Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 10th Lesson జీవ అణువులు Textbook Questions and Answers.
AP Inter 1st Year Botany Study Material 10th Lesson జీవ అణువులు
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఔషధాలు కృత్రిమంగాగానీ, మొక్కలు, బాక్టీరియా, జంతువులు మొదలైన వాటినుంచి గానీ (సహజసిద్ధమైన ఉత్పన్నాలు) తయారవుతాయి. కొన్ని సమయాల్లో సహజ ఉత్పన్నాల విషప్రభావాన్ని (side effects) తగ్గించటానికి రసాయనికంగా మార్పులు జరుపుతారు.
ఈ క్రిందివానిలో ఏవి సహజమైనవో, ఏవి కృత్రిమంగా తయారు చేయబడినవో తెల్పండి.
a) పెన్సిలిన్ …………….
b) సల్ఫోనమైడ్ …………….
c) విటమిన్ సి …………….
d) పెరుగుదల హార్మోన్లు …………….
జవాబు:
a) పెన్సిలిన్ – సహజ ఉత్పత్తి
b) సల్ఫోనమైడ్ – కృత్రిమ ఉత్పత్తి
c) విటమిన్ సి – సహజ ఉత్పత్తి
d) పెరుగుదల హార్మోన్లు – సహజ ఉత్పత్తి
ప్రశ్న 2.
దిగువనిచ్చిన పదార్థాలలో ఎస్టర్ బంధం, గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం, హైడ్రోజన్ బంధాలను గుర్తించండి.
a) పాలీశాఖరైడ్లు …………….
b) ప్రోటీనులు …………….
c) కొవ్వులు …………….
d) నీరు …………….
జవాబు:
a) పాలీశాఖరైడ్లు – గ్లైకోసైడిక్ బంధము
b) ప్రోటీనులు – పెప్టైడ్ బంధము
c) కొవ్వులు – ఎస్టర్ బందము
d) నీరు – హైడ్రోజన్ బందము
ప్రశ్న 3.
అమైనో ఆమ్లాలు, చక్కెరలు, న్యూక్లియోటైడ్లు, కొవ్వు ఆమ్లాలకు ఒక్కొక్క ఉదాహరణ నివ్వండి.
జవాబు:
a) అమైనో ఆమ్లాలు – గ్లైసిన్, అలనిన్
b) చక్కెరలు – గ్లూకోస్, రైబోస్
c) న్యూక్లియోటైడ్లు – ఎడినైలిక్ ఆమ్లము
d) కొవ్వు ఆమ్లాలు – గ్లిసరాల్, లెసిథిన్
ప్రశ్న 4.
అమైనో ఆమ్లం యొక్క జ్విట్టర్ అయాన్ రూపాన్ని వివరించండి. [Mar. ’14]
జవాబు:
ఒక నిర్దిష్ట PH వద్ద అమైనో ఆమ్లము ధనాత్మక ఋణాత్మక విలువలను సమాన సంఖ్యలో కలిగి ఉంటుంది. ఇది ద్విద్రువం వలె కనిపిస్తుంది. దీనిని జ్విట్టర్ అయాను రూపము అంటారు.
ప్రశ్న 5.
DNA లోని ఏ ఘటకాలు గ్లైకోసైడిక్ బంధాన్ని చూపిస్తాయి.
జవాబు:
ప్రక్కప్రక్కన ఉండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే బంధము – గ్లైకోసైడిక్ బంధము
ప్రశ్న 6.
గ్లెసిన్, అలానిన్లు వాటి (or) కార్బన్లోని ప్రతిక్షేపకాలననుసరించి వేర్వేరుగా ఉంటాయి. రెంటిలో ఉండే ప్రతిక్షేపక గ్రూపులేవి?
జవాబు:
హైడ్రోజన్, కార్బాక్సిల్ సముదాయము, అమైనో సముదాయము మరియు ‘R’ సమూహము.
ప్రశ్న 7.
