Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers.
AP Inter 2nd Year Economics Study Material 9th Lesson ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై ఒక వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
నైసర్గిక స్వరూపము: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 12°41′ మరియు 22° ల ఉత్తర అక్షాంశ రేఖలకు మరియు 77°, 80°40′ తూర్పు రేఖాంశాల మధ్య ఏర్పడి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ మరియు ఒడిషా, తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉంది. గోదావరి, కృష్ణా మరియు తుంగభద్ర వంటి ప్రధాన నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సహజ మరియు మానవ వనరులను సమృద్ధిగా కలిగి, పోటీ తత్వానికి కావల్సిన సామాజిక ఆర్థిక పరిపుష్టులను కలిగివుంది. మొత్తం 1,60,20,400 హెక్టార్ల భౌగోళిక భూభాగాన్ని కల్గిన భారతదేశంలోని 8వ పెద్ద రాష్ట్రంగా నిల్చింది. గుజరాత్ తర్వాత దేశంలో 974 కి.మీ. తీరప్రాంతము కల్గిన 2వ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మొత్తం భూభాగంలో 21.81 శాతము అంటే 34,93,475 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కలిగివుంది. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఎత్తైన పర్వత ప్రాంతాలు, మైదానాలు, మరొకవైపు తీరప్రాంతము మరియు పీఠభూములతో కూడిన బహువిధ భౌతిక లక్షణాలు కల్గి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ – లక్షణాలు: భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగములో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గి ఉండి, జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నది. మొత్తం భూభాగంలో 40.95% వ్యవసాయ యోగ్య భూమి, 21.81% అడవులను కల్గివున్నది.
1) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004 – 05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కనిపిస్తున్నది. 2004 – 05 లో R 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013 – 14 నాటికి 2,50,282 కోట్లుగా చేరుకొన్నది. 2011-12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివుంది.
2) తలసరి ఆదాయము: రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగిలిన సంవత్సరాలలో అధికంగా నమోదు అయ్యింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణానికి సూచికగా పరిగణింపవచ్చును. 2013-14 సం॥లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా ? 11,417 లుగా ఉంది.
3) జనాభా వృద్ధిరేటులో పోకడలు: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో పదవస్థానంలో నిల్చింది. మొదటి నుండి భారతదేశ జనాభా వృద్ధి రేటు కన్నా, రాష్ట్ర జనాభా దశాబ్ద వృద్ధి రేటు తక్కువగానే నమోదవుతున్నది.
మొదటిసారి 2011 దశకంలో రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధిరేటు 1% కన్నా తక్కువ (0.921)గా నమోదయింది.
4) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో రంగాల వాటా: దీనిలో వివిధ రంగాల వాటా వర్తమాన సంవత్సర ధరల ప్రకారం కాని, ఆధార సంవత్సర (2004-05) ధరల ప్రకారం కాని అనేక మార్పులకు గురవుతూ, వాటా ఆధిపత్యం వ్యవసాయం నుండి క్రమంగా సేవారంగానికి మారుతూ వస్తున్నది.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 2004-05 ఆర్థిక సంవత్సరంలో కౌ 1,36,767 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ రంగం R 40,232 కోట్లు సమకూర్చగా, గనులు, వస్తు తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సప్లయి మొదలగు ఉపరంగాలు కలిగిన పారిశ్రామిక రంగం 29,124 కోట్లు మరియు సేవారంగం 65,411 కోట్లను సమకూర్చడం జరిగింది. | 2013 – 14 సంవత్సర తాత్కాలిక అంచనాల ప్రకారం మొత్తం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 2004 – 05 ఆధార సంవత్సరం ధరలలో 58,390 కోట్లు, పారిశ్రామిక రంగం కౌ 51,838 కోట్లు మరియు సేవారంగము శౌ 1,40,054 కోట్లు సమకూర్చడం జరిగింది.
5) నిరుద్యోగిత రేటు: నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (NSS) అనే సంస్థ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఉద్యోగిత, నిరుద్యోగితలను అంచనా వేస్తుంది. ఇటీవలి (2011-12) సర్వే ప్రకారం నిరుద్యోగుల రేటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో, దేశ సగటు కన్నా ఎక్కువగా నమోదయింది. రాష్ట్రంలో ఈ రేటు 2004 – 05 వరకు పెరిగి ఆ తర్వాత మొత్తం దేశంలో లాగానే గ్రామీణ, పట్టణ ప్రాంతంలో తగ్గుతూ వస్తున్నది.
ప్రతి వెయ్యిమంది శ్రామిక శక్తిలో నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్యను “నిరుద్యోగిత రేటు” అంటారు. 2011 – 12 సంవత్సరానికి NSS వారు వేసిన 68వ రౌండు అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత రేటు (12%), భారత గ్రామీణ నిరుద్యోగిత రేటు (17%) కన్నా తక్కువగా ఉంది. కాని పట్టణ నిరుద్యోగితా రేటు విషయంలో రాష్ట్ర నిరుద్యోగిత రేటు (43%), దేశ సగటు కన్నా (34%) ఎక్కువగా నమోదయ్యింది.
6) పేదరికము: ఆంధ్రప్రదేశ్ వివిధ నూతన పేదరిక నిర్మూలనా పథకాలకు రూపొందించడంలో అగ్రగామిగా ఉంది. సబ్సిడీలు, మహిళా సాధికారత కోసం ఇందిర క్రాంతి పథం (IKP), పేదలకు గృహ నిర్మాణం కోసం రాజీవ్ స్వగృహ పథకం, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్యశ్రీ వంటి వైద్య పథకాలు మొదలైనవి రాష్ట్రంలో అమలవుతున్నాయి.
ప్రశ్న 2.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) అనగానేమి ? ఆంధ్రప్రదేశ్ (SGDP) సరళిని పరిశీలించండి.
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.
రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013-14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో 3 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. – 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి నిలకడ (2004 – 05) ధరలలో
ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో జనాభా మరియు తలసరి ఆదా మీ వృజ్ఞ పోకడలను తెలపండి.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417 లుగా ఉంది. జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత.
జవాబు:
వ్యవసాయ రంగం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తున్నది. మన రాష్ట్రం “Bejeweled rice bowl of India” గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయాన్నే తమ ప్రధాన వృత్తిగా భావిస్తున్నారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో కూడా వ్యవసాయరంగ వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.
1) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) లో వాటా: భారత ఆర్థిక వ్యవస్థలో మాదిరే రాష్ట్ర GSDPలో కూడా వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతున్నప్పటికీ దాని ప్రాధాన్యత నిరర్ధకమైనదిగా భావించరాదు. 2004 – 05 మరియు 2013 – 14 సం||లలో రాష్ట్ర GSDPలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల వాటాను ఇతర రంగాల వాటాను ఈ క్రింది పట్టికలో చూపబడినది.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం, మిగతా రంగాల వాటా (%)
మూలం: ఆంధ్రప్రదేశ్ గణాంక సూచిక 2014, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేజీ నెం. 233 మరియు 234.
గమనిక: సంఖ్యలు 2004-05 నిలకడ ధరలలో
పై పట్టిక మరియు చిత్రమును గమనిస్తే రాష్ట్ర GSDPలో వ్యవసాయరంగ వాటా క్రమంగా తగ్గుతూ, ఆ మేరకు సేవారంగం వాటా పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. పారిశ్రామికరంగ వాటా, పరిశీలనలోని కాలాలలో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నది. 2007వ సంవత్సరం నాటికి సేవారంగం వాటా 50 శాతం స్థాయిని దాటితే 2010-11 నాటికి వ్యవసాయరంగ వాటా 25 శాతం కన్నా దిగువకు పడిపోయింది. అయితే ఇప్పటికీ రాష్ట్ర వ్యవసాయరంగ వాటా జాతీయ వ్యవసాయం వాటా కన్నా ఎక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ కూడా రాష్ట్ర GSDPలో వ్యవసాయ రంగం 1/5 వంతు వాటాను సమకూరుస్తుంది.
2) ఉపాధి కల్పన: రాష్ట్రంలోని అత్యధిక జనాభాకు వ్యవసాయమే ప్రధాన ఉపాధి మార్గము. సగాని కన్నా ఎక్కువమంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి పనిచేస్తున్నారు. పారిశ్రామిక, సేవారంగాలు ఎంతగా అభివృద్ధి జరిగినా, ఉపాధి కల్పనలోను, ప్రధాన ఆదాయ వనరుగా వ్యవసాయం తన ప్రాధాన్యతను కొనసాగిస్తూ ఉన్నది.
2011 జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయ రంగం అటు వ్యవసాయదారులకు, ఇటు వ్యవసాయ కూలీలకు కలిపి మొత్తం 62.36 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇప్పటికినీ దేశం మరియు రాష్ట్రాలలో 50 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యవసాయమే ప్రధాన ఉపాధి మూలం.
3) భూమిని ఉపయోగించే తీరు: ఆంధ్రప్రదేశ్ 160.20 లక్షల హెక్టార్ల మొత్తం భూభాగంతో భారతదేశంలో ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. రాష్ట్రంలో భూమిని ఉపయోగిస్తున్న తీరు స్వల్ప మార్పులతో చాలాకాలంగా దాదాపు యధాతథంగా కొనసాగుతూ ఉంది.
4) ఆహార మరియు ఆహారేతర పంటల క్రింద ఉన్న భూమి: రాష్ట్రంలో పండే పంటలను స్థూలంగా ఆహార మరియు ఆహారేతర పంటలుగా విభజించవచ్చు. అన్ని తృణధాన్యాలు, పప్పుదినుసులు, వంటనూనెలు మొదలైనవి ఆహారపంటల క్రిందకు వస్తే, పసుపు, ప్రత్తి, చెరకు మొదలైనవి ఆహారేతర లేక వాణిజ్య పంటల క్రిందకు వస్తాయి. మొత్తం భూభాగాన్ని ఆహార, ఆహారేతర పంటల కోసం కేటాయించిన తీరునుబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయ వాణిజ్యీకరణ ఏ మేరకు జరిగిందో అంచనా వేయవచ్చు. 2013-14 సం॥లో మొత్తం 81.28 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 54. 92 లక్షల హెక్టార్లు అంటే 67.57 శాతం భూమిని ఆహారపంటల ఉత్పత్తికి కేటాయించడం జరిగింది.
వాణిజ్య పంటలను 32 శాతం వ్యవసాయ భూమిలో పండించడం జరుగుతున్నది. 2013-14లో ఆహారేతర పంటలను 32.43 లక్షల హెక్టార్లలో పండించడం జరుగుతుంది.
5) ప్రధాన పంటల ఉత్పాదకత: సగటున ఒక హెక్టారు భూమిలో పండిన పంటను ఉత్పాదకత అంటారు. ప్రధాన పంటల ఉత్పాదకత 2010-11 మరియు 2013-14 సం॥లలో మిశ్రమ సరళిని కలిగివున్నది.
వరి ఉత్పాదకత ఒక హెక్టారుకో గరిష్టంగా నెల్లూరులోను (4,051) మరియు కర్నూలులో (3,670) ఉంది. గోధుమ ఉత్పత్తి రాష్ట్రంలో అత్యల్పంగా ఉంది.
6) నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపివున్న మొత్తం నీటి పరిమాణం | 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి.
2013 – 14 సం||నికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం, 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగివున్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువుల ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
జిల్లాలను పరిశీలిస్తే 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం॥కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.
ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.
సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు, 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.
రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 3,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.
పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.
ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం ప్రాధాన్యత.
జవాబు:
పారిశ్రామిక రంగం: ఏ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్నైనా పారిశ్రామిక పాత్రనే నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాలైన సహజవనరులు, దక్షిణ భారతదేశంలోనే పొడవైన సముద్ర తీర ప్రాంతము, అవస్థాపన సౌకర్యాలు, కమ్యూనికేషన్లు, సాంకేతిక నిపుణులు మరియు విస్తృత మార్కెట్ అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి.
