AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్వదేశీ, విదేశీ వర్తకం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్వదేశీ, విదేశీ వర్తకం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్తకము అనగానేమి ? వివిధ రకాల వర్తకాలను వివరింపుము.
జవాబు:
వస్తువులు లేదా సేవల అమ్మకము మరియు కొనుగోలు చేయడాన్ని వర్తకము అంటారు. ఈ అమ్మకము మరియు కొనుగోలు ఇద్దరు వ్యక్తుల మధ్యగాని, రెండు సంస్థల మధ్యగాని లేదా రెండు దేశాల మధ్య జరుగవచ్చును. వర్తకము రెండు రకాలు. 1) స్వదేశీ వర్తకము, 2) విదేశీ వర్తకము.

1) స్వదేశీ వర్తకము : ఒకదేశ సరిహద్దు లోపల కొనుగోలు మరియు అమ్మకాలు జరపడాన్ని స్వదేశీ వర్తకము అంటారు. స్వదేశీ వర్తకాన్ని దేశీయ వర్తకము అని కూడా అంటారు.
స్వదేశీ వర్తకము యొక్క లక్షణాలు :

  1. కొనుగోలు, అమ్మకాలు ఒక దేశ సరిహద్దులలోనే జరుగుతాయి.
  2. వస్తువుల రవాణా సాధారణముగా రోడ్డు లేదా రైల్వే వాహనాల ద్వారా జరుగుతుంది.
  3. స్వదేశీ వర్తకములో చెల్లింపులు స్వదేశీ కరెన్సీ ద్వారానే జరుగుతాయి.
  4. స్వదేశీ వర్తకములో వ్యాపార వ్యవహారాలు ఉత్పత్తిదారులు, మధ్యవర్తులు, వినియోగదారుల మధ్య జరుగుతాయి.
  5. స్వదేశీ వర్తకములో చాలారకాలైన వస్తువులు అందుబాటులో ఉంటాయి.

స్వదేశీ వర్తకాన్ని మరల రెండు రకాలుగా విభజించవచ్చును. అది ఎ) టోకు వర్తకము బి) చిల్లర వర్తకము. ఎ) టోకు వర్తకము : ఉత్పత్తిదారుల నుండి పెద్ద పెద్ద పరిమాణములో వస్తువులను కొనుగోలు చేసి, చిన్నచిన్న పరమాణములో చిల్లర వర్తకులకుగాని, తుది వినియోగదారులకు గాని అమ్మకము చేయడాన్ని టోకు వర్తకమని, ఆ వ్యాపారాన్ని నిర్వహించే వర్తకుడిని టోకు వర్తకుడు అని అంటారు. ఇతడు ఉత్పత్తిదారులకు, చిల్లర వర్తకులకు మధ్య వారధిగా ఉంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

బి) చిల్లర వర్తకము : టోకు వర్తకుల నుంచి పెద్ద మొత్తాలలో సరుకును కొనుగోలు చేసి, చిన్న మొత్తాలలో తుది వినియోగదారులకు చేరవేసే వర్తకము చిల్లర వర్తకము. చిల్లర వర్తకము చేసేవారిని చిల్లర వర్తకులు అని అంటారు. వీరు అటు టోకు వర్తకులకు, ఇటు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారు.

2) విదేశీ వర్తకము : రెండు వేరువేరు దేశాల మధ్య జరిగే కొనుగోలు, అమ్మకాలను అంతర్జాతీయ వర్తకము లేదా విదేశీ వర్తకము అంటారు. విదేశీ వర్తకాన్ని మూడురకాలుగా విభజించవచ్చును. అవి ఎ) దిగుమతి వర్తకము, బి) ఎగుమతి వర్తకము, సి) మారు వర్తకము.

ఎ) దిగుమతి వర్తకము : ఏదైనా ఒక దేశము తన దేశ అవసరాలకు వస్తువులను లేదా సేవలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అలాంటి వర్తకాన్ని దిగుమతి వర్తకము అంటారు. ఉదా : భారతదేశము చైనా నుంచి అత్యాధునిక ఎలక్ట్రిక్ పరికరాలను కొనుగోలు చేయడము.

బి) ఎగుమతి వర్తకము : ఏదైనా ఒక దేశము తన దేశ అవసరాలకు సరిపడగా, మిగిలిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని ఎగుమతి వర్తకము అంటారు. ఉదా : భారతదేశము వజ్రాలను వేరే దేశాలకు ఎగుమతి చేయడము.

సి) ఎంట్రిపో వర్తకము (మారు వర్తకము) : ఒక దేశము తన దేశ అవసరాల కోసం కాకుండా వేరొక దేశ అవసరాలకు విదేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకొని, వేరొక దేశానికి ఎగుమతి చేసినట్లయితే ఆ వర్తకాన్ని

3. విత్తనాలను ఎంట్రిపో వర్తకము లేక మారు వర్తకము అంటారు. ఉదా : భారతదేశము అమెరికా నుంచి నూనె దిగుమతి చేసుకొని, మలేషియాకు ఎగుమతి చేయడము.

ప్రశ్న 2.
విదేశీ వర్తకము అనగానేమి ? వివిధ రకాల విదేశీ వర్తకాలను తెలుపుము.
జవాబు:
రెండు దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అంటారు. రెండు దేశాలలోని వ్యాపారస్తుల మధ్య సరుకు మరియు సేవల వినిమయము జరిగితే అది అంతర్జాతీయ వర్తకము అవుతుంది. విదేశీ వర్తకములో రెండు వేరు వేరు దేశాల మధ్య కేవలము వస్తువులే కాకుండా ఆయాదేశాల కరెన్సీ కూడా మారకం జరుగుతుంది. విదేశీ వర్తకము ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒక దేశములో తయారైన వస్తువులు మరొక దేశములోని వినియోగదారులు ఉపయోగించుకుంటారు.

విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా విభజించవచ్చును. అవి 1. దిగుమతి వర్తకము, 2. ఎగుమతి వర్తకము, 3. మారు వర్తకము (ఎంట్రిపో వర్తకము).
1. దిగుమతి వర్తకము : Import అనే పదము యొక్క భావన ఏమిటంటే వస్తు, సేవలను దేశములోని రేవులకు చేరవేయడము. ఇతర దేశము నుంచి సరుకును కొనుగోలు చేసినపుడు, ఆ దేశము నుంచి కొనుగోలుదారు దేశానికి దిగుమతి చేసుకున్నట్లు భావిస్తారు. ఇలాంటి వర్తకాన్ని దిగుమతి వర్తకము అంటారు. ఉదా : చైనాలో అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు చౌకగా లభ్యమవుతాయి. వాటిని భారతదేశము దిగుమతి చేసుకుంటున్నది.

2. ఎగుమతి వర్తకము : Export అనే పదము యొక్క భావము ఏమిటంటే వస్తు, సేవలను ఇతర దేశాలకు ఓడరేవుల నుంచి బయటకు షిప్పింగ్ చేయడము. ఇతర దేశాలలోని వర్తకులకు సరుకును అమ్మినపుడు, సరుకును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగా భావిస్తారు. ఉదా : మన దేశము ఇతర దేశాలకు వజ్రాలను ఎగుమతి చేస్తుంది.

