AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

SCERT AP 9th Class Physics Study Material Pdf Download 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 12th Lesson Questions and Answers ప్రమాణాలు మరియు గ్రాఫులు

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

9th Class Physical Science Textbook Page No. 209

ప్రశ్న 1.
లీటరు అనేది ప్రాథమిక ప్రమాణమా లేక ఉత్పన్న ప్రమాణమా?
జవాబు:
1) లీటరు అనగా 10 సెం.మీ. భుజం గల ఘనం యొక్క ఘనపరిమాణం.
2) 1 లీ. = 10 సెం.మీ. X 10 సెం.మీ. X 10 సెం.మీ.
1లీ. = 10 సెం.మీ. ” 3) లీటరు అనేది ఉత్పన్న రాశి.

9th Class Physical Science Textbook Page No. 207

ప్రశ్న 2.
2 కిలోగ్రాములు మరియు 100 గ్రాములలో ఏది అధిక పరిమాణం కలిగి ఉంటుంది?
జవాబు:
2 కిలోగ్రాములు.

ప్రశ్న 3.
దానికి రషీద సమాధానం ఏమై ఉంటుంది?
జవాబు:
2 కిలోగ్రాములు అధిక పరిమాణం కలిగి ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 4.
ఒక వేళ రషీద షాపు వానిని 2 పంచదార మరియు 100 టీపొడి ఇమ్మని అడిగితే, అతను తూచి ఇవ్వగలదా? కారణం తెలపండి.
జవాబు:
ఇవ్వలేదు. ఎందుకనగా కొలత ప్రమాణాలతో పదార్ల పరిమాణాలను చెప్పలేదు.

ప్రశ్న 5.
కాలానికి ప్రమాణాలు చెప్పగలవా? అవి ఏమిటి?
జవాబు:
సెకను, నిమిషం, గంట మొదలైనవి.

ప్రశ్న 6.
వేరు వేరు ప్రమాణాలు ఎందుకు అవసరమవుతాయి?
జవాబు:
ఒక పదార్థం పరిమాణాలను బట్టి వేరు వేరు ప్రమాణాలు అవసరమవుతాయి.

9th Class Physical Science Textbook Page No. 208

ప్రశ్న 7.
ఎందుకు మనం వివిధ వస్తువులకు వివిధ ప్రమాణాలను వినియోగిస్తున్నాం?
జవాబు:
పదార్థ పరిమాణాలను బట్టి వాటి ప్రమాణాలను వినియోగించాలి.

ప్రశ్న 8.
సుద్దముక్క ద్రవ్యరాశి కిలోగ్రాములలో వ్యక్తపరచగలమా?
జవాబు:
సాధారణంగా సుద్దముక్క ద్రవ్యరాశిని కిలోగ్రాములలో వ్యక్తపరచము.

ప్రశ్న 9.
వీటినే ప్రాథమిక రాశులని ఎందుకు అంటారు?
జవాబు:
పై రాశులు (పొడవు, ద్రవ్యరాశి, కాలం)లను మరే ఇతర పరిమాణాలలోనూ వ్యక్తపరచడానికి వీలులేని భౌతిక రాశులు. కావున ప్రాథమిక రాశులు.

ప్రశ్న 10.
పై పట్టికలో ప్రాథమిక రాశులేవి?
జవాబు:
పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్, కాంతి తీవ్రత, పదార్ధ పరిమాణం, ఉష్ణం, సమతల కోణం.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 11.
MKS మరియు SI పద్ధతులలో సారూప్యాలు ఏమిటి?
జవాబు:
MKS పద్ధతి మరియు SI పద్ధతిలోనూ పొడవు, ద్రవ్యరాశి మరియు కాలంలు ఉన్నాయి.

ప్రశ్న 12.
వైశాల్యాన్ని ఎలా కనుగొంటావు?
జవాబు:
పొడవు, వెడల్పులను గుణించి కనుగొంటాము.

ప్రశ్న 13.
దీనికి కావలసిన కొలతలు ఏవి?
జవాబు:
పొడవు, వెడల్పు

9th Class Physical Science Textbook Page No. 209

ప్రశ్న 14.
వైశాల్యం ప్రాథమిక ప్రమాణమేనా?
జవాబు:
కాదు.

ప్రశ్న 15.
వైశాల్యం లెక్కించడానికి మనం ఉపయోగించిన ప్రాథమిక రాశి ఏది?
జవాబు:
పొడవు.

9th Class Physical Science Textbook Page No. 213

ప్రశ్న 16.
ప్రతి భుజం పొడవు ఎంత?
జవాబు:
1 సెం.మీ.

ప్రశ్న 17.
సన్నని గళ్ళ మధ్య దూరం ఎంత?
జవాబు:
1 మి.మీ.

9th Class Physical Science Textbook Page No. 215

ప్రశ్న 18.
గ్రాఫ్-1లో రేఖ ఆకారం ఎలా ఉంది?
జవాబు:
వక్రరేఖ.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 19.
అన్ని సందర్భాలలో గ్రాఫు వక్రరేఖగానే వస్తుందా?
జవాబు:
రాదు.

ఉదాహరణ సమస్యలు

9th Class Physical Science Textbook Page No. 209

ప్రశ్న 1.
పుస్తకం పొడవు 20 సెంటీమీటర్లు, వెడల్పు 12 సెంటీమీటర్లు అయితే వైశాల్యం ఎంత?
సాధన:
వైశాల్యం = పొడవు ” వెడల్పు
= 20 సెం.మీ. × 12 సెం.మీ.
= 20 × 12 సెం.మీ. × సెం.మీ.
= 240 (సెం.మీ.)²
= 240 చదరపు సెం.మీ.

9th Class Physical Science Textbook Page No. 210

ప్రశ్న 2.
రవి ప్రతిరోజు 1.5 కి.మీ. దూరం నడిచి పాఠశాలకి చేరుకుంటాడు. రమ్య రోజూ 1250 మీ. దూరం నడిచి పాఠశాలకి చేరుకుంటుంది. ఎవరి ఇల్లు పాఠశాలకి ఎక్కువ దూరంలో ఉంది?
సాధన:
రవి నడుస్తున్న దూరం = 1.5 కి.మీ.
రమ్య నడుస్తున్న దూరం = 1250 మీ.
ఈ దూరాలను పోల్చడానికి రెండూ తప్పనిసరిగా ఉమ్మడి ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఇక్కడ కి.మీ. లను మీటర్లలోకి మార్చాలి.
1కి.మీ. = 1000 మీ.
1.5 కి.మీ. = 1.5 × 1000 మీ.
= 1500 మీ.

కావున రవి నడుస్తున్న దూరం = 1.5 కి.మీ. = 1500 మీ.
దీనిని బట్టి రవి ఇల్లు, రమ్య ఇల్లు కన్నా పాఠశాలకి ఎక్కువ దూరంలో ఉంది.

9th Class Physical Science Textbook Page No. 210

ప్రశ్న 3.
పట్టికను పరిశీలించి క్రింది వానికి జవాబులిమ్ము.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 2

ఖాళీలను పూరింపుము.

1. 6 నానో మీటర్లు = …………….
జవాబు:
6 × 10-9 మీ.

2. 5 గిగాబైట్లు = …………………………. బైట్లు.
జవాబు:
5 × 109

3. ………….. = 4 × 10³g.
జవాబు:
4 కిలోగ్రాములు

4. ………. = 11 × 106 వాట్లు .
జవాబు:
11 మెగావాట్లు

5. 2 సెం.మీ. = 2 × ……
జవాబు:
2 × 10-2 మీటర్లు.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

9th Class Physical Science Textbook Page No. 211

జేమ్స్ మరియు శరలు నడక పోటీలో పాల్గొన్నారు. జేమ్స్ గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నడిచాడు. శరత్ సెకనుకు 2.5 మీటర్ల వేగంతో నడిచాడు. ఇద్దరూ ఒకే సమయానికి బయలుదేరి ఒకే దారిలో నడిస్తే ఎవరు ముందుగా గమ్య స్థలానికి చేరి ఉంటారు?
సాధన:

  1. జేమ్స్ నడక వేగం కిలోమీటర్లలో, శరత్ నడక వేగం మీటర్లలో తెలుపబడింది.
  2. ఇక్కడ దూరానికి కిలోమీటరు, మీటరు అనే ప్రమాణాలను కాలానికి గంట, సెకను అనే ప్రమాణాలను వినియోగించారు.
  3. ఏవైనా రెండు రాశులను పోల్చాలంటే వాటి ప్రమాణాలు తప్పనిసరిగా ఒకే ప్రమాణాలు అయి ఉండాలి.
  4. గంటకు కిలోమీటర్ల (కి.మీ./గం.) ను, సెకనుకు మీటర్ల (మీ./సె.) లోకి మార్చాలి.
  5. జేమ్స్ వేగం = 9 కి.మీ. / గం.
    9 కి.మీ./గం. = 9 × \(\frac{5}{18}\) = 2.5 మీ./సె.
  6. శరత్ వేగం = 2.5 మీ./సె.
  7. కావున ఇద్దరూ ఒకేసారి గమ్యస్థానానికి చేరుతారు.

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

ప్రశ్న 1.
నీ గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని పట్టికలోని వస్తువులను సాధారణంగా ఏ ప్రమాణంతో కొలుస్తారో టిక్ (✓) గుర్తు పెట్టండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 3

కృత్యం – 2

2. ఒక పుస్తకం తీసుకొని దాని ఉపరితల వైశాల్యం ఎట్లా కనుగొంటావో రాయుము.
జవాబు:
1) పుస్తకం యొక్క పొడవు, వెడల్పులను కొలవండి.
2) పొడవు, వెడల్పులను గుణిస్తే వైశాల్యం వస్తుంది.
3) పొడవు = ………….
4) వెడల్పు = ………….
5) వైశాల్యం = పొడవు × వెడల్పు = ………….

→ వైశాల్యం ప్రాథమిక రాశియేనా?
జవాబు:
కాదు.

→ వైశాల్యం లెక్కించడానికి మనం ఉపయోగించే ప్రాథమిక రాశి ఏది?
జవాబు:
పొడవు.

3. క్రింది పట్టికను పరిశీలించండి. మీ పరిశీలన ఆధారంగా ప్రాథమిక ప్రమాణాలు, ఉత్పన్న ప్రమాణాలను రాయండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 4
1. ప్రాథమిక రాశులను గుణిండం ద్వారా వచ్చిన ఉత్పన్న రాశులు ఏవి?
జవాబు:
వైశాల్యం, ఘన పరిమాణం.

2. ప్రాథమిక రాశి పొడవును మాత్రమే గుణించడం ద్వారా వచ్చిన ఉత్పన్న రాశులేవి?
జవాబు:
వైశాల్యం , ఘన పరిమాణం.

3. ఏ ఉత్పన్న రాశికి ప్రమాణాలు లేవు? ఎందుకు?
జవాబు:

  1. సాపేక్ష సాంద్రతకి ప్రమాణాలు లేవు.
  2. ఇది రెండు సాంద్రతల నిష్పత్తి, కావున ప్రమాణాలు లేవు.

4. ఘన పరిమాణానికి ప్రమాణాలేవి?
జవాబు:
m³(మీ³)

5. కాలం, త్వరణంతో సంబంధం ఉన్న ఉత్పన్న ప్రమాణాలేవి?
జవాబు:
i) కాలంతో సంబంధం ఉన్న ఉత్పన్న ప్రమాణాలు

  1. వేగం (m/s)
  2. త్వరణం (m/s²)
  3. బలం (kg.m/s²)
  4. పీడనం (kg/m.s²)

ii) త్వరణంతో సంబంధం ఉన్న ఉత్పన్న ప్రమాణాలు
1) బలం (kg.m/s²)

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

కృత్యం – 4

4. క్రింది ఇవ్వబడిన పట్టికలోని దత్తాంశానికి గ్రాఫును గీయుము.
(లేదా)
దూరం – కాలం గ్రాఫును గీయుము.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 5
జవాబు:
పట్టికలోని సమాచారం ఆధారంగా స్వతంత్ర రాశిగా ‘కాలం’ను, ఆధారిత రాశిగా ‘దూరం’ ను తీసుకోవాలి.
గ్రాఫుని గీయడంలో సోపానాలు :
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 6

1) అక్షాలు :
→ కాలం ఏ అక్షం మీద ఉంది?
జవాబు:
X – అక్షం మీద.

→ దూరం ఏ అక్షం మీద ఉంది?
జవాబు:
Y- అక్షం మీద.

2) వ్యాప్తి :
i) ముందుగా X – అక్షంపై విలువలను తీసుకుందాం
అవి : 5, 10, 15, 20, 25, 30, 35, 40
ii) వీటిలో అతి పెద్ద విలువ – 40; అతి చిన్న విలువ – 5

→ అతి పెద్ద విలువకి, అతి చిన్న విలువకి మధ్య వ్యత్యాసం ఎంత?
జవాబు:
40 – 5 – 35

iii) దీనినే వ్యాప్తి అంటారు.
iv) Y- అక్షం పై వ్యాప్తి = పెద్ద విలువ – చిన్న విలువ = 33 – 3 = 30

3) స్కేలు :
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 7

→ పట్టికలోని దూరం విలువలలో ఏఏ విలువలు Y – అక్షంపై గుర్తించిన విలువలకు సమానంగా ఉన్నాయి?
జవాబు:
3, 12, 24, 30, 33

4) అక్షాల పేర్లు :
i) X- అక్షంపై ‘కాలం’ తీసుకున్నాం కాబట్టి X – అక్షం దగ్గర కాలం (నిమిషాలలో) అని రాయాలి.
ii) Y – అక్షంపై ‘దూరం’ తీసుకున్నాం కాబట్టి Y – అక్షం దగ్గర దూరం (కి.మీ.లలో) అని రాయాలి.

5) దత్తాంశ బిందువులు :
i) పట్టికలోని విలువలను దత్తాంశ బిందువులుగా రాయాలి.
ii) (5,3), (10,8), (15, 12), (20, 19), (25, 24), (30, 24), (35, 30), (40, 33)

6) దత్తాంశ బిందువులను గుర్తించడం :
i) పై బిందువులను X – అక్షం, Y – అక్షంపై ఉన్న స్కేలు ఆధారంగా నిలువు, అడ్డు రేఖల ఖండన బిందువుల వద్ద గుర్తించాలి.
ii) గుర్తించిన బిందువులను కలుపుతూ గీసిన రేఖయే గ్రాఫ్. దీనినే మనం ‘దూరం – కాలం గ్రాపు’ అని అంటాము.

→ గ్రాఫు ఎలా ఉంది?
జవాబు:
గ్రాఫు వక్రరేఖా గ్రాఫు.

కృత్యం – 5

5. సరళరేఖా గ్రాఫును గీయండి.
(లేదా)
హుక్ సూత్రం నిరూపించే ప్రయోగ విలువలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. గ్రాఫు ద్వారా సూత్రాన్ని నిరూపించుము.
(లేదా )
రెండు రాశుల మధ్య అనులోమానుపాతం సంబంధాన్ని చూపే గ్రాఫు గీయుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 8
1) ఒక స్ప్రింగ్ ను గాని, రబ్బరు బ్యాండ్ ను గాని తీసుకొనుము.
2) స్టాండ్ కి స్ప్రింగ్ ను బిగించుము.
3) స్ప్రింగ్ పొడవును స్కేలుతో కొలువుము.
4) స్ప్రింగ్ రెండవ కొనకు బరువును వేలాడదీయుము.
5) సాగిన స్ప్రింగ్ పొడవును కొలువుము.
6) స్ప్రింగ్ లో సాగుదలను లెక్కించుము.
7) ఈ విధంగా బరువులను పెంచుతూ, స్ప్రింగ్ సాగుదలను ప్రతిసారి లెక్కించుము.
8) పట్టికలో ద్రవ్యరాశి (g), సాగుదల (mm) లను నమోదు చేయుము.
9) వివరాలు నమోదు చేయబడిన పైన ఇచ్చిన పట్టికకు గ్రాఫు గీయుము.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 9 AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 10
10) గ్రాఫు (0, 0) గుండా పోవు సరళరేఖ గ్రాఫు. ద్రవ్యరాశికి స్ప్రింగ్ సాగుదల అనులోమానుపాతంలో ఉంటుందని తెలుస్తుంది.

i) X – అక్షంపై తీసుకున్న రాశి ఏది? దీనిని ఏ ప్రమాణాలలో వ్యక్తం చేస్తారు? దానిని ఎందుకు X – అక్షంపై తీసుకున్నారు?
జవాబు:

  1. X – అక్షంపై తీసుకున్న రాశి ద్రవ్యరాశి.
  2. ద్రవ్యరాశిని ‘గ్రాములు’ ప్రమాణాలలో వ్యక్తపరుస్తారు.
  3. ద్రవ్యరాశి స్వతంత్ర రాశి. కావున X – అక్షంపై తీసుకున్నారు.

ii) Y – అక్షంపై తీసుకున్న రాశి ఏది? దీనిని ఏ ప్రమాణాలలో వ్యక్తం చేస్తారు? దీనిని స్వతంత్ర రాశి అనవచ్చా? ఎందుకు?
జవాబు:

  1. Y- అక్షంపై తీసుకున్న రాశి సాగుదల.
  2. సాగుదలని మి.మీ.లలో వ్యక్తం చేస్తారు.
  3. సాగుదల స్వతంత్ర రాశి కాదు. ద్రవ్యరాశి మార్పునకు అనుగుణంగా సాగుదల రీడింగులు వస్తాయి. అనగా స్వతంత్ర రాశి కాదు. ఆధారిత రాశి.

iii) X – అక్షంపై వ్యాప్తి విలువ ఎంత?
జవాబు:
వ్యాప్తి – 50 – 0 = 50

iv) Y- అక్షంపై వ్యాప్తి విలువ ఎంత?
జవాబు:
వ్యాప్తి = 10 – 0 = 10

v) X – అక్షంపై స్కేలు ఎంత?
జవాబు:
1 సెం.మీ. – 10 గ్రా.

vi) Y- అక్షంపై స్కేలు ఎంత?
జవాబు:
1 సెం.మీ. = 2 మి.మీ.

vii) X – అక్షంపై గల దత్తాంశ విలువలు
జవాబు:
0, 10, 20, 30, 40, 50.

viii) Y- అక్షంపై గల దత్తాంశ విలువలు
జవాబు:
1, 2, 4, 6, 8, 10.

ix) ఖండన బిందువులను కలుపుతూ గీసిన రేఖ ఏ ఆకారంలో ఉంది?
జవాబు:
సరళ రేఖ.

x) రేఖవాలు దేనిని సూచిస్తుంది?
జవాబు:
ద్రవ్యరాశి – స్ప్రింగు సాగుదల మధ్య సంబంధం అనులోమానుపాతంలో ఉందని సూచిస్తుంది.

xi) స్పింగ్ సాగుదలకు కారణం ఏమిటి?
జవాబు:
ద్రవ్యరాశిని స్ప్రింగ్ కి వేలాడదీయడం వలన.

xii) ద్రవ్యరాశి – స్ప్రింగ్ లో సాగుదల మధ్య ఏమి సంబంధం గుర్తించారు?
జవాబు:
అనులోమానుపాతం.

xiii) గ్రాఫ్ సరళరేఖగా ఉన్నప్పుడు రెండు రాశుల మధ్య ఏ విధమైన సంబంధం ఉందని చెప్పవచ్చు?
జవాబు:
అనులోమానుపాతం.

xiv) పై గ్రాఫు ప్రకారం క్రింది వాక్యా లలో ఏది సరైనది?
ఎ) ద్రవ్యరాశి పెరిగితే స్ప్రింగ్ సాగుదల పెరుగుతుంది.
బి) ద్రవ్యరాశి తగ్గితే స్ప్రింగ్ సాగుదల పెరుగుతుంది.
సి) ద్రవ్యరాశి పెరిగినా, తగ్గినా స్ప్రింగ్ సాగుదలలో మార్పు ఉండదు.
జవాబు:
ఎ) సరైనది.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

కృత్యం – 6

6. విలోమానుపాత సంబంధాన్ని సూచించే ఏదైనా ఒక గ్రాఫు గీయుము.
(లేదా)
పీడనానికి, ఘనపరిమాణానికి మధ్య సంబంధాన్ని సూచించే గ్రాఫును గీయండి.
(లేదా)
క్రింది పట్టికకు గ్రాఫు గీయండి.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 11
జవాబు:

  1. ఒక 50 మి.లీ. సిరంజిని తీసుకోండి.
  2. ప్లంజర్‌ను లాగి సిరంజిని గాలితో నింపండి.
  3. గాలి సిరంజి నుండి బయటకు పోకుండా వేలితో మూయండి.
  4. సిరంజిలోని గాలి స్తంభం యొక్క ఎత్తు గాలి ఘనపరిమాణాన్ని సూచిస్తుంది.
  5. ఇపుడు ప్లంజర్‌ను నెమ్మదిగా ముందుకు నొక్కండి.

→ ఏ స్థానం వద్ద ప్లంజరు ముందుకు కదలలేదు?
జవాబు:
గరిష్ట పీడనం వద్ద ప్లంజరు ముందుకు కదలలేదు.

→ గాలి ఒత్తిడిని కలిగిస్తుందని నీకు అనిపిస్తుందా?
జవాబు:
అనిపిస్తుంది.

6) ప్లంబర్‌ను ముందుకు నొక్కే కొద్ది సిరంజిలో గాలి ఘనపరిమాణం తగ్గుతుంది. లోపలి గాలిపీడనం పెరుగుతుంది.

7) ఇచ్చిన పట్టికలోని విలువలకు గ్రాఫును గీద్దాం.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 12
→ X- అక్షంపై తీసుకున్న భౌతికరాశి ఏది?
జవాబు:
పీడనం

→ Y – అక్షంపై తీసుకున్న భౌతికరాశి ఏది?
జవాబు:
ఘనపరిమాణం

→ గ్రాఫులో స్వతంత్రరాశి ఏది?
జవాబు:
పీడనం

→ గ్రాఫులో ఆధారిత రాశి ఏది?
జవాబు:
ఘనపరిమాణం

→ నిలువు అక్షంపై తీసుకున్న రాశి యొక్క వ్యాప్తి ఎంత?
జవాబు:
50 – 18.7 = 31.3

→ క్షితిజ సమాంతర అక్షంపై తీసుకున్న రాశి యొక్క వ్యాప్తి ఎంత?
జవాబు:
3.2 – 1.2 = 2

→ గ్రాఫు ఆకారం ఏమిటి?
జవాబు:
పరావలయం (వక్రరేఖా గ్రాపు)

→ ఆ గ్రాఫులో ఉన్న దత్తాంశ బిందువుల ఆధారంగా అక్షాలపై ఉన్న భౌతికరాశుల మధ్య నీవు ఏమి సంబంధాన్ని గుర్తించావు?
జవాబు:
విలోమానుపాతం

కృత్యం – 7

7. క్రింది గ్రాఫులు పరిశీలించి ఇచ్చిన పట్టికను నింపుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 13 AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 14

AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది ?

SCERT AP 9th Class Physical Science Guide Pdf Download 5th Lesson పరమాణువులో ఏముంది ? Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 5th Lesson Questions and Answers పరమాణువులో ఏముంది ?

9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
పరమాణువులో గల మూడు ఉపకణాలేమిటి?
జవాబు:
ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేవి పరమాణువులో గల మూడు ఉపకణాలు.

ప్రశ్న 2.
ఎలక్ట్రాన్, ప్రోటాన్, మరియు న్యూట్రాన్ల ధర్మాలను పోల్చండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది 1

ప్రశ్న 3.
జె.జె. థామ్సన్ పరమాణు నమూనా పరిమితులను తెలపండి.
జవాబు:
పరమాణువులో ధనాత్మక మరియు ఋణాత్మక కణాలు ఒకదానినొకటి తటస్థ పరచుకోకుండా ఎలా రక్షింపబడుతున్నాయో వివరించలేకపోవడమే జె.జె. థామ్సన్ పరమాణు నమూనా యొక్క ముఖ్య లోపము.

ప్రశ్న 4.
రూథర్ ఫర్డ్ బంగారురేకు ప్రయోగం యొక్క ముఖ్యమైన మూడు పరిశీలనలు తెలపండి.
జవాబు:
రూథర్ ఫర్డ్ బంగారు రేకు ప్రయోగం యొక్క ముఖ్యమైన మూడు పరిశీలనలు :

  1. పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉంటుంది.
  2. పరమాణువులో ధనావేశమంతా ‘కేంద్రకం’ అనే అతిచిన్న సాంద్ర ప్రాంతంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానులు ఉండవు. దీని పరిమాణం పరమాణు పరిమాణంతో పోలిస్తే అత్యంత చిన్నది.
  3. ఈ కేంద్రకం చుట్టూ ఋణావేశ ఎలక్ట్రానులు వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. ఈ చలనం సూర్యుని చుట్టూ గ్రహాల చలనాన్ని పోలి ఉండుట వలన రూథర్‌ఫర్డ్ నమూనాను గ్రహమండల నమూనా అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 5.
సరైన దానికి (✓), సరికాని వాటికి (✗) లను గుర్తించండి.
i) రూథర్ ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో, చాలా ఎక్కువ సంఖ్యలో ఆల్ఫా కణాలు బంగారు రేకులోంచి నేరుగా చొచ్చుకుపోయాయి. ఈ పరిశీలన ద్వారా కింది వానిలో ఏ నిర్ధారణకు రావచ్చు?
ఎ) పరమాణువులో అతి చిన్న ధనావేశ ప్రాంతం ఉంటుంది. (✓)
బి) పరమాణువులో చాలా ప్రదేశం ఖాళీగా ఉంటుంది. (✓)
సి) ఆల్ఫా కణాలు ధనావేశ ప్రాంతంను నేరుగా ఢీ కొంటాయి. (✓)
డి) పరమాణువులో దట్టమైన ధనావేశ ప్రాంతం ఉంటుంది. (✗)

ii) రూథర్ ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో, కొన్ని సార్లు ఆల్ఫా కణాలు మాత్రం ఋజుమార్గం నుండి విచలనం చెందుతాయి. ఈ పరిశీలనల నుంచి క్రింది వానిలో ఏ నిర్ధారణకు రావచ్చు?
ఎ) పరమాణువులో ధనావేశం అతి తక్కువ ప్రాంతంలో ఉంటుంది. (✓)
బి) పరమాణువులో ఎక్కువ భాగం ఖాళీగా ఉంటుంది. (✓)
సి) ఆల్ఫా కణాలు ధనావేశ ప్రాంతాన్ని నేరుగా ఢీ కొంటాయి. (✓)
డి) పరమాణువులో ధనావేశ ప్రాంతం దట్టంగా ఉంటుంది. (✗)

ప్రశ్న 6.
సోడియం ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించి క్రింది వానిలో సరియైనది ఏది?
ఎ) 2, 8
బి) 8, 2,1
సి) 2, 1, 8
డి) 2, 8, 1
జవాబు:
డి) 2, 8, 1

ప్రశ్న 7.
బోర్ పరమాణు నమూనా ముఖ్యాంశాలు పేర్కొనండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది 2
బోర్ పరమాణు నమూనాలోని మౌలిక ప్రతిపాదనలు :

  1. పరమాణువులో గల ప్రత్యేకమైన స్థిర కక్ష్యలలో మాత్రమే ఎలక్ట్రానులు ఉంటాయి. ఈ స్థిర కక్ష్యలనే శక్తి స్థాయిలని పిలుస్తాం.
  2. ఈ స్థిర కక్ష్యలలో తిరుగుతున్నంత సేపూ ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు. అందువల్ల అవి కేంద్రకంలో పడి నశించిపోకుండా ఉంటాయి.
  3. పటంలో చూపినట్లు ఈ స్థిర కక్ష్యలను K, L, M, N …… అక్షరాలతో లేదా n = 1, 2, 3, 4 ……. అంకెలతో సూచిస్తాం.

ప్రశ్న 8.
మెగ్నీషియం, సోడియం మూలకాల సంయోజకతలను తెలపండి.
జవాబు:
మెగ్నీషియం :

  1. మెగ్నీషియం పరమాణు సంఖ్య – 12,
  2. ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 8, 2
  3. చిట్టచివరి కక్ష్యలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కావున మెగ్నీషియం సంయోజకత 2.

సోడియం :

  1. సోడియం పరమాణు సంఖ్య – 11,
  2. ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 8, 1
  3. చిట్టచివరి కక్ష్యలో 1 ఎలక్ట్రాన్ ఉన్నది. కావున సోడియం సంయోజకత 1.

AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 9.
ద్రవ్యరాశి సంఖ్య 32 మరియు న్యూట్రాన్ల సంఖ్య 16 గా గల మూలకం పరమాణు సంఖ్యను, సంకేతాన్ని రాయండి.
జవాబు:
ద్రవ్యరాశి సంఖ్య (A) = 32 ; న్యూట్రాన్ల సంఖ్య (N) = 16
పరమాణు సంఖ్య Z = A – N = 32 – 16 = 16
∴ పరమాణు సంఖ్య 16 గా గల మూలకం : “సల్ఫర్”
సంకేతం : ‘S

ప్రశ్న 10.
Cl లో పూర్తిగా నిండిన K మరియు L కర్పరాలు ఉంటాయి. వివరించంది.
జవాబు:
Cl (క్లోరిన్) పరమాణు సంఖ్య – 17.
ఎలక్ట్రాన్ల పంపిణీ K
AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది 3

2n² సూత్రం ప్రకారం K కక్ష్య 2 ఎలక్ట్రాన్లను, ఒక్య 8 ఎలక్ట్రాన్లను గరిష్టంగా నింపుకోగలదు. కావున K మరియు Lక్ష్యలు పూర్తిగా నిండి ఉన్నాయి.

ప్రశ్న 11.
ఒకే మూలకానికి చెందిన ఐసోటోపుల మధ్య ముఖ్య భేదమేమి?
జవాబు:
ఒకే మూలకానికి చెందిన ఐసోటోపుల మధ్య ముఖ్య భేదం :

  1. న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండదు.
  2. భౌతిక ధర్మాలు వేరుగానున్నప్పటికి రసాయన ధర్మాలలో సారూప్యత ఉంటుంది.

ప్రశ్న 12.
కింది వాక్యాలను పరిశీలించి ఒప్పు అయితే ‘T’ అని, తప్పు అయితే ‘F” అని వాటికి ఎదురుగా రాయండి.
a) పరమాణువు యొక్క కేంద్రకం కేంద్రక కణాలను మాత్రమే కలిగి ఉంటుందని థామ్సన్ ప్రతిపాదించాడు.
b) ఎలక్ట్రాన్, ప్రోటాన్ల సంయోగం వల్ల న్యూట్రాన్ ఏర్పడును. అందుచే న్యూట్రాన్ తటస్థంగా ఉంటుంది.
c) ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశిలో \(\frac{1}{1836}\) వంతు ఉంటుంది.
జవాబు:
a) (F)
b) (F)
c) (T)

ప్రశ్న 13.
“పరమాణు కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్లు మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఎందుకు ఉండవు?” అని గీతకు అనుమానం వచ్చింది. తన అనుమానాన్ని నివృత్తి చేయగలరా? వివరించండి.
జవాబు:
పరమాణు కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్ మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఉండవు. ఒకవేళ అలా ఉంటే,
a) రూథర్ ఫర్డ్ α – కణ పరిక్షేపణ ప్రయోగంలో α – కణాలు పరిక్షేపణంగాని, విక్షేపణంగాని చెందవు.
b) ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి పరిగణనలోకి తీసుకోలేనంత చిన్నది మరియు ఎలక్ట్రాన్ అస్థిరమైనది కావున ‘కేంద్రకము’ అనే భావన వచ్చి ఉండేది కాదు.

ప్రశ్న 14.
Z = 5 అయితే ఆ మూలకం యొక్క సంయోజకత ఎంత?
జవాబు:
పరమాణు సంఖ్య Z = 5. ; ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 3
సంయోజకత : 3

ప్రశ్న 15.
ఈ క్రింది పట్టికలో ఖాళీలను సరైన సమాచారంతో పూరించండి.
AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది 4
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది 5

ప్రశ్న 16.
రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనాని గీయండి. దీనిని గ్రహమండల నమూనా అని ఎందుకు అంటాం?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది 6
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ల చలనం, సూర్యుని చుట్టూ గ్రహాల చలనాన్ని పోలి ఉండడం వల్ల రూథర్‌ఫర్డ్ నమూనాని గ్రహమండల నమూనా అంటారు.

ప్రశ్న 17.
పరమాణువు యొక్క నిర్మాణాన్ని, వివిధ పరమాణు నమూనాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు చేసిన కృషిని మీరెలా అభినందిస్తారు?
జవాబు:
నేటికీ అనేక ఆలోచనలు రేకెత్తిస్తూ, శాస్త్రజ్ఞులపై కొత్త కొత్త సవాళ్ళు విసురుతున్నది పరమాణు నిర్మాణం అనే భావన.
1) ప్రస్తుతం మనకు తెలిసిన పరమాణు నిర్మాణానికి మూలమైన సిద్ధాంతాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు-లెవోయిజర్ (ద్రవ్యనిత్యత్వ నియమం), జోసెఫ్ ప్రొస్ట్ (స్థిరానుపాత నియమం), డాల్టన్ – (తన మొట్టమొదటి పరమాణు నమూనా), J.J. థామ్సన్ (పుచ్చకాయ నమూనా), రూథర్ ఫర్డ్ (గ్రహమండల నమూనా), నీల్స్ బోర్ (శక్తి స్థాయిలు) వంటి వారిని అభినందించక తప్పదు.

2) పరమాణువులో ఉండే మూడు ఉపకణాలైన ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లతోపాటు ఇంకా ఎన్ని ఉపకణాలున్నాయనే దానిపై నేటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

3) పరమాణు నిర్మాణం తెలియడం, అనేక నూతన ఆవిష్కరణలకు దారితీసి మన జీవితాన్ని సుఖమయం చేసిన శాస్త్రవేత్తల కృషిని అభినందించడంతో బాటు మనముందున్న ఎన్నో సవాళ్ళను స్వీకరించి పరిష్కారం కనుగొనవలసి ఉన్నది.

AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 18.
మీ పాఠ్యాంశంలో ఇచ్చిన వివిధ పరమాణు నమూనాలను పోల్చంది.
జవాబు:
ఈ అధ్యాయంలో నాలుగు పరమాణు నిర్మాణాలు చర్చించబడినవి. వాటిలోని ముఖ్యాంశాలు.

1) డాల్టన్ ప్రతిపాదన :

  1. పరమాణువు విభజింప వీలుకానిది.
  2. ఒక మూలకం యొక్క పరమాణువులన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ ఇతర మూలక పరమాణువులకు భిన్నంగా ఉంటాయి.

2) J.J. థామ్సన్ ప్రతిపాదన :

  1. పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళంగా ఉండి దానిలో ఎలక్ట్రానులు పొదగబడి ఉంటాయి.
  2. పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది.

3) రూథర్‌ఫర్డ్ ప్రతిపాదన :

  1. పరమాణువులో ధనావేశమంతా ‘కేంద్రకం’ అనే అతి చిన్న సాంధ్ర ప్రాంతంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానులు ఉండవు.
  2. ఋణావేశ ఎలక్ట్రానులు ఈ కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతుంటాయి.
  3. పరమాణు కేంద్రక పరిమాణం పరమాణువుతో పోలిస్తే చాలా చిన్నది.
  4. దీనిని గ్రహమండల నమూనా అంటారు.

4) నీల్స్ బోర్ ప్రతిపాదనలు :

  1. పరమాణువులో గల ప్రత్యేకమైన స్థిరకక్ష్యలలో మాత్రమే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ స్థిర కక్ష్యలనే శక్తిస్థాయిలు అంటారు.
  2. ఈ స్థిర కక్ష్యలలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంత సేపూ ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు. అందువల్ల అవి కేంద్రకంలో పడి నశించిపోకుండా ఉంటాయి.
  3. ఈ స్థిర కక్ష్యలను K, L, M, N ….. అక్షరాలతో లేదా n = 1, 2, 3, 4 …. అంకెలతో సూచిస్తాం.

ప్రశ్న 19.
నైట్రోజన్ మరియు బోరాన్లను ఉదాహరణలుగా తీసుకొని సంయోజకతని నిర్వచించండి.
జవాబు:
సంయోజకత :
పరమాణువు యొక్క బాహ్యతమ కక్ష్యలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటారు.
(లేదా)
పరమాణు సంయోగ సామర్థ్యాన్నే సంయోజనీయత అంటారు.

నైట్రోజన్ సంయోజకత :

  1. నైట్రోజన్ పరమాణు సంఖ్య – 7.
  2. ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 5
  3. చిట్టచివరి కక్ష్యలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
  4. కావున నైట్రోజన్ సంయోజకత 5 కావలెను. కానీ ‘అష్టకం’ను పొందుటకు 5 ఎలక్ట్రాన్లను కోల్పోవడం కన్నా 3 ఎలక్ట్రాన్లను గ్రహించడం తేలిక.
  5. కావున నైట్రోజన్ సంయోజకత ‘3’.

బోరాన్ సంయోజకత :

  1. బోరాన్ పరమాణు సంఖ్య – 5
  2. ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 3
  3. బోరాన్ చిట్టచివరి కక్ష్యలో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
  4. కావున బోరాన్ సంయోజకత 3.

AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 20.
జాన్ డాల్టన్ నుండి నీళ్బర్ వరకు ఉన్న శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు, సిద్ధాంతాలను “పరమాణువు చరిత్ర” అనే శీర్షికతో ఒక కథగా రాయండి.
జవాబు:
పరమాణువు చరిత్ర :
ద్రవ్యనిత్యత్వ నియమము, స్థిర అనుపాత నియమమును ఆధారంగా చేసుకొని జాన్ డాల్టన్ పరమాణు నిర్మాణాన్ని ప్రతిపాదించాడు.

డాల్టన్ ప్రకారము :

  1. పరమాణువు విభజింప వీలుకానిది.
  2. ఒక మూలకం యొక్క పరమాణువులన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ ఇతర మూలక పరమాణువులకు భిన్నంగా ఉంటాయి. తదుపరి J.J. థామ్సన్, పరమాణువు విభజింప తగినదని తెలిపాడు.

J.J. థామ్సన్ ప్రకారం –

  1. పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళంగా ఉండి, దానిలో ఎలక్ట్రానులు పొదగబడి ఉంటాయి.
  2. పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అంతటా ఏకరీతిగా పంఫిణీ చేయబడి ఉంటుంది.
  3. మొత్తం ధనావేశాలు, ఋణావేశాలు సమానంగా ఉండటం వల్ల పరమాణువు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుంది. ఈ నమూనాను పుచ్చకాయ నమూనా లేక ప్లమ్ పుడ్డింగ్ నమూనా అంటారు.
  4. గోల్డ్ స్టెయిన్ 1886లో శ్” వాస్ కనుగొన్నాడు.

అనంతరం థామ్సన్ శిష్యుడైన రూథర్ ఫర్డ్, 4-కణ పరిక్షేపణ ప్రయోగం థామ్సన్ నమూనాకు భిన్నమైన ఫలితాలనిచ్చింది. దీని ఆధారంగా రూథర్‌ఫర్డ్ ప్రతిపాదించిన నమూనా యొక్క ముఖ్యాంశాలు :

  1. పరమాణువులో ధనావేశమంతా ‘కేంద్రకం’ అనే అతి చిన్న సాంద్ర ప్రాంతంలో ఉంటుంది.
  2. ఋణావేశ ఎలక్ట్రానులు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో చలిస్తుంటాయి.
  3. పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం అత్యంత చిన్నది.
    కానీ ఈ నమూనా పరమాణు స్థిరత్వాన్ని వివరించలేకపోయింది.

1913లో నీల్స్ బోర్, రూథర్ ఫర్డ్ నమూనాలోని లోపాలను అధిగమించడానికి మరొక నమూనాను ప్రతిపాదించాడు. దీని ప్రకారం –

  1. పరమాణువులో గల ప్రత్యేకమైన స్థిర కక్ష్యలలో మాత్రమే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ స్థిరకక్ష్యలనే శక్తి స్థాయిలని పిలుస్తాం.
  2. ఈ స్థిర కక్ష్యలలో తిరుగుతున్నంత సేపు ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు. అందువల్ల అవి కేంద్రకంలో పడి నశించిపోకుండా ఉంటాయి.
  3. ఈ స్థిర కక్ష్యలను K, L, M, N … అక్షరాలతో లేదా n = 1, 2, 3, 4 … అంకెలతో సూచిస్తాం. ఈ నమూనా హైడ్రోజన్ కంటే బరువైన పరమాణు వర్ణపటాలను వివరించలేకపోయింది.
    … ఇలా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది …

9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No.76

ప్రశ్న 1.
పరమాణువు తటస్థమైనది. కానీ అందులో ఋణావేశపూరిత ఎలక్ట్రానులు ఉంటాయి. ఋణావేశాలు మాత్రమే ఉంటే పరమాణువు తటస్థంగా ఉండదు. అప్పుడు పరమాణువు ఎందుకు తటస్థమైనదిగా ఉంది?
జవాబు:

  1. ఈ భావన ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ఆవిష్కరణ జరగకముందుది, అంతేగాక రూథర్ ఫర్డ్ పరమాణు నమూనాను ప్రతిపాదించక ముందుది.
  2. రూథర్ ఫర్డ్ పరమాణు నిర్మాణం ప్రతిపాదన ప్రకారం కేంద్రకం లోపల ఉండే ప్రోటాన్ల సంఖ్య, కేంద్రకం బయట ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం.
  3. దీనివల్ల మొత్తం ఋణావేశం, మొత్తం ధనావేశానికి సమానమై పరమాణువు తటస్థంగా ఉంటుంది.

9th Class Physical Science Textbook Page No. 80

ప్రశ్న 2.
కింది ప్రశ్నల ఆధారంగా రూథర్ ఫర్డ్, థామ్సన్ పరమాణు నమూనాలు పోల్చంది.
1) ధనావేశం ఎక్కడ ఉంది?
2) ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయి?
3) ఇవన్నీ పరమాణువులో నిశ్చలంగా ఉంటాయా? లేదా చలిస్తూ ఉంటాయా?
జవాబు:

ప్రశ్నలుథామ్సన్ నమూనారూథర్ ఫర్డ్ నమూనా
ధనావేశం ఎక్కడ ఉంది?ధనావేశం, పరమాణువు అంతటా సమంగా విస్తరించబడింది.ధనావేశ ప్రోటాన్లు కేంద్రకంలో ఉన్నాయి.
ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయి?పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళంగా ఉండి దానిలో ఎలక్ట్రానులు పొదగబడి ఉంటాయి.ఋణావేశ ఎలక్ట్రానులు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి.
ఇవన్నీ పరమాణువులో నిశ్చలంగా ఉంటాయా? లేదా చలిస్తూ ఉంటాయా?ఎలక్ట్రాన్లు పరమాణువు లోపల నిశ్చలంగా ఉంటాయి.ప్రోటాన్లు కేంద్రకంలో నిశ్చలంగా ఉండి, కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో ఎలక్ట్రానులు తిరుగుతూ ఉంటాయి.

9th Class Physical Science Textbook Page No. 83

ప్రశ్న 3.
ఫాస్ఫరస్, సల్ఫర్ బహుళ సంయోజకతలను కలిగి ఉంటాయి. ఎందుకు కొన్ని మూలకాలు బహుళ సంయోజకతలని కలిగి ఉంటాయో పట్టిక-2 (పేజి 98) పరిశీలించి వివరించండి. మీ స్నేహితులు, ఉపాధ్యాయులతో చర్చించండి.
జవాబు:

  1. సల్ఫరక్కు చిట్టచివరి కక్ష్యలోనున్న ఎలక్ట్రానుల సంఖ్య 6.
  2. కావున సల్పర్ వేలన్సీ (8-6) = 2 కావలెను.
  3. కానీ సల్పర్ వివిధ రూపాలలో లభిస్తుంది.
  4. కావున ఉత్తేజస్థితిలో చివరి కక్ష్యలో నున్న 6 ఎలక్ట్రానులు కూడా బంధంలో పాల్గొనే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  5. దీనివల్ల కొన్నిసార్లు సంయోజకత ‘6’ చూపును. ఉదా : SO2, SO3 మొ||వి.
  6. ఇదే విధంగా ఫాస్పరసకు కూడా జరుగును. ఉదా : PCl3, PCl5 మొ||వి.

9th Class Physical Science Textbook Page No. 75

ప్రశ్న 4.
విభిన్న మూలకాల పరమాణువులు భిన్నంగా ఎందుకు ఉంటాయి?
జవాబు:
మూలకాల స్వభావము, ధర్మాలు పరమాణు అమరికను బట్టి ఉంటుంది. విభిన్న మూలకాలు విభిన్నంగా ప్రవర్తించడానికి కారణం ఈ పరమాణువుల అమరికే.

ప్రశ్న 5.
పరమాణువులు ఒకేలా లేదా విభిన్నంగా ఉండేలా చేసేదేదైనా పరమాణువులో ఉందా?
జవాబు:
పరమాణు ఉపకణం అమరికే, పరమాణువులు ఒకేలా లేదా విభిన్నంగా ఉండేలా చేస్తుంది.

AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 6.
పరమాణువులు విభజింపశక్యం కానివా? లేదా పరమాణువు లోపల ఏదైనా ఉన్నదా?
జవాబు:
పరమాణువు విభజింపదగినదే. పరమాణువు లోపల ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లతో పాటు ఇంకా అనేకానేక ఉపకణాలు ఉంటాయని ఇటీవలి పరిశోధనలు తెలుపుతున్నాయి.

9th Class Physical Science Textbook Page No.77

ప్రశ్న 7.
పరమాణువులో ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ వంటి ఉప పరమాణు కణాలుంటే అవి పరమాణువులో ఏ విధంగా అమరి ఉంటాయో ఊహించండి.
జవాబు:
పరమాణువులో ఎలక్ట్రాన్, న్యూట్రాన్ వంటి పరమాణు ఉపకణాల అమరికను గూర్చి రూథర్‌ఫర్, నీల్బర్ వంటి శాస్త్రవేత్తలు వివరించారు. వారి ప్రతిపాదనల ప్రకారం, పరమాణు మధ్యభాగంలో కేంద్రకం ఉంటుంది. దీనిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి.

9th Class Physical Science Textbook Page No. 80

ప్రశ్న 8.
పరమాణువు ఎందుకు స్థిరంగా ఉంది?
జవాబు:
పరమాణు కేంద్రకంలోని ప్రోటానుల సంఖ్య, కేంద్రకం బయటి ఎలక్ట్రానుల సంఖ్యకు సమానం. కావున పరమాణువులోని ధన, ఋణ ఆవేశాలు సమానంగా ఉంటాయి. దీనివల్ల పరమాణువు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుంది. కానీ పరమాణు స్థిరత్వాన్ని గూర్చి నీల్స్ బోర్ మరొకవిధంగా వివరించాడు.