స్టార్చ్, (పిండి పదార్థాలు), సెల్యూలోస్, గ్లైకోజన్, కైటిన్ అనే పాలిశాఖరైడ్లను ఈ కింది వాటితో జతపరచండి.
a) నూలుపోగు ………….
b) బొద్దింక ఎక్సోస్కెలిటిన్ ………….
c) కాలేయం ………….
d) తొక్కతీసిన బంగాళదుంప ………….
జవాబు:
a) నూలుపోగు – సెల్యూలోస్
b) బొద్దింక ఎక్సోస్కెలిటిన్ – కైటిన్
c) కాలేయం – గ్లైకోజన్
d) తొక్కతీసిన బంగాళదుంప – స్టార్చ్ (పిండి)
ప్రశ్న 8.
ప్రాథమికద్వితియ జీవ క్రియోత్పన్నాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ప్రాథమిక జీవ క్రియోత్పన్నాలు: జీవులలో గుర్తించదగిన విధాలు కలిగి, శరీర ధర్మ శాస్త్ర విధానాల్లో పాత్ర కలిగిన జీవక్రియోత్పన్నాలును ప్రాథమిక జీవ క్రియోత్పన్నాలు అంటారు.
ఉదా : ఉదజని, కర్బనం, ఆక్సిజన్, నత్రజని మొదలగునవి.
ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు : జీవులలో చెప్పుకోదగిన విధాలు లేని జీవ క్రియోత్పన్నాలను ద్వితియ జీవ క్రియోత్పన్నాలు అంటారు.
ఉదా : ఆల్కలాయిడ్లు, ఫావనాయిడ్లు, రబ్బర్లు, జిగురు పదార్థాలు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పాలిశాఖరైడ్ల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
పాలిశాఖరైడ్లు చక్కెరలతో ఏర్పడిన పొడవైన గొలుసు లేదా శృంఖలాలు. ఉదా : పత్తిదారం, సెల్యులోస్ మొదలగునవి. సెల్యులోస్ ఒక సమజాతీయ బహ్వణువు. ఇది ఒకే రకమైన మోనోశాఖరైడు (గ్లూకోజ్) తో ఏర్పడతాయి. సెల్యులోజ్ రూపాంతరమైన స్టార్స్ మొక్కల కణజాలాల్లోకి శక్తి మూలాధారంగా ఉంటుంది. మొక్కల కణత్వచాలు సెల్యుజోజుతో నిర్మితమై ఉంటాయి. ప్రకృతిలో ఇంకా ఎక్కువ సంక్లిష్ట పాలిశాఖరైడ్లు కలవు. ఆర్థోపోడ్ ల బాహ్య అస్థిపంజరంలోనూ, శిలింధ్రాల కణత్వచాల్లోను కైటిన్ అనే సంక్లిష్ట విషమ బహ్వణువు పాలిశాఖరైడ్లుంటాయి. ఇన్యులిన్ అనేది ఫ్రక్టోజ్ యొక్క పాలిశాఖరైడు. బాక్టీరియా కణవచంలో పెప్టిడోగ్లైకాన్ అనే బహ్వణువు గ్లూకోజమైన్ N – సిటైల్గా లక్టోజమైన్లను కలిగి ఉంటుంది. ఇది అమైనో చక్కెరలు పాలిశాఖరైడుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
ప్రశ్న 2.
ప్రోటీన్ని ఉదాహరణ చేసుకొని దాని పరికల్పనాత్మక (hypothetical) ప్రాథమిక, ద్వితీయ, తృతీయ నిర్మాణాలను పటాల ద్వారా సూచించండి.