3. మారు వర్తకము (ఎంట్రిపో వర్తకము) : ఒక దేశము తన అవసరాల కోసం కాకుండా వేరొక దేశానికి అవసరాల కోసం, వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, వాటిని మరల ఆ దేశానికి ఎగుమతి చేసే వర్తకాన్ని మారు వర్తకము అంటారు. ఉదా: భారతదేశము అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకొని వాటిని మలేషియాకు ఎగుమతి చేయడము.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

ప్రశ్న 3.
విదేశీ వర్తకము అనగానేమి ? వాటి యొక్క ప్రాముఖ్యతను వివరింపుము.
జవాబు:
రెండు దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అంటారు. రెండు దేశాలలోని వ్యాపారస్తుల మధ్య సరుకు మరియు సేవల వినిమయం జరిగితే అది అంతర్జాతీయ వర్తకము అవుతుంది. విదేశీ వర్తకములో రెండు వేరు వేరు దేశాల మధ్య కేవలం వస్తువులే కాకుండా ఆయా దేశాల కరెన్సీ కూడా మారకము జరుగుతుంది. విదేశీ వర్తకము ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒక దేశములో తయారైన వస్తువులు మరొక దేశములోని వినియోగదారులు ఉపయోగించుకుంటారు.

విదేశీ వర్తకము ప్రాముఖ్యత : ప్రతి దేశానికి విదేశీ వర్తకము అవసరము అవుతుంది. కారణమేమంటే ఏ దేశమైనా ప్రజల వినియోగానికి అవసరమైన అన్ని వస్తువులను ఉత్పత్తి చేయలేదు. ఈ దిగువ తెలుపబడిన అంశాలను పరిశీలిస్తే విదేశీ వర్తక ప్రాముఖ్యత తెలుస్తుంది.

1. ప్రపంచములోని వివిధ దేశాలలో వివిధ సహజ వనరులు కలిగి ఉంటాయి. మరికొన్ని దేశాలలో సహజ వనరులు ఉండకపోవచ్చును. అటువంటి పరిస్థితులలో ఆ దేశము సహజ వనరులకై ఇతర దేశాలపై ఆధారపడుతుంది.”

2. కొన్ని దేశాలు కొన్ని రకములైన వస్తువులను ముడిపదార్థాల లభ్యత, శ్రామికుల లభ్యత, సాంకేతిక పరిజ్ఞానము మొదలైన కారణాల వలన తక్కువ ఉత్పత్తి వ్యయముతో తయారుచేస్తాయి. అటువంటి పరిస్థితులలో ఎక్కువ వ్యయము వస్తువులను ఉత్పత్తి చేయకుండా, ఆయా దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి విదేశీ వర్తకము తోడ్పడుతుంది.

3. ప్రతిదేశము ఆ దేశానికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసుకోలేదు. కొన్ని దేశాలలో కొన్ని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వలన ఆయా దేశాలలో ఆ వస్తువులు తయారుచేయబడతాయి. ఉదా : క్యూబా దేశములో చక్కెర, ఈజిప్టు దేశములో పత్తి ఉత్పత్తి అవుతుంది.

4. ఆర్థిక అసమానతలు తొలగించి, వివిధ దేశాల ఆర్థికాభివృద్ధికి విదేశీ వర్తకము తోడ్పడుతుంది.

5. అంతర్జాతీయ వర్తకము ఇరుదేశాల మధ్య సంబంధాలను, సంస్కృతిని, శాంతిని పెంపొందిస్తుంది.

6. అంతర్జాతీయ వర్తకము వలన వివిధ దేశాలలో వస్తుసేవల ధరలు తగ్గుతాయి.

7. ఈ ప్రపంచీకరణ యుగములో ఏ దేశమైనా స్వయముగా అభివృద్ధి చెందదు. కాబట్టి ప్రతిదేశము మరొక దేశముపై ఆధారపడవలసి వస్తుంది.

ప్రశ్న 4.
స్వదేశీ మరియు విదేశీ వర్తకాల మధ్య భేదాలను తెలుపుము.
జవాబు:
స్వదేశీ వర్తకానికి, విదేశీ వర్తకానికి మధ్య క్రింది తేడాలున్నవి.

విదేశీ వర్తకము

  1. వర్తకము : వర్తకము ఒక దేశ సరిహద్దులలోపు జరుగుతుంది.
  2. కరెన్సీ మార్పిడి : స్వదేశీ వర్తకములో కరెన్సీ మార్పిడి ఉండదు.
  3. ఆంక్షలు : స్వదేశీ వర్తకము ఎలాంటి ఆంక్షలకు లోబడి ఉండదు.
  4. రవాణా వ్యయాలు : స్వదేశీ వర్తకములో రవాణా వ్యయాలు, నష్టభయాలు ఎక్కువ.
  5. స్వభావము : దీనిలో ఒకదేశములో వస్తుసేవల ‘వినిమయము జరుగుతుంది.
  6. సరుకు తరలింపు : సరుకు తరలింపు ఎక్కువగా రవాణా సౌకర్యాలైన రైలు, రోడ్ల అభివృద్ధిపై ఆధారపడుతుంది.
  7. ప్రత్యేకీకరణ : దేశములోని ప్రత్యేకీకరణ లాభాలను అందజేయడంలో సహకరిస్తుంది.
  8. వర్తక పరిమాణము : వర్తక పరిమాణము జనాభా పరిమాణము, ఉత్పత్తి పరిమాణము, బ్యాంకుల అభివృద్ధిపై ఆధారపడుతుంది.
  9. అనుకూలత : ఇది వస్తువులను ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగిత కేంద్రాలకు తరలిస్తుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

స్వదేశీ వర్తకము

  1. వరక్తము ఒక దేశానికి, మరొక దేశానికి మధ్య జరుగుతుంది.
  2. విదేశీ వకర్తములో కరెన్సీ మార్పిడి ఉంటుంది.
  3. విదేశీ వర్తకము అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది.
  4. విదేశీ వర్తకములో రవాణా వ్యయాలు, నష్టభయము తక్కువ.
  5. దీనిలో వస్తువుల ఎగుమతి, దిగుమతి జరుగుతుంది.
  6. సరుకును ఎక్కువగా సముద్రము (నౌకల ద్వారా) తరలిస్తారు.
  7. ప్రపంచ దేశాల ప్రత్యేకీకరణ లాభాలను అందజేయడం సహకరిస్తుంది.
  8. వస్తువులు ఒక దేశములో ప్రవేశించుటకు ఎన్నో ఆంక్షలు ఉంటాయి. డ్యూటీలు, పన్నులను చెల్లించవలెను.
  9. ఏ దేశమైతే వస్తువుల ఉత్పత్తికి అనుకూలముగా ఉంటుందో, వాటిలో ప్రత్యేకీకరణ సాధించడానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 5.
విదేశీ వర్తకము యొక్క పరిమితులను తెలుపుము.
జవాబు:
పరిమితులు :

  1. అంతర్జాతీయ వర్తకము ఆర్థికముగా ఇతర దేశాలపై ఆధారపడుటకు దారితీస్తుంది. యుద్ధ సమయములో ఇది సంక్షోభాన్ని సృష్టిస్తుంది.
  2. అంతర్జాతీయ వర్తకము దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని సెక్టార్లను నిర్లక్ష్యము చేయడానికి దారితీస్తుంది.
  3. దిగుమతులపై ఆంక్షలు లేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాల పారిశ్రామికీకరణపై ప్రభావాన్ని చూపుతుంది.
  4. ఇది వివిధ దేశాల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తుంది.
  5. తులనాత్మక వ్యయ సిద్ధాంతాన్ని అనుసరించి కొద్ది పరిశ్రమలలో ప్రత్యేకీకరణ అనేక సమస్యలను సృష్టిస్తుంది.

ప్రశ్న 6.
విదేశీ వర్తకములో లోపాలను తెలుపుము.
జవాబు:
విదేశీ వర్తకములో లోపాలు / నష్టాలు :

  1. ద్రవ్య సమస్య : ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన ద్రవ్యం ఉండటం వలన వ్యాపార వ్యవహారములు జరిగినప్పుడు ద్రవ్య సమస్యలు ఏర్పడతాయి.
  2. న్యాయసంబంధిత సమస్యలు : ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన చట్టాలుంటాయి. అంతర్జాతీయ వర్తకములో దేశాల మధ్య న్యాయసంబంధిత చిక్కులు ఏర్పడతాయి.
  3. పరపతి సమస్య : ఎగుమతిదారులు, దిగుమతిదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండవు కాబట్టి ఎగుమతిదారులు, దిగుమతిదారుల ఆర్థిక స్థోమతను గురించి తెలుసుకోవలసి ఉంటుంది.
  4. నష్టభయాలు : వివిధ దేశాల మధ్యదూరము ఎక్కువగా ఉండటము వలన, రవాణాలో వస్తువులకు నష్టము కలిగే అవకాశాలు ఎక్కువ.
  5. కాలయాపన : ఒక దేశము నుంచి సరుకును ఎగుమతి చేయడానికి మరియు ఆ దేశములో సరుకును స్వీకరించి, ధరను చెల్లించడానికి ఎక్కువ సమయం పడుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

ప్రశ్న 7.
ప్రత్యేక ఆర్థిక మండలి యొక్క లాభాలను తెలుపుము.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్లు) ద్వారా క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. ఉద్యోగ అవకాశాలు : ఉద్యోగ అవకాశాలు కల్పించడములో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు సార్థకమైన పనిముట్టుగా పరిగణిస్తారు.
  2. ఆర్థిక అభివృద్ధి : సెజ్లను ఆర్థిక అభివృద్ధి సాధనాలుగా గుర్తించడం జరిగినది. సెజ్లు సక్రమముగా నెలకొల్పితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారతాయి.
  3. శ్రమ ఆధారిత పరిశ్రమల వృద్ధి: సెజ్లను నెలకొల్పడం వలన శ్రమ ఆధారిత పరిశ్రమలు, సేవారంగము ఎక్కువగా వృద్ధి చెందుతాయి.
  4. సమతల ప్రాంతీయ అభివృద్ధి: సమాన ప్రాంతీయ అభివృద్ధికి సెజ్లు ఇతోధికముగా తోడ్పడతాయి.
  5. సామర్థ్య నిర్మాణము దృఢమైన, సామర్థ్య నిర్మాణానికి సెజ్ల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
  6. ఎగుమతులు (Performance) : ఎగుమతులలో అనవసర టారిఫ్, వర్తక అవరోధాలు, కార్పొరేటు పన్ను విధానము మరియు బ్యూరోక్రసీని తొలగించి ఎగుమతుల performance లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న 8.
ప్రత్యేక ఆర్థిక మండలి ధ్యేయాలను తెలుపుము.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలి ఒక భౌగోళిక ప్రాంతము. దీనిలోని ఆర్థిక చట్టాలు దేశములోని ఆర్థిక చట్టాల కంటే సరళముగా ఉంటాయి. సెజ్ యొక్క ప్రధాన ధ్యేయము విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే. ఆర్థికాభివృద్ధికి సెజ్లు సాధనాలుగా ఉపయోగపడుతున్నవి. భారతప్రభుత్వం 2000 సంవత్సరములో ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించినారు. పార్లమెంటులో సెజ్ల చట్టాన్ని 2005లో ఆమోదించినారు. ఎగుమతి ప్రక్రియ అనుభవము నుంచి సెజ్ విధానము ఆవిర్భవించి పరిగణించబడే సుంకాలు చెల్లించనవసరము లేని ప్రత్యేక ప్రాంగణములే ఈ ప్రత్యేక ఆర్థికమండలి.

ధ్యేయాలు / లక్ష్యాలు :

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడము.
  2. వస్తుసేవల యొక్క ఎగుమతులను ప్రోత్సహించడము.
  3. స్వదేశీ మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడము.
  4. ఉద్యోగ అవకాశాలను కల్పించడము.
  5. మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడము.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
టోకు వర్తకుని నిర్వచించుము.
జవాబు:
ఉత్పత్తిదారుల నుండి పెద్దపెద్ద పరిమాణములో వస్తువులను కొనుగోలు చేసి, వాటిని చిన్నచిన్న పరిమాణాలలో చిల్లర వర్తకులకు గాని, తుది వినియోగదారులకు కాని అమ్మకము చేయడాన్ని టోకు వర్తకము అంటారు. టోకు వర్తకము చేసే వ్యాపారులను టోకు వర్తకులు అంటారు. వీరు ఉత్పత్తిదారులు మరియు చిల్లర వర్తకులకు మధ్య వారధిగా ఉంటారు.

ప్రశ్న 2.
చిల్లర వర్తకుడు అనగా ఎవరు ?
జవాబు:
టోకు వర్తకుల నుంచి సరుకు కొనుగోలు చేసి, చిన్న చిన్న మొత్తాలలో తుది వినియోగదారులకు చేరవేసే ప్రక్రియను చిల్లర వర్తకము అంటారు. చిల్లర వర్తకము చేసే వారిని చిల్లర వర్తకులు అంటారు. చిల్లర వర్తకులు వస్తువుల పంపిణీ గొలుసులో చివరి లింకు. చిల్లర వర్తకులు అటు టోకు వర్తకులకు, ఇటు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారు. అతడి కార్యకలాపాలు స్థానికముగానే ఉంటాయి.

ప్రశ్న 3.
స్వదేశీ వర్తకము అనగానేమి ?
జవాబు:
ఒక దేశ సరిహద్దు లోపల కొనుగోలు మరియు అమ్మకాలు జరపడాన్ని స్వదేశీ వర్తకము అంటారు. అనగా కొనుగోలుదారుడు మరియు అమ్మకపుదారులు ఒకే దేశానికి చెంది ఉండి, వర్తకము కొనసాగించినపుడు దానిని స్వదేశీ వర్తకము అంటారు. స్వదేశీ వర్తకాన్ని ‘దేశీయ వర్తకము’ అని కూడా అంటారు. స్వదేశీ వర్తకములో కరెన్సీ మార్పు
ఉండదు.

ప్రశ్న 4.
ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) అనగానేమి ?
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలి ఒక భౌగోళిక ప్రాంతము. దీనిలోని ఆర్థిక చట్టాలు దేశములోని ఆర్థిక చట్టాల కంటే సరళముగా ఉంటాయి. సెజ్ యొక్క ప్రధానమైన ధ్యేయము విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే. ఆర్థికాభివృద్ధికి సెజ్లు సాధనాలుగా ఉపయోగపడుతున్నవి. భారత ప్రభుత్వము 2000 సంవత్సరములో ఎగుమతి, దిగుమతి విధానములో ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించినారు. పార్లమెంటులో సెజ్ల చట్టాన్ని 2005 సంవత్సరములో ఆమోదించినారు. ఎగుమతి ప్రక్రియ అనుభవము నుంచి సెజ్ల విధానము ఆవిర్భవించి పరిగణించే సుంకాలు చెల్లించనవసరములేని ప్రత్యేక ప్రాంగణాలే సెజ్లు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
సెజ్ ల పని తీరుపై గల విమర్శలను వివరించండి.
జవాబు:

  1. ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు కోసము వ్యవసాయ భూములను స్వాధీనము చేసుకుంటున్నారు అనేది ప్రధానమైన విమర్శ. దీనివలన చాలామంది వారి కులవృత్తులైన వ్యవసాయము, చేపలు పట్టుట మొదలైన వాటికి దూరమై జీవనోపాధిని కోల్పోతున్నారు. సెజ్లు రియల్ ఎస్టేటులో స్పెక్యులేషన్ను ప్రోత్సహిస్తున్నది. చిన్న మరియు మార్జినల్ రైతులు, వీవర్లు, livestock కు సంబంధించిన కులాలవారు సెజ్ల వలన వారి వృత్తులకు దూరమవుతున్నారు.
  2. సెజ్ వలన వాతావరణ కాలుష్యము ఏర్పడి ప్రజల ఆరోగ్యము దెబ్బతింటున్నది.
  3. సెజ్లపైన మరొక విమర్శ ఏమిటంటే తీసుకున్న భూములకు సరైన నష్టపరిహారము చెల్లించడం లేదు. ఇది చాలా తక్కువగా ఉంటోంది. తొలగించబడిన ప్రజలకు పునరావాస చర్యలు తీసుకోవడం లేదు.
  4. సాధారణముగా సెజ్లను మారుమూల ప్రాంతాలలో నెలకొల్పి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే థ్యేయం. పట్టణ ప్రాంతాల దగ్గరలోనే సెజ్లను ఏర్పాటు చేయడం వలన ఈ ధ్యేయము నెరవేరలేదు.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక మండలికి అందించిన ప్రోత్సాహకాలను తెలుపండి.
జవాబు:
బహుళ ఉత్పాదక ప్రాజెక్టుగా మరియు వర్తకపు కార్యకలాపాల నిమిత్తము, విదేశీ భూభాగము పరిగణింపబడి, సుంకాలు అనగా పన్నులు చెల్లించనవసరము లేని ప్రత్యేక ప్రాంగణము సెజ్. పరిశ్రమలను అభివృద్ధి చేయుటకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సదుపాయాలను ఉపయోగించి, ప్రాంతాలను అభివృద్ధి చేసే విధముగా ఈ సెజ్లను ఏర్పాటు చేసినారు. సెజ్లు వస్తూత్పత్తి మరియు సేవారంగములోని పరిశ్రమలకు సహాయం చేస్తాయి.

ఆంధ్రప్రదేశ్ సెజ్ ఉత్పత్తి మరియు సేవా పరిశ్రమలకు ప్రత్యేక మౌళిక సదుపాయాలను కలుగజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సెజ్ విదేశీ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఆర్థిక మరియు పన్నుల ప్రోత్సాహకాలు ఇవ్వడంలో సరళీకృత అనుమతులు ఇస్తున్నది. భారతదేశములో APSEZ ఒక భారీతరహా బహుళ ఉత్పాదక ప్రత్యేకమండలి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్వదేశీ, విదేశీ వర్తకం

సెజ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు :

  1. డ్యూటీలు మరియు ఎక్సైజ్ల నుంచి మినహాయింపు.
  2. 50% నూతన మూలధనం అనగా గత 5 సంవత్సరాలలో పెట్టుబడి.
  3. అంతర్జాతీయ నిధులను ఉపయోగించుకొనుట.
  4. చెల్లించిన డ్యూటీని తిరిగి పొందుట..
  5. సెజ్ యూనిట్లలో హిడ్జింగ్కు అనుమతి.
  6. విదేశాలలో సబ్కాంట్రాక్టులకు అనుమతి.
  7. లోపలే కస్టమ్స్ క్లియరెన్సు.
  8. స్వదేశీ ఎగుమతిదారులకు ప్రత్యక్ష ఎగుమతికి ఆమోదం.
  9. FDI 100%.
  10. AP పారిశ్రామిక విధానము 2010-15 నుంచి ప్రయోజనాలు.
  11. స్టాంపుడ్యూటీ మినహాయింపు.
  12. వాట్, అమ్మకపు పన్ను, ఆల్ట్రాయ్ నుంచి మినహాయింపు.
  13. విద్యుచ్ఛక్తి సబ్సిడీ.
  14. రాష్ట్రస్థాయిలో సింగిల్ విండో సిస్టమ్ క్లియరెన్సు.
  15. పరిశ్రమలకు తక్కువ విద్యుత్ టారిఫ్.