Students can go through AP Inter 1st Year Zoology Notes 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం
→ రెండు భిన్న జాతులకు చెందిన జీవులకు మధ్య ఏర్పడిన సహవాసంలో
→ ఒక జీవి లాభం పొందుతూ (పరాన్నజీవి), దీని ప్రభావంతో రెండవ జీవి నష్టపోతూ (అతిథేయి) ఉండే సహవాసాన్ని పరాన్నజీవనం అంటారు.
→ పరాన్నజీవనంలో అతిథేయి పరాన్నజీవుల వలన వివిధ వ్యాధుల బారిన పడతాడు.
→ పరాన్నజీవులు పరాన్నజీవనానికి అనుకూలంగా తమ దేహంలో వివిధ అనుకూలనాలను సంతరించుకుంటాయి.
→ Dr. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు భారతదేశంలో గర్వించదగిన జీవ రసాయన శాస్త్రవేత్త.
→ Dr. Y.S.Rao కాన్సర్కు వాడే మేథోట్రికేట్స్ మందు, రుమటాయిడ్ ఆర్థరయిటీస్, సోరియాసిస్ మందు, DEC మందు. డై ఈథైన్ కార్బమజొల్ (హెట్రాజిన్) కలరా, ప్లేగు, టైఫస్ జ్వరం, ట్రెంచ్ జ్వరం మొదలగు వాటికి వాడే టెట్రాసైక్లిన్ యాంటిబయోటిక్, ఆరిమోమైసిన్ మరియు ట్యూబర్ క్లోసిస్లలో వినియోగించే ఐసోనికోటినిక్ ఆమ్ల హైడ్రజైడ్లు మొదలైన వాటిని కనుగొనడం జరిగింది.
→ ప్లాస్మోడియం వైవాక్స్ కణాంతస్త పరాన్నజీవి. దీనిని మానవ కాలేయ కణాలలో ఎర్ర రక్తకణాలలో నివశిస్తుంది.
→ ప్లాస్మోడియం వైవాక్స్ మానవునిలో మలేరియా జ్వరాన్ని కలిగిస్తుంది. దీని సంక్రమణను ఇనాక్యులేషన్ అంటారు.
→ మానవుడిలో ప్లాస్మోడియం జరుపుకునే బహుధా విచ్ఛిత్తిని విఖండజననం అంటారు. ఇది మూడు విధాలుగా ఉంటుంది. అవి రక్తకణ పూర్వ, రక్తకణ బాహ్య, రక్తకణ జీవిత చక్రం – గామిటోగాని.
→ ప్లాస్మోడియం జీవితచరిత్ర మానవుడిలో మొదటి భాగం కాలేయ కణాలలో, రెండవ భాగం ఎర్ర రక్తకణాలలో పూర్తి అవుతుంది.
→ రక్తకణ బాహ్య జీవితచక్రంలో స్పోరోజాయిట్లు మానవుడి కాలేయ కణాలలో ప్రవేశించి ట్రోపోజాయిట్గా మారతాయి.
→ సూక్ష్మ మెక్రిప్టో జాయిట్స్ రక్తంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలపై దాడి చేస్తుంది.
→ పరాన్నజీవులు RBC లోని హిమోగ్లోబిన్ ఆరగిస్తుంది. దీని వలన హిమాటిన్ హిమోజాయిన్ అనే విష కణికలుగా రూపొందుతుంది.
→ హిమోజాయిన్ మానవులలో మలేరియా జ్వరాన్ని కలిగిస్తుంది.
→ మీ రోజాయిట్స్ RBC లో అభివృద్ధి చెంది రెండు రకాలుగా మారతాయి.
- స్థూల సిద్ధ మాతృకణాలు,
- సూక్ష్మ సిద్ధబీజకణాలు
→ ప్లాస్మోడియం మానవుడిలో ప్రవేశించినది మొదలు తిరిగి రక్తంలో కనిపించే వరకు పట్టే కాలాన్ని ప్రీ పేటెంట్ కాలం అంటారు.
→ పరాన్నజీవులను ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి బదిలీ చేయడానికి ఉపయోగపడే జీవులను వాహక జీవులు అంటారు.
→ మానవ దేహంలో కనిపించే ఎటువంటి అస్వస్థతను, అనారోగ్య లక్షణాలను రోగము లేదా వ్యాధి అంటారు.
