Students can go through AP Inter 2nd Year Botany Notes 11th Lesson జీవసాంకేతికశాస్త్రం; సూత్రాలు, ప్రక్రియలు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 11th Lesson జీవసాంకేతికశాస్త్రం; సూత్రాలు, ప్రక్రియలు
→ హెర్బర్ట్ బాయర్, ఇ.కొలైలో ఉపయోగకర లక్షణాలు గల రెండు రెస్ట్రిక్షన్ ఎన్జైమ్లపై అధ్యయనం జరిపారు. ఈ ఎన్జైమ్లు నిర్దిష్టమైన శైలిలో DNA పోచలను కత్తిరించే సామర్థ్యం కల్గి అతుక్కునే కొనలు గలవిగా రూపొందుతాయని గమనించారు.
→ స్టాన్లీ కోహెన్ కణం నుంచి ప్లాస్మిడ్లును వేరుచేసి వేరొక కణంలోకి చొప్పించే పద్ధతిని కనుగొన్నారు.
→ సూక్ష్మజీవుల లక్షణాలను, ఉపయోగాలను వాడుకునే శాస్త్రం లేదా కణాలు కణాంశాలను మానవ సంక్షేమానికి, మనుగడకు ఉపయోగకరమైన ఉత్పన్నాలను పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేసే శాస్త్రమును జీవ సాంకేతిక శాస్త్రము అంటారు.
→ జన్యు పదార్థాలయిన DNA, RNA లలో రసాయన మార్పులు తీసుకొచ్చి వాటిని అతిథేయిలోకి ప్రవేశపెట్టడం, తద్వారా అతిథేయి దృశ్య రూపంలో మార్పు కల్గజేయడం లాంటి సాంకేతిక విధానాలు జెనెటిక్ ఇంజనీరింగ్ ఉన్నాయి.
→ జీవ సాంకేతిక ఉత్పన్నాలయిన సూక్ష్మజీవనాశకాలు, వాక్సిన్లు, ఎన్జైమ్లు లాంటివి పెద్ద ఎత్తున తయారు చేయడం కోసం వాంఛనీయ సూక్ష్మజీవులు / నిజ కేంద్రక కణాలను వృద్ధి చేయడమనే దానిని కణజాల వర్ధనం అంటారు.
→ అలైంగిక ప్రత్యుత్పత్తి జన్యు సమాచారాన్ని భద్రపరుస్తుంది. కాని లైంగిక ప్రత్యుత్పత్తి వైవిధ్యాలకు అనుమతిస్తుంది. 7 DNA ను విశిష్ట స్థానాల వద్ద గుర్తించి కత్తిరించిన ఎంజైమ్లను అణు కత్తెరలు లేక రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియోజీలు
→ మొట్టమొదటి రెస్ట్రిక్షన్ ఎన్జైమ్ – Hind – II
→ ఎక్సో న్యూక్లియేజ్లు కొనల నుండి న్యూక్లియోటైడ్లను తొలగించగా, ఎండో న్యూక్లియేజ్లు DNA లోపల నిర్దిష్ట ప్రదేశాల్లో ఛేదింపులు జరుపుతాయి.
→ రెస్ట్రిక్షన్ ఎంజైములన్నీ ద్విసరిల DNA లోని రెండు పోచలలో ఛేదనలు వేరువేరు ప్రదేశాల్లో జరుపుతాయి. అటువంటి ఛేదనను స్టాగర్డ్ ఛేదన అంటారు.
→ E. CoRI, DNA లోని 5′ GAATTC3′ ప్రదేశంలోని G – A ల మధ్య ఛేదిస్తుంది. దీనివల్ల DNA లో అతుక్కునే కొనలు ఏర్పడతాయి.
→ విజాతీయ DNA క్రమాల వృద్ధికి ఉపయోగపడే వాహకాలను క్లోనింగ్ వాహకాలు అంటారు.
→ సాధారణంగా ప్లాస్మిడ్లు, బాక్టీరియోఫాజ్లు, కాస్మిడ్లను క్లోనింగ్ వాహకాలుగా వాడతారు.
→ కృత్రిమంగా పునర్నిర్మించబడిన ప్లాస్మిడ్లు PBR 322, PUC 19, 101
→ క్లోనింగ్ వాహకానికి తక్కువ అణుభారం ఉండాలి.
→ జన్యు పునఃసంయోజక సాంకేతిక విధానములో జన్యు పదార్థాన్ని వేరు చేయుట, విశిష్ట స్థానాల్లో DNA ని ఛేదించుట, DNA ఖండితాలకు వేరుపర్చడం, వివక్తత చేయడం, ఉపయుక్తమైన వాహకంలోకి వివక్తమైన జన్యువును ప్రవేశపెట్టడం, అతిథేయిలోనికి పునఃసంయోజక DNA ను చొప్పించడం అను దశలు కలవు.
→ DNA ముక్కలను ‘జెల్ ఎలక్ట్రోపోరెసిస్’ ద్వారా వేరుచేస్తారు.
→ వేరుచేసిన DNA బద్దీలను అగరోజ్ జెల్ ముక్క నుండి ఛేదించాలి. దీనిని ఎల్యూషన్ అంటారు.
→ మూలాధార DNA + వాహక DNA = r – DNA
→ జీవశాస్త్ర ముడి పదార్థాలను విశిష్టమైన ఉత్పన్నాలుగా మార్చడానికి బయోరియాక్టర్లు తోడ్పడతాయి.
→ హెర్బర్ట్ బోయర్
జననము : జులై 10, 1936
దేశము : పెన్సిల్వేనియా
హెర్బర్ట్ బోయర్ 1963లో పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడై అనంతరం యేల్ లో 3సం||ల పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు సాగించారు.
1969లో అతను ఎ.కోలై బ్యాక్టీరియాలోని ఉపయోగకర లక్షణాలు గల రెండు రెస్ట్రక్షన్ ఎన్జైమ్లపై అద్యాయనం జరిపారు. ఈ ఎన్జైమ్లు నిర్ధిష్టమైన శైలిలో DNA పోచలను కత్తిరించే సామర్ధ్య కలిగి అతుక్కునే కొనలు కలదిగా రూపోందుతాయని గమనించాడు. ‘కోహెన్’ ప్లాస్మిడ్లను కణం నుంచి వేరు పరచి వేరొక కణంలోకి చొప్పించే పద్ధతిని కనుగొన్నాడు. ఈ పద్దతితో పాటు DNA ఖండాలు జతపరచకలగడంతో బోయర్, కోహెన్ లు వాంఛనీయ జన్యువుల గల DNA ఖండాలను బ్యాక్టీరియమ్ కణాలలోనికి చొప్పించడంవల్ల విశిష్ట ప్రొటిన్లును తయారు చేయగల మొక్కల వలె రూపొందించారు. ఈ విజయం జీవ సాంకేతిక శాస్త్ర అవిర్భావానికి నాంది పలికింది.