Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Chemistry Study Material 8th Lesson పాలిమర్ లు Textbook Questions and Answers.
AP Inter 2nd Year Chemistry Study Material 8th Lesson పాలిమర్ లు
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మోనోమర్, పాలిమర్ అనే పదాలను నిర్వచించండి?
జవాబు:
i) మోనోమర్ :
పాలిమర్లలో పునరావృతమయ్యే నిర్మాణాత్మక యూనిట్లను మోనోమర్లు అంటారు.
ii) పాలిమర్ :
నిర్మాణాత్మక యూనిట్ పునరావృతమవుతూ సంయోజనీయ బంధాల నేర్పరచుకుని సంయోగంచెంది నిర్మితమైన అతిపెద్ద అణువును పాలిమర్ అంటారు.
ప్రశ్న 2.
పాలిమర్ అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పాలిమర్ :
నిర్మాణాత్మక యూనిట్ పునరావృతమవుతూ సంయోజనీయ బంధాల నేర్పరచుకుని సంయోగంచెంది నిర్మితమైన అతిపెద్ద అణువును పాలిమర్ అంటారు.
ఉదా : నైలాన్ 6, 6, బ్యున – S (V. C) బ్యున – N etc..
ప్రశ్న 3.
పాలిమరీకరణం అంటే ఏమిటి? పాలిమరీకరణ చర్యకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పాలిమరీకరణం :
నిర్మాణాత్మక యూనిట్ పునరావృతమవుతూ సంయోజనీయ బంధాల నేర్పరచుకుని సంయోగం చెంది నిర్మితమైన అతిపెద్ద అణువులను పాలిమర్ అంటారు. ఈ ప్రక్రియను పాలిమరీకరణం అంటారు.
ఉదా : 1. ఈథేన్ నుండి పాలిథీన్ ఏర్పడుట.
2. హెక్సామిథిలీన్ డై ఎమీన్ మరియు ఎడిపిక్ ఆమ్లం నుండి నైలాన్ 6, 6 ఏర్పడుట.
ప్రశ్న 4.
కృత్రిమ, అర్థ కృత్రిమ పాలిమర్లకు ఒకొక్కదానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
- కృత్రిమ పాలిమర్ల కు ఉదా : నియోప్రిన్, బ్యున – V. C, బ్యున – N etc.,
- అర్ధకృత్రిమ పాలిమర్లకు ఉదా: సెల్యులోజ్ రేయాన్, సెల్యులోజ్ నైట్రేట్
ప్రశ్న 5.
నిర్మాణం ఆధారంగా పాలిమర్లను ఎలా వర్గీకరిస్తారు?
జవాబు:
నిర్మాణం ఆధారంగా పాలిమర్లను మూడు రకాలుగా వర్గీకరించారు.
1) రేఖీయ పాలిమర్లు :
వీటిలో ఒక దానిపైన ఒకటి అతి సన్నిహితంగా అమరి ఉన్న మోనోమర్లు ఉంటాయి. ఉదా : పాలిథీన్, PVC మొదలగునవి.
2) శాఖాయుత శృంఖల పాలిమర్లు :
వీటిలో వివిధ ధైర్ఘ్యాలున్న శాఖలు ప్రధాన కర్బన శృంఖాలానికి చేరి ఉంటాయి. ఉదా : అల్పసాంద్రత పాలిథీన్ (LDP) మొదలగునవి.
3) జాలక (వ్యత్యస్త బద్ధ) ఎలిమర్లు :
రేఖీయ పాలిమర్ శృంఖలాల మధ్య బలమైన సమయోజనీయ బంధాలు గల పాలిమర్లు ఉదా : బేకలైట్, మెలమైన్ మొదలగునవి.
ప్రశ్న 6.
రేఖీయ, శాఖాయుత శృంఖల పాలిమర్లకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
1) రేఖీయ పాలిమర్లు :
వీటిలో ఒక దానిపైన ఒకటి అతి సన్నిహితంగా అమరి ఉన్న మోనోమర్లు ఉంటాయి.
ఉదా : పాలిథీన్, PVC మొదలగునవి.
2) శాఖాయుత శృంఖల పాలిమర్లు :
వీటిలో వివిధ ధైర్ఘ్యాలున్న శాఖలు ప్రధాన శృంఖాలానికి చేరి ఉంటాయి.
ఉదా : అల్ప సాంద్రత పాలిథీన్ (LDPE) మొదలగునవి.
ప్రశ్న 7.
వ్యత్యస్తబద్ధ (లేదా జాలక) పాలిమర్లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
వ్యత్యస్తబద్ధ లేదా జాలక పాలిమర్లు : రేఖీయ పాలిమర్ శృంఖలాల మధ్య బలమైన సమయోజనీయ బంధాలు గల పాలిమర్లు ఉదా : బేకలైట్, మెలమైన్ మొదలగునవి.
ప్రశ్న 8.
సంకలన పాలిమర్ అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సంకలన పాలిమర్ :
ఒకే రకమైన (లేదా) విభిన్నమైన రకాలు అయిన ద్విబంధాలు గల మోనోమర్ అణువుల సంకలన చర్యవలన ఏర్పడిన పాలిమర్ను సంకలన పాలిమర్ అంటారు.
ఉదా : పాలిథీన్, పాలీ ఎక్రైలో నైట్రైట్
ప్రశ్న 9.
సంఘనన పాలిమర్ అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి ? [TS. Mar.’15]
జవాబు:
సంఘనన పాలిమర్ :
పాలిమర్ను ఏర్పరచిన అన్ని మోనోమర్ యూనిట్లలోని మొత్తం పరమాణువుల సంఖ్య కంటే పాలిమర్లో పరమాణువుల సంఖ్య తక్కువగా ఉన్నపుడు ఆ పాలిమర్ను సంఘనన పాలిమర్ అంటారు.
ఉదా : నైలాన్ 6, 6, పాలీఇథలీన్ టెరి థొలేట్.
ప్రశ్న 10.
సజాతీయ పాలిమర్ (homopolymer) అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సజాతీయ పాలిమర్ : ఏక మోనోమర్ జాతుల పొలిమరీకరణం ద్వారా ఏర్పడిన పాలిమర్లను సజాతీయ పాలిమర్లు
ఉదా : పాలిథీన్, పాలిస్టైరీన్
ప్రశ్న 11.
కోపాలిమర్ అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
కోపాలిమర్ :
రెండు లేదా అంతకన్నా ఎక్కువ రసాయనికంగా విభిన్నత్వం కలిగిన మోనోమర్ల పాలిమరీకరణం ద్వారా ఏర్పడిన పాలిమర్ను కోపాలిమర్ అంటారు.
ఉదా : బ్యుటాడయీన్ – స్టైరీన్ల పాలిమర్ → బ్యున – S
ప్రశ్న 12.
{CH2 – CH (C6H5)}n అనేది సజాతీయ పాలిమరా లేక కోపాలిమరా?
జవాబు:
{CH2 – CH – C6H5}n అనునది పాలీస్టైరిన్. ఇది ఒక సజాతీయ పాలిమర్. ఇది స్టైరీన్ అను ఒకే ఒక మోనోమర్ పాలిమరీ కరణం ద్వారా ఏర్పడును.
ప్రశ్న 13.
{NH – CHR – CO}n అనేది సజాతీయ పాలిమరా లేక కోపాలిమరా?
జవాబు:
[NH – CHR – CO]n అనునది సజాతీయ పాలిమర్. ఇది α – ఎమినో ఆమ్లం యొక్క పాలిమరీకరణం ద్వారా ఏర్పడును.
ప్రశ్న 14.
అణుబలాల ఆధారంగా పాలిమర్లలో వివిధ రకాలేవి?
జవాబు:
అణుబలాల ఆధారంగా పాలీమర్లు నాలుగు రకాలుగా వర్గీకరించారు.
1) ఎలాస్టోమర్లు :
ఇవి రబ్బర్ వంటి ఘనపదార్థాలు. వీటికి స్థితిస్థాపక ధర్మం ఉంటుంది.
ఉదా : బ్యున – S, బ్యున – N
2) పోగులు :
పోగులు తంతువులను ఏర్పరచే ఘనపదార్థాలు. వీటికి అధిక తనన సామర్థ్యం, అధిక మధ్య గుణకం ఉంటాయి. ఉదా : నైలాన్ 6, 6; టెరిలీన్
3) థర్మోప్లాస్టిక్లు :
ఇవి రేఖీయ లేదా స్వల్ప శాఖాయుత దీర్ఘశృంఖల అణువులు. వీటిని వేడి చేస్తే మెత్తబడి, చల్లబరిస్తే గట్టిపడే లక్షణాలు ఉంటాయి.
ఉదా : పాలిథీన్, పాలిస్టైరీన్
4) ఉష్ణ దృఢ పాలిమర్లు :
ఈ పాలిమర్లు వ్యత్యస్త బంధాలలతోగాని లేదా అత్యధిక శాఖాయుతమైన అణువులతోగాని ఉండి వేడి చేసినప్పుడు విస్తారంగా వ్యత్యస్త బంధాలలో ఉన్న పోత లేదా మూసలాగా మారి, తిరిగి కరిగించటానికి వీలుకానిదిగా మారుతుంది.
ఉదా : బేకలైట్, యూరియా-ఫార్మాల్డిహైడ్ రెజిన్
ప్రశ్న 15.
ఎలాస్టోమర్లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఎలాస్టోమర్లు :
ఇవి అబ్బర్ వంటి ఘనపదార్థాలు. వీటికి స్థితిస్థాపక ధర్మం ఉంటుంది.
ఉదా : బ్యున – S, బ్యున – N
ప్రశ్న 16.
పోగులు (Fibres) అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పోగులు : పోగులు తంతువులను ఏర్పరచే ఘనపదార్థాలు. వీటికి అధిక తనన సామర్థ్యం, అధిక మధ్య గుణకం ఉంటాయి. ఉదా : నైలాన్ 6,6; టెరిలీన్
ప్రశ్న 17.
థర్మోప్లాస్టిక్ పాలిమర్లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
థర్మోప్లాస్టిక్ :
ఇవి రేఖీయ లేదా స్వల్ప శాఖాయుత దీర్ఘశృంఖల అణువులు. వీటిని వేడి చేస్తే మెత్తబడి, చల్లబరిస్తే గట్టిపడే లక్షణాలు ఉంటాయి.
ఉదా : పాలిథీన్, పాలిస్టైరీన్
ప్రశ్న 18.
ఉష్ణ దృఢ పాలిమర్లు (Thermosetting polymers) అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఉష్ణ దృఢ పాలిమర్లు :
ఈ పాలిమర్లు వ్యత్యస్త బంధాలలతోగాని లేదా అత్యధిక శాఖాయుతమైన అణువులతోగాని ఉండి వేడి చేసినప్పుడు విస్తారంగా వ్యత్యస్త బంధాలలో ఉన్న పోత లేదా మూసలాగా మారి, తిరిగి కరిగించటానికి వీలుకానిదిగా మారుతుంది.
ఉదా : బేకలైట్, యూరియా-ఫార్మాల్డిహైడ్ రెజిన్
ప్రశ్న 19.
స్వేచ్ఛా ప్రాతిపదిక పాలిమరీకరణ చర్యలో ఉపయోగించే ఒక సాధారణ ప్రారంభకం పేరును, దాని నిర్మాణాన్ని వ్రాయండి.
జవాబు:
స్వేచ్ఛా ప్రాతిపదిక పాలిమరీకరణ చర్యలో ఉపయోగించే ఒక సాధారణ ప్రారంభకం బెంజోయిల్ పెరాక్సైడ్
ప్రశ్న 20.
సంకలన, సంఘనన పాలిమరీకరణాల మధ్య గల భేదాన్ని ఎలా గుర్తిస్తారు?
జవాబు:
సంకలన పాలిమెరీకరణం | సంఘనన పొలిమెరీకరణం |
1. ఉపయోగించు మోనోమర్లు అసంతృప్త సమ్మేళనాలు. | 1. ద్విగుణ ప్రమేయ, త్రిగుణ ప్రమేయ సమ్మేళనాలు మోనోమర్లు. |
2. పరమాణువులు (లేదా) సమూహాలు కోల్పోకుండా పాలిమర్ ఏర్పడును. | 2. పరమాణువులు (లేదా) సమూహాలు కోల్పోయి పాలిమర్ ఏర్పడును. |
3. ఇది శృంఖల పెరుగుదల పాలిమరీకరణం. | 3. ఇది దశా పెరుగుదల పాలిమరీకరణం. |
4. వీటిని సంకలన పాలిమర్లు (లేదా) శృంఖల (లేదా) వినైల్ పాలిమర్లు అంటారు. | 4. వీటిని సంఘనన పాలిమర్లు అంటారు. |
ప్రశ్న 21.
జీగ్లర్ – నట్టా (Zeiglar – Natta) ఉత్ప్రేరకం అంటే ఏమిటి?
జవాబు:
ట్రై ఆల్కైల్ అల్యూమినియం మరియు టైటానియం క్లోరైడ్ల మిశ్రమాన్ని జీగ్లర్ – నట్టా ఉత్ప్రేరకం అంటారు.
ఉదా : (C2H5)3 Al + TiCl4.
ప్రశ్న 22.
ఇథిలీన్ గ్లైకాల్, టెర్రెలిక్ ఆమ్లాల నుంచి డైక్రాన్ను ఎలా తయారుచేస్తారు?
జవాబు:
డెక్రాన్ ఏర్పడుట అనునది సంఘనన పాలిమరీకరణంనకు ఉదాహరణ. ఇది ఇథిలీన్ గ్లైకాల్ మరియు టెర్రాలిక్ ఆమ్లం నుంచి ఈ క్రింది విధంగా ఏర్పడును.
ప్రశ్న 23.
నైలాన్ 6, నైలాన్ 6, 6 లలో పునరావృతమయ్యే మోనోమరిక్ యూనిట్లు ఏమిటి?
జవాబు:
→ నైలాన్ – 6లో పునరావృతమయ్యే మోనోమర్ యూనిట్ కాప్రొలాక్టమ్.
→ నైలాన్ 6, 6లో పునరావృతమయ్యే మోనోమర్లు హెక్సామిథిలీన్ డైఎమీన్ మరియు ఎడిపిక్ ఆమ్లం.
ప్రశ్న 24.
బ్యున-N, బ్యున-S ల మధ్య తేడా ఏమిటి?
జవాబు:
బ్యున – N: 1, 3 – బ్యుటాడయీన్ మరియు ఎక్రైలోనైట్రైల్ను పాలిమరీకరణం చేయుట ద్వారా ఏర్పడు కోపాలిమర్ బ్యున – N.
బ్యున – S : 1, 3 బ్యుటాడయీన్ మరియు స్టెరీన్లను పాలిమరీకరణం ద్వారా ఏర్పడు కోపాలిమర్ బ్యున – N.
ప్రశ్న 25.
క్రింది పాలిమర్లను వాటి అణుబలాలు పెరిగే క్రమంలో అమర్చండి.
జవాబు:
1) నైలాన్ 6, 6, బ్యున – S, పాలిథీన్
2) నైలాన్ 6, నియోప్రీన్, పాలి వినైల్రోరైడ్.
1) ఇవ్వబడిన పాలిమర్ల అణుబలాలు పెరిగే క్రమం
బ్యున్ – S < పాలిథీన్ < నైలాన్ – 6, 6
2) ఇవ్వబడిన పాలిమర్ల అణుబలాలు పెరిగే క్రమం
నియోప్రీన్ < పాలి వినైల్ క్లోరైడ్ < నైలాన్ 6.
ప్రశ్న 26.
క్రింది పాలిమెరిక్ నిర్మాణాలలో మోనోమర్ను గుర్తించండి.
జవాబు:
- {C – (CH2)8 – C – NH (CH2)6 – NH} లో గల మోనోమర్లు
డెకేన్ డమోయిక్ ఆమ్లం (HOOC – (CH2)8 – COOH] మరియు హెక్సామిథిలీన్ డైఎమీన్ [H2N – (CH2)8 – NH2]. - {NH – CO – NH – CH2}n లో గల మోనోమర్లు యూరియా [CO (NH2)2] మరియు ఫార్మాల్డీహైడ్ (HCHO).
ప్రశ్న 27.
పాలిమర్ల వివిధ రకాల అణుద్రవ్యరాశులను తెలపండి.
జవాబు:
పాలిమర్ల ముఖ్యమైన అణుద్రవ్యరాశులు
- సగటు సంఖ్య అణుద్రవ్యరాశి (\(\overline{\mathrm{M}}\)n).
- సగటుభార అణుద్రవ్యరాశి (\(\overline{\mathrm{M}}\)w)
ప్రశ్న 28.
పాలి విక్షేపణ సూచిక (PDI) అంటే ఏమిటి?
జవాబు:
ఒక పాలిమర్ సగటు భార అణుద్రవ్యరాశి (\(\overline{\mathrm{M}}\)w), సగటు సంఖ్య అణుద్రవ్యరాశి (\(\overline{\mathrm{M}}\)n) మధ్య గల నిష్పత్తిని పాలి విక్షేపణ సూచిక (PDI) అంటారు.
ప్రశ్న 29.
రబ్బర్ వల్కనైజేషన్ అంటే ఏమిటి? [AP. Mar.’17]
జవాబు:
రబ్బరు వల్కనైజేషన్ :
ముడి (లేదా) సహజ రబ్బరును సల్ఫర్ (లేదా) సల్ఫర్ సమ్మేళనాలతో వేడిచేసి దాని భౌతిక ధర్మాలు మెరుగుపరచుటను రబ్బరు వల్కనైజేషన్ అంటారు.
ప్రశ్న 30.
టైర్ రబ్బర్ తయారీలో ఉపయోగించే వ్యత్యస్త బంధాలను ఏర్పరిచే కారకం ఏమిటి ?
జవాబు:
టైర్ రబ్బర్ తయారీలో ఉపయోగించే వ్యత్యస్త బంధాలను ఏర్పరచే కారకం 5% సల్ఫర్.
ప్రశ్న 31.
జీవ క్షయీకృత పాలిమర్ అంటే ఏమిటి? జీవ క్షయీకృత పాలి ఎస్టర్కు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జీవక్షయీకృత పాలిమర్లు :
“ఎంజైమ్లతో ఆక్సీకరణం, జలవిశ్లేషణం వంటి రసాయన చర్యలు జరిపే లక్షణం కల్గి ఉండి, జీవ వ్యవస్థలలో తొందరగా క్షయకరణం చెందే మరియు మానవుడు నిరపాయకరంగా ఉపయోగించగలిగే పాలిమర్లను జీవ క్షయీకృత పాలిమర్లు అంటారు”.
ఉదా : PHBV పాలిగ్లైకాలిక్ ఆమ్లము, పాలిలాక్టిక్ ఆమ్లము మొ||వి.
ప్రశ్న 32.
PHBV అంటే ఏమిటి? అది మానవుడికి ఏవిధంగా ఉపయోగపడుతుంది? [TS. Mar.’16; TS. Mar.’15]
జవాబు:
పాలి β – హైడ్రాక్సీ బ్యుటిరేట్ – కో – β – హైడ్రాక్సీ వేలరేట్ (PHBV) :
ఇది 3–హైడ్రాక్సీ బ్యుటనోయిక్ ఆమ్లం మరియు 3 – హైడ్రాక్సీ పెంటనోయిక్ ఆమ్లముల కోపాలిమర్.
లక్షణాలు :
ఈ పాలిమర్ భౌతిక లక్షణాలు రెండు మోనోమర్ హైడ్రాక్సీ ఆమ్లాల సాపేక్ష పరిమాణాల మీద ఆధారపడతాయి.
ఉపయోగాలు :
- ఈ పాలిమర్ వైద్యరంగంలో మందు గొట్టాలను తయారుచేయడానికి అత్యంత ఉపయోగకారి.
- దీన్ని ప్రత్యేక పాకేజింగ్లోను, ఆర్థోపెడిక్ పరికరాల్లోను కూడ ఉపయోగిస్తారు.
ప్రశ్న 33.
నైలాన్ – 2 – నైలాన్ – 6 అణు నిర్మాణాన్ని ఇవ్వండి. [AP. Mar.’16]
జవాబు:
నైలాన్ – 2 – నైలాన్ – 6
ఇది గ్లైసీన్ (H2N – CH2 – COOH), ఎమినో కాప్రాయిక్ ఆమ్లాల (H2N (CH2)5 COOH) ఏకాంతర పాలిఎమైడ్ కోపాలిమర్. ఇది జీవక్షయీకృత పాలిమర్.
నిర్మాణం :
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్రింది వాటిని సంకలన, సంఘనన పాలిమర్లుగా వర్గీకరించండి.
ఎ) టెరిలీన్ బి) బేకలైట్ సి) పాలి వినైల్ క్లోరైడ్ డి) పాలిథీన్
జవాబు:
ఎ) టెరిలీన్ ఒక సంఘనన పాలిమర్
బి) బెకలైట్ ఒక సంఘనన పాలిమర్
సి) పాలి వినైల్రోక్లోరైడ్ ఒక సంకలన పాలిమర్
డి) పాలిధీన్ ఒక సంకలన పాలిమర్
ప్రశ్న 2.
ఒక పాలిమర్ క్రియాశీలతను ఏవిధంగా వివరిస్తారు?
జవాబు:
పాలిమర్లోని మోనోమర్లలో గల బంధ స్థావరాల సంఖ్యను పాలిమర్ క్రియాశీలత అంటారు.
ఉదా : 1) ఈథేన్, ప్రొపేన్ల క్రియాశీలత ఒకటి.
2) ఇథిలీన్ గ్లైకాల్ క్రియాశీలత రెండు.
ప్రశ్న 3.
సజాతీయ పాలిమర్, కోపాలిమర్ల మధ్య భేదాన్ని తెలపండి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సజాతీయ పాలిమర్ :
ఏక మోనోమర్ జాతుల పొలిమరీకరణం ద్వారా ఏర్పడిన పాలిమర్లను సజాతీయ పాలిమర్లు అంటారు.
ఉదా : పాలిథీన్, పాలిస్టైరీన్
కోపాలిమర్ :
రెండు లేదా అంతకన్నా ఎక్కువ రసాయనికంగా విభిన్నత్వం కలిగిన మోనోమర్ పాలిమరీకరణం ద్వారా ఏర్పడిన పాలిమర్ను కోపాలిమర్ అంటారు.
ఉదా : బ్యుటాడయీన్ – స్టైరీన్ల పాలిమర్ → బ్యునా – S
ప్రశ్న 4.
ధర్మోప్లాస్టిక్, ఉష్ణ దృఢ పాలిమర్లను నిర్వచించి, ఒక్కొక్క దానికి రెండేసి ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ధర్మోప్లాస్టిక్ :
ఇవి రేఖీయ లేదా స్వల్ప శాఖాయుత దీర్ఘ శృంఖల అణువులు. వీటిని వేడి చేస్తే మెత్తబడి, చల్లబరిస్తే గట్టిపడే లక్షణాలు ఉంటాయి.
ఉదా : పాలిథీన్, పాలిస్టైరీన్
ఉష్ణ దృఢ పాలిమర్లు :
ఈ పాలిమర్లు వ్యత్యస్త బంధాలలతోగాని లేదా అత్యధిక శాఖాయుతమైన అణువులతోగాని ఉండి వేడి చేసినప్పుడు విస్తారంగా వ్యత్యస్త బంధాలలో ఉన్న పోత లేదా మూసలాగా మారి, తిరిగి కరిగించటానికి వీలుకానిదిగా మారుతుంది.
ఉదా : బేకలైట్, యూరియా-ఫార్మాల్డిహైడ్ రెజిన్
ప్రశ్న 5.
కోపాలిమరీకరణాన్ని ఒక ఉదాహరణలో వివరించండి.
జవాబు:
కోపాలిమర్ :
రెండు లేదా అంతకన్నా ఎక్కువ రసాయనికంగా విభిన్నత్వం కలిగిన మోనోమర్ల పాలిమెరీకరణం ద్వారా ఏర్పడిన పాలిమర్ను కోపాలిమర్ అంటారు.
ఉదా : బ్యుటాడయీన్ – స్టైరీన్ల పాలిమర్ → బ్యునా – S
కోపాలిమర్ ఏర్పడు ప్రక్రియకు కోపాలిమరీకరణం అంటారు.
ఉదా :
బ్యున – 5 : 1, 3 – బ్యుటాడయీన్ మరియు స్టెరీన్లను పాలిమరీకరణం ద్వారా ఏర్పడు కోపాలిమర్ బ్యున – N.
ప్రశ్న 6.
ఈథేన్ పాలిమరీకరణాన్ని స్వేచ్ఛా ప్రాతిపదిక చర్యా విధానం ద్వారా వివరించండి.
జవాబు:
స్వేచ్ఛా ప్రాతిపదిక చర్యావిధానం :
విభిన్న ఆల్కీన్లు లేదా డయీన్లు, వాటి ఉత్పన్నాలు బెంజోయిల్ పెరాక్సైడ్, ఎసిటైల్, పెరాక్సైడ్ టెర్షరీ బ్యుటైల్ పెరాక్సైడ్ లాంటి స్వేచ్ఛా ప్రాతిపదిక జనకాల ప్రారంభకం (ఉత్ప్ర్పేరకం) సమక్షంలో పాలిమరీకరణం చెందుతాయి. ఉదాహరణకు ఈథీన్, పాలిథీన్ గా ఏర్పడే పాలిమరీకరణ చర్యలో, ఈథీన్కు కొద్ది మొత్తంలో బెంజోయిల్ పెరాక్సైడ్ ప్రారంభకాన్ని కలిపి, ఆ మిశ్రమాన్ని వేడిచేయడంగాని లేదా సూర్యకాంతీ సమక్షంలోగాని చర్య జరుపుతారు. ఈ ప్రక్రియ పెరాక్సైడ్ ఏర్పరచిన ఫినైల్ స్వేచ్ఛా ప్రాతిపదిక ఈథీన్ లోని ద్విబంధాలతో సంకలనం చెంది, కొత్త పెద్దదైన స్వేచ్ఛా ప్రాతిపదిక ఏర్పడటంతో ప్రారంభమవుతుంది.
ఈ అంచెను శృంఖల ప్రారంభ అంచె (chain initiating step) అని అంటారు. ఈ స్వేచ్ఛా ప్రాతిపదిక మరొక ఈథీన్ అణువుతో చర్య జరిపినప్పుడు మరొక పెద్ద పరిమాణంలో ఉన్న ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన పెద్ద పరిమాణంలో ఉన్న ప్రాతిపదికలు పునరావృతంగా చర్యను జరిపి, పాలిమరీకరణ చర్యను పురోగమనం చెందిస్తాయి. ఈ అంచెను శృంఖల ప్రవర్ధిక అంచె (chain propagating step) అంటారు. చివరికి ఒక దశలో ఉత్పన్న ప్రాతిపదిక మరొక ప్రాతిపదికతో చర్య జరపడంతో పాలిమరీకరణ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ అంచెను శృంఖలాంతక అంచె (chain terminating step) అంటారు. ఈ చర్యలో వివిధ దశల అనుక్రమం క్రింది విధంగా ఉంటుంది. శృంఖల ప్రారంభక అంచెలు
శృంఖలాంతక అంచె
దీర్ఘ శృంఖలాలను పరిసమాప్తి చేయడానికి ఈ స్వేచ్ఛా ప్రాతిపదికలు వివిధ రకాలుగా సంయోగం చెంది, పాలిథీన్ ను ఏర్పరుస్తాయి. ఒక రకమైన శృంఖలాంతక చర్యాక్రమం కింద చూపించిన విధంగా ఉంటుంది.
ప్రశ్న 7.
క్రింది పాలిమర్లను పొందడానికి వాడే మోనోమర్ల పేర్లను, నిర్మాణాలను వ్రాయండి.
ఎ) పాలి వినైల్ క్లోరైడ్
బి) టెఫ్లాన్
సి) బేకలైట్
డి) ఫాలిస్టెరీన్
జవాబు:
ఎ) పాలి వినైల్ క్లోరైడ్ :
మోనోమర్ : వినైల్ క్లోరైడ్
నిర్మాణం : CH2 = CH2 – Cl
బి) టెఫ్లాన్
మోనోమర్ : టెట్రాఫ్లోరో ఇథిలీన్
నిర్మాణం : CF2 = CF2
ప్రశ్న 8.
క్రింది పాలిమర్ల మోనోమర్ల పేర్లను, నిర్మాణాలను వ్రాయండి.
ఎ) బ్యున – 5 బి) బ్యున – N సి) డెక్రాన్ డి) నియోప్రీన్
జవాబు:
ఎ) బున్య – S :
మోనోమర్లు : 1, 3 – బ్యుటాడయీన్, స్టైరీన్
నిర్మాణాలు : CH2 – CH – CH = CH2,
బి) బ్యున. – N : [AP. Mar.’17]
మోనోమర్లు : 1, 3 – బ్యుటాడయీన్, ఎక్రైలోనైట్రైల్
నిర్మాణాలు : CH2 = CH – CH = CH2, CH2 = CH – CN
సి) డెక్రాన్ :
మోనోమర్లు : ఇథిలీన్ గ్లైకాల్, టెరాలిక్ ఆమ్లం
నిర్మాణాలు : HO – CH2 – CH2 – OH,
డి) నియోప్రిన్ :
మోనోమర్లు : 2 – క్లోరో 1, 3 – బ్యుటాడయీన్
నిర్మాణాలు : CH2 = C-CH = CH2
ప్రశ్న 9.
సహజ రబ్బర్ అంటే ఏమిటి? అది స్థితిస్థాపక ధర్మాలను ఎలా ప్రదర్శిస్తుంది? [TS. Mar.’17]
జవాబు:
1. సహజ రబ్బర్ :
రబ్బర్ ఒక సహజ పాలిమర్. దీనికి స్థితిస్థాపక ధర్మం ఉంటుంది. దీనిని ఎలాస్టోమర్ కూడా పిలుస్తారు. దీనికి విభిన్న ఉపయోగాలు ఉన్నాయి. సహజ రబ్బరు లేటెక్స్ నుండి తయారుచేస్తారు. ఇది నీటిలో విక్షిప్తమైన రబ్బర్ కొల్లాయిడల్ ద్రావణం. లేటెక్స్ను రబ్బర్ చెట్టు బెరడు నుంచి పొందుతారు. ఇది ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, దక్షిణ అమెరికా దేశాల్లో లభిస్తుంది. సహజ రబ్బర్ ఐసోప్రీన్ (2-మిథైల్-1, 3-బ్యూటాడయీన్) రేఖీయ పాలీమర్. దీనిని సిస్-1,4-పాలిఐసోప్రీన్ అని కూడా అంటారు.
ఈ సిస్-పాలిఐసోప్రీన్ అణువులకు బలహీన వాండర్వాల్ బాలాల చేత బంధితమైన విభిన్న CH శృంఖలాలతో చుట్లు తిరిగిన నిర్మాణం (coiled structure) ఉంటుంది. కాబట్టి అది స్ప్రింగ్గా సాగదీయడానికి వీలుగా ఉండి, స్థితిస్థాపక ధర్మాలను ప్రదర్శిస్తుంది.
ప్రశ్న 10.
రబ్బర్ వల్కనైజేషన్ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
సహజ రబ్బర్కు సున్నితత్వము, అధిక ఉష్ణోగ్రతలకు మెత్తబడడం, అల్ప ఉష్ణోగ్రతలకు పెళుసుగా మారడం, అల్పతనన శక్తి, నీటిని అధికంగా శోషించుకోవడం, త్వరగా అరిగిపోయే స్వభావం, తక్కువ ఎలాస్టిక్ ధర్మం వంటి అనుకూల భౌతిక లక్షణాలుంటాయి. ఈ భౌతిక లక్షణాలను మెరుగుపరచి, రబ్బరును వ్యాపారాత్మక అనువర్తనాలకు అనుగుణంగా మార్చడానికి వీలుగా ‘చార్లెస్ గుడ్ ఇయిర్’ అను శాస్త్రవేత్త వల్కనైజేషన్ అనే పద్ధతిని కనుగొన్నాడు.
రబ్బరు వల్కనైజేషన్ :
“వేడి రబ్బర్కు సల్ఫర్ని కలపడం ద్వారా దాని భౌతిక లక్షణాలను మెరుగుపరచే పద్ధతిని వల్కనైజేషన్ అంటారు.” 373 – 415K వద్ద · ముడిరబ్బరును, జింక్ ఆక్సైడ్ (లేక) జింక్ స్టీరేట్ సమక్షంలో, సల్ఫర్తో కలిపి మిశ్రమాన్ని వేడి చేస్తారు.
విధానం :
సహజ రబ్బర్ పాలిమర్కు చెందిన ద్విబంధాల్లో చర్యాశీలక స్థావరాలు ఉంటాయి. ద్విబంధానికి పక్కనే ఉన్న – CH2 సమూహాన్ని, ఎలైలిక్ – CH2 సమూహం అంటారు. ఇది చాలా చర్యాశీలక సమూహం. వల్కనైజేషన్ ఈ చర్యాశీలక స్థావరాల వద్దనే జరుగుతుంది. ఇక్కడే సల్ఫర్ వ్యత్యస్థ బంధాలను కూడా ఏర్పరుస్తుంది. ఈ విధంగా రబ్బర్ గట్టి పడుతుంది. రబ్బర్ భౌతిక ధర్మాలు మారతాయి. ఈ మార్పు వాడిన సల్ఫర్ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. వల్కనైజ్డ్ రబ్బర్ల కు క్రింది నిర్మాణాలు ఉంటాయి.
రబ్బరు వల్కనైజేషన్ – ఫలితాలు :
- వల్కనైజ్ చేసిన రబ్బర్ అత్యుత్తమ భౌతిక ధర్మాలు కలిగి ఉంటుంది.
- వల్కనైజ్ రబ్బరు సాగే ధర్మం, అధికతననశక్తి, అధిక నిరోధకత వంటి ధర్మాలుంటాయి..
- నీటిని శోషించుకునే లక్షణం, రసాయనిక ఆక్సీకరణానికి, కర్బన ద్రావణాలలో కరగటానికి ఎక్కువ నిరోధకత లాంటి ధర్మాలు వల్కనైజేషన్ వల్ల రబ్బరుకు వస్తాయి. “
- సల్ఫర్కు 40 – 50%, వరకు పెంచితే ఏబనైట్ అనే సాగే గుణంలేని గట్టిపదార్థం వస్తుంది.
ప్రశ్న 11.
సహజ రబ్బర్, కృత్రిమ రబ్బర్ల మధ్య భేదాన్ని వివరించండి.
జవాబు:
సహజ రబ్బర్ :
సహజసిద్ధ వనరులైన మొక్కలు, జంతువుల నుండి పొందబడిన రబ్బర్ను సహజ రబ్బర్ అంటారు.
కృత్రిమ రబ్బర్ :
కృత్రిమంగా తయారుచేయబడిన రబ్బర్లు అనగా మానవులచే తయారుచేయబడిన 1, 3 – బ్యుటాడయీన్ ఉత్పన్నాలను కృత్రిమ రబ్బర్లు అంటారు.
వీటి వలన పరిశ్రమలలో, నిత్యజీవితంలో చాలా ఉపయోగాలు కలవు.
ప్రశ్న 12.
రబ్బర్ అణువులలో ఉండే ద్విబంధాలు వాటి నిర్మాణాన్ని, చర్యాశీలతను ఏవిధంగా ప్రభావితం చేస్తాయి?
జవాబు:
సహజ రబ్బరులోని ద్విబంధాలు చర్యాశీలక స్థావరాలను తెలియచేస్తాయి. అలాగే పాలిమర్ విన్యాసాన్ని కూడా నిర్ధారిస్తాయి. ద్విబంధానికి తరువాత ఉండే – CH2 ని, ఎలైలిక్ – CH2 సమూహం అంటారు. ఇది అత్యంత క్రియాశీలత కల సమూహం. ఈ స్థానాల్లోనే వల్కనైజేషన్ జరుగుతుంది. ఇక్కడే సల్ఫర్ కూడా వ్యత్యస్థ బంధాలను ఏర్పరుస్తుంది. అందుకే రబ్బరు వంగకుండా బిట్టుగా తయారవుతుంది. రబ్బరు చుట్టలలో అణువాంతర కదలికలు ఆగిపోతాయి. భౌతిక ధర్మాలన్నీ మారతాయి. రబ్బరు ఏ మేరకు గట్టిగా అవుతుంది అనేది వల్కనైజేషన్లో ఉపయోగించిన సల్ఫర్ పరిమాణాన్ని బట్టి మారుతుంది.
ప్రశ్న 13.
LDP, HDP అంటే ఏమిటి అవి ఎలా ఏర్పడతాయి?
జవాబు:
అల్పసాంద్రత పాలిథీన్ (LDP) :
ఈథీన్ను 1000 – 2000 atm. అధిక పీడనం వద్ద 350 – 570 K ఉష్ణోగ్రత వద్ద పాలిమరీకరణం చేయుట ద్వారా దీనిని తయారు చేస్తారు.
ధర్మాలు :
- ఇది స్వేచ్ఛా ప్రాతిపదిక సంకలనం ద్వారా ఏర్పడును.
- రసాయనికంగా జఢత్వాన్ని, దృఢత్వాన్ని ప్రదర్శిస్తుంది.
- బలహీన విద్యుద్వాహకం.
ఉపయోగాలు :
- దీనిని నలిపివేసి సీసాలు, ఆటవస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.
- దీనిని నమ్యశీలత గల పైపుల తయారీలో ఉపయోగిస్తారు.
అధిక సాంద్రత పాలిథీన్ (HDP) :
ఈథీన్ ఒక హైడ్రోకార్బన్ ద్రావణిలో ట్రెఇథైల్ అల్యూమినియం, టైటానియం టెట్రాక్లోరైడ్ (జీగ్లర్ – నట్టా ఉత్ప్రేరకం) సమక్షంలో 333 – 343K వద్ద, 6 – 7atm పీడనం వద్ద సంకలన పాలిమరీకరణం చెందినపుడు అధిక సాంద్రత పాలిథీన్ ఏర్పడును.
ధర్మాలు :
- ఇది రేఖీయ అణువులు కలిగి, సన్నిహిత కూర్పు వలన అధిక సాంద్రత కలిగి ఉండుట.
- ఇది రసాయనికంగా జఢత్వాన్ని, అధిక దృఢత్వాన్ని కలిగి ఉండును.
ఉపయోగాలు :
- దీనిని బకెట్ల, చెత్తకుండీలు, సీసాలు, పైపుల తయారీలో ఉపయోగిస్తారు.
ప్రశ్న 14.
సహజ, కృత్రిమ పాలిమర్లు అంటే ఏమిటి? ఒక్కొక్క రకానికి రెండేసి ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సహజపాలిమర్లు :
సహజసిద్ధమైన వనరులైన మొక్కలు, జంతువుల నుండి పొందబడిన పాలిమర్లను సహజ పాలిమర్లు అంటారు.
ఉదా : సహజ రబ్బర్, సెల్యులోజ్, స్టార్చ్ మొదలగునవి.
కృత్రిమ పాలిమర్లు :
కృత్రిమంగా తయారుచేయబడిన పాలిమలను కృత్రిమ పాలిమర్లు అంటారు. మానవుల చేత తయారు చేయబడినవి.
ఉదా : ప్లాస్టిక్లు, నైలాన్ 6, 6, కృత్రిమ రబ్బర్లు.
వీటి వలన పరిశ్రమలలో నిత్యజీవితంలో చాలా ఉపయోగాలు కలవు.
ప్రశ్న 15.
పాలిమర్ వివిధ రకాల అణుద్రవ్యరాశులపై వ్యాఖ్యను వ్రాయండి.
జవాబు:
సరళరసాయన సమ్మేళనాలలో పాలిమర్లలో అణుభారం స్థిరంగా ఉండదు. కావున పాలిమర్ అణుభారం “సగటు విలువ” రూపంలో చెప్పవలెను.
పాలిమర్ల సగటు అణుభారం విభిన్న పద్ధతులలో తెలుపుతారు.
ఎ) సగటు సంఖ్య అణుద్రవ్యరాశి (\(\overline{\mathrm{M}}\)n)
బి) సగటు భార అణు ద్రవ్యరాశి (\(\overline{\mathrm{M}}\)w)
ఎ) సగటు సంఖ్య అణుద్రవ్యరాశి (\(\overline{\mathrm{M}}\)n) :
పాలిమర్లో మొత్తం కణాల సంఖ్య Ni ఒక్కొక్క దాని ద్రవ్యరాశి Mi అనుకొంటే పాలిమర్ యొక్క సగటు సంఖ్య అణుద్రవ్యరాశి (\(\overline{\mathrm{M}}\)n) ఈ క్రింది విధంగా చెప్పవచ్చును.
బి) సగటు భార అణుద్రవ్యరాశి (\(\overline{\mathrm{M}}\)w) :
పాలిమర్ల సగటు భార అణుద్రవ్యరాశిని క్రింది విధంగా చెప్పవచ్చు.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్రింది వాటిపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
ఎ) సంకలన పాలిమరీకరణం
బి) సంఘనన పాలిమరీకరణం
(a) సంఘనన పాలిమరీకరణము :
“పాలిమర్ను ఏర్పరిచిన అన్ని మోనోమర్ యూనిట్లలోని మొత్తం పరమాణువుల సంఖ్య కంటే పాలిమర్లో పరమాణువుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఆ పాలిమర్ను సంఘనన పాలిమర్ అనీ మరియు ప్రక్రియను సంఘనన పాలిమరీకరణము అంటారు”. సంఘనన పాలిమరీకరణం ఒకటి కంటే ఎక్కువ ప్రమేయ సమూహాలున్న అణువుల మధ్య సంఘననం జరిగినప్పుడు జరుగుతుంది.
ఉదా :
i) హెక్సామిథిలీన్ డైఎమీన్, ఎడిపికామ్లాలు సంఘననం చెంది నైలాన్ 6, 6 అనే సంఘనన పాలిమర్శి ఏర్పరుస్తాయి.
ii) ఇథిలీన్ గ్లెకాల్, టెర్హాలిక్ ఆమ్లాలు సంఘననం చెంది పాలి ఇథిలీన్ టెర్హిలేట్ (PET) అనే సంఘనన పాలిమర్ ఏర్పడుతుంది.
(b) సంకలన పాలిమరీకరణము :
“సంకలన విధానంలో ఏర్పడిన పాలిమర్లను సంకలన పాలిమర్ అని మరియు ప్రక్రియను సంకలన పాలిమరీకరణము అందురు”.
- ఈ విధానంలో ఏర్పడిన పాలిమర్లను శృంఖల చర్య పాలిమర్లు మరియు వినైల్ పాలిమర్లు అనీ అంటారు.
- ద్విబంధాలున్న మోనోమర్ల నుంచి సంకలన పాలిమర్లు ఏర్పడతాయి.
- సంకలన పాలిమరీకరణ విధానములో శృంఖల ప్రారంభ చర్య, శృంఖల ప్రవర్థక చర్య మరియు శృంఖలాంతక చర్యలు వుంటాయి.
- ఈ పాలిమరీకరణాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి
(a) అయానిక పాలిమరీకరణము (కాటయానిక మరియు ఆనయానిక పాలిమరీకరణము)
(b) స్వేచ్ఛా ప్రాతిపదిక పాలిమరీకరణము.
ఉదా : వినైల్ క్లోరైడ్ `అణువులు సంకలన పాలిమరీకరణంలో పాల్గొని పాలివినైల్ క్లోరైడ్ (PVC) ని ఏర్పరుస్తాయి.
ప్రశ్న 2.
లభ్యస్థానం, నిర్మాణం ఆధారంగా పాలిమర్ల వర్గీకరణాన్ని వివరించండి.
జవాబు:
లభ్యస్థానం ఆధారంగా వర్గీకరణ (Classification Based on Source) :
ఈ వర్గీకరణలో మూడు ఉపవర్గాలున్నాయి.
1. సజహ పాలిమర్లు :
ప్రకృతి వనరులైన మొక్కలు, జంతువుల నుంచి ఈ పాలిమర్లు లభిసాయి. ప్రోటీన్లు, సెల్యులోజ్, స్టార్చ్, కొన్ని రెజిన్లు, రబ్బర్లు సహజ పాలిమర్లకు ఉదాహరణలు.
2. అర్ధ-కృత్రిమ పాలిమర్లు :
ఈ పాలిమర్లు సహజ పాలిమర్ల కృత్రిమ ఉత్పాదితాలు. సెల్యులోజ్ ఉత్పన్నాలైన సెల్యులోజ్ ఎసిటేట్ (రేయాన్), సెల్యులోజ్ నైట్రేట్ మొదలైనవి అర్ధ-కృత్రిమ పాలిమర్లకు ఉదాహరణలు.
3. కృత్రిమ పాలిమర్లు :
ఈ పాలిమర్లు సాధారణంగా మానవుడు తయారుచేసిన పాలిమర్లు. విభిన్న కృత్రిమ పాలిమర్లైన ప్లాస్టిక్ లు (పాలిథీన్), కృత్రిమ పోగులు (నైలాల్ 6,6) కృత్రిమ రబ్బర్లు (బ్యున – S మొదలైనవి నిత్యజీవితంలోను, పారిశ్రామికరంగంలోను విరివిగా వాడే కృత్రిమ పాలిమర్లు లేదా మానవ-తయారీ (man-made) పాలిమర్లకు ఉదాహరణలు
నిర్మాణం ఆధారంగా పాలిమర్ల వర్గీకరణ :
ఎ) రేఖీయ పాలిమర్లు :
వీటిలో ఒకదానిపైన ఒకటి అతిసన్నిహితంగా అమరిఉన్న మోనోమర్లు ఉంటాయి.
ఉదా : పాలిథీన్, PVC మొదలగునవి.
బి) శాఖాయుత శృంఖల పాలిమర్లు :
వీటిలో వివిధ దైర్ఘ్యాలున్న శాఖలు ప్రధాన కర్బన శృంఖలానికి చేరి ఉంటాయి.
ఉదా : అల్ప సాంద్రత పాలిథీన్ (LDPE) మొదలగునవి.
సి) జాలక పాలిమర్లు (వ్యత్యస్తబద్ధ పాలిమర్లు) :
రేఖీయ పాలిమర్ శృంఖలాల మధ్య బలమైన సమయోజనీయ ‘బంధాలు గల పాలిమర్లు.
ఉదా : బేకలైట్, మెలమైన్ మొదలగునవి.
ప్రశ్న 3.
పాలిమరీకరణ విధానం, అణుబలాల స్వభావం ఆధారంగా పాలిమర్ల వర్గీకరణాన్ని వివరించండి.
జవాబు:
పాలిమరీకరణ విధానం ఆధారంగా పాలిమర్లను రెండు రకాలుగా వర్గీకరించారు.
- సంకలన పాలిమర్లు
- సంఘనన పాలిమర్లు
సంకలన పాలిమర్ :
ఒకే రకమైన (లేదా) విభిన్నమైన రకాలు అయిన ద్విబంధాలు గల మోనోమర్ అణువుల సంకలన చర్యవలన ఏర్పడిన పాలిమర్ను సంకలన పాలిమర్ అంటారు.
ఉదా : పాలిథీన్, పాలీఎక్రైలో నైట్రైట్
సంఘనన పాలిమర్ :
పాలిమర్ను ఏర్పరచిన అన్ని మోనోమర్ యూనిట్లలోని మొత్తం పరమాణువుల సంఖ్య కంటే పాలిమ అగీఈర్లో పరమాణువుల సంఖ్య తక్కువగా ఉన్నపుడు ఆ పాలిమర్ను సంఘనన పాలిమర్ అంటారు.
ఉదా : నైలాన్ 6, 6, పాలీఇథలీన్ టెరి థొలేట్.
అణుబలాల ఆధారంగా పాలీమర్లు నాలుగు రకాలుగా వర్గీకరించారు.
1) ఎలాస్టోమర్లు :
ఇవి రబ్బర్ వంటి ఘనపదార్థాలు. వీటికి స్థితిస్థాపక ధర్మం ఉంటుంది.
ఉదా : బ్యున – S, బ్యున – N
2) పోగులు :
పోగులు తంతువులను ఏర్పరచే ఘనపదార్థాలు. వీటికి అధిక తనన సామర్థ్యం, అధిక మధ్యగుణకం ఉంటాయి.
ఉదా : నైలాన్ 6,6; టెరిలీన్
3) థర్మోప్లాస్టిక్ లు :
ఇవి రేఖీయ లేదా స్వల్ప శాఖాయుత దీర్ఘశృంఖల అణువులు. వీటిని వేడి చేస్తే మెత్తబడి, చల్లబరిస్తే గట్టిపడే లక్షణాలు ఉంటాయి.
ఉదా : పాలిథీన్, పాలిస్టైరీన్
4) ఉష్ణ దృఢ పాలిమర్లు :
ఈ పాలిమర్లు వ్యత్యస్త బంధాలలతోగాని లేదా అత్యధిక శాఖాయుతమైన అణువులతోగాని ఉండి వేడి చేసినప్పుడు విస్తారంగా వ్యత్యస్త బంధాలలో ఉన్న పోత లేదా మూసలాగా మారి, తిరిగి కరిగించటానికి వీలుకానిదిగా మారుతుంది.
ఉదా : బేకలైట్, యూరియా-ఫార్మాల్డిహైడ్ రెజిన్
ప్రశ్న 4.
కృత్రిమ రబ్బర్ లు అంటే ఏమిటి ? క్రింది వాటి తయారీని, ఉపయోగాలను వివరించండి.
ఎ) నియోప్రీన్ బి) బ్యున – N సి) బ్యున – S
జవాబు:
కృత్రిమ రబ్బర్లు :
సహజ రబ్బర్లో లాగా వల్కనైజేషన్ జరుపగల దాని పొడవును రెట్టింపు పొడవు వరకు సాగదీయబడే లక్షణాలు గల పాలిమర్లను కృత్రిమ రబ్బర్లు అంటారు.
→ ఇవి 1, 3 – బ్యుటాడయీన్ యొక్క ఉత్పన్నాల సజాతీయ పాలిమర్లు.
ఎ) నిమోప్రిన్ :
క్లోరోప్రీన్ను స్వేచ్ఛాప్రాతిపదిక పాలిమరీకరణానికి గురిచేసినప్పుడు నియోప్రీన్ లేదా పాలిక్లోరోప్రీన్ ఏర్పడుతుంది.
నియోప్రీన్ కు శాకతైలాలు (vegetable oils), ఖనిజ తైలాలతో అత్యధిక నిరోధక ఉంటుంది. దీనిని కన్వేయర్ బెల్ట్లు, గాస్కెట్లు, హోస్ పైపులను తయారుచేయడానికి వాడతారు.
బి) బ్యున్ – N :
1,3 బ్యుటాడయీన్ ఎక్రైలోనైట్రైల్లను పెరాక్సైడ్ ఉత్ప్రేరకం సమక్షంలో కోపాలిమరీకరణం జరిపినప్పుడు బ్యున-N ఏర్పడుతుంది.
బ్యున -N కు పెట్రోల్, లూబ్రికేటింగ్ ఆయిల్, కర్బన ద్రావణాల చర్యలను నిరోధించే లక్షణం ఉంటుంది. దీనిని ఆయిల్ సీల్లు, టాంక్ లైనింగ్ మొదలైన వాటిని తయారుచేయడానికి ఉపయోగిస్తారు.
సి) బ్యున – S :
1, 3 – బ్యుటాడయీన్ మరియు స్టైరీన్లను పాలిమరీకరణం ద్వారా ఏర్పడు కోపాలిమర్ బ్యున – N.
ఉపయోగాలు :
- సహజసిద్ధ రబ్బరుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
- మోటర్ వాహనాల టైర్ల తయారీలో ఉపయోగిస్తారు.
- నేలపలకల తయారీలో ఉపయోగిస్తారు.
- పాదరక్షల భాగాలు తయారీకి, కేబుల్లకు విద్యుద్భంధనం చేయుటకు ఉపయోగిస్తారు.
సాధించిన సమస్యలు Textual Examples
ప్రశ్న 1.
{CH2 – CH (C6H5-)}n అనేది సజాతీయ పాలిమరా లేక కోపాలిమరా?
సాధన:
అది ఒక సజాతీయ పాలిమర్, దానిని స్టైరీన్ C6H5CH = CH2 అనే మోనోమర్ నుంచి పొందుతారు.
ప్రశ్న 2.
ఒక పాలిమర్ లో ఒక్కొక్క అణువు ద్రవ్యరాశి 10,000 గల అణువులు 10, ఒక్కొక్క అణువు ద్రవ్యరాశి 1,00,000 గల `అణువులు 10 ఉన్నాయి. ఆ పాలిమర్ సగటు సంఖ్య అణు ద్రవ్యరాశిని లెక్కకట్టండి.
సాధన:
పాఠ్యాంశ ప్రశ్నలు Intext Questions
ప్రశ్న 1.
పాలిమర్లు అంటే ఏమిటి?
జవాబు:
పాలిమర్లు అధిక సంఖ్యలో పునరావృతమయ్యే నిర్మాణాత్మక యూనిట్ ఉన్న అధిక అణుద్రవ్యరాశి గల పదార్థాలు. వాటిని బృహదణువులు అనికూడా పిలుస్తారు. పాలిథీన్, బేకలైట్, రబ్బర్, నైలాన్ 6,6, మొదలైనవి పాలిమర్లకు కొన్ని ఉదాహరణలు.
ప్రశ్న 2.
నిర్మాణం ఆధారంగా పాలిమర్లను ఎలా వర్గీకరిస్తారు?
జవాబు:
నిర్మాణం ఆధారంగా పాలిమర్లను కింది రకాలుగా వర్గీకరించారు.
(i) రేఖీయ పాలిమర్లు : పాలిథీన్, పాలి వినైల్ క్లోరైడ్ లాంటివి.
(ii) శాఖాయుత శృంఖల పాలిమర్లు : అల్ప సాంద్రత పాలిథీన్ (LDP) లాంటివి.
(iii) వ్యత్యస్తబద్ధ పాలిమర్లు : బేకలైట్, మెలమైన్ వంటివి.
ప్రశ్న 3.
కింది పాలిమర్ల మోనోమర్ల పేర్లను వ్రాయండి.
జవాబు:
- హెక్సామిథిలీన్ డైనమీన్, ఎడిపిక్ ఆమ్లం.
- కాప్రొలాక్టమ్
- టెట్రాఫ్లోరో ఈథీన్
ప్రశ్న 4.
కింది వాటిని సంకలన, సంఘనన పాలిమర్లుగా వర్గీకరించండి. టెరిలీన్, బేకలైట్, పాలి వినైల్ క్లోరైడ్, పాలిథీన్
జవాబు:
సంకలన పాలిమర్లు : పాలి వినైల్ క్లోరైడ్, పాలిథీన్
సంఘనన పాలిమర్లు : టెరిలీన్, బేకలైట్.
ప్రశ్న 5.
బ్యున-N బ్యున-S ల మధ్యగల భేదాన్ని తెలపండి.
జవాబు:
బ్యున–N :1,3-బ్యుటాడయీన్, ఎక్స్ప్రెలోనైట్రైల్ల కోపాలిమర్
బ్యున–S: 1,3-బ్యుటాడయీన్, స్టెరీన్ల కోపాలిమర్
ప్రశ్న 6.
కింది పాలిమర్లను, వాటి అంతర అణుబలాలు పెరిగే క్రమంలో, అమర్చండి.
(i) నైలాన్ 6,6, బ్యున-S, పాలిథీన్.
(ii) నైలాన్ 6, నియోప్రీన్, పాలి వినైల్ క్లోరైడ్.
జవాబు:
అంతర అణుబలాలు పెరిగే క్రమంలో
(i) బ్యున–S, పాలిథీన్, నైలాన్ 6,6.
(ii) నియోప్రీన్, పాలి వినైల్రోక్లోరైడ్, నైలాన్ 6.