AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మీరు గమనించిన స్పంజికల దేహంలో ఏ భౌతిక లక్షణం ఆధారంగా అవి నివసించే మాధ్యమాన్ని బట్టి స్పంజికలను మొక్కలుగా కాక జంతువులుగా గుర్తిస్తారు ? మీరు గమనించిన ఆ లక్షణాల ఆధారంగా స్పంజిక దేహంలోని ఆ భాగాన్ని ఏమంటారు?
జవాబు:
వీటిలో కుల్యావ్యవస్థ ఉండి నీరు నిరంతరము ఆస్టియా ద్వారా శరీరములోకి పంపబడి ఆస్కులమ్ ద్వారా బయటకు పంపబడును. ఈ నీటి ప్రసరణ ఆహార సముపార్జనలోను, శ్వాస వాయువుల వినిమయములోను తోడ్పడును.

ప్రశ్న 2.
స్పంజికలో అంతరాస్థిపంజరాన్ని ఏర్పరచే వివిధ నిర్మాణాలు ఏవి? ఈ నిర్మాణాల ఏర్పాటుకు ఏ రసాయనాలు అవసరమో తెలపండి.
జవాబు:
స్పంజికల అంతరాస్థి పంజరము కంటకములతోను మరియు స్పంజికా తంతువులు నిర్మితమై ఉండును. ఈ కంటకాలు కాల్షియం కార్బొనేట్ ను లేదా సిలికాన్ ను నిర్మితమగును. స్పంజికా తంతువులు ప్రోటీన్లతో తయారుచేయబడును.

ప్రశ్న 3.
స్పంజికల కుల్యావ్యవస్థ విధులేవి?
జవాబు:
కుల్యావ్యవస్థ విధులు ఏమనగా పోషణ, శ్వాసక్రియ మరియు విసర్జన క్రియకు తోడ్పడును.

ప్రశ్న 4.
నిడేరియన్లలోని రెండు ముఖ్యమైన దేహరూపాలు ఏవి ? వాటి ప్రధాన విధులు తెలపండి.
జవాబు:
పాలిప్ రూపము మరియు మెడ్యుసా రూపము. పాలిప్ రూపము పోషణకు మరియు మెడ్యుసా రూపము ప్రత్యుత్పత్తికి తోడ్పడును.

ప్రశ్న 5.
మెటాజెనిసిస్ అంటే ఏమిటి? ఏ వర్గానికి చెందిన జంతువులు దీన్ని ప్రదర్శిస్తాయి?
జవాబు:
లైంగిక, అలైంగిక దశలు ఒక జీవి జీవిత చక్రములో ఒకదాని తరువాత ఒకటి ఏర్పడిన యెడల దానిని మెటాజెనిసిస్ అంటారు. వర్గము నిడేరియా జీవులు మెటాజెనిసిస్ ను చూపును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 6.
ఏ సముదాయానికి చెందిన నిడేరియన్లలో మీసోగ్లియా పరిమాణం సాపేక్షరీత్యా ఎక్కువగా ఉంటుంది? నిడేరియన్ల జలజీవనానికి సంబంధించి బాగా అభివృద్ధి చెందిన మీసోగ్లియా ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
స్కైఫోజోవా జీవులలో మీసోగ్లియా పరిమాణం సాపేక్షరీత్యా ఎక్కువగా ఉంటుంది. మీసోగ్లియా జీవి దేహము తేలికగా నీటిపై తేలియాడుటకు తోడ్పడును.

ప్రశ్న 7.
రక్షకకణాలు లేదా రక్షకనిర్మాణాలు కలిగిన జననస్తరానికి సంబంధించి హైడ్రోజోవన్స్, ఇతర నిడేరియన్లకు గల ప్రధాన భేదమేమిటి?
జవాబు:
రక్షకకణాలు లేదా రక్షక నిర్మాణాలు అయిన దంశ కణములు బాహ్య త్వచము నుండి ఏర్పడును. మిగిలిన నిడేరియా జీవులలో బాహ్యత్వచము నుండి అంతస్త్వచం నుండి ఏర్పడును.

ప్రశ్న 8.
బల్లపరుపు పురుగుల విసర్జక కణాలేవి? ఈ ప్రత్యేక కణాల మరొక ముఖ్యవిధి ఏమిటి?
జవాబు:
బల్లపరుపు పురుగుల విసర్జక కణాలను జ్వాలా కణములు లేదా సొలెనోసైట్స్ అందురు. వీటి యొక్క మరొక విధి ద్రవాభిసరణ క్రమత.

ప్రశ్న 9.
ఆంఫిడ్లు, ఫాస్మిడ్ల మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
నిమటోడా జీవులలో ముఖ భాగము చుట్టూ క్యూటికిల్తో నిర్మితమైన పల్లపు నిర్మాణాలను ఆంఫిడ్లు అని అందురు. ఇవి రసాయనిక గ్రాహకాలు. ప్లాస్మిడ్లు పరాంతరములో ఉండే గ్రంథి జ్ఞాన నిర్మాణాలు.

ప్రశ్న 10.
దేహ పర్యాంతరంగ స్థలానికి సంబంధించి బల్లపరుపు పురుగులు, గుండ్రటి పురుగులకు మధ్య ఉండే ప్రధాన భేదం ఏమిటి?
జవాబు:
బల్లపరుపు పురుగులు శరీర కుహరరహిత లక్షణములను అవయవస్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించును. దేహంలో నిజ ఖండీభవనము ఉండదు.

గుండ్రటి పురుగులు అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించును. ఇవి ద్విపార్శ్వ, మిథ్యా శరీరకుహర, త్రిస్తరిత జీవులు. దేహం ఖండరహితం.

