అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘కనిపించని ఆకలి’ (Hidden hunger) అంటే ఏమిటి ?
జవాబు:
సూక్ష్మమూలకాలు, ప్రోటీన్, విటమిన్ల లోపాలతో ఉండుటవల్ల వ్యాధులు బారినపడే అవకాశాలు, జీవితకాలం కుదించుకుపోవడం, మానసిక సామర్థ్యాన్ని దెబ్బతీసేవి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దానిని కనిపించని ఆకలి అంటారు.
ప్రశ్న 2.
భారతదేశంలో అభివృద్ధిపరచిన పాక్షిక వామన (semi – dwarf) వరి రకాలను తెల్పండి.
జవాబు:
జయ, రత్న.
ప్రశ్న 3.
భారతదేశంలోకి ప్రవేశపెట్టిన అధిక దిగుబడి, వ్యాధినిరోధకత కలిగిన గోధుమ రకాలలోని రెండు ఉదాహరణలను ఇవ్వండి.
జవాబు:
సొనాలిక, కల్యాణ్ సోనా.
ప్రశ్న 4.
SCP ఉత్పత్తికి ఉపయోగించే రెండు శిలీంధ్రాలను ఉదాహరణగా ఇవ్వండి. [A.P. Mar. ’17, ’15]
జవాబు:
కాండిడా యుటిలిస్, (టోరులా ‘ఈస్ట్); శాఖరోమైసిస్ సెరివిసియే (బేకర్స్ ఈస్ట్); ఖీటోమియం సెల్యులైటికమ్
ప్రశ్న 5.
చక్కటి దిగుబడి కోసం చెరుకులోని ఏ రెండు జాతుల మధ్య సంకరణం జరిపారు ?
జవాబు:
శఖారమ్ బార్ బెర్రి మరియు శఖారమ్ అఫిసినారమ్ల మధ్య సంకరణం జరిపి అధిక దిగుబడి, ఎక్కువ చక్కెర కల రకాలను ఉత్పత్తి చేసారు.
ప్రశ్న 6.
టోటిపొటెన్సి మరియు ఎక్స్ప్లాంట్లను నిర్వచింపుము.
జవాబు:
టోటిపొటెన్సి : ఒక కణము తనలోని అంతర్గత సామర్థ్యముతో పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందుటకు టోటిపొటెన్ని అంటారు.
ఎక్స్టెంట్ : కణజాల వర్ధన ప్రయోగములో ఉపయోగించే మొక్క భాగమును ఎక్స్ ప్లాంట్ అంటారు.
ప్రశ్న 7.
సూక్ష్మవ్యాప్తి, సోమాక్లోన్లను నిర్వచింపుము.
జవాబు:
సూక్ష్మవ్యాప్తి : కణజాల వర్ధనం ద్వారా చాలా తక్కువ సమయములో పరిమిత ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయుటను సూక్ష్మవ్యాప్తి అంటారు.
సోమాక్లోన్లు : సూక్ష్మవ్యాప్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు జన్యుపరంగా అసలైన తల్లి లేదా మూలాధార మొక్కను పోలి ఉంటాయి. వాటిని సోమాక్లోన్లు అంటారు.
ప్రశ్న 8.
బీజపదార్థ సేకరణ అనగానేమి ? [T.S. Mar. ’15]
జవాబు:
ఒక గుర్తించిన సస్యంలోని మొక్కలు/విత్తనాలు మొత్తం సేకరణలో అన్ని రకాల యుగ్మ వికల్పాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దానిని బీజపదార్థ సేకరణ అంటారు.
ప్రశ్న 9.
బయోఫోర్టిఫికేషన్ అనగానేమి ?
జవాబు:
సస్యాలలో విటమిన్లు, లవణాల స్థాయిలను అధికం చేయుట, లేదా అధిక ప్రోటీను, ఆరోగ్యవంతమైన కొవ్వువంటి అంశాలపై దృష్టిసారించుట, ముఖ్యంగా సమాజ ఆరోగ్య స్థితిని పెంపొందించుటను బయోఫోర్టిఫికేషన్ అంటారు.
