Students can go through AP Inter 2nd Year Chemistry Notes 10th Lesson నిత్యజీవితంలో రసాయనశాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Chemistry Notes 10th Lesson నిత్యజీవితంలో రసాయనశాస్త్రం
→ అల్ప అణుద్రవ్యరాశులు (100 ~ 500 u) గల రసాయన పదార్థాలు మన శరీరంలోని బృహత్ అణువులతో చర్య జరిపి, జీవ సంబంధమైన స్పందన తెస్తాయి. వీటినే మందులు అంటారు.
→ వ్యాధి చికిత్సకు రసాయన పదార్థాలను ఉపయోగించే ప్రక్రియను కెమోథెరపీ (లేదా) రసాయనాల చికిత్స అంటారు.
→ ఆమ్ల విరోధులు : ఉదరంలో స్రవించిన అధిక ఆమ్లాన్ని తటస్థీకరించి సరైన pH కి తెచ్చే రసాయన పదార్థాలను ఆమ్ల విరోధులు (లేదా) యాంటాసిడ్లు అంటారు. ఉదా : NaHCO, AZ(OH), + Mg(OH), ఓమెప్రజోల్ మొదలగునవి.
→ యాంటీహిస్టమిన్లు : ఈ రసాయనాలు ఉదరంలో అధిక ఆమ్ల మోతాదులను పరోక్ష పద్ధతిలో నివారిస్తాయి. ఉదరగోడలలో ఉండే అభిగ్రాహకాల దగ్గరకు హిస్టమిన్ పోకుండా ఆపి తక్కువ ఆమ్లం ఉత్పన్నమయ్యేటట్లు చేయు రసాయనాలను యాంటీహిస్టమిన్లు అంటారు. ఉదా : డిమెటాప్, సెలెన్ మొదలగునవి.
→ ట్రాంక్విలైజర్లు : మానసిక ఒత్తిడిని, స్వల్ప లేదా తీవ్రమైన స్థాయిలలో ఉండే మనోవ్యాధుల నుంచి ఉపశమనం కొరకు ఉపయోగించే రసాయన పదార్థాలను ట్రాంక్విలైజర్లు అంటారు. ఉదా : లూమినాల్, సెకోనాల్ మొదలగునవి.
→ ఎనాల్జెసిక్: నొప్పి అనునది అనేక వ్యాధులలోను, ఆకస్మిక ప్రమాదాలలోనూ వుంటుంది. తలనొప్పి, చెవినొప్పి,, ఒంటి నొప్పి, కడుపునొప్పి, కీళ్ళ నొప్పులు మొదలైనవి సాధారణ నొప్పులు. శరీరంలో ఏ భాగము వాపుకు గురి అయిన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పిని తగ్గించు ఔషధాలను ఎనాల్జెసిక్ అంటారు. ఉదా : ఆస్పిరిన్, ఐబుప్రొఫెన్ మొదలైనవి.
→ యాంటీమైక్రోబియల్ : బాక్టీరియా ద్వారా, ఫంగై ద్వారా, వైరస్ ద్వారా ఇతర పరాన్నజీవులు వరణాత్మకంగా కలగజేసే వ్యాధి కారక చర్యలను విధ్వంసం చేయడం, జరగకుండా నివారించే (లేదా) పూర్తిగా నివారించే మందులను యాంటీమైక్రోబియల్ అంటారు. ఉదా : లైసోజైమ్, లాక్టిక్ ఆమ్లం మొదలగునవి.
→ “యాంటీబయోటిక్లు బాక్టీరియా, ఫంగస్, బూజు లాంటి సూక్ష్మజీవుల నుంచి ఉత్పన్నమై ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా వాటిని నాశనం చేసే రసాయన పదార్థాలు”.
(లేదా)
“యాంటీబయోటిక్ అనేది పూర్తిగా కాని, కొంత భాగంగా కాని రసాయన పద్ధతిలో తయారు చేయబడి తక్కువ గాఢతలో ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే లేదా అంతం చేసే రసాయన పదార్థం”. ఉదా : పెనిసిలీన్, క్లోరామ్ఫనికోల్, సల్ఫాడయాజీన్ మొ||నవి.
→ యాంటీసెప్టిక్లు (చీము నిరోధులు) : యాంటీసెప్టిక్లు అనేవి సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించేవి (లేదా) వాటిని నాశనం చేసేవి. వీటిని గాయాలు, కోతలు, రణాలు, రోగానికి గురైన చర్మం ఉపరితలాలు అయినటువంటి జీవకణజాలాలకు పూస్తారు. ఉదా : డెట్టాల్, బితియనోల్
→ క్రిమిసంహారిణులు: సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించడానికి (లేదా) నాశనం చేయడానికి వాడే రసాయన పదార్థాలు క్రిమిసంహారక మందులను ఫ్లోర్లు, డ్రయొనే జిలులాంటి జీవరహిత వ్యవస్థలకు వాడతారు. ఉదా :
- 4% ఫార్మాల్డిహైడ్ జలద్రావణాన్ని ఫార్మలిన్ అంటారు.
- 0.3 ppm గాఢత గల క్లోరిన్ ద్రావణం క్రిమిసంహారిణిగా వాడతారు.
→ సహజ చక్కెరలు కాలరీలను పెంచుతాయి. అందువలన వాటి స్థానంలో కృత్రిమ చక్కెరలను వాడుతున్నారు. “ఆహార పదార్థాల్లో చక్కెరకు బదులుగా వాడే రసాయనాలను కృత్రిమ తీపికారుకాలు అంటారు. వీటిని వాడడం వల్ల కాలరీలను నియంత్రించ వచ్చు. అదే సమయంలో సుక్రోజ్ కంటే ఆహారానికి ఎంతో తీపినిస్తాయి. చక్కెర వ్యాధి ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగకరం.
ఉదా :
- ఆస్పార్టేమ్కు సుక్రోజ్ కంటే 100 రెట్లు తీపి ఎక్కువగా ఉంటుంది.
- అలిటేమ్ మరియు సుక్రలోజ్ మరికొన్ని ఉదాహరణలు.
→ రసాయనికంగా సబ్బులు పొడవైన శృంఖలాలుగల కొవ్వు ఆమ్లాల సోడియమ్ (లేదా) పొటాషియం లవణాలు. (13 కొవ్వు పదార్థాన్ని సోడియమ్ హైడ్రాక్సైడ్ జల ద్రావణంతో కలిపి వేడిచేసి సోడియమ్ లవణాలు గల సబ్బులను తయారుచేస్తారు. దీనినే సబ్బు ఏర్పడే చర్య అంటారు.
→ సంక్లిష్ట డిటర్జెంట్లు : సబ్బు ధర్మాలన్నీ ఉండి, వాటిలో మాత్రం సబ్బులు లేని శుభ్రపరిచే కారకాలను సంక్లిష్ట లేదా కృత్రిమ డిటర్జెంట్లు అంటారు. వీటిని కఠినజలంలోను, మృదుజలంలోను కూడా ఉపయోగిస్తారు. ఉదా : సోడియమ్ డోడెకైల్ బెంజీన్ సల్ఫోనేట్.