Students can go through AP Inter 2nd Year Physics Notes 9th Lesson విద్యుదయస్కాంత ప్రేరణ will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Physics Notes 9th Lesson విద్యుదయస్కాంత ప్రేరణ
→ మారే అయస్కాంత క్షేత్రము, విద్యుత్ క్షేత్రాన్ని జనింపచేస్తుంది.
→ వాహకంలో మొత్తం బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు.
→ ఫారడే ప్రయోగాల ద్వారా విద్యుదయస్కాంత ప్రేరణ దృగ్విషయం ఆవిష్కరించబడినది.
→ తీగచుట్టలో అయస్కాంత అభివాహం మారితే, దానిలో విద్యుచ్ఛాలక బలం ప్రేరితమవుతుంది.
→ ప్రేరిత విద్యుచ్ఛాలక బలం, అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
→ లెంజ్ నియమం ప్రకారం ప్రేరిత వి.చా.బ దిశ ఎల్లప్పుడూ అధిగమించడానికి ఉపయోగపడిన దానిని వ్యతిరేకిస్తుంది.
→ మారు ప్రవాహాలు (లేదా) ఫోకాల్ట్ ప్రవాహాలు, వాహకంను మారే అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు . ప్రేరితమయ్యే విద్యుత్ ప్రవాహం.
→ ఎడ్జీ ప్రవాహాలు ప్రాయోగిక అనువర్తనాలలో మరియు అవసరంలేని ప్రభావాలలో ఉపయోగిస్తారు.
→ నిరోధాల పెట్టెలలో స్వయం ప్రేరణను తొలగించడానికి ప్రేరకతలేని తీగచుట్టలను వాడతారు.
→ తీగ ప్రేరకంలాగా పనిచేయదు. అందుకు కారణం విస్మరించదగిన అడ్డుకోత వైశాల్యం గల తీగలో అయస్కాంత అభివాహం సున్నా
→ తీగచుట్టలాగా తీగను చుట్టితే, అది ప్రేరకం వలె పనిచేస్తుంది.
→ సాలినాయిడ్ పొడవు, దాని అడ్డుకోత వైశాల్యంతో పోల్చితే చాలా ఎక్కువ.
→ విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలు :
- తీగచుట్టలో అయస్కాంత అభివాహం మారితే, వలయంలో విద్యుచ్ఛాలక బలం జనిస్తుంది.
- వలయంలో వి.చా.బ పరిమాణం, అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
→ తీగచుట్టలో విద్యుత్ ప్రవాహము మారితే, అయస్కాంత అభివాహం మారి, దానిలో ప్రేరిత వి.చా.బ. జనిస్తుంది. ఈ దృగ్విషయాన్ని స్వయంప్రేరణ అంటారు.
→ ఒక తీగచుట్టలో విద్యుత్ ప్రవాహము మారితే, అయస్కాంత అభివాహం మారి, మరొక తీగచుట్టలో వి.చా.బ. ప్రేరితమవుతుంది. ఈ దృగ్విషయాన్ని అన్యోన్య ప్రేరణ అంటారు.
→ అయస్కాంత అభివాహం (ΦB) = B.A = BA cos θ
→ ε = \(\frac{-\mathrm{d} \phi_{\mathrm{B}}}{\mathrm{dt}}\)
→ ε = -N\(\frac{\mathrm{d} \phi}{\mathrm{dt}}\)
→ చలన వి.చా.బ. (ε) = Blυ.
→ ε = – L\(\frac{\mathrm{dI}}{\mathrm{dt}}\)
→ ε = -M12\(\frac{\mathrm{dI}}{\mathrm{dt}}\)
→ అయస్కాంత క్షేత్రంలో నిల్వ ఉన్న శక్తి (u) = \(\frac{1}{2}\)LI02
→ సాలినాయిడ్ యొక్క స్వయం ప్రేరకత (L) = μ0n2Al
→ రెండు పొడవైన సాలినాయిడ్ల యొక్క అన్యోన్య ప్రేరకత (M) = μ0n1n2Al
→ తక్షణ ప్రేరిత వి.చా.బ (ε) = NBAω sin ωt.
→ F= q\((\vec{E}+\vec{v} \times \vec{B})\)
→ సామర్థ్యము (p) = \(\frac{\mathrm{B}^2 l^2 v^2}{\mathrm{r}}\)
→ NΦ = LI.
→ NΦ = MI.