Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Chemistry Study Material 11th Lesson హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు Textbook Questions and Answers.
AP Inter 2nd Year Chemistry Study Material 11th Lesson హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్రింది సమ్మేళనాల నిర్మాణాలను వ్రాయండి.
ఎ) 2 – క్లోరో 3 – మిథైల్ పెంటేన్,
బి) 1 – 4 సెకండరీ బ్యుటైల్ – 2 – మిథైల్ బెంజీన్
జవాబు:
ఎ) 2 – క్లోరో – 3 – మిథైల్ పెంటేన్
నిర్మాణము :
బి) 1 – బ్రోమో మిథైల్ బెంజీన్
నిర్మాణము :
ప్రశ్న 2.
క్రింది వాటిలో దేనికి ఎక్కువ ద్విధ్రువ భ్రామకం ఉంటుంది?
ఎ) CH2Cl2
బి) CHCl3
సి) CCl4
జవాబు:
ఇవ్వబడిన సమ్మేళనాలలో CH2Cl2 కు ఎక్కువ ద్విధృవ భ్రామకం కలిగి ఉంటుంది. (µ = 1.62 D)
- CCl4 కు సున్నా ద్విధృవ భ్రామకం కలిగి ఉండును.
- CHCl3 కి ద్విధృవ భ్రామకం1.03D.
ప్రశ్న 3.
ఆంబిడెంట్ న్యూక్లియోఫైల్లు అంటే ఏవి?
జవాబు:
ఆంబిడెంట్ న్యూక్లియోఫైల్లు : రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రదేశాలలో చర్యాశీలత కలిగి ఉన్నటువంటి న్యూక్లియోఫైల్లను ఆంబిడెంట్ న్యూక్లియోఫైల్లు అంటారు.
ఉదా : CN–.
ప్రశ్న 4.
C4H9Br అనే సమ్మేళనానికి ఉండే సదృశకాలను వ్రాయండి.
జవాబు:
C4H9Br అణుఫార్ములాకు గల సదృశకాలు ఐదు.
ప్రశ్న 5.
క్రింది సమ్మేళనాల జతలలో ఏది – OH సమూహంతో S2 చర్య పొందుతుంది?
ఎ) CH3Br లేదా CH3I
బి) (CH3)3 CCl లేదా CH3Cl
జవాబు:
ఎ) OH సమూహంలో CH3 – I, CH3Br కన్నా త్వరితగతిన SN² చర్య జరుపును.
కారణం :
C – I బంధ వియోగ ఎంథాల్పీ విలువ C – Br బంధ వియోగ ఎంథాల్పీ విలువ కన్నా తక్కువ.
బి) OH సమూహంతో CH3Cl, (CH3)3 C – Cl కన్నా త్వరితగతిన SN² చర్య జరుపును.
కారణం :
SN² చర్యలలో ఆల్కైల్ హాలైడ్ల చర్యాశీలత క్రమం 1° – ఆల్కైలోలైడ్ > 2° – ఆల్కైల్ హాలైడ్ > 3° – ఆల్కెల్ హాలైడ్.
ప్రశ్న 6.
ఆల్కైల్లైట్లు ధ్రువాత్మకాలు (Polar) అయినప్పటికీ నీటిలో కరగవు. ఎందువల్ల?
జవాబు:
ఆల్కెల్హాలైడ్లు ధృవాత్మకాలు అయినప్పటికీ నీటిలో కరగవు,
కారణం :
నీటి అణువులనందు బలమైన హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. వీటిని విచ్ఛిన్నం చేయుటకు తగిన శక్తి ఆల్కైల్ హాలైడ్లు కలిగి ఉండవు.
ప్రశ్న 7.
C6H5CH2Cl, C6H5CHClC6H5 లలో ఏది జల KOH తో సులభంగా జల విశ్లేషణ చెందుతుంది?
జవాబు:
C6H5CH2Cl, C6H5CHClC6H5 లలో C6H5 CHClC5H5 KOH జలద్రావణంలో సులభంగా జలవిశ్లేషణ జరుపును.
- పై విషయాన్ని SN¹ చర్యా విధానంను తీసుకొని వివరించవచ్చును.
- SN¹ చర్యలలో చర్యాశీలత కార్బోకాటయాన్ స్థిరత్వంపై ఆధారపడును.
- C6H5 CHCl C6H5 C6H5 CH2Cl కన్నా స్థిరమైన కార్బోకాటయానన్ను ఏర్పరచును.
ప్రశ్న 8.
ఆల్కైల్ హాలైడ్లను KOH జల ద్రావణంతో చర్య జరిపితే ఆల్కహాల్లు ఏర్పడతాయి. అయితే వీటిని ఆల్కహాలిక్ KOH ‘తో చర్య జరిపితే ఎటువంటి ఉత్పన్నాలు ఏర్పడతాయి?
జవాబు:
ఆల్కెల్ హాలైడ్లను KOH జల ద్రావణంతో చర్య జరుపగా ఆల్కహాల్ ఏర్పడును.
ఉదా : C2H5Cl + KOH(జల) → C2H5OH + KCl
ఆల్కైల్ హాలైడ్లను KOH ఆల్కహాల్ ద్రావణంతో చర్య జరుపగా ఆల్కీన్లు ఏర్పడును.
ఉదా : C2H5Cl + KOH(ఆల్కహాల్) → C2H4 + KCl + H2O
ప్రశ్న 9.
Sn¹, Sn² చర్యలలో త్రిమితీయ రసాయన (Stereo Chemical) ప్రభావం ఏమిటి? [TS. Mar.’17]
జవాబు:
- SN¹ చర్య యొక్క త్రిమితీయ రసాయన ప్రభావం రెసిమీకరణ ఉత్పన్నం.
- SN² చర్య యొక్క త్రిమితీయ రసాయన ప్రభావం విలోను ఉత్పన్నం.
ప్రశ్న 10.
o, m, p – డై క్లోరో బెంజీన్లు ఎటువంటి స్థాన సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి?
జవాబు:
o, m మరియు p – డైక్లోరో బెంజీన్లు స్థాన సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి స్థాన సదృశకాలు.
ప్రశ్న 11.
ఎనాన్షియోమర్లు అంటే ఏమిటి?