జవాబు:
ప్రోటీన్లు సన్నని దారం రూపంలో అమరిన అమైనో ఆమ్లాలు కలిగిన విషమ పాలిమర్లు. ప్రోటీన్లులో ఏ అమైనో ఆమ్లము మొదటిది, ఏది రెండవది అనే సమాచారాన్ని ప్రోటీను ప్రాథమిక నిర్మాణము అంటారు. ఒక ప్రోటీనును ఒక గీతిగా ఊహిస్తే ఎడమ కొనను మొదటి అమైనోఆమ్లాన్ని కలిగినదిగాను, కుడికొనను అంత్య అమైనోఆమ్లాన్ని కలిగినదిగాను సూచిస్తారు. మొదటి అమైనోఆమ్లాన్ని N – కొన అని, ఆఖరి అమైనో ఆమ్లాన్ని C – కొన అంటారు. ప్రోటీన్లులలో కుడివైపు సర్పిలాలనే గమనించారు. ప్రోటీను పోగులోని మిగిలిన ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా మడతలు పడి ఉంటుంది. దీని ద్వితీయ నిర్మాణం అంటారు. పొడవైన ప్రోటీను గొలుసు దాని మీద అదే మడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలు బంతివలె ఉంటె దానిని తృతీయ నిర్మాణం అంటారు. దీని వల్ల ప్రోటీన్లుకు ఒక త్రిమితీయ రూపం వస్తుంది.
ప్రశ్న 3.
కేంద్రకామ్లం ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. సోదాహరణంగా సమర్థించండి.
జవాబు:
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. ఉదా : వాట్సన్ – క్రిక్ నమూనా DNA ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణము. దీని ప్రకారం DNA ద్విసర్పిలాకారంలో ఉంటుంది. పాలిన్యూక్లియోటైడ్ లు కల ఈ రెండు పోచలు వ్యతిరేక దిశలలో సమాంతరంగా ఉంటాయి. చక్కెర – ఫాస్పేట్ – చక్కెర గొలుసు కేంద్ర కామ్లాలలో వెన్నెముక వలె ఉంటుంది. నత్రజని క్షారాలు వెన్నెముకకు లంబంగా లోపలి వైపుకు ప్రక్షేపించబడి ఉంటాయి. ఒకపోచలోని ఎడినిన్ (A) గ్వానిన్ (G) లు వరుసగా రెండవ పోచలోని థైమిన్ (T) సైటోసిన్ (C) తో బంధాలు కలిగి ఉంటాయి. A-T ల మధ్య రెండు ఉదజని బంధాలు, G – C ల మధ్య 3 ఉదజని బంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కపోచ సర్పిలాకార మేడమెట్లును పోలి ఉంటుంది. ప్రతి ఆరోహణ మెట్టు ఒక జతనత్రజని క్షారాలను కలిగి 36° కోణాన్ని చూపుతుంది. ద్విసర్పిలంలోని ఒక పూర్తి మెలికకు పదిమెట్లు లేదా పదిజతల నత్రజని క్షారాలు ఉంటాయి. ఒక మెలిక నిడివి 34 A° నత్రజని క్షారాల జతల మధ్య దూరము 3.4 A° ఉంటుంది. ఈ రకమైన DNA ను B – DNA అంటారు.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ద్వితీయ జీవనక్రియోత్పన్నాలంటే ఏమిటి? అవి మానవునికి ఏవి ఏవిధంగా ఉపయోగపడతాయో తెలపండి.
జవాబు:
అతిథేయిలో చెప్పుకోదగ్గ విదులులేవి జీవక్రియ ఉత్పన్నాలను ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటారు. ఉదా : ఆల్కలాయిడ్లు, ఫ్లావనాయిడ్లు, రబ్బరు, ఆవశ్యక నూనెలు, ఆంటిబయోటిక్స్, వర్ణద్రవ్యాలు, అత్తర్లు, జిగురులు, సుగంధ ద్రవ్యాలు.
1) ఆల్కలాయిడ్లు :
ఇవి సేంద్రియ నత్రజని సంయోగ పదార్థాలు. జీవన క్రియల ఫలితంగా అమైనో ఆమ్లాల నుండి ద్వితీయ పదార్థాలుగా ఏర్పడతాయి. వీటిని ద్రవరూప ఔషదాలు తయారీలోను, విష పదార్థాలలో వాడతారు. పురాతన కాలంలో మొక్కల నుండి లభించే ఆల్కలాయిడ్లను పాముకాటుకు విరుగుడుగా, జ్వరము నివారణకు వాడేవారు.
