AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 5th Lesson సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్ Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 5th Lesson సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మంగోలులను తెలుసుకొనుటకు గల ఆధారాలేవి?
జవాబు:
సంచారజాతుల, తెగల చరిత్రను, వారి జీవన విధానాన్ని తెలుసుకోవడానికి అనేక ఆధారాలు, వృత్తాంతాలు (క్రానికల్స్), యాత్రారచనలు (ట్రావెలోగ్స్), గ్రంథాలు, పత్రాలు, పోర్ట్రెయిట్స్ రూపంలో ఉన్నాయి. కొంతమంది మంగోలులను గూర్చీ యాత్రాకథనాలు రాయగా కొంతమంది మంగోలులు ఆస్థాన పండితులుగా స్థిరపడ్డారు. వారు బౌద్ధ, క్రైస్తవ, కన్ఫూషియస్, తుర్కీ, ముస్లిం మతాలకు చెందినవారు. వీరిలో కొంతమంది మంగోలులను స్తుతిస్తూ, నివాళులర్పిస్తూ రచనలు చేసారు.

మంగోలులపై విస్తృత పరిశోధనలు చేసి, రచనలు చేసినవారు రష్యా పరిశోధకులైన యాత్రికులు, సైనికులు, వ్యాపారులు, పురాతత్వవేత్తలు క్రీ.శ. 18, 19 శతాబ్దాలకు చెందినవారు. క్రీ.శ 20వ శతాబ్దపు తొలినాళ్ళలో రష్యాకు చెందిన బోరిస్ ఎకోప్లెని౫డి మిరోవ్, వాసిలి వ్లాడిమిరోవిచ్ బోరోల్డ్ మంగోలులు భాష, సమాజం, సంస్కృతులపై చక్కని రచనలు చేసారు.

మంగోలుల చరిత్రను తెలిపే ఆధారాలు చైనా, మంగోలు, పారశీక, అరబ్బీ, ఇటలీ, లాటిన్, ఫ్రెంచి, రష్యా వంటి అనేక భాషలలో విభిన్న సమాచారంతో లభిస్తున్నాయి. ఉదాహరణకు చంఘీస్ ఖాన్ను గురించి రాసిన మంగోలుల రహస్య చరిత్ర మంగోలు, చైనా భాషలలో ఉంది. మార్కోపోలో రాసిన మంగోలుల ఆస్థానానికి యాత్రలు (ట్రావెల్స్ టు ది మంగోల్ కోర్ట్) ఇటలీ, లాటిన్ భాషలలో భిన్నంగా ఉంది. అదే విధంగా ఇగోర్ డి రాచెవిట్జ్ రచన మంగోలుల రహస్య చరిత్ర, గెర్హార్డ్ డూ ఫర్ మంగోలు, తుర్కీ పదకోశంపై చేసిన రచనలు పారశీక భాషను కలిగి క్లిష్టంగా ఉన్నాయి. ఇంకా ఐబన్ బటూటా రచనలలో కూడా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.

రోమ్కు చెందిన పోప్లతో మంగోలు రాజులు సత్సంబంధాలు నెరపారు. పోట్లు ఎన్నో రాయబారాలు నడిపారు. పోప్ ఇన్నోసెంట్ (IV)కు గ్రేటాన్ గుయుగ్ రాసిన లేఖ వంటివి అనేక వివరాలను తెలియజేస్తున్నాయి. ఇ.ఎ. నాలిసబ్బుడ్జ రచించిన ‘ద మాక్స్ ఆఫ్ కుబ్లయే ఖాన్’ అతని పరిపాలనా కాలాన్ని గురించి మనకు తెలియజేస్తోంది. రషీద్ అల్దన్ రచించిన కంపెండియమ్ ఆఫ్ క్రానికల్స్, గ్రెగర్ ఆఫ్ అకాన్ హిస్టరీ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఆర్చర్స్, ద క్రానికల్స్ ఆఫ్ నొవ్ రోడ్, జువైనా-ద హిస్టరీ ఆప్ ద వరల్డ్ కాంకరర్స్ వంటి చారిత్రక విషయాలను తెలియజేస్తున్నాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

ప్రశ్న 2.
సంచార జాతి సామ్రాజ్య స్థాపనకు దారితీసిన భౌగోళిక పరిస్థితులను తెలపండి.
జవాబు:
క్రీ.శ. 13, 14 శతాబ్దాలలో మంగోలులు చంఘీస్ ఖాన్ నాయకత్వంలో అనేక ఐరోపా, ఆసియా ప్రాంతాలతో మధ్య ఆసియాలో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మంగోలు సంచార తెగలు నిబద్దతతో కూడిన సాంఘిక, ఆర్థిక జీవితాన్ని, వినమ్రతతో కూడిన గుణగణాలు కలిగి ఉండేవారని ఒక అభిప్రాయం. అయితే ఈ తెగల వారు చారిత్రకంగా వచ్చే పరిణామాలను, మార్పులను అంగీకరించరు. వీరి సాంప్రదాయాలకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక పద్ధతులను పాటిస్తూ తమ అధికారానికి మూలహేతువైన శక్తివంతమైన సైనికవ్యవస్థలకు ప్రాధాన్యత నిచ్చేవారు.

మంగోలులు భిన్న సమూహాలకు చెందినవారు. వారు భాషాపరంగా టాటార్లు, ఖిటాన్, మంచూ, తుర్కీ తెగలకు దగ్గరగా ఉంటారు. వారిలో కొందరు గ్రామీణ జీవితాన్ని గడపగా కొందరు వేటగాళ్ళుగా జీవించారు. గ్రామీణులు గుర్రాలు, గొర్రెలు, ఎద్దులు, మేకలు, ఒంటెలు వంటి జంతువులను పెంచేవారు. వారు మధ్య ఆసియాలోని స్టెప్పీలలో ముఖ్యంగా ఆధునిక మంగోలియా రాజ్యంలో సంచార జీవితం గడిపారు. ఈ ప్రాంతం అల్బాయ్ పర్వతాలతో, గోబిఎడారి, ఆనాన్, తెలంగా నదులు, అనేక ప్రవాహాలతో అందంగా, అద్భుతంగా ఉండేది. ఆటవికులు గ్రామీణులకు ఉత్తర ప్రాంతమైన సైబీరియా అటవీ ప్రాంతంలో ఉండేవారు. గ్రామీణుల కంటే వారు కొంత వినమ్రతతో జంతు చర్మాలు అమ్మి తన జీవితాన్ని గడిపేవారు. ఈ రెండు తరగతుల వారు నివశించే ప్రాంతంలో శీతోష్ణస్థితి పూర్తి భిన్నంగా ఉండేది.

ఈ రెండు సమూహాలు ప్రజలు ఆర్థికంగా స్థిరజీవితాన్ని నిలుపుకోలేక పోవడంతో ఆ ప్రాంతంలో పట్టణాభివృద్ధి జరగలేదు. మంగోలులు గుడారాలలో నివసిస్తూ వేసవి, శీతాకాలాల పచ్చికబయళ్ళలో పరస్పరం మారుతూ సంచరించేవారు. చంఘీస్ ఖాన్ నాయకత్వంలోని మంగోలు, తుర్కీ తెగల సమాఖ్య క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన | అట్టెలా రాజ్యంతో సమానంగా ఉండేది. అయితే అట్టెలా కూటమి వలె కాక, చంఘీస్ ఖాన్ రాజకీయ వ్యవస్థ శక్తివంతమై ఎక్కువ కాలం కొనసాగే స్వభావం కలది. ఇది బలమైన సైనిక బలాలు కలిగిన చైనా, ఇరాన్, తూర్పు ఐరోపాలను ఎదుర్కొనే శక్తి కలది. మంగోలులు క్లిష్టమైన వ్యవసాయ, ఆర్థికవ్యవస్థలు, పట్టణ స్థిరత్వం, స్వల్ప సామాజిక వ్యవస్థలు కలిగిన పరిపాలన చేసారు. అది వారి సహజ సామాజిక జీవితానికి పూర్తిగా భిన్నమైంది.

సహజంగా పశువులను పెంచుతూ, వాటి గడ్డికోసం పచ్చిక మైదానాలలో సంచరిస్తూ స్థిరజీవితం లేని సంచార జాతులు వారి మనుగడకు ఆధారమయిన పశువులపైనే ఆధారపడేవారు. ఇటీవల కాలంలో ఆధునిక చారిత్రక పరిశోధకులు చంఘీస్ ఖాన్ కాలం నాటికి వాతావరణంలోని మార్పుల వలన గడ్డి సరిగా పెరగక మంగోలులు ఆందోళనకు గురయ్యారని భావించారు. ఇలాంటి పరిస్థితులలో మంగోలులు నాయకుడైన చంఘీన్ ఖాన్ మంగోలు జాతి ప్రజలను, ఇతర తెగలను కలిపి బలమైన సమాఖ్య రాజ్యాన్ని మధ్య ఆసియాలోని స్టెప్పీలనే పచ్చికబయళ్ళ ప్రాంతంలో నిర్మించాడు. ఇది అంతటితో ఆగక ఆసియా, ఐరోపా ఖండాలలోని అనేక దేశాలను ఆక్రమించి ఖండాంతర విశాలమైన సామ్రాజ్య స్థాపనకు దారితీసింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రాజ్యాన్ని సంచారజాతి తెగలు స్థాపించడం, ఊహకందని, నమ్మలేని విషయంగా పరిశోధకులు భావించారు.

ప్రశ్న 3.
చంఘీస్ ఖాన్ జీవిత విశేషాలు, విజయాలను వివరించండి.
జవాబు:
చంఘీస్ ఖాన్ క్రీ.శ. 1162 ప్రాంతంలో ఆనాన్ నదికి సమీపంలోని నేటి మంగోలియాలోని ఉత్తర ప్రాంతంలో జన్మించాడు. అతనిని తెముజిన్ అని పిలిచేవారు. అతని తండ్రి ఎసుగి బోర్జిగిద్ తెగకు చెందిన కియాట్ సమూహానికి నాయకుడు. తెముజిన్ చిన్న వయసులో అతని తండ్రి చంపబడ్డాడు. అతని తల్లి ఓలన్ – ఇకే అటువంటి కష్టకాలంలో తెముజిన్తో పాటు అతని సోదరులను, సవతితల్లి బిడ్డలను పెంచి పెద్ద చేసింది. తరువాత దశాబ్ద కాలమంతా చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. తెముజిన్ పట్టుబడి బానిసగా చేయబడ్డాడు. వివాహానంతరం అతని భార్య బోల్టే అపహరించబడగా తెముజిన్ యుద్ధం చేసి ఆమెను పొందాడు. ఈ స్థితిలో బోఘుర్చు, జముఖ అనే కుటుంబ సోదరుడిని స్నేహితులుగా చేసుకున్నాడు. తండ్రి వంక వారితో సంబంధాలు పునరుద్ధరించుకున్నాడు.

క్రీ.శ 1180 – 90 మధ్య కాలంలో తెముజిన్ అంగాన్తో మైత్రి నడుపుతూ తన బద్ధశత్రువులైన జముఖా వంటి వారిని ఓడించాడు. క్రీ.శ. 1203లో తండ్రిని పొట్టన పెట్టుకున్న టాటారులనే తెగ వారిని, కెరెయిట్స్న అంగన్ను ఓడించాడు. క్రీ.శ 1206లో నైమాన్ ప్రజలపై విజయం, శక్తివంతుడైన జముఖాను లొంగదీయడంతో తెముజిన్ శక్తిమంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. ‘చంఘీఖాన్’ అంటే ‘సముద్రాధిపతి’ లేక ‘ప్రపంచరాజు’ అని మంగోలుల సభచే పిలువబడి తెముజిన్ మంగోలుల గొప్ప నాయకుడు అని ప్రకటింపబడ్డాడు.

చైనాను ఆక్రమించడానికి తన సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించి, క్రమశిక్షణ గల సైన్యంగా తీర్చిదిద్దాడు. మంగోలు సైన్యాన్ని మూడు భాగాలుగా చేసాడు. టిబెట్ తెగకు చెందిన హిృహ్సియా ప్రజలను 1209 నాటికి, 1215 నాటికి పెకింగ్ను ఓడించాడు. ఈ విజయాల తర్వాత క్రీ.శ. 1216లో చంఘీస్ ఖాన్ తిరిగి మంగోలియా చేరుకున్నాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

క్రీ.శ 1218లో మంగోలులు ఖారాభిటాను ఓడించిన తర్వాత మంగోల్ సరిహద్దులు పశ్చిమోత్తర చైనా, అమూదరియా, ట్రాన్సాక్సియానా, ఖ్వారజం వరకు విస్తరించాయి. ఖ్వారజం పాలకుడు సుల్తాన్ మహమ్మద్ మంగోలు రాయబారులను వధించి చంఘీస్ ఖాన్ ఆగ్రహాన్ని చవిచూసాడు. క్రీ.శ 1219-21 మధ్య కాలంలోని దండయాత్రలలో బట్రార్, బుఖారా, సామరఖండ్, బాల్క్, హీరట్లు లొంగిపోయాయి. వ్యతిరేకించిన పట్టణాలు నేలమట్టమయ్యాయి. నిషాపూర్ వద్ద మంగోల్ రాజును చంపినందుకు ప్రతీకారంగా ఆ పట్టణ ఆక్రమణ సమయంలో యావత్తు పట్టణాన్ని దున్నిపారేసి పిల్లలు, కుక్కలు సైతం లేని స్మశాన వాటికగా ఆ ప్రాంతాన్ని మార్చివేసాడు.

చంఘీస్ ఖాన్ దండయాత్రల వలన అనేక నగరాల విధ్వంసం, లెక్కలేనంత మంది ప్రజల మరణం సంభవించాయి. క్రీ.శ. 1220లో నిషాపూర్లో 17 లక్షల మందిని, క్రీ.శ. 1222లో హీరట్ వద్ద 16 లక్షల మందిని, క్రీ.శ. 1258లో | బాగ్దాద్ వద్ద 8 లక్షల మందిని చంపారని మధ్యయుగ చరిత్రకారులు కొందరు లెక్కలు వేసారు. అయితే పారశీక వృత్తాంతాలు ఇల్కానిడ్ ఇరాన్ను గురించి రాస్తూ చంఘీస్ ఖాన్ వధించిన లేక చంపిన వారి వివరాలను అతిశయోక్తిగా పేర్కొన్నాయని కొందరు చరిత్రకారుల భావన.

మంగోల్ సైన్యాలు సుల్తాన్ మొహమ్మద్ కోసం వెళుతూ అజర్బైజాన్లోకి ప్రవేశించి, క్రిమియా వద్ద రష్యా సైన్యాలను ఓడించి కాస్పియన్ సముద్రాన్ని చుట్టుముట్టాయి. మరో విభాగం సుల్తాన్ కుమారుడు జలాలుద్దీన్ ను వెంటాడుతూ ఆఫ్ఘనిస్తాన్, సింధ్ ప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్ళాయి. సింధూనది వద్ద చంఘీస్ ఖాన్ ఉత్తర భారతదేశం, అస్సాంల ద్వారా మంగోలియాకు వెళ్ళడం మంచిదని భావించాడు. కానీ ఆ ప్రాంత భయంకర ఉష్ణతాపం, దుశ్శకునాలను గురించి జ్యోతిష్కుడు చెప్పిన మాటలతో మనసు మార్చుకున్నాడు. అయితే అప్పటికే యుద్ధాలతోను, ఎక్కువ కాలం సైనిక స్థావరాలలో గడపటం వలన చంఘీస్ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడక క్రీ.శ 1227లో మరణించాడు.

ఘనత: చంఘీస్ ఖాన్ సైనిక విజయాలు అపూర్వమైనవి. అతడు స్టెప్పీ ప్రాంతాల సైన్యాలను తన శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో ఆధునీకరించటం వలన అవి శక్తివంతమైనాయి. అతడు మంగోలుల, తురుష్కుల గుర్రపుస్వారీ నైపుణ్యాలను మెరుగుపరచి, సైన్యంలో పరుగు తీవ్రతను పెంచాడు. భయంకరమైన చలి, తీవ్రమైన వేడిని సైతం లెక్కచేయకుండా శత్రువులను వెంటాడి, వధించి విజయాలు సాధించడం, ప్రాంతాలు జయించడం వంటి యుద్ధకాంక్షను మంగోలులో రగిలించాడు.

మంగోలులను ఐక్యపరచి, ఆదివాసీ, సంచార తెగల నిరంతర అంతర్యుద్ధాల నుండి వారికి విముక్తి ప్రసాదించి, చైనా దోపిడీ నుండి కాపాడి, వారిని అభివృద్ధి పథంలో నడిపిన ఒక నాయకుడిగా చంఘీస్ ఖాన్ నిలచిపోయాడు. నేటికీ మంగోలులకు చంఘీస్ ఖాన్ ప్రేరణ కలిగిస్తూ జాతీయనాయకుడిగా ఆ దేశ ప్రజలచే గౌరవింపబడుతున్నాడు. తన విజయాలతో ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విజేతగా నిలిచిపోయాడు.

ప్రశ్న 4.
స్టెప్పీ సమాఖ్యల ప్రాధాన్యతను తెలపండి.
జవాబు:
మంగోలు – తుర్కీ ప్రజలకు చెందిన మధ్య ఆసియాలోని కొన్ని గొప్ప స్టెప్పీ సమాఖ్యలు ఏమనగా: క్రీ.పూ. 200 సంవత్సరాలకు చెందిన తురుష్కుల సియుంగు, క్రీ.శ. 400 సంవత్సరాలకు చెందిన మంగోలుల జువాన్, క్రీ.శ. 400 సంవత్సరాలకు చెందిన మంగోలుల ఎప్తలైట్ హూణులు, క్రీ.శ. 550 సంవత్సరాలకు చెందిన తురుష్కుల టుచు, క్రీ.శ. 740 సం॥లకు చెందిన తురుష్కుల ఇఝారులు, క్రీ.శ. 940 సంవత్సరాలకు చెందిన మంగోలుల ఖిటాన్లు. వారి ఆక్రమణలు ఒకే ప్రాంతానికి పరిమితం కాక సమంగా లేక వారి ఆంతరంగిక వ్యవస్థ క్లిష్టంగా ఉండేది. సంచార జనాభాపై వారి ప్రభావం ఉండేది. వీరి ప్రభావ తీవ్రత చైనా తదితర దేశాలలో వేరు వేరుగా ఉంది.

క్రీ.శ 13వ శతాబ్దపు తొలిదశకాలలో మంగోలుల నాయకుడైన చంఘీస్ ఖాన్ మంగోలు జాతి ప్రజలను ఇతర తెగల ప్రజలను కలిపి బలమైన సమాఖ్య రాజ్యాన్ని మధ్య ఆసియాలోని స్టెప్పీలనే పచ్చికబయళ్ళ ప్రాంతంలో నిర్మించాడు. ఇతడు తన అధికారాన్ని చైనా, ట్రాన్సాక్సియానా, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు ఇరాన్, రష్యా స్టెప్పీలకు వ్యాపింపజేసాడు. తరువాత అతడు అనేక చైనా ప్రాంతాలను, ఐరోపాలోని అనేక ప్రాంతాలను జయించాడు. క్రీ.శ 1220లో ప్రముఖ బుఖారా పట్టణాన్ని వశపరచుకున్నాడు. అతని అనుచరులు మరింత ముందుకు సాగి బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఉదా: చంఘీస్ ఖాన్ ఒక మనువడు మాంగ్ కే (క్రీ.శ. 1251 60) ఫ్రెంచ్ రాజును బెదిరించి కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకోగా, మరో మనువడు బాటు, మాస్కో వరకు రష్యా ప్రాంతాలు ఆక్రమించి పోలండ్, హంగరీ, వియన్నా రాజ్యాలను క్రీ.శ 1236-41 మధ్య దాడులలో వశపరచుకున్నాడు.

మంగోలులు భిన్న సమూహాలకు చెందినవారు. వారు భాషాపరంగా టాటార్లు, ఖిటాన్, మంచూ, తుర్కీ తెగలకు దగ్గరగా ఉంటారు. వారిలో కొందరు గ్రామీణ జీవితాన్ని గడపగా కొందరు వేటగాళ్ళుగా జీవించారు. గ్రామీణులు గుర్రాలు, ఎద్దులు, మేకలు, ఒంటెలు వంటి జంతువులను పెంచేవారు. వారు మధ్య ఆసియాలోని స్టెప్పీలలో ముఖ్యంగా ఆధునిక మంగోలియా రాజ్యంలో సంచార జీవితం గడిపారు. ఈ ప్రాంతం అల్బాయ్ పర్వతాలతో, గోబి ఎడారి, ఆనాన్, శిలంగా నదులు. అనేక ప్రవాహాలతో అందంగా, అద్భుతంగా ఉండేది. వేట లేక ఆటవికులు గ్రామీణులకు ఉత్తర ప్రాంతమైన సైబీరియా అటవీ ప్రాంతంలో ఉండేవారు. గ్రామీణుల కంటే వారు కొంత వినమ్రతతో జంతు చర్మాలు అమ్మి తన జీవితాన్ని గడిపారు. ఈ రెండు తరగతుల వారు నివసించే ప్రాంతంలో శీతోష్ణస్థితి పూర్తి భిన్నంగా ఉండేది.

ఈ రెండు సమూహాలు ప్రజలు ఆర్థికంగా స్థిరజీవితాన్ని నిలుపుకోలేకపోవడంతో ఆ ప్రాంతంలో పట్టణాభివృద్ధి జరగలేదు. మంగోలులు గుడారాలలో నివసిస్తూ వేసవి, శీతాకాలాల పచ్చికబయళ్ళలో పరస్పరం మారుతూ సంచరించేవారు. చంఘీస్ ఖాన్ నాయకత్వంలోని మంగోలు, తుర్కీ తెగల సమాఖ్య క్రీ.శ 5వ శతాబ్దానికి చెందిన ‘అట్టెలా’ రాజ్యంతో సమంగా ఉండేది. అయితే అట్టెలా కూటమి వలే కాక, చంఘీసన్ రాజకీయ వ్యవస్థ శక్తివంతమై ఎక్కువ కాలం కొనసాగే స్వభావం కలది. ఇది బలమైన సైనిక బలాలు కలిగిన చైనా, ఇరాన్, తూర్పు ఐరోపాలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉండేది.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

చంఘీస్ ఖాన్ మరణాంతం మంగోలు సామ్రాజ్యంలోని సంచార, భిన్న వర్గాల మధ్యగల వైషమ్యాలు సరళమవుతూ వచ్చాయి. ఉదాహరణకు 1230లో మంగోలుల ఉత్తర చైనాకు చెందిన చిన్ రాజవంశంపై విజయవంతంగా దండయాత్ర చేయగా, మంగోలు నాయకత్వంలోని ఒక వర్గం రైతులను వధించి, వారి భూములను పచ్చికబయళ్ళుగా మార్చమని ఒత్తిడి చేసింది. తరువాత కాలంలో ఘజన్ ఖాన్ వంటివారు దీనిని వ్యతిరేకించారు. ఇది వారిలో ఉండే సంప్రదాయ రీతి అయిన గడ్డి భూముల పట్ల వారి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. చంఘీస్ ఖాన్ తన తదనంతరం తన మొదటి కుమారుడు జోచికి రష్యా స్టెప్పీలను, రెండవ కుమారుడు చగతాయ్కి ట్రాన్సాక్సియానా స్టెప్పీలను, సామీరు పర్వత ఉత్తర భూములను, మూడవ కుమారుడు ఒగొడికి కారకోరమ్ పర్వత ప్రాంతాలని, చివరి కుమారుడు టోలుయ్కి తన పూర్వీకుల మంగోలియా ప్రాంతాలను ఇచ్చాడు.

మంగోలులు క్లిష్టమైన వ్యవసాయం, ఆర్థికవ్యవస్థలు, పట్టణ స్థిరత్వం, స్వల్పసామాజిక వ్యవస్థలు కలిగిన పరిపాలన చేసారు. అది వారి సహజ సామాజిక జీవితానికి పూర్తిగా భిన్నమైంది.

ఎటువంటి సంచారజాతి సామ్రాజ్యాన్ని పరిశీలించినా మంగోలుల వలె చెల్లా చెదురైన వివిధ జాతులు, తెగలు, సమూహాలు చైతన్యవంతులై, ఏకమై ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం ఊహకందనిది, నమ్మలేనిది.

ప్రశ్న 5.
మంగోలుల చరిత్రలో ఘజన్ ఖాన్ స్థానం ఎట్టిది?
జవాబు:
ఘజన్ 1271లో ఇల్-ఖానిడ్ పాలకుడైన ఆర్గున్, తల్లి ఖుత్లుక్ ఖాతున్లకు జన్మించాడు. ఘజన్ చిన్నతనంలో బాప్టిజం ఇచ్చి క్రైస్తవుడిగా పెంచబడ్డాడు. యవ్వనావస్థలో చైనా బౌద్ధ సన్యాసి వద్ద విద్యనభ్యసించాడు. అతని ద్వారా బౌద్ధాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఘజన్ ఖాన్ ను పాశ్చాత్యులు ‘కాసనస్’ అని పిలిచేవారు. ఇలా నిడ్ పాలకులు చంఘీస్ ఖాన్ చిన్న కుమారుడు ‘లొలుయి’ సంతతికి చెందినవారు. ఇతను ఇల్-ఖానిడ్ ఆనిడ్ వంశంలో 7వ పాలకుడు. ఈ ప్రాంతం నేటి ఆధునిక ఇరాన్ ప్రాంతం. 11 ఏళ్ళ వయసుకే వైస్రాయిగా ‘ఖొరాసాన్’ పాలకుడయ్యాడు.

క్రీ.శ 1291లో ఘజన్ తండ్రి ఆర్గున్ చనిపోయే సమయానికి ఘజన్ ఖాన్ ‘నవజ్’ అనే కులీనుడి తిరుగుబాటు, ఛాగాయ్ మంగోలులు, తుర్కీ మంగోలులను ఎదుర్కొనవలసి వచ్చింది. 1295 ప్రాంతాలలో ఘజన్ ఒత్తిడి మేరకు ‘నవ్రజ్’ లొంగిపోయి, ఘజన్ దళ నాయకుడిగా మారాడు. ‘నవ్రజ్’ సహాయంతో కుట్రలను ఛేదించాడు. ‘నవ్రజ్’ ప్రఖ్యాతి చెందిన ముస్లిం అమీర్. నమ్రాజ్ వంటి వారి మద్దతు ఉంటుందని క్రీ.శ 1295లో ఇస్లాంను స్వీకరించాడు. తన పేరును మహమూద్ ఘజన్ గా మార్చుకున్నాడు. ఘజన్ ఇస్లాంను స్వీకరించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో ప్రాచీన మంగోల్ సంప్రదాయాలు పాటించేవాడు.

పరమత సహనం: ఘజన్ ఖాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పటికి, పరమత సహనాన్ని ప్రదర్శించాడు. తన చిన్నతనంలో క్రైస్తవుడిగా పెంచబడ్డాడు. యవ్వనంలో బౌద్ధమత గురువు ప్రభావంతో బౌద్ధం వైపు ఆకర్షితుడయ్యాడు. 1295లో రాజకీయ అవసరాల నిమిత్తం ఇస్లాంను స్వీకరించాడు. తన రాజ్యంలోని క్రైస్తవులను జిజియా పన్ను నుంచి మినహాయించాడు. అయితే ఈ పరమత సహనం ‘నవ్రజ్’ వంటి నాయకులు సహించలేకపోయారు. ఎన్నో బౌద్ధరామాలను శాశ్వతంగా ధ్వంసం చేసారు. చివరకు టిబెట్ వెళ్ళదలుచుకున్న బౌద్ధులందరికీ అనుమతినిచ్చాడు. ‘నవ్రజ్’ అతని అనుచరుల ఆగడాలు మితిమీరి పోతుండుటచే ఘజన్ ఖాన్ అతనిని అణచివేసాడు.

తమ చిరకాల శత్రువులైన ఈజిప్ట్ మామ్లుక్ తో యుద్ధం చేయడానికి 1299లో క్రైస్తవులను ఆహ్వానించి వారితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో మామ్లుక్లలు ఓడించబడ్డారు. తరువాత కాలంలో తుర్క్ మంగోల్ ఛాగ్తాయ్లాతో యుద్ధం చేసాడు. ఈ విధంగా ఎక్కువ కాలం యుద్ధరంగంలోనే గడిపాడు.

సంస్కరణలు: ఘజనాఖాన్ ఇలా నిడ్ సామ్రాజ్యంలో అనేక సంస్కరణలు చేపట్టాడు. తన ప్రాంతంలోని రైతుల సంక్షేమానికి కృషి చేసినట్లు తెలుస్తుంది. ఇతడు మంగోలు తురుష్క సంచార సైన్యాధికారులకు క్రింది సందేశాన్నిచ్చాడు. ఈ సందేశాన్ని అతని వజీర్ రషీదుద్దీన్ తయారుచేసాడని కొందరి అభిప్రాయం.

“నేను పారశీక కర్షకుల వైపు లేను. వారిని నిర్మూలించాలనే తలంపు ఉంటే ఆ పనిని నాకంటే శక్తివంతంగా చేసేవారు మరొకరు లేరు. అయితే మీరు తిండిగింజలను, ఆహారపదార్థాలను పొందాలనుకుంటే మీ పట్ల కఠినంగా వ్యవహరిస్తాను …… వినమ్రతగా ఉన్న కర్షకులను శత్రువులుగా ఉన్న కర్షకుల నుండి వేరుచేసి గౌరవించాలి” అని సందేశమిచ్చాడు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

మిలటరీ సంస్కరణలు: సైన్యంలో ఎన్నో కొత్త దళాలను ఏర్పాటు చేసాడు. మంగోలు రాజ్యంలోని సామాన్యులు ఎందరో తమ పిల్లలను బానిసలుగా అమ్ముతుంటే, వారిని విడిపించి తన మంత్రులలో ఒకడైన బోలాడ్ నేతృత్వంలో వారందరినీ ఒక సైనిక యూనిట్గా ఏర్పరచాడు.

ఆర్థిక సంస్కరణలు: కాగితం కరెన్సీ ప్రవేశాన్ని వ్యతిరేకించిన ఘజన్ ఖాన్ తన రాజ్యం అంతా ఒకేరకమైన నాణేలు ప్రవేశపెట్టాడు. వాటిని గజనీ దినార్స్ అన్నారు. మార్కెట్ వ్యవస్థను క్రమబద్దీకరించాడు.

నిర్మాణాలు, ఘనత: ఘజన్ ఖాన్ ఉన్నత సాంస్కృత విలువలు కలిగినవాడు. ఇతడు అనేక భాషలు మాట్లాడగలడు, కళాపోషణారాధకుడు. చిత్రలేఖనం, రసాయనశాస్త్రం, వ్యవసాయం పట్ల ఎంతో మక్కువగా ఉండేవాడు. తన ప్రజల సంక్షేమం కోసం హాస్టల్స్, హాస్పటల్స్, విద్యాలయాలు, తపాల వ్యవస్థలు ఏర్పాటు చేసాడు. ‘రషీద్-అల్-దీన్’ అనే చరిత్రకారుడుని తన వంశ చరిత్ర రాయమని ఘజన్ కోరాడు. ఇతడు తన సామ్రాజ్యంలో మంగోలియన్ యాసాకోడ్ను అమలుచేసాడు.

ఒక యూరప్ చరిత్రకారుడి ప్రకారం 14వ శతాబ్దంలో ఎందరో యూరోపియన్లు తమ పిల్లలకు మంగోల్ పాలకుల పేర్లు పెట్టుకోవడం గొప్పగా భావించేవారు. ‘గజన్’ పేరును ఎక్కువమంది పెట్టుకునేవారు. ఇంతటి ఘనత వహించి ఘజన్ ఖాన్ క్రీ.శ 1304లో 33 సంవత్సరాల వయసులోనే మరణించాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సంచారజాతి సామ్రాజ్యాలు.
జవాబు:
సంచార అంటే ‘దేశ దిమ్మర’, ‘అనాగరిక జాతులు’ అని వ్యవహరించేవారు. మధ్య ఆసియాకు చెందిన మంగోలులు, అరేబియా ద్వీపకల్పంలోని బెడౌన్లు, గౌలులు, హూణులు ఇలాంటివారే. కొన్ని సంచారజాతులు కుటుంబవ్యవస్థను కలిగి ఉండగా, కొన్ని జాతులకు కుటుంబ జీవితం ఉండేది కాదు. వీరి రాజకీయ వ్యవస్థ వెనుకబడి ఉండేది. సామ్రాజ్యం అంటే మిశ్రమ సాంఘిక, ఆర్థిక భావాలతో కూడిన నిర్మాణం. క్రీ.శ 13, 14 శతాబ్దాలలో మంగోలులు చంఘీస్ ఖాన్ నాయకత్వంలో ఐరోపా, ఆసియా ప్రాంతాలతో మధ్య ఆసియాలో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మంగోలు సంచార తెగలు నిబద్ధతతో కూడిన సాంఘిక, ఆర్థిక జీవితాన్ని కలిగి ఉండేవారు. ఈ తెగల వారు చారిత్రకంగా వచ్చే పరిణామాలను అంగీకరించరు. వారి సాంప్రదాయాల కనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక పద్ధతులు పాటిస్తూ, తమ అధికారానికి మూలహేతువైన, శక్తివంతమైన సైనిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

ప్రశ్న 2.
రష్యా పండితులు.
జవాబు:
మంగోలులపై విస్తృత రచనలు చేసినవారు రష్యా పరిశోధకులైన యాత్రికులు, సైనికులు, వ్యాపారులు, పురాతత్వవేత్తలు క్రీ.శ 18, 19 శతాబ్దాలకు చెందినవారు. 19వ శతాబ్దంలోని చరిత్రకారుడైన N.M కరంజినే టాటర్ల వలన రష్యా వెనుకబడిందని భావించాడు. మరోవైపు మరో చరిత్రకారుడు S.M సొలెవేవ్ మంగోలుల ఆక్రమణ ప్రభావం చాలా స్వల్పకాలికమైన, దీర్ఘకాలక ప్రభావం ఏమీలేదని పేర్కొన్నాడు. వివి. బోర్తోల్డ్, ప్రొఫెసర్ జార్జ్ వెర్నార్డ్స్క వంటివారు కూడా మంగోలుల రష్యా ఆక్రమణ వాటి ప్రభావాలని అంచనా వేసారు.

క్రీ.శ. 20వ శతాబ్దపు తొలినాళ్ళలో రష్యాకు చెందిన బోరిస్ ఎకోఫ్లెవిచ్ వ్లాడిమిర్టోవ్, మంగోలుల భాష, సమాజం, సంస్కృతులపై చక్కని రచనలు చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

ప్రశ్న 3.
మంగోలుల దండయాత్రలు.
జవాబు:
క్రీ.శ 13వ శతాబ్దంలో మంగోలులు నాయకుడు చంఘీస్ ఖాన్ తన జాతి ప్రజలను, ఇతర తెగలను కలిపి గొప్ప సైన్యాన్ని నిర్మించాడు. ఇతడు తన అధికారాన్ని చైనా, ట్రాన్సాక్సియనా, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు ఇరాన్, రష్యా స్టెప్పీలకు వ్యాపింపచేసాడు. క్రీ.శ 1220లో ప్రముఖ బుఖారా పట్టణాన్ని ఆక్రమించాడు. తరువాత కాలంలో చంఘీస్ ఖాన్ మనుమడు మాంగ్ కే ఫ్రెంచ్జును బెదిరించి కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకున్నాడు. మరో మనుమడు బాటు, మాస్కో వరకు రష్యా ప్రాంతాలు ఆక్రమించారు. పోలండ్, హంగరీ, వియన్నా రాజ్యాలను వశపరచుకున్నారు.

మంగోలు దండయాత్రల మూలంగా ఎన్నో పట్టణాలు ధ్వంసం చేయబడ్డాయి. వ్యవసాయ భూములు నిరుపయోగమయ్యాయి. లక్షల మంది చంపబడ్డారు. వర్తక, వ్యాపార, హస్తకళలు మూగబోయాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు, బానిసలయ్యారు. మంగోలుల దండయాత్రల ధాటికి చైనా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలోని ఎన్నో దేశాలు భయోత్పాతాన్ని పొందాయి.

ప్రశ్న 4.
మంగోలు రాజవంశం.
జవాబు:
అనేక మంది స్త్రీలకు భర్త అయిన చంఘీస్ ఖాన్కు అనేక మంది పిల్లలు జన్మించారు. తన మొదటి భార్య బోర్టెకు జన్మించిన నలుగురు కుమారులు మంగోలు వంశవృక్షమయ్యారు. వారి జోచి, చగతాయ్, ఒగొడి, టోలుయిలు. మొదటి కుమారుడు జోచి, కుమారులు లేకపోయినా శక్తివంతంగా పాలించాడు. గుయుక్ మరణానంతరం ఒగొడి వంశస్థులకు మద్దతు ఇవ్వకుండా జోచి కుమారుడు బాటు టొలుయ వైపు మొగ్గు చూపి, మొంగ్కె, కుబ్లట్లకు తెర తెరిచాడు. దీని వలన మంగోలు వంశంలో అంతర్గత పోరు తప్పలేదు.

ప్రశ్న 5.
మంగోలులు చేసిన వినాశనం.
జవాబు:
చంఘీస్ ఖాన్ దండయాత్రల గురించి తయారైన నివేదికలన్నీ అనేక నగరాలను, పట్టణాలను ఆక్రమించి ధ్వంసం చేసినందున, అంతులేనంతమంది ప్రజలు మరణించారని అంగీకరిస్తున్నాయి. క్రీ.శ 1220లో నిషాపూర్ను పట్టుకున్నప్పుడు 17,47,000 మంది ప్రజలు ఊచకోతకు గురికాగా, క్రీ.శ 1222లో హీరట్ వద్ద 16 లక్షల మందిని, క్రీ.శ 1258లో బాగ్దాద్ వద్ద 8 లక్షల మంది చంపబడగా అదే నిష్పత్తిలో చిన్న చిన్న పట్టణాలు నష్టపోయాయి. నాసా వద్ద 70,000 మంది, బాయ్ ఖ్ జిల్లాలో 70,000 మంది, కుహిస్థాన్ ప్రాంతంలోని టున్ వద్ద 12 వేల మందిని ఉరితీసారు. ఇలా నిడ్లో 13 లక్షలమంది చనిపోయారని పారశీక జువైనీ పేర్కొన్నాడు. అయితే పారశీక వృత్తాంతాలు అతిశయోక్తులతో నిండాయని కొందరు చరిత్రకారులు అంచనా. వీరి దండయాత్రల వలన వ్యవసాయ భూములు నిరుపయోగమయి, వర్తక వ్యాపార హస్తకళలు మూగబోయాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇంకెంతో మంది బానిసలయ్యారు. ఇలా ఎన్నో నగరాలు శాశ్వత విధ్వంసానికి గురైనాయి.

ప్రశ్న 6.
యాసా.
జవాబు:
డేవిడ్ అయలాన్ ప్రకారం ‘యాసా’ అనే న్యాయస్మృతిని చంఘీస్ ఖాన్ క్రీ.శ. 1206వ సంవత్సరంలో జారీ చేసాడు. ఈ పదం ‘యాసఖ్’ అని రాయబడింది. దీని అర్థం ‘న్యాయం’, ‘ఆదేశం’, ‘ఆజ్ఞ’. మరికొన్ని వివరాలను బట్టి యాసఖ్ పరిపాలనా నిబంధనలైన వేటాడే పద్ధతి, సైన్యం, పోస్టల్ వ్యవస్థలను గురించి తెలిపే పద్ధతి. క్రీ.శ. 13 వ శతాబ్దపు మధ్య కాలానికి మంగోలులు దీనిని పోలిన ‘యాసా’ అనే పదాన్ని ‘సాధారణ న్యాయస్మృతి’ అనే అర్థంతో వాడారు.

మంగోలులు తమ ఉనికిని కాపాడుకొని, ప్రత్యేకతను చాటుకొనుటకు వారు యాసాను తమ నాయకుడిచ్చిన పవిత్ర స్మృతిగా ఉపయోగించారు. యాసా అనేది మంగోలు తెగల ఆచార, సంప్రదాయాల సంకలనం. మంగోలులు దీనిని చంఘీస్ ఖాన్ న్యాయస్మృతి అని ప్రజలపై రుద్దారు. ఇది మంగోలుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, తమ సంచారజాతి చిహ్నాన్ని గుర్తించి, ఈ న్యాయస్మృతిని ఓటమి పాలైన వారిపై రుద్దేటట్లు చేసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 5 సంచారజాతి సామ్రాజ్యాలు మంగోలులు, చంఘీస్ ఖాన్

ప్రశ్న 7.
చైనా గొప్ప ప్రాకార నిర్మాణానికి కారణాలు.
జవాబు:
తన మొత్తం చరిత్రలో అనేక సంచార జాతుల దాడులు, రాజ్యాల ఆక్రమణల వలన చైనా ఎంతో నష్టపోయింది. అందువలన చైనా పాలకులు క్రీ.పూ. 8వ శతాబ్దం నుండీ తమ ప్రజల రక్షణార్థం అనేక కోటలు, ప్రాకారాలు నిర్మించుకున్నారు. తరువాత క్రీ.పూ 3వ శతాబ్దం నుండి ఈ కోటల నిర్మాణాలు అందరి రక్షణ నిర్మాణాలుగా కలిసిపోయి ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చైనా గొప్ప ప్రాకారంగా పిలువబడుతోంది. ఉత్తర చైనాలోని వ్యవసాయ సమాజాలపై జరిగే సంచార జాతుల దాడుల వలన కలిగే భయం, కలత చెందటం వంటి వాటి నుండి ప్రజలకు రక్షణ కల్గించేదిగా ఈ నిర్మాణం చక్కని తార్కాణంగా కన్పిస్తుంది. ఈ ప్రాకారాన్ని చిన్ వంశానికి చెందిన షి హ్యాంగ్ అనే రాజు క్రీ.పూ. 221 నుండి 207 వరకు నిర్మించి పాలించాడు.

Leave a Comment