ప్రశ్న 10.
వైరస్ రహిత మొక్కలను ఉత్పత్తి చేయుటకు మొక్కలోని ఏ భాగము బాగా అనుకూలము ? ఎందువల్ల ? [T.S. Mar. ’16]
జవాబు:
కాండ అగ్రంలోని విభాజ్య కణజాలము. దీనిలోని కణాలు చురుకుగా విభజన చెందుతూ వైరస్ రహితంగా ఉంటాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బయోఫోర్టిఫైడ్ (Biofortified) సస్యాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఇవి సమాజానికి ఎటువంటి లాభాలను సమకూరుస్తాయి ?
జవాబు:
- గోధుమరకం – అట్లాస్ 66 – ఎక్కువ ప్రొటీన్ పరిమాణము.
- ఐరన్ ఫోర్టిఫైడ్ వరి రకం – సాధారణ రకంలో కంటే ఐదింతల ఎక్కువ ఐరన్ ఉండేది.
- బంగారు వరి – బీటాకెరోటిన్ కల వరి రకము.
- క్యారెట్, స్పినాచ్, గుమ్మడి – విటమిన్ A ఎక్కువగా ఉన్న రకాలు.
- కాకర, బతువ, ఆవాలు, టమాటో : విటమిన్ ‘C’ ఎక్కువగా కల రకములు.
- స్పినాచ్, బతువ – ఇనుము, కాల్షియం పుష్టిగా కల రకాలు.
- చిక్కుళ్ళు, లాబ్-లాబ్, బీన్స్, తోట బటానీ – ప్రొటీన్ పుష్టిగా ఉన్న రకాలు.
ఉపయోగాలు :
- సస్వాలలో విటమిన్లు, లవణాల స్థాయిలు అధికంగా ఉంటాయి.
- అధిక ప్రొటీన్లు ఉంటాయి.
- నూనె పరిమాణం ఎక్కువగా ఉంటుంది. “
- రాజ ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుట.
ప్రశ్న 2.
SCP పై లఘుటీక వ్రాయుము.
జవాబు:
జంతువులకు, మానవుల పోషణకు కావలసిన ప్రోటీన్ మూలానికి ఒక ప్రత్యామ్నాయము ఏకకణ ప్రోటీనులు. శైవలాలు, శిలీంధ్రాలు, బాక్టీరియమ్లను ఏకకణ ప్రొటీనుల ఉత్పత్తికి పెంచుతారు. బంగాళదుంప ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థాలపై, ఎండుగడ్డి, మొలాసిస్, జంతువుల ఎరువులు మురుగునీటిపై కూడా, స్పైరులినా వంటి శైవలాలను పెంచవచ్చు. వీటి నుండి ప్రోటీనులు, లవణాలు, కొవ్వు, పిండిపదార్థాలు, విటమిన్లు పుష్టిగాగల ఆహారం లభిస్తుంది మరియు వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.
ఉదా : 250 కిలోల బరువు కల ఒక ఆవు, ఒక రోజుకి 200 గ్రాముల ప్రోటీను ఉత్పత్తి చేస్తుంది. ఇదే సమయంలో మిథైలోఫిలస్ మిథైలోట్రాపస్ అనే బాక్టీరియా విపరీతంగా పెరిగి, జీవద్రవ్యరాశిని అధికంగా ఉత్పత్తి చేయుటవల్ల 25 టన్నుల ప్రోటీనును ఉత్పత్తి చేస్తుందని అంచనావేసారు.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మీరు మొక్కల ప్రజనన విభాగంలో పనిచేసే ఒక వృక్షశాస్త్రవేత్త. ఒక కొత్త రకాన్ని విడుదల చేసే క్రమంలో మీరు పాటించే వివిధ దశలను గురించి వివరించండి. [T.S. Mar. ’17, ’16] [May ’15]
జవాబు:
జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించుటలోని దశలు.
