AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Botany Study Material 2nd Lesson ఖనిజ పోషణ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Botany Study Material 2nd Lesson ఖనిజ పోషణ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైడ్రోపోనిక్స్న నిర్వచించండి.
జవాబు:
మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని హైడ్రోపోనిక్స్ అంటారు.

ప్రశ్న 2.
ఒక ఆవశ్యక మూలకాన్ని సూక్ష్మ లేదా స్థూల పోషకంగా ఎలా వర్గీకరించగలవు ? [Mar. ’14]
జవాబు:
మొక్క పెరుగుదల, జీవక్రియలకు ఎక్కువ పరిమాణంలో (10 m మోల్ / kg-1 పొడి బరువు) కావలసిన మూలకాన్ని స్థూల మూలకమని, తక్కువ పరిమాణంలో (10 m మోల్ / kg -1 పొడి బరువు) కావలసిన మూలకాన్ని సూక్ష్మ మూలకమని చెప్పవచ్చు.

AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ

ప్రశ్న 3.
ఎన్జైమ్లకు ఉత్తేజితాలుగా పనిచేసే ఆవశ్యక మూలకాల్లో రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు:
(MO) మాలిబ్దినం, మెగ్నీషియం (Mg2+), జింక్ (Zn2+).

ప్రశ్న 4.
కాంతి జలవిచ్ఛేదనంలో ముఖ్యపాత్ర వహించే ఆవశ్యక ఖనిజ మూలకాలను తెలపండి.
జవాబు:
కాల్షియం (Ca2+) మరియు మాంగనీసు (Mn)2+.

ప్రశ్న 5.
17 ఆవశ్యక మూలకాల్లో ఖనిజాలు కాని ఆవశ్యక మూలకాలు ఏవి ?
జవాబు:
కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్.

ప్రశ్న 6.
సల్ఫర్ కలిగిన రెండు అమైనో ఆమ్లాల పేర్లను తెలపండి.
జవాబు:
సిస్టిన్, మిథియోనైన్.

ప్రశ్న 7.
ఎప్పుడు ఒక ఆవశ్యక మూలకం లోపించిందని చెప్పగలవు ?
జవాబు:
ఆవశ్యక మూలకం గాఢత తక్కువైనపుడు మొక్క పెరుగుదల ఆగిపోయినట్లయితే, ఆ గాఢతను సందిగ్ధ గాఢత అంటారు. మూలకం ఈ గాఢత కంటే తక్కువైనపుడు మొక్కకు ఆ మూలకం లోపించినట్లు చెప్పవచ్చు.

ప్రశ్న 8.
లేత పత్రాల్లో లోప లక్షణాలను ముందుగా చూపే రెండు మూలకాల పేర్లను తెల్పండి.
జవాబు:
సల్ఫర్, కాల్షియమ్.

ప్రశ్న 9.
లెగ్యూమ్ మొక్కల వేర్లలో ఉండే పింక్ వర్ణపు వర్ణద్రవ్యం పాత్రను వివరించండి. దానినేమంటారు ? [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
పింక్ వర్ణ ద్రవ్యం అయిన లెగ్-హిమోగ్లోబిన్, నైట్రోజినేజ్ ఎన్జైమ్ చుట్టుప్రక్కల నుండి ఆక్సిజన్ను తొలగిస్తుంది. దీనిని ఆక్సిజన్ సమ్మార్జకము అంటారు.

ప్రశ్న 10.
ఏ ఖనిజ లవణాన్ని 17వ ఆవశ్యక లవణంగా గుర్తించారు ? దాని లోపం వల్ల కలిగే వ్యాధిని తెలపండి.
జవాబు:
నికెల్. దీని లోపం వల్ల పెకాన్లో మౌస్ ఇయర్ (Mouse ear) వ్యాధి కలుగుతుంది.

AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ

ప్రశ్న 11.
నైట్రోజినేజ్ ఎన్ఎమ్లో గల ఆవశ్యక మూలకాల పేర్లను తెలపండి. అవి ఏ రకపు ఆవశ్యక మూలకాలు ?
జవాబు:
నైట్రోజినేజ్ ఎన్జైమ్
MO, Fe అను సూక్ష్మ మూలకాలు గలవు.

ప్రశ్న 12.
నత్రజని స్థాపన సమతుల్య సమీకరణాన్ని వ్రాయండి. [T.S. Mar. ’16]
జవాబు:
N2 + 8H+ + 8e + 16 ATP → 2 NH3 + H2 + 16 ADP + 16 Pi

ప్రశ్న 13.
ఏవైనా రెండు ఆవశ్యక మూలకాల పేర్లను, వాటి లోపం వల్ల కలిగే వ్యాధులను తెలపండి.
జవాబు:
వ్యాధి — మూలకము
1) నిర్హరితము — N, K, Mg, S, Fe, Mn, Zn, MO
2) కణజాల క్షయము — Ca, Mg, Cu, K.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వేరు బుడిపెలు ఏర్పడే విధానంలోని వివిధ దశలను వివరించండి. [A.P. Mar. ’17; T.S. Mar. ’16]
జవాబు:
1) ఆతిథేయి లెగ్యూమ్ వేర్ల నుంచి విడుదలైన అమైనో ఆమ్లాలు, చక్కెరలచే రైజోబియమ్ ఆకర్షించబడి, సంఖ్యాపరంగా అభివృద్ధి చెంది, వేరు బాహ్యచర్మ కణాలు, మూలకేశ కణాలు చుట్టూ అతుక్కొని స్థిరపడతాయి.

2) మూలకేశాలు వంకర తిరుగుతాయి. వాటిలోకి బాక్టీరియమ్లు చేరతాయి.

3) ఒక సంక్రమణ పోగు ఏర్పడి, బాక్టీరియమున్ను వేరు వల్కలం వరకు తీసుకుపోతుంది.

4) బాక్టీరియమ్ వేరు వల్కలంలో బుడిపె ఏర్పడటాన్ని ప్రారంభిస్తుంది. బాక్టీరియమ్లు పోగు నుంచి ఆతిథేయి వల్కల . కణాల్లోకి విడుదలై ఆతిథేయి కణాలు విభజన చెందేటట్లు ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ప్రత్యేక నత్రజని స్థాపక కణాలు ఏర్పడతాయి.

5) బుడిపెలు పోషకాల పరస్పర మార్పిడి కొరకు ఆతిథేయి నాళికా పుంజాలలో నేరుగా సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి.
AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ 1

(a) రైజోబియం బాక్టీరియమ్లు సంక్రమణ మూలకేశాన్ని తాకుట

(b) సంక్రమణ వల్ల మూలకేశం వంకర తిరగడం

(c) సంక్రమణ పోగు బాక్టీరియమ్లను లోపలి వల్కలంకు గొనిపోవుట, బాక్టీరియమ్లు దండాకార బాక్టీరాయిడ్లుగా మార్పు చెంది లోపలి వల్కలం, పరిచక్ర కణాలు విభజన చెందేటట్లు చేయటం. వల్కల, పరిచక్ర కణాల విభజన, పెరుగుదల బుడిపె ఏర్పడటానికి దారి తీస్తుంది.

(d) వేరు నాళికా కణజాలాలతో సంబంధం ఏర్పరచుకొని బుడిపై పక్వానికి వస్తుంది.

ప్రశ్న 2.
మొక్కలు ఏ విధంగా అమైనో ఆమ్లాల సంశ్లేషణ జరుపుతాయో క్లుప్తంగా రాయండి. [T.S. Mar. ’17; A.P. Mar. ’16]
జవాబు:
అమైనో ఆమ్లాల సంశ్లేషణ 2 ప్రధాన మార్గాల ద్వారా జరుగుతుంది.
1) క్షయీకరణ అమైనేషన్ : ఈ చర్యల్లో అమ్మోనియా, α – కీటో గ్లుటారిక్ ఆమ్లంతో చర్యనొంది గ్లూటమిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది.
α – కీటో గ్లుటారిక్ ఆమ్లము + NH2+ + NADPH → గ్లూటమిక్ ఆమ్లము + H2O + NADP

2) ట్రాన్స్ అమైనేషన్ : అమైనో ఆమ్లం నుంచి అమైనో సముదాయము కీటో ఆమ్లం యొక్క కీటో సముదాయానికి మారుతుంది. గ్లూటమిక్ ఆమ్లము అనే ప్రధాన అమైనో ఆమ్లం నుంచి NH2 బదిలీ జరిగి, ట్రాన్స్ మైనేషన్ చర్య ద్వారా ట్రాన్స్ అమైనేజ్ ఎన్ఎమ్ సమక్షంలో ఇతర అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి.
AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ 2

AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ

ప్రశ్న 3.
మొక్కలు ఆవశ్యక మూలకాలను ఏ విధంగా శోషిస్తాయో క్లుప్తంగా రాయండి.
జవాబు:
ఆవశ్యక మూలకాల శోషణ విధానాలు 2 దశలలో జరుగుతుంది. మొదటి దశలో అయానులు వేగవంతంగా ‘స్వేచ్ఛా ప్రదేశం’ లేదా ‘కణాల బాహ్య ప్రదేశం’ (అపోప్లాస్ట్) లోకి శోషించబడతాయి. ఇది నిష్క్రియా పద్ధతి. రెండవ దశలో అయాన్లు నెమ్మదిగా ‘అంతర ప్రదేశం’ (సింప్లాస్ట్) కణాలలోకి శోషించబడతాయి. అయాన్ల నిష్క్రియా చలనము కణం నుంచి అపోప్లాస్ట్ లోనికి గాఢత ప్రవణత వెంట, అయాన్ చానల్స్ ద్వారా జరుగుతుంది. కణత్వచ ప్రోటీన్లు ఎన్నుకొన్న రంధ్రాలుగా పనిచేస్తాయి. సింప్లాస్ట్ నుంచి గాఢత ప్రవణతకు వ్యతిరేకంగా అయాన్లు వచ్చుటకు లేదా లోపలికి ప్రవేశించుటకు జీవక్రియాశక్తి అవసరం. కావున ఇది సక్రియా పద్ధతి.

ప్రశ్న 4.
నత్రజని వలయాన్ని సోదాహరణంగా వివరించండి.
జవాబు:
చక్రీయముగా వాతావరణములోని నత్రజని మృత్తికను చేరటం, మృత్తిక నుంచి తిరిగి మొక్కలు, జంతువులు సూక్ష్మజీవుల ద్వారా వాతావరణానికి చేరటాన్ని నత్రజని వలయం అందురు. నత్రజని వలయములో అయిదు దశలుంటాయి. అవి :

  1. నత్రజని స్థాపన (జీవరహిత స్థాపన, జీవస్థాపన)
  2. నత్రజని స్వాంగీకరణ
  3. అమ్మోనిఫికేషన్
  4. నత్రీకరణ
  5. వినత్రీకరణ

1. నత్రజని స్థాపన : వాతావరణంలోని ద్వినత్రజని జీవ వ్యవస్థలోనికి ప్రవేశపెట్టబడటాన్ని నత్రజని స్థాపన అందురు. ఇది రెండు పద్ధతులలో జరుగుతుంది.
A. జీవరహిత పద్ధతి
B. జీవ పద్ధతి (డై అజోట్రాఫీ)

A. జీవరహిత పద్ధతి లేక భౌతిక నత్రజని స్థాపన : ఇది భౌతిక రసాయనిక స్థాపన రకము. మెరుపులతో కూడిన వానలు కురిసినపుడు, నత్రజని వాతావరణంలోని ఆక్సిజన్తో కలిసి నైట్రిక్ ఆక్సైడ్గా మారును. నైట్రిక్ ఆక్సైడ్ ఆక్సీకరణము చెంది నైట్రోజన్ పెరాక్సైడ్గా, ఇది వర్షపు నీటితో కలిసి నైట్రస్ మరియు నైట్రిక్ ఆమ్లములుగా మారి మృత్తికను చేరును. ఈ ఆమ్లములు మృత్తికలోని క్షారములతో కలిసి నైట్రేట్లను ఏర్పరచును. ఈ ద్రావణీయ నైట్రేట్లు ప్రత్యక్షముగా మొక్కలచే గ్రహింపబడును. నత్రజని స్థాపన క్లుప్తముగా ఈ క్రింది విధముగా ఉంటుంది.

  1. N2 + O2 → 2 NO
  2. 2 NO + O2 → 2 NO2
  3. 2 NO2 + H2O → HNO2 HNO3
  4. HNO3 + Ca/K లవణాలు → Ca/K నైట్రేట్లు

హేబర్ – బాష్ పద్ధతి : జీవరహిత నత్రజని స్థాపన పారిశ్రామికంగా 450°C, 1000 బార్ల పీడనం వద్ద జరుపవచ్చు.

B. జీవపద్ధతి లేక డై అజోట్రాఫీ: కేంద్రకపూర్వ జీవుల ద్వారా ద్వినత్రజని NH3 లేదా NH4+ గా మార్పు చెందడాన్నే జీవ నత్రజని స్థాపన (డై అజోట్రాఫీ) అందురు. అటువంటి సూక్ష్మజీవులను నత్రజని స్థాపకాలు లేక డైఅజోట్రాప్స్ అంటారు.
ఉదా : స్వేచ్ఛా జీవన బాక్టీరియమ్లు – అజటో బాక్టర్, క్లాస్ట్రీడియమ్
సహజీవన బాక్టీరియమ్లు – ఫాబేసి మొక్కల వేరు బొడిపెలలో నివసించే సహజీవన బాక్టీరియమ్, రైజోబియమ్.
నీలి ఆకుపచ్చ శైవలాలు – నాస్టాక్, అనబీనా.

2) నత్రజని స్వాంగీకరణ : ఇది నత్రజని వలయములో రెండవ దశ. నైట్రేట్, అమ్మోనియాలు శోషించబడి, నత్రజని మిగతా మూలకాలతో రసాయనిక బంధనం చెంది కర్బన నత్రజని ఉత్పత్తి చేయబడే పద్ధతిని నత్రజని స్వాంగీకరణ అందురు. ఈ దశలో మొదటి దశలో ఏర్పడిన నైట్రేట్లు, అమ్మోనియాను మొక్కలు శోషించి వాటిని మొక్కల దేహ భాగములో వినియోగించుకొంటాయి. మొక్కలను జంతువులు తినినట్లైన, ఈ కర్బన నత్రజని జంతువుల దేహభాగంలోనికి చేరుతుంది.

3) అమ్మోనిఫికేషన్ : ఇది నత్రజని వలయములో మూడవదశ. పూతికాహార బాక్టీరియములు, శిలీంధ్రాలు, జంతు, వృక్ష సంబంధమైన మృత కళేబరములలోని కర్బన నత్రజని సమ్మేళనములను అమ్మోనియాగా మార్చుటను అమ్మోనిఫికేషన్ అందురు. ఈ చర్యలో పాల్గొనే బాక్టీరియమ్లను అమ్మోనిఫైయింగ్ బాక్టీరియములు అందురు. ఇది ఒక ఖనిజీకరణ చర్య.
ఉదా : బాసిల్లస్ రెమోసస్, బా. వల్గారిస్. బా. మైకాయిడిస్.

4) నత్రీకరణ : నత్రజని వలయములో ఇది నాల్గవ దశ. అమ్మోనియా మొదట నైట్రైట్లుగాను, తరువాత నైట్రేట్లుగా మారుటను నత్రీకరణ అందురు. ఈ బాక్టీరియాలను నత్రీకరణ బాక్టీరియమ్లు అందురు. ఇది రెండు దశలలో జరుగుతుంది.

ఎ) మొదటి దశలో నైట్రెసోమోనాస్, నైట్రోకోకస్ వంటి బాక్టీరియమ్లు అమ్మోనియాను నైట్రైట్లుగా మారుస్తాయి.
2NH3 + 3O2 → NO2– + 2H2O + 2H+

బి) రెండవ దశలో నైట్రోబాక్టర్ వంటి బాక్టీరియమ్లు నైట్రైట్లను తిరిగి నైట్రైట్లుగా ఆక్సీకరణ చేస్తాయి.
2 NO2 + O2 → 2NO3

5) వినత్రీకరణ : ఇది నత్రజని వలయములో చివరి దశ. నైట్రేట్లు’ ద్వి అణు నత్రజనిగా మారి వాతావరణమును చేరుటను వినత్రీకరణ అందురు. ఈ బాక్టీరియమ్లను వినత్రీకరణ బాక్టీరియమ్లు అందురు. వినత్రీకరణ నాలుగు దశలలో జరుగును.
(NO3 → NO2– → NO → N2)
ఈ చర్యలో వినత్రీకరణ బాక్టీరియమైన థయోబాసిల్లస్ డీనైట్రిఫికెన్స్, సూడోమోనాస్ డీనైట్రిఫికెన్స్, మైక్రోకోకస్ డీనైట్రిఫికెన్స్ పాల్గొంటాయి.
AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ 3

AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ

అభ్యాసాలు

ప్రశ్న 1.
హైడ్రోపోనిక్స్న ఎవరు ప్రారంభించారు ?
జవాబు:
జూలియస్ వాన్ సాక్స్.

