Students can go through AP Inter 2nd Year History Notes 8th Lesson ఫ్రెంచి విప్లవం – 1789 will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year History Notes 8th Lesson ఫ్రెంచి విప్లవం – 1789
→ స్వేఛ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం ఫ్రెంచి ప్రజలు చేసిన పోరాటమే 1789 ఫ్రెంచి విప్లవం. ఈ విప్లవం ఐరోపాలో కాక యావత్ప్రపంచాన్ని స్వేఛ్ఛ స్వయంపాలన దిశకు నడిపించింది.
→ 16వ లూయీ చక్రవర్తి ఫ్రాన్సు న్ను పాలించిన ఆఖరు బూర్టన్ వంశపు చక్రవర్తి,
→ ఫ్రాన్స్ సమాజంలో రోమన్ కాథలిక్ క్రైస్తవులు ఉన్నతస్థానంలో గౌరవ మర్యాదలు పొందేవారు.
→ ఫ్రాన్స్ అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడేవారు. వారు అధికమైన పన్నులతోను, వడ్డీలతో బాధపడేవారు.
→ 18వ శతాబ్దంలో మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసో వంటి మేథావుల గ్రంథములు ప్రజలలో స్పూర్తిని కొత్త ఆలోచనలను రేకెత్తించాయి.
→ “స్వేచ్ఛాగా పుట్టిన మానవుడు అన్ని చోట్ల సంకెళ్ళతో బంధించి ఉన్నాడు.” అని రూసో పేర్కొన్నాడు.
→ 1789లో ఎస్టేట్స్ జనరల్ సమావేశమయ్యారు. దీనిలో సామాన్యులకు సరైన ప్రాతినిధ్యం లేదు. దానితో వారు టెన్నిస్ కోర్ట్ సమావేశమై నూతన రాజ్యాంగం కోసం పోరాడదామని శపథం చేసారు.
→ 1789 ఆగస్ట్ నెలలో జాతీయసభ భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసింది. మతాధికారులు వసూలు చేసే ‘టైత్’ పన్నును కూడా తొలగించింది.
→ 1789 ఆగస్ట్ 26న నూతన అసెంబ్లీ మానవ హక్కుల ప్రకటన పత్రము విడుదల చేసింది. ఇందులో పౌరుల హక్కులు. వాటి అమలు గురించిన వివరాలున్నాయి.
→ 1789 అక్టోబర్లో పారిస్ లోని వేలాది మహిళలు ఆకలియాత్ర చేసి వర్సెల్స్ రాజప్రాసాదం చేరుకొని బలవంతంగా కోటద్వారాలు తెరిచి రాజు, రాణిలను బందీలుగా చేసారు.
→ నూతన సిద్ధాంతాలు, సంస్కరణలు అమలు జరగడానికి కన్వెన్షన్ భీతావహ పరిపాలన చేసింది. ఎన్నో వేలమంది మరణదండనకు గురయ్యారు.
→ సైనిక కుట్రతో (కూలియట్) నెపోలియన్ 1799లో ఫ్రాన్స్ అధికారం చేపట్టి, 1804 నాటికి చక్రవర్తిగా. ప్రకటించుకున్నాడు.
→ నెపోలియన్ విప్లవం కన్నబిడ్డగా కీర్తి పొందాడు.