Students can go through AP Inter 1st Year Zoology Notes 8th Lesson జీవావరణం – పర్యావరణం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 8th Lesson జీవావరణం – పర్యావరణం
→ జీవుల మధ్య జరిగే అంతర చర్యలు, జీవులకు వాటి భౌతిక పరిసరాలకు మధ్య జరిగే పరస్పర చర్యలను వివరించే విజ్ఞాన శాస్త్రాన్ని జీవావరణశాస్త్రం (Ecology) అంటారు.
→ Ecology (జీవావరణ శాస్త్రం) అనే పదాన్ని ఎర్నెస్ట్ హెకెల్ పరికల్పన చేశారు.
→ జీవావరణ శాస్త్రంలో ఆటెకాటజీ, సైనెకాలజీ అనే రెండు ముఖ్య విభాగాలున్నాయి.
→ ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువుల సమాజాన్ని జీవ మండలం (Biome) అంటారు.
→ భూమండలంలో అన్ని రకాల ఆవాస ప్రాంతాలను కలిపి సంయుక్తంగా ఇకొస్ఫియర్ లేదా బయోస్ఫియర్ (జీవగోళం) అంటారు.
→ పర్యావరణంలోని జీవ, నిర్జీవకారకాలు పలువిధాలుగా ఒక దానిపై ఒకటి ప్రభావంను కలిగి ఉంటాయి.
→ జీవ సమాజంలో జీవి నిర్వహించే క్రియాత్మక పాత్రను నిచే (Niche) అంటారు.
→ ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి వ్యవధి (Photoperiod) అంటారు.
→ నీరు 4°C కు ఉష్ణోగ్రతకు చేరినప్పుడు అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది.
→ జీవ సంబంధ నియంత్రకాలంను ఉపయోగించే పంట పొలంలో చీడ పీడలను నివారించవచ్చు. వీటి డింబకాలను నాశనం చేయవచ్చును.
→ జిల్లేడు మొక్క అతి ప్రమాదకరమైన హృదయస్పందన ప్రభావం చూపించే కార్డియ గ్లైకోసైజ్ విషపదార్ధం కలిగి ఉంటుంది.
→ జీవావర్ణ వ్యవస్థ ప్రకృతిలో క్రియాత్మక భాగం.
→ పర్యావరణంలో ఆహారశక్తి ఒక స్థాయి జీవుల నుండి (ఉత్పత్తిదారు నుండి) మారుస్తాయి జీవులకు బదిలీ అయ్యే మార్గాన్ని నిలువు వరుసగా చూసే ఒకదానితో ఒకటి గొలుసు లింకులలాగా ఉండటం వలన దీనిని “ఆహారపు గొలుసు” అంటారు. ఇది శక్తి ప్రరసరణను చూపిస్తుంది.
→ ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నీటిలలో ఉష్ణస్తరాలు ఏర్పడతాయి. దీనినే ‘ఉష్ణస్తరీభవనం’ అంటారు.
→ నీటిలో లోతుకుపోయేకొద్ది ఉష్ణోగ్రత తగ్గుదలను గమనించవచ్చును. ఏ లోతు నుండైతే ఉష్ణోగ్రతలో వేగవంతమైన తరుగుదల కనిపిస్తుందో ఆ భాగాన్ని ‘థర్మోక్లెన్’ అంటారు.
→ ఆహార గోలుసులో కాలుష్యం లేదా విషపదార్థం గాఢత ఒక పోషకస్థాయి నుండి వేరొక పోషక స్థాయికి పెరుగుతూపోతే దానిని జీవ ఆవర్ధనం (Bio-magnification) అంటారు.
→ పర్యావరణంలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్చిన్న కారులు ప్రధాన పోషకస్థాయిలు.
→ వాతావర్ణంలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. అవి. అట్మాస్ఫియర్, హైడోస్ఫియర్, లిథోస్ఫియర్.
