AP Inter 2nd Year Botany Notes Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

Students can go through AP Inter 2nd Year Botany Notes 13th Lesson ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 13th Lesson ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

→ ఉత్పరివర్తన ప్రజననం, కణజాల వర్థనం, r-DNA సాంకేతిక విధానాల వంటి ఎన్నో కొత్త సాంకేతిక విధానాలు కూడా మరింత అధికంగా ఆహారం ఉత్పత్తి చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.

→ ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించడంలోని దశలు :
(a) వైవిధ్యశీలత సేకరణ,
(b) విశ్లేషణ, జనకుల ఎంపిక,
(C) జనకుల మధ్య సంకరణం,
(d) వరణం, మేలైన పునః సంయోజకాలను పరీక్షించడం,
(e) కొత్త సాగు రకాల వ్యాపారీకరణ.

→ 1963లో సొనాలికా, కళ్యాణ్ సోనా వంటి అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత చూపే అనేక రకాలను భారతదేశంలోని గోధుమ పండించే అన్ని ప్రదేశాలలో ప్రవేశపెట్టారు.

→ మంచి దిగుబడిని ఇచ్చే పాక్షిక వామన రకాలైన జయ, రత్నాలను భారతదేశంలో అభివృద్ధి చేశారు. 5 శఖారమ్ బార్బెర్రి శఖారమ్ అఫిసినారమ్ లను సంకరణం చేసి అధిక దిగుబడినిచ్చే రకాన్ని ఉత్పత్తి చేసారు.

→ గోధుమలో హిమగిరి రకాన్ని ఉత్పత్తి చేసారు. ఇది పత్ర, చారల కుంకుమ తెగులుకు ప్రతిరోధకత చూపును. పసుపుపచ్చ మొజాయిక్ వ్యాధి నిరోధకత చూపే బెండ (ఎబుల్మాస్కస్) (పరని క్రాంతి) అనుకొత్త రకం ఏర్పడింది.

→ బ్రాసికాలో పూసాగౌరవ్ అను రకాన్ని కీటకాలు, చీడలను తట్టుకునే విధంగా రూపొందించారు.

→ బయోఫోర్టిఫికేషన్ అను ప్రజననం ఉద్దేశం ద్వారా సస్యాలలో విటమిన్లు, లవణాల స్థాయిలను అధికం చేయడం లేదా అధిక ప్రొటీను, ఆరోగ్యవంతమైన కొవ్వు, అతి ముఖ్యంగా సమాజ ఆరోగ్య స్థితిని పెంపొందించడం.

→ IARI న్యూఢిల్లీ వారు ఎక్కువ విటమిన్లు, ఖనిజాలున్న కూరగాయల మొక్కల అనేక రకాలను విడుదల చేసారు. ఉదా : విటమిన్ A పుష్టిగా ఉన్న కారట్లు, స్పినాచ్, గుమ్మడి, విటమిన్ C పుష్టిగా ఉన్న కాకర, బతువ, ఆవాలు, టమాటో, ఇనుము, కాల్షియం పుష్టిగా ఉన్న స్వినాచ్, బతువ, ప్రొటీను పుష్టిగా ఉన్న చిక్కుళ్ళు.

→ సూక్ష్మ జీవులను మంచి ప్రొటీనుల కోసం పారిశ్రామికంగా పెంచవచ్చును.

→ సూక్ష్మ జీవులైన స్పిరులినా వంటి వాటిని వ్యర్థ పదార్థాలపై పెంచి, ప్రొటీను, లవణాలు, క్రొవ్వు, పిండిపదార్థాలు, విటమిన్లు పుష్టిగా ఉన్న ఆహారంగా వినియోగించవచ్చు.

→ 250గ్రా. మిథైలోఫిలస్ మిథైలోట్రాపస్ అనే సూక్ష్మ జీవి 25 టన్నుల ప్రొటీనును ఉత్పత్తి చేస్తుంది.

→ మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకుని, ఒక పరీక్షనాళికలో, సూక్ష్మ జీవ రహిత వాతావరణంలో ప్రత్యేక పోషక యానకం పై పెంచుటను కణజాలవర్థనం అంటారు.

→ మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకుని దానికి ఉపయోగించిన, ఎక్స్ ప్లాంట్ అంటారు.

→ ఒక కణం పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందగలిగే శక్తిని టోటిపొటెన్సి అంటారు.

→ వివిధ గాఢతలో ఉండే ఆక్సిన్లు, సైటోకైనిన్ల కలయికతో ఉన్న యానకంపై ఎక్స్ ప్లాంట్ లేదా కాలస్ వర్థనం చేసినప్పుడు వేర్లు లేదా కాండాలు ఏర్పడతాయి. దీనిని అవయవోత్పత్తి అంటారు.

AP Inter 2nd Year Botany Notes Chapter 13 ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

→ చాలా తక్కువ సమయంలో పరిమితమైన ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయుటను సూక్ష్మవ్యాప్తి అంటారు.

→ వివిక్తం చేసిన జీవపదార్థాలను సంయోగం చేయడం ద్వారా, ఒక సరికొత్త తరహా మొక్కను పొందవచ్చు. వాటిని శాకీయ సంకరాలు అంటారు.

→ ఒక టమాటో జీవపదార్థకం, బంగాళదుంప జీవపదార్థకం కలిపి కొత్త మొక్క పొమాటో ఏర్పడింది.

→ ఎమ్.ఎస్. స్వామినాథన్
జననము: ఆగష్టు 07, 1925
దేశము : ఇండియన్
మోనకంబు సాంబశివన్ స్వామినాథన్ మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి వృక్షశాస్త్రంలో కళశాల విద్య, విశ్వవిద్యాలయ విద్యాను పూర్తిచేశారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(IARI) లో స్థాపించిన స్కూల్ ఆఫ్ సైటోజెనిటిక్స్ మరియు రేడియేషన్ రిసర్చ్ సంస్థ ద్వారా స్వామివాధన్ అతని సహచరులు వరిలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలతో సహా, సువాసననిచ్చే బాస్మతిని అభివృద్ధి చేశారు.
నార్మేన్.ఇ.బోర్లాగ్ (Norman. E. Borlung) తో ఏర్పడిన సాంగత్యం వల్ల స్వామినాథన్ మెక్సికన్ గోధుమరకాలను భారతదేశంలో ప్రవేశపెట్టడం ‘హరిత-విప్లవానికి’ దారి తీసింది. దీనికి మంచి గుర్తింపుతో పాటు ప్రశంసలు కూడ అందుకున్నారు. వీరు ప్రయోగశాల నుంచి భూమి పైకి (Lab -to- land) ఆహార భద్రత, అనేక ఇతర పర్యావరణ కార్యక్రమాలకు మొదటిసారిగా ప్రారంభించారు. వీరిని ‘పద్మభూషణ్’ తో సన్మానించారు. ఇవేకాక వివిధ విశిష్టమైన సంస్థల నుండి అనేక గౌరవ పురస్కారాలు, పతకాలు, గౌరవ వేతనాలు పొందారు.