జవాబు:
ఎనాన్షియోమర్లు :
అధ్యారోపితాలు కాని, దర్పణ ప్రతిబింబాలు అయి ఒకదానికొకటి సంబంధం కలిగియుండు త్రిమితీయ సదృశకాలను ఎనాన్షియోమర్లు అంటారు.
- వీటికి ఒకేరకమైన భౌతిక ధర్మాలు కలిగి ఉంటాయి.
- ఇవి ధృవణ కాంతి భ్రమణంలో విభిన్నత కలిగి ఉంటాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్రింది వాటి IUPAC పేర్లు వ్రాయండి.
a) CH3CH (Cl) CH (I) CH3
b) ClCH2CH = CHCH2Br
c) (CCl3)3 CCl
d) CH3C (p – Cl – C6H4)2 CH (Br) CH3
జవాబు:
ప్రశ్న 2.
క్రింది కర్బన హాలైడ్ల నిర్మాణాలు వ్రాయండి.
ఎ) 1 – బ్రోమో – 4 – సెకండరీ బ్యుటైల్ – 2 – మిథైల్ బెంజీన్
బి) 2 – క్లోరో – 1 – ఫినైల్ బ్యుటేన్
సి) p – బ్రోమో క్లోరో బెంజీన్
డి) 4 – టెర్షియరీ బ్యుటెల్ – 3 – అయోడోహెప్టేన్
జవాబు:
ఎ) 1- బ్రోమో – 4 – సెకండరీ బ్యుటెల్ – 2 – మిథైల్ బెంజీన్
నిర్మాణం :
ప్రశ్న 3.
C5H10, అణు సంకేతం గల హైడ్రోకార్బన్ చీకట్లో క్లోరిన్తో చర్య పొందదు కానీ సూర్యకాంతి సమక్షంలో C5H9Cl అనే ఒకే మోనో క్లోరో హైడ్రోకార్బన్ ను ఏర్పరుస్తుంది. హైడ్రోకార్బను గుర్తించండి.
జవాబు:
ఇవ్వబడిన సమ్మేళన అణుఫార్ములా C5H10 ఇది C2H2n అను సాధారణ ఫార్ములా కలిగి ఉన్నది. కావున ఇది ఆల్కీన్ (లేదా) సైక్లో ఆల్కేన్ కావచ్చు.
హైడ్రోకార్బన్ చీకట్లో క్లోరిన్తో చర్య పొందదు కావున అది ఆల్కీన్ కాదు. సైక్లోఆల్కేన్ అగును.
ప్రశ్న 4.
క్రింది సమ్మేళనాల జతలలో ఏ సమ్మేళనం – OH గ్రూపుతో S2 లో వేగంగా పాల్గొంటుంది.
ఎ) CH3Br లేదా CH3I
బి) (CH3)3 CCl లేదా CH3Cl
జవాబు:
ఎ) OH సమూహంలో CH3 – I, CH3Br కన్నా త్వరితగతిన SN² చర్య జరుపును.
కారణం :
C-I బంధ వియోగ ఎంథాల్పీ విలువ C – Br బంధ వియోగ ఎంథాల్పీ విలువ కన్నా తక్కువ.
బి) OH సమూహంతో CH3Cl, (CH), C – CI కన్నా త్వరితగతిన SN² చర్య జరుపును.
కారణం :
SN² చర్యలలో ఆల్కైల్ హాలైడ్ల చర్యాశీలత క్రమం 1° – ఆల్కైల్లైడ్ > 2° – ఆల్కైల్ హాలైడ్ > 3° – ఆల్కైల్ హాలైడ్.
ప్రశ్న 5.
క్రింది చర్యలలో ఏర్పడే ఆల్కీన్లను గుర్తించి వాటిలో ఏది ప్రధాన ఉత్పన్నమో వ్రాయండి.
జవాబు:
ప్రశ్న 6.
క్రింది మార్పులను ఏ విధంగా చేస్తారో తెలపండి.
ఎ) ఈథేన్ న్ను బ్రోమో ఈథీన్
బి) టోలీసు బెంజైల్ ఆల్కహాల్గా
జవాబు:
ఎ) ఈథేన్ నుండి బ్రోమో ఈథీన్ :
ప్రశ్న 7.
క్లోరోబెంజీన్ ద్విధృవ భ్రామకం సైక్లోహెక్సెల్ క్లోరైడ్ ద్విధ్రువ భ్రామకం కంటే ఎందుకు తక్కువ వివరించండి.
జవాబు:
‘క్లోరో బెంజీన్’ ద్విధృవ భ్రామకం సైక్లో హెక్సెల్ క్లోరైడ్ ద్విధృవ భ్రామకం కన్నా తక్కువ.
వివరణ :
- క్లోరో బెంజీన్లో C – Cl బంధ ధృవణత సైక్లోహెక్సెల్ క్లోరైడ్ C – Cl బంధ ధృవణత కన్నా తక్కువ.
- క్లోరోబెంజీన్లో ‘C’ పరమాణువులు sp² చెంది ఉంటాయి. సైక్లోహెక్సెల్ క్లోరైడ్ లో Sp³ సంకరీకరణం చెంది ఉంటాయి.
ప్రశ్న 8.
క్రింది చర్యలో జరిగే చర్యావిధానం వ్రాయండి.
జవాబు:
ఇవ్వబడిన చర్య
చర్యా విధానం :
KCN అయనీకరణం : KCN → K+ + CN–
CNΘ అయాన్ ఆంబిడెంట్ న్యూక్లియోఫైల్. ఇది C – పరమాణువు లేదా N – పరమాణువు నుండి చర్యాశీలత కలిగియుండును. కానీ KCN వంటి ద్రావణుల సమక్షంలో సైనైడ్ను ప్రధాన ఉత్పన్నంగా ఏర్పరచును.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్రింది హాలైడ్ల పేర్లను IUPAC పద్ధతిలో రాసి ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, వినైల్ లేదా ఎరైల్ హాలైడ్లుగా గుర్తించండి.
ఎ) CH3CH (CH3) CH (Br) CH3
బి) CH3Cl (Cl) (C2H5) CH2CH3
సి) m – ClCH2C6H4CH2C (CH3)3
డి) o – Br – C6H4 CH(CH3) CH2CH3
జవాబు:
ప్రశ్న 2.