ఎ) రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పారిశ్రామికరంగ వాటా: రాష్ట్ర (GSDP) లో ఆధార సం||పు 2004 – 05 ధరల ప్రకారం వివిధ సంవత్సరాలలో పారిశ్రామికరంగ వాటాను క్రింది పట్టిక తెలుపుతుంది.
రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పరిశ్రమరంగ వాటా
నిరపేక్షికంగా రాష్ట్ర GSDPలో పారిశ్రామిక రంగ వాటా క్రమంగా పెరుగుతున్నది. 2004 – 05 ఆధార సం॥లో ఈ రంగ మొత్తం విలువ 7 29,124 కోట్లు మాత్రమే ఉండగా, ఒక్క 2008-09 సంవత్సరాన్ని మినహాయిస్తే 2013 – 14 వరకు నిరంతరంగా పెరిగి ఔ 51,838 కోట్లకు చేరుకుంది. 2007-08లో 23.7 శాతం ఉన్న ఈ రంగ వాటా 2013-14 నాటికి 20.7 శాతానికి తగ్గిపోయింది.
బి) ఉపాధి అవకాశాల కల్పన: ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఒక రంగం యొక్క వాటాను ఆ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న శ్రామికుల సంఖ్యను ఒక సూచికగా భావించి చెప్పవచ్చు. దేశంలోను, రాష్ట్రంలోను మొదటి నుండి పారిశ్రామిక రంగం కల్పిస్తున్న ఉపాధి శాతములో చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. 2011 నాటికి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పారిశ్రామిక రంగం దాదాపు 21 శాతము మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది.
సి) పరిశ్రమలకు ప్రణాళికా కేటాయింపులు: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికై ప్రణాళికలలో చెప్పుకోదగ్గ కేటాయింపులే జరిగాయి. 12వ ప్రణాళికలోని మొదటి వార్షిక ప్రణాళిక 2012-13లో మొత్తం ప్రణాళిక వ్యయం 48,935 కోట్ల రూపాయలలో 784 కోట్ల రూపాయలు పరిశ్రమలు మరియు ఖనిజ రంగానికి కేటాయించారు.
డి) పారిశ్రామిక ఉత్పత్తి సూచిక: పారిశ్రామిక ప్రగతిని కొలిచే ఒక సాధనమే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP). ఒక కాలంలో జరిగిన భౌతిక పారిశ్రామిక ఉత్పత్తి, అంతకుముందు కాలం కన్నా సాపేక్షికంగా ఎంత మార్పు జరిగిందో ఇది తెలుపుతుంది. రాష్ట్ర IIP విలువ 2004-05 ఆధార సంవత్సర ఉత్పత్తి ప్రకారం ముదింపు చేయబడుతుంది. ఇ) రిజిస్టరు అయిన ఫ్యాక్టరీల సంఖ్య: వివిధ సెకన్ల ప్రకారం రిజిస్టరు అయిన పనిచేసే ఫ్యాక్టరీల సంఖ్యను చూపడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో పని చేయుచున్న ఫ్యాక్టరీల సంఖ్య
పట్టిక ప్రకారం 2m(i), 2m (ii) సెక్షన్ల ప్రకారం నమోదు అయిన ఫ్యాక్టరీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2008 – 09లో 9,972 గా ఉన్నా ఈ ఫ్యాక్టరీల సంఖ్య 2011 – 12 నాటికి 11,195కు పెరిగాయి. 2010 – 11 మరియు 2011 – 12 మధ్య ఒక సంవత్సర కాలంలో కొత్తగా 837 ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి.
ఎఫ్) ఇతర ముఖ్యాంశాలు:
- రాష్ట్రం నుండి వెళ్ళే పారిశ్రామిక ఎగుమతుల విలువ క్రమంగా పెరుగుతున్నది. 2012-13 సంవత్సరంలో దీని విలువ 1,29,001 కోట్ల రూపాయలు.
- దేశంలోని మొత్తం ఖాయిలా పడ్డ పరిశ్రమలో, రాష్ట్రంలోని ఖాయిలా పరిశ్రమలు 10.2 శాతం మరియు వీటి విషయంలో రాష్ట్రం నాల్గవ స్థానంలో ఉంది.
- ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపనా కార్పొరేషన్ (APIIC) రాష్ట్రంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) లకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది. పూర్తిస్థాయి SEZ విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
- మార్చి, 2014 నాటికి రాష్ట్రంలో 32 SEZలు ఉండగా అందులో 10IT రంగానికి, 6 విభిన్న వస్తువులకు, 4 ఔషధాలకు, 2 బయోటిక్, 10 రంగ ప్రాధాన్యత గల SEZలు ఉన్నాయి.
ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రాధాన్యత.
జవాబు:
సేవా మరియు అవస్థాపన రంగాలు: భారతదేశంలో వలే రాష్ట్రంలో కూడా సేవారంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పారిశ్రామిక రంగం స్థిరంగా ఉండడం వల్ల వ్యవసాయ రంగం కోల్పోతున్న రేటులో, సేవా రంగం అభివృద్ధి సాధిస్తున్నది.
ఎ) రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వాటా: 2004-05 సంవత్సరంలో రాష్ట్ర (GSDP)లో 48.54 శాతం తోను, 2013 -14లో ఇంకా పెరిగి 55.99 శాతంలో సేవా రంగం అతి ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నది. 2004 -05 సంవత్సరంలో 3 64,411 కోట్లు, రాష్ట్ర GSDPకి సమకూర్చినది ఈ రంగమే. ఈ రంగం 2013-14 నాటికి ఏకంగా కౌ 1,40,054 కోట్లు ఆర్జించి పెట్టింది. అంటే రాష్ట్ర GSDPలో సగ భాగానికన్నా ఎక్కువ ఒక సేవారంగమే సమకూరుస్తుంది.
బి) ఉపాధి కల్పన: రాష్ట్రంలో సేవారంగం ఉపాధి కల్పనలో మూడు రంగాలలో రెండవ స్థానంలో ఉండి, దాదాపు 1/4 వంతు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. రాష్ట్రంలో 24.5 శాతం శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తున్నది. ఇది జాతీయ సగటున 25.4 శాతానికి దాదాపు సమానము.