ప్రశ్న 11.
నిమటోడా, అనెలిడా దేహంలోని పర్యాంతరాంగ స్థలం పుట్టుక గురించి మీరు ఏవిధంగా వివరిస్తారు?
జవాబు:
గుండ్రటి పురుగుల స్థాయి నిమటోడాలో అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించును. ఇవి ద్విపార్శ్వ, సౌష్టవ, మిథ్యా శరీరకుహర త్రిస్తరిత జీవులు. దేహం ఖండితరహితం. అనెలిడా జీవులలో శరీర నిర్మాణం అవయవ వ్యవస్థ స్థాయిని కలిగి ఉంటుంది. ఇది త్రిస్తరిత, సమఖండ విన్యాసాన్ని ప్రదర్శించే నిజ శరీరకుహర జీవులు.

ప్రశ్న 12.
దేహ సమఖండీభవనం అంటే ఏమిటి? బద్దెపురుగు, వానపాములలో స్వరూప పరంగా దేహ ఖండితాలు ఏర్పడే పద్ధతిలో ప్రధాన భేదం ఏమిటి?
జవాబు:
అనెలిడా జీవులలో శరీర కుహరము అడ్డు విభాజకాలతో ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. దీనిని సమఖండ విన్యాసము అందురు. బద్దె పురుగులో అడ్డు విభాజకములు ఉండవు. అందువలన ఇవి నిజఖండీభవనమును చూపవు. అందువలన దీనిని మిథ్యాఖండీభవనము అందురు.

ప్రశ్న 13.
దేహ సమఖండీభవనానికి సంబంధించిన స్వరూప లక్షణాల ఆధారంగా ఒక హైరుడినీయన్ ను ఇతర అనెలిడ్ నుంచి ఎలా గుర్తిస్తారు? శరీర కుహర అంశాలకు సంబంధించి జలగ శరీర కుహరం వానపాము శరీరకుహరం నుంచి ఏ రకంగా భిన్నమైంది?
జవాబు:
దేహం పృష్టోదర తలాలలో అణచబడి, నిర్దిష్ట సంఖ్యలో ఖండితాలు కలిగి ఉంటుంది. ఖండితాలు బాహ్యంగా ఉపఖండితాలుగా విభజింపబడి ఉంటాయి.

జలగ శరీర కుహరము బొట్రాయిడల్ కణములతో నిండి ఉంటుంది. వానపాము శరీర కుహరం శరీర కుహర ద్రవముతో నింపబడి ఉండును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 14.
నీరిస్లోని చలనానికి తోడ్పడే నిర్మాణాలను ఏమంటారు ? నీరిస్ ను పాలికీట్ అని ఎందుకు అంటారు?
జవాబు:
నీరిస్లోని చలనాలకు తోడ్పడే నిర్మాణాలను పారాపోడియా లేదా పార్శ్వ పాదాలు అందురు. ఇది అనేక శూకాలను కలిగి ఉండును. కాబట్టి వీటిని పాలికీట్ అని అందురు.

ప్రశ్న 15.
బొట్రాయిడల్ కణజాలం అంటే ఏమిటి?
జవాబు:
జలగవంటి జీవులలో శరీర కుహరం ప్రత్యేకమైన బొట్రాయిడల్ కణజాలముతో నిండి ఉండును. ఇవి ద్రాక్ష గుత్తులను పోలియుండును. ఇవి విసర్జన క్రియకు, ఇనుము, కాల్షియం నిల్వ, గాయం తగిలిన ప్రాంతములో రక్తనాళాల పునర్నిర్మాణములో ముఖ్యపాత్ర వహించును.

ప్రశ్న 16.
నిమటోడా, అనెలిడా బాహ్యచర్మాల మధ్య భేదమేమిటి ? శరీరకుడ్యంలోని కండరాలకు సంబంధించి నిమటోడ్ అనెలిడ్ ఏవిధంగా విభేదిస్తుంది?
జవాబు:
నిమటోడా జీవులలో సిన్సీషియల్ లేదా బహుకేంద్రక బాహ్యచర్మము ఉంటుంది. అనెలిడా జీవులలో బాహ్యచర్మము ఒక కణ మందములో ఉండే ఉపకళా కణములతో ఏర్పడును. అనెలిడా జీవులలో దేహ కుడ్యములో వర్తుల, ఆయత కండరాలు ఉండును. ఈ కండరాలు గమనమునకు ఉపయోగపడును.

ప్రశ్న 17.
తేళ్ళలోని మొదటి, రెండవ జత శిరో ఉపాంగాలను ఏమంటారు?
జవాబు:
తేళ్ళలోని మొదటి, రెండవ జత శిరో ఉపాంగాలను తెలిసెరాలు మరియు పెడిపాలు అందురు.

ప్రశ్న 18.
క్రస్టేషియాలోని మొదటి రెండు జతల శిరో ఉపాంగాలు, ఇతర సజీవ ఆర్థ్రోపోడ్ జీవులతో పోల్చినప్పుడు కనిపించే ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
శిరో భాగములో రెండు జతల స్పర్శశృంగాలు అనగా స్పర్శశృంగికలు, స్పర్శశృంగాలు ఉండుట ఒక విశిష్ట లక్షణముగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 19.
టిక్ లు, మైట్లను చేర్చిన ఉపవర్గం ఏది? నడిచే కాళ్ళ ఆధారంగా వీటిని కీటకాల నుంచి ఏ విధంగా గుర్తిస్తారు?
జవాబు:
టిక్లను, మైట్లను ఉపవర్గము కెలిసిరేటా క్రింద చేర్చినారు. ప్రోసోమా ఆరు జతల ఉపాంగాలను కలిగి ఉండును.

