AP Inter 2nd Year Botany Notes Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

Students can go through AP Inter 2nd Year Botany Notes 14th Lesson మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Botany Notes 14th Lesson మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

→ భూమిపై ఉండే జీవవ్యవస్థలో సూక్ష్మ జీవులు అనేవి స్థూలభాగంగా ఉంటాయి.

→ ఏ ఇతర జీవి మనుగడకు సాధ్యం కాని ప్రదేశాలలో కూడా ఉంటూ, అనగా చాలా లోతుగా ఉన్న వేడినీటి ఊట ప్రదేశాలలో, ఎక్కడ 140 °C ఉష్ణం ఉంటుందో, విపరీత ఆమ్ల ప్రదేశాలలోను నివసిస్తాయి.

→ లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా పాలలో పెరిగి, దానిని పెరుగుగా మారుస్తాయి. తద్వారా దానిలో విటమిన్ B<sub>12</sub> అభివృద్ధి చెందడం వల్ల దాని పోషక విలువలు కూడా పెరుగుతాయి. మన జీర్ణకోశంలో కూడా LAB వ్యాధికారక సూక్ష్మజీవులను నివారించడంలో ఎంతో ఉపయోగకరమైన విధిని నిర్వహిస్తాయి.

→ రొట్టె తయారీలో వాడే తడిపిన పిండికి కూడా బేకర్స్ ఈస్ట్ (శాఖరోమైసిస్ సిరివిసియేను ఉపయోగించుట ద్వారా పులిసేలా చేస్తారు.

→ కల్లు అనే సాంప్రదాయ పానీయం కూడా పామ్ మొక్కల (తాడిచెట్లు) నుండి వచ్చే రసం సూక్ష్మజీవులతో పులియుట వల్ల తయారు అవుతుంది.

→”స్విట్జున్ను”లో ఉండే పెద్ద రంధ్రాలు “ప్రొపియెనిబాక్టీరియం షర్మనై” అనే బాక్టీరియం ఎక్కువగా CO<sub>2</sub>, ఉత్పత్తి చేయడం వల్ల ఏర్పడతాయి.

→ ‘రాకీఫోర్ట్ జున్ను’ – పెనిసిలియం రాక్వీఫోర్టి అను శిలీంధ్రం వల్ల తయారగును.

→ పరిశ్రమలకు ఉపయోగపడేలా సూక్ష్మజీవులను పెంచే పెద్ద పాత్రలను “ఫర్మెంటర్స్” అంటారు.

→ ‘శాఖరోమైసిస్ సెరివిసియే’ను ఉపయోగించి ఉడికించిన ధాన్యపు పిండి మరియు పండ్ల రసాలను పులియబెట్టి ఎథనాల్ను ఉత్పత్తి చేస్తున్నారు.

→ సూప్ లాంటి పదార్థ కిణ్వనం వల్ల వైన్, బీర్ లాంటివి స్వేదనం లేకుండా ఉత్పత్తి చేయడం, విస్కి, బ్రాంది, రమ్ లాంటివి స్వేదనం ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది.

→ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (పెన్సిలియం నోటేటం నుండి) పెన్సిలిన్ అను సూక్ష్మజీవ నాశకంను కనుగొన్నారు.

→ పెన్సిలిన్ను అమోఘమైన ఆంటీబయాటిక్గా నిరూపించిన వారు ఎర్నస్ట్ చైన్, హొవార్డ్ ఫ్లోరె.

AP Inter 2nd Year Botany Notes Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

→ ఆసరిజిల్లస్, అసిటోబాక్టర్, క్లాస్ట్రీడియమ్ మరియు లాక్టోబాసిల్లస్లు ఆమ్లాలను ఉత్పత్తి చేయు బ్యాక్టీరియమ్లు.

→ లైపేజ్ న్ను సబ్బుల తయారీ సూత్రంలో వినియోగిస్తారు. తద్వారా ఇవి బట్టలపై నూనె మరకలు తొలగించుటలో ఉపయోగపడతాయి.

→ స్ట్రెప్టోకోకస్ నుండి లభించే స్ట్రెప్టోకైన్ ను రూపాంతరంచేసి, రక్త నాళాలలో ఏర్పడే గడ్డలను తొలగించుటకు (Clot buster) ఉపయోగిస్తారు.

→ మోనాస్కస్ పర్ఫ్యూరస్ అనే ఈస్ట్నుంచి కొవ్వు తగ్గించే స్టాటిన్లను ఉత్పత్తి చేస్తున్నారు.

→ పరపోషిత సూక్ష్మజీవుల వల్ల మురుగు నీరు శుద్ధి చేయబడుతుంది.

→ వాతావరణంలోకి అనుకోకుండా విడుదలయ్యే నూనె లేదా రసాయనాల వంటి పారే పదార్థాలు అలాగే భూమిని కలుషితం చేసే విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో కూడా సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను “బయోరెమిడియేషన్” అంటారు.

→ వాయురహిత మురుగు మట్టిలో ఉన్న ‘మిథనోజన్లు’ మురుగునీటిని శుద్ధిచేస్తూ మీథేన్ గ్యాస్ లేక గోబర్ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి.

→ బాసిల్లస్ థురింజియన్సిస్ ద్వారా సీతాకోకచిలుకల గొంగళిపురుగులను నియంత్రించవచ్చు.

→ బాక్యులో వైరస్లు అనే వ్యాధి జనకాల ద్వారా కీటకాలు, ఆర్థోపోడు వ్యాధి బారిన పడతాయి.

→ రైజోబియం, అజోటోబాక్టర్, అజోస్పైరిల్లమ్లు నత్రజని స్థాపన చేస్తాయి.

→ గ్లోమస్ ప్రజాతికి చెందిన అనేక శిలీంధ్ర మూలాలు, మృత్తిక నుంచి ఫాస్ఫరస్ ను మొక్క శోషించే విధంగా ఉంటాయి.

AP Inter 2nd Year Botany Notes Chapter 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

→ సయనో బ్యాక్టీరియా వాతావరణం నుంచి నత్రజనిని స్థాపన చేస్తాయి.

→ “బయో టెర్రరిజం”లో భయానికి గురిచేసేలా జీవశాస్త్ర సహకారులను వినియోగిస్తూ, భయం లేదా నిజమైన వ్యాధులను కలుగజేసేలా చేస్తూ తద్వారా ఎక్కువ జనాభా చనిపోయేలా చేస్తారు.