Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Chemistry Study Material 10th Lesson నిత్యజీవితంలో రసాయనశాస్త్రం Textbook Questions and Answers.
AP Inter 2nd Year Chemistry Study Material 10th Lesson నిత్యజీవితంలో రసాయనశాస్త్రం
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మందులు అంటే ఏమిటి?
జవాబు:
అల్ప అణుద్రవ్యరాశులు (100 ~ 500u) గల రసాయన పదార్థాలు మన శరీరంలోని బృహత్ అణువులతో చర్య జరిపి, జీవ సంబంధమైన స్పందన తెస్తాయి. వీటినే మందులు అంటారు.
ప్రశ్న 2.
మందులను ఔషధాలుగా ఎప్పుడు పరిగణిస్తారు?
జవాబు:
రసాయన పదార్థాల (మందుల) జీవ సంబంధమైన స్పందన వ్యాధి చికిత్సకు సంబంధించినదీ, ఉపయోగకరమైనదీ అయితే ఈ రసాయనాలను ఔషధాలుగా పరిగణిస్తారు.
ప్రశ్న 3.
‘కెమోథెరపీ’ పదాన్ని నిర్వచించండి.
జవాబు:
వ్యాధి చికిత్సకు రసాయన పదార్థాలను ఉపయోగించే ప్రక్రియను కెమోథెరపీ (లేదా) రసాయనాల చికిత్స అంటారు.
ప్రశ్న 4.
మందుల లక్ష్యాలుగా పరిగణింపబడే బృహత్ అణువులను తెలపండి.
జవాబు:
కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలులాంటి జీవాణువులతో మందులు చర్య జరుపుతాయి. ఈ జీవాణువులనే మందుల లక్ష్యాలు (లేదా) లక్ష్య అణువులు అంటారు.
ప్రశ్న 5.
ఎంజైమ్లు, గ్రాహకాలు అంటే ఏమిటి?
జవాబు:
ఎంజైమ్లు :
శరీరంలోని జీవసంబంధమైన ఉత్ప్రేరకాలుగా పనిచేసే ప్రోటీన్లను ఎంజైమ్లు అంటారు.
గ్రాహకాలు :
శరీరంలోని సమాచార బదిలీ వ్యవస్థలలో పాల్గొనే ప్రధాన పదార్థాలను “గ్రాహకాలు” అంటారు.
ప్రశ్న 6.
ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద మందును ఏ బలాలు నిలిపి ఉంచుతాయి?
జవాబు:
అయానిక బంధాల ద్వారా లేదా హైడ్రోజన్ బంధాల ద్వారా లేదా వాండర్వాల్స్ బలాల ద్వారా లేదా ద్విధ్రువ – ద్విగు . అణువుల మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఎంజైమ్ల క్రియాశీల స్థానాల వద్ద క్రియాధార అణువులు బంధితమౌతాయి.
ప్రశ్న 7.
ఎంజైమ్ నిరోధకాలు అంటే ఏమిటి?
జవాబు:
ఎంజైమ్ నిరోధకాలు :
ఎంజైమ్లలోని క్రియాశీల స్థానాలను మందులు (black) మరుగుపరచవచ్చు. ఫలితంగా ఎంజైమ్తో క్రియాధార అణువు ఏర్పరచే బంధం ఏర్పడకపోవచ్చు. లేదా ఎంజైమ్ జరిపే ఉత్ప్రేరణ చర్య నిరోధించవచ్చు. కాబట్టి ఈ మందులను “ఎంజైమ్ నిరోధకాలు” అంటారు.
ప్రశ్న 8.
ఎలోస్టీరిక్ స్థానం అంటే ఏమిటి?
జవాబు:
కొన్ని మందులు, ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద బంధితం కావు. ఇవి వేరొక ఎంజైమ్ స్థానం వద్ద బంధితమౌతాయి. వాటిని “ఎల్లోస్టీరిక్ స్థానాలు” అంటారు.
ప్రశ్న 9.
ఏంటగొనిష్టులు, ఎగొనిష్టులు అంటే ఏమిటి?
జవాబు:
i) ఏంటగొనిష్టులు :
గ్రాహకం బంధన స్థానానికి బంధితమై ఉండి గ్రాహకం జరిపే సహజ క్రియలను నిరోధించే మందులను “అంతర్ విరుద్ధకాలు (antagonists)” అంటారు.
ii) ఎగొనిష్టులు :
సహజ సహకార వాహకాలను అనుకరణం చేసి (Mimic) గ్రాహకాన్ని తెరిపించే ఇతర రకం మందులు ఉంటాయి. వీటిని “అంతర్ సహాయకులు (agonists)” అంటారు.
ప్రశ్న 10.
ఎందుకు మందులను, భిన్న పద్ధతులలో వర్గీకరణం చేయవలసిన అవసరం ఏర్పడింది?
జవాబు:
మందులను భిన్న పరిస్థితులలో వర్గీకరణ వలన వైద్యులకు, వైద్యరసాయన శాస్త్రవేత్తలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకే రకమైన నిర్మాణాలు కలిగిన మందులకు ఔషధశాస్త్ర సంబంధ చర్యలు ఒకే రకంగా ఉంటాయి. ఈ వర్గీకరణల వలన ప్రత్యేకమైన రోగ చికిత్సల విషయంలో ప్రతి వ్యాధి చికిత్స అందుబాటులో ఉండే మందుల గురించి తెలుస్తుంది.
ప్రశ్న 11.
ఆమ్ల విరోధులు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆమ్ల విరోధులు :
ఉదరంలో స్రవించిన అధిక ఆమ్లాన్ని తటస్థీకరించి సరైన pH కి తెచ్చే రసాయన పదార్థాలను ఆ విరోధాలు (లేదా) యాంటాసిడ్లు అంటారు.
ఉదా : NaHCO3, AZ(OH)3 + Mg(OH)2, ఓమెప్రజోల్ మొదలగునవి.
ప్రశ్న 12.
యాంటీహిస్టమిన్లు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
యాంటీహిస్టమిన్లు :
ఈ రసాయనాలు ఉదరంలో అధిక ఆమ్ల మోతాదులను పరోక్ష పద్ధతిలో నివారిస్తాయి.
ఉదర గోడలలో ఉండే అభిగ్రాహకాల దగ్గరకు హిస్టమిన్ పోకుండా ఆపి తక్కువ ఆమ్లం ఉత్పన్నమయ్యేటట్లు చేయు రసాయనాలను యాంటీ హిస్టమిన్లు అంటారు. ఉదా : డిమెటాప్, సెల్షన్ మొదలగునవి.
ప్రశ్న 13.
ఆమ్ల విరోధులు, యాంటీ ఎలర్జిక్ మందులు, హిస్టమిన్ చర్యలలో అడ్డుపడతాయి. అయితే ఇవి రెండూ వాటి చర్యలలో ఒకదానితో మరొకటి ఎందుకు అడ్డుపడవు ?
జవాబు:
ఆమ్లవిరోధులు, యాంటీ ఎలర్జిక్ మందులు వాటి చర్యలలో ఒకదానితో మరొకటి అడ్డుపడవు. ఇవి భిన్న గ్రాహకాలపై పనిచేస్తాయి.
ప్రశ్న 14.
ట్రాంక్విలైజర్లు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ట్రాంక్విలైజర్లు :
మానసిక ఒత్తిడిని, స్వల్ప లేదా తీవ్రమైన స్థాయిలలో ఉండే మనోవ్యాధుల నుంచి ఉపశమనం కొరకు ఉపయోగించే రసాయన పదార్థాలను ట్రాంక్విలైజర్లు అంటారు. ఉదా : లూమినాల్, సెకోనాల్ మొదలగునవి.
ప్రశ్న 15.
బార్బిట్యురేట్లు అంటే ఏమిటి?
జవాబు:
బార్బిట్యురేట్లు :
ట్రాంక్విలైజర్ల ముఖ్య వర్గానికి చెందిన బార్బిట్యురిక్ ఆమ్లం యొక్క ఉత్పన్నాలను బార్బిట్యురేట్లు అంటారు. ఉదా : వెరోనాల్, ఎమిటాల్.
ప్రశ్న 16.
ఎనాల్జిసిక్లు అంటే ఏమిటి? వీటిని ఎలా వర్గీకరిస్తారు?
జవాబు:
ఎనాల్జిసిక్ :
నొప్పి అనునది అనేక వ్యాధులలోను, ఆకస్మిక ప్రమాదాలలోనూ వుంటుంది. తలనొప్పి, చెవినొప్పి, ఒంటి నొప్పి, కడుపునొప్పి, కీళ్ళ నొప్పులు మొదలైనవి సాధారణ నొప్పులు. శరీరంలో ఏ భాగము వాపుకు గురి అయిన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పిని తగ్గించు ఔషధాలను ఎనాల్జెసిక్ అంటారు.
ఉదా : ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్ మొదలైనవి.
వర్గీకరణలు :
1) నార్కోటిక్ ఎనాల్జెసిక్ 2) నాన్ – నార్కోటిక్ ఎనాల్జెసిక్ 3) యాంటీ పైరిటిక్లు.
ప్రశ్న 17.
నార్కోటిక్ ఎనాల్జెసిక్ లు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నార్కోటిక్ ఎనాల్జెసిక్లు :
నొప్పి అనునది అనేక వ్యాధులలోను, ఆకస్మిక ప్రమాదాలలోనూ వుంటుంది. తలనొప్పి, చెవినొప్పి, ఒంటి నొప్పి, కడుపునొప్పి, కీళ్ళ నొప్పులు మొదలైనవి సాధారణ నొప్పులు. శరీరంలో ఏ భాగము వాపుకు గురి అయిన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పిని తగ్గించు ఔషధాలను ఎనాల్జెసిక్ అంటారు. ఉదా : ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్ మొదలైనవి.
వర్గీకరణాలు :
1) నార్కోటిక్ ఎనాల్జెసిక్ 2) నాన్ – నార్కోటిక్ ఎనాల్జెసిక్ 3) యాంటీ పైరిటిక్లు.
ప్రశ్న 18.
నార్కోటిక్ ఎనాల్జెసిక్ లు కాని ఎనాల్జెసిక్ లు ఏవి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నార్కోటిక్ ఎనాల్జెసిక్లుకాని ఎనాల్జెసిక్లు : ఎనాలిసిక్లుగా వాడే నాన్-నార్కోటిక్ లో ఎక్కువగా సాలిసిలేట్లు, ఎనిలిన్, ఎమినో ఫినాల్లకు సంబంధించిన సమ్మేళనాలు ఉంటాయి. ఇంకా పైర జోలోన్లు, క్వినోలిన్ ఉత్పన్నాలు కూడా ఉంటాయి. ఇవన్నీ వశపరచుకొనే ధర్మం లేని పదార్థాలు అయితే వీటి ఉపయోగం పరిమితమే. చిన్న చిన్న నొప్పులకు, బాధలకు తలనొప్పి, వెన్ను నొప్పిలాంటి వాటికి మాత్రమే ఉపయోగపడతాయి.
ఉదా : ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్.
ప్రశ్న 19.
యాంటీమైక్రోబియల్స్ అంటే ఏమిటి?
జవాబు:
యాంటీమైక్రోబియల్స్: బాక్టీరియా ద్వారా, ఫంగై ద్వారా, వైరస్ ద్వారా ఇతర పరాన్న జీవులు వరణాత్మకంగా- కలగజేసే వ్యాధికారక చర్యలను విధ్వంసం చేయడం, జరగకుండా నివారించే (లేదా) పూర్తిగా నివారించే మందులను యాంటీమైక్రోబియల్ అంటారు. ఉదా : లైసోజైమ్, లాక్టిక్ ఆమ్లం మొదలగునవి.
ప్రశ్న 20.
యాంటీ బయోటిక్ లు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి. [AP. Mar.’16]
జవాబు:
“యాంటీ బయోటిక్లు బాక్టీరియా, ఫంగస్, బూజులాంటి సూక్ష్మజీవుల నుంచి ఉత్పన్నమై ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా వాటిని నాశనం చేసే రసాయన పదార్థాలు”.
(లేదా)
“యాంటీబయోటిక్ అనేది పూర్తిగా కాని, కొంత భాగంగా కాని రసాయన పద్ధతిలో తయారు చేయబడి తక్కువ గాఢతలో ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా అంతం చేసే రసాయన పదార్థం”.
ఉదా : పెనిసిలీన్, క్లోరామ్ ఫెనికోల్, సల్ఫాడయాజీన్ మొ||నవి.
ప్రశ్న 21.
యాంటీ సెప్టిక్ లు (చీము నిరోధులు) అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి. [AP. Mar.’15]
జవాబు:
యాంటీ సెప్టిక్ లు (చీము నిరోధులు): యాంటీ సెప్టిక్లు అనేవి సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించేవి (లేదా) వాటిని నాశనం చేసేవి. వీటిని గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూస్తారు. ఉదా : డెట్టాల్, బితియనోల్.
ప్రశ్న 22.
క్రిమిసంహారిణులు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
క్రిమిసంహారిణులు :
“సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించడానికి (లేదా) నాశనం చేయడానికి వాడే రసాయన పదార్థాలు క్రిమిసంహారక మందులను ఫ్లోర్లు, డ్రయొనేజిలులాంటి జీవరహిత వ్యవస్థలకు వాడతారు.
ఉదా : i) 4% ఫార్మాల్డిహైడ్ జలద్రావణాన్ని ఫార్మలిన్ అంటారు.
ii) 0.3 ppm గాఢత గల క్లోరిన్ ద్రావణం క్రిమిసంహారిణిగా వాడతారు.
ప్రశ్న 23.
యాంటీ సెప్టిక్గాను, క్రిమిసంహారిణిగాను ఉపయోగపడే పదార్థాన్ని తెలపండి.
జవాబు:
ఫినాల్ యాంటీ సెప్టిక్గాను, క్రిమిసంహారిణిగా ఉపయోగపడును.
0.2% ఫినాల్ – యాంటీ సెప్టిక్
1% ఫినాల్ – క్రిమిసంహారిణి
ప్రశ్న 24.
యాంటీ సెప్టిక్ లకు, క్రిమిసంహారిణులకు మధ్య భేదం ఏమిటి? [AP. Mar.’17]
జవాబు:
యాంటీ సెప్టిక్ ను జీవకణజాలాలకు పూతగా పూస్తారు. క్రిమిసంహారిణులను నేలలు, కాలువలు, పరికరాలు మొదలైన నిర్జీవ పదార్థాలకు పూస్తారు.
ప్రశ్న 25.
డెట్టాల్లోని ప్రధాన అనుఘటకాలు ఏవి?
జవాబు:
డెట్టాల్, క్లోరోక్సీలెనోల్, టెర్ఫినియెల్ల మిశ్రమంను డెట్టాల్ అంటారు.
ప్రశ్న 26.
అయోడిన్ టింక్చర్ అంటే ఏమిటి? దీని ఉపయోగం ఏమిటి?
జవాబు:
ఆల్కహాల్ – నీరు మిశ్రమంలో కరిగించిన 2 3 శాతం అయోడిన్ ద్రావణాన్ని అయోడిన్ టింక్చర్ అంటారు. దీనిని గాయాలపై పూస్తారు.
ప్రశ్న 27.
గర్భనిరోధక మందులు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
“ఋతుచక్రాలను, స్త్రీ బీజాణువులను నియంత్రించడం ద్వారా గర్భ నిరోధకాలుగా పనిచేసే మందులను ‘యాంటీ ఫెర్టిలిటీ మాత్రలు’ అంటారు. ఇవి స్టిరాయిడ్లు: ఉదా : నారెథిన్ డ్రోన్, ఇథైనిలెస్ట్రాడియోల్, మిఫెప్రిస్టోన్ మొ||నవి. ఈ జనన నియంత్రణ సూత్రలలో సంక్లిష్ట ఈస్ట్రోజన్, ప్రోజెస్టిరాన్ ఉత్పన్నాలు చాలా చురుకుగా పనిచేస్తాయి.
ప్రశ్న 28.
ఆహారానికి రసాయన పదార్థాలను ఎందుకు చేరుస్తారు?
జవాబు:
ఆహారాన్ని 1) చెడిపోకుండా నిల్వ ఉంచడానికి, 2) దాని బాహ్యరూపాన్ని ఆకర్షణీయంగా ఉంచటానికి, 3) దాని పౌష్టిక విలువలను పెంచడానికి ఆహారానికి రసాయన పదార్థాలను కలుపుతారు.
ప్రశ్న 29.
ఆహార సంకలితాల భిన్న వర్గాలను తెలపండి.
జవాబు:
ఆహారానికి కలిపే ముఖ్య సంకలితాలు కింద ఇవ్వబడ్డాయి.
- ఆహారపు రంగులు
- సుగంధాలు, తీపి రుచినిచ్చే పదార్థాలు,
- కొవ్వు పదార్థాలను ఎమల్సీకరణం చేసే పదార్థాలు, ఆహార నిల్వకారణులు,
- వివర్ణకారకాలు, ఆహారానికి మెత్తదనాన్ని కలిగించే పదార్థాలు.
- యాంటీ ఆక్సీకరణులు,
- పరిరక్షక పదార్థాలు,
- ఖనిజాలు, విటమిన్లు, ఎమైనో ఆమ్లాలులాంటి ఆహార పౌష్టిక విలువలు పెంచేవి.
ప్రశ్న 30.
కృత్రిమ తీపి కారకాలు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. [AP. Mar.’16; AP. Mar.’15]
జవాబు:
సహజ చక్కెరలు కాలరీలను పెంచుతాయి. అందువలన వాటి స్థానంలో కృత్రిమ చక్కెరలను వాడుతున్నారు. “ఆహార పదార్థాల్లో చక్కెరకు బదులుగా వాడే రసాయనాలను కృత్రిమ తీపి కారుకాలు అంటారు. వీటిని వాడడం వల్ల కాలరీలను నియంత్రించ అదే సమయంలో సుక్రోజ్ కంటే ఆహారానికి ఎంతో తీపినిస్తాయి. చక్కెర వ్యాధి ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగకరం.
ఉదా : i) ఆస్పార్టేమ్కు సుక్రోజ్ కంటే 100 రెట్లు తీపి ఎక్కువగా ఉంటుంది.
ii) అలిటేమ్ మరియు సుక్రలోజ్ మరికొన్ని ఉదాహరణలు.
ప్రశ్న 31.
మనకు కృత్రిమ తీపి కారకాల అవసరం ఏమిటి?
జవాబు:
- కృత్రిమ తీపి కారకాలు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరమైనవి.
- ఇవి హాని కలిగించవు.
- ఇవి ఆహారం అందించే కేలరీలను నియంత్రిస్తాయి.
ప్రశ్న 32.
శీతల ఆహారపదార్థాలకు, శీతల పానీయాలకు మాత్రమే ఆస్పర్డమ్ను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
ఇది ఆహారం వండే ఉష్ణోగ్రతల వద్ద ఇది అస్థిరమైనది. అందువల్ల దీనిని శీతల ఆహార పదార్థాలలో, శీతల పానీయాలలో మాత్రమే ఉపయోగిస్తారు.
ప్రశ్న 33.
మధుమేహ రోగి వాడే తీపి పదార్థాల తయారీలో వాడే కృత్రిమ తీపి కారకాన్ని తెలపండి.
జవాబు:
మధుమేహరోగి వాడే తీపి పదార్థాల తయారీలో వాడే కృత్రిమ తీపి కారకం సాకరీన్. ఇది ఆహారం వండే ఉష్ణోగ్రత వద్ద స్థిరమైనది.