క్రింది కర్బన హాలోజన్ సమ్మేళనాల నిర్మాణాలు వ్రాయండి.-
ఎ) 2-బ్రోమో-3-మిథైల్ హెక్సేన్
బి) 2-(2-క్లోరోఫినైల్)-1-అయొడోఆక్టేన్
సి) 4-టెర్షియరీబ్యుటైల్-3-అయొడో బెంజీన్
డి) 1-బ్రోమో-4-సెకండరీ బ్యుటెల్-2-మిథైల్ బెంజీన్
జవాబు:
ఎ) 2-బ్రోమో-3-మిథైల్ , హెక్సేన్
ప్రశ్న 3.
హాలో ఆల్కేన్ల భౌతిక ధర్మాలను వివరించండి.
జవాబు:
హాలో ఆల్కేన్ల భౌతిక ధర్మాలు :
- స్వచ్ఛమైన స్తితిలో ఆల్కైల్ హాలైడ్లు రంగులేని పదార్థాలు.. అయితే బ్రోమైడ్లు, అయొడైడ్లు కాంతి సమక్షంలో రంగును ప్రదర్శిస్తాయి.
- చాలా బాష్పశీల హాలోజన్ సమ్మేళనాలు తీపివాసన కలిగియుంటాయి.
- సామాన్య ఉష్ణోగ్రత వద్ద మిథైల్ క్లోరైడ్, ఇథైల్ క్లోరైడ్ మరియు కొన్ని క్లోరో ఫ్లోరో మీథేన్లు వాయువులు.
- ఆల్కైల్ హాలైడ్లు అణుభారం పెరిగే కొద్దీ ద్రవ, ఘన పదార్థాలుగా ఉంటాయి.
- ఆల్కెల్ హాలైడ్లు అదే అణుభారం కలిగిన హైడ్రోకార్బన్ల కంటే బాష్పీభవన, ద్రవీభవన స్థానాలు అధికంగా ఉంటాయి. క్లోరైడ్లు, బ్రోమైడ్లు, అయొడైడ్లకు వాటి హైడ్రోకార్బన్ల కంటే బాష్పీభవన స్థానాలు అధికంగా ఉంటాయి.
- ఆల్కెల్ హాలైడ్ల సాంద్రతలు వాటిలోని కార్బన్ పరమాణువుల సంఖ్య, హాలోజన్ పరమాణువుల సంఖ్య, హాలోజన్ పరమాణువుల ద్రవ్యరాశి పెరిగేకొద్దీ పెరుగుతాయి.
- హాలో ఆల్కేన్లు నీటిలో చాలా తక్కువగా కరుగుతాయి మరియు కర్బన ద్రావణులలో అధికంగా కరుగుతాయి.
ప్రశ్న 4.
న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ ద్వి అణుక చర్య (SN²) యొక్క చర్యా విధానాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. [TS. Mar.’15; Mar. ‘1
జవాబు:
న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ ద్వి అణుక చర్య (SN²)
- ఏ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలో చర్యరేటు రెండు క్రియాజనకాల గాఢతలపై ఆధారపడుతుందో దానిని SN² చర్య అంటారు.
- ఇవి చర్య క్రమాంకం రెండు విలువను కలిగి ఉంటాయి. అందువలన వీటిని ద్వి అణుక చర్యలు అంటారు.
ఉదా : మిథైల్ క్లోరైడ్ హైడ్రాక్సైడ్ అయాన్తో చర్యజరిపి మిథనోల్ మరియు క్లోరైడ్ అయాను ఏర్పరచును. - ఇక్కడ చర్యరేటు రెండు క్రియాజనకాల గాఢతలపై ఆధారపడి ఉంటుంది.
ఈ చర్యలో కొత్తగా వచ్చే న్యూక్లియోఫైల్ ఆల్కైల్ హాలైడ్లో చర్య జరిపే కార్బన్ – హాలోజన్ బంధాన్ని విచ్ఛిన్నం చేసి కొద్దిగా కార్బన్ – OH బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ చర్యా మధ్యస్థం ఏర్పడదు. చర్య జరుగుతున్నప్పుడు న్యూక్లియోఫైల్ కార్బన్ల మధ్య బంధం ఏర్పడటం మొదలైతే కార్బన్ స్థానభ్రంశం చెందే న్యూక్లియోఫైల్ల మధ్య బంధం బలహీనమై సంధిస్థితిని ఏర్పరుస్తుంది. అంటే కొత్త న్యూక్లియోఫైల్ స్థానభ్రంశం చెంది న్యూక్లియోఫైల్ ఉన్నవైపు కాకుండా దానిని వెనుకవైపు నుంచి బంధం ఏర్పడటం వల్ల ఆ కార్బన్ విన్యాసం తిరగబడుతుంది. దీనిని పెనుగాలిలో గొడుగు తిరగబడినట్లుగా ఊహించవచ్చు. ఈ ప్రక్రియను “విలోమ విన్యాసం” (Inversion of Configuration) అంటారు.
ఆల్కెల్ హాలైడ్లు చర్యాక్రమం (SN² చర్యలలో) ప్రైమరీ హాలైడ్ > సెకండరీ హాలైడ్ > టెర్షియరీ హాలైడ్.
ప్రశ్న 5.
అల్లెలిక్, బెంజైలిక్ SN¹ ప్రతిక్షేపణ చర్యలలో చర్యాశీలత చూపిస్తే 1 – హాలో, 2, హాలో బ్యుటేన్లు ముఖ్యంగా SN² ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి. ఎందుకో వివరించండి.
జవాబు:
అల్లెలిక్, బెంజైలిక్ హాలైడ్లు SN¹ చర్యలలో చర్యాశీలతను చూపిస్తాయి.
కారణం :
రెజోనెన్స్ పద్ధతి ద్వారా ఏర్పడిన కార్బో కాటయాన్ స్థిరత్వాన్ని పొందును.
1 – హాలో మరియు 2 – హాలో బ్యుటేన్లు ముఖ్యంగా SN² చర్యలలో పాల్గొంటాయి.
కారణం :
SN² చర్యలలో సంధి స్థితి ఏర్పడుట జరుగును. ప్రాదేశిక అవరోధం ఎక్కువగా ఉన్నప్పుడు సంధిస్థితి స్థిరత్వం తక్కువగా ఉండును. ఇవ్వబడిన 1 హాలో, 2 హాలో బ్యూటేన్లలో తక్కువ ప్రాదేశిక అవరోధం కలిగి ఉండును. కావున ప్రధానంగా SN² చర్యలలో పాల్గొంటాయి.
ప్రశ్న 6.
2 – బ్రోమో బ్యుటేన్ జలవిశ్లేషణ చర్యపై త్రిమితీయ రసాయన ప్రభావాన్ని వివరించండి.
జవాబు:
S-2-బ్రోమోబ్యుటేన్ జలవిశ్లేషణ చేయగా R-2-బ్యుటనోల్ ఏర్పడును. ఇచ్చట OH – సమూహం బ్రోమైడ్ ఉన్న దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇది SN² చర్యకు ఉదాహరణ. SN² చర్యలలో ధృవణ భ్రమణం కలిగిన ‘హాలైడ్లలో విన్యాస విలోమం ఏర్పడును.
ప్రశ్న 7.
ధ్రువణ భ్రమణత (Optical activity) లక్షణాలేమిటి ? రెండు కైరల్ అణువులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఎ) ధృవణ భ్రమణత :
ఒక రసాయన పదార్థంచే ధృవిత కాంతి భ్రమణం చెందుటను ధృవణ భ్రమణత అంటారు.
- ధృవిత కాంతి కుడివైపుకు భ్రమణం చెందితే ఆ పదార్థాన్ని డెక్స్ భ్రమణ పదార్థం అంటారు.
- ధృవిత కాంతి ఎడమ వైపుకు భ్రమణం చెందితే ఆ పదార్థాన్ని లీవో భ్రమణ పదార్థం అంటారు.
ధృవణ భ్రమణత లక్షణాలు :
కైరాలిటి (లేదా) అసౌష్ఠవతలు ఒక అణువులో ఉన్నపుడు ఆ అణువు ధృవణ భ్రమణతను చూపును.
బి) కైరాలిటీ :
అధ్యారోపితం చెందని దర్పణ ప్రతిబింబాలు గల వస్తువులను కైరల్ అని ఆ ధర్మాన్ని కైరాలిటీ అంటారు. ఒక అణువులో అసౌష్ఠవత కలిగి యుండుట ఆ అణువు ధృవణ భ్రమణతకు ప్రధాన కారణం.
ఉదా : 1) 2 – బ్యుటనోల్ 2) 2 – క్లోరో బ్యుటేన్ 3) 2 – బ్రోమో ప్రోపనోయిక్ ఆమ్లం
ప్రశ్న 8.
క్రింది వాటిని నిర్వచించండి. [ AP. Mar.’17]
ఎ) రెసిమిక్ మిశ్రమం
బి) యథాతథ విన్యాసం (retention of configurátion)
సి) ఎనాన్షియోమర్లు
జవాబు:
ఎ) రెసిమిక్ మిశ్రమం :
ఎనాన్షియోమర్లను సమపాళ్ళలో సంయోగం చెందించినపుడు ధృవణ భ్రమణత లేని మిశ్రమం ఏర్పడును. దీనినే రెసిమిక్ మిశ్రమం అంటారు.
ఈ మిశ్రమంలో ఒక ఎనాన్షియోమర్ ధృవణ తలాన్ని కుడివైపుకు తిప్పితే రెండవది అంటే మొత్తంలో ఎడమవైపుకు తిప్పి సున్నా భ్రమ కొన్ని చూపుతుంది.
ఎనాన్షియోమర్ను రెసిమిక్ మిశ్రమంగా మార్చడాన్ని రెసిమీకరణం అంటారు.
బి) యథాతథ విన్యాసం (Retention of Configuration) :
ఒక రసాయన చర్యలో ఉత్పన్నానీకి క్రియా జనకానికి వాటి అణువుల్లోని అసౌష్టవ కేంద్రం చుట్టూ ఉండే బంధాలకు ఒకే విధమైన ప్రాదేశిక అమరిక ఉంటే అపుడు దానిని యథాతథ విన్యాసం అంటారు.
ఉదా : XCabc అనే సమ్మేళనం YCabc గా మారి అదే సాపేక్ష విన్యాసం చూపిస్తుంది.
సి) ఎనాన్షియోమర్లు :
అధ్యారోపితాలు కాని, దర్పణ ప్రతిబింబాలు అయి ఒకదానికొకటి సంబంధం కలిగియుండు త్రిమితీయ సదృశకాలను ఎనాన్షియోమర్లు అంటారు. [ AP. Mar.’16]
- వీటికి ఒకేరకమైన భౌతిక ధర్మాలు కలిగి ఉంటాయి.
- ఇవి ధృవ కాంతి భ్రమకంలో విభిన్నత కలిగి ఉంటాయి.
ప్రశ్న 9.
2 – బ్రోమో బ్యుటేన్ డీ హైడ్రో హాలోజనీకరణం చర్యా విధానాన్ని వ్రాయండి.
జవాబు:
2 – బ్రోమోబ్యుటేన్ డీ హైడ్రో హాలోజనీకరణం :
2 – బ్రోమో బ్యుటేన్ ఆల్కహాలిక్ KOH ద్రావణంతో చర్య జరిపి 2 బ్యుటీన్ ను ఏర్పరచును.
చర్యావిధానం :
2 – బ్రోమో బ్యుటేను ఆల్కహాలిక్ KOH ద్రావణంలో వేడిచేయగా β – కార్బన్ నుండి హైడ్రోజన్, α – కార్బన్ నుండి. బ్రోమిన్ విలోపనం చెందుతాయి. దీనినే β – విలోపనం అంటారు.
స్టేట్ జెఫ్ నియమం ప్రకారం ఇక్కడ 2 – బ్యుటీన్. ప్రధాన ఉత్పన్నంగా ఏర్పడును. డీ హైడ్రో హాలోజనీకరణ చర్యలలో సాధ్యమైనంత వరకు ద్విబంధ కార్బన్లపై ఎక్కువ ఆల్కైల్ సమూహాలు ఉన్న ఆల్కీన్ అధికంగా ఏర్పడును.
ప్రశ్న 10.
గ్రిగ్నార్డ్ కారకాలను తయారుచేసే పద్ధతిని వివరించి ఏదైనా ఒక ఉదాహరణతో వాటి ఉపయోగాన్ని వ్రాయండి.
జవాబు:
ఆల్కెల్ మెగ్నీషియం హాలైడ్లకు గ్రిగ్నార్డ్ కారకాలు అంటారు.
తయారీ :
ఆల్కైల్ హాలైడ్లను మెగ్నీషియం లోహంతో పొడి ఈథర్ సమక్షంలో చర్యజరిపి వీటిని తయారు చేయవచ్చు.
ఉపయోగాలు :
ఇథైల్ మెగ్నీషియం క్లోరైడ్
→ గ్రిగ్నార్డ్ కారకాలను అధిక సంఖ్యలో కర్బన సమ్మేళనాలను సంశ్లేషణ చేయుటలో ఉపయోగిస్తారు.
1) ఆల్కేన్ల తయారీ :
గ్రిగ్నోర్డ్ కారకం ఆల్కహాల్తో చర్యజరిపి ఆల్కేను ఏర్పరచును.
2) ఆల్కహాల్ తయారీ :
మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. ఫార్మాల్డీహైడ్తో చర్య జరిపి జలవిశ్లేషణ చేయుట ద్వారా ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడును.
3. కార్బాక్సిలిక్ ఆమ్లాల తయారీ :
గ్రిగ్నార్డ్ కారకాన్ని కార్బాక్సిలేషన్ చేసి జలవిశ్లేషణ చేయుట ద్వారా కార్బాక్సిలిక్ ఆమ్లాలు తయారుచేయవచ్చు.
ప్రశ్న 11.
C4H9Br (A) అనే ప్రైమరీ ఆల్కైలోలైడ్ ఆల్కహాలిక్ KOH తో చర్యపొంది (B) అనే సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. (B) HBr తో చర్యపొంది (C) ను ఏర్పరుస్తుంది. (C), (A) లు సదృశకాలు. (A) ను సోడియమ్ లోహంతో చర్య జరిపితే (D) C8H18 ఏర్పడుతుంది. n – బ్యుటైల్ బ్రోమైడ్న సోడియమ్ లోహంతో చర్యజరిపితే ఏర్పడే (D) C8H18 లు వేరువేరు ఉత్పన్నాలు. (A) నుంచి (D) వరకు నిర్మాణాలను రాసి ఆ చర్యల సమీకరణాలను వ్రాయండి.
జవాబు:
ఇవ్వబడిన 1°- ఆల్కైల్ హాలైడ్ అణుఫార్ములా C4H9Br
C4H9Br (1° – ఆల్కెల్ హాలైడ్) అణుఫార్ములాకు రెండు సదృశకాలు సాధ్యపడతాయి.
సమ్మేళనం ‘A’, Na – లోహంలో n – బ్యుటైల్ బ్రోమైడ్ చర్య జరిపితే ఏర్పడే ఉత్పన్నాన్ని ఏర్పరచదు.
కావున ‘A’ I – సదృశకం కాదు.
n – ఆక్టేన్ ఈ చర్యలో ఏర్పడదు.
కావున సదృశకం – II నే ‘A’ అగును.
ప్రశ్న 12.
క్రింది వ్యాఖ్యలను సమర్థించండి.
ఎ) న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో ఎరైల్ హాలైడ్లు చాలా తక్కువ చర్యాశీలత చూపుతాయి.
బి) క్లోరోబెంజీన్ కంటే p – నైట్రోక్లోరోబెంజీన్, o, p డై నైట్రోక్లోరో బెంజీన్లు వేగంగా న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి.
జవాబు:
ఎ) న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో ఎరైల్ హాలైడ్లు తక్కువ చర్యాశీలతను చూపుతాయి.
వివరణ :
- ఎరైల్ హాలైడ్లలో ‘C’ పరమాణువులు sp² సంకరీకరణం చెందుతాయి. మరియు sp² సంకరీకరణం చెందిన C- పరమాణువు ఎక్కువ S – స్వభావం మరియు ఋణవిద్యుదాత్మకత కలిగి ఉండును. కావున C – X బంధ దైర్ఘ్యం తక్కువగా ఉండును.
- ఎరైల్ హాలైడ్లలో రెజోనెన్స్ ప్రభావం ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- బెంజీన్ వలయంలో π – ఎలక్ట్రాన్లలో హాలోజన్ పరమాణువు పై గల ఎలక్ట్రాన్ జంటలు సంయుగ్మంలో ఉంటాయి.
- పైన C – Br బంధం పాక్షికంగా ద్విబంధం స్వభావాన్ని కలిగియుంటుంది. ఇది రెజోనెన్స్ వల్ల ఏర్పడుతుంది. ఈ బంధం వియోగం కష్టతరమైనది.
- ఎరైల్ హాలైడ్లలో ఏర్పడిన ఫినైల్ కాటయాన్ రెజోనెన్స్ ద్వారా స్థిరత్వం పొందలేదు.
బి) క్లోరోబెంజీన్ కంటే p – నైట్రోక్లోరో బెంజీన్, o, p – డైనైట్రోక్లోరో బెంజీన్లు వేగంగా న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి.
వివరణ :
- – NO2 వంటి ఎలక్ట్రాన్ ఆకర్షక గ్రూపులు o, p – స్థానాలలో వలయంలో ఉండుట వలన బంధం విఘటనం సులువుగా జరుగును.
- – NO2 సమూహాలు పెరిగే కొలది ఎరైలోలైడ్ల చర్యాశీలత పెరుగును. దీనిని ఈ క్రింది చర్యలు బలపరుస్తాయి.
ప్రశ్న 13.
క్రింది మార్పులను ఏవిధంగా చేయవచ్చో వివరించండి.
ఎ) ప్రొపీన్ నుంచి ప్రొపనోల్
బి) ఇథనాల్ నుండి బ్యుట్ – 1
సి) 1 – బ్రోమో ప్రొపేన్ నుంచి 2 – బ్రోమో ప్రొపేన్
డి) ఎనిలీస్ నుంచి క్లోరో బెంజీన్
జవాబు:
ఎ) ప్రొపేన్ నుండి ప్రొపనోల్ :
ప్రశ్న 14.
క్రింది చర్యలలో ఏ ఉత్పన్నాలు ఏర్పడతాయి? [AP. Mar.’15]
ఎ) n – బ్యుటైల్ క్లోరైడ్ను ఆల్కహాలిక్ KOH తో చర్య జరిపితే
బి) బ్రోమోబెంజీన్ ను అనార్ద్ర ఈథర్ సమక్షంలో Mg తో చర్య జరిపితే
సి) మిథైల్ బ్రోమైడ్ను అనార్ద్ర ఈథర్ సమక్షంలో సోడియమ్ లోహంతో చర్య జరిపితే
జవాబు:
ఎ) n – బ్యుటైల్ క్లోరైడ్ను ఆల్కహాలిక్ KOH తో చర్య జరిపినపుడు డీ హైడ్రోహాలో జనీకరణం చెంది 1 – ఏర్పడును.
బి) బ్రోమో బెంజీన్ న్ను అనార్ధ ఈథర్ సమక్షంలో Mg తో చర్య జరిపితే ఫినైల్ మెగ్నీషియం బ్రోమైడ్ (గ్రిగ్నార్డ్ కారకం) ఏర్పడును.
సి) మిథైల్ బ్రోమైడు అనార్థ ఈథర్ సమక్షంలో సోడియం లోహంతో చర్య జరిపితే ఈథేనన్ను ఏర్పరచును (ఉర్జ్చర్య)
ప్రశ్న 15.
క్లోరో బెంజీన్ను CH3Cl, CH3COCl లతో AlCl3 సమక్షంలో చర్య జరిపితే ఏర్పడే ప్రధాన, అల్ప ఉత్పన్నాలను రాసి ఆ చర్యలను వ్రాయండి.
జవాబు:
1) క్లోరోబెంజీన్ CH3Cl తో AlCl3 సమక్షంలో చర్య జరిపినపుడు మిథైల్ బెంజీన్ (ప్రధానమైనది) మరియు 1 – క్లోరో 2 – మిథైల్ బెంజీన్ (అల్ప ఉత్పన్నం) ఏర్పడును.
2) క్లోరో బెంజీన్ CH3COCl తో AlCl3 సమక్షంలో చర్య జరిపినపుడు 2 – క్లోరో ఎసిటోఫినోన్ (అల్ప ఉత్పన్నం) మరియు 4 – క్లోరో ఎసిటోఫినోన్ (ప్రధాన ఉత్పన్నం) ఏర్పడును.
సాధించిన సమస్యలు Textual Examples
ప్రశ్న 1.
C5H11Br అణు సంకేతం గల సమ్మేళనానికి చెందిన ఎనిమిది నిర్మాణ సదృశకాలను రాయండి. ప్రతి సదృశకానికి IUPAC పేరు రాసి వాటిని ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ బ్రోమైడ్లుగా వర్గీకరించండి.
సాధన:
CH3CH2 CH2CH2 CH2Br – 1 – బ్రోమోపెంటేన్ (1°)
CH3CH2CH2CH(Br)CH3 – 2 – బ్రోమోపెంటేన్ (2°)
CH3CH2CH(Br)CH2 CH3 – 3 – బ్రోమోపెంటేన్ (2°)
(CH3)2CHCH2CH2Br – 1 – బ్రోమో-3 – మిథైలబ్యుటేన్ (1°)
(CH3)2CHCHBгCH3 – 2 – బ్రోమో-3 – మిథైలబ్యుటేన్ (2°)
(CH3)2CBrCH2CH3 – 2 – బ్రోమో-2 – మిథైలబ్యుటేన్ (3°)
CH3CH2CH(CH3)CH2Br – 1 – బ్రోమో-2 – మిథైలబ్యుటేన్ (1°)
(CH3)3CCH2Br – 1 – బ్రోమో-2, 2 – డైమిథైల్ ప్రొపేన్ (1°)
ప్రశ్న 2.
క్రింది వాటికి IUPAC పేర్లను వ్రాయండి.
సాధన:
- 4-బ్రోమోపెంట్-2-ఈన్
- 3-బ్రోమో-2-మిథైలబ్యుట్-1-ఈన్
- 4-బ్రోమో-3-మిథైల్ పెంట్-2-ఈన్
- 1-బ్రోమో-2-మిథైల్ బ్యుట్-2-ఈన్
- 1-బ్రోమోబ్యుట్-2-ఈన్
- 3-బ్రోమో-2-మిథైల్ ప్రొఫీన్
ప్రశ్న 3.
(CH3)2;CHCH2CH3 యొక్క స్వేచ్ఛా ప్రాతిపదిక మోనోక్లోరినీకరణ చర్యలో ఏర్పడే మోనోక్లోరో నిర్మాణాత్మక సదృశకాలను రాయండి.
సాధన:
ఇచ్చిన ఆల్కేన్ అణువులో 4 రకాల హైడ్రోజన్ పరమాణువులున్నాయి. ఈ హైడ్రోజన్లను ప్రతిక్షేపిస్తే కింది సమ్మేళనాలు ఏర్పడతాయి.
ప్రశ్న 4.
కింది చర్యలలో ఏర్పడే ఉత్పన్నాలను రాయండి.
సాధన:
ప్రశ్న 5.
హాలోఆల్కేన్లు KCN తో చర్య జరిపి ఆల్కైల్ సైనైడ్లను, AgCN తో చర్య జరిపి ఆల్కైల్ ఐసోసైనైడ్లను ప్రధాన ఉత్పన్నాలుగా ఏర్పరుస్తాయి. దీనిని వివరించండి,
సాధన:
KCN కు ప్రధానంగా అయానిక స్వభావం ఉండి. ద్రావణంలో సైనైడ్ అయాన్లను ఏర్పరుస్తుంది. సైనైడ్లోని కార్బన్, నైట్రోజన్ పరమాణువులు రెండూ ఎలక్ట్రాన్లను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నా, ముఖ్యంగా కార్బన్ పరమాణువు నుంచే ఎలక్ట్రాన్ల దానం జరుగుతుంది. కాని నైట్రోజన్ నుంఛి కాదు. ఎందుకంటే C-C బంధం CAN బంధం కంటే స్థిరమైనది. AgCN లో సమన్వయ సమయోజనీయ బంధం ఉండి నైట్రోజన్ ఎలక్ట్రాన్లను దానం చేసి ఆల్కైల్ ఐసోసైనైడ్ను ప్రధాన ఉత్పన్నంగా ఏర్పరుస్తుంది.
ప్రశ్న 6.
కింది హాలోజన్ సమ్మేళనాల జతలలో ఏది S2 చర్యలో వేగంగా పాల్గొంటుంది?
సాధన.
అయోడిన్ పరిమాణం పెద్దది కాబట్టి తొందరగా విడిపోవడానికి సులభం అవుతుంది. అంటే న్యూక్లియోఫైల్ ఆల్కైల్ అయొడైడ్ను ఢీకొనగానే వేగంగా విడిపోతుంది.
ప్రశ్న 7.
క్రింద ఇచ్చిన సమ్మేళనాల SI, S2 చర్యలలో వాటి చర్యాశీలత క్రమం వివరించండి.
i) బ్రోమో బ్యుటేన్ నాలుగు సదృశకాలు
ii) C6H5CH2Br, C6H5CH (C6H5) Br, C63H5CH(CH3) Br, C6H5C(CH3) (C6H5) Br
సాధన:
i) SN1 చర్యకు చర్యాశీలత
CH3CH2CH2CH2Br < (CH3)2CHCH2Br < CH3CH2CH(Br)CH3 < (CH3)3CBr
SN2 చర్యకు చర్యాశీలత
CH3CH2CH2CH2Br > (CH3)2CHCH2Br > CH3CH2CH(Br)CH3 > (CH3)3CBr
రెండు ప్రైమరీ బ్రోమైడ్లలో (CH3)2CHCH2 Br నుంచి ఏర్పడిన కార్బోకాటయాన్కు CH3CH2CH2CH2Br నుంచి ఏర్పడిన కార్బోకాటయాన్ కంటే ‘స్థిరత్వం ఎక్కువ ఎందుకంటే (CH3)2CH⊕CH2 కార్బోకాటయాన్లోని (CH3)2CH- సమూహం ప్రేరేపక ప్రభావం వల్ల ఎలక్ట్రాన్లను దానం చేసి స్థిరత్వాన్ని పెంచుతుంది. అందువల్ల SN1 చర్యలలో CH2CH2CH(Br)CH3 కు CH3CH2CH(Br)CH3 కంటే చర్యాశీలత ఎక్కువ.
CH3CH2 CH(Br) CH3 సెకండరీ బ్రోమైడ్, (H3C)3 CBr టెర్షియరీ బ్రోమైడ్ కాబట్టి పైన చర్యాక్రమం S21 చర్యలలో చూపడమైంది. SN2. చర్యలలో ఈ చర్యాక్రమం S2N1 కు వ్యతిరేకంగా ఉంటుంది. ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ చుట్టూ త్రిమితీయ విఘాతం (steric hinderance) ఈ క్రమంలో పెరుగుతుంది.
ii) SN1 చర్యకు
C6H5C(CH3) (C6H5) Br > C6H5CH(C6H5) Br > C6H5CH(CH3) Br > C6H5CH2Br
ii) SN1 చర్యకు
C6H5C(CH3) (C6H5) Br < C6H5CH(C6H5)Br < C6H5CH(CH3)Br < C6H5CH2Br
రెండు సెకండరీ బ్రోమైడ్లలో, C6H5CH(C6H5) Br నుంచి ఏర్పడిన కార్బోకాటయాన్ మధ్యస్థానికి C6H5CH(C6H5)Br నుంచి ఏర్పడిన కార్బోకాటయాన్ మధ్యస్థం కంటే స్థిరత్వం ఎక్కువ. రెండు ఫినైల్ సమూహాలు రెజొనెన్స్ ద్వారా స్థిరత్వాన్ని పెంచుతాయి. కాబట్టి SN1 చర్యలలో C6H5CH(C6H5) Br లోని బ్రోమైడ్ తరువాతదాని కంటే ఎక్కువ చర్యాశీలత చూపుతుంది. ఫినైల్ సమూహం మిథైల్ సమూహం కంటే పరిమాణాత్మకంగా పెద్దది. కాబట్టి SN2 చర్యలలో C6H5CH(C6H5) Br, C6H5CH(CH3) Br కంటే తక్కువ చర్యాశీలత చూపిస్తుంది.
ప్రశ్న 8.
క్రింది సమ్మేళనాల జతలలో కైరల్, ఎకైరల్ అణువులను గుర్తించండి. (వెడ్జ్, గీతల నమూనాలు ఇంటర్ మొదటి సంవత్సరం పటం)
సాధన:
ప్రశ్న 9.
క్లోరిన్ ఎలక్ట్రాన్ ఆకర్షక గ్రూపు అయినప్పటికీ, ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో ఎలక్ట్రోఫైల్ను ఆర్థో, పారా స్థానాలలోకి నిర్దేశిస్తుంది. ఎందుకు?
సాధన:
క్లోరిన్ ప్రేరేపక ప్రభావం వల్ల ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తుంది కాని రెజొనెన్స్ ప్రభావం వల్ల ఎలక్ట్రాన్లను వలయంలోకి విడుదల చేస్తుంది. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలో ఏర్పడే కార్బోకాటయాను క్లోరిన్ ప్రేరేపక ప్రభావం అస్థిరపరుస్తుంది.
హాలోజన్ తన రెజొనెన్స్ ప్రభావంతో కార్బోకాటయాన్ను (ఆర్థో, పారా స్థానాలలో) స్థిరపరుస్తుంది. ప్రేరేపక ప్రభావం రెజొనెన్స్ ప్రభావం కంటే బలమైనది, ఎలక్ట్రాన్లను ఆకర్షించి వలయాన్ని నిరుత్తేజపరుస్తుంది. కానీ రెజొనెన్స్ ప్రభావం ప్రేరేపక ప్రభావానికి వ్యతిరేక దిశలో పనిచేసి ఆర్థో, పారా స్థానాలలో నిరుత్తేజతను తగ్గించి ఎలక్ట్రోఫైల్పై దాడి ఈ స్థానాలలో కలుగజేస్తుంది. ప్రేరేపక ప్రభావం చర్యాశీలతను నియంత్రిస్తే రెజొనెన్స్ ప్రభావం చర్యాశీలతను పెంచి, స్థాన నిర్దేశం చేస్తుంది.
పాఠ్యాంశ ప్రశ్నలు Intext Questions
ప్రశ్న 1.
క్రింది సమ్మేళనాల నిర్మాణాలను రాయండి.
i) 2–క్లోరో-3-మిథైల్ పెంటేన్
ii) 1-క్లోరో – 4 – ఈథైల్ సైక్లో హెక్సేన్
iii) 4–టెర్షియరీ- బ్యుటైల్- 3-అయొడో హెప్టేన్
iv) 1, 4–డైబ్రోమోబ్యుట్-2 ఈన్
v) 1-బ్రోమో-4-సెకండరీ బ్యుటైల్-2-మిథైల్ బెంజీన్
సాధన:
ప్రశ్న 2.
ఆల్కహాల్లను KIతో చర్య జరిపేటప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎందుకు వాడకూడదు ?
సాధన:
ఆల్కహాల్ను ఆల్కైల్ అయొడైడ్గా మార్చడానికి KI తో పాటు H2SO, ఆమ్లాన్ని ఉపయోగించలేం. ఎందుకంటే ఈ ఆమ్లం KI ని HI ఆమ్లంగా మార్చి దానిని Iz గా ఆక్సీకరణం చేస్తుంది.
ప్రశ్న 3.
ప్రొపేన్ యొక్క డైహాలోజన్ ఉత్పన్నాల విభిన్న నిర్మాణాలను రాయండి.
సాధన:
i) ClCH2CH2CH2Cl
ii) ClCH2CHClCH3
iii) Cl2CHCH2CH3
iv) CH3CCl2CH3
ప్రశ్న 4.
C5H12 అణు సంకేతం గల ఆల్కేన్ సదృశకాలలో కాంతి రసాయన క్లోరినీకరణ చర్యలో కింది వాటిని ఏర్పరచే సదృశకాన్ని గుర్తించండి.
i) ఒక మోనోక్లోరైడ్ సదృశకం
ii) మూడు మోనోక్లోరో సదృశకాలు
iii) నాలుగు మోనోక్లోరో సదృశకాలు
సాధన:
అన్ని హైడ్రోజన్లు తుల్యమే కాబట్టి ఏ హైడ్రోజన్ ను పునఃస్థాపన చేసినా ఒకే ఉత్పన్నాన్ని ఇస్తుంది.
తుల్య హైడ్రోజన్లను సమూహాలుగా గుర్తించాలి. తుల్య హైడ్రోజన్ను పునః ‘స్థాపన చేస్తే ఒకే విధమైన ఉత్పన్నం ఏర్పడుతుంది.
పై విధంగానే తుల్య హైడ్రోజన్లను a, b, c, d సమూహాలుగా గుర్తించవచ్చు. కాబట్టి నాలుగు సదృశక ఉత్పన్నాలు వీలవుతాయి.
ప్రశ్న 5.
కింది చర్యలలో ఏర్పడే ప్రధాన మోనోహాలో ఉత్పన్నాల నిర్మాణాలు రాయండి.
సాధన:
ప్రశ్న 6.
కింద ఇచ్చిన సమ్మేళనాలను వాటి బాష్పీభవన స్థాన పెరుగుదల క్రమంలో రాయండి.
i) బ్రోమోమీథేన్, బ్రోమోఫారమ్, క్లోరోమీథేన్, డైబ్రోమోమీథేన్
ii) 1-క్లోరోప్రొపేన్, ఐసోప్రొపైల్ క్లోరైడ్, 1-క్లోరోబ్యుటేన్
సాధన:
i) క్లోరోమీథేన్, బ్రోమోఈథేన్, డైబ్రోమోఈథేన్, బ్రోమోఫారమ్లలో అణుభారం పెరిగేకొద్దీ బాష్పీభవన స్థానం పెరుగుతుంది.
ii) ఐసోప్రొపైల్ క్లోరైడ్, 1-క్లోరోప్రొపేన్, 1-క్లోరోబ్యుటేన్, ఐసోప్రొపైలోరైడ్ శాఖీయంగా ఉండటం వల్ల 1-క్లోరోప్రొపేన్ కంటే తక్కువ బాష్పీభవన స్థానం చూపిస్తుంది.
ప్రశ్న 7.
కింది ఆల్కైల్ హాలైడ్ జతలలో ఏ ఆల్కైల్ హాలైడ్ 2 చర్యలో వేగంగా పాల్గొంటుంది?
సాధన:
i) CH3CH2CH2CH2Br ప్రైమరీ హాలైడ్ కావటం వల్ల త్రిమితీయ విఘాత ప్రభావం ఉండదు.
సెకండరీ హాలైడ్ టెర్షియరీ హాలైడ్ కంటే వేగంగా చర్యలో పాల్గొంటుంది.
హాలైడ్ సమూహానికి మిథైల్ సమూహం దగ్గరగా ఉండి త్రిమితీయ విఘాతం కలిగించి వేగాన్ని తగ్గిస్తుంది.
ప్రశ్న 8.
కింది జతల హాలోజన్ సమ్మేళనాలలో ఏ సమ్మేళనం ఏ చర్యలో త్వరగా పాల్గొంటుంది?
సాధన:
టెర్షియరీ కార్బోకాటయాన్ స్థిరత్వం వల్ల టెర్షియరీ హాలైడ్ సెకండరీ హాలైడ్ కంటే చర్యలో వేగంగా పాల్గొంటుంది.
ప్రైమరీ కార్బోకాటయాన్ కంటే సెకండరీ కార్బోకాటయాన్ స్థిరమైనది కావడం వల్ల
ప్రశ్న 9.
కింది చర్యలలో A, B, C, D, E, R, R¹ లను గుర్తించండి.
సాధన: