AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 5th Lesson పారిశ్రామిక రంగం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Economics Study Material 5th Lesson పారిశ్రామిక రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశములో పారిశ్రామిక రంగము యొక్క పాత్రను వివరింపుము.
జవాబు:
భారతదేశములో పారిశ్రామికీకరణ పాత్ర: అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశానికి పారిశ్రామికీకరణ అత్యావశ్యకము. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి చేయబడి, సరసమైన ధరలకు అందుబాటులో ఉండు యంత్రములు, పరికరములపై ప్రధాన రంగాలైన వ్యవసాయం, సేవల రంగం ఆధారపడినది. పారిశ్రామికీకరణ ప్రజల ఆదాయాలను పెంచి తత్ఫలితముగా వారి జీవనప్రమాణ స్థాయి పెరుగుటకు తోడ్పడును. పారిశ్రామికీకరణ క్రింది ప్రయోజనాలను కల్పిస్తుంది.
పారిశ్రామికీకరణ ప్రయోజనములు
AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం 1

1) ఆదాయ వృద్ధి: పారిశ్రామికీకరణ దేశంలో జాతీయాదాయాన్ని త్వరితగతిన పెంచుతుంది. వనరుల సద్వినియోగానికి దోహదం చేస్తుంది. 2012వ సంవత్సరంలో తలసరి ఆదాయములు జర్మనీలో 44,010 $, జపాన్లో 47,870 $, U.K. 38,250 $, USA.50,120 $ భారతదేశములో తక్కువగా 1,530 $ గా ఉన్నది.

2) ఆర్థిక వ్యవస్థ నిర్మాణములో మార్పు: వెనుకబడిన దేశాలలో పారిశ్రామికీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన మార్పులు అవసరము. పారిశ్రామికీకరణ ఫలితాలు వ్యవసాయ, సేవలరంగ అభివృద్ధికి తోడ్పడుతూ, ఉపాధి, ఉత్పత్తి ఆదాయాలను పెంచును. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 13.9 శాతము, పారిశ్రామిక రంగం వాటా 26.2 శాతం, సేవల రంగం వాటా 59.9 శాతముగా ఉంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

3) అధిక ఆదాయ వర్గాల డిమాండు తీర్చుట: అధిక ఆదాయ వర్గాల వారు ఒక పరిమితి దాటిన తర్వాత పారిశ్రామిక వస్తువులను డిమాండ్ చేస్తారు. (రిఫ్రిజిరేటర్, ఎ.సి., మొదలగునవి) అవసరాలు తీరిన తరువాత అధిక ఆదాయ వర్గాలు తమ ఆదాయాన్ని తయారీ వస్తువులపై ఖర్చు చేస్తారు. ధనవంతుల విషయంలో తయారీ వస్తువుల డిమాండ్ ఆదాయ వ్యాకోచంగానూ, వ్యవసాయ వస్తువుల డిమాండ్ ఆదాయ అవ్యాకోచముగా ఉండును. ప్రజల డిమాండుకు అనుగుణంగా తయారీ వస్తువులను అందించుటకు పారిశ్రామికీకరణకు అవసరము.

4) విదేశీ వ్యాపారములో అభివృద్ధి: ప్రాథమిక వస్తువుల ధరలలో వచ్చు ఒడుదుడుకులను ఎదుర్కొనుటకు పారిశ్రామికీకరణ అవసరము. ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేస్తూ తయారీ వస్తువులను దిగుమతి చేసుకుంటారు. మన దేశములో ప్రాథమిక వస్తువుల ధరలు స్థిరంగానూ లేదా తగ్గే అవకాశముంటుంది. తయారీ రంగ వస్తువుల ధరలు మాత్రం హెచ్చుగా ఉంటాయి. ఇది అంతర్జాతీయ వ్యాపార ప్రతికూలతలకు కారణము. ఇటువంటి దేశాలు దిగుమతి ప్రత్యామ్నాయ, ఎగుమతి ప్రోత్సాహక పారిశ్రామిక విధానాన్ని అనుసరించాలి.

5) ఉద్యోగ అవకాశాల కల్పన: భారతదేశములో అధిక జనాభా పెరుగుదల వలన శ్రామిక మిగులు ఎక్కువ. వ్యవసాయ రంగంలో అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువ. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచిన ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించవచ్చును.

6) సాంకేతిక పురోగతి: పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచి నూతన యంత్రాలు, పరికరాలను ఎక్కువగా ఉత్పత్తి చేసి తక్కువ ధరలకు అందజేయగలిగిన వాటిని ఉత్పత్తి రంగంలో ప్రవేశపెట్టి ఉత్పత్తిని పెంచవచ్చును. నూతన పరిశ్రమల ప్రారంభానికి దోహదపడతాయి. అనేక బహుళార్థసాధక ప్రాజెక్టులు, రైల్వేలు, విద్యుచ్ఛక్తి మొదలైన అవస్థాపన సౌకర్యాలు పెరుగుతాయి. సాంకేతిక ప్రగతి జరుగుతుంది.

7) ఆర్థిక వ్యవస్థ బలపడుటకు:

  • భవిష్యత్ ఆర్థిక పురోగతికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలు పెరగటానికి పరిశ్రమలు దోహదం చేస్తాయి.
  • వ్యవసాయరంగ అభివృద్ధికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, రవాణా సదుపాయాలు వృద్ధి చెందుట ద్వారా ఉత్పత్తి పెరుగును.
  • బహుముఖంగా ఆర్థిక వ్యవస్థ విస్తృతం చేయుటకు పారిశ్రామికీకరణ అవసరము.
  • దేశ ఆర్థిక భద్రతకు పారిశ్రామికీకరణ ముఖ్యము. దేశ రక్షణకు అవసరమైన యుద్ధ సామాగ్రిని ఉత్పత్తి చేయుటలో స్వయం సమృద్ధిని సాధించుట అవసరం.

ప్రశ్న 2.
భారతదేశములో 1948 పారిశ్రామిక విధాన తీర్మానమును సమీక్షింపుము.
జవాబు:
1948 పారిశ్రామిక విధాన తీర్మానము: స్వాతంత్ర్యము పొందిన తరువాత త్వరిత పారిశ్రామికీకరణ 1948వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన భారత ప్రభుత్వము సమగ్ర, క్రమబద్ధమైన మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. ఈ తీర్మానము భారతదేశానికి మిశ్రమ ఆర్థికవ్యవస్థ అవసరముందని గుర్తించింది. ఇందులో పబ్లిక్ రంగము యొక్క ప్రయివేటు రంగము యొక్క పాత్రలు స్పష్టీకరించడమైనది.

లక్ష్యాలు:

  1. న్యాయమైన, సమాన అవకాశాలు అందరికీ కల్పించబడడం.
  2. దేశములో అంతర్గతముగా ఉన్న వనరులను పూర్తిగా వినియోగములోకి తెచ్చి, ప్రజల జీవన ప్రమాణాన్ని అభివృద్ధి చేయడం.
  3. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా త్వరగా ఉత్పత్తి పెంచడం.
  4. సామాజిక సేవలో అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించడము.

ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని 1948 పారిశ్రామిక విధానము పరిశ్రమలను నాలుగు విధాలుగా విభజించటం జరిగింది.
I. ప్రభుత్వ ఏకస్వామ్యం గల పరిశ్రమలు: ఈ జాబితాలో 3 రకాల పరిశ్రమలు ఉన్నాయి. అవి: 1) దేశరక్షణ, తత్సంబంధ పరిశ్రమలు, ఆయుధ సామాగ్రి, ఆయుధాల ఉత్పత్తి, 2) అణుశక్తి ఉత్పత్తి, నియంత్రణ,. 3) రైల్వే రాకపోకలు. వీటి నిర్వహణ, యాజమాన్యము ప్రభుత్వానిదే.

II. క్రమేణ ప్రభుత్వ యాజమాన్యం క్రిందికి వచ్చే పరిశ్రమలు: ఈ జాబితాలో బొగ్గు, ఇనుము, ఉక్కు, విమానాల ఉత్పత్తి, నౌకా నిర్మాణము, టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఖనిజపు నూనెలు. ఇవి మౌళిక, కీలక పరిశ్రమలు.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

III. ప్రైవేటు రంగానికి వదిలిపెట్టిన పరిశ్రమలు: పరిశ్రమలు ప్రైవేట్ రంగములో ఉన్నను, ప్రభుత్వ నియంత్రణకు, నిబంధనలకు లోబడిన పరిశ్రమలు. ఇందులో కొన్ని మౌళికమైన పరిశ్రమలు ఉన్నాయి. మోటారు కార్లు, ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, భారీ యంత్రసామాగ్రి, యంత్ర పనిముట్లు, ఎరువులు మొదలైనవి. వీటిని ప్రైవేట్ రంగము నిర్వహించినప్పటికీ వీటిలో ప్రభుత్వ నియంత్రణ, నిబంధనలకు లోబడి ఉత్పత్తి జరుగుతుంది.

IV. పైన తెల్పిన పరిశ్రమలు మినహా మిగిలినవన్నీ ప్రయివేట్ రంగానికి వదిలివేయడం జరిగింది. వీటి పై ప్రభుత్వ సాధారణ అజమాయిషీ ఉంటుంది.

V. ఈ పారిశ్రామిక విధానములో కుటీర, చిన్నతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు పరిపూరకంగా స్థాపించడానికి, అవి సహకార సంఘాల ఆధ్వర్యంలో స్థాపించవచ్చునని తెలియజేసినది. సంస్థలలో శ్రామికులకు వాటా పెంచి, వారిని భాగస్వాములుగా చేయాలని చెప్పింది.

VI. ఈ పారిశ్రామిక విధానంలో ముఖ్యంగా విదేశీ మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని ప్రభుత్వము భావించింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక పద్ధతులు మనదేశ త్వరిత పారిశ్రామికీకరణకు అవసరమని ప్రభుత్వము గుర్తించినది. విదేశీ మూలధనంపై, దేశ సంక్షేమం, లాభాల దృష్ట్యా, ప్రభుత్వ నియమ నిబంధనలు ఉంటాయి.

