AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material Lesson 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం Textbook Questions and Answers.

AP Inter 2nd Year Zoology Study Material Lesson 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆక్రోమెగాలి అంటే ఏమిటి ? ఈ అపస్థితిని కలుగజేసే హార్మోన్ పేరు రాయండి. [T.S. Mar. ’17; A.P. Mar. ’15]
జవాబు:
పూర్వ పిట్యూటరీ నుంచి మానవ పెరుగుదల హార్మోన్ అధికోత్పత్తి ప్రౌఢ మానవులలో జరిగితే, ఆ లక్షణాన్ని ఆక్రోమెగాలి అంటారు. ఈ స్థితిలో చేతులు కాళ్లు, దవడ ఎముకలు, ముక్కు ఎముకల కొనలోని మృదులాస్థి అధికంగా పెరిగి వారి ముఖం గొరిల్లా ముఖం లాగా కనిపిస్తుంది. ఈ అపస్థితికి కారణం మానవ పెరుగుదల హార్మోన్ అధికోత్పత్తి.

ప్రశ్న 2.
యాంటిడైయూరిటిక్ హార్మోన్ అని దేనినంటారు ? దీన్ని స్రవించే గ్రంథి పేరు రాయండి.
జవాబు:
వాసోప్రెస్సిన్ హార్మోన్నే యాంటిడైయూరిటిక్ హార్మోన్ అని అంటారు. ఇది పరపిట్యూటరీ నుండి స్రవించబడుతుంది.

ప్రశ్న 3.
బాల్యంలో పరిమాణం పెరుగుతూ, యుక్త వయస్సులో పరిమాణం తగ్గే గ్రంథి పేరేమి ? సాంక్రమణ జరిగినప్పుడు ఈ గ్రంథి పోషించే పాత్ర ఏమిటి ?
జవాబు:
థైమస్ గ్రంథి శిశువు జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి శిశువు పెరిగే కొద్ది పెద్దదవుతూ యౌవనారంభంలో గరిష్ట పరిమాణం చేరుతుంది. ప్రౌఢదశలో ఇది కుచించుకుపోయి జన్మించినప్పుడు ఉన్న పరిమాణంలాగా చిన్నదవుతుంది.

సాంక్రమణ జరిగినప్పుడు ఇది రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధిలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది థైమోసిన్ హార్మోన్ను స్రవించి T – లింఫోసైట్ల విభేదనంలో పాల్గొని కణ నిర్వర్తిత రోగనిరోధకతకు మరియు ప్రతిదేహాలు ఏర్పడటంలో సహాయపడి దేహద్రవ నిర్వర్తిత రోగనిరోధకతకు దోహదం చేస్తుంది.

ప్రశ్న 4.
డయాబెటిస్ ఇన్సిపిడస్, డయాబెటిస్ మెల్లిటస్ మధ్య గల భేదాన్ని వివరించండి. [T.S. & A.P. Mar. ’16 Mar. ’14]
జవాబు:
డయాబెటిస్ ఇన్సిపిడస్: ఇది వాసోప్రెస్సిన్ న్యూనత వల్ల ఏర్పడే అపసవ్యత. అధిక మూత్రోత్పత్తి, అధిక నీటి విసర్జన, తీవ్రదాహం దీని లక్షణాలు. మూత్రంలో చక్కెర విడుదల కాదు కేవలం నీరు మాత్రమే విసర్జితమవుతుంది.

డయాబెటిస్ మెల్లిటస్: ఇది ఇన్సులిన్ అల్పోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. ఈ స్థితి చాలాకాలం కొనసాగితే డయాబెటిస్ మెల్లిటస్ అనే వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధిలో మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జన జరుగుతుంది.

ప్రశ్న 5.
లాంగర్ హాన్స్ పుటికలని వేటినంటారు ?
జవాబు:
క్లోమ గ్రంథిలోని అంతస్రావక భాగాన్ని లాంగరోన్స్ పుటికలు అంటారు. ఈ భాగంలో 1 2 మిలియన్ల లాంగర్ హాన్స్ పుటికలను కలిగి ఉంటుంది. లాంగర్ హాన్స్ పుటికలో ac – కణాలు, B-కణాలని రెండు రకాల కణాలుంటాయి. 0 – కణాలు గ్లూకగాన్ హార్మోను, B -కణాలు ఇన్సులిన్ హార్మోన్ ను స్రవిస్తాయి.

ప్రశ్న 6.
ఇన్సులిన్ షాక్ అంటే ఏమిటి ? [A.P. Mar. ’15]
జవాబు:
ఇన్సులిన్ అధికోత్పత్తి లేదా అధికస్రావత వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. దీన్ని ఇన్సులిన్ షాక్ అంటారు.

ప్రశ్న 7.
పోరాట, పలాయన హార్మోనని దేనినంటారు ? [T.S. Mar. ’15]
జవాబు:
ఎపినెఫ్రిన్ మరియు నార్ఎపినెఫ్రిన్లను పోరాట, పలాయన హార్మోన్లని అంటారు. ఎందుకంటే ఇవి ఒత్తిడి, అత్యవసర పరిస్థితులకు అనుక్రియగా స్రవించబడతాయి:

ప్రశ్న 8.
ఆండ్రోజెన్లని వేటినంటారు ? వీటిని స్రవించే కణాలేవి ?
జవాబు:
ఆండ్రోజెన్లు పురుష లైంగిక హార్మోన్లు వీటిలో ప్రధానమైంది టెస్టోస్టిరావి ముష్కాలలో గల లీడిగ్ కణాలనుండి స్రవించబడతాయి.

ప్రశ్న 9.
ఎరిత్రోపోయిటిన్ అంటే ఏమిటి ? దీని విధి ఏమిటి ? [Mar. ’14]
జవాబు:
ఎరిత్రోపోయిటిన్ ఒక పెప్టైడ్ హార్మోన్, ఇది మూత్రపిండంలో ఉండే రక్తనాళికా గుచ్ఛ సన్నిధి పరికరం నుండి స్రవించబడుతుంది. ఇది అస్థిమజ్జలో ఎర్రరక్తకణోత్పాదనక్రియను ప్రేరేపిస్తుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవులలో అంతస్రావక గ్రంథులను, అవి స్రవించే హార్మోన్లను పేర్కొనండి.
జవాబు:
1) హైపోథలామస్: ఇది థైరాయిడ్ విడుదల హార్మోన్, కార్టికోట్రోఫిన్ విడుదల హార్మోన్, గొనాడోట్రోఫిన్ విడుదల హార్మోన్, పెరుగుదల హార్మోన్ విడుదల హార్మోన్, పెరుగుదల హార్మోన్ నిరోధక హార్మోన్, ప్రొలాక్టిన్ విడుదల నిరోధక హార్మోన్.

2) పిట్యూటరీ గ్రంథిని రెండు భాగాలుగా విడదీయవచ్చు. అవి: 1) పూర్వ పిట్యూటరీ మరియు పరపిట్యూటరీ. ఎ) పూర్వ పిట్యూటరీ: పూర్వ పిట్యూటరీ ఆరు ముఖ్య పెప్టైడ్ హార్మోనులను స్రవిస్తుంది. అవి పెరుగుదల హార్మోను, ప్రొలాక్టిన్, థైరాయిడ్ ప్రేరక హార్మోన్, ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, పుటికాప్రేరక హార్మోన్, ల్యుటినైజింగ్ హార్మోన్. బి) పరపిట్యూటరీ: ఇది రెండురకాల హార్మోనులను స్రవిస్తుంది. అవి. ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెస్సిన్లు.

3) పీనియల్ గ్రంథి: ఈ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోను స్రవిస్తుంది.

4) థైరాయిడ్ గ్రంథి: థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, టెట్రాఐడోథైరోనిన్, కాల్సిటోనిన్ అనే హార్మోన్లను స్రవిస్తుంది.

5) పారాథైరాయిడ్ గ్రంథి: పారాథైరాయిడ్ అనే పెప్టైడ్ హార్మోన్ ను స్రవిస్తుంది.

6) థైమస్ గ్రంథి: ఇది థైమోసిన్ హార్మోన్ను స్రవిస్తుంది.

7) ఎడ్రినల్ లేదా అధివృక్క గ్రంథి: వీటిలో రెండు కణజాలాలు ఉంటాయి. పరిధీయ కణజాలాన్ని అధివృక్క వల్కలం అని, లోపలి కణజాలాన్ని అధివృక్క దవ్వ అని అంటారు.
అధివృక్క వల్కలం: ఇది గ్లూకోకార్డికాయిడ్లు, మినరలో కార్డికాయిడ్లు, ఆండ్రోజెన్స్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్లను స్రవిస్తుంది.
అధివృక్క దవ్వ: ఎపినెఫ్రిన్ మరియు నార్ఎపినెఫ్రిన్లను ఉత్పత్తి చేస్తుంది.

8) క్లోమం: క్లోమం గ్లూకగాస్ మరియు ఇన్సులిన్ హార్మోనులను స్రవిస్తుంది.

9) ముష్కాలు: ఆండ్రోజెన్లు మరియు టెస్టోస్టిరాన్ హార్మోన్లను స్రవిస్తుంది.

10) స్త్రీ బీజకోశాలు: ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అనే రెండు స్టిరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 2.
న్యూరో అంతస్రావక అవయవం లాగా హైపోథలామస్ ఏ విధంగా పని చేస్తుందో వివరించండి.
జవాబు:
హైపోథలామస్, పూర్వ మెదడులోని ద్వారగోపు ఆధార భాగం. దీని కింది వైపు పిట్యూటరీ గ్రంథి అతికి ఉంటుంది. ఈవిధంగా హైపోథలామస్ నాడీ, అంతస్రావక వ్యవస్థలను అనుసంధానం చేస్తుంది.

హైపోథలామస్లో అనేక నాడీస్రావక కణాల సముదాయాలు ఉంటాయి. వీటిని కేంద్రకాలు అంటారు. ఇవి రెండు రకాల న్యూరోహార్మోన్లను స్రవిస్తాయి. అవి: విడుదల హార్మోన్లు మరియు నిరోధక హార్మోన్లు.

1) విడుదల హార్మోన్లు: ఇవి పిట్యూటరీ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి.
ఉదా: (i) థైరోట్రోపిన్ విడుదల హార్మోన్లు: ఇది పూర్వ పిట్యూటరీను ప్రేరేపించి థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది.
(ii) పెరుగుదల హార్మోన్ విడుదల హార్మోన్ల లు: ఇది పిట్యూటరీని ప్రేరేపించి పెరుగుదల హార్మోన్ విడుదలను గావిస్తుంది.

2) నిరోధక హార్మోన్లు: ఇవి పిట్యూటరీ హార్మోన్ల విడుదలను నిరోధిస్తాయి.
(i) పెరుగుదల హార్మోన్ నిరోధక హార్మోన్: ఈ హార్మోన్ పిట్యూటరీ నుంచి పెరుగుదల హార్మోన్ విడుదలను నిరోధిస్తుంది.
(ii) ప్రొలాక్టిన్ విడుదల నిరోధక హార్మోన్: పూర్వ పిట్యూటరీ గ్రంథి నుండి ప్రొలాక్టిన్ విడుదలను నిరోధిస్తుంది.

ప్రశ్న 3.
పిట్యూటరీ గ్రంథి స్రావకాల గురించి వివరించండి.
జవాబు:
పిట్యూటరీ లేదా పీయూష గ్రంథిని హైపోఫైసిస్ అని అంటారు. పిట్యూటరీ గ్రంథిని పూర్వ పిట్యూటరీ మరియు పర పిట్యూటరీగా విభజించవచ్చు.
పూర్వ పిట్యూటరీ: పూర్వ పిట్యూటరీ ఆరు ముఖ్య పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. ఇవి

  1. పెరుగుదల హార్మోన్: ఇది కాలేయ కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల చేస్తుంది. ఇవి అస్థికణాల విభజనను ప్రేరేపించి ఎముకలు పొడుగయ్యేటట్లు చేస్తాయి. తద్వారా దేహ పెరుగుదలకు తోడ్పడుతుంది.
  2. ప్రొలాక్టిన్: ఇది స్త్రీలలో క్షీర గ్రంథుల పెరుగుదలకు, క్షీరోత్పత్తికి తోడ్పడుతుంది.
  3. థైరాయిడ్ ప్రేరక హార్మోన్: ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణ విడుదలకు తోడ్పడుతుంది.
  4. ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్: ఇది అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్లు అనే స్టిరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణకు, వాటి విడుదలకు తోడ్పడుతుంది.
  5. పుటికాప్రేరక హార్మోన్: ఇది స్త్రీలలో స్త్రీబీజకోశ పుటికల పెరుగుదల, అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. పురుషులలో ఇది ఆండ్రోజెన్లతో కలసి శుక్రజననాన్ని నియంత్రిస్తుంది.
  6. ల్యుటినైజింగ్ హర్మోన్: ఇది పురుషులలో ముష్కాలలో ఉండే లీడిగ్ కణాలను ప్రేరేపించి ఆండ్రోజెన్ అనే పురుష హార్మోన్ల విడుదలకు దోహదం చేస్తుంది. స్త్రీలలో స్త్రీబీజకోశాలను ప్రేరేపించి ఈస్ట్రోజెన్; ప్రొజెస్టిరాన్ హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది.

పరపిట్యూటరీ: ఇది ఆక్సిటోసిన్, వాసోప్రెస్సిన్ అనే రెండు హార్మోనులను నిల్వ ఉంచి విడుదల చేస్తుంది.

ఆక్సిటోసిన్: స్త్రీలలో ప్రసవసమయంలో ఇది గర్భాశయపు నునుపు కండరాలలో బలమైన సంకోచాలను కలుగజేసి సుఖ ప్రసవమయ్యేటట్లు చేస్తుంది. ప్రసవం తరువాత తల్లి వక్షోజాల నుంచి క్షీరం చిందించడానికి తోడ్పడుతుంది. వాసోప్రెస్సిన్: మూత్రపిండంపై ప్రభావాన్ని చూపుతుంది. నెఫ్రాన్లోని దూరాగ్ర సంవళిత నాళికను ప్రేరేపించి, దాని ద్వారా నీరు, ఎలక్ట్రోలైట్ల పునఃశోషణను వేగవంతం చేసి నీటి నష్టాన్ని నివారిస్తుంది.

ప్రశ్న 4.
పిట్యూటరీ కుబ్జులు, థైరాయిడ్ మరుగుజ్జులను తులనాత్మకంగా వివరించండి.
జవాబు:
పిట్యూటరీ కుబ్జులు

  1. శిశువులలో పిట్యూటరీ గ్రంథి నుండి పెరుగుదలహార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు పెరుగుదల నిలిచిపోయి పిట్యూటరీ కుబ్జులుకు దారితీస్తుంది.
  2. శిశువులలో పెరుగుదల హార్మోన్ లోపించడం వల్ల పెరుగుదల నిలిచిపోయి, అసాధారణంగా పొట్టిగా ఉంటారు. (మరుగుజ్జుతనం ఏర్పడుతుంది).
  3. పిట్యూటరీ కుబ్జులు లైంగికంగా, మేధోపరంగా సాధారణ మానవులు లాగా ఉంటారు.
  4. సరియైన సమయంలో వీరికి పెరుగుదల హార్మోన్ ఇచ్చినప్పుడు వీరిలో ఎముకల పెరుగుదల కనిపిస్తుంది.

థైరాయిడ్ మరుగుజ్జులు

  1. గర్భం దాల్చిన స్త్రీలలో థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు, గర్భస్థ శిశువులో భౌతికంగా, మానసికంగా అభివృద్ధి లోపించి థైరాయిడ్ మరుగుజ్జుతనంకు దారితీస్తుంది.
  2. పుట్టుకతోనే థైరాయిడ్ హార్మోన్లు లోపించడం వల్ల, పెద్దతల, పొట్టికాళ్ళు, బయటకు పొడుచుకు వచ్చిన నాలుక, శారీరక మందకొండితనం, పొడి చర్మం అల్పబుద్ధి నిష్పత్తి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  3. వీరికి చికిత్స అందించని యెడల పిల్లలు మరుగుజ్జుతనంగా ఉండి, మానసిక మాంద్యం మరియు లైంగికంగా వంధ్యత్వం కలిగి ఉంటారు.
  4. ముందుగా చికిత్స అందించడం వల్ల వీరిలో సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధి కనిపించును.

ప్రశ్న 5.
శరీరంలో హైపోథైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్ ఎటువంటి ప్రభావం చూపుతాయో వివరించండి. [A.P. Mar. 17; T.S. & A.P. Mar. 16]
జవాబు:
హైపోథైరాయిడిజమ్: ఆహారంలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉబ్బి థైరాయిడ్ హార్మోన్ల (T3,T) ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ లక్షణాన్ని హైపోథైరాయిడిజమ్ అంటారు. దీనినే సరళగాయిటర్ అనికూడా అంటారు.

గర్భం దాల్చిన స్త్రీలలో ఈ స్థితి ఏర్పడితే గర్భస్థ శిశువులో అభివృద్ధి లోపించి, క్రెటినిజమ్ అనే అపస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పెరుగుదల లోపం, మానసిక మాంద్యం, అల్పబుద్ధి నిష్పత్తి, అసాధారణ చర్మం, చెవిటి – మూగత్వం లాంటి లక్షణాలు కలుగుతాయి.

ప్రౌఢ స్త్రీలలో హైపోథైరాయిడిజమ్ వల్ల రుతుచక్ర క్రమం తప్పుతుంది. ప్రౌఢ మానవులలో మిక్సిడిమా అనే అసాధారణ స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో మానసిక, శారీరక మందకొడితనం, ఉబ్బిన ముఖం, పొడిచర్మం మొదలైన లక్షణాలు కలుగుతాయి. హైపర్ థైరాయిడిజమ్: థైరాయిడ్ గ్రంథి అతిక్రియాశీలత వల్లగానీ, క్యాన్సర్ వల్లగానీ, గ్రంథిలో కణుతులు ఏర్పడటం వల్లగానీ, థైరాక్సిన్ హార్మోన్ అధికోత్పత్తి జరుగుతుంది. ఈ లక్షణాన్ని హైపర్ థైరాయిడిజమ్ అంటారు.

ఈ స్థితిలో జీవక్రియారేటు పెరుగుతుంది. కంటి వెనుక కణజాలంలో ద్రవం సంచితం కావడం వల్ల కళ్ళు ఉబ్బి ముందుకు పొడుచుకొని వస్తాయి. ఈ స్థితిని ఎక్సాప్తాల్మిక్ గాయిటర్ అంటారు. హైపర్ థైరాయిడిజమ్ స్థితిలో జీవక్రియారేటు పెరుగుదలతోపాటు, హృదయ స్పందన రేటు పెరగడం, నరాల బలహీనత, అధికంగా చెమటపట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ప్రశ్న 6.
అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్ల గురించి రాయండి. [T.S. Mar. ’17]
జవాబు:
అడిసన్స్ వ్యాధి: అడ్రినల్ వల్కలం స్రవించే గ్లూకోకార్డికాయిడ్ల అల్పోత్పత్తి వల్ల అడిసన్స్ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధిగ్రస్తులలో చర్మంపై కంచువర్ణ మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా బరువు కోల్పోవడం, కండర బలహీనత, కండర అలసట, రక్తపీడనం తగ్గిపోవడం మొదలైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తుడు ఒత్తిడికి ప్రతిస్పందించలేడు.

కుషింగ్స్ సిండ్రోమ్: అడ్రినల్ వల్కలం స్రవించే కార్టిసాల్ లేదా ఇతర గ్లూకోకార్డికాయిడ్ల అధికోత్పత్తి వల్ల కుషింగ్స్ సిండ్రోమ్ అనే అపస్థితి కలుగుతుంది. దీనిలో కండర ప్రోటీన్ల విచ్ఛిత్తి జరిగి కండరాలు బలహీనపడతాయి. ముఖం, అంగాలు, వీపు ప్రాంతాలలో కొవ్వు నిక్షేపం జరుగుతుంది. అందువల్ల ముఖం గుండ్రంగా చంద్రబింబాకారంగానూ, అంగాలు కదురాకృతిగానూ మారతాయి. వీపుపై మూపురం, డోలన ఉదరం మొదలైన లక్షణాలు కూడా ఈ వ్యాధిగ్రస్తులలో ఏర్పడతాయి. రక్తంలో కార్టిసాల్స్ స్థాయి పెరగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి కాలేయంలో అధిక గ్లైకోజెన్ నిక్షేపణలు ఏర్పడతాయి. దీని ఫలితంగా అధిక శరీరబరువు పొందుతారు.

ప్రశ్న 7.
డయాబెటిక్ రోగి మూత్రంలో చక్కెర ఎందుకు విసర్జితమవుతుంది ?
జవాబు:
క్లోమగ్రంథి స్రవించే ఇన్సులిన్ అల్పోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. ఈ స్థితి చాలా కాలం కొనసాగితే డయాబెటిస్ మెల్లిటస్ అనే వ్యాధికి దారితీస్తుంది.

డయాబెటిక్ రోగి మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జనం జరుగుతుంది. దీనిని గ్లైకోసూరియా అంటారు. దీనికి కారణం మూత్రపిండాలు రక్తంలో గల గ్లూకోజ్ ద్రవలవణ సమతాస్థితి కాపాడుటలో ముఖ్యపాత్ర వహిస్తాయి. మూత్రపిండాలలోని గ్లామరులస్ ద్వారా రక్తము గాలనం చేసినపుడు ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది. ఇందులో గల లవణాలు, గ్లూకోజ్ పునః శోషణ చేయబడి రక్తంలో కలుస్తాయి. అయితే రక్తంలో గల గ్లూకోజ్ విలువలు 160-180 mg/dl ల కంటే అధికంగా ఉన్నప్పుడు (హైపర్ గ్లైసీమియా), ప్రాథమిక మూత్రంలో గల గ్లూకోజ్ అంతా పునఃశోషణ చేయబడదు. అందువల్ల మూత్రంలో గ్లూకోజ్ ఉండి బయటకు విసర్జింపబడుతుంది.

ప్రశ్న 8.
పురుష, స్త్రీ లైంగిక హార్మోన్లను వాటి చర్యలను వివరించండి.
జవాబు:
మానవుని వివిధ దశలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి, మార్పులకు అవసరమయ్యే హార్మోన్లను లైంగిక హార్మోన్లు అంటారు.

పురుష లైంగిక హార్మోన్లు:
ఆండ్రోజెన్లు: ఆండ్రోజెన్లు, ముష్కాలలో గల లీడిగ్ కణాల నుండి ఉత్పత్తి అవుతాయి. అతి స్వల్పం మొత్తంలో పురుషులు ఇరువురిలో అధివృక్క గ్రంథుల నుండి కూడా స్రవించబడుతుంది.

విధులు:

  1. పురుష ప్రత్యుత్పుత్తి అవయవాల పెరుగుదలకు, అభివృద్ధి, పరిణితి, విధి నిర్వహణకు అవసరం.
  2. పురుష లైంగిక ప్రవర్తనకు, శుక్రజననాన్ని ప్రేరేపించుటలో ఈ హార్మోన్లు ముఖ్య పాత్ర వహిస్తాయి.
  3. ఈ హార్మోన్లు కండర అభివృద్ధికి, ముఖం, బాహు మూలాలలో రోమాలేర్పడటం, ఉగ్రప్రవర్తన, పురుష కంఠధ్వని మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగిస్తాయి.
  4. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ల జీవన చర్యలలో పాల్గొని, సంశ్లేషణ లేదా నిర్మాణాత్మాక ప్రభావాలను కలిగిస్తాయి.

స్త్రీ లైంగిక హార్మోన్ల లు:

  1. ఈస్ట్రోజెన్లు: అభివృద్ధి చెందే స్త్రీ బీజకోశపుటికలు, ఈస్ట్రోజెన్ హార్మోన్లను సంశ్లేషణ చేసి స్రవిస్తాయి.

విధులు:

  1. స్త్రీలలో ద్వితీయ లైంగిక అవయవాల అభివృద్ధి, క్రియలను, స్త్రీ బీజకోశ పుటికల అభివృద్ధిని క్షీరగ్రంథుల అభివృద్ధిని ద్వితీయలైంగిక లక్షణాలను ప్రేరేపిస్తుంది.
  2. రుతుచక్రం నిర్వహణలోనూ ముఖ్యపాత్ర వహిస్తుంది.
  3. ఈస్ట్రోజెన్ స్త్రీ లైంగిక ప్రవర్తనను కూడా నియంత్రిస్తుంది.
  4. ఈస్ట్రోజెన్ ప్రోటీన్ల సంశ్లేషణను, కాల్షిఫికేషన్ మరియు ఎముకల పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది.

2) ప్రొజెస్టిరాన్: ఇది కార్పస్ల్యూటియమ్, జరాయువులలో సంశ్లేషణం చెంది స్రవించబడుతుంది.
విధులు: గర్భాశయ గోడలో బ్లాస్టోసిస్ట్ ప్రతిస్థాపన కోసం గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది.

  1. గర్భాశయ కండరాల సంకోచాన్ని నిరోధిస్తుంది. మరియు శిశువు జన్మించే వరకు గర్భధారణను కొనసాగిస్తుంది.
  2. ఇది క్షీర గ్రంథులలో ఆల్వియోలై ఏర్పాటును ప్రేరేపించి క్షీరోత్పత్తికి కూడా తోడ్పడుతుంది.

3) ఫాలిక్యులార్ స్టిములేటింగ్ మరియు ల్యూటినైజింగ్ హార్మోన్లు: స్త్రీ, పురుషులు ఇరువురిలో పూర్వపిట్యూటరీ నుండి ఉత్పత్తి అవుతాయి.
విధులు: ఇవి ముఖ్యంగా ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధికి ముఖ్య పాత్రవహిస్తాయి.

ప్రశ్న 9.
హార్మోన్ చర్యా విధానం గురించి రాయండి.
జవాబు:
హార్మోనులు ప్రాథమిక వార్తావాహకాలు. ఇవి హార్మోన్ గ్రాహకాలతో పరస్పర చర్య జరిపి ద్వితీయ వార్తావాహకాలను ఏర్పరిచి వాటి ద్వారా కణములో జీవక్రియలను నియంత్రిస్తుంది.
కొవ్వులలో కరగని హైడ్రోఫిల్లిక్ హార్మోన్ల చర్యావిధానం:

  1. ఈ హార్మోన్ కణత్వచం ద్వారా కణంలోకి ప్రవేశించలేదు. కాబట్టి అది కణ ఉపరితలంపై ఉండే త్వచ గ్రాహకాలకు బంధించబడి G – ప్రోటీన్ ను ప్రేరేపిస్తుంది.
  2. ఈ బంధన చర్య ఫలితంగా G ప్రోటీన్ GTP తో బంధించబడి అడినైల్ సైక్లేస్ అనే త్వచ ఎంజైమును ఉత్తేజపరుస్తుంది.
  3. ఉత్తేజపరచబడిన అడినైల్ సైక్లేస్ ATP నుంచి చక్రీయ అడినోసిన్ మోనోఫ్రాస్ఫేట్ను ఏర్పరుస్తుంది.
  4. ఇది ద్వితీయ వార్తాహరిగా పనిచేసి ప్రోటీన్ కైనేస్ – A అనే ఎన్జైమ్ ను క్రియాశీలంగా మారుస్తుంది.
  5. క్రియాశీలమైన ప్రోటీన్ కైనేస్ – A, క్రియాశీల రహితంగా ఉన్న ఎంజైమ్ను క్రియాశీలంగా మారుస్తుంది. ఈ ఎంజైమ్ జీవక్రియలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉదా: ఎపినెఫ్రిన్

కొవ్వులలో కరిగే హార్మోన్ల చర్యా విధానం: కొవ్వులలో కరిగే హార్మోన్లు సులువుగా కణ త్వచం ద్వారా వ్యాపనం చెందగలవు.
AP Inter 2nd Year Zoology Study Material Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం 1

  1. కొవ్వులో కరిగే హార్మోన్ కణంలోకి ప్రవేశించిన తరువాత, కణాంతస్థ గ్రాహకాలతో బంధించబడుతుంది. దీని ఫలితంగా హార్మోన్ – గ్రాహక సంక్లిష్టం ఏర్పడుతుంది.
  2. ఈ సంక్లిష్టం కేంద్రకాన్ని చేరి అక్కడ DNA ను బంధింపబడి mRNA ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
  3. ఈ m-RNA కణద్రవ్యంలోకి వచ్చి ప్రోటీన్ సంశ్లేషణకు తోడ్పడుతుంది.
  4. ఈ విధంగా ఉత్పత్తి అయిన ప్రోటీన్లు వివిధ జీవక్రియలో పాల్గొంటాయి. ఉదా: ఆల్డోస్టిరాన్.