AP Inter 2nd Year Botany Study Material Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Botany Study Material 6th Lesson మొక్క పెరుగుదల, అభివృద్ధి Textbook Questions and Answers.

AP Inter 2nd Year Botany Study Material 6th Lesson మొక్క పెరుగుదల, అభివృద్ధి

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్లాస్టిసిటిని నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మొక్కలు వాతావరణానికి లేదా జీవిత దశలకు అనుక్రియగా భిన్న రకాల నిర్మాణాలను ఏర్పరచడానికి అవలంబించే వివిధ పద్ధతుల సామర్థ్యాన్ని ప్లాస్టిసిటి అంటారు. ఉదా : పత్తి, కొత్తిమీర, లార్క్సపర్లలో కనిపించే భిన్న ప్రత్యుత్పత్తి.

ప్రశ్న 2.
మొక్కలలో జిబ్బరెల్లిన్లను గుర్తించడానికి ఆధారంగా ఏర్పడ్డ వ్యాధి ఏమిటి ? ఈ వ్యాధిని కలుగజేసే వ్యాధి జనక శిలీంధ్రం పేరు తెలపండి.
జవాబు:
వరి నారు మొక్కలలో బకనే వ్యాధి (Bakane disease) ఇది జిబ్బరెల్లా ప్యూజికురై అను శిలీంధ్రం వల్ల కలుగుతుంది.

ప్రశ్న 3.
అగ్రాధిక్యత అంటే ఏమిటి ? దాన్ని కలుగజేసే పెరుగుదల హార్మోను పేరు తెలపండి.
జవాబు:
పెరిగే కొనమొగ్గ, పార్శ్వ మొగ్గల పెరుగుదలను నిరోధించే దృగ్విషయాన్ని అగ్రాధిక్యత అంటారు. దీనిని కలుగజేసే హార్మోన్ ఆక్సిన్.

ప్రశ్న 4.
బోల్డింగ్ అంటే ఏమిటి ? బోల్టింగ్ను ఏ హార్మోను కలుగజేస్తుంది ?
జవాబు:
పుష్పోత్పత్తికి ముందు కణుపు మధ్యమాలు ఆకస్మిక దైర్ఘ్యవృద్ధి చూపించడంను బోల్టింగ్ అంటారు. దీనిని జిబ్బరెల్లిన్లు కలుగచేస్తాయి.

ప్రశ్న 5.
శ్వాసక్రియ క్లైమాక్ఆకు నిర్వచించండి. దానికి సంబంధించిన PGR పేరు తెలపండి.
జవాబు:
ఫలాలు పక్వత చెందేటప్పుడు శ్వాసక్రియ వేగం పెరగడాన్ని శ్వాసక్రియ క్లైమాక్టిక్ అంటారు. దీనికి ఎథిలీస్ కారణము.

AP Inter 2nd Year Botany Study Material Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

ప్రశ్న 6.
ఎథెఫాన్ అంటే ఏమిటి ? వ్యవసాయ రంగ కృషిలో దాని పాత్రను రాయండి.
జవాబు:
ఎథిలీన్ విడుదల చేసే రసాయన పదార్థమును ఎథెఫాన్ అంటారు. ఇది టమాటాలలోను, ఆపిల్ ను ఫలాలు తొందరగా పక్వానికి రావడానికి తోడ్పడుతుంది. దోసలో స్త్రీ పుష్పాలు ఉత్పత్తిని పెంచి తద్వారా దిగుబడిని పెంచుతుంది.

ప్రశ్న 7.
PGR లలో దేన్ని ప్రతిబల హార్మోన్ అంటారు. ఎందుకు ?
జవాబు:
ABA (అబ్సిసిక్ ఆమ్లము). బాహ్మ చర్మంలోని పత్రరంధ్రాలు మూసుకొనడాన్ని ప్రేరేపించి, మొక్కలలో అనేక రకాల ప్రతిబలాలకు సహనశీలతను పెంచుతుంది. కావున దీనిని ప్రతిబల హార్మోస్ అంటారు.

