Students can go through AP Inter 2nd Year Botany Notes 9th Lesson అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 9th Lesson అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత
→ గ్రిగర్ జోహన్ మెండల్ ఆస్ట్రియా దేశపు సన్యాసి. బటానీ మొక్కలపై చేసిన ప్రయోగాల ద్వారా అనువంశికత మూల సూత్రాలను కనుగొన్నాడు.
→ ఆయన తన అధ్యయన ఫలితాలను “ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ప్లాంట్ హైబ్రిడ్స్” అను గ్రంథంలో ప్రచురించారు.
→ జనకుల నుంచి తరువాత తరానికి లక్షణాలు సంక్రమించే ప్రక్రియను అనువంశికత అంటారు.
→ మెండల్ తన ప్రయోగాల కొరకు బటాని మొక్కను ఎన్నుకొనుటకు కారణాలు. అవి :
(a) స్పష్టమైన లక్షణాలు గల ఏకవార్షిక మొక్క
(b) దీనిని పెంచడం, సంకరణ చేయడం సులభం
(c) దీనిలో పురుష, స్త్రీ భాగాలు గల ద్విలింగ పుష్పాలు ఉంటాయి.
(d) దీని జీవితకాలం చిన్నది.
→ మెండల్ బటానీ మొక్కలలో కొన్ని పరస్పర విరుద్ధ జతల లక్షణాలపై అధ్యయనం చేశారు.
అవి :
- కాండం ఎత్తు = పొడవు / పొట్టి
- పుష్పం రంగు = ఊదా / తెలుపు
- పుష్ప స్థానం = గ్రీవస్థం / శిఖరస్థం
- ఫలాల ఆకారం = నిండైనవి / నొక్కు ఉన్నవి
- ఫలాల రంగు = ఆకుపచ్చ / పసుపు
- విత్తన ఆకారం = గుండ్రని / ముడుతలు పడినవి.
- విత్తనం రంగు = పసుపు / ఆకుపచ్చ
→ జన్యువులు అనువంశిక ప్రమాణాలు.
→ ఒక జత విరుద్ధ లక్షణాలకు సంకేతాలుగా పనిచేసే జన్యువులను యుగ్మవికల్పాలు అంటారు.
→ ఏక సంకర సంకరణం మొక్క దృశ్యరూప నిష్పత్తి = 3:1
→ ఏక సంకర సంకరణం మొక్క జన్యురూప నిష్పత్తి = 1 : 2:1
→ F1 మొక్కను, అంతర్గత లక్షణాలు గల జనకునితో సంకరణం చేసిన, దానిని పరీక్షా సంకరణం అంటారు.
→ F1 మొక్కను, బహిర్గత లక్షణాలు గల జనకునితో సంకరణం చేసిన, దానిని పశ్చ సంకరణం అంటారు.
→ ఒక జన్యువు యొక్క రెండు యుగ్మవికల్పాలు కలిసి విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు అవి ఎప్పుడూ కలిసిపోవు లేదా మిళితం చెందవు. అవి క్షయకరణ చెందినప్పుడు కాని సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు కాని పృథక్కరణ చెందుతాయి. కావున ప్రతి క్షయకరణ ఉత్పన్నం లేదా సంయోగబీజంలో ఒకే ఒక యుగ్మ వికల్పం ఉంటుంది. దీనిని పృథక్కరణ సిద్ధాంతం లేక సంయోగబీజ స్వచ్ఛత సిద్ధాంతం అంటారు.
→ ఒక లక్షణం సమయుగ్మజ మరియు విషమయుగ్మజ స్థితి రెండింటిలో దృశ్య రూపంగా వ్యక్తమవుతుంది. దీనిని బహిర్గతత్వ సిద్ధాంతం అంటారు.
→ జన్యువు యొక్క ఒక యుగ్మ వికల్పం సంపూర్ణంగా వేరొక యుగ్మ వికల్పంపై బహిర్గతం కాకుండా ఉంటుంది. దీనివల్ల విషమయుగ్మజ మొక్క దృశ్యరూపము బహిర్గత, అంతర్గత సమయుగ్మజ జనకాలను పోలి ఉండక మధ్యస్థంగా ఉండును. దీనిని అసంపూర్ణ బహిర్గతత్వం అంటారు.
→ విషమయుగ్మజాలు, రెండు సమయుగ్మజాల లక్షణాలను చూపు విధానము. దీనిలో యుగ్మ వికల్పాలు ఒకదానికొకటి బహిర్గతత్వం కాని అంతర్గతత్వం కాని చూపవు. దీనిని సహ బహిర్గతత్వం అంటారు.
→ ఒక సంకరంలో రెండు జతల లక్షణాలు కలిసి ఉన్నప్పుడు ఒక జత లక్షణాలు మరొక జత లక్షణాలతో సంబంధం లేకుండా పృథక్కరణ చెందుతాయి. దీనిని స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము అంటారు.
→ సట్టన్ మరియు బొవెరిలు క్రోమోసోమల్ అనువంశిక సిద్ధాంతమును ప్రతిపాదించారు.
→ క్రోమోసోమ్పై జన్యువులు భౌతికంగా, దగ్గరగా ఉండుటను సహలగ్నత అంటారు.
→ ఉత్పరివర్తనాలను హ్యాగోడివ్రీస్ అనువారు ఈనోథేరా లామార్కియానా అను మొక్కలో గుర్తించారు.
→ UV కిరణాలు జీవుల్లో ఉత్పరివర్తనాలను ప్రేరేపిస్తాయి.
→ ఉత్పరివర్తనాలు ఒక జనాభాలో అత్యధిక వైవిధ్యశీలతను ఉత్పత్తి చేస్తాయి. దీనిని ఉపయోగించి ప్రజనన కర్త నిశితవరణం, సంకరణంల ద్వారా మేలైన, వాంఛనీయ లక్షణాలు గల పంటమొక్కల రకాలను పొందుతాడు.
→ గ్రీగర్ జోహన్ మెండల్
జననము : జులై 22, 1822
మరణము : జనవరి 6, 1884
దేశము : ఆస్ట్రియా
గ్రీగర్ జోహన్ మెండల్ అనే ఆస్ట్రియా దేశపు సన్యాసి, బటాని మొక్కలపై ప్రయోగాల ద్వారా అనువంశికత మూల సూత్రాలను కనుగోన్నాడు. 1850 కాలంలో సంకర మొక్కల్లో అనువంశికత లక్షణాలు సంక్రమింపచే విధానం గురించి పరిశోధనలు ప్రారంభించాడు. అతడు అద్యయన ఫలితాలను ‘ఎక్స్ పెరిమెంట్స్ ఆఫ్ ప్లాంట్ హైబ్రిడ్స్’ అను గ్రంథంలో ప్రచురించారు. మొనాస్ట్రీలోని తోటలో బటాని మొక్కలను పెంచి, అతడు జరిపిన పరిశీలనలు ఆధునిక జన్యుశాస్త్రానికి, అనువంశికత అద్యయనానికి పునాది వేశాయి.