Students can go through AP Inter 2nd Year Botany Notes 6th Lesson మొక్క పెరుగుదల, అభివృద్ధి will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 6th Lesson మొక్క పెరుగుదల, అభివృద్ధి
→ ఒక జీవి మౌళిక, సుస్పష్టమైన ప్రధాన లక్షణాలలో ఒకటి పెరుగుదల. ఒక జీవి లేదా దాని భాగాలు పరిమాణం, పొడవు, బరువులో పెరిగి అనుత్కమణీయ శాశ్వత పెంపును పెరుగుదల అంటారు.
→ విభాజ్య కణజాలాల వల్ల పెరుగుదల జరుగుతుంది.
→ వేరు, ప్రకాండ అగ్రవిభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలం వల్ల మొక్కలు అక్షీయ దైర్ఘ్యవృద్ధిని చూపుతాయి.
→ పెరుగుదల రేటులో కనిపించే పెంపు అంకగణితంగా లేదా జ్యామితీయంగా ఉండవచ్చు.
→ పెరుగుదలలో మందదశ, సంవర్గదశ మరియు పూర్తిగా ఆగిపోయే దశ ఉంటాయి.
→ కణాలు విభజన శక్తిని కోల్పోయి, విభేదనంకు దారితీస్తాయి.
→ పెరుగుదల, విభేదనం ఫలితంగా అభివృద్ధి కనిపిస్తుంది.
→ మొక్కలు వాతావరణానికి లేదా జీవిత దశలకు అనుక్రియగా భిన్న రకాల నిర్మాణాలను ఏర్పరచడానికి వివిధ పద్ధతులను చూపుతాయి. దానిని ప్లాస్టిసిటీ అంటారు.
→ మొక్కల అభివృద్ధి అంతర, బాహ్య కారకాల మీద ఆధారపడి ఉంటుంది.
→ మొక్క పెరుగుదల నియంత్రకాలు చాలా చిన్న సరళ రసాయన పదార్థాలు. అవి : ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు, సైటోకైనిన్లు, అబ్బిసిక్ ఆమ్లము మరియు ఎథిలీన్.
→ కాంతి, ఉష్ణోగ్రత, నీరు, ఆక్సిజన్, పోషకాలు మొదలైనవి బాహ్య కారకాలు.
→ ఓట్ (oat) నారు మొక్కల ప్రాంకుర కంచుకం నుండి ఎఫ్. డబ్ల్యూ.వెంట్ అనువారు ఆక్సిన్లను వేరుచేసారు.
→ వరి నారు మొక్కలలో జిబ్బరెల్లా ప్యూజికురై అను శిలీంధ్రము బకనే వ్యాధిని కలుగజేస్తుంది.
→ స్కూగ్, మిల్లర్లు కణద్రవ్య విభజనను ప్రేరేపించి క్రియాశీల పదార్థాన్ని గుర్తించి స్పటికీకరించారు. దానికి కైనటిన్ అని పేరు పెట్టారు.
→ ABA అను హార్మోను సహజ బాష్పోత్సేక నిరోధకము.
→ ఎథిలీస్ వాయురూపంలో హార్మోను.
→ IAA, IBA లు సహజ ఆక్సిన్లు.
→ NAA, 2,4-D లు కృత్రిమ ఆక్సిన్లు.
→ పెరుగుదలకు కావలసిన అనుకూల బాహ్య పరిస్థితులు లేనప్పుడు, విత్తనాలు అంకురించలేక పోవడాన్ని క్విసెన్స్ అంటారు.
→ బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అంతర పరిస్థితుల కారణంగా విత్తనాలు అంకురించలేకపోవడాన్ని సుప్తావస్థ అంటారు.
→ మగలు, రాత్రి కాలాలకు మొక్కలు చూపే పుష్పోత్పత్తి అనుక్రియలను కాంతి కాలావధి అంటారు.
→ నిర్దిష్ట సందిగ్ధ కాలవ్యవధి కంటే ఎక్కువ ఉన్నప్పుడు పుష్పించే మొక్కలను దీర్ఘదీప్తికాల మొక్కలు అంటారు.
→ నిర్దిష్ట సందిగ్ధ కాలవ్యవధి కంటే తక్కువ ఉన్నప్పుడు పుష్పించే మొక్కలను హ్రస్వదీప్తికాల మొక్కలు అంటారు.
→ కొన్ని మొక్కలు కాంతి కాల ప్రమాణానికి పరస్పరం సంబంధం లేకుండా పుష్పిస్తాయి. వాటిని దీప్తికాల తటస్థ మొక్కలు అంటారు.
→ స్వల్ప లేదా అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పుష్పోత్పత్తి ప్రేరేపించబడుటను వెర్షలైజేషన్ అంటారు.