→ అట్మాస్ఫియర్లో స్ట్రాపోస్ఫియర్, స్టాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఎక్సొస్ఫియర్ అనే భాగాలుంటాయి.
→ సరస్సు జీవావర్ణంలో వేలాంచల మాండలం, లిన్నటిక్ మండలం, ప్రొఫెండల్ మండలం అనే బాగాలుంటాయి.
→ నీరు 4°C వద్ద అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది.
→ ఉష్ణోగ్రతలలో మార్పు కారణంగా, ఋతువులకనుగుణంగా నీరు క్రిందకు, పైకి సరోవరంలో తిరగబడడాన్ని ఓవర్ టర్న్ అంటారు.
→ డాప్నియా వంటి కొన్ని జంతువుల ఋతువులను బట్టి వాటి శరీరాకృతిలో మార్పులను ఏర్పరుచుకుంటాయి. దీనికి భ్రమణ రూపవిక్రియ అంటారు.
→ కొన్ని జంతువులు అననుకూల వాతావరణ పరిస్థితులలో వాటి పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని డయాపాస్ అంటారు.
→ ఎత్తైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు పీడనంలో మార్పు కారణంగా దేహంలో కలిగే అసాధారణ మార్పులను ఆల్టిట్యూడ్ సిక్నెస్ (Altitude sickness) అంటారు.
→ ఆవాసం కోసం ఆహారం కోసం ఒక జీవి వేరొక జీవిపై ఆధారపడటాన్ని ‘పరాన్నజీవనం’ అంటారు.
→ జీవావరణ వ్యవస్థ ప్రకృతిలో క్రియాత్మక ప్రయాణం.
→ శక్తి ఒక పోషణ స్థాయినుండి వేరొక పోషణ స్థాయి బదిలీ చేయబడటాన్ని ‘శక్తి ప్రసరణ’ అంటారు.
→ ఒక ప్రమాణ వైశాల్యం, నిర్థిష్ట సమయంలో ఒక ప్రదేశంలో ఉండే జీవుల సంఖ్యను ‘జనసాంద్రత’ అంటారు.
→ పర్యావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగిపోవడం వల్ల హరిత గృహప్రభావం కనిపిస్తుంది.
→ ఆటె కాలజీ : వైయక్తిక విడివడి జాతుల జీవావరణ శాస్త్రం.
→ బాస్కింగ్ : ఉష్ణోగ్రత గ్రహించడానికి శరీరాన్ని ఎండకు గురి చేయడం.
→ అగాధ జీవులు : నదులు, సరస్సులు, సముద్రాల అడుగున నివసించే అన్ని రకాల అంటే స్థానబద్ద, పాకే, బొయజీవులు.
→ జీవద్రవ్యదాశి : నిర్దిష్ట ప్రదేశంలో, నిర్దిష్ట సమయంలో ఉండే మొత్తం జీవుల బరువును జీవద్రవ్యరాశి అంటారు.
→ బ్లబ్బర్ : కేవలం సముద్ర క్షీరదాలలోనే కనిపించే చర్మం కింది ప్రత్యేకమైన కొవ్వు పొర. ఇది సముద్ర క్షీరదాల దేహం అంతటా ఉంటుంది. ఉపాంగాల మీద ఉండదు.
→ బ్రాకిష్ వాటర్ : నది, సముద్ర జలాలు కలిసే మధ్యస్థ ప్రాంతం.
→ కమొఫ్లేజ్ : వేటాడే జంతువుల నుంచి రక్షణ కోసం దాక్కోవడానికి ఏర్పడే వర్ణ మార్పులు. (ఉదా : మెలనిజం), నిర్మాణ మార్పులు (ఉదా : స్టిక్ కీటకం).
→ రసాయన స్వయంపోషకాలు : సరళ అకర్బన సమ్మేళనాల నుంచి ఆక్సీకరణ ద్వారా శక్తిని గ్రహించి, ఆ శక్తిని CO2 ను స్వాంగీకరణ చేయడానికి, సేంద్రీయ పదార్థాలకు బదిలీ చేయగల బాక్టీరియా జీవులు. ఉదా : థయోబాసిల్లస్ జాతులు.
→ శీతోష్ణస్థితి : ఒక ప్రాంతపు సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం, వాయు వేగాలను ఆ ప్రాంతపు శీతోష్ణస్థితిగా వర్ణిస్తారు.
→ జీవసముదాయం : మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో సహా ఒక జీవావరణ వ్యవస్థలోని మొత్తం ప్రాణులు. దీన్ని గాసే సూత్రం అంటారు.
→ పోటీ బహిష్కరణ : మారు ఋతువులతో పాటు దృశ్య రూపంలో జరిగే చక్రీయ బాహ్యస్వరూప మార్పులు. ఇది క్లాడోసిరన్ క్రస్టేషియన్లు, రోటిఫర్లలో ఎక్కువగా కనిపిస్తుంది.
→ భ్రమణరూపవిక్రియ : నిర్జీవ సేంద్రీయ పదార్థం. సాధారణంగా ఇది మొక్కలకు సంబంధించిన రేణురూప పదార్థం. ఉదా : ఆకుల చెత్తకుప్ప.
→ డయాపాస్ : ప్రతికూల పరిస్థితులలో అనేక జీవులలో, ప్రత్యేకించి కీటకాలలో ఎదుగుదల, లైంగికాభివృద్ధి ఆగిపోవడం.
→ డైమిక్ సరస్సు : వసంత ఋతువులోను, ఆకురాలే కాలంలోనూ, రెండుసార్లూ, సరస్సు మొత్తం నిడివి నీటి మిశ్రమం చెందడం. ఈ సరస్సులు వేసవిలో ఉష్ణోగ్రతా స్తరీభవనం చెందుతాయి.
→ ఎడాఫిక్ కారకాలు : మొక్కల అభివృద్ధి, వ్యాప్తిని ప్రభావితం చేసే మృత్తికలోని భౌతిక, రసాయన, జీవ లక్షణాలు.
→ నదీముఖద్వారం (Estuary) : నదులు సముద్రంలో కలిసే ప్రదేశం. దీనిలో లవణీయత ఋతువుల ప్రకారం మారుతుంది. ఈ నీటిని బ్రాకిష్ నీరు అంటారు. ఇందులో నివసించే జీవులు అమితలవణీయ జీవులు.
→ జెమ్యూల్స్ : స్పంజికల అలైంగిక ప్రత్యుత్పత్తిలో కనిపించే లోపలి కారకాలు. ఇది అమీబో సైట్లతో తయారై, కంటకాలతో కప్పబడి ఉంటాయి. ఇవి ప్రతికూల పరిస్థితులలోనూ జీవించగలవు.
→ విక్షాళనం (Leaching) : నేలపై నీటి ప్రవాహం ద్వారా కరిగే పదార్థాల తొలగింపు.
→ మైకోరైజ్ : గింజ మొక్కల వేళ్ళతో శిలీంధ్రం యొక్క మైసీలియం జరిపే సహజీవనం.
→ ఆస్మోట్రోఫిక్ పోషణ : ముందుగా జీర్ణమైన ఆహారాన్ని శరీర ఉపరితలం ద్వారా తీసుకోవడం.
→ పెడోనిక్ జీవులు : జల జీవావరణ వ్యవస్థలో అధస్తరంపై ఆధారపడే జీవులు.
→ పెరిఫైటాన్ : జల మొక్కల ఉపరితలంపై జీవించే ప్రోటోజోవా, కీటక డింభకాలు, నత్తల సముదాయాలు.
→ గడ్డిమైదానాలు : ఉష్ణ, ఉప ఉష్ణమండలాల్లోని విసిరేసినట్లుండే చెట్లు గల గడ్డి మైదాన ప్రాంతం.
→ స్టాండింగ్ క్రాప్ : నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట ప్రాంతంలోని మొత్తం మొక్కల రాశి. సాధారణంగా మొక్కలకే అన్వయిస్తారు. జంతువుల జీవద్రవ్యరాశికి కూడా ఈ సాంకేతిక పదాన్ని ఉపయోగిస్తారు.
→ వినత్రీకరణం : సూక్ష్మజీవుల ద్వారా నైట్రేట్లను అణు నైట్రోజన్ (N2) గా మార్చే ప్రక్రియ. నైట్రేట్ క్షయకరణ జరిగి వరస శ్రేణిలో మాధ్యమిక నైట్రోజన్ ఆక్సైడ్ వాయు ఉత్పాదితాల ద్వారా చివరన అణు నైట్రోజన్ (N2) ఏర్పడుతుంది.
→ విచ్ఛిన్నకారులు : చనిపోయి, కుళ్లిపోతున్న పదార్థాలను విచ్ఛిన్నం చేసే జీవులు. వీటిని పూతికాహారులు అని కూడా అంటారు.
→ సెడిమెంటరీ : నీరు, మంచు, గాలి వల్ల పేరుకొని గట్టిపడిన ఖనిజ, కర్బన రసాయన తునకలు.
→ అనంత స్పర్శరేఖ (Asymptote) : ఒక రేఖ నిర్ణయించిన దూరం కంటే వక్రరేఖకు దగ్గరగా వస్తుంది, కానీ అనంతంగా పెంచినా, అది దాన్ని కలువదు.
→ రసాయన స్వయంపోషకం : రసాయన ప్రక్రియ ద్వారా శక్తిని గ్రహించే ఒక జీవి (బాక్టీరియా లేదా ప్రోటోజోవన్) కిరణజన్య ప్రక్రియ నుంచి కాకుండా, పరిసరంలోని ఎలక్ట్రాన్ ప్రదాత అణువుల ఆక్సీకరణ ద్వారా శక్తిని గ్రహిస్తుంది.
→ మరణరేటు : చావు రేటు లేదా ఒక నిర్దిష్ట సమయంలో ఒక జనాభాలో మరణించిన వ్యక్తుల సంఖ్య.
→ జననరేటు : జననరేటు లేదా ఒక నిర్దిష్ట సమయంలో ఒక జనాభాలో పుట్టిన వ్యక్తుల సంఖ్య.
→ ఆమ్లవర్షాలు : అసాధారణ ఆమ్లయుత వర్షం లేదా ఏదేని అవక్షేప రూపం.
→ శైవల మంజరులు : జల జీవావరణ వ్యవస్థలో శైవలాల వేగవంతమైన వృద్ధి లేదా శైవల జనాభా సంచయనం (multiplication) (సూక్ష్మజీవులు).
→ జీవి (క్షయ) విచ్ఛిన్నం : సూక్ష్మజీవుల చర్య ద్వారా హానికరం కాని పదార్థాలుగా విచ్ఛిన్నం చెందడం.
→ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ : ఒక నీటి నమూనాలో, నిర్దిష్ట ఉష్ణోగ్రత, కాలవ్యవధిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి వాయుసహిత జీవులకు అవసరమయ్యే కరిగిన ఆక్సిజన్ పరిమాణం.
→ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ : నీటిలో కరిగి ఉన్న రసాయన పదార్థాల విచ్ఛిన్నతను రసాయన వియోగం ఆధారంగా పరీక్షించే ప్రక్రియ.
→ క్లోరోఫ్లోరోకార్బన్లు : కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్ ఉన్న వివిధ హేలోకార్బన్లు. ఇవి ఒకప్పుడు రెఫ్రిజిరెంట్లుగా, ఏరోసాల్ ప్రొపెల్లెంట్లుగా విరివిగా వాడబడేవి. ఇవి వాతావరణం లోని ఓజోన్ పొరను క్షీణింపజేస్తాయని విశ్వాసం.
→ అడవుల నరికివేత : అడవులలోని చెట్లను నరికి, ఆ ప్రదేశాన్ని అడవికి సంబంధం లేని పనులకు వినియోగించడం.
→ యూట్రోఫికేషన్ : నీటివనరులయిన సరస్సులు, నదీముఖద్వారాలు లేదా మెల్లగా కదిలే ఝరులలో అధిక పోషకాల చేరికవల్ల మొక్కలు, కలుపు మొక్కలు, శైవలాలు అతిగా అభివృద్ధి చెందడానికి పురికొల్పడం.
→ శిలీంధ్రనాశకాలు : శిలీంధ్ర వినాశక పదార్థాలు- పిచికారులు, పొడులు.
→ గుల్మనాశకం (Herbicide) : కలుపు, అవాంఛనీయ మొక్కల వినాశక రసాయనాలు.
→ భస్మీకరణ యంత్రం : వ్యర్థాలను బూడిదగా మార్చేది.
→ ల్యాండ్ ఫిల్లు : వ్యర్థ పదార్థాలను నింపడానికి ప్రణాళికాబద్ధంగా నేలమీద గుంతలో చేసిన ఏర్పాటు లేదా ఫుట్బాల్ స్టేడియంను తలపించే నేల మీది కట్టడం.
→ కీటకనాశనులు : కీటకాలు, తెగుళ్ల వినాశక రసాయనాలు.
→ కాంతి రసాయన పొగమంచు (smog) : వాహనాల, ఉద్గారాలు (వాయువులు) సూర్యకాంతితో చర్య జరిపి ఓజోన్, ఆల్డీహైడ్లు, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ (PAN) లాంటి హానికారక పదార్థాలుగా మార్పుచెందే ఒక విధమైన వాయు కాలుష్యం
→ పాలీబ్లెండ్ : రెండు; అంతకంటే ఎక్కువ పాలిమర్ల భౌతిక మిశ్రమం. అవి రెండింటి ఉపయుక్త లక్షణాలను కలిగి ఉంటాయి.
→ స్క్రబ్బర్ : పొగ గొట్టాల నుంచి హానికర ధూళి, కాలుష్యాలను రుద్ది, తొలగించే పదార్థాలు. వీటిలో నీరు, రసాయనాలు ఉంటాయి. వాయువుల నుంచి ఏరోసాలు, వాయు కాలుష్యకాలను శోషణ లేదా రసాయన చర్యల ద్వారా తొలగిస్తాయి.
→ మురుగునీరు : అనేక ఘన, ద్రవ (మానవ విసర్జాలతో సహా) పదార్థాలు కలిసిన గృహ వ్యర్థ జలం.
→ మృత్తిక క్రమక్షయం : నీరు, గాలి ప్రవాహాల వల్ల నేల ఉపరితలం కొట్టుకొని పోవడం.
→ ఉష్ణకాలుష్యం :పరిశ్రమల నుంచి, థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి, అగ్నిపర్వతాల నుంచి నీటిలోకి ప్రవహించే ఉష్ణజలం వల్ల కలిగే కాలుష్యం. దీనివల్ల జలజీవులకు ప్రమాదం.
→ అతినీలలోహిత-బి : సూర్యకాంతిలో వచ్చే మూడు రకాల కిరణాలలో ఒకటి (మిగతావి UV-A, UV-C )). UV-C అత్యంత ప్రమాదకారి అయినా అది ఓజోన్ పొర దాటి రాలేదు. ఓజోన్ పొర ఉన్నంతకాలం దీనివల్ల మానవులకు, జంతువులకు లేదా భూమిపై ఉన్న మొక్కల జీవనానికి ప్రమాదం ఉండదు. మిగతా రెండు ఓజోన్ పొరని దాటి భూమిని తాకుతాయి. UV-A వల్ల చర్మం ముడతలు, చర్మ క్యాన్సర్లు కలుగుతాయి. UV-B నేరుగా DNA ని దెబ్బతీస్తుంది, అనేక చర్మ క్యాన్సర్లను కలిగిస్తుంది.