2) ప్లావనాయిడ్లు :
రెండు బెంజీన్ వలయాలు, పైరేన్ వలయంచే కలుపబడి ఉన్న ఫీనాలిక్ గ్లైకోసైడులను ప్లావనాయిడ్లు అంటారు. ఇవి మొక్కల ఆకులు, పుష్పాలు, ఫలాలలో ఉంటాయి. వీటిని కాన్సర్ నివారణలో, వైరస్ వ్యాధుల నివారణకు, వాపుల నివారణకు వాడతారు. వీటిని మానవ రక్త ఫలకికల సమూహం ఏర్పడకుండా వాడతారు.
3) రబ్బరు :
శుద్ధిచేయని రబ్బరును సిమెంట్ పరిశ్రమలలో ఇన్సులేటింగ్ టేపుల తయారీలోను వాడతారు. రబ్బరుకు సాగే గుణం, నమ్యత ఉండుట వల్ల వీటిని రబ్బరు పైపులు, టైరులు తయారీలో వాడతారు. దీని సాగే గుణమును వివిధ ఘాతశోషకాలలో ఉపయోగిస్తారు. ఇది వాయువులకు అపార గమ్యంగా ఉంటుంది. దీనిని రబ్బరు పైపులు, బెలూన్లు, బంతులు, కుషన్ల తయారీలో వాడతారు.
సుగంధతైలాలు :
జల విరోది ద్రావణీయత కల ఆవిరి అయ్యే నూనెలు. వీటిలో ముఖ్యమైనవి.
a) కొత్తిమీర నుండి తీసిన తైలమును నొప్పుల నివారణకు అజీర్ణ వ్యాధి నివారణకు వాడతారు.
b) మందారిన్ తైలమును కాలి పగుళ్ళు నివారణకు మచ్చల నివారణకు వాడతారు.
c) లావెండర్ తైలమును అస్మా నివారణలో, తలనొప్పి చెవినొప్పి నివారణలో వాడతారు.
సూక్ష్మజీవ నాశకాలు :
వ్యాధి జనక జీవులను నాశనం చేసే సహజ రసాయనాలు. అతిథేయిపై ఏవిధమైన ప్రభావం చూపకుండా వ్యాధిని కలుగచేయు బాక్టీరియా వంటి క్రిములను నాశనం చేస్తాయి. ఉదా : స్ట్రెప్టోమైసిన్ – స్ట్రెప్టోమైసిస్ గ్రీనియస్ నుండి లభిస్తుంది.
సుగంధద్రవ్యాలు :
ఇంగువ, యాలకులు, దాల్చినచెక్క ముఖ్యమైనవి. ఇంగువ దగ్గు నివారణకు, కడుపునొప్పి నివారణకు వాడతారు. యాలకులు నోటి దుర్వాసన పోగొట్టటానికి చక్కెరవ్యాధి నివారణలో వాడతారు. లవంగాలు పంటినొప్పి నివారణకు, జలుబు, దగ్గు నివారణకు వాడతారు.
ప్రశ్న 2.
మూలకాల సంఘటకాలను, జీవకణ సముదాయాల్లోని కర్బన అకర్బన ఘటకాలను ఏ విధమైన పద్ధతుల ద్వారా విశ్లేషిస్తారు? జీవ కణజాలాల్లో అత్యధిక సమృద్ధిగాగల ఘటకాల అనుమతి లేమిటి? సరైన దత్తాంశాలతో అనుమతులను సమర్థించండి.
జవాబు:
ఒక సజీవ కణజాలము (ఒక కూరగాయ లేదా కాలేయపు బాగము) తీసుకుని ట్రైక్లోరో ఎసిటిక్ ఆమ్లముతో, రోకలి, కల్వం సహాయంతో నూరినప్పుడు ఒక చిక్కని ద్రవం తయారవుతుంది. దీనిని వడగట్టే గుడ్డతో వడబోసినప్పుడు రెండు బాగాలు లభిస్తాయి.
1) వడబోసిన లేదా ఆమ్లం కరగ గల బాగము.
2) అవశేషము లేదా ఆమ్లంలో కరగని భాగము ఆమ్ల ద్రావణీయత భాగంలో వేలాది కర్బన సంయోగ పదార్థాలు కనుగొన్నారు. సజీవ కణజాలమునుంచి లభ్యమయ్యే అన్ని కర్బన సమ్మేళనాలను జీవాణువులు అంటారు.
