Students can go through AP Inter 2nd Year Physics Notes 6th Lesson ప్రవాహ విద్యుత్తు will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Physics Notes 6th Lesson ప్రవాహ విద్యుత్తు
→ వాహకం ఏదైనా భాగం గుండా పోవు ఆవేశ ప్రవాహపు రేటును విద్యుత్ ప్రవాహసత్వం అంటారు.
i.e., i = Q. దీనిని ఆంపియర్లలో కొలుస్తారు.
→ ఓమ్ నియమము : స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం గుండా పోవు విద్యుత్ ప్రవాహం, దాని పొటెన్షియల్ తేడాకు అనులోమానుపాతంలో ఉండును. V & I లేక V = IR. ఇక్కడ ‘R’ వాహకము లేక నిరోధకము యొక్క
→ నిరోధకము, విద్యుత్ ప్రవాహంను వ్యతిరేకించు ఒక సాధనము.
→ అధిక పొటెన్షియల్ నుండి అల్ప పొటెన్షియల్కు మరియు ఎలక్ట్రాన్ ప్రవాహ దిశకు వ్యతిరేకంగా సాంప్రదాయక విద్యుత్ ప్రవాహం దిశ ఉండును.
→ ఓమ్ నియమమును పాటించు నిరోధకములను ఓమిక్ నిరోధకములు అంటారు.
→ ఓమ్ నియమమును పాటించని నిరోధకములను అఓమిక్ నిరోధకములు అంటారు.
→ ప్రమాణ పొడవు మరియు ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న ఒక తీగ నిరోధంను నిరోధకత లేక విశిష్ట నిరోధం అంటారు.
i.e., ρ = \(\frac{\mathrm{RA}}{l}\) దీని ప్రమాణము Ω – m.
→ ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న విద్యుత్ ప్రవాహంను విద్యుత్ ప్రవాహ సాంద్రత (J) అంటారు. దీని ప్రమాణం A/m2.
→ నిరోధం యొక్క విలోమమును కండక్టెన్స్ అంటారు. దీనికి ప్రమాణం సీమెన్.
→ నిరోధకత యొక్క విలోమమును వాహకత్వం అంటారు.
i.e., σ = \(\frac{1}{\rho}\) దీని ప్రమాణం సీమెన్ / మీటర్.
→ 1°C ఉష్ణోగ్రత పెరుగుదలలో నిరోధం పెరుగుదలకు మరియు 0°C వద్ద నిరోధంనకు గల నిష్పత్తిని ఉష్ణోగ్రత నిరోధ గుణకం (α) అంటారు.
→ ఏకాంక ఉష్ణోగ్రత పెరుగుదలకు నిరోధకతలో కలిగే అంశిక పెరుగుదలను ఉష్ణోగ్రతా నిరోధకత గుణకం (α) అంటారు.
i.e., α = \(\frac{\rho_{\mathrm{t}}-\rho_0}{\rho_0 \mathrm{t}}\)
→ ప్రమాణ ఆవేశంను కదిలించుటలో జరిగిన పనిని ఘటం విద్యుచ్ఛాలక బలం (వి.చా.బ) అంటారు.
E = \(\frac{W}{q}\)మరియు ఓల్టలో కొలుస్తారు.
→ ఘటం విద్యుత్ విశ్లేష్యం గుండా ప్రవహించు ఆవేశాలను వ్యతిరేకించు నిరోధంను అంతర నిరోధం అంటారు.
→ వలయంలో ఆవేశ ప్రభాహంలను ఘటంలో ఏర్పడే వి. చా.బ వ్యతిరేకించును. దీనిని తిరో వి.చా.బ అంటారు.
→ లోహ వాహకంపై బాష విద్యుత్ క్షేత్రంను ప్రయోగిస్తే ఎలక్ట్రాన్ వడితో అపసరం చెందును. దీనినే అపసర వేగం లేక డ్రిఫ్ట్ వేగం అంటారు.
→ ప్రమాణ విద్యుత్ క్షేత్రసత్వంను అనువర్తింపచేస్తే, ఫలిత సరాసరి అపసర వేగంను మొబిలిటి (μ) అంటారు. μ = \(\). దీని ప్రమాణము m2s-1 Volt-1.
→ ద్రవాలలో విద్యుత్ ప్రవాహంను ఎలక్ట్రాలిసిస్ అంటారు. ఇది అయాన్ల చలనం వల్ల ఉండును.
→ వాయువులలో విద్యుత్ ప్రవాహంను ఉత్సర్గం (డిశ్చార్జ్) అంటారు. ఇది అయాన్ల చలనం వల్ల ఉండును.
→ E. వి.చా.బ. జనకంను బాహ్య నిరోధం R కు కలిపితే, వోల్టేజి Vబాహ్య, R వెంట Vబాహ్య = I(R + r). ఇక్కడ r జనకం అంతర నిరోధం.
→ నిరోధకంల శ్రేణి సంధానంలో, మొత్తం నిరోధం Rs = R1 + R2 + ……….. + Rn
→ నిరోధకంల సమాంతర సంధానంలో, మొత్తం నిరోధం \(\frac{1}{R_P}=\frac{1}{R_1}+\frac{1}{R_2}+\ldots \ldots \cdot \frac{1}{R_n}\)
→ కిర్కాఫ్ సంధి నియమం : వలయం ఏదైనా సంధి వద్ద, సంధి వద్దకు వచ్చు విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తం, సంధి నుండి బయటకు వచ్చు విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తమునకు సమానం.
→ కిర్కాఫ్ లూప్ నియమం: ఏదైనా సంవృత లూప్లో పొటెన్షియల్ తేడాల బీజీయ మొత్తం శూన్యం.
→ వీటన్ బ్రిడ్జి సూత్రము R4 = R3 × \(\frac{\mathrm{R}_2}{\mathrm{R}_1}\)
→ మీటర్ బ్రిడ్జి, వీటన్ బ్రిడ్జి సూత్రంపై ఆధారపడును.
→ మీటర్ బ్రిడ్జిని ఉపయోగించి తెలియని నిరోధంను ఖచ్చితంగా కొలవవచ్చును.
→ పొటెన్షియోమీటర్ చాలా సున్నితమైంది, ఖచ్చితమైన పొటెన్షియల్ తేడాను కనుగొనుటకు ఉపయోగిస్తారు.
→ విద్యుత్ ప్రవాహం I = \(\frac{\mathrm{q}}{\mathrm{t}}=\frac{\mathrm{ne}}{\mathrm{t}}\)
→ అపసర్గ వేగం, Vd = \(\frac{\mathrm{eE} \tau}{\mathrm{m}}\)
→ I = neA Vd; I = \(\frac{\mathrm{nAe}^2 \tau}{\mathrm{m}}\)E
→ ఎలక్ట్రాన్ చలనశీలత, m = \(\frac{\mathrm{e} \tau}{\mathrm{m}}\)
→ ప్రవాహ సాంద్రత j = \(\frac{\mathrm{I}}{\mathrm{A}}\) మరియు j = \(\frac{\mathrm{ne}^2 \tau}{\mathrm{m}}\)E
→ ఓమ్స్ నియమము, V = IR
→ నిరోధం, R = \(\frac{V}{I}\) మరియు R = \(\frac{\rho l}{\mathrm{~A}}\); R = \(\frac{\mathrm{m}}{\mathrm{ne}^2 \tau} \cdot \frac{l}{\mathrm{~A}}\); ρ = \(\frac{\mathrm{m}}{\mathrm{ne}^2 \tau}\)
→ కండక్టేన్స్ G = \(\frac{1}{R}\); వాహకత్వం σ = \(\frac{1}{ρ}\)
→ ఉష్ణోగ్రత నిరోధ గుణకం α = \(\frac{\mathrm{R}-\mathrm{R}_0}{\mathrm{R}_0 \theta}\)
→ కార్బన్ నిరోధం కలర్ కోడ్
→ శ్రేణి సంధానంలో Rs = R1 + R2 + R3 + …………
→ సమాంతర సంధానంలో, \(\frac{1}{\mathrm{R}_{\mathrm{p}}}=\frac{1}{\mathrm{R}_1}+\frac{1}{\mathrm{R}_2}+\frac{1}{\mathrm{R}_3}\) + …………..
→ టెర్మినల్ పొటెన్షియల్ తేడా లేక టెర్మినల్ వోల్టేజి V = E – Ir = \(\left[\frac{E-V}{V}\right]\)R
→ కిర్కాఫ్ మొదటి నియమము నుండి Σi = 0
→ కిర్కాఫ్ రెండవ నియమము నుండి ΣE = ΣIR
→ వీటన్ బ్రిడ్జి సూత్రము, R4 = R3 × \(\frac{\mathrm{R}_2}{\mathrm{R}_1}\)