Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Accountancy Study Material 8th Lesson కంపెనీ ఖాతాలు Textbook Questions and Answers.
AP Inter 2nd Year Accountancy Study Material 8th Lesson కంపెనీ ఖాతాలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వాటా మూలధన వర్గీకరణను వివరించండి.
జవాబు:
కంపెనీ వాటా మూలధనాన్ని దిగువ విధముగా వర్గీకరించవచ్చును.
1. అధీకృత మూలధనము : ఈ మూలధనాన్ని కంపెనీ సంస్థాపనా పత్రములో మూలధనక్లాజులో పేర్కొంటారు. ప్రజలనుంచి వాటాల ద్వారా సేకరించుటకు ఎంత మూలధనముతో నమోదు అయినదో దానిని అధీకృత మూలధనము, 3 నామమాత్రపు మూలధనము లేదా నమోదైన మూలధనం అంటారు.
2. జారీ మూలధనము : అధీకృత మూలధనములో ప్రజలకు జారీ చేసిన భాగాన్ని జారీమూలధనము అంటారు. కంపెనీ అధీకృత మూలధనం మొత్తముగాని లేదా అందులో కొంతభాగాన్ని సమయానుకూలముగా అవసరాన్ని బట్టి జారీ చేయవచ్చును.
3. చందా మూలధనము : జారీ మూలధనములో ప్రజలు కొనడానికి అంగీకరించిన భాగాన్ని చందా మూలధనము అంటారు. చందా మూలధనము జారీ మూలధనానికి సమానముగాను లేదా తక్కువగాను ఉండవచ్చు.
4. కోరిన మూలధనము : కోరిన మూలధనము చందా మూలధనంలో ఒక భాగము. వాటా విలువ మొత్తము గాని లేదా అందులో కొంత భాగాన్ని గాని చెల్లించమని కోరవచ్చు.
5. పిలవని మూలధనము : జారీచేసిన లేదా చందా మూలధనములో చెల్లించమని కోరని మూలధన భాగాన్ని పిలవని మూలధనము అంటారు.
6. చెల్లించిన మూలధనము : పిలిచిన మూలధనములో వాటాదారులు వాటాల కోసం చెల్లింపులు జరిపిన మూలధనాన్ని చెల్లించిన మూలధనము అంటారు.
7. చెల్లించని మూలధనము: పిలిచిన మూలధనములో వాటాదారులు చెల్లింపుజరపని భాగాన్ని చెల్లించని మూలధనము అంటారు.
8. రిజర్వు మూలధనము : పిలవని మూలధనములో కొంత మొత్తాన్ని కంపెనీ పరిసమాప్తి సమయములో మాత్రమే వసూలు చేసుకోవడానికి వీలుగా ఉంచిన మూలధనాన్ని రిజర్వు మూలధనం అంటారు.
ప్రశ్న 2.
వాటాలలో రకాలను వివరించండి.
జవాబు:
కంపెనీ మొత్తము మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తుంది. అలా విభజింపబడిన ఒక చిన్న భాగాన్నీ వాటా అంటారు. ఎవరైతే వాటాల కొనుగోలుకు చందా చెల్లిస్తారో వారిని వాటాదారులు అంటారు. వాటాలు వాటాదారుల అభిరుచులకు అనుగుణముగా వివిధ రకాలుగా జారీచేస్తారు. కంపెనీల చట్టం 1956 సెక్షన్ 86 ప్రకారం ఒక కంపెనీ రెండు రకాలైన వాటాలనే జారీచేయవలెను. అవి 1. ఆధిక్యపు వాటాలు 2. ఈక్విటీ వాటాలు.
1. ఆధిక్యపు వాటాలు : కంపెనీ చట్టము 1956 సెక్షన్ 86 ప్రకారము ఆధిక్యపు వాటాలు రెండు షరతులను సంతృప్తి పరచాలి. అవి
ఎ) డివిడెండ్ చెల్లింపులో ఆధిక్యతను కలిగి ఉండాలి. డివిడెండ్ స్థిరమొత్తము లేదా స్థిరశాతము కావచ్చు. ఈ డివిడెండును ఈక్విటీ వాటాదారులకు చెల్లించడానికి ముందు చెల్లించవలెను.
