Students can go through AP Inter 2nd Year History Notes 6th Lesson ఐరోపాలో భూస్వామ్య పద్ధతి will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year History Notes 6th Lesson ఐరోపాలో భూస్వామ్య పద్ధతి
→ ప్రజల ప్రాణాలను, సంపదను, సహజ సంపద అయిన భూమిని రక్షించుకోవడానికి ఏర్పడిన వ్యవస్థే భూస్వామ్య వ్యవస్థ.
→ ‘ఫ్యూడ్’ అనగా ‘ఒక చిన్న భూభాగము’ అని అర్థం.
→ జర్మనీలో ఒక తెగ అయిన ‘ఫ్రాంకులు’ రోమ్ సామ్రాజ్యంలోని ‘గాల్’ అనే ప్రాంతంలో స్థిరపడి తమ తెగ వేరు పెట్టడం వలన ఫ్రాన్స్ అనే పేరు ఏర్పడింది.
→ ఐరోపాలో చర్చికి పెద్దగా పోప్ వ్యవహరించేవాడు.
→ క్రైస్తవులు తమ సంపాదనలోని 10 శాతం పన్నుల రూపంలో చర్చికి విధిగా చెల్లించాలి. దీనిని ‘టైత్’ అని పిలుస్తారు.
→ చర్చి అనుబంధ వ్యవస్థ (మోనాస్టరీ) ని సెయింట్ బెనెడిక్ట్ స్థాపించాడు.
→ ఫ్రాన్స్లో ప్రభువు తాను నివసించే ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మింపబడిన ఇంటిని మేనర్ అని పిలుస్తారు.
→ ఐరోపాలోని అంతర్గత ఘర్షణలను అదుపులో ఉంచడానికి ఏర్పడిన వర్గమే నైట్స్:
→ ఇంగ్లాండ్లో భూస్వామ్య వ్యవస్థ 11వ శతాబ్దం నుండి అభివృద్ధి చెందింది.
→ ఫ్రాన్స్లో 12వ శతాబ్దం నుండి విశాలంగా, పెద్ద పెద్ద భవనాలతో నిర్మించిన చర్చిలను కాథడ్రల్ అని అంటారు.
→ 14వ శతాబ్దంలో యూరప్ లో అనేక సంవత్సరాలు వరుసగా క్షామాలు ఏర్పడ్డాయి.
→ 15, 16, శతాబ్దాలలో ఐరోపా రాజులు తమకున్న సైనిక, ఆర్థిక శక్తుల వల్ల బలపడినారు. చరిత్రకారులు వీరిని ‘కొత్తరాజులు’ అని వర్చించారు.
→ ఫ్రాన్స్ లో 11వ లూయి, ఆస్ట్రియాలో మాక్సిమిలయన్, ఇంగ్లండ్లో 7వ హెన్రీ, స్పెయిన్లో ఇజబెల్లా మరియు ఫెర్డినాండ్ రాజులు బలమైన రాజులుగా తయారైనారు.