Students can go through AP Inter 2nd Year Chemistry Notes 11th Lesson హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Chemistry Notes 11th Lesson హాలో ఆల్కేన్లు, హాలో ఎరీస్లు
→ హైడ్రోకార్బన్లందు హైడ్రోజన్ పరమాణువులు, హాలోజన్లతో మార్పిడి వల్ల హాలోఆల్కేన్లు (లేదా) హాలో ఎరీన్లు ఏర్పడతాయి.
→ హాలోఆల్కేన్లలో హాలోజన్ sp3 – సంకరీకరణం కార్టన్కు బంధింపబడును.
హాలోఎరీన్లలో హాలోజన్ sp2 – సంకరీకరణం కార్జన్కు బంధింపబడును.
→ హాలోజన్ పరమాణువుల సంఖ్య ఆధారంగా హాలో ఆల్కేన్లు (లేదా) హాలో ఎరీన్లు మోనోహాలో ఆల్కేన్/ ఎరీన్, డైహాలో ఆల్కేన్ / ఎరీన్, ట్రై హాలో ఆల్కేన్ / ఎరీన్ లుగా విభజించారు.
→ sp3 C – X బంధాన్ని కలిగిన సమ్మేళనాలు ఎ) ఆల్కైల్ హాలైడ్లు, బి) ఎల్లైలిక్ హాలైడ్లు, సి) బెంజైలిక్ హాలైడ్లు.
→ sp2 C – X బంధాన్ని కలిగిన సమ్మేళనాలు ఎ) వినైలిక్ హాలైడ్లు, బి) ఎరైల్ హాలైడ్లు.
→ ఆల్కహాలు HX/ZnCl2, లేదా PX3, లేదా PX5 లేదా SOCl2, లతో చర్య జరిపి ఆల్కైల్ హాలైడ్లు ఏర్పరుచును.
→ ఆల్కెల్ హాలైడ్లు / ఎరైల్ హాలైడ్లు
- స్వేచ్ఛా ప్రాతిపదిక హాలోజినేషన్,
- ఎలక్ట్రో ఫిలిక్ ప్రతిక్షేపణ,
- సాండేమేయర్ చర్య,
- హైడ్రోజన్ హాలైడ్ లేదా హాలోజన్ను ఆల్కీను కలుపుట ద్వారా తయారు చేయవచ్చు. “
→ ఆల్కైల్ హాలైడ్ల బాష్పీభవన స్థానం తగ్గు క్రమం RI > RBr > RCl > RF
→ C-X బంధం ధృవణత స్వభావం కలిగి ఉండుట వలన హాలోఆల్కేన్లు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి.
- SN2. చర్యలు,
- SN1 చర్యలు.
→ SN2 – చర్యలలో ఆల్కెల్ హాలైడ్లు చర్యాశీలత క్రమము 1°-ఆల్మెల్ హాలైడ్>2° ఆల్కెల్ హాలైడ్ > 3° – ఆల్కెల్ హాలైడ్
→ SN1 – చర్యలలో ఆల్కైల్ హాలైడ్ల చర్యాశీలత క్రమము. 3° – ఆల్మైల్ హాలైడ్ > 2° – ఆల్కైల్ హాలైడ్ > 1° – ఆల్కెల్ హాలైడ్.
→ SN2 – చర్యా విధానం వలన ఏర్పడు’ ఉత్పన్నం విలోమ విన్యాస ఉత్పన్నం.
SN1 చర్యా విధానం వలన ఏర్పడు ఉత్పన్నం రెసిమీకరణ విన్యాస ఉత్పన్నం.
→ ఆల్కైల్ హాలైడ్లు ఆల్కహాలిక్ KOH తో చర్య జరిపి ఆల్కీన్లను ఏర్పరచును. దీనినే డీహైడ్రో హాలోజనీకరణం అంటారు.
→ ఆల్కైల్ హాలైడ్లు కొన్ని లోహాలతో చర్య జరిపి C – లోహ బంధం ఉన్న సమ్మేళనాలను ఏర్పరచును. వీటినే కర్బన లోహ సమ్మేళనాలు అంటారు. ఉదా : గ్రిగా నార్డ్ కారకం (RMgX).
→ కర్బన లోహ సమ్మేళనాలు, కర్బన సమ్మేళనాల సంశ్లేషణలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
→ ఆల్కైల్ హాలైడ్లు, ఎరైల్ హాలైడ్లు సోడియం లోహం మరియు పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపి ఆల్కైల్ ఎరీను ఏర్పరచును. దీనినే ఉర్జ్ – ఫిట్టింగ్ చర్య అంటారు. ఈ చర్యలో కేవలం ఎరైల్ హాలైడ్లు చర్య జరిపితే దానినే ఫిట్టింగ్ చర్య అంటారు.
→ పాలీహాలోజన్ సమ్మేళనాలు పరిశ్రమలలో, వ్యవసాయ రంగంలో బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఉదా : CH2Cl2, CHCl3, CHI3, DDT, ఫ్రీయాన్లు, CCl4.