AP Inter 1st Year Zoology Notes Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

Students can go through AP Inter 1st Year Zoology Notes 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Zoology Notes 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం

→ జీవులను గూర్చి తెలిపే శాస్త్రాన్ని జీవశాస్త్రం అందురు.

→ జంతువులను గూర్చి తెలియజేయు శాస్త్రమును జంతుశాస్త్రము అందురు.

→ జంతుశాస్త్రవేత్తలు జంతుశాస్త్రంలో కొన్ని ప్రత్యేక శాఖలను గుర్తించినారు.

→ జీవశాస్త్ర పిత “అరిస్టాటిల్” తో సహా అనేకమంది జంతుశాస్త్రజ్ఞులు ఈ శాస్త్రమును అధ్యయనం చేసినారు.

→ ఈ శాస్త్రము అభివృద్ధి చెంది “ట్రాన్స్ జెనిక్ మొక్కలను, జంతువులను అభివృద్ధిచేసి సర్వసమాన సౌభాగ్యమే పరమావధిగా పనిచేయు చున్నారు.

→ జంతుశాస్త్రము అన్ని శాస్త్రములతో సంబంధము కలిగి ఉన్నది.

→ జంతుశాస్త్ర అభివృద్ధిలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అత్యంత ప్రాధాన్యత వహించుచున్నది.

→ వివిధ పరిశ్రమల అభివృద్ధికి జంతుశాస్త్రము అధికంగా ఉపయోగ పడుచున్నది.

AP Inter 1st Year Zoology Notes Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

→ జంతుజాతులను గుర్తించుటకు నామీకరణ మరియు వర్గీకరణ అత్యంత ఆవశ్యకం.

→ ద్వినామ నామీకరణం అత్యంత ఆదరణ పొందింది.

→ జాతిలో ఉపజాతులు ఉన్నపుడు త్రినామ నామీకరణ సిద్ధాంతము ఉపయోగపడుచున్నది.

→ వర్గీకరణలో గల అంతస్తులను టాక్సానులందురు.

→ వర్గీకరణంలో జాతి అనునది అతి చిన్న ప్రమాణం.

→ లిన్నేయస్, తన గ్రంథమైన సిస్టమానేచురేలో ద్వంద్వ నామీకరణగా ప్రతిపాదించిన దాన్ని ప్రస్తుతం ద్వినామ నామీకరణగా అనుసరిస్తున్నారు.

→ కృత్రిమ పద్ధతి, సహజ వర్గీకరణలు ఉంటాయి. సహజ వర్గీకరణను ఫైలెటిక్ లేదా ఫైలోజెనిటిక్ వర్గీకరణ విధానాలు అందురు.

→ ప్రజననం జరుపుకొని, ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయమే జాతి.

→ జాతి గతికశీలం, వ్యూహన అంతర ప్రజననం ప్రదర్శిస్తుంది. జాతి ఒక ప్రత్యుత్పత్తి ప్రమాణం, జీవావరణ ప్రమాణం, పరిణామ ప్రమాణం, జన్యు ప్రమాణంగా ఉంటుంది.

→ డబ్ జాన్సీ, జాతిని మెండెలియన్ జనాభాగా వర్ణించాడు. ఒక జాతికి చెందిన జీవులతోనే లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల సమూహమే మెండెలియన్ జనాభా అని అందురు.

→ లిన్నేయస్ రెండు రాజ్యాల వర్గీకరణ, హెకెల్ మూడు రాజ్యాల వర్గీకరణ, కోప్ లండ్ నాలుగు రాజ్యాల వర్గీకరణ, విట్టేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణలను ప్రతిపాదించారు.

AP Inter 1st Year Zoology Notes Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

→ పిండదశల్లో ఏర్పడిన స్తరాల ఆధారంగా జంతువులను ద్విస్తరిత మరియు త్రిస్తరిత జీవులుగా పరిగణిస్తారు.

→ కణ, కణజాల అవయవ, అవయవ వ్యవస్థల స్థాయి నిర్మాణం జంతువులలో ఉంటుంది. వీటి ఆధారంగా ప్రోటోస్టోమ్లు, శరీరకుహర రహిత, మిధ్యాశరీర కుహర, షైజోసీలోమేటా జీవులుగా ఉంటాయి.

→ పోషణ : శారీరక పెరుగుదల, జీవనాన్ని కొనసాగించడానికి అవసరమైన ఆహారాన్ని గ్రహించి, జీర్ణించుకొని, శోషించుకొనే ప్రక్రియ.

→ పారిభాషిక పదకోశం : ఇవి గతిజ స్థూల అణువులు. ఇవి దేహంలో వివిధ విధులను నిర్వహిస్తాయి.

→ మాంసకృత్తులు : ఇవి అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి పెప్టైడ్ బంధాల ద్వారా బంధించబడి తయారయ్యే పాలీమర్ గొలుసులే ప్రోటీన్లు.

→ కేంద్రకపూర్వ జీవులు : కేంద్రక త్వచాన్ని కలిగి ఉండని ఏకకణ జీవులు.

→ నిజకేంద్రక జీవులు : కేంద్రకం చుట్టూ త్వచాన్నీ, ఇతర త్వచ సహిత కణాంగాలనూ కలిగిన జీవులు.

→ గ్లైకోజన్ : జంతువుల దేహంలో నిల్వ ఉండే పిండి పదార్థం.

→ సకశేరుకాలు : ఈ వర్గపు జంతువులు జీవితంలో ఏదో ఒక దశలో పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాయి.

→ వర్గ వికాసం (Phylogeny) : జీవి యొక్క పరిణామ చరిత్ర.

→ క్రియాసామ్య (analogous) లక్షణాలు : అవయవాల నిర్మాణంలో ఒకే పోలికలు ఉండనప్పటికీ వేరువేరు జీవులలో ఒకే పనిని చేసే అవయవాలు (పక్షిరెక్క, సీతాకోక చిలుక రెక్క).

→ స్థాయీ సంగమం : జనాభాలోని జీవుల మధ్య వరణం / ఎంపిక ద్వారా జరిగే సంగమం లేదా యాదృచ్ఛిక సంగమానికి వ్యతిరేకం.

→ కణజాలం : ఒకే రకమైన జననాన్ని కలిగి అవయవంలో నిర్దిష్ట విధిని నిర్వహించే కణాల సమూహం.

→ జాంతవ భక్షణ : జంతువులు ఆహారాన్ని గ్రహించే విధానం. ఘన లేదా ద్రవరూప సేంద్రియ పదార్థాన్ని సంగ్రహించే పోషణ విధానం.

→ టీనోఫోరా : కంకయుత జెల్లీలు అనే జంతువులను కలిగిన అకశేరుక వర్గం.

AP Inter 1st Year Zoology Notes Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

→ సర్పిల విదళనం : దీనిలో విదళన తలం సంయుక్త బీజపు ధృవ అక్షానికి ఏటవాలుగా ఉంటుంది. ఈ లక్షణం ప్రోటోస్టోమియా జీవుల ప్రత్యేక లక్షణం.

→ ఛార్లెస్ డార్విన్
బ్రిటీష్ ప్రకృతి శాస్త్రవేత్త. తన పరిశోధనా ఫలితాలను జాతుల ఉత్పత్తి (Origin of Species) అనే తన గ్రంథంలో ప్రచురించారు. ‘మార్పులతో కూడిన ‘ వారసత్వమే’ (Descent with modification) పరిణామం అని ఆయన ఉద్దేశం. నిస్సందేహంగా ఆయనను “19వ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్త”గా వర్ణించవచ్చు.