Students can go through AP Inter 2nd Year Physics Notes 10th Lesson ఏకాంతర విద్యుత్ ప్రవాహం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Physics Notes 10th Lesson ఏకాంతర విద్యుత్ ప్రవాహం
→ ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనగా కాలంతోపాటు పరిమాణం మారుతూ మరియు ఆవర్తనంగా దిశ మారుతుంది.
→ A.C యొక్క సగటు విలువ (లేదా) సరాసరి విలువ నిలకడ విద్యుత్ ప్రవాహానికి సమానం. అదే వలయంలో, అదే కాలంలో ఏకాంతర విద్యుత్ ప్రవాహము, అంటే మొత్తం ఆవేశాన్ని అందిస్తుంది.
→ ఒక పూర్తి భ్రమణం (లేదా) ఆవర్తనంలో తక్షణ ప్రవాహ వర్గాల సరాసరి విలువ వర్గ మూలాన్నిms. విలువ అంటారు.
→ నిరోధం గుండా a.c నింపినప్పుడు వోల్టేజి, విద్యుత్ ప్రవాహము ఒకే దశలో ఉంటాయి.
→ ప్రేరకం గుండా a.c ని పంపినప్పుడు, విద్యుత్ ప్రవాహంకన్నా వోల్టేజి \(\frac{\pi}{2}\) (లేదా) 90° ముందుంటుంది.
→ కెపాసిటర్గుండా a.c ని పంపినప్పుడు, విద్యుత్ ప్రవాహంకన్నా వోల్టేజి \(\frac{\pi}{2}\) (లేదా) 90′
→ ప్రేరకంగుండా a.c ని పంపినప్పుడు కలిగే నిరోధాన్ని ప్రేరకత్వ నిరోధము అంటారు. కెపాసిటర్గుండా a.c ని పంపినప్పుడు కలిగే నిరోధాన్ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు. a.c వలయంలో ఓమిక్ నిరోధము వల్ల సామర్థ్య నష్టం జరుగుతుంది.
→ శుద్ధ ప్రేరక (లేదా) శుద్ధ కెపాసిటర్ వలయంలో సామర్థ్య కారకం ఉంటుంది.
→ పరివర్తకం అన్యొన్య ప్రేరకతపై ఆధారపడుతుంది.
→ పరివర్తకం a.c లో పనిచేస్తుంది మరియు d.c. లో పనిచేయదు.
→ ఏకాంతర అల్ప వోల్టేజి (అధిక విద్యుత్) నుండి అధిక వోల్టేజి (అల్ప విద్యుత్) కు మార్చుటకు పరివర్తకంను ఉపయోగిస్తారు.
→ తక్షణ వోల్టేజి మరియు తక్షణ విద్యుత్ ప్రవాహా లబ్ధమును తక్షణ సామర్థ్యం అంటారు.
→ ప్రేరకం (లేదా) కెపాసిటర్ వద్ద వోల్టేజికి, అనువర్తిత వోల్టేజికి గల నిష్పత్తిని Q-కారకం అంటారు.
→ అనునాద కోణీయ పౌనఃపున్యానికి, పట్టీ వెడల్పుకుగల నిష్పత్తిని అనునాద నైశిత్యం అంటారు.
→ వేష్టన చుట్టను ఉపయోగించి విద్యుత్ సామర్థ్యం నష్టం లేకుండా a.c ని నియంత్రిస్తుంది.
→ జనరేటర్లు మరియు మోటార్లలో నివేశనం మరియు నిర్గమనాలు తారమారవుతాయి.
→ మోటార్ విద్యుత్ శక్తి నివేశనం మరియు యాంత్రికశక్తి నిర్గమనం.
→ జనరేటర్లో యాంత్రికశక్తి నివేశనం మరియు విద్యుత్ శక్తి నిర్గమనం.
→ ఏకాంతర విద్యుత్ ప్రవాహం మరియు వోల్టేజి i = im sin ot మరియు υ = v0 sin ot
→ Vrms = \(\frac{V_m}{\sqrt{2}}\) మరియు irms = \(\frac{\mathrm{i}_0}{\sqrt{2}}\)
→ ఇండక్టివ్ రియాక్టెన్స్ (XL) = ωL
→ కెపాసిటివ్ రియాక్టెన్స్ (XC) = \(\frac{1}{\omega \mathrm{C}}\)
→ అవరోధము (Z) = \(\sqrt{R^2+\left(\frac{1}{\omega C}-\omega L\right)^2}=\sqrt{R^2+\left(X_C-X_L\right)^2}\)
→ Φ = tan-1\(\left(\frac{\frac{1}{\omega C}-\omega L}{R}\right)\) = tan-1\(\left[\frac{\mathrm{X}_{\mathrm{C}}-\mathbf{X}_{\mathrm{L}}}{\mathrm{R}}\right]\)
→ f0 = \(\frac{1}{2 \pi \sqrt{L C}}\)
→ Q- కారకం = \(\frac{\omega_0 \mathrm{~L}}{\mathrm{R}}=\frac{1}{\omega_0 \mathrm{CR}}\)
→ సగటు సామర్థ్యం (p) = Vrms × Irms × cos Φ
→ పరివర్తకం నిష్పత్తి = \(\frac{N_s}{N_p}=\frac{V_s}{V_p}\)