AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Botany Study Material 7th Lesson బ్యాక్టీరియమ్లు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Botany Study Material 7th Lesson బ్యాక్టీరియమ్లు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సూక్ష్మజీవుల ఉనికి గురించి క్లుప్తంగా వ్రాయండి. [T.S. Mar. ’17]
జవాబు:
సూక్ష్మజీవులు విస్తారమైన సంఖ్యలో ప్రతిచోట ఉండి, సర్వాంతర్యాములుగా వర్ణించబడ్డాయి. వీటిలో బాక్టీరియమ్లు మృత్తిక, గాలి, నీరు, జీవరాశుల దేహాలపైన లేదా దేహాల లోపల ఉంటాయి. ఇది వివిధ రకాల ఆహార పదార్థాలలోను, అతిశీతల ఉష్ణ, జలాభావ పరిస్థితులను తట్టుకుని జీవిస్తాయి.

ప్రశ్న 2.
సూక్ష్మజీవ శాస్త్రాన్ని నిర్వచించండి.
జవాబు:
మామూలుగా కంటికి కనిపించనంత చిన్నగా ఉండే సూక్ష్మజీవరాశులను శాస్త్రీయ అధ్యయనం చేసే ఒక జీవశాస్త్ర శాఖను సూక్ష్మజీవశాస్త్రము అంటారు. ఉదా: బాక్టీరియా, వైరస్లు.

ప్రశ్న 3.
మానవుని పేగుల్లో సాధారణంగా నివసించే బాక్టీరియమ్ ఏది ? దానిని జీవసాంకేతికశాస్త్రంలో ఎలా ఉపయోగిస్తారు ?
జవాబు:
ఎశ్చరీషియా కోలై, దీనిని జీవసాంకేతికశాస్త్రంలో ఇన్సులిన్ హార్మోను ఉత్పత్తికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 4. బహురూప బాక్టీరియమ్లు అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి. [Mar. ’14]
జవాబు:
వాతావరణ పరిస్థితి, లభ్యమయ్యే పోషకాలను బట్టి తరచు తన ఆకారంను మార్చుకునే బాక్టీరియమ్లను బహురూప బాక్టీరియమ్లు అంటారు. ఉదా : అసిటోబాక్టర్

AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు

ప్రశ్న 5.
లైంగిక పైలస్ అంటే ఏమిటి ? వాటి విధిని తెలపండి.
జవాబు:
సంయుగ్మం జరగటానికి అవసరమైన ఒక ప్రత్యేక సంయుగ్మ పరికరము. ఇది రెండు సంయుగ్మ కణాలను దగ్గరకు చేరుస్తుంది. తదుపరి ప్రతికృతి చెందిన DNA నకలు పైలస్ నుండి ఏర్పడిన వంతెన ద్వారా గ్రహీతకణంలోకి చేరుతుంది.

ప్రశ్న 6.
జీనోఫోర్ అంటే ఏమిటి ?
జవాబు:
బాక్టీరియమ్లోని వలయాకార, ద్వంద్వ పోచయుత DNA (ప్రధాన జన్యుపదార్ధము)ను జీనోఫోర్ లేక బాక్టీరియల్ క్రోమోసోమ్ అంటారు.

ప్రశ్న 7.
ప్లాస్మిడ్ అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు:
బాక్టీరియల్ క్రోమోసోమ్క అదనంగా, బాక్టీరియమ్లలో ఉండే చిన్న వలయాకార, రెండుషోగుల DNA అణువును ప్లాస్మిడ్ అంటారు. వీటిని ఆధునిక జెనిటిక్ ఇంజనీరింగ్ సాంకేతికతలో వాహకాలుగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
సంయుగ్మం అంటే ఏమిటి ? దాన్ని ఎవరు, జీవిలో కనుక్కొన్నారు ? [A.P. Mar. ’17]
జవాబు:
రెండు బాక్టీరియమ్ కణాలు పరస్పరం తాకుట వల్ల జరిగే జన్యుపదార్థ మార్పిడిని సంయుగ్మము అంటారు. దీనిని 1946లో లెడర్బర్గ్ మరియు టాటమ్లు ఎశ్చరీషియా కోలైలో పరిశీలించారు.

ప్రశ్న 9.
జన్యు పరివర్తన అంటే ఏమిటి ? దాన్ని ఎవరు ఏ జీవిలో కనుక్కొన్నారు ?
జవాబు:
నగ్న DNA ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి, గ్రహీత కణంలో దాని జన్యు సమాచారం వ్యక్తమవడంను జన్యుపరివర్తన అంటారు. దీనిని ఫ్రెడిరిక్ గ్రిఫిత్ (1928) అనువారు స్ట్రెప్టోకోకస్ న్యిమోనియేలో కనుక్కొన్నాడు.

ప్రశ్న 10.
జన్యువహనం అంటే ఏమిటి ? దాన్ని ఎవరు ఏ జీవిలో కనుక్కొన్నారు ? [A.P. Mar. ’16]
జవాబు:
బాక్టీరియోఫాజ్ ద్వారా జన్యు పదార్థం ఒక బాక్టీరియమ్ నుండి వేరొక బాక్టీరియమ్క బదిలీ చెందడాన్ని జన్యువహనం అంటారు. దీనిని లెడర్ బర్గ్, జిండర్లు (1951) సాల్మోనెల్లా టైఫిమ్యూరియర్లో కనుక్కొన్నారు.

AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్వరూపం ఆధారంగా బాక్టీరియమ్లను ఏవిధంగా వర్గీకరించవచ్చు ?
జవాబు:
బాక్టీరియమ్ల స్వరూపంను బట్టి 4 రకాలుగా వర్గీకరించారు. అవి
1) కోకై : గోళాకార బాక్టీరియమ్. కణాల సంఖ్య, వాటి అమరికను బట్టి, కొకైలో ఆరు రకాలు కలవు. అవి :
a) మోనోకోకస్ : ఒక విడి గోళాకార కణము.
b) డిప్లోకోకస్ : ఒక జత గోళాకార కణాలు.
c) టెట్రాకోకస్ : నాలుగు కణాల గుంపు.
d) స్ట్రెప్టోకోకస్ : ఒక వరుసలో అమరి ఉండే గొలుసు వంటి కణాలు.
e) స్టాఫిలోకోకస్ : గుత్తులుగా ఏర్పడిన కణాలు.
f) సార్సినా : 8 కణాలతో, ఘనాకారంలో అమరి ఉండేవి.

2) బాసిల్లస్ : దండాకార బాక్టీరియమ్. ఇవి
a) మోనోబాసిల్లస్ : ఒంటరిగా ఉండి సాగి ఉన్న కణము.
b) డిప్లోబాసిల్లస్ : ఒక జత దండాకార కణాలు.
c) స్ట్రెప్టో బాసిల్లస్ : గొలుసులా ఉన్న దండాకార కణాలు.

3) స్పైరిల్లమ్ : ఒక స్పష్టమైన సర్పిలాకారము. ఇది సన్నని పొడవైన కార్క్, స్క్రూ ఆకారంలా (స్పైరోకీట్స్) ఉండవచ్చు.

4) విబ్రియో : కామా ఆకారంలో ఉన్న కణము.
AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు 1

ప్రశ్న 2.
కశాభాల సంఖ్య, వాటి అమరికలను బట్టి బాక్టీరియమ్లను ఏవిధంగా వర్గీకరించారు ?
జవాబు:
కశాభాల సంఖ్య, వాటి అమరికలను బట్టి బాక్టీరియమ్లను 4 రకాలుగా వర్గీకరించారు. అవి :
1) ఏకతంతుకం : ఒకే ఒక ధృవ కశాభం ఉంటుంది.
2) ద్విధృవ తంతుకం : కణానికి ప్రతి కొనలో ఒక కశాభం ఉంటుంది.
3) బహుతంతుకం : కణానికి ఒక ధృవం వద్ద రెండు లేదా ఎక్కువ కశాభాలు ఉంటాయి.
4) పరితంతుకం : కశాభాలు కణం ఉపరితలం అంతటా విస్తరించి ఉంటాయి.
AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు 2

ప్రశ్న 3.
శక్తి, కార్బన్ మూలాల ఆధారంగా బాక్టీరియమ్లలో పోషణ సముదాయాలు ఏవి ? [A.P. Mar. ’15]
జవాబు:
శక్తి, కార్బన్ మూలాల ఆధారంగా బాక్టీరియమ్లలో 4 పోషణ సముదాయాలు కలవు. అవి
1) కాంతి స్వయం పోషితాలు : ఇవి సూర్యరశ్మి నుండి శక్తిని, వాతావరణలోని CO2 నుండి కార్బన్ ను పొందుతాయి. ఉదా : పర్పుల్ సల్ఫర్ బాక్టీరియా – క్రొమాషియమ్
గ్రీన్ సల్ఫర్ బాక్టీరియా – క్లోరోబియమ్

AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు

2) రసాయన స్వయంపోషితాలు : ఇవి అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణంద్వారా శక్తిని, వాతావరణంలోని CO2, నుండి కార్బన్ను పొందుతాయి.
ఉదా :
a) సల్ఫర్ బాక్టీరియా – బెగియోటా ఇది H2S ను ఆక్సీకరణంచేసి S ను విడుదల చేస్తుంది.
b) నత్రీకరణ బాక్టీరియా – నైట్రోసోమానస్ : ఇది అమ్మోనియాను నైట్రైటులుగాను
నైట్రోబాక్టర్ : ఇది నైట్రైటులను నైట్రేటులుగా ఆక్సీకరణం చేస్తాయి.

3) కాంతిపర పోషితాలు : ఇవి కాంతి నుంచి శక్తిని, సేంద్రియ పదార్థాల నుండి కార్బన్ను పొందుతాయి. ఉదా : పర్పుల్ నాన్. సల్ఫర్ బాక్టీరియా – రోడోస్పైరిల్లమ్, రోడోమైక్రోఖియమ్, రోడోసూడోమోనాస్,

4) రసాయన పరపోషితాలు : ఇవి శక్తిని, కార్బన్ను సేంద్రియ పదార్థాలనుంచి పొందుతాయి. ఇవి 2 రకాలు
a) పూతికాహారులు ఇవి నిర్జీవ సేంద్రియ పదార్థాలపై పెరుగుతాయి.
b) పరాన్న జీవులు – అతిథేయి నుండి పోషకాలను గ్రహిస్తూ, వాటిలో వ్యాధులను కలుగచేస్తాయి.
ఉదా : జాంథోమోనాస్, సాల్మోనెల్లా.

ప్రశ్న 4.
బాక్టీరియమ్లలోని సంయుగ్మాన్ని గురించి వివరించండి.
జవాబు:
రెండు సజీవ బాక్టీరియమ్లు పరస్పరం తాకుట వల్ల జరిగే జన్యు పదార్థ మార్పిడిని సంయుగ్మము అంటారు. దీనిని 1946లో లెడర్ బర్గ్, టాటమ్లు, ఎశ్చరీషియా కోలైలో పరిశీలించారు.

ఎ. కోలైలో కొన్ని కణాలలో ప్రధాన జన్యుపదార్థంతోపాటు, చిన్న వలయాకార DNA ఉంటుంది. దానిని ప్లాస్మిడ్ అంటారు. ప్లాస్మిడ్ కల కణాలను దాతకణాలు లేదా F+ కణములు అని అంటారు. ప్లాస్మిడ్ లేని కణాలను గ్రహీతకణములు లేదా F కణములు అని అంటారు. సంయుగ్మం సమయంలో దాతకణము పైలస్ ను ఏర్పరిచి F అనే గ్రహీత కణంతో అంటి పెట్టుకుంటుంది. వెంటనే పైలస్ పొట్టిదై 2 బాక్టీరియమ్ కణాలను దగ్గరకు చేరుస్తుంది. తరువాత F+ ప్లాస్మిడ్ ప్రతికృతి చెందిన DNA నకలు, పైలస్ నుంచి ఏర్పడిన వంతెన ద్వారా గ్రహీత కణంలోకి చేరుతుంది. ఫలితంగా F కణము F+ కణంగా మారుతుంది. తర్వాత రెండు కణాలు విడిపోతాయి.
AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు 3

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాక్టీరియమ్లలో జరిగే వివిధ రకాల లైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులను వివరించండి.
జవాబు:
బాక్టీరియమ్లలో నిజమైన లైంగిక ప్రత్యుత్పత్తి లేదు. కాని జన్యుపదార్థ వినిమయము మూడు విధాలుగా జరుగుతుంది.
అవి :
1) సంయుగ్మము : రెండు సజీవ బాక్టీరియమ్లు పరస్పరం తాకుట వల్ల జరిగే జన్యు పదార్థ మార్పిడిని సంయుగ్మము అంటారు. దీనిని 1946లో లెడర్బర్గ్, టాటమ్లు, ఎశ్చరీషియా కోలైలో పరిశీలించారు.

ఎ.కోలైలో కొన్ని కణాలలో ప్రధాన జన్యుపదార్థంతోపాటు, చిన్న వలయాకార DNA ఉంటుంది. దానిని ప్లాస్మిడ్ అంటారు. ప్లాస్మిడ్ కల కణాలను దాతకణాలు లేదా F+ కణములు అని అంటారు. ప్లాస్మిడ్ లేని కణాలను గ్రహీతకణములు లేదా F కణములు అని అంటారు. సంయుగ్మం సమయంలో దాతకణము పైలస్ను ఏర్పరిచి F+ అనే గ్రహీత కణంతో అంటి పెట్టుకుంటుంది. వెంటనే పైలస్ పొట్టిదై 2 బాక్టీరియమ్ కణాలను దగ్గరకు చేరుస్తుంది. తరువాత F ప్లాస్మిడ్ ప్రతికృతి చెందిన DNA నకలు పైలస్ నుంచి ఏర్పడిన వంతెన ద్వారా గ్రహీత కణంలోకి చేరుతుంది. ఫలితంగా F కణము F+ కణంగా మారుతుంది. తర్వాత రెండు కణాలు విడిపోతాయి.
AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు 4

ప్రశ్న 2.
“బాక్టీరియమ్లు మానవాళికి మిత్రులుగాను, శత్రువులుగాను ఉంటాయి” చర్చించండి.
జవాబు:
1) బాక్టీరియమ్లు మానవునికి ప్రత్యక్షముగా, పరోక్షముగా ప్రయోజనకరంగాను, హానికరంగానూ ఉంటున్నాయి. కాబట్టి వీటిని మిత్రులుగాను, శత్రువులుగాను భావించవచ్చు.

2) బాక్టీరియమ్ల వల్ల మానవునికి కలిగే ప్రయోజనకరమైన, హానికరమైన చర్యలను ఈ క్రింద వివరించడమైనది.

1) ప్రయోజనకరమైనచర్యలు :
i) బాక్టీరియాలు నిర్జీవ వృక్ష, జంతు దేహాలను కుళ్ళింపచేసి వాటిలోని సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సరళ సేంద్రియ పదార్థాలుగా మార్చి నేలలో కలిపి, మొక్కలకు లభించేటట్లు చేస్తున్నాయి. దీనివల్ల పోషక మూలకాలు నిరంతరంగా పునఃచక్రీయం చెందడమే కాకుండా పరిసరాలు కూడా పరిశుభ్రమవుతున్నాయి. కావున బాక్టీరియాలను “ప్రకృతిలోని పారిశుద్ధ్య పనివారు” అంటారు.

ii) వ్యవసాయం : నేలను సారవంతం చేయడంలోను బాక్టీరియమ్లు ప్రముఖపాత్ర వహిస్తాయి. అవి :
ఎ) అమ్మోనిఫైయింగ్ బాక్టీరియమ్లు: అమ్మోనిఫైయింగ్ బాక్టీరియమ్లు చనిపోయిన జీవుల దేహాల్లోని ప్రోటీన్ లు, అమైనో ఆమ్లాలను అమ్మోనియాగా మార్చును. ఈ చర్యను అమ్మోనిఫికేషన్ అందురు. ఉదా : బాసిల్లస్.

బి) నత్రీకరణ బాక్టీరియమ్లు: అమ్మోనియాను నైట్రేట్లుగా ఆక్సీకరణ గావిస్తాయి. ఈ చర్యను నత్రీకరణ అందురు. ఉదా : నైట్రోసోమానాస్, నైట్రోబాక్టర్.

సి) రైజోబియమ్ : రైజోబియమ్ వంటి సహజీవన బాక్టీరియమ్, క్లాస్ట్రీడియమ్ వంటి సహజీవనం చేయని బాక్టీరియమ్లు, కిరణజన్య సంయోగక్రియ జరిపే రోడోస్పైరిల్లమ్, రోడోమైక్రోబియమ్, క్లోరోబాక్టీరియమ్ వాతావరణములో వాయురూపములో ఉన్న నత్రజనిని స్థాపన చేసి నేలను సారవంతం చేస్తాయి.

డి) మొక్కలని ఆశించి నష్టం కలిగించే కీటకాల జీవసంబంధ నివారణికి బాసిల్లస్ థురంజియన్సిస్ అనే బాక్టీరియమి జీవకీటకనాశకారిగా ఉపయోగిస్తున్నారు.

AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు

iii) పరిశ్రమ : పరిశ్రమల్లో బాక్టీరియమ్లని అనేక క్రియలకు ఉపయోగిస్తున్నారు. అవి :

  • క్లాస్ట్రీడియమ్ బ్యుటిలికమ్, జనుము నుంచి క్లా, ఫెల్సినియమ్ ఫ్లాక్స్ నుండి నారలు తీయడానికి ఉపయోగపడతాయి.
  • కొన్ని బాక్టీరియమ్లను టానింగ్ (తోళ్ళని పదును పెట్టడం) పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు.
  • పొగాకు క్యూరింగ్లో బాసిల్లస్ మెగాథెరియమ్, తేయాకు క్యూరింగ్లో మైక్రోకోకన్ని ఉపయోగిస్తారు.
  • కొన్ని బాక్టీరియమ్లను కిణ్వనం ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఉదా: లాక్టోబాసిల్లస్
  • మిథనోకోకస్, మిథనోబాసిల్లస్ వంటి బాక్టీరియమ్లు వాయురహిత శ్వాసక్రియ ద్వారా పేడ నుండి ‘మిథేన్’ గాస్ని ఉత్పత్తి చేస్తాయి. దీనిని గోబర్ గ్యాస్ అందురు.
  • బాక్టీరియమ్లనుపయోగించి పారిశ్రామికంగా ఉత్పత్తి చేసే కొన్ని రసాయన పదార్థాలని ఈ క్రింది పట్టికలో ఇవ్వడమైనది.
    రసాయన పదార్ధం బాక్టీరియమ్
    ఎసిటోన్, బ్యుటనాల్ క్లాస్ట్రీడియమ్ ఎసిటోబ్యుటి లికమ్
    వెనిగర్ ఎసిటోబాక్టర్ ఎసిటి, ఎ. పాశ్చరియానమ్
    లాక్టిక్ ఆమ్లము లాక్టోబాసిల్లస్ డెల్ బ్రుకి
    ప్రొపియోనిక్ ఆమ్లము ప్రొపియోనిబాక్టీరియమ్ ప్రొపియోనమ్
    ఇథనాల్ జైమోమోనాస్ మొబిలిస్
    థర్మోఎనరోబాక్టర్ ఇథనాలికస్

iv) వైద్యరంగం :

  • కొరినేబాక్టీరియమ్ గ్లుటామికమ్ ‘లైసిన్’ అనే ఆవశ్యక అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది.
  • స్ట్రెప్టోమైసిన్, బాసిల్లస్లకు చెందిన బాక్టీరియమ్ జాతులు సూక్ష్మజీవనాశకాలని ఉత్పత్తి చేస్తాయి. అవి :
    సూక్ష్మజీవనాశకం బాక్టీరియమ్
    స్ట్రెప్టోమైసిన్, సైక్లోహెక్సిమైడ్ స్ట్రెప్టోమైసిన్ గ్రిసియస్
    క్లోరామ్ ఫెనికాల్ స్ట్రెప్టోమైసిన్ వెనుజులే
    నియోమైసిన్ స్ట్రెప్టోమైసిన్ ఫ్రాడియే
    కనామైసిన్ స్ట్రెప్టోమైసిన్ కనామైసిటికస్
    ఆంఫోటెరికాన్ స్ట్రెప్టోమైసిన్ నోడోసస్
    ఆక్సీటెట్రా సైక్లిన్ స్ట్రెప్టోమైసిన్ రైమోసన్
    పాలిమిక్సిన్ – బి బాసిల్లస్ పాలిమిక్సా
    బాసిట్రాసిన్ బాసిల్లస్ లైకెనిఫార్మిస్

v) జీవసాంకేతిక శాస్త్రం :

  1. పునఃసంయోజక DNA టెక్నాలజీని ఉపయోగించి ఇన్సులిన్ కారక జన్యువులని ప్రవేశపెట్టి ఈ. కోలైని ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటట్లు రూపొందించారు. జీవరసాయన శాస్త్రం, అణు జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, శరీరధర్మశాస్త్ర ప్రయోగాలలో అనేక జీవ రహస్యాలు తెలుసుకోవడానికి ఎ.కోలైను విరివిగా ఉపయోగిస్తున్నారు.
  2. కొన్ని బాక్టీరియమ్లు తమ కణాలలో ప్రోటీన్లని ఎక్కువ మోతాదులో నిలువచేసుకొంటారు. వీటిని ఏకకణ ప్రోటీన్లల ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. ఉదా : బ్రెవిబాక్టీరియమ్.
  3. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో ఆగ్రోబాక్టీరియమ్ ట్యుమిఫేసియన్స్ని వాహకంగా ఉపయోగిస్తున్నారు.

2) హానికరమైన చర్యలు : కొన్ని పూతికాహార బాక్టీరియమ్లు, అన్ని పరాన్నజీవి బాక్టీరియమ్లు తమ జీవక్రియల ద్వారా మానవుడికి హాని కలిగిస్తాయి.

I) ఆహార పదార్థాలు పాడు చేయడం : బాక్టీరియమ్ జాతులు వివిధ రకాల ఆహారపదార్థాలపై పెరుగుతూ వాటిని పనికిరాకుండా చేస్తాయి. అంతేకాకుండా కొన్ని బాక్టీరియమ్లు ఆహారపదార్థాలపై పెరిగేటప్పుడు శక్తివంతమైన విషపదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు క్లాస్ట్రీడియమ్ బోట్యులినమ్ ‘బోట్యులిన్’ అనే అత్యంత శక్తివంతమైన విషపదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ‘బోట్యులిజమ్’ అనే ఆహార విషప్రభావ వ్యాధి కలిగిస్తుంది.

AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు

II) మొక్కల తెగుళ్ళు : బాక్టీరియమ్లు మొక్కలపై వివిధ రకాల తెగుళ్ళని కలిగిస్తున్నట్లు గుర్తించారు. బాక్టీరియమ్ల వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన తెగుళ్ళు ఈ క్రింద పేర్కొన్నారు.:

తెగులు బాక్టీరియమ్
వరి బ్లైట్ తెగులు జాంథోమోనాస్ ఒరైజే
పత్తి కోణీయ ఆకుపచ్చ తెగులు జాంథోమోనాస్ మాల్వేసియారమ్
సిట్రస్ కాంకర్ జాంథోమోనాస్ ఆక్సనో పోడిస్ PV సిట్రి
సొలనేసి మొక్కల వడలే తెగులు సూడోమోనాస్ సొలనేసియారమ్
ఆపిల్, పియర్ల క్రౌన్గాల్ తెగులు ఆగ్రోబాక్టీరియమ్ ట్యుమిఫేసియన్స్
ఆపిల్ ఫైర్ బ్లెట్ తెగులు ఎర్వీనియా ఆమైలోవోరా

III) మానవ వ్యాధులు : బాక్టీరియమ్లు అనేక రకాల మానవ వ్యాధులని కలిగిస్తాయి.:

వ్యాధి బాక్టీరియమ్
స్ట్రెప్టోమైసిన్, సైక్లోహెక్సిమైడ్ స్ట్రెప్టోమైసిన్ గ్రిసియస్
డిసెంటరీ (నీళ్ల విరోచనాలు) బాసిల్లస్ డిసెంటరీ
డిప్తీరియా కొరినెబాక్టీరియమ్ డిప్తీరియే
కలరా విబ్రియో కలరె
టైఫాయిడ్ సాల్మోనెల్లా టైపి
న్యుమోనియా స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే
ట్యుబర్క్యులోసిస్ (క్షయ) మైకోబాక్టీరియమ్ ట్యుబర్క్యులోసిస్
లెప్రసీ (కుష్ఠు) మైకోబాక్టీరియమ్ లెప్రే
ప్లేగు పాశ్చురెల్లా పెట్టిస్
గనేరియా నిస్సేరియా గనేరియా
టెటానస్ (ధనుర్వాతం) క్లాస్ట్రీడియమ్ టెటాని
సిఫిలిస్ ట్రెప్టోనిమా పాల్లిడం

IV) జంతువుల వ్యాధులు : పెంపుడు జంతువుల్లో బాక్టీరియమ్లు కొన్ని వ్యాధులను కలిగిస్తాయి.:
బాక్టీరియమ్లు మొక్కలు, జంతువులు, మానవుల్లో వ్యాధులను కలుగచేస్తాయి. అంతేకాక అనేక బాక్టీరియమ్లు మానవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి వీటిని “మానవాళికి మిత్రులుగానూ, శత్రువులు” గానూ కూడా భావించవచ్చు.

వ్యాధి బాక్టీరియమ్
గొర్రెల ఆంథ్రాక్స్ వ్యాధి బాసిల్లస్ ఆంథ్రాసిన్
కుక్కల, పశువుల ట్యుబర్క్యులోసిస్ మైకోబాక్టీరియమ్ ట్యుబర్క్యులోసిస్
పశువుల ఆక్టినోమైకోసిస్ మైకో బాక్టీరియమ్ బోవిస్
విబ్రియోసిస్ విబ్రియో టెటస్

అభ్యాసాలు

ప్రశ్న 1.
బాక్టీరియమ్లు మానవులకు అనారోగ్యాన్ని, సంక్రామిక వ్యాధులను మాత్రమే కలగచేస్తాయని చాలావరకు ప్రజలు నమ్ముతారు. ఈ అధ్యాయంలో ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఈ అపనమ్మకాన్ని మీరు ఎలా సరిదిద్దుతారు ?
జవాబు:
బాక్టీరియమ్లు మొక్కలు, జంతువులు, మానవుల్లో వ్యాధులు కలుగచేస్తాయి. అంతేగాక అనేక బాక్టీరియమ్లు మానవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనకారిగా ఉంటాయి. కావున వీటిని మానవాళికి మిత్రులుగాను, శత్రువులుగాను భావించవచ్చు.

AP Inter 2nd Year Botany Study Material Chapter 7 బ్యాక్టీరియమ్లు

ప్రశ్న 2.
ఒక జీవిని పరితంతుక బాసిల్లస్ గా వర్ణించారు. ఈ బాక్టీరియమ్ సంబంధిత భాషను మీరు జీవి వర్ణనకు ఎలా అన్వయించుకోవచ్చు ?
జవాబు:
దేహమంతటా కశాభాలను కలిగి ఉన్న దండాకార బాక్టీరియమ్.