ప్రశ్న 3.
1956 పారిశ్రామిక విధాన తీర్మానమును గురించి వివరింపుము.
జవాబు:
1956 పారిశ్రామిక విధాన తీర్మానము: మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అనుకున్న వృద్ధిరేటును భారతదేశం సాధించలేదు. అయితే 1948 తరువాతనే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు గల రాజ్యాంగం రూపొందించటం, సామ్యవాద పద్ధతిలో సాంఘిక, ఆర్థిక మార్పులను తేవచ్చునని, పార్లమెంట్ భావించడం, అనుకూల ఉత్సాహపూరిత వాతావరణములో రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామికీకరణ – భారీ, మౌళిక పరిశ్రమల స్థాపనకు కావలసిన ఏర్పాట్ల కోసం 1956 పారిశ్రామిక విధాన తీర్మానమును రూపొందించడం జరిగింది.

1956 పారిశ్రామిక విధాన తీర్మానము లక్ష్యాలు:

  1. ఆర్థికాభివృద్ధిని శీఘ్రతరము చేయడానికి, పారిశ్రామికీకరణను త్వరితం చేయడం.
  2. భారీ యంత్ర నిర్మాణ పరిశ్రమలను అభివృద్ధి పరచడము.
  3. విశాలమైన, అభివృద్ధికరమైన సహకార రంగాన్ని నిర్మించుట.
  4. ప్రజల ఆదాయ సంపదలలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడము.
  5. ప్రాంతీయ అసమానతలను తొలగించడము.
  6. సామ్యవాదరీతి సమాజ స్థాపన.
  7. ఏకస్వామ్యాలను నిరోధించడం, ఆర్థికశక్తి కేంద్రీకృతము కావటాన్ని నిలుపుదల చేయటము, దాన్ని చిన్న ఉత్పత్తిదారులకు వికేంద్రీకరించటం.

1956 పారిశ్రామిక విధాన తీర్మానము ప్రధాన అంశాలు: ఈ పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించారు.
ఎ) గ్రూపు పరిశ్రమలు: ఈ వర్గములో 17 పరిశ్రమలున్నాయి. భవిష్యత్తులో ఈ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఈ వర్గ పరిశ్రమలైన ఇనుము, ఉక్కు, అణుశక్తి, భారీ యంత్రాలు, బొగ్గు, ఖనిజపు నూనెలు, రైల్వే, రవాణా, టెలిఫోన్, టెలిగ్రాఫ్, విద్యుచ్ఛక్తి మొదలగునవి.

బి) గ్రూపు పరిశ్రమలు: ఈ వర్గములో 12 పరిశ్రమలు ఉన్నాయి. ఈ వర్గములోని పరిశ్రమలను, ఎక్కువగా కొత్త సంస్థలను ప్రభుత్వమే స్థాపించి తన భాగస్వామ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ప్రైవేటు రంగము ఇందులోని పరిశ్రమలను స్థాపించడానికి నిరాకరించడము జరగదు.

సి) గ్రూపు పరిశ్రమలు: పై రెండు వర్గాల్లో పేర్కొనబడని పరిశ్రమలు’ సి వర్గములో ఉంటాయి. వీటిని ప్రైవేట్ రంగము చొరవకు, సాహసానికి వదిలి పెట్టడము జరిగినది.

డి) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు: ఈ తీర్మానము ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పరస్పరము సహకరించుకుంటాయి. అయితే ప్రభుత్వము ఏ రంగములోనైనా సంస్థలను స్థాపించవచ్చును. అలాగే ‘ఎ’ వర్గము మరియు ‘బి’ వర్గములో గల కొన్నింటిని మినహాయించి మిగిలిన ఏ ఇతర పరిశ్రమలలోనైనా ప్రయివేట్ రంగాన్ని అనుమతించవచ్చును.

ఇ) కుటీర మరియు చిన్నతరహా పరిశ్రమలు: కుటీర, చిన్నతరహా పరిశ్రమల ప్రాముఖ్యతను గుర్తించి, వీటిని ప్రోత్సహించడానికిగాను పెద్ద పరిశ్రమల ఉత్పత్తులపై పరిమితి విధించడం, విచక్షణాత్మక పన్నుల విధానాన్ని అనుసరించడం, సబ్సిడీలను ఇవ్వడము, ఆధునికీకరణకు తోడ్పడడం మొదలైన చర్యల ద్వారా వీటిని ప్రోత్సహించవలెను.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ఎఫ్) ప్రాంతీయ అసమానతలను తగ్గించడం: దేశంలోని అన్ని ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం ద్వారా, వికేంద్రీకరణకు అవకాశము కల్పిస్తూ, ప్రాంతీయ అసమాతలను తగ్గించాలని ఈ తీర్మానములో పేర్కొనడం జరిగింది.

జి) కార్మిక పాత్ర: శ్రామికులు పనిచేసే స్థలములో సౌకర్యాల కల్పన, వారి సామర్థ్యాన్ని పెంచవలసిన ఆవశ్యకతను ఈ తీర్మానము గుర్తించింది. యాజమాన్యం, శ్రామికుల మధ్య ముఖ్య సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

హెచ్) విదేశీ పెట్టుబడి: పారిశ్రామిక తీర్మానము వేగవంతము చేయడానికి భారత సాంకేతిక నిపుణులకు, నిర్వాహకులకు శిక్షణను ఇవ్వడానికి విదేశీ మూలధనాన్ని వినియోగించాలని ఈ తీర్మానము సూచించడము జరిగింది. అయితే పరిశ్రమల యాజమాన్యం, నియంత్రణ భారతీయుల చేతులలోనే ఉండాలని స్పష్టం చేసింది.

1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యంగా భావించవచ్చును. అయితే సామ్యవాదరీతి సమాజస్థాపన, మిశ్రమ ఆర్థికవ్యవస్థ నిర్మాణం, ఈ తీర్మానంలో ప్రధానంగా చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ విస్తరణకు ఈ తీర్మానము ఎక్కువ ప్రాముఖ్యతను కల్పించింది.

ప్రశ్న 4.
భారతదేశములో 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానమును విమర్శనాత్మకంగా పరిశీలింపుము. [Mar ’16]
జవాబు:
1991 నూతన పారిశ్రామిక విధానము: దేశ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక, ఇతర రంగాలలో ఉన్న స్తబ్దతను తొలగించడానికి, ఆర్థిక వ్యవస్థను చలనస్థితికి తీసుకొనివచ్చి అభివృద్ధి పథములో నడిపించేందుకు ఒక నూతన పారిశ్రామిక విధానము అవసరము అయింది. దీనిని పూరించుటకు 1991 పారిశ్రామిక విధానము అమలులోకి వచ్చింది.

లక్ష్యాలు:

  1. అప్పటికే అనుభవిస్తున్న ప్రయోజనాల ఆధారంగా పారిశ్రామిక వ్యవస్థను నిర్మించటం.
  2. వ్యవస్థలోని బలహీనతలు, వక్రీకరణలు పారిశ్రామిక వృద్ధికి ఆటంకాన్ని కలిగించకుండా సరిదిద్దుట.
  3. పరిశ్రమలు తమ ఉత్పాదకశక్తిని పెంచి, లాభదాయకమైన ఉపాధి అవకాశాలను పెంచడము.
  4. సాధించిన (పొందిన) సాంకేతిక విజ్ఞానము ప్రపంచస్థాయి పోటీకి దీటుగా ఉండటం.
  5. భారత ఆర్థికరంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమైక్యపరచటం.

1991 పారిశ్రామిక విధాన తీర్మాన ప్రధాన అంశాలు: 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానములోని ప్రధానాంశాలను ఈ క్రింది విధముగా తెలియజేయవచ్చు.
1) డిలైసెన్సింగ్: దీని ప్రకారం పరిశ్రమల స్థాపన, నిర్వహణలో లైసెన్సు పొందవలసిన అవసరము లేదు. తప్పనిసరిగా లైసెన్సు పొందవలసిన పరిశ్రమలకూ పరిధిని తగ్గించారు. అలాగే వినియోగ సంబంధమైన వస్తువులు, చిన్నతరహా సంస్థలు ఉత్పత్తి చేసే వివిధ ఉత్పతులకు లైసెన్సింగ్ అవసరము లేదు. అయితే కొన్ని ముఖ్యమైన పరిశ్రమలకు లైసెన్సు అవసరము. ఉదా: బొగ్గు, పెట్రోలియం మొదలగునవి.

2) ప్రభుత్వ రంగమునకు ప్రత్యేక వసతి: ముఖ్యమైన, వ్యూహాత్మకమైన పరిశ్రమ రంగాలైన వాటికి ప్రత్యేక వసతి అవసరం. ఉదా: రక్షణ పరికరాలు, అణుశక్తి, ఖనిజపు నూనెలు, రైల్వే రవాణా మొదలగునవి. అయితే ప్రభుత్వ రంగ పరిధి కుదింపబడినది. ఈ చర్య ద్వారా ప్రైవేటు రంగ పరిధిని విస్తృత పరచడము జరిగినది.

3) మూలధన వస్తువుల దిగుమతి: దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్యం కోల్పోవడం జరుగును. కావున దిగుమతుల మీద ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. మూలధన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఆమోదించడం జరుగును.

4) స్థల విధానము: 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలలో పరిశ్రమలు ఎక్కడైనా స్థాపించుకొనవచ్చును. అయితే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో కాలుష్యము కలిగించే పరిశ్రమలు స్థాపించుటకు నగరమునకు 25 కిలోమీటర్ల వెలుపలకు స్థాపించవలెను. పరిశ్రమల కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను తప్పనిసరిగా తీసుకొనవలెను.

5) నిలుపుదల చేసి తిరిగి మరలా ఉత్పత్తిని కొనసాగించే గుణము గల పరిశ్రమలు: ఇలాంటి పరిశ్రమల విషయంలో చట్టపరంగా విత్త సంస్థల నుంచి ఋణాలను పొంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి, దీర్ఘకాలిక నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఇలాంటి పరిశ్రమల యాజమాన్యానికి వాటాలు అవసరము.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

6) విదేశీ పెట్టుబడి విధానము: విదేశీ మారక ద్రవ్యార్జన దృష్ట్యా విదేశీ పెట్టుబడులు అధిక ప్రాధాన్యత గల రంగాలలో అవసరమని ప్రభుత్వం భావిస్తే ఆ రంగాలలో మూలధన పెట్టుబడులు 51% వరకు అనుమతిస్తుంది. ఈ పెట్టుబడికి సంబంధించిన లావాదేవీలను చర్చించేందుకు ప్రత్యేక అధికారాలు ఉన్న బోర్డును ఏర్పాటు చేస్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కొన్ని రంగాలకు మాత్రమే నిషేధించడమైనది. అవి:

  1. చిల్లర వ్యాపారము
  2. అణుశక్తి
  3. లాటరీ వ్యాపారము
  4. జూదము మరియు పందెము.