ప్రశ్న 9.
తిరుగుతూ ఉండే ఎలక్ట్రాన్ కేంద్రకంలో పడిపోకుండా ఉండేలా పరమాణువులో ఉపపరమాణు కణాలకు ఏదైనా ప్రత్యామ్నాయ అమరికను మీరు సూచించగలరా?
జవాబు:
ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ప్రత్యేకమైన స్థిర కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయి. అందువల్ల వీటిపై పనిచేసే అభికేంద్ర, అపకేంద్ర బలాలు పరిమాణంలో సమానంగా ఉండి, దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. కావున తిరుగుతున్న ఎలక్ట్రాన్లు కేంద్రకంలో పడిపోవు.

9th Class Physical Science Textbook Page No. 82

ప్రశ్న 10.
ఒక్కో కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండవచ్చు?
జవాబు:
ఒక్కో కర్పరంలో ఉండే ఎలక్ట్రానుల సంఖ్య ఆ కర్పరపు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి కర్షరం (K) లో 2, రెండవ కర్పరం (L) లో 8, మూడవ కర్పరం (M) లో 18, నాల్గవ కర్పరం (N) లో 32 ఎలక్ట్రాన్లు …. ఇలా ఉంటూ ఉంటాయి.

ప్రశ్న 11.
ఏదైనా కర్పరంలో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుందా?
జవాబు:
ఏ కర్పరంలోను ఒకే ఎలక్ట్రాన్ ఉండదు.

AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 12.
కర్పరాలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
ఒక కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యని 2n² అనే సూత్రం ద్వారా నిర్ణయిస్తాము (n అనేది కర్పరం సంఖ్య).
ఉదా : L కర్పరం సంఖ్య = n = 2

∴ L కర్పరంలో ఉండే ఎలక్ట్రానుల సంఖ్య = 2 × n² = 2 × 2² = 2 × 4 = 8.

9th Class Physical Science Textbook Page No. 83

ప్రశ్న 13.
ఆక్సిజన్ యొక్క సంయోజకతని ఎలా తెలుసుకుంటావు?
జవాబు:

  1. ఆక్సిజన్ పరమాణువులో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
  2. ఎలక్ట్రాన్ల పంపిణీ 2, 6.
  3. ఆక్సిజన్ చిట్టచివరి కక్ష్యలలో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ సంఖ్య 8 కి చాలా దగ్గర.
  4. కావున ఆక్సిజన్ సంయోజకత 8 – 6 = 2.

9th Class Physical Science Textbook Page No. 85

ప్రశ్న 14.
న్యూట్రాన్ల సంఖ్యని పరమాణు లక్షణంగా మనం పరిగణించగలమా?
జవాబు:
పరమాణు లక్షణాలలో ఒకటియైన పరమాణు ద్రవ్యరాశి, కేంద్రకంలోని ప్రోటానుల మరియు న్యూట్రానుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కావున న్యూట్రానుల సంఖ్యను పరమాణు లక్షణంగా మనం పరిగణించవచ్చు.

పరికరాల జాబితా

వివిధ పరమాణు నమూనాలను ప్రదర్శించే చార్టులు, ఎలక్ట్రాన్ల పంపిణీ చార్టు, ఐసోటోపుల ఫ్లాష్ కార్డులు …

9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

ప్రశ్న 1.
మీరు ఊహించిన విధంగా పరమాణు నిర్మాణాన్ని గీయండి.
AP Board 9th Class Physical Science Solutions 5th Lesson పరమాణువులో ఏముంది 7
ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లను పరమాణువులో ఎన్నో విధాలుగా అమర్చవచ్చు. పరమాణువు ఒక గదిగా ఊహించుకోండి. కణాలను ఒకదాని తరువాత ఒకటి అడువరసలుగా అమర్చండి. ఎలా కనిపిస్తుందో మీరు బొమ్మ తీయండి. ఉప పరమాణు కణాల స్వభావంను దృష్టిలో ఉంచుకుని గోళాకారంగా ఉన్న పరమాణువులో వీటిని అమర్చే పటాన్ని గీయండి.

ప్రోటాన్లు ధనావేశాన్ని, ఎలక్ట్రానులు ఋణావేశాన్ని కలిగి ఉండి, న్యూట్రాన్లు ఆవేశరహితంగా ఉంటాయి. కావున న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఒక దగ్గర ఉంచి, ఎలక్ట్రాన్లను దూరంగా గాని, గోళం అంచుకు దగ్గరగా గాని ఉంచవచ్చు. ఇది కేవలం ఊహ మాత్రమే. ఇంకా ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించవచ్చు.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

SCERT AP 9th Class Physical Science Guide Pdf Download 4th Lesson పరమాణువులు-అణువులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 4th Lesson Questions and Answers పరమాణువులు-అణువులు

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుటకు చేసే ప్రయోగ పద్ధతి మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించండి. (ప్రయోగశాల కృత్యం) (AS 1)
(లేదా)
“ఒక రసాయన చర్య జరిగినపుడు ద్రవ్యరాశి సృష్టించబడదు లేదా నాశనం కాదు” అని నిరూపించు విధానమును వివరించండి.
జవాబు:
ఉద్దేశ్యం : ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుట.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 1

కావలసిన పరికరాలు :
లెడ్ నైట్రేట్, పొటాషియం అయొడైడ్, స్వేదన జలం, రెండు బీకర్లు, కొలజాడి, శాంఖవ కుప్పై, (స్ప్రింగ్ త్రాసు, పరీక్ష నాళికలు, స్టాండ్, రబ్బరు బిరడా, దారం మొదలగునవి.

ప్రయోగ విధానం :

  1. 100 మి.లీ. స్వేదన జలములో సుమారు 2 గ్రా. లెడ్సెట్రేట్ కలిపి ద్రావణం తయారు చేయండి.
  2. 100 మి.లీ. స్వేదన జలములో సుమారు 2 గ్రా. పొటాషియం అయొడైడ్ కలిపి వేరొక ద్రావణం తయారు చేయండి.
  3. 250 మి.లీ. శాంభవ కుప్పెలో 100 మి.లీ. లెడ్నై ట్రేట్ ద్రావణాన్ని తీసుకోండి.
  4. చిన్న పరీక్షనాళికలో 4 మి.లీ పొటాషియం అయొడైడ్ ద్రావణాన్ని తీసుకోండి.
  5. కుప్పెలో పరీక్షనాళికను జాగ్రత్తగా వ్రేలాడదీయండి. రెండు ద్రావణాలు కలవకుండా జాగ్రత్త తీసుకోండి. కుప్పెకు రబ్బరు బిరడాను బిగించండి.
  6. స్ప్రింగు త్రాసునుపయోగించి, కుప్పె భారాన్ని దానిలో ఉండే పదార్థంతోపాటు తూచండి.
  7. రెండు ద్రావణాలూ కలిసిపోయేటట్లు కుప్పెను కదపండి.
  8. అదే విధంగా స్పింగుత్రాసుతో మళ్ళీ కుప్పె భారాన్ని తూచండి.

పరిశీలనలు:

  1. రసాయన పదార్థాలు కలవకముందు కుప్పె భారం = m1 గ్రా.
  2. రసాయన పదార్థాలు కలిసిన తరువాత కుప్పె భారం = m2 గ్రా.

నిర్ధారణ :

  1. m1, m2 లు రెండూ సమానమని గమనిస్తాము.
  2. ఇది ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపిస్తుంది.

జాగ్రత్తలు:

  1. రసాయన పదార్థాలు వాడేటప్పుడు వాటిని నేరుగా చేతితో తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  2. గాజు పరికరాలు క్రిందపడి పగిలిపోకుండా జాగ్రత్త వహించాలి.
  3. మొదటిసారి బరువు తూచడానికి ముందు కుప్పెలోని పదార్థాలు కలవకుండా జాగ్రత్త వహించాలి.
  4. శాంఖవ కుప్పెను స్ప్రింగు త్రాసుకు వేలాడదీయుటకై గట్టి దారాన్ని వాడాలి.

ప్రశ్న 2.
0.24 గ్రా. సంయోగపదార్థంలో 10, 144 గ్రా. ఆక్సిజన్, 0.096 గ్రా. బోరాన్ ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. సంఘటన శాతాలను భారం పరంగా కనుక్కోండి. (AS 1)
జవాబు:
విశ్లేషణ ప్రకారం ఆక్సిజన్, బోరాన్ల సంయోగ పదార్థం యొక్క ద్రవ్యరాశి = 0.24 గ్రా.
ఆక్సిజన్ ద్రవ్యరాశి = 0. 144 గ్రా, ; భోరాన్ ద్రవ్యరాశి = 0.096 గ్రా.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 2

ప్రశ్న 3.
ఒక తరగతిలో ఆక్సిజన్ యొక్క అణుసాంకేతికం రాయమని ఉపాధ్యాయుడు చెబితే షమిత (0), గాను, ప్రియాంక ‘O’ గాను రాసారు. నీవు ఎవరి జవాబును సమర్థిస్తావు? ఎందుకు? (AS 1, AS 2)
జవాబు:
షమిత రాసిన జవాబు సరియైనది.
కారణం:

  1. ఆక్సిజన్ ద్విపరమాణుక అణువు.
  2. రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఆక్సిజన్ అణువును ఏర్పరుస్తాయి.
  3. కావున ఆక్సిజన్ అణుఫార్ములా O2

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 4.
“H2 మరియు 2Hలు భిన్నమైనవి” అని మోహిత్ చెప్పాడు. ఈ వాక్యము తప్పో, ఒప్పో సకారణముగా తెలుపండి. (AS 1)
జవాబు:

  1. H2 అనేది హైడ్రోజన్ అణువు. ఇది రెండు హైడ్రోజన్ పరమాణువుల కలయిక వలన ఏర్పడినది.
  2. 2H అనేది ‘హైడ్రోజన్ పరమాణువు. దీనిలో రెండు హైడ్రోజన్ పరమాణువులు రసాయన చర్యలో పాల్గొనుటకు సిద్ధంగా వున్నాయి. కనుక మోహిత్ చెప్పిన వాక్యము సరియైనదే.

ప్రశ్న 5.
“CO మరియు Co రెండూ మూలకాలను తెలియజేస్తాయి.” అని లక్ష్మి చెప్పింది. మీరేమంటారు? కారణం చెప్పండి. (AS 1, AS 2)
జవాబు:
లక్ష్మి చెప్పిన విషయం సరియైనది కాదు.

  1. CO అనేది ‘కార్బన్ మోనాక్సైడ్’ యొక్క ఫార్ములా.
  2. ‘C’ పెద్ద అక్షరం (Capital letter) మరియు ‘O’ కూడా పెద్ద అక్షరం (Capital letter) వల్ల ఈ విషయం తెలుస్తుంది.
  3. Co అనేది ‘కోబాల్ట్’ అనే మూలక సంకేతం.
  4. ‘C’ పెద్ద అక్షరం (Capital letter), ‘0’ చిన్న అక్షరం (Small letter) వల్ల ఈ విషయం తెలుస్తుంది.

ప్రశ్న 6.
నీటి అణువు యొక్క సాంకేతికం H2O. ఈ సాంకేతికం మనకేం సమాచారాన్ని తెల్పుతుంది? (AS 1)
జవాబు:

  1. నీరు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల కలయిక వలన ఏర్పడుతుంది.
  2. ఒక ఆక్సిజన్ పరమాణువు, రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక నీటి అణువును ఏర్పరుస్తాయి.
  3. నీటి అణువు యొక్క అణుద్రవ్యరాశి 18. [హైడ్రోజన్ – 1, ఆక్సిజన్ – 16, H2O ⇒ 2 × 1 + 16 = 18]
  4. 18 గ్రా. నీటి అణువులో 6.022 × 1023 కణాలు వుంటాయి.
  5. హైడ్రోజన్ సంయోజకత 1, ఆక్సిజన్ సంయోజకత 2.

ప్రశ్న 7.
రెండు అణువుల ఆక్సిజన్, ఐదు అణువుల నైట్రోజనను సాంకేతికంగా మీరు ఎలా రాస్తారు? (AS 1)
జవాబు:
a) రెండు అణువుల ఆక్సిజన్ 2O2.

కారణం:

  1. ఆక్సిజన్ ద్విపరమాణుక మూలకము.
  2. రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఒక ఆక్సిజన్ అణువును ఏర్పరచును.
  3. ఆక్సిజన్ సాంకేతికం O2

b) ఐదు అణువుల నైట్రోజన్ 5N2

కారణం :

  1. నైట్రోజన్ ద్విపరమాణుక మూలకము.
  2. రెండు నైట్రోజన్ పరమాణువులు కలిసి ఒక నైట్రోజన్ అణువును ఏర్పరచును.
  3. నైట్రోజన్ సాంకేతికం N2

ప్రశ్న 8.
ఒక లోహ ఆక్సైడ్ యొక్క సాంకేతికం MO అయిన ఆ లోహ క్లోరైడ్ యొక్క సాంకేతికంను రాయండి. (AS 1)
జవాబు:

  1. ఆక్సైడ్ యొక్క సంయోజకత ‘2’ అనగా O2- అవుతుంది.
  2. లోహ ఆక్సైడ్ యొక్క సాంకేతికం MO అని ఇవ్వబడినది.
  3. కావున ఇవ్వబడిన లోహం యొక్క సంయోజకత 2 అనగా M2+ అవుతుంది.
  4. క్లోరైడ్ యొక్క సంయోజకత 1 అనగా Cl.
  5. క్రిస్క్రాస్ పద్ధతి ప్రకారం ఆ లోహ క్లోరైడ్ యొక్క సాంకేతికం MCl2 అవుతుంది.

ప్రశ్న 9.
కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం Ca(OH)2 మరియు జింక్ ఫాస్ఫేట్ సాంకేతికం Zn3 (PO4)2 అయిన కాల్షియం ఫాస్పేట్ యొక్క సాంకేతికాన్ని రాయండి. (AS 1)
జవాబు:

  1. కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం Ca(OH)2
  2. కావున కాల్షియం సంయోజకత 2 అనగా Ca2+ మరియు హైడ్రాక్సైడ్ సంయోజకత 1 అనగా (OH).
  3. జింక్ ఫాస్ఫేట్ సాంకేతికం Zn3 (PO4)2.
  4. జింక్ సంయోజకత 2 అనగా Zn2+, ఫాస్పేట్ సంయోజకత 3 అనగా (PO4)3-.
  5. క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారం కాల్షియం ఫాస్ఫేట్ యొక్క సాంకేతికం Ca3 (PO4)2.

ప్రశ్న 10.
మన ఇండ్లలో సాధారణంగా వాడే క్రింది పదార్థాల రసాయన నామాలు (Chemical Names), సాంకేతికాలను తెలుసుకోండి. (AS 1)
a) సాధారణ ఉప్పు (Common Salt)
b) వంట సోడా (Baking Soda)
c) ఉతికే సోడా (Washing Soda)
d) వెనిగర్ (Vinegar)
జవాబు:

పదార్ధంరసాయన నామంఫార్ములా
a) సాధారణ ఉప్పుసోడియం క్లోరైడ్NaCl
b) వంట సోడాసోడియం బై కార్బొనేట్NaHCO3
c) ఉతికే సోడాసోడియం కార్బోనేట్Na2CO3
d) వెనిగర్సజల ఎసిటిక్ ఆమ్లంCH3COOH

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 11.
క్రింది వాటి ద్రవ్యరాశులను లెక్కించండి. (AS 1)
a) 0.5 మోల్‌ల N2 వాయువు
b) 0.5 మోల్‌ల N పరమాణువులు
c) 3.011 × 1023 N పరమాణువులు
d) 6.022 × 1023 N2 అణువులు
జవాబు:
a) 0.5 మోల్‌ల N2 వాయువు
1 మోల్‌ N2 వాయువు ద్రవ్యరాశి = 28 గ్రా. (∵ N యొక్క అణు ద్రవ్యరాశి = 28 గ్రా.)
0.5 మోల్‌ల N2 వాయువు ద్రవ్యరాశి = 28 × 0.5 = 14 గ్రా.

b) 0.5 మోల్‌ల N పరమాణువులు
1 మోల్ N పరమాణువుల ద్రవ్యరాశి = 14 గ్రా. (∵ N యొక్క అణు ద్రవ్యరాశి = 14 గ్రా. )
0.5 మోల్‌ల N పరమాణువుల ద్రవ్యరాశి = 14 × 0.5 = 7 గ్రా.

c) 3.011 × 1023 N పరమాణువులు
6.022 × 1023 N పరమాణువుల ద్రవ్యరాశి = 14 గ్రా.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 3

d) 6.022 × 1023 N2 అణువులు
6.022 × 1023 N2 అణువుల ద్రవ్యరాశి = 28 గ్రా.

ప్రశ్న 12.
కింద ఇవ్వబడిన వాటిలో ఉండే కణాల సంఖ్యను లెక్కించండి. (AS 1)
a) 46 గ్రా. Na పరమాణువులు
b) 8 గ్రా. O2 అణువులు
c) 0.1 మోల్ హైడ్రోజన్ పరమాణువులు
జవాబు:
a) 46 గ్రా. Na పరమాణువులు
Na పరమాణు ద్రవ్యరాశి = 23
23 గ్రా. Na పరమాణువులలో ఉండే కణాల సంఖ్య = 6.022 × 1023
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 4

b) 8 గ్రా. O2 అణువులు
O2 అణు ద్రవ్యరాశి = 32
32 గ్రా. O2 అణువులలో ఉండే కణాల సంఖ్య = 6.022× 1023
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 5

c) 0.1 మోల్ హైడ్రోజన్ పరమాణువులు
హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి = 1
∴ 1 మోల్ హైడ్రోజన్ పరమాణువులలో ఉండే కణాల సంఖ్య = 6.022 × 1023
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 6

ప్రశ్న 13.
‘మోల్’లలోకి మార్చండి. (AS 1)
a) 12 గ్రా. ఆక్సిజన్ వాయువు
b) 20 గ్రా. నీరు
C) 22 గ్రా. కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
a) 12 గ్రా. ఆక్సిజన్ వాయువు
O2 అణుభారం = 32
∴ 32 గ్రా. O2 లో ఉండే మెల్ల సంఖ్య = 1
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 7

b) 20 గ్రా. నీరు
నీరు (H2O) అణుభారం = 18
∴ 18 గ్రా. నీటిలోని మోల్ల సంఖ్య = 1
20 గ్రా. నీటిలోని మోల్ల సంఖ్య = \(\frac{20}{18}\) × 1 = 1.11

c) 22 గ్రా, కార్బన్ డై ఆక్సైడ్
కార్బన్ డై ఆక్సైడ్ (CO2) అణుభారం = 44
∴ 44 గ్రా. CO2 లోని మోల్ల సంఖ్య = 1
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 8

ప్రశ్న 14.
FeCl2 మరియు FeCl3 లలో Fe యొక్క సంయోజకతలు రాయండి. (AS 1)
జవాబు:
FeCl2 లో Fe యొక్క సంయోజకత = 2
FeCl3 లో Fe యొక్క సంయోజకత = 3

ప్రశ్న 15.
సల్ఫ్యూరిక్ ఆమ్లం(H2SO4) గ్లూకోజ్ (C6H12O6)ల మోలార్ ద్రవ్యరాశులు లెక్కించండి. (AS 1)
జవాబు:
a) సల్ఫ్యూరిక్ ఆమ్లం : H2SO4
H2SO4 యొక్క అణు ద్రవ్యరాశి = (2 × 1) + (1 × 32) + (4 × 16)
= 2 + 32 + 64 = 98 యూనిట్లు
∴ H2SO4 యొక్క మోలార్ ద్రవ్యరాశి : 98 గ్రా.

b) గ్లూకోజ్ : C6H12O6
C6H12O6 యొక్క అణు ద్రవ్యరాశి = (6 × 12) + (12 × 1) + (6 × 16)
= 72 + 12 + 96 = 180 యూనిట్లు
∴ C6H12O6 యొక్క మోలార్ ద్రవ్యరాశి : 180 గ్రా.

ప్రశ్న 16.
100 గ్రా. సోడియం, 100 గ్రా. ఇనుములలో ఎక్కువ సంఖ్యలో పరమాణువులు కలిగియున్న లోహమేది? వివరించండి. (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 9

ప్రశ్న 17.
కింది పట్టికను పూరించండి. (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 10
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 12

ప్రశ్న 18.
కింది పట్టికలోని ఖాళీలను పూరించండి. (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 11
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 13

ప్రశ్న 19.
15.9 గ్రా. కాపర్ సల్ఫేట్ మరియు 10.6 గ్రా. సోడియం కార్బొనేట్ చర్య పొంది 14.2 గ్రా. సోడియం సల్ఫేట్ మరియు 12.3 గ్రా. కాపర్ కార్బోనేటను ఏర్పరుస్తున్నాయి. దీనిలో ఇమిడి ఉన్న రసాయన సంయోగ నియమాన్ని తెలిపి, నిరూపించండి. (AS 2)
జవాబు:
క్రియాజనకాలు :
కాపర్ సల్ఫేట్ ద్రవ్యరాశి = 15.9 గ్రా.
సోడియం కార్బోనేట్ ద్రవ్యరాశి = 10.6 గ్రా.
క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి = 15.9 + 10.6 = 26.5 గ్రా.

క్రియాజన్యాలు :
సోడియం సల్ఫేట్ ద్రవ్యరాశి = 14.2 గ్రా.
కాపర్ కార్బోనేట్ ద్రవ్యరాశి = 12.3 గ్రా.
క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి : 14.2 + 12.3 = 26.5 గ్రా.
క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి = క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి
ఇదియే ద్రవ్యనిత్యత్వ నియమము.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 20.
112 గ్రా|| కాల్షియం ఆక్సైడ్ కు కార్బన్ డై ఆక్సైడును కలిపితే 200 గ్రా. కాల్షియం కార్బోనేట్ ఏర్పడింది. ఈ చర్యలో వాడిన కార్బన్ డై ఆక్సైడ్ ద్రవ్యరాశిని కనుక్కోండి. మీ జవాబుకు ఏ రసాయన సంయోగ నియమం తోడ్పడింది. (AS 2)
జవాబు:

  1. x గ్రా. కార్బన్ డై ఆక్సైడ్ ను 112 గ్రా. కాల్షియం ఆక్సెడ్ కు కలిపారనుకొనుము. (క్రియాజనకాలు)
  2. క్రియాజన్యమైన కాల్షియం కార్బొనేట్ ద్రవ్యరాశి – 200 గ్రా.
  3. ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం,
    క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి = క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి
    x + 112 = 200 ⇒ x = 200 – 112 ⇒ x = 88
    ∴ 88 గ్రా. కార్బన్ డై ఆక్సైడు కలిపారు.

ప్రశ్న 21.
మూలకాలకు ప్రామాణిక గుర్తులు (సంకేతాలు) నిర్ణయించి ఉండకపోతే ఎలా ఉండేదో ఊహించి రాయండి. (AS 2)
జవాబు:

  1. ప్రపంచంలో చాలా భాషలు వాడుకలో ఉన్నాయి.
  2. ఒక మూలకాన్ని రకరకాల భాషలలో రకరకాల పేర్లుతో పిలిస్తే సమస్యగా మారుతుంది.
  3. ఒక ప్రాంతం వారు పిలిచే ఒక మూలకము, మరొక ప్రాంతం వారు అవగాహన చేసుకోలేక తికమకపడతారు. ఆ పదార్థం బదులుగా వేరొక పదార్థంగా భావించిన ఫలితాలు వేరుగా వస్తాయి.
  4. కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి అన్ని దేశాల, అన్ని ప్రాంతాల, అన్ని భాషల వారికి సౌలభ్యంగా ఉండటం కోసం మూలకాలకు ఒక స్థిరమైన పేరును కేటాయించడం జరిగింది.

ప్రశ్న 22.
ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుటకు చేసే ప్రయోగాన్ని చూపే పటం గీయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 1

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 58

ప్రశ్న 1.
శాంకువ కుప్పెకు రబ్బరు బిరడాను తొలగించి పై ప్రయోగాన్ని చేసినపుడు ఇదే ఫలితం వస్తుందా?
జవాబు:
శాంకువ కుప్పెకు రబ్బరు బిరడాను తొలగించి ప్రయోగాన్ని చేస్తే అదే ఫలితం రాదు. ద్రవ్యనిత్యత్వ నియమం నిరూపణ అవదు.

శాంకువ కుప్పెకు రబ్బరు బిరడాను తొలగించి ప్రయోగాన్ని చేస్తే కొన్ని వాయువులు బయటకుపోయి ప్రయోగం ఫలితం తేడాగా వస్తుంది.

ప్రశ్న 2.
మెగ్నీషియం తీగను మండించడాన్ని గుర్తుకు తెచ్చుకోంది. ఈ చర్యలో కూడా ద్రవ్యరాశిలో మార్పు జరగలేదని నీవు భావిస్తున్నావా? మీ స్నేహితులతో చర్చించండి.
జవాబు:

  1. ద్రవ్యరాశిలో మార్పు జరగదు. కాని దానిని మనం గమనించలేము. కారణం మెగ్నీషియం తీగ మండేటప్పుడు తన చుట్టూ ఉన్న ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది.
  2. ఒకవేళ మనం తీసుకున్న మెగ్నీషియం తీగ మండడానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించగల మూసివున్న సీసాలో, గాలి బయటకు పోకుండా చేసి ప్రయోగాన్ని నిర్వహిస్తే ద్రవ్యనిత్యత్వ నియమం నిరూపించవచ్చు.

9th Class Physical Science Textbook Page No. 59

ప్రశ్న 3.
100 గ్రా. పాదరసపు ఆక్సెడ్ వియోగం చెంది 92.6 గ్రా. పాదరసం 7.4 గ్రా. ఆక్సిజన్లను ఏర్పరుస్తుంది. ఒకవేళ 10 గ్రా. ఆక్సిజన్ 125 గ్రా. పాదరసంతో పూర్తిగా చర్యనొంది పాదరసపు ఆక్సెడు ఏర్పరిచినది అనుకొంటే, ఈ ద్రవ్యరాశి విలువలు స్థిరానుపాత నియమానికి అనుగుణంగా ఉంటుందా?
జవాబు:
ఆక్సిజన్ నిష్పత్తి = 7.4 : 10
పాదరసం నిష్పత్తి = 92.6 : 125 ⇒ \(\frac{7.4}{10}=\frac{92.6}{125}\) ⇒ 0.74 = 0.74
∴ ఇవ్వబడిన ద్రవ్యరాశులు స్థిరానుపాత నియమానికి అనుగుణంగా ఉన్నాయి.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 4.
మీరు శ్వాసించేటప్పుడు బయటకు విడిచిన ర్బన్ డై ఆక్సైడ్ కు, మీ స్నేహితులు బయటకు విడిచిన కార్బన్ డై ఆక్సైడక్కు మధ్య ఏమైనా తేడా ఉంటుందా? స్నేహితులతో చర్చించండి. వివిధ పద్ధతుల ద్వారా తయారైన కార్బన్‌డయాక్సెయ్ సంఘటనం స్థిరంగా ఉంటుందా?
జవాబు:
స్థిరానుపాత నియమం ప్రకారం, ఒక పదార్థం ఎక్కడి నుండి సేకరించాం, ఏ విధంగా తయారు చేశాం అనే వాటితో సంబంధం లేకుండా ఒక సంయోగ పదార్థంలోని మూలకాల స్థిరభార నిష్పత్తి ఎల్లప్పుడు ఒకే రకంగా ఉంటుంది. కావున మేము విడిచిన కార్బన్ డై ఆక్సైడ్ కు, మా స్నేహితులు విడిచిన కార్బన్‌డయాక్సెడు ఏమి తేడా ఉండదు.

9th Class Physical Science Textbook Page No. 60

ప్రశ్న 5.
డాల్టన్ సిద్ధాంతములోని ఏ ప్రతిపాదన ద్రవ్యనిత్యత్వ నియమం యొక్క ఫలితం?
జవాబు:
డాల్టన్ సిద్ధాంతం యొక్క మొదటి ప్రతిపాదన “పదార్థం విభజింప వీలుకాని పరమాణువులను కలిగి ఉంటుంది” అనేది ద్రవ్యనిత్యత్వ నియమం యొక్క ఫలితం.

ప్రశ్న 6.
డాల్టన్ సిద్ధాంతములోని ఏ ప్రతిపాదన స్టిరానుపాత నియమంను వివరిస్తుంది?
జవాబు:
డాల్టన్ సిద్ధాంతములోని మూడవ ప్రతిపాదనయైన “ఒకే మూలక పరమాణువుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. కాని వేర్వేరు మూలక పరమాణువుల ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి” అనేది స్థిరానుపాత నియమాన్ని వివరిస్తుంది.

9th Class Physical Science Textbook Page No. 56

ప్రశ్న 7.
తుప్పు పట్టిన ఇనుప ముక్క భారం పెరుగుతుందా? తగ్గుతుందా?
జవాబు:
తుప్పు పట్టిన ఇనుప ముక్క భారం తగ్గుతుంది.

ప్రశ్న 8.
కట్టి బొగ్గు పూర్తిగా మండిన తరువాత అందులో ఉండే పదార్థం ఎక్కడకెళ్ళింది?
జవాబు:
కట్టె బొగ్గు పూర్తిగా మండి, CO2, వాయువును విడుదల చేయును. బూడిద అవక్షేపముగా మిగులును.

ప్రశ్న 9.
తడిబట్టలారితే పొడిగా మారతాయి. తడి బట్టలో ఉన్న నీరు ఏమైంది?
జవాబు:
తడి బట్టలోనున్న నీరు బాష్పీభవనం చెంది వాతావరణంలో కలిసిపోతుంది.

ప్రశ్న 10.
మెగ్నీషియం తీగను గాలిలో మండిస్తే ఏమవుతుంది?
జవాబు:
మెగ్నీషియం తీగను గాలిలో మండించినపుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతితో మండును. బూడిద అవక్షేపముగా మిగులును. ఈ అవక్షేపమే మెగ్నీషియం ఆక్సెడ్.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 11.
గంధకం (Sulphur)ను గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
గంధకంను గాలిలో మండించినపుడు దాని స్థితిలోను, రంగులోను మార్పు వస్తుంది.

9th Class Physical Science Textbook Page No. 60

ప్రశ్న 12.
మూలకాలు కూడా పరమాణువులతోనే నిర్మితమవుతాయా?
జవాబు:
ఒక పదార్థం ఒకే రకమైన పరమాణువులను కలిగియుంటే దానిని ‘మూలకం’ అని అంటాం. మూలకాలలో పరమాణువులు లేదా అణువులు అనే సూక్ష్మ కణాలు ఉంటాయి.

9th Class Physical Science Textbook Page No. 62

ప్రశ్న 13.
మనకు తెలిసిన మూలకాలు 115కు పైగా ఉన్నాయి. కాని ఇంగ్లీషులో ఉన్న అక్షరాలు 26 మాత్రమే కదా ! కాల్షియం, కోరిన్, క్రోమియంల సంకేతాలను ఎలా రాస్తాం?
జవాబు:
ఇంగ్లీషులో ఉన్న అక్షరాలు 26 మాత్రమే అయినప్పటికీ కాల్షియం, క్లోరిన్, క్రోమియం వంటి వాటికి ఒకే సంకేతాన్ని రాయలేము. అందుకే వాటి పేరులోని రెండు అక్షరాలు అనగా Ca, CI, Cr లను సంకేతాలుగా రాస్తాము.

9th Class Physical Science Textbook Page No. 63

ప్రశ్న 14.
లాటిన్ పేర్ల ఆధారంగా సంకేతాలు రాయబడిన మూలకాలను గుర్తించగలరా? అవి ఏవి?
జవాబు:
లాటిన్ పేరు ఆధారంగా సంకేతం రాయబడిన మూలకాలు : ఇనుము (Fe), బంగారం(Au), సోడియం(Na), పొటాషియం (K).

9th Class Physical Science Textbook Page No. 64

ప్రశ్న 15.
కొన్ని మూలకాలు ఎందుకు ఏక పరమాణుక అణువులుగా వుంటాయి?
జవాబు:
కొన్ని మూలకాల అణువులు ఏర్పడాలంటే, అవి ఒకే ఒక పరమాణువులతో ఏర్పడతాయి. ఇటువంటివి ఏక పరమాణుక అణువులుగా ఉంటాయి.
ఉదా : Ar, Na, Fe మొ||వి.

ప్రశ్న 16.
కింది పట్టికను గమనించి వివిధ మూలక అణువుల సాంకేతికాలను రాయండి.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 14
జవాబు:

మూలకము పేరుసాంకేతికముపరమాణుకత
ఆర్గాన్Arఏకపరమాణుక
హీలియంHeఏకపరమాణుక
సోడియంNaఏకపరమాణుక
ఐరన్Feఏకపరమాణుక
అల్యూమినియంAlఏకపరమాణుక
కాపర్Cuఏకపరమాణుక
హైడ్రోజన్H2ద్విపరమాణుక
ఆక్సిజన్O2ద్విపరమాణుక
నైట్రోజన్N2ద్విపరమాణుక
క్లోరిన్Cl2ద్విపరమాణుక
ఓజోన్O3త్రిపరమాణుక
పాస్ఫరస్P4చతుఃపరమాణుక
సల్ఫర్S8అష్టపరమాణుక

ప్రశ్న 17.
కొన్ని మూలకాలు ఎందుకు ద్విపరమాణుక లేదా త్రిపరమాణుక అణువులుగా ఉంటాయి?
జవాబు:
రెండు లేదా మూడు పరమాణువులు కలిసి ఒక మూలక అణువు ఏర్పడితే అటువంటి వాటిని ద్విపరమాణుక లేదా త్రిపరమాణుక అణువులు అంటారు.
ఉదా : ద్విపరమాణుక అణువులు : O2, H2 మొ||వి.
త్రిపరమాణుక అణువులు : O3 మొ||వి.

ప్రశ్న 18.
పరమాణుకతలో మూలకానికి, మూలకానికి మధ్య భేదం ఉండడానికి కారణమేమి?
జవాబు:
పరమాణుకతలో మూలకానికి, మూలకానికి మధ్య భేదం ఉండడానికి కారణం వాటి సంయోజకత.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 19.
సంయోజకత అంటే ఏమిటి?
జవాబు:
ఒక మూలక పరమాణువులు వేరొక మూలక పరమాణువులతో సంయోగం చెందే సామర్థ్యాన్నే ఆ మూలక పరమాణువు యొక్క సంయోజకత అంటాం.

9th Class Physical Science Textbook Page No. 66

ప్రశ్న 20.
కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైకు సాంకేతికాలను రాయండి. నీటి అణువుకు సాంకేతికం రాసినట్టే వీటికి కూడా ప్రయత్నించండి.
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ :

  1. కార్బన్ డై ఆక్సైడ్లో కార్బన్, ఆక్సిజన్లు ఉన్నాయి.
  2. ఒక కార్బన్ పరమాణువు, రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి కార్బన్ డై ఆక్సైడ్ అణువును ఏర్పరుస్తాయి.
  3. కావున కార్బన్ డై ఆక్సైడ్ సాంకేతికం CO2.

కార్బన్ మోనాక్సైడ్:

  1. కార్బన్ మోనాక్సైడ్లో కార్బన్, ఆక్సిజన్లు ఉన్నాయి.
  2. ఒక కార్బన్ పరమాణువు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి కార్బన్‌ మోనాక్సైడ్ ను ఏర్పరుస్తాయి.
  3. కావున కార్బన్ మోనాక్సైడ్ సాంకేతికం CO.

9th Class Physical Science Textbook Page No. 69

ప్రశ్న 21.
18 గ్రా. నీటిలో ఎన్ని అణువులు ఉంటాయని మీరు భావిస్తున్నారు?
జవాబు:
18 గ్రా. నీటిలో 6.022 × 1023 అణువులు ఉంటాయి.

ప్రశ్న 22.
12 గ్రా. కార్బన్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి?
జవాబు:
12 గ్రా. కార్బన్లో 6.022 × 1023 పరమాణువులు ఉంటాయి.

పరికరాల జాబితా

బీకరులు, శాంఖవకు ప్పె, స్టాండు, స్ప్రింగ్ త్రాసు, రబ్బరు బిరడా, మూలకాల సంకేతాలను సూచించే చార్టు లేదా కార్డు, పొటాషియం అయోడైడ్, స్వేదన జలం

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. కింది పట్టికలో కొన్ని మూలకాలకు గుర్తులు ఉన్నాయి. వాటిని సరిచేసి రాసి, కారణాలను వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 15

కృత్యం – 2

2. మీ పాఠశాల ప్రయోగశాలలో ఉండే మూలకాల ఆవర్తన పట్టికను చూసి క్రింద ఇచ్చిన మూలకాలకు సంకేతాలను రాయండి.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 16
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 17

AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?

SCERT AP 9th Class Physical Science Guide Pdf Download 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ? Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 3rd Lesson Questions and Answers మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?

9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ? Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిని వేరుచేయడానికి ఏ విధమైన పద్దతులను వాడతారు? (AS 1)
జవాబు:

మిశ్రమంవేరుచేయు పద్ధతి
ఎ. సోడియం క్లోరైడ్ జల ద్రావణం నుండి సోడియం క్లోరైడ్స్ఫటికీకరణం
బి. సోడియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్ మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్ఉత్పతనము
సి. కారు ఇంజన్ ఆయిల్ లోనున్న చిన్న లోహపు ముక్కలువడపోత
డి. వివిధ పుష్పాల ఆకర్షణ పత్రావళి నుండి వర్ణదములుక్రొమటోగ్రఫీ
ఇ. పెరుగు నుండి వెన్నఅపకేంద్రనము
ఎఫ్. నీటి నుండి నూనెవేర్పాటు గరాటు
జి. తేనీరు నుండి టీ పొడివడపోత
హెచ్. ఇసుక నుండి ఇనుప ముక్కలుఅయస్కాంతము
ఐ. ఊక నుండి గోధుమలుతూర్పారబట్టుట
జె. నీటిలో అవలంజనం చెందిన బురద కణాలుతేర్చుట, వడపోయుట (లేదా) ఫిల్టర్ పేపరును ఉపయోగించి వడపోయుట

ప్రశ్న 2.
సరైన ఉదాహరణలతో ఈ క్రింది వాటిని వివరించండి. (AS 1)
ఎ) సంతృప్త ద్రావణం బి) శుద్ధ పదార్ధం సి) కొలాయిడ్ డి) అవలంబనం
జవాబు:
ఎ) సంతృప్త ద్రావణం :
ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితాన్ని కలిగియున్న ద్రావణంను “సంతృప్త ద్రావణం” అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 1

  1. ఒక ఖాళీ కప్పులో 50 మి.లీ నీటిని పోయండి.
  2. దానిలో ఒక చెంచా చక్కెరను తీసుకుని కరిగేంతవరకు బాగా కలపండి.
  3. అది కరిగిన తర్వాత మరొక చెంచా కలపండి. ఇలా దీనిలో చక్కెర ఇంకా ఏ మాత్రం కరగదు అనేంత వరకు కలపండి.
  4. ఇలా ఏర్పడిన ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు.

బి) శుద్ధ పదార్థం :
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 2
ఒక పదార్థం శుద్ధమైనది అంటే అది సజాతీయమైనది. ఆ పదార్థం యొక్క ఏ భాగం నుండి తీసుకున్న నమూనాలోనైనా సంఘటనంలో మార్పు ఉండదు.
ఉదా : శుద్ధమైన బంగారం బిస్కెట్ నుండి ఏ సూక్ష్మభాగాన్ని నమూనాగా తీసుకుని పరిశీలించినా, సంఘటనం ఒకేలా ఉంటుంది.

సి) కొలాయిడ్ :
కొలాయిడ్ లేదా కాంజికాభకణ ద్రావణాలు విజాతీయ మిశ్రమాలు. వీటి కణాల పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కాంతిపుంజాలను పరిక్షేపించగలిగేంతగా ఉంటాయి.
ఉదా : పాలు, వెన్న, జున్ను, క్రీమ్, జెల్, షూ పాలిష్ వంటివి కొలాయిడ్ ద్రావణాలకు ఉదాహరణలు.

డి) అవలంబనం :
ఒక ద్రావణిలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థాల కణాలతో అవలంబనాలు ఏర్పడుతాయి. ఇవి ‘విజాతీయ’ మిశ్రమాలు,
ఉదా : సిరట్లు, నీటిలో కలిపిన సుద్దపొడి మిశ్రమం మొదలగునవి అవలంబనాలకు ఉదాహరణలు.

ప్రశ్న 3.
మీకు ఒక రంగులేని ద్రవంను ఇస్తే అది శుద్ధమైన నీరు అని ఎలా నిర్ధారిస్తారు? (AS 1)
జవాబు:

  1. ముందుగా వాసనను చూడాలి. అది ఏ విధమైన వాసనను కలిగియుండరాదు.
  2. సాధారణ కంటితో గమనించినపుడు దానిలో ఏ విధమైన అవలంబన కణాలుగాని, పొగలు గాని, గాలి బుడగలు గాని కనబడవు.
  3. ఒక కాంతికిరణాన్ని పంపితే అది విక్షేపం చెందదు.
  4. ఆ ద్రవం ఉష్ణోగ్రత సాధారణంగా ఉండాలి. అప్పుడు ఆ ద్రవం శుద్ధమైన నీరు.

AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?

ప్రశ్న 4.
ఈ క్రింద పేర్కొన్న వస్తువులలో శుద్ధ పదార్థములు ఏవో తెలిపి, కారణం రాయండి. (AS 1)
ఎ) ఐస్ ముక్క బి) పాలు సి) ఇనుము డి) హైడ్రోక్లోరికామ్లం ఇ) కాల్షియం ఆక్సెడ్ ఎఫ్) మెర్క్యూరి జి) ఇటుక హెచ్) కర్ర ఐ) గాలి
జవాబు:
ఇటుక, కర్ర తప్ప మిగిలిన పదార్థాలను శుద్ధ పదార్థాలుగా చెప్పవచ్చు.

కారణం :
ఇటుక, కర్ర తప్ప పైన పేర్కొన్న మిగిలిన పదార్థాల నుండి ఏ సూక్ష్మ భాగాన్ని తీసుకుని పరిశీలించినా, వాటి అనుఘటకాలలో ఏ మార్పు ఉండదు.

ప్రశ్న 5.
ఈ క్రింద ఇవ్వబడిన మిశ్రమాలలో ద్రావణాలను పేర్కొనుము. (AS 1)
ఎ) మట్టి బి) సముద్రపు నీరు సి) గాలి డి) నేలబొగ్గు ఇ) సోదానీరు
జవాబు:
సముద్రపు నీరు, గాలి, సోడానీరు ద్రావణాలు.

ప్రశ్న 6.
ఈ క్రింది వాటిని జాతీయ, విజాతీయ మిశ్రమాలుగా వర్గీకరించి కారణములను తెలుపుము. (AS 1)
సోడానీరు, కర్ర, గాలి, మట్టి, వెనిగర్, వడపోసిన తేనీరు.
జవాబు:

సజాతీయ మిశ్రమాలువిజాతీయ మిశ్రమాలు
సోడానీరు, గాలి, వెనిగర్, వడపోసిన తేనీరు.
కారణము :
పై మిశ్రమాలలోని అనుఘటకాలు మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించుకుని ఉన్నాయి. వాటిని మనం కంటితో చూడలేము.
మట్టి, కర్ర.
కారణము :
పై మిశ్రమాలలోని అనుఘటకాలు ఏకరీతిగా విస్తరించుకొని లేవు.

ప్రశ్న 7.
ఈ కింది వానిని మూలకాలు, సంయోగ పదార్థాలు మరియు మిశ్రమాలుగా వర్గీకరించండి. (AS 1)
ఎ) సోడియం బి) మట్టి సి) చక్కెర ద్రావణం డి) వెండి ఇ) కాల్షియం కార్బొనేట్ ఎఫ్) టిన్ జి) సిలికాన్ హెచ్) నేలబొగ్గు బి) గాలి జె) సబ్బు కె) మీథేన్ ఎల్) కార్బన్ డై ఆక్సైడ్ ఎమ్) రక్తం
జవాబు:

మూలకాలుసంయోగ పదార్థాలుమిశ్రమాలు
సోడియంకాల్షియం కార్బొనేట్మట్టి
వెండిబొగ్గుచక్కెర ద్రావణం
టిన్మ మీథేన్గాలి
సిలికాన్కార్బన్ డైఆక్సైడ్రక్తం
సబ్బు

ప్రశ్న 8.
ఈ కింద ఇచ్చిన పదార్థాలను పట్టికలో చూపినట్లు వర్గీకరించి నమోదు చేయండి. (AS 1)
సిరా, సోదానీరు, ఇత్తడి, పొగమంచు, రక్తం, ఏరోసాల్ స్త్రీలు, ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ, నూనె, నీరు, షూ పాలిష్, గాలి, గోళ్ళ పాలిష్, ద్రవరూపంలో ఉన్న గంజి (Liquid starch), పాలు.
జవాబు:

ద్రావణంఅవలంబనంకొలాయిడ్
సోడానీరుసిరాపొగమంచు
ఫ్రూట్ సలాడ్గోళ్ళ పాలిష్ఏరోసాల్ స్ప్రేలు
బ్లాక్ కాఫీద్రవరూపంలోనున్న గంజిషూ పాలిష్
గాలిపాలు
ఇత్తడిరక్తం

ప్రశ్న 9.
100 గ్రాముల ఉప్పు ద్రావణంలో 20 గ్రాముల ఉప్పు కలిగి ఉంది. ఈ ద్రావణపు ద్రవ్యరాశి శాతం ఎంత? (AS 1)
జవాబు:
ఉప్పు ద్రవ్యరాశి = 20 గ్రా
ఉప్పు ద్రావణం ద్రవ్యరాశి = 100 గ్రా.
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 3

ప్రశ్న 10.
50 మి.లీ. పొటాషియం క్లోరైడ్ (KCI) ద్రావణంలో 2.5 గ్రా. పొటాషియం క్లోరైడ్ ఉంటే ఆ ద్రావణం యొక్క ద్రవ్యరాశి /ఘనపరిమాణ శాతం కనుక్కోంది. (AS 1)
జవాబు:
పొటాషియం క్లోరైడ్ ద్రవ్యరాశి = 2.5 గ్రా
పొటాషియం క్లోరైడ్ ద్రావణం ద్రవ్యరాశి = 50 మి.లీ.
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 4

ప్రశ్న 11.
ఈ క్రింది వాటిలో ఏవి బొండాల్ ప్రభావమును ప్రదర్శిస్తాయి ? వాటిలో టిండాల్ ప్రభావమును మీరెలా ప్రదర్శించి చూపుతారు? (AS 2, AS 3)
ఎ) లవణ ద్రావణం బి) పాలు సి) కాపర్ సల్ఫేట్ ద్రావణం డి) గంజి ద్రావణం
జవాబు:
పాలు టిండాల్ ప్రభావమును చూపును.
ప్రదర్శన :

  1. పాలు, కాపర్ సల్ఫేట్, లవణము మరియు గంజి ద్రావణాలను వేరు వేరు గాజు బీకరులలో తయారుచేయుము.
  2. ప్రతి ఒక్క బీకరు గుండా కాంతి పుంజాన్ని ప్రసరింపజేయుము.
  3. పాల గుండా కాంతిపుంజం మనకు స్పష్టంగా కనబడును.
  4. మిగిలిన ద్రావణాల గుండా కాంతిపుంజం కనబడదు.
  5. ఈ ప్రయోగాన్ని చీకటి గదిలో చేస్తే ఫలితం ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?

