AP Inter 2nd Year Botany Notes Chapter 12 జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు

Students can go through AP Inter 2nd Year Botany Notes 12th Lesson జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 12th Lesson జీవ సాంకేతిక శాస్త్రం – దాని అనువర్తనాలు

→ వాతావరణ కలుషితాలను విచ్ఛిన్నం చేయడానికి తిరిగి వాడటానికి సూక్ష్మజీవుల్ని, మొక్కల్ని వాడే పద్ధతిని బయోరెమిడియేషన్ అంటారు.

→ నార్మన్ ఇ. బోర్లాగ్ను హరితవిప్లవ పితామహుడుగా పరిగణిస్తారు.

→ డా.ఎమ్.ఎస్. స్వామినాధన్, వారి బృందం హరితవిప్లవం సఫలమవడానికి కారకులైనారు.

→ జన్యుమార్పిడి చెందిన మొక్కలు, బాక్టీరియమ్లు, శిలీంధ్రాలు, జంతువులను జన్యుపరంగా రూపాంతరం చెందిన జీవులు (GMO) అంటారు.

→ బాసిల్లస్ థుంజియన్సిస్లు విషపూరితమైన కీటక నాశ ప్రోటీన్ ను కల్గి ఉంటాయి.

→ మెలోయిడిగైని ఇన్కాగ్నిషియా అనే నిమాటోడ్ పొగాకు మొక్కల వేర్లలో సంక్రమించి దిగుబడిని అధికంగా తగ్గిస్తుంది.

→ జన్యు చికిత్స అనేది అనువంశికంగా సంక్రమించే వ్యాధులను సరిచేసే చికిత్సా విధానము.

AP Inter 2nd Year Botany Notes Chapter 12 జీవ సాంకేతిక శాస్త్రం - దాని అనువర్తనాలు

→ పునస్సంయోజక DNA సాంకేతిక విధానం, PCR, ఎలిసా లాంటివి కొన్ని సత్వర నిర్ధారణకు ఉపయోగకరమైన పద్ధతులు.

→ PCR ద్వారా వాటి న్యూక్లికామ్లాలను విస్తరణ చేసి బ్యాక్టీరియా, వైరస్లు అతితక్కువ గాఢతలో ఉన్నా కనుక్కోగలం.

→ DNA ఫింగర్ ప్రింటింగ్, నేరస్థులను పట్టుకునే నేరపరిశోధనా విభాగంలోను వివాదాస్పద తల్లిదండ్రులను పరిష్కరించడంలో విజయవంతంగా సహాయపడుతుంది.

→ భారతప్రభుత్వం GEAC అను సంస్థను GM పరిశోధనలు, ప్రజల సేవకై ప్రవేశపెట్టిన భద్రతల సమ్మతానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి నెలకొల్పబడింది.

Leave a Comment