ప్రశ్న 20.
లిమ్యులస్, పేలామ్నియన్లలో వాటి శ్వాస నిర్మాణాలను పేర్కొనండి.
జవాబు:
లిమ్యులస్ నందు శ్వాస నిర్మాణాలు పుస్తకాకార మొప్పలు మరియు తేలునందు పుస్తకాకార ఊపిరితిత్తులు ఉండును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 21.
స్పర్శశృంగాలు అంటే ఏమిటి? స్పర్శశృంగాలు లేని ఆర్థ్రోపోడ్ సముదాయం ఏది?
జవాబు:
స్పర్శశృంగాలు జ్ఞానాంగములు. స్పర్శను, వాసనను తెలుసుకొనుటకు ఉపయోగపడును. మాండిబ్యులేటా జీవులు వీటిని కలిగి ఉండును.

ప్రశ్న 22.
ఒక ఆర్థ్రోపోడ్లోని పర్యాంతరాంగకుహరాన్ని ఏమంటారు? అది పిండాభివృద్ధిలో ఎక్కడ నుంచి ఏర్పడుతుంది?
జవాబు:
పర్యాంతరాంగ కుహరమును హీమోసోల్ లేదా రక్తకుహరము అని అందురు. ఇది పిండాభివృద్ధి దశలలో పిండ బ్లాస్టోసోల్ నుంచి ఏర్పడును.

ప్రశ్న 23.
మీరు చదివిన ఏ ఆర్థ్రోపోడ్ను సజీవశిలాజం అంటారు? దాని శ్వాసాంగాలను పేర్కొనండి.
జవాబు:
“లిమ్యులస్” ను సజీవ శిలాజముగా పేర్కొనెదరు. వీటి శ్వాస అవయవములు పుస్తకాకార మొప్పలు.

ప్రశ్న 24.
బాహ్యరూపం ఆధారంగా కైటాన్ ను ఏ విధంగా గుర్తించగలవు? కైటాన్ లో ఎన్ని జతల మొప్పలు శ్వాసక్రియలో సహాయపడతాయి?
జవాబు:
కైటాన్ కర్పరము ఎనిమిది అడ్డు ఫలకాలు (కవాటాలను) కలిగి ఉండును. అందువలన దీనిని గుర్తించవచ్చును. మొప్పలు 6 నుంచి 88 జతల వరకు ఉంటాయి. ఇవి శ్వాసక్రియకు తోడ్పడును.

ప్రశ్న 25.
రాడ్యులా విధి ఏమిటి? రాడ్యులా లేని మలస్కా జీవుల సముదాయం పేరు తెలపండి. [Mar. ’14]
జవాబు:
మలస్కా జీవుల ఆస్య కుహరములో ఆకురాయిలాంటి నికషణ అవయవము ఉండును. దీనిని రాడ్యులా అని అందురు. పెలిసిపొడా విభాగపు జీవులలో రాడ్యులా ఉండదు.

ప్రశ్న 26.
మలస్కా జీవుల మొప్పకు వేరొక పేరేమిటి ? ఓస్ఫేడియం విధి ఏమిటి?
జవాబు:
మొప్పలకు మరియొక పేరు టినీడియా. ఓస్ఫేడియం ముఖ్య విధి నీటి స్వచ్ఛతను తెలియజేయును.

ప్రశ్న 27.
అరిస్టాటిల్ లాంతరు అంటే ఏమిటి? దీన్ని కలిగి ఉండే ఒక జంతువు ఉదాహరణను పేర్కొనండి.
జవాబు:
నోటిలో ఐదు దవడలు కలిగి ఆహారాన్ని నమలటానికి ఉపయోగపడే నిర్మాణమును అరిస్టాటిల్ లాంతరు అని అందురు. ఉదా : సీ అర్చిన్.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 28.
సౌష్ఠవపరంగా ఇకైనోడర్మ్ జువెనైల్, ప్రౌఢజీవుల మధ్య ప్రధాన భేదం ఏమిటి?
జవాబు:
సౌష్ఠవపరంగా ఇకైనోడర్మ్ డింభకాలు ద్విపార్శ్వ సౌష్ఠవమును కలిగి ఉంటాయి. ఇకైనోడర్మేటాలోని ప్రౌఢజీవులు పంచభాగ వ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉండును.

ప్రశ్న 29.
ఫెరిటిమాలో రక్తగ్రంథులు అంటే ఏమిటి?
జవాబు:
ఫెరిటిమా దేహంలో 4, 5, 6వ ఖండితాలలో రక్తగ్రంథులు అనే నిర్మాణాలుంటాయి. ఇవి రక్తకణాలను, ప్లాస్మాలో కరిగి ఉండే హీమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 30.
ఫెరిటిమాలోని శుక్రగ్రాహికలు అంటే ఏమిటి? అవి ఏ ఖండితాలలో ఉంటాయి?
జవాబు:
ఫెరిటిమాలో 6, 7, 8, 9 ఖండితాలలో పూర్వ విభాజకమునకు అంటుకొని ఖండితానికి ఒక జత చొప్పున శుక్రగ్రాహికలు అనబడే నిర్మాణాలుంటాయి. ఇవి సంపర్క సమయంలో శుక్ర కణాలను (శుక్ర గుళికలు) గ్రహించి నిల్వ చేస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంథోజోవన్ల ముఖ్య లక్షణాలపై లఘుటీక రాయండి. [Mar. 14]
జవాబు:
ఆంథోజోవా :
ఈ జీవులను సాధారణంగా సీ అనిమోన్లు అంటారు. ఇవి స్థానబద్ధ జీవులు, పాలిప్ రూపాలను మాత్రమే కలిగి ఉంటాయి. సీలెంటిరాన్ అనేక గదులుగా ఆయత విభాజకాలతో విభక్తమై ఉంటుంది. ఈ విభాజకాలను మీసెంటరీలు అంటారు. మధ్యశ్లేష్మస్తరం సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది. దంశకణాలు బహ్మచర్మం, అంతఃచర్మంలో ఉంటాయి. బీజకణాలు అంతఃచర్మం నుంచి ఏర్పడతాయి. ఉదా : ఎడామ్సియా (సీ అనిమోన్), కొరాలియమ్ రుబ్రమ్ (ప్రశస్తమైన ఎరుపు శిలా ప్రవాళం), గార్గోనియా (సముద్ర విసనకర్ర), పెన్నాట్యులా (సముద్ర కలం).