ప్రశ్న 34.
అలిటేము, కృత్రిమ తీపి కారకంగా వాడటంలోని ఇబ్బందులు ఏమిటి?
జవాబు:
అలిటేమ్ అత్యధిక తియ్యదనాన్ని అందించే కృత్రిమ తీపికారకం. దీనిని వాడినప్పుడు అది అందించే తియ్యదనాన్ని నియంత్రించడం చాలా కష్టం..
ప్రశ్న 35.
ఆహార పదార్థాల పరిరక్షకాలు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. [AP. Mar.’17]
జవాబు:
ఆహార పదార్థాల పరిరక్షకాలు : సూక్ష్మజీవుల వృద్ధి ద్వారా ఆహార పదార్థాలు చెడిపోయే ప్రమాదం నుండి నివారించే రసాయన పదార్థాలను ఆహార పదార్థాల పరిరక్షకాలు అంటారు.
ఉదా : సోడియమ్ బెంజోయేట్ (CH,COONa), సార్బిక్ ఆమ్లం మొదలగునవి.
ప్రశ్న 36.
ఆహార పదార్థంలో సంకలితాలుగా వాడే రెండు పరిచయమున్న యాంటీఆక్సీకరణులను తెలపండి.
జవాబు:
బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీటోలీన్ (BHT), బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్ (BHA)లు రెండూ అతి ప్రాచుర్యం గల యాంటీ ఆక్సీకరణులు.
ప్రశ్న 37.
సబ్బు తయారీ అంటే ఏమిటి?
జవాబు:
కొవ్వు పదార్థాన్ని సోడియమ్ హైడ్రాక్సైడ్ జల ద్రావణంతో కలిపి వేడిచేసి సోడియమ్ లవణాలు గల సబ్బులను తయారుచేస్తారు. దీనినే సబ్బు ఏర్పడే చర్య అంటారు.
ప్రశ్న 38.
రసాయనికంగా సబ్బులు అంటే ఏమిటి?
జవాబు:
రసాయనికంగా సబ్బులు పొడవైన శృంఖలాలుగల కొవ్వు ఆమ్లాల సోడియమ్ (లేదా) పొటాషియం లవణాలు.
ప్రశ్న 39.
కఠిన జలంలో సబ్బులు ఎందుకు పనిచేయవు?
జవాబు:
కఠిన జలంలో కాల్షియమ్, మెగ్నీషియమ్ అయాన్లు ఉంటాయి. కఠినజలంలో సోడియం లేదా పొటాషియమ్ సబ్బులను కరిగిస్తే ఇవి వరసగా కరగని కాల్షియమ్, మెగ్నీషియమ్ సబ్బులను ఏర్పరుస్తాయి. ఈ కరగని సబ్బులు మడ్డి రూపంలో వేరుపడతాయి. కాబట్టి ఇవి శుభ్రపరిచే కారకాలుగా పనిచేయవు. ఎందుకంటే ఈ అవక్షేపాలు వస్త్రాలపై జిగురు పదార్థాలుగా అతుక్కుపోతాయి. ఈ జిగురు అవక్షేపం కారణంగానే ‘కఠినజలంతో శుభ్రపరచిన తలవెంట్రుకలు కాంతిహీనంగా ఉంటాయి. కఠినజలంలో సబ్బుతో శుభ్రపరిచిన వస్త్రాలపై రంగులు సజాతీయంగా అభిశోషించబడవు. ఈ జిగురుగా ఉండే అవక్షేపమే దీనికి కూడా కారణం.
ప్రశ్న 40.
సంక్లిష్ట డిటర్జెంట్లు అంటే ఏమిటి?
జవాబు:
సంక్లిష్ట డిటర్జెంట్లు :
సబ్బు ధర్మాలన్నీ ఉండి, వాటిలో మాత్రం సబ్బులు లేని శుభ్రపరిచే కారకాలను సంక్లిష్ట లేదా కృత్రిమ డిటర్జెంట్లు అంటారు. వీటిని కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు.
ఉదా : సోడియం డోడెకైల్ బెంజీన్ సల్ఫోనేట్.
ప్రశ్న 41.
సబ్బుకు, సంక్లిష్ట డిటర్జెంటుకు గల భేదం ఏమిటి?
జవాబు:
రసాయనికంగా సబ్బులు పొడవైన శృంఖలాలుగల కొవ్వు ఆమ్లాల సోడియం (లేదా) పొటాషియం లవణాలు.
సంక్లిష్ట డిటర్జెంట్లు :
సబ్బు ధర్మాలన్నీ ఉండి, వాటిలో మాత్రం సబ్బులు లేని శుభ్రపరిచే కారకాలను సంక్లిష్ట లేదా కృత్రిమ డిటర్జెంట్లు అంటారు. వీటిని కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు.
కఠినజలంతో సబ్బులు పనిచేయవు. కృత్రిమ డిటర్జెంట్లు కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు. ఈ డిటర్జెంట్లు ఐస్తో చల్లబరిచిన నీటిలోను నురుగును ఏర్పరుస్తాయి.
ప్రశ్న 42.
సబ్బులతో పోలిస్తే సంక్లిష్ట డిటర్జెంట్లు మంచివిగా ఉంటాయి. ఎందుకు?
జవాబు:
కఠినజలంతో సబ్బులు పనిచేయవు. కృత్రిమ డిటర్జెంట్లు కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు. ఈ డిటర్జెంట్లు ఐస్తో చల్లబరిచిన నీటిలోను నురుగును ఏర్పరుస్తాయి.
ప్రశ్న 43.
సంక్లిష్ట డిటర్జెంట్ల భిన్న రకాలను తెలపండి.
జవాబు:
సంక్లిష్ట డిటర్జెంట్లను మూడు వర్గాలుగా విభజించారు.
- ఆనయానిక డిటర్జెంట్లు
- కాటయానిక డిటర్జెంట్లు
- అయానేతర డిటర్జెంట్లు.
ప్రశ్న 44.
నీటి కఠినత్వాన్ని నియంత్రించడానికి సబ్బులను, సంక్లిష్ట డిటర్జెంట్లను వాడవచ్చా?
జవాబు:
- సబ్బులను నీటి కాఠిన్యతను పరీక్షించుటకు ఉపయోగిస్తారు. ఎందువలన అనగా అవి కఠినజలంతో కరుగని అవక్షేపాలను ఏర్పరుస్తాయి.
- డిటర్జెంట్లు కఠినజలం, మృదుజలం రెండింటిలో కరుగుతాయి. కావున వీటిని నీటి కాఠిన్యత పరీక్షకు ఉపయోగించరు.
ప్రశ్న 45.
నీటిలో కాల్షియమ్ హైడ్రోజన్ కార్బొనేట్ కరిగి ఉన్నట్లైతే సబ్బులు, సంక్లిష్ట డిటర్జెంట్లలో దేనిని వస్త్రాలు ఉతకడానికి వాడతారు? ఎందువల్ల?
జవాబు:
నీటిలో కాల్షియమ్ హైడ్రోజన్ కార్బోనేట్ కరిగి ఉన్నట్లైతే ఆ నీటిని కఠినజలం అంటారు. ఈ కఠినజలం సబ్బుతో కరుగనటువంటి అవక్షేపాలు ఏర్పరచును. కావున కృత్రిమ (లేదా) సంక్లిష్ట డిటర్జెంట్లను వస్త్రాలను ఉతకటానికి వాడతారు. కృత్రిమ డిటర్జెంట్లు అవక్షేపాలు కఠినజలంతో ఏర్పరచవు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వైద్య రసాయన శాస్త్రంలో వాడే లక్ష్య అణువులు లేదా మందుల లక్ష్యాలు అనే పదాన్ని వివరించండి.
జవాబు:
లక్ష్య అణువులు (లేదా) మందుల లక్ష్యాలు :
కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, న్యూక్లియిక్ ఆమ్లాలులాంటి చాలా జీవాణువులతో మందులు చర్య జరుపుతాయి. ఈ జీవాణువులనే లక్ష్య అణువులు లేదా మందుల లక్ష్యాలు అంటారు. నిర్మాణాత్మక లక్షణాలలో సారూప్యతను ప్రదర్శించే మందులకు, అవి లక్ష్యాలపై జరిపే చర్యల విధానాల మధ్య కూడా సారూప్యత ఉంటుంది. వైద్య రసాయన శాస్త్రవేత్తలకు లక్ష్య అణువుల ఆధారంగా చేసిన మందుల వర్గీకరణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రశ్న 2.
మందుల లక్ష్యాలుగా ఎంజైమ్ల ఉత్ప్రేరణ చర్యను వివరించండి.
జవాబు:
ఎంజైమ్ ఉత్ప్రేరణ చర్య :
ఉత్ప్రేరణ చర్యలలో ఎంజైమ్లు రెండు ముఖ్యమైన క్రియలను జరుపుతాయి.
- రసాయన చర్య జరగడానికి వీలు కల్పించే విధంగా క్రియాధార అణువు లేదా సబ్స్టేట్ తనలో నిలుపుకొని ఉంచడం. ఎంజైమ్లు వాటిలోని క్రియాశీల స్థానాలలో సరైన దృగ్విన్యాసంలో క్రియాధార అణువులను నిలుపుకొని ఉంచుతాయి.
- అయానిక బంధాల ద్వారా లేదా హైడ్రోజన్ బంధాల ద్వారా లేదా వాండర్వాల్స్ బలాల ద్వారా లేదా ద్విధ్రువ ద్విధ్రువ అణువుల మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఎంజైమ్ల క్రియాశీల స్థానాల వద్ద క్రియాధార అణువులు బంధితమౌతాయి.
- చర్యలో క్రియాధార అణువుతో తలపడే ప్రమేయ వర్గాలను సమకూర్చి రసాయన చర్యను ప్రోత్సహించడం.
ప్రశ్న 3.