బి) కంపెనీ పరిసమాప్తి సమయములో మూలధన తిరిగి చెల్లింపు విషయములో ఆధిక్యతను కలిగి ఉండాలి. అనగా ఈక్విటీ వాటాదారులకు మూలధనాన్ని చెల్లించే ముందుగా ఆధిక్యపు వాటాదారులకు చెల్లించాలి. కాబట్టి ఈ రెండు ఆధిక్య హక్కులు కలిగి ఉన్న వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు.
2. ఈక్విటీ వాటాలు : ఈక్విటీ వాటాలను సాధారణ వాటాలు అని కూడా అంటారు. కంపెనీల చట్టం 1956 ప్రకారం ఆధిక్యపు వాటాలు కానివన్నీ ఈక్విటీ వాటాలే. వీటికి డివిడెండు చెల్లింపు విషయములో గాని, కంపెనీ పరిసమాప్తి సమయములో వాటా మూలధనాన్ని తిరిగి చెల్లించే విషయములో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. ఆధిక్యపు వాటాదారులకు డివిడెండు చెల్లించిన తర్వాత మిగులలో మాత్రమే ఈక్విటీ వాటాదారులకు డివిడెండ్ పంచుతారు. ఈ డివిడెండ్ కూడా స్థిరముగా ఉండదు. కంపెనీకి వచ్చే లాభాలను అనుసరించి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది.
ప్రశ్న 3.
వాటాల జారీ పద్ధతులను వివరించండి.
జవాబు:
కంపెనీ వాటా మూలధనమును వాటాదారుల నుండి కాలానుగుణముగా, ఆర్థిక అవసరాలను బట్టి సేకరించుటకు అవకాశము ఉన్నది. మొదటి వాయిదాలో దరఖాస్తుతో పాటు దరఖాస్తు రుసుమును వసూలు చేస్తారు. రెండవ వాయిదా సొమ్ము వాటా కేటాయింపుతో వసూలు చేస్తారు. మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపములో వసూలుచేస్తారు. ఈ వాయిదాలను మొదటి పిలుపు, రెండవ పిలుపు, తుది పిలుపు అంటారు. ఏది ఏమైనా పూర్తిమొత్తాన్ని దరఖాస్తుతోనే వసూలు చేసుకునే అవకాశము కంపెనీకి ఉంటుంది.
వాటాలను జారీ చేసే పద్ధతులు: వాటాలను సమమూల్యానికి, ప్రీమియంనకు మరియు డిస్కౌంట్కు జారీ చేయవచ్చును.
1) వాటాలను సమమూల్యానికి జారీచేయడం: కంపెనీ తన వాటాలను ముద్రిత విలువ (ముఖవిలువ)కు జారీచేస్తే వాటాలను సమమూల్యానికి జారీచేయడం అంటారు. ఉదా : ఒక కంపెనీ ముద్రిత విలువ గల ₹ 100 వాటాను, ₹ 100 లకే జారీచేయడం ముద్రిత విలువకు జారీచేయడమంటారు.
2) కంపెనీ వాటాలను ప్రీమియానికి జారీచేయడం : ఒక కంపెనీ తన వాటాలను ముద్రిత విలువ కన్నా ఎక్కువ విలువకు జారీచేస్తే దానిని ప్రీమియానికి వాటాల జారీ అంటారు. ముద్రిత విలువకు, జారీ విలువకు గల తేడాను ప్రీమియం అంటారు. ఉదా : ఒక కంపెనీ ₹ 100 ముద్రిత విలువ గల వాటాలను ₹ 110 జారీచేస్తే అది ₹ 10 వాటా ప్రీమియం అవుతుంది. దీనిని సెక్యూరిటీల ప్రీమియం ఖాతాకు మళ్ళించి, ఆస్తి – అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపుతారు.
3) కంపెనీ వాటాలను డిస్కౌంట్కు జారీచేయడం : ఒక కంపెనీ తన వాటాలను ముఖ విలువ కన్నా తక్కువ విలువకు జారీచేస్తే దానిని వాటాలను డిస్కౌంట్కు జారీచేయడం అంటారు. వాటా ముఖవిలువకు జారీ విలువకు గల తేడా డిస్కౌంట్ అంటారు. ఉదా : ఒక కంపెనీ ₹ 100 విలువ గల వాటాలను 90 లకు జారీచేస్తే డిస్కౌంట్ 10 అవుతుంది. సాధారణముగా ఈ డిస్కౌంట్ కేటాయింపులో వసూలు చేయవలసిన సొమ్ములో ఇస్తారు. ఈ మొత్తాన్ని వాటాల డిస్కౌంట్ ఖాతాకు డెబిట్ చేసి, ఆస్తి – అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపుతారు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
అధీకృత మూలధనము అనగానేమి ?