ప్రశ్న 12.
ఒక ద్రావణం, అవలంబనం, కొలాయిడల్ విక్షేపణాలను వివిధ బీకర్లలో తీసుకోండి. బీకరు పక్క భాగంపై కాంతి పడేటట్లు చేసి ప్రతీ మిశ్రమం టిండాల్ ప్రభావంను చూపుతుందో, లేదో పరీక్షించండి. (AS 3)
జవాబు:

  1. చక్కెర ద్రావణం (ద్రావణం), గంజి ద్రావణం (అవలంబనం) మరియు పాలు (కొలాయిడల్ విక్షేపణం)లను మూడు వేరు వేరు బీకర్లలో తీసుకోండి.
  2. ప్రతి బీకరు యొక్క పక్క భాగంపై టార్చ్ లేదా లేసర్ లైట్ సహాయంతో ఒక కాంతిపుంజాన్ని పడేటట్టు చేసి పరిశీలించండి.
  3. ప్రతి బీకరులోని ద్రావణం గుండా కాంతిపుంజాన్ని స్పష్టంగా చూడవచ్చు.
  4. కావున పైన పేర్కొన్న ద్రావణాలన్నీ టిండాల్ ప్రభావాన్ని చూపుతాయి.

ప్రశ్న 13.
స్వేదన ప్రక్రియ మరియు అంశిక స్వేదన ప్రక్రియల కొరకు పరికరాల అమరికను చూపే పటాలను గీయండి. ఈ రెండు ప్రక్రియలలో వాడే పరికరాల మధ్య ఏమి తేడాను గమనించారు? (AS 5, AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 5
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 6
ఈ రెండు పరికరాల మధ్య ప్రధాన భేదమేమనగా, అంశిక స్వేదన ప్రక్రియకు వాడే పరికరంలో స్వేదన కుప్పెడు, కండెన్సరకు మధ్య స్వేదన గది ఉంటుంది.

ప్రశ్న 14.
తేనీరు(tea)ను ఏ విధంగా తయారుచేస్తారో రాయండి. ఈ కింద పేర్కొన్న పదాలను ఉపయోగించి తేనీరు తయారీ విధానాన్ని తెలపండి. (AS 7)
ద్రావణం, ద్రావణి, ద్రావితం, కరగదం, కరిగినది, కరిగేది, కరగనిది, వడపోయబడిన పదార్థం , వదపోయగా మిగిలిన పదార్థం
జవాబు:

  1. ఒక టీ కెటిల్ నందు ఒక కప్పు పాలు (ద్రావణి) తీసుకోండి.
  2. ఒక టేబుల్ స్పూన్ చక్కెర (ద్రావితము), ఒక టేబుల్ స్పూన్ టీ పొడి (కరగనిది) మరియు పాలు (ద్రావణి) కలపండి.
  3. ఈ మిశ్రమాన్ని స్టా మీద పెట్టి వేడిచేయండి.
  4. చక్కెర (ద్రావితము) పాలు (ద్రావణి) లో కరుగుతుంది. టీ పొడి కరగకుండా అడుగున మిగిలిపోతుంది.
  5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోయండి.
  6. వడపోయగా మిగిలిన ద్రావణమే తేనీరు.
  7. జల్లెడలో మిగిలిన అవక్షేపం ద్రావణిలో కరగని పదార్థం.

9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ? Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 38

ప్రశ్న 1.
లాండ్రీ డయర్ తడి బట్టల నుండి నీటిని ఎలా వేరుచేస్తుంది?
జవాబు:

  1. బట్టలు ఉతికే యంత్రంలోనున్న డ్రయర్, గోడలకు రంధ్రాలున్న ఒక స్థూపాకార పాత్రను కలిగియుంటుంది.
  2. తడి బట్టలను ఆ స్థూపాకార పాత్రలో వేసి, విద్యుత్ మోటారు సహాయంతో అధిక వేగంతో దానిని తిప్పుతారు.
  3. అపకేంద్ర బలం వల్ల బట్టలలోని నీరు పాత్ర గోడలవద్దకు చేరుకుని, పాత్రకు గల రంధ్రాల ద్వారా బయటకు నెట్టివేయబడుతుంది.
  4. ఈ విధంగా యంత్రం తడి బట్టల నుండి నీటిని వేరుచేయగలుగుతుంది.

9th Class Physical Science Textbook Page No. 40

ప్రశ్న 2.
“అన్ని ద్రావణాలు మిశ్రమాలే, కాని అన్ని మిశ్రమాలు ద్రావణాలు కావు”. ఈ వాక్యం సరైనదో కాదో చర్చించి మీ వాదనను సమర్థించే విధంగా సరైన కారణాలు రాయండి.
జవాబు:

  1. ఉప్పు ద్రావణము లేదా చక్కెర ద్రావణము వంటి వాటిని తీసుకున్నట్లయితే, ఇవి సజాతీయ మిశ్రమాలు. కావున ఇవి ద్రావణాలు.
  2. ఇసుక, ఇనుపరజనుల మిశ్రమాన్ని తీసుకున్నట్లయితే, ఇది విజాతీయ మిశ్రమము. కావున ఇది ద్రావణం కాదు.

ప్రశ్న 3.
సాధారణంగా ద్రావణాలను ఘన / ద్రవ / వాయు పదార్థాలు కలిగి ఉన్న ద్రవాలుగానే భావిస్తాం. కాని కొన్ని ఘన ద్రావణాలు కూడా ఉన్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా?
జవాబు:

  1. నిర్మాణాలలో వాడే ఉక్కు (ఇది ఇనుము మరియు కార్బన్ సజాతీయ మిశ్రమము).
  2. ఇత్తడి (ఇది జింక్ మరియు కాపర్ సజాతీయ మిశ్రమము).

9th Class Physical Science Textbook Page No. 43

ప్రశ్న 4.
జలుబు, దగ్గుతో బాధపడుచున్నపుడు మీరు త్రాగే సిరపను ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా? ఈ మందును త్రాగడానికి ముందు ఎందుకు బాగా కుదుపుతారు? ఇది అవలంబనమా? లేదా కాంజికాభ ద్రావణమా?
జవాబు:

  1. జలుబు, దగ్గుకు వాడే సిరప్ కు అడుగు భాగాన కొన్ని కరగని పదార్థాలు తేరుకొని ఉంటాయి. కావున ఈ మందును వాడే ముందు బాగా కుదుపుతారు.
  2. కావున దగ్గుకు వాడే సిరప్ ఒక అవలంబనము.

AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?

9th Class Physical Science Textbook Page No. 45

ప్రశ్న 5.
నిజ ద్రావణమునకు, కొలాయిడ్ ద్రావణమునకు మధ్య తేడాలు ఉన్నాయా ? మీరు వాటి మధ్య తేడాలు గమనిస్తే అవి ఏమిటి?
జవాబు:
నిజ ద్రావణమునకు, కొలాయిడ్ ద్రావణమునకు మధ్య తేడాలు :

ధర్మమునిజ ద్రావణముకొలాయిడ్ ద్రావణము
1. కణాల పరిమాణము< 1 నానో మీటర్1 – 1000 నానో మీటర్లు
2. వడపోత ధర్మంకొలాయిడ్ ద్రావణ కణాలు వడపోత కాగితం గుండా ప్రవహిస్తాయి.నిజ ద్రావణ కలు వడపోత కాగితంలో త్వరగా విక్షేపణం చెందుతాయి.
3. స్వభావంఇది సజాతీయము.ఇది విజాతీయము.
4. కంటికి కనబడే స్వభావంవీటి కణాలు సాధారణ కంటికి కనబడవు.వీటి కణాలు కూడా కంటికి కనబడవు.
5. టిండాల్ ప్రభావముటిండాల్ ప్రభావమును చూపవు.టిండాల్ ప్రభావమును చూపుతాయి.
6. పారదర్శకతఇవి సంపూర్ణ పారదర్శకాలు.ఇవి పాక్షిక పారదర్శకాలు.

9th Class Physical Science Textbook Page No. 46

ప్రశ్న 6.
ధాన్యం మరియు ఊక అదే విధంగా అమ్మోనియం క్లోరైడ్ మరియు ఉప్పు మొదలగునవి విజాతీయ మిశ్రమాలు అయినప్పటికీ వాటిని వేరుచేయుటకు వేరు వేరు పద్ధతులను ఎందుకు వాడుతున్నాము?
జవాబు:

  1. ధాన్యము మరియు ఊక మిశ్రమాన్ని వేరుచేయుటకు మనము తూర్పారబట్టడం అనే పద్ధతిని వాడుతాము. ఎందుకంటే ఊక చాలా తేలికైనది కావున ఇది గాలిలో తేలుతుంది.
  2. అమ్మోనియం క్లోరైడ్, ఉప్పుల మిశ్రమాన్ని వేరుచేయుటకు మనము ఉత్పతనము అనే పద్దతిని వాడుతాము. ఎందుకంటే అమ్మోనియం క్లోరైడ్ ఉత్పతనం చెందుతుంది.

ప్రశ్న 7.
ఒక మిశ్రమాన్ని వేరుచేయడానికి ఏ పద్ధతి అనువైనది అనే విషయాన్ని దేని ఆధారంగా నిర్ణయిస్తామో చర్చించండి.
జవాబు:
ఒక మిశ్రమాన్ని వేరుచేయడానికి ఏ పద్ధతి అనువైనది అనే విషయాన్ని ఆ మిశ్రమంలోని అనుఘటకాల ధర్మాలైన నీటిలో కరుగుట, బాష్పీభవన స్థానము, వాటి బాహ్య నిర్మాణము, కణాల పరిమాణము వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తాము.

9th Class Physical Science Textbook Page No. 50

ప్రశ్న 8.
గాలిలోని వాయువులన్నింటిని వాటి వాటి మరగుస్థానాలు పెరిగే క్రమంలో అమర్చండి. ఏం గమనించారు?
జవాబు:

వాయువుమరగు స్థానం
హీలియం268.93°C
హైడ్రోజన్252.9°C
నియాన్246.08°C
నైట్రోజన్195.8°C
ఆర్గాన్185.8°C
ఆక్సిజన్183°C
మీథేన్164°C
క్రిప్టాన్153.22°C
జీనాన్108.120
కార్బన్ డయాక్సైడ్78°C

ప్రశ్న 9.
గాలి చల్లబడడం వలన ఏ వాయువు ముందుగా ద్రవరూపంలోకి మారుతుంది?
జవాబు:
గాలి చల్లబడడం వలన ఆక్సిజన్ ముందుగా ద్రవరూపంలోకి మారుతుంది.

9th Class Physical Science Textbook Page No. 40

ప్రశ్న 10.
సజాతీయ మిశ్రమాలకు మీరు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా?
జవాబు:
చక్కెర ద్రావణం, నిమ్మరసం, పండ్ల రసాలు, వైద్యంలో వాడే టానిన్లు, సిరట్లు మొదలగునవి.

AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?

ప్రశ్న 11.
ద్రావణంలో కాంతికిరణ మార్గాన్ని మనం చూడలేము. దీనిని మీరు ప్రయోగం ద్వారా నిరూపించగలరా?
జవాబు:

  1. ఒక పరీక్ష నాళికలో చిక్కటి పాలను తీసుకోండి.
  2. టార్చిలైటు / లేజర్ లైట్ ద్వారా కాంతికిరణ పుంజాన్ని బీకరులోనికి ప్రసరింపచేయండి.
  3. కాంతికిరణ మార్గాన్ని మనం ఆ ద్రావణంలో చూడలేము.

ప్రశ్న 12.
ద్రావణంను విలీనపరిచినపుడు కాంతి మార్గంను మనం చూడగలమా?
జవాబు:
ద్రావణంను విలీనపరిచినపుడు కాంతి మార్గంను మనం చూడలేము.

ప్రశ్న 13.
మీరు కొంచెం ఎక్కువ ద్రావితంను ద్రావణికి కలిపితే ఏమి జరుగుతుంది?
జవాబు:
ద్రావణం యొక్క గాఢత పెరుగుతుంది.

ప్రశ్న 14.
ఒక ద్రావణంలో ఎంత శాతం ద్రావితం ఉందో మీరు ఎలా నిర్ధారిస్తారు?
జవాబు:

  1. ఒక బీకరులో 100 మి.లీ. ద్రావణంను తీసుకోండి.
  2. ఒక ప్లేటులో 50 గ్రా. చక్కెరను తీసుకోండి.
  3. బీకరులోని నీటికి ఒక టేబుల్ స్పూన్ చక్కెరను కలిపి అది కరిగేంతవరకు బాగా కలపండి.
  4. ఇదే విధంగా చక్కెరను, నీటిలో చక్కెర కరగని స్థితి వచ్చేవరకు కలుపుతూ ఉండండి.
  5. ఇప్పుడు ప్లేటులో మిగిలిన చక్కెర బరువును కనుక్కోండి.
  6. ఈ బరువును 50 గ్రా. నుండి తీసివేయండి. ఈ బరువు నీటిలో కరిగిన చక్కెర బరువును తెలుపుతుంది.
  7. కావున 100 మి.లీ. ల ద్రావణిలో కరిగియున్న ద్రావిత గరిష్ఠ పరిమాణాన్ని ద్రావిత శాతం (ద్రావణీయత) అంటారు.

9th Class Physical Science Textbook Page No. 44

ప్రశ్న 15.
సినిమా థియేటర్లలో టిందాల్ ప్రభావాన్ని మీరెప్పుడైనా గమనించారా?
జవాబు:
సినిమా థియేటర్లలో సినిమా నడిచేటప్పుడు ప్రొజెక్టరు వైపు గమనిస్తే, ప్రొజెక్టరు నుండి తెర వైపుకి ఒక కాంతి కిరణపుంజం కనిపిస్తుంది. ఆ కాంతి కిరణపుంజంలో దుమ్ము, ధూళి కణాలు కూడా కనిపిస్తాయి. ఇది టిండాల్ ప్రభావము.

9th Class Physical Science Textbook Page No. 46

ప్రశ్న 16.
ఈ మిశ్రమం విజాతీయ సమ్మేళనమా? కారణాలు తెలపండి.
జవాబు:
అమ్మోనియం క్లోరైడ్ మరియు ఉప్పుల మిశ్రమం విజాతీయ మిశ్రమం. ఇవి రెండూ తెల్లరంగులో ఉన్నప్పటికీ, వాటి కణాలు ఒకదానితోనొకటి కలవవు.

ప్రశ్న 17.
అమ్మోనియం క్లోరైడ్ మరియు ఉప్పుల మిశ్రమం నుండి ఉప్పు మరియు అమ్మోనియం క్లోరైడ్ లను ఎలా వేరుచేస్తారు?
జవాబు:
అమ్మోనియం క్లోరైడ్ మరియు ఉప్పుల మిశ్రమం నుండి ఉప్పు మరియు అమ్మోనియం క్లోరైడ్లను ఉత్పతనము ద్వారా వేరుచేస్తారు.

9th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 18.
అంశిక స్వేదన ప్రక్రియను ఉపయోగించే సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ముడి చమురులోని అనుఘటకాలైన పెట్రోల్, నాఫ్తలీన్, కిరోసిన్, గ్రీజు వంటి వాటిని వేరుచేయుటకు అంశిక స్వేదన ప్రక్రియను ఉపయోగిస్తారు.

ఉదాహరణ సమస్యలు

9th Class Physical Science Textbook Page No. 42

ప్రశ్న 1.
200 గ్రా||ల నీటిలో 50 గ్రా.ల ఉప్పు కలిగియున్నది. ఆ ద్రావణం యొక్క ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని కనుక్కోండి.
జవాబు:
ద్రావిత ద్రవ్యరాశి (లవణం) = 50 గ్రా||
ద్రావణి ద్రవ్యరాశి (నీరు) | = 200 గ్రా||
ద్రావణం ద్రవ్యరాశి = ద్రావిత ద్రవ్యరాశి + ద్రావణి ద్రవ్యరాశి
= 50 + 200 = 250 గ్రా||
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 7

ప్రశ్న 2.
80 మిల్లీ లీటర్ల ద్రావణంలో 20 మిల్లీ లీటర్ల చక్కెర కరిగి ఉన్నది. ఆ ద్రావణపు ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతంను కనుక్కోండి.
జవాబు:
ద్రావణ ఘనపరిమాణము = 80 మి.లీ||
ద్రావిత ద్రవ్యరాశి = 20 మి.లీ||
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 8

పరికరాల జాబితా

కవ్వం, పాత్ర, పాలు, అపకేంద్రయంత్రం నమూనా, నూనెనీరు, నూనె వెనిగర్, నీరూనాఫ్తలీన్, పింగాణీ కప్పు, చక్కెర, ఉప్పు, టార్చిలైటు లేదా లేజరు లైటు, నలుపు రంగు మార్కర్, పెన్సిల్, సెల్లోటేపు, నీరు, నూనె, కిరోసిన్, రెండు పరీక్ష నాళికలు, గాజు బీకర్లు, సారాయి దీపం, గాజు కడ్డీ, వడపోత కాగితం, గాజు గరాటు, బీకరు, వాచ్ గ్లాస్, వేర్పాటు గరాటు, స్వేదన కుప్పె, అంశిక స్వేదన కుప్పె, పింగాణి కుప్పె, అయస్కాంతం, సుద్దపొడి, అమ్మోనియం క్లోరైడ్, ఉప్పు, సిరా, ఇనుపరజను, సల్ఫర్ పొడి.

9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ? Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

వెన్నతీయని పాలు శుద్ధమైనవా? :

ప్రశ్న 1.
పాల నుండి వెన్నను వేరుచేయు విధానమును వివరించుము.
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 9
జవాబు:

  1. ఒక పాత్రలో పాలు తీసుకొని, కవ్వముతో కొద్దిసేపు చిలకండి.
  2. ఈ విధంగా చిలికిన కొంత సేపటికి పేస్ట్ లా ఉండే చిక్కటి ఘనపదార్థం, పాల నుండి వేరగుటను గమనించవచ్చును.
  3. ఈ చిక్కని పదార్థాన్నే వెన్న అంటారు.

కృత్యం – 2

సజాతీయ, విజాతీయ మిశ్రమాలను గుర్తించుట :

ప్రశ్న 2.
సజాతీయ, విజాతీయ మిశ్రమాలను గుర్తించడానికి ఒక కృత్యాన్ని వివరించండి.
జవాబు:

  1. రెండు పరీక్షనాళికలను తీసుకొని, ఒకదానిని నీటితో, రెండవ దానిని కిరోసితో నింపండి.
  2. రెండు పరీక్షనాళికలలో ఒక చెంచా ఉప్పును కలిపి, బాగా కలపండి.
  3. మొదటి పరీక్ష నాళికలో గల నీటిలో ఉప్పు పూర్తిగా కరగడం గమనించవచ్చు.
  4. ఈ రకమైన మిశ్రమమును సజాతీయ మిశ్రమము అంటారు.
  5. రెండవ పరీక్ష నాళికలో గల కిరోసిన్లో ఉప్పు కరగదు.
  6. ఇది విజాతీయ మిశ్రమము.

AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?

కృత్యం – 3

ప్రశ్న 3.
సంతృప్త, అసంతృప్త ద్రావణాలను తయారుచేయుట :
ఎ) సంతృప్త ద్రావణము తయారుచేయు విధానమును వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 10
ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితాన్ని కలిగియున్న ద్రావణంను “సంతృప్త ద్రావణం” అంటారు.

  1. ఒక ఖాళీ కప్పులో 50 మి.లీ నీటిని పోయండి.
  2. దానిలో ఒక చెంచా చక్కెరను తీసుకుని కరిగేంతవరకు బాగా కలపండి.
  3. అది కరిగిన తర్వాత మరొక చెంచా కలపండి. ఇలా దీనిలో చక్కెర ఇంకా ఏ మాత్రం కరగదు అనేంత వరకు కలపండి.
  4. ఇలా ఏర్పడిన ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు.

బి) అసంతృప్త ద్రావణమును తయారుచేయు విధానమును వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 11

  1. కప్పులో తయారు చేసిన ద్రావణమును ఒక బీకరులోనికి తీసుకొని, దానిని సన్నని మంటపై వేడిచేయవలెను.
  2. మరిగించకుండా వేడి చేస్తూ దానికి ఇంకొంచెం చక్కెరను కలపవలెను.
  3. ద్రావణాన్ని వేడిచేసినప్పుడు ఎక్కువ చక్కెర కరగడాన్ని మనం గమనించవచ్చు.

కృత్యం – 4

కరిగేరేటును ప్రభావితం చేయు అంశాలు :

ప్రశ్న 4.
కరిగేరేటును ప్రభావితం చేయు అంశాలేవి? వాటినెలా నిరూపిస్తావు?
జవాబు:
కరిగేరేటును ప్రభావితం చేయు అంశాలు :

  1. ద్రావణి ఉష్ణోగ్రత
  2. ద్రావిత కణాల పరిమాణం
  3. కలియబెట్టు పద్దతి

నిరూపణ :

  1. మూడు గాజు బీకర్లను తీసుకొని ఒక్కొక్క దానిలో 100 మి.లీ. నీటిని నింపండి.
  2. ప్రతి బీకరులో రెండు చెంచాల ఉప్పుపొడిని వేయండి.
  3. మొదటి బీకరును నిశ్చలంగా ఉంచండి.
  4. రెండవ బీకరులోని ద్రావణాన్ని కలియబెట్టండి.
  5. మూడవ బీకరులోని ద్రావణాన్ని గోరువెచ్చగా వేడి చేయండి.
  6. పై అన్ని సందర్భాలలో ఉప్పు కరుగుతుంది కాని కరగడానికి పట్టే సమయంలో తేడా ఉంటుంది.
  7. మూడవ బీకరు (వేడిచేసినది)లో ఉప్పు త్వరగా కరుగుతుంది.
  8. రెండవ బీకరు (కలియబెట్టినది)లో ఉప్పు కొంచెం నెమ్మదిగా కరుగుతుంది.
  9. మొదటి బీకరు (నిశ్చలంగా ఉంచినది)లోని ఉప్పు మరికొంచెం నెమ్మదిగా కరుగుతుంది.
  10. పై కృత్యం ద్వారా ద్రావణి ఉష్ణోగ్రత, ద్రావిత కణాల పరిమాణం, కలియబెట్టే విధానం అనేవి కరిగేరేటును ప్రభావితం చేస్తాయని తెలుస్తుంది.

కృత్యం – 5

విజాతీయ మిశ్రమాలను అవలంబన మరియు కాంజికాభకణ ద్రావణాలుగా గుర్తించుట :

ప్రశ్న 5.
విజాతీయ మిశ్రమాలను అవలంబన, కాంజికాభకణ ద్రావణాలుగా గుర్తించుటకు ఒక కృత్యమును పేర్కొనుము.
జవాబు:

  1. ఒక పరీక్ష నాళికలో కొంచెం సుపొడిని, మరొక పరీక్ష నాళికలో కొన్ని చుక్కల పాలను తీసుకోండి.
  2. ఈ రెండు పరీక్షనాళికలకు కొంత నీటిని కలిపి గాజు కడ్డీతో బాగా కలపిండి.
  3. ఇప్పుడు పై కృత్యాన్ని కింది సోపానాలతో పొడిగించండి.

సోపానం – 1: టార్చిలైట్ లేదా లేజర్ లైట్ నుండి వచ్చు కాంతిని నేరుగా పరీక్షనాళికలోని ద్రవంపై పడేటట్లు చేయండి.
సోపానం – 2 : ఈ రెండు మిశ్రమాలను కదపకుండా కొద్దిసేపు ఒకచోట ఉంచండి.
సోపానం – 3 : ఈ మిశ్రమాలను వడపోత కాగితంను ఉపయోగించి వడపోయండి.

ఇప్పుడు మీ పరిశీలనలను ఈ పట్టికలో పొందుపర్చండి.

AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 12

పరిశీలనలు:

  1. నీటిలో కలిపిన సుద్దపొడిని దానిలో కరగకుండా అవలంబనంగా నీరంతటా విస్తరించి ఉండడం గమనించవచ్చు.
  2. కావున సుద్దపొడి మిశ్రమం అవలంబనం.
  3. పాల కణాలు మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటాయి. అంతేగాక వడపోసినపుడు వడపోత కాగితంపై ఎటువంటి అవక్షేపం ఉండదు.
  4. కావున పాలు కొలాయిడల్ (కాంజికాభకణ ద్రావణాలు) ద్రావణం.

కృత్యం – 6

ఉత్పతనం :

ప్రశ్న 6.
ఉత్పతనం ద్వారా మిశ్రమాలను వేరుచేయు పద్ధతిని ఉదాహరణతో వివరించుము. (లేదా) ఉప్పు, అమ్మోనియం క్లోరైడ్ మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడను వేరుచేయు పద్ధతిని వివరించుము.
జవాబు:
ఉద్దేశ్యం :
ఉప్పు, అమ్మో సియం క్లోరైడ్ ల మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్ ను వేరుచేయుట

కావలసిన పరికరాలు :
పింగాణి పాత్ర, దూది, అమ్మోనియం క్లోరైడ్, ఉప్పు, స్టవ్.
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 13

విధానం :

  1. ఒక చెంచా ఉప్పును, ఒక చెంచా అమ్మోనియం క్లోరైడను తీసుకుని వాటిని కలపండి.
  2. ఈ మిశ్రమాన్ని ఒక పింగాణీ పాత్రలో తీసుకోండి.
  3. ఒక గాజు గరాటును పటంలో చూపిన విధంగా పింగాణీ పాత్రపై బోర్లించి, గరాటు చివరి భాగాన్ని దూదితో మూసివేయండి.
  4. పింగాణీ పాత్రను దీపపు స్టాండుపై ఉంచి, కొద్దిసేపు వేడిచేసి గరాటు గోడలను పరిశీలించండి.

పరిశీలనలు :

  1. ముందుగా అమ్మోనియం క్లోరైడ్ బాష్పాలను గమనిస్తాము.
  2. కొంత సేపటికి ఘనీభవించిన అమ్మోనియం క్లోరైడ్ గరాటు గోడలపై నిలిచి ఉండడాన్ని గమనిస్తాము.

కృత్యం – 7

నీరు బాష్పీభవనం చెందే ప్రక్రియ :

ప్రశ్న 7.
సిరా (మిశ్రమం) నుండి దాని అనుఘటకాలను వేరుచేయు పద్దతిని వివరించుము. (లేదా) బాష్పీభవన ధర్మమును ఉపయోగించి మిశ్రమాలను వేరుచేయు పద్ధతిని ఉదాహరణతో వివరించుము.
జవాబు:
ఉద్దేశ్యం :
బాష్పీభవన ప్రక్రియ ద్వారా సిరా (మిశ్రమం) నుండి దాని అనుఘటకాలను వేరుచేయుట.

కావలసిన పరికరాలు :
గాజు బీకరు, వాచ్ గ్లాసు, నీరు, సిరా, స్టవ్.
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 14

విధానం :

  1. ఒక బీకరులో సగం వరకు నీటిని నింపి దాని మూతిపై వాచ్ గ్లాసును ఉంచండి.
  2. ఆ వాచ్ గ్లాసులో కొన్ని చుక్కల సిరాను వేయండి.
  3. బీకరును వేడిచేస్తూ, వా గ్లాస్ ను గమనించండి.

పరిశీలనలు :

  1. వాచ్ గ్లాస్ నుండి పొగలు రావడం గమనిస్తాము.
  2. వా గ్లాస్ లో ఏ మార్పు గమనించనంత వరకు వేడిచేయడాన్ని కొనసాగించండి.
  3. వాచ్ గ్లాస్ లో ఒక చిన్న అవక్షేపం మిగిలి ఉండడాన్ని గమనిస్తాము.

నిర్ధారణ :

  1. సిరా, నీరు మరియు రంగుల మిశ్రమమని మనకు తెలుసు.
  2. ఈ కృత్యంలో వాగ్లాలో మిగిలియున్న అవక్షేపం సిరాలోని రంగు.

AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 8.
మార్కర్ సిరాలోనున్న అనుఘటకాలను పరిశీలించుటకు కాగితం క్రొమటోగ్రఫీ పద్దతిని వివరించుము.
జవాబు:
లక్ష్యం :
సిరాలోనున్న అనుఘటకాలను కాగితం క్రొమటోగ్రఫీ ద్వారా పరిశీలించుట.

కావలసిన పదార్థాలు :
బీకరు, దీర్ఘచతురస్రాకారపు వడపోత కాగితం, నలుపురంగు మార్కర్ పెన్, నీరు, పెన్సిల్, సెల్లో టేపు.
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 15

విధానం :

  1. వడపోత కాగితం యొక్క అడుగు భాగంనకు కొంచెం పైన మార్కతో ఒక లావు గీతను గీయండి.
  2. బీకరులో కొంచెం నీరు పోసి, ఒక పెన్సిల్ కు వడపోత కాగితంను సెల్లో టేపుతో అతికించి, కాగితం చివర నీటికి తగిలేటట్లు పటంలో చూపిన విధంగా వేలాడదీయండి.
  3. గీచిన గీత నీటికి అంటుకోకుండా చూడండి.
  4. కాగితం ఒక చివర నీటికి తగిలేటట్లు ఉండడం వలన నీరు నెమ్మదిగా పైకి పాకుతుంది. 5 ని॥ తర్వాత వడపోత కాగితంను తొలగించి ఆరనీయండి.
  5. ఇదే ప్రయోగాన్ని ఆకుపచ్చ మార్కర్, పర్మనెంట్ మార్కర్లతో చేసి చూడండి.

పరిశీలనలు :

  1. నల్ల మార్కరను ఉపయోగించినపుడు ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, నలుపు వంటి వివిధ రంగులు వడపోత కాగితంపై కనబడినవి.
  2. ఆకుపచ్చ మార్కరను ఉపయోగించినపుడు పసుపు, ఆకుపచ్చ, నీలము వంటి రంగులు వడపోత కాగితంపై కనబడినవి.
  3. పర్మనెంట్ మార్కర్ ను ఉపయోగించినపుడు వడపోత కాగితంపై గీచిన గీతలో ఎటువంటి మార్పు కనబడలేదు.

కృత్యం – 8

అమిశ్రణీయ (Immiscible) ద్రవాలను వేరుచేయడం :

ప్రశ్న 9.
నీరు, కిరోసిన్ మిశ్రమం నుండి నీటిని, కిలోసిసెను వేరుచేసే విధానాన్ని వివరించండి.
జవాబు:
ఉద్దేశ్యం :
నీరు, కిరోసిన్స్ శ్రమం నుండి నీటిని, కిరోసినన్ను వేరుచేయుట.

కావలసిన పరికరాలు :
కిరోసిన్, నీరు, వేర్పాటు గరాటు, బీకరు.
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 16

విధానం :

  1. ఒక వేర్పాటు గరాటును తీసుకొని దానిలో నీరు, కిరోసిన్స్ మిశ్రమాన్ని పోయండి.
  2. ఈ గరాటును కొంత సమయం కదపకుండా స్థిరంగా ఉంచండి. దాని వలన నీరు, కిరోసిన్ యొక్క పొరలు ఏర్పడుతాయి.
  3. ఇపుడు వేర్పాటు గరాటుకు అమర్చియున్న స్టాప్ కాకను తెరచి కింది పొరలలో ఉన్న నీటిని నెమ్మదిగా బయటకు తీయండి.
  4. కిరోసిన్ స్టాప్ కాకను చేరగానే వెంటనే దానిని మూసివేయండి.

సూత్రం :
అమిశ్రణీయ ద్రవాలలోని అనుఘటకాలను వాటి సాంద్రతల ఆధారంగా వేరుచేయవచ్చు.

కృత్యం – 9

స్వేదన ప్రక్రియ ద్వారా మిశ్రణీయ ద్రవాలను వేరుచేయుట :

ప్రశ్న 10.
స్వేదన ప్రక్రియ ద్వారా మిశ్రణీయ ద్రవాలను వేరుచేయు ప్రక్రియను వివరించుము.
జవాబు:
ఉద్దేశ్యం :
స్వేదన ప్రక్రియ ద్వారా మిశ్రణీయ ద్రవాల (నీరు, ఎసిటోన్)ను వేరుచేయుట.

కావలసిన పరికరాలు :
స్టాండు, స్వేదన కుప్పె, థర్మామీటరు, కండెన్సర్, బీకరు, ఎసిటోన్, నీరు, ఒంటి రంధ్రం గల రబ్బరు బిరడా.
AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా 5

విధానం :

  1. ఎసిటోన్, నీరుల మిశ్రమంను ఒక స్వేదన కుప్పెలో తీసుకొనుము.
  2. దీనికి థర్మామీటరును బిగించి స్టాండుకు అమర్చండి.
  3. కండెన్సర్ యొక్క ఒక చివరను స్వేదన కుప్పెకు బిగించి మరొక చివరలో బీకరును ఉంచండి.
  4. మిశ్రమాన్ని నెమ్మదిగా వేడిచేస్తూ, జాగ్రత్తగా థర్మామీటరును పరిశీలించండి.
  5. బాష్పీభవనం చెందిన ఎసిటోన్ కండెన్సర్ లో ద్రవీభవనం చెందుతుంది.
  6. ద్రవరూపంలోనున్న ఎసిటోను కండెన్సర్ చివరనున్న బీకరులో సేకరించవచ్చు.
  7. నీరు మాత్రం స్వేదన కుప్పెలోనే ఉండిపోతుంది.
  8. పై విధంగా ద్రవరూప మిశ్రమాలను వేరుచేయడానికి వాడే ఈ పద్ధతిని స్వేదనం అంటారు.

సూత్రం :
రెండు ద్రవాల బాష్పీభవన ఉష్ణోగ్రతలలో తేడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ?

కృత్యం – 10

ప్రశ్న 11.
కాపర్ సల్ఫేట్, అల్యూమినియం మిశ్రమంను వేరుచేయగలమా?
కాపర్ సల్ఫేట్, అల్యూమినియం మిశ్రమం నుండి కాపర్ లోహాన్ని వేరుచేయు విధానమును వివరింపుము.
జవాబు:

  1. గాఢ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఒక బీకరులో తీసుకొని దానిలో ఒక అల్యూమినియం రేకును వేయండి.
  2. కొంత సమయానికి అల్యూమినియం రేకు ముక్కపై కాపర్ పొర ఏర్పడడాన్ని గమనించవచ్చు.
  3. కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగును కోల్పోతుంది.
  4. అల్యూమినియం, గాఢ కాపర్ సల్ఫేట్ ద్రావణాల మధ్య రసాయనిక చర్య జరిగి కాపర్ లోహం వేరుపడి అల్యూమినియం రేకు పై పూతగా ఏర్పడుతుంది.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

SCERT AP 9th Class Physics Study Material Pdf Download 2nd Lesson గమన నియమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 2nd Lesson Questions and Answers గమన నియమాలు

9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటికి కారణాలు వివరించండి. (AS 1)
ఎ) కంబళిని కర్రతో కొడితే, దుమ్ము పైకి లేస్తుంది.
బి) బస్సు పైన వేసిన సామాన్లని తాడుతో కట్టకపోతే పడిపోతాయి.
సి) ఒక పేస్ బౌలర్ బంతి విసిరే ముందు దూరం నుంచి పరిగెత్తుతూ వస్తాడు.
జవాబు:
ఎ) కంబళిని కర్రతో కొడితే అది చలనంలోకి వస్తుంది. కంబళిలోని దుమ్ము కణాలు నిశ్చల జడత్వం వలన నిశ్చలస్థితిలోనే ఉంటాయి కాబట్టి.

బి) బస్సు చలనంలో ఉన్నప్పుడు సామాన్లన్ని కూడా గమన జడత్వం వలన అవి కూడా బస్సు వేగాన్ని కలిగి ఉంటాయి. బస్సు సడన్ గా నిశ్చలస్థితికి రాగానే వస్తువులు మాత్రము గమన జడత్వంలోనే ఉంటాయి కాబట్టి అవి పడిపోతాయి. కనుక.

సి) ఒక పేస్ బౌలర్ బంతి విసిరే ముందు దూరం నుంచి పరుగెత్తుటకు కారణం బంతికి గమన జడత్వంను అందించుటకు
(లేదా) బంతికి ద్రవ్యవేగమును అందించుటకు.

ప్రశ్న 2.
8 కి.గ్రా., 25 కి.గ్రా. ద్రవ్యరాశులు గల రెండు వస్తువులలో ఏ వస్తువు అధిక జడత్వం కలిగి ఉంటుంది? ఎందుకు? (AS 1)
జవాబు:
25 కేజీల ద్రవ్యరాశిగల వస్తువుకు అధిక జడత్వముండును. ఎందుకనగా జడత్వమును నిర్ణయించునది ద్రవ్యరాశి కాబట్టి.

ప్రశ్న 3.
2.2 మీ./సి. వేగంతో కదులుతున్న 6.0 కి.గ్రాల బంతి యొక్క ద్రవ్యవేగం ఎంత? (AS 1)
జవాబు:
బంతి వేగం (V) = 2.2 మీ./సె.
బంతి ద్రవ్యరాశి (m) = 6 కిలోలు
బంతి ద్రవ్యవేగము (P) = mv = 6 × 2.2 = 13.2 కి.గ్రా.మీ/సె.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 4.
ఇద్దరు వ్యక్తులు 200N ఫలిత బలంతో ఒక కారుని 3 సెకండ్ల పాటు నెట్టారు. (AS 1)
ఎ) కారుకి అందిన ప్రచోదనం ఎంత?
జవాబు:
వ్యక్తులు ప్రయోగించిన బలం = (F) = 200 N
కాలము = t = 3 సె||
ప్రచోదనము (I) = బలం × కాలం = 200 × 3 = 600 న్యూటన్ – సెకను

బి) కారు ద్రవ్యరాశి 1200 కిలోగ్రాములు అయితే, దాని వేగంలో మార్పు ఎంత?
జవాబు:
కారు ద్రవ్యరాశి = m = 1200 కి.గ్రా.
కారుపై ప్రయోగించిన బలం = 200 N
కాలం = 3 సె.
ప్రచోదనము = ద్రవ్యరాశి × వేగంలోని మార్పు
F × t = m × (v – u)
\(\mathrm{v}-\mathrm{u}=\frac{\mathrm{F} \times \mathrm{t}}{\mathrm{m}}=\frac{200 \times 3}{1200}=\frac{1}{2}=0.5\) మీ./సె.
∴ వేగంలోని మార్పు = v – u = 0.5 మీ./సె.

ప్రశ్న 5.
0.7 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువులో 3 మీ./సె² త్వరణాన్ని కలుగజేయడానికి ఎంత బలాన్ని ఉపయోగించాలి? (AS 1)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి = m = 0.7 కేజీలు
త్వరణం = a = 3 మీ./సె².
బలం (F) = ద్రవ్యరాశి × త్వరణం = 0.7 × 3 = 2.1 N

ప్రశ్న 6.
5 కి.గ్రా. ద్రవ్యరాశి గల వస్తువు 10 మీ./సె. వేగంతో కదులుతోంది. దానిపై 20 సె.ల పాటు బలాన్ని ప్రయోగించడం వల్ల అది 25 మీ/సె. వేగాన్ని పొందితే, వస్తువుపై ప్రయోగించిన బలం ఎంతో తెల్పండి. (AS 1)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి = m = 5 కి.గ్రా.
వస్తువు తొలి వేగము = u = 10 మీ./సె.
బలం ప్రయోగించబడిన కాలం = t = 20 సె.
వస్తువు తుది వేగము = v = 25 మీ./సె.
వస్తువుపై ప్రయోగించబడిన బలం = F = ma
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 1
∴ వస్తువుపై ప్రయోగించబడిన బలం = 3.75 న్యూటర్లు

ప్రశ్న 7.
న్యూటన్ మూడు గమన నియమాలను ఉదాహరణలతో వివరించండి. (AS 1)
జవాబు:
1) న్యూటన్ మొదటి గమన నియమము :
ఫలిత బలం పనిచేయనంతవరకు నిశ్చలస్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ, సమచలనంలో ఉన్న వస్తువు అదే సమచలనంలోనూ ఉండును.
ఉదా 1 : నిశ్చలంగా ఉన్న ఒక బస్సు ఒక్కసారిగా ముందుకు కదిలితే అందులో నిలబడి ఉన్న ప్రయాణీకుడు వెనుకకు పడతాడు, కారణము బస్సు ఒక్కసారిగా త్వరణాన్ని పొంది ముందుకు కదిలినది, కానీ అందులో వ్యక్తి “జడత్వం” వల్ల తను ముందు ఉన్న స్థానంలోనే ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అందువల్లనే వెనక్కి పడిపోతాడు.

ఉదా 2 : బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి, ఒక్కసారిగా బస్సు ఆగితే ముందుకు పడతాడు, కారణము బస్సు వేగముకు సమాన వేగంతో అతను ప్రయాణిస్తున్నాడు. బస్సు ఒక్కసారిగా ఆగినప్పుడు జడత్వం వలన అతని శరీరం మాత్రం వెంటనే తన గమనస్థితిని మార్చుకోలేదు. అందుకే ముందుకు పడతాడు.

2) రెండవ గమన నియమము : వస్తువు ద్రవ్యవేగంలో మార్పు రేటు, దానిపై పనిచేసే ఫలిత బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దాని దిశ ఫలిత బలదిశలో ఉంటుంది.
ఉదా 1 : సిమెంట్ గచ్చుపై కంటే ఇసుక నేల మీద దూకడం సురక్షితము. ఎందుకనగా మృదువైన, మెత్తని తలాలు వస్తువుని ఆపడంలో ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల “ఆపే దూరం” ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ద్రవ్యవేగంలో మార్పు రేటు తక్కువగా ఉంటుంది. ఫలితంగా కాలికి తక్కువ దెబ్బ తగులుతుంది.

ఉదా 2 : వేగంగా వస్తున్న క్రికెట్ బంతిని “క్యాచ్” చేసేటప్పుడు ఆ వ్యక్తి తన చేతులను వెనుకకు లాగుతాడు. ఈ సందర్భంలో అతడు బంతి వేగాన్ని తగ్గించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు.

ఇలా చేయడం వల్ల బంతి ద్రవ్యవేగంలో మార్పు రేటు తక్కువగా ఉంటుంది. ఫలితంగా చేతులపై బంతి ప్రయోగించే బలం తగ్గుతుంది.

3) మూడవ గమన నియమము : ఎల్లప్పుడూ చర్యకు దానికి సమానంగా మరియు వ్యతిరేక శిశలో ఉంటుంది. ఇది దృఢ వస్తువులకు మాత్రమే. చర్య, ప్రతిచర్య జంట బలాలు. వాటి పరిమాణం సమానం. దిశలో వ్యతిరేకం మరియు వేరు వేరు వస్తువులపై పని చేస్తాయి. కావున అవి ఎప్పుడూ రద్దు కావు.

వివరణ:
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 2

  1. రెండు వస్తువులు పరస్పరం బలాలు ప్రయోగించుకుంటున్నప్పుడు
  2. ప్రతిక్రియ జరిపేటప్పుడు, A వస్తువు B వస్తువుపై కలుగజేసే బలం FAB (చర్య)
  3. B వస్తువు A వస్తువుపై కలుగజేసే బలం FRA (ప్రతిచర్య)
  4. న్యూటన్ మూడో గమన నియమం వలన ఈ రెండు బలాలు పరిమాణంలో సమానంగాను, దిశలో వ్యతిరేకంగాను, ఉంటాయి.
    FAB = – FBA
    చర్య = ప్రతిచర్య
  5. దీనిని బట్య జంట బలాలు ఒకే వస్తువు పై కాక, రెండు వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి.
    ఉదా 1:
    i) పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కలతో గాలిని కిందకి నెడతాయి. అప్పుడు గాలి కూడా పక్షిని వ్యతిరేకదిశలో (పైకి) నెడుతుంది.
    ii) రెక్కలు గాలి మీద ప్రయోగించే బలం, గాలి పక్షి రెక్కలపై ప్రయోగించే బలాలు రెండూ సమాన పరిమాణంలో, వ్యతిరేక దిశలో ఉంటాయి.
    ఉదా 2 :
    నీటిలో ఈదుతున్న చేప నీటిని వెనక్కి నీరు చేపని ముందుకు నెట్టే బలం రెండూ పరిమాణంలో సమానంగా, దిశ పరంగా వ్యతిరేకంగా ఉంటాయి. నీరు చేపపై కలిగించే బలం వల్ల చేప ముందుకు కదులుతుంది.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 8.
వేగంగా వెళ్తున్న బస్సు అద్దాన్ని ఒక ఈగ గుద్దుకుంటే, బస్సు మీద, ఈగ మీద ఒకే బలం ప్రయోగించబడుతుందా? ఎందుకు? (AS 1, AS 7)
జవాబు:
న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం బస్సు మీద, ఈగ మీద ఒకే బలం ప్రయోగించబడుతుంది.

ప్రశ్న 9.
ఒక బిండిని గుర్రం లాగదాన్ని ‘దివ్య’ చూసింది. గుర్రం ఎంత బలంతో బండిని లాగుతుందో, అంతే బలంతో బండి సర్రాన్ని కూడా లాగుతుందని ఆమె భావించింది. “మరి బండి ఎలా కదులుతుంది?” అని ఆమెకు సందేహం కలిగింది. అంతేగాక ఆమె మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలేవో ఊహించండి. (AS 2)
జవాబు:

  1. గుర్రం ఎంత బలాన్ని నేలపై ఉపయోగిస్తుంది?
  2. గుర్రంకు – బండికి మధ్య ఏ నియమం పనిచేస్తుంది?
  3. గుర్రం ముందుకు ఎందుకు వంగవలసి వస్తుంది?
  4. గుర్రం తక్కువ బలాన్ని ఉపయోగిస్తే బండి కదలదా?
  5. సైకిలులాగా, ఎందుకు తేలికగా గుర్రపు బండి కదలటం లేదు?
  6. మరి బండి ఎలా కదులుతుంది?

ప్రశ్న 10.
గెలీలియో ప్రకారం ఫలిత బలం పని చేయనంతవరకు, వస్తువు దాని స్థితిలోనే కొనసాగుతుందని మనకు తెలుసు. అదే విధంగా అరిస్టాటిల్ ప్రకారం ప్రతి వస్తువు కదులుతూ దానంతట అదే నిశ్చలస్థితికి వస్తుందని కూడా మనకు తెలుసు. వీటిలో ఏది సరైనదో మనం చెప్పగలమా? గెలీలియో తెలిపిన నియమాన్ని మీరు ఏ విధంగా అభినందిస్తారు? (AS 6)
జవాబు:
గెలీలియో, అరిస్టాటిల్ నియమాలలో ఏది సరైనదో మనకు చెప్పడం సాధ్యమే.

  1. భూమి మీద కదులుతున్న ఏ వస్తువైనా క్రమంగా నిశ్చలస్థితికి వస్తుందని మన ప్రాచీన తత్త్వవేత్తల భావన.
  2. ఆ కాలంలో గొప్ప తత్త్వవేత్త అయిన అరిస్టాటిల్ కూడా ఇలాగే ఆలోచించి, కదిలే ఏ వస్తువైనా చివరకు నిశ్చలస్థితికి రావాలి కాబట్టి, వాటిపై ఎటువంటి వివరణా అవసరం లేదని భావించాడు.
  3. ఆ సమయంలో గెలీలియో తన ఆలోచనాత్మక ప్రయోగాలను నునుపుతలం గల వాలు బల్లలపై చేశాడు.
  4. గెలీలియో, తలం ఎంత నునుపుగా ఉంటే వదిలిన గోళీ అంత దూరం ప్రయాణం చేస్తుందని గమనించాడు. ఏదీ అడ్డురాకపోతే గోళీ అనంత దూరం ప్రయాణిస్తుందని వివరించాడు.
  5. ఈ విధంగా ఏ బాహ్య బలం పనిచేయనంత వరకు కదులుతున్న వస్తువు అదే గమన స్థితిలో ఉంటుందని చెప్పడం ద్వారా గెలీలియో ఆధునిక విజ్ఞానశాస్త్రానికి తెరతీశాడు. కావున నేను గెలీలియో ప్రాథమిక ప్రయోగాలను పరిశీలించి, అతనిని అభినందిస్తున్నాను. .

ప్రశ్న 11.
20 మీ./సె. సమ వడితో ఒక కారు పడమర వైపు ప్రయాణిస్తుంటే, దానిపై గల ఫలిత బలం ఎంత? (AS 1, AS 7)
జవాబు:
కారు వడి = 20 మీ./సె.
కారు పడమర వైపు సమ వేగంతో ప్రయాణిస్తుంది, కావున త్వరణము శూన్యము.
∴ ఫలిత బలము = శూన్యము.

ప్రశ్న 12.
30 కి.గ్రాల ద్రవ్యరాశి గల ఒక వ్యక్తి 450 న్యూటన్ల బలాన్ని భరించగల ‘తాడు’ సహాయంతో కొండ ఎక్కుతున్నాడు. అతను సురక్షితంగా ఎక్కడానికి కావల్సిన గరిష్ఠ త్వరణం ఎంత? (AS 1, AS 7)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి = m = 30 kg
తాడు తన్యత (T) = 450 న్యూ.
త్వరణం = a = ?
T = N = ma
450 = 30 xa
450 a = 30 = 15 మీ./సె

∴ గరిష్ఠ త్వరణం = a = 15 మీ./సె.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 13.
కదులుతున్న రైలులో ఉన్న ఒక ప్రయాణికుడు ఒక నాణాన్ని నిట్ట నిలువుగా పైకి విసిరిన, అది అతని వెనుకవైపు పడింది. ఆ రైలు ఎటువంటి చలనంలో ఉంది? (AS 7)
ఎ) ధన త్వరణం బి) సమచలనం సి) ఋణ త్వరణం డి) వృత్తాకార చలనం
జవాబు:
ఎ) ధన త్వరణం.

ప్రశ్న 14.
నిశ్చలస్థితిలో ఉన్న 1.4 కి.గ్రా.ల ద్రవ్యరాశి గల వస్తువు మీద 0.2 సెకన్ల పాటు బలం ప్రయోగించబడింది. బలం ప్రయోగించడం ఆపిన తర్వాత ఆ వస్తువు 2 సెకన్లలో 4 మీ. దూరం కదిలింది. ప్రయోగించిన బల పరిమాణం ఎంత? (AS 1)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి = m = 1.4 కి.గ్రా.
బలం ప్రయోగించిన కాలం = t1 = 0.2 సె||
బల ప్రయోగం ఆపిన తర్వాత
వస్తువు ప్రయాణించిన దూరం = 4 మీ.
వస్తువు ప్రయాణించిన కాలం = t2 = 2 సె||
ప్రయోగించబడిన బలం (F) = m . a
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 3
∴ ప్రయోగించబడిన బలం = F = 14 న్యూ.

ప్రశ్న 15.
పటాలలో ఉన్న 2 కి.గ్రా.ల ద్రవ్యరాశి గల వస్తువు యొక్క త్వరణాన్ని కనుక్కోండి. (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 4
జవాబు:
1) 2 × 10 = 20 kg. ద్రవ్యరాశిపై, 30 N బలం క్రింది వైపు పనిచేస్తుంది.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 5

ప్రశ్న 16.
రెండు రబ్బరు బాండ్ల సహాయంతో సాగదీసి వదిలినపుడు ఒక వస్తువు 2 మీ./సె². త్వరణాన్ని పొందింది. ఇలా చేయడంలో రబ్బరు బాండు ఒక ప్రమాణ పొడవుకి సాగిందనుకుందాం. రెండోసారి నాలుగు రబ్బరు బాండ్ల సహాయంతో రెట్టింపు ద్రవ్యరాశి గల వస్తువును లాగితే అది పొందే త్వరణం ఎంత? (రబ్బరు బాండ్లను పైన తెలిపిన ప్రమాణ పొడవుకు సాగదీయాలి.) (AS 1)
జవాబు:
మొదటిసారి రెండు రబ్బరు బాండ్ల సహాయంతో సాగదీసి వదిలినపుడు వస్తువు పొందు త్వరణం 2 మీ/సె².
రెండవసారి నాలుగు రబ్బరు బాండ్ల సహాయంతో రెట్టింపు ద్రవ్యరాశిగల వస్తువును లాగితే పొందు త్వరణం, రెండు సందర్భాలలో ప్రయోగించబడిన బలం సమానము. కావున అవి ఒకే త్వరణాన్ని కలిగి ఉంటాయి.
∴ కావలసిన త్వరణం = 2 మీ/సె².

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 17.
ఒక గుర్రం స్థిర వడితో బండిని లాగాలంటే అది ఎల్లప్పుడూ నేలపై బలాన్ని ప్రయోగిస్తూ ఉండాలి. ఎందుకో వివరించండి. (AS 1)
జవాబు:

  1. గుర్రం, బండిపై బలాన్ని ప్రయోగించగానే, బండి చక్రాలకు రోడ్డుకి మధ్యన గల ఘర్షణ బలం గుర్రం ఉపయోగించిన బలానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
  2. గుర్రం స్థిరవడితో బండిని లాగాలంటే అది ఎల్లప్పుడూ ఘర్షణ బలానికి సమానమైన బలాన్ని బండిపై ప్రయోగించాలి.

ప్రశ్న 18.
5 N బలం m1 ద్రవ్యరాశి గల వస్తువులో 8 మీ./సె². త్వరణాన్ని, m2 ద్రవ్యరాశి గల వస్తువులో 24 మీ/సె². త్వరణాన్ని తీసుకురాగలుగుతుంది. రెండు వస్తువులను జతచేసిన వ్యవస్థపై అదే బలాన్ని ప్రయోగిస్తే అది పొందే త్వరణం ఎంత? (AS 1)
జవాబు:
మొదటి వస్తువుపై ప్రయోగించబడిన బలం = F = 5 N
మొదటి వస్తువు త్వరణం = a = 8 మీ./సె².
న్యూటన్ 2వ నియమం ప్రకారం F = m1a ⇒ m1 = F/a = \(\frac{5}{8}\)
రెండవ వస్తువుపై ప్రయోగించబడిన బలం = F = 5N
రెండవ వస్తువు త్వరణం = a = 24 మీ/సె²
న్యూటన్ 2వ గమన నియమం ప్రకారం F = m2a ⇒ m2 = \(\frac{\mathrm{F}}{\mathrm{a}}=\frac{5}{24}\)
ఈ రెండు వస్తువులను జతచేసిన వ్యవస్థ కావున
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 6

రెండు వస్తువులను జత చేసిన వ్యవస్థపై ఒకే బలం ప్రయోగించడం వలన ఏర్పడు త్వరణము 6 మీ./సె². అగును.

ప్రశ్న 19.
400 గ్రా. ద్రవ్యరాశి గల సుత్తి 30 మీ./సె. వేగంతో కదులుతూ ఒక మేకును తాకింది. మేకు సుత్తిని 0.01 సె.కాలంలో నిశ్చలస్థితికి తీసుకురాగలిగితే, మేకు సుత్తి మీద ప్రయోగించే బలం ఎంత? (AS 1)
జవాబు:
సుత్తి ద్రవ్యరాశి = m = 400 గ్రా = 0.4 కి.గ్రా
సుత్తి తొలివేగం = u = 30 మీ./సె.
సుత్తి తుదివేగం = V = 0
మేకును సుత్తి తాకిన కాలం = t = 0.01 సె.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 7
∴ మేకు వ్యతిరేకదిశలో సుత్తి పై 1200 న్యూ. బలం కలుగజేయును.

ప్రశ్న 20.
పటంలో ఒక వ్యవస్థ చూపబడింది.
ఈ వ్యవస్థలోని చెక్కదిమ్మల త్వరణాన్ని, తాడులో తన్యతను కనుక్కోండి. (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 8
g = 10 మీ/సె² గా తీసుకోండి.
జవాబు:
వ్యవస్థలో m1 = m2 = 3 కి.గ్రా.
త్వరణం = g = 10 మీ/సె²

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 21.
పటంలో చూపిన విధంగా ఘర్షణ లేని సమాంతర తలంపై మూడు చెక్కదిమ్మలను అమర్చి 30 న్యూటన్ల బలంతో తాడుని లాగుతున్నారు. ప్రతి చెక్కదిమ్మ ద్రవ్యరాశి 10 కి.గ్రా. అయితే ప్రతి చెక్కదిమ్మ యొక్క త్వరణం ఎంత? చెక్కదిమ్మలను కలిపిన తాడులో తన్యత ఎంత? (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 9
జవాబు:
మూడు చెక్కదిమ్మల ద్రవ్యరాశులు m1, m2 మరియు m3 లనుకొనుము.
∴ m1 = m2 = m3 = 10 కి.గ్రా.
చెక్కదిమ్మలపై పనిచేయు బలం = F = 30 N

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 11

తాడులో తన్యతలు T1 మరియు T2 లనుకొనుము.
మొదటి సందర్భంలో తన్యత = T1 = m1 × a = F
= 10 × 1 = 10 N
రెండవ సందర్భంలో తన్యత = T2 = F = (m1 + m2) a
= (10+ 10) (1) = 20 N

ప్రశ్న 22.
టేబుల్ చివర ఒక దీర్ఘ చతురస్రాకారంలో కత్తిరించిన కాగితాన్ని పెట్టి దానిపై మందమైన ఐదు రూపాయల బిళ్లని పటంలో చూపినట్లు నిలబెట్టండి. మీ వేలితో వేగంగా కాగితాన్ని నెట్టండి. ఈ కృత్యాన్ని జడత్వంతో ఏ విధంగా వివరించగలవు? (AS 2)
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 10
జవాబు:
కాగితాన్ని వేలితో గట్టిగా లాగడం వలన కాగితం చలనములోనికి వస్తుంది. ఐదు రూపాయల బిళ్ల నిశ్చల జడత్వం వలన చలనములోనికి రాకుండానే టేబుల్ పై ఉంటుంది.

ప్రశ్న 23.
ఏకరీతి గల రెండు గోళాలను తీసుకోండి. గోళాలు కదిలేందుకు వీలుగా మీ నోటు పుస్తకాలను రెండువైపులా పెట్టి చిన్న దారిని ఏర్పాటు చేయండి. ఇప్పుడు దారిలో ఒక గోళాన్ని పెట్టి, రెండవ గోళీతో కొట్టండి. (క్యారంబోర్డు స్ట్రైకర్ తో కొట్టినట్లు) అలాగే ఒక గోళీ స్థానంలో రెండు, మూడు, నాలుగు గోళీలను పెట్టి గోళీలను కొట్టింది. పరిశీలనల నుంచి మీరు ఏం వివరించగలరు? (AS 5)
జవాబు:
న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం ఒక గోళీ రెండవ గోళీ పై బలాన్ని చూపగా, రెండవ గోళీ మూడవ గోళీ పై వ్యతిరేక దిశలో బలాన్ని చూపుతుంది.
చర్య = – ప్రతిచర్య కావున
అదే విధముగా 3వ గోళీ 4వ గోళీ పై, 4వ గోళీ 3వ గోళీ పై చర్యా, ప్రతిచర్యలకు లోనవుతాయి.

ప్రశ్న 24.
1500 కి.గ్రాల ద్రవ్యరాశి గల వాహనం 1.7 మీ/సె². ఋణ త్వరణంలో ఆగడానికి రోడ్డుకి, వాహనానికి మధ్య గల ఇలం ఎంత ఉండాలి? (AS 7)
జవాబు:
వాహన ద్రవ్యరాశి = m = 1500 కి.గ్రా.
ఋణ త్వరణము = – a = – 1.7 మీ/సె².
బలము (F) = ద్రవ్యరాశి × త్వరణం = 1500 × – 1.7 = – 2550 N
∴ రోడ్డుకి, వాహనానికి మధ్యన గల బలం 2550 N లు చలనదిశకు వ్యతిరేక దిశలో పనిచేయును.

ప్రశ్న 25.
ఎత్తులో ఉన్న ఒక హోపర్ ఇసుకను జారవేసే యంత్రానికి కింద ఉన్న ట్రక్కు 20 మీ/సి. సమవేగంతో వెళ్తుంది. సెకనుకు 20 కిలోల చొప్పున ఇసుక ట్రక్కు మీద పడుతుంటే, ఇసుక పడటం వల్ల ట్రక్కు మీద ప్రయోగింపబడిన బలం ఎంత? (AS 7)
జవాబు:
ట్రక్కు వేగము = 20 మీ/సె.
హోపర్ సెకనుకు 20 కిలోల చొప్పున ఇసుకను ట్రక్ పై వేస్తున్నది.
న్యూటన్ రెండవ నియమము ప్రకారం
బలం = ద్రవ్యరాశి × వేగంలోని మార్పురేటు
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 12

కాని ఇసుకను కొంత ఎత్తు నుండి జారవేసే హోపర్ వంటి పరికరాల విషయంలో దాని వేగంలో మార్పుండదు, కాని అది వేసే ఇసుక పరిమాణంలో సెకను, సెకనుకి మార్పుండును. అనగా వేగం స్థిరము, ద్రవ్యరాశిలో మార్పు వస్తుంది.
∴ F = వేగము × ద్రవ్యరాశిలో మార్పురేటు.
F = v × \(\frac{\Delta \mathrm{m}}{\Delta \mathrm{t}}\) = 20 × 20
F = 400 న్యూ.
∴ ఇసుక పడటం వల్ల ట్రక్కుపై ప్రయోగించబడిన బలం (F) = 400 న్యూ.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 26.
నిశ్చలస్థితిలో ఉన్న ఇద్దరు స్కేటింగ్ చేసే వ్యక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. వీరిలో 60 కి.గ్రా. ద్రవ్యరాశి గల వ్యక్తి 2 మీ/సె. వేగాన్ని పొందితే, 40 కి.గ్రా. ద్రవ్యరాశి గల రెండవ వ్యక్తి పొందే వేగం ఎంత? (AS 7)
జవాబు:
వ్యవస్థలో తొలి ద్రవ్యవేగం = శూన్యము = m1u1 + m2u2
మొదటి వ్యక్తి ద్రవ్యరాశి = m1 = 60 కి.గ్రా,
మొదటి వ్యక్తి తుది వేగము = v1 = 2 మీ./సె.
రెండవ వ్యక్తి ద్రవ్యరాశి = m2 = 40 కి.గ్రా.
రెండవ వ్యక్తి తుది వేగము = v2 = ?
∴ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం
m1u1 + m2u2 = m1v1 + m2v2
m1v1 + m2v2 = 0
m2v2 = -m1v1
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 13

∴ రెండవ వ్యక్తి వ్యతిరేక దిశలో 3 మీ./సె. త్వరణాన్ని కలిగి ఉన్నాడు.

ప్రశ్న 27.
m ద్రవ్యరాశి గల బంతి ‘V’ వడితో గోడను లంబంగా ఢీకొట్టి అదే వడితో వెనుకకు మరలింది. గోడ బంతిపై ప్రయోగించే సరాసరి బలాన్ని మరియు బల దిశను కనుక్కోండి. (అభిఘాత సమయం ‘t’) (AS 7)
జవాబు:
బంతి ద్రవ్యరాశి = m
బంతి తొలివడి = u = – v (↑ ↑)
బంతి తుదివడి = v= v (అదే వడి కావున దిశ వేరే)
ప్రయోగ కాలము = 1 అనుకొనుము.
న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం
∴ F = ma
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 14
బలదిశ గోడ నుండి దూరముగా ఉండును.

9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 24

ప్రశ్న 1.
టేబుల్ మీది గుడ్డను ఒక్కసారిగా లాగిన, దాని మీద పెట్టిన పాత్రలు దాదాపు కదలకుండా అలాగే ఉండేలా చేసే ట్రిక్ (గారదీ)ని మీరు చూసే ఉంటారు ! ఈ గారడీని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏం కావాలి?
జవాబు:
ఒక టేబుల్ క్లాత్, ఏదైనా ఒక వస్తువు కావాలి. ఈ గారడీ చేసే వ్యక్తి గుడ్డను చాలా నైపుణ్యంతో టేబుల్ పై నుండి లాగాలి.

ప్రశ్న 2.
ఎటువంటి గుధ ఉపయోగిస్తావు? దళసరి కాన్వాస్ గుడ్డనా లేదా పల్చని సిల్కు గుడ్డనా?
జవాబు:
దళసరి కాన్వాస్ గుడ్డను ఈ గారడీ చేయడానికి వాడాలి.

ప్రశ్న 3.
టేబుల్ గుడ్డపై పెట్టిన పాత్రలు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉండాలా? తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండాలా?
జవాబు:
టేబుల్ గుడ్డపై పెట్టిన పాత్రలు కొద్దిగా ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండాలి. తేలికపాటి వస్తువులైన ప్లాస్టిక్ కప్పులు, స్పాంజ్ లు వాడకూడదు.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 4.
గుడ్డను ఒక్కసారిగా ఎక్కువ బలాన్ని ప్రయోగించి లాగాలా? లేదా సున్నితంగా, నిలకడగా బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుందా?
జవాబు:
గుడ్డను తక్కువ బలంతో ఒక్కసారిగా లాగండి.

ప్రశ్న 5.
10 కి.మీ./సె. వేగంతో శూన్యంలో ప్రయాణిస్తున్న రాకెట్ నుండి విడిపోయిన చిన్న వస్తువు యొక్క వేగం ఎంత ఉంటుంది?
జవాబు:
నిర్దిష్ట వేగంతో చలిస్తున్న ఒక్క వస్తువు నుండి విడిపోయిన మరొక చిన్న వస్తువు కూడా అదే వేగంతో ప్రయాణిస్తుంది. కావున 10కి.మీ/ సెకను వేగంతో శూన్యంలో ప్రయాణిస్తున్న రాకెట్ నుండి విడిపోయిన చిన్న వస్తువు యొక్క వేగము కూడా 10కి.మీ/సెకన్ ఉంటుంది.

9th Class Physical Science Textbook Page No. 27

ప్రశ్న 6.
ప్రక్క పటాన్ని గమనించండి. 80 కి.గ్రా.ల ద్రవ్యరాశి గల దృఢమైన వ్యక్తి పటంలో చూపిన విధంగా గరిష్ఠంగా ఎంత బరువును పైకి ఎత్తగలడు?
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 15
జవాబు:
వ్యక్తి అతని బరువుకు సమానమైన భారమును ఎత్తగలడు. ఎందుకనగా ఫలితబలము శూన్యము.
కావున T – mg = 0 = mg = T
ఇక్కడ g = 10, ద్రవ్యరాశి = 80 కి.గ్రా.
∴ T = 80 × 10 = 800 N

ప్రశ్న 7.
తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ యొక్క ద్రవ్యవేగం ఎంత?
జవాబు:
ద్రవ్యవేగము = ద్రవ్యము X వేగము
∆t = m (v – u)
ఇక్కడ వస్తువు తొలివేగము (u) మరియు తుది వేగము (v)లు సమానము కావున m (v – u) = ∆t = 0
∴ తిరుగుతున్న ఫ్యాను యొక్క ద్రవ్యవేగము శూన్యము.

ప్రశ్న 8.
ఫలిత బలం లేనప్పుడు వస్తువు వక్రమార్గంలో చలించగలదా?
జవాబు:
చలించగలదు. ఉదాహరణకు మనము ఒక వక్రమార్గములో ప్రయాణించుచున్నపుడు, అభికేంద్ర బలము వలన మనము ఆకర్షించబడతాము. అదే సమయంలో మనపై అపకేంద్రబలము పనిచేయును. ఈ ఫలితబలము వలన మన వాహన టైర్లకు, రోడ్డుకు మధ్య ఘర్షణ బలము ఏర్పడును.

ప్రశ్న 9.
తాడు యొక్క ద్రవ్యరాశిని విస్మరించినప్పుడు దానిలో ఉన్న తన్యత ఏకరీతిగా ఉంటుందని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఒక తాడుకు రాయిని కట్టి నీటిలో వ్రేలాడదీసినపుడు దాని ద్రవ్యరాశి గురుత్వాకర్షణ (8)పై ఆధారపడును. అదే విధముగా అదే రాయిని గాలిలో వ్రేలాడదీసిన దాని ద్రవ్యరాశి కూడా ‘g’ పై ఆధారపడును. దీనిని బట్టి తాడు యొక్క ద్రవ్యరాశిని విస్మరించినప్పుడు దానిలో ఉన్న తన్యత ఏకరీతిగా ఉంటుందని గ్రహించవచ్చును.

9th Class Physical Science Textbook Page No. 31

ప్రశ్న 10.
ఒక బంతిపై భూమి ప్రయోగించే బలం 8N అయితే, ఆ బంతి భూమిపై ప్రయోగించే బలం ఎంత?
జవాబు:
బంతిపై ప్రయోగించిన బలం = 8N
బంతి భూమిపై ప్రయోగించే బలం = బంతిపై ప్రయోగించిన బలం = 8N

ప్రశ్న 11.
ఒక చెక్క దిమ్మ క్షితిజ సమాంతర తలంపై ఉంది. దానిపై కిందికి లాగే అభిలంబ బలం గురుత్వాకర్షణ బలం, పైకి నెట్టే అభిలంబ బలం పనిచేస్తాయి. ఆ రెండు బలాలు పరిమాణంలో సమానంగా ఉంటూ, వ్యతిరేక దిశలలో ఉంటాయా? ఆ బలాల జతను చర్య – ప్రతిచర్య జతగా చెప్పవచ్చా? మీ స్నేహితులతో చర్చించండి.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 16
జవాబు:

  1. చెక్కదిమ్మపై గురుత్వాకర్షణ బలం, పైకి నెట్లే అభిలంబ బలం సమానంగా మరియు వ్యతిరేక దిశలలో ఉంటాయి.
  2. ఆ బలాల జతను చర్య – ప్రతిచర్య జతగా చెప్పవచ్చును.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 12.
మంటలను ఆర్పడానికి ఉపయోగించే గొట్టాల నుండి అతి వేగంగా నీరు బయటకు వస్తుంది. ఆ గొట్టాలను పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకు?
జవాబు:
మంటలను ఆర్పడానికి వాడు గొట్టాలను పట్టుకున్నపుడు అది మన చేతులపై బలాన్ని కలుగజేస్తుంది. ప్రతిచర్యగా మనము ఆ గొట్టముపై బలంను ప్రదర్శించవలెనన్న సాధ్యపడదు. కావున ఆ గొట్టాలను పట్టుకోవడం చాలా కష్టం.

9th Class Physical Science Textbook Page No. 33

ప్రశ్న 13.
భూవాతావరణంలోకి ప్రవేశించిన ఒక ఉల్క మండిపోయింది. అలా మండినప్పుడు దాని ద్రవ్యవేగము ఏమైనట్లు?
జవాబు:
భూవాతావరణంలోకి రాగానే ఉల్క మండిపోవటం వలన దాని ద్రవ్యవేగము శూన్యమవుతుంది.

ప్రశ్న 14.
బంతిని నిట్టనిలువుగా పైకి విసిరినప్పుడు, భూ ఉపరితలం నీ కాళ్లపై ప్రయోగించే అభిలంబ బలంలో ఏమైనా మార్పు వస్తుందా?
జవాబు:
నా శరీరాన్ని తుల్యము (balance) చేయుటకు భూఉపరితలము ప్రదర్శించు అభిలంబ బలము పెరుగును.

ప్రశ్న 15.
చెట్టుపై నుండి జారిపడిన కొబ్బరికాయ నేలని తాకి ఆగిపోయింది. దాని ద్రవ్యవేగం ఏమైందని చెప్పగలం?
జవాబు:
కొబ్బరికాయ నేలను తాకి ఆగిపోవుట వలన దాని ద్రవ్యవేగము శూన్యము అగును.

ప్రశ్న 16.
కొన్ని కార్లలో రక్షణ కొరకు గాలి సంచులు వాడతారు. ఎందుకు?
జవాబు:
గాలి సంచులుగల కార్లకు ప్రమాదములు జరిగినపుడు ప్రచోదన కాలము పెరుగుట వలన కారు నడుపు వ్యక్తిపై ప్రయోగించబడు బలము తగ్గి, అతను ప్రాణహాని నుండి రక్షించబడతాడు.

9th Class Physical Science Textbook Page No. 24

ప్రశ్న 17.
అన్ని వస్తువులూ ఒకే జడత్వాన్ని కలిగి ఉంటాయా? వస్తువుల జడత్వాన్ని నిర్ణయించే అంశాలు ఏవి? ఉదాహరణతో వివరించండి.
జవాబు:
అన్ని వస్తువులూ ఒకే జడత్వాన్ని ప్రదర్శించవు. జడత్వమును నిర్ణయించు అంశము ఆ వస్తువుకుండే ద్రవ్యరాశి,

ఉదాహరణ :

  1. మైదానంలో ఒక ఫుట్ బాల్ ను కాలితో తన్నినట్లయితే, అది కొంత వేగంతో తన్నిన దిశలో వెళ్తుంది.
  2. అదే పరిమాణము గల ఒక రాయినిగాని తన్నినట్లయితే దాని చలనంలో ఎటువంటి మార్పును గమనించవు మరియు నీ కాలికి దెబ్బ తగులుతుంది.
  3. దీనికి కారణము రాయికి అధిక ద్రవ్యరాశి ఉండటం వలన బంతికి తక్కువ ద్రవ్యరాశి ఉండటం వలన త్వరగా స్థితిని మార్చుకోగలిగినది.
  4. ఈ విధంగా పదార్థ ద్రవ్యరాశి వస్తు జడత్వంను నిర్ణయిస్తుంది.

9th Class Physical Science Textbook Page No. 32

ప్రశ్న 18.
పోల్ వాల్ట్ ఆడేవారు స్పాంజ్ తో చేసిన పరుపు మీద దూకుతారు. ఎందుకు?
జవాబు:
స్పాంజ్ పరుపుపై ఫలిత ద్రవ్యవేగము తక్కువగా ఉండును. కావున పోల్ వాల్ట్ ఆడేవారిపై తక్కువ ప్రతిచర్యా బలం పని చేస్తుంది.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 19.
ఇసుక నేల మీద దూకటం సురక్షితమా లేదా సిమెంటు గచ్చుపై దూకటం సురక్షితమా? ఎందుకు?
జవాబు:
సిమెంటు గచ్చుపై కన్నా ఇసుకపై దూకటం సురక్షితము. ఎందుకంటే మృదువైన మెత్తటి తలాలు వస్తువుని ఆపటంలో ఎక్కువ సమయాన్ని తీసుకోవటం వల్ల ఆ పేదూరం ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణ సమస్యలు

9th Class Physical Science Textbook Page No. 25

ప్రశ్న 1.
సమతలంపై ఉంచిన ‘M’ ద్రవ్యరాశి గల వస్తువు పై క్షితిజ సమాంతరంగా 100 బలం నిరంతరంగా ప్రయోగించడం వల్ల ఆ వస్తువు నిలకడగా కదులుతుంది.
ఎ) స్వేచ్ఛా వస్తు పటాన్ని (FBD) (ఒక నిర్దిష్ట సమయం వద్ద ఆ వస్తువుపై పనిచేస్తున్న అన్ని బలాలను చూపే పటం) గీయండి.
బి) ఘర్షణ విలువ ఎంత?
సాధన:
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 17
వస్తువు నిలకడగా కదులుతుందని ఇవ్వబడింది. అంటే క్షితిజ సమాంతర, క్షితిజ లంబ దిశలో ఆ వస్తువుపై పనిచేసే ఫలిత బలం శూన్యం అని అర్ధం.

ఆ వస్తువుపై క్షితిజ సమాంతర దిశలో ఘర్షణ బలం (f), నెట్టిన బలం (F). లు పనిచేస్తున్నాయి.

క్షితిజ సమాంతర దిశలో ఫలిత బలం
Fnet, x = 0 అని మనకు తెలుసు.
F + (-f) = 0
F = f

కాబట్టి ఆ వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం = 10 న్యూటన్లు.

9th Class Physical Science Textbook Page No. 27

ప్రశ్న 2.
1కి.గ్రా. ద్రవ్యరాశి మరియు 1 మీటరు పొడవు గల చాప గచ్చుపై పరచబడి ఉంది. చాప ఒక చివరను పట్టుకుని దాని – పొడవు వెంట రెండవ చివరివైపు 1 మీ/సె. స్థిర వడితో చాప మొత్తం చలనంలోకి వచ్చేంత వరకు చాప పూర్తిగా తిరగబడేంత వరకు) లాగాలంటే చాపపై ఎంత బలాన్ని ప్రయోగించాలి?
సాధన:
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 18
పటం 10లో చూపిన విధంగా చాప చివర బాగాన్ని 1 మీ/సె. స్థిర వడితో లాగుతున్నప్పుడు చలనం లోకి వచ్చే చాప భాగపు ద్రవ్యరాశి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యరాశి స్థిరంగా ఉండదు.

మొత్తం చాప చలనంలోకి రావడానికి పట్టే సమయం,
∆t = చాప చివర భాగం కదలిన దూరం / వడి = 2/1 = 2 సె.
(చాప చివరి భాగం కదిలిన దూరం = 1మీ + 1మీ = 2 మీటర్లు)
న్యూటన్ రెండవ గమన నియమం నుండి
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 19

∆m అనేది ∆t సమయంలో వచ్చే ద్రవ్యరాశిలోని మార్పును సూచిస్తుంది. 2 సెకన్ల కాలంలో ద్రవ్యరాశిలో వచ్చే మార్పు మొత్తం చాప ద్రవ్యరాశికి సమానం.
Fnet = (1 మీ/సె) X (1 కి.గ్రా) / 2 సె. = 1/2 న్యూటన్
క్షితిజ సమాంతర దిశలో ఒకే బలం పనిచేస్తుంది కనుక చాప చివర ప్రయోగించాల్ని బలం 1/2 న్యూటన్.

9th Class Physical Science Textbook Page No. 28

ప్రశ్న 3.
న్యూటన్ గమన నియమాలను అటవుడ్ ఒక ప్రయోగం ద్వారా నిరూపించాడు. పటంలో చూపినట్లు అటవుడ్ యంత్రంలో కప్పి ద్వారా పంపిన సాగే గుణం లేని ఒక తాడుకు రెండు చివరలలో m1 మరియు m2 ద్రవ్యరాశులు గల భారాలు వేలాడుతుంటాయి. (m1 > m2) అయిన, ఆ రెండు భారాల త్వరణాలను, తాడులో తన్యతను లెక్కించండి.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 20
సాధన:
పటంలో చూపినట్లు తాడులో గల తన్యత ఎల్లప్పుడూ వస్తువులను పైకి లాగుతుంది.
m1 ద్రవ్యరాశి యొక్క FBD ద్వారా ఆ ద్రవ్యరాశిపై తన్యత, (T) పై వైపుకు, దాని భారం (m1 g) కిందవైపుకు పని చేస్తున్నాయని గ్రహించవచ్చు.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 21
m1 పై ఫలిత బలం,
Fnet = m1a
m1g – T = m1a ………….. (1)
m1 పై ఫలిత బలం కలగజేసే త్వరణం ‘a’ m1 కిందకి కదులుతుంటే m2 పైకి వెళ్తుంది. కనుక వాటి త్వరణాల పరిమాణాలు సమానం.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 22
m2 యొక్క FBD పటం నుండి
Fnet = T – m2g = m2a ……………. (2)
(1), (2) సమీకరణాలను సాధించగా
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 23

9th Class Physical Science Textbook Page No. 33

ప్రశ్న 4.
12000 కి.గ్రా. ద్రవ్యరాశి (m1) గల ఫిరంగి నున్నని సమాంతర తలంపై ఉంది. అది 300 కి.గ్రా. ద్రవ్యరాశి (m2) గల గుండును క్షితిజ సమాంతర దిశలో v2 = 400 మీ./సె. వేగంతో విడుదల చేస్తే, ఆ ఫిరంగి వేగం (v1) ఎంత?
సాధన:
ఫిరంగి ద్రవ్యరాశి (m1) = 12000 కి.గ్రా
గుండు ద్రవ్యరాశి (m2) = 300 కి.గ్రా
ఫిరంగి వేగము (v1) = ?
గుండు వేగము (v2) = 400 మీ./సె.
ఫిరంగి పేల్చిన తర్వాత దాని వేగం v1 అనుకొనుము.
వ్యవస్థ తొలి ద్రవ్యవేగం శూన్యం.
వ్యవస్థ తుది ద్రవ్యవేగం = m1v1 + m2v2.
రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము ప్రకారం
m1v1 + m2v2 = 0
m1v1 = – m2v2
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 24

ఫిరంగి పేలిన తర్వాత దాని వేగం = 10 మీ/సె.
ఫిరంగి వ్యతిరేక దిశలో కదులుతుంది.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

పరికరాల జాబితా

చెక్క ట్రాక్, కాగితపు రింగు లేదా బంతి, పెన్నుమూత, గాజు గోళీ, సీసా, క్యారమ్ బోర్డు నమూనా, చెక్క దిమ్మలు, చెక్క స్కేలు, సాగే గుణం లేని తాడు, బెలూన్, స్ట్రా ముక్క, తాడు, రెండు కోడిగుడ్లు, మెత్తని దిండు, కప్పీ, రెండు స్ప్రింగ్ త్రాసులు, పరీక్ష నాళిక, రబ్బరు కార్కు, బున్సెన్ బర్నర్, దారము, స్టాండు, నీరు

9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

కాగితపు రింగుపై ఉంచిన పెన్ను మూత చలనాన్ని వివరించటం :

ప్రశ్న 1.
జడత్వాన్ని నిరూపించు ప్రయోగాన్ని తెల్పుము.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 25
జవాబు:
ఉద్దేశ్యం : వస్తువు యొక్క జడత్వాన్ని నిరూపించుట.

కాగితపు రింగు కావలసిన పరికరాలు :
పెన్నుమూత, కాగితపు రింగు, వెడల్పు మూతిగల సీసా.

పద్ధతి :

  1. ఒక దళసరి కాగితంతో రింగును తయారుచేయండి.
  2. పటంలో చూపినట్లు ఒక సీసామూత మీద ఆ రింగును నిలబెట్టండి.
  3. సీసామూతికి సరిగ్గా పైన పేపరు రింగుపై ఒక పెన్నుమూతను నిలబెట్టండి.
  4. కాగితపు రింగును ఒక్కసారిగా వేగంగా మీ చేతితో లాగండి.
  5. పెన్నుమూత, వెడల్పు మూతిగల సీసాలోనికి పడిపోతుంది.

వివరణ :
పై ప్రయోగాన్ని బట్టి మార్పును వ్యతిరేకించే లక్షణం పెన్నుమూత ప్రదర్శించినది కావున దానికి జడత్వ లక్షణం కలదని చెప్పవచ్చును.

కృత్యం – 2

స్టైకరుతో కొట్టిన కేరమ్ బోర్డు కాయిన్ చలనాన్ని పరిశీలించడం :

ప్రశ్న 2.
స్ట్రైకరుతో కొట్టిన కేరమ్ బోర్డు కాయిన్ చలనాన్ని పరిశీలించు ప్రయోగాన్ని వివరింపుము.
జవాబు:
ఉద్దేశ్యం :
స్ట్రైకరుతో కొట్టినపుడు కేరమ్ బోర్డు కాయిన్ చలనాన్ని పరిశీలించుట.

కావలసిన పరికరాలు :
క్యారమ్ బోర్డు, కాయిన్స్, స్టైకరు.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 26

పద్ధతి :

  1. క్యారమ్ బోర్డుపై కాయిన్లను ఒకే నిలువు వరుసలో నిలబెట్టండి.
  2. కింది కాయినను స్ట్రైకర్ తో గట్టిగా కొట్టండి.
  3. పటంలో చూపినట్లు కింది కాయిన్ మాత్రమే వరుస నుండి బయటకు వస్తుంది.
  4. క్యారమ్ కాయిన్ల దొంతర నిలువుగా కిందకు దిగింది.

వివరణ :
పై ప్రయోగం ద్వారా వస్తువు పై పనిచేసే ఫలిత బలం శూన్యం అయినదని అర్ధమవుతుంది.

కృత్యం – 3

రెండు చెక్కపెట్టెలను ఒకే బలంతో నెట్టడం :

ప్రశ్న 3.
అధిక ద్రవ్యరాశి గల వస్తువు అధిక జడత్వాన్ని కలిగి ఉంటుందని చూపండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 27

  1. రెండు వేరు వేరు ద్రవ్యరాశులు గల చెక్కదిమ్మెలను గచ్చుపై ఒక సరళరేఖపై ఉంచండి.
  2. రెండు దిమ్మలను చెక్క స్కేలు సహాయంతో ఒకే బలంతో ముందుకు నెట్టండి.
  3. తక్కువ ద్రవ్యరాశి గల చెక్కదిమ్మ ఎక్కువ త్వరణాన్ని పొంది ఎక్కువ దూరం వెళ్ళింది.
  4. ఎక్కువ ద్రవ్యరాశి గల చెక్కదిమ్మ తక్కువ త్వరణాన్ని పొంది తక్కువ దూరం కదులుతుంది.
  5. ఈ పరిశీలన వల్ల ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువు ఎక్కువ జడత్వాన్ని పొందుతాయని తెలుస్తుంది.

కృత్యం – 4

ప్రశ్న 4.
ఫలిత బలం – త్వరణం
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 28

నున్నగా ఉన్న తలం మీద ఒక మంచు ముక్క నుంచి నెమ్మదిగా నెట్టవలెను. అది వేగాన్ని ఎలా పుంజుకుంటుందో (ఎలా త్వరణాన్ని పొందుతుందో) గమనించవలెను. ఇప్పుడు ఫలిత బలాన్ని పెంచి, వేగంలో మార్పుని గమనించవలెను.
మంచు ముక్క త్వరణం పెరుగుతుంది.

కృత్యం – 5

ప్రశ్న 5.
ద్రవ్యరాశి – త్వరణం
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 29

ఒక మంచు ముక్కపై కొంత బలాన్ని ప్రయోగించినపుడు, అది త్వరణాన్ని పొందుతుంది. ఇప్పుడు ఎక్కువ ద్రవ్యరాశి గల మంచు ముక్కపై దాదాపు అంతే బలాన్ని ప్రయోగించి, త్వరణాన్ని పరిశీలించవలెను.

ఎక్కువ ద్రవ్యరాశి గల మంచుముక్క, తక్కువ ద్రవ్యరాశి గల మంచు ముక్క పొందిన త్వరణాన్ని పొందలేదు.

గమనించినది :
ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు ఫలిత బలం ఎక్కువగా ఉంటే త్వరణం కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఫలిత బలం స్థిరమైనప్పుడు ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే ఆ వస్తువుపై పొందిన త్వరణం తక్కువగా ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

కృత్యం – 6

రెండు స్ప్రింగు త్రాసులను వ్యతిరేకదిశలో లాగటం :

ప్రశ్న 6.
రెండు స్ప్రింగ్ త్రాసుల ద్వారా న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని ప్రయోగపూర్వకముగా నిరూపించుము.
(లేదా)
చర్య, ప్రతిచర్య బలాలు పరిమాణంలో సమానమని, దిశలో వ్యతిరేకమని నిరూపించు ప్రయోగమును తెల్పుము.
జవాబు:
ఉద్దేశ్యం : చర్య, ప్రతిచర్య బలాలను చూపుట.

కావలసిన పరికరాలు : రెండు స్ప్రింగు త్రాసులు, వాటి కొక్కెములు.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 30

పద్ధతి :
వ్యతిరేక దిశలో పనిచేసే బలాలు

  1. ఒకే విధమైన కొలతలుగల రెండు స్ప్రింగు త్రాసులు తీసుకోండి.
  2. వాటి కొంకీలను పటంలో చూపినట్లు కలపండి.
  3. ఇరువైపుల నుండి స్ప్రింగు త్రాసులు పట్టుకొని లాగండి.
  4. అవి రెండూ సమాన రీడింగులను సూచిస్తాయి.
  5. ఆ త్రాసులలోని స్ప్రింగులు ఒకదానిపై ఒకటి సమాన (F1 = F2) దిశలో, వ్యతిరేకంగా (F1 = – F2 ) బలాలు కలుగజేసుకుంటాయి.
  6. ఈ రెండు వ్యతిరేక బలాల్ని కలిపి చర్య – ప్రతిచర్య బలాల జత అంటాము.

కృత్యం – 7

బెలూన్ రాకెట్:

ప్రశ్న 7.
బెలూన్ రాకెట్ ప్రయోగాన్ని న్యూటన్ మూడవ గమన నియమంతో ఏ విధముగా వివరించవచ్చును?
జవాబు:
ఉద్దేశ్యం :
బెలూన్ రాకెట్ ద్వారా న్యూటన్ మూడవ సూత్రాన్ని పరీక్షించుట.

పరికరాలు :
బెలూన్, దారము, స్ట్రా. టేపు.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 31

పద్ధతి :

  1. ఒక బెలూన్లోకి గాలి ఊది బయటికి వెళ్ళకుండా మూతిని గట్టిగా వేళ్ళతో పట్టుకోండి.
  2. ఒక దారాన్ని స్ట్రా గుండా పంపండి.
  3. పటంలో చూపిన విధంగా బెలూను స్టాకు టేపుతో అతికించండి.
  4. దారం ఒక చివరి కొనను మీరు పట్టుకొని, రెండవ చివరను మీ స్నేహితుడిని పట్టుకోమనండి.
  5. బెలూన్ మూతి వద్ద వేళ్ళను తీసివేయండి. మూతి ఉన్న దిశ ఎడమ దిశ అనుకొనుము.
  6. బెలూన్లోని గాలి మూతి ద్వారా బయటికి కొంత వేగంతో, ఎడమవైపుకు వెళుతుంది.
  7. బెలూన్ కుడి చేతి వైపుకు కదులుతుంది. దానికి అంటిపెట్టుకున్న స్ట్రా కూడా దానితోపాటు వెళు 190ది.

ఈ విధముగా చర్య (గాలి వెళ్ళడం), ప్రతిచర్య (బెలూన్ వెళ్ళడం) సమానముగా ఉండి, వాటి దిశలు వ్యతిరేకముగా కలవని తెలియుచున్నది.

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 8.
రెండు విభిన్న వస్తువుల మీద పనిచేయు చర్య, ప్రతిచర్య బలాలను ప్రయోగపూర్వకముగా చూపుము.
జవాబు:
ఉద్దేశ్యం :
రెండు విభిన్న వస్తువుల మీద పనిచేసే చర్య, ప్రతిచర్య బలాలను చూపుట.

కావలసిన పరికరాలు :
పరీక్షనాళిక, రబ్బరు కార్కు, బున్సెన్ బర్నర్, స్టాండు, దారం.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 32

పద్ధతి :

  1. ఒక పరీక్ష నాళికలో కొద్దిగా నీరు తీసుకొని దాని మూతిని రబ్బరు కార్కుతో మూయండి. –
  2. పటంలో చూపిన విధంగా రెండు దారాల సహాయంతో పరీక్ష నాళికను క్షితిజ సమాంతరంగా వేలాడదీయండి.
  3. బుస్సెన్ బర్నర్ సహాయంతో పరీక్ష నాళికను వేడి చేయండి.
  4. వేడిచేయటం వలన పరీక్షనాళికలోని నీరు ఆవిరైపోతుంది.
  5. ఆ ఆవిరి రబ్బరు కారును బయటకు నెట్టే వరకు పరీక్ష నాళికను వేడి చేస్తూనే ఉండాలి.
  6. కార్కు బయటకు రావడం (చర్య), పరీక్ష నాళిక వెనుకకు జరగడం (ప్రతిచర్య) ఒక్కసారిగా గమనించవచ్చు.
  7. కార్కు ద్రవ్యరాశి, పరీక్షనాళిక ద్రవ్యరాశి కన్నా తక్కువ కావడం వలన పరీక్షనాళిక కన్నా కార్కు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.
    పై ప్రయోగం ద్వారా చర్య, ప్రతిచర్య బలాలను గమనించవచ్చును.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 9.
గ్రుడ్డును జారవిడవడం
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 33
రెండు కోడి గ్రుడ్లను తీసుకొని వాటిని ఒకే ఎత్తు నుండి, ఒకటి గట్టి గచ్చు మీద పడేటట్లుగా, రెండవది మెత్తని దిండు మీద పడేటట్లుగా వదలండి. తలాన్ని తాకిన తరువాత ఆ గ్రుడ్లలో గమనించిన మార్పులు వివరించుము.
జవాబు:

  1. గట్టి గచ్చు మీద గ్రుడ్డు పగిలిపోతుంది కారణం, అధిక బలం అతిస్వల్ప కాలంలో పని చేయడమే.
  2. మెత్తని దిండు మీద పడిన గ్రుడ్డు పగలదు కారణం, తక్కువ బలం ఎక్కువ కాలం పాటు పని చేసింది.

పై రెండు సందర్భాలలో గ్రుడ్డు పగులుతుందా, పగలదా అని నిర్ణయించేది గ్రుడు మీద పనిచేసే ఫలిత బలమే అని తెలుసుకున్నాను.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

SCERT AP 9th Class Physics Study Material Pdf Download 1st Lesson చలనం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 1st Lesson Questions and Answers చలనం

9th Class Physical Science 1st Lesson చలనం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
“ఆమె స్థిరవడితో నిర్దిష్ట దిశలో పరిగెడుతుంది.” ఈ వాక్యాన్ని చలనానికి సంబంధించిన భావనల ఆధారంగా తక్కువ పదాలలో రాయండి. (AS 1)
జవాబు:
“ఆమె స్థిర వేగంతో చలిస్తుంది”.