మందు – ఎంజైమ్ మధ్య అన్యోన్య చర్యను వివరించండి.
జవాబు:
మందు – ఎంజైమ్ల మధ్య అన్యోన్య చర్యలు : ఎంజైమ్ల యొక్క చర్యలను మందు నిరోధించగలుగుతుంది.
ఎంజైమ్ నిరోధకాలు :
ఎంజైమ్లలోని క్రియాశీల స్థానాలను మందులు (black) మరుగుపరచవచ్చు. ఫలితంగా ఎంజైమ్తో క్రియాధార అణువు ఏర్పరచే బంధం ఏర్పడకపోవచ్చు. లేదా ఎంజైమ్ జరిపే ఉత్ప్రేరణ చర్య నిరోధించవచ్చు. కాబట్టి ఈ మందులను “ఎంజైమ్ నిరోధకాలు” అంటారు.
ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద క్రియాధార అణువు అతుక్కునే చర్యను మందులు రెండు విధాలుగా నిరోధిస్తాయి.
- ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద బంధితమవడానికి సహజ క్రియాధార అణువులతోబాటు మందులు కూడా పోటీపడతాయి. ఈ రకం మందులను పోటీ నిరోధకాలు అంటారు.
- కొన్ని మందులు, ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద బంధితం కావు. ఇవి వేరొక ఎంజైమ్ స్థానం వద్ద బంధితమౌతాయి. వాటిని “ఎల్లోస్టీరిక్ స్థానాలు” అంటారు.
ప్రశ్న 4.
సోడియమ్ హైడ్రోజన్ కార్బొనేట్ లేదా మెగ్నీషియమ్ హైడ్రాక్సైడ్ లేదా అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్, వీటికంటే సిమెటిడీన్, రెనిటిడీన్ ఎందుకు మంచి ఆమ్ల విరోధులుగా పనిచేస్తాయి?
జవాబు:
సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్లు ఆమ్లత్వ లక్షణాలను మాత్రమే నియంత్రిస్తాయి. కానీ, ఈ అనారోగ్య పరిస్థితికి కారణాన్ని నివారించవు. అనారోగ్యం ముదిరిన పరిస్థితులలో జీర్ణకోశంలో ఏర్పడిన పుండ్లు, ప్రాణహానిని కలిగించేవిగా ఉంటాయి. అలాంటి పరిస్థితులలో జీర్ణకోశంలో పుండ్లకు గురైన భాగాలను నిర్మూలించవలసి వస్తుంది. రెనిటిడీన్, సిమెటిడీన్లు ఉదర గోడలలో ఉండే అభిగ్రాహకాల దగ్గరకు హిస్టమిన్ పోకుండా ఆపుతుంది. దీనివల్ల అతి తక్కువ ఆమ్లం ఏర్పడుతుంది. అందువలన ఇవి పై వాటికన్నా మంచి ఆమ్ల విరోధులు.
ప్రశ్న 5.
అల్ప పరిమాణాలలో ఉండే నార్ఎడ్రినలీన్ ద్వారా మనోవ్యాకులత కలుగుతంది. ఈ సమస్య చికిత్సకు ఏరకం మందులు అవసరం అవుతాయి? రెండు మందులను పేర్కొనండి.
జవాబు:
నార్ ఎడ్రినలిన్, రక్తపోటును పెంచి ప్రచోదనాలను ఒక నాడి చివర నుంచి ఇంకో నాడికి పంపుతుంది. నార్ ఎడ్రినలిన్ స్థాయి తక్కువయితే సంకేతం పంపే చర్య కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి డిప్రెషన్కి లోనవుతాడు. అలాంటి సందర్భాల్లో ఫినలజైన్ వంటి యాంటిడిప్రసెంట్ వంటి మందు వాడాలి. ఇది నార్ ఎడ్రినలిన్ చర్యలను క్రింది స్థాయికి తగ్గించే ఉత్ప్రేరక చర్యలకు కారణమయిన ఎంజైములను నిరోధిస్తాయి. ఆ విధంగా మెదడును, నాడులకు సంబంధించిన జీవ రసాయన చర్యలు నెమ్మదిగా తిరిగి సాగుతాయి.
ప్రశ్న 6.
ఎనాల్జిసిక్ లు అంటే ఏమిటి? వాటిని ఎలా వర్గీకరిస్తారు? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఎనాల్జెసిక్ :
నొప్పి అనునది అనేక వ్యాధులలోను, ఆకస్మిక ప్రమాదాలలోనూ వుంటుంది. తలనొప్పి, చెవినొప్పి, ఒంటి నొప్పి, కడుపునొప్పి, కీళ్ళ నొప్పులు మొదలైనవి సాధారణ నొప్పులు. శరీరంలో ఏ భాగము వాపుకు గురి అయిన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పిని తగ్గించు ఔషధాలను ఎనాల్జెసిక్ అంటారు.
ఉదా : ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్ మొదలైనవి.
వర్గీకరణలు :
1) నార్కోటిక్ ఎనాల్జెసిక్ 2) నాన్ – నార్కోటిక్ ఎనాల్జెసిక్ 3) యాంటీ పైరిటిక్లు.
ప్రశ్న 7.
యాంటీమైక్రోబ్ మందుల రకాలు ఏమిటి ? ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
యాంటీమైక్రోబియల్స్ బాక్టీరియా ద్వారా, ఫంగై ద్వారా, వైరస్ ద్వారా ఇతర పరాన్న జీవులు వరణాత్మకంగా కలగజేసే వ్యాధికారక చర్యలను విధ్వంసం చేయడం, జరగకుండా నివారించే (లేదా) పూర్తిగా నివారించే మందులను యాంటీమైక్రోబియల్స్ అంటారు. ఉదా : లైసోజైమ్, లాక్టిక్ ఆమ్లం మొదలగునవి.
యాంటీమైక్రోబియాల్స్ను ఈ క్రింది విధంగా వర్గీకరించారు.
క్రిమిసంహారిణులు :
“సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించడానికి (లేదా) నాశనం చేయడానికి వాడే రసాయన పదార్థాలు క్రిమిసంహారక మందులను ఫ్లోర్లు, డ్రయొనేజిలులాంటి జీవరహిత వ్యవస్థలకు వాడతారు.
ఉదా : i) 4% ఫార్మాల్డిహైడ్ జలద్రావణాన్ని ఫార్మలిన్ అంటారు.
ii) 0.3 ppm గాఢత గల క్లోరిన్ ద్రావణం క్రిమిసంహారిణిగా వాడతారు.
యాంటీసెప్టిక్లు (చీము నిరోధులు) :
యాంటీ సెప్టిక్ లు అనేది సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించేవి (లేదా) వాటిని నాశనం చేసేవి. వీటిని గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూస్తారు.
ఉదా : డెట్టాల్, బితియనోల్
యాంటీబయోటిక్లు :
“యాంటీబయోటిక్లు బాక్టీరియా, ఫంగస్, బూజులాంటి సూక్ష్మజీవుల నుంచి ఉత్పన్నమై ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా వాటిని నాశనం చేసే రసాయన పదార్థాలు”.
(లేదా)
“యాంటీబయోటిక్ అనేది పూర్తిగా కాని, కొంత భాగంగా కాని రసాయన పద్ధతిలో తయారు చేయబడి తక్కువ గాఢతలో ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపటమో లేదా అంతం చేసే రసాయన పదార్థం”.
ఉదా : పెనిసిలీన్, కోరామ్ ఫెనికోల్, సల్ఫాడయాజీన్ మొ||నవి.
ప్రశ్న 8.
యాంటీబయోటిక్లల అభిలాక్షణిక ధర్మాలను తెలపండి.
జవాబు:
యాంటీబయోటిక్ ల అభిలాక్షణిక ధర్మాలు :
- యాంటీబయోటిక్ జీవుల జీవక్రియలలో ఏర్పడే క్రియాజన్యం అయి ఉండాలి.
- యాంటీబయోటిక్కు అల్ప పరిమాణాలలోనే క్రియాశీలత (చికిత్సకు తోడ్పడే) ధర్మం ఉండాలి.
- యాంటీబయోటిక్, సూక్ష్మజీవుల పెరుగుదలను లేదా బతుకు ప్రక్రియలను మందిత (retard) పరచాలి.
- సహజసిద్ధమైన యాంటీబయోటిక్తో నిర్మాణంలో సారూప్యత ప్రదర్శించే సంక్లిష్ట పదార్థంగా యాంటీబయోటిక్ ఉండాలి. యాంటీబయోటిక్లకు సూక్ష్మజీవులను చంపే ధర్మాన్ని (సైడలధర్మం) లేదా సూక్ష్మజీవులను నిరోధించే ధర్మం (స్టాటిక్ ధర్మం) ఉండాలి.
ప్రశ్న 9.
అధిక విస్తృతి యాంటీబయోటిక్ అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు:
ఒక యాంటీ బయోటిక్ ద్వారా ప్రభావితం అయ్యే బాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవుల రకాల విస్తృతిని క్రియాత్మక వ్యాప్తి స్పెక్ట్రమ్ అంటారు.
అధిక క్రియాత్మక విస్తృతి యాంటీబయోటిక్లు :
గ్రాపాజిటివ్ మరియు గ్రామ్ నెగెటివ్ బాక్టీరియాను నాశనం చేసే లేదా నిరోధించే యాంటీబయోటిక్లను అధిక క్రియాత్మక విస్తృతి యాంటీబయోటిక్లు అంటారు.
ప్రశ్న 10.
అధిక విస్తృతి యాంటీబయోటిక్లు స్వల్ప విస్తృతి యాంటీబయోటిక్ లు అంటే ఏమిటి? ప్రతీదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఒక యాంటీబయోటిక్ ద్వారా ప్రభావితం అయ్యే బాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవుల రకాల విస్తృతిని క్రియాత్మక వ్యాప్తి స్పెక్ట్రమ్ అంటారు.
