Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Botany Study Material 3rd Lesson ఎన్జైమ్లు Textbook Questions and Answers.
AP Inter 2nd Year Botany Study Material 3rd Lesson ఎన్జైమ్లు
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ప్రొస్థటిక్ సముదాయాలు, సహకారకాలతో ఏ విధంగా తేడాలను చూపిస్తాయి ?
జవాబు:
అపోఎన్జైము దృఢంగా అంటిపెట్టుకుని ఉండే కర్బన సహకారకమును ప్రాస్థటిక్ సముదాయము అంటారు. సంపూర్ణ ఎన్ఎమ్లోని ప్రొటీనేతర భాగమును సహకారకం అంటారు.
ప్రశ్న 2.
ఫీడ్బుక్ నిరోధకత అంటే ఏమిటి ?
జవాబు:
వరసగా గొలుసులాగా జరిగే ఎన్జైమ్ ఉత్ప్రేరిత చర్యల అంత్య ఉత్పన్నం జీవక్రియలోని హోమియోస్టాటిక్ నియంత్రణలో భాగంగా మొదటి చర్యలోని ఎన్జైమ్ను నిరోధిస్తుంది.
ప్రశ్న 3.
ఆక్సిడోరిడక్టేజ్లకు ఆ విధంగా ఎందుకు పేరు పెట్టారు ?
జవాబు:
రెండు అధస్థ పదార్థాల మధ్య జరిగే ఆక్సీకరణ, క్షయకరణ ఉత్ప్రేరిత చర్యలలో పాల్గోనే ఎన్జైమ్లు కావున వాటిని ఆక్సిడోరిడక్టేజ్లు అని పిలుస్తారు.
మాలేట్ డీహైడ్రోజినేజ్
ఉదా :
ప్రశ్న 4.
అపోఎమ్, సహకారకం మధ్య విభేదాన్ని తెలపండి. [Mar. ’14]
జవాబు:
ఎన్ఎమ్ లోని ప్రొటీను భాగాన్ని అపోఎన్జైమ్ అంటారు. సంపూర్ణ ఎన్జైమ్లోని ప్రొటీనేతర భాగమును సహకారకం అంటారు.
ప్రశ్న 5.
పోటీపడే ఎన్జైమ్ నిరోధకాలు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి. [May ’14]
జవాబు:
నిరోధకము తన అణునిర్మాణంలో అధస్థ పదార్థాన్ని దగ్గరగా పోలి ఉండి, ఎన్జైమ్ క్రియాశీలతను నిరోధిస్తే దానిని పోటీ పడే నిరోధకము అంటారు. ఉదా: నిర్మాణంలో సక్సినేట్ అధస్థ పదార్థాన్ని దగ్గరగా పోలి ఉన్న మెలోనేట్ వల్ల జరిగే సక్సీనిక్ డీహైడ్రోజినేజ్ చర్యా నిరోధకత.
ప్రశ్న 6.
పోటీపడని ఎన్ఎమ్ నిరోధకాలు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నిరోధకం అధస్థ పదార్థంతో నిర్మాణాత్మకపోలికను కలిగి ఉండదు. ఇది క్రియాశీల స్థానం దగ్గర కాకుండా వేరొక స్థానం వద్ద ఎన్జైమ్ నిరోధక సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. అందువల్ల ఎన్జైమ్ గోళాభ నిర్మాణం పొందుతుంది. ఫలితంగా ఉత్ప్రేరణం జరగదు.
ఉదా : కాపర్, మెర్క్యురి, సిల్వర్ వంటి లోహ అయానులు
ప్రశ్న 7.
ఎన్ఎమ్ సంకేతంలోని నాలుగు అంకెలు వేటిని సూచిస్తాయి ?
జవాబు:
ఎన్ఎమ్ సంకేతంలోని మొదటి అంకె ఎన్జైమ్ విభాగమును, రెండవ సంఖ్య ఉపవిభాగాన్ని, మూడవ సంఖ్య ఉప విభాగాన్ని, నాల్గవ సంఖ్య ఎన్జైమ్ వరుస సంఖ్యను సూచిస్తాయి.
ప్రశ్న 8.
తాళం కప్ప, తాళం చెవి పరికల్పనను, ఇండ్యూస్డ్-ఫిట్ సిద్ధాంతాలను ఎవరు ప్రతిపాదించారు.
జవాబు:
తాళం కప్ప
తాళం చెవి పరికల్పన – ఇమిలి ఫిషర్ 1884.
ఇండ్యూస్డ్-ఫిట్ సిద్ధాంతము – డానియల్.ఇ.కోషాండ్ (1973).
