Students can go through AP Inter 2nd Year Botany Notes 7th Lesson బ్యాక్టీరియమ్లు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 7th Lesson బ్యాక్టీరియమ్లు
→ ఆంటన్వాన్ లీవెన్ హాక్ బాక్టీరియమ్లను గుర్తించారు. కావున ఆయనను సూక్ష్మజీవశాస్త్రపిత అంటారు.
→ బాక్టీరియా అని పేరు పెట్టినవారు “ఎర్రెన్ బర్గ్”.
→ బాక్టీరియమ్లు రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో విశిష్టమైన మార్పులు తీసుకువస్తాయి లూయిస్ పాశ్చర్.
→ బాక్టీరియమ్లను గురించి చదివే శాస్త్రంను బాక్టీరియాలజీ అంటారు.
→ విట్టేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణ ప్రకారము బాక్టీరియమ్లు, నీలి ఆకుపచ్చ శైవలాలు కలిపి మొనీరా అను రాజ్యంలో ఉంచారు.
→ బాక్టీరియమ్లు మృత్తిక, గాలి, నీరు, జీవరాశుల దేహాలపైన లేదా దేహాల లోపల ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆహారపదార్థాలలో, అతిశీతల, ఉష్ణ, జలభావ పరిస్థితులను తట్టుకుని జీవిస్తాయి.
→ కొన్ని బాక్టీరియమ్లు మొక్కలు, జంతువులు, మానవులలో ప్రాణాంతక పరాన్న జీవులుగా ఉంటాయి.
→ ఎశ్చరీషియా కోలై (E.Coli) అనే బాక్టీరియమ్ మానవుని పేగుల్లో నివసిస్తుంది.
→ చాలావరకు బాక్టీరియమ్లు 2.0 నుంచి 5.0 um పొడవులోను, 0.5 నుంచి 1.0 m వెడల్పులోను ఉంటాయి. (10) బాక్టీరియమ్ కణాలు గోళాకారము (కొకై), దండాకారము (బాసిల్లై), సర్పిలాకారము (స్పైరిల్లమ్) లేదా కామా ఆకారము (విబ్రియో)లో ఉంటాయి.
→ కొన్ని బహురూపకంలో ఉంటాయి. ఉదా : అసిటోబాక్టర్.
→ కొన్ని స్పైరిల్లమ్ రకాలు నమ్మత కలిగి ఉండి స్పైరోకీట్గా పిలవబడతాయి.
→ కొన్ని బాక్టీరియమ్లు దారం పోగులేక తంతువు రూపంలో ఉంటాయి. ఉదా : బెగ్గియోటా.
→ బాక్టీరియమ్ల కణకవచము 2 నుండి అనేక వరుసల పెప్టిడోగ్లైకాన్తో నిర్మితమై ఉంటుంది. గ్రామ్ పాజిటివ్
→ బాక్టీరియమ్ కణకవచంలో థికాయిక్ ఆమ్లము ఉంటుంది.
→ కణకవచానికి వెలుపల కశాభాలు, పిలి, లైంగిక పైలస్ మరియు గ్లైకోకేలిక్స్ ఉంటాయి.
→ లైంగిక పైలస్, బాక్టీరియమ్ సంయుగ్మములో రెండు కణాలను బంధించుటలో తోడ్పడుతుంది.
→ బాక్టీరియమ్ కణంలో ప్రధాన జన్యు పదార్థమును జీనోఫోర్ అంటారు.
→ జీనోఫోర్కు అదనంగా, చిన్నవలయాకార, రెండుపోగుల DNA అణువులు ఉంటాయి. వాటిని ప్లాస్మిడ్లు అంటారు.
→ శక్తి మరియు కర్బన మూలాలను బట్టి బాక్టీరియమ్లలో, కాంతి స్వయంపోషితాలు, రసాయన స్వయం
→ పోషితాలు, కాంతి పరపోషితాలు, రసాయన పరపోషితాలు అను 4 పోషణ రకాలు కలవు.
→ బాక్టీరియమ్లు సాధారణంగా ద్విధావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
→ బాక్టీరియమ్లలో లైంగిక ప్రత్యుత్పత్తి లేదు. కాని జన్యు పదార్థ వినిమయము 3 విధాలుగా జరుగుతుంది. అవి :
- సంయుగ్మము
- జన్యుపరివర్తనము
- జన్యువహనము.
→ అనేక బాక్టీరియమ్లు మానవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనకరంగా ఉంటాయి. కావున వీనిని “మానవాళికి మిత్రులుగాను, శత్రువులుగాను” భావించవచ్చు.
→ బాక్టీరియమ్ల DNA అనుఘటకాలను బయోసెన్సర్స్ ఉపయోగించి జీవక్రియాపూరితమైన విషపూరిత కాలుష్య కారకాలను గుర్తిస్తున్నారు.
→ ఆంటన్ వాన్ లీవెన్ హాక్
జననము : అక్టోబర్ 24, 1632
మరణము : ఆగష్టు 26, 1723
దేశము : డచ్
లీవెన్ హాక్ అనే డచ్ వ్యాపారస్థుడికి చేతిలో ఇమిడిపోయే చిన్న చేతి బూతద్దాలను తయారు చేయడం అలవాటుగా ఉండేది.ఒక గుండుసూదిపై ఉంచిన పదార్థంపై తన కటకం ద్వారా చూసి, కంటికి కనిపించని జీవరాశిని ఆవిష్కరించారు. వాటిని ఆయన జంతుకాలు న్నారు. నీటి బిందువులలో, మృత్తికలో, అతని దంతాల పాచిపైన ఈ సూక్ష్మజీవులను కనుగొన గలిగాడు.
1674e5 లీవెన్ హాక్ బ్యాక్టీరియమ్లు, ప్రోటోజోవన్లు ప్రప్రథమంగా విపులంగా వ్యక్తీకరించిన తన ఆవిష్కరణలను చిత్ర పటాలతో సహా రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ కు పంపించాడు. సూక్ష్మజీవులపై ఇతను జరిపిన కృషికి గుర్తుగా లీవెన్హాక్ ను “సూక్ష్మజీవ శాస్త్రపితామహుడు” గా గౌరవించారు.