కారణం :
నిర్దిష్ట దిశలో స్థిరవడిని స్థిర వేగం అంటారు.

ప్రశ్న 2.
పటంలో A, B అనే రెండు కార్ల చలనాన్ని చూపే s – t (స్లు ఇవ్వడం జరిగింది. ఏ కారు వడి ఎక్కువ? ఎందుకు? (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 1
జవాబు:
A – కారు ఎక్కువ వడి కలిగి ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 2
కారణం :
A, B ల నుండి X, Y అక్షాలకు లంబాలను గీచినపుడు, కారు తక్కువ సమయం (t1)లో ఎక్కువ దూరం (s1) ప్రయాణించినట్లుగా తెలుస్తుంది.
(లేదా)
OA మరియు OBరేఖల వాలులు ఏదైనా బిందువు వద్ద కనుగొనండి. OA వాలు ఎక్కువ రెట్లుగా గమనిస్తాము. కావున ఈ వడి ఎక్కువ.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 3.
వది, వేగాల మధ్య భేదమేమి? వివరించండి. (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 3

ప్రశ్న 4.
స్థిర త్వరణం అనగానేమి? (AS 1)
జవాబు:

  1. వేగంలో మార్పురేటును త్వరణం అంటారు.
  2. త్వరణం అనేది ఒక వస్తువు యొక్క వేగంలో మార్పు ఎంత త్వరగా జరుగుతుందో తెలియజేస్తుంది.
  3. నిర్దిష్ట కాలవ్యవధులలో ఒక వస్తువు వేగంలో మార్పులు సమానంగా ఉంటే, ఆ వస్తువు త్వరణాన్ని సమత్వరణం అంటారు.
  4. ఉదాహరణకు మనం ఒక కారు నడుపుతున్నామనుకుందాం. ఆ కారు వేగాన్ని ఒక సెకనులో 30 కి.మీ/గం. నుండి 35 కి.మీ/గం||కు, తర్వాత సెకనులో 35 కి.మీ/ గం|| నుండి 40 కి.మీ | గం||కు, అదే క్రమంలో ప్రతి సెకనుకు దాని వేగాన్ని పెంచుతున్నామనుకుందాం. ఈ సందర్భంలో కారు వేగం ప్రతి సెకనుకు 5 కి.మీ/గం. చొప్పున పెరుగుతుంది. దీనినే ‘స్థిరత్వరణం’ అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 4

ప్రశ్న 5.
“ఒక కారు 70 కి.మీ./గం|| స్థిరవేగంతో వక్రమార్గంలో చలిస్తుంది.” అని మీ స్నేహితుడు మీతో అంటే అతను చెప్పిన దానిని మీరెలా సరిచేస్తారు? (AS 1)
జవాబు:
“ఒక కారు 70 కి.మీ./ గం. స్థిరవడితో వక్రమార్గంలో చలిస్తుంది.”

కారణం :
వక్రమార్గంలో వడి స్థిరంగా వుంటుంది. కాని వేగం మారుతూ ఉంటుంది.

ప్రశ్న 6.
ఒక కణం స్థిర వేగంతో చలిస్తుంది. ఏదేని నిర్ణీత కాలవ్యవధిలో దాని సరాసరి వేగం, తక్షణ వేగంతో సమానంగా ఉంటుందా? లేదా? వివరించండి. (AS 2, AS 1)
జవాబు:
ఇక్కడ వేగం స్థిరంగా వుంది. కావున ఏదేని నిర్ణీత కాలవ్యవధిలో దాని సరాసరి వేగం తక్షణ వేగంతో సమానంగా ఉంటుంది.
ఉదా :
ఒక తిన్నని రోడ్డుపై ఒక కారు 10 మీ/సె ఫిరవేగంతో చలిస్తున్నదనుకొనుము.
1 సె||లో కారు ప్రయాణించిన దూరం (AB) = 10 మీ.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 5

అదే విధంగా 2 సె॥లో కారు ప్రయాణించిన దూరం (AC) = 10 × 2 = 20 మీ.
∴ A నుండి C కు గల సరాసరి వేగం = \(\frac{20}{2}\) = 10 మీ/సె.
∴ A లేదా B లేదా C లేదా ఏదేని బిందువు వద్ద దాని తక్షణ వడి = 10 మీ/సె.

ప్రశ్న 7.
ఒక వస్తువు త్వరణం స్థిరంగా ఉన్నప్పుడు దాని వేగందిశ పూర్తిగా వ్యతిరేక దిశలోనికి మారగలదా? ఒక ఉదాహరణతో వివరించండి. అలా మారడం వీలుకాదనుకుంటే ఎందుకు కాదో వివరించండి. (AS 2, AS 1)
జవాబు:
నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు విషయంలో ఇది నిజమగును.
ఉదా: ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరామనుకోండి. అది పైకి పోవునపుడు దాని వేగం పై దిశలో వుంటుంది. కాని అదే వస్తువు క్రిందికి పడేటప్పుడు దాని వేగ దిశ క్రిందికి ఉంటుంది. ఈ రెండు సందర్భాలలోను త్వరణం (సంఖ్యాత్మకంగా) సమానంగా ఉంటుంది. కాని దిశ మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది.

ప్రశ్న 8.
పటంలో చూపిన విధంగా ఒక కణం వక్రమార్గంలో చలిస్తుంది. A నుండి B కి, స్థానభ్రంశ సదిశను గీయండి. (AS 5)
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 6
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 7

ప్రశ్న 9.
ఒక వస్తువు వడి ఏకరీతిగా తగ్గుతూ వుంటే దాని చలనాన్ని తెలిపే దూరం – కాలం గ్రాఫ్ గీయండి. (AS 5)
జవాబు:
బ్రేకులు వేసిన తరువాత ఒక కారు చలనాన్ని గమనించండి. దాని చలనం క్రింది విధంగా వున్నదనుకోండి.

కాలము (t) సెకండ్లలోదూరము (s) మీటర్లలో
020
118
216
314
412
510

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 8

ప్రశ్న 10.
తాబేలు మరియు కుందేలుల పరుగు పందెం కథ మీరు వినే ఉంటారు. తాబేలు ప్రయాణించే వడి కంటే కుందేలు ప్రయాణించే వడి ఎక్కువ. రెండూ ఒకే చోటు నుండి పరుగుపందెం ప్రారంభించాయి. కుందేలు కొంత దూరం ప్రయాణించి చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుంది. కుందేలు నిద్ర లేచి చేరవలసిన గమ్యం వైపు పరిగెత్తింది. కుందేలు గమ్యానికి చేరేసరికి తాబేలు అప్పటికే గమ్యాన్ని చేరింది. ఈ కథను దూరం-కాలం గ్రాస్లో చూపండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 9

  1. OX – తాబేలు చలనము.
  2. ‘OABC-కుందేలు చలనము.
  3. కుందేలు, తాబేలు ‘O’ వద్ద బయలుదేరినాయి.
  4. ‘t1 కాలం తరువాత కుందేలు ‘A’ వద్ద, తాబేలు ‘P’ వద్ద వున్నాయి.
  5. తరువాత ‘t2‘ సమయం వరకు కుందేలు విశ్రాంతి తీసుకుంది.
  6. ‘t2‘ కాలం తరువాత తాబేలు Qవద్ద ఉన్నది కాని కుందేలు స్థానభ్రంశం చెందలేదు.
  7. ‘t3‘ కాలం తరువాత తాబేలు తన గమ్యస్థానమైన Xను చేరుతుంది.
  8. కాని ఆ గమ్యాన్ని కుందేలు ‘t4‘ సమయం తరువాత చేరుకున్నది.

ప్రశ్న 11.
4 సె.లో ఒక చిరుత 100 మీ. దూరం పరిగెడుతుంటే, దాని సరాసరి వడి ఎంత? అదే చిరుత 2 సె.లో 50 మీ.దూరం పరిగెడినచో దాని సరాసరి వడి ఎంత? (AS 1, AS 7)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 10

ప్రశ్న 12.
రెండు రైళ్లు 30 కి.మీ./గం. వడితో ఒకే ట్రాక్ పై వ్యతిరేక దిశల్లో చలిస్తున్నాయి. ఒక పక్షి ఒక రైలు నుండి రెండవ రైలుకు 60 కి.మీ./గం. వడితో ఎగరగలదు. రెండు రైళ్ల మధ్య 60 కి.మీ. దూరం ఉన్నప్పుడు పక్షి ఎగరటం ప్రారంభించింది. పక్షి రెండవ రైలును తాకి మరల మొదటి రైలు వైపు, మరల మొదటి రైలు నుండి రెండవదాని వైపు, ఆ రెండు రైళ్లు ఢీకొనేంత వరకు ఎగిరింది. పక్షి ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేసింది ? పక్షి ప్రయాణించిన దూరం ఎంత? (AS 1)
జవాబు:
1వ పద్దతి:
ప్రతి రైలు వేగము = 30 కి.మీ / గం||
మొదటి రైలు, రెండవ రైలు కూడా ఒక గంటలో 30 కి.మీ. ప్రయాణించగలవు.
రెండు రైళ్ళ మధ్య దూరము = 60 కి.మీ
కావున రెండు రైళ్ళు ఒక గంటలో ఢీకొంటాయి.
పక్షి ఒక రైలు నుండి రెండవ రైలుకు 60 కి.మీ / గం. వేగంతో చలిసుంది.

∴ రెండు రైళ్ళు ఢీకొనుటకు ముందు పక్షి 60 కి.మీ దూరం ప్రయాణించును.
కాని రెండు రైళ్ళు ఢీకొనక ముందు, ఢీకొన్న తరువాత ఆ పక్షి అనంతమైన ప్రదక్షిణలు చేస్తుంది.

2వ పద్దతి:
రెండు రైళ్ళ సాపేక్ష వేగం = 60 కి.మీ./ గం||
రెండు రైళ్ళు ఢీకొనుటకు పట్టు సమయం = t సె॥ అనుకొనుము.
రెండు రైళ్ళ మధ్యదూరం = 60 కి. మీ.
∴ \(t=\frac{d}{s}=\frac{60}{60}=1\) గం||
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 11
పక్షి వేగము = 60 కి.మీ.
1 గం||లో పక్షి ప్రయాణించిన దూరం = 60 కి.మీ.
ఉదాహరణకు పక్షి B నుండి ‘X’ కి.మీ. దూరంలో (A వద్ద) ఉందనుకోండి. అప్పుడు ఆ పక్షి ‘t’ సమయంలో A రైలును ‘C’ వద్ద ఢీ కొట్టును.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 12

ప్రశ్న 13.
ఒక రాయిని భావిలోకి జారవిడిచినప్పుడు అది 2 సెకన్లలో నీటి ఉపరితలాన్ని తాకినది. ఆ రాయి ఎంత వేగంతో ఉపరితలాన్ని తాకినది మరియు పై నుండి నీటి ఉపరితలం ఎంత లోతులో ఉన్నది? (AS 1)
(g = 10m/s², V= U + at, S = Ut + 1/2 at²)
జవాబు:
దత్తాంశం ప్రకారం; t = 2 సె; 1 = (0 మీ./సె [∵ స్వేచ్ఛగా పడుతున్న రాయి); v = ?
లోతు, s = ?; a = g = 10 మీ./సె²
i) v = u + at; v = 0 + 10 × 2 = 20 మీ./సె
ii) s = ut + \(\frac{1}{2}\) at² = 0 + \(\frac{1}{2}\) × 10 × 2² = \(\frac{1}{2}\) × 10 × 4 = 20 మీ.
∴ రాయి ఉపరితలాన్ని తాకిన వేగం = 20 మీ/సె
పై నుండి నీటి ఉపరితలంలోతు = 20 మీ.

ప్రశ్న 14.
ఒక వస్తువు 6 మీ/సె వేగంతో కదులుతూ తరువాత 3 సెకన్లలో 2 మీ/సె² చొప్పున త్వరణం చెందినది. సమయంలో
వస్తువు ఎంత దూరం ప్రయాణించినది ? (S = Ut + 1/2 at²) (AS 1)
జవాబు:
దత్తాంశం ప్రకారం
u = 6 మీ/సె. ; t = 3 సెకనులు; a = 2 మీ./సె²
s = ut + \(\frac{1}{2}\) at² = 6 × 3 + \(\frac{1}{2}\) × 2 × 3² = 18 + 9 = 27 మీ.
∴ 3 సెకనుల సమయంలో వస్తువు ప్రయాణించిన దూరం = 27 మీ.

ప్రశ్న 15.
ఒక కారు 40 మీ/సె వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు బ్రేకు వేయగా 8మీ దూరం ప్రయాణించి ఆగినది. కారు త్వరణాన్ని కనుగొనండి. (v² – u² = 2as) (AS 1)
జవాబు:
దత్తాంశం ప్రకారం
u = 40 మీ/సె.; V = 0 (కారు ఆగినది కనుక); S = 8మీ.; a = ?
v² – u² = 2as
0 – 40² = 2 × a × 8
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 13
కారుత్వరణం = 100 మీ/సె².
త్వరణానికి ‘-‘ గుర్తు ఉన్నది కనుక కారుత్వరణం ఋణత్వరణం.

ప్రశ్న 16.
ఒక కణం సమత్వరణ చలనంలో ఉంది. ఆ కణం ‘n’ వ సెకనులో పొందిన స్థానభ్రంశానికి సమీకరణాన్ని ఉత్పాదించండి. [Sn = u + a(n – 1/2)] (AS 1)
జవాబు:
సెకనులో వస్తువు పొందిన స్థానభ్రంశం S = ut + \(\frac{1}{2}\) + at² (సమచలన సమీకరణం)
∴ ‘n’ సెకనులలో వస్తువు పొందిన స్థానభ్రంశం Sn(sec) = un + \(\frac{1}{2}\) an² ………….. (1)
∴ (n – 1) సెకనులలో వస్తువు పొందిన స్థానభ్రంశం, S(n-1)sec = u (n – 1) + \(\frac{1}{2}\) a (n – 1)²………….. (2)
∴ nవ సెకనులో వస్తువు పొందిన స్థానభ్రంశం Sn = S(a sec) – S(n – 1)sec
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 14

ప్రశ్న 17.
ఒక కణం ‘O’ బిందువు నుండి బయలుదేరి, స్థిర త్వరణంతో చలిస్తూ ‘O’ బిందువును విడిచి పెట్టింది. 5 సెకన్ల తర్వాత దాని వడి 1.5 మీ./సె. 6వ సెకను చివర అది నిశ్చలస్థితికి వచ్చి మరల వెనుకకు తిరిగి చలిస్తుంది. అది నిశ్చల స్థితికి వచ్చేలోపు ఆ కణం ప్రయాణించిన దూరమెంత ? వెనుదిరిగిన కణం ఎంత వేగంతో ‘O’ బిందువును చేరుతుంది? (AS 1)
జవాబు:
5వ సెకనులో వేగం = 1.5 మీ/సె.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 15
6వ సెకనుకు నిశ్చల స్థితికి వస్తుంది.
∴ 6వ సెకనులో తుదివేగం v = 0 మీ/సె.
6వ సెకనులో త్వరణం v = u + at
0 = 1.5 + a.1
∴ a = -1.5 మీ/సె² (∵ 5వ సెకనులో వేగం, 6వ సెకనులో తొలివేగమవుతుంది. కాలం = 6 – 5 = 1 సె॥)
6 సెకనుల తరువాత, వస్తువు నిశ్చలస్థితికి వస్తుంది.
v = 0, a = – 1.5 మీ/సె², u = ? t = 6 సె.
v = u + at
0 = u + (-1.5) × 6
∴ u = 9 మీ/సె.
నిశ్చలస్థితికి వచ్చేసరికి అనగా 6 సెకనులలో వస్తువు ప్రయాణించిన దూరం
s = ut + \(\frac{1}{2}\) at² = 9 × 6 + \(\frac{1}{2}\) ×- 1.5 × 6²
s = 54 – 27 = 27 మీ.

ఇప్పుడు కణం వెనుకకు మరలుతుంది.
v = 0 మీ/సె, t = 6 సె, a = -1.5 మీ/సె².
v = u + at
v = (0 – 1.5 × 6
v = – 9
∴ తిరుగు ప్రయాణంలో వేగం = -9 మీ/సె.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 18.
ఒక కణం స్థిరత్వరణం ‘a’ తో నిశ్చలస్థితి నుండి బయలుదేరి ‘t’ కాలం ప్రయాణించిన తర్వాత దాని త్వరణం దిశ పూర్తిగా వ్యతిరేక దిశలోకి మారింది. కాని దాని త్వరణం పరిమాణంలో ఏ మార్పు లేదు. ఆ కణం తిరిగి బయలుదేరిన బిందువుకు చేరడానికి ఎంత సమయం పడుతుంది? (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 16
ఒక కణం ‘a’ వద్ద బయలుదేరినదనుకొనుము.
దాని తొలివేగం u = 0 మీ/సె
స్థానభ్రంశం = 6 మీ.
త్వరణం = a మీ/సె²
కాలము = t సెకనులు

స్థానభ్రంశం s = ut + \(\frac{1}{2}\) at = ot – \(\frac{1}{2}\)at
s = \(\frac{1}{2}\)at² ……… (1)
తుదివేగం (v) = u + at = v = at ………… (2)
‘t2‘ కాలం తరువాత దాని దిశను మార్చుకుంటుంది. కాని పరిమాణం సమానంగా ఉంటుంది. అప్పుడు కణం B నుండి Aకి కదులుతుంది.
స్థానభ్రంశం = -s మీ.
త్వరణం = – a మీ/సె²
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 17

ప్రశ్న 19.
ఒక రైలు దాని వడిని 20 సెం.మీ/సె. త్వరణంతో పెంచుకోగలదు. అలాగే తన వడిని 100 సెం.మీ/సె. త్వరణంతో తగ్గించుకోగలదు. అయితే ఒకదానితో ఒకటి 27 కి.మీ. దూరంలో ఉన్న రెండు రైల్వేస్టేషన్ల మధ్య ఆ రైలు ప్రయాణించడానికి పట్టే కనీస కాలం ఎంత? (AS 1)
జవాబు:
ఒక రైలు త్వరణం α = 20 సెం.మీ/సె²
దాని రుణ త్వరణం β = 100 సెం.మీ/సె²
రెండు స్టేషన్ల మధ్య దూరం s = 2.7 కి.మీ = 27 × 104 సెం.మీ.
రైలు, రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించడానికి పట్టే కనీస కాలం t సె|| అనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 18
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 19

ప్రశ్న 20.
50 మీ. పొడవు గల రైలు 10 మీ/సె. స్థిర వడితో చలిస్తుంది. ఆ రైలు ఒక విద్యుత్ స్తంభాన్ని మరియు 250 మీ. పొడవు గల బ్రిడ్జిని దాటడానికి పట్టే కాలాన్ని లెక్కించండి. (AS 1)
జవాబు:
(i) రైలు పొడవు = 50 మీ.
రైలు వడి V = 10 మీ./సె.
రైలు విద్యుత్ స్తంభాన్ని దాటుటకు అది ప్రయాణించిన దూరము = రైలు పొడవు (s) = 50 మీ.
∴ రైలు విద్యుత్ స్తంభాన్ని దాటుటకు పట్టు కాలము \(\mathrm{t}=\frac{\mathrm{s}}{\mathrm{v}} \Rightarrow \mathrm{t}=\frac{50}{10}=5\) సెకనులు

(ii) బ్రిడ్జి పొడవు = 250 మీ. రైలు బ్రిడ్జిని దాటుటకు ప్రయాణించిన దూరం (s)= రైలు పొడవు + బ్రిడ్జి పొడవు
⇒ s = 50 + 250 = 300 మీ.
రైలు బ్రిడ్జిని దాటుటకు పట్టు కాలము \(\mathrm{t}=\frac{\mathrm{s}}{\mathrm{v}} \Rightarrow \mathrm{t}=\frac{300}{10}=30\) సెకనులు

ప్రశ్న 21.
పటంలో చూపిన విధంగా ఒకే ఎత్తు గల మూడు రకాలైన తలాల నుంది, ఒకే రకమైన మూడు బంతులను జారవిడిచినచో, ఏ బంతి త్వరగా నేలను చేరుతుంది? వివరించండి. (AS 2 AS 1)
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 20
జవాబు:
మొదటి కొండపై నుండి జారవిడిచిన బంతి ముందుగా నేలను చేరును.

కారణం:

  1. మొదటి కొండపైనున్న బంతి రేఖీయ చలనంలో ఉండును.
  2. కావున దాని వడి మరియు వేగము ఒకే పరిమాణం, దిశ కలిగియుండును.
  3. రెండవ మరియు మూడవ కొండల పైనున్న బంతులు వక్రమార్గంలో ప్రయాణించును.
  4. కావున వీటి వేగ దిశ నిరంతరం మారును.

ప్రశ్న 22.
నిశ్చలస్థితి నుండి బయలుదేరిన ఒక వస్తువు యొక్క వడి ఏకరీతిగా పెరుగుతున్నట్లయితే వస్తువు యొక్క చలనాన్ని చూపే దూరం – కాలం ను గీయండి. (AS 5)
జవాబు:
ఒక కారు క్రింది పట్టికలో చూపిన విధంగా చలిస్తున్నదనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 21

కాలము (t) సెకండ్లలోదూరము (s) మీటర్లలో
00
13
26
39
412
515

ప్రశ్న 23.
ఒక కారు తన ప్రయాణ కాలంలో మొదటి సగం కాలం 80 కి.మీ./గం. వడితోను, మిగిలిన సగం కాలం 40 కి.మీ./గం. వడితోనూ ప్రయాణిస్తే, దాని సరాసరి వడి ఎంత?
జవాబు:
మొత్తం ప్రయాణించిన కాలం = xగం|| అనుకొనుము.
మొదటి సగం కాలం (అనగా \(\frac{x}{2}\)గం॥) లో దాని వడి = 80 కి.మీ | గం||
∴ \(\frac{x}{2}\) గం||లలో ప్రయాణించు దూరం = 80 × \(\frac{x}{2}\) = 40 x కి.మీ/గం.
మిగిలిన సగం కాలములో వడి = 40 కి.మీ/గం.
∴ మిగిలిన \(\frac{x}{2}\) గం||లలో ప్రయాణించిన దూరం = 40 × \(\frac{x}{2}\) = 20 x కి.మీ/గం.
∴ మొత్తం ప్రయాణించిన దూరం = 40x + 20x = 60x కి.మీ.
మొత్తం ప్రయాణానికి పట్టిన కాలం = x గం||
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 22

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 24.
ఒక కారు తాను ప్రయాణించిన మొత్తం దూరంలో మొదటి సగం దూరం 50 కి.మీ./గం. వడితోనూ, మిగిలిన సగం దూరం 10 కి.మీ./గం. వడితోనూ ప్రయాణిస్తే, ఆ కారు సరాసరి వడి ఎంత? (AS 1)
జవాబు:
కారు ప్రయాణించిన మొత్తం దూరం = x కి. మీ. అనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 23

ప్రశ్న 25.
ఒక కణం మొదటి 5 సెకనుల్లో 10మీ. దూరం తర్వాత 3 సెకనులలో 10మీ. దూరం ప్రయాణించింది. ఆ కణం సమత్వరణంతో చలిస్తుందనుకొంటే ఆ కణం తొలివేగాన్ని, త్వరణాన్ని మరియు తదుపరి 2కె.లో ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. (AS1, AS7)
జవాబు:
మొదటి 5 సెకన్లలో ప్రయాణించిన దూరం = 10 మీ.
t1 = 5 సె||; s1 = 10 మీ.
s = ut + \(\frac{1}{2}\) at² అని మనకు తెలుసు.
10 = u × 5 + \(\frac{1}{2}\) a . 5²
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 24

తరువాతి 2 సె॥లలో వస్తువు ప్రయాణించిన దూరం కనుగొనుటకు ముందు ఈ రెండు సెకనులకు తొలివేగాన్ని కనుగొనాలి. ఇది 8సె|| తరువాత తుదివేగానికి సమానము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 25

∴ కణం తరువాత 2 సె॥॥లలో 8.33 మీ. దూరం ప్రయాణిస్తుంది.

ప్రశ్న 26.
ఒక కారు నిశ్చలస్థితి నుండి బయలుదేరింది. అది కొంతసేపు స్థిర త్వరణం “α” తో ప్రయాణించి, ఆ తర్వాత స్థిర ఋణత్వరణం “β” తో చలిస్తూ నిశ్చలస్థితికి వచ్చింది. ఆ కారు యొక్క మొత్తం ప్రయాణ కాలం “t” అయితే, ఆ కారు పొందే గరిష్ఠ వేగమెంత? (AS 2, AS7)
జవాబు:
త్వరణం a = α మీ/సె²
తొలివేగం u = 0 మీ/సె²
కాలం = t1 సె|| అనుకొనుము.
v = u + at సమీకరణం నుండి
⇒ v= 0 + αt1 ⇒ v = αt1
∴ \(t_{1}=\frac{v}{\alpha}\)సె
ఋణత్వరణం = – β మీ/సె²
ఇక్కడ ‘α’ త్వరణంతో ప్రయాణించే వస్తువు తుది వేగమే తిరుగు ప్రయాణంలో తొలివేగం ‘u’ అవుతుంది.
∴ u = αt1 మీ/సె
తుదివేగం v = 0 మీ/సె.
v = u + at సమీకరణం నుండి
0 = αt1 + (-β)t2
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 26

ప్రశ్న 27.
బస్సుకు 48 మీ. దూరంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. బస్సు బయలుదేరగానే, ఆ వ్యక్తి 10 మీ./సె. స్థిరవేగంతో బస్సు వైపు పరిగెత్తాడు. బస్సు నిశ్చలస్థితి నుండి 1 మీ./సె.² త్వరణంతో చలిస్తుంది. ఆ వ్యక్తి ఆ బస్సు పట్టుకోగల కనీస సమయాన్ని లెక్కించండి. (AS 1 AS 7)
జవాబు:
బస్సును మనిషి n సెకనులలో పట్టుకోగలడు అనుకుందాం.
బస్సు నిశ్చలస్థితిలో ఉన్నది.
u = 0 మీ/సె ; a = 1 మీ/సె²
ఆ బస్సు n సెకనులలో 8 దూరం ప్రయాణిస్తుందనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 27

మనిషి బస్సును పట్టుకోవడానికి పట్టు కనీస సమయం = 8 సె॥

9th Class Physical Science 1st Lesson చలనం Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 5

ప్రశ్న 1.
ఒక వస్తువు కొంత దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకే చేరుకుంటే దాని స్థానభ్రంశమెంత? ఈ సందర్భానికి నిజ జీవితంలోని ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఒక వస్తువు కొంత దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకి చేరుకుంటే దాని స్థానభ్రంశం ‘సున్న’.
ఉదా : ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయలుదేరి మార్కెట్టుకి వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు అతని స్థానభ్రంశం ‘సున్న’ అవుతుంది.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 2.
దూరం, స్థానభ్రంశముల పరిమాణములు ఎప్పుడు సమానమవుతాయి?
జవాబు:
ఒక వస్తువు ఒక సరళరేఖ వెంబడి ఒకే దిశలో రెండు బిందువుల మధ్య చలించినపుడు ఆ వస్తువు దూరం, స్థానభ్రంశ పరిమాణములు సమానమవుతాయి.

9th Class Physical Science Textbook Page No. 6

ప్రశ్న 3.
ఒక కారు 5 గంటల్లో 200 కి.మీ. దూరం ప్రయాణించిన, దాని సరాసరి వడి ఎంత?
జవాబు:
కారు ప్రయాణించిన మొత్తం దూరం = 200 కి.మీ
ప్రయాణించిన కాలం = 5 గం||లు
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 28

ప్రశ్న 4.
ఏ సందర్భంలో సరాసరి వేగం శూన్యమవుతుంది?
జవాబు:
ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమయినపుడు దాని సరాసరి వేగం శూన్యమవుతుంది.

ప్రశ్న 5.
ఒక వ్యక్తి కారులో 25 గంటలు ప్రయాణించాడు. కారు ఓడోమీటర్లో తొలి, తుది రీడింగులు వరుసగా 4849 మరియు 5549 గా గుర్తించాడు. అయితే పూర్తి ప్రయాణంలో అతని సరాసరి వడి ఎంత?
జవాబు:
కారు ప్రయాణించిన దూరము = 5549 – 1849 = 700 కి.మీ.
ప్రయాణించిన కాలము = 25 గం||లు
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 29

9th Class Physical Science Textbook Page No. 9

ప్రశ్న 6.
a) రోడ్డుపై అతి వేగంతో ప్రయాణించే వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడం మీరు గమనించి ఉంటారు. ఈ జరిమానా వారి వడి ఆధారంగా విధిస్తారా? లేదా సరాసరి వడి ఆధారంగా విధిస్తారా? వివరించండి.
జవాబు:
తక్షణ వడి ఆధారంగా జరిమానా విధిస్తారు.

b) ఒక విమానం ఉత్తర దిశలో 300 కి.మీ/గం. వేగంతోనూ, మరొక విమానం దక్షిణ దిశలో 300 కి.మీ/గం. వేగంతోనూ ప్రయాణిస్తున్నవి. వాటి వడులు సమానమా? లేదా వేగాలు సమానమా? వివరించండి.
జవాబు:

  1. వాటి వడులు సమానము.
  2. వేగము పరిమాణములో సమానము కాని దిశ మాత్రము వ్యతిరేకము.

c) చలనంలో గల ఒక కారులోని స్పీడోమీటరు స్థిర విలువను చూపుతుంది. దీని ఆధారంగా కారు స్థిర వేగంతో చలిస్తుందని చెప్పగలమా? వివరించండి.
జవాబు:

  1. కారులోని స్పీడోమీటరు ముల్లు, కారు వడి యొక్క స్వల్ప మార్పులకు కూడా దాని స్థానాన్ని మార్చుకుంటుంది.
  2. కాని ఈ సందర్భంలో స్పీడోమీటరు స్థిర విలువను చూపిస్తుంది. కావున కారు స్థిర వేగంతో చలిస్తుందని చెప్పవచ్చు.

9th Class Physical Science Textbook Page No. 11

ప్రశ్న 7.
ఒక చీమ బంతి ఉపరితలంపై కదులుతుంది. దాని వేగం స్థిరమా? అస్థిరమా? వివరించండి.
జవాబు:
వేగం దిశ అస్థిరము.

వివరణ:
చీమ, బంతి ఉపరితలంపై కదులుతున్నది. కావున అది వృత్తాకార మార్గంలో చలించాలి. వృత్తాకార మార్గంలో వేగ దిశ నిరంతరం మారుతుంది. కావున వేగదిశ అస్థిరము.

ప్రశ్న 8.
వడి మారుతూ చలనదిశలో మార్పులేని చలనాన్ని సూచించే సందర్భాలకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రోడ్డుపై ప్రయాణించే బస్సు

9th Class Physical Science Textbook Page No. 13

ప్రశ్న 9.
300 కి.మీ/గం. స్థిరవేగంతో చలించే కారు త్వరణమెంత?
జవాబు:
వేగం = 300 కి.మీ/ గం|| = \(300 \times \frac{5}{18}=\frac{500}{6}=83.33\) మీ/సె॥
వేగము స్థిరంగా ఉన్నది. కావున త్వరణం కూడా స్థిరము.
∴ త్వరణము = 83.33 మీ/సె²

ప్రశ్న 10.
ఒక విమానం వేగం 1000 కి.మీ./గం. నుండి 1005 కి.మీ/గం.కు చేరటానికి 10 సెకనులు పట్టింది. స్కేటింగ్ చేసే వ్యక్తి వేగం శూన్యం నుండి 5 కి.మీ/గం. చేరటానికి 1 సెకను పట్టింది. వీరిలో ఎవరి త్వరణం ఎక్కువ?
జవాబు:
విమానం :
∴ స్కేటింగ్ చేసే వ్యక్తి యొక్క త్వరణం ఎక్కువ.

ప్రశ్న 11.
ఒక వాహన వేగం 100 కి.మీ/గం. నుండి నిశ్చల స్థితికి రావటానికి 10 సెకనులు పట్టిన ఆ వాహన త్వరణం ఎంత?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 31 AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 32

ప్రశ్న 12.
“స్థానంలో మార్పు ఎంత త్వరితగతిన వస్తుందో తెలిపే భావనే త్వరణం” అని మీ స్నేహితుడు అన్నాడు. మీ స్నేహితుడిని మీరు ఏ విధంగా సరి చేస్తారు?
జవాబు:
“నిర్ణీత దిశలో స్థానంలో మార్పు ఎంత త్వరితగతిన వస్తుందో తెలిపే భావనే త్వరణం”.

9th Class Physical Science Textbook Page No. 1

ప్రశ్న 13.
భూమి చలనంలో ఉన్నప్పటికీ, ఆ చలనాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము?
జవాబు:

  1. భూమి చలనంలో వున్నది.
  2. భూమి మీద ఉన్న మనం కూడా భూమి వేగానికి సమానమైన వేగంతో చలిస్తున్నాము. అనగా భూమికి, మనకు సాపేక్ష చలనం ఉన్నది.
  3. కావున భూమి చలనమును మనం గుర్తించలేకపోతున్నాము.

ప్రశ్న 14.
మీ తరగతి గది గోడలు చలనంలో ఉన్నాయా? లేదా? ఎందుకు?
జవాబు:
పరిశీలకుని దృష్టిలో గోడలు స్థిరంగా వున్నాయి.
చలనంలో ఉన్న భూమి దృష్ట్యా చూసినపుడు గోడలు కూడా చలనంలో వున్నాయని చెప్పవచ్చు.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 15.
నిశ్చలస్థితిలో ఉన్న రైలులో మీరు కూర్చుని ఉన్నప్పుడు అది కదులుతున్న అనుభూతిని ఎప్పుడైనా పొందారా? ఎందుకు?
జవాబు:
ఒక నిశ్చలస్థితిలోనున్న రైలులో కూర్చుని ఉన్నప్పుడు, అవతలి ట్రాక్ పైనున్న రైలు కదలికలోకి వచ్చినప్పుడు ఇటువంటి అనుభూతి కలుగుతుంది.

9th Class Physical Science Textbook Page No. 2

ప్రశ్న 16.
ఈ మార్పులు ఎందుకు వస్తాయి?
జవాబు:
భూమి గోళాకారంగా వుందని మనకు తెలుసు. అందువల్ల భూ ఉపరితలంపై గీసిన లంబదిశ భూమి మీద అది గీసిన స్థలంపై ఆధారపడి వుంటుంది. కాబట్టి భూ ఉపరితలంపై ఏ స్థానానికి ఆధారం చేసుకొని దిశను చెబుతున్నామో తెలియనంత వరకు పైకి, క్రిందకి అనే దిశలకు అర్థం లేదు.

ప్రశ్న 17.
ఈ పదాలు సాపేక్షమైనవా? కావా?
జవాబు:
కుడి, ఎడమ; పైకి, కిందకు; పొడవు, పొట్టి అనే పదాలు పరిశీలకుని పరంగా సాపేక్షమైనవి.

9th Class Physical Science Textbook Page No. 4

ప్రశ్న 18.
ప్రయాణికుడు ఏ సమాధానం ఇస్తాడో మీకు తెలుసా?
జవాబు:
రోడ్డుపై నిలుచున్న పరిశీలకుడి పరంగా కారు చలనంలో వుంటుంది. కాని కారులో ఉన్న ప్రయాణికుడి పరంగా చూస్తే కారు నిశ్చలస్థితిలో వుంటుంది. వస్తు చలనం, పరిశీలకుడిపై ఆధారపడి వుంటుంది. కాబట్టి ‘చలనం’ అనేది పరిశీలకుడు, చలించే వస్తువుల ఉమ్మడి ధర్మం.

ప్రశ్న 19.
చలనాన్ని మనం ఏవిధంగా అవగాహన చేసుకుంటాం?
జవాబు:
పరిశీలకుడి పరంగా ఒక వస్తుస్థానం కాలంతోపాటు నిరంతరం మారుతూంటే ఆ వస్తువు చలనంలో వుంది అంటాము.

9th Class Physical Science Textbook Page No. 7

ప్రశ్న 20.
ఒక నిర్దిష్ట సమయం దగ్గర కారు వడి ఎంత ఉంటుందో మనం తెలుసుకోగలమా?
జవాబు:
కారు ప్రయాణిస్తున్నప్పుడు ఏ సమయంలోనైనా దాని వడిని మనం స్పీడోమీటరు చూసి నిర్ణయించవచ్చు.

ప్రశ్న 21.
‘t3‘ సమయం వద్ద కారు వడి (తక్షణ వడి) ఎంత?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 33
ఏదైనా ఇచ్చిన సమయం వద్ద గ్రావాలు, ఆ సమయంలో కారు వడిని తెలుపుతుంది. గ్రాఫ్ పై ఏదైనా ఒక బిందువు వద్ద ఆ గ్రాఫ్ యొక్క వాలును ఆ బిందువు వద్ద గీసిన స్పర్శరేఖతో తెలుసుకోవచ్చు. ఈ వాలు, ఆ సమయంలో ఆ కారు యొక్క వడిని తెలుపుతుంది.

9th Class Physical Science Textbook Page No. 8

ప్రశ్న 22.
దానికి కట్టిన వస్తువు ఏ దిశలో చలిస్తుంది?
జవాబు:
వృత్తాకార మార్గంలో చలిస్తున్న వస్తువు, ఆ వస్తువును వదిలిన బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో చలిస్తుంది.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 23.
ఏ రకమైన చలనాన్ని సమచలనం అంటారు? ఎందుకు?
జవాబు:
ఒక వస్తువు స్థిరవేగంతో చలిస్తూ వుంటే ఆ చలనాన్ని ‘సమచలనం’ అంటారు.

9th Class Physical Science Textbook Page No. 9

ప్రశ్న 24.
మీరు గీసిన గ్రాఫ్ ఏ ఆకారంలో ఉంది?

కాలము (t) సెకండ్లలోదూరము (s) మీటర్లలో
00
14
28
312
416

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 34
జవాబు:
సమచలనంలో వున్న వస్తువు చలనానికి గీసిన గ్రాఫు ఒక సరళరేఖను సూచిస్తుంది.

9th Class Physical Science Textbook Page No. 10

ప్రశ్న 25.
మీరు గీసిన గ్రాఫ్ ఏ ఆకారంలో ఉంది?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 35
అసమ చలనంలో ఉన్న వస్తువు యొక్క చలనానికి గీసిన గ్రాఫు ఒక వక్ర రేఖ.

ప్రశ్న 26.
ఆ గ్రాఫ్ సరళరేఖ రూపంలో ఉందా? లేదా మరేదైనా రేఖ లాగా ఉందా? ఎందుకు?
జవాబు:
అసమచలనానికి గీసిన గ్రాఫ్ ఒక సరళరేఖ కాదు. ఎందుకనగా దాని వడి నిరంతరం, అసమంగా మారుతూ ఉంది.

9th Class Physical Science Textbook Page No. 11

ప్రశ్న 27.
వడి స్థిరంగా ఉంది, వేగం నిరంతరంగా మారే సందర్భాలకు కొన్ని ఉదాహరణలివ్వగలరా?
జవాబు:
సమవృత్తాకారచలనంలోనున్న వస్తువుల వడి స్థిరంగా ఉంటుంది. కాని వేగం నిరంతరం మారుతూ ఉంటుంది.
ఉదా: భూభ్రమణం, భూమి చుట్టూ చంద్రుని చలనం మొ||వి.

ప్రశ్న 28.
ఈ చలనంలో రాయి వడి స్థిరమా? ఎందుకు?
జవాబు:
రాయి వడి నిరంతరం మారుతూ ఉంటుంది. కావున అది అసమ చలనం.

ప్రశ్న 29.
రాయి చలనదిశ స్థిరంగా ఉంటుందా?
జవాబు:
రాయి చలనదిశ నిరంతరం మారుతూ ఉంటుంది.

ప్రశ్న 30.
వడి, చలన దిశలు రెండూ నిరంతరం మారే చలనాలకు కొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
రాకెట్ చలనము, క్షితిజ సమాంతరంగా విసిరిన వస్తువు, కాలితో తన్నిన ఫుట్ బాల్, బౌలర్చే విసరబడిన క్రికెట్ బంతి మొదలగునవి.

9th Class Physical Science Textbook Page No. 12

ప్రశ్న 31.
త్వరణం అనగానేమి? ఒక వస్తువు త్వరణంలో ఉందని ఎలా తెలుసుకోగలవు?
జవాబు:

  1. త్వరణం అనేది ఒక వస్తువు యొక్క వేగంలో మార్పు ఎంత త్వరగా జరుగుతుందో తెలియజేస్తుంది.
  2. ఇది వేగంలోని మార్పు రేటుకి సమానము.
  3. మనం బస్సు లేదా కారులో ప్రయాణించేటప్పుడు బస్సు డ్రైవరు యాక్సలరేటర్‌ను నొక్కితే మనం వెనకకు పడతాం. మనం పొందిన త్వరణం వలన మనం కూర్చొన్న సీట్లను శరీరం గట్టిగా వెనుకకు నొక్కుతుంది. ఈ విధంగా త్వరణం మన అనుభవంలోకి వస్తుంది.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 32.
వస్తువు వడి ఏ బిందువు వద్ద గరిష్ఠంగా వుంది?
జవాబు:
‘B’ వద్ద వస్తువు వడి గరిష్ఠము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 36

ప్రశ్న 33.
వస్తువుకు త్వరణం ఉన్నదా? లేదా?
జవాబు:
చలనంలోనున్న ఏ వస్తువుకైనా త్వరణం ఉంటుంది.

ఉదాహరణ సమస్యలు

9th Class Physical Science Textbook Page No. 9

ప్రశ్న 1.
‘h’ఎత్తు గల మనిషి సరళరేఖా మార్గంలో ‘v’ వడితో ‘H’ఎత్తు గల వీధిదీపం కింది నుండి ప్రయాణిస్తున్నాడు. వీధిదీపం నుండి వచ్చే కాంతి ఆ మనిషిపై పడి అతని నీడను ఏర్పరచింది. అతను కదులుతున్నప్పుడు నీదకూడా అతనితో పాటు కదులుతుంది. ఆ మనిషి నీడ యొక్క చివరిభాగంలో గల తల ఎంత వడితో కదులుతుందో కనుక్కోండి.
సాధన:
ఇటువంటి సమస్యను సాధించాలంటే మనిషి, అతని నీడ యొక్క చివరి భాగాల చలనాలను పోల్చాలి. ఇవి రెండూ ఒక మూల బిందువు ‘0’ నుండి చలించడం ప్రారంభించాయనుకొందాం. ఇది పటంలో చూపబడింది. “OD” మనిషి ఎత్తును సూచిస్తుంది. అలాగే OA దీపస్తంభం ఎత్తును (H) సూచిస్తుంది.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 37

‘t’ కాలంలో మనిషి, అతడి నీడ యొక్క చివర భాగంలో గల తల ప్రయాణించిన దూరాలు ‘S’ మరియు ‘S’లు అనుకుందాం.

ఈ చలనం వల్ల పటంలో చూపినట్లు ∆ABD, ∆ACO అనే రెండు సరూప త్రిభుజాలు ఏర్పడతాయి.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 38
S/t అనేది మనిషి నీడ యొక్క చివర భాగంలో తల వడిని తెల్పుతుంది. దీనిని ‘V’ తో సూచిస్తే, పై సమీకరణం నుండి మనం నీడ, యొక్క చివర భాగంలో తల వడి
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 39

9th Class Physical Science Textbook Page No. 12

ప్రశ్న 2.
400 మీ దూరంలో గల రెడ్ సిగ్నల్ లైటును చూసి 54 కి.మీ./గం. వేగంతో ప్రయాణించే రైలు ఇంజను బ్రేకులు వేశారు. బ్రేకులు కలుగజేసిన త్వరణం a = 0.3 మీ/సె అయితే 1 నిముషం తర్వాత రైలు ఇంజన్ సిగ్నల్ స్తంభానికి ఎంత దూరంలో ఉంటుంది?
సాధన:
రెడ్ సిగ్నల్ ను చూసినపుడు బ్రేకులు వేస్తే రైలు ఇంజన్ రుణత్వరణంతో చలిస్తుంది. ‘I’ కాలం తర్వాత ఆగిపోయిందనుకుందాం.
తొలివేగం 4 = 54 కి.మీ/గం. = 54 × 5/18 = 15 మీ/సె.
తుదివేగం V = 0 (ఇచ్చిన సందర్భానికి)
a = – 0.3 మీ/సె². (ఇంజన్ ఋణత్వరణంతో చలిస్తుంది.)
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 40

1 నిముషం తర్వాత రైలు ఇంజన్, సిగ్నల్ స్తంభానికి మధ్య దూరం I = L – S = 400 – 375 = 25 మీ.

ప్రశ్న 3.
ఒక వస్తువు సమత్వరణంతో సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ సరళరేఖా మార్గంపై గల రెండు బిందువుల వద్ద వస్తు వేగాలు వరుసగా u, v అయిన ఆ రెండు బిందువులకు మధ్య బిందువు వద్ద వస్తువు వేగం ఎంత?
సాధన:
వస్తువు సమత్వరణాన్ని ‘a’ అనుకుందాం.
ఇచ్చిన బిందువుల మధ్య దూరం ‘s’ అనుకుందాం.
v² – u² = 2as …………. (1)

ఈ రెండు బిందువులకు మధ్యబిందువు వద్ద వస్తువు వేగం v0 అనుకుందాం. (ఆ బిందువును ‘M’ గా పటంలో చూపడం జరిగింది.) అప్పుడు v²0 – u² = 2as/2
సమీకరణం (1) లోని 2as విలువను పై సమీకరణంలో ప్రతిక్షేపించగా
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 41

9th Class Physical Science Textbook Page No. 16

ప్రశ్న 4.
నిశ్చలస్థితి నుండి బయలుదేరిన ఒక కారు సమత్వరణం ‘a’ తో ‘t’ కాలం పాటు ప్రయాణించింది. కారు సరళరేఖా మార్గంలో ప్రయాణించినట్లయితే ‘t’ కాలంలో అది పొందే సరాసరి వడి ఎంత?
సాధన:
కారు నిశ్చలస్థితి నుండి ప్రారంభమైంది కాబట్టి దాని తొలి వేగం u = 0
‘t’ కాలంలో కారు ప్రయాణించిన దూరం
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 42

ప్రశ్న 5.
ఒక కణం 9 మీ./సె. వేగంతో తూర్పు దిశలో ప్రయాణిస్తుంది. అది పడమర దిశలో 2మీ./సి². స్థిరత్వరణాన్ని కలిగి ఉంటే దాని ప్రయాణంలో 5వ సెకనులో కణం ప్రయాణించిన దూరం ఎంత?
సాధన:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 43
తొలి వేగం U : + 9 మీ./సె.
త్వరణం a = -2 మీ./సె.²

ఈ సమస్యలో త్వరణం, వేగ దిశలు పరస్పరం వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఎంత సమయంలో ఆ కణం నిశ్చలస్థితికి వస్తుందో ముందుగా నిర్ణయించాలి. ఆ కాలాన్ని ‘t’ అనుకుందాం.
v = u + at నుండి
0 = 9 – 2t ⇒ t = 4.5 సె.
4.5 సె. నుండి 5 సె. వరకు కణం త్వరణదిశలో చలిస్తుంది. కనుక \(\frac{1}{2}\) సెకనులో అది కదిలిన దూరాన్ని లెక్కిద్దాం.
ఈ సందర్భంలో t = 4.5 సె. వద్ద 1 = 0.
\(\frac{1}{2}\) సె.లో ప్రయాణించిన మొత్తం దూరం,
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 44
5వ సెకనులో ప్రయాణించిన మొత్తం దూరం s0 అనుకుంటే అది 2s కు సమానం అవుతుంది.
s0 = 2s = 2 (1/4) = 1/2 మీ.

పరికరాల జాబితా

తాడు, రాయి, ఎలక్ట్రికల్ కేసింగ్, స్టీలు పళ్లెం, గాజు గోళీలు, డిజిటల్ వాచ్

9th Class Physical Science 1st Lesson చలనం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

ప్రయాణించే మార్గాన్ని గీయడం, దూరం – స్థానభ్రంశాల మధ్య తేడాను గమనించడం :
1. దూరం, స్థానభ్రంశాల మధ్య తేడాను గుర్తించడానికి ఒక కృత్యమును తెలిపి, గ్రాఫును గీయుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 45

  1. ఒక బంతిని తీసుకొని క్షితిజ తలానికి కొంతకోణం చేసే విధంగా విసరండి.
  2. బంతి ప్రయాణించిన మార్గాన్ని గమనించి తెల్లకాగితములపై ఆ మార్గాన్ని గీయండి.
  3. ఈ పటం నిర్ణీతకాలంలో బంతి గాలిలో ప్రయాణించిన దూరాన్ని తెలుపుతుంది.
  4. ASB వక్రరేఖ పొడవు బంతి ప్రయాణించిన దూరాన్ని తెలుపుతుంది.
  5. సరళరేఖ \(\overrightarrow{\mathrm{AB}}\) పొడవు బంతి స్థానభ్రంశాన్ని తెలుపుతుంది.

స్థానభ్రంశం :
నిర్దిష్ట దిశలో వస్తువు కదిలిన కనిష్ఠ దూరాన్ని . స్థానభ్రంశమని అంటారు. దీనిని సదిశతో సూచిస్తారు.

దూరం :
నిర్ణీత కాలంలో వస్తువు కదిలిన మార్గం మొత్తం పొడవును దూరము అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

కృత్యం – 2

స్థానభ్రంశ సదిశలను గీయడం : 2. కింది సందర్భాలలో A నుండి B కి స్థానభ్రంశ సదిశలను గీయుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 46
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 47

కృత్యం – 3

వస్తువు చలన దిశను పరిశీలించుట :
3. వృత్తాకార మార్గంలో చలించే ఒక వస్తువు వేగదిశ, ఆ వృత్తానికి ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో ఉంటుందని చూపండి.
జవాబు:

  1. ఒక తాడు చివర ఒక రాయి లేదా ఏదైనా వస్తువును కట్టి, తాడు రెండవ చివరను పట్టుకొని క్షితిజ సమాంతర తలంలో గుండ్రంగా తిప్పండి.
  2. అలా తిప్పుతూ తాడును వదిలి పెట్టండి.
  3. రాయిని మరలా అదే మాదిరిగా తిప్పుతూ వృత్తంలో వేరువేరు బిందువుల వద్ద నుండి తాడును వదలండి.
  4. తాడును విడిచి పెట్టే ప్రతి సందర్భంలో రాయి యొక్క చలన దిశను గమనించండి.
  5. వృత్తాకార మార్గంలో మీరు వదిలిన బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో ఆ వస్తువు చలించడం మీరు గమనిస్తారు.
  6. కావున వృత్తాకార మార్గంలో చలించే వస్తువు వేగదిశ, ఆ వృత్తానికి ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో ఉంటుంది.

కృత్యం – 4

సమచలనాన్ని అవగాహన చేసుకోవడం :

4. సమచలనాన్ని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
1. ఒక వ్యక్తి సైకిల్ పై రోడ్డుమీద సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తున్నాడనుకుందాం.
2. అతడు వివిధ సమయాల్లో ప్రయాణించిన దూరాలు క్రింది పట్టికలో ఇవ్వబడినవి.

కాలము (t) సెకండ్లలోదూరము (s) మీటర్లలో
00
14
28
312
416

3. పై విలువలకు దూరం – కాలం గ్రాఫ్ గీయండి. అది క్రింది విధంగా ఉండెను.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 48
4. సరళరేఖ రూపంలో గల గ్రాఫ్ ను పరిశీలిస్తే సైకిల్ పై ప్రయాణించే వ్యక్తి సమాన కాలవ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించాడని తెలుస్తుంది.
5. అదే విధంగా గ్రాఫ్ నుండి, అతని సరాసరి వడి తక్షణ వడికి సమానమని తెలుస్తుంది.
6. సైకిల్ పై వెళ్ళే వ్యక్తి చలన దిశ స్థిరమని మనం భావిస్తే అతని వేగం స్థిరమని చెప్పవచ్చు.
7. ఒక వస్తువు స్థిరవేగంతో చలిస్తూవుంటే ఆ చలనాన్ని ‘సమచలనం’ అంటారు.

కృత్యం – 5

వాలు తలంపై బంతి చలనాన్ని గమనించుట :

5. వడి మారినప్పటికి చలన దిశ స్థిరంగా వుంటుందని నిరూపించే ఒక సందర్భాన్ని వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 49 AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 50

  1. పటంలో చూపిన విధంగా వాలు తలాన్ని ఏర్పాటు చేయండి.
  2. ఒక బంతిని తీసుకొని వాలుతలం పై చివర నుండి వదిలివేయండి.
  3. పటంలో వివిధ సమయాలవద్ద బంతి స్థానాలను చూపడం జరిగింది.
  4. బంతి గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, వాలు తలంపై క్రిందికి జారేబంతి వడి క్రమంగా పెరుగుతుందని, బంతి చలన దిశ స్థిరంగా ఉందని మనం గమనించ గలం.
  5. ఇప్పుడు బంతిని తీసుకొని అది కొంత వడి పొందే టట్లుగా వాలుతలం కింది భాగం నుండి పైకి నెట్టండి.
  6. బంతి కొంతభాగం పైకెళ్ళి మరల క్రిందికి రావడం గమనిస్తాము.
  7. ఈ సందర్భాలను గమనిస్తే బంతి వడి మారుతుండడాన్ని, దాని చలన దిశ స్థిరంగా వుండడాన్ని గమనించవచ్చు.

కృత్యం – 6

సమవృత్తాకార చలనాన్ని పరిశీలించుట :

6. “వది స్థిరంగా వుండి, వేగదిశ మారే” సందర్భాన్ని వివరించండి. (లేదా) సమవృత్తాకార చలనాన్ని వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 51

  1. ఒక చిన్న రాయిని తాడుకి కట్టి దీక్షితిజ సమాంతర తలంలో తిప్పండి.
  2. పటంలో చూపినట్లు రాయి చలన మార్గాన్ని, వివిధ స్థానాలలో వేగ సదిశలను గీయండి.
  3. రాయి వడి స్థిరమని భావించండి.
  4. రాయి వృత్తాకార మార్గం చలిస్తుందని మరియు దాని వేగ దిశ నిరంతరం మారుతుందని గమనిస్తాము.
  5. రాయి వడి మాత్రం స్థిరంగా వుంటుంది.
  6. వస్తువు వృత్తాకార మార్గంలో చలిస్తున్నప్పుడు దాని వడి స్థిరంగా ఉన్నా, వేగదిశ మాత్రం నిరంతరం మారుతుందని తెలుస్తుంది.

కృత్యం – 7

గాలిలోకి విసిరిన రాయి చలనాన్ని గమనించుట :

7. వది, చలనదిశలు రెండూ మారే సందర్భాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 52

  1. క్షితిజ తలంతో కొంత కోణం చేసే విధంగా ఒక రాయిని విసరండి.
  2. అది ఎలా చలిస్తుందో పరిశీలించి, దాని మార్గాన్ని మరియు వేగ సదిశలను చూపే పటం గీయండి.
  3. బంతి వివిధ కాలవ్యవధులలో వివిధ దూరాలు ప్రయాణించి చివరిగా నిశ్చల స్థితికి రావడం గమనిస్తాము. అందువల్ల రాయి వడి స్థిరంగా ఉండదు.
  4. పటంలో చూపిన వేగ సదిశల ఆధారంగా, బంతి చలన దిశ కూడా స్థిరంగా ఉండదని తెలుస్తుంది.
  5. ఈ కృత్యం ద్వారా వడి, చలన దిశలు రెండూ కూడా నిరంతరం మారుతుండడాన్ని గమనించవచ్చు.

ప్రయోగశాల కృత్యం

8. వాలు తలంపై కదిలే వస్తువు త్వరణం, వేగాలను కొలిచే విధానాన్ని వివరించుము.
జవాబు:
ఉద్దేశం : వాలు తలంపై కదిలే వస్తువు త్వరణం, వేగాలను కొలవడం.

పరికరాలు :
గాజు గోళీలు, ఒకే పరిమాణంలో గల పుస్తకాలు, డిజిటల్ వాచ్, పొడుగాటి ప్లాస్టిక్ గొట్టం, స్టీలు పళ్ళెం.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 53

ప్రయోగపద్ధతి :

  1. సుమారు 200 సెం.మీ. పొడవుగల ప్లాస్టిక్ గొట్టాన్ని తీసుకోండి.
  2. దానిని పొడవు వెంట చీల్చి వస్తువులు కదిలే కాలువ వంటి మార్గంగా మార్చుకోండి. దీనినే ట్రాక్ అంటాము.
  3. ట్రాక్ పై 0 – 200 సెం.మీ. వరకు కొలతలను గుర్తించండి.
  4. ట్రాక్ ఒక చివరను పటంలో చూపిన విధంగా పుస్తకాలపై ఉంచండి. రెండవ చివరను నేలపై వుంచండి.
  5. రెండవ చివర వద్ద స్టీలు ప్లేటును వుంచండి.
  6. ట్రాకను అమర్చేటప్పుడు దాని ‘0’ రీడింగ్ నేలను తాకే వైపు ఉండాలి.
  7. ట్రాక్ లో పట్టే పరిమాణంగల గోళీని తీసుకోండి. 40 cm మార్కు నుండి గోళీని విడిచిపెట్టండి.
  8. గోళీని విడిచిపెట్టిన వెంటనే డిజిటల్ వాచ్ ను ‘ఆన్’ చేయండి.
  9. ఆ గోళీ క్రిందకు వస్తూ నేలపై వుంచిన స్టీలు ప్లేటును ఢీకొని శబ్దం చేస్తుంది. శబ్దం విన్న వెంటనే డిజిటల్ వాచ్ ను ఆపివేయండి.
  10. ఇదే ప్రయోగాన్ని (40cm కొలతతో) 2 లేక 3 సార్లు చేసి గణించిన విలువలు పట్టికలో రాయండి.
    AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 54
  11. పై ప్రయోగాన్ని వేర్వేరు దూరాలతో చేసి వాటికి సంబంధించిన విలువలు పట్టికలో రాయండి.
  12. పై విలువలకు s – t గ్రాఫు గీయండి.
  13. ఇదే ప్రయోగాన్ని వేరు, వేరు వాలు కోణాల వద్ద చేసి త్వరణాలను కనుక్కోండి.

పరిశీలనలు:

  1. వాలు పెరిగిన కొద్దీ త్వరణం పెరుగుతుంది.
  2. గాజు గోళీలకు బదులు ఇనుప దిమ్మను వాడినప్పటికీ త్వరణం, వాలుల మధ్య సంబంధం మారదు. (ప్రయోగంలో వచ్చే సంఖ్యాత్మక విలువలు మారవచ్చు.)

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

These AP 9th Biology Important Questions and Answers 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 11th Lesson Important Questions and Answers జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
జీవ భౌగోళిక రసాయనిక వలయాలు అనగానేమి?
జవాబు:
భూమి మీద పర్యావరణం నుండి జీవులకు, జీవుల నుండి పర్యావరణానికి పోషకాల ప్రసరణ జరగడంలో ఇమిడి ఉండే నిర్దిష్ట మార్గాలను “జీవ భౌగోళిక రసాయనిక వలయాలు” అంటారు.

ప్రశ్న 2.
వినత్రీకరణం అనగానేమి?
జవాబు:

  1. జంతువృక్ష కణాలలోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం లేదా డినైట్రిఫికేషన్ అంటారు.
  2. దీనిలో ఘనరూపంలోనున్న నైట్రెట్స్ (NO3) వాయురూపంలో ఉండే నైట్రోజన్ (N2) గా మారుతాయి.

ప్రశ్న 3.
ఆక్సిజన్ మరియు ఓజోన్ల మధ్య గల భేదాలు రాయండి.
జవాబు:

  1. ఆక్సిజన్ రెండు పరమాణువులతో ఉండే రంగు వాసన లేని వాయువు.
  2. మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఓజోన్ ఏర్పడుతుంది. ఓజోన్ నీలిరంగులో ఉండి ఘాటైన వాసన కలిగి ఉంటుంది.

ప్రశ్న 4.
నైట్రోజన్ స్థాపన అనగానేమి?
జవాబు:
నైట్రోజన్ స్థాపన : నైట్రోజన్ సమ్మేళనం (సంయోగ పదార్థం) స్థిర రూపంలోకి మార్చబడడాన్ని ‘నైట్రోజన్ స్థాపన’ (Nitrogen) అంటారు.

ప్రశ్న 5.
అమ్మోనీకరణం అనగానేమి?
జవాబు:
నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా (NH3) ఉత్పత్తి కావటాన్ని అమ్మోనీకరణం అంటారు.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 6.
BOD అనగానేమి?
జవాబు:
నీటిలోని జీవ విఘటన పదార్థాలను ప్రత్యేకమైన సూచిక ద్వారా తెలియజేస్తారు. ఆ సూచికను జీవులకు అవసరమైన ఆక్సిజన్ “(Biological Oxygen Demand (BOD))” అంటారు.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నీటి యొక్క ఉపయోగమును వివరించండి.
జవాబు:

  1. భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు తాగునీటిగా ఉపయోగపడుతుంది.
  2. కిరణజన్య సంయోగక్రియ, జీర్ణక్రియ, కణశ్వాస క్రియలతో సహా వివిధ జీవరసాయనిక చర్యలలో నీరు పాల్గొంటుంది.
  3. చాలా జాతుల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులకు నీరు ఆవాసంగా ఉండడంతోబాటు జీవులు వినియోగించుకొనే వివిధ పదార్థాల రవాణాలో పాల్గొంటుంది.
  4. జీవరాశి ఏర్పడడానికి కావలసిన సేంద్రియ పదార్థాలలో అతి ముఖ్యమైన మూలకాలు హైడ్రోజన్, ఆక్సిజన్ నీటి ద్వారానే లభ్యమవుతున్నాయి.

ప్రశ్న 2.
నత్రీకరణం అనగానేమి? నత్రీకరణలో పాల్గొను బాక్టీరియాలు ఏవి?
జవాబు:

  1. నేలలోని డీ నైట్రిఫైయింగ్ బాక్టీరియాలు నైట్రేట్ లను అమ్మోనియా రూపంలో మారుస్తాయి.
  2. నైట్రిఫైయింగ్ బాక్టీరియా తమ కణాల కొరకు ఈ అమ్మోనియాను ఉపయోగించుకుని, ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, నైటైట్స్, నైట్రేట్స్ గా మార్చుకుంటాయి.
  3. ప్రధానంగా నైట్రో సోమోనాస్ నైటైలను ఉత్పత్తిచేయగా, నైట్రేట్ లను నైట్రోబాక్టర్స్ ఉత్పత్తిచేస్తాయి.
  4. సూక్ష్మజీవులు చనిపోవడం వలన నేలలో నత్రజని సంబంధిత పదార్థాలు కలుపబడుతాయి.

ప్రశ్న 3.
స్వాంగీకరణంను క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. నైట్రోజన్ సంబంధ పదార్థాలు, ప్రధానంగా నైట్రేట్స్ లేదా అమ్మోనియం (NH3+) అయాన్లను మొక్కలు, నేల నుండి గ్రహిస్తాయి.
  2. వీటిని మొక్కలు ప్రోటీన్లు తయారుచేయడానికి ఉపయోగించుకుంటాయి.
  3. జంతువులు ఈ మొక్కలను తిన్నాక, వాటిలో జంతువుల ప్రోటీన్లు తయారవుతాయి.

ప్రశ్న 4.
అమ్మోనీకరణం అనగానేమి? అమ్మోనీకరణం జరిగే సందర్భాలు ఏవి?
జవాబు:

  1. నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా (NH3) ఉత్పత్తి కావటాన్ని అమ్మోనిఫికేషన్ అంటాం.
  2. మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు లేదా జంతువుల వ్యర్థాలను వదలినప్పుడు కూడా అమ్మోనిఫికేషన్ జరుగుతుంది.
  3. సేంద్రియ పదార్థాలలోనున్న నైట్రోజన్ నేలలోనూ, నీటి వనరుల్లోనూ తిరిగి చేరి అక్కడ విచ్ఛిన్నకారులైన సూక్ష్మజీవుల చర్య వల్ల అమ్మోనియాగా మారి ఇతర జీవన ప్రక్రియలకు అందుబాటులో ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 5.
ఆక్సిజన్ యొక్క ఉపయోగాలు ఏవి?
జవాబు:

  1. జీవులు జీవించడానికి ఆక్సిజన్ కావాలి.
  2. శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించబడి కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదలచేయటం వలన ప్రకృతిలో సమతాస్థితి కొనసాగుతుంది.
  3. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ నీటిలో నివసించే జంతువులకు ప్రాణాధారం.
  4. కార్బన్ వ్యర్థాలు విచ్ఛిన్నమవడానికి ఆక్సిజన్ చాలా అవసరం.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
భూమిపై నీటి యొక్క విస్తరణను వివరించండి.
జవాబు:

  1. భూమి మీద ఉన్న నీటిలో దాదాపుగా 97% నీరు ఉప్పునీటి రూపంలో సముద్రంలో ఉంది.
  2. 3% మాత్రమే మంచినీరు, ఇందులో కూడా 2% మంచినీరు గడ్డకట్టిన గ్లేసియలోనూ, ధృవ ప్రాంతాలలోనూ ఉంటుంది.
  3. మనకు 1% మంచినీరు మాత్రమే అందుబాటులో ఉన్నది.
  4. ఇందులో కూడా మళ్ళీ 4వ వంతు భూగర్భ జలరూపంలో ఉంటుంది.
  5. 0.0091 మాత్రమే భూమిపై నదులలో, సరస్సులలో ఉంటుంది.
  6. మిగిలినదంతా జీవుల దేహాలలో, నేలలో, వాతావరణంలో తేమ రూపంలో ఉంటుంది.
  7. సజీవులలో అత్యవసరమైనదీ అధికమొత్తంలో ఉండే పదార్థం నీరు.
  8. ఉదాహరణకు మన శరీరంలో 70% నీరు ఉంటుంది.

ప్రశ్న 2.
జలచక్రం అనగానేమి? దానిని వివరించండి.
జవాబు:

  1. నీరు ఆవిరిగా మారటం, వర్షం రూపంలో భూమిపైన కురియటం మరియు వివిధ రూపాలలో అవక్షేపాలుగా మారి భూమి నుండి వివిధ మార్గాలుగా అనగా నది, భూగర్భ జల మార్గాల ద్వారా సముద్రాలలో కలిసే మొత్తం ప్రక్రియను’ – జలచక్రం అంటారు.
  2. భూమి పైన పడ్డ వర్షం నీరు మొత్తం నేరుగా సముద్రాలలోకి పోదు.
  3. అందులో కొంతభాగం నేలలో ఇంకిపోతుంది. అది భూగర్భజల నిల్వలో భాగమవుతుంది.
  4. భూగర్భ జలాల్లోని కొంత నీరు ఊటల రూపంలో పైకి వస్తుంది. దాన్నే మనం అవసరం నిమిత్తం బావులు, గొట్టపు . బావుల ద్వారా పైకి తెస్తాం.
  5. సముద్రం, భూమి వాతావరణాల మధ్య నీటి మార్పిడి ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న 3.
నైట్రోజన్ స్థాపన అనగానేమి ? అది ఏ విధముగా జరుగుతుంది?
జవాబు:

  1. వాతావరణంలో థమికంగా జడస్థితి లేదా క్రియారహితంగా ఉండే నత్రజనిని కొన్ని రకాల జీవులు నైట్రోజన్’ సమ్మేళనం స్థిర రూపంలోకి మార్చుతాయి. దీనిని నైట్రోజన్ స్థాపన అంటాం.
  2. చాలా వరకు వాతావరణంలోని నైట్రోజన్ జైవిక పద్ధతుల ద్వారా ‘స్థాపన’ చేయబడుతుంది.
  3. చాలా రకాల సూక్ష్మజీవులు, బాక్టీరియాలు నీలి ఆకుపచ్చ శైవలాలు, నైట్రోజనను తమ శరీరంలో వివిధ సమ్మేళనాల రూపంలో స్థాపన చేసుకోగలవు.
  4. ఈ బాక్టీరియాలో కొన్ని స్వేచ్ఛాస్థితిలో ఉంటాయి. ఉదా : నైట్రో సోమోనాస్ మరికొన్ని సహజీవనం జరిపే బాక్టీరియా. ఉదా : రైజోబియం.
  5. ఈ జీవులు వాతావరణంలోని నైట్రోజన్‌ను తమ సొంత కణాల కొరకు సేంద్రియ రూపంలోకి మార్చుకుంటాయి.
  6. చిక్కుడు జాతి మొక్కలలో మొక్కకి, నైట్రోజన్ స్థాపన బాక్టీరియాకి మధ్య సహజీవనం ఉండటం వలన లెగ్యూమినేసి పంట తరువాత నైట్రోజన్ సమ్మేళనాలు వేలలోకి చేరుతాయి.
  7. ఉరుములు, మెరుపులు సంభవించినపుడు ఆ కాంతి నుండి నైట్రోజన్ నైట్రేటుగా స్థాపన చేయబడుతుంది.

ప్రశ్న 4.
భూమిపైన కార్బన్ ఏయే రూపాలలో లభ్యమవుతుంది?
జవాబు:

  1. భూమిపైన కార్బన్ వివిధ రూపాలలో లభ్యమవుతుంది.
  2. మూలక స్థితిలో, నల్లటి మసిలో వజ్రం, గ్రాఫైట్ రూపాలలో లభ్యమవుతుంది.
  3. సమ్మేళనాల రూపంలో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రూపంలో లభ్యమవుతుంది.
  4. అదే విధంగా వివిధ ఖనిజాలలో కార్బొనేట్, హైడ్రోకార్బొనేట్ లవణాలుగా కూడా లభ్యమవుతుంది.
  5. జీవుల దేహాలు’ కార్బన్ ని కలిగిన అణువులైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లతో నిర్మితమై ఉన్నాయి.
  6. వివిధ జంతువుల అంతర అస్థిపంజరాలు మరియు బాహ్య అస్థిపంజరాలు కూడా కార్బొనేట్ లవణాలతో నిర్మితమై ఉన్నాయి.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 5.
గ్రీన్ హౌజ్ ఎఫెక్టు గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. వాతావరణంలో CO, CO2, మీథేన్ వంటి వాయువులు నీటి ఆవిరి వాతావరణంలో తిరిగి ఉద్గారమయ్యే వేడిని నిల్వచేసుకుంటాయి.
  2. ఇటువంటి సహజ గ్రీన్‌హౌజ్ వాయువులు భూమిచుట్టూ ఒక కంబళిలాగా ఏర్పడి భూమిని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి.
  3. భూమి పైన ఉన్న జీవరాశులు జీవించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి.
  4. ఇలా జరగకపోతే భూమి పైన ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే తక్కువైపోయే ప్రమాదం ఉంది.
  5. ఇటువంటి సహజ సిద్ధమైన వెచ్చదనం ఏర్పాటుచేసే దృగ్విషయాన్ని గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్ అంటారు.

ప్రశ్న 6.
“జీవులకు అవసరమైన ఆక్సిజన్” సూచిక అనగానేమి? క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. నీటిలోని జీవ విఘటన పదార్థాలను ప్రత్యేకమైన సూచిక ద్వారా తెలియచేస్తారు.
  2. ఆ సూచికను “జీవులకు అవసరమయిన ఆక్సిజన్” (Biological Oxygen Demand (BOD)) అంటారు.
  3. వాయుసహిత బాక్టీరియా వ్యర్థ పదార్థాలను కుళ్ళింపచేయడానికి కావలసిన ఆక్సిజన్ మొత్తం పరిమాణాన్ని BOD సూచిస్తుంది.
  4. వ్యర్థ పదార్థాలు విఘటన చెందడానికి నీటిలో కరిగిన ఆక్సిజన్ ఎక్కువగా ఉపయోగించబడినప్పుడు నీటిలో నివసించే జీవులకు ఆక్సిజన్ యొక్క ఆవశ్యకత పెరుగుతుంది అంటే BOD పెరుగుతుంది.
  5. కావున BOD అనునది వ్యర్థాలను విఘటన చెందటాన్ని సూచించే మంచి సూచిక.

ప్రశ్న 7.
కార్బన్ వలయమును వివరించండి.
జవాబు:

  1. కార్బన్ డై ఆక్సైడ్’ కొంత భాగం నీటిలో కరుగుతుంది.
  2. మొక్కలు CO2 ను కిరణజన్య సంయోగక్రియలో వాడుకుంటాయి.
  3. ఇందులో CO2 గ్లూకోజ్ గా మారుతుంది.
  4. కొంత గ్లూకోజ్ కణ శ్వాసక్రియలో వాడుకోబడుతుంది.
  5. మిగిలినది ఇతర పిండిపదార్థాలుగాను, నూనెల రూపంలోకి మార్చబడి వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది.
  6. జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకొన్నప్పుడు, కర్బన పదార్థాలు జీర్ణం అయి శోషణ చేయబడతాయి. జంతువు కణజీవ క్రియలో అవి వాడబడతాయి.
  7. ఈ విధంగా వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ జంతువుల శరీరాల్లోకి చేరుతుంది.
  8. ఈ పదార్థాలు జీవక్రియలో వినియోగించబడి చివరకు CO2 ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
  9. జంతువులు, మొక్కలు చనిపోయిన తరువాత విచ్ఛిన్నకర బాక్టీరియా వీటి శరీర కణాలలోని కర్బన అణువులను CO2 రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1

ప్రశ్న 8.
ఆక్సిజన్ వలయమును క్లుప్తంగా వివరించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 2

  1. నీటిలోని మొక్కలు, జంతువులు కలిగివున్న ఆక్సిజన్ ని శ్వాసక్రియ కోసం వినియోగించుకుంటాయి.
  2. అదే విధంగా భౌమ్య జీవులు గాలిలోని ఆక్సిజనను శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి.
  3. ఈ క్రియలో చివరి పదార్థాలయిన CO2, నీరు తిరిగి గాలిలోకి చేర్చబడతాయి.
  4. మొక్కలు ఈ పదార్థాలను కిరణజన్య సంయోగక్రియకు వినియోగించుకుంటాయి.
  5. ఈ ప్రక్రియలో తయారయిన ఆక్సిజన్ గాలిలోకి వదలబడుతుంది.
  6. కలప, బొగ్గు, పెట్రోలు మొదలయిన పదార్థాలు మండినపుడు CO2 విడుదల అవుతుంది.
  7. ఈ విధంగా O2 మరియు CO2 ల మధ్యనున్న సమతాస్థితి చాలా నాజుకుగా ఉంటుంది.
  8. అందువలన గాలిలోని ఆక్సిజన్ చాలా స్థిరంగా ఉంటుంది. ఈ క్రియలన్నీ కలసి ఆక్సిజన్ వలయం ఏర్పడుతుంది.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Important Questions and Answers

ప్రశ్న 1.
భూతాపాన్ని తగ్గించుటకు ఒక బాధ్యత గల పౌరుడిగా నీవు నీ పాఠశాలలో లేదా గ్రామంలో ఏ చర్యలు పాటిస్తావు ?
జవాబు:

  1. ఇంటి ఆవరణలో, ఖాళీస్థలాలు, పాఠశాల ప్రాంగణాలలో మొక్కలను నాటుతాను.
  2. వాహనాల వాడకాన్ని తగ్గించి సైకిల్‌ను వినియోగిస్తాను.
  3. పత్తి కట్టె, రబ్బరు టైర్లను కాల్చడాన్ని నేను నియంత్రిస్తాను. ఎందుకంటే వీటిని మండిస్తే గ్రీన్ హౌస్ వాయువైన CO2 వాతావరణంలోకి విడుదల అవుతుంది.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 2.
నైట్రిఫికేషన్ అంటే ఏమిటి? ఇది ఏ విధంగా జరుగుతుందో వివరించండి.
జవాబు:

  1. నేలలోని డీ నైట్రిఫైయింగ్ బాక్టీరియాలు నైట్రేట్లను అమ్మోనియా రూపంలో చూరుస్తాయి.
  2. నైట్రిఫైయింగ్ బాక్టీరియా తమ కణాల కొరకు ఈ అమ్మోనియాను ఉపయోగించుకుని, ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, నైటైట్స్, నైట్రేట్స్ గా మార్చుకుంటాయి.
  3. ప్రధానంగా నైట్రో సోమోనాస్ నైటైలను ఉత్పత్తిచేయగా, నైట్రేట్ లను నైట్రోబాక్టర్స్ ఉత్పత్తిచేస్తాయి.
  4. సూక్ష్మజీవులు చనిపోవడం వలన నేలలో నత్రజని సంబంధిత పదార్థాలు కలుపబడుతాయి. నత్రీకరణను క్లుప్తంగా ఈ క్రింది విధంగా చూపవచ్చు.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 3

ప్రశ్న 3.
కాగితం వినియోగాన్ని తగ్గిస్తే కాలుష్యాన్ని తగ్గించినట్లేనని ఎలా చెప్పగలవు?
జవాబు:
1) 1 టన్ను కాగితం తయారీకి 17 పచ్చని చెట్లను నేల కూల్చాల్సి వస్తుంది. అందువల్ల అడవుల నరికివేత జరుగుతుంది.
దీని ఫలితంగా భూతాపం పెరిగి సముద్రమట్టం పెరిగి భూమి మీద గల పల్లపు ప్రాంతాలు జలమయం అవుతాయి. కోట్లాది మంది తమ నివాసాలు కోల్పోయి నిరాశ్రయులు అవుతారు.

2) కాగితాన్ని పునః చక్రీయం చేయడం ద్వారా అడవుల నరికివేతను అరికట్టి అనేక పర్యావరణ దుష్ఫలితాలను ఆపగలిగిన వాళ్ళం అవుతాము.

ప్రశ్న 4.
నత్రీకరణం, వినత్రీకరణంకు గల భేదాలు ఏమిటి?
జవాబు:

నత్రీకరణంవినత్రీకరణం
1) నేలలోని వినత్రీకరణ బాక్టీరియాలు నైట్రేట్లను అమ్మోనియా రూపంలోకి మారుస్తాయి.1) జంతువృక్ష కణాలలోకి చేరిన నత్రజని తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం అంటారు.
2) నేలలో స్థాపించబడిన అమ్మోనియాను నైట్రోసోమో నాస్” నైట్రేట్లను ఉత్పత్తి చేస్తాయి. నైట్రోబాక్టర్ నైట్రేట్లను ఉత్పత్తి చేస్తాయి.2) ఘనరూపంలో ఉన్న నైట్రేట్లపై ఆక్సిజన్ కోసం బాక్టీరియాలు చర్యను వేగవంతం చేసి నైట్రోజన్ వాయువును తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
3) ఇది నీటిని లాగుకొనే నేలల్లో ఎక్కువగా జరుగుతుంది.3) తడి నేలల్లో వినత్రీకరణం ఎక్కువగా జరుగుతుంది.
4) ఈ చర్యలో జీవులు నైట్రేట్లను ఉపయోగించుకొని కేంద్రకామ్లాలుగా మరియు ప్రొటీన్లుగా మార్చుకుంటాయి.4) ఈ చర్య భూవాతావరణంలో నత్రజనిని సమతాస్థితి  చెడకుండా స్థిరంగా ఉంచుతుంది.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. హ్యూవరణం నుండి జీవులకు, జీవుల నుండి హ్యూవరణానికి పోషకాల మార్పిడి వీటి ద్వారా జరుగుతుంది.
A) జీవ భౌగోళిక రసాయనిక వలయాలు
B) జీవ వలయాలు
C) రసాయనిక వలయాలు
D) భౌగోళిక వలయాలు
జవాబు:
A) జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

2. భూమి మీద ఉన్న నీటిలో ఉప్పునీటి శాతం
A) 3%
B) 1%
C) 97%
D) 2%
జవాబు:
B) 1%
C) 97%

3. మానవ శరీరంలో ఉండే నీరు శాతం
A) 80%
B) 70%
C) 90%
D) 10%
జవాబు:
B) 70%

4. జీవరాశి ఏర్పడడానికి కావలసిన సేంద్రియ పదార్థాలలో అతి ముఖ్యమైన మూలకాలు
A) నత్రజని, హైడ్రోజన్
B) హైడ్రోజన్, ఫాస్ఫరస్
C) హైడ్రోజన్, ఆక్సిజన్
D) నత్రజని, ఆక్సిజన్
జవాబు:
C) హైడ్రోజన్, ఆక్సిజన్

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

5. వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న మూలకం
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) నైట్రోజన్
జవాబు:
D) నైట్రోజన్

6. స్వేచ్ఛాస్థితిలో ఉండే ఈ బాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది.
A) నైట్రో సోమోనాస్
B) రైజోబియం
C) నైట్రో బ్యాక్టర్
D) అన్నీ
జవాబు:
A) నైట్రో సోమోనాస్

7. జంతు, వృక్ష కణాలలోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడం
A) అమ్మోనీకరణం
B) వినత్రీకరణం
C) స్వాంగీకరణం
D) నత్రీకరణం
జవాబు:
B) వినత్రీకరణం

8. ఎక్కువ మొత్తంలో నైట్రేట్లు మరియు నత్రజని సంబంధిత పదార్థాలు నదులు, సరస్సులలో చేరినపుడు అధిక మొత్తంలో పెరిగే జీవులు
A) బయో ఫైట్స్
B) శిలీం నాలు
C) శైవలాలు
D) టెరిడోఫైట్స్
జవాబు:
C) శైవలాలు

9. జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నిర్వహించి భూమిని గ్రీన్‌హౌజ్ గా ఉంచడంలో ప్రధానపాత్ర వహించేది
A) ఆక్సిజన్
B) కార్బన్ డై ఆక్సైడ్
C) హైడ్రోజన్
D) నత్రజని
జవాబు:
B) కార్బన్ డై ఆక్సైడ్

10. కార్బన్ ఎక్కువగా ఉన్న నిల్వ పదార్థాలు
A) సెడిమెంటరీ శిలలు
B) సేంద్రియ పదార్థాలు
C) సముద్రాలు
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

11. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్‌హౌజ్ వాయువులు అధిక మొత్తంలో విడుదల కావడానికి కారణాలు
A) శిలాజ ఇంధనాల దహనం, అడవులను నరకడం
B) శిలాజ ఇంధనాల దహనం, పారిశ్రామికీకరణ
C) అడవులను నరకడం, పారిశ్రామికీకరణ
D) శిలాజ ఇంధనాల దహనం, అడవులను నరకడం, పారిశ్రామికీకరణ
జవాబు:
D) శిలాజ ఇంధనాల దహనం, అడవులను నరకడం, పారిశ్రామికీకరణ

12. ఆక్సిజన్ విషంలా పనిచేసే జీవులకు ఉదాహరణ
A) శైవలాలు
B) వైరస్లు
C) బాక్టీరియా
D) అన్నీ
జవాబు:
C) బాక్టీరియా

13. కార్బన్ వ్యర్థాలు విచ్ఛిన్నమవడానికి అవసరం అయ్యే వాయువు
A) హైడ్రోజన్
B) ఆక్సిజన్
C) నత్రజని
D) ఫాస్ఫరస్
జవాబు:
B) ఆక్సిజన్

14. వాతావరణంలో 10 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉన్న పొర
A) స్ట్రాటోస్ఫియర్
B) అయనోస్ఫియర్
C) మీసోస్ఫియర్
D) ట్రోపోస్పియర్
జవాబు:
D) ట్రోపోస్పియర్

15. ఓజోన్నందుండు ఆక్సిజన్‌ పరమాణువుల సంఖ్య
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3

16. ఓజోన్ పొర సూర్యకాంతిలోని ఈ కిరణాలను శోషిస్తుంది.
A) పరారుణ కిరణాలు
B) అతినీలలోహిత కిరణాలు
C) కాస్మిక్ కిరణాలు
D) గామా కిరణాలు
జవాబు:
B) అతినీలలోహిత కిరణాలు

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

17. ఓజోన్ పొర నాశనమగుటకు కారణమయ్యే రసాయనాలు
A) పెస్టిసైడులు
B) కార్బన్ డై ఆక్సైడ్
C) క్లోరోఫ్లోరో కార్బనులు
D) హైడ్రోజన్
జవాబు:
C) క్లోరోఫ్లోరో కార్బనులు

18. ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానము
A) వాషింగ్టన్ ప్రోటోకాల్
B) మాంట్రియల్ ప్రోటోకాల్
C) వాంకోవర్ ప్రోటోకాల్
D) జెనీవా ప్రోటోకాల్
జవాబు:
B) మాంట్రియల్ ప్రోటోకాల్

19. వజ్రంలో ఉండే మూలకం
A) కార్బన్
B) నైట్రోజన్
C) హైడ్రోజన్
D) భాస్వరం
జవాబు:
A) కార్బన్

20. సార్వత్రిక ద్రావణి
A) నీరు
B) ఆల్కహాల్
C) ఈధర్
D) CCl4
జవాబు:
A) నీరు

21. భూమిపైన ఉండే మంచినీటి శాతం (నదులు, సరస్సులలో)
A) 0.0089
B) 0.0090
C) 0.0091
D) 0.0092
జవాబు:
C) 0.0091

22. ఆమ్ల వర్షాలకు కారణం
A) SO2
B) NO2
C) A & B
D) CO2
జవాబు:
C) A & B

23. ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు ఏర్పడటంలో ప్రధాన పాత్ర వహించేది
A) హైడ్రోజన్
B) కార్బన్
C) నత్రజని
D) ఆక్సిజన్
జవాబు:
C) నత్రజని

24. భూమిపై N2 శాతం
A) 72%
B) 78%
C) 75%
D) 76%
జవాబు:
B) 78%

25. వినత్రీకరణ బాక్టీరియాల పని
A) నైట్రేట్స్ → అమ్మోనియాగా మార్చడం
B) అమ్మోనియా → నైట్రేట్
C) నైట్రేట్ → నైట్రీట్
D) నైట్రేటీ → ప్రోటీన్లు
జవాబు:
A) నైట్రేట్స్ → అమ్మోనియాగా మార్చడం

26. నైట్రెసోమోనాస్ తయారుచేసేవి
A) నైట్రేట్లు
B) నైటైట్లు
C) అమ్మోనియా
D) ప్రోటీన్లు
జవాబు:
B) నైటైట్లు

27. అమ్మోనిఫికేషన్లో తయారయ్యేది
A) అమ్మోనియా
B) నైట్రేట్స్
C) నైలైట్స్
D) నత్రజని
జవాబు:
A) అమ్మోనియా

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

28. నల్లటిమసి, వజ్రం, గ్రాఫైట్లలో ఉండేది.
A) నత్రజని
B) ఆక్సిజన్
C) కార్బన్
D) నీరు
జవాబు:
C) కార్బన్

29. గాలిలో CO2 శాతం
A) 0.02%
B) 0.03%
C) 0.04%
D) 0.05%
జవాబు:
C) 0.04%

30. సముద్ర గర్భంలోని కార్బన్ వాతావరణంలోకి తిరిగి రావడానికి పట్టే కాలం
A) 10 మిలియన్ సం||
B) 20 మిలియన్ సం||
C) 30 మిలియన్ సం||
D) 40 మిలియన్ సం||
జవాబు:
A) 10 మిలియన్ సం||

31. గ్రీన్ హౌస్ వాయువు
A) O2
B) CO
C) CO2
D) N2
జవాబు:
C) CO2

32. గ్లోబల్ వార్మింగ్ కు కారణం
A) O2
B) CO2
C) మీథేన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

33. గాలిలో O2 శాతం
A) 20%
B) 21%
C) 22%
D) 23%
జవాబు:
B) 21%

34. దుర్గంధ వాసనలో ఉండే వాయువు
A) H2S
B) NO2
C) SO2
D) CO
జవాబు:
A) H2S

35. B.O.D అనగా
A) బయోలాజికల్ ఆర్గానిక్ డిమాండ్
B) బయోగ్యాస్ ఆర్గానిజం డిమాండ్
C) బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్
D) బయో పెస్టిసైడ్ ఆర్గానిక్ డిమాండ్
జవాబు:
C) బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్

36. వ్యర్థాల విఘటన చెందటాన్ని సూచించే సూచిక
A) B.O.D
B) C.O.D
C) T.O. D
D) A.O.D
జవాబు:
A) B.O.D

37. విమానాల రాకపోకలు జరిగేది.
A) ట్రోపోస్ఫియర్
B) స్ట్రాటోస్ఫియర్
C) అయనోస్ఫియర్
D) పైవేవీ కావు
జవాబు:
B) స్ట్రాటోస్ఫియర్

38. అతినీలలోహిత కిరణాలను శోషించుకునేది
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) ఓజోన్
D) నైట్రోజన్
జవాబు:
B) హైడ్రోజన్

39. A.Cలలో వెలువడేవి
A) క్లోరో ఫ్లోరో కార్బన్లు
B) హైడ్రో కార్బన్లు
C) హేలోజన్లు
D) నత్రజని విష వాయువులు
జవాబు:
A) క్లోరో ఫ్లోరో కార్బన్లు

40. మాంట్రియల్ ఫోటోకాల్ దీనికి సంబంధించినది.
A) జీవవైవిధ్యం
B) పర్యావరణం
C) ఓజోన్ పొర సంరక్షణం
D) అడవుల నరికివేత
జవాబు:
C) ఓజోన్ పొర సంరక్షణం

41. మాంట్రియల్ ప్రోటోకాల్ అమలులోకి వచ్చిన సంవత్సరం
A) 1982
B) 1989
C) 1992
D) 1994
జవాబు:
B) 1989

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

42. భూ ఉపరితలం నుండి ట్రోపోస్పియర్ ఇంత ఎత్తు వరకు వ్యాపించి వుంటుంది.
A) 1000 మీ.
B) 8848 మీ.
C) 100 కి.మీ.
D) 10 కి.మీ.
జవాబు:
D) 10 కి.మీ.

43. పర్యావరణ స్నేహిత చర్య కానిది
A) వ్యర్ధ స్థలాల్లో మొక్కల పెంపకం
B) విద్యుత్ వినియోగం తగ్గించుట
C) కంపోస్ట్ ఎరువు వాడుట
D) వాహనాల వినియోగం పెంచుట
జవాబు:
D) వాహనాల వినియోగం పెంచుట

44. నత్రజని స్థాపన జరగకపోతే ఏమౌతుంది?
1) నేలలో నత్రజని తగ్గిపోతుంది
2) మొక్కలకు నైట్రేట్లు అందవు
3) మొక్కలు, జంతువులు మరణిస్తాయి
4) వాతావరణంలో నత్రజని తగ్గిపోతుంది
పై వాటిలో సరైనవి
A) 1, 2
B) 3, 4
C) 1, 3
D) 1, 4
జవాబు:
A) 1, 2

మీకు తెలుసా?

శ్వాసక్రియకు ఆక్సిజన్ అత్యవసరమని మనం సాధారణంగా అనుకుంటుంటాం. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులకు ఆక్సిజన్ విషంలా పనిచేస్తుంది. నత్రజని స్థాపక బాక్టీరియా ఆక్సిజన్ సమక్షంలో నైట్రోజన్ స్థాపన చేయలేవు.

మాంట్రియల్ ప్రోటోకాల్

ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానమే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది అంటార్కిటికా పైన కనిపించిన ఓజోన్ రంధ్రాన్ని పరిశీలించి ఓజోన్ పొరను నాశనం చేసే వాయువులపై నియంత్రించే విధంగా చర్యలు చేపట్టడానికి అవకాశాన్నిచ్చింది. ఈ అంశానికి అనుగుణంగా ఓజోన్ పొరను తగ్గించే పదార్థాలపై నిషేధం విధిస్తూ Montreal Protocol ఉద్భవించింది. ఈ ఒప్పందంపై 1987లో 24 దేశాలు సంతకాలు చేశాయి. 1989లో ఇది అమలులోకి వచ్చింది. నేటికి 120 దేశాలు ఈ ఒప్పందంలో భాగస్వాములయ్యాయి. ఒప్పందం ఏమిటంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, (Chloro Floro Carbon (CFC)) వాటి ఉత్పన్నాల వంటివి, ఓజోన్ పొరకు నష్టం కలిగించే పదార్థాల ఉత్పత్తి మరియు సరఫరాను నియంత్రించడం. ప్రోటోకాలను సరిచేయడానికి మరల 1992లో కోపెన్ హెగలో సమావేశం జరిగింది. ఈ సమావేశం హాలోకార్బన్ ఉత్పత్తిని 1994 నాటికి, క్లోరోఫ్లోరోకార్బన్స్, CHLORO FLORO CARBON (CFC) ఇతర హాలోకార్బన్లను 1996 నాటికి నిలిపివేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మనం ఈ లక్ష్యాన్ని సాధించలేకపోయాం.

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 2

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

These AP 9th Biology Important Questions and Answers 10th Lesson నేల కాలుష్యం will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 10th Lesson Important Questions and Answers నేల కాలుష్యం

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
నేలలో కలిసిపోని చెత్త గురించి క్లుప్తంగా వివరించండి. ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. ఇవి నేలలో తొందరగా కలిసిపోని వ్యర్థాలు.
  2. ప్లాస్టిక్, గాజు, డిడిటి, అల్యూమినియం కప్పులు వీటికి ఉదాహరణలు.

ప్రశ్న 2.
కుళ్ళిపోవడం అనగానేమి?
జవాబు:
కుళ్ళిపోవడం :
పదార్ధాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న సరళ పదార్థాలుగా మారిపోవడాన్ని కుళ్ళిపోవడం అంటారు.

ప్రశ్న 3.
నేల పై పొర ఎందువలన ప్రధానమైనది?
జవాబు:
నేలలో ఉన్న మూడు క్షతిజాలలో పై పొర ప్రధానమైనది. ఎందుకంటే ఇది భూమి మీద జీవులు జీవించడానికి జీవనానికి ఆధారమైనది.

