Students can go through AP Inter 2nd Year Botany Notes 10th Lesson అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 10th Lesson అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం
→ జీవవ్యవస్థలో డీ ఆక్సీ రైబో కేంద్రకామ్లం, రైబో కేంద్రకామ్లం అనే రెండు రకాల కేంద్రకామ్లాలు ఉంటాయి.
→ అనేక జీవులలో DNA జన్యు పదార్థంగా వ్యవహరిస్తుందని కనుగొన్నారు. .
→ కొన్ని వైరస్లలో RNA జన్యు సహిత కేంద్రకామ్లముగా పనిచేసినప్పటికీ, ఇవి ప్రధానంగా వార్తాహరిగా పనిచేస్తూ, ఇతర విధులైన అడాప్టర్, నిర్మాణాత్మక, కొన్నిసార్లు ఉత్ప్రేరక అణువుగా కూడా వ్యవహరిస్తుంది.
→ DNA పొడవు, దీనిలో ఉన్న న్యూక్లియోటైడ్ల సంఖ్య లేదా నత్రజని క్షారాల జతలపైన ఆధారపడి ఉంటుంది.
→ Φ × 174 బాక్టీరియోఫేజ్ యొక్క DNA లో 5386 న్యూక్లియోటైడ్లు ఉంటాయి.
→ “బాక్టీరియోఫేజ్ లామ్డా”లో 48502 నత్రజని క్షారజతలు ఉంటాయి.
→ మానవుని ఏకస్థితికత్వపు DNA లో 3.3 × 10<sup>9</sup> bp ఉంటాయని కనుగొన్నారు.
→ న్యూక్లియోటైడ్లో నత్రజని క్షారం, పెంటోస్ చక్కెర, ఫాస్పేట్ సమూహం ఉంటాయి.
→ నత్రజని క్షారాలు 2 రకాలు. అవి ప్యూరిన్లు, పిరమిడైన్లు. అడినిన్, గ్యానిన్లు ఫ్యూరిన్లు. థయమిన్, సైటోసిస్లు పిరమిడన్లు.
→ A = T తో రెండు హైడ్రోజన్ బంధాలతో, G = C తో 3 హైడ్రోజన్ బంధాలో కలుపబడి ఉంటుంది.
→ ఫ్రెడ్రిక్ మెయిషర్ అనే శాస్త్రవేత్త 1869లో కేంద్రకంలో ఉన్న DNA పదార్థం ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటుందని గుర్తించారు. దానికి న్యూక్లిస్ అని నామకరణం చేసారు.
→ వాట్సన్, క్రిక్లు DNA ద్విసర్పిల నమూనాను ప్రతిపాదించారు.
→ కేంద్రక పూర్వ జీవులలో ఉన్న DNA ఇంచు మించు వర్తులాకారంగా ఉండి. క్రొమాటిన్ నిర్మాణ రహితంగా ఉంటుందని దానిని జీనోఫోర్ అంటారు.
→ నిజకేంద్రక జీవులలో DNA ధనావేశిత నిర్మాణం ఉన్న క్షారహిస్టోన్ ప్రోటీన్లతో బంధితమై ఉంటుంది. ఋణావేశం ఉన్న DNA, ధనావేశం ఉన్న హిస్టోన్ ఆక్టామర్తో చుట్టూ చుట్టుకుని న్యూక్లియోసోమ్ అనే నిర్మాణాన్ని రూపొందిస్తుంది.
→ కేంద్రకంలో తక్కువ వర్ణ ద్రవ్యాన్ని గ్రహించి, వదులుగా ఉన్న క్రొమాటిన్ ను యూక్రోమాటిన్ అంటారు.
→ కేంద్రకంలో ఎక్కువ వర్ణాన్ని గ్రహించి, ఒకదానికొకటి బంధితమై ఉన్న క్రొమాటిన్ ను హెటిరోక్రొమాటిన్ అంటారు.
→ ఫ్రెడ్రిక్ గ్రిఫిత్ 1928లో స్ట్రెప్టోకోకస్ నిమోనియే పై విస్తృత ప్రయోగాలు జరిపి బాక్టీరియమ్లలో జన్యు పరివర్తిత అద్భుతాలను కనుగొన్నారు.
→ అవేరి, మాక్లియాడ్, మెకార్టి జరిపిన ప్రయోగాలను బట్టి DNA జన్యు పదార్థము అని నిరూపితమైనది.
→ హెర్షీ మరియు చేజ్ 1952లో బాక్టీరియోఫేజ్ల పై ప్రయోగాలు చేసి DNA జన్యుపదార్థము అని నిరూపించారు.
→ TMV లో RNA జన్యుపదార్థము అని నిరూపించారు. ఉదా: QB బ్యాక్టీరియోఫేజ్, HIV.
→ RNA స్థిరత్వం లేనిది, త్వరగా ఉత్పరివర్తనం చెందగలదు.
→ DNA స్థిరత్వం కలిగినది, దానిని జన్యు సమాచార నిల్వకేంద్రకంగా పరిగణిస్తారు.
→ RNA ఉత్ప్రేరకాలు లేదా RNA ఎన్జైమ్లను రైబోజైమ్లు అంటారు.
→ DNA ప్రతికృతి అర్థ సంరక్షక విధానంలో జరుగుతుందని మొదట ఎ. కొలైలో మెసల్సన్ మరియు స్టాల్ నిరూపించారు.
→ DNA ప్రతికృతిలో విచ్ఛిన్నంగా ఏర్పడిన ఖండితాలను “ఒఖజాకి” ఖండితాలు అంటారు. ఇవి DNA లైగేజ్ ద్వారా అతికించబడతాయి.
→ ప్రతికృతి ప్రారంభానికి ఎ. కొలై DNA లో నిర్దిష్ట స్థానం ఉంటుంది. దానిని ‘ఓఆర్ఎస్ఐ’ (origin of replication) అంటారు.
→ DNA లో ఒక పోచలో ఉన్న జన్యు సమాచారము RNA నకలు రూపంలో ఏర్పడటాన్ని అనులేఖనం అంటారు.
→ బాక్టీరియమ్లలో m – RNA, t – RNA మరియు r – RNA ఉంటాయి.
→ కేంద్రకంలో 3 RNA పాలిమరేజ్లు ఉంటాయి.
→ జన్యు సంకేతం త్రికసంకేతము. మొత్తం 61 త్రికసంకేతాలు ఉంటాయి. వాటిలో 3 ఏ అమైనో ఆమ్లానికి సూచికలుగా ఉండవు. వాటిని ఆపుదల సంకేతాలు అంటారు.
→ AUG మీథియోనైన్ అనుఆమైనో ఆమ్లానికి సూచిక మరియు ప్రారంభ కోడాన్ గా ఉంటుంది.
→ డి.వే. జేమ్స్ వాట్సన్ ఫ్రాన్సిస్/ క్రిక్ హర్రేకాంప్టన్
- జేమ్స్ వాట్సన్ జననము : ఏప్రిల్ 6, 1928
- దేశము: అమెరికా
- ఫ్రాన్సిస్ క్రిక్ జననము: జున్ 8, 1916
- మరణము: జులై 28, 2004
- దేశము: ఇంగ్లాండ్
జేమ్స్ వాట్సన్ 1928 ఏప్రిల్ 6న చికాగోలో జన్మించారు. 1947లో జంతుశాస్త్రంలో బి.ఎస్.సి పట్టా పొందారు. 1950లో బ్యాక్టీరి యోఫేజ్ ప్రతికృతిపై ధృఢ X – కిరణాల ప్రభావం పై జరిపిన పరి శోధనలకు Ph.D పట్టపొందారు.
ఫ్రాన్సిస్ క్రిక్, ఇంగ్లాండ్ లోని నార్టంప్టన్లో 1916 లో జూన్ 8న జన్మించారు. X కిరణాల వివర్తనం, పాలిపెప్టైడ్, ప్రోటీన్ల పై జరిపిన పరిశోధన అంశంపై 1954 లో Ph.D ని పూర్తి చేసారు.
23 ఏళ్ళ జె.డి. వాట్సన్ తో ఫ్రాన్సిస్ క్రిక్ కు ఏర్పడిన విమర్శనాత్మక స్నేహప్రభావము 1953లో DNA ద్విసర్పిలర్మాణం, ప్రతికృతినమునాలు కనుగోనటకు దారి తీసింది. 1959 లో క్రిక్ కు FRS సభ్యాత్వం లభించింది. 1959లో మసెచుసట్స్ జనరల్ హాస్సిటల్ జాన్ కోలిన్స్ వారెన్ పురస్కారం, 1960లో లాస్కర్ పురస్కారం, 1962లో ‘రిసర్చ్ కార్పోరేషన్’ బహుమతి, అన్నింటికి మించి 1962లో ప్రతిష్టాత్మక ‘నోబెల్’ బహుమతి లభించింది.