సి) నీటిపారుదల: ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా సాగునీటి అభివృద్ధి, నిర్వహణ అత్యంత ప్రాధాన్యతను కలిగివుంది. రాష్ట్రం ప్రధాన నదీ వనరులైన గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార వంటి ప్రముఖ నదులను కలిగి “నదుల రాష్ట్రం” గా ‘గా పిలువబడుటకు అన్ని విధాల అర్హతలు కలిగి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా 52 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో 54 భారీ, మధ్యతరహా, ఇతర ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్ట్ ఒక బహుళార్థక సాగునీటి ప్రాజెక్ట్ గా చేపట్టబడి ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే “జాతీయ ప్రాజెక్ట్ హోదా” ను పొందినది.
పట్టిసీమ ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు గోదావరి నదిలోని మిగులు జలాలు 80 (tmcft) లు దాకా, పట్టిసీమ ద్వారా శ్రీశైలం నుండి రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు తరలించే యోచనతో రూపొందించబడినది.
ప్రభుత్వం రాష్ట్రంలో బిందుసేద్య విధానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రైతులకు బిందు సేద్య పరికరాలను సబ్సిడీ రేట్లకే అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూక్ష్మ నీటిపారుదల పద్దతి విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉండి, ప్రస్తుతం 5.63 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది.
డి) విద్యుచ్ఛక్తి: 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సప్లయిని ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,717 MWల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగివుంది. ఇందులో 70 శాతం థర్మల్ మరియు 21 శాతం జలవనరుల ద్వారా సాధిస్తున్నది.
సింహాద్రి STPS, దామోదరం సంజీవయ్య TPS, రాయలసీమ TPS మొదలైనవి రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ విద్యుత్ కేంద్రాలు, లాంకో కొండపల్లి, స్పెక్ట్రం, కోనసీమ కంబైన్డ్ సైకిల్ విద్యుత్ సంస్థ మొదలైనవి గ్యాస్ ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, అలాగే శ్రీశైలం, టిబి డ్యామ్, పోలవరం, పెన్నహోబిలం, సీలేరు మొదలైనవి ప్రధాన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు.
ఇవేకాకుండా అనంతపురం జిల్లాలోని కదిరి వద్ద అమృత్ సౌర విద్యుత్ ప్లాంట్లు, అనంతపురం జిల్లాలోనే స్థాపించబడిన రామగిరి, నర్మద పవన విద్యుత్ ప్లాంట్లు మరియు పుత్లూరు ప్లాంట్లు పవన ఆధారిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి.
ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల వసతులను తెలపండి.
జవాబు:
నీటిపారుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులను ప్రసాదింపబడింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపి మొత్తం నీటి పరిమాణం 2,746 TMC లు. కాని ఇప్పటివరకు ఉపయోగించుకుంటున్న నీరు కేవలం 1,753 TMC లు. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు, రిజర్వాయర్లు కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలు తీరుస్తాయి.
2013 – 14 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి 46 శాతం. 65.61 లక్షల సాగుభూమిలో 30.14 లక్షల హెక్టార్లు నీటిపారుదలను కలిగి ఉన్నాయి. నీటిపారుదల కలిగిన నికర సాగుభూమిలో 48 శాతం కాలువలు (canals), చెరువులు ద్వారా 9 శాతం మరియు అన్ని రకాల బావుల ద్వారా 40 శాతం భూమి నీటిపారుదలను పొందినది.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మూలాలు (హెక్టార్లలో)
జిల్లాలను పరిశీలిస్తే, 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగుభూమితో అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5 శాతంతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగుభూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సం||కి విజయనగరం మరియు అనంతపురంలు రాష్ట్రం మొత్తం మీద అతితక్కువ నీటిపారుదల భూమిని కలిగివున్నాయి.
ఇతర అంశాలు:
రాష్ట్రంలో సగటు భూకమతము 1.6 హెక్టార్లు. మొత్తం రైతుల సంఖ్యలో ఉపాంత రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పెద్ద రైతుల విషయంలో సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది.
సంస్థాగత పరపతిలో 70 శాతం వాణిజ్య బ్యాంకులు. 20 శాతం సహకార బ్యాంకులు మరియు 11 శాతం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పరపతిని అందిస్తున్నాయి.
వ్యవసాయ మార్కెటింగ్ లోని లోపాలను సరిచేయడానికి “రైతుబంధు పథకం”, DAATT సెంటర్లు, కంప్యూటరీకరణ, సహకార మార్కెటింగ్ మొదలైన అనేక చర్యలు చేపట్టడం జరిగింది.
రాష్ట్రం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు మొదలైనవాటి ఉత్పత్తి ద్వారా 73,000 కోట్లు అంటే భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తి విలువలో 50 శాతం ఆర్జించి పెడుతున్నది.
పట్టు పరిశ్రమలోను, పట్టు ఉత్పత్తిలోను రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.
ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లోని రవాణా సౌకర్యాలను వివరింపుము.
జవాబు:
1) రైల్వేలు: ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తూనే, మరో ప్రక్క రాష్ట్రంలో పారిశ్రామిక మరియు పర్యాటక రంగ వృద్ధికి తోడ్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దక్షిణమధ్య రైల్వే, దక్షిణ రైల్వే, తూర్పు తీర రైల్వే |అనే మూడు రైల్వే జోన్ల సేవలను పొందుతున్నది. రాష్ట్రంలో మొత్తం 444 రైల్వేస్టేషన్లు మరియు 3,355 కి.మీ. మేర నెట్వర్క్ కలిగివుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ మనవి, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉంది.
ప్రపంచంలోనే అత్యధిక బ్రాడ్ గేజ్ ట్రాకులు విశాఖపట్టణం నుండి అనంతగిరిని కలుపుతూ తూర్పు కనుమల గుండా సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రఖ్యాతమైనదే కాక అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్గా దేశంలోనే గుర్తింపు పొందింది.
