Students can go through AP Inter 2nd Year Physics Notes 5th Lesson స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్ will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Physics Notes 5th Lesson స్థిర విద్యుత్ పోటెన్షియల్ – కెపాసిటెన్స్
→ ప్రమాణ ధనావేశంను అనంత దూరం నుండి క్షేత్ర దిశకు వ్యతిరేకంగా ఒక బిందువు వద్దకు తీసుకురావటానికి ‘ చేయవలసిన పనిని విద్యుత్ పొటెన్షియల్ అంటారు.
→ ప్రమాణ ధనావేశంను విద్యుత్ క్షేత్రదిశకు వ్యతిరేకంగా ఒక బిందువు నుండి మరొక బిందువుకు జరుపుటకు చేయవలసిన పనిని ఆ క్షేత్రంలో ఆ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా అంటారు.
→ బిందు ఆవేశం వల్ల విద్యుత్ పొటెన్షియల్ V = \(\frac{1}{4 \pi \varepsilon_0} \frac{q}{r}\)
→ q1 మరియు q2, ఆవేశాల స్థిరవిద్యుత్ స్థితిజశక్తి = U(q1, q2) = \(\frac{1}{4 \pi \varepsilon_0} \frac{q_1 q_2}{r}\)
→ q1, q2, మరియు q3, ఆవేశాల వ్యవస్థ స్థిరవిద్యుత్ స్థితిజశక్తి = U(q1, q2, q3) = \(\frac{1}{4 \pi \varepsilon_0}\left[\frac{q_1 q_2}{r_1}+\frac{q_2 q_3}{r_2}+\frac{q_3 q_1}{r_3}\right]\)
→ విద్యుత్ ద్విధ్రువం పొటెన్షియల్ V = \(\frac{P \cos \theta}{4 \pi \varepsilon_0 r^2}\)
→ తలంపై అన్ని బిందువుల వద్ద పొటెన్షియల్ విలువ స్థిరంగా ఉంటే, ఆ తలంను సమశక్మతలం (సమపొటెన్షియల్) అంటారు.
→ విద్యుత్ క్షేత్రం మరియు పొటెన్షియల్ల మధ్య సంబంధం E = \(-\frac{\delta \mathrm{V}}{\delta l}=+\frac{|\delta \mathrm{V}|}{\delta l}\)
→ బాహ్యక్షేత్రంలో ఒక (డైపోల్) ద్విధ్రువం స్థితిజశక్తి U(θ) = PE(cos θ0 – cos θ1)
→ ప్రమాణ ఘనపరిమాణంలో ద్విధ్రువ భ్రామకంను, ధ్రువణం (polarisation) అంటారు. దీనిని P తో సూచిస్తారు.
→ కెపాసిటర్ అల్ప పొటెన్షియల్ వద్ద అధిక ఆవేశంను నిల్వచేయు సాధనం C = \(\frac{\mathrm{Q}}{\mathrm{V}}\)
→ సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటి, C = \(\frac{\varepsilon_0 A}{d}\)
→ శ్రేణి సంధానంలో, \(\frac{1}{\mathrm{C}}=\frac{1}{\mathrm{C}_1}+\frac{1}{\mathrm{C}_2}+\frac{1}{\mathrm{C}_3}+\ldots \ldots\)
→ సమాంతర సంధానంలో, C = C1 + C2 + C3 + ……….
→ C కెపాసిటేన్స్, Q ఆవేశం మరియు V ఓల్టేజి ఉన్న కెపాసిటర్ లో నిల్వ ఉండు శక్తి, U = \(\frac{1}{2}\)CV2 = \(\frac{\mathrm{Q}^2}{2 \mathrm{C}}=\frac{\mathrm{QV}}{2}\)
→ ఒక రోథకంను బాహ్యక్షేత్రం (E) ఉంచితే ధ్రువణం చెందును. ధ్రువణం వల్ల రోధకంలో E దిశకు వ్యతిరేకంగా Eo ప్రేరణ విద్యుత్ క్షేత్రం ఏర్పడును. రోథకంలోపల నికర విద్యుత్ క్షేత్రం E = E0 – Ei = \(\frac{\mathrm{E}_0}{\mathrm{~K}}\)
→ వాక్ డీ గ్రాఫ్ జనరేటర్ అధిక వోల్టేజ్లను (కొన్ని మిలియన్. వోల్ట్స్) ఉత్పత్తి చేయు ఒక యంత్రము ఫలిత విద్యుత్ క్షేత్రాలను ఉపయోగించి హెచ్చు శక్తులకు (ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, అయాన్లు) ఆవేశ కణాలను త్వరణం చెందించును.
→ విద్యుత్ క్షేత్ర రేఖీయ సమాకలనమును
→ రెండు బిందువులు A మరియు B ల మధ్య పొటెన్షియల్ తేడా
VB – VA = \(-\int_A^B \vec{E} \cdot \mathrm{d} \overrightarrow{\mathrm{i}}\); VB – VA = \(\frac{\mathrm{q}}{4 \pi \varepsilon_0}\left[\frac{1}{\mathrm{r}_{\mathrm{B}}}-\frac{1}{\mathrm{r}_{\mathrm{A}}}\right]\)
→ బిందు ఆవేశం q వల్ల విద్యుత్ పొటెన్షియల్, V = \(\frac{1}{4 \pi \varepsilon_0} \frac{\mathrm{q}}{\mathrm{r}}\)
→ ఆవేశాల వ్యవస్థ వల్ల విద్యుత్ పొటెన్షియల్, V = \(\frac{1}{4 \pi \varepsilon_0} \sum_{i=1}^n \frac{q_i}{r_i}\)
→ విద్యుత్ ద్విధ్రువం వల్ల ఏదైనా బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ V = \(\frac{1}{4 \pi \varepsilon_0} \frac{P \cos \theta}{\left(r^2-a^2 \cos ^2 \theta\right)}\)
→ E = \(\frac{-\mathrm{dv}}{\mathrm{dr}}\)
→ గాలిలో C = \(\frac{\varepsilon_0 \mathrm{~A}}{\mathrm{~d}}\) యానకంలో C = \(\frac{\mathrm{K}_0 \mathrm{~A}}{\mathrm{~d}}\)
→ సమాంతర పలకల కెపాసిటర్ రెండు పలకల మధ్య ఖాళీలో రోధక దిమ్మెను పాక్షికంగా నింపబడితే, కెపాసిటి
C = \(\frac{\varepsilon_0 \mathrm{~A}}{\mathrm{~d}}\)
→ గోళాకార కెపాసిటర్ కెపాసిటి C = 4πε0\(\frac{a b}{b-a}\)
→ స్థూపాకార కెపాసిటర్ C = \(\frac{2 \pi \varepsilon_0 l}{\log _{\mathrm{e}}\left(\frac{\mathrm{b}}{\mathrm{a}}\right)}\)
→ ఆవేశాల పంపిణీలో కెపాసిటర్లను కలిపితే, ఉమ్మడి పొటెన్షియల్ V = \(\frac{\mathrm{C}_1 \mathrm{~V}_1+\mathrm{C}_2 \mathrm{~V}_2+\mathrm{C}_3 \mathrm{~V}_3+\ldots \ldots}{\mathrm{C}_1+\mathrm{C}_2+\mathrm{C}_3+\ldots \ldots}\)