Students can go through AP Inter 2nd Year History Notes 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year History Notes 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం
→ అరేబియా దేశంలో క్రీ.శ. 7వ శతాబ్దంలో ఇస్లాం మతస్థాపన జరిగింది. అనతికాలంలో అభివృద్ధి చెంది గొప్ప సామ్రాజ్యానికి, ఒక నూతన నాగరికత ఆవిర్భానానికి కారణమయింది.
→ క్రీ.శ 570లో మక్కా నగరంలో ఖురేషి జాతికి చెందిన హాప్మంట్ కుటుంబంలో మహమ్మద్ జన్మించాడు.
→ మహమ్మద్కు తన 40వ ఏట నిజమార్గం లభించింది. మహమ్మద్ తనకు కలిగిన సత్యానుభూతితో ప్రవక్తగా మారాడు. తాను దేవుని దూతనని (రసూల్) భావించాడు.
→ క్రీ.శ. 622లో మహ్మద్ మక్కాను వదిలి మదీనాకు ప్రవాసం పోయాడు. ఈ ప్రవాసాల్ని హిజరా అనే పేరుతో ముసల్మానుల కేలండర్ ప్రథమ సంవత్సరంగా గుర్తించారు.
→ మహ్మద్ బోధించిన నూతన మత సారం వారి గ్రంథమైన ‘కురాన్’ లో గమనించవచ్చు. అరబిక్ భాషలో ఖురాన్ అనగా కంఠస్తం చేయడం అని అర్థం.
→ క్రీ.శ. 632లో మహమ్మద్ మరణానంతరం అబూబకర్ అనే మహ్మద్ ప్రవక్త స్నేహితుడిని అతని వారసుడిగా గుర్తించారు. అతనిని ‘ఖలీఫా’ లేదా ‘కాలిఫ్’ అని పిలిచారు.
→ కీ.శ. 712లో అరబ్బులు సింధునాక్రమించారు.
→ ముసల్మానులు కాలక్రమంలో సున్నీలు, షియాలుగా విడిపోయారు. మహమ్మద్ వారసత్వంపై వచ్చిన అభిప్రాయ భేదాల మూలంగా వారు విడిపోయారు.
→ మధ్యయుగ కాలంలో క్రైస్తవులకు, మహమ్మదీయులకు మధ్య జరిగిన మతయుద్ధాలు క్రూసేడ్లుగా అభివర్ణింప బడ్డాయి.
→ క్రూసేడ్ల వలన ఐరోపాలో భూస్వామ్య విధానం క్షీణించింది. అనేక మంది ప్రభువులు క్రూసేడ్లలో పాల్గొని దరిద్రులవడంగాని, మరణించడం కాని జరిగింది.
→ అరబ్బుల ఇస్లాం సామ్రాజ్యంలో బాగ్దాద్, కైరో, డమాస్కస్, కార్డోవా, వంటి చోట గొప్ప విద్యాకేంద్రాలు నెలకొల్పబడ్డాయి. 12 గణితంలో అరబ్బులు భారతీయ సంఖ్యామానాన్ని అలవరుచుకున్నారు. అరబ్బులు గొప్ప భవన నిర్మాతలు.