7) విదేశీ సాంకేతిక ఒప్పందాలు: 1991 తీర్మానం ప్రకారం విదేశీ సాంకేతిక విజ్ఞానం బదిలీ కోసం, ఒప్పందాల చెల్లింపు విషయంలో అధిక ప్రాధాన్యత గల పరిశ్రమలకు సంబంధించి ఒక కోటి రూపాయల వరకు, దేశీయ అమ్మకాలపై రాయల్టీ 5 శాతము వరకు, ఎగుమతులపై రాయల్టీ 8 శాతము వరకు రిజర్వుబ్యాంకు తక్షణమే ఆమోదిస్తుంది.

8) ప్రభుత్వ రంగ విధానము: ప్రభుత్వ రంగానికి దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తము పరిశ్రమలపై దృష్టిని పెట్టక, వాటికి ప్రత్యేకంగా కేటాయించిన పరిశ్రమలపై మాత్రమే అధికారము ఉంటుంది. నష్టపోయిన పరిశ్రమలను ప్రభుత్వము స్వాధీనము చేసుకుంటుంది. వీటి పునర్ నిర్మాణము కోసము పారిశ్రామిక విత్త పునర్నిర్మాణ మండలి (BIFR) అను సంస్థను ఏర్పాటు చేసింది.

9) MRTP చట్టము: 1991 తీర్మానం ప్రకారం MRTP పరిధిలోని సంస్థలు, కొత్త సంస్థల స్థాపనకు, ఉత్పత్తిని పెంచటానికి (సంస్థ విస్తరణకు), వేరొక సంస్థలో విలీనం కావటానికి ఎటువంటి అనుమతి పొందనవసరం లేదు. ఆర్థిక స్థోమత కేంద్రీకరణను, ఏకస్వామ్యాలను, అక్రమ వ్యాపార పద్ధతులను సమర్థవంతంగా నియంత్రించటానికి ఈ | తీర్మానం MRTP చట్టానికి సవరణలు ప్రతిపాదించినది. ఈ చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల విషయంలో గరిష్ట ఆస్తుల పరిమితిని (1985 నుంచి ఈ పరిమితి గౌ 100 కోట్లు) తొలగించుట.

1991 పారిశ్రామిక విధానము వల్ల భారత పారిశ్రామిక అభివృద్ధి ఆశించిన రేటులో పొందటానికి మార్గము ఏర్పడింది. అయితే పరిశ్రమల లైసెన్సింగ్, విదేశీ సహాయము, పరిజ్ఞానము, ఉపయోగము, MRTP చట్ట సవరణ మొదలైన చర్యల ద్వారా ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందినది.

ప్రశ్న 5.
భారతదేశ జాతీయ తయారీ విధానమును గురించి వ్రాయుము.
జవాబు:
భారత ప్రభుత్వము – జాతీయ తయారీ విధానము: వ్యాపార నియంత్రణలను సడలిస్తూ దేశ ప్రయోజనాలను బలహీనపరచని విధంగా భారత జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించడమైంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించినట్లే సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమల ప్రాముఖ్యతను గుర్తించి ప్రోత్సహించుటకు సంకల్పించింది. సాంకేతికతను మెరుగుపరచుట, వాతావరణ పరిరక్షణ, స్నేహపూర్వక సాంకేతికత, పెట్టుబడి వాటాలలో ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ప్రైవేటు రంగానికి కోశపరమైన ప్రోత్సాహకాల్ని కల్పించి, యువత ఎక్కువ ఉద్యోగాలను పొందే విధంగా నైపుణ్యాలను అభివృద్ధి పరచుట ఈ తయారీ విధానము యొక్క లక్ష్యము. వ్యవసాయమునకు ఉపయోగపడని భూములలో జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్లను ఏర్పాటు చేయుట ఈ విధానము లక్ష్యము.

జాతీయ తయారీ విధానము – లక్ష్యాలు:

  1. తయారీ రంగంలో 12 నుండి 14 శాతము మాధ్యమిక వృద్ధిరేటును సాధించుట.
  2. స్థూల జాతీయోత్పత్తిలో ప్రస్తుతము 16 శాతముగా ఉన్న తయారీ రంగపు వాటాను 2022 నాటికి 25
    శాతమునకు పెంచుట.
  3. తయారీ రంగంలో 2012 నాటికి 100 మిలియన్ల అదనపు ఉద్యోగాల కల్పన.
  4. తయారీ రంగంలో ఉపాధి అవకాశములను అందుకొనే విధంగా గ్రామీణ వలసదారులకు మరియు పట్టణ పేదరికానికి సరిపడినన్ని నైపుణ్యాలను కల్పించుట.
  5. ప్రపంచ పోటీని తట్టుకొనే విధంగా భారత తయారీ విధానాన్ని అభివృద్ధి పరచుట.
  6. తయారీ రంగంలో దేశీయ ఉత్పత్తి విలువలు మరియు సాంకేతిక పరిధిని పెంపొందించుట. దేశ జనాభాలో 60 శాతము మంది శ్రమైక జీవన లక్షణములను కలిగిన యవ్వనదేశము భారతదేశము. ఇప్పుడున్న శ్రామిక జనాభాకు రాబోయే దశాబ్ది కాలంలో 220 మిలియన్ల అదనపు శ్రామిక సప్లయ్ ఉండగలదని అంచనా. వీరిలో సగం మందికైనా లాభసాటి ఉద్యోగితను కల్పించునట్లు తయారీ రంగమును అభివృద్ధిపరచాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 6.
భారతదేశ పెట్టుబడుల ఉపసంహరణ విధానమును వివరింపుము.
జవాబు:
పెట్టుబడుల ఉపసంహరణ: ఉత్పాదక కార్యకలాపాలను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి బదిలీచేసే విధానమే ప్రైవేటీకరణ. ప్రభుత్వ రంగం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం జరుగును. నూతన ఆర్థిక విధానములో భాగంగా ప్రభుత్వము జూలై 1991 నుంచి పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అనుసరిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉత్పాదకత అల్పంగా ఉండుట. ఈ సంస్థలలో |నిర్వహణపరమైన లోపాలు చోటుచేసుకోవడం తదితరమైన అంశాలు డిజిన్వెస్ట్మెంట్కు కారణం.

“వనరుల పెంపుదలకు మరియు విస్తృత ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించుటకు, ప్రభుత్వ రంగంలోని కొంత వాటాను మ్యూచువల్ ఫండ్స్కు, విత్త సంస్థలకు, అసాధారణ ప్రజలకు, శ్రామికులకు ఇవ్వటాన్ని “పెట్టుబడుల ఉపసంహరణ అంటారు.

పెట్టుబడి ఉపసంహరణ విధాన లక్షణాలు:

  1. ప్రభుత్వ రంగ సంస్థలలో కొంత భాగము వాటాల రూపములో పొందే హక్కు ప్రజలకు కల్పించుట.
  2. ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ సంపద కాబట్టి ఆ సంపద ప్రజలకే చెందుతాయి.
  3. ఈ ప్రక్రియలో కనీసము 51 శాతపు వాటా ప్రభుత్వ ఆధీనములో ఉంటుంది మరియు వాటి నిర్వహణ, నియంత్రణ ప్రభుత్వానిది.

పెట్టుబడి ఉపసంహరణ విధానము: నవంబర్ 5, 2009న లాభాలు ఆర్జించు ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వము ప్రకటించింది.

  1. ప్రభుత్వము గాని, కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలు గాని “వాటాల అమ్మకము లేదా తదుపరి వాటాల జారీ” పద్దతిని లాభదాయ ప్రభుత్వ రంగ సంస్థలలో కల్పించుట.
  2. నష్టాలలో లేకుండా వరుసగా మూడు సంవత్సరములు నికర లాభాన్ని ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను జాబితాలోని సంస్థలుగా చేర్చుట.
  3. పెట్టుబడుల ఉపసంహరణ సరయిన ప్రభుత్వరంగ సంస్థలలో కనీసము 51 శాతము పెట్టుబడులను ప్రభుత్వమే ఉంచుకోవాలి. తద్వారా సంస్థలపై యాజమాన్య నియంత్రణ ప్రభుత్వానిదే.
  4. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో అవసరమైన మూలధనాన్ని దృష్టిలో ఉంచుకొని “తదుపరి మూలధన సేకరణ” పద్ధతిని ప్రోత్సహించి, క్రమేణా ఆ సంస్థల అభివృద్ధిని సాధించుట.

2004-05వ సంవత్సరము నుంచి భారీ ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 2,684.07 కోట్లు, మారుతి ఉద్యోగ లిమిటెడ్ (MVL) (Not a CPSU) R 2277.62 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) < 994.82 కోట్లు, ఆయిల్ ఇండియా లిమిటెడ్ శ్ 2247.05 కోట్లు (N.M.D.C) (National Mineral Development Corporation) లిమిటెడ్ 9930.40 కోట్లు, కోల్ ఇండియా లిమిటెడ్ 15,199 కోట్లు మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1144.55 కోట్లు మరియు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కోట్లు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 30-1-2015 నాటికి భారత ప్రభుత్వము 1,79,625.25 కోట్లు రాబట్టినది. ఈ మొత్తాన్ని సాంఘిక అవస్థాపన సౌకర్యాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరుగును.

ప్రశ్న 7.
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అవసరాన్ని వివరింపుము.
జవాబు:
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు: 1991 పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించింది. పరిశ్రమల ఆధునికీకరణకు, సాంకేతిక పరిజ్ఞానం పెంచటానికి, ఆర్థికాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఋణపూరిత పద్ధతిలో ఆర్థిక వనరుల లభ్యతకు అవకాశం కల్పించును. భారతదేశంలో శ్రమ చౌకగా లభించడమే కాక, పన్ను మినహాయింపులు ఇవ్వడము, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత ప్రభుత్వము ఆకర్షిస్తుంది. ఏ దేశంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంటుందో అచ్చట సాంకేతిక అభివృద్ధిని పొందటానికి, ఉపాధిని పెంచుటకు అవకాశము ఏర్పడును.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

భారతదేశములో నిరంతర విదేశీ పెట్టుబడులు వెల్లువలా వచ్చి అన్ని రంగాలకు విస్తరించుట భారతదేశంపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నది. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రభుత్వ విధానము మరియు అధిక వ్యాపార అవకాశాలు విదేశీ పెట్టుబడులు మనదేశంలోని విరివిగా వస్తున్నాయి. భారత ప్రభుత్వము విదేశీ పెట్టుబడులపై ఇటీవల నియంత్రణ తొలగించుట అన్ని రంగాలకు విదేశీ పెట్టుబడులు విస్తరించినవి. రక్షణ, ప్రభుత్వ రంగములోని ఇంధనశుద్ధి కర్మాగారాలు, టెలికామ్, విద్యుచ్ఛక్తి మార్పిడి, స్టాక్ ఎక్స్ఛేంజీస్, ఆటోమొబైల్ రంగము, మందుల కంపెనీలు, రసాయనాలు మొదలగు పరిశ్రమలలోనికీ విదేశీ పెట్టుబడులు విచ్చలవిడిగా వచ్చుట భారత సత్వర ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలదు.

ప్రశ్న 8.
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ప్రత్యేక ఆర్థికమండళ్ళ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలింపుము.
జవాబు:
ప్రత్యేక ఆర్థికమండళ్ళు: భారత ప్రభుత్వము ఏప్రిల్ 2000 సంవత్సరమున ప్రత్యేక ఆర్థికమండళ్ళను ప్రకటించినది. ఈ విధానము త్వరిత ఆర్థికవృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలతో పాటు పన్ను రాయితీలు పొందుతూ కనీస నియంత్రణలకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏర్పాటు చేయబడినది. భారతదేశములో ప్రత్యేక ఆర్థికమండళ్ళను ఏర్పాటు చేస్తూ, మే నెల 2005లో చట్టమును రూపొందించి ఫిబ్రవరి 2006 నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
వీటి లక్ష్యాలు:

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను సృష్టించుట.
  2. వస్తు సేవల ఎగుమతులను పెంచుట.
  3. దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించుట.
  4. ఉద్యోగావకాశాలను కల్పించుట.
  5. అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధిపరచుట.

SEZ’s ప్రయోజనాలు: ప్రత్యేక ఆర్థిక నియంత్రణ మండళ్ళు ఎగుమతులను, ఉద్యోగితను, పెట్టుబడిని ఎక్కువగా పెంచుటకు కృషి చేస్తున్నాయి. ఆర్థిక సౌభాగ్యస్థితిని తీసుకొచ్చేవే ప్రత్యేక ఆర్థికమండళ్ళు. వీటి ప్రయోజనాలు కింద పేర్కొన్నాము.

  1. ఆర్థికవృద్ధి తీవ్రంగా పెరిగే శక్తినిచ్చుట.
  2. గ్రామీణ ప్రాంతంలో సంపదను సృష్టించుట.
  3. తయారీ మరియు ఇతర సేవల రంగంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పించడము.
  4. ప్రపంచ తయారీ సంస్థలను మరియు సాంకేతిక నైపుణ్యాలను ఆకర్షించుట.
  5. అంతర్గత, విదేశీ పెట్టుబడులు ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగాలకు తీసుకెళ్ళడము.
  6. భారతదేశ సంస్థలను ప్రపంచ పోటీని తట్టుకొనే విధంగా తయారుచేయుట.
  7. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలసలు తగునట్లు దోహదం చేయుట.

ప్రత్యేక ఆర్థికమండళ్ళ ఉత్పత్తి ఉద్యోగితను పెంచి పారిశ్రామికీకరణకు తోడ్పడుచున్నవి.

ప్రశ్న 9.
భారతదేశములో పారిశ్రామికవృద్ధి వెనుకబాటుతనానికి వివిధ కారణాలను తెల్పండి.
జవాబు:
భారత పారిశ్రామిక రంగం వెనుకబడుటకు కారణాలు: భారతదేశము సుసంపన్నమైన సహజ వనరులు మరియు ఎక్కువ మంది శ్రామిక జనాభాను కలిగి ఉన్నను పారిశ్రామిక రంగం ఆశించిన ప్రగతిని సాధించలేదు. పదకొండు పంచవర్ష ప్రణాళికలు పూర్తయినా నిర్ణయించుకొన్న లక్ష్యాలను, సాధించిన ప్రగతికి ఎంతో తేడా ఉన్నది.
పారిశ్రామిక వెనుకబాటుకు కారణాలు
AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం 2
1) ఉత్పాదక సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకోవడం: అనేక పారిశ్రామిక సంస్థలు తమ పూర్తి ఉత్పాదకతా సామర్థ్యాన్ని వినియోగించుకొనే స్థాయి లేదు. దీనికి ముడిసరుకు కొరత, తక్కువ సాంకేతిక పరిజ్ఞానము కారణాలు.

2) ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు: సరళీకరణకు ముందు ప్రభుత్వ రంగ సంస్థల వృద్ధి గుర్తించదగిన స్థాయిలో ఉండేది. 1999-2000 సంవత్సరములో 10,302 కోట్ల రూపాయలుగా ఉన్న నష్టాలు 2011-12 నాటికి |27,602 కోట్ల రూపాయలకు పెరిగింది.

3) రాజకీయ కారణాలు: ఒక ప్రాంతము పరిశ్రమల స్థాపనకు అనుకూలముగాక పోయిన రాజకీయ కారణాల ప్రభావము చేత అచ్చటి పరిశ్రమలను స్థాపించవలసి వస్తున్నది. దీని వలన మూలధన వనరులు నిరుపయోగమగుచున్నవి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

4) అవస్థాపనా సౌకర్యాల కొరత: పారిశ్రామిక ప్రగతి వెనుకబడుటకు అవస్థాపనా సౌకర్యాలు కొరతగా ఉండుట లేదా వాటిని సమకూర్చుకోవడానికి ఎక్కువ వ్యయమగుట కారణము. వీటి కారణంగా ప్రపంచ మార్కెట్టులో భారతదేశ పారిశ్రామిక రంగము పోటీపడలేకున్నది.

5) లక్ష్యాలకు మరియు సాధించిన ప్రగతికి మధ్య వ్యత్యాసము: గడచిన ప్రణాళికా కాలములో లక్ష్యాలను సాధించడములో ప్రభుత్వము విఫలమయినాయి.

6) తక్షణ సవాళ్ళు: ప్రపంచ వ్యాపార సంస్థ (W.T.O.) ప్రారంభ సభ్యదేశమైన భారతదేశము దిగుమతులపై అన్ని పరిమాణాత్మక పరిమితులను ఉపసంహరించడమైనది. భారతదేశములో అనేక సంస్థలు మూతబడుటకు ఇదొక కారణము.

ప్రశ్న 10.
భారత ఆర్థిక వ్యవస్థలో చిన్నతరహా సంస్థల లాభనష్టాలను తెలపండి. [Mar ’17]
జవాబు:
నిర్వచనములు: చిన్నతరహా పరిశ్రమలనగానే వాటి పెట్టుబడి 5 లక్షలకు లోబడి ఉంటుంది. విద్యుచ్చక్తి వినియోగించుకుంటూ 50 కంటే తక్కువ శ్రామికులకు ఉపాధి కల్పించేవి ఒక వర్గం. విద్యుచ్ఛక్తిని వినియోగించకుండా 100 కంటే తక్కువ శ్రామికులకు ఉపాధి కల్పించేవి ఇంకొక వర్గం.

భారత ప్రభుత్వము అక్టోబర్ 2, 2006వ సంవత్సరమున, “సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల చట్టము” ను అమలులోకి తెచ్చినది. ఈ చట్టము ప్రకారము “సూక్ష్మ లేదా లఘు పరిశ్రమల విషయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి కల్గినవి. మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడి 5 నుంచి 10 కోట్ల రూపాయల మధ్య ఉండాలి. పెద్ద పరిశ్రమలలో పెట్టుబడి 10 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చును. మెగా పరిశ్రమలలో పెట్టుబడి 100 కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చును.

లాభాలు:
1) పారిశ్రామిక ఉత్పత్తిలో వాటా: 2006-07 సంవత్సరం తర్వాత శీఘ్రగతిన వృద్ధి చెందుతున్న చిన్నతరహా | పరిశ్రమలు భారతదేశ స్థూలదేశీయోత్పత్తికి ఎక్కువ వాటాలను సమకూరుస్తున్నాయి. 2006-07 సంవత్సరమున సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మొత్తం ఉత్పత్తి 13,51,383 కోట్ల రూపాయలు ఉండగా, 2011-12 నాటికి ఈ మొత్తం 18,34,332 కోట్ల రూపాయలకు పెరిగినది. దీనిని బట్టి మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల వాటా 8 శాతం, తయారీ రంగ ఉత్పత్తులలో ఈ సంస్థల వాటా 38 శాతముగా ఉన్నది,

2) ఉద్యోగ అవకాశాల కల్పన: చిన్న తరహా పరిశ్రమలు శ్రమసాంద్రతమైనవి. చిన్నతరహా సంస్థలో మూలధన శ్రామికుల నిష్పత్తి తక్కువ. పెద్ద పరిశ్రమలలో ఒక వ్యక్తికి ఉపాధి కల్పించే మూలధనంతో చిన్నతరహా పరిశ్రమలలో 8 మందికి ఉపాధిని కల్పించవచ్చును. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం కుటీర చిన్న తరహా పరిశ్రమ.

3) తక్కువ మూలధనము: చిన్న తరహా సంస్థలలో మూలధన ఉత్పత్తి నిష్పత్తి తక్కువ. ఇది భారీ పరిశ్రమలలో 5:4:1 వుండగా చిన్న పరిశ్రమలలో కేవలం 1: మాత్రమే. భారతదేశంలో మూలధనము కొరతగా ఉంది. తక్కువ మూలధనంతో హెచ్చు ఉత్పత్తిని సాధించడం ఈ పరిశ్రమలలో సాధ్యపడుతుంది.

4) మూలధన సేకరణ: చిన్న తరహా సంస్థలు మూలధనాన్ని సులభంగా సేకరించుకోగలదు. చిన్న తరహా పరిశ్రమల విస్తరణ గ్రామీణ ప్రజల పొదుపు మరియు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

5) నైపుణ్యమును వెలికితీయడం: చిన్న తరహా పరిశ్రమలకు అధునాతన నైపుణ్యాలు అవసరం లేదు. చిన్న | తరహా పరిశ్రమల నిర్వహణదారులకు పెద్ద పరిశ్రమలలో కొద్దిమందైనా పని చేయగలిగిన అనుభవాన్ని గడించే శిక్షణను చిన్న తరహా పరిశ్రమలు కల్పించును. చిన్న తరహా పరిశ్రమలు ప్రజల పొదుపు మరియు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

6) తక్కువ దిగుమతులు: తక్కువ మూలధన సాంద్రత చిన్న తరహా పరిశ్రమల లక్షణము. చిన్న తరహా పరిశ్రమలు విదేశీ మూలధనంపై, విదేశీ మారకద్రవ్యంపై ఆధారపడకుండా విదేశీ వ్యాపార చెల్లింపులలోని ఇబ్బందులను తొలగిస్తుంది.

7) పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీకరణ: చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించి, వికేంద్రీకరణ ద్వారా సంతులిత ప్రాంతీయాభివృద్ధిని సాధించవచ్చు. ఈ సంస్థలు స్థానికంగా లభించే మానవశక్తి, ముడిసరుకులు మరియు మూలధనంపై ఆధారపడును.

8) సమాన పంపిణీ: చిన్నతరహా పరిశ్రమలు ఆర్జించు లాభాలు వాటిని నిర్వహించే అనేకమంది ఉద్యమదారులు పంచుకోవడం వలన ఆదాయ మరియు సంపద పంపిణీలో వికేంద్రీకరణ జరుగును.

9) ఎగుమతులు: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో చిన్నతరహా పరిశ్రమలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 2006-07 సంవత్సరంలో మనదేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేయు మొత్తం వస్తు సేవల విలువలో 31.1 శాతం చిన్నతరహా పరిశ్రమలదే.

10) అనారోగ్య పట్టణ సంస్కృతిని నివారించుట లఘు, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి పరచడం ద్వారా గ్రామీణ ప్రాంతం వారికి లాభసాటి ఉపాధి కల్పించబడును. దీని ఫలితం నిరుద్యోగ యువత పట్టణాలకు ఉపాధి కొరకు వలస వెళ్ళుటను నివారించవచ్చును.

11) శ్రామిక సంబంధాలు: చిన్నతరహా పరిశ్రమలలో శ్రామిక తగాదాలు ఎక్కువగా ఉండవు. ఈ సంస్థలలో పరిమితమైన శ్రామికులు పనిచేయుట వలన యాజమాన్యంతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. సమ్మెలు, లాకౌట్ల ప్రభావం ఈ చిన్నతరహా పరిశ్రమలపై తక్కువగా ఉంటుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

నష్టాలు:
1) అసమర్థ మానవ వనరులు: ఎక్కువ మంది గ్రామీణ జనాభా నిరక్షరాస్యులు. వారిలో సాంకేతిక అవగాహన తక్కువ స్థాయిలో ఉంటుంది. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను గూర్చి తెలిసి ఉండరు. ప్రభుత్వ పరపతి విధానాలపై అవగాహన ఉండదు.

2) పరపతి కొరత: చాలా చిన్నతరహా పరిశ్రమల నిర్వాహణకు అవసరమైన పరపతి లభ్యం కావడం లేదు. ఈ విషయంలో కుటీర పరిశ్రమలు మరీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారు మధ్యవర్తుల నుంచి హెచ్చు వడ్డీకి అప్పులు చేస్తారు. తయారయిన వస్తువులను వారికి తక్కువ ధరలకు అమ్ముతూ నష్టపోతున్నారు.

3) ముడిసరుకు సమస్య: చిన్నతరహా సంస్థలకు ఆర్థికస్థోమత లేనందున, బ్యాంకులు అవసరమైన పరపతిని సమకూర్చకపోవడం వల్ల ఈ సంస్థల యాజమాన్యం పెద్దతరహా ఉత్పత్తి సంస్థల లాగా ధర తక్కువగా ఉన్నప్పుడు ముడి పదార్థాలను భారీ స్థాయిలో కొనుగోలు చేయలేనందున తక్కువ మొత్తాలలో ముడిసరుకును కొనుగోలు చేయుట వలన, ధర విషయంలో వీరికి బేరమాడే శక్తి ఉండదు.

4) మార్కెటింగ్ సమస్యలు: చిన్నతరహా పరిశ్రమలకు చెందిన వస్తువులను విక్రయించడానికి సంఘటిత మార్కెటింగ్ వ్యవస్థ అందుబాటులో లేదు. కుటీర పరిశ్రమల వస్తు విక్రయానికి మధ్యవర్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తున్నది.

5) ఆధునిక యంత్రపరికరముల కొరత: చిన్న పరిశ్రమలలో వాడుతున్న యంత్రాలు పురాతనమైనవి. వాటి ఆధునికీకరణకు నూతన పరికరములను ప్రవేశపెట్టుటకు పెట్టుబడి కొరతగా ఉన్నది. దీని ఫలితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువే, తక్కువ నాణ్యత కలిగిన వస్తువులు తయారవుతున్నాయి.

6) విద్యుచ్ఛక్తి కొరత: చిన్నతరహా ఉత్పత్తి సంస్థలు ఎదుర్కొనే మొదటి సమస్య విద్యుచ్ఛక్తి. తరచూ విద్యుత్ కోతలతో చిన్నతరహా పరిశ్రమలు లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తిని సాధించలేకున్నవి. గ్రామీణ ప్రాంతములో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోల్చిన విద్యుత్ కోతల ఫలితంగా చిన్నతరహా కుటీర పరిశ్రమలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి.

7) పురాతన సాంకేతికత కొరత: చిన్నతరహా పరిశ్రమల ఉత్పాదకత మరియు సాంకేతికత ప్రపంచస్థాయి పోటీని తట్టుకోలేకున్నది. సాంకేతికత అభివృద్ధి చెందనంతవరకు చిన్నతరహా పరిశ్రమలు ప్రపంచ ప్రజల అవసరాలను తీర్చుట కష్టము.

8) అధిక పన్నులు: చిన్నతరహా పరిశ్రమలు ముడిసరుకు కొనుగోలు చేయునప్పుడు భారీ ఎత్తున పన్ను చెల్లించవలసి వస్తున్నది. ముగింపు వస్తువులను మార్కెట్లో విక్రయించునపుడు కూడా పన్ను చెల్లించవలసి వస్తున్నందున వీటి ధరలు పెరిగి డిమాండ్ తగ్గుచున్నది.

9) సరళీకరణ – ప్రపంచీకరణ: 1991వ సంవత్సరము తర్వాత ప్రభుత్వం సరళీకృత విధానాలను అమలుపరచడంలో భాగంగా దిగుమతి సుంకాలను తగ్గించడము జరిగినది. అందువల్ల ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా చైనా, జపాన్, కొరియాల నుండి అత్యధికంగా వస్తువులు దిగుమతి కావడంతో మనదేశ చిన్నతరహా ||పరిశ్రమలు వాటితో పోటీ పడలేకున్నవి.

ప్రశ్న 11.
వివిధ పంచవర్ష ప్రణాళికలలో భారత పారిశ్రామికాభివృద్ధి రేటును వివరింపుము.
జవాబు:
భారతదేశములో పంచవర్ష ప్రణాళికలు – పారిశ్రామికాభివృద్ధి: భారత ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి విధానంలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నది. పారిశ్రామికీకరణ ప్రాథమికరంగ అభివృద్ధికి, అవస్థాపనా సౌకర్యాల పెరుగుదలకు, పరిశోధన ద్వారా సాంకేతిక మార్పులకు దోహదము చేస్తుంది. భారతదేశము వినియోగ వస్తువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినది. మూలధన వస్తువుల ఉత్పత్తి కూడా ఆశాజనకముగా ఉన్నది. గనులు, రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఎరువులు, మూలధన వస్తువులు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుచ్ఛక్తి, రవాణా, నిర్మాణ రంగములలో వృద్ధిని సాధించుట ద్వారా పారిశ్రామిక రంగం కొంతమేర ప్రగతిని సాధించినది.

రెండవ పంచవర్ష ప్రణాళిక ద్వారా పారిశ్రామిక స్వావలంబనకు అవసరమైన మౌలిక, కీలక మూలధన పరిశ్రమలు ప్రభుత్వ రంగానికి కేటాయించబడ్డాయి.

మొదటి ప్రణాళిక (1951-56): మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వనరులు తక్కువగా కేటాయించుట, వ్యవసాయ రంగ తక్షణ అభివృద్ధిని ప్రోత్సహించుటకు, ఈ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించలేదు.

పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల ఈ ప్రణాళికా కాలంలో 39 శాతము కాగా సాంవత్సరిక వృద్ధిరేటు 8 శాతముగా ఉన్నది.

రెండవ ప్రణాళిక (1956-61): ఈ ప్రణాళికలో పారిశ్రామికీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమైనది. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రభుత్వరంగ విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. మహళనోబీస్ నమూనా ప్రకారం భారీ స్థాయిలో మౌలిక, మూలధన వస్తువుల పరిశ్రమలు నెలకొల్పడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
పారిశ్రామిక ఉత్పత్తి సూచి సంఖ్య (ఆదాయము 1950-51 = 100) 1955-56 సంవత్సరమున ఉన్న 139 శాతము 1960-61 సంవత్సరము నాటికి 194 శాతానికి పెరిగినది. సాంవత్సరిక సగటు వృద్ధిరేటు 11 శాతముగా ఉన్నది. మూడవ ప్రణాళిక (1961-66): ఈ ప్రణాళికలో కూడా భారీ కీలక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల మధ్య సంతులితను సాధించడానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. పారిశ్రామిక వ్యవసాయ సంతులనంతో సమగ్రాభివృద్ధి సాధించే లక్ష్యంగా 15 సంవత్సరాల దీర్ఘదర్శి ప్రణాళికకు ఈ ప్రణాళిక నాంది పలికింది.

నాల్గవ ప్రణాళిక (1969-74): మూడవ ప్రణాళికలో ఆరంభించిన పరిశ్రమలను పూర్తిచేయుట, ఎగుమతి ప్రోత్సాహక, దిగుమతి ప్రత్యామ్నాయ పరిశ్రమల స్థాపన శక్తిని పెంచడానికి ఈ ప్రణాళిక నిర్ణయించినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

సాంవత్సరిక పారిశ్రామిక వృద్ధిరేటును ఈ ప్రణాళికలో 8 శాతము లక్ష్యముగా నిర్ణయించుకోగా సాధించినది కేవలం 5 శాతము మాత్రమే.

ఐదవ ప్రణాళిక (1974-79): స్వావలంబన, సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రణాళిక ప్రాధాన్యత నిచ్చినది. ఈ ప్రణాళికలో ప్రభుత్వరంగ వాటా 9,700 కోట్ల రూపాయలు. ఈ ప్రణాళిక సత్వర మౌలిక పరిశ్రమల అభివృద్ధికి నిర్ణయించినది. సామాన్య ప్రజలకు అవసర వస్తువులు సరిపడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించినది. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చుట జరిగినది.

ఆరవ ప్రణాళిక (1980-85): అభిలషణీయమైన ఉత్పత్తి స్థాయి కంటే తక్కువ ఉత్పత్తి చేయడం ద్వారా పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వ రంగ అభివృద్ధికి అవసరమైన వనరులను సమకూర్చుకోలేక పోతుందని, ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగాయని, వెనుకబడిన ప్రాంతాలు నిర్లక్ష్యము చేయబడ్డాయని, ఆరవ పంచవర్ష ప్రణాళిక పేర్కొన్నది. దీనిని సరిదిద్దుటకు ప్రభుత్వ రంగానికి ఈ ప్రణాళికలో 23,000 కోట్ల రూపాయలు కేటాయించిరి. ఈ ప్రణాళిక. 5.45 శాతము వృద్ధిరేటును సాధించినది.

ఏడవ ప్రణాళిక (1985-90): ఏడవ ప్రణాళిక మార్గదర్శక సూత్రాలైన సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ఉత్పాదక పెరుగుదలకు అనుగుణంగా ఈ ప్రణాళిక పారిశ్రామిక రంగానికి లక్ష్యాలను నిర్దేశించినది. 7వ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించుకొన్న 8.5 శాతము వృద్ధిని సాధించడమైనది. నూతన ఆర్థిక విధానము మరియు అవస్థాపనా సౌకర్యాల కొరత లేకుండుట వలన ఇది సాధ్యమైనది.

ఎనిమిదవ ప్రణాళిక (1992-97): ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఎనిమిదవ ప్రణాళిక ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ రంగాల వైఫల్యంతో అనగా ప్రభుత్వ రంగాలు ఎక్కువ నష్టాలతో, ఆశించిన పారిశ్రామిక ప్రగతికి దోహదము చేయడములేదనే నమ్మిక బలపడి ప్రైవేటు రంగమునకు ప్రభుత్వము ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగినది. ఎనిమిదవ ప్రణాళిక పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి లక్ష్యం 7.4 శాతము కాగా వాస్తవిక వృద్ధిరేటు 7.3 శాతముగా ఉన్నది.

తొమ్మిదవ ప్రణాళిక (1997-2002): ఈ ప్రణాళిక ప్రభుత్వ రంగంలోను, ప్రైవేటు రంగంలోను నాణ్యమైన అవస్థాపనా సౌకర్యాలను పెంచడం కొరకు నిశ్చయించినది. దేశం పెట్రోలియం ఉత్పత్తులను విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న దృష్ట్యా, ఈ ప్రణాళికా కాలంలో వీటి అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు.

9వ ప్రణాళిక పారిశ్రామిక వృద్ధిరేటు 8 శాతము లక్ష్యంగా నిర్ణయించగా వాస్తవంగా సాధించినది 5 శాతము మాత్రమే. దీనికి ముఖ్య కారణము ప్రపంచవ్యాప్తంగా సాధించిన తక్కువ వృద్ధిరేటు.

పదవ ప్రణాళిక (2002-07): తొమ్మిదవ ప్రణాళికలో ప్రైవేటు రంగం కార్యకలాపాల విస్తరణకు అధిక అవకాశం ఇచ్చినందున ప్రభుత్వం రంగం కేటాయింపులు తగ్గించడం జరిగింది. పదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో వార్షిక వృద్ధిరేటు పారిశ్రామిక రంగంలో 8.9 శాతము.

పదకొండవ ప్రణాళిక (2007-12): ఈ ప్రణాళికా కాలంలో పారిశ్రామిక వృద్ధిరేటు 10 నుంచి 11 శాతము ఉండాలని లక్ష్యంగా నిర్ణయించింది.

పన్నెండవ ప్రణాళిక (2012-17): రాబోవు 5 సంవత్సరాలలో మొత్తము పెట్టుబడి 50 లక్షల కోట్ల రూపాయలు. ||ప్రైవేటు రంగము 25 లక్షల కోట్ల పెట్టుబడి ఆశిస్తున్నది.
12వ ప్రణాళికలో 9.5 శాతము వృద్ధిని పారిశ్రామిక రంగము సాధించాలన్న తయారీ రంగము, విద్యుచ్ఛక్తి, గ్యాస్ మరియు నీటి సప్లయ్ రంగాలలో ఎక్కువ వృద్ధిరేటును సాధింపవలసి ఉన్నది.

ప్రశ్న 12.
భారత పారిశ్రామిక విత్తానికి గల మూలాధారాలను వివరింపుము.
జవాబు:
పారిశ్రామిక సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన విత్తాన్ని పారిశ్రామిక మూలధన విత్తం అంటారు. సమర్థవంతమైన విత్త విధానం దేశ పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమర్థవంతమైన విత్త సంస్థలుంటే ఆ దేశంలో అధిక మొత్తంలో పొదుపు సమీకరించి, ఆ పొదుపు మొత్తాన్ని లాభసాటిగా ఉపయోగించుకునే పరిశ్రమలను అందించటం జరుగుతుంది. పరిశ్రమలకు కావలసిన మూలధనం 2 రకాలుగా ఉంటుంది. 1) దీర్ఘకాలిక మూలధనం 2) స్వల్పకాలిక మూలధనం.

1) దీర్ఘకాలిక విత్త సంస్థలు: దీర్ఘకాలిక మూలధన అవసరాలైన స్థిర మూలధనము భవన నిర్మాణాలకు యంత్రాలు – యంత్ర పరికరాల కొనుగోలుకు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి మొదలైన వాటికై పరిశ్రమలకు ఋణ సహాయం అందించే ఋణ చెల్లింపు కాల వ్యవధి 5-7 సం॥ల నుండి 10-15 సం||లు లేదా ఆపైన ఉంటుంది. దీర్ఘకాలిక ద్రవ్య అవసరాలను మూలధన మార్కెట్ తీరుస్తుంది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

2) స్వల్పకాలిక విత్త సంస్థలు: స్వల్పకాలిక మూలధన అవసరమైన చర మూలధనం ముడి పదార్థాల కొనుగోలుకు, రవాణా ఖర్చులకు, శ్రామికులకు చెల్లించే వేతనాలకు, ఇంధన ఖర్చులకు, ప్రకటన ఖర్చులకు మొదలైన అవసరాల కోసం ఋణ సహాయం అందించే సంస్థలను స్వల్పకాలిక విత్త సంస్థలు అంటారు. ఈ సంస్థలిచ్చే స్వల్పకాలిక మూలధనాన్ని చర మూలధనాన్ని చర మూలధనం లేదా వర్కింగ్ కాపిటల్ అంటారు. సాధారణంగా స్వల్పకాలిక విత్త సంస్థల ఋణాలు చెల్లింపుల కాల వ్యవధి ఒక సంవత్సరం లేదా ఒక సంవత్సరానికి మించి ఉంటుంది. స్వల్పకాలిక విత్త అవసరాలను ద్రవ్య మార్కెట్ తీరుస్తుంది.

చర మూలధనం: చర మూలధనాన్ని తగిన హామీపై వాణిజ్య బ్యాంకులు పరిశ్రమలకు సమకూరుస్తాయి. స్థిర మూలధనం: స్థిర మూలధనాన్ని పారిశ్రామిక సంస్థలు అనేక మార్గాల ద్వారా సమీకరిస్తాయి. అవి:

  1. వాటాలు, ఋణపత్రాలు: పరిశ్రమలకు కావలసిన మూలధనంలో ఎక్కువ భాగం వాటాలు, మూలధన పత్రాలను ప్రత్యక్షంగా విక్రయించటం ద్వారా సమకూర్చుకుంటాయి.
  2. పబ్లిక్ డిపాజిట్లు: పరిశ్రమలు, ప్రజల నుండి డిపాజిట్లను తీసుకుంటుంది.
  3. ప్రైవేటు డిపాజిట్లు: మేనేజింగ్ ఏజెంట్లు, ప్రైవేట్ సంస్థలు మొదలగునవి సమకూర్చే ఋణాలను ప్రైవేట్ డిపాజిట్లు అంటారు.
  4. రిజర్వ్లు: పారిశ్రామిక సంస్థలు మూలధనపు రిజర్వ్ ు, తరుగుదల రిజర్వ్ ు మొదలగునవి ఏర్పరచుకొని వాటిని పెట్టుబడిగా వినియోగించుకుంటాయి.
  5. ఇన్సూరెన్సు కంపెనీలు: జీవితబీమా, సాధారణ బీమా కంపెనీలు కూడా పరిశ్రమలకు కావలసిన మూలధనాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సమకూరుస్తాయి.
  6. ప్రత్యేక ద్రవ్య సంస్థలు పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పడిన పారిశ్రామిక ద్రవ్య సహాయ సంస్థలు పరిశ్రమలకు మూలధనాన్ని సమకూరుస్తాయి.

భారత ప్రభుత్వం రెండవ ప్రణాళికా కాలం నుండి పారిశ్రామికీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. కొత్త పరిశ్రమల స్థాపన, ఉన్న పరిశ్రమల ఆధునికీకరణలకు భారీ ఎత్తున మూలధనం అవసరమవుతుంది. కనుక పరిశ్రమల మధ్యకాలిక, దీర్ఘకాలిక విత్త అవసరాలను తీర్చడానికి కింది సంస్థలు ముందుకు వచ్చాయి. అవి:

  1. భారత పారిశ్రామిక విత్త సంస్థ (IFCI)
  2. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (SIDC)
  3. భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ICIC)
  4. భారత జీవితబీమా సంస్థ (LIC)
  5. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు (IDBI)
  6. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (UTI)
  7. భారతీయ పారిశ్రామిక పునర్నిర్మాణ సంస్థ (IRCI)
  8. ఎక్స్పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ (EXIM Bank)
  9. సాధారణ బీమా సంస్థ (GIC)
  10. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (SIDBI)
  11. వెంచర్ కాపిటల్ ఫండ్
  12. జాతీయ గృహ నిర్మాణ సంస్థ (NHB)
  13. రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలు (SFC)

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత పారిశ్రామిక విత్త సంస్థ.
జవాబు:
భారతీయ పారిశ్రామిక విత్త సంస్థ 1948వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇది ప్రజల నుండి డిపాజిట్లను ఆకర్షిస్తుంది. ఈ విత్త సంస్థ బాండ్లు మరియు డిబెంచర్లను బహిరంగ మార్కెట్టులో విడుదల చేసే అధికారమున్నది.
విధులు:

  1. పారిశ్రామిక సంస్థలకు 25 సం॥ల కాల పరిమితి గల ఋణాలు, అడ్వాన్సులు ఇస్తుంది.
  2. ప్రత్యక్షంగా విత్త సహాయం అందించడం.
  3. పారిశ్రామిక సంస్థలు చేసే రుణాలకు హామీగా నిలబడుతుంది.
  4. పారిశ్రామిక సంస్థల షేర్లు, డిబెంచర్లను కొంటుంది.
  5. వాయిదా పద్ధతిలో ఋణాల చెల్లింపులకు హామీ ఇస్తుంది..
  6. ఔత్సాహిక ఉద్యమదారులకు ప్రోత్సాహకాలు, సాంకేతిక శిక్షణ ఇస్తుంది.
  7. విదేశీ సంస్థల నుండి విదేశీ కరెన్సీలో తీసుకున్న ఋణాలకు హామీ ఇస్తుంది.

ప్రశ్న 2.
భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ICICI).
జవాబు:
దీనిని 1955వ సంవత్సరంలో భారత ప్రభుత్వం, విదేశీ పెట్టుబడి వాటాదారులను అనుమతిస్తూ ప్రారంభించారు. ఇది మొదటి ప్రైవేట్ పెట్టుబడి లిమిటెడ్ కంపెనీగా ప్రారంభమయిన విత్త సహాయ సంస్థ. దీనిలో వాటాదారులు జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలు, అమెరికా, ఇంగ్లాండులోని ప్రైవేటు పెట్టుబడి సంస్థలు, భారత ప్రజలు 2002లో ICICIని (ICICI) బ్యాంకు లిమిటెడ్ విలీనం చేయడం వల్ల దేశంలో మొదటి యూనివర్సల్ బ్యాంకుగా ఆవిర్భవించింది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

విధులు:

  1. ప్రైవేటు రంగ భారీ పరిశ్రమలకు, దీర్ఘకాలిక రుణాలు అందజేయడం. ఈ ఋణాల మొత్తం రూపాయలలో, విదేశీ కరెన్సీలలో కూడా అందిస్తారు.
  2. ప్రైవేటు రంగ పెట్టుబడులకు, ఋణాలకు గ్యారంటీ ఇవ్వండి.
  3. పారిశ్రామిక సంస్థలు సేకరించే ఋణాలకు, డిబెంచర్లకు హామీదారుగా ఉండటం.
  4. పరిశ్రమలకు నిర్వహణ, సాంకేతిక సలహాలు అందించుట.
  5. పరిశ్రమల ఈక్విటీ మూలధనము, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టడం.
  6. ఋణ వాయిదాలకు, వడ్డీకి తీసుకున్న అప్పు, వాయిదాలలో అమ్మకాలు. తాత్కాలిక వ్యాపార మూలధనం మొదలగు వాటికి విత్త సలహాలనిస్తుంది.

ICICI ద్వారా ఋణాలిచ్చిన మొత్తము 1981లో 180 కోట్ల రూపాయలు, 2001వ సంవత్సరము నాటికి ఈ మొత్తము 31,660 కోట్ల రూపాయలకు పెరిగినది.

ప్రశ్న 3.
పారిశ్రామిక క్షేత్రాలు. [Mar ’17]
జవాబు:
పారిశ్రామిక క్షేత్రాలు చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అనేక చిన్న పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రదేశాన్ని పారిశ్రామిక క్షేత్రం / పారిశ్రామిక వాడ అని అంటారు. వీటిలో పరిశ్రమలకు కావలసిన స్థలం, భవనాలు, నీరు, విద్యుచ్ఛక్తి, రవాణా, సమాచార సౌకర్యాల వంటి వసతులు చౌకగా లభింపచేయబడిన పారిశ్రామిక క్షేత్రాల ఏర్పాటు లక్ష్యం. పై వసతులన్నింటినీ ఒకే ప్రదేశంలో లభింపచేయడం వలన ఉత్పాదక సంస్థల ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.

ప్రయోజనాలు:

  1. వీటిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న / పాక్షిక పట్టణాలలో ఏర్పాటు చేయటం వలన ఆ ప్రదేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశముంది.
  2. ప్రాంతీయంగా లభ్యమయ్యే వనరులను ఉపయోగించే అవకాశం ఏర్పడుతుంది
  3. ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశం ఉంటుంది.
  4. పారిశ్రామిక కేంద్రీకరణ వల్ల ఏర్పడే అంతర్గత, బహిర్గత ఆదాలు లభిస్తాయి.
  5. భారీ పరిశ్రమలున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తే ఇవి పెద్ద పరిశ్రమలకు అనుబంధ / అనుషంగిక పరిశ్రమలుగా ఉంటాయి.
  6. చిన్న పరిశ్రమలు ఇక్కడ లభించే వసతులను ఉపయోగించుకోవటం వలన ఉత్పత్తిని లాభసాటిగా మార్చుకునే వీలుంటుంది.

ప్రశ్న 4.
ప్రత్యేక ఆర్థికమండళ్ళు,
జవాబు:
భారత ప్రభుత్వము ఏప్రిల్ 2000 సంవత్సరమున ప్రత్యేక ఆర్థికమండళ్ళను ప్రకటించినది. ఈ విధానము త్వరిత ఆర్థికవృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలతో పాటు పన్ను రాయితీలు పొందుతూ కనీస నియంత్రణలకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏర్పాటు చేయబడినవి. మన దేశములో ప్రత్యేక ఆర్థికమండళ్ళను 2005లో ఏర్పాటు చేస్తూ చట్టమును రూపొందించిరి. 2006 నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

లక్ష్యాలు:

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను సృష్టించుట.
  2. వస్తు సేవల ఎగుమతులను పెంచుట.
  3. దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించుట.
  4. అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధిపరచటం.
  5. ఉద్యోగావకాశాలను కల్పించుట.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 5.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
జవాబు:
1991వ పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించింది. పరిశ్రమల ఆధునికీకరణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచటానికి, ఆర్థికాభివృద్ధికి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఋణరహిత పద్ధతిలో ఆర్థిక వనరుల లభ్యతకు అవకాశం కలిగించును. ఏ దేశంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంటుందో అచ్చట సాంకేతిక అభివృద్ధి పొందటానికి ఉపాధిని పెంచటానికి అవకాశం కలుగును. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రభుత్వ విధానం మరియు అధిక వ్యాపార అవకాశాలు మన దేశంలోకి విరివిగా వస్తున్నాయి. ప్రభుత్వము విదేశీ పెట్టుబడులపై నియంత్రణను తొలగించటం వల్ల అన్ని రంగాలకు ఈ పెట్టుబడులు విస్తరించినవి. రక్షణ ప్రభుత్వ రంగంలోని ఇంధన శుద్ధి కర్మాగారాలు Stock exchange, టెలికం, మందుల కంపెనీలు మొదలగు పరిశ్రమలలోకి ఈ పెట్టుబడులు రావటం వల్ల సత్వర ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలదు. మన కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగంలో అవస్థాపన నిర్మాణానికి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. అదే విధంగా నిర్మాణ రంగంలో కూడా 100% అనుమతించింది. పట్టణీకరణ షాపింగ్ మాల్స్ మరియు వ్యాపార కేంద్ర నిర్వహణకు 100% FDI అనుమతించింది.

ప్రశ్న 6.
జాతీయ పెట్టుబడి నిధి.
జవాబు:
భారత ప్రభుత్వం నవంబరు 3, 2005లో జాతీయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ అను రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణల మొత్తం రూపాయలు 1814.45 కోట్లతో ఈ పెట్టుబడి నిధిని ప్రారంభించింది.

లక్షణాలు:

  1. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిర్వహించబడును. సేకరించిన మొత్తము భారత సంఘటిత నిధిలో కలపకుండా ప్రత్యేకంగా ఉంటుంది.
  2. జాతీయ పెట్టుబడి నిధి శాశ్వత వినియోగ స్వభావం కలిగి ఉంటుంది.
  3. ప్రభుత్వానికి నిలకడతో కూడిన ఆర్థిక ఫలితాలను చేకూర్చే విధంగా. ఈ విధి నిర్వహణ జరుగుతుంది.
  4. ఈ నిధిపై వచ్చే వార్షిక ఆదాయంలో 75% విద్య, ఆరోగ్య ఉపాధి మొదలగు సామాజిక పధకాలైన జవహర్లాల్ నెహ్రూ పట్టణ రెన్యువల్ మిషన్, ఇందిరా ఆవాస్ యోజన మొదలగు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.

ప్రశ్న 7.
జాతీయ తయారీ విధాన లక్ష్యాలు.
జవాబు:
భారత ప్రభుత్వం జాతీయ తయారీ విధానాన్ని నవంబరు 4, 2011లో నూతన పారిశ్రామిక విధానం పేరుతో ప్రకటించడమైంది. ప్రైవేటు రంగానికి కోశపరమైన ప్రోత్సాహకాల్ని కల్పించి, యువతకు ఎక్కువ ఉద్యోగాల్ని పొందే విధంగా నైపుణ్యాలను అభివృద్ధి పరచుట ఈ తయారీ విధానము యొక్క లక్ష్యము. వ్యవసాయమునకు ఉపయోగపడని భూములలో జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్లను ఏర్పాటు చేయుట ఈ విధానము లక్ష్యము.
జాతీయ తయారీ విధానము
లక్ష్యాలు:

  1. తయారీ రంగంలో 12 నుండి 14 శాతము మాధ్యమిక వృద్ధిరేటును సాధించుట.
  2. తయారీ రంగంలో 2012 నాటికి 100 మిలియన్లు అదనపు ఉద్యోగాల కల్పన.
  3. తయారీ రంగంలో ఉపాధి అవకాశములను అందుకొనే విధంగా గ్రామీణ వలసదారులకు మరియు పట్టణ పేదరికానికి సరిపడినన్ని నైపుణ్యాలను కల్పించుట.
  4. స్థూల జాతీయోత్పత్తిలో ప్రస్తుతము 16 శాతముగా ఉన్న తయారీ రంగపు వాటాను 2022 నాటికి 25 శాతమునకు పెంచుట.
  5. తయారీ రంగంలో దేశీయ ఉత్పత్తి విలువలు మరియు సాంకేతిక పరిణతిని పెంపొందించుట.
  6. ప్రపంచ పోటీని తట్టుకొనే విధంగా భారత తయారీ రంగాన్ని అభివృద్ధి పరచుట.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 8.
జాతీయ పెట్టుబడి మరియు తయారీ మండళ్ళు.
జవాబు:

  1. తయారీ రంగానికి అనువైన 5000 హెక్టార్ల భూమిని ఎంపిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది.
  2. జాతీయ పెట్టుబడి మరియు తయారీ మండళ్ళు వ్యవహారాలను నిర్వహించేందుకు ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని ఏర్పాటు చేయాలి.
  3. జాతీయ మూలధనం మరియు తయారీ మండళ్ళకు అవస్థాపనా సౌకర్యాలైన రైలు, రోడ్డు, విమానాశ్రయాలు మొదలగునవి ప్రణాళిక మేరకు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడం.
  4. నీరు, విద్యుచ్ఛక్తి మరియు ఇతర అవస్థాపనా సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి.
  5. ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 20%కు మించకుండా ఆర్థిక సదుపాయ సౌకర్యానికి తగు నిధులను కేంద్ర ప్రభుత్వం కల్పించుట.
  6. జాతీయ తయారీ మండళ్ళు అంతర్గత అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కోసం బహుళ ఆర్థిక సదుపాయ సంస్థలు వాణిజ్యపరమైన ఋణ సదుపాయాన్ని కల్పించుట.

ప్రశ్న 9.
సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమలు.
జవాబు:
1) సూక్ష్మ పరిశ్రమలు: సూక్ష్మ పరిశ్రమలు యంత్రాలు, యంత్ర పరికరాలపై, సేవలపై 25 లక్షలలోపు పెట్టుబడి ఉన్న పరిశ్రమలు.

2) చిన్నతరహా పరిశ్రమలు: ఉత్పత్తిపై 25 లక్షల నుండి 5 కోట్లు, సేవలపై 10 లక్షల నుండి 2 కోట్లు పెట్టుబడి పెట్టే పరిశ్రమలు. ఇవి మరల మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  • గ్రామీణ పరిశ్రమలు: 10 లక్షలు అంతకంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలలో ఒక్కో శ్రామికునిపై సగటున గరిష్టంగా 15 వేలు పెట్టుబడి పెడితే వాటిని గ్రామీణ పరిశ్రమలంటారు.
  • కుటీర పరిశ్రమలు: నామమాత్రపు పెట్టుబడితో కుటుంబ సభ్యులతో కలిసి, శ్రమ సాంద్రత పద్ధతులు ద్వారా వస్తు సేవలను తయారుచేసే పరిశ్రమలను కుటీర పరిశ్రమ అంటారు.
  • చిన్నతరహా పరిశ్రమ: కోటి రూపాయల నుండి 5 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్న పరిశ్రమలు. 3) మధ్యతరహా పరిశ్రమలు: ఉత్పత్తిలో గరిష్ట పెట్టుబడి 35 కోట్ల నుండి 3 10 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్న పరిశ్రమలు.

ప్రశ్న 10.
భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు. [Mar ’16]
జవాబు:
1971వ సంవత్సరంలో ఖాయిలాపడ్డ పరిశ్రమలను పునరుజ్జీవింప జేయుటకు భారత పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పోరేషన్ (IRCI) ఏర్పాటు చేయబడినది. దీనిని 1985 నుండి భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకు (IRBI) గా మార్చడమైనది. పోటీ పరిస్థితులు, విత్త సంస్థల పునర్నిర్మాణం దృష్టిలో ఉంచుకొని IRBD ని 1997లో దీనిని భారతీయ పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకుగా పూర్తిస్థాయి పరపతి సంస్థగా మార్పు చేయడమైనది. ఇది పరిశ్రమల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఋణాలను అందిస్తున్నది.

భారతీయ పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు 2004 మార్చి నాటికి పారిశ్రామికాభివృద్ధికి మంజూరు చేసిన మొత్తం 14,050 కోట్ల రూపాయలలో చెల్లించినవి 13,396 కోట్ల రూపాయలు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI).
జవాబు:
భారత ప్రభుత్వం ఏప్రిల్ 1990లో భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకుకు అనుబంధంగా భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయడమైనది. భారతదేశంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధికి, విస్తరణకు ప్రధానమైన విత్త సహాయ సంస్థగా “భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు” ఏర్పడినది.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 2.
భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (IDBI).
జవాబు:
పరిశ్రమలకు దీర్ఘకాలిక పరపతిని అందించుటకు 1964వ సంవత్సరంలో భారతీయ పారిశ్రామికాభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయడమైంది. ఇది పరిశ్రమల ఆధునికీకరణకు, బహు విధాలుగా విస్తరించుటకు పరపతిని అందిస్తుంది.

ప్రశ్న 3.
రాష్ట్ర విత్త సహాయ సంస్థలు (SFIS).
జవాబు:
భారత పారిశ్రామిక విత్త సంస్థల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల దీర్ఘకాలిక అవసరాలను సక్రమంగా తీర్చలేకపోవడం వల్ల దీనిని సెప్టెంబర్ 18, 1951లో ఏర్పాటు చేసారు. ఇవి ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 4.
పెట్టుబడుల ఉపసంహరణ.
జవాబు:
వనరుల పెంపుదలకు మరియు విస్తృత ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించుటకు, ప్రభుత్వ రంగంలోని కొంత వాటాలను మ్యూచువల్ ఫండ్స్కు, విత్త సంస్థలకు, సాధారణ ప్రజలకు, శ్రామికులకు ఇవ్వటాన్ని పెట్టుబడుల ఉప సంహరణ అంటారు.

ప్రశ్న 5.
ఏకస్వామ్య నిర్బంధ వర్తక ఆవరణ చట్టం (MRTP Act).
జవాబు:
ఆర్థిక స్థోమత కేంద్రీకరణగాను, ఏకస్వామ్యాలను, అక్రమ వ్యాపార పద్ధతులను సమర్థవంతంగా నియంత్రించుటకు ఈ తీర్మానాన్ని MRTP చట్టానికి సవరణలు ప్రతిపాదించింది.

ప్రశ్న 6. ప్రత్యేక ఆర్థికమండళ్ళు, [Mar ’17]
జవాబు:
భారత ప్రభుత్వం ఏప్రిల్ 2000వ సం॥లో ప్రత్యేక ఆర్థికమండళ్ళను ప్రకటించింది. ఈ విధానము త్వరిత ఆర్థికాభివృద్ధికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలతో పాటు పన్ను రాయితీలు పొందుతూ కనీస నియంత్రణలకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఏర్పాటు చేయబడింది. ఈ చట్టం 2006 నుండి తన కార్యకలాపాలను నిర్వహించుచున్నది.

ప్రశ్న 7.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.
జవాబు:
1991 పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించింది. పరిశ్రమల-ఆధునికీకరణకు, సాంకేతిక పరిజ్ఞానం పెంచటానికి, ఆర్థికాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా ఋణరహిత పద్ధతిలో ఆర్థిక వనరుల లభ్యతకు అవకాశం కల్పించును.

ప్రశ్న 8.
పారిశ్రామిక క్షేత్రాలు.
జవాబు:
ఒక ప్రాంతంలో అనేక చిన్న పరిశ్రమలు కేంద్రీకృతం కావడాన్ని పారిశ్రామిక క్షేత్రాలు లేదా పారిశ్రామిక వాడలు అంటారు. చిన్న పరిశ్రమలకు అవసరమైన అవస్థాపనా సౌకర్యాలైన నీరు, రవాణా, విద్యుచ్ఛక్తి మొదలగునవి కల్పించి అనేక చిన్న పరిశ్రమల నిర్మాణం జరిగిన ప్రాంతాన్ని పారిశ్రామిక క్షేత్రాలు అంటారు.

ప్రశ్న 9. సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమలు.
జవాబు:
భారత ప్రభుత్వం అక్టోబర్ 2, 2006వ సం॥న సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల చట్టమును అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం సూక్ష్మ లేదా లఘు పరిశ్రమల విషయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టిన పెట్టుబడి 25 లక్షల రూ॥ నుంచి 5 కోట్ల వరకు పెట్టుబడి కలిగినవి. మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడి 5 నుంచి 10 కోట్ల మధ్య ఉండాలి.

AP Inter 2nd Year Economics Study Material Chapter 5 పారిశ్రామిక రంగం

ప్రశ్న 10.
భారతీయ పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ICICI).
జవాబు:
దీనిని 1995వ సం॥లో ప్రైవేట్ రంగంలో ప్రారంభించారు. దీర్ఘకాలిక ఋణాలను, మధ్యకాలిక ఋణాలను, స్వదేశీ, విదేశీ కరెన్సీలలో అందిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పరపతి సౌకర్యం కల్పిస్తుంది. పరిశ్రమల షేర్లకి, డిబెంచర్లకు పూచీదారుగా వ్యవహరిస్తుంది.

ప్రశ్న 11.
ప్రపంచీకరణ.
జవాబు:
ప్రపంచ దేశాల మధ్య రాజకీయ ఎల్లలు లేని ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి.