Students can go through AP Inter 2nd Year Chemistry Notes 8th Lesson పాలిమర్ లు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Chemistry Notes 8th Lesson పాలిమర్ లు
→ పాలిమర్ : నిర్మాణాత్మక యూనిట్ పునరావృతమవుతూ సంయోజనీయ బంధాల నేర్పరచుకుని సంయోగంచెంది నిర్మితమైన అతిపెద్ద అణువును పాలిమర్ అంటారు.
→ పాలిమర్ల లభ్య స్థానాల ఆధారంగా సహజ, అర్థకృత్రిమ, కృత్రిమ పాలిమర్లుగా వర్గీకరించారు.
→ పాలిమర్ల నిర్మాణం ఆధారంగా రేఖీయ, శాఖాయుత, వ్యత్యస్తబద్ధ పాలిమర్లుగా వర్గీకరించారు. పాలిమరీకణ విధానం ఆధారంగా సంకలన, సంఘనన పాలిమర్లగా వర్గీకరించారు.
→ అణుబలాల ఆధారంగా ఎలాస్టోమర్లు, పోగులు, ధర్మోప్లాస్టిక్ లు, ఉష్ణదృడ పాలిమర్లుగా వర్గీకరించారు.
→ సంకలన పాలిమర్ : ఒకే రకమైన (లేదా) విభిన్నమైన రకాలు అయిన ద్విబంధాలు గల మోనోమర్ అణువుల సంకలన చర్యవలన ఏర్పడిన పాలిమర్ను సంకలన పాలిమర్ అంటారు.
→ సంఘనన పాలీమర్ : పాలిమర్ను ఏర్పరచిన అన్ని మోనోమర్ యూనిట్లలోని మొత్తం పరమాణువుల సంఖ్య కంటే పాలిమర్లో పరమాణువుల సంఖ్య తక్కువగా ఉన్నపుడు ఆ పాలిమర్ను సంఘనన పాలిమర్ అంటారు.
→ సజాతీయ పాలిమర్ : ఏక మోనోమర్ జాతుల పొలిమరీకరణం ద్వారా ఏర్పడిన పాలిమర్లను సజాతీయ పాలిమర్లు అంటారు.
→ ట్రై ఆల్కైల్ అల్యూమినియం మరియు టైటానియం క్లోరైడ్ల మిశ్రమాన్ని జీగ్లర్ – నట్టా ఉత్ప్రేరకం అంటారు.
ఉదా : (C2H5)3 Al + TiCl4.
→ పాలిమర్ల ముఖ్యమైన అణుద్రవ్యరాశులు:
- సగటు సంఖ్య అణుద్రవ్యరాశి \(\left(\overline{\mathrm{M}}_{\mathrm{n}}\right)\).
- సగటుభార అణుద్రవ్యరాశి \(\left(\bar{M}_w\right)\)
→ ఒక పాలిమర్ సగటు భార అణుద్రవ్యరాశి \(\left(\bar{M}_w\right)\), సగటు సంఖ్య అణుద్రవ్యరాశి \(\left(\bar{M}_n\right)\) మధ్య గల నిష్పత్తిని పాలి విక్షేపణ సూచిక (PDI) అంటారు.
PDI = \(\frac{\bar{M}_w}{\bar{M}_n}\)
→ రబ్బరు వల్కనైజేషన్ : ముడి (లేదా) సహజ రబ్బరును సల్ఫర్ (లేదా) సల్ఫర్ సమ్మేళనాలతో వేడిచేసి దాని భౌతిక ధర్మాలు మెరుగుపరచుటను రబ్బరు వల్కనైజేషన్ అంటారు.
→ జీవక్షయీకృత పాలిమర్లు : “ఎంజైమ్లతో ఆక్సీకరణం, జలవిశ్లేషణం వంటి రసాయన చర్యలు జరిపే లక్షణం కల్గి ఉండి, జీవ వ్యవస్థలలో తొందరగా క్షయకరణం చెందే మరియు మానవుడు నిరపాయకరంగా ఉపయోగించగలిగే పాలిమర్లను జీవ క్షయీకృత పాలిమర్లు అంటారు”.