→ ఎంటమీబా హిస్టోలైటికాను లాంబెల్ కనుగొన్నాడు. ఎంటమీబా కణాంతస్థ పరాన్నజీవి.
→ ఎంటమీబా పోషకజీవి హిస్టోలైసిన్ అనే ఎంజైమును స్రవించి అతిథేయి పేగు, రక్తనాళాల గోడలను నాశనం చేస్తుంది.
→ ఎంటమీబా దేహంలో బండిచక్రాన్ని పోలిన కేంద్రకము, ఎర్ర రక్తకణాలతో కూడిన ఆహార రిక్తికలుంటాయి.
→ ఎంటమీబా ఏకాతిథేయి పరాన్నజీవి. పోషకజీవి అలైంగిక పద్ధతిలో ద్విధావిచ్ఛిత్తి ద్వారా మానవ పెద్ద పేగు మరియు పురీషనాళ గోడలలో అభివృద్ధి చెందుతుంది.
→ ఎంటమీబా దేహంలో ఆహారం గ్లైకోజన్ మరియు క్రొమాటిడ్ దేహాల రూపంలో నిలువ ఉంటాయి. తరువాత ఇది కోశమును ఏర్పరచుకొని దీనిని కోశస్థ దశ అంటారు.
→ మానవ మలంతోబాటు చతుష్కేంద్రక దశలున్న కోశాలు విస్తరించబడతాయి.
→ ఈ కోశాలు పెద్దపేగును చేరిన తరువాత వికోశీకరణ జరిగి పెద్దపేగు గోడలలోని శ్లేష్మస్తరంను చేరి పోషకజీవులుగా అభివృద్ధి చెందుతాయి.
→ ఎంటమీబా అమీబియాసిస్ వ్యాధిని కలుగజేస్తుంది. తీవ్రమైన కడుపునొప్పి, రక్త చారికలతో శ్లేష్మంతో కూడిన విరేచనాలు ఈ వ్యాధి లక్షణాలు.
→ కంగా ఉన్నప్పుడు ఇవి కాలేయం, ఊపిరితిత్తులు, అరుదుగా మెదడు, మూత్రపిండాలలో చేరి అక్కడ గడ్డలను ఏర్పరుస్తాయి.
→ అమీబియాసిస్ వ్యాధిని వ్యక్తిగత పరిశుభ్రతతో నివారించవచ్చును మరియు ఆహారం, నీరు కలుషితం కాకుండా, కీటకాలను చేరకుండా జాగ్రత్త తీసుకోవలెను.
→ ఫలాలను, కూరగాయలను వినియోగానికి ముందు శుభ్రంగా బాగా కడగవలెను.
→ ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ ను సాధారణంగా గుండ్రటి పురుగు అంటారు. ‘
→ రాబ్దిటిఫామ్ లార్వాదశలో ఆస్కారిస్ మానవునికి సంక్రమిస్తుంది.
→ ఆస్కారిస్ వలన ఆస్కారియాసిస్ అనే వ్యాధి సంక్రమిస్తుంది.
→ ఉకరేరియా బాంక్రాఫ్టి మానవ శోషరస నాళాలలో నివాసముండే పరాన్నజీవి.
→ దీనిని సాధారణంగా పైలేరియా పురుగు అంటారు.
→ ఉకరేరియా లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తుంది. పురుషజీవి స్త్రీ జీవి కంటే చిన్నగా ఉండి పరాంతం వంపు తిరిగి, సంపర్క కంటకాలను కలిగి ఉంటుంది.
→ ఉకరేరియా అండ స్త్రీజీవి పురుషజీవి కంటే పొడవుగా ఉండి తిన్నగా ఉంటుంది. జననరంధ్రం, పాయువు వేరుగా ఉంటాయి. సంపర్క కంటకాలుండవు.
→ ఉకరేరియా అండ శిశూత్పాదక జీవి. తల్లి దేహంలో ఉండగానే గుడ్లలోని పిల్లజీవులు అభివృద్ధి చెందటాన్ని అండ శిశూత్పాదకత అంటారు.
→ స్త్రీ జీవులు మైక్రోఫైలేరియాకు జన్మనిస్తాయి. ఇవి నిశాకాల గమనాన్ని ప్రదర్శిస్తాయి.
→ మైక్రోఫైలేరియా దోమలో నిర్మోచనాలు చెంది మానవునికి సంక్రమణ దశలుగా అభివృద్ధి చెందుతాయి.
→ ఉకరేరియా వలన ఫైలేరియాసిస్, లింఫాయిడెస్ మరియు బోదకాలు వ్యాధిని కలిగిస్తుంది.
→ దోమల వ్యాధిని నివారించడం ద్వారా ఫైలేరియా వ్యాధిని నివారించవచ్చును.
→ దోమలు ఫైలేరియా వ్యాధిగ్రస్తుని రక్తాన్ని పీల్చినపుడు రక్తంతోబాటుగా ఫైలేరియా డింభకం దోమను చేరి నిర్మూకాలు జరుపుకుని మానవునికి సంక్రమణ దశగా అభివృద్ధి చెందుతాయి.
→ టైఫాయిడ్ జ్వరం స్మాల్మొనెల్లా టైఫి బాక్టీరియా వల్ల కలుగుతుంది.
→ టైఫాయిడ్ జ్వరాన్ని వైడాల్ పరీక్ష ద్వారా నిర్థారించవచ్చును.
→ టైఫాయిడ్ జ్వరం కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది.
→ నిమోనియా స్ట్రెప్టోకోకస్ నిమోనియా మరియు హిమోఫిలిస్ ఇన్ఫ్లూయెంజా వలన వస్తుంది.
→ రైనోవైరస్ వలన సాధారణ జలుబులు కలుగుతాయి.
→ రింగ్వామ్ వ్యాధి మైక్రోస్టోరమ్, ట్రైకోఫైటాన్, ఎపిడెర్మోఫైటాన్ అనే ఫంగస్ల వలన వస్తుంది.
→ పొగాకులో ఆరోగ్యానికి ప్రమాదకారి అయిన నికోటిన్ ను కలిగి ఉంటుంది.
→ మార్ఫిన్, హిరాయిక్, గంజాయి మొదలైన మాదక ద్రవ్యాలు నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతాయి.
→ గడ్డ (abscess) : వాపు (Inflammation) కణజాలం ఆవరించిన చీము గల గాయం.
→ దుర్వినియోగం (abuse) : మితిమీరిన వినియోగం.
→ ఆల్కాలాయిడ్ : మొక్కలలో లభించే నత్రజని కలిగిన క్షారం. ఉదా : క్వినైన్
→ ఊపిరితిత్తుల వాయుకోశాలు : శ్వాసవాయువుల మార్పిడికి తోడ్పడే ఊపిరితిత్తులలోని చిన్న కోశాలు.
→ అనబాలిక్ స్టీరాయిడ్స్ : వీటిని సాంకేతికంగా అనబాలిక్ – ఆండ్రోజన్ స్టీరాయిడ్స్ (AAS) లేదా స్టీరాయిడ్స్ అంటారు. ఇవి టెస్టోస్టిరోన్, డైహైడ్రోటెస్టోసిరోన్ (శరీరంలో ఉన్నవి) ల ప్రభావాన్ని అనుకరిస్తాయి. ఇవి కణాలలో మాంస కృత్తుల సంశ్లేషణాన్ని ఎక్కువ చేయడం వల్ల (ముఖ్యంగా కండరాలలో) నిర్మాణ క్రియ (anabolism) వేగం పెరుగుతుంది.
→ ఎనీమియా : ఈ రక్తంలో హీమోగ్లోబిన్ లేదా ఎర్రరక్తకణాలు తక్కువవడం.
→ అపటైట్ : ఆకలి అనిపించడం.
→ బౌట్ (Bout) : ఏదైనా వ్యాధి లక్షణం (ఉదా : జ్వరం) కొద్ది కాలం మాత్రమే ఉండి హెచ్చుతగ్గులు చూపడం.
→ క్లినికల్ లక్షణాలు : వ్యాధిని గుర్తించే లక్షణాలు
→ అవస్కరం : ఆహార నాళం చివర గల ఆశయం. సకశేరుకాలలో దీనిలోనికి ఆహార నాళం, జనన, మూత్రనాళాలు తెరుచుకొంటాయి. అకశేరుకాలలో ఆహారనాళ, జనననాళాలు మాత్రం దీనిలోకి తెరుచుకుంటాయి.