ప్రశ్న 8.
వెర్నలైజేషన్ గురించి మీరు ఏమి తెలుసుకున్నారు ? దాని ప్రాముఖ్యతను రాయండి.
జవాబు:
మొక్కలకు శీతల అభిచర్య జరిపి త్వరగా పుష్పించే గుణాన్ని ప్రేరేపించడాన్ని వెర్నలైజేషన్ అంటారు. ఇది పెరిగే ఋతువులో చివరగా శీఘ్రంగా పూలు పూయగల ప్రత్యుత్పత్తి అభివృద్ధిని నిరోధించి తద్వారా మొక్కలకు అవి పరిపక్వత చెందడానికి తగినంత కాలము, లభించేటట్లు చేస్తుంది. ఇది ముఖ్యంగా పుష్పోత్పత్తిని ప్రేరేపించే విధానము.

ప్రశ్న 9.
క్విసెన్స్, సుప్తావస్థను నిర్వచించండి. [A.P. Mar. ’15]
జవాబు:
క్విసెన్స్ : పెరుగుదలకు కావలసినటువంటి అనుకూల బాహ్య పరిస్థితులు లేనప్పుడు విత్తనాలు అంకురించలేక పోవడాన్ని క్విసెన్స్ అంటారు.
సుప్తావస్థ : బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అంతర పరిస్థితుల కారణంగా విత్తనాలు అంకురించలేక పోవడాన్ని సుప్తావస్థ అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవసాయం / ఉద్యానవన కృషిలో ఆక్సిన్ల అనువర్తనాలను (application) గురించి రాయండి. [A.P. Mar. ’17; T.S. Mar. 16 Mar. ’14]
జవాబు:

  1. IBA, NAA మరియు IAA లు కాండాల చ్ఛేదాల నుంచి వేర్లు ఏర్పడేటట్లు చేస్తాయి. ఈ పద్ధతిని ఉద్యానవన కృషిలో విరివిగా ఆచరిస్తున్నారు.
  2. 2, 4 – D, 2, 4, 5 – T లను ద్విదళ బీజ కలుపుమొక్కల నాశనానికి వాడుచున్నారు.
  3. ఆక్సిన్లు టమాటోలలో ఫల అభివృద్ధిని ప్రేరేపిస్తాయి.
  4. పైనాపిల్లో పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి.
  5. ఆక్సిన్లు ఫలాలను, పత్రాలను ప్రధమ దశలో రాలిపోకుండా నిరోధిస్తాయి.

ప్రశ్న 2.
మొక్కలలో జిబ్బరెల్లిన్ల శరీర ధర్మ సంబంధ అనుక్రియలను రాయండి. [T.S. Mar. ’15]
జవాబు:

  1. ఇవి వార్ధక్యాన్ని ఆలస్యం చేస్తాయి. ఆ విధంగా ఫలాలు వృక్షం మీదనే ఎక్కువ కాలం ఉండి, మార్కెట్ కాలం పొడిగించబడుతుంది.
  2. చెరుకు పంటపై జిబ్బరెల్లిన్లు చల్లిన కాండం పొడవు పెరిగి, తద్వారా పంట దిగుబడి ఎకరానికి 20 టన్నుల వరకు పెరుగుతుంది.
  3. శైశవ దశలో ఉన్న కోనిఫెర్లను Gలతో పిచికారి చేస్తే, అవి తొందరగా పరిపక్వం చెంది, విత్తన ఉత్పత్తిని జరుపుతాయి.
  4. రొజెట్టీ ఆకారంతో ఉండే బీట్, కాబేజీలలో జిబ్బరెల్లిన్లు బోల్టింగ్ను ప్రేరేపిస్తాయి.
  5. ద్రాక్ష, టమాటాలలో అనిషేక ఫలాలను ఏర్పరుస్తాయి.
  6. దోస మొక్కలలో పురుష పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి.
  7. ఆపిల్ లాంటి ఫలాలు పొడుగెదిగి తద్వారా వాటి ఆకారం మెరుగు కావడానికి దోహదపడతాయి.
  8. ద్రాక్ష ఫలాల కాడలు పెంచడానికి ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 3.
మొక్కలలో సైటోకైనిన్ల శరీర ధర్మ సంబంధ ప్రభావాలను ఏవైనా నాలుగింటిని రాయండి. [A.P. Mar. ’16]
జవాబు:

  1. సైటోకైనిన్లు “కణ విభజనను ప్రేరేపిస్తాయి.
  2. కొత్త పత్రాలు, పత్రాలలో హన్సిక రేణువులు ఏర్పడటానికి, పార్శ్వ ప్రకాండ పెరుగుదల జరగటానికి, అబ్బురపు ప్రకాండ తయారీకి తోడ్పడతాయి.
  3. సైటోకైనిన్లు అగ్రాధిక్యతను పోగొడతాయి.
  4. పత్ర వార్ధక్యాన్ని ఆలస్య పరచడంలో తోడ్పడే పోషకాల రవాణాను ప్రేరేపిస్తాయి.
  5. సైటోకైనిన్లు పత్రరంధ్రాలు తెరుచుకోవడంలో తోడ్పడతాయి.

ప్రశ్న 4.
మొక్కలలో ఎథిలీన్ నియంత్రించే శరీర ధర్మ సంబంధ ప్రక్రియలను తెలపండి. [A.P. Mar. ’15]
జవాబు:

  1. ఫలాల పక్వతను ప్రేరేపిస్తుంది.
  2. మొక్కల అంగాలు ముఖ్యంగా పత్రాలు, పుష్పాలు రాలిపోవడాన్ని ఎథిలీన్ ప్రేరేపిస్తుంది.
  3. ఇది విత్తనాలు, మొగ్గల సుప్తావస్థను పోగొట్టి, వేరుశెనగ విత్తనాలు, బంగాళాదుంపల్లో మొలకలేర్పడటాన్ని ప్రేరేపిస్తుంది.
  4. లోతుగా ఉన్న నీటిలో పెరిగే వరి మొక్కలలో కణుపు మధ్యమం / పత్రవృంతం చురుకుగా పొడవు ఎదిగేటట్లు ప్రేరేపిస్తుంది.
  5. ఎథిలీన్ వేరు పెరుగుదల, మూలకేశం తయారీలను ప్రేరేపించి నీటిని శోషించే ఉపరితలం పరిమాణం పెరిగేటట్లు చేస్తుంది.
  6. మామిడిలో పుష్పోత్పత్తిని, అనాసలో పంట అంతా ఒకేసారి పుష్పించేటట్లు ప్రేరేపిస్తుంది.
  7. దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి, తద్వారా దిగుబడిని పెంచుతుంది.

AP Inter 2nd Year Botany Study Material Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

ప్రశ్న 5.
విత్తన సుప్తావస్థ మీద లఘుటీక రాయండి. [T.S. Mar. ’17]
జవాబు:
మొక్క జీవితచక్రంలో విత్తనం అంకురించలేక పోవుటను సుప్తావస్థ అంటారు. విత్తనం అంకురణ శక్తిని కలిగి ఉండవచ్చు కాని అనేక కారణాల వల్ల అంకురించలేకపోవచ్చు. అవి : అంతర కారకాలు మరియు బాహ్య కారకాలు.
1) అంతర కారకాలు :
A) అపరిపక్వ పిండం : పరిపక్వం చెందని పిండం ఉంటుంది. ఉదా : రాననక్యులస్

B) గట్టి భీజ కవచము : ఆక్సిజన్ లేదా నీటిని పీల్చుకోలేని గట్టి బీజకవచం ఉండటం వల్ల. ఉదా : ఫాబేసి.

C) రసాయనాలు : టమాటో వంటి మొక్కల విత్తనాలలో కొన్ని రసాయన పదార్థాలు ఉండి, విత్తన అంకురణను నిరోధిస్తాయి. ఉదా : ఫెరూవిక్ ఆమ్లము, ABA.

2) బాహ్య కారకాలు :
A) అనేక దేశవాళి మొక్కల విత్తనాలు తేమ లోపించడం వల్ల లేదా వెచ్చని ఉష్ణోగ్రతల వల్ల సుప్తావస్థలో ఉంటాయి. విత్తనాలను తడి ఇసుక పీట్లలో పొరలుగా పెట్టి శీతాకాలంలో వదిలివేయడాన్ని ‘స్ట్రాటిఫికేషన్’ లేదా పూర్వశీతల అభిచర్య అంటారు.

B) పాలీగోనమ్ మొక్కల విత్తనాలు, ఆక్సిజన్ సమక్షంలో తేమభరిత పరిస్థితులలో తక్కువ ఉష్ణోగ్రతకు బహిర్గతమయ్యేవరకు అంకురించలేవు.

ప్రశ్న 6.
మిమ్మల్ని అడిగితే, ఈ క్రింది వాటికోసం ఏ మొక్క పెరుగుదల నియంత్రకాలను ఉపయోగిస్తారు ?
ఎ) కొమ్మలో వేర్లని ప్రేరేపించడం.
బి) ఫలం తొందరగా పక్వానికి రావడం.
సి) పత్ర వార్ధక్యాన్ని ఆలస్యపరచడం.
డి) గ్రీవపు మొగ్గల్లో పెరుగుదలను ప్రేరేపించడం.
ఇ) రొజెట్టీ మొక్కలో బోల్టింగ్.
ఎఫ్) పత్రాలలో పత్రరంధ్రాలు వెనువెంటనే మూసుకోవడానికి
జి) అగ్రాధిక్యతను పోగొట్టడానికి
హెచ్) ద్విదళబీజ కలుపుమొక్కలను చంపడానికి
జవాబు:
ఎ) ఆక్సిన్లు
బి) ఎథిలిన్
సి) సైటోకైనిన్లు
డి) సైటోకైనిన్లు
ఇ) జిబ్బరెల్లిన్లు
ఎఫ్) అబ్సిసిక్ ఆమ్లము
జి) సైటోకైనిన్లు
హెచ్) ఆక్సిన్లు – 2, 4 – D

ప్రశ్న 7.
క్లుప్తంగా వర్ణింపుము.
ఎ) సిగ్మాయిడ్ పెరుగుదల వక్రరేఖ.
బి) సంపూర్ణ మరియు సాపేక్ష పెరుగుదల రేటు.
జవాబు:
ఎ) సిగ్మాయిడ్ పెరుగుదల వక్రరేఖ: పెరుగుదల ప్రమాణానికి, కాలానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే రేఖా చిత్రమును గీచినప్పుడు వచ్చే S-ఆకార వక్రరేఖను సిగ్మాయిడ్ వక్రరేఖ అంటారు. దీనిలో 3 దశలు కలవు. అవి :
AP Inter 2nd Year Botany Study Material Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి 1

ఎ) మంద దశ : పెరుగుదల నెమ్మదిగా జరుగుతుంది.
బి) సంవర్గ దశ : పెరుగుదల ఎక్కువగాను, వేగంగాను జరుగుతుంది.
సి) పూర్తిగా ఆగిపోయే దశ : పోషకాల సరఫరా తగ్గి, పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది.

బి) సంపూర్ణ మరియు సాపేక్ష పెరుగుదల రేటు : ఒక ప్రమాణ కాలంలోని మొత్తం పెరుగుదలకు సంబంధించిన కొలతలు పోలికలను పరమ లేదా సంపూర్ణ పెరుగుదల రేటు అంటారు.

ఒక ప్రమాణ కాలంలో ఇవ్వబడ్డ వ్యవస్థలోని పెరుగుదలను సాధారణ సూత్రాల ద్వారా వ్యక్తీకరించి, మొదటి పరిమితిలలో, దానిని సాపేక్ష పెరుగుదల రేటు అంటారు.
AP Inter 2nd Year Botany Study Material Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి 2

AP Inter 2nd Year Botany Study Material Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మొక్కలలోని ఐదు సహజ పెరుగుదల నియంత్రకాల జాబితాను తెలపండి. అందులో ఒకదాని ఆవిష్కరణ, వ్యవసాయ ఉద్యానవన కృషిలో వినియోగం, శరీర ధర్మసంబంధ విధులను గురించి రాయండి.
జవాబు:

  1. ఆక్సిన్లు,
  2. జిబ్బరెల్లిన్లు
  3. సైటోకైనిన్లు
  4. అబ్సిసిక్ ఆమ్లం
  5. ఇథలిన్

1) ఆక్సిన్లు – ఆవిష్కరణ : ఛార్లెస్ డార్విన్, అతని కుమారుడైన ఫ్రాన్సిస్ డార్విన్లు కెనరీ గడ్డిమొక్క ప్రాంకుర కంచుకం ఏకపార్శ్వ కాంతికి అనుక్రియగా కాంతిపడే వైపు పెరుగుతుందని గమనించారు. ఆ తర్వాత, ప్రాంకుర కంచుకం కొనలో సరఫరా చెందగలిగే ఒక పదార్థం ఉండి, అదే మొత్తం ప్రాంకుర కంచుకం కాంతి వైపు వంగేటట్లు చేస్తుందని తెలిసింది. ఓట్ (Oat) నారుమొక్కల ప్రాంకుర కంచుకం నుంచి ఎఫ్.డబ్ల్యు. వెంట్ (FW.Went) ఆక్సిన్లను వేరుచేశారు.

వ్యవసాయం, ఉద్యానవన కృషిలో వినియోగము :

  1. IBA, NAA మరియు IAA లు కాండాలచ్చేదాల నుంచి వేర్లు ఏర్పడేటట్లు చేస్తాయి. ఈ పద్ధతిని ఉద్యానవన కృషిలో విరివిగా ఆచరిస్తున్నారు.
  2. 2, 4 – D, 2, 4, 5 – T లను ద్విదళ బీజ కలుపుమొక్కల నాశనానికి వాడుచున్నారు.
  3. ఆక్సిన్లు టమాటోలలో ఫల అభివృద్ధిని ప్రేరేపిస్తాయి.
  4. పైనాపిల్లో పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి.
  5. ఆక్సిన్లు ఫలాలను, పత్రాలను ప్రధమ దశలో రాలిపోకుండా నిరోధిస్తాయి.

శరీర సంబంధ విధులు :

  1. ఆక్సిన్లు పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఉదా : అనాస
  2. ఆక్సిన్లు ఫలాలను, పత్రాలను ప్రధమ దశలో రాలిపోకుండా నిరోధిస్తాయి కాని పరిపక్వం చెందిన పత్రాలను, ఫలాలను రాలిపోయేటట్లు ప్రేరేపిస్తాయి.
  3. ఇవి అధిక్యతను ప్రేరేపిస్తాయి.
  4. టమాటాలో అనిషేక ఫలనాన్ని ప్రేరేపిస్తాయి.
  5. 2, 4 – D వంటి ఆక్సిన్ల ద్విదళబీజ కలుపు మొక్కలను నాశనం చెయ్యడానికి విరివిగా వాడతారు.
  6. ఆక్సిన్లు దారు విభేదనాన్ని నియంత్రిస్తాయి.
  7. ఆక్సిన్లు దారుకణ విభజనలో తోడ్పడతాయి.

అభ్యాసాలు

ప్రశ్న 1.
సరైన పదం / పదాలతో ఖాళీలను పూరించండి.
a) పెరుగుదలలో చాలా చురుకుగా జరిగే దశ :
b) పార్శ్వ మొగ్గలలో కంటే కొనమొగ్గల్లో ———- ఎక్కువ ఉండుట వల్ల ద్విదళ బీజ మొక్కలకో అగ్రాధిక్యత కనిపిస్తుంది.
c) మొక్క కణజాల వర్ధనంలో కాలస్ ఏర్పడానికి వర్ధన యానకానికి ఆక్సిన్తో పాటు ———- ను అందజేయాలి.
d) శాకీయ మొక్కలలో ———- కాంతి కాలావధి ప్రేరణ స్థానాలు.
జవాబు:
a) సంవర్గ దశ (Log phase)
b) ఆక్సిన్లు
c) సైటోకైనిన్లు
d) కాండ అగ్రాలు

ప్రశ్న 2.
జిబ్బరెల్లిన్లు కెన్నాబిస్ లోని జన్యు సంబంధ a) ……….. b) ……. పుష్పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. మరి ఎథలీన్ జన్యు సంబంధ c) ……….. మొక్కలలో d) …….. పుష్పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
జవాబు:
a) పురుష
b) వామన
c) స్త్రీ
d) వామన మొక్కలలో

ప్రశ్న 3.
ఈ క్రింది మొక్కలను దీర్ఘ దీప్తికాల మొక్కలు (LDP), హ్రస్వదీప్తికాల మొక్కలు (SDP), దీప్తికాల తటస్థ మొక్కలుగా (DNP) వర్గీకరించండి.
జాంథియమ్, స్పినాచ్, హెన్బేన్ [హై యో సయామస్ నైజర్] వరి, స్ట్రాబెర్రి, బ్రయోఫిల్లమ్, సూర్యకాంతం (ప్రొద్దు తిరుగుడు పువ్వు), టమాటో, మొక్కజొన్న …
జవాబు:
దీర్ఘదీప్తికాల మొక్కలు : స్పినాచ్, హెన్టేన్
హ్రస్వదీప్తికాల మొక్కలు : జాంథియమ్, వరి
దీప్తికాల తటస్థ మొక్కలు : బ్రయోఫిల్లం, మొక్కజొన్న, టమాటో, సూర్యకాంతం, స్ట్రాబెర్రి.

AP Inter 2nd Year Botany Study Material Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

ప్రశ్న 4.
ఒక వ్యవసాయదారుడు తన పొలంలో దోస (కుకుంబర్) మొక్కలను పెంచాడు. దానిలో స్త్రీ పుష్పాల సంఖ్యను పెంచాలనుకున్నాడు. దీన్ని సాధించడానికి ఏ మొక్క పెరుగుదల నియంత్రకాన్ని ఉపయోగించవచ్చు ?
జవాబు:
ఎథిలీన్

ప్రశ్న 5.
ఈ క్రింది హార్మోన్లు మొక్కలలో ఎక్కడ సంశ్లేషణ చెందుతాయి ?
a) IAA
b) జిబ్బరెల్లిన్లు
c) సైటోకైనిన్లు
జవాబు:
a) IAA : పెరిగే వేరు, కాండ అగ్రాలు.
b) జిబ్బరెల్లిన్లు : జిబ్బరెల్లా ప్యూజికురై అను శిలీంధ్రము నుండి.
c) సైటోకైనిన్లు : వేరు అగ్రాలు, పెరిగే కొనమొగ్గలు, లేతఫలాలు.

ప్రశ్న 6.
అన్ని జీవుల జీవితంలో కాంతి ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాంతి వల్ల ప్రభావితం చేయబడే ఏవైనా మూడు పద్ధతులను తెలపండి.
జవాబు:
పెరుగుదల, విభేదనము, అభివృద్ధి.

ప్రశ్న 7.
అన్ని జీవుల లక్షణాలలో ఒక లక్షణంగా పెరుగుదలను చెప్పవచ్చు. ఏక కణజీవులు కూడ పెరుగుతాయా? పెరిగినట్లయితే పరిమితులు ఏమిటి ?
జవాబు:
పెరుగుతాయి. తాజాబరువు, పొడిబరువు, పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం వంటి పరిమితులలో కొలుస్తారు.

ప్రశ్న 8. జిబ్బరెల్లి ప్యూజికోరై అనే శిలీంధ్రంతో సంక్రమిత వరి నారుమొక్కలను తెలివితక్కువ మొలకలు అంటారు. దీనికి కారణం ఏమిటి ?
జవాబు:
వ్యాధి సోకిన మొక్కలు బాగా పొడవుగా పెరుగుతాయి. పాలిపోయి, తక్కువ పిలకలను ఏర్పరుస్తాయి. తక్కువ దిగుబడిని ఇస్తాయి.

ప్రశ్న 9.
ఒక పుష్పించే మొక్కలో జీవితకాలమంతా జరిగే పెరుగుదల నిరూపించడానికి ఏదైనా ఒక పరిమితి ఎందుకు వీలుకాదు ?
జవాబు:
ఒక పరిమితి ఇచ్చే సమాచారము సరిపోదు. కావున పెరుగుదలను నిరూపించడానికి తాజాబరువు, పొడిబరువు, పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం వంటి కొన్ని పరిమితులు ఉంటాయి.

ప్రశ్న 10.
“అగ్రశ్రేణి మొక్కలలో పెరుగుదల, విభేదనం రెండు వివృతాలు” – వ్యాఖ్యానించండి.
జవాబు: విభాజ్య కణజాలాల నుండి ఏర్పడిన కణాలు, కణజాలాలు, వాటి స్థానాలు, అభివృద్ధి తర్వాత వివిధ నిర్మాణాలతో ఉంటాయి. ఉదా : వేరు అగ్ర విభాజ్య కణజాలమునకు దూరంగా ఉన్న కణాలు వేరుతొడుగు కణాలుగా పరిధి వైపు నెట్టబడే కణాలు బాహ్యచర్మంగా పరిపక్వమవుతాయి.

ప్రశ్న 11.
హ్రస్వదీప్తికాల మొక్కలు, దీర్ఘదీప్తికాల మొక్కలు రెండూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒకే కాలంలో పుష్పాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. వివరించండి.
జవాబు: సందిగ్ధ కాలవ్యవధి వేరువేరు మొక్కలకు భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలకు కాంతి కాల ప్రమాణం నిర్దిష్ట సందిగ్ధ కాలవ్యవధి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పుప్పిస్తాయి.
కొన్ని మొక్కలు కొంత కాల ప్రమాణం, ఒక సందిగ్ధ కాంతి కాలవ్యవధి కంటే తక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి.

AP Inter 2nd Year Botany Study Material Chapter 6 మొక్క పెరుగుదల, అభివృద్ధి

ప్రశ్న 12.
కాంతి కాలావధి చక్రానికి ఒక నిష్పత్రణ (defoliated) మొక్క అనుక్రియను చూపించగలుగుతుందా ? ఎందుకు ? చూపించదు. అవసరమైన కాంతి కాల వ్యవధికి మొక్కలు బహిర్గతమైనప్పుడు కొన్ని హార్మోనులు పత్రాల నుంచి ప్రకాండ కొన భాగాలకు రవాణా చెంది పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి.
జవాబు:

ప్రశ్న 13.
ఈ క్రిందివి జరిగితే ఏమి ఊహించవచ్చు ?
జవాబు:
a) వరి నారుమడులకు GA3ని ప్రయోగిస్తే
b) విభజన చెందే కణాల విభేదనాన్ని ఆపేస్తే
c) ఒక కుళ్ళిన ఫలాన్ని అపరిపక్వ ఫలాలతో కలిపితే
d) వర్థన యానకానికి మీరు సైటోకైనిన్ కలపడం మర్చిపోతే.
జవాబు:
a) వరి నారు మొక్కలలో బకనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
b) పెరుగుదల ఆగిపోయి, అంగాలు ఏర్పడవు.
c) అపరిపక్వ ఫలాలు ఎండిపోతాయి.
d) కాండము, పత్రాలు ఏర్పడవు.