Students can go through AP Inter 2nd Year History Notes 5th Lesson సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్ will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year History Notes 5th Lesson సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్
→ సంచార లేక దేశదిమ్మర పదాన్ని సంచార తెగలని, ప్రాచీన జాతులని, అనాగరిక జాతులని, ఆటవికులని ఇలా అనేక అర్థాలలో వాడారు.
→ క్రీ.శ. 13, 14 శతాబ్దాలలో మంగోలులు చంఘీస్ ఖాన్ నాయకత్వంలో అనేక ఐరోపా, ఆసియా ప్రాంతాలతో మధ్య ఆసియాలో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
→ చంఘీస్ ఖాన్ తన అధికారాన్ని చైనా, ట్రాన్సాక్సియానా, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు ఇరాన్, రష్యా స్టెప్పీలకు వ్యాపింపచేసాడు.
→ మంగోలులు భిన్న సమూహాలకు చెందినవారు. వారు భాషా పరంగా టాటార్లు, ఖిటాన్, మంచూ, తుర్కీ తెగలకు దగ్గరగా ఉంటారు.
→ మంగోలులు గుడారాలలో నివసిస్తూ వేసవి, శీతాకాలాల పచ్చికబయళ్ళలో పరస్పరం మారుతూ సంచరించేవారు.
→ చైనా పాలకులు శ్రీ.పూ. 8వ శతాబ్దం నుండి తమ ప్రజల రక్షణార్థం కోటలు, ప్రాకారాలు నిర్మించుకున్నారు.
→ చంఘీస్ ఖాన్ క్రీ.శ 1162లో ఆనాన్ నదికి సమీపంలోని నేటి మంగోలియాలోని ఉత్తర ప్రాంతంలో జన్మించాడు. అతనిని ‘తెముజీన్’ అని పిలిచారు.
→ చంఘీస్ ఖాన్ దండయాతల వలన ఎన్నో నగరాలు ధ్వంసం అయి లెక్కలేనంత మంది మరణించారు.
→ యుద్ధాలతోను, ఎక్కువకాలం సైనిక శిబిరాలలోను గడపటం వలన చంఘీస్ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడక చివరకు క్రీ.శ 1227లో మరణించాడు.
→ మంగోలుల దాడులు ముగియగానే ఐరోపా, చైనాల మధ్య భౌగోళిక సంబంధాలు ఏర్పడ్డాయి. వ్యాపార సంబంధాలు పునరుద్ధరింపబడ్డాయి. చైనా, కారకోరమ్ మార్గాలలో వాణిజ్యం పెరిగింది.
→ డేవిడ్ అయలాన్ ప్రకారం ‘యాసా’ అనే న్యాయస్మృతిని చంఘీస్ ఖాన్ స్క్రీ.శ. 1206లో జారీచేసాడు. దీని అర్థం న్యాయం, ఆదేశం, ఆజ్ఞ.