AP Inter 2nd Year History Notes Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

Students can go through AP Inter 2nd Year History Notes 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year History Notes 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

→ రోమన్ సామ్రాజ్యం ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాలకు విస్తరించి అఖండ ఖ్యాతినార్జించింది. ఆ కాలంలో రోమ్, అలెగ్జాండ్రియాలు గొప్ప నగరాలుగా విలసిల్లాయి.

→ ఉత్తరాన ఆల్ప్స్ పర్వతాలు, దక్షిణ దిక్కున ఆడ్రియాటిక్ మధ్యధరా సముదాలు ఇటలీకి సహజ రక్షణ కల్పించాయి.

→ రోము సాంఘిక వ్యవస్థలో ప్రముఖ వర్గాలున్నాయి. వారిని వేట్రిసియన్స్, వీబియన్స్ అని పిలిచేవారు.

→ జూలియస్ సీజర్ పాలనా కాలంలో ఈజిప్టు రోమ్కు మిత్రరాజ్యమయింది.

→ సీజర్ మరణానంతరం రోమన్ సామ్రాజ్యం మూడు ముక్కలయింది.

→ అగస్టస్ కాలంలో నిర్మించబడిన ‘కలోసియమ్’ 50,000 మంది ఒకేసారి కూర్చుని చూడగల పెద్ద ప్రదర్శనశాల.

→ కాన్ స్టాంటైన్ రోమన్ సామ్రాజ్య రాజధానిని రోమ్ నుండి బైజాంటియన్కు మార్చాడు. ఇదే నాటినుండి కాన్స్టంట్ నోఫుల్గా పిలవబడింది.

→ రోమన్ వ్యవస్థలో బానిసత్వ దురాచారం ఉండేది.

AP Inter 2nd Year History Notes Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

→ రోమన్లు మతము, తత్వశాస్త్రము, కళలు, భవన నిర్మాణం, విజ్ఞానం, పాండిత్యం వంటి అనేక భావాలను గ్రీకుల నుండి గ్రహించారు.

→ గొప్పవాడైన రోమన్ చక్రవర్తి జస్టీనియన్ న్యాయ సూత్రాలను సీడీకరించుట చేత వీటిని జర్జీనియన్ కోడ్’ అని పిలిచారు.

→ ప్రాచీన రోమన్లు దేవతలను, ఆత్మలను ఆరాధించారు. జూపిటర్ (ఆకాశ దేవుడు), జునో (స్త్రీలను రక్షించే దేవత), మార్స్ (యుద్ధాలలో సహాయంచేసే దేవుడు), వీనస్ (ప్రేమదేవత), నెప్ట్యూన్ (సాగరదైవం).

→ జూలియస్ కేలండర్ను సొసిజెనెస్ అనే అలెగ్జాండ్రియాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు తయారుచేసాడు.