ప్రశ్న 4.
జైవిక నేల అనగానేమి?
జవాబు:
నేలలో 30 శాతం లేదా అంతకన్న ఎక్కువ జీవ సంబంధ పదార్ధాలను కలిగి ఉండే దానిని జైవిక నేల (Organic Soil) అంటారు.

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 5.
ఆమ్ల, క్షార స్వభావం కల నేలలని వేటిని అంటారు?
జవాబు:
pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలను ఆమ్ల స్వభావం కల నేలలు అని, pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగిన నేలలను క్షార స్వభావం కల నేలలనీ అంటారు.

ప్రశ్న 6.
ఖనిజీకరణం అంటే ఏమిటి?
జవాబు:
నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవసంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మారుస్తాయి. ఈ సమయంలో కార్బన్ డయాక్సెడ్, అమ్మోనియం సల్ఫేట్లు, ఫాస్ఫేట్ లు ఉత్పన్నం అవుతాయి. ఇతర నిరింద్రియ మూలకాలు కూడా ఏర్పడతాయి. ఈ పద్ధతిని ‘ఖనిజీకరణం’ (Mineralization) అంటారు.

ప్రశ్న 7.
జైవిక వ్యవస్థాపనం అంటే ఏమిటి?
జవాబు:
అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లోకి ప్రవేశించడాన్నే జైవిక వ్యవస్థాపనం (Biomagnification) అంటారు.

ప్రశ్న 8.
జైవిక సవరణీకరణ అంటే ఏమిటి?
జవాబు:
జీవ సంబంధం పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ (Bio-Remediation) అంటారు.

ప్రశ్న 9.
ఫైటోరెమిడియేషన్ అంటే ఏమిటి?
జవాబు:
జైవిక సవరణీకరణంలో సూక్ష్మజీవులతో పాటు మొక్కలను కూడా ఉపయోగిస్తారు. దీనిని ఫైటోరెమిడియేషన్ (Phyto – Remediation) అంటారు.

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నేలలో కలిసిపోయే చెత్త గురించి క్లుప్తంగా వివరించి, ఉదాహరణలివ్వంది.
జవాబు:

  1. సూక్ష్మజీవుల వల్ల ప్రమాదం కాని మరియు విషరహితం కాని చెత్తగా మార్చబడే పదార్థాలను నేలలో కలసిపోయే చెత్త పదార్థాలు అంటాం.
  2. ఆకులు, పేడ, చొప్ప, కొమ్మలు వంటి మొక్క మరియు జంతువుల నుండి వచ్చే వ్యర్థాలు మరియు వ్యవసాయంలో వచ్చే వ్యర్థాలు వీటికి ఉదాహరణలు.

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 2.
ఘనరూప వ్యర్థాలు అంటే ఏమిటి? ఘనరూప వ్యర్థాలలోని రకములు ఏవి?
జవాబు:

  1. వివిధ చర్యల ద్వారా సమాజం చేత ఒకసారి వాడుకొని పారేయబడిన కర్బన, ఆకర్బన పదార్థాల వ్యర్థాలన్నింటిని ఘనరూప వ్యర్థాలు అనవచ్చు.
  2. ఘనరూప వ్యర్థాలు అవి ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి మూడు రకాలు. అవి :
    ఎ) మునిసిపల్ వ్యర్థాలు,
    బి) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు,
    సి) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు.

ప్రశ్న 3.
ప్రమాదకర రసాయన వ్యర్థాల వలన కలిగే దుష్ఫలితాలు ఏవి?
జవాబు:
ప్రమాదకర రసాయన వ్యర్థాలు మన చుట్టుపక్కల పేరుకునిపోవడం వలన ఆయా ప్రాంతాల్లోని పిల్లలు అసాధారణ రీతిలో, పుట్టుకతోనే లోపాలు కలిగి ఉండడం, క్యాన్సర్, శ్వాస, నాడీ మరియు కిడ్నీ సంబంధ వ్యాధులకు గురి కావడం జరుగుతున్నది.

ప్రశ్న 4.
నేల కాలుష్యాన్ని ఎలా విభజించవచ్చు?
జవాబు:
నేలలో చేరే వ్యర్థాల ఆధారంగా నేల కాలుష్యాన్ని కింది విధంగా విభజించవచ్చును.

  1. వ్యవసాయం వల్ల నేల కాలుష్యం
  2. పారిశ్రామిక ఘన, ద్రవ వ్యర్థాల వల్ల నేల కాలుష్యం
  3. పట్టణీకరణ వల్ల వెలువడే కాలుష్యం.

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నేల ఏ విధంగా ఏర్పడుతుంది?
జవాబు:

  1. నేల ఏర్పడడం ఒక సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియ. ఒక అంగుళం నేల ఏర్పడడానికి 100 నుండి 10,000 సంవత్సరాలు పడుతుంది.
  2. వాతావరణం, వాటి సహజ స్వరూప లక్షణాలు, దానిలో ఉండే మాతృశిల స్వభావం, సూక్ష్మజీవులు మొదలైనవన్నీ నేలను ఏర్పరచడంలో కారకాలుగా పనిచేస్తాయి.
  3. మాతృశిల క్రమక్షయం చెందడం, నదులు ఇతర ప్రవాహాలు మేటవేయడం, అగాధాలు, పర్వతాలు, గాలి మరియు మంచు కొండలు, వృక్ష సంబంధ వ్యర్థాల వల్ల నేల మాతృ పదార్థాలు ఏర్పడతాయి.
  4. కొంత కాలానికి ఇవి గడ్డకట్టడం, కరిగిపోవడం, పొడిబారడం, తడిసిపోవటం, వేడెక్కడం, చల్లబడడం, క్రమక్షయానికి గురికావడం, మొక్కలు, జంతువులు, ఇతర రసాయన చర్యల వల్ల నేలగా రూపొందుతాయి.

ప్రశ్న 2.
నేలలో ఉండే అంశీభూతములు ఏవి?
జవాబు:

  1. భూమి ఖనిజాలు, క్రమక్షయం చెందిన సేంద్రియ పదార్థాలు గాలి, నీరుతో కలిసి నేల ఏర్పడుతుంది.
  2. నేల అనేక జీవరాసులకు ఆవాసం.
  3. బాక్టీరియా, ఫంగై వంటి జీవులతో పాటు పెద్ద, పెద్ద వృక్షాలు, జంతువులకు కూడా నేల ఆహారాన్ని అందించడంతోపాటు ఒక మంచి ఆవాసంగా ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం 1

ప్రశ్న 3.
నేల రసాయన ధర్మాలు ఏవి? మొక్కలపై రసాయన ధర్మాల ప్రభావం ఏమిటి?
జవాబు:

  1. నేలల ఆమ్ల మరియు క్షార స్వభావాలను తెలుపడానికి pH ప్రమాణాలను ఉపయోగిస్తారు.
  2. మంచి నేలల pH విలువలు 5.5 నుండి 7.5 వరకు ఉంటాయి.
  3. pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలను ఆమ్ల స్వభావం గల నేలలు అని, pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగిన నేలలను క్షార స్వభావం గల నేలలని అంటారు.
  4. నేలలో ఉండే జీవ సంబంధ పదార్థాలు కూడా pH విలువలతో సంబంధం కలిగి ఉంటాయి.
  5. మొక్కకు కావాల్సిన పోషకాల అందుబాటు నేల యొక్క pH విలువపై ఆధారపడి ఉంటుంది.
  6. నేలలో pH విలువ తగ్గే కొద్దీ మొక్కలకు కావలసిన పోషకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్ అందుబాటు కూడా తగ్గుతుంది.

ప్రశ్న 4.
నేల యొక్క జీవ సంబంధ ధర్మాలు ఏవి? మొక్కల పెరుగుదలపై ఇవి ఏ విధమైన ప్రభావం కలిగిస్తాయి?
జవాబు:

  1. భూమి మీద ఉన్న వైవిధ్యభరితమైన ఆవరణ వ్యవస్థలలో నేల ప్రధానమైనది.
  2. నేలలోని వృక్ష సంబంధమైన జీవులు, అతిసూక్ష్మమైన వైరస్ నుండి వానపాముల వరకు, ఎన్నో జీవరాసులు నేలలో జీవిస్తున్నాయి.
  3. బొరియల్లో నివసించే ఎలుకలు, నేల ఉడుతలు వంటి జీవజాలం కూడా ఈ నేలతో సంబంధం కలిగినవి.
  4. నేలలో ఉన్న సూక్ష్మజీవులలో బాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవనులు ముఖ్యమైనవి.
  5. ఇవి వృక్ష సంబంధ వ్యర్థాల మీద ఆధారపడి జీవిస్తూ నేలలోకి గాలి చొరబడడానికి, నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి.
  6. నేలలోని సూక్ష్మజీవులు నేలలో ఉండే రసాయన పదార్థాల పరిమాణాన్ని మరియు ప్రభావాన్ని కూడా నియంత్రిస్తాయి.

ప్రశ్న 5.
పర్యావరణంపై కీటక సంహారిణి డిడిటి యొక్క ప్రభావమేమిటి?
జవాబు:
పర్యావరణంపై కీటక సంహారిణి దిడిటి యొక్క ప్రభావం :

  1. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత చాలా ఎక్కువగా ఉపయోగించబడిన కీటక సంహారకాలు డిడిటీ మరియు గమాక్సిన్లు.
  2. డిడిటి కేవలం కొవ్వులలో మాత్రమే కరుగుతుంది.
  3. నీళ్ళలో కరగకపోవడం వల్ల ఇది ఆహార గొలుసు ద్వారా పక్షులలోకి చేరి వాటిలో కాల్షియం జీవక్రియలకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల పక్షుల గుడ్లపై పెంకులు పలచబడి పగిలిపోతున్నాయి.
  4. దీని ఫలితంగా బ్రౌన్ పెలికాన్, ఓఎస్, డేగ మరియు గద్దలు అంతరించిపోతున్నాయి.
  5. పాశ్చాత్య దేశాలలో ప్రస్తుతం డిడిటి నిషేధించబడినది.

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 6.
శిలీంధ్ర నాశకాలకు ఉదాహరణలివ్వండి. పర్యావరణంపై వీటి ప్రభావమేమిటి?
జవాబు:
శిలీంధ్ర నాశకాలకు ఉదాహరణలు :
DDT, BHC (బెంజీన్ హెక్సాక్లోరైడ్), క్లోరినేటెడ్ హైడ్రోకార్బనులు, ఆర్గనో ఫాస్ఫేట్స్, ఆల్జిన్, మలాథియాన్, టైలిడ్రిన్, ప్యూరో డాన్ మొదలైనవి శిలీంధ్ర నాశకాలకు ఉదాహరణలు.

పర్యావరణంపై వీటి ప్రభావాలు :

  1. శిలీంధ్ర నాశకాలను పంటలపై చల్లినప్పుడు మిగిలిపోయిన వీటి అవశేషాలు నేలలోని మట్టి కణాలలోకి చేరతాయి.
  2. ఇవి ఆ నేలలో పెరిగిన పంట మొక్కలలోకి చేరి కలుషితం చేస్తాయి.
  3. ఈ అవశేషాలతో పెరిగే పంటలను ఆహారంగా తినడం ద్వారా మానవ జీర్ణవ్యవస్థలోనికి చేరి తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను కలుగచేస్తాయి.
  4. ఈ శిలీంధ్ర నాశకాలు జంతువులు మరియు మానవులలో విష” ప్రభావాన్ని కలిగించడమే కాకుండా నేల సారాన్ని తగ్గిస్తాయి.

ప్రశ్న 7.
జైవిక వ్యవస్థాపనం గురించి వివరించండి.
జవాబు:
జైవిక వ్యవస్థాపనం :
AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం 2

  1. మొక్కలకు కావలసిన పోషకాలైన నత్రజని మరియు భాస్వరం సహజంగా లభించే నీటిలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.
  2. నీటిలో పెరిగే వృక్షప్లవకాలు వాటి పెరుగుదల కొరకు అవసరమైన మూలకాలను ఎక్కువ పరిమాణంలో నీటి నుండి సేకరిస్తాయి.
  3. ఆ విధంగా సేకరించేటప్పుడు వృక్ష ప్లవకాలు కరగకుండా మిగిలిన కీటక నాశకాలలోని రసాయనిక పదార్థాలను కూడా సేకరిస్తాయి.
  4. ఇవి నీటిలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. చాలా సున్నిత పరికరాలు కూడా వీటిని కొలవలేవు.
  5. ఈ రసాయనాలు జీవులలో కొద్ది కొద్దిగా పేరుకుపోతాయి.
  6. జీవుల కణాలలో వీటి సాంద్రత నీటిలోని రసాయనాల సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది.
  7. వాతావరణంలో విచ్చిన్నం కాని DDT, BHC లాంటివి జీవుల కొవ్వు కణాలలోకి చేరతాయి.
  8. వృక్ష ప్లవకాలను ఎక్కువగా తినే జంతు ప్లవకాలు, చిన్న చేపలలో ఇవి కొద్దికొద్దిగా చేరి పేరుకొనిపోతాయి.
  9. ఆహారపు గొలుసులోని ప్రతి దశలోని జీవుల్లో దీని సాంద్రత ఎక్కువగా చేరుతూ ఉంటుంది.
  10. ఇలా అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవులలోకి ప్రవేశించడాన్ని జైవిక వ్యవస్థాపనం అంటారు.

ప్రశ్న 8.
మృత్తిక క్రమక్షయం అనగానేమి? దానికి కారణాలేవి?
జవాబు:
మృత్తిక క్రమక్షయం :
గాలి లేదా నీటి ద్వారా మట్టిపై పొరలు కొట్టుకుపోవడాన్ని మృత్తిక క్రమక్షయం అంటారు.

కారణాలు :

  1. చెట్లను నరికివేయడం, వ్యవసాయ విస్తీర్ణం పెంచడం, ఉష్ణోగ్రతలో ఎక్కువ వ్యత్యాసాలు, ఆమ్ల వర్షాలు, మానవుని చర్యలు నేల క్రమక్షయానికి కారణమవుతున్నాయి.
  2. మానవులు నిర్మించే వివిధ నిర్మాణాలు, గనుల తవ్వకం, కలప నరకడం, అధిక పంటలు, అధికంగా పశువులను మేపడం ద్వారా మానవుడు నేల క్రమక్షయాన్ని అధికం చేస్తున్నాడు.
  3. ఇది వరదలకు దారితీసి దీనివల్ల మృత్తిక క్రమక్షయం అధికమైనది.

ప్రశ్న 9.
నగరాలలో చెత్తను సరిగా సేకరించకపోవడం వలన కలిగే సమస్యలేవి?
జవాబు:
నగరాలలో చెత్తను సరిగా సేకరించకపోవడం వలన కలిగే సమస్యలు :

  1. కాల్వల్లో నీరు ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడటం వలన మామూలుగా ప్రవహించవలసిన నీరు ఆగిపోయి మురికి నీరు రోడ్లను ముంచెత్తడం, భవనాల పునాదులకు ప్రమాదం వాటిల్లడం, దోమల వ్యాప్తి.
  2. ఆరోగ్యానికి ప్రమాదకారిగా మారుతుంది.
  3. ఒకే ప్రదేశంలో వ్యర్థాలన్నీ పారవేయడం వల్ల దుర్వాసన రావడం.
  4. సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో పెరిగి కర్బన పదార్థాలు ఎక్కువ మొత్తంలో మీథేన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
  5. ఆసుపత్రి నుండి విడుదలయ్యే ఘనరూప వ్యర్థాలు ఆరోగ్య సమస్యలను ఉత్పన్నం చేస్తాయి.

ప్రశ్న 10.
జైవిక సవరణీకరణ అంటే ఏమిటి? దాని వలన ఉపయోగమేమిటి?
జవాబు:
జైవిక సవరణీకరణ :
జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అంటారు.

ఉపయోగాలు :

  1. అవక్షేపాలు, నేల, నీరు మొదలైన వాటిలో ఏర్పడే పర్యావరణ సమస్యలను తొలగించుకోవడానికి సాధారణంగా సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు.
  2. జైవిక సవరణీకరణలో సూక్ష్మజీవులతోపాటు మొక్కలను కూడా ఉపయోగిస్తారు. దీనిని ఫైటోరిమిడియేషన్ అంటారు.
  3. లోహాల వంటి అకర్బన పదార్థాలు, తక్కువ స్థాయిలో గల రేడియోధార్మిక పదార్థాలు వంటి వాటి ద్వారా కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి జైవిక పద్ధతులను ఉపయోగిస్తారు.

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం 3

ప్రశ్న 11.
నేలను సంరక్షించడానికి ఉపయోగపడే మార్గాలను, పద్ధతులను తెలపండి. వాటిని క్లుప్తంగా వివరించండి.
జవాబు:
నేల సంరక్షణ చర్యలు :
1. మొక్కలు పెంచడం, 2. గట్టు కట్టడం, 3. దున్నకుండా వ్యవసాయం చేయడం, 4. కాంటూర్ వ్యవసాయం, 5. పంట మార్పిడి, 6. నేలలో ఉదజని సూచిక (pHI), 7. నేలకు నీరు పెట్టడం, 8. క్షారత్వ నిర్వహణ, 9. నేలలో ఉండే జీవులు, 10. సంప్రదాయ పంటలు.

1) మొక్కలను పెంచడం :
a) మొక్క వేరు నేల లోపలికి విస్తరించి నేల కోరివేతకు గురికాకుండా కాపాడుతాయి.
b) నేలను కప్పి ఉన్న మొక్కలు నేలను క్రమక్షయం కాకుండా ఉంచడమే కాకుండా గాలి వేగాన్ని కూడా అదుపు చేస్తాయి.

2) గట్టు కట్టడం :
కొండవాలు ప్రాంతాలలో గట్లను నిర్మించడం వలన వర్షాకాలంలో వేగంగా పారే వర్షపు నీటితోపాటు మట్టి కొట్టుకొని పోకుండా గట్లు నిరోధిస్తాయి. ఎక్కడి నేల అక్కడే నిలిచిపోతుంది.

3) దున్నకుండా వ్యవసాయం చేయడం :
a) నేలలో ఎరువులు వేయడానికి చాళ్ళను దున్నడం పనికి వస్తున్నప్పటికీ దీనివలన నేలలో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి.
b) అందువలన నత్రజని స్థాపన తగ్గిపోతుంది.
c) కాబట్టి దున్నకుండా వ్యవసాయం చేసే పద్ధతులు పాటించి నేల సారం కాపాడుకోవచ్చు.

4) కాంటూర్ వ్యవసాయం :
a) నేలలో వాలుకు అడ్డంగా పొలం దున్ని వ్యవసాయం చేయడం.
b) ఇది వర్షాకాలంలో ప్రవహించే నీటి వేగాన్ని తగ్గించి నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది.

5) పంట మార్పిడి :
పంట మార్పిడి పద్ధతి ద్వారా నేల సారం కాపాడుకోవడంతోపాటు పంట దిగుబడి కూడా పెంచవచ్చు.

6) నేలలో ఉదజని సూచిక (pH) :
a) నేల pH విలువను బట్టి మొక్కలు తీసుకొనే పోషకాల పరిమాణం అధారపడి ఉంటుంది.
b) నేల pH మారకుండా చూసినట్లయితే నేల సారం సంరక్షించబడుతుంది.

7) నేలకు నీరు పెట్టడం :
మొక్కలతోపాటు నేలకు నీరు పెట్టడం ద్వారా గాలికి నేల క్రమక్షయం కాకుండా కాపాడుకోవచ్చు.

8) క్షారత్వ నిర్వహణ :
a) నేలలోని క్షార స్వభావం నేలపై పెరిగే మొక్కలపై ప్రభావితం చూపుతాయి. అందువల్ల మొక్కలు చనిపోతాయి.
b) ఇది నేల క్రమక్షయానికి దారితీస్తుంది.

9) నేలలో ఉండే జీవులు :
నేలలో ఉండే జీవులు నేల స్వభావాన్ని మెరుగుపరుస్తాయి. మొక్కలకు అందుబాటులోకి వచ్చేలా చేస్తాయి.

10) సంప్రదాయ పంటలు :
నేలలను కాపాడుకోవడంలో స్థానిక పంటలు ముఖ్యపాత్ర వహిస్తాయి.

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 12.
వ్యవసాయంపై నేల కాలుష్య ప్రభావాలు ఏవి?
జవాబు:
వ్యవసాయంపై నేల కాలుష్య ప్రభావాలు :

  1. నేల సారం తగ్గిపోతుంది.
  2. నేలలో నత్రజని స్థిరీకరణ తగ్గిపోతుంది.
  3. నేల క్రమక్షయం పెరుగుతుంది.
  4. నేలలోని పోషకాలు అధికంగా నష్టమవుతాయి.
  5. నదులు, చెరువుల్లో పూడిక పెరిగిపోతుంది.
  6. పంట దిగుబడి తగ్గిపోతుంది.

ప్రశ్న 13.
పరిశ్రమల ద్వారా కలిగే నేల కాలుష్య ప్రభావాలు ఏవి?
జవాబు:
పరిశ్రమల ద్వారా కలిగే నేల కాలుష్య ప్రభావాలు :

  1. భూగర్భ జలాలు విష రసాయనాలతో కలుషితమవుతాయి.
  2. ఆవరణ వ్యవస్థలలో అసమతుల్యత ఏర్పడుతుంది.
  3. విషపూరిత వాయువులు వెలువడతాయి.
  4. ఆరోగ్యానికి హాని కలిగించే రేడియోధార్మిక కిరణాలు విడుదల అవుతాయి.
  5. నేలలో క్షార స్వభావం పెరిగిపోతుంది.
  6. వృక్షజాలం తగ్గిపోతుంది.

ప్రశ్న 14.
నగరాలలో నేల కాలుష్య ప్రభావ ఫలితాలు ఏవి?
జవాబు:
నగరాలలో నేల కాలుష్య ప్రభావ ఫలితాలు :

  1. మురుగు నీటి కాలువలు మూసుకుపోతాయి.
  2. పరిసరాలు నివాసయోగ్యం కాకుండా పోతాయి.
  3. ప్రజా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
  4. తాగునీటి వనరులు కలుషితం అవుతాయి.
  5. చెడు వాసన గల వాయువులు వెలువడుతాయి.
  6. వ్యర్థ పదార్థాల నిర్వహణ కష్టమవుతుంది.

ప్రశ్న 15.
నేల కాలుష్యం కలిగించే కారకాలను, వాటిని తొలగించే పద్ధతులను వివరించండి.
జవాబు:
నేలలో చేరే వ్యర్థాల ఆధారంగా నేల కాలుష్యాన్ని ఈ కింది విధంగా విభజించవచ్చు. అవి :

  1. వ్యవసాయం వల్ల నేల కాలుష్యం
  2. పారిశ్రామిక ఘన, ద్రవ వ్యర్థాల వల్ల నేల కాలుష్యం
  3. పట్టణీకరణ వల్ల వెలువడే కాలుష్యం

కాలుష్య కారకాలను తొలగించే పద్ధతులు :

  1. నగరాల్లో ఏర్పడే చెత్తలో అధికంగా కాగితాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు వంటి వాటిని పునఃచక్రీయ పద్ధతి ద్వారా కాని, నేలలోకి విచ్ఛిన్నం చేయించడం ద్వారా కాని నిర్మూలించవచ్చు / తొలగించవచ్చు.
  2. వ్యవసాయంలో ఏర్పడే అధిక వ్యర్థాలను పునఃచక్రీయ పద్ధతిలో వాడుకోవచ్చు.
  3. ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వ్యర్థాల సేకరణ, అనుకూలమైన ప్రదేశాలకు రవాణా చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించని పద్ధతుల ద్వారా తొలగించడం అనే దశలు పాటించాలి.
  4. పరిశ్రమల వ్యర్థాలను భౌతిక, రసాయనిక, జైవిక పద్ధతుల ద్వారా తక్కువ హాని కలిగించే విధంగా మార్చాలి.
  5. ఆమ్ల, క్షార వ్యర్థాలను మొదట తటస్థీకరించాలి. నీటిలో కరగని, నేలలోకి చేరిపోయే వ్యర్థాలను నియంత్రిత స్థితిలో పారవేయాలి.
  6. ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వాటికి నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో గోతులను తీసి పూడ్చివేయడ మనేది అందరికి తెలిసిన పద్ధతి.
  7. ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడాన్ని పైరాలసిస్ అంటారు. ఇది కాల్చడానికి ఉపయోగించే ఇన్ సినరేషనకు ప్రత్యామ్నాయ పద్ధతి.
  8. పట్టణాల, గృహాల నుండి వెలువడే చెత్తను వాయుసహిత, అవాయు పరిస్థితులలో జీవ సంబంధిత నశించిపోయే వ్యర్థాలను కుళ్ళింప చేయడం ద్వారా జీవ ఎరువులు తయారు చేస్తారు.
  9. జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అంటారు.

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Important Questions and Answers

ప్రశ్న 1.
ఫ్లోరోసిస్ నివారణ చర్యలు ఏవైనా రెండు రాయండి.
జవాబు:

  1. భూగర్భజలాల వినియోగం ఆపివేసి భూ ఉపరితలం పై ప్రవహించే నదులు, కాలువల నీటిని ఉపయోగించాలి. తక్కువ ఫ్లోరిన్ శాతం కలిగిన భూగర్భ జలాలను, వర్షపు నీటిని వాడవచ్చు.
  2. త్రాగేనీటి నుండి అధిక మొత్తంలో ఉన్న ఫ్లోరైడ్స్ ను డీఫ్లోరిడేషన్ ప్రక్రియ ద్వారా తొలగించాలి.

ప్రశ్న 2.
ఈ క్రింది పటాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం 5
ఎ) తక్కువ కాలుష్య కారకం ఏది?
జవాబు:
చెత్త 1%

బి) పై కాలుష్య కారకాలలో నేలలో కలిసిపోయేవి ఏవి?
జవాబు:
సేంద్రియ వ్యర్థాలు, చెత్త, కాగితం

సి) నిర్మాణపరమైన నేల కాలుష్య కారకాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
నిర్మాణాల కూల్చివేతలు, లోహలు

డి) నేల కాలుష్య నివారణ చర్యలు రెండింటిని సూచించండి.
జవాబు:

  1. 4R సూత్రాన్ని నిత్యజీవితంలో ఉపయోగించడం.
  2. ఘన రూప వ్యర్థాల సమగ్ర యాజమాన్యం

ప్రశ్న 3.
ఫ్లోరైడ్ ఆరోగ్యానికి హానికరమని నీకు తెలుసుకదా! మరి మీ గ్రామంలో ఫ్లోరైడ్ సంబంధిత వ్యాధులు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటావు.?
జవాబు:

  1. సాధ్యమైనంత వరకు బావి నీరు కాకుండా నదులలో, వాగులలో ఉండే నీటిని త్రాగాలి.
  2. డీఫ్లోరిడేషన్ చేయబడిన నీటిని మాత్రమే త్రాగాలి.
  3. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంత భూములలో పండిన కాయగూరలను తినకూడదు. వాటిని దూరంగా ఉంచాలి.

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 4.
ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఆటంకం కలిగిస్తాయని నీకు తెలుసుకదా ! మరి వాటికి బదులుగా నీవేం ఉపయోగిస్తావు?
జవాబు:
ప్లాస్టిక్ సంచులకు బదులు, జనపనారతో లేదా గుడ్డతో చేసిన సంచులను వాడతాను.

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. నేల వీటితో ఏర్పడుతుంది.
A) ఖనిజాలు
B) సేంద్రియ పదార్థం
C) నీరు మరియు గాలి
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

2. భూమి మీద గల ఒక అంగుళం పై పొర ఏర్పడడానికి పట్టే కాలం
A) 100 నుండి 1000 సంవత్సరాలు
B) 100 నుండి 10,000 సంవత్సరాలు
C) 100 నుండి 5000 సంవత్సరాలు
D) 100 నుండి 15,000 సంవత్సరాలు
జవాబు:
B) 100 నుండి 10,000 సంవత్సరాలు

3. భూమి మీద జీవులు జీవించడానికి, జీవనానికి ఆధారమైన నేల పొర
A) మధ్య పొర
B) కింది పొర
C) పై పొర
D) అన్ని పొరలూ
జవాబు:
C) పై పొర

4. మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు
A) నత్రజని
B) ఫాస్పరస్
C) పొటాషియం
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

5. pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేల స్వభావం
A) ఆమ్ల స్వభావం
B) క్షార స్వభావం
C) లవణ స్వభావం
D) సేంద్రియ నేల
జవాబు:
A) ఆమ్ల స్వభావం

6. క్షార స్వభావం గల నేల pH విలువ
A) 7 కన్నా ఎక్కువ
B) 7 కన్నా తక్కువ
C) 8 కన్నా ఎక్కువ
D) 8 కన్నా తక్కువ
జవాబు:
A) 7 కన్నా ఎక్కువ

7. నేలలో ఎక్కువ సంఖ్యలో ఉన్న సూక్ష్మజీవుల సమూహాలు
A) బాక్టీరియా, శిలీంధ్రాలు
B) బాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలు
C) బాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలు మరియు ప్రోటోజోవన్లు
D) బాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు
జవాబు:
D) బాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు

8. సేంద్రియ స్థితిలో ఉన్న జీవ సంబంధ మూలకాలను నిరింద్రియ పదార్థాలుగా సూక్ష్మజీవులు మార్చే ప్రక్రియ
A) జీవ భౌతిక, రసాయనిక వలయాలు
B) ఖనిజీకరణం
C) పైరాలసిస్
D) ఇన్‌సినరేషన్
జవాబు:
B) ఖనిజీకరణం

9. నేలలో విస్తరించి ఉండే సూక్ష్మజీవులలో అధిక భాగం వీటితోనే ఏర్పడి ఉంటుంది.
A) శైవలాలు
B) శిలీంధ్రాలు
C) బాక్టీరియా
D) ప్రోటోజోవా
జవాబు:
B) శిలీంధ్రాలు

10. సూక్ష్మజీవుల వల్ల ప్రమాదం కాని మరియు విషరహితం కాని చెత్తగా మార్చబడే పదార్థాలు
A) ఘనరూప వ్యర్థ పదార్థాలు
B) నేలలో కలసిపోని చెత్త
C) నేలలో కలసిపోయే చెత్త
D) ద్రవరూప వ్యర్థ పదార్థాలు
జవాబు:
C) నేలలో కలసిపోయే చెత్త

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

11. పొటాషియం ఎక్కువగా ఉండే నేలల్లో పండే ఈ ఆహార పదార్థాలలో విటమిన్ ‘C మరియు కెరోటిన్ పరిమాణం తగ్గుతున్నది.
A) కూరగాయలు
B) పండ్లు
C) ధాన్యాలు
D) కూరగాయలు, పండ్లు
జవాబు:
D) కూరగాయలు, పండ్లు

12. రెండో ప్రపంచ యుద్ధం తరువాత చాలా ఎక్కువగా ఉపయోగించబడిన కీటక సంహారిణి
A) DDT
B) BHC
C) మలాథియాన్
D) నువక్రాన్
జవాబు:
A) DDT

13. అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవులలోకి ప్రవేశించడం
A) ఇన్‌సినరేషన్
B) పైరాలసిస్
C) జైవిక వ్యవస్థాపనం
D) జైవిక సవరణీకరణ
జవాబు:
C) జైవిక వ్యవస్థాపనం

14. ఘనరూప వ్యర్థాలు ఎక్కువ కావటానికి కారణం
A) జనాభా పెరుగుదల
B) నగరీకరణ
C) A మరియు B
D) ఆధునికీకరణ
జవాబు:
C) A మరియు B

15. ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
A) ఇళ్ళ నుండి వచ్చే వ్యర్థాలు
B) పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు
C) పారిశుద్ధ్యం వల్ల వచ్చే వ్యర్థాలు
D) ఇళ్ళ నిర్మాణం వ్యర్థాలు
జవాబు:
B) పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు

16. నేలను గట్టిగా పట్టి ఉంచడం ద్వారా నేల క్రమక్షయానికి, గురి కాకుండా కాపాడేవి
A) అడవులు
B) గడ్డి మైదానాలు
C) అడవులు, గడ్డి మైదానాలు
D) ఏదీకాదు
జవాబు:
C) అడవులు, గడ్డి మైదానాలు

17. మన దేశములో ప్రతిరోజూ పట్టణాలలో ఏర్పడే ఘనరూప వ్యర్థాల పరిమాణం
A) 50,000 నుండి 80,000 మెట్రిక్ టన్నులు
B) 5,000 నుండి 8,000 మెట్రిక్ టన్నులు
C) 500 నుండి 800 మెట్రిక్ టన్నులు
D) 600 నుండి 800 మెట్రిక్ టన్నులు
జవాబు:
A) 50,000 నుండి 80,000 మెట్రిక్ టన్నులు

18. సేంద్రియ వ్యర్థాలను సూక్ష్మజీవులు కుళ్ళింపచేయుట
A) ఈథేన్
B) ప్రొపేన్
C) మిథేన్
D) ఎసిటిలీన్
జవాబు:
C) మిథేన్

19. మనుష్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలిగించే విషపూరిత లోహం
A) బంగారం
B) వెండి
C) సీసం
D) రాగి
జవాబు:
C) సీసం

20. నేల కాలుష్యమును ఈ విధముగా నివారించవచ్చు.
A) రసాయన ఎరువులు, పురుగు మందులు తక్కువగా వాడడం
B) నేల క్రమక్షయం చెందకుండా చూడడం కోసం పరిమిత సంఖ్యలో నిర్మాణాలు
C) తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, మరల వాడుకునేందుకు వీలుగా మార్చడం, తిరిగి చేయడం
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

21. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే తలసరి చెత్త పరిమాణం
A) 264 గ్రా.
B) 364 గ్రా.
C) 634 గ్రా.
D) 346 గ్రా.
జవాబు:
B) 364 గ్రా.

22. ఘనరూప వ్యర్థాల నిర్వహణలో ఇది అత్యంత ఎక్కువ వినియోగంలో ఉన్న పద్ధతి.
A) వ్యర్థాలను పూడ్చివేయడం
B) వ్యర్థాలను మండించడం
C) ఇన్‌సినరేషన్
D) పైరాలసిస్
జవాబు:
A) వ్యర్థాలను పూడ్చివేయడం

23. ఘనరూప వ్యర్థాల నిర్వహణలో ఖరీదైనది మరియు గాలి కాలుష్యానికి కారణమయ్యే పద్ధతి
A) వ్యర్థాలను పూడ్చివేయడం
B) పైరాలసిస్
C) ఇన్ సినరేషన్
D) బయోరిమిడియేషన్
జవాబు:
C) ఇన్ సినరేషన్

24. జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడం.
A) పైరాలసిస్
B) ఇన్ సినరేషన్
C) జైవిక వ్యవస్థాపనం
D) జైవిక సవరణీకరణ
జవాబు:
D) జైవిక సవరణీకరణ

25. బాష్పీభవనం ద్వారా మొక్కల నుండి నేరుగా వాతావరణములోకి వెలువడే లోహాలు
A) సీసం, పాదరసం వలన విడుదల అయ్యే వాయువు
B) పాదరసం, సెలినియమ్
C) సెలినియమ్, సీసం
D) ఆంటిమొని, పాదరసం
జవాబు:
B) పాదరసం, సెలినియమ్

26. ఎక్కువ మొత్తంలో నేల కాలుష్యం జరిగే సందర్భాలు
A) భూకంపాలు, వరదలు
B) నేల పరియలు కావడం, తుపానులు
C) భూకంపాలు, వరదలు, నేల పరియలు కావడం
D) భూకంపాలు, వరదలు, నేల పరియలు కావడం, తుపానులు
జవాబు:
D) భూకంపాలు, వరదలు, నేల పరియలు కావడం, తుపానులు

27. ఈ పద్ధతి నేలలో నీరు ఇంకదానికి ఎంతగానో సహకరిస్తుంది.
A) దున్నకుండా వ్యవసాయం చేయడం
B) కాంటూర్ వ్యవసాయం
C) పంట మార్పిడి
D) మొక్కలు పెంచడం
జవాబు:
B) కాంటూర్ వ్యవసాయం

28. నేలలో దీని విలువను బట్టి మొక్కలు తీసుకునే పోషకాల పరిమాణం ఆధారపడి ఉంటుంది.
A) నేల స్వభావం
B) నేలలో ఉదజని సూచిక
C) నేలలో ఉండే జీవులు
D) క్షారత్వ నిర్వహణ
జవాబు:
B) నేలలో ఉదజని సూచిక

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

29. 8 అంగుళాల పై పొర మందంగల ఒక ఎకరా భూమి నందు ఉండే వానపాముల సంఖ్య
A) 5,000
B) 50,000
C) 15,000
D) 17,000
జవాబు:
B) 50,000

30. ఆరోగ్యవంతమైన నేల అంటే
A) నేల సారవంతంగా ఉండటం
B) నేలలో పంటలు బాగా పండటం
C) ఆ నేలలో ఆహారోత్పత్తులు తిన్న ప్రాణులు ఆరోగ్యంగా ఉండటం
D) నేల కాలుష్యం కాకుండటం
జవాబు:
C) ఆ నేలలో ఆహారోత్పత్తులు తిన్న ప్రాణులు ఆరోగ్యంగా ఉండటం

31. సేంద్రియ పదార్థాలలో హ్యూమస్ శాతం
A) 60%
B) 70%
C) 80%
D) 90%
జవాబు:
C) 80%

32. భూమి మీద ఒక అంగుళం పొర ఏర్పడటానికి పట్టే కాలం
A) 100 సం||
B) 1000 సం||
C) 100 – 1000 సం||
D) 100-10,000 సం||
జవాబు:
D) 100-10,000 సం||

33. నేలలో 30% కన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలు ఉంటే
A) జైవిక నేలలు
B) ఖనిజపరమైన నేలలు
C) ఆమ్ల నేలలు
D) క్షార నేలలు
జవాబు:
A) జైవిక నేలలు

34. మంచి నేలలకు ఉండవలసిన pH విలువ
A) 4.5-5. 5
B ) 5.5-6.5
C) 5.5-7.5
D) 6.5-7.5
జవాబు:
C) 5.5-7.5

35. నేల pH విలువ తగ్గటానికి కారణం
A) సూక్ష్మజీవుల చర్య తగ్గిపోవటం
B) నేల క్రమక్షయం చెందటం
C) A & B
D) పైవేవీ కావు
జవాబు:
C) A & B

36. ఖనిజీకరణం అనగా
A) సేంద్రీయ మూలకాలు ఏర్పడటం
B) నిరీంద్రీయ మూలకాలేర్పడటం
C) రెండూ ఏర్పడటం
D) పైవేవీ కావు
జవాబు:
C) రెండూ ఏర్పడటం

37. భూమి, గాలి, నేల, నీరు ఇవి వారసత్వ సంపద కాదు. అలాగని అప్పు కాదు. వీటిని ఎలా పొందామో అదే రూపంలో తరువాత తరానికి అందించవలసిన బాధ్యత ఉన్నది అని అన్నది ఎవరు?
A) గాంధీ
B) నెహ్రూ
C) సుందర్ లాల్ బహుగుణ
D) మేధా పాట్కర్
జవాబు:
A) గాంధీ

38. వీటిలో నేలలో తొందరగా కలిసిపోయేవి.
A) DDT
B) అల్యూమినియం కప్పులు
C) ఆకులు
D) గాజు
జవాబు:
C) ఆకులు

39. నేలలో విచ్ఛిన్నం అయ్యే లోహం
A) ఇనుము
B) ఆర్సినిక్
C) లెడ్
D) కాడ్మియం
జవాబు:
A) ఇనుము

40. మిశ్రమ ఎరువుల్లో ఉండేవి
A) అమ్మోనియం నైట్రేట్
B) పొటాషియం పెంటాక్సెడ్
C) పొటాషియం ఆక్సెడ్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

41. చాలా సంవత్సరాలుగా NPK ఎరువులు వాడటం ద్వారా
A) వంటలు, కూరగాయల దిగుబడి తగ్గిపోతుంది.
B) గోధుమ, మొక్కజొన్న, పప్పుధాన్యాలలో ప్రోటీన్ల పరిమాణం తగ్గును.
C) పొటాషియం ఎక్కువగా ఉన్న నేలలో పండే పండ్లలో విటమిన్ ‘సి’ మరియు కెరోటిన్ పరిమాణం తగ్గుతాయి.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

42. DDT అనగా
A) డై క్లోరో డై ఫినైల్ టై క్లోరో ఈథేన్
B) డై క్లోరో డై ఫినైల్ ట్రై క్లోరో మీథేన్
C) డై క్లోరో డై ఫినైల్ టైఫ్లోరో ఈథేన్
D) డై క్లోరో డై ఫినైల్ ట్రై ఫ్లోరో మీథేన్
జవాబు:
A) డై క్లోరో డై ఫినైల్ టై క్లోరో ఈథేన్

43. పక్షి గుడ్లలోని ‘పెంకు పలచబడి పగలిపోవటానికి కారణం
A) B.H.C
B) డైలిడ్రిన్
C) ఆల్జిన్
D) D.D.T
జవాబు:
D) D.D.T

44. ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి కాలుష్యాలు సాంద్రీకృతమవడం
A) జైవిక వ్యవస్థాపనం
B) జైవిక వృద్ధీకరణం
C) జైవిక సవరణీకరణ
D) వృక్ష సవరణీకరణ
జవాబు:
B) జైవిక వృద్ధీకరణం

45. సూక్ష్మజీవులతోపాటు మొక్కలను ఉపయోగించి కాలుష్య కారకాలను తొలగించడం
A) జైవిక సవరణీకరణ
B) జైవిక వృద్ధీకరణం
C) జైవిక వ్యవస్థాపనం
D) వృక్ష సవరణీకరణ
జవాబు:
D) వృక్ష సవరణీకరణ

46. ఇళ్ళ నుండి వచ్చే వ్యర్థాలు
A) మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు
B) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
C) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు
D) పైవేవీ కావు
జవాబు:
A) మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు

47. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు
A) మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు
B) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
C) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు
D) పైవేవీ కావు
జవాబు:
B) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు

48. ఆపరేషన్ థియేటర్ వ్యర్థాలు సూదులు, సిరంజిలు
A) మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు
B) ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
C) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు
D) పైవేవీ కావు
జవాబు:
C) సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు

49. నేల జీవరసాయన ధర్మాలను మార్చి మంచినీటి వనరులను కలుషితం చేసేవి
A) హానికరమైన నూనెలు
B) భారలోహాలు
C) కర్బన ద్రావణాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

50. అటవీ భూములను ఈ విధంగా పిలుస్తారు.
A) కార్బన్ సింక్స్
B) ఆక్సిజన్ సింక్స్
C) హైడ్రోజన్ సింక్స్
D) వాటర్ సింక్స్
జవాబు:
A) కార్బన్ సింక్స్

51. పిల్లల్లో తెలివితేటలు తగ్గిపోటానికి కారణమయ్యే విషపూరిత భారలోహం
A) పాదరసం
B) సీసం
C) లెడ్
D) కాడ్మియం
జవాబు:
B) సీసం

52. ఘనరూప వ్యర్థాలను తగ్గించే పద్ధతి
A) తిరిగి ఉపయోగించటం
B) మరల వాడుకునేందుకు వీలుగా మార్చటం
C) తిరిగి చేయటం
D) పైవన్నీ
జవాబు:
B) మరల వాడుకునేందుకు వీలుగా మార్చటం

53. ఒక టన్ను కాగితం తయారీకి కావలసిన చెట్ల సంఖ్య
A) 17
B) 27
C) 37
D) 47
జవాబు:
A) 17

54. 2021 నాటికి చెత్తనంతా పారవేయడానికి మన రాష్ట్రానికి కావలసిన స్థలం
A) 344 చ.కి.మీ
B) 444 చ.కి.మీ
C) 544 చ.కి.
D) 644 చ.కి.మీ
జవాబు:
C) 544 చ.కి.

55. ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడం
A) కంబశ్చన్
B) బర్నింగ్
C) పైరాలసిస్
D) ఎలక్ట్రాలిసిస్
జవాబు:
C) పైరాలసిస్

56. పేడ నుండి వెలువడే వాయువు
A) మీథేన్
B) ఈథేన్
C) ప్రోపేన్
D) బ్యూటేన్
జవాబు:
A) మీథేన్

57. నేల కాలుష్యం జరిగే సహజ పద్దతి
A) భూకంపాలు
B) వరదలు
C) తుపానులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

58. కాంటూర్ వ్యవసాయం ఇక్కడ చేస్తారు.
A) అడవులు
B) మైదానాలు
C) కొండలు
D) ఎడారులు
జవాబు:
C) కొండలు

59. క్రింది వానిలో సహజ వనరు
A) గాలి
B) నీరు
C) నేల
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

60. నేల క్రమక్షయాన్ని వేగవంతం చేసేవి
A) అడవుల నరికివేత
B) ఉష్ణోగ్రత వ్యత్యాసాలు
C) మానవ చర్యలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

61. వానపాము విసర్జితాలలో NPKలు సాధారణ నేలకన్నా ఎంత ఎక్కువగా ఉంటాయి?
A) 5, 7, 11
B) 3, 5, 7
C) 7, 9, 11
D) 5, 7, 9
జవాబు:
A) 5, 7, 11

62. పశువుల పెంపకంలో ఉపయోగించే పురుగు
A) మిడత
B) పేడపురుగు
C) గ్రోమోర్
D) వానపాము
జవాబు:
B) పేడపురుగు

63. ఒకేసారి పేడపురుగు తన బరువుకన్నా ఎన్ని రెట్ల పేడను నేలలో పూడ్చగలదు?
A) 100
B) 150
C) 200
D) 250
జవాబు:
D) 250

64. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గటం, స్త్రీలలో రొమ్ము కేన్సర్ కి కారణం
A) ప్లాస్టిక్
B) రసాయనాలు
C) పురుగుమందులు
D) హార్మోన్లు
జవాబు:
A) ప్లాస్టిక్

65. ప్లాస్టిక్ పునఃచక్రీయ సంస్థలు కల దేశం
A) జపాన్
B) మలేషియా
C) A మరియు B
D) చైనా
జవాబు:
C) A మరియు B

66. భూమి మీద జీవులు జీవించడానికి, జీవనానికి ఆధారమైన నేలపొర
A) మధ్యపొర
B) క్రిందిపొర
C) పైపొర
D) అన్ని పొరలు
జవాబు:
C) పైపొర

67. P.V.C. ప్లాస్టిక్ ను మండించడం వల్ల వెలువడేవి
A) హైడ్రోకార్బన్లు
B) హేలోజన్లు
C) డయాక్సిన్, ఫ్యూరాన్లు
D) క్లోరో ఫ్లోరో కార్బన్లు
జవాబు:
C) డయాక్సిన్, ఫ్యూరాన్లు

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం

68. కింది వాటిలో నేల కాలుష్య కారకం కానిది
A) కూరగాయల తొక్కలు
B) ఆమ్లవర్షాలు
C) కీటకనాశనులు
D) పాలిథీన్ సంచులు
జవాబు:
A) కూరగాయల తొక్కలు

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 10th Lesson నేల కాలుష్యం 4

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

These AP 9th Biology Important Questions and Answers 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 9th Lesson Important Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
జీవులలోని అనుకూలనాలు అని వేటిని అంటారు?
జవాబు:
వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తరువాత వాటికి అనుకూలంగా మారతాయి. లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు.