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 2.
ఫ్లూక్ ను ఏ విభాగంలో చేర్చారు? ఆ సముదాయం ప్రధాన లక్షణాలపై లఘుటీక రాయండి.
జవాబు:
ట్రెమటోడా :
ట్రెమటోడా విభాగములోని జీవులను సాధారణంగా ఫ్లూక్స్ అంటారు. ఇవి ఇతర జంతువులలో పరాన్న జీవులుగా ఉంటాయి. దేహాన్ని కప్పి మందమైన అవభాసిని (టెగ్యుమెంట్) ఉంటుంది. ముఖ చూషకం, ఉదర చూషకం (ఉదూఖలం) అనే రెండు చూషకాలు ఉంటాయి. పూర్వాంతంలో నోరు, ద్విశాఖీయుత పేగు ఉంటుంది. ఇవి ద్విలింగ జీవులు (Monoecious), అనేక అతిథేయిలతో వివిధ రకాల డింభక దశలతో (మిరాసీడియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా మొదలైనవి) జీవితచరిత్ర క్లిష్టంగా ఉంటుంది. ఉదా : ఫాసియోలా (లివర్హెక్), షిస్టోసోమా లేదా బిల్హార్జియా (బ్లడ్రూక్).

ప్రశ్న 3.
పాలికీట్లు ప్రదర్శించే ముఖ్య లక్షణాలు ఏమిటి?
జవాబు:
పాలికీటా (Gr : Poly = అనేక; Chaetae శూకాలు) : పాలికీటా జీవులు సముద్రపు నీటిలో నివసిస్తాయి. వీటిని సాధారణంగా బ్రిసిల్ పురుగులు అంటారు. వీటిలో కొన్ని స్వేచ్ఛగా కదులుతాయి. మిగతావి బొరియలలో లేదా నాళాలలో జీవిస్తాయి. తల నిర్దిష్టంగా ఉంటుంది. దానిపై నేత్రాలు, స్పర్శకాలు, స్పర్శాంగాల లాంటి జ్ఞానావయవాలు ఉంటాయి. పార్శ్వ పాదాలు అనేక శూకాలను కలిగి (కాబట్టి పాలికీటా) గమనం, శ్వాసక్రియలో సహాయపడతాయి. క్లైటెల్లం ఉండదు. ఈ జీవులు ఏకలైంగికాలు, బీజవాహికలుండవు. సంయోగబీజాలు శరీరకుహరంలోకి విడుదల చేయబడి వృక్క రంధ్రాల ద్వారా వెలుపలికి విడుదలవుతాయి. బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధిలో ట్రోకోఫోర్ డింభకం ఉంటుంది.
ఉదా : నీరిస్ (ఇసుకపురుగు లేదా రాగ్వర్మ్ లేదా క్లాప్వార్మ్), ఎఫ్రోడైట్ (సముద్ర చుంచెలుక), ఆరెనికోలా (లగ్ వర్క్).

ప్రశ్న 4.
హిరుడీనియన్లు, పాలికీట్లు, ఒలిగోకీట్ల నుంచి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి?
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 1

ప్రశ్న 5.
క్రస్టేషియన్ల ప్రధాన లక్షణాలు ఏవి?
జవాబు:
క్రస్టేషియా :
ఇవి జలచరజీవులు, తల, ఉరం కలిసి శిరోవక్షం ఏర్పడుతుంది. (కైటిన్ నిర్మితమైన పృష్ఠకవచంతో కప్పబడి ఉంటుంది). కొన్నింటిలో బాహ్య కవచం కాల్షియం కార్బొనేట్తో దృఢపరచబడి ఉంటుంది. (పీతలు, లాబస్టర్లు). శిరోభాగంలో రెండు జతల స్పర్శశృంగాలు (స్పర్శ శృంగికలు, స్పర్శశృంగాలు – విశిష్ట లక్షణం), ఒక జత హనువులు, రెండు జతల జంభికలు ఉంటాయి. ఉరం, ఉదర ఉపాంగాలు ద్విశాఖీయంగా ఉంటాయి. శ్వాసాంగాలు మొప్పలు (బ్రాంకియే), విసర్జకాంగాలు హరిత గ్రంథులు లేదా స్పర్శశృంగ గ్రంథులు. వీటి దేహంలో స్పర్శశృంగాలు, సంయుక్తనేత్రాలు, సంతులన కోశాల వంటి జ్ఞానాంగాలుంటాయి. పరోక్ష పిండాభివృద్ధి జరిగి వివిధ రకాల డింభకాలు ఏర్పడతాయి.
ఉదా : పాలిమాన్ (మంచినీటి రొయ్య), కాన్సర్ (పీత), బలానస్ (రాక్ బార్నకిల్), సాక్యులైనా (రూట్ హెడెడ్ బార్నకిల్), ఆస్టాకస్ (క్రే చేప), డాఫ్నియా (వాటర్).

