Students can go through AP Inter 2nd Year Botany Notes 8th Lesson వైరస్లు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 8th Lesson వైరస్లు
→ బాక్టీరియమ్లు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులలో అన్ని రకాల కణాలకు సంక్రమించే “జీవ రూపాలు” – వైరస్లు.
→ వైరస్లకు కణరూపం ఉండదు. వీటిని కాంతి సూక్ష్మదర్శిని కింద చూడలేము.
→ వైరస్లను గురించి చదివే శాస్త్రంను వైరాలజీ అంటారు.
→ TMV ని మొదట ఐవనోస్కి గుర్తించారు.
→ వైరస్ రేణువులను విరియన్లు అంటారు.
→ వైరస్ రేణువులో ప్రోటీను తొడుగు, కాప్సిడ్ మరియు DNA లేదా RNA ఉంటాయి.
→ ఇవి ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కొనసాగిస్తూ ఉత్పరివర్తనాలకు లోనవుతాయి. వైరస్లను వ్యాధి సంక్రమింపజేసే రేణువులుగా గుర్తించవచ్చు.
→ వైరస్లు అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు అనగా ఒక ప్రత్యేక ఆతిథేయి కణాన్ని ఆక్రమించనంతవరకు ఇవి వృద్ధి చెందలేవు.
→ ‘స్టాన్లీ’, TMV ని స్ఫటికీకరించినందులకు నోబెల్ బహుమతి లభించింది.
→ ఫ్రెంకల్ – కనాట్లు TMV లో జన్యు పదార్థము RNA అని నిర్ధారణ చేసారు.
→ ఇంటర్నేషనల్ కమిటి ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ (ICTV) వారు వైరస్ల నామీకరణ, వర్గీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రిస్తారు.
→ ICTV పథకంలో మూడు వర్గీకరణ స్థాయిలు ఉంటాయి. అవి కుటుంబము, ప్రజాతి మరియు జాతి.
→ మానవులలో వైరస్ కలుగజేసే కుటుంబం : రిట్రోవిరిడే, ప్రజాతి : లెంటివైరస్, జాతి : హ్యూమన్ ఇమ్యూన్ డెఫిసియన్సీ వైరస్ [HIV) గా వర్గీకరిస్తారు.
→ వైరస్లు కేంద్రకామ్లము మరియు ప్రొటీనులతో నిర్మితమై ఉంటాయి.
→ TMV – దండాకార వైరస్. దీనిలో RNA అను జన్యు పదార్థము, సుమారు 2130 కాప్సోమియర్లతో ఉన్న కాప్సిడ్లు ఉంటాయి.
→ బాక్టీరియో ఫాజ్లు తోకకప్ప ఆకారంలో ఉంటాయి.
→ T – సరిసంఖ్య గల ఫాజ్లు ఎ.కోలై (E.coli) పై దాడిచేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజ్లు అంటారు. ఇవి లైటిక్ చక్రాన్ని కనబరుస్తాయి.
→ ఒక కణం నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే ఫాజ్ రేణువుల సంఖ్యను “పగిలే పరిమాణం” (50 – 200) అంటారు.
→ ఫాజ్ DNA, ఎ. కోలై కణంలోకి ప్రవేశించాక వలయాకార బాక్టీరియల్ DNA తో కలిసిపోయి దానిలో భాగమై గుప్తంగా ఉండిపోతుంది. ఇటువంటి ఫాజ్లను టెంపరేట్ ఫాజ్లు అంటారు. ఇవి లైసోజెనిక్ చక్రంను కనబరుస్తాయి.
→ వైరస్లు నిర్హరితం (పీచ్ పసుపుపచ్చ తెగులు), మొజాయిక్ (పొగాకు మొజాయిక్ వ్యాధి), ఈనెల నిర్హరితము (బెండ – ఈనెల నిర్హరితము), కురూపత (కోకో – ఉబ్బు కాండం) పుష్ప చీలికలు (ట్యూలిప్ పుష్ప చీలిక తెగులు) వంటి వ్యాధులను కలుగజేస్తాయి.
→ అసాధారణంగా ఒక ప్రొటీన్ త్వచం లేని, 300 – 400 న్యూక్లియోటైడ్లను కలిగి ఉన్న ఒక చిన్న కేంద్రకామ్లపు ముక్కను వైరాయిడ్-అని పిలుస్తారు. ఇవి అనేక ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కలపై (టమాటో, పొటాటో, కుకుంబర్లు) వ్యాధులను కలుగజేస్తాయి.
→ దీర్ఘకాలిక హెపటైటిస్ B క్యాన్సర్కు దారితీస్తుంది. వీటిని అంకోవైరస్లు అంటారు.
→ ప్రియానులు అని పిలవబడే ప్రోటీన్ యుత సంక్రామిక రేణువులు కూడ ఆవులలో మాడొ ్క వ్యాధి (బొవైన్ స్పాంజి ఫామ్ ఎన్సెఫాలైటిస్), గొర్రెలలో స్క్రాపి వ్యాధులను కలుగజేస్తాయి.