1) వైవిధ్యశీలత సేకరణ : ప్రజనన కార్యక్రమమునకు జన్యు వైవిధ్యశీలత అనేది మూలాధారము. వివిధ వన్యరకాలను, జాతులను వాటి ద్వారా సాగుచేసే సంబంధీకులను సేకరించడం, భద్రపరచడం అనేది వృక్ష జనాభాలో ప్రకృతిపరంగా లభించే జన్యువులను చక్కగా గుర్తించి, ఉపయోగించుకోవడం ముఖ్య అవసరము. ఈ సేకరణలో ఒక నమూనా రకంలోని వివిధ రకాల యుగ్మవికల్పాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దానిని బీజపదార్థ సేకరణ అంటారు.
2) విశ్లేషణ, జనకుల ఎంపిక : బీజ పదార్థాన్ని సరియైన రీతిలో విశ్లేషించడం ద్వారా ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కలను గుర్తించవచ్చు. ఇలా ఎంపిక చేసిన మొక్కలను వృద్ధిచేసి సంకరణ ప్రక్రియలో ఉపయోగిస్తారు.
3) ఎంపిక చేసిన జనకుల మధ్య సంకర సంకరణం : వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేరువేరు మొక్కలను సాధారణంగా సంకరణం చేయాలి. స్త్రీ జనక మొక్కలలో విపుంసీకరణ చేసాక, పాలిథిన్ సంచి మూసి, అవాంఛనీయ పరపరాగ సంపర్కమును నిరోధిస్తారు. పురుష జనకుని నుండి బ్రష్ సహాయంతో పరాగ రేణువులను సేకరించి, స్త్రీ జనక మొక్కలో పుష్పంలోని కీలాగ్రంపై అద్ది సంకరణం జరుపుతారు.
4) వరణం, మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం : సంతతి సంకర మొక్కలలో, వాంఛనీయ లక్షణాలు కలిసి ఉన్న మొక్కలను ఎన్నుకోవడం జరుగుతుంది. సంతతి మొక్కల శాస్త్రీయ విశ్లేషణలో చాలా జాగ్రత్త అవసరం. ఈ దశ మొక్కలు రెండు జనకుల కన్నా మేలైనవిగా ఏర్పడతాయి. వీటిలో అనేక తరాలు ఆత్మ పరాగ సంపర్కం జరిపి, (సమయుగ్మజ స్థితి చేరుకునే వరకు) తద్వారా సంతాన మొక్కలలో లక్షణాల పృథక్కరణ జరగకుండా చూస్తారు.
5) పరీక్షించడం, విడుదల, కొత్త సాగురకాల వ్యాపారీకరణ : వరణం ద్వారా ఎంపిక చేసిన కొత్త క్రమాలను అధిక దిగుబడి నాణ్యత, వ్యాధి నిరోధకత మొదలైన లక్షణాల కోసం విశ్లేషిస్తారు. ఈ విశ్లేషణ వివిధ పరిశోధనా క్షేత్రాలలో సాగుచేయడం ద్వారా జరుగుతుంది. ఆదర్శమైన ఎరువు వాడకం, నీటి పారుదల వంటి నిర్వహణ పద్ధతుల ద్వారా వీటి నిర్వహణ సమర్థతను భద్రపరుస్తారు. పరిశోధనా క్షేత్రాలలో విశ్లేషణ తర్వాత, ఈ పదార్థాలను రైతుల పొలాలలో కనీసం మూడు సాగుబడి చేసే ఋతువులలో వివిధ ప్రదేశాలలో అనగా ఈ సస్యం సాధారణంగా పెరిగే వాతావరణ మండలాలలో పరీక్షిస్తారు. చివరకు రైతులకు, సాగుకొరకు అందచేస్తారు.
ప్రశ్న 2.
కణజాల వర్ధనం అనే సాంకేతిక విజ్ఞానం గురించి వివరించండి. సాంప్రదాయ పద్ధతిలో మొక్కల ప్రజననం, సస్యాభివృద్ధి కార్యక్రమాల కంటే కణజాల వర్ధనం వల్ల వచ్చే లాభాలు ఏమిటి ? [A.P. & T.S. Mar. ’17, ’16, ’15 May ’14]
జవాబు:
మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకుని, దానిని ఒక పరీక్షనాళికలో సూక్ష్మజీవ రహిత పరిస్థితులలో ప్రత్యేక పోషకాహార యానకంపై ప్రవేశపెట్టి పెంచినట్లైతే దాని నుంచి సంపూర్ణ మొక్కలు ఉత్పత్తి అయ్యే ప్రక్రియను కణజాల వర్ధనము అంటారు. దీనిలోని దశలు :
1) పోషకయానకం తయారుచేయుట : వివిధ రకాల ఖనిజ లవణాలు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు మరియు కర్బన మూలము (సుక్రోస్) గల యానకంను పోషక యానకం అంటారు. వీటిని శుద్ధజలంలో కలిపి PH = 5.6 – 6.0 ఉండేటట్లు చూస్తారు. యానకానికి ఆక్సిన్లు, సైటోకైనిన్లు వంటి ఫైటో హార్మోనులు కలుపుతారు. దీనిని పరీక్ష నాళికల్లోకి తీసుకుని వాటి మూతులను దూది బిరడాలతో బిగించాలి.
2) సూక్ష్మజీవరహితం చేయుట : యానకంలో చక్కెర పదార్థాలుండుట వలన సూక్ష్మజీవులు ఆకర్షితమై, యానకం పంకిలమై చెడిపోతుంది. అందువల్ల సూక్ష్మ జీవులను నశింపచేయడం కోసం యానకాన్ని, ఆటోక్లేవ్లో 15 పౌండ్ల పీడనం, 120°C వద్ద 15ని॥లు ఉంచాలి.
3) ఎక్స్టెంట్ తయారీ : మొక్క దేహంలో ఏదైనా ఒక భాగమును తీసుకుని ద్రవరూప డిటర్జెంట్లోను, మంచి నీటితో శుద్ధి చేసి, సోడియం హైపోక్లోరైడ్తోను, శుద్ధ జలంతో శుద్ధి చేయాలి.
4) ప్రవేశపెట్టుట (అంతర్నివేశనం) : ఎక్సప్లాంట్ను వర్ధన పాత్రలో సూక్ష్మజీవరహిత పోషక యానకం మీద ప్రవేశ పెట్టడాన్ని అంతర్నివేశనం అంటారు. దీనికి పూర్తిగా అసంక్రామిక వాతావరణంలో జరుపుతారు.
5) ఇంక్యుబేషన్ : వర్ధనాలు 3-4 వారాలు ఇంక్యుబేట్ చేసిన తరువాత, ఎక్స్ప్రెంట్ కణాలు పోషక పదార్థాలను గ్రహించి పెరిగి, అనేక విభజనలు చెంది, అవయవ విభేదనం చెందిన కణాల సమూహమైన కాలసన్ను ఉత్పత్తి చేస్తాయి. వివిధ గాఢతల్లో ఉండే ఆక్సిన్లు, సైటోకైనిన్ల కలయికతో ఉన్న యానకంపై కాలస్ వర్ధనం చేసినప్పుడు వేర్లు, కాండాలు ఏర్పడతాయి. దీనిని అవయవోత్పత్తి అంటారు. కాలస్ నుండి ఏర్పడే పిండాల వంటి నిర్మాణాలను శాకీయ పిండాభాలు అంటారు. వీటి చుట్టూ సోడియం ఆర్జనేట్ను చుట్టి కృత్రిమ విత్తనాలు తయారు చేయవచ్చు.