ప్రశ్న 6.
అరాక్నిడా సాధారణ లక్షణాలను రాయండి.
జవాబు:
ఎరాక్నిడా :
ఇవి భూచరాలు. ప్రోసోమాలో ఒక జత కలిసెరాలు, ఒక జత పెడిపాలు, నాలుగు జతల నడిచే కాళ్ళు ఉంటాయి. మీసోసోమాలోని ఉపాంగాలు పుస్తకాకార ఊపిరితిత్తులుగా రూపాంతరం చెంది ఉంటాయి. సాలీళ్లలో నాలుగు జతల పరాంత ఉదర ఉపాంగాలు స్పిన్నరెట్లుగా రూపాంతరం చెందాయి. శ్వాసాంగాలు పుస్తకాకార ఊపిరితిత్తులు (తేళ్ళు, కొన్ని సాలీళ్ళు), వాయునాళాలు (కొన్ని సాలీళ్ళు) లేదా పుస్తకాకార ఊపిరితిత్తులు, వాయునాళాలు రెండూ (కొన్ని సాలీళ్ళు). రాగి కలిగిన ‘హీమోసయనిన్” అనే శ్వాసవర్ణకం ఉంటుంది. మాల్ఫీజియన్ నాళికలు, కోక్సల్ గ్రంథులు వీటి విసర్జకాంగాలు. ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. తేళ్ళు శిశూత్పాదకాలు.
ఉదా : పేలామ్నియస్ (తేలు), ఎరానియ (సాలీడు), సార్కొప్టెస్ (దురదమైట్).

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 7.
శతపాదులను, సహస్రపాదులతో సంక్షిప్తంగా పోల్చండి.
జవాబు:
శతపాదులు – కైలోపోడ విభాగానికి చెందినవి.
సహస్రపాదులు – డిప్లోపోడా విభాగానికి చెందినవి.

లక్షణం శతపాదులు (కైలోపోడ) సహస్రపాదులు (డిప్లోపోడా)
ఉనికి భూచర భూచర
శరీర విభజనలు తల, మొండెము తల, వక్షం ఉదరం
స్పర్శ శృంగాలు కలవు కలవు
నోటి భాగాలు హనువులు, జంభికలు కలవు హనువులు, జంభికలు కలవు
ఉపాంగాలు మొండెం ప్రత ఖండితానికి ఒక జత నఖాలు గల ఉపాంగాలు (ఏకశాఖీయుత) ప్రతి ఖండితానికి రెండు జతల కాళ్ళుంటాయి. (ఏకశాఖీయత)
శ్వాసాంగాలు వాయునాళాలు వాయునాళాలు
రక్తం శ్వాసవర్ణకం లేదు శ్వాసవర్ణకం లేదు
విసర్జన అవయవాలు మాల్ఫీజియన్ నాళికలు మాల్ఫీజియన్ నాళికలు
అభివృద్ధి ప్రత్యక్ష
ఉదా : స్కోలో పెండ్రా (కాళ్ళ జెర్రి)
స్కూటిజెరా (శతపాది)
ప్రత్యక్ష
ఉదా : స్పైరోస్ట్రెప్టస్ జూలస్ (సహస్రపాది)

ప్రశ్న 8.
ఇతర మలస్కా జీవులతో పోలిస్తే సెఫలోపోడ్లు అనేక ప్రత్యేక లేదా పురోగతి చెందిన లక్షణాలను ప్రదర్శిస్తాయి. సంక్షిప్తంగా చర్చించండి.
జవాబు:
సెఫలోపొడా లేదా సైఫనోపొడా (Gr. Cephalo – తల; Podos – పాదం) :
ఈ విభాగంలో కటిల్ చేపలు, స్క్విడ్లు, ఆక్టోపస్లు, నాటిస్లను చేర్చారు. తల స్పష్టంగా ఉండి సుస్పష్టమైన సకశేరుకాలను పోలిన కళ్ళు, ఒక జత కొమ్ము స్వభావం కలిగిన ముక్కులాంటి దవడలు, ఆస్యకుహరంలో రాడ్యులా ఉంటాయి. కొన్నిటిలో అనేక గదులు కలిగిన బాహ్యకర్పరం (నాటిలిస్) లేదా అంతర కర్పరం (సెపియా, లాలిగో) గానీ ఉంటుంది. కొన్నిటిలో కర్పరం ఉండదు (ఆక్టోపస్), సెపియా కర్పరాన్ని సాధారణంగా కటిల్ ఎముక అంటారు. లాలిగోలోని కర్పరాన్ని కలం అంటారు. పాదం రూపాంతరం చెంది నోటి చుట్టూ చూషకాలతో 8 (ఆక్టోపస్) నుంచి 10 (సెపియా, లాలిగో) భుజాలు కలిగి ఉంటుంది. పాదంలోని కొంత భాగం రూపాంతరం చెంది అంకుశనాళంగా మార్పు చెందుతుంది. ఇది ఆకస్మిక కదలికలు కలిగించడానికి ఉపయోగపడుతుంది). కొన్ని జీవులలో సిరా గ్రంథి ఉంటుంది.

దీనిలోని సిరను మేఘాల లాగా విడుదల చేసి పరభక్షక జీవి నుంచి తప్పించుకుంటాయి. (రక్షణ అనుకూలత). కంకాభాంగాలు ఏట్రియమ్లు, వృక్కాలు రెండు చొప్పున డైబ్రాంకియేట్లలోనూ (సెపియా) నాలుగు చొప్పున టెట్రాబ్రాంకియేట్లలోనూ (నాటిలస్) ఉంటాయి. ప్రసరణ వ్యవస్థ సంవృత రకం (సెఫలోపొడా విశిష్ఠ లక్షణం), హృదయంలో రెండు నుంచి నాలుగు కర్ణికలు, ఒక జఠరిక ఉంటాయి. నాడీవ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. మెదడు బాగా అభివృద్ధి చెంది మృదులాస్థి నిర్మితమైన కపాలం (మస్తిష్క పేటిక లో ఉంటుంది. ఇవి ఏకలింగ జీవులు. ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది.
ఉదా : సెపియా (కటిల్ చేప), ఆర్కిట్యూథిస్ (బృహత్ స్క్విడ్ – అతిపెద్ద సజీవ అకశేరుక జీవి), నాటిలస్, ఆక్టోపస్ (దెయ్యపు చేప).

ప్రశ్న 9.
మలస్కాలోని ఏ విభాగంలో పురాతన జీవులు ప్రాతినిధ్యం వహిస్తాయి? వాటి ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
మోనోప్లాకోఫోరా (Gr. Mono – ఒకే; Placos – ఫలకం; Pherein కలిగి ఉండు) :
ఈ విభాగంలోని జీవులు మిలియన్ సంవత్సరాల పూర్వం విలుప్తమైనవని భావించారు. అయితే నియోపిలైనా అనే ఈ విభాగపు జీవి ఒకటి 1952లో బయల్పడింది. దీనిని కోస్టారికా పసిఫిక్ తీరం దగ్గర లోతైన సముద్రం నుంచి గలాతియా అనే సాగర పరిశోధన నౌకలోని శాస్త్రజ్ఞులు సేకరించారు. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. వీటి దేహంలో వృక్కాలు, మొప్పలు వరుస క్రమంలో పునరావృతి ప్రదర్శిస్తాయి. (కొందరు దీన్ని అంతర్గత ఖండీభవనం అంటారు). వీటిలో ఫలకం లాగా ఉండే ఏక కవాట కర్పరం ఉంటుంది. హృదయం విలక్షణమైంది. దీనిలో రెండు జతల ఏట్రియమ్లు రెండు జఠరికలలోకి తెరుచుకుంటాయి.
ఉదా : నియోపిలైనా గలాతియా.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 10.
ఎకినాయిడ్ల ప్రధాన లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
ఎకినాయిడియా (Gr. echinos – ముళ్ళ పంది; eidos – రూపం) :
ఈ విభాగంలో సీ అర్చిన్లు, హార్ట్ అర్చిన్లు, సాండ్ డాలర్లు, సీ బిస్కట్లు మొదలైన వాటిని చేర్చారు. దేహం అండాకారంగా (సీ అర్చిన్) లేదా చక్రిక ఆకారంలో (సాండ్ డాలర్) ఉంటుంది.” దేహాన్ని కప్పి కదిలే కంటకాలు ఉంటాయి. బాహువులు ఉండవు. నాళికా పాదాలకు చూషకాలుంటాయి. దేహంలోని కాల్కేరియస్ అస్థిఖండాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక దృఢమైన కవచం లేదా కరోనా పెట్టెను ఏర్పరుస్తాయి. రంధ్ర ఫలకం, పాయువు ప్రతిముఖ తలంలో ఉంటాయి. అంబులేక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. పెడిసిల్లేరియాలకు మూడు దవడలుంటాయి. సీఅర్చిన్ నోటిలో ఉన్న ఒక సంక్లిష్టమైన ఐదు దవడల నమిలే యంత్రాంగాన్ని అరిస్టాటిల్ లాంతరు అంటారు. (హార్ట్ అర్చిన్లో ఉండదు). అభివృద్ధిలో ఎకైనోప్లూటియస్ డింభకం ఉంటుంది.
ఉదా : ఎకైనస్ (సీ అర్బిన్), ఎకైనోకార్డియం (హార్ట్ అర్చిన్), ఎకైనోడిస్కస్ (సాండ్ డాలర్).

ప్రశ్న 11.
హో లో థురాయిడియా ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు:
హోలోథురాయిడియా (Gr. Holothurion – నీటి, పాలిప్ లేదా సముద్ర దోసకాయ; eidos – రూపం) :
ఈ విభాగంలో సముద్ర దోసకాయలను చేర్చారు. దేహం ముఖ -ప్రతిముఖ అక్షం వెంబడి పొడవుగా సాగి ఉంటుంది. చర్మం తోలులాగా ఉంటుంది. అంతశ్చర్మంలో వదులైన కంటకాలు ఉంటాయి. బాహువులు, ముళ్ళు, పెడిసిల్లేరియాలు ఉండవు. నోటి చుట్టూ ముకుళించుకోగల స్పర్శకాలు ఉంటాయి. (రూపాంతరం చెందిన నాళికాపాదాలు ఆహార సేకరణకు ఉపయోగపడతాయి). అంబులేక్రల్ గాడులు మూసుకొని ఉంటాయి. నాళికాపాదాలకు చూషకాలు ఉంటాయి. రంధ్ర ఫలకం అంతర్గతంగా (శరీర కుహరంలో) ఉంటుంది. శ్వాసాంగాలు ఒక జత అవస్కర శ్వాస వృక్షాలు. పిండాభివృద్ధి పరోక్షంగా జరిగి ఆరిక్యులేరియా డింభకం ఏర్పడుతుంది.
ఉదా : హోలోతూరియా, సినాప్టా, థయోన్.

ప్రశ్న 12.
వృక్కాల విధులను తెలపండి.
జవాబు:
ఫెరిటిమాలో విసర్జక వ్యవస్థలో అంత్య వృక్కాలు రకానికి చెందిన వృక్కాలు కనిపిస్తాయి. ఇవి బాహ్య చర్మం నుండి ఉద్భవిస్తాయి.