→ మలబద్దకం : క్రమరహితమైన, అరుదుగా లేదా కష్టంతో కూడిన మల విసర్జనం.
→ కాప్రోఫాగస్ : మలాన్ని ఆహారంగా గ్రహించడం.
→ విశ్వవ్యాప్తి (Cosmopolitan) : ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లో కనిపించేది.
→ ఎమాసియేషన్ : అతిగా బక్క పలచన.
→ ఎపిడమిక్ / మహమ్మారి : ఒక ప్రాంతంలో జీవించే ప్రజలలో సాంక్రమిక వ్యాధులు వ్యాప్తి చెందడం.
→ ఎపిడెమాలజీ (Epidemology) : వ్యాధుల సంక్రమణ, నియంత్రణ గురించి తెలిపే వైద్యశాస్త్ర శాఖ.
→ ఉల్లాసస్థితి (Euphoria) : ఆల్కహాల్, మాదకద్రవ్యాల వినియోగం వల్ల తాత్కాలికంగా కలిగే ఉల్లాసం, గర్వం, సుఖం లాంటి అనుభూతులు (కుంగిన స్థితి లేకపోవడం).
→ మలం (Faeces) : జీర్ణం కాని ఘన పదార్థం. పాయువు ద్వారా బయటికి విసర్జించ బడుతుంది.
→ తంతురూప (Filliform) : దారం వంటిది.
→ జానపద వైద్యం / మందు (Folk medicine) : గ్రామీణ ప్రాంతాలలో ముసలివాళ్ళు చేసే చికిత్స. దీన్ని నాటు వైద్యం
→ తలతిప్పడం (Giddiness) : కింద పడతామా అనే భావన.
→ గజ్జలు (Groin) : జననాంగ భాగం, తొడల మధ్య కూడలి.
→ హాల్లుసినేషన్స్ (Hallucinations) : దీన్ని భ్రమ అంటారు. శారీరక, మానసిక అవలక్షణాల వల్ల నిజంగా మన మధ్యలేనిది ఉన్నట్లు మనస్సులో అనిపించే స్థితి.
→ గొంతువాపు (Hoarseness) : సంక్రమణాల వల్ల గొంతు లోపలి తలం ఉబ్బడం.
→ వాపు (Inflammation) : గాయం లేదా దురదకు దేహంలోని కణజాలాలు చూపే ప్రతిచర్య. ఆ ప్రాంతంలో కణజాలాలు ఎర్రగా మారి, ఉబ్బి చాలా మంటను కలుగజేస్తాయి.
→ సహజాతం (Instinct) : జంతువుల అంతర్జన్య ప్రవర్తన.
→ సిరలోకి (Intravenous) : సూది లేదా సిరంజితో నేరుగా సిరలోకి ద్రవాలను ఎక్కించడం.
→ లీజన్ (Lesion) : జీవ కణజాలానికి ఏర్పడిన గాయం.
→ కాలేయ సైనుసాయిడ్స్ (Liver sinusoids) : కాలేయంలో రక్తంతో నిండిన చిన్న గదులు.
→ పుంశీకరణ (Masculinisation) : పురుష ముఖ కవళికలు ఏర్పడటం.
→ నిర్మోచనం (moultings) : కొన్ని జంతువులు లేదా డింభక దశలు ఒక క్రమ పద్ధతిలో అవభాసిని లేదా చర్మాన్ని విడవటం.
→ నేసల్ కంజెషన్ (nasal congestion) : ముక్కు మూసుకుపోవడం.
→ నాడీ అభివాహకం (Neuro transmitter) : నాడీ ప్రచోదనాలను నాడీ కణసంధి (Synapse) గుండా ప్రసరింప చేయడానికి తోడ్పడే రసాయనం (ఉదా : అసిటైల్ కొలైన్).
→ అండశిశూత్పాదకత (Ovoviviparous) : డింభకాలు లేదా పిల్లజీవులు కలిగిన గుడ్లను పెట్టే లక్షణం.
→ వ్యాధి కారకం (Pathogen) : వ్యాధిని కలిగించే జీవి.
→ తోటివారు/సమతౌల్యులు (Peer) : ఒక సమూహంలోని వ్యక్తి ఇంకొకరితో సరిసమానంగా ఉండటం, స్నేహితులు లేదా సహవిద్యార్థులు.
→ ఫాస్మిడ్స్ : నిమటోడా జీవులలోని పుచ్ఛ జ్ఞానాంగాలు
→ ప్రాక్కేంద్రకం(Pronucleus) : ఫలదీకరణకు ముందు స్త్రీ, పురుష బీజకణాలలో ఉండే కేంద్రకం. రెండు ప్రాక్కేంద్రకాలు కలిసి సంయుక్త కేంద్రకం.
→ క్వాగ్మెర్ (Quagmire) : మృదువైన, దిగువ ప్రాంతంలోని తడినేల. కాలువేయగానే దిగబడుతుంది. దీన్ని ఊబినేల లేదా ఊబి అంటారు.
→ అనుష్టానికమైన(rituals) : మత సంబంధమైన కార్యాలను నిర్వహించడానికి గల ఒక పద్ధతి.
→ సాసేజ్ ఆకారం (sausage shape) : అటూ ఇటూగా పొడవైన నీటి వంకాయ లేదా కీరదోసకాయ ఆకారం.
→ విఖండ జననం(schizogony) : స్పోరోజోవన్ (Sporozoan) లేదా ఎపికాంప్లెక్షన్ (epi complexan) ప్రొటోజోవా జీవులలో అలైంగిక చక్రంలో జరిగే బహుధావిచ్ఛిత్తి విధానం.
→ స్నార్టింగ్ (snorting) : బలవంతంగా మందులను పీల్చుకోవడం.
→ ప్లీహం పెరుగుదల (Splenomegaly) : క్రమరహిత ప్లీహ విస్తరణ.
→ మలం (stool): విసర్జక పదార్థం.
→ సింకారియాన్(Synkaryon) : స్త్రీ, పురుష ప్రాక్కేంద్రకాల వల్ల ఏర్పడిన సంయుక్త కేంద్రకం.
→ జీవించు(thrive) : జీవించు / విపరీతంగా పెరుగు.
→ ట్రాంక్విలైజర్స్ : మనసు స్వచ్ఛత (mental clarity) తగ్గకుండా ఒత్తిడిని (stress/ tension) తగ్గించే మందులు.
→ ఉష్ణ మండల సంబంధ ఆంత్రవ్యాధి (Tropical Sprue) : పిల్లలు మరియు పెద్దవారిలో కలిగే తీవ్ర అనారోగ్యం; పోషకాలు సరిగా శోషణం చెందని స్థితి; దుర్వాసనతో కూడిన డయేరియా, చిక్కిపోవడం (emaciation) వంటి లక్షణాలు కనిపిస్తాయి.
→ వ్రణం / పుండు (Ulcer) : వర్తులాకార శోధి గాయం. ఇది చర్మంపై లేదా శ్లేష్మస్తరంలో ఏర్పడి కణజాలాలను విచ్ఛిన్నం (necrosis) చేస్తుంది.
→ వాక్సీన్ (Vaccine) : బలహీన లేదా చనిపోయిన వ్యాధికారక కణాలు గల ద్రవం. దీన్ని ఇమ్యునోజన్ అంటారు. ఈ ద్రవాన్ని శరీరంలోకి ఎక్కించడం వల్ల అతిథేయి శరీరంలో ప్రేరణతో ప్రతి రక్షకాలు (anti-bodies) ఉత్పత్తి అవుతాయి.
→ వాండలిజం(Vandalism) : ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక ప్రజలు లేదా ఇతరుల ఆస్తిని ధ్వంసం చేయడం.
→ వర్మిఫామ్ (Vermiform) : పొడవైన క్రిమి ఆకారం.
→ తిత్తి / ఆశయ కేంద్రకం (vesicular nucleus) : న్యూక్లియోలస్ మరియు అధిక యూక్రొమాటిన్ గల కేంద్రకం.
→ వ్యసన స్వభావ వలయం (vicious circle) : ఒక ఇబ్బంది. ఇంకొకదానికి దారితీసి, రెండోది మొదటి ఇబ్బందిని ఎక్కువ చేయడం.
→ హానిపొందు(vulnerable) : సులువుగా దాడికి గురయ్యే లక్షణం కలిగి ఉండటం.
→ సంక్షేమం(welfare) : తోడ్పాటు (aid) లేదా ప్రోత్సాహాన్ని ఇచ్చేది.