జవాబు:
కంపెనీ సంస్థాపనా పత్రములో పేర్కొన్న విధముగా ప్రజల నుండి వాటాలను సేకరించుటకు కంపెనీకి అధికారము ఉన్నది. కంపెనీ ఎంత మూలధనముతో నమోదు అయినదో దానిని అధీకృత మూలధనమని, నమోదు మూలధనమని, నామమాత్రపు మూలధనం అంటారు.
ప్రశ్న 2.
ఆధిక్యపు వాటాలు అనగానేమి ?
జవాబు:
ఏ వాటాలకయితే స్థిరరేటుతో డివిడెండ్ ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా చెల్లించడానికి మరియు కంపెనీ పరిసమాప్తిలో ముందుగా చెల్లించడానికి మరియు కంపెనీ పరిసమాప్తిలో ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా మూలధనాన్ని వాపసు పొందడానికి ఆధిక్యపు హక్కులు ఉంటాయో ఆ వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు.
ప్రశ్న 3.
ఈక్విటీ వాటాలు అనగానేమి ?
జవాబు:
ఈక్విటీ వాటాలను సాధారణ వాటాలు అంటారు. కంపెనీల చట్టం 1956 ప్రకారం ఆధిక్యపు వాటాలు కానివి ఈక్విటీ వాటాలు. ఈ వాటాలకు డివిడెండు చెల్లింపులో గాని, కంపెనీ పరిసమాప్తిలో వాటా మూలధనము వాపసు ‘విషయములో ఎలాంటి ఆధిక్యత ఉండదు.
ప్రశ్న 4.
వాటాలను సమమూల్యానికి జారీ చేయడం వివరించండి.
జవాబు:
కంపెనీ తన వాటాలను వాటా ముద్రిత విలువకు (ముఖవిలువ) జారీచేస్తే వాటాలను సమమూల్యానికి/ ముఖవిలువకు జారీ చేయడం అంటారు.
ప్రశ్న 5.
వాటాలను ప్రీమియానికి జారీ చేయడం వివరించండి.
జవాబు:
కంపెనీ తన వాటాలను ముద్రిత విలువకన్నా ఎక్కువ విలువకు జారీచేస్తే ‘ప్రీమియంనకు వాటాల జారీ’ అంటారు. వాటా ముద్రిత విలువకు, జారీ విలువకు మధ్యగల తేడాను ప్రీమియం అంటారు.
ప్రశ్న 6.
వాటాలను డిస్కౌంట్తో జారీచేయడం వివరించండి.
జవాబు:
కంపెనీ తన వాటాలను వాటి ముఖ విలువ కన్నా తక్కువ విలువకు జారీచేసినపుడు దానిని వాటాలను డిస్కౌంట్కు జారీ అంటారు. వాటా ముఖ విలువకు జారీ విలువకు మధ్యగల తేడాను డిస్కౌంట్ అంటారు.
TEXTUAL EXERCISES
ప్రశ్న 1.
ధన లిమిటెడ్ ₹ 20,000 ల వాటాలను వాటా 1 కి 100 చొప్పున జారీ చేసింది. వాటా విలువను దరఖాస్తుపై ₹ 40, కేటాయింపు పై ₹ 40, మిగిలిన 20 మొత్తాన్ని మొదటి మరియు చివరి పిలుపులపై వసూలు చేస్తారు. అన్ని వాటాలపై సొమ్ము వసూలు అయింది. కంపెనీ ఖాతాలలో అవసరమైన చిట్టా పద్దులను నమోదు చేయండి.
సాధన.
చిట్టాపద్దులు
ప్రశ్న 2.
