AP Inter 2nd Year History Notes Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

Students can go through AP Inter 2nd Year History Notes 1st Lesson తొలికాలపు మానవ చరిత్ర will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year History Notes 1st Lesson సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

→ మతగ్రంథం పేర్కొన్న ప్రకారం మానవులు దేవుడి చేత సృష్టించబడినవారు కాదు. పురావస్తు శాస్త్రవేత్తలు, మానవాకృతి శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కలిసి త్రవ్వకాలు జరిపి, పరిశోధనలు చేసి ఈ నిర్ణయానికి వచ్చారు.

→ సామాజిక మానవాకృతి శాస్త్రవేత్తలు మానవుని ఆవిర్భావాన్ని క్రీ.పూ. 5 లేదా 6 మిలియన్ సంవత్సరాలుగా గుర్తించారు.

→ 24 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రైమేట్స్లోలో ఒక భాగమైన తోమినాయిడ్స్ ఉద్భవించినట్లు తెలుస్తుంది.

→ ఆస్ట్రలోపిథకస్ అనగా దక్షిణప్రాంత ఏప్ అని అర్థం.

→ దొరికిన అవశేషాలను బట్టి హోమో మానవుడిని మూడు వర్గాలుగా విభజించారు. ఏ ప్రాంతంలో అవశేషాలు దొరికితే ఆ ప్రాంతం పేరు పెట్టడం జరిగింది.

AP Inter 2nd Year History Notes Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

→ ప్రాచీన మానవుడు ఆహార సేకరణ, ఆహారాన్ని పోగుచేయడం, జంతువులను వేటాడడం, చేపలు పట్టడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకున్నాడు.

→ వేట అనే ప్రక్రియ దాదాపు 5,00,000 సంవత్సరాల క్రిందటిదిగా ఆధారాలను బట్టి తెలుస్తోంది.

→ దక్షిణ ఫ్రాన్స్ లోని లాజరేత్ గుహాలో 12 × 4 మీటర్ల నివాస స్థలాన్ని ప్రాచీన మానవుడు ఏర్పరుచుకున్నట్లుగా ఆధారాలు లభించాయి.

→ కొన్ని చింపాంజీలు తమ పనిముట్లను తామే తయారుచేసుకునేవని ఇథియోపియా, కెన్యా ప్రాంతాలలో దొరికిన పనిముట్లును బట్టి తెలుస్తోంది.

→ ప్రాచీన మానవుడు సుమారు 35,000 సంవత్సరాల క్రితం నుండి జంతువులను వేటాడి చంపుటకు నూతనంగా ఆయుధాలు తయారుచేసుకున్నాడు.

→ క్రీ.పూ 21,000 సంవత్సరం నాటికే బట్టలు కుట్టే సూదులను ఉపయోగించి బట్టలు కుట్టడం ఆరంభించారు.

→ దాదాపు 40,000 – 35,000 సంవత్సరాల క్రితం చిత్రలేఖనం ఆవిర్భవించింది.