ప్రశ్న 9.
మైఖేలిస్ స్థిరాంకమును నిర్వచింపుము.
జవాబు:
గరిష్ఠ చర్యావేగం సగము జరగటానికి కావలసిన అధస్థ పదార్థ గాఢతను మైఖేలిస్ స్థిరాంకము అంటారు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఎన్ఎమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
ఎన్ఎమ్ నిరోధకాలు 3 రకాలు
a) పోటీపడే నిరోధకము : నిరోధకము అధస్థపదార్థాన్ని పోలిఉండి ఎన్ఎమ్ యొక్క క్రీయాశీల ప్రదేశాల కొరకు పోటీపడుతుంది. ఫలితంగా ఎన్ఎమ్ క్రియాశీలతను నిరోధిస్తుంది. ఉదా: నిర్మాణంలో సక్సినేట్ అధస్థ పదార్థాన్ని దగ్గరగా పోలిఉన్న మెలోనేట్వల్ల జరిగే సక్సీనిక్ డీహైడ్రోజినేజ్ చర్యా నిరోధకత.
b) పోటీపడని నిరోధకాలు : నిరోధకం అధస్థ పదార్థంతో నిర్మాణాత్మక పోలిక కలిగి ఉండదు. ఇది క్రియాశీలస్థానం వద్ద కాకుండా, వేరొక స్థానం వద్ద బంధితమై ఎన్జైము క్రియారహితం చేస్తాయి. అందువల్ల అంత్య ఉత్పన్నాలు ఏర్పడవు.. ఉదా : కాపర్, మెర్క్యురి, సిల్వర్ వంటి లోహ అయానులు.
c) ఫీడ్బాక్ నిరోదకాలు : గొలుసులాగా జరిగే ఎన్జైమ్ ఉత్ప్రేరిత చర్య వల్ల అంత్య ఉత్పన్నం జీవక్రియలోని హోమియో స్థాటిక్ నియంత్రణలో భాగంగా మొదటి చర్యలోని ఎన్జైమ్ను నిరోధిస్తుంది.
ఉదా : G 6 P అధికంగా ఏర్పడినచో ఇది హెక్సోకైనేజ్ను నిరోధిస్తుంది.
ప్రశ్న 2.
వివిధ రకాల సహకారకాలను వివరించండి. [A.P. Mar. ’12, ’16’]
జవాబు:
సహకారకాలు 2 రకాలు అవి :
1) లోహ అయానులు : అపోఎన్ఎమ్తో గట్టిగా బంధించబడి ఉన్న లోహ అయానులు. ఇవి క్రియాశీలస్థానాల వద్ద పక్క శృంఖాలతో సమన్వయ బంధాలను ఏర్పరచడంతో పాటు, అదే సమయంలో అధిస్థ పదార్థంను ఒకటి లేక ఎక్కువ సమన్వయ బంధాలను ఏర్పరుస్తాయి. ఉదా : కార్బాక్సిపెప్టిడేజ్కి జింక్ ఒక సహకారకం, Cu+2 సైటోక్రోం ఆక్సిడేజ్.
2) సేంద్రియ సహకారకాలు : ఇవి 2రకాలు
a) సహఎన్ఎమ్లు : అసోఎన్ఎమ్క తాత్కాలికంగా బంధించబడి ఉన్న కర్బన పదార్థాలు ఉదా : NAD, NADP లలో నియాసిన్ ఉంటుంది.
b) ప్రాస్థిటిక్ సముదాయము : అపోఎన్జైమ్కు గట్టిగా బంధించబడి ఉన్న కర్బన పదార్థాలు పెరాక్సిడేజ్లో హీమ్ సముదాయము.
ప్రశ్న 3.
ఎన్ఎమ్ల చర్యాయాంత్రికాన్ని వివరించండి.
జవాబు:
అధిస్థ పదార్థము ‘S’ ఎన్జైమ్లో [E] నొక్కులా ఉండే క్రియాశీల ప్రదేశాలలో బంధితమై ES సంక్లిష్టం ఏర్పడుతుంది. దీనిని క్రమ పరివర్తన స్థితి నిర్మాణము అంటారు. అనుకున్న బంధం తయారవడం పూర్తయిన వెంటనే క్రీయాశీల స్థానం నుంచి ఉత్పాదితం విడుదల అవుతుంది.
X- అక్షంపై చర్యా పురోగతి, y – అక్షంపై స్థితిజశక్తి అంశాలను తీసుకుని చిత్రాత్మక రేఖాచిత్రం గీచిన, S, P ల మధ్య ఉన్న శక్తి స్థాయిల భేదాన్ని చూడవచ్చు. ‘S’ కన్నా ‘P’ తక్కువ స్థాయిలో ఉంటే అది ఉష్ణ విమోచక చర్య. ఉత్పాదితం ఏర్పడటానికి శక్తిని అందచేయాల్సిన అవసరంలేదు. అలాకాకుండా, శక్తి విమోచక లేక శక్తి అవసరమయ్యే చర్య అయినట్లయితే ‘S’ ఇంకా ఎక్కువ అధిక శక్తిస్థితి లేదా క్రమ పరివర్తన స్థితి ద్వారా చర్యలో పాల్గోనాలి. ‘S’ సరాసరి శక్తి స్థితి, క్రమపరివర్తన స్థితిలోని శక్తి స్థితి మధ్యగల భేదాన్ని ఉత్తేజిత శక్తి అంటారు. ఎన్జైమ్లు ఈ శక్తి అవరోధాన్ని తగ్గించి ‘S’ నుంచి ‘P’ సులభంగా ఏర్పడేటట్లు చేస్తాయి.
ప్రతి ఎన్జైమ్ [E] అణువులో అధస్థపదార్థము [S] బంధితమయ్యే స్థానము ఉంటుంది. అందువల్ల అధిక చర్యాపూరిత ఎన్జైమ్ – అధస్థ పదార్థము సంక్లిష్టము [ES] ఏర్పడుతుంది. ఇది స్వల్పకాలికంగా ఉండి ఉత్పాదితం, మార్పుచెందని ఎన్జైమ్లో వియోజనం చెందుతుంది. దీనితోపాటు ఎన్ఎమ్ – ఉత్పాదితం సంక్లిష్టం మధ్యస్థంగా ఏర్పడుతుంది. ES సంక్లిష్టం ఉత్ప్రేరణకు
అవసరము.
E+SES → EP → E+P
ES సంక్లిష్టం ఏర్పడే విధానాన్ని ఇమిల్ఫిషర్ ప్రతిపాదించిన తాళం కప్ప – తాళం చెవి పరికల్పన, ఆ తరువాత డానియల్ ఇ.కోషాండ్ ప్రతిపాదించిన ఇండ్యూస్డ్-ఫిట్ పరికల్పనలు వివరిస్తాయి.
ఎంజైమ్ చర్యా విధానంలోని ఉత్ప్రేరక చక్రములోని అంశాలు :
- మొదట అధస్థ పదార్థము ఎన్జైమ్ క్రియాశీలస్థానంలో బంధితమై, తర్వాతదానిలోకి ఇమిడిపోతుంది.
- అధస్థ పదార్థము ఎన్జైమ్లో బంధితమైన తర్వాత ఎన్జైమ్ ఆకారంలో మార్పును ప్రేరేపిస్తుంది. దానివల్ల అధస్థ పదార్థం చుట్టూ ఎన్జైమ్ గట్టిగా ఇమిడిపోతుంది.
- ఎన్జైమ్ క్రియాశీల స్థానం అథస్థ పదార్థంలోని రసాయనబంధాలను విచ్చిన్నం చేసి ఎన్ఎమ్ ఉత్పాదిత సంక్లిష్టం ఏర్పడుతుంది.
- ఎన్జైమ్ చర్యలోని ఉత్పాదితాలను విడుదల చేస్తుంది. స్వేచ్ఛాఎన్జైమ్ వేరొక అధస్థపదార్థ అణువుతో బంధితమై తిరిగి చక్రాన్ని ఏర్పరుస్తుంది.
అభ్యాసాలు
ప్రశ్న 1.
రేఖాచిత్ర నిరూపణ సహాయంతో ఎన్ఎమ్ క్రియాశీలతను pH ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి.
జవాబు:
ప్రతి ఎన్జైమ్ ఒక నిర్ధిష్ట pH వద్ద అతి ఎక్కువ క్రియాశీలతను చూపుతుంది. దానిని యుక్తతను pH అంటారు. యుక్తతను pH కన్నా విలువ ఎక్కువైనా, తక్కువైనా ఎన్జైమ్ క్రియాశీలత తగ్గిపోతుంది.
ప్రశ్న 2.
ES సంక్లిష్టం తయారీ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
ఎన్జైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టము స్వల్పకాలికంగా ఉండి, ఉత్పాదికంగాను, మార్పుచెందని ఎన్జైమ్లోను వియోజనం చెందుతుంది. దీనితోపాటు ఎన్జైమ్ ఉత్పాదిత సంక్లిష్టం మధ్యస్థంగా ఏర్పడుతుంది.
E+S → ES → EP → E+ P