6) వాతావరణానుకూలత చెందించి, కుండీలలోకి మార్చుట : కణజాల వర్ధన ప్రక్రియ ద్వారా రూపొందిన మొక్కలను నీటిలో శుభ్రపరచి, ఎరువులు ఉన్న కుండీలలోకి మార్చి, తాత్కాలికంగా నీడ కల్పించాలి. 1 వారం తర్వాత వాటిని పొలాలలోకి మార్చాలి.
ఉపయోగాలు :
- కణజాల వర్ధనం ద్వారా చాలా తక్కువ సమయంలో పరిమితమైన ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. దీనిని సూక్ష్మవ్యాప్తి అంటారు.
- విభాజ్యకణజాలమును వర్ధనముచేసి, వైరస్ రహిత మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు.
- కణజాల వర్థనం ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు జన్యుపరంగా తల్లి లేదా మూలాధార మొక్కలను పోలి ఉంటాయి. వీటిని సస్యప్రజననములో ఉపయోగించవచ్చు.
- శాఖీయ పిండాభాల చుట్టూ సోడియం ఆల్జినేట్ అను రసాయనమును చుట్టి కృత్రిమ లేదా సంశ్లేషిత విత్తనాలు ఉత్పత్తి చేయవచ్చు.
- కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు త్వరితంగా అభివృద్ధి చెంది, మంచి పుష్పాలు, ఫలాలు ఇస్తాయి.
- విత్తనాలు లేకపోయినను, పరాగసంపర్క సహకారులు లేనప్పటికీ, కొత్త మొక్కలు ఉత్పత్తి చేయవచ్చు. ఉదా : ఆర్కిడ్స్, నెఫంథిస్.
- పురుష వంధ్యత్వ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు.
అభ్యాసాలు
ప్రశ్న 1.
మొక్కల ప్రజననంలోని వివిధ దశల గురించి వివరించండి.
జవాబు:
జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించుటలోని దశలు.
1) వైవిధ్యశీలత సేకరణ : ప్రజనన కార్యక్రమమునకు జన్యు వైవిధ్యశీలత అనేది మూలాధారము. వివిధ వన్యరకాలను, జాతులను వాటి ద్వారా సాగుచేసే సంబంధీకులను సేకరించడం, భద్రపరచడం అనేది వృక్ష జనాభాలో ప్రకృతిపరంగా లభించే జన్యువులను చక్కగా గుర్తించి, ఉపయోగించుకోవడం ముఖ్య అవసరము. ఈ సేకరణలో ఒక నమూనా రకంలోని వివిధ రకాల యుగ్మవికల్పాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దానిని బీజపదార్థ సేకరణ అంటారు.
2) విశ్లేషణ, జనకుల ఎంపిక : బీజ పదార్థాన్ని సరియైన రీతిలో విశ్లేషించడం ద్వారా ఉపయోగకరమైన లక్షణాలు ఉన్న మొక్కలను గుర్తించవచ్చు. ఇలా ఎంపిక చేసిన మొక్కలను వృద్ధిచేసి సంకరణ ప్రక్రియలో ఉపయోగిస్తారు.
3) ఎంపిక చేసిన జనకుల మధ్య సంకర సంకరణం : వాంఛనీయ లక్షణాలు ఉన్న రెండు వేరువేరు మొక్కలను సాధారణంగా సంకరణం చేయాలి. స్త్రీ జనక మొక్కలలో విపుంసీకరణ చేసాక, పాలిథిన్ సంచి మూసి, అవాంఛనీయ పరపరాగ సంపర్కమును నిరోధిస్తారు. పురుష జనకుని నుండి బ్రష్ సహాయంతో పరాగ రేణువులను సేకరించి, స్త్రీ జనక మొక్కలో పుష్పంలోని కీలాగ్రంపై అద్ది సంకరణం జరుపుతారు.
4) వరణం, మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం : సంతతి సంకర మొక్కలలో, వాంఛనీయ లక్షణాలు కలిసి ఉన్న మొక్కలను ఎన్నుకోవడం జరుగుతుంది. సంతతి మొక్కల శాస్త్రీయ విశ్లేషణలో చాలా జాగ్రత్త అవసరం. ఈ దశ మొక్కలు రెండు జనకుల కన్నా మేలైనవిగా ఏర్పడతాయి. వీటిలో అనేక తరాలు ఆత్మ పరాగ సంపర్కం జరిపి, (సమయుగ్మజ స్థితి చేరుకునే వరకు) తద్వారా సంతాన మొక్కలలో లక్షణాల పృథక్కరణ జరగకుండా చూస్తారు.
5) పరీక్షించడం, విడుదల, కొత్త సాగురకాల వ్యాపారీకరణ : వరణం ద్వారా ఎంపిక చేసిన కొత్త క్రమాలను అధిక దిగుబడి నాణ్యత, వ్యాధి నిరోధకత మొదలైన లక్షణాల కోసం విశ్లేషిస్తారు. ఈ విశ్లేషణ వివిధ పరిశోధనా క్షేత్రాలలో సాగుచేయడం ద్వారా జరుగుతుంది. ఆదర్శమైన ఎరువు వాడకం, నీటి పారుదల వంటి నిర్వహణ పద్ధతుల ద్వారా వీటి నిర్వహణ సమర్థతను భద్రపరుస్తారు. పరిశోధనా క్షేత్రాలలో విశ్లేషణ తర్వాత, ఈ పదార్థాలను రైతుల పొలాలలో కనీసం మూడు సాగుబడి చేసే ఋతువులలో వివిధ ప్రదేశాలలో అనగా ఈ సస్యం సాధారణంగా పెరిగే వాతావరణ మండలాలలో పరీక్షిస్తారు. చివరకు రైతులకు, సాగుకొరకు అందచేస్తారు.
ప్రశ్న 2.
సూక్ష్మవ్యాప్తి ద్వారా ఉత్పత్తి చేసే మొక్కల స్థూల ప్రయోజనం ఏమిటి ?
జవాబు:
సూక్ష్మవ్యాప్తి ద్వారా ఉత్పత్తి అయ్యే మొక్కలు జన్యుపరంగా అసలైన తల్లి లేదా మూలాదార మొక్కతో పోలి ఉంటాయి. కావున వాటిని సోమాక్లోన్లు అంటారు.
ఉదా : టొమోటో, అరటి, ఆపిల్, టేకు, యూకలిప్టస్, వెదురు వంటి ఆర్థిక ప్రాముఖ్యత కల మొక్కలు ఉత్పత్తి చేసారు.
ప్రశ్న 3.
పరస్థానిక వర్థనంలో invitro ఒక ఎక్స్టెంట్ వ్యాప్తి కోసం ఉపయోగించే యానకంలోని వివిధ అనుఘటకాలు ఏమిటో తెలపండి.
జవాబు:
కర్బన యోగికాల అయిన సుక్రోస్, గ్లూకోస్, అసేంద్రియ లవణాలు విటమిన్లు, అమైనో ఆమ్లాలు, నీరు, అగార్ – అగార్ మరియు పెరుగుదల హార్మోనులు అయిన ఆక్సిన్లు, సైటోకైనిన్లు ఉంటాయి.
ప్రశ్న 4.
భారతదేశంలో అభివృద్ధి పరచిన ఏవైన ఐదు సంకర సస్య మొక్కల రకాలను పేర్కొనండి.
జవాబు:
- గోధుమ – సోనాలికా, కళ్యాణ్ సోనా
- వరి – జయ, రత్న
- కాలీఫ్లవర్ – పూసా శుభ్ర, పూసా స్నోబాల్ K-1
- బొబ్బర్లు – పూసా కోమల్
- ఆవాలు – పూసాస్వర్నిమ్
ప్రశ్న 5.
“వాంఛనీయమైనలక్షణం” అనే పదం వివిధ మొక్కలలో వివిధ రకాలుగా అర్థాన్ని సూచిస్తుంది. ఈ వాక్యాన్ని సరైన ఉదాహరణలతో సమర్ధించండి.
జవాబు:
వివిధ రకాల మొక్కలు వివిధ రకాలుగా వాంఛనీయ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఉదా :
- హిమగిరి గోధుమ రకం పత్ర, చార కుంకుమ తెగులుకు నిరోధకత చూపుతుంది.
- పూసాస్వర్ణిం – బ్రాసికా – తెల్లటి కుంకుమ తెగులుకు నిరోధకత చూపుతుంది.
- శైవలం (స్పైరులినా) కాండిడా (ఈస్ట్), మిథైలోఫిలస్ (బాక్టీరియాలు) సూక్ష్మ జీవులు ఇవి ముఖ్యంగా ఏకకణ ప్రోటీనుల ఉత్పత్తిలో పాల్గొంటాయి.
- చెరకు శఖారమ్ బార్ బెర్రి, శఖారమ్ అఫిసినారమ్ ల మధ్య సంకరణం చేసి అధిక దిగుబడి, ఎక్కువ చక్కెర వంటి వాంఛనీయ లక్షణాలున్న రకాన్ని ఉత్పత్తి చేస్తారు.
- బీటా కెరోటిన్ కల వరిరకాన్ని (బంగారు వరి) ఉత్పత్తి చేస్తారు.
ప్రశ్న 6.
వృక్ష కణజాల వర్ధన ప్రయోగాల ద్వారా సాధించిన ఎక్కువ ప్రగతికి మరియు నిర్వభేదనాలు (dedifferentiation) మధ్య ఏదైనా సంబంధం ఉందా ?
జవాబు:
కణజాల వర్ధన ప్రయోగాలలో విభేదనం చెందని కణాల సమూహము ఏర్పడుతుంది. దానిని కాలస్ అంటారు. దీనిపై ఆక్సిన్లు, సైటోకైనిన్లు చల్లిన పునర్విభేదనం చెంది నారు మొక్కలు ఏర్పడతాయి. దీనిని బట్టి కణజాల వర్ధనంలో సాధించిన ప్రగతికి నిర్విభేదనానికి సంబంధం ఉందని చెప్పవచ్చు.
ప్రశ్న 9.
ఏ మొక్కలోనిదైనా ఒక కణం నాకు ఇవ్వండి. నేను మీకు అనే రకానికి చెందిన కొన్ని వేల మొక్కలను ఇవ్వగలను ? ఇది కేవలం ఒక దీక్షావాక్యమా లేక ఇది విజ్ఞాన శాస్త్ర పరంగా సాధ్యమా ? మీ ఉద్దేశాలను రాస్తూ వాటిని సమర్ధించింది.
జవాబు:
ఇవి విజ్ఞానశాస్త్ర పరంగా సాధ్యమే. కణజాల వర్ధన ప్రయోగాల ద్వారా మొక్క దేహంలోని ఏదైనా భాగము నుండి కణమును లేదా కణజాలమును తీసుకుని, అనేక మొక్కలు, తక్కువ సమయంలో తక్కువ స్థలంలో ఉత్పత్తి చేయవచ్చు. దీనిని సూక్ష్మ వ్యాప్తి అంటారు. మొక్క దేహంలోని ప్రతికణానికి కొత్త మొక్కగా ఎదగగల శక్తి ఉండుట దీనికి కారణము.
ప్రశ్న 10.
జీవ పదార్థక కలయిక ప్రయోగంలో, ఒక కణం భౌతిక అవరోదాలు ఏమిటి ? ఈ అవరోధాలను ఏవిధంగా జయించవచ్చు ?
జవాబు:
జీవ పదార్థక కలయిక ప్రయోగంలో కణకవచము అవరోధంగా ఉంటుంది. దీనిని అధిగమించుటకు కణకవచము కరిగించే సెల్యులేజస్, పెక్చినేజర్లను వాడి జీవ పదార్థాలను వేరు చేయవచ్చు.