అధిక క్రియాత్మక విస్తృతి యాంటీబయోటిక్లు :
గ్రాపాజిటివ్ మరియు గ్రామ్ నెగెటివ్ బాక్టీరియాను నాశనం చేసే లేదా నిరోధించే యాంటీ బయోటిక్లను అధిక క్రియాత్మక విస్తృతి యాంటీబయోటిక్లు అంటారు.
స్వల్ప విస్తృతి యాంటీబయోటిక్లు :
గ్రామ్ పాజిటివ్ లేదా గ్రామ్ నెగిటివ్లలో ఒకరకం సూక్ష్మజీవులపై ప్రభావం చేయు యాంటీబయోటిక్లను స్వల్పవిస్తృతి యాంటీబయోటిక్లు అంటారు.
ప్రశ్న 11.
యాంటీ సెప్టిక్ లు (చీము నిరోధులు), క్రిమిసంహారిణులపై లఘు వ్యాఖ్యను వ్రాయండి. [TS. Mar. ’17, ’15]
జవాబు:
యాంటీ సెప్టిక్లు (చీము నిరోధులు) :
యాంటీసెప్టిక్లు అనేవి సూక్ష్మక్రిములు పెరుగుదలను నిరోధించేవి (లేదా) వాటిని నాశనం చేసేవి. వీటిని గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూస్తారు.
ఉదా : డెట్టాల్, బితియనోల్
డెట్టాల్, క్లోరోక్సీలెనోల్, టెర్ఫినియెల్ల మిశ్రమంను డెట్టాల్ అంటారు.
ఆల్కహాల్ – నీరు మిశ్రమంలో కరిగించిన 2 – 3 శాతం అయోడిన్ ద్రావణాన్ని అయోడిన్ టింక్చర్ అంటారు. దీనిని గాయాలపై పూస్తారు.
0.2% ఫినాల్ యాంటీ సెప్టిక్.
క్రిమిసంహారిణులు :
“సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించడానికి (లేదా) నాశనం చేయడానికి వాడే రసాయన పదార్థాలు క్రిమిసంహారక మందులను ఫ్లోర్లు, డ్రయొనేజిలులాంటి జీవరహిత వ్యవస్థలకు వాడతారు.
ఉదా : i) 4% ఫార్మాల్డిహైడ్ జలద్రావణాన్ని ఫార్మలిన్ అంటారు.
ii) 0.3 ppm గాఢత గల క్లోరిన్ ద్రావణం క్రిమిసంహారిణిగా వాడతారు.
- 0.3 ppm క్లోరిన్ జల ద్రావణం క్రిమిసంహారిణి
- తక్కువ గాఢతలలో SO, క్రిమిసంహారిణి
- 1% ఫినాల్ క్రిమిసంహారిణి
ప్రశ్న 12.
క్రిమి సంహారిణులను, యాంటీసెప్టిక్ లు (చీము నిరోధులు) ఏ విధంగా భేదిస్తాయి?
జవాబు:
- యాం టీసెప్టిక్లను గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణ జాలాలకు పూతగా పూస్తారు.
- క్రిమిసంహారిణులను నేలలు, కాలువలు, పరికరాలు మొదలైన నిర్జీవ పదార్థాలకు పూస్తారు.
- ఫినాల్ యాంటీ సెప్టిక్ మరియు క్రిమిసంహారిణిగా వాడతారు.
0.2% ఫినాల్ – యాంటీ సెప్టిక్
1% ఫినాల్ – క్రిమిసంహారిణి
ప్రశ్న 13.
ఆహార, పదార్థ సంకలితాలలో ముఖ్య రకాలు ఏవి?
జవాబు:
ఆహారానికి కలిపే ముఖ్య సంకలితాలు కింద ఇవ్వబడ్డాయి.
- ఆహారపు రంగులు
- సుగంధాలు, తీపి రుచినిచ్చే పదార్థాలు,
- కొవ్వు పదార్థాలను ఎమల్సీకరణం చేసే పదార్థాలు, ఆహార నిల్వకారిణులు,
- వివర్ణకారకాలు, ఆహారానికి మెత్తదనాన్ని కలిగించే పదార్థాలు.
- యాంటీ ఆక్సీకరణులు,
- పరిరక్షక పదార్థాలు,
- ఖనిజాలు, విటమిన్లు, ఎమైనో ఆమ్లాలులాంటి ఆహార పౌష్టిక విలువలు పెంచేవి.
ప్రశ్న 14.
ఆహార పదార్థాలలో యాంటీఆక్సీకరణుల గురించి లఘు వ్యాఖ్య వ్రాయండి.
జవాబు:
యాంటీఆక్సీకరణులు :
- ఇవి ముఖ్యమైన, అవసరమైన ఆహారసంకలితాలు.
- ఇవి ఆహార పదార్థాలపై ఆక్సిజన్ జరిపే చర్యవేగాన్ని తగ్గించి, ఆహార పదార్థాల సంరక్షణకు తోడ్పడతాయి.
- ఇవి తాము సంరక్షించే ఆహార పదార్థాలతో కంటే ఆక్సిజన్తో అధిక చర్యాశీలతను ప్రదర్శిస్తాయి.
- బ్యు టైలేటెడ్ హైడ్రాక్సీటోలిన్ (BHT), బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్ (BHA)లు రెండూ అతి ప్రాచుర్యం గల యాంటీ ఆక్సీకరణులు.
- వెన్నకు BHA కలిపితే చెడిపోకుండా ఉండే నిల్వకాలం నెలల నుండి సంవత్సరాలకు పెరుగును.
- BHT, BHA లను సిట్రిక్ ఆమ్లంతో కలిపి అధిక ప్రభావం కోసం వాడతారు.
- వైను, బీరు, చక్కెరపాకం, ముక్కలుగా కోసిన లేదా తొక్కలుతీసిన పండ్లు, ఎండబెట్టిన పండ్లు, కూరగాయలు మొదలగువాటిని SO2, సల్ఫైట్లను యాంటీ ఆక్సీకరణులుగా వాడతారు.
ప్రశ్న 15.
సబ్బుల భిన్న రకాలను తెలపండి.
జవాబు:
సబ్బులలో భిన్న రకాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
- శరీర శుద్ధికి వాడే సబ్బులు,
- నీటిలో తేలే గుణంగల సబ్బులు,
- వైద్య ప్రాముఖ్యంగల సబ్బులు,
- షేవింగ్ సబ్బులు,
- లాండ్రీ సబ్బులు,
- సబ్బుల చూర్ణాలు.
ప్రశ్న 16.
సరైన ఉదాహరణలతో క్రింది వాటిని వివరించండి.
ఎ) కాటయానిక డిటర్జెంట్లు
బి) ఆనయానిక డిటర్జెంట్లు
సి) అయానేతర డిటర్జెంట్లు
జవాబు:
ఎ) కాటయానిక డిటర్జెంట్లు :
ఎసిటేట్లు, క్లోరైడ్లు, బ్రోమైడ్లు ఆనయాన్లుగా గల ఎమీన్ క్వాటర్నరీ అమోనియమ్ లవణాలే కాటయానిక డిటర్జెంట్లు. కాటయాన్ భాగంలో పొడవైన హైడ్రోకార్బన్ గొలుసు ఉంటుంది. నైట్రోజన్ పై ధనావేశం ఉంటుంది. కాబట్టి వీటిని కాటయానిక డిటర్జెంట్లు అంటారు. సిటైల్ ట్రై మిథైల్ అమోనియమ్ బ్రోమైడ్ చాలా ఎక్కువగా వాడకంలో ఉన్న కాటయాన్ డిటర్జెంటు. దీనిని హెయిర్ కండిషనర్లలో (hair conditioners) వాడతారు. వీటికి క్రిములను నాశనం చేసే ధర్మం ఉంది. ఇవి చాలా ఖరీదైనవి. కాబట్టి ఇవి తక్కువ స్థాయిలోనే వాడకంలో ఉన్నాయి.
బి) ఆనయానిక డిటర్జెంట్లు :
పొడవైన కార్బన్ గొలుసు నిర్మాణాలు గల సల్ఫోనేటెడ్ ఆల్కహాల్ లేదా సల్ఫోనేటెడ్ హైడ్రోకార్బన్ల సోడియమ్ లవణాలే ఆయానిక డిటర్జెంట్లు. పొడవైన కర్బన గొలుసుల నిర్మాణాలు గల ఆల్కహాల్లను, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపించి, తరవాత క్షారంతో తటస్థీకరణ చర్యకు గురిచేసినప్పుడు ఆనయానిక డిటర్జెంట్లు ఏర్పడతాయి. ఇదేవిధంగా ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లాలను క్షారాలతో తటస్థీకరణం చెందించినప్పుడు కూడా ఇవి ఏర్పడతాయి.
ఆనయానిక డిటర్జెంట్లలో అణువులోని ఆనయాన్ భాగం మాత్రమే శుభ్రపరిచే ప్రక్రియలో పాల్గొంటుంది. ఆల్కెల్ బెంజీన్ సల్ఫోనేట్ల సోడియమ్ లవణాలు అతిముఖ్యమైన ఆనయానిక డిటర్జెంట్లు. ఇవి మన ఇండ్లలో విరివిగా వాడతారు. ఆనయాన్ డిటర్జెంట్లను టూత్పేస్టులలో కూడా వాడతారు.
సి) అయానేతర డిటర్జెంట్లు :
వీటి నిర్మాణంలో అయాన్లు ఉండవు. పాలి ఇథైల్ గ్లైకాల్, స్టియరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు అటువంటి ఒక డిటర్జెంటు ఏర్పడుతుంది.
పాత్రలను శుభ్రంచేసే ద్రవ రూపంలో ఉండే డిటర్జెంట్లు అయానేతర డిటర్జంట్ల రకానికి చెందినవి.
ప్రశ్న 17.