చరణ్ లిమిటెడ్ ₹ 10,000 ల వాటాలను వాటా 1 కి 200 లకు జారీ చేయుటకు నిర్ణయించారు. దరఖాస్తుపై ₹ 50, కేటాయింపుపై ₹ 100, మిగిలిన 50 ల మొత్తాన్ని మొదటి మరియు చివరి పిలుపులపై వసూలు చేస్తారు. మొత్తం సొమ్ము వసూలు అయినది. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టా పద్దులను నమోదు చేయండి.
సాధన.
చరణ్ లిమిటెడ్ పుస్తకాలు చిట్టాపద్దులు
ప్రశ్న 3.
గాయత్రి క్లాత్స్ లిమిటెడ్ వాటా 1 కి ₹ 150 విలువ కలిగిన ₹ 15,000 ల వాటాలను జారీ చేసింది. వాటా విలువను దరఖాస్తుపై 50, కేటాయింపుపై 50. మొదటి పిలుపుపై 20, రెండవ పిలుపు పై ఔ 20 మరియు చివరి పిలుపుపై 10 వసూలు చేస్తారు. అన్ని వాయిదాలు వసూలు అయినది. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టా పద్దులను నమోదు చేయండి.
సాధన.
గాయత్రి క్లాత్స్ లిమిటెడ్ పుస్తకాలు చిట్టాపద్దులు
ప్రశ్న 4.
జయరాం ఫర్నిచర్స్ లిమిటెడ్ ₹ 20,000 ల వాటాలను వాటా 1 కి ₹ 100 విలువ గలవి, ₹ 10 ప్రీమియంతో జారీ చేసింది. దరఖాస్తుపై 40 (5 ప్రీమియంతో) కేటాయింపుపై 40 (5 ప్రీమియంతో) మిగిలిన 30 మొత్తాన్ని మొదటి మరియు చివరి పిలుపులపై వసూలు చేస్తారు. అన్ని వాటాలపై మొత్తం సొమ్ము వసూలు అయినది. అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
జయరాం ఫర్నిచర్ లిమిటెడ్ వారి పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 5.
అనూష లిమిటెడ్ ₹ 1,00,00,000 విలువ కలిగిన అధీకృత మూలధనం కలిగి ఉన్నది. ఇందులో నుండి వాటా 1కి ₹ 10 విలువ కలిగిన ₹ 10,000 ల వాటాలను వాటా 1 కి 2 ప్రీమియంతో జారీ చేసింది. దరఖాస్తుపై 4 ( 1 ప్రీమియంతో, కేటాయింపుపై 51 ప్రీమియంతో మిగిలిన మొత్తం 7 3 లను మొదటి మరియు చివరి పిలుపులపై వసూలు చేస్తారు. అన్ని వాటాలపై మొత్తం వసూలు అయినది. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
అనూష లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 6.
కార్తీక్ లిమిటెడ్ వాటా 1 కి ₹ 100 విలువ కలిగిన ₹ 50,000 ల వాటాలను, వాటా 1కి 3 10 ల ప్రీమియంతో జారీ చేసింది. దరఖాస్తుపై 405 ప్రీమియంతో), కేటాయింపుపై 40 (35 ప్రీమియంతో), మిగిలిన 30 ల మొత్తాన్ని మొదటి మరియు చివరి పిలుపులపై వసూలు చేస్తారు. మొత్తం సొమ్ము వసూలు అయినది. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
కార్తీక్ లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 7.
పద్మావతి లిమిటెడ్ వాటా 1కి ₹ 100 విలువ కలిగిన ₹ 10,000 ల వాటాలను, వాటా 1 కి 10 శాతం డిస్కౌంట్ జారీ చేసినారు. దరఖాస్తుపై 30, కేటాయింపుపై 40, మొదటి మరియు చివరి పిలుపులపై 3 20 లను వసూలు చేస్తారు. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
పద్మావతి లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 8.
అభిషేక్ లిమిటెడ్ వాటా 20,000 ల వాటాలను వాటా 1 కి ₹ 100 విలువ కలిగినవి. వాటా 1 కి 10% డిస్కౌంట్ జారీ చేసినారు. దరఖాస్తుపై 30, కేటాయింపుపై 40, మొదటి మరియు చివరి పిలుపులపై 20 లను వసూలు చేస్తారు. మొత్తం సొమ్ము వసూలు అయినది. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
అభిషేక్ లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 9.
వెంకట్ లిమిటెడ్ వాటా 1 కి ₹ 10 విలువ కలిగిన ₹ 50,000 ల వాటాలను వాటా 1 కి 10 శాతం డిస్కౌంట్ జారీ చేసినారు. దరఖాస్తుపై ₹ 3, కేటాయింపుపై 3, మొదటి మరియు చివరి పిలుపులపై 3 3 లను వసూలు చేస్తారు. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
వెంకట్ లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
TEXTUAL EXAMPLES
ప్రశ్న 1.
పవిత్ర లిమిటెడ్ వాటా 1 కి ₹ 10 లు విలువ కలిగిన ₹ 10,000 ల వాటాలను జారీ చేసినది. వాటా విలువను దరఖాస్తుపై ₹ 3, కేటాయింపుపై 4 మరియు మిగిలిన మొత్తం సొమ్మును మొదటి మరియు చివరి పిలుపులపై వసూలు చేస్తారు. రావలసిన సొమ్ము మొత్తం వసూలు అయినది. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
పవిత్ర లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 2.
భవాని లిమిటెడ్ ₹ 20,000 ల వాటాలను వాటా 1 కి ₹ 20 చొప్పున జారీ చేసింది. వాటా సొమ్మును దరఖాస్తుపై ₹ 5, కేటాయింపు పై ₹ 10, మిగిలిన మొత్తాన్ని మొదటి మరియు చివరి పిలుపులపై వసూలు చేస్తారు. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
భవాని లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 3.
శివ లిమిటెడ్ 30,000 ల వాటాలను వాటా 1 కి ₹ 30 చొప్పున ప్రజలకు జారీ చేసింది. దరఖాస్తుపై ₹ 5, కేటాయింపు పై ₹ 10, మిగిలిన మొత్తాన్ని మొదటి పిలుపుపై 5, రెండవ పిలుపుపై ₹ 5, మరియు చివరి పిలుపుపై 5 వసూలు చేస్తారు. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
శివ లిమిటెడ్ పుస్తకాలలో ‘చిట్టాపద్దులు
ప్రశ్న 4.
సరోజనమ్మ లిమిటెడ్ 20,000 ల వాటాలను వాటా 1 కి ₹ 10 విలువ గలవి ₹ 5 ప్రీమియంతో జారీ చేసింది. వాటా విలువను, దరఖాస్తుపై ₹ 52 ప్రీమియంతో కేటాయింపుపై ₹ 3 ప్రీమియంతో) మిగిలిన మొత్తాన్ని మొదటి మరియు చివరి పిలుపులపై ₹ 3 వసూలు చేస్తారు. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
సరోజనమ్మ లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 5.
రామయ్య లిమిటెడ్ ₹10 విలువ కలిగిన ₹ 50,000 ల వాటాలను వాటా 1కి ₹ 5 ప్రీమియంతో జారీ చేసింది. చెల్లించవలసిన వాయిదాలు, దరఖాస్తుతో ₹ 52 ప్రీమియంతో కేటాయింపు పై ₹ 6 (( 3 ప్రీమియంతో), మొదటి మరియు చివరి పిలుపులపై ₹4 లను వసూలు చేస్తారు. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
రామయ్య లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 6.
సుగుణ మోటార్స్ లిమిటెడ్ వాటా 1 కి ₹10 విలువ కలిగిన ₹ 10,000 ల వాటాలను 10% డిస్కౌంట్ జారీ చేసినారు. వాటా విలువను దరఖాస్తుతో ₹ 4, కేటాయింపుతో ₹ 3 మరియు ₹ 2 మొదటి మరియు చివరి పిలుపుపై వసూలు చేస్తారు. కంపెనీ ఖాతాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
సుగుణ మోటార్స్ లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులు
ప్రశ్న 7.
రవి ట్రాక్టర్స్ లిమిటెడ్ వాటా 1 కి ₹ 10 విలువ కలిగిన ₹ 20,000 ల వాటాలను 10% డిస్కౌంట్ జారీ చేసినారు. వాటా విలువను దరఖాస్తుతో ₹ 2, కేటాయింపుతో ₹ 3 మరియు ₹ 4 మొదటి & చివరి పిలుపులపై వసూలు చేస్తారు. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను నమోదు చేయండి.
సాధన.
రవి ట్రాక్టర్స్ లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపద్దులలు