AP Inter 2nd Year Physics Notes Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

Students can go through AP Inter 2nd Year Physics Notes 7th Lesson చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Physics Notes 7th Lesson చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

→ అయస్కాంత క్షేత్రం ఎల్లప్పుడూ, విద్యుత్ ప్రవాహంతో కలిసి ఉంటుంది.

→ సౌష్ఠవ విద్యుత్ ప్రవాహ వితరణ ఉన్నప్పుడు మాత్రమే బయోట్-సవర్ట్ నియమం పాటించబడుతుంది.

→ విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్రము ఏకరీతిగా ఉండదు. కాని ప్రయోగ అవసరాల కోసం దాని కేంద్రం వద్ద ఏకరీతిగా తీసుకుంటాం.

→ నిశ్చిలస్థితిలో విద్యుదావేశాలు స్థిర విద్యుత్ అంతర చర్యలను చలనంలో ఉన్న ఆవేశాలు అయస్కాంత అంతర చర్యలను ఏర్పరచును.

→ అయస్కాంత బలం, విద్యుత్ బలం కన్నా స్వల్పం.

→ డోలన మరియు త్వరణం చెందే ఆవేశాలు విద్యుదయస్కాంత తరంగాలను జనింపచేస్తాయి.

→ విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు ఉన్నప్పుడు, అంతరాళంలో చలించే ఆవేశంపై పనిచేసే బలాన్ని లారెంజ్ బలం అంటారు.

→ అయస్కాంత క్షేత్రం (B) యొక్క రేఖీయ సమాకలని, సంవృత వలయంలో మొత్తం విద్యుత్ ప్రవాహం (i) కు
μ0 రెట్లుంటుంది. ∮\(\overrightarrow{\mathrm{B}} \cdot \overrightarrow{\mathrm{d} l}\) = μ0I

→ అవసరమైన అయస్కాంతక్షేత్రాన్ని జనింపచేయడానికి టెలివిజన్లో సాలినాయిడ్ను వాడతారు.

→ టోరాయిడ్ అనగా బోలుగా ఉండే వృత్తాకార రింగ్, దీనిలో విద్యుత్ బంధిత తీగ అనేకచుట్లు దగ్గర దగ్గరగా చుట్టబడి ఉంటుంది.

→ బయోట-సవర్ట్ నియమంను ఇలా తెలుపవచ్చు. \(\overrightarrow{\mathrm{dB}}=\frac{\mu_0}{4 \pi} \cdot \frac{\mathrm{id} l \sin \theta}{\mathrm{r}^2}=\frac{\mu_0}{4 \pi} \cdot \frac{\mathrm{id} l \times \overrightarrow{\mathrm{r}}}{\mathrm{r}^3}\)

AP Inter 2nd Year Physics Notes Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

→ రెండు తిన్నని సమాంతర వాహకాలలో విద్యుత్ ప్రవాహాలు ఒకే దిశలో ఉంటే అవి పరస్పరం ఆకర్షించుకుంటాయి మరియు విద్యుత్ ప్రవాహాలు వ్యతిరేక దిశలలో ఉంటే వికర్షించుకుంటాయి.

→ సైక్లోట్రాన్ ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రాన్లను త్వరణం చెందించదు.

→ అమ్మీటరును వలయాలలో ఎల్లప్పుడూ శ్రేణిలోనే కలుపుతారు.

→ వోల్టు మీటరును వలయాలలో ఎల్లప్పుడూ సమాంతరంగానే కలపాలి.

→ ఆదర్శ అమ్మీటరు నిరోధము సున్నా.

→ ఆదర్శ వోల్టు మీటరు నిరోధము అనంతం

→ N చుట్లు, A వైశాల్యం గల తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం i అయిన అయస్కాంత భ్రామకం (m)m = NiA

→ కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ యొక్క అయస్కాంత భ్రామకం μl = \(\frac{\mathrm{e}}{2 \mathrm{~m}}\)l

→ పరస్పరం లంబంగా ఉన్న విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల గుండా అంతరాళంలో ఒక గల ఆవేశిత కణాల కిరణపుంజము యొక్క ఎంపికను వేగవరణకం అంటారు.

→ F = q (\(\vec{v} \times \vec{B}\)) (లేదా) F = Bqv sin θ

→ dB = \(\frac{\mu_0}{4 \pi} \cdot \frac{\mathrm{id} l \sin \theta}{\mathrm{r}^2}\)

→ B = \(\frac{\mu_0 n i^2}{2\left(r^2+x^2\right)^{3 / 2}}\)

→ B = \(\frac{\mu_0 n i^2}{2\left(r^2+x^2\right)^{3 / 2}}\)

→ B = \(\frac{\mu_0}{4 \pi} \frac{\mathrm{i}}{\mathrm{a}}\)(sin Φ1 + sin Φ2)

→ B = \(\frac{\mu_0 \mathbf{i}}{2 \pi \mathrm{a}}\)

→ M = niA

→ B = μ0ni (సాలినాయిడ్ కేంద్రం వద్ద)

→ B = \(\frac{\mu_0 n i}{2}\)(సాలినాయిడ్ ఒక చివర వద్ద)

→ ∮\(\overrightarrow{\mathrm{B}} \cdot \overrightarrow{\mathrm{d} l}\) = μ0I

→ F = q\([\overrightarrow{\mathbf{E}}+(\vec{v} \times \overrightarrow{\mathbf{B}})]\)

→ F = i\((\vec{l} \times \vec{B})\) = Bil sin θ

→ τ = \(\overrightarrow{\mathrm{M}} \times \overrightarrow{\mathrm{B}}\) = MB sin θ

→ i = \(\frac{\mathrm{C}}{\text { BAN }}\)θ

AP Inter 2nd Year Physics Notes Chapter 7 చలించే ఆవేశాలు-అయస్కాంతత్వం

→ S = \(\frac{i_g G}{i-i_g}\)

→ R = \(\frac{\mathrm{v}}{\mathrm{i}_{\mathrm{g}}}\) – G

→ F = \(\frac{\mu_0 i_1 i_2 l}{2 \pi r}\)