2) రోడ్డు మార్గాలు: రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపన సౌకర్యము కూడా. ఆర్థిక వ్యవస్థలో రోడ్ల శాస్త్రీయమైన అభివృద్ధి అనునది ఆర్థికవృద్ధికి ఒక ప్రాథమిక అవసరమేకాక, ఆర్థిక వృద్ధిని వేగవంతం కూడా చేయగలదు. దేశంలోని వివిధ రవాణా వ్యవస్థలన్నింటిలో ఒక్క రోడ్డు మార్గాలే 80 |శాతం ప్రయాణికుల, వస్తు రవాణా అవసరాలు తీరుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ 42,511 కి.మీ.ల రాష్ట్ర రహదారులు, 3,144 కి.మీ.ల జాతీయ రహదార్లు, 1,01,484 కి.మీ. జిల్లా రోడ్లను కలుపుకొని మొత్తం 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగివుంది. రాష్ట్రంలోని రోడ్లను 1998లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థ (APRDC) నే నిర్వహణ బాధ్యత కలిగివుంది.
3) పౌర విమానయానము: రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టను మెట్రోయేతర ఎయిర్పోర్టుగా ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో అవగాహన తాఖీదు (MOU) కుదుర్చుకున్నది. తిరుపతి ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ప్రమాణాల అనుసారం ఆధునీకరించుటకు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా (AAI) ప్రతిపాదించినది. అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కూడా (AAI) ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది.
4) సముద్ర ఓడరేవులు: భారతదేశంలో గుజరాత్ తర్వాత 972 కి.మీ.ల సముద్రతీర ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. రేవులు ఎగుమతులు, దిగుమతులు, అంతర్జాతీయ వ్యాపారం, ఓడల రిపేర్లు, పర్యాటకం, చేపల వేట మరియు జల క్రీడల వంటి సముద్ర కార్యకలాపాల వృద్ధికి దోహదం చేస్తాయి. రేవులు వాణిజ్యానికి సింహద్వారము వంటివి. విశాఖపట్టణం ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా, దేశంలోనే సరుకు రవాణా విషయంలో అతిపెద్ద రేవులలో ఒకటి. విశాఖపట్టణం నుండి అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్కి ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు.
ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక అభివృద్ధిలో ఐ.టి. (IT) రంగ ప్రాధాన్యతను తెలుపుము.
జవాబు:
IT/సాఫ్ట్వేర్ పరిశ్రమ: సాఫ్ట్వేర్ పరిశ్రమ సమాచార సాంకేతిక రంగంలోని ప్రధాన అంశము. సాఫ్ట్వేర్ పరిశ్రమలో కంప్యూటర్ సాఫ్ట్వేరు సంబంధించిన అభివృద్ధి చేయబడే వ్యాపారం, నిర్వహణ మరియు ముద్రణ అనే అంశాలు కలిసి ఇవి ఏ వ్యాపార రూపంలోనైనా ఉండవచ్చు. ఈ రంగం 1960 మొదట్లో మొదలై 1970 దశకంలో బాగా విస్తరించింది. ఈ పరిశ్రమలో ముఖ్యంగా 5 రంగాలు ఉన్నాయి. అవి:
1. సాఫ్ట్వేర్ అవస్థాపన రంగం 2. ఉద్యమిత్వ సాఫ్ట్వేర్ 3. రక్షణాత్మక సాఫ్ట్వేర్ 4. పరిశ్రమ పరిమిత సాఫ్ట్వేర్ 5.ప్రత్యేక కంపెనీ క్లయింట్గా గల సాఫ్ట్వేర్
రాష్ట్ర విభజన తర్వాత 2014, జూన్ 2న నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర ఐ.టి. టర్నోవర్లో 2 శాతం మరియు కేవలము 1.8 శాతం ఉద్యోగ అవకాశాలను మాత్రమే కలిగివుంది.
ఆంధ్రప్రదేశ్ భారతదేశ హైటెక్ రాజధాని, భారత సిలికాన్ లోయగా గుర్తింపు పొందినది. కాని విభజనానంతరం వైజాగ్ నగరం ఐ.టి. సెంటర్ గా అభివృద్ధి చెందుటకు అన్ని అనుకూల అంశాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్టణం రాష్ట్ర నూతన ఐ.టి. రాజధాని అవుతుంది.
- ప్రతి జిల్లా కేంద్రము ఒక ఐ.టి. పార్కును కలిగివుంటుంది.
- రాష్ట్రం మొత్తం ఎగుమతుల్లో ఐ.టి. రంగం 38.22 శాతం వాటా కలిగివుంది (ఉమ్మడి రాష్ట్రం).
- 2013 నాటికి ఐ.టి. రంగం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
- 2013లో ఈ రంగం మొత్తం ఎగుమతుల విలువ సుమారు 36 వేల కోట్ల రూపాయలు.
- ఐ.టి. రంగం ప్రస్తుతం ఉన్న 36,000 కోట్ల రూపాయల స్థితి నుండి 2017 నాటికి 1,50,000 కోట్ల స్థాయికి చేరగలదని అంచనా.
- రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి. మరియు బి.టి. (IT & BT)లను సమన్వయం చేసే యోచనలో ఉంది.
ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ సంక్షేమ పథకాలను పరిశీలింపుము.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ – సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ క్రింది పట్టికలో పొందుపరచడమైనది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ వర్గాల వారి సంక్షేమ పథకాలు
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP).
జవాబు:
భారతదేశములో ఆంధ్రప్రదేశ్ వైశాల్యము మరియు జనాభా దృష్ట్యా రాష్ట్రాల్లో ఒకటిగా నిల్చింది. దేశ భూభాగంలో 4.96 శాతం భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్రము 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10 శాతం కల్గివుండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రముగాను ఉన్నది. మొత్తం భూభాగములో 40.95 శాతం వ్యవసాయ యోగ్య భూమి, 21.81 శాతం అడవులను కల్గివున్నది.
రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి, వాటి వృద్ధి రేటులతోపాటు రాష్ట్ర, దేశ స్థూల ఉత్పత్తి విలువ 2004-05 మరియు 2013 – 14ల మధ్య దాదాపు రెట్టింపు అయినట్లుగా విశదమవుతున్నది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల ధోరణి కన్పిస్తున్నది. 2004-05లో ఔ 1,34,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఉత్పత్తి విలువ 2013-14 నాటికి 2,50,282 కోట్లకు చేరుకొన్నది. 2011 – 12 తర్వాత రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జాతీయ సగటు GDP పెరుగుదల కన్నా అధికంగా నమోదు అయినది. రాష్ట్ర GSDP భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.36 శాతాన్ని కల్గివున్నది.
ప్రశ్న 2.
రాష్ట్ర తలసరి ఆదాయం.
జవాబు:
రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ సగటు తలసరి ఆదాయం కన్నా 2, 3 సం॥లలో తప్ప మిగతా సం॥లలో అధికంగా నమోదు అయింది. దీనిని రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణ సూచికగా చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం మరియు భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో) రూ.లలో
2013 – 14 సం||లో రాష్ట్ర, దేశ తలసరి ఆదాయాల మధ్య తేడా కౌ 11,417లుగా ఉంది.
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్
దేశంలో 10వ స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటు (శాతంలో)
ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్లో వృత్తివారీ శ్రమ విభజన. [Mar ’17]
జవాబు:
ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఆర్థికాభివృద్ధి స్థాయిని ఆ ఆర్థిక వ్యవస్థలోని వృత్తివారి శ్రమ విభజన తీరు నిర్ణయిస్తుంది. ఏ ఆర్థిక వ్యవస్థనైనా వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాలుగా విభజించవచ్చు. జనాభాను, వారు చేసే వృత్తులు లేక పనులు ఆధారంగా విభజించడాన్ని వృత్తివారీ శ్రమ విభజన లేక వృత్తివారీ జనాభా విభజన అంటారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు కలిసి మొత్తంగా 1,43,92,736 మంది అనగా 62.36 శాతము వ్యవసాయ రంగాలలో ఉపాధి పొందుతున్నారు.
అదే విధంగా గృహ పరిశ్రమలలో పనిచేసే శ్రామికులు 6,62,608 మంది అంటే మొత్తం శ్రామిక సంఖ్యలో కేవలం 2.87 శాతము ఉన్నారు. పారిశ్రామిక మరియు సేవా రంగాల కార్యకలాపాలు పరస్పరం పూరకంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు రంగాలలో మొత్తం 80,25,620 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే మొత్తం కార్మిక సంఖ్యలో
ఇది 34.77 శాతము.
ఇప్పటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న కార్మిక సంఖ్య ఎక్కువగా ఉంది. సేవారంగం రెండవ స్థానాన్ని కలిగి, వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ద్వితీయ లేక పారిశ్రామికరంగ వాటా రాష్ట్రంలో సంవత్సరాలుగా స్థిరంగా కొనసాగుతున్నది.
ప్రశ్న 4.
రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణ అంశాలు. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పర్యావరణ పరిస్థితులను కలిగి ఉంది. దీని కోస్తా తీర ప్రాంతము పొడవు దృష్ట్యా భారతదేశంలోనే రెండవది మరియు దక్షిణ భారత రాష్ట్రాలలో మొదటిది. ఇందులోని జీవ వైవిధ్యం, విభిన్నమైన జీవ జాతులను కలిగి దేశంలోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకొన్నది. ఈ అమూల్య పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు:
1) పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు: సామాజిక అటవీ నిర్వహణ (CFM), జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికా కార్యక్రమం (NRCP) మరియు జాతీయ వృక్ష సంరక్షణ కార్యక్రమము (NAP) మొదలైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.
2) చెట్టు – నీరు కార్యక్రమము: 2015లో రాష్ట్ర ప్రభుత్వం వృక్ష సంరక్షణ మరియు నీటి పరిరక్షణ కోసం ‘నీరు – చెట్టు’ పథకాన్ని అన్ని జిల్లాలో ఆరంభించెను. ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి, కనీసం 90 శాతం మొక్కలు బ్రతికేటట్లు పలు చర్యలను తీసుకోవడం జరుగుతుంది.
3) సాంప్రదాయేతర శక్తి: ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వారు రాష్ట్రంలో సోలార్ మరియు పవన విద్యుత్ శక్తి మూలాలను వృద్ధి చెయ్యడం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని ఒక పెద్ద “గ్రీన్ ఎనర్జి కారిడార్” గా మార్చుటకు నిర్ణయించిరి.
4) వన మహోత్సవం: 2013లో అటవీశాఖ వారు “రెండు మిలియన్ల మొక్కలను నాటే ఉద్దేశ్యంతో 64వ వన మహోత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవములు అదే సమయంలో జిల్లా కేంద్రాలలోను జరుపుకున్నారు. సామాజిక అటవీ కార్యక్రమంలో ఇది ఒక భాగము.
5) వన్యమృగ సంరక్షణ: మొక్కలు, వృక్షాలు, జంతువులు మరియు పర్యావరణ వ్యవస్థలతో కూడిన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుటకు ప్రభుత్వం 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు 3 జాతీయ పార్కులతో సహా 16 ప్రాంతాలను వన్యప్రాణి రక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య సంరక్షణ సొసైటి (BIOSAP)ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల బాగోగులు చూసే బాధ్యతను అప్పగించారు. శ్రీశైలం జీవావరణ రిజర్వుని గుర్తించి నిర్వహిస్తున్నారు. స్థానిక కమిటీలతో పాటు ప్రభుత్వ కమిటీలు కూడా జీవావరణ నిర్వహణ ప్రణాళిక అంతిమ ఆమోదం కోసం కృషి చేస్తున్నాయి.
6) ప్రాజెక్ట్ టైగర్: మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.
7) పర్యావరణ విద్య: ప్రజలను ప్రకృతి పరిరక్షణపై జాగృతం చేయడానికి రాష్ట్రంలోని చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్కుల వద్ద ప్రదర్శనశాలలు, వ్రాయబడిన బోర్డుల ప్రదర్శన, మిని ఆడిటోరియంలు మరియు లైబ్రరీల ద్వారా పర్యావరణ విద్యపై అవగాహన పెంచుతున్నారు.
ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ ప్రాధాన్యత. [Mar ’16]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ “భారతదేశ కోహినూర్” గా మరియు పర్యాటకం విషయంలో దేశంలోనే గమ్యస్థాన రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప రాజవంశాలకు, పవిత్ర దేవాలయాలకు, లోహపూత బొమ్మలు, నేతపని వస్తువులు, అమూల్య పాండిత్యము, కూచిపూడి నాట్యం వంటి మహోన్నత కళలకు గుర్తింపు పొందినది. రాష్ట్రం దాదాపు 300 పర్యాటక ప్రాంతాలలో అసంఖ్యాకంగా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆదర్శిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) అనునది రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ. ఇది పర్యాటకంలో అవస్థాపనా సౌకర్యాల కల్పన మరియు వస్తువులను సృష్టిస్తుంది. ఈ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఘన చరిత్ర మరియు గత స్మృతులను సూచించే విధంగా సాంస్కృతిక, వారసత్వ, ప్రకృతి, సాహస, ఆరోగ్య మరియు గ్రామీణ పర్యాటకాల ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తుంది.
పర్యాటకాన్ని ఆర్థికాభివృద్ధి ఇంజనుగా, ఆంధ్రప్రదేశ్ విజన్ -2020 భావిస్తున్నది. “ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి తీసుకుపోవడం” అనే లక్ష్యాన్ని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు మొదలు పెట్టింది. 2010లో నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రాన్ని పర్యాటక హిత గమ్యస్థానంగా మార్చుటకు చర్యలు మొదలు పెట్టిరి.
- తీర్ధయాత్ర పర్యాటకం
- వైద్య పర్యాటకం
- బుద్ధిస్ట్ పర్యాటకం
- సముద్ర తీర పర్యాటకం
- వ్యవసాయ పర్యాటకం
- పర్యావరణ పర్యాటకం
- విశ్రాంత పర్యాటకం.
రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అత్యధిక మంది దేశీయ, విదేశీ పర్యాటకులను ఏడుకొండలపై వెలసిన ప్రసిద్ధ వైష్ణవాలయం తిరుమలను కలిగి ఉన్న చిత్తూరు జిల్లా ఆకర్షించగలిగింది. దీని తర్వాత స్థానంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగముతో పాటు, ఒకానొక శక్తి పీఠము కూడా అయిన శ్రీశైలం కారణంగా కర్నూలు జిల్లాను పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలు ప్రధాన మరియు కర్నూలు, విజయవాడలు ద్వితీయ పర్యాటక గమ్యాలుగా గుర్తింపబడినవి.
అలాగే రాష్ట్రం నదీపర్యాటక కేంద్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నది. ఉదాహరణకు గోదావరి నుండి పాపికొండల వరకు గోదావరి నదిపై నౌకా విహార కేంద్రం అయిన హరిత. ప్రస్తుతం ఐ.టి. రంగం మాదిరే పర్యాటక రంగం కూడా రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా లక్షణాలు. [Mar ’16]
జవాబు:
జనాభా: ఆంధ్రప్రదేశ్ 4.96 కోట్ల మొత్తం జనాభాతో, దేశ జనాభాలో 4.1 శాతంగా ఉండి జనాభా రీత్యా 10వ అత్యధిక జనాభా కల్గిన రాష్ట్రంగా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా వృద్ధిరేటు 2011 నాటికి 11.89 శాతం నుండి 9.21 శాతానికి తగ్గినది.
మరో వైపు అదే కాలానికి దేశ జనాభా 4.3 రెట్లు పెరిగింది. దీనిని బట్టి దేశంలో కన్నా రాష్ట్రంలో జనాభా వృద్ధి వేగంగా తగ్గుతున్నట్లు అర్థం అవుతున్నది.
జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చదరపు కిలోమీటర్లలో.
కాబట్టి రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేస్తుంది.
కాని 1971 తర్వాత జాతీయ సగటు జనసాంద్రత కన్నా తక్కువ స్థాయిని రాష్ట్రం నమోదు చేస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత 1 చ.కిమీ. కు 304 మంది ఉండగా, దేశం మొత్తంలో 382 చ.కి.మీ.కు జనసాంద్రత ఉంది.
రాష్ట్రంలోని జిల్లాలను పరిశీలిస్తే కృష్ణాజిల్లా అత్యధికంగా 518 మందితోను, పశ్చిమ గోదావరి 470 మందితోను మొదటి రెండు స్థానాలలో నిలిచాయి.
పురుష నిష్పత్తి: భారతదేశంలో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా సరళి పురుష జనాభాకు అనుకూలంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి మరియు కృష్ణా జిల్లాలలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువ. విజయనగరం జిల్లాలో ప్రతి 1000 పురుషులకు అత్యధికంగా 1019 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలలో అనంతపురం జిల్లాలో అతి తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ప్రతి 1000 పురుషులకు కేవలం 977 మంది స్త్రీలు ఉన్నారు.
వయసు ఆధారిత జనాభా: ఒక దేశంలో కాని, ప్రాంతంలో కాని మొత్తం జనాభాలో పనిచేయగల శ్రామిక శక్తిని ఇది తెలియజేస్తుంది. వయస్సు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాను మూడు తరగతులగా విభజించవచ్చు. అవి 0-14, 15-59 మరియు 60 సంవత్సరాలు మరియు ఆపైన వయస్సు ఉన్న వారి తరగతి. జననరేట్లు అధికంగా ఉండడం, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గడం వల్ల బాలల శాతం ఎక్కువగా ఉంటుంది.
గ్రామీణ – పట్టణ జనాభా: గ్రామీణ పట్టణ జనాభా అధ్యయనము జనాభా యొక్క జీవన సరళిని ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతదేశంలో మాదిరి అధిక జనాభా గ్రామాలలోనే నివసిస్తున్నది.
2011 అంచనాల ప్రకారం విశాఖపట్నం అత్యధిక పట్టణ జనాభా 47.45 శాతము కలిగి ఉంది. కృష్ణాజిల్లా 40.81 శాతంతో రెండవ స్థానంలో ఉంది.
అక్షరాస్యత: అక్షరాస్యత ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఇది ఒక మంచి విద్యా వ్యవస్థకు కావలసిన కనీస అవసరం. ఒక ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడినది.