ప్రశ్న 2.
ఆవశ్యక మూలకాలన్నీ మొక్కలకు అవసరమా ? వివరించండి.
జవాబు:
మొక్కల పెరుగుదల అభివృద్ధికి 17 రకాల అవశ్యక మూలకాలు అవసరము. అవి : స్థూల మరియు సూక్ష్మ మూలకాలు.

ప్రశ్న 3.
CO2 స్థాపనకు అవసరమైన ఎన్జైమ్ ప్రేరేపణకు అవసరమగు మూలకాన్ని తెలపండి.
జవాబు:
Mg2+ (Magnesium)

ప్రశ్న 4.
కణాల్లో ద్రవాభిసరణ సమతుల్యాన్ని కాపాడే ఒక కాటయాన్, ఒక ఆనయాన్ు తెలపండి.
జవాబు:
K+, Cl

ప్రశ్న 5.
సమ విభజన కండెను ఏర్పరచుటకు అవసరమగు మూలకాన్ని తెలపండి.
జవాబు:
కాల్షియమ్.

ప్రశ్న 6.
మొక్క జీవనంలో సల్ఫర్ పాత్ర ఏమిటి ?
జవాబు:
సల్ఫర్, సిస్టీన్, మిథియోనైన్ అను అమైనో ఆమ్లాలలోను, అనేక సహ ఎన్జైమ్లు, విటమిన్లు (థయమిన్, బయోటిన్) కెర్రిడాక్సిన్లలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. దీనివల్ల డై సల్ఫైడ్ బ్రిడ్జిలు ప్రోటీను నిర్మాణాత్మక స్థిరత్వానికి తోడ్పడతాయి.

ప్రశ్న 7.
ఏ సూక్ష్మ మూలకం మిగతా సూక్ష్మ మూలకాల కంటే ఎక్కువ మోతాదులో అవసరం ?
జవాబు:
ఐరన్.

ప్రశ్న 8.
కిరణజన్య సంయోగక్రియ ముఖ్య వర్ణద్రవ్య సంశ్లేషణ కొరకు అవసరమై, దాని నిర్మాణంలో అనుఘటకంగా లేని మూలకం ఏది ?
జవాబు:
ఐరన్

ప్రశ్న 9.
ఆనయాన్ రూపంలో శోషించబడే, కాంతి జల విచ్ఛేదనంకు అవసరమగు మూలకం ఏది ?
జవాబు:
క్లోరిన్ (Cl)

ప్రశ్న 10.
17వ ఆవశ్యక మూలకంచే ప్రేరేపించబడే ఎన్ఎమ్ ఏది ?
జవాబు:
యూరియేజ్ (Urease)

AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ

ప్రశ్న 11.
ఎప్పుడు మూలకాన్ని విషపూరితంగా భావిస్తారు ?
జవాబు:
కణజాలాల్లో ఏదైనా మూలకం గాఢత పొడి బరువుకు 10 శాతం తగ్గించినట్లయితే అది విషపూరితం.

ప్రశ్న 12.
ఏ మూలకాన్ని ఎక్కువ మోతాదులో అందించినపుడు నిర్హరిత ఈనెలచే ఆవరించబడిన గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి ?
జవాబు:
Mn (మాంగనీసు)

ప్రశ్న 13.
వాయురహిత, స్వేచ్ఛగా నివసించే కాంతి పరపోషిత నత్రజని స్థాపన బాక్టీరియమ్ పేరు తెలపండి.
జవాబు:
రోడోస్పైరిల్లమ్.

ప్రశ్న 14.
అల్నస్ ఏ సూక్ష్మజీవులు నత్రజని స్థాపన జరిపే బుడిపెలను ఏర్పరుస్తాయి ?
జవాబు:
ఫ్రాంకియా (Frankia)

ప్రశ్న 15.
వేరుశెనగ మొక్కల వేరు బుడిపెలను అడ్డుకోతలో సూక్ష్మదర్శిని సాయంతో పరిశీలించినపుడు అవి పింక్ రంగులో కనిపిస్తాయి. ఎందుకు ?
జవాబు:
వేరు బుడిపెలలో పింక్ వర్ణద్రవ్యం అయిన లెగ్ – హీమోగ్లోబిన్ ఉంటుంది.

ప్రశ్న 16.
వేరు బుడిపెలలో వల్కల కణాలేగాక మరి ఏ ఇతర కణాల విభజనను వేరులోని బాక్టీరియాయిడ్లు ప్రేరేపిస్తాయి ?
జవాబు:
వల్కలం లోపలి కణాలు, పరిచక్ర కణాలు.

ప్రశ్న 17.
జీవ పద్ధతిలో వాతావరణ అణు నత్రజని స్థాపనకు అవసరమైన ఎలక్ట్రాన్ల, ప్రోటాన్ల నిష్పత్తి ఎంత ?
జవాబు:
8 M+ + 8e = 1 : 1

ప్రశ్న 18.
లెగ్యూమ్ వేరు బుడిపె సాంగత్యంలో ఆక్సిజన్ సమ్మారకముగా ఏది పనిచేస్తుంది ?
జవాబు:
లెగ్ – హీమోగ్లోబిన్

AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ

ప్రశ్న 19.
ఏ విధంగా ఆస్పర్జిన్, ఆస్పర్టిక్ ఆమ్లంను విభేదిస్తుంది ?
జవాబు:
ఆస్పర్జిన్ ఒక అమైడ్. ఇది ఆస్పర్టిక్ ఆమ్లం కన్నా ఎక్కువ నత్రజని కలిగి ఉంటుంది.

ప్రశ్న 20.
మొక్క దేహంలో అమైనో ఆమ్లాలు ఏ కణజాలం ద్వారా రవాణా చెందుతాయి ?
జవాబు:
దారునాళాలు

 

ప్రశ్న 21.
పిచ్చర్ మొక్క వీనస్ ఫ్లెట్రాప్ లాంటి మొక్కలు ప్రత్యేక పోషణ విధానాన్ని కలిగి ఉంటాయి. అవి ఏ మూలకం కొరకు, దాని లభ్యత కొరకు అటువంటి అనుకూలనాలను చూపుతాయి ?
జవాబు:
నైట్రోజన్.

ప్రశ్న 22.
మృత్తికలో Mn ఎక్కువగా ఉన్నప్పుడు Ca, Mg, Fe ల లోపానికి దారితీస్తుంది. వివరించండి.
జవాబు:
మాంగనీసు మూలకము ఐరన్, మెగ్నీషియమ్ మూలకాలతో శోషణలో పోటీపడుతుంది. మెగ్నీషియమ్ ఎన్ఎమ్లతో కలియునప్పుడు పోటీపడుతుంది. కాండాగ్రంలో కాల్షియమ్ స్థానచలనాన్ని మాంగనీసు నిరోదిస్తుంది. కావున అధిక మాంగనీసు మూలకము Ca, Mg, Fe ల లోపానికి దారితీస్తుంది.

ప్రశ్న 23.
మొక్కలకు అవసరమయిన ఆవశ్యక మూలకాలను ఏది నిలువ ఉంచుతుంది ? అది ఎలా ఏర్పడుతుంది.
జవాబు:
మొక్కలకు అవసరమయిన ఆవశ్యక మూలకాలను మృత్తిక నిలువ ఉంచుతుంది. మృత్తిక, మాతృకల నుండి శైథిల్యము అను ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది.

AP Inter 2nd Year Botany Study Material Chapter 2 ఖనిజ పోషణ

ప్రశ్న 24.
నత్రజని స్థాపనను కేంద్రక పూర్వ జీవులే చూపిస్తాయి. నిజ కేంద్రక జీవులెందుకు చూపవు ?
జవాబు:
నత్రజని స్థాపనకు అవసరమయిన నైట్రోజినేజ్ ఎన్ఎమ్ (Mo-Fe ప్రొటీను) కేంద్రక పూర్వజీవులలో మాత్రమే ఉంటుంది. నిజ కేంద్రక జీవులలో ఉండదు.