Students can go through AP Inter 2nd Year History Notes 7th Lesson అధునిక యుగారంభం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year History Notes 7th Lesson అధునిక యుగారంభం
→ రినైసాన్స్ అనగా పునరుద్ధరణ లేక పునర్జన్మ అని అర్థం.
→ ప్రాచీన గ్రీకు, రోమన్ల సంస్కృతిని తెలుగులోకి తెచ్చి ప్రాచుర్యం కల్పించిన ఉద్యమమే సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం.
→ క్రీ.శ. 14-15 శతాబ్దాలలో ఫ్లారెన్స్, వెనిస్, రోమ్ నగరాలు కళలకు, సారస్వతానికి ముఖ్య కేంద్రాలుగా పుట్టాయి.
→ వ్యక్తి సత్ప్రవర్తనతో మంచి జీవితాన్ని తీర్చిదిద్దుకొని, శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేయడమే మానవతావాదం.
→ సిసిరో మానవతావాదం అంటే ‘సంస్కృతి’ అన్నాడు.
→ మాకియవెల్లి తన గ్రంథం దిప్రిన్స్లో రాజ్యం, చర్చి (మతం) రెండూ వేరని పేర్కొన్నాడు. రాజ్యం లౌకిక స్వభావాన్ని సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నాడు.
→ ప్లాటో ప్రవేశపెట్టిన త్రేరేపిత పద్ధతి (Inductive Method) వైజ్ఞానిక శాస్త్ర ఆవిర్భావానికి, శాస్త్రీయ పద్ధతిలో సైన్సు అధ్యయనం చేయడానికి సహాయపడింది.
→ ఐరోపా వ్యాపారులు మంగోల్ చక్రవర్తుల దగ్గర దౌత్యాధికారులుగా పనిచేసి అచ్చుయంత్ర పరిజ్ఞానాన్ని పొందారు.
→ కీ.శ. 1455లో జోహన్స్ గుటెన్బర్గ్ 150 బైబిల్ ప్రతులను ముద్రించారు.
→ క్రీ.శ. 14వ శతాబ్దం చివరలో ‘డాన్డే ఇటలీలో సాంస్కృతిక పునరుజ్జీవానికి ఆద్యుడిగా నిలిచాడు.
→ సాంస్కృతిక పునరుజ్జీవనం వలన వాస్తు శిల్పశాస్త్రాలు, చిత్రలేఖనం వంటి లలితకళలు వికసించి ప్రజలను అమితంగా ప్రభావితం చేసాయి.
→ గెలీలియో సౌరకేంద్ర సిద్ధాంతాన్ని చర్చి తీవ్రంగా వ్యతిరేకించింది.
→ ఎరాస్మస్ తన గ్రంథం ‘ది ఫ్రెయిస్ ఆఫ్ ఫాలీ’ అనే గ్రంథంలో మూఢనమ్మకాలపై ఆధారపడిన చర్చి ఆచారాలను, మతాధికారులను విమర్శించాడు.
→ చర్చి అరాచకాలను వ్యతిరేకిస్తూ జర్మన్ వేదాంతవేత్త మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు.