Students can go through AP Inter 2nd Year History Notes 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year History Notes 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం
→ నాగరికత అనగా మానవ సమాజంలో వచ్చిన మేధాసంపత్తి, సాంస్కృతిక, నిత్యజీవన విధానంలో వచ్చిన అభివృద్ధి, సామాజిక, శాస్త్రీయ విషయాలలో అభివృద్ధితో పాటు సాధించిన, శోధించిన విషయాలను వ్రాత పూర్వకంగా భద్రపరచి రాజకీయ, సామాజిక రంగాలకు ఉపయోగపడేదే నాగరికత.
→ మొదట చిన్న చిన్న సముదాయాలుగా ప్రారంభమైన మానవజీవితం సామాజిక జీవన విధానానికి దారి తీసింది. ఆ విధంగా ఏర్పడిన మానవ సముదాయాలు నాగరిక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
→ మెసలిటోమియా – ఈజిప్ట్ నాగరికతలు అక్కాచెల్లెళ్లుగా ప్రసిద్ధి చెందాయి.
→ మెసపిటోమియా అనే పదం గ్రీకు భాషలోని మెసోస్, ‘పోటమస్’ అనే పదాల కలయిక. ఈ పదాలకర్థం రెండు నదుల మధ్యప్రదేశం. ప్రస్తుతం దీని నామం ‘ఇరాక్:
→ క్రీ.పూ. 7000 – 6000 సంవత్సరాల మధ్య మెసపిటోమియాలో వ్యవసాయం ఆరంభమయింది. ఇక్కడి ప్రజలు పశుపోషకులు, గొర్రెలను పెంచేవారు.
→ పురావస్తు శాఖ తవ్వకాలలో ‘ఉర్’ ‘బాబిలోనియా’, ‘అబూసలాబిక్, ‘ఉరుక్’ పట్టణాలు బయల్పడ్డాయి.
→ ‘ఉర్’ పట్టణ నిర్మాణానికి సరి అయిన ప్రణాళిక లేదు.
→ మెసలిటోమియా నాగరికతలో త్రండి సంపాదించిన ఆస్తికి కుమారులు మాత్రమే హక్కుదారులు. కుమార్తెలు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప వారికి ఆస్తి హక్కు లేదు.
→ సుమేరియా, బాబిలోనియా, అక్కాడియన్, అస్సీరియా ప్రజలు స్థానిక దేవతలను పూజించే దేవాలయాలను ‘జిగూరత్’ అనేవారు. ప్రజలు ఈ జిగూరత్లను స్వర్గానికి, భూమికి మధ్య వారధిగా భావించేవారు.
→ ప్రపంచ చరితలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైనవి రాయడం ప్రారంభించింది మెసటోమియా ప్రజలని కొందరు చరితకారుల భావన.
→ కీ.పూ 1800 సంవత్సరాల నాటి మట్టి బిళ్ళలు మెసలిటోమియా కాలం నాటి గణితశాస్త్ర పరిశోధనలకు నిదర్శనాలు.
→ మెసపిటోమియా వాసులు నేడు మనం వాడుతున్న కాల నిర్ణయ విధానాన్ని కనుగొన్నారు.