ఒక జీవకణ సముదాయాన్ని (ఒక పత్రం లేదా కాలేయపు ముక్క) తీసుకొని, తూచి తడి బరువు తీసుకుని, దానిని నీరు ఆవిరి అయ్యేంతవరకు ఎండబెట్టాలి. ఈ మిగిలిన పదార్థపు బరువును పొడి బరువు అంటారు. ఈ కణజాలాన్ని కాల్చినప్పుడు అందులో ఉండే కర్బన సమ్మేళనాలన్ని (co, నీటిఆవిరి) ఆక్సీకరణం చెంది వాయురూపంలో తొలగిపోతాయి. ఈ రకంగా మిగిలిన దానిని బూడిద అంటారు. ఈ బూడిదలో అకర్బన మూలకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఆమ్లంలో కరిగే భాగంలో సల్ఫేట్, ఫాస్ఫేట్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. కావున జీవ కణజాలాలు మూలక విశ్లేషణలో ఉదజని, ఆమ్లజని, కర్బనము క్లోరిన్ మొదలైన రూపాల్లో మూలకాల సంఘటన సమ్మేళనాల విశ్లేషణలో ఎటువంటి కర్బన, అకర్బన పదార్థాలు ఉన్నాయో తెల్సుకోవచ్చు జీవకణజాలాల్లో ఉదజని, కర్బనము అత్యధిక సమృద్ధిగా ఉంటాయి. 0.5, కర్బనము
ఉదా : ఉదజని = 0.5, = 18.5
ప్రశ్న 3.
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వాట్సన్, క్రిక్ నమూనా ద్వారా వివరించండి.
జవాబు:
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. ఉదా : వాట్సన్ – క్రిక్ నమూనా DNA ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణము. దీని ప్రకారం DNA ద్విసర్పిలాకారంలో ఉంటుంది. పాలిన్యూక్లియోటైడ్ లు కల ఈ రెండు పోచలు వ్యతిరేక దిశలలో సమాంతరంగా ఉంటాయి. చక్కెర – ఫాస్పేట్ – చక్కెర గొలుసు కేంద్ర కామ్లాలలో వెన్నెముక వలె ఉంటుంది. నత్రజని క్షారాలు వెన్నెముకకు లంబంగా లోపలి వైపుకు ప్రక్షేపించబడి ఉంటాయి. ఒకపోచలోని ఎడినిన్ (A) గ్వానిన్ (G) లు వరుసగా రెండవ పోచలోని థైమిన్ (T) సైటోసిన్ (C) తో బంధాలు కలిగి ఉంటాయి. A-T ల మధ్య రెండు ఉదజని బంధాలు, G – C ల మధ్య 3 ఉదజని బంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కపోచ సర్పిలాకార మేడమెట్లును పోలి ఉంటుంది. ప్రతి ఆరోహణ మెట్టు ఒక జతనత్రజని క్షారాలను కలిగి 36° కోణాన్ని చూపుతుంది. ద్విసర్పిలంలోని ఒక పూర్తి మెలికకు పదిమెట్లు లేదా పదిజతల నత్రజని క్షారాలు ఉంటాయి. ఒక మెలిక నిడివి 34 A° నత్రజని క్షారాల జతల మధ్య దూరము 3.4 A° ఉంటుంది. ఈ రకమైన DNA ను B – DNA అంటారు.
ప్రశ్న 4.
న్యూక్లియోటైడ్, న్యూక్లియోసైడ్కు గల భేదమేమి? రెండేసి ఉదాహరణలతో వాటి నిర్మాణాలను తెలపండి.
జవాబు:
ప్రశ్న 5.
వివిధ లిపిడ్ల రూపాలను సోదాహరణంగా వివరించండి.
జవాబు:
లిపిడ్లు సాదారణంగా నీటిలో కరగవు. ఇవి కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు, నూనెలు, ట్రైగ్లిసరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు, స్టిరాయిడ్లు మరియు మైనం రూపాలలో ఉంటాయి.
ఒక ఫాటీ ఆమ్లంలో R సమూహాన్ని అతుక్కుని ఒక కార్బాక్సిల్ సమూహం ఉంటుంది. R సమూహం మిథైల్, ఇథైల్ లేదా అంతకంటే ఎక్కువ – CH2 సముదాయాలను కలిగి ఉండవచ్చు.
ఉదా : పామిటిక్ ఆమ్లములో కార్బోక్సిల్ కార్బను కలుపుకొని 16 కార్బన్లు ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు సంతృప్తమైనవిగాను లేదా అసంతృప్తమైనవిగాను ఉంటాయి.
గ్లైకోలిపిడ్లు :
చాలా లిపిడ్లు కొవ్వు ఆమ్లాలను, గ్లిసరాల్ను కలిగి ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్తో కలిసి ఎస్టర్ రూపంలో ఉంటాయి. ఆ రకంగా అవి మోనోగ్లిసరైడ్లు, డైగ్లిసరైడ్లు, ట్రైగ్లిసరైడ్లుగా ఉంటాయి.
ఫాస్ఫోలిపిడ్లు :
కొన్ని లిపిడ్లు ఫాస్పరస్ను, ఫాస్ఫారిలేటెడ్ కర్బన సమ్మేళనాన్ని గాని కలిగి ఉంటాయి. ఇవి కణత్వచంలో ఉంటాయి. నాడీకణజాలాలు ఎక్కువ సంక్లిష్టమైన నిర్మాణాలు గల లిపిడ్లను కలిగి ఉంటాయి.
Intext Question and Answers
ప్రశ్న 1.
బృహదణువులంటే ఏమిటి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఆమ్ల అద్రావణీయ బాగాలలోని, ఎక్కువ అణుబారం కల స్థూల అణువులను బృహదణువులు అంటారు.
ఉదా : పోలీశాఖ రైడ్లు, కేంద్రకామ్లాలు
ప్రశ్న 2.
గ్లైకోసైడిక్, పెప్టైడ్, ఫాస్ఫోడైఎస్టర్ బంధాలను పటాలలో విశదీకరించండి.
జవాబు:
గ్లైకోసైడిక్ బంధము :
ప్రక్కప్రక్కన ఉండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే రసాయన బంధం.
పెప్టైడ్ బంధము :
ప్రోటీనులోని అమైనో ఆమ్లాల మధ్య ఉన్న బంధము
ఫాస్పోడై ఎస్టర్ బంధము :
ఫాస్ఫేట్ అణువు చక్కెరలోని హైడ్రాక్సిల్ గ్రూప్ మద్యకాల బంధమును ఎస్టర్ బంధం అంటారు. ఫాస్పేటి కిరువైపులా ఉన్న ఒక్కొక్కొ ఎస్టర్ బంధంను ఫాస్ఫోడై ఎస్టర్ బంధం అంటారు.
ప్రశ్న 3.
ప్రోటీన్ల తృతీయ నిర్మాణాన్ని తెలపండి.
జవాబు:
పొడవైన ప్రోటీను గొలుసు దానిమీద అదే ముడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలు బంతిలాంటి తృతీయ నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనివల్ల ప్రోటీనుకు ఒక త్రిమితీయ రూపం వస్తుంది. ఇది ఎన్నో జీవక్రియలకు అవసరము.
ప్రశ్న 4.
అల్ప అణుభారం కలిగిన 10 ఆసక్తికరమైన జీవాణువుల నిర్మాణాన్ని తెలపండి. వేరుచేసే పద్ధతుల ద్వారా వాటిని తయారు చేసే పరిశ్రమలుంటే తెలపండి. వాటిని కొనేదెవరో తెలుసుకోండి.
జవాబు:
అమైనో ఆమ్లాలు, మోనోశాఖరైడ్లు, డై శాఖరైడ్లు, చక్కెరలు, ఫాటీ ఆమ్లాలు, గ్లిసరాల్, న్యూక్లియోటైడ్లు, నత్రజని క్షారాలు.
ప్రశ్న 5.
ప్రోటీన్లకు ప్రాథమిక నిర్మాణం కలదు. మీకు ఏ అమైనో ఆమ్లం ఏ కొనలో ఉందో తెలిపితే, ఈ సమాచారంతో ప్రోటీను యొక్క శుద్ధత గాని సమ జాతీయతను గాని తెలుసుకోగలరా?
జవాబు:
ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు కలిగిన విషమ పాలీమర్లు. ప్రోటీన్లలో ఏ అమైనోఆమ్లం మొదటిది, ఏది రెండవది అనే
సమాచారాన్ని ప్రాధమిక నిర్మాణం అంటారు. ఒక ప్రోటీనును ఒకే గీతిగా ఊహిస్తే ఎడమకొనను మొదటి అమైనో ఆమ్లం కలిగినదిగాను (N – కొన), కుడికొనను అంత్య అమైనో ఆమ్లము కలిగినదిగాను (C – కొన) సూచిస్తారు. ఈ సమాచారం ప్రకారం ప్రోటీను యొక్క శుద్ధతి గాని, సమజాతీయతకాని తెలుసుకోలేము.
ఉదా : అనేక ప్రోటీనులు మిథియోనైన్ అను అమైనో ఆమ్లంతో మొదలవుతాయి, కాని అవి ప్రోటీన్లుకు సమజాతీయంకాదు.
ప్రశ్న 6.
చికిత్సకుపకరించే ప్రోటీన్ల జాబితాను తయారుచేయండి. ప్రోటీన్ల (సౌందర్యసాధనాల) లాంటి ఉపయోగాలను తెలపండి.
జవాబు:
ఎరిథ్రో ప్రోటీన్లు, మోనోక్లోనల్ ఆంటీబాడీలు, ఇంటర్ఫెరాన్లు థ్రాంబిన్, ఫైబ్రినోజన్, ఆంటిజెన్, ఇన్సులిన్, రెనిన్, ప్రోటీనులను సౌందర్యపోషకాల తయారీలో, టాక్సిన్లు, జీవక్రియా బఫర్లు తయారీలో వాడతారు.
ప్రశ్న 7.
ట్రైగ్లిసరైడు సంఘటనాన్ని వివరించండి.
జవాబు:
ట్రైగ్లిసరైడ్లు మూడు మూలకాలతో ఏర్పడతాయి. అవి కార్బన్ ఉదజని, ఆమ్లజని, వీటిలో కార్బన్, ఉదజని ఎక్కువగాను ఆమ్లజని తక్కువగాను ఉంటాయి. ట్రైగ్లిసరైడ్లు 4 మూలభాగాలతో ఏర్పడతాయి. అవి 1) గ్లిసరాల్ అణువు, 2) కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్ 3 కర్బన పరమాణువులు 5 అణువు కొవ్వు ఆమ్లాలు కర్బన, ఉదజని గొలుసులు కలిగి, ఒక కొనలో 0, ను కలిగిఉంటాయి.
ప్రశ్న 8.
ప్రోటీన్ల అవగాహననుసరించి పాలు, పెరుగుగా మారేటప్పుడు ఏమి జరుగుతుందో తెలపండి.
జవాబు:
పాలలో ఉన్న ఎంజైమ్లు లాక్టోజెనన్ను లాక్టిక్ ఆమ్లముగా మారుస్తాయి. దీనివల్ల పాల PH విలువ తగ్గి పాలు-పెరుగుగా మారుతుంది.
ప్రశ్న 9.
అలనిన్ అనే అమైనోఆమ్ల నిర్మాణాన్ని చూపండి.
జవాబు:
ప్రశ్న 10.
జిగురు పదార్థాలు దేనినుంచి తయారవుతాయి? ఫెవికాల్ వేరుగా ఉంటుందా?
జవాబు:
జిగురులు, మొక్కల లేటెక్స్ నుండి లభిస్తాయి. ఇది రెసిన్లు హైడ్రోకార్బన్లతో ఉంటాయి. జిగురులు విషమ పాలీశాఖరైడ్లు. ఫెవికాల్ పాలీవినైల్ ఆల్కాహాలు. దీనిలో పాలీ శాఖరైడ్లు ఉండవు. కావున జిగురులు, ఫెవికాల్ వేర్వేరు పదార్థాలు.