Students can go through AP Inter 1st Year Zoology Notes 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)
→ భారతదేశంలో పెరిప్లానెటా అమెరికానా, బ్లాటా ఓరియంటారీస్ అనే బొద్దింకల జాతులున్నాయి.
→ బొద్దింకను సాధారణ వంటగది చీడపురుగు అంటారు. ఇది నిశాచర జీవి.
→ బొద్దింక సర్వభక్షిణి. అన్ని రకాల పదార్థాలను తింటుంది.
→ దేహం కైటిన్ నిర్మిత ఫలకాలచే కప్పబడి ఉంటుంది. వీటిని స్ట్రీరైట్స్ అంటారు.
→ బొద్దింక శరీరకుడ్యం మూడు స్తరాలతో నిర్మించబడి ఉంటుంది. అవి అవభాసిని, బాహ్యచర్మం, ఆధారత్వచం.
→ బొద్దింక దేహం స్పష్టమైన ఖండీభవనంను కలిగి ఉంటుంది.
→ కీళ్ళుగల కాళ్ళుగల జీవులు కనుక వీటిని ఆర్థోపొడా అంటారు.
→ దేహకుహరం, రక్తకుహరం వివృత రక్తప్రసరణ కనిపిస్తుంది.
→ శ్వాసక్రియలో శ్వాసనాళాలు ఉంటాయి. మాల్ఫీజియన్ నాళాలు జీవిదేహంలోని నీటి నష్టాన్ని నివారిస్తాయి.
→ బొద్దింక దేహం పిండాభివృద్ధిలో 21 ఖండితాలను కలిగి ఉంటుంది. ప్రౌఢ బొద్దింకలో 20 ఖండితాలు మాత్రం ఉంటాయి.
→ బొద్దింక తలలో ఆరు స్ల్కీరైట్స్ ఉంటాయి. దీనిలో జ్ఞానేంద్రియాలు, కొరకడానికి, నమలడానికి ఉపయోగపడే నోటి భాగాలు, సంయుక్త నేత్రాలు, స్పర్శకాలు, స్పర్శశృంగాలు ఉంటాయి.
→ బొద్దింక నోటి భాగాలు క్రిందికి వేలాడుతూ ఉంటాయి. గనుక ఇటువంటి తలను హైపోగ్నాథస్ తల అంటారు.
→ ప్రొనొటమ్ జీవి దేహంలోని అన్ని స్ట్రీరైట్స్ కన్నా పెద్దది.
→ పాయు ఉపాంగాలు మగ బొద్దింకలో మాత్రమే ఉంటాయి.
→ వక్షం పృష్టభాగంలో 3 స్ల్కీరైట్స్ ఉంటాయి. దీనిలో రెండు జతల రెక్కలు 3 జతల కాళ్ళు ఉంటాయి.
→ ఉదరం పది ఖండితాలను కలిగి ఉంటుంది. తొమ్మిది, పది ఖండితాల మధ్య పాయువు ఉంటుంది.
→ ఉదరంలో గోనెపోఫైసిస్ అనే నిర్మాణం ఉంటుంది.
→ బొద్దింక శరీర కుడ్యం, అవభాసిని, బాహ్యచర్మం, ఆధారత్వచం అనే పొరలచే నిర్మించబడి ఉంటుంది.
→ అవభాసిని మూడు స్తరాలలో నిర్మించబడి ఉంటుంది. బాహ్యంగా అధ్వ అవభాసిని, మధ్యలో బాహ్య అవభాసిని, లోపలి కైటిన్చే నిర్మించబడిన అంత్య అవభాసిని.
→ బాహ్య చర్మంలో వివిధ గ్రంథి కణాలుంటాయి.
→ అంతరాస్త్రీ పంజరం అవభాసిని అంతర్వలనం చెందడం వలన ఏర్పడుతుంది. ఇది అంతరంగాలు అతక్కోవడానికి ఉపయోగపడుతుంది.
→ బొద్దింక తల ఆరు పిండదశ ఖండితాల కలయిక వలన ఏర్పడుతుంది.
→ బొద్దింక ఉదర, 5, 6 కండితాల మధ్య దుర్గంద గ్రంథి తెరుచుకుంటుంది. ఇది రక్షణకోసం ఉపయోగపడుతుంది.
→ బొద్దింక చురుకుగా పరిగెత్తే కీటకం. కాని అరుదుగా కొద్ది దూరం ఎగరగలదు.
→ బొద్దింక సర్వభక్షిణి. ఇది తినని వస్తువులేదు. పేపరు, బట్టలు, తోలు, కర్ర మొ||నవి.
→ బొద్దింక ఆహారనాళం మూడు బాగాలుగా గుర్తించబడి ఉంటుంది.
- ఆద్వముఖం,
- మధ్యాంత్రం,
- పాయుపధం.
→ బొద్దింక నోటి భాగాలు చుట్టి ఉన్న ప్రాంతాన్ని సిచేరియమ్ అంటారు. దీని తరువాత భాగాన్ని సెలైవేరియం అంటారు.
→ ఆహారనాళం గ్రసని, ఆహార వాహిక, అన్నాశయం, అంతర జఠరం, మధ్యాంత్రం, శేషాంత్రికం, పెద్దపేగు, పురీషనాళం అనే బాగాలుగా కలిగి ఉంటుంది.
→ బొద్దింకలో మాల్ఫీజియన్ నాళికలుంటాయి. ఇవి విసర్జన క్రియలో పాల్గొంటాయి.
→ పురీషనాళపు చూషకాలు విసర్జక పదార్థంలోని నీటిని పూర్తిగా పునఃశోషణ గావిస్తాయి.
→ బొద్దింకలో ఒక జత లాలాజలగ్రంథులుంటాయి. ఇవి ఎవైలెజ్తో కూడిన లాలాజలాన్ని స్రవిస్తాయి.
→ మధ్యాంత్రపు గోడలలోని గ్రంథి లక్షణాలు మాల్టీస్, ఇన్వర్టేస్, ప్రోటియేజెస్, లైపేజ్ అనే జీర్ణ ఎంజైములు స్రవిస్తాయి.
→ జీర్ణించబడిన ఆహారం మధ్యాంత్రపు చివరి భాగంనుండి శోషించబడుతుంది.
→ జీర్ణంకాని ఆహారపదార్థం చివరికి పురీషనాళంను చేరుతుంది.
→ బొద్దింకలో శ్వాస వ్యవస్థ శ్వాసనాళ వ్యవస్థగా వర్ణించబడినది.
→ బొద్దింక శ్వాసనాళ వ్యవస్థలో 10 జతల రంధ్రాలు పాల్గొంటాయి.
→ ప్రతి రంధ్రాన్ని చుట్టి పెరిట్రీమ్ అనే కైటిన్ నిర్మిత వర్తులాకార ఫలకం ఉంటుంది.
→ శ్వాసరంధ్ర వాయునాళంలోనికి తెరుచుకుంటుంది.
→ వాయు నాళాలు వాయు నాళికలలోకి తెరుచుకుంటాయి.
→ వాయు నాళికలశాఖలో దేహంలోని అవయవాల వరకు వెళ్ళి కణజాలం వరకు విస్తరిస్తాయి.
→ వాయునాళ చివరిభాగ కణాన్ని వాయునాళకణం అంటారు.
→ వాయునాళ లోపలి పొరను ఇంటిమా అంటారు.
→ వాయునాళాల లోపల ఇంటిమా టినీడియా అనే సర్పిలాకార వలయాలను ఏర్పరుస్తుంది.
→ ఉచ్వాసం ప్రక్రియ ఉదర ఆయుతకండరాలు, పృష్టోదరకండరాలు సడలడంవల్ల జరుగుతుంది.
→ నిశ్వాసం ఉదర ఆయుతకండరాలు, పృష్టోద కండరాల సంకోచం వలన జరుగుతుంది.
→ బొద్దింక విచ్చిన వాయు ప్రసారంను జరుపుతుంది.
→ బొద్దింక కేంద్ర నాడీవ్యవస్థలో నాడీవలయం, ద్వంద్వ ఉదరనాడీ దండం ఉంటాయి.
→ నాడీ వలయం ఒక జత అదోనాడీ సంధాయకాలు (మెదడు), ఒక జత అధ్యాహర వాహికా సంధాయకాలు, ఒక జత పర్యాహర వాహికా నాడీ సంధాయకాలచే నిర్మితమవుతుంది.
→ నాడీవ్యవస్థలో అధ్వాహర వాహినాడీ సంధులు లేదా మెదడు జ్ఞాన కేంద్రంగాను, అధో ఆహరవాహికా నాడీ సంధాయకాలు చాలక కేంద్రంగాను పనిచేస్తాయి.
→ ఉదర నాడీదండంలో మొత్తం 9 నాడీ సంధులుంటాయి.
→ ఉదర నాడీదండం ఉదరభాగంలో 7 నాడీ సంధులుంటాయి.
→ ఉదరంలోని 5వ ఖండితంలో నాడీసంధి ఉండదు.
→ స్వయంచోదిత నాడీ వ్యవస్థను అంతరాంగ నాడీవ్యవస్థ అని కూడా అంటారు.
→ స్వయంచోదిత నాడీవ్యవస్థలో నాలుగు నాడీసంధులుంటాయి. అవి లలాటికా నాడీసంధి, అధోమస్తిష్క నాడీ సంధి, అంతరాంగ నాడీసంధి, పూర్వగ్రంథుల జఠరికా నాడీసంధి.
→ స్వయంచోదిత నాడీవ్యవస్థ అంతరంగాలను ప్రదానంగా ఆహారనాళం, గుండెలోని కండరాలను నియంత్రిస్తుంది.
→ అవభాసిని గ్రాహక ప్రమాణాలైన సెన్సిల్లాలు రసాయన గ్రాహకాలు.
→ బొద్దింక జ్ఞాన అవయవాలు సెన్సిల్లాలు, సంయుక్త నేత్రాలు, స్పర్మాంగాలు, ఓష్ఠం మొ||నవి.
→ సంయుక్త నేత్రాలు అనేక క్రియాత్మక నేత్రాంశాలను కలిగిఉంటాయి.
→ స్పర్శశృంగం యొక్క పీఠభాగంలో ఒక సుషిరం ఉంటుంది. ఇది సరళనేత్రం లేదా నేత్ర బిందువును సూచిస్తుంది. ఇవి ప్రతిబింబాలను ఏర్పరచలేవు. కాంతి తీవ్రతలోని మార్పులను గమనించగలవు.
→ బొద్దింక లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తుంది.
→ విలియం కిర్బీ ఆంగ్లశాస్త్రవేత్త. ఈయన కీటక శాస్త్రంలో ఎనలేని సేవలనందించాడు. అందువల్ల ఈయనను కీటక శాస్త్ర స్థాపకుడు అంటారు.
→ ఉదరం : కీటకంలో మూడో లేదా పర విభాగం (టెగ్మా).
→ స్పర్శశృంగం : జీవి తల నుంచి ఏర్పడే జ్ఞానాంగాలు. వీటికి స్పర్శ, ఘ్రాణ విధులు ఉంటాయి.
→ ఉపాంగం : దేహంలో కదిలే భాగం. నోటి భాగాలు రూపాంతరం చెందిన ఉపాంగాలు.
→ అరోలియం : కీటకాల కాళ్ల నఖాలకు మధ్య ఏర్పడిన మృదువైన రోమాల మెత్త. దీన్ని పల్విల్లస్ అంటారు.
→ ఆర్థ్రోపొడా : కీళ్లు గల కాళ్లు, ఖండీభవనం కలిగిన అకశేరుకాలు.
→ ద్విశాఖాయుత : రెండు శాఖలు కలిగిన; ఉదా : బహిః పాదాంగం, అంతరపాదాంగం.
→ బ్లాస్టులా : సంయుక్త బీజకుహరిక కలిగిన పిండదశ. దీన్ని ప్రాథమిక శరీరకుహరం అంటారు.
→ శిరస్థ : తలకు సంబంధించింది.
→ సెర్విం : మెడ.
→ సంపర్కం : లైంగిక ప్రక్రియ/ఒక జీవిలో శుక్రకణాలను వేరొక సంపర్కజీవిలోకి బదిలీ చేయడానికి అవసరమైన కలయిక.
→ కర్పోరియల్ : వేగంగా పరుగెత్తే జీవి.
→ అవభాసిని : కీటకపు దేహం బాహ్యాస్తిపంజర నిర్మాణం. దీనికి అధ్యావభాసిని, మధ్యావభాసిని, అంత్యావభాసిని ఉంటాయి. ఇది ఒక రకమైన పాలిసాకరైడ్.
→ ఏకలింగజీవులు : డయాస్ట్రిక్ ప్రాంతం : నేత్రాంశం లోపలి భాగం మీద కాంతి కిరణాలను కేంద్రీకరించే భాగం.
→ నిర్మోచనం : దేహ వెలుపలి స్తరం (అవభాసిని) ఉండిపోవడం
→ జర్మేరియం : బొద్దింక ఒవేరియోల్లో సాగిన పూర్వాంతపు పోగు.
→ రక్తకుహరం : ఆర్థ్రోపొడా లేదా మొలస్కా జీవుల శరీరకుహరం రక్తశోషరసంతో నిండి ఉంది. ఇది పిండం సంయుక్త బీజకుహరిక నుంచి ఏర్పడింది. దీన్ని ప్రాథమిక శరీరకుహరం అని కూడా అంటారు.
→ నెర్వ్యూర్లు : బొద్దింక రెక్కల్లోని బోలుగా ఉన్న నాళాకార జాలకం.
→ గుడ్లకోశం : రెండు వరసల్లో గుడ్లు కలిగిన దృఢమైన రూకల సంచి లాంటి నిర్మాణం.
→ ఒవేరియోల్ : బొద్దింకలో అభివృద్ధి చెందుతున్న అండాలు కలిగిన స్త్రీ బీజకోశనాళిక.
→ పారోమెటాబాలిక్ : కొన్ని కీటకాల్లో సరూపశాబక దశల ద్వారా జరిగే క్రమమైన అభివృద్ధి/రూపవిక్రియ.
→ పోడోమియర్ : ఆర్థ్రోపోడ్ కాలు యొక్క ఖండితం.
→ పల్విలస్ : నఖాల మధ్యనున్న మృదువైన రోమాల మెత్త.
→ ఉరఃఫలకం (Sterna) : బొద్దింకలాంటి కీటకాల్లో దేహ ఖండితం ఉదరభాగ స్లీరైట్.
→ టాగ్మా (Plural-Tagmata) : కీటకపు దేహంలోని భాగాలు. దేహం వివిధ భాగాలుగా విభజన చెందడాన్ని టెగ్మాటైజేషన్ అంటారు.
→ టెర్గమ్ (Plural-Terga) : కీటక దేహంలోని ఖండిత పృష్ఠ స్లీరైట్.