జీవక్రమపతన క్రియకు గురయ్యే డిటర్జెంట్లు, జీవక్రమపతన క్రియకు గురికాని డిటర్జెంట్లు అంటే ఏమిటి? ప్రతీదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
i) జీవక్రమపతన చర్యకు గురయ్యే డిటర్జెంట్లు :
ఏ డిటర్జెంట్లు అయితే సూక్ష్మజీవులచే క్రమపతన చర్యకు గురి అవుతాయో వాటిని జీవక్రమపతన చర్యకు గురయ్యే డిటర్జెంట్లు అంటారు.
- ఇవి తక్కువ శాఖాయుతం అయినవి.
- ఇవి నీటి కాలుష్యాన్ని కలిగించవు.
ఉదా : in-డోడెకైల్ బెంజీన్ సల్ఫోనేట్, సబ్బు
ii) జీవక్రమపతనచర్యకు గురికాని డిటర్జెంట్లు :
ఏ డిటర్జెంట్లు అయితే సూక్ష్మజీవులచే క్రమపతన చర్యకు గురికావో వాటిని జీవక్రమపతనచర్య గురికాని డిటర్జెంట్లు అంటారు.
- ఇవి ఎక్కువ శాఖాయుతమైనవి.
- ఇవి నీటి కాలుష్యాన్ని కలిగిస్తాయి.
ఉదా : ABS డిటర్జెంటు.
ప్రశ్న 18.
సబ్బులు జరిపే శుభ్రపరిచే ప్రక్రియను వివరించండి.
జవాబు:
మురికి గుడ్డలపై ఉండే గ్రీజు, మురికి మొదలైన పదార్థాలు నీటిలో కరిగి మిసెల్ను ఏర్పరచటం అనే అంశం మీద ఈ శుభ్రపరిచే ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియను గ్రీజు ఎమల్సిఫికేషన్ చర్య అంటారు. పొడుగాటి గొలుసులున్న ఉన్నత ఫాటీ ఆమ్లం సోడియం లవణాలను సబ్బు అంటారు. సబ్బులోని ఆనయాన్లకూ, నీటికీ మధ్య ఉన్న బంధక బలం ఆధారంగానే ఈ శుభ్రపరచే ప్రక్రియ ఆధారపడి ఉంటుంది.
సబ్బు ఆనయాన్లు సులభంగా మిసెల్లను ఏర్పరుస్తాయి. హైడ్రోకార్భన్ భాగాలు మిసెల్ అంతర్భాగంలోనికి చొచ్చుకుని పోతాయి. -COO` అయాన్లు మిసెల్ ఉపరితలంపై చోటు చేసుకుంటాయి. ద్రవ హైడ్రో కార్బన్ గా ప్రవర్తించే గ్రీజు లేదా మురికి మిసెల్లోకి పోతుంది. సబ్బు ఆనయాన్ తోక భాగాలు గ్రీజులోకి చొచ్చుకుని ఉంటాయి. ధ్రువ సమూహాలు గ్రీజు ఉపరితలం నుంచి వెలుపలికి చొచ్చుకునిపోయి మిసెల్ చుట్టూ ఒక ధ్రువ స్వభావం ఉన్న పొరను ఏర్పరుస్తాయి. ఎమల్సిఫికేషన్ చెందిన గ్రీజు మరకలను సబ్బు ద్రావణంతో తొలగించడం అవుతుంది.
ప్రశ్న 19.
క్రింది సమ్మేళనాలలో హైడ్రోఫిలిక్ బాగాలను హైడ్రోఫోబిక్ భాగాలను గుర్తించండి.
ఎ) CH3(CH2)10 CH2 OSO–3 Na+
బి) CH3 (CH2)15 N+ (CH3)3 Br–
సి) CH3 (CH2)16 COO (CH2 CH2O)n CH2 CH2 OH
జవాబు:
ప్రశ్న 20.
క్రింది వాటి నిర్మాణాలను వ్రాయండి.
ఎ) సెరోటోనిన్ బి) బితియోనోల్ సి) క్లోరామ్ ఫెనికోల్ డి) సాకరీన్
జవాబు:
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మందులను భిన్న వర్గాలుగా వర్గీకరించండి.
జవాబు:
క్రింద పేర్కొన్న లక్షణాల ఆధారంగా మందులను వర్గీకరిస్తారు.
a) వ్యాధి సంబంధ ఔషధాలుగా వర్గీకరణ :
నిబంధనల ఆధారంగా మందులను వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణ వైద్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకమైన రోగ చికిత్సల విషయంలో ప్రతి వ్యాధి చికిత్సకు అందుబాటులో ఉండే మందుల గురించి ఈ వర్గీకరణ తెలుపుతుంది. ఉదాహరణకు “ఎనాల్జెసిక్లు” (బాధా నివారణులు) నొప్పులను హరించే గుణం ఉన్నవి. యాంటీ సెప్టిక్లు (చీము నిరోధులు) సూక్ష్మజీవుల వృద్ధిని నిరోధించడం లేదా వాటిని నాశనం చేయడం చేస్తాయి.
b) మందులు జరిపే చర్యల ఆధారంగా వర్గీకరణ :
ప్రత్యేక జీవరసాయన ప్రక్రియపై మందు జరిపే చర్య ఆధారంగా ఈ వర్గీకరణ ఉంటుంది. ఉదాహరణకు శరీరంలో వాపును (inflammation) కలిగించే హిస్టమిన్ పదార్థం జరిపే చర్యను నిరోధించే మందులను యాంటీ హిస్టమిన్లు (antihistamines) లేదా హిస్టమిన్ వ్యతిరేకులు అంటారు. హిస్టమిన్ చర్యలను అడ్డుకొనే విధానాలు చాలా ఉన్నాయి.
c) మందులలోని రసాయన పదార్థాల నిర్మాణాల ఆధారంగా వర్గీకరణ :
ఈ వర్గీకరణ మందులలోని రసాయన పదార్థాల నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఈ వర్గీకరణలో చోటుచేసుకొన్న మందులన్నింటిలోను ఉండే రసాయన పదార్థాలకు ఒకేరకమైన రసాయన నిర్మాణం ఉంటుంది. అంతేకాకుండా వీటన్నింటికి ఔషధశాస్త్ర సంబంధమైన చర్యలు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకు సల్ఫోనమైడ్ మందులన్నింటికి సామాన్య రసాయన నిర్మాణం పక్క విధంగా ఉంటుంది.
d) ఔషధాల లక్ష్య అణువుల ఆధారంగా వర్గీకరణ :
కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలులాంటి చాలా జీవాణువులతో మందులు చర్య జరుపుతాయి. ఈ జీవాణువులనే లక్ష్య అణువలు (target molecules) లేదా మందుల లక్ష్యాలు (drug target) అంటారు. నిర్మాణాత్మక లక్షణాలలో సారూప్యతను ప్రదర్శించే మందులకు, అవి లక్ష్యాలపై జరిపే చర్యల విధానాల మధ్య కూడా సారూప్యత ఉంటుంది. వైద్య రసాయన శాస్త్రవేత్తలకు లక్ష్య అణువుల ఆధారంగా చేసిన మందుల వర్గీకరణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రశ్న 2.
భిన్న వర్గాల మందుల చికిత్సా చర్యలను స్థూలంగా వర్గీకరించండి.
జవాబు:
భిన్న వర్గాల మందుల చికిత్సా చర్యలు క్రింద వివరించబడ్డాయి.
ఆమ్ల అవరోధులు :
ఉదరంలో స్రవించిన అధిక ఆమ్లాన్ని తటస్థీకరించి సరైన pH కి తెచ్చే రసాయన పదార్థాలను ఆమ్ల విరోధులు (లేదా) యాంటాసిడ్లు అంటారు.
ఉదా : NaHCO3, AL(OH)3 + Mg(OH)2, ఓమెప్రజోల్ etc.,
యాంటీహిస్టమిన్లు :
ఈ రసాయనాలు ఉదరంలో అధిక ఆమ్ల మోతాదులను పరోక్ష పద్ధతిలో నివారిస్తాయి.
ఉదర గోడలలో ఉండే అభిగ్రాహకాల దగ్గరకు హిస్టమిన్ పోకుండా ఆపి తక్కువ ఆమ్లం ఉత్పన్నమయ్యేటట్లు చేయు రసాయనాలను యాంటీ హిస్టమిన్లు అంటారు.
ఉదా : డిమెటాప్, సెల్దేన్ మొదలగునవి.
ట్రాంక్విలైజర్లు :
మానసిక ఒత్తిడిని, స్వల్ప లేదా తీవ్రమైన స్థాయిలలో ఉండే మనోవ్యాధుల నుంచి ఉపశమనం కొరకు ఉపయోగించే రసాయన పదార్థాలను ట్రాంక్విలైజర్లు అంటారు.
ఉదా : లూమినాల్, సెకోనాల్ మొదలగునవి.
బార్బిట్యురేట్లు :
ట్రాంక్విలైజర్ల ముఖ్య వర్గానికి చెందిన బార్బిట్యురిక్ ఆమ్లం యొక్క ఉత్పన్నాలను బార్బిట్యురేట్లు అంటారు.
ఉదా : వెరోనాల్, ఎమిటాల్.
ఎనాల్జెసిక్ :
నొప్పి అనునది అనేక వ్యాధులలోను, ఆకస్మిక ప్రమాదాలలోనూ వుంటుంది. తలనొప్పి, చెవినొప్పి, ఒంటి నొప్పి, కడుపునొప్పి, కీళ్ళ నొప్పులు మొదలైనవి సాధారణ నొప్పులు. శరీరంలో ఏ భాగము వాపుకు గురి అయిన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పిని తగ్గించు ఔషధాలను ఎనాల్జెసిక్ అంటారు.
ఉదా : ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్ మొదలైనవి.
వర్గీకరణలు :
- నార్కోటిక్ ఎనాల్జెసిక్
- నాన్- నార్కోటిక్ ఎనాల్జెసిక్
- యాంటీ పైరిటిక్లు.
యాంటీమైక్రోబియల్స్ :
బాక్టీరియం ద్వారా, ఫంగై ద్వారా, వైరస్ ద్వారా ఇతర పరాన్న జీవులు వరణాత్మకంగా కలగజేసే వ్యాధి కారక చర్యలను విధ్వంసం చేయడం, జరగకుండా నివారించే (లేదా) పూర్తిగా నివారించే మందులను యాంటీమైక్రోబియల్స్ అంటారు.
ఉదా : లైసోజైమ్, లాక్టిక్ ఆమ్లం మొదలగునవి.
యాంటీమైక్రోబియల్స్ను ఈ క్రింది విధంగా వర్గీకరించారు.
క్రిమిసంహారిణులు :
“సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించడానికి (లేదా) నాశనం చేయడానికి వాడే రసాయన పదార్థాలు క్రిమిసంహారక మందులను ఫ్లోర్లు, డ్రయొనేజిలులాంటి జీవరహిత వ్యవస్థలకు వాడతారు.
ఉదా : i) 4% ఫార్మాల్డిహైడ్ జలద్రావణాన్ని ఫార్మలిన్ అంటారు.
ii) 0.3 ppm గాఢత గల క్లోరిన్ ద్రావణం క్రిమిసంహారిణిగా వాడతారు.
యాంటీసెప్టిక్ లు (చీము నిరోధులు) :
యాంటీసెప్టిక్లు అనేది సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించేవి (లేదా) వాటిని నాశనం చేసేవి. వీటిని గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూస్తారు.
ఉదా : డెట్టాల్, బితియనోల్.
యాంటీబయోటిక్లు :
“యాంటీబయోటిక్లు బాక్టీరియా, ఫంగస్, బూజు లాంటి సూక్ష్మజీవుల నుంచి ఉత్పన్నమై ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా వాటిని నాశనం చేసే రసాయన పదార్థాలు”.
(లేదా)
“యాంటీబయోటిక్ అనేది పూర్తిగా కాని, కొంత భాగంగా కాని రసాయన పద్ధతిలో తయారు చేయబడి తక్కువ గాఢతలో ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా అంతం చేసే రసాయన పదార్థం”.
ఉదా : పెనిసిలీన్, క్లోరామ్ ఫెనికోల్, సల్ఫాడయాజీన్ మొ||నవి.
“ఋతుచక్రాలను, స్త్రీ బీజాణువులను నియంత్రించడం ద్వారా గర్భ నిరోధకాలుగా పనిచేసే మందులను ‘యాంటీ ఫెర్టిలిటీ మాత్రలు’ అంటారు. ఇవి స్టిరాయిడ్లు. ఉదా : నారెథిన్న్, ఇథైనిలె స్ట్రాడియోల్, మిథెప్రిస్టోన్ మొ||నవి.
ఈ జనన నియంత్రణ మాత్రలలో సంక్లిష్ట ఈస్ట్రోజన్. ప్రోజెస్టిరాన్ ఉత్పన్నాలు చాలా చురుకుగా పనిచేస్తాయి.
ప్రశ్న 3.
యాంటీమైక్రోబ్ మందుల గురించి వ్యాసం వ్రాయండి.
జవాబు:
యాంటీమైక్రోబియల్స్ : బాక్టీరియా ద్వారా, ఫంగై ద్వారా, వైరస్ ద్వారా ఇతర పరాన్న జీవులు వరణాత్మకంగా కలగజేసే వ్యాధికారక చర్యలను విధ్వంసం చేయడం, జరగకుండా నివారించే (లేదా) పూర్తిగా నివారించే మందులను యాంటీమైక్రోబియల్స్ అంటారు.
ఉదా : లైసోజైమ్, లాక్టిక్ ఆమ్లం మొదలగునవి.
యాంటీ మైక్రోబియల్స్ను ఈ క్రింది విధంగా వర్గీకరించారు.
క్రిమిసంహారిణులు :
“సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించడానికి (లేదా) నాశనం చేయడానికి వాడే రసాయన పదార్థాలు క్రిమిసంహారక మందులను ఫ్లోర్లు, డ్రయొనేజిలులాంటి జీవరహిత వ్యవస్థలకు వాడతారు.
ఉదా : i) 4% ఫార్మాల్డిహైడ్ జలద్రావణాన్ని ఫార్మలిన్ అంటారు.
ii) 0.3 ppm గాఢత గల క్లోరిన్ ద్రావణం క్రిమిసంహారిణిగా వాడతారు.
యాంటీసెప్టిక్లు (చీము నిరోధులు) :
యాంటీ సెప్టిక్లు అనేది సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించేవి (లేదా) వాటిని నాశనం చేసేవి. వీటిని గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన’ చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూస్తారు.
ఉదా : డెట్టాల్, బితియనోల్.
“యాంటీబయోటిక్లు బాక్టీరియా, ఫంగస్, బూజు లాంటి సూక్ష్మజీవుల నుంచి ఉత్పన్నమై ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా వాటిని నాశనం చేసే రసాయన పదార్థాలు”.
(లేదా)
“యాంటీబయోటిక్ అనేది పూర్తిగా కాని, కొంత భాగంగా కాని రసాయన పద్ధతిలో తయారు చేయబడి తక్కువ గాఢతలో ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా అంతం చేసే రసాయన పదార్థం”.
ఉదా : పెనిసిలీన్, క్లోరామ్ ఫెనికోల్, సల్ఫాడయాజీన్ మొ||నవి..
ప్రశ్న 4.
క్రింది వాటిని గురించి లఘు వ్యాఖ్యలు వ్రాయండి. [TS. Mar.’16]
ఎ) కృత్రిమ తీపి కారకాలు బి) నిల్వ ఉంచే ఆహార పదార్థాల పరిరక్షకాలు సి) యాంటీ ఆక్సీకరణులు
జవాబు:
ఎ) కృత్రిమ తీపి కారకాలు :
సహజ చక్కెరలు కాలరీలను పెంచుతాయి. అందువలన వాటి స్థానంలో కృత్రిమ చక్కెరలను వాడుతున్నారు. “ఆహార పదార్థాల్లో చక్కెరకు బదులుగా వాడే రసాయనాలను కృత్రిమ తీపి కారకాలు అంటారు. వీటిని వాడడం వల్ల కాలరీలను నియంత్రించవచ్చు. అదే సమయంలో సుక్రోజ్ కంటే ఆహారానికి ఎంతో తీపినిస్తాయి. చక్కెర వ్యాధి ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగకరం.
ఉదా : i) ఆస్పార్టామ్ సుక్రోజ్ కంటే 100 రెట్లు తీపి ఎక్కువగా ఉంటుంది.
ii) అలిటేమ్ మరియు సుక్రలోజ్ మరికొన్ని ఉదాహరణలు.
- కృత్రిమ తీపి కారకాలు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరమైనవి.
- ఇవి హాని కలిగించవు.
- ఇవి ఆహారం అందించే కేలరీలను నియంత్రిస్తాయి.
ఇది ఆహారం వండే ఉష్ణోగ్రతల వద్ద ఇది అస్థిరమైనది. అందువల్ల దీనిని శీతల ఆహార పదార్థాలలో, శీతల పానీయాలలో మాత్రమే ఉపయోగిస్తారు.
మధుమేహ రోగి వాడే తీపి పదార్థాల తయారీలో వాడే కృత్రిమ తీపి కారకం సాకరీన్. ఇది ఆహారం వండే ఉష్ణోగ్రత వద్ద స్థిరమైనది.
అలిటేమ్ అత్యధిక తియ్యదనాన్ని అందించే కృత్రిమ తీపికారకం. దీనిని వాడినప్పుడు అది అందించే తియ్యదనాన్ని నియంత్రించడం చాలా కష్టం.
బి) నిల్వ ఉంచే ఆహార పదార్థాల పరిరక్షకాలు :
సూక్ష్మజీవుల వృద్ధి ద్వారా ఆహార పదార్థాలు చెడిపోయే ప్రమాదం నుంచి ఇవి ఆహార పదార్థాలను సంరక్షిస్తాయి. సాధారణ ఉప్పు, పంచదార, వంటనూనెలు, సోడియమ్ బెంజోయేట్ CH, COONa ఇవన్నీ మనం సామాన్యంగా ఉపయోగించే ఆహార పదార్థాల సంరక్షకాలు. తక్కువ పరిమాణాలలో కూడా ఉపయోగించే అతి ముఖ్యమైన సంరక్షక పదార్థం, సోడియమ్ బెంజోయేట్. ఇది జీవక్రియలో హిప్యూరిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ ఆమ్లం మూత్రం ద్వారా బహిష్కృతమవుతుంది. సార్బిక్ ఆమ్లం, ప్రొపనోయిక్ ఆమ్ల లవణాలను కూడా సంరక్షక పదార్థాలుగా వాడతారు.
సి) యాంటీఆక్సీకరణులు :
- ఇవి ముఖ్యమైన, అవసరమైన ఆహారసంకలితాలు.
- ఇవి ఆహార పదార్థాలపై ఆక్సిజన్ జరిపే చర్యవేగాన్ని తగ్గించి ఆహార పదార్థాల సంరక్షణకు తోడ్పడతాయి.
- ఇవి తాము సంరక్షించే ఆహార పదార్థాలతో కంటే ఆక్సిజన్తో అధిక చర్యాశీలతను ప్రదర్శిస్తాయి.
- బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీటోలిన్ (BHT), బ్యుటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్ (BHA) లు రెండూ అతి ప్రాచుర్యం- గల యాంటీ ఆక్సీకరణులు.
- వెన్నకు BHA కలిపితే చెడిపోకుండా ఉండే నిల్వకాలం నెలల నుండి సంవత్సరాలకు పెరుగును.
- BHT, BHA లను సిట్రిక్ ఆమ్లంతో కలిపి అధిక ప్రభావం కోసం వాడతారు..
- వైను, బీరు, చక్కెరపాకం, ముక్కలుగా కోసిన లేదా తొక్కలుతీసిన పండ్లు, ఎండబెట్టిన పండ్లు, కూరగాయలు మొదలగువాటిని SO2, సల్ఫైట్లను యాంటీ ఆక్సీకరణులుగా వాడతారు.
ప్రశ్న 5.
క్రింది వాటిని గురించి లఘు వ్యాఖ్యలు వ్రాయండి.
ఎ) సబ్బులు బి) కృత్రిమ డిటర్జెంట్లు
జవాబు:
ఎ) సబ్బులు :
రసాయనికంగా సబ్బులు పొడవైన శృంఖలాలుగల కొవ్వు ఆమ్లాల సోడియం (లేదా) పొటాషియం లవణాలు. కొవ్వు పదార్థాన్ని సోడియం హైడ్రాక్సైడ్ జల ద్రావణంతో కలిపి వేడిచేసి సోడియం లవణాలు గల సబ్బులను తయారుచేస్తారు. దీనినే సబ్బు ఏర్పడే చర్య అంటారు.
కఠిన జలంలో కాల్షియమ్, మెగ్నీషియమ్ అయాన్లు ఉంటాయి. కఠినజలంలో సోడియం లేదా పొటాషియమ్ సబ్బులను కరిగిస్తే ఇవి వరసగా కరగని కాల్షియమ్, మెగ్నీషియమ్ సబ్బులను ఏర్పరుస్తాయి. ఈ కరగని సబ్బులు మడ్డి రూపంలో వేరుపడతాయి. కాబట్టి ఇవి శుభ్రపరిచే కారకాలుగా పనిచేయవు. ఎందుకంటే ఈ అవక్షేపాలు వస్త్రాలపై జిగురు పదార్థాలుగా అతుక్కుపోతాయి. ఈ జిగురు అవక్షేపం కారణంగానే కఠినజలంతో శుభ్రపరచిన తలవెంట్రుకలు కాంతిహీనంగా ఉంటాయి. కఠినజలంలో సబ్బుతో శుభ్రపరిచిన వస్త్రాలపై రంగులు సజాతీయంగా అభిశోషించబడవు. ఈ జిగురుగా ఉండే అవక్షేపమే దీనికి కూడా కారణం.
బి) కృత్రిమ డిటర్జెంట్లు :
సంక్లిష్ట డిటర్జెంట్లు :
సబ్బు ధర్మాలన్నీ ఉండి, వాటిలో మాత్రం సబ్బులు లేని శుభ్రపరిచే కారకాలను సంక్లిష్ట లేదా కృత్రిమ డిటర్జెంట్లు అంటారు. వీటిని కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు. ఉదా : సోడియం డోడెకైల్ బెంజీన్ సల్ఫోనేట్.
కఠినజలంతో సబ్బులు పనిచేయవు. కృత్రిమ డిటర్జెంట్లు కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు. ఈ డిటర్జెంట్లు ఐస్తో చల్లబరిచిన నీటిలోను నురుగును ఏర్పరుస్తాయి.
సంక్లిష్ట డిటర్జెంట్లను మూడు వర్గాలుగా విభజించారు.
- ఆనయానిక డిటర్జెంట్లు,
- కాటయానిక డిటర్జెంట్లు,
- అయానేతర డిటర్జెంట్లు.
i) ఆనయానిక డిటర్జెంట్లు :
పొడవైన కార్బన్ గొలుసు నిర్మాణాలు గల సల్ఫోనేటెడ్ ఆల్కహాల్ల లేదా సల్ఫోనేటెడ్ హైడ్రోకార్బన్ల సోడియమ్ లవణాలే అయానిక డిటర్జెంట్లు. పొడవైన కర్బన గొలుసుల నిర్మాణాలు గల ఆల్కహాల్లను, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపించి, తరవాత క్షారంతో తటస్థీకరణ చర్యకు గురిచేసినప్పుడు ఆనయానిక డిటర్జెంట్లు ఏర్పడతాయి. ఇదేవిధంగా ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లాలను క్షారాలతో తటస్థీకరణం చెందించినప్పుడు కూడా ఇవి ఏర్పడతాయి.
ఆనయానిక డిటర్జెంట్లలో అణువులోని ఆనయాన్ భాగం మాత్రమే శుభ్రపరిచే ప్రక్రియలో పాల్గొంటుంది. ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ల సోడియమ్ లవణాలు అతి ముఖ్యమైన ఆనయానిక డిటర్జెంట్లు. ఇవి మన ఇండ్లలో విరివిగా వాడతారు. ఆనయాన్ డిటర్జెంట్లను టూత్పేస్టులలో కూడా వాడతారు.
ii) కాటయానిక డిటర్జెంట్లు :
ఎసిటేట్లు, క్లోరైడ్లు, బ్రోమైడ్లు ఆనయాన్లుగా గల ఎమీన్ క్వాటర్నరీ అమోనియమ్ లవణాలే కాటయానిక్ డిటర్జెంట్లు. కాటయాన్ భాగంలో పొడవైన హైడ్రోకార్బన్ గొలుసు ఉంటుంది. నైట్రోజన్పై ధనావేశం ఉంటుంది. కాబట్టి వీటిని కాటయానిక డిటర్జెంట్లు అంటారు. సిటైల్ ట్రై మిథైల్ అమోనియమ్ బ్రోమైడ్ చాలా ఎక్కువగా వాడకంలో ఉన్న కాటయాన్ డిటర్జెంటు. దీనిని హెయిర్ కండిషనర్లలో (hair conditioners) వాడతారు. వీటికి క్రిములను నాశనం చేసే ధర్మం ఉంది. ఇవి చాలా ఖరీదైనవి. కాబట్టి ఇవి తక్కువ స్థాయిలోనే వాడకంలో ఉన్నాయి.
iii) అయానేతర డిటర్జెంట్లు :
వీటి నిర్మాణంలో అయాన్లు ఉండవు. పాలిఇథైల్ గ్లైకాల్, స్టియరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు అటువంటి ఒక డిటర్జెంటు ఏర్పడుతుంది.
పాత్రలను శుభ్రంచేసే ద్రవ రూపంలో ఉండే డిటర్జెంట్లు అయానేతర డిటర్జంట్ల రకానికి చెందినవి.
పాఠ్యాంశ ప్రశ్నలు Intext Questions
ప్రశ్న 1.
నిద్రలేమితో బాధపడుతున్న రోగులకు నిద్ర రావడానికిగాను వైద్యుడు నిద్రవచ్చే మాత్రలను సిఫారసు చేస్తాడు. అయితే వైద్యుని సంప్రదించకుండా వీటిని అధిక మోతాదులలో వాడకూడదు. దీనికి కారణం తెలపండి.
జవాబు:
చాలా మందులు సిఫారసు చేసిన మోతాదులకు మించిన మోతాదులలో సేవిస్తే ఇవి హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. విషపదార్థాలుగా పనిచేస్తాయి. కాబట్టి మందును సేవించే ముందుగా డాక్టరు సలహా తీసుకోవాలి.
ప్రశ్న 2.
‘రెనిటిడీన్ ఆమ్ల విరోధి’ అనేది ఏ వర్గీకరణ ఆధారంగా ఇచ్చిన వివరణ?
జవాబు:
మందుల చికిత్స చర్యాశీలత ప్రభావం ఆధారంగా చేసిన వర్గీకరణానికి సంబంధించిన వ్యాఖ్య. జీర్ణకోశంలో ఏర్పడిన అధిక పరిమాణ ఆమ్లం ప్రభావాన్ని ప్రతిఘటించడానికి ఉపయోగించే మందును ఆమ్ల. విరోధి అంటారు.
ప్రశ్న 3.
మనం కృత్రిమ తీపి కారకాలను ఎందుకు ఉపయోగిస్తాం?
జవాబు:
కృత్రిమ తీపి కారకాల ఉపయోగాలు :
- సహజ చక్కెరలు కాలరీలను పెంచాతాయి. అందువల్ల వాటి స్థానంలో కృత్రిమ చక్కెరలను వాడుతున్నారు. ఇవి మూత్రం తేలికగా బయటకుపోతాయి.
ద్వారా - వీటిని వాడడం వల్ల కాలరీలను నియంత్రించవచ్చు. ఇది చక్కెర వ్యాధి (diabeties) ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది.
- ఆహారం తియ్యదనాన్ని నియంత్రించడం చాలా కష్టం. సుక్రొలోస్ (కృత్రిమ తీపి కారకం) రూపు, రుచులు చక్కెరలను పోలి ఉంటాయి. దీనితో కాలరీలు రావు. “
ప్రశ్న 4.
గ్లిసరైల్ ఓలియేట్, గ్లిసరైల్ పామిటేట్ల నుంచి సోడియం సబ్బులను తయారుచేసే చర్యలకు రసాయన సమీకరణాలు వ్రాయండి. వీటి నిర్మాణాత్మక ఫార్ములాలు క్రింద ఇవ్వడమైంది.
i) (C15H31COO)3 C3H5 – గ్లిసరైల్ పామిటేట్
ii) (C17H32COO3 C3H5 – గ్లిసరైల్ ఓలియేట్
జవాబు:
ప్రశ్న 5.
ద్రవ డిటర్జెంట్లలో, ఎమల్సీకరణ కారకాలు, తడిని సమకూర్చే కారకాలలో క్రింది రకం అయానేతర డిటర్జెంట్లు ఉన్నాయి. అణువులోని హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ భాగాలను గుర్తించండి. అణువులోని ప్రమేయ వర్గాలను కూడా తెలపండి.
జవాబు:
b) ప్రమేయ వర్గాలు : ఈథర్ మరియు ఆల్కహాల్.