  • ఫెరిటిమాలోని వివిధ వృక్కాలు ప్రాథమికంగా ఒకే నిర్మాణం కలిగి ఉంటాయి.
  • వీటిలో వృక్క ముఖాలు కలిగి వాటిని వివృత వృక్కాలు అంటారు. ఉదా : విభాజకాయుత వృక్కాలు.
  • వృక్క ముఖాలు లేని వాటిని సంవృత వృక్కాలు అంటారు. ఉదా : గ్రసనీ వృక్కాలు, త్వచ వృక్కాలు.
  • వృక్క రంధ్రాల ద్వారా దేహం వెలుపలికి తెరుచుకునే వాటిని బాహ్య వృక్కాలు అంటారు.
  • ఆంత్రంలోకి తెరుచుకునే వాటిని ఆంత్ర వృక్కాలు అంటారు.
  • ఆంత్ర వృక్కాలు ద్రవాభిసరణ క్రమత క్రియలో కీలకపాత్ర పోషిస్తాయి,
  • వానపాములు యూరియోటెలిక్ జీవులు. విసర్జక పదార్థంగా ప్రధానంగా యూరియాను విసర్జిస్తాయి.

ప్రశ్న 13.
ఫెరిటిమాలో ఎన్ని రకాల వృక్కాలు కలవు ? వాటిని వివరించండి.
జవాబు:
ఫెరిటిమాలో మెలికలు తిరిగిన నాళికల లాంటి వృక్కాలు విసర్జక అవయవాలు. ఇవి ఖండిత విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి.
ఇవి మూడు రకాలు.
1) విభాజకాయుత వృక్కాలు :
ఇవి ఖండితాంతర విభాజక పటలానికి ఇరువైపులా 15/16 ఖండితాల నుంచి చివరి వరకు ఉంటాయి. ఇవి పేగులోకి తెరుచుకుంటాయి.

2) త్వచ వృక్కాలు :
ఇవి మూడో ఖండితం నుంచి చివరి ఖండితం వరకు శరీర కుడ్యం లోపలి తలంలో అతుక్కొని ఉంటాయి. ఇవి వృక్క రంధ్రాల ద్వారా శరీర ఉపరితలం మీద వెలుపలికి తెరుచుకుంటాయి.

3) గ్రసని వృక్కాలు :
ఇవి 4, 5, 6 ఖండితాలలో మూడు జతల గుచ్ఛాలు ఉంటాయి. ఇవి ఆంత్రంలోకి తెరుచుకుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 14.
ఫెరిటిమాలోని హృదయాలను వర్ణించండి.
జవాబు:
హృదయాలు :
పృష్ఠ, ఉదర రక్తనాళాలను కలుపుతూ లయబద్దంగా సంకోచ వ్యాకోచాలు జరిపే నాలుగు జతల హృదయాలు 7, 9, 12, 13 ఖండితాలలో ఒక్కొక్క జత చొప్పున ఉంటాయి. వీటిలో మొదటి రెండు జతలూ పృష్ఠ, ఉదర రక్త నాళాలను మాత్రమే కలుపుతాయి. కాబట్టి వీటిని పార్శ్వ హృదయాలు అంటారు. పరభాగపు రెండు జతలు పృష్ఠ, ఉదర రక్త నాళాలను కలపటమే కాక, ఆధ్యాహార వాహికా రక్తనాళాన్ని ఉదర రక్తనాళంతో కలుపుతాయి. కాబట్టి వీటిని పార్శ్వ ఆహార వాహికా హృదయాలు అంటారు.

ఈ రెండు రకాల హృదయాలకు కవాటాల సంఖ్యలోనూ భేదం ఉంటుంది. పార్శ్వ హృదయాల లోపల నాలుగు జతల కవాటాలు ఉంటాయి. పార్శ్వాహార వాహికా హృదయంలో మూడు జతల కవాటాలే ఉంటాయి. హృదయాల ద్వారా రక్తం ఉదర రక్తనాళంలోకి ప్రవహిస్తుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 2

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఫెరిటిమాలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 3
ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
వానపాము ఉభయ లైంగిక జీవి. 10, 11వ ఖండితాలలో ఖండితానికి ఒక జత చొప్పున రెండు జతల ముష్కాలు ఉంటాయి. వీటి శుక్రవాహికలు 18వ ఖండితం వరకు వ్యాపించి పౌరుష నాళంలో కలుస్తాయి. ఐక్య పౌరుష, శుక్రవాహికలు 18వ ఖండితం ఉదర పార్శ్వ తలంలో ఒకే జత పురుష జనన రంధ్రాల ద్వారా వెలుపలికి తెరుచుకొంటాయి. రెండు జతల “అనుబంధ గ్రంథులు” ఖండితానికి ఒక జత చొప్పున 17వ, 19వ ఖండితాలలో ఉంటాయి. నాలుగు జతల శుక్రగ్రాహికలు 6 నుంచి 9 ఖండితాలలో (ఖండితానికి ఒక జత చొప్పున) ఉంటాయి. ఇవి సంపర్క సమయంలో శుక్రకణాలను (శుక్రగుళిక) గ్రహించి నిల్వ చేస్తాయి.

ఒక జత స్త్రీ బీజకోశాలు 12వ, 13వ ఖండితాలలో ఖండితాంతర విభాజక పరముఖానికి అతికి ఉంటాయి. బీజకోశాల కింద ఉండే స్త్రీ బీజవాహికా సురంగాలు, స్త్రీ బీజవాహికలు (14వ ఖండితం) గా కొనసాగి, కలిసిపోయి 14వ ఖండితం ఉదరతలం మధ్యన ఒక స్త్రీ జనన రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకొంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

ప్రశ్న 2.
ఫెరిటిమాలోని జీర్ణ వ్యవస్థను వర్ణించి, జీర్ణక్రియా విధానాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 3 జంతు వైవిధ్యం-I అకశేరుక వర్గాలు 4
జీర్ణవ్యవస్థ :
ఆహారనాళం తిన్నగా ఉండే నాళం. ఇది దేహం మొదటి ఖండితం నుంచి చివరి ఖండితం వరకు ఉంటుంది. పూర్వభాగం చివరగల నోరు ఆస్యకుహరం (1-3 ఖండితాలు) లోకి తెరుచుకొంటుంది. ఆహారవాహిక (5-7 ఖండితాలు) పొట్టిగా, సన్నగా ఉండే నాళం, ఈ నాళం కండర యుతమైన అంతర జఠరం (8-9 ఖండితాలు) గా కొనసాగుతుంది. ఇది ఇసుక రేణువులు, కుళ్ళిపోయిన ఆకులు మొదలైన వాటిని మెత్తగా నూరడానికి దోహద పడుతుంది.

