Students can go through AP Inter 2nd Year Chemistry Notes 9th Lesson జీవాణువులు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Chemistry Notes 9th Lesson జీవాణువులు
→ మొక్కల నుండి లభ్యమయ్యే ప్రకృతిలో లభించే కర్ణన రసాయన పదార్థాలలో అతి పెద్దస్థానం గల సమ్మేళనాలను కార్బోహైడ్రేట్లు అంటారు.
ఉదా : గ్లూకోజ్, స్టార్చ్, ఫ్రక్టోజ్ మొదలగునవి.
→ కార్బోహైడ్రేట్లను బహుసంఖ్యలో హైడ్రాక్సీ ప్రమేయ సమూహాలున్న ఆల్డీహైడ్లు లేదా కీటోన్లుగా నిర్వచించవచ్చు.
→ జలవిశ్లేషణ చర్య ఆధారంగా కార్టోహైడ్రేట్లను ఈక్రింది విధంగా వర్గీకరించారు.
- మోనోశాకరైడ్లు \(\stackrel{\mathrm{H}_2 \mathrm{O}}{\longrightarrow}\), శాకరైడ్లు ఏర్పడవు. ఉదా: గ్లూకోజ్, ఫ్రక్టోజ్
- ఓలిగోశాకరైడ్లు \(\stackrel{\mathrm{H}_2 \mathrm{O}}{\longrightarrow}\) రెండు మోనోశాకరైడ్లు. ఉదా : సుక్రోజ్, మాల్టోజ్
- పాలీశాకరైడ్లు \(\stackrel{\mathrm{H}_2 \mathrm{O}}{\longrightarrow}\) అధిక సంఖ్యలో మోనోశాకరైడ్లు. ఉదా : స్టార్చ్, సెల్యులోజ్
→ ఏ కార్బోహైడ్రేట్లు అయితే టోలెన్స్, ఫెయిలింగ్ కారకాలను క్షయకరణం చేస్తాయో వాటిని క్షయకరణ చక్కెరలు అంటారు. ఉదా : గ్లూకోజ్
ఏ కార్బోహైడ్రేట్లు అయితే టోలెన్స్, ఫెయిలింగ్ కారకాలను క్షయకరణం చేయనో వాటిని క్షయకరణం చేయని చక్కెరలు అంటారు. ఉదా : సుక్రోజ్
→ ఏనోమర్లు: రెండు సదృశక నిర్మాణాలలో విన్యాసం C-1 వద్ద విభిన్నంగా ఉంటే వాటిని ఏనోమర్లు అంటారు.
→ సుక్రోజ్’ జలవిశ్లేషణలో ధృవణ భ్రమణత గుర్తు కుడి (+) నుండి ఎడమ (-) కు మారడం వల్ల ఏర్పడే ఉత్పన్నాన్ని విలోమ చక్కెర ఉంటారు.
→ ఎమినో ప్రమేయ సమూహం (-NH2) మరియు కార్టాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహం (-COOH). కలిగియున్న కర్బన సమ్మేళనాలను ఎమినో ఆమ్లాలు అంటారు.
ఉదా : గ్లైసిన్, ఎలనైన్
→ ఆవశ్యక ఎమినో ఆమ్లాలు : “మన శరీరములో తయారుకాని ఎమినో ఆమ్లములను ఆహారము ద్వారా అందచేయవలెను: వీటిని ఆవశ్యక ఎమినో ఆమ్లాలు అందురు.”
ఉదా : లైసీన్ (Lys)
→ అనావశ్యక ఎమినో ఆమ్లాలు : “శరీరములో తయారగు ఎమినో ఆమ్లములను అనావశ్యక ఎమినో ఆమ్లాలు “అందురు.”
ఉదా : ఎలనైన్.
→ జ్విట్టర్ అయాన్ : ఎమినో ఆమ్ల జల ద్రావణంలో కార్టాక్సిల్ సమూహం నుంచి ఒక ప్రోటాన్ న్ను ఎమినో సమూహానికి మార్పిడి జరిగి ఒక ద్విధృవ అయాన్ ఏర్పడును. దీనినే జ్విట్టర్ అయాన్ అంటారు.
→ ప్రోటీన్ లు : వంద ఎమినో ఆమ్లాల అణువుల కంటే ఎక్కువ అణువులతో ఏర్పడిన పాలీపెప్టైడ్ను ప్రోటీన్ .అంటారు. ప్రోటీన్ లకు అణుభారం 10,000 U కంటే ఎక్కువగా ఉంటుంది.
ఉదా : కెరాటిన్, మెయోసిన్ మొదలగునవి.
→ రకాల RNA లు :
- మెసెంజర్ RNA (m – RNA)
- రైబోజోమల్ RNA (r – RNA)
- ట్రాన్సఫర్ RNA (t – RNA)
→ పెప్టైడ్ బరథం : ఒక అణువులోని ఎమైన్ గ్రూపు ఇంకో అణువులోని కార్బాక్సిల్ గ్రూపుతో చర్య జరిపి ఎమైడ్ బంధం ఏర్పరచడం ద్వారా రెండు ఎమినో ఏసిడ్ అణువులు ఒక అణువుగా ఏర్పడతాయి. ఈ ఎమైడ్ బంధమే పెప్టైడ్ బంధం లేదా పెప్టైడ్ కలయిక. ఈ విధంగా ఏర్పడ్డ ఉత్పనాన్ని డైపెప్టైడ్ అంటారు. ఇది మూడు, నాలుగు అనేక ఎమినో ఆమ్ల అణువులకు పొడిగిస్తే ట్రై, టెట్రా… పాలీపెప్టైడ్లు వస్తాయి. పాలీపెప్టైడ్లో అనేక ఎమినో ఆమ్ల యూనిట్లు ఉంటాయి. పాలిపెప్టైడ్లను ప్రోటీన్లు అంటారు.
→ ప్రోటీన్ స్వభావ వికలత : “ప్రోటీన్ టెర్షియరీ నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. దీనిని విచ్ఛిన్నం చెందించటాన్ని ప్రోటీన్ స్వభావ వికలత అంటారు.” త్రిమితీయ నిర్మాణాన్ని క్రమ పద్ధతిలో ఉంచే ప్రోటీన్లోని బంధాలు విచ్ఛిన్నం చేయడమే ప్రోటీన్ స్వభావ వికలత. ఈ బంధాలు సహజంగా బలహీనంగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్లు తేలికగా స్వభావ వికలత చెందుతాయి.
→ ప్రకృతిలో లభించే కర్బన రసాయన పదార్థాలు. ఇవి ఆహారంలో ముఖ్యమైన పదార్థాలు. జీవరాశులు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి అల్ప పరిమాణాలలో అవసరమవుతాయి. ఇటువంటి పదార్థాలను విటమిన్లు అంటారు.
→ మానవ శరీరంలో జీవ సంబంధ సమాచారాన్ని ఒక గ్రూపుకు చెందిన కణాల నుంచి దూరంగా ఉన్న కణజాలాలకు లేదా అవయవాలకు రవాణా చేసే కర్బన సమ్మేళనాల అణువులను హార్మోన్లు అంటారు. ఉదా : ఈస్ట్రోడయోల్, ఈస్ట్రోజన్ మొదలగునవి.