ఆంధ్రప్రదేశ్ అటు స్త్రీ అక్షరాస్యతలోను, పురుష అక్షరాస్యతలోను, ఇటు మొత్తం అక్షరాస్యత రేటులో భారత అక్షరాస్యత రేటు కన్నా వెనుకబడి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత రేటు 67.41. ఇందులో 74.83 శాతం పురుష అక్షరాస్యత కాగా, 60.01 శాతం స్త్రీ అక్షరాస్యత. అంటే జాతీయ అక్షరాస్యత రేటుకన్నా రాష్ట్ర అక్షరాస్యత 5.58 శాతం ఎక్కువ.
ప్రశ్న 7.
రాష్ట్రంలోని వివిధ వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు/కార్యక్రమాలు: ఏ సంక్షేమ రాజ్య లక్ష్యమైన తన ప్రజల జీవన ప్రమాణాన్ని కొనసాగించడం లేదా ఇంకా మెరుగుపరచడమే. చాలాకాలం వరకు ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పరిశ్రమలు ప్రధాన వాహకాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యత వల్ల సామాజిక రంగ అవస్థాపన సౌకర్యాలైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, నీటి సప్లయి, గృహవసతి, సామాజిక రక్షణ వంటి వాటిని మెరుగుపరచడము ద్వారానే సాధ్యం అవుతుంది. సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వాలు సాధించాలంటే ఈ సాంఘిక అంశాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
SGDP
జవాబు:
ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక ఎల్లల్లో ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల అంతిమ విలువను రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయం అంటారు. రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయాన్ని ‘రాష్ట్ర ఆదాయం’ గా కూడా పేర్కొనవచ్చు. దీనిని రాష్ట్ర ఆర్థిక గణాంకశాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని
- ప్రాథమిక రంగం.
- పారిశ్రామిక రంగం.
- సేవారంగం నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి లభిస్తుంది.
ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత.
జవాబు:
ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే సగటు ప్రజల సంఖ్యను జనసాంద్రత అనవచ్చు. జనసాంద్రత = ఆ ప్రాంత జనాభా / ప్రాంత భూభాగం చ.కిమీ.లలో.
రాష్ట్ర సౌభాగ్యం లేక పేదరికానికి జనసాంద్రత ఒక సూచికగా పనిచేయును.
ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత.
జవాబు:
అక్షరాస్యత అనగా ప్రజల యొక్క చదవగల, వ్రాయగల నైపుణ్యం. ఒక ఆర్థికవ్యవస్థ అభివృద్ధి వేగానికి, అక్షరాస్యత స్థాయికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు గుర్తింపబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 67.11%. ఇందులో పురుష అక్షరాస్యత 74.83% మరియు స్త్రీ అక్షరాస్యత 60.01%.
ప్రశ్న 4.
ప్రాజెక్ట్ టైగర్. [Mar ’16]
జవాబు:
మన జాతీయ జంతువు అయిన పులుల సంఖ్య పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలలో విస్తరింపబడిన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) 50 కన్నా ఎక్కువ పులులకు నివాస స్థానంగా ఉంది.
ప్రశ్న 5.
సర్వశిక్ష అభియాన్.
జవాబు:
రాష్ట్రంలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001-02లో సర్వశిక్ష అభియాన్ పధకాన్ని ప్రవేశపెట్టారు. సామాజిక నిర్వహణ పాఠశాలల ద్వారా సాంఘీక ప్రాంతీయ లింగపరమైన వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం సర్వశిక్ష అభియాన్ కృషి చేస్తుంది. ప్రస్తుతం దీని పేరు “రాజీవ్ విద్యామిషన్” గా మార్చారు.
ప్రశ్న 6.
ఏదేని సంక్షేమ పథకం.
జవాబు:
A.P. ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నది. అవి: మహిళల కోసం జననీ సురక్ష యోజన, వెనుకబడిన తరగతులకు బి.సి. వసతి గృహాలు, మైనారిటీలకు ఉర్దూ అకాడమీ, గిరిజనులకు ఐ.టి.డి.ఎ., యువతకు TRYSEM పథకం మొదలగునవి.
ప్రశ్న 7.
పర్యావరణ పర్యాటకం. [Mar ’17]
జవాబు:
ఆంధ్రప్రదేశ్ ప్రధాన పర్యావరణ పర్యాటక బిందువుగా కూడా ఉంది. మారేడుమిల్లు; నేలపట్టు; మాయందూర్; తలకోన, ఎత్తిపోతలు మొదలగునవి ప్రముఖ పర్యావరణ పర్యాటక కేంద్రాలు.
ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్లో పౌర విమానయానం.
జవాబు:
రాష్ట్రంలో ప్రాంతాల మధ్య మెరుగైన అనుసంధానం కోసం మరియు ఆర్థికాభివృద్ధిని వేగతరం చేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం “ప్రాంతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదన తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, కడప మరియు రాజమండ్రి ఎయిర్పోర్టులను మెట్రోయేతర ఎయిర్పోర్టులుగా ఆధునికరించుటలో ఎయిర్పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో తాఖీదు కుదుర్చుకుంది.
ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్లో రోడ్డుమార్గాలు.
జవాబు:
రోడ్లు ప్రాథమిక రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవే కాకుండా అత్యంత కీలకమైన అవస్థాపనా సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో 42,511 కి.మీ.లలో రాష్ట్ర రహదార్లు 3,144 కి.మీ.ల, జాతీయ రహదార్లు 1,01,484 కి.మీ.లలో జిల్లాలను కలుపుకొని 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కలిగి ఉంది. దీనిని రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థనే నిర్వహణ బాధ్యత కల్గి ఉంటుంది.
ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్లో నౌకా కేంద్రాలు. [Mar ’17, ’16]
జవాబు:
సముద్ర తీర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. విశాఖ ఓడరేవు రాష్ట్రంలో అతిపెద్దదే కాకుండా | అండమాన్ నికోబార్ దీవులలోని పోర్టబ్లెయిర్కు ప్రయాణికుల సముద్ర యాత్రా వసతి కూడా కలదు. కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ రేవులు రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులు.