AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు.
AP State Syllabus 8th Class Telugu Important Questions 3rd Lesson నీతి పరిమళాలు
8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది చుక్కగుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.
1) చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తిఁ గోరు నా
 ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
 లనుకొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా
 ననిశము మోవఁడే మణి మహాభరమైన ధరిత్రి భాస్కరా ! – (భాస్కర శతకం)
భావం :
 భాస్కరా ! కీర్తిని కోరే గుణవంతుడు, తనకు ఎలాంటి లాభమునూ ఆశింపడు. లోకానికి మేలు జరిగే కార్యము ఎంత భారమైనా, చేయడానికి పూనుకుంటాడు. ఆదిశేషుడు గాలిని మాత్రమే మేస్తూ, తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా !
2) చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
 చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
 బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
 పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా ! – (భాస్కర శతకం)
భావం:
 భాస్కరా ! ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతనూ గ్రహింప లేనప్పుడు, ఆ చదువు వ్యర్థం. దాన్ని గుణవంతులు ఎవరూ మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి నలపాకంగా, వంట చేసినా, దానిలో తగిన ఉప్పు వేయకపోతే అది రుచించదు కదా?

3) ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
 భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
 భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
 గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్ – (సుభాషిత రత్నావళి)
భావం :
 మానవులకు బంగారు కేయూరాలు, ముత్యాలహారాలు అలంకారాలు కావు. జుట్టు దువ్వుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, పన్నీటితో స్నానం చేయడం మానవుడికి అలంకారాలు కావు. పవిత్రమైన వాక్కు, పురుషుని అలంకరిస్తుంది. సంస్కారవంతమైన మాటయే, నిజమైన అలంకారము. మిగిలిన అలంకారాలు, నశించి పోయేవే.
4) చ. వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
 వినికికి (జిక్కె (జిల్వ గనువేదురుఁ జెందెను లేళ్ళు, తావినో
 మని నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ వైదుసా
 ధనముల నీవె గావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ ! – (దాశరథీ శతకం)
భావం :
 దయా సముద్రుడవైన ఓ రామా ! తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగూ ; నోటి రుచిని ఆశించి చేప, సంగీతానికి లొంగి పామూ, అందానికి బానిసయై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలూ, బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి, ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియములందూ చాపల్యం గల నేను, ఎలా బయటపడగలను? ఓ దశరథ పుత్రా! కరుణాసాగరా ! రామా ! నీవే నన్ను కాపాడాలి.
5) ఆ.వె. క్షమను కడఁక నెవరు గాపాడుకొందుఱో
 క్షమను చిరము వారు కావ గలరు
 కదలకుండ నెవరికడ క్షమయుండునో
 సర్వకార్యములకు క్షములు వారు – (సభారంజన శతకం)
భావం :
 ఎవరు ప్రయత్నంతో క్షమను (ఓరిమిని) కాపాడుకుంటారో, వారు క్షమను’ (భూమిని) కాపాడతారు. ఎవరిలో క్షమ (సహనం) నిశ్చలంగా ఉంటుందో, వారు అన్ని పనుల్లోనూ క్షములై (సమర్థులై) ఉంటారు.
6) శా. ఊరూరం జనులెల్ల క్షమిడరో, యుండం గుహలలవో
 చీరానీకము వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛ వాః
 పూరం బేరుల బారదో తపసులం బ్రోవంగ నీవోపవో
 చేరంబోవుదు రేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! – (శ్రీకాళహస్తీశ్వర శతకం)
భావం :
 శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి భిక్షం అడిగితే ప్రతి గ్రామంలోనూ ప్రజలు భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతం లాంటి తియ్యని నీరు ఉంది. తపస్సు చేసుకొనే మనుష్యులను కాపాడడానికి నీవున్నావు. ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలియడం లేదు.

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి
 కం|| “ఇందుగలడందులేడని
 సందేహము వలదు చక్రి సర్వోపగతుం
 డెందెందు వెదకి చూచిన
 నందందే కలడు దానవాగ్రణి వింటే”
 ప్రశ్నలు :
 1. సర్వోపగతుండెవరు?
 జవాబు:
 సర్వోపగతుండు ‘చక్రి’. చక్రి అనగా చక్రమును ధరించే శ్రీమహావిష్ణువు.
2. చక్రి ఎక్కడున్నాడు?
 జవాబు:
 చక్రి అన్ని చోట్లా ఉంటాడు.
3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తుంది?
 జవాబు:
 ఈ పద్యం, దానవాగ్రణిని అంటే రాక్షసరాజు హిరణ్యకశిపుని సంబోధిస్తుంది.
4. ఈ పద్యం ఏ గ్రంథంలోనిది .? (రామాయణం, భారతం, భాగవతం)
 జవాబు:
 ఈ పద్యం భాగవతం లోనిది.
2. కింది పద్యాన్ని చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
“కమలములు నీట బాసిన
 కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
 తమ తమ నెలవులు దప్పిన
 తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ”
 ప్రశ్నలు :
 1. కమలములు ఎపుడు వాడిపోతాయి?
 జవాబు:
 కమలములు నీటిలో నుండి బయటకు వస్తే సూర్యుని కాంతి తాకి వాడిపోతాయి.
2. మిత్రులు శత్రువులు ఎపుడు అవుతారు?
 జవాబు:
 తమ తమ స్థానాలను కోల్పోతే మిత్రులు శత్రువులు అవుతారు.
3. ఈ పద్యానికి మకుటమేది?
 జవాబు:
 సుమతీ
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
 జవాబు:
 రశ్మి అనగా ఏమిటి?
3. కింది పద్యమును చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి
అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
 తినగ తినగ వేము తీయనుండు
 సాధనమున పనులు సమకూరు ధరలోన
 విశ్వదాభిరామ ! వినురవేమ!
 ప్రశ్నలు :
 1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
 జవాబు:
 అంటూ ఉంటే అతిశయిల్లేది రాగము.
2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
 జవాబు:
 తింటూ ఉంటే తీయనయ్యేది వేము.
3. సాధనతో సమకూరేవి ఏవి?
 జవాబు:
 సాధనమున పనులు సమకూరు ధరలోన
4. ఈ పద్యానికి మకుటం ఏమిటి?
 జవాబు:
 విశ్వదాభిరామ ! వినురవేమ !

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించండి.
 చేతులారంగ శివుని పూజింపడేని
 నోరునొవ్వంగ హరికీర్తినుడువడేని
 దయయుసత్యంబులోనుగా దలపడేని
 కలుగనేటికి తల్లులు కడుపుచేటు
 ప్రశ్నలు :
 1. “కడుపుచేటు” అనే మాటకు అర్థం
 ఎ) చెడ్డకడుపు
 బి) పుట్టుక దండగ
 సి) తల్లులకు బాధ
 జవాబు:
 బి) పుట్టుక దండగ
2. శివపూజ ఎలా చేయమంటున్నాడు కవి?
 ఎ) ఆరు చేతులతో
 బి) చేతులు నొప్పి పుట్టేటట్లు
 సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
 జవాబు:
 సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
3. దయను, సత్యాన్ని రెండింటిలో మనిషి వేటిని తలచాలి?
 ఎ) దయను మాత్రమే
 బి) సత్యాన్ని మాత్రమే
 సి) దయను, సత్యాన్ని రెండింటిని
 జవాబు:
 సి) దయను, సత్యాన్ని రెండింటిని
4. నోరారా హరి కీర్తిని………….
 ఎ) పిలవాలి
 బి) పలకాలి
 సి) అరవాలి
 జవాబు:
 బి) పలకాలి
5. కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి
 చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
 నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
 సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
 పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
 ప్రశ్నలు :
 1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
 జవాబు:
 నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.
2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
 జవాబు:
 పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.
3. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
 జవాబు:
 ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.
4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
 జవాబు:
 ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.
6. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
 చీమలు పెట్టిన పుట్టలు
 పాముల కిరవైనయట్లు పామరుడుదగన్
 హేమంబు కూడబెట్టిన
 భూమీశుల పాలజేరు భువిలో సుమతీ !
 ప్రశ్నలు:
 1. చీమలు పెట్టిన పుట్టలు వేటికి స్థానమవుతాయి?
 జవాబు:
 పాములకు
2. పై పద్యంలో కవి పామరుడిని ఎవరితో పోల్చాడు?
 జవాబు:
 చీమలతో
3. ‘బంగారం’ అనే అర్థం వచ్చే పదం పై పద్యంలో ఉంది. గుర్తించి రాయండి.
 జవాబు:
 హేమము
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
 జవాబు:
 ‘భూమీశుడు’ అనగా ఎవరు?
7. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
 అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను
 సజ్జనుండు బల్కు జల్లగాను
 కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
 విశ్వదాభిరామ ! వినురవేమ !
 ప్రశ్నలు :
 1. అల్పుని మాటలు ఎలా ఉంటాయి?
 జవాబు:
 ఆడంబరంగా
2. ఆహ్లాదకరంగా మాట్లాడువారు ఎవరు?
 జవాబు:
 సజ్జనుడు
3. కవి ఈ పద్యంలో ఏ రెండు లోహాలను పోల్చారు?
 జవాబు:
 కంచు, బంగారం
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
 జవాబు:
 దీనిలోని మకుటం ఏది?

8. కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
 ఆచార్యున కెదిరింపకు
 బ్రోచిన దొరనింద సేయ బోకుము కార్యా
 లోచనము లొంటి జేయకు
 మాచారము విడువ బోకుమయ్య ! కుమారా !
 ప్రశ్నలు :
 1. ఒంటరిగా చేయకూడనిది ఏది?
 జవాబు:
 కార్యాలోచనము.
2. వేటిని విడిచి పెట్టకూడదు?
 జవాబు:
 ఆచారములు.
3. “తనని పోషించిన యజమానిని నిందించరాదు” అనే భావం వచ్చే పద్యపాదాన్ని గుర్తించి రాయండి.
 జవాబు:
 బ్రోచిన దొర నింద సేయబోకుము.
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
 జవాబు:
 ఈ పద్యా నికి మకుటం ఏమిటి?
 (లేదా)
 ఈ పద్యాన్ని రాసినది ఎవరు?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
 ‘శతకం’ అనే ప్రక్రియను వివరించండి. (S.A. I – 2018-19)
 జవాబు:
 ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ అనే ప్రక్రియ ఒకటి. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. కొన్ని శతకాల్లో నూరుకు పైగా పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలు ఉంటాయి. నీతి, ధర్మం, భక్తి, వైరాగ్యం మొదలైన అంశాలను శతకపద్యాలు బోధిస్తాయి. శతక పద్యాలు సమాజంలో నైతిక విలువలను, ఆధ్యాత్మిక భావనను, సత్ప్రవర్తనను కల్గిస్తాయి. సమాజంలో మూఢాచారాలను. తొలగించడానికి సహకరిస్తాయి.
ప్రశ్న 2.
 సంస్కారం అంటే ఏమిటి? దాని గురించి నీవు ఏమనుకున్నావో రాయండి.
 జవాబు:
 సంస్కారం అంటే సంస్కరించడం. అంటే చక్కజేయడం. సాంఘికం, రాజకీయం, పరిపాలన, న్యాయవ్యవస్థ వంటి రంగాల్లో ఉన్న లోపాలను సవరించి, మంచి మార్గంలో పెట్టడం “సంస్కారం”. అలా సంస్కారం చేసిన వారిని “సంస్కర్త” అంటారు. పెద్దలు చెప్పిన మంచిదారిలో నడవడం “సంస్కారం”.
వీరేశలింగం గారు తన కాలం నాటి సంఘంలోని లోపాలను ఎత్తిచూపి, ప్రజలను మంచిదారిలో పెట్టడానికి కృషి చేశాడు. అందుకే ఆయన గొప్ప “సంఘసంస్కర్త” అయ్యాడు.
రాజకీయాలలోని లోపాలను సవరించడానికి ‘అన్నాహజారే’ వంటివారు లోక్ పాల్ బిల్లుకోసం ప్రయత్నించి విజయం సాధించారు. అన్నాహజారే “రాజకీయ సంస్కర్త”.
పూర్వకాలంలో శంకరాచార్యులవారు వేదమతాచారంలోని లోపాలను సంస్కరించి, అద్వైతమతాన్ని స్థాపించారు. ఆయన “మత సంస్కర్త”.
ఇటువంటి సంస్కరణల వల్ల మనిషిలో పెంపొందే ఉత్తమ గుణమే “సంస్కారం”.

ప్రశ్న 3.
 ఏనుగు లక్ష్మణకవి “వాగ్భూషణమే సుభూషణం” అని చెప్పాడు కదా ! దీనిని మీరు సమర్థిస్తారా? ఎందుకు?
 జవాబు:
 ఏనుగు లక్ష్మణకవి వాగ్భూషణమే సుభూషణం అని చెప్పాడు. ఇది నిజమే. ఈ మాట అందరినీ ఆలోచింపచేసేదిగా ఉంది. మంచి మాటకున్న శక్తిని లోకానికి చాటాడు. ఇది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మంచి వాక్కు వల్ల విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న వాక్ శక్తిని పెంపొందించుకొనగలుగుతారు. నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. ఈ వాక్ శక్తి వల్ల ఎంతటి వారినైనా చక్కగా ఆకట్టుకొనగలుతారు. హేతువాద దృష్టిని అలవరుచుకొనగలుగుతారు. – చక్కని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. వాక్ శక్తి వల్ల అనేకములైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రశ్న 4.
 పాఠంలోని పద్యాల్లో ఉన్న నీతిని సొంతమాటల్లో రాయండి.
 జవాబు:
- గొప్ప గుణవంతుడు, లోకానికి హితమైన కార్యాన్ని ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటాడు.
- ఉప్పులేని కూరవలె రసజ్ఞత లేని చదువు వ్యర్థం.
- సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం.
- మానవులను పంచేంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి.
- క్షమాగుణం కలవాడే అన్ని కార్యములకు సమర్థుడు.
- మానవులు రాజులను ఆశ్రయించడం వ్యర్థం.
- ఎదుటి వాడి బలాన్ని తెలుసుకోకుండా అతడితో పోరాడడం అవివేకం.
- జీర్ణం కాని చదువూ, తిండి చెరుపు చేస్తాయి.
ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
 ‘నీతి పరిమళాలు’ పాఠ్యభాగం ఆధారంగా నీవు గ్రహించిన విషయాలను సొంతమాటల్లో రాయండి.
 జవాబు:
 ‘నీతి పరిమళాలు’ అనే పాఠ్యభాగంలో శతక కవులు చక్కని నీతులను చెప్పారు. ఆ నీతులు సమాజానికి ఎంతగానో సహకరిస్తాయి. జగతిని జాగృతం చేస్తాయి. సారం లేకుండా చదివే చదువు ఉప్పులేని కూర వంటిది. మానవునికి బంగారు ఆభరణాలు, పుష్పాలు, సుగంధద్రవ్యాలు, పన్నీటి స్నానాలు అలంకారాలు కావు. సంస్కారవంతమైన వాక్కు మాత్రమే మానవులకు నిజమైన అలంకారం.
మానవుడు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే ఏదైనా సాధించగలడు. పంచేంద్రియాలకు బానిసలైతే పతనాన్ని పొందుతారు. మానవులకు ఓర్పు గొప్ప అలంకారం. ఓర్పుతో అసాధ్యమైన పనులను కూడా సాధించగలడు.
గొప్పవారితో తలపడడం మంచిది కాదు. శక్తిసామర్థ్యాలను గుర్తించకుండా ఎదుటివారితో తలపడితే పరాభవం కలుగక మానదు. గొప్పవారితో పోరాడటం వల్ల వారికేమీ నష్టం కలుగదనే సత్యాన్ని గ్రహించాలి. ఇలాంటి నీతులు అనేకం అనేది పాఠ్యభాగం ద్వారా గ్రహించాను.
ప్రశ్న 2.
 “నోరు మంచిదైతే – ఊరు మంచిదౌతుంది” – దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
 జవాబు:
 ఈ సమస్త చరాచర ప్రకృతిలో అన్నిటికన్నా అద్వితీయమైంది మానవ జన్మ. అది ఎంతో విశిష్టమైంది, విలక్షణమైంది. మమతలు పంచుకుంటూ, మంచిని పెంచుకుంటూ, మానవతకు మారాకులు తొడుగుతూ, ఇలాతలంపై చిరునవ్వుల సిరివెన్నెలలు చిలికించగల శక్తి ఒక్క మానవుడికి మాత్రమే వుంది. అయితే, ఆ మానవుడికి నిజమైన ఆభరణం ఏమిటి? పూసుకునే అత్తరులా? వేసుకునే వస్త్రాలా? చేసుకునే సింగారాలా? ఇది ఒక మహత్తరమైన ప్రశ్న. మనసుపెట్టి ఆలోచిస్తే ఇవేవీ అసలైన ఆభరణాలు కావని ఇట్టే తెలిసిపోతుంది. ఇవన్నీ చెరిగిపోయేవి, వన్నె తరిగిపోయేవి. అలా కాకుండా, మానవుడికి ఎన్నటికీ చెరగని, తరగని ఆభరణంలా నిలచేది మధురమైన వాక్కు ఒక్కటే. మృదువైన భాషణంతో మనిషి అందరినీ ఆకర్షించగలుగుతాడు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతాడు. తన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాడు. దీనికి భిన్నంగా పరుషమైన, కఠినమైన వాక్కు కలిగివుంటే ఆత్మీయులు కూడా ఆగర్భ శత్రువులుగా మారిపోతారు. అంతేకాదు, విరసమైన వాక్కు వలన జరిగే పనులు కూడా చెడిపోతాయి.
ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
 ‘నీతి పరిమళాలు’ పాఠం ఆధారంగా ఏయే మంచి గుణాలను అలవరచుకున్నారో పట్టిక తయారు చేయండి.
 జవాబు:
- మానవులకు బంగారు ఆభరణాలు అలంకారాలు కాదు.
- సంస్కారవంతమైన వాక్కు మాత్రమే నిజమైన అలంకారం.
- రసజ్ఞత లేని చదువు ఉప్పులేని కూరవంటిది.
- గుణవంతుడు లోకానికి మేలు కలిగే కార్యక్రమమంత భారమైనా చేయడానికి ప్రయత్నిస్తాడు.
- మానవుడు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
- ఓర్పును మించిన ఆభరణం మరొకటి లేదు. ఓర్పుతో అసాధ్యములైన పనులను సాధంపవచ్చు.
- రాజులను సేవించడం కంటే దేవదేవుడిని సేవించడం మిన్న.
- శక్తియుక్తులు తెలుసుకోకుండా తోటివారితో పోరాడకూడదు.
- అర్థం చేసుకొని చదవాలి. అవసరమైనంత మాత్రమే భుజించాలి.

ప్రశ్న 2.
 నీకు నచ్చిన శతక కవిని గురించి మిత్రునికి లేఖ రాయండి.
 జవాబు:
| పొదిలి, ప్రియమైన మిత్రుడు రాధాకృష్ణకు, నీ మిత్రుడు రాయునది నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది మన తెలుగు సాహిత్యంలో ఎందరో శతకకవులు ఉన్నారు. వారిలో నాకు భాస్కర శతక రచయిత మారద వెంకయ్య బాగా నచ్చారు. వారు జీవిత సత్యాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రతి పద్యంలోను, దృష్టాంతంలో చెప్పిన విధం ఆకట్టుకుంది, అన్ని రంగాలమీద తన అభిప్రాయాలను, ముఖ్యంగా చదువు, వినయం మొదలైన విషయాల మీద చక్కని పద్యాలను రచించారు. భాస్కరా అనే మకుటంతో పద్యాలు రచించారు. వీరి శైలి కూడా లలితంగా ఉంటుంది. అట్లే నీకు నచ్చిన శతక కవిని గురించి వివరంగా నాకు తెలియజేయి. పెద్దలందరికి నా నమస్కారాలు తెలుపగలవు. ఇట్లు, చిరునామా : | 
ప్రశ్న 3.
 పాఠంలోని పద్యభాగాల ఆధారంగా విద్యార్థులలో నైతిక విలువల పట్ల అవగాహన పెంచడానికై ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
 జవాబు:
 శతకపద్యాలు చదవండి
ప్రియమైన విద్యార్థులారా ! మన తెలుగు సాహిత్యంలో శతక గ్రంథాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఎందరో మహాకవులు తమ జీవిత అనుభవసారాన్ని రంగరించి చిన్న చిన్న పద్యాలతో మనకు అందించారు. విలువైన అంశాలను చిన్నపద్యాల్లో చిరస్థాయిగా గుర్తుపెట్టుకోనే విధంగా అందించారు. దీన్ని మనం మరువకూడదు. వేమన, వీరబ్రహ్మం వంటి ప్రజా కవులు సమాజంలోని సాంఘిక దురాచారాలను తూర్పారబట్టారు. నైతిక విలువల్ని, మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. ఆ మహనీయుల పద్యరత్నాలను అందరూ చదవండి. వాటిని ఆచరించండి. లోకానికి ఆదర్శంగా నిలువండి.
 ఇట్లు,
 తెలుగు భాషా సేవా కమిటి.
ప్రశ్న 4.
 పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతకకవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనలను గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు ? ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
 జవాబు:
 ఇంటర్వ్యూ ప్రశ్నావళి
- శతక కవులకు స్వాగతం. ‘శతకాలు’ ఎన్ని రకాలు?
- తెలుగులో మొదటి శతకకర్త ఎవరు?
- శతకాల్లో ఎన్ని రకాలున్నాయి?
- మకుటం లేని శతకాలు ఏమైనా ఉన్నాయా?
- నీతి శతకాల ప్రాముఖ్యత ఏమిటి?
- భక్తి శతకాలు మీరు ఏమైనా రాశారా?
- ‘కాళహస్తీశ్వర శతకం’లో భక్తి ఎక్కువగా ఉందా? రాజదూషణ ఉందా?
- వసురాయకవి గారి భక్త చింతామణి శతకం గూర్చి చెప్పండి.
- ‘సుమతి శతకం’ ప్రత్యేకత. ఎటువంటిది?
- మీకు నచ్చిన శతకం ఏమిటి?
- ఛందోబద్ధం కాని శతకాలు ఏమైనా ఉన్నాయా?
- మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు 1 Mark Bits
1. తావినికికి జిక్కెం “జిల్వ” (అర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
 ఎ) చేప
 బి) పాము
 సి) ఏనుగు
 డి) తేనెటీగ
 జవాబు:
 బి) పాము
2. “రాముడు” ఇది ఏ గణం? (S.A. I – 2018-19)
 ఎ) ర గణం
 బి) జ గణం
 సి) డ గణం
 డి) న గణం
 జవాబు:
 సి) డ గణం

3. మూడూ లఘువులు గల గణం ఏది?
 ఎ) స గణం
 బి) న గణం
 సి) ర గణం
 డి) మ గణం
 జవాబు:
 బి) న గణం
4. కరుణా పయోనిధి గాంభీర్య ఘనుడు (అర్థాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
 ఎ) నది
 బి) లోయ
 సి) తటాకం
 డి) సముద్రము
 జవాబు:
 డి) సముద్రము
5. ఏనుగుల బలము చాలా ఎక్కువ. (గురులఘువులు గుర్తించండి) (S.A. II – 2018-19)
 ఎ) UIU
 బి) III
 సి) IIU
 డి) UUI
 జవాబు:
 బి) III
6. రాజు బడికి వెళ్ళాలని తొందర పడుతున్నాడు. (సంధి విడదీయండి) (S.A. II – 2017-18)
 ఎ) వెళ్ళా + లని
 బి) వెళ్ళాల + అని
 సి) వెళ్ళాలి + అని
 డి) వెళ్ళా + అని
 జవాబు:
 సి) వెళ్ళాలి + అని
7. మూడూ గురువులే ఉండే గణం ఏది? (S.A. I – 2019-20)
 బి) ర గణం
 ఎ) న గణం
 సి) జ గణం
 డి) మ గణం
 జవాబు:
 డి) మ గణం
భాషాంశాలు – పదజాలం
అర్ధాలు :
8. విద్యార్థులకు క్షమ అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) దారి
 బి) ధనం
 సి) ఓర్పు
 డి) వినయం
 జవాబు:
 సి) ఓర్పు
9. శత్రువులకు కూడా చెఱుపు తల పెట్టకూడదు – గీత గీసిన పదానికి గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) వారి
 బి) కీడు
 సి) అగ్ని
 డి) జలధి
 జవాబు:
 బి) కీడు

10. సరస్సులో మీనం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) ఎలుక
 బి) చేప
 సి) కప్పు
 డి) పాము
 జవాబు:
 బి) చేప
11. చిరకాలం జీవించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) గతకాలం
 బి) మంచి కాలం
 సి) విద్యా కాలం
 డి) చాలా కాలం
 జవాబు:
 డి) చాలా కాలం
12. ధరిత్రి పై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) భూమి
 బి) జలధి
 సి) సాగరం
 డి) వనం
 జవాబు:
 ఎ) భూమి
13. ఇంచుక జ్ఞానం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
 ఎ) తపన
 బి) కొంచెము
 సి) అధికము
 డి) చాతుర్యం
 జవాబు:
 బి) కొంచెము
14. పయోధిలో రత్నాలు ఉంటాయి – గీత అర్థం గుర్తించండి.
 ఎ) అవని
 బి) పాపము
 సి) సముద్రం
 డి) భూషణము
 జవాబు:
 సి) సముద్రం
పర్యాయపదాలు :
15. భాస్కరుడు గొప్ప కాంతివంతుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) సూర్యుడు, రజనీకరుడు
 బి) రవి, ప్రభాకరుడు
 సి) ఆదిత్యుడు, చంద్రుడు
 డి) రవి, కువలయానందకరుడు
 జవాబు:
 బి) రవి, ప్రభాకరుడు

16. విద్యార్థులు కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) తపస్సు, ఉషస్సు
 బి) రోచస్సు, ధనుస్సు
 సి) యశస్సు, ఖ్యాతి
 డి) ధరణి, వర్చస్సు
 జవాబు:
 సి) యశస్సు, ఖ్యాతి
17. అమృతం సేవిస్తారు దేవతలు – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
 ఎ) క్షీరం
 బి) నారం
 సి) వారి
 డి) సుధ
 జవాబు:
 డి) సుధ
18. దివిపై తారలు ఉదయించాయి – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
 ఎ) చుక్కలు, నక్షత్రాలు
 బి) దినకరాలు, అరవిందాలు
 సి) కుముదాలు, కలువలు
 డి) నిలయాలు, కిసలయాలు
 జవాబు:
 ఎ) చుక్కలు, నక్షత్రాలు
19. సింహం వడిగా వెళ్ళింది – గీత గీసిన పదానికి సమానార్థకం గుర్తించండి.
 ఎ) వాయువు
 బి) వేగం
 సి) మందం
 డి) దురంతం
 జవాబు:
 బి) వేగం
20. రాజు ప్రజలను పాలించు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
 ఎ) నీరపతి, జలనిధి
 బి) గతనందనుడు, దాశరథి
 సి) నృపతి, క్షితిపతి
 డి) అంబుధి, సచివుడు
 జవాబు:
 సి) నృపతి, క్షితిపతి
ప్రకృతి – వికృతులు :
21. లక్ష్మి సంపదలను ఇచ్చు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) లెచ్చి
 బి) లచ్చి
 సి) లచ్చ
 డి) లక్కి
 జవాబు:
 బి) లచ్చి

22. గుణమును ఆశ్రయించాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
 ఎ) గెనము
 బి) గనము
 సి) గృనము
 డి) గొనము
 జవాబు:
 డి) గొనము
23. దేశ చరిత్ర ఉన్నతమైంది – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
 ఎ) చోరిత
 బి) చరిత
 సి) చారిత్ర
 డి) చెరిత్ర
 జవాబు:
 బి) చరిత
24. అగ్గిలో పడితే కాలుతుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
 ఎ) అగ్న
 బి) అగ్ని
 సి) అగ్గి
 డి) అగ్లీ
 జవాబు:
 బి) అగ్ని
25. హృదయం నిర్మలంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
 ఎ) ఎద
 బి) హేవయం
 సి) హోదయం
 డి) హదయం
 జవాబు:
 ఎ) ఎద
26. శ్రీ కావాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
 ఎ) సరి
 బి) సెరి
 సి) శీరి
 డి) సిరి
 జవాబు:
 డి) సిరి
27. నీకు కర్ణం చేయాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
 ఎ) కార్యం
 బి) కర్రమ
 సి) కారం
 డి) పని
 జవాబు:
 ఎ) కార్యం
నానార్థాలు :
28. ఆకాశంలో మిత్రుడు ప్రకాశిస్తున్నాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) వారిధి, వార్షికం
 బి) సూర్యుడు, స్నేహితుడు
 సి) రవి, శని
 డి) గురువు, వారిధి
 జవాబు:
 బి) సూర్యుడు, స్నేహితుడు

29. సుధను దేవతలు త్రాగుతారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) దధి, క్షీరం
 బి) ఘృతం, వారి
 సి) అమృతం, పాలు
 డి) నీరు, లవణం
 జవాబు:
 డి) నీరు, లవణం
30. రాజు కువలయానందకరుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) ఉదధి, వారిదం
 బి) నృపతి, చంద్రుడు
 సి) శుక్రుడు, వాచస్పతి
 డి) వారిధి, అంబుధి
 జవాబు:
 బి) నృపతి, చంద్రుడు
31. సూర్యుని కరం కాంతివంతం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
 ఎ) కిరణం, వాయువు
 బి) జలధి, ఉదధి
 సి) వారిదం, కీడు
 డి) చేయి, తొండము
 జవాబు:
 డి) చేయి, తొండము
వ్యుత్పత్త్యర్థాలు :
32. దాశరథి రక్షించుగాక – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
 ఎ) దశరథుని కుమారుడు
 బి) దాశరథికి తమ్ముడు
 సి) దశరథుని చేత తమ్ముడు
 డి) దశరథునికి ఆత్మీయుడు
 జవాబు:
 ఎ) దశరథుని కుమారుడు
33. పయోధి – ఈ పదానికి వ్యుత్పత్తి గుర్తించండి.
 ఎ) నీటికి చెందునది
 బి) నీటిలో రత్నాలు కలది
 సి) నీటిని ధరించునది
 డి) నీటి కొరకు ఆనందము
 జవాబు:
 సి) నీటిని ధరించునది
34. విశ్వమును ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
 ఎ) భూషితం
 బి) ధరణి
 సి) జలధి
 డి) వారిధి
 జవాబు:
 బి) ధరణి

35. ‘కరి’ దీనికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
 ఎ) అంకుశం కలది
 బి) కరము కలది
 సి) నీరము కలది
 డి) క్షీరము కలది
 జవాబు:
 బి) కరము కలది
36. సర్వభూతములయందు సమభావన కలవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
 ఎ) వారి
 బి) జలధి
 సి) మిత్రుడు
 డి) శత్రువు
 జవాబు:
 సి) మిత్రుడు
37. పాపములను తొలగించువాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
 ఎ) ఈశుడు
 బి) విధాత
 సి) వేంకటేశుడు
 డి) శంకరుడు
 జవాబు:
 సి) వేంకటేశుడు
వ్యాకరణాంశాలు
సంధులు :
38. శివునికి జలాభిషేకం చేశారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
 ఎ) జన + అభిషేకం
 బి) జల + అభిషేకం
 సి) జలే + అభిషేకం
 డి) జలా + ఆభిషేకం
 జవాబు:
 బి) జల + అభిషేకం

39. వేంకటేశ నమోనమః – గీత గీసిన పదాన్ని విడదీయండి.
 ఎ) వేంకట + ఈశ
 బి) వేంకట్ + ఈశు
 సి) వెంకట + ఆశ
 డి) వేంక + టేశ
 జవాబు:
 డి) వేంక + టేశ
40. వీటిలో ఆమ్రేడిత సంధికి ఉదాహరణను గుర్తించండి.
 ఎ) పల్లెటూరు
 బి) ముందడుగు
 సి) ఊరూరు
 డి) చిగురుటాకు
 జవాబు:
 సి) ఊరూరు
41. చాలకున్న – ఇది ఏ సంధి పదమో గుర్తించండి.
 ఎ) ఉత్వసంధి
 బి) ఇత్వసంధి
 సి) అత్వసంధి
 డి) ఆమ్రేడిత సంధి
 జవాబు:
 సి) అత్వసంధి
42. కీర్తిఁగోరుట మంచిది – గీత గీసిన పదం ఏ సంధి?
 ఎ) ఉత్వసంధి
 బి) సరళాదేశ సంధి
 సి) త్రికసంధి
 డి) అత్వసంధి
 జవాబు:
 బి) సరళాదేశ సంధి

43. లక్ష్మీ నీవే నాకు రక్ష – గీత గీసిన పదం ఏ సంధి?
 ఎ) సవర్ణదీర్ఘ సంధి
 బి) త్రికసంధి
 సి) ఆమ్రేడిత సంధి
 బి) పడ్వాదిసంధి
 జవాబు:
 ఎ) సవర్ణదీర్ఘ సంధి
44. దానికేమి? ఎక్కడ ఉన్నావు? – గీత గీసిన పదానికి సంధిని గుర్తించండి.
 ఎ) యడాగమ సంధి
 బి) సరళాదేశ సంధి
 సి) ఇత్వసంధి
 డి) అత్వసంధి
 జవాబు:
 సి) ఇత్వసంధి
45. శ్రీకాళహస్తీశ్వరా – దీనిని విడదీయండి.
 ఎ) శ్రీ + కాళహస్తీశ్వరా
 బి) శ్రీకాళహస్తి + ఈశ్వరా
 సి) శ్రీకాళహస్తి + ఏశ్వరా
 డి) శ్రీకాళ + హస్తీశ్వరా
 జవాబు:
 బి) శ్రీకాళహస్తి + ఈశ్వరా
గణ విభజన
46. ‘ఉత్పలమాల’ – దీనికి గల గణాలను గుర్తించండి.
 ఎ) భ, ర, న, భ, భ, ర, వ
 బి) మ, స, జ, స, త, త, గ
 సి) స, భ, ర, న, మ, య, వ
 డి) న, జ, భ, జ, జ, జ, ర
 జవాబు:
 ఎ) భ, ర, న, భ, భ, ర, వ
47. UUU – ఇది ఏ గణము?
 ఎ) న గణం
 బి) మ గణం
 సి) త గణం
 డి) భ గణం
 జవాబు:
 బి) మ గణం
48. చంపకమాల – వృత్తంలోని పాదానికి అక్షరాల సంఖ్య
 ఎ) 21
 బి) 20
 సి) 19
 డి) 22
 జవాబు:
 ఎ) 21
49. ‘భూషలు’ – ఇది ఏ గణము?
 ఎ) త గణం
 బి) మ గణం
 సి) భ గణం
 డి) య గణం
 జవాబు:
 సి) భ గణం
50. క్షమను చిరమువారు కావగలదు – ఇది ఏ పద్య పాదము?
 ఎ) మత్తేభం
 బి) ఆటవెలది
 సి) తేటగీతి
 డి) కందం
 జవాబు:
 బి) ఆటవెలది
వాక్యాలు
51. అల్లరి చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) విధ్యర్ధక వాక్యం
 బి) తద్ధర్మార్థక వాక్యం
 సి) అప్యర్థక వాక్యం
 డి) నిషేధార్థక వాక్యం
 జవాబు:
 డి) నిషేధార్థక వాక్యం

52. మీకు మేలు కలుగుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) నిషేధాక వాక్యం
 బి) అభ్యర్థక వాక్యం
 సి) ఆశీరార్థక వాక్యం
 డి) విధ్యర్థక వాక్యం
 జవాబు:
 సి) ఆశీరార్థక వాక్యం
53. వాడు వస్తాడో రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) కర్మణి వాక్యం
 బి) సందేహార్థక వాక్యం
 సి) అద్యర్థక వాక్యం
 డి) ధాత్వర్థక వాక్యం
 జవాబు:
 బి) సందేహార్థక వాక్యం
54. తప్పక అందరు రావాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) తప్పక అందరు రాకూడదు
 బి) తప్పక కొందరు రాకూడదు
 సి) తప్పక కొందరు రాకపోవచ్చు
 డి) అందరు తప్పక రాలేకపోవచ్చు
 జవాబు:
 బి) తప్పక కొందరు రాకూడదు
55. అందరు కలలు కనాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
 ఎ) అందరు కలలు కనలేకపోవచ్చు.
 బి) అందరు కలలు కని తీరాలి.
 సి) అందరు కలలు కనకూడదు.
 డి) కొందరు కలలు కనాలి.
 జవాబు:
 సి) అందరు కలలు కనకూడదు.
56. రమ తెలివైనది, అందమైనది – ఇది ఏ రకమైన వాక్యం?
 ఎ) సంక్లిష్ట వాక్యం
 బి) కర్తరి వాక్యం
 సి) కర్మణి వాక్యం
 డి) సంయుక్త వాక్యం
 జవాబు:
 డి) సంయుక్త వాక్యం

57. ధూర్జటి శతకం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
 ఎ) ధూర్జటి యందు శతకం రాశాడు.
 బి) ధూర్జటి చేత శతకం రచింపబడింది.
 సి) ధూర్జటి వల్ల శతకం రాశాడు.
 డి) ధూర్జటికి శతకం రాయవచ్చు.
 జవాబు:
 బి) ధూర్జటి చేత శతకం రచింపబడింది.
58. అల్లరి చేస్తే శిక్ష తప్పదు – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
 ఎ) చేదర్థకం
 బి) అప్యకం
 సి) శత్రర్థకం
 డి) క్వార్ధకం
 జవాబు:
 ఎ) చేదర్థకం
అలంకారాలు
59. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్టు – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.
 ఎ) ఉపమ
 బి) వృత్త్యనుప్రాస
 సి) లాటానుప్రాస
 డి) యమకం
 జవాబు:
 బి) వృత్త్యనుప్రాస

60. వీరు పొమ్మనువారు కాదు పొగబెట్టువారు – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
 ఎ) అంత్యానుప్రాస
 బి) వృత్త్యనుప్రాస
 సి) యమకం
 డి) లాటానుప్రాస
 జవాబు:
 బి) వృత్త్యనుప్రాస
సొంతవాక్యాలు :
61. లోకహితం : మహనీయులు లోకహితం కోసం నిరంతరం ప్రయత్నిస్తారు.
62. సత్త్వము : పాండవులు యుద్ధంలో తమ సత్త్వమును ప్రదర్శించారు.
63. క్షమ : విద్యార్థులకు అన్ని రంగాల్లోను క్షమ మిక్కిలి అవసరం.
64. పవిత్రవాణి : సజ్జనులు సభల్లో తమ పవిత్ర వాణిని వినిపిస్తారు.
65. నలపాకము : వివాహ విందులోని వంటకాలు నలపాకమువలె రుచికరంగా ఉన్నాయి.
66. అనిశం : భారత సైనికులు సరిహద్దుల్లో అనిశం రక్షణ బాధ్యతలను చూస్తారు.
67. రసజ్ఞత : కవులు సందర్భానుగుణంగా రసజ్ఞతతో మాట్లాడుతారు.
68. భూషణము : విద్వాంసులకు వినయమే గొప్ప భూషణము.
69. నిరర్థకము : నిరర్థకంగా సంపదను, కాలాన్ని వృథా చేయకూడదు.
70. స్వచ్ఛము : మా చెరువులోని నీరు స్వచ్ఛముగా ఉన్నది.
