AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 3rd Lesson కేంద్ర కార్యనిర్వాహక శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 3rd Lesson కేంద్ర కార్యనిర్వాహక శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి అధికారాలు, విధులను గూర్చి వివరించండి.
జవాబు:
భారత రాష్ట్రపతి రాజ్యాధినేత. రాజ్యాంగ నిర్మాతలు ఆయనను బ్రిటిష్ రాజుతో సమానుడుగా వర్ణించారు. దేశ ప్రథమ పౌరుడుగా, కార్యనిర్వహణాధిపతిగా, జాతి గౌరవ ప్రతిష్ఠలకు ఆయన ప్రతీక. రాజ్యాంగం ప్రకారం ఆయన అధీనంలో కార్య నిర్వహణాధికారం ఉంది. పార్లమెంటులో రాష్ట్రపతి అంతర్భాగం. దేశ పరిపాలన ఆయన పేరు మీదుగా జరుగుతుంది. అయితే నామమాత్రపు అధికారి కావడం వలన పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం మంత్రిమండలి వాస్తవ అధికారాలను కలిగి ఉంటుంది. రాష్ట్రపతికి గల వివిధ అధికారాలు దిగువ పేర్కొనబడ్డాయి.

రాష్ట్రపతి అధికారాలు:
1) కార్యనిర్వహణాధికారాలు: అధ్యక్షుడు దేశానికి ప్రధాన కార్యనిర్వహణాధికారి. పరిపాలన ఆయన పేరు మీదనే జరుగుతుంది. రాష్ట్రపతి మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహరించాలి. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అభిప్రాయం ప్రకారం అధ్యక్షుడు రాజ్యాంగానికి బద్ధుడు.

అధికారుల నియామకం: సాధారణ ఎన్నికల తరువాత లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఏ పార్టీకీ మెజారిటీ లభించకపోతే తనకు తోచిన వ్యక్తిని ప్రధానిగా నియమిస్తాడు. ప్రధాని సలహాపై ఇతర మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. త్రివిధ బలగాల అధిపతులను, (సైన్యం, నౌకా, వైమానిక దళం) నియమిస్తాడు. రాష్ట్ర గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాయబారులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎన్నికల ప్రధానాధికారి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులు, ఆర్థిక సంఘం సభ్యులు, కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ మొదలగువారిని రాష్ట్రపతి నియమిస్తాడు.

2) శాసనాధికారాలు:

  1. పార్లమెంట్ను సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి, లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలున్నాయి.
  2. సాధారణ ఎన్నికల తరువాత ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తాడు.
  3. పార్లమెంట్కు సందేశాలు పంపవచ్చును.
  4. రాష్ట్రపతి సంతకం పొందిన తరువాతనే బిల్లులు చట్టాలవుతాయి. బిల్లులకు ఆమోదం తెలుపకుండా కొంతకాలం నిలపవచ్చు. కానీ రెండు సభలు తిరిగి ఆ బిల్లులను ఆమోదించి పంపితే, అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదించాలి.
  5. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు.
  6. ఆర్థిక బిల్లులు ఆయన అనుమతి లేనిదే పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదు.
  7. ఆర్థిక సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికలను పార్లమెంట్కు పంపుతాడు.
  8. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తాడు.
  9. రాజ్యసభకు 12 మందిని, లోక్సభకు ఇద్దరిని నియమిస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

3) ఆర్థికాధికారాలు:

  1. రాష్ట్రపతి ఆమోదం లేనిదే ఆర్థిక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టకూడదు.
  2. కేంద్ర బడ్జెట్, అనుబంధ బడ్జెట్లు ఆయన అనుమతి లేనిదే పార్లమెంట్ ముందుంచరాదు.
  3. ఐదు సంవత్సరాలకొక పర్యాయం రాష్ట్రపతి ఆర్థిక కమీషన్ను ఏర్పాటు చేస్తాడు.
  4. కంప్టోలర్, ఆడిటర్ జనరల్ రూపొందించిన వార్షిక నివేదికను ఆయన పార్లమెంట్కు సమర్పిస్తాడు.

4) న్యాయాధికారాలు: రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు. కాని వారిని తొలగించే అధికారం ఆయనకు లేదు. తగిన కారణాలుంటే సుప్రీంకోర్టు విధించిన శిక్షలను తాత్కాలికంగా నిలిపి వేయవచ్చు. శిక్షలు అమలు కాకుండా వాయిదా వేయవచ్చు. ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్చవచ్చు. శిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టవచ్చు.

2) రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (356వ ప్రకరణ): భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరణ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పించింది. ఆ రాష్ట్ర గవర్నర్ నుంచి గాని, మరొక విధంగా ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడిందన్న నివేదిక తరువాత, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దీనినే రాష్ట్రపతి పాలన’ అంటారు.

రాష్ట్రపతి పాలన సమయంలో భారత రాజకీయ వ్యవస్థలో క్రింది మార్పులు సంభవిస్తాయి.

  1. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లేదా ఏవైనా కొన్ని విధులను రాష్ట్రపతి స్వయంగా నిర్వహించవచ్చు. గవర్నరికి గానీ లేదా ఇతర కార్యనిర్వాహక అధికారికి గానీ అప్పగించవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలను పార్లమెంటు వినియోగిస్తుందని ప్రకటించవచ్చు.
  3. అత్యవసర పరిస్థితి ప్రకటన ఉద్దేశాలకు అనుగుణమైన అంశాలను అమలులో ఉంచడానికి రాష్ట్రపతి తగిన ఆదేశాలను జారీ చేయవచ్చును.

3) ఆర్థిక అత్యవసర పరిస్థితి: భారతదేశం మొత్తానికి లేదా ఒక ప్రాంతం ఆర్థిక స్థిరత్వానికి లేదా పరపతికి ముప్పు వాటిల్లిన పరిస్థితి ఏర్పడినపుడు 360వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటనను రెండు నెలల లోగా పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ఇప్పటివరకు ఇటువంటి అత్యవసర పరిస్థితిని మనదేశంలో విధించలేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతి, ప్రభుత్వ సిబ్బందితో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను తగ్గించవచ్చు.

ప్రశ్న 3.
భారత ప్రధానమంత్రి అధికారాలు, విధులను గూర్చి చర్చించండి. [Mar. ’16]
జవాబు:
భారత ప్రధాని పరిపాలనా యంత్రాంగంలోను, దేశంలోను అత్యంత ప్రముఖస్థానాన్ని కలిగి ఉంటాడు. పార్లమెంటరీ ప్రభుత్వ సంప్రదాయాల ప్రకారం, “ప్రధాని ప్రభుత్వానికి మకుటంలేని మహారాజు”. “మంత్రిమండలి అనుభవానికి పునాదివంటివాడు”. “సౌర కుటుంబంలో సూర్యునివలె మంత్రిమండలిలో ప్రకాశిస్తాడు”. అని ఐవర్ జెన్నింగ్స్ పేర్కొనెను.

నియామకం: సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని, రాష్ట్రపతి ప్రధానిగా నియమిస్తాడు. ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే తన వివేచన ఉపయోగించి రాష్ట్రపతి తగిన వ్యక్తిని ప్రధానిగా నియమిస్తాడు. తరువాత ప్రధానిగా నియమించబడిన వ్యక్తి లోక్సభలో మెజారిటీని నిరూపించుకోవాలి. ఉదా: 1978లో జనతా ప్రభుత్వం పడిపోయినపుడు, ఏ పార్టీకి మెజారిటీ లేదని భావించి అప్పటి అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి, చరణ్్సంగ్ను ప్రధానిగా నియమించి, ఒక నెలలోగా లోక్సభలో తన మెజారిటీని నిరూపించుకోమన్నాడు. ఈ విధమైన పరిస్థితులు ఈ మధ్యకాలంలో కూడా జరిగెను.

ప్రధానమంత్రి అధికారాలు, విధులు: ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ అధిపతి. ఆయన వాస్తవ కార్యనిర్వాహక అధికారి. ప్రధానమంత్రి లేకుండా కేంద్ర మంత్రిమండలి ఏర్పాటు కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన చాలా ముఖ్యమైన, శక్తివంతమైన, కీలకమైన అధినేత. అయితే దేశంలోని రాజకీయ పరిస్థితిని బట్టి ప్రధానమంత్రి చెలాయించే అధికారం ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి ఈ క్రింద పేర్కొన్న అధికారాలను, విధులను నిర్వహిస్తాడు.

1) కేంద్ర కేబినెట్ నాయకుడు: ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్, కేంద్ర మంత్రిమండలికి నాయకుడు. తన పార్టీ లేదా సంకీర్ణ కూటమికి చెందిన పార్లమెంటు సభ్యులలో ప్రముఖమైన సభ్యులను ఎంపిక చేసి, వారు రాష్ట్రపతి చేత మంత్రులుగా నియమించబడేటట్లు చూస్తాడు. మంత్రులకు శాఖల కేటాయింపు, మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసేందుకు పూర్తి అధికారం ప్రధానమంత్రికి కలదు.

2) కేంద్ర ప్రభుత్వ నాయకుడు: ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నాయకునిగా వ్యవహరిస్తాడు. కేంద్ర కార్యనిర్వాహక శాఖ కేంద్ర మంత్రిమండలి) వ్యవహారాలు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంతో మొదలవుతాయి. కేంద్ర మంత్రిమండలిలోని మంత్రులందరూ ప్రధానమంత్రితో పాటు తమ పదవులను స్వీకరించి, పదవీ బాధ్యతలను నిర్వహించే హోదాను పొంది ఉంటారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

3) పార్లమెంటు నాయకుడు: ప్రధానమంత్రి పార్లమెంటు నాయకునిగా వ్యవహరిస్తాడు. ఆయన కూడా పార్లమెంటు సభ్యుడే. ఉభయ సభలు సాఫీగా జరిగేటట్లు సభాపతులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. పార్లమెంటులో తమ పార్టీ సభ్యులను నియంత్రిస్తాడు. పార్లమెంటు సమావేశాల సమయంలో తమ పార్టీ సభ్యులు క్రమశిక్షణతో మెలిగేటట్లు చూస్తాడు.

4) రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి మధ్య వారధి: ప్రధానమంత్రి రాష్ట్రపతికి, కేంద్ర మంత్రిమండలికి మధ్య వారధి వలె వ్యవహరిస్తాడు. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం ప్రధానమంత్రి బాధ్యత. రాష్ట్రపతి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేయవలసిన బాధ్యత ఆయనపై కలదు.

5) మెజారిటీ పార్టీ నాయకుడు: ప్రధానమంత్రి దిగువ సభలో మెజారిటీ పార్టీ లేదా వర్గానికి నాయకునిగా వ్యవహరిస్తాడు. ఆయన తమ పార్టీ సభ్యుల సమావేశాలలో పాల్గొని వారికి వివిధ అంశాలపై, పార్టీ చేసిన వాగ్దానాల అమలుకు తీసుకొన్న చర్యలను వివరిస్తాడు. ప్రభుత్వ పాలనలో పార్టీలోని పెద్దల సేవలను వినియోగించుకుంటాడు. ఆయన పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాడు.

6) జాతి నాయకుడు: ప్రధానమంత్రి జాతి నాయకుడిగా వ్యవహరిస్తాడు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే | లోక్సభకు నాయకునిగా ఉండటం వలన ఆయన అభిప్రాయాలను మొత్తం జాతి అభిప్రాయాలుగా భావించడం జరుగుతుంది.

7) విదేశాంగ విధాన రూపకల్పన కర్త: ప్రధానమంత్రి భారతదేశ విదేశాంగ విధానాన్ని మరియు ఇతర దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలను నిర్ణయించడంతో కీలకపాత్ర పోషిస్తాడు. అంతర్జాతీయ సంబంధాలు, దేశ గౌరవ ప్రతిష్టలను నిలబెట్టడంలో ముఖ్యమైన బాధ్యత వహిస్తాడు. ముఖ్యమైన అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.

8) నీతి అయోగ్ అధ్యక్షుడు: ప్రధానమంత్రి నీతి ఆయోగ్ అధ్యక్షుడు. నీతి ఆయోగ్ (NITI Aayog – భారత జాతీయ పరివర్తన సంస్థ) అనగా విధాన కమిటీ అని అర్థం. ఇది ప్రభుత్వంలోని మేధావులు, అనుభవజ్ఞులైన వారితో పూర్వపు ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశ ఆర్థిక ప్రణాళికలలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించడం.

ప్రశ్న 4.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
కేంద్ర మంత్రిమండలి పరిపాలనలో కీలకమైన పాత్ర వహిస్తుంది. దీని సలహా ప్రకారం రాష్ట్రపతి తన విధులు నిర్వహిస్తాడు. “రాజ్యమనే నౌకకు మంత్రిమండలి చుక్కాని” వంటిదని రామ్సే మ్యూర్ అభిప్రాయం.

మంత్రులు ప్రధాని సలహాపై రాష్ట్రపతిచే నియమింపబడతారు. మంత్రిమండలి సభ్యులు సమిష్టిగాను, వ్యక్తిగతంగానూ లోక్సభకు బాధ్యత వహిస్తారు. రాజ్యాంగరీత్యా రాష్ట్రపతి విశ్వాసం పొందినంతవరకు పదవిలో ఉంటారు.

అర్హతలు:

  1. మంత్రులకు శాసన సభ్యత్వం అవసరం.
  2. పార్లమెంట్ ఉభయసభలలో ఏదో ఒక సభలో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ సభ్యుడు కాకపోతే ఆరు నెలల లోగా ఏదో ఒక సభకు సభ్యుడిగా ఎన్నిక కావాలి.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయం పొందే ఉద్యోగంలో ఉండరాదు.

నిర్మాణం: కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులు ఉంటారు. వారు:

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు (స్వతంత్ర హోదా)
  3. డిప్యూటీ మంత్రులు (స్వతంత్ర హోదాలేని మంత్రులు).

1) కేబినెట్ మంత్రులు: కేంద్ర ప్రభుత్వంలో హోం, ఆర్థిక, రక్షణ, రైల్వేలు, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పట్టణాభివృద్ధి, పౌర విమానయానం, గనులు, ఉక్కు మొదలైన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు కేబినెట్ హోదాగల మంత్రులు అధిపతులుగా వ్యవహరిస్తారు. వారు తమ మంత్రిత్వశాఖల పరిధిలో నిర్ణయాలు తీసుకోవడంలోను, వాటిని అమలు చేయడంలోనూ స్వతంత్రులు.

2) స్టేట్ మంత్రులు (స్వతంత్ర హోదా): కేంద్ర ప్రభుత్వంలో స్వతంత్ర హోదా కలిగిన స్టేట్ మంత్రులు ప్రధానమంత్రికి నేరుగా జవాబుదారిగా ఉంటూ కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తారు. తమ మంత్రిత్వశాఖలో కేబినెట్ మంత్రుల అజమాయిషీ వారిపై ఉండదు. స్వతంత్ర హోదా కలిగిన స్టేట్ మంత్రులు తమ శాఖలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉంటుంది.

3) డిప్యూటీ మంత్రులు (స్వతంత్ర హోదాలేని మంత్రులు): స్వతంత్ర హోదాలేని మంత్రులను డిప్యూటీ మంత్రులు అంటారు. వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన, శాసన వ్యవహారాలలో కాబినెట్ మంత్రులకు సహాయంగా ఉంటారు. వారికి నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉండదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

అధికారాలు విధులు:
1) విధానాలను రూపొందించుట: దేశ పరిపాలనకు సంబంధించిన విధానాలను మంత్రివర్గం రూపొందిస్తుంది. విదేశాంగ విధానం, ఆంతరంగిక పరిపాలనా విధానం, ఆర్థిక విధానం మొదలగునవి.

2) పరిపాలనా నియంత్రణ: వివిధ శాఖలకు అధిపతులుగా ఉండే మంత్రులు తమ శాఖలపై నియంత్రణ చెలాయిస్తూ పరిపాలన సమర్థవంతంగా పనిచేసేటట్లు చూస్తారు.

3) శాసన విధులు: మంత్రులు పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టి అవి చట్టాలుగా రూపొందించేటందుకు కృషి చేస్తారు.

4) నియోజిత శాసనాలు: మౌలిక శాసనాల పరిధిలో, తమ శాఖలు నిర్వహించడానికి కావలసిన నిబంధనలను మంత్రులు, కార్యదర్శుల సహకారంతో రూపొందిస్తారు.

5) ఆర్థికాధికారాలు: వార్షిక బడ్జెట్ను తయారుచేసి, లోక్సభ ఆమోదం పొందేటట్లు చూస్తారు. దేశ ఆర్థిక వ్యవహారాలను నియంత్రణ చేస్తారు.

6) సంక్షేమ పథకాలు: ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి పథకాలు రూపొందించి, అమలుచేయడం మంత్రివర్గం విధి. ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, ఆర్థిక సమస్యల పరిష్కారం, బలహీనవర్గాల రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సహాయం చేయడం మున్నగునవి మంత్రివర్గం యొక్క బాధ్యత.

7) శాంతిభద్రతల నిర్వహణ: దేశంలో అల్లర్లు జరగకుండా చూడటం, అందుకు కావలసిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడం మంత్రిమండలి విధి.

8) దేశ రక్షణ: రాజ్యాన్ని విదేశీ దురాక్రమణ నుండి కాపాడటం, సైన్యాన్ని సురక్షితం చేసి సరిహద్దుల రక్షణ, ఆయుధాల నిర్మాణం, రక్షక వూహ్యం, స్వాతంత్య్ర పరిరక్షణ, దేశ ప్రయోజనాలు కాపాడటం మంత్రివర్గం విధి. దేశాభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం, ప్రజాశ్రేయస్సు మంత్రివర్గ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.

కేంద్ర కేబినెట్ పాత్ర: కేంద్ర ప్రభుత్వంలో విధాన నిర్ణయం, వాటి అమలులో కేబినెట్ చురుకైన, కీలకమైన పాత్రను పోషిస్తుంది.

  1. జాతీయస్థాయిలో కార్యనిర్వాహక చర్యలను నిర్ణయించే అత్యున్నత రాజకీయ వ్యవస్థగా కేబినెట్ వ్యవహరిస్తుంది.
  2. కేంద్ర మంత్రిమండలి తరపున అన్ని విధులను కేబినెట్ నిర్వహిస్తుంది.
  3. కేంద్ర కార్యనిర్వాహక, పరిపాలనా సిబ్బందిపై దానికి పూర్తి అజమాయిషీ ఉంటుంది.
  4. కేంద్ర కార్యనిర్వాహక అధికారులు తన అధీనంలో పనిచేసేటట్లు చూస్తుంది.

భారతదేశంలోని కేబినెట్, బ్రిటన్లోని కేబినెట్ను పోలి ఉంటుంది. “ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రిమండలి జీవము”. సర్ జాన్ మేరియట్ మంత్రిమండలి గురించి ప్రస్తావిస్తూ “ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రిమండలి కీటకం వంటిది అని, అది దాని చుట్టూ పరిభ్రమణ చేస్తూ ఉంటుంది” అని పేర్కొనెను.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నిక అవుతాడు ?
జవాబు:
భారత రాష్ట్రపతి పదవికి పోటీచేసే వ్యక్తికి పేర్కొన్న అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
  3. లోక్సభకు ఎంపిక కావడానికి కావలసిన అర్హతలుండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్నిచ్చే పదవిలో ఉండరాదు.

ఎన్నిక: ఇవిగాక పార్లమెంట్ సమయానుకూలంగా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

దేశాధ్యక్షునిగా పోటీచేసే వ్యక్తిని బలపరుస్తూ నామినేషన్ పత్రంపై కనీసం 50 మంది నియోజకులు సంతకం చేయాలి. రూ.15,000 ధరావతు చెల్లించాలి. ఎన్నికలలో 1/6వ వంతు కంటే తక్కువ ఓట్లు వస్తే ధరావతు (డిపాజిట్) కోల్పోతాడు.

పార్లమెంట్లోని రెండు సభల సభ్యులు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు కలిసి ఒక ఎన్నికల గణంగా ఏర్పడి ఓటును బదిలీచేసే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ఎన్నుకుంటారు. రహస్య ఓటింగ్ విధానం అనుసరించబడుతుంది. ఎన్నికలలో పాల్గొనే ఓటరు విలువ ఈ దిగువ విధంగా నిర్ణయించబడుతుంది.
AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ 1

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రమాణ స్వీకారం: రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఒక సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం పూర్తి కాకుండానే రాజీనామా చేయవచ్చు లేదా మహాభియోగం తీర్మానం వలన పదవీచ్యుతుడైనా కావచ్చును.

ప్రశ్న 2.
భారత రాష్ట్రపతి మహాభియోగ ప్రక్రియను గూర్చి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయవచ్చు లేదా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే రాజ్యాంగంలోని 56, 61 అధికరణాల ప్రకారం పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. దానికి అనుసరించే పద్ధతి ఈ దిగువ వివరించిన విధంగా ఉంటుంది.

  1. పార్లమెంట్లో ఏదో ఒక సభలో 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు జారీ చేసి మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానం మీద ఆ సభలోని సభ్యులలో 4వ వంతు సభ్యులు సంతకం చేయాలి.
  2. ఆ తీర్మానాన్ని చర్చించి ఆ సభ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి.
  3. అలా ఆమోదించిన తీర్మానాన్ని రెండవ సభ ఒక కమిటీని ఏర్పరచి, ఆరోపణలపై విచారణ జరుపుతుంది.
  4. ఆరోపణలు రుజువైతే ఆ సభలో కూడా మొత్తం సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తే రాష్ట్రపతి పదవీచ్యుతుడౌతాడు.

ఇంతవరకు మహాభియోగ తీర్మానం ద్వారా ఏ రాష్ట్రపతి తొలగింపబడలేదు.

ప్రశ్న 3.
భారత రాష్ట్రపతికి గల ఏవైనా రెండు అత్యవసర అధికారాలను పేర్కొనండి.
జవాబు:
1) జాతీయ అత్యవసర పరిస్థితి (352వ ప్రకరణ): రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర పరిస్థితిని యుద్ధం, విదేశీ దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఏర్పడినపుడు వినియోగిస్తాడు. భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు లేక దేశంలోని ఏదో ఒక ప్రాంతానికి ముప్పు వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఇలాంటి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. అయితే ఇటువంటి అత్యవసర పరిస్థితి ప్రకటించాలంటే ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి వ్రాతపూర్వకమైన సలహామేరకు మాత్రమే ప్రకటించాలని భారత రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978 స్పష్టం చేస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు పనిచేయవు. అన్ని అధికారాలను కేంద్రమే చెలాయిస్తుంది. మన దేశంలో నాలుగు సందర్భాలలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. అవి:

  1. చైనా దురాక్రమణ (1962)
  2. భారత్ – పాకిస్తాన్ యుద్ధం (1965)
  3. బంగ్లాదేశ్ విమోచన సందర్భంలో భారత్ – పాకిస్తాన్ యుద్ధం (1971)
  4. పార్లమెంటును స్తంభింపజేయాలన్న ప్రతిపక్షాల పిలుపు సందర్భంగా (1975)

2) రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (356వ ప్రకరణ): భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరణ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పించింది. ఆ రాష్ట్ర గవర్నర్ నుంచి గాని, మరొక విధంగా ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడిందన్న నివేదిక తరువాత, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దీనినే ‘రాష్ట్రపతి పాలన’ అంటారు.
రాష్ట్రపతి పాలన సమయంలో భారతీయ రాజకీయ వ్యవస్థలో క్రింది మార్పులు సంభవిస్తాయి.

  1. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లేదా ఏవైనా కొన్ని విధులను రాష్ట్రపతి స్వయంగా నిర్వహించవచ్చు. అలాగే గవర్నర్కు గానీ లేదా ఇతర కార్యనిర్వాహణ అధికారికి గానీ అప్పగించవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలను పార్లమెంటు వినియోగిస్తుందని ప్రకటించవచ్చు.
  3. అత్యవసర పరిస్థితి ప్రకటన ఉద్దేశాలకు అనుగుణమైన అంశాలను అమలులో ఉంచడానికి రాష్ట్రపతి తగిన ఆదేశాలను జారీ చేయవచ్చును.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 4.
కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి పాత్ర, స్థానాన్ని వివరించండి.
జవాబు:
రాష్ట్రపతి పాత్ర: రాష్ట్రపతి పాత్ర – స్థానాల గురించి రాజ్యాంగ పరిషత్తు సమావేశాల సమయంలోనూ, తరువాత కాలంలోనూ విశేషమైన చర్చ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి ప్రసిద్ధ నాయకులు రాష్ట్రపతికి కేవలం నామమాత్రమైన అధికారాలు మాత్రమే ఉంటాయని భావించారు. అందుకు విరుద్ధంగా రాజేంద్రప్రసాద్, అలెన్ గ్లెడ్ల్, కె.ఎం. మునీ వంటి ప్రముఖులు కేంద్ర మంత్రిమండలి సలహాతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతికి కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉన్నాయని వాదించేవారి ఉద్దేశంలో రాష్ట్రపతి తన పదవీ స్వీకార సమయంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని సంరక్షించి, పెంపొందిస్తాననీ, భారతదేశ ప్రజలసేవ, శ్రేయస్సులకోసం అంకితమవుతానని ప్రమాణం చేస్తాడని ఆ ప్రమాణం ప్రకారం రాష్ట్రపతికి స్వతంత్ర అధికారాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

లోక్సభలో ఏ పార్టీకీ మెజారిటీ రానప్పుడు లేదా కొన్ని పార్టీలు సంకీర్ణ మంత్రిమండలిని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలలో తనకు సలహా, సహాయాలు అందించడానికి అవసరమైన ప్రధానమంత్రి నియామకంలో రాష్ట్రపతి విచక్షణాధికారాలు వినియోగిస్తాడనేది నిజమే. అలాగే లోక్సభను రద్దుచేయాలనే ప్రధానమంత్రి సలహాను పాటించడానికి లేదా తిరస్కరించడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని న్యాయశాఖతో సహా ఎవరూ ప్రశ్నించడానికి వీలులేదు. ముఖ్యంగా, జాతీయస్థాయిలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో రాష్ట్రపతి పాత్ర, స్థానం ఎంతో ప్రధానమైనవి, కీలకమైనవి కూడా. కేంద్రంలో ఆచరణ సాధ్యమైన, పనిచేయగలిగిన, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని స్థాపించడానికి గల అన్ని అవకాశాలను రాష్ట్రపతి అన్వేషించాలి. మంత్రిమండలి సమర్థవంతంగా పనిచేయలేనప్పుడు, రాజ్యాంగపరమైన యంత్రాంగం అదుపు తప్పినప్పుడు రాష్ట్రపతి ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా రూపొందుతాడు.

1997లో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని, ముఖ్యమంత్రి కళ్యాణ్సింగ్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలని యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి సూచనను రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పైగా అలాంటి సలహాను ఉపసంహరించుకోవలసిందిగా కేంద్ర మంత్రిమండలి కోరడం జరిగింది. అలాగే బీహార్ ఆర్.జె.డి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని వాజ్పేయి ప్రభుత్వం చేసిన సూచనలను కూడా రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ తిరస్కరించారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, కార్గిల్ యుద్ధంపై రాజ్యసభలో చర్చించాలనే ప్రతిపక్షాల డిమాండ్ను అధికారపక్షం విస్మరించడం, 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర క్యాబినెట్ ప్రసంగం బదులుగా ఒక పాత్రికేయునితో సంభాషణ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడటం, 1999 ఆగస్టు – అక్టోబరుల మధ్య వాజ్పేయి ఆపద్ధర్మ ప్రభుత్వ నూతన టెలికాం విధానం, ఇండియన్ ఎయిర్లైన్స్న లాభాల బాటలో నడిపించడానికి రూ.125 కోట్ల ప్యాకేజి మొదలైన అంశాలపై రాష్ట్రపతి అభ్యంతరాలు తెలిపారు. అలాగే 1998లో జరిగిన పన్నెండో లోక్సభ ఎన్నికల్లో ఓటువేసి, ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతిగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటువేయడం పౌరుడి బాధ్యత అని, ఆ బాధ్యతను నిర్వర్తించానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని అత్యవసర దీపం (Emergency lamp) గా రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ తన ‘మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ (My Presidential Years) గ్రంథంలో వర్ణించారు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ తన పదవీ విరమణ సందర్భంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి నిష్పాక్షికత, రాజ్యాంగ ఔచిత్యం, పారదర్శకత అనే మూడు సూత్రాలను అనుసరించవలసి ఉంటుందని ఉద్ఘాటించారు. విభిన్న సందర్భాలలో నిష్పాక్షికంగా వ్యవహరించడానికి నిబంధనల గ్రంథాన్ని అనుసరించే లక్షణం సదా రాష్ట్రపతికి ఉండాలని ఆయన ప్రకటించారు.

ప్రశ్న 5.
భారత ఉపరాష్ట్రపతికి గల ఏవైనా రెండు అధికారాలను వ్రాయండి.
జవాబు:
1) రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడిగా వ్యవహరించడం: ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడు. ఆయన రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. రాజ్యసభ సమావేశాలను ఎంతో గౌరవం, ఔచిత్యం, మర్యాదలతో నిర్వహిస్తాడు. వివిధ బిల్లులు, అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి అనుమతిస్తాడు. సమావేశాలలో అనేక విషయాలపై తన నిర్ణయాలను తెలుపుతాడు. బిల్లులపై చర్చలు పూర్తయిన తరువాత ఓటింగ్ జరిపి, ఫలితాలను ప్రకటిస్తాడు. రాజ్యసభ ఆమోదించిన బిల్లులపై సంతకం చేసి లోక్సభకు పంపుతాడు. దేశంలోని వివిధ కార్యనిర్వాహక, శాసన నిర్మాణ సంస్థలు, అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాడు. రాజ్యసభ సభ్యుల ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కాపాడతాడు. లోక్ సభ స్వీకర్లాగే ఆయనకు అనేక అధికారాలుంటాయి. అయితే, ఒక బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రకటించి దానిపై సంతకం చేయడానికి లేదా పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ఆయనకు అధికారం లేదు. సభలో ఏదైనా ఒక బిల్లును ఆమోదించే విషయంలో సందిగ్ధత ఏర్పడితే, తన అంతిమ నిర్ణాయక ఓటును వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు. అయితే రాజ్యసభ సభ్యుడు కాకపోవడంవల్ల, సాధారణంగా ఆయన సభలోని బిల్లులపై జరిగే ఓటింగ్లో పాల్గొనడు.

2) రాష్ట్రపతిగా వ్యవహరించడం: రాష్ట్రపతి పదవిలో ఉండే వ్యక్తి మరణించినా, రాజీనామా చేసినా లేదా తొలగించబడినా లేదా మరొక కారణం వల్ల ఆ పదవిలో ఖాళీ ఏర్పడితే, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించే కాలపరిమితి ఆరు నెలలకు మించకూడదు. కానీ, నూతన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టేవరకు ఆయన రాష్ట్రపతిగా పదవిలో కొనసాగుతాడు. అలాగే, రాష్ట్రపతి అస్వస్థుడైన సందర్భంలో రాష్ట్రపతి తిరిగి ఆరోగ్యవంతుడై విధులను నిర్వహించేవరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో ఆయనకు రాష్ట్రపతికి గల జీతభత్యాలు, అధికారాలు, సౌకర్యాలన్నీ కల్పించడం జరుగుతుంది. ఈ విషయంలో పార్లమెంటు ఎప్పటికప్పుడు తగిన నిబంధనలను రూపొందిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 6.
ప్రధానమంత్రి ఎలా నియమించబడతాడో తెలియజేయండి.
జవాబు:
ప్రధానమంత్రి నియామకం: మంత్రుల జట్టుతో కూడుకున్న ప్రధానమంత్రి రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వ అధికార విధుల నిర్వహణలో సహాయకుడిగా, సలహాదారుడిగానూ వ్యవహరిస్తాడని భారత రాజ్యాంగం 74(1)వ అధికరణం స్పష్టం చేసింది. 75(1)వ అధికరణం ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు.

లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత, సభలో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. ఒకవేళ లోక్సభలో ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ స్థానాలు లభించని పక్షంలో, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి గల అవకాశాలన్నింటినీ రాష్ట్రపతి అన్వేషిస్తాడు. సంకీర్ణమండలికి నాయకత్వం వహించిన వ్యక్తిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానిస్తాడు. ఈ సందర్భంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తాడు. సంకీర్ణమండలి నాయకుడికి ఆహ్వానం పంపేముందు రాష్ట్రపతి రాజకీయ స్థిరత్వం, మెజారిటీ సభ్యుల మద్దతు పొందగలిగిన సామర్థ్యం, రాజ్యాంగపరమైన, చట్టపరమైన అంతర్ధాలు, జాతీయ ప్రయోజనాలు, ప్రతిపక్షాల అభిప్రాయాలు మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాడు. సంకీర్ణమండలికి చెందిన నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించే సందర్భంలో, లోక్సభలో నిర్ణీత గడువులోగా మెజారిటీ సభ్యుల మద్దతును నిరూపించు కోవలసిందిగా రాష్ట్రపతి షరతును కూడా విధిస్తాడు. రాష్ట్రపతులు ఆర్. వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్. నారాయణన్లు పైన పేర్కొన్న షరతును విధించి, తమ హయాంలో ప్రధానమంత్రులను నియమించారు. ప్రధానమంత్రిగా ఎవరిని ఆహ్వానించాలి ? ఎవరిని ఎంపిక చేయాలి ? ఎవరిని నియమించాలి ? అనే వాటిపై రాష్ట్రపతికిగల అధికారాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించే వీలు లేదు.

ప్రశ్న 7.
కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి పాత్రను వివరించండి.
జవాబు:
ప్రధానమంత్రి పాత్ర: కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలలో ప్రధానమంత్రి ప్రబలమైన పాత్రను పోషిస్తాడు. కేంద్ర ప్రభుత్వ పాలనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రధానమంత్రి చెరగని ముద్రవేస్తాడు. ఆయనను మంత్రివర్గ సభ్యులలో ప్రథముడిగా వర్ణించడం జరిగింది. కేంద్ర మంత్రిమండలి, కేంద్ర కాబినెట్, అధికారపార్టీ, లోక్సభ, కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజల నాయకుడిగానూ, కేంద్ర మంత్రిమండలి – రాష్ట్రపతికి, దేశ ప్రజల మధ్య సంధానకర్తగానూ ప్రధానమంత్రి విలక్షణమైన పాత్రను పోషిస్తాడు. ఆయన అత్యంత రాజకీయ శక్తిని, ప్రాపకాన్ని కలిగి ఉంటాడు. అయితే ప్రధానమంత్రిగా వ్యవహరించే వ్యక్తికి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రతిష్ట, పలుకుబడి, ఔన్నత్యం, వ్యక్తిత్వ స్థాయిలను బట్టి ఆయన పాత్ర ఆధారపడి ఉంటుంది.

జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి ప్రముఖ జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన వ్యక్తిగానూ, మూలస్తంభంగానూ, ఇరుసు చీలగానూ వర్ణించారు. ఈ కారణంగానే “ప్రధానమంత్రిగా వ్యవహరించేవారికి హూందాతనం, అధికారం, నియంత్రించగల దృఢత్వం, ఒప్పించగల నేర్పరితనం, సమయస్ఫూర్తి, వాస్తవికత, నిశ్చయత్వం, నిష్పాక్షికత, ప్రశాంతత, ప్రజలకు అందుబాటు, వ్యక్తిగతంగా దయ, దూరదృష్టివంటి లక్షణాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని” విలియం హారొ ్కర్ట్ పేర్కొన్నాడు.

ప్రశ్న 8.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం మరియు అధికారాలను వర్ణించండి.
జవాబు:
మంత్రిమండలి నిర్మాణం: కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులు ఉంటారు. వారు:

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు
  3. డిప్యూటీ మంత్రులు. మంత్రులు సమిష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత అనే సూత్రాలపై పనిచేస్తారు. వీరిని ప్రధాని తొలగించవచ్చు లేక విశ్వాసరాహిత్య తీర్మానం వలన మొత్తం ప్రభుత్వమే మారవచ్చు.

అధికారాలు

విధులు:
1) విధానాలను రూపొందించుట: దేశ పరిపాలనకు సంబంధించిన విధానాలను మంత్రివర్గం రూపొందిస్తుంది. విదేశాంగ విధానం, ఆంతరంగిక పరిపాలనా విధానం, ఆర్థిక విధానం మొదలగునవి.

2) పరిపాలనా నియంత్రణ: వివిధ శాఖలకు అధిపతులుగా ఉండే మంత్రులు తమ శాఖలపై నియంత్రణ చెలాయిస్తూ పరిపాలన సమర్థవంతంగా పనిచేసేటట్లు చూస్తారు.

3) శాసన విధులు: మంత్రులు పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టి అవి చట్టాలుగా రూపొందించేటందుకు కృషి చేస్తారు.

4) నియోజిత శాసనాలు: మౌలిక శాసనాల పరిధిలో, తమ శాఖలు నిర్వహించడానికి కావలసిన నిబంధనలను మంత్రులు, కార్యదర్శుల సహకారంతో రూపొందిస్తారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

5) ఆర్థికాధికారాలు: వార్షిక బడ్జెట్ను తయారుచేసి, లోక్సభ ఆమోదం పొందేటట్లు చూస్తారు. దేశ ఆర్థిక వ్యవహారాలను నియంత్రణ చేస్తారు.

6) సంక్షేమ పథకాలు: ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి పథకాలు రూపొందించి, అమలు చేయడం మంత్రివర్గం విధి. ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, ఆర్థిక సమస్యల పరిష్కారం, బలహీనవర్గాల రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సహాయం చేయడం మున్నగునవి మంత్రివర్గం యొక్క బాధ్యత.

7) శాంతిభద్రతల నిర్వహణ: దేశంలో అల్లర్లు జరగకుండా చూడటం, అందుకు కావలసిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడం మంత్రిమండలి విధి.

8) దేశ రక్షణ: రాజ్యాన్ని విదేశీ దురాక్రమణ నుండి కాపాడటం, సైన్యాన్ని సురక్షితం చేసి సరిహద్దుల రక్షణ, ఆయుధాల నిర్మాణం, రక్షక వూహ్యం, స్వాతంత్ర్య పరిరక్షణ, దేశ ప్రయోజనాలు కాపాడటం మంత్రివర్గం విధి. దేశాభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం, ప్రజాశ్రేయస్సు మంత్రివర్గ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కేంద్ర కార్యనిర్వాహక శాఖ నిర్మాణం.
జవాబు:
భారత రాజ్యాంగం అయిదో భాగంలో 52 నుండి 78 వరకు ఉన్న ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖను గురించి వివరించాయి. కేంద్ర కార్య నిర్వాహక శాఖ

  1. రాష్ట్రపతి
  2. ఉపరాష్ట్రపతి
  3. ప్రధానమంత్రి
  4. మంత్రిమండలితో కూడుకొని ఉంటుంది.

ప్రశ్న 2.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసిన అర్హతలేవి ?
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సం||ల వయస్సు నిండి ఉండాలి.
  3. లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు తగిన అర్హతలుండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో ఏ ప్రభుత్వంలోనూ లాభసాటి పదవిలో కొనసాగుతూ ఉండరాదు.

ప్రశ్న 3.
భారత రాష్ట్రపతి ఎన్నిక.
జవాబు:
భారత రాష్ట్రపతి పరోక్ష పద్ధతిలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ సూత్ర ప్రాతిపదికగా ఎన్నికవుతాడు. భారత రాష్ట్రపతిని ‘ఎన్నికల గణం’ రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నుకొంటుంది. ఈ ఎన్నికల గణంలో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.

ప్రశ్న 4.
రాష్ట్రపతిచే ముఖ్యమైన నియామకాలు.
జవాబు:
భారత రాష్ట్రపతి నియమించే ముఖ్యమైన నియామకాలలో కొన్ని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, భారత అటార్నీ జనరల్, భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులు, రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్, పరిపాలకులు, ప్రధాన ఎన్నికల కమీషనర్లు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 5.
రాష్ట్రపతి న్యాయాధికారాలు.
జవాబు:
కేంద్ర ప్రభుత్వ సలహామేరకు రాష్ట్రపతి న్యాయాధికారాలను చెలాయిస్తాడు. అవి:

  1. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను నియమించటం.
  2. ఏదైనా చట్టపరమైన విషయాలపై సుప్రీంకోర్టు సలహాను కోరటం.
  3. న్యాయస్థానాలు విధించిన శిక్షలను మార్చటం, తగ్గించటం, నిలుపుదల చేయటం, క్షమాభిక్ష ప్రసాదించటం.

ప్రశ్న 6.
352వ ప్రకరణ. [Mar. ’16]
జవాబు:
352వ ప్రకరణ ప్రకారం భారత రాష్ట్రపతి యుద్ధం, విదేశీ దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు తలెత్తినపుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ఈ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు పనిచేయవు. అన్ని అధికారాలను కేంద్ర ప్రభుత్వమే చెలాయిస్తుంది.

ప్రశ్న 7.
356వ ప్రకరణ.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరణ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతికి కల్పించింది. ఏదైనా రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడింది అని నివేదిస్తే, రాష్ట్రపతి. ఆ రాష్ట్రంలో ‘రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి’ ప్రకటిస్తాడు. దీనినే ‘రాష్ట్రపతి పాలన’ అని కూడా అంటారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడుతుంది.

ప్రశ్న 8.
ఆర్థిక అత్యవసర పరిస్థితి.
జవాబు:
భారతదేశం మొత్తానికి లేదా ఏదో ఒక ప్రాంతం ఆర్థిక స్థిరత్వానికి, లేదా పరపతికి ముప్పు వాటిల్లినపుడు 360వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఈ పరిస్థితిని ప్రకటించినపుడు రాష్ట్రపతి ప్రభుత్వ సిబ్బంది మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను తగ్గించవచ్చు.

ప్రశ్న 9.
జాతీయ అత్యవసర పరిస్థితి.
జవాబు:
జాతీయ అత్యవసర పరిస్థితి (352 ప్రకరణ): రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర పరిస్థితిని యుద్ధం, విదేశీ దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఏర్పడినపుడు వినియోగిస్తాడు. భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు లేక దేశంలో ఏదో ఒక ప్రాంతానికి ముప్పు వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఇలాంటి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. అయితే ఇటువంటి అత్యవసర పరిస్థితి ప్రకటించాలంటే ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి వ్రాతపూర్వకమైన సలహామేరకు మాత్రమే ప్రకటించాలని భారత రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978 స్పష్టం చేస్తుంది.

ప్రశ్న 10.
ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 35 సం||ల వయస్సు నిండి ఉండాలి.
  3. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు తగిన అర్హతలను కలిగి ఉండాలి.
  4. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలలో ఆదాయాన్నిచ్చే పదవిలో ఉండరాదు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 11.
రాజ్యసభ అధ్యక్షుడు. [Mar. ’17]
జవాబు:
ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ, సమావేశాలు హుందాగా నిర్వహిస్తాడు. సమావేశాలలో తన నిర్ణయాలను వెల్లడిస్తాడు. వివిధ బిల్లులపై ఓటింగ్ జరిపి, ఫలితాలను వెల్లడిస్తాడు.

ప్రశ్న 12.
ప్రధానమంత్రి నియామకం.
జవాబు:
ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు అని మన రాజ్యాంగం సూచించింది. లోక్సభ సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత, ఆ సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. ప్రధానమంత్రి ఎంపిక ఆహ్వానం, నియామక విషయాలలో రాష్ట్రపతి అధికారాలను న్యాయస్థానాలలో ప్రశ్నించేందుకు వీలు లేదు.

ప్రశ్న 13.
కేంద్ర మంత్రిమండలి రకాలు.
జవాబు:
కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులుంటారు. వారు:

  1. కేబినెట్ మంత్రులు.
  2. స్టేట్ మంత్రులు (స్వతంత్ర హోదా).
  3. డిప్యూటీ మంత్రులు (స్వతంత్ర హోదాలేని మంత్రులు).

ప్రశ్న 14.
కేంద్ర కేబినెట్ ఏవేని రెండు విధులు. [Mar. ’17]
జవాబు:

  1. కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందిస్తుంది. జాతి ఆంతరంగిక, విదేశీ విధానాలను సుదీర్ఘమైన, తీవ్రమైన సమాలోచనల తరువాత ఖరారు చేస్తుంది.
  2. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో రాష్ట్రపతికి సలహాలు అందిస్తుంది. రాష్ట్రపతికి తన విధుల నిర్వహణలో కేబినెట్ మార్గదర్శకంగా ఉంటుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 3 కేంద్ర కార్యనిర్వాహక శాఖ

ప్రశ్న 15.
సమిష్టి బాధ్యత.
జవాబు:
పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలలో ప్రధానమైనదే సమిష్టి బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగం 75(3)వ అధికరణం మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుందని ప్రకటించింది. కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక జట్టుగా వ్యవహరిస్తుంది. కార్యనిర్వాహక శాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు, పార్లమెంటుకు సమిష్టిగా బాధ్యత వహించడాన్నే సమిష్టి బాధ్యత అంటారు.