(పిండిమర) జీర్ణాశయం 9 నుంచి 14వ ఖండితం వరకు విస్తరించి ఉంటుంది. వానపాము ఆహారం కుళ్ళిన ఆకులు, మట్టితో కలిసిన ఇతర సేంద్రియ పదార్థాలు. జీర్ణాశయ కుడ్యంలో కాల్సిఫెరస్ గ్రంథులు ఉంటాయి. వీటి స్రావం మట్టి యొక్క హ్యూమస్ లోని హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. పేగు 15వ ఖండితం నుంచి మొదలై చివరి ఖండితం వరకు ఉంటుంది. ఒక జత కురుచ శంకు ఆకారా తలు 26వ ఖండితంలోని పేగు నుంచి ఆంత్రాంధ నాళాలు 26వ ఏర్పడతాయి. పేగు పృష్ఠకుడ్యం మధ్యస్థంగా లోపలి వైపుకు ఒక మడత వలె ఏర్పడుతుంది. దీనిని ఆంత్రావళి (Typhlosole) అంటారు. ఆంత్రావళి శోషించే తలాన్ని పెంచుతుంది. ఇది ఫెరిటిమాలో తక్కువగా వృద్ధిచెంది, దేహంలోని 26వ ఖండితం నుంచి చివరి 24 లేదా 25 ఖండితాలు మినహా, మిగిలిన అన్ని ఖండితాలలో ఉంటుంది. ఆహారనాళం చిన్నని, గుండ్రని రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. దీన్ని పాయువు అంటారు. వానపాము గ్రహించిన మట్టిలో కర్బన సంబంధ పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆహారనాళంలో ప్రయాణించేటప్పుడు జీర్ణ ఎంజైమ్లు క్లిష్టమైన బృహదణువుల రూపంలో ఉన్న ఆహార పదార్థాలను సరళమైన, శోషణ యోగ్యమైన చిన్న అణువులుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ సరళ అణువులు ఆంత్రత్వచం ద్వారా శోషణ చెంది వివిధ జీవక్రియలకు వినియోగింపబడతాయి.

జీర్ణక్రియా విధానం :
వానపాములో కణ బాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. నేలలో ఉండే కర్బన సంబంధ పదార్థాలతో వానపాములు పోషణ జరుపుకొంటాయి. కాబట్టి వానపాము ఒక డెట్రీవోర్, మట్టితో కలిసి ఉన్న ఈ ఆహార పదార్థాలను నోరు ఆస్య కక్ష్య ద్వారా వానపాము గ్రసనిలోకి తీసుకుంటుంది. రేడియల్ డైలేటర్ (radial dilator) కండరాలతో గ్రసని ఆహార సేకరణలో సక్షన్ పంపు (suction pump) వలె పనిచేస్తుంది. గ్రసనిలో ఆహారం శ్లేష్మం, లాలాజలంతో కలిసి ముద్దగా (బోలస్) ఏర్పడుతుంది. ఆహారం సులభంగా జారిపోయేందుకు గ్రసని లోపలి తలపై కందెన లాగా జిగటి పూతను లాలాజలం ఏర్పాటు చేస్తుంది. అంతేకాక బోలస్ ఏర్పడటంలో తోడ్పడుతుంది. ఆ లాలాజలంలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్ మాంసకృత్తులను పాక్షికంగా జీర్ణం చేస్తుంది. తరువాత ఆహార వాహిక ద్వారా ఆహారం అంతర జఠరాన్ని చేరుతుంది. ఇక్కడున్న పటిష్టమైన కండరాలు, దట్టమైన అవభాసిని ఆహారాన్ని మెత్తగా నూరతాయి. ఈ స్థితిలో జీర్ణాశయం, పేగులో ఉన్న ఎంజైములు ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయగలవు. పేగులోని ఆంత్రగ్రంథుల స్రావాలు ఉన్నతశ్రేణి సకశేరుకాల క్లోమరసాన్ని పోలి ఉంటాయి. రేణువుల రూపంలో ఉన్న ఆహారాన్ని ప్రొటియేజులు, ఎమైలేజు, లైపేజు రేణువుల రూపంలో ఉన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తాయి. ప్రొటియేజులు మాంసకృత్తులను అమినో ఆమ్లాలుగాను, ఎమైలేజులు పిండి పదార్థాలను గ్లూకోజుగాను, లైపేజు క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలుగాను మారుస్తాయి.

జీర్ణమైన ఆహారంలో ఆంత్రంలోని ఉపకళ ద్వారా శోషణం చెంది ఆ తరువాత రక్తాన్ని చేరుతుంది. పేగు గోడలోని రక్తకేశనాళికల వల శోషణలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఆంత్రావళి శోషణ తలాన్ని పెంచటంలో తోడ్పడుతుంది.

జీర్ణం కాని ఆహారం, ఆ తరువాత పురీషనాళాన్ని చేరుతుంది. పురీషనాళంలోని జీర్ణంకాని పదార్థాలు పాయువు ద్వారా క్రిమి విసర్జనాల రూపంలో బయటకు విస్తరించబడతాయి.

Leave a Comment