ప్రశ్న 2.
నిశాచరులు అని వేటిని అంటారు?
జవాబు:
నిశాచరులు :
రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు(nocternals) అంటారు.

ప్రశ్న 3.
బబ్బర్లు, యాంటీ ఫ్రీజ్ అనగానేమి?
జవాబు:
చాలా సముద్ర జీవులు బబ్బర్లు అనే క్రొవ్వు పొరను కలిగి ఉంటాయి. ఇది ఉష్ణ బంధకంలా ఉండి చలితీవ్రత నుండి రక్షిస్తుంది. కొన్ని చేపలు శరీరంలోని రక్తం గడ్డకట్టకుండా ప్రవహించేలా చేయటానికి యాంటీ ఫ్రీజింగ్ (Anti Freeze వంటి పదార్థం కలిగి ఉంటాయి.

ప్రశ్న 4.
లిట్టోరల్ మండలం అనగానేమి?
జవాబు:
సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల భాగాన్ని లిటోరల్ మండలం అంటారు. ఈ మండలం సమీపంలో నీరు మట్టితో కలిసి మట్టిగా ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 5.
లిమ్నెటిక్ మండలం అనగానేమి?
జవాబు:
సరస్సులో నీటి పైభాగం (ఉపరితలం) లో బయటకు కనిపించే భాగాన్ని లిమ్నెటిక్ మండలం అంటారు. ఈ భాగం ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది.

ప్రశ్న 6.
ప్రొఫండల్ మండలం అని దేనిని అంటారు?
జవాబు:
మంచినీటి ఆవరణ వ్యవస్థలో తక్కువ వెలుతురు కలిగి మసకగా, చల్లగా ఉండే మండలాన్ని ప్రొఫండల్ మండలం అంటారు. ఈ ప్రాంతంలో చాలా వరకు సర్వాహారులు (heterotrophs) ఉంటాయి.

ప్రశ్న 7.
లైకెన్లు అనగానేమి?
జవాబు:
శిలీంధ్ర సమూహాలతో సహజీవన సంబంధం సాగిస్తూ జీవించే అనుకూలన రూపాలనే ‘లైకిళ్లు’ అంటారు. ఇలాంటి సమూహాలు, రాళ్ళు, వృక్షకాండాలపై పెరగడాన్ని చూడవచ్చు.

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నీటి ఆవరణ వ్యవస్థలోని రకాలు ఏవి? ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. నీటి లేదా జల ఆవరణ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాలు. అవి.
    1 మంచి నీటి ఆవరణ వ్యవస్థ
    2. ఉప్పునీటి/సముద్రనీటి ఆవరణ వ్యవస్థ.
  2. కొలనులు, సరస్సులు, నదులు మంచినీటి ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణలు.
  3. సముద్రాలు, మహాసముద్రాలు ఉప్పునీటి ఆవాసాలకు ఉదాహరణలు.

ప్రశ్న 2.
ఎలక్ట్రిక్ ఈల్ గురించి లఘుటీక రాయండి.
జవాబు:

  1. ఎలక్ట్రిక్ ఈల్ అనే చేపలు దాదాపు 600 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
  2. ఈ విద్యుత్తుని ఉపయోగించి అవి శత్రువుల బారి నుండి తమను తాము కాపాడుకుంటాయి.
  3. వీటి పేరు ఈల్ అనగా సర్పం అయినప్పటికీ ఇది పాము కాదు. ఒక రకమైన కత్తి చేప.

ప్రశ్న 3.
మన రాష్ట్రంలోని మంచి నీటి జలాశయములు, ఆవరణ వ్యవస్థలు ఏవి?
జవాబు:
కృష్ణాజిల్లాలోని కొల్లేరు సరస్సు, శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉన్న మడ్డు వలస, ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు మొదలైనవి మన రాష్ట్రంలోని కొన్ని మంచినీటి జలాశయములు మరియు ఆవరణ వ్యవస్థలు.

ప్రశ్న 4.
సముద్ర జీవుల శరీరం లోపలి సాంద్రత బయటి సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువగా (దాదాపు 8.5%) ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవుల శరీరం నుండి నీరు సముద్రంలోకి వచ్చి చేరుతుంది. ఇది జీవికి ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో అవి ఎలా జీవిస్తాయి?
జవాబు:

  1. సముద్రంలో ఎన్నో జాతి జీవుల శరీరంలోని లవణీయత సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువ ఉంటుంది.
  2. కావున ద్రవాభిసరణం ద్వారా కోల్పోయిన నీటి కొరతను పూరించడానికి అధిక పరిమాణంలో నీరు గ్రహిస్తాయి.
  3. వీటిలోని లవణాలను మూత్రపిండాలు మరియు మొప్పలలోని ప్రత్యేకమైన కణాల ద్వారా విసర్జిస్తాయి.

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 5.
మడ అడవి ఆవరణ వ్యవస్థలోని చేపలు, నదులు మరియు సముద్రాలలో ఎలా జీవిస్తాయి?
జవాబు:

  1. మడ అడవి ఆవరణ వ్యవస్థలోని చేపలు, నదులు మరియు సముద్రాలలో కూడా జీవిస్తాయి.
  2. మడ అడవి ఆవరణ వ్యవస్థలోని చేపలు ఎప్పటికప్పుడు మారే లవణీయతను తట్టుకొని నిలబడతాయి.
  3. మంచినీటి చేపలు తమ శరీరంలోని ద్రవాభిసరణ నియంత్రకాల ద్వారా నిరంతరం మారే లవణీయతలోని తేడాలను తట్టుకుంటాయి.

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సముద్ర జీవులలో కనిపించే కొన్ని అనుకూల లక్షణాలు రాయండి.
జవాబు:

  1. ప్రతి సముద్ర ప్రాణి ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా అనుకూలనాలు ఏర్పరచుకుంటుంది.
  2. సముద్ర చరాలు వాటి శరీరంలో జరిగే మంచినీటి, ఉప్పునీటి ప్రతిచర్యలను తప్పక నియంత్రించాలి. వీటికొరకు ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన మూత్రపిండాలు, మొప్పలు వంటి అవయవాలు సహాయపడతాయి.
  3. సీ అనిమోన్లు వంటి కొన్ని జంతువులు చర్మం ద్వారా వాయువులను గ్రహిస్తాయి.
  4. నీటిలో చలించే జంతువులు నీటి నుండి, గాలి నుండి ఆక్సిజన్ గ్రహించుటకు మొప్పలు లేదా ఊపిరితిత్తులను ఉపయోగిస్తాయి.
  5. చాలా సముద్ర జీవులు బట్లర్లు అనే కొవ్వు పొరను కలిగి ఉంటాయి. ఇది ఉష్ణబంధకంలా ఉండి’ చలి తీవ్రత నుండి రక్షిస్తుంది.
  6. కొన్ని చేపలు శరీరంలోని రక్తం గడ్డకట్టకుండా ప్రవహించేలా చేయడానికి యాంటి ఫ్రీజింగ్ వంటి పదార్థం కలిగి ఉంటాయి.
  7. సముద్ర ఆవరణ వ్యవస్థలో సహజీవనం, రక్షించుకునే ప్రవర్తన, దాక్కోవటం, ప్రత్యుత్పత్తి వ్యూహాలు, సమాచార సంబంధాలు మొదలగునవి కలిగి ఉంటాయి.

ప్రశ్న 2.
నీటిలో నివసించే మొక్కలందు గల అనుకూలనాలు ఏవి?
జవాబు:
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 5

  1. పాక్షికంగా నీటిలో మునిగి ఉండే మొక్కల కాండాలు, ఆకులు, వేర్లలో ఉన్న గాలి గదుల వలన వాయు మార్పిడికి మరియు సమతాస్థితికి తోడ్పడతాయి.
  2. గుర్రపుడెక్క పత్రం అంచులకు గాలితో నిండిన నిర్మాణాలు ఉండటం వలన మొక్క నీటిపై తేలుతుంది.
  3. కలువ మొక్కలో ఆకులు బల్లపరుపుగా ఉండి, మైనపు పూత గల ఉపరితలంలో పత్రరంధ్రాలు ఉంటాయి.
  4. నీటిలో తేలియాడే హైడ్రిల్లా మొక్కలలో పత్రరంధ్రాలు ఉండవు. పలుచని ఆకులు, సులభంగా వంగే కాండాలు కలిగి ఉంటుంది.

ప్రశ్న 3.
హైఢిల్లా మొక్క నీటిలో నివసించడానికి గల ప్రత్యేక అనుకూలనాలు ఏవి?
జవాబు:
AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 1

  1. హైడ్రిల్లా మొక్కలలో పత్రరంధ్రాలు ఉండవు.
  2. కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఇవి బాగా పెరగగలవు.
  3. నీటి నుండి CO2 ను బాగా గ్రహించగలవు. తదుపరి అవసరాల కోసం పోషకాలను నిలువ చేయగలవు.
  4. నీటి ప్రవాహవేగం, ఎద్దడి వంటి వివిధ రకాల పరిస్థితులు తట్టుకోగలవు.
  5. లవణీయత ఎక్కువగా ఉన్న ఉప్పు నీటిలో కూడా పెరుగుతాయి.
  6. లైంగిక, అలైంగిక విధానాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపగలవు.

ప్రశ్న 4.
లైకెన్ల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 2

  1. పై పటంలో శైవలాలు, శిలీంధ్రాలు సమూహపరమైన లైకెన్లో ఫలవంతమైన అనుకూలనాలు చూడవచ్చు.
  2. శిలీంధ్ర సమూహం శైవలాల సమూహంపై దాడి చేస్తుంది. శైవలాలు పోటీపడలేక విఫలమై నశిస్తాయి.
  3. శిలీంధ్ర సమూహాలతో సహజీవన సంబంధం సాగిస్తూ జీవించే అనుకూలన రూపాలను “లైకెన్లు” అంటారు.
  4. శైవలాలకు కావలసిన నీరు, ఖనిజ లవణాలను శిలీంధ్రం అందిస్తుంది.
  5. శైవలాలు కిరణజన్య సంయోగక్రియ జరుపుతూ శిలీంధ్రాలకు కావలసిన ఆహారాన్ని చక్కెర రూపంలో సరఫరా చేస్తుంది.
  6. ఇలాంటి అనుకూలనాల వలన లెకెన్స్ ప్రతికూల పరిస్థితులలో కూడా జీవించగలుగుతాయి.

ప్రశ్న 5.
గాలపోగాన్ దీవులందు పిచ్చుకలపై డార్విన్ చేసిన పరిశోధనలు గురించి వివరించండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 3

  1. చార్లెస్ డార్విన్ -1885వ సంవత్సరంలో హెచ్.ఎమ్.ఎస్. బీగిల్ అనే ప్రసిద్ధిగాంచిన ఓడ నుండి ఒక ద్వీపం మీద అడుగుపెట్టాడు.
  2. ఇది 120 చిన్న దీపాల సముదాయమైన గాలపోగాన్ ద్వీపాలకు చెందినది.
  3. ఆ ద్వీపాలలోని వివిధ రకాల జీవులపై అధ్యయనం చేశాడు.
  4. ఈయన పిచ్చుకల గురించి చేసిన పరిశీలనలు చాలా ప్రఖ్యాతి చెందాయి.
  5. చిన్న ప్రాంతమైన గాలపోగాన్ దీవులలో ఈకల రంగులు, ముక్కులలో వైవిధ్యాలు గల పదమూడు రకాల పిచ్చుకలను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.
  6. కొన్ని పిచ్చుకలు గింజలు, కొన్ని పండ్లు, మరికొన్ని కీటకాలు తింటాయని తెలుసుకున్నాడు.
  7. ఈ పిచ్చుకలు తమ సమీప పరిసరాలను ఆహారం, నివాసం కోసం అనుకూలించుకున్నాయి.
  8. ఒకే జాతికి చెందిన పక్షులలో కూడా ప్రత్యేకంగా ముక్కుల్లో వైవిధ్యం ఉండడం డార్విన్ గమనించాడు.
  9. అనుకూలనాలు అనేవి ఒక జీవిలో నిరంతరం జరుగుతుంటాయి.
  10. భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతాలలో దగ్గర సంబంధాలు గల వాటిలో కూడా ప్రత్యేకంగా అనుకూలనాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయని డార్విన్ తీర్మానించాడు.

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 6.
నిశాచర జీవులను గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు అంటారు.
  2. ఈ జంతువులలో వినడానికి, వాసన పీల్చడానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  3. రాత్రి సమయంలో చూడడానికి వీలుగా పెద్ద పెద్ద కళ్ళు అనుకూలనాలు చెంది ఉంటాయి.
  4. గబ్బిలం లాంటి జీవులు హెచ్చు కీచుదనం గల శబ్దాలు చేసి వస్తువుల ఉనికి పసికడతాయి. ఆహారాన్ని ఎంచుకొంటాయి. శత్రువుల బారినుండి తమను తాము రక్షించుకుంటాయి.
    ఉదా : పిల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, మిణుగురు పురుగులు, క్రికెట్ కటిల్ ఫిష్.

ప్రశ్న 7.
ధృవ ప్రాంతములలో నివసించే జంతువులు చూపే అనుకూలనాలు ఏవి?
జవాబు:
AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 4

  1. శీతల ప్రాంతాలలో నివసించే జీవులు వివిధ రకాలుగా అనుకూలనాలు ఏర్పరచుకుంటాయి.
  2. వాటి చర్మాల కింద దళసరి కొవ్వు పొరను నిలువ చేసుకుంటాయి లేదా దళసరి బొచ్చుతో తమ శరీరాలను కప్పి ఉంచుతాయి.
  3. ఇవి ఉష్ణ బంధకాలుగా పనిచేస్తూ తమ శరీరాల నుండి ఉష్ణం కోల్పోకుండా నిరోధిస్తాయి.
  4. కొవ్వు పొర శరీరానికి ఉష్ణబంధకంగా సహాయపడుతూ ఉష్ణం, శక్తిని ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి.

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Important Questions and Answers

ప్రశ్న 1.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులివ్వండి.
“సైడ్ వైండర్ యాడర్ స్నేక్” – ఈ పాము ప్రక్కకు పాకుతూ కదులుతుంది. దీని వలన శరీరంలోని కొంత భాగం మాత్రమే వేడెక్కిన ఇసుక తలాన్ని ఒత్తుతుంది. ఈ విధమైన కదలిక శరీరాన్ని చల్లగా ఉంచటంలో తోడ్పడుతుంది. “గోల్డెన్ మోల్” అనే జంతువు ఎండవేడిమి నుండి తప్పించుకోవడానికి ఇసుకలో దూకి ఈదుతున్నట్లు కదులుతుంది. ఇది అన్ని అవసరాలు నేల లోపలే తీర్చుకోవడం వలన చాలా అరుదుగా నేల బయటకు వస్తుంది. కొన్ని జంతువులు ఎడారిలో జీవించడానికి అసాధారణమైన సామర్థ్యాలు చూపిస్తాయి. ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివశించే “క్యాంగ్రూ ఎలుక” జీవిత కాలమంతా నీరు తాగకుండా జీవిస్తుంది. వీటి శరీరం జీర్ణక్రియా క్రమంలో కొంత నీటిని తయారుచేస్తుంది. ఎడారి పక్షి “సాండ్ గ్రౌజ్ ” నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్ ను చేరుతుంది. తన కడుపులోని క్రాప్ అనే భాగంలో నీటిని నింపుకొని వచ్చి గూటిలోని పిల్లలకు తాగిస్తుంది.

అ) ఏ ఎడారి జీవి జీవితాంతం నీటిని త్రాగదు?
జవాబు:
క్యాంగ్రూ ఎలుక

ఆ) గోల్డెన్ మోల్ ఎండ వేడిమిని ఏ విధంగా తప్పించుకుంటుంది?
జవాబు:
ఇసుకలో దూరి ఈదుతున్నట్లు కదులుతుంది.

ఇ) సాండ్ గ్రేజ్ కు నీరు ఎక్కడి నుండి లభిస్తుంది?
జవాబు:
ఒయాసిస్ నుండి

ఈ) సైడ్ వైండర్ యాడర్ స్నేక్ ఎందుకు పక్కకు ప్రాకుతుంది?
జవాబు:
దీని వలన శరీరంలోని కొంత భాగం మాత్రమే వేడెక్కిన ఇసుకతలాన్ని ఒత్తుతుంది. ఈ విధమైన కదలిక శరీరాన్ని చల్లగా ఉంచడంలో తోడ్పడుతుంది.

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 2.
పట్టిక ఆధారంగా సమాధానాలు రాయండి.

జంతువు పేరునివసించే ప్రాంతంచూపించే అనుకూలనాలు
కాంగ్రూ ఎలుకఉత్తర అమెరికాజీవితకాలమంతా నీరు త్రాగకుండా ఉంటుంది. జీర్ణక్రియలోనే కొంత నీటిని తయారుచేసుకుంటుంది.
శాండ్ గ్రూస్ఎడారులుతన కడుపులో క్రాప్ అనే భాగంలో నీటిని నింపి ఉంచుకుంటుంది.

పై పట్టిక ఆధారంగా ఈ రెండు జంతువులు చూపే అనుకూలనాలను రాయండి.
జవాబు:

  1. కాంగ్రూ ఎలుక నీరు దొరకని ప్రాంతాలలో జీవించడం వలన జీవితకాలమంతా నీరు త్రాగకుండా ఉంటుంది. దీనికి కారణం అది జీర్ణక్రియలో తయారైన నీటిని పొదుపుగా వాడుకుంటూ జీవిస్తుంది.
  2. శాండ్ గ్రూస్ అనే ఎడారి పక్షి, తన కడుపులో క్రాప్ అనే భాగంలో నీటిని నింపి ఉంచుకుంటుంది. చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్లో నీటిని త్రాగుతుంది.

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. మడ మొక్కలందు ఉండే శ్వాస రంధ్రాల ఉపయోగం
A) కిరణజన్య సంయోగక్రియ
B) వేరు శ్వాసక్రియ
C) శ్వాసక్రియ
D) బాష్పోత్సేకము
జవాబు:
B) వేరు శ్వాసక్రియ

2. నేడు అలంకారం కోసం ఇళ్ళలో పెంచబడుతున్నమొక్కలు
A) నీటి మొక్కలు
B) ఎడారి మొక్కలు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) ఎడారి మొక్కలు

3. ఒంటె నందు కొవ్వును నిలువచేయు భాగం
A) మోపురం
B) జీర్ణాశయం
C) చర్మం
D) పైవన్నీ
జవాబు:
A) మోపురం

4. ఉత్తర అమెరికా పడమటి ఎడారిలోని ఈ జీవి జీవితకాలమంతా నీరు తాగకుండా జీవిస్తుంది.
A) సాండ్ గ్రౌజ్
B) ఫెన్సిస్ ఫాక్స్
C) క్యాంగ్రూ ఎలుక
D) గోల్డెన్ మోల్
జవాబు:
C) క్యాంగ్రూ ఎలుక

5. హెచ్చు కీచుదనం గల శబ్దాలు చేసి వస్తువుల ఉనికి పసిగట్టేవి
A) కటిల్ ఫిష్
B) గబ్బిలం
C) క్రికెట్ కీటకం
D) పిల్లి
జవాబు:
B) గబ్బిలం

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

6. క్రింది వానిలో ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థను గుర్తించుము.
A) కొలను
B) వాగులు
C) నది
D) సముద్రం
జవాబు:
D) సముద్రం

7. కణాలలో నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలేవి
A) ప్లవకాలు
B) డాల్ఫిన్లు
C) పెద్ద మొక్కలు
D) చేపలు
జవాబు:
A) ప్లవకాలు

8. ప్రతి 10 మీటర్ల లోతునకు పెరిగే పీడనము
A) 1 అట్మాస్ఫియర్
B) 2 ఎట్మాస్ఫియర్లు
C) 3 అట్మాస్ఫియర్లు
D) 4 ఎట్మాస్ఫియర్లు
జవాబు:
A) 1 అట్మాస్ఫియర్

9. సీలు మరియు తిమింగలము లందు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ నిల్వ ఉండు ప్రదేశము
A) ఊపిరితిత్తులు
B) కండర కణజాలము
C) చర్మము
D) పైవన్నీ
జవాబు:
B) కండర కణజాలము

10. ఈ సముద్ర జీవులు ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలనాలు కలిగి ఉంటాయి.
A) తిమింగలాలు
B) హెర్రింగ్ గల్స్
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

11. సముద్ర ఆవరణ వ్యవస్థ నందలి మండలాలు
A) యుఫోటిక్ మండలం, బెథియల్ మండలం
B) బెథియల్ మండలం, అబైసల్ మండలం
C) అబైసల్ మండం, యూఫోటిక్ మండలం
D) యుఫోటిక్ మండలం, బెథియల్ మండలం, అబైసల్ మండలం
జవాబు:
D) యుఫోటిక్ మండలం, బెథియల్ మండలం, అబైసల్ మండలం

12. కిరణజన్య సంయోగక్రియ గరిష్ఠంగా జరిగే మండలం
A) బెథియల్ మండలం
B) యుఫోటిక్ మండలం
C) అబైసల్ మండలం
D) పైవన్నియు
జవాబు:
B) యుఫోటిక్ మండలం

13. సముద్ర ఆవరణ వ్యవస్థ నందలి ఈ మండలము సంవత్సరము పొడవున చీకటిగా, చల్లగా ఉంటుంది.
A) అబైసల్ మండలం
B) బెథియల్ మండలం
C) యూఫోటిక్ మండలం
D) బేథియల్ మరియు అబైసల్ మండలం
జవాబు:
A) అబైసల్ మండలం

14. ఎలక్ట్రిక్ ఈల్ అనే చేపలు ఎన్ని వోల్టులు విద్యుత్ ను ఉత్పత్తి చేయగలవు?
A) 500 వోల్టులు
B) 600 వోల్టులు
C) 700 వోల్టులు
D) 400 వోల్టులు
జవాబు:
B) 600 వోల్టులు

15. ఉప్పునీటి సరస్సు గుర్తించండి.
A) కొల్లేరు
B) పులికాట్
C) ఉస్మాన్ సాగర్
D) షామీర్ పేట సరస్సు
జవాబు:
B) పులికాట్

16. మంచినీటి ఆవరణ వ్యవస్థలో జీవులపై ప్రభావం చూపే కారకాలు
A) కాంతి, లవణీయత
B) ఆహారము
C) ఆక్సిజన్
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

17. సముద్ర నీటి లవణీయత
A) 2.8%
B) 2.5%
C) 3.5%
D) 3.8%
జవాబు:
C) 3.5%

18. మంచినీటి చేపలు శరీరాలలో
A) తక్కువ లవణీయత ఉంటుంది
B) ఎక్కువ లవణీయత ఉంటుంది
C) A మరియు B
D) చాలా తక్కువ లవణీయత ఉంటుంది.
జవాబు:
B) ఎక్కువ లవణీయత ఉంటుంది

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

19. ఉష్ణమండలంలోని కొన్ని మొక్కలు ఆకులు రాల్చు కాలము
A) చలికాలము ముందు
B) వేసవి మొదలు కాకముందు
C) చలికాలము తరువాత
D) వర్షాకాలము
జవాబు:
A) చలికాలము ముందు

20. మన రాష్ట్ర పక్షి
A) పాలపిట్ట
B) గ్రద్ద
C) చిలుక
D) పావురం
జవాబు:
A) పాలపిట్ట

21. సముద్ర ఆవరణ వ్యవస్థలో సహజీవనము కలిగిన జీవులు
A) తిమింగలాలు, హెర్రింగ్ గల్స్
B) క్లోన్ ఫిష్, సముద్ర అనిమోను
C) రేచేప మరియు సముద్ర అనిమోను
D) తిమింగలం కేస్ ఫిష్
జవాబు:
B) క్లోన్ ఫిష్, సముద్ర అనిమోను

22. శ్వాసవేర్లు సుమారుగా ఇంత పొడుగు పెరుగుతాయి.
A) 8 అంగుళాలు
B) 10 అంగుళాలు
C) 12 అంగుళాలు
D) 14 అంగుళాలు
జవాబు:
C) 12 అంగుళాలు

23. శ్వాస వేర్లు ఈ మొక్కలో కనిపిస్తాయి.
A) కలబంద
B) సైప్రస్
C) లింగాక్షి
D) డక్వడ్
జవాబు:
B) సైప్రస్

24. ఈ క్రింది వానిలో కణజాలం నీటిని నిల్వచేసే మొక్కలు
A) ఉష్ణమండల మొక్కలు
B) సమశీతోష్ణ మండల మొక్కలు
C) జలావాస మొక్కలు
D) టండ్రా మొక్కలు
జవాబు:
A) ఉష్ణమండల మొక్కలు

25. జంతువులు తినకుండా వదిలేసే మొక్కలు
A) గులకరాళ్ళ మొక్కలు
B) ఎడారి మొక్కలు
C) జలావాస మొక్కలు
D) టండ్రా మొక్కలు
జవాబు:
A) గులకరాళ్ళ మొక్కలు

26. ఎడారిలో కనిపించే పాము
A) రసెల్స్ వైపర్
B) సాండ్ బోయా
C) సైడ్ వైడర్
D) కింగ్ కోబ్రా
జవాబు:
C) సైడ్ వైడర్

27. జీవితాంతం నీరు త్రాగకుండా ఉండే జీవి
A) గోల్డెన్ మోల్
B) క్యాంగ్రూ ఎలుక
C) సాండ్ గ్రెస్
D) సైడ్ వైడర్
జవాబు:
B) క్యాంగ్రూ ఎలుక

28. ఎడారి పక్షి
A) గోల్డెన్ మోల్
B) క్యాంగ్రూ ఎలుక
C) సాండ్ గ్రేస్
D) సైడ్ వైడర్
జవాబు:
C) సాండ్ గ్రేస్

29. క్రింది వానిలో నిశాచర జీవి
A) గబ్బిలం
B) కటిల్ ఫిష్
C) క్రికెట్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

30. ప్లవకాలు వీటి సహాయంతో నీటిపై తేలుతాయి.
A) గాలితిత్తులు
B) గాలిగదులు
C) నూనె బిందువులు
D) వాజాలు
జవాబు:
C) నూనె బిందువులు

31. జీర్ణమండలంలో ఫ్లూటర్స్ అనే ప్రత్యేక నిర్మాణం కల్గినవి
A) తాబేళ్ళు
B) చేపలు
C) డాల్ఫిన్లు
D) B & C
జవాబు:
D) B & C

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

32. సముద్రంలో రక్తంలాంటి ద్రవాలపై ప్రతి 10 మీటర్లకు ఎంత వాతావరణ పీడనం పెరుగుతుంది?
A) 1 అట్మాస్ఫియర్
B) 2 అట్మాస్ఫియర్లు
C) 3 అట్మాస్ఫియర్లు
D) 4 అట్మాస్ఫియర్లు
జవాబు:
A) 1 అట్మాస్ఫియర్

33. సీలు చేపలో ఊపిరితిత్తులు కుచించుకోగానే
A) దాని బరువు పెరుగుతుంది.
B) నీటిలో సులభంగా మునుగుతుంది.
C) ఆక్సిజన్ నిల్వల్ని కాపాడుకుంటుంది.
D) పైవన్నీ
జవాబు:
A) దాని బరువు పెరుగుతుంది.

34. ఈతతిత్తులు దేనికి పనికి వస్తాయి?
A) నీటిలో తేలటం
B) నీటిలో ఈదటం
C) నీటిలో సమతాస్థితి
D) పైవన్నీ
జవాబు:
C) నీటిలో సమతాస్థితి

35. చేపలను అగాథాల నుండి పైకి తెచ్చినపుడు నోటి ద్వారా బయటకు వచ్చేది
A) నాలుక
B) పేగులు
C) ఈతతిత్తి
D) కళ్ళు మరియు రక్తం
జవాబు:
C) ఈతతిత్తి

36. సముద్ర జలాల్లో ద్రవాభిసరణను నియంత్రించేవి
A) మూత్రపిండాలు
B) మొప్పలు
C) A మరియు B
D) పైవేవీ కావు
జవాబు:
C) A మరియు B

37. సీ అనిమోన్లు దేని ద్వారా వాయువులను గ్రహిస్తాయి?
A) నోరు
B) ఊపిరితిత్తులు
C) ముక్కు
D) చర్మం
జవాబు:
D) చర్మం

38. యాంటీ ఫ్రీజింగ్ పదార్థాలు వీటిలో ఉంటాయి.
A) చేపలు
B) ఉభయచరాలు
C) పక్షులు
D) క్షీరదాలు
జవాబు:
A) చేపలు

39, బ్లబ్బరను కలిగి ఉండేది
A) ఎడారిజీవులు
B) సముద్ర జీవులు
C) టండ్రా జీవులు
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

40. శైన్ ఫిష్ మరియు సముద్ర అనిమోన్లకు మధ్యగల సంబంధం
A) పరాన్నజీవనం
B) సహజీవనం
C) సహభోజకత్వం
D) పూతికాహార విధానం
జవాబు:
B) సహజీవనం

41. సముద్రంలో లేని ప్రాంతం
A) యుఫోటిక్ జోన్
B) లిమ్నెటిక్ జోన్
C) బేథియల్ జోన్
D) అబైసల్ జోన్
జవాబు:
B) లిమ్నెటిక్ జోన్

42. మసక మండలం అని దీనిని అంటారు.
A) యుఫోటిక్ జోన్
B) బెథియల్ జోన్
C) అబైసల్ జోన్
D) ప్రొఫండల్ జోన్
జవాబు:
B) బెథియల్ జోన్

43. కాంతిని ఉత్పత్తి చేసే అవయవాలు కల జీవులు ఇక్కడ ఉంటాయి.
A) యుఫోటిక్ జోన్
B) బెథియల్ జోన్
C) అబైసల్ జోన్
D) ప్రొఫండల్ జోన్
జవాబు:
C) అబైసల్ జోన్

44. సముద్రపు అడుగు భాగాల్లో నివసించే జీవులకు
A) దృష్టి లోపిస్తుంది
B) వాసన, వినికిడి బాగుంటాయి
C) A మరియు B
D) పైవేవీ కావు
జవాబు:
C) A మరియు B

45. ఇందులో సరస్సులో లేని మండలం
A) లిటోరల్ జోన్
B) లిమ్నెటిక్ జోన్
C) ప్రొఫండల్ జోన్
D) బెథియల్ జోన్
జవాబు:
D) బెథియల్ జోన్

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

46. పత్ర రంధ్రాలు లేని మొక్క
A) తామర
B) గుర్రపుడెక్క
C) కలువ
D) హైడ్రిల్లా
జవాబు:
D) హైడ్రిల్లా

47. వేసవికాలం రాకముందే ఆకురాల్చే మొక్కలు
A) ఉష్ణమండల మొక్కలు
B) సమశీతోష్ణ మండల మొక్కలు
C) ఎడారి మొక్కలు
D) టండ్రా మొక్కలు
జవాబు:
A) ఉష్ణమండల మొక్కలు

48. శీతాకాల సుప్తావస్థ, గ్రీష్మకాల సుప్తావస్థ చూపే జీవులు
A) చేపలు
B) ఉభయచరాలు
C) సరీసృపాలు
D) పక్షులు
జవాబు:
B) ఉభయచరాలు

49. పత్తర్ ఫూల్ అనే సుగంధ ద్రవ్యం
A) ఒక శైవలం
B) ఒక శిలీంధ్రం
C) ఒక లైకెన్
D) ఒక చెట్టు బెరడు
జవాబు:
C) ఒక లైకెన్

50. 1885వ సంవత్సరంలో H.M.S బీగల్ అనే ఓడపై ప్రయాణించి డార్విన్ ఈ ద్వీపాలకు చేరాడు.
A) పసిఫిక్ దీవులు
B) గాలపోగస్ దీవులు
C) బెర్ముడా దీవులు
D) మారిషస్ దీవులు
జవాబు:
D) మారిషస్ దీవులు

51. జలావరణ వ్యవస్థపై ప్రభావం చూపని కారకం
A) లవణాలు
B) ఉష్ణోగ్రత
C) కాంతి
D) పీడనం
జవాబు:
B) ఉష్ణోగ్రత

52. తీక్షణ, స్పష్టమైన దృష్టిగల జీవులు సముద్రంలో ఈ భాగంలో నివశిస్తాయి.
A) బెథియల్ మండలం
B) యూఫోటిక్ మండలం
C) అబిస్పల్ మండలం
D) పైవన్నీ
జవాబు:
B) యూఫోటిక్ మండలం

53. లైకెన్స్ లో సహజీవనం చేసేవి
A) శైవలాలు, బాక్టీరియా
B) శైవలాలు, శిలీంధ్రాలు
C) బ్యా క్టీరియా, వైరస్
D) శిలీంధ్రాలు, బ్యాక్టీరియా
జవాబు:
B) శైవలాలు, శిలీంధ్రాలు

54. డార్విన్ ఫించ్ పక్షుల గురించి నివేదిక వ్రాయాలంటే కింది వాటిలో ఏ అంశాన్ని ఎన్నుకుంటావు?
A) పరిసరాలలోని మార్పులకు జీవులు స్థిరంగా వుంటాయి.
B) ఒక జాతిలోని జీవులన్నీ ఒకే రకమైన అనుకూలనాలు చూపిస్తాయి.
C) ఒకే జాతికి చెందిన జీవులు ఆహారపు అలవాట్లను బట్టి వేర్వేరు అనుకూలనాలను చూపిస్తాయి.
D) జీవులలో ఏర్పడిన అనుకూలనాలు తరువాత తరాలకు అందజేయబడవు.
జవాబు:
C) ఒకే జాతికి చెందిన జీవులు ఆహారపు అలవాట్లను బట్టి వేర్వేరు అనుకూలనాలను చూపిస్తాయి.

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

55. పత్రరంధ్రాలు ఏ సందర్భంలో మూసుకుపోతాయి?
i) వాతావరణం చల్లగా ఉన్నప్పుడు
ii) వాతావరణం వేడిగా ఉన్నప్పుడు
iii) వాతావరణం తేమగా ఉన్నప్పుడు
iv) పై వన్నియూ మొక్కలు
A) i, ii మాత్రమే
B) ii, iii మాత్రమే
C) i, iii మాత్రమే
D) అన్నియూ సరైనవే
జవాబు:
A) i, ii మాత్రమే

56. ఎడారిమొక్కలకు సంబంధించిన అంశం
1. త్వచకణాలు బాగా దళసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి.
2. కాండం నీటితో నిండి మందంగా ఉంటుంది.
3. ఆకులు ముల్లుగా రూపాంతరం చెంది ఉంటాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 3 మాత్రమే
D) పైవన్నీ సరైనవి
జవాబు:
D) పైవన్నీ సరైనవి

57. ఒంటెను ఇసుక, దుమ్మునుంచి రక్షించే అనుకూలనం
A) మూపురం
B) పొట్టి తోక
C) పొడవైన కనుబొమ్మలు
D) ఒంటె ఆకారం
జవాబు:
C) పొడవైన కనుబొమ్మలు

మీకు తెలుసా?

నిశాచరులు : రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు (nocturnals) అంటారు. జంతువులలో వినడానికి, వాసన పీల్చడానికి వీటి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. రాత్రి సమయంలో చూడడానికి వీలుగా పెద్ద పెద్ద కళ్ళు అనుకూలనాలు చెంది ఉంటాయి. గబ్బిలం లాంటి జీవులు హెచ్చు కీచుదనం గల శబ్దాలు చేసి వస్తువుల ఉనికి పసిగడతాయి. ఆహారాన్ని ఎంచుకుంటాయి, శత్రువుల బారి నుండి తమను తాము రక్షించుకుంటాయి.

పిల్లులు, ఎలుకలు, గబ్బిలాలు, గుడ్లగూబలు సాధారణంగా మన చుట్టూ కనిపించే నిశాచరులు. మిణుగురు పురుగులు, క్రికెట్ కీటకం, కటిల్ ఫిష్ వంటి జీవులు రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి. పగటి ఉష్ణ తాపాన్ని తప్పించుకోవడానికి కొన్ని ఎడారి జంతువులు రాత్రి వేళల్లోనే సంచరిస్తాయి.

ఎలక్ట్రిక్ ఈల్ అనే చేపలు దాదాపు 600 వోల్టులు విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ విద్యుత్ ని ఉపయోగించి అవి శత్రువుల బారి నుండి తమను తాము కాపాడుకుంటాయి. వీటి పేరు eel అనగా సర్పం అయినప్పటికీ ఇది పాము కాదు, ఒక రకమైన కత్తిచేప మాత్రమే.

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 5

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

These AP 9th Biology Important Questions and Answers 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 8th Lesson Important Questions and Answers వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
స్థూల పోషకాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
మొక్కలకు అధిక పరిమాణంలో అవసరం అయ్యే ఖనిజ లవణాలను స్థూల పోషకాలు అంటారు.
ఉదా : నత్రజని, భాస్వరం, పొటాషియం , సోడియం మొదలగునవి.

ప్రశ్న 2.
సూక్ష్మ పోషకాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరం అయ్యే ఖనిజ లవణాలను సూక్ష్మ పోషకాలు అంటారు.
ఉదా : ఇనుము, మాంగనీస్, బోరాన్, జింక్, కాపర్, మాలిబ్డినమ్, క్లోరిన్ మొదలగునవి.

ప్రశ్న 3.
సేంద్రీయ సేద్యం అనగానేమి? దాని వలన ఉపయోగాలేవి?
జవాబు:

  1. నేల స్వభావాన్ని, సారవంతాన్ని పెంచడానికిగాను ఉపయోగపడే వ్యవసాయ విధానాన్ని సేంద్రీయ సేద్యం అంటారు.
  2. సేంద్రీయ సేద్యంలో అధిక దిగుబడి సాధించడం కోసం రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులను ఉపయోగిస్తారు.
  3. సహజ శత్రువులతో కీటకాలను అదుపులో పెట్టే పద్ధతులను ఉపయోగిస్తారు.
  4. పంట మార్పిడి, మిశ్రమ పంటలను పండించడం వంటి పద్ధతులను కూడా అవలంబిస్తారు.

ప్రశ్న 4.
పంచగవ్య ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏవి?
జవాబు:
ఇది కూడా సహజ ఎరువు. పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 5.
‘కలుపు మొక్కలు’ అనగానేమి?
జవాబు:
పంట మొక్కలతో పాటు ఇతర మొక్కలు కూడా నేలలో పెరగడం తరచుగా మనం చూస్తుంటాం. వీటినే ‘కలుపు మొక్కలు’ అంటారు.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సంకరణము గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. జన్యుపరంగా వేరు వేరు లక్షణాలు ఉన్న రెండు మొక్కల నుండి మనం కోరుకున్న లక్షణాలతో కూడిన కొత్త మొక్కను ఉత్పత్తి చేయడాన్ని సంకరణం అంటారు.
  2. సంకరణం ద్వారా అభివృద్ధి చెందిన వంగడాలు అధిక దిగుబడిని ఇవ్వడం, వ్యాధులకు నిరోధకత కలిగి ఉండడం, తక్కువ నీటి వసతితో కూడా, ఆమ్లయుత నేలల్లో కూడా పెరగగలగడం వంటి ఉపయోగకరమైన లక్షణాలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 2.
పంట మార్పిడిలోని కొన్ని పద్ధతులను రాయండి.
జవాబు:
పంట మార్పిడిలో కొన్ని పద్ధతులు:
ఎ) వరి పండిన తర్వాత మినుములు, వేరుశనగ సాగుచేయడం.
బి) పొగాకు పండించిన తర్వాత మిరప పంట సాగుచేయడం.
సి) కందులు, మొక్కజొన్న పండించిన తర్వాత వరి సాగుచేయడం.

ప్రశ్న 3.
పచ్చిరొట్ట ఎరువులు అనగానేమి ? ఉదాహరణలివ్వండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1

  1. కొన్ని రకాల పంటలను పండించిన తరువాత వాటిని అలాగే నీళ్ళలో కలిపి దున్నుతారు. ఇటువంటి వాటిని పచ్చి రొట్ట ఎరువులు అంటారు.
  2. వెంపలి, ఉలవ, పిల్లి పెసర, అలసంద, పెసర వంటి పంటలు పచ్చిరొట్ట ఎరువులకు ఉదాహరణలు.

ప్రశ్న 4.
పంట దిగుబడి అధికం చేయడానికి అవసరమయ్యే కారకాలు ఏవి?
జవాబు:

  1. పంట దిగుబడి అనేది ఏదో ఒక కారకంపైన ఆధారపడి ఉండదు.
  2. అనేక కారకాలు కలసి పనిచేయడం వల్ల మాత్రమే దిగుబడి పెరుగుతుంది.
  3. నాటిన విత్తన రకం, నేల స్వభావం, నీటి లభ్యత, ఎరువులు, పోషక పదార్థాల అందుబాటు, వాతావరణం, పంటపై క్రిమికీటకాల దాడి, కలుపు మొక్కల పెరుగుదలను అదుపుచేయడం వంటి వాటిని అధిక దిగుబడికి కారకాలుగా గుర్తిస్తాం.

ప్రశ్న 5.
అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు అవలంబించే పద్ధతులు ఏవి?
జవాబు:
అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు 3 పద్ధతులు ఉపయోగిస్తారు. అవి :

  1. అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం.
  2. అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులను పాటించడం.
  3. పంటలను పరిరక్షించే పద్ధతులు పాటించడం.

ప్రశ్న 6.
ఆహార ఉత్పత్తిని ఏ విధంగా పెంచవచ్చు?
జవాబు:

  1. సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం వలన ఆహార ఉత్పత్తి పెంచవచ్చు.
  2. ప్రస్తుతం సాగుచేయుచున్న భూమిలో ఉత్పత్తి పెంచడం.
  3. ఎక్కువ దిగుబడినిచ్చే సంకర జాతులను అభివృద్ధి చేయడం.
  4. పంట మార్పిడి పద్ధతులు.
  5. మిశ్రమ పంట విధానము.
  6. దీర్ఘకాలిక పంటల కంటే స్వల్పకాలిక పంటల వల్ల అధిక ధాన్యం ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 7.
పంటమార్పిడి అనగానేమి? దీనివలన ఉపయోగమేమిటి?
జవాబు:

  1. వేరు వేరు కాలాల్లో వేరు వేరు పంటలను పండించే విధానమును పంటమార్పిడి అంటారు.
  2. ఆహార ధాన్యాలు పండించినపుడు నేల నుండి అధిక పరిమాణంలో పోషక పదార్థాలు గ్రహిస్తాయి.
  3. కాని లెగ్యూమినేసి పంటలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి.
  4. ఇవి నేల నుండి పోషక పదార్థాలను తీసుకున్నప్పటికి నేలలోకి కొన్ని పోషక పదార్థాలను విడుదల చేస్తాయి.
  5. లెగ్యూమినేసి పంటలను పండించడం వల్ల నేలలో నత్రజని సంబంధిత లవణాల స్థాయి పెరుగుతుంది.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 8.
మిశ్రమ పంటలు అనగానేమి? వాటి వలన ఉపయోగమేమిటి?
జవాబు:
ఒక పంట పొలంలో ఒకటి కంటే ఎక్కువ రకాల పంటలను పండిస్తే దానిని మిశ్రమ పంటలు అంటారు.

ఉపయోగాలు :

  1. మిశ్రమ పంటలను పండించడం వల్ల నేల సారవంతం అవుతుంది.
  2. నేల నుండి ఒక పంట తీసుకున్న పోషక పదార్థాలను మరొక పంట పోషక పదార్థాలను పునరుత్పత్తి చేయగలదు.
    ఉదా : సోయా చిక్కుళ్ళతో బఠాణీలు, బఠాణీతో పెసలు, మొక్కజొన్నతో మినుములు మొదలగునవి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సేంద్రీయ ఎరువులను గురించి వివరించండి.
జవాబు:

  1. మొక్కలు, జంతువుల విసర్జితాలు కుళ్ళింప చేసినప్పుడు సేంద్రీయ ఎరువులు ఏర్పడతాయి.
  2. సేంద్రీయ ఎరువులు వాడడం వలన నేలలో హ్యూమస్ చేరి నీటిని నిల్వ చేసుకునే శక్తి నేలకు పెరుగుతుంది.
  3. సేంద్రీయ ఎరువు మంచి పోషక పదార్థములను నేలకు అందిస్తుంది.
  4. సహజ సేంద్రీయ ఎరువులు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి.
    ఎ) అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువులు.
    బి) స్థూల జీవ ఎరువులు.
  5. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, వేప, జట్రోపా వంటి విత్తనాల పొడి అధిక సాంద్రత గల జీవ ఎరువులకు ఉదాహరణ.
  6. జంతు సంబంధ విసర్జక పదార్థాలు, కుళ్ళిన పదార్థాలు, చెత్త వంటివి స్థూల జీవ ఎరువులకు ఉదాహరణ.
  7. స్థూల సేంద్రియ ఎరువుల కంటే అధిక సాంద్రత గల సేంద్రీయ ఎరువుల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయి.
  8. పొలాల్లో ఎండిపోయిన మొక్కల వ్యర్థాలైన కాండం, వేళ్ళు, ఆవు పేడ, మూత్రం మొదలగు వాటిని మనం సాధారణంగా సేంద్రీయ ఎరువులు అంటాం.

ప్రశ్న 2.
భూసార పరీక్షా కేంద్రాల ఉపయోగం ఏమిటి?
జవాబు:

  1. భూసార పరీక్షా నిపుణులు పొలంలో అక్కడక్కడ నేలను తవ్వి మట్టి నమూనాలు సేకరిస్తారు.
  2. వీటిని పరీక్షించి ఇవి ఎంతవరకు సారవంతమైనవో పరీక్షిస్తారు.
  3. ఇలా చేయడం వలన నేలకు సంబంధించిన అన్ని విషయాలు మనకు తెలుస్తాయి.
  4. దీనివల్ల రైతులు ఏ పంటలు పండించాలి, ఎలాంటి ఎరువు వేయాలి, ఎంత పరిమాణంలో ఎరువులు వాడాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  5. ఇందువల్ల ఎరువుల వాడకంలో వృథాను అరికట్టడమే కాకుండా పెట్టుబడి కూడా తగ్గిపోతుంది.

ప్రశ్న 3.
సహజ ఎరువు పంచగవ్యను ఏ విధముగా తయారుచేస్తారు?
జవాబు:

  1. పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం.
  2. ఆవు పేడను నెయ్యిలో కలిపి నాలుగు రోజులు అలాగే ఉంచాలి.
  3. 5వ రోజు దీనికి మూత్రం, పాలు, పెరుగు, కల్లు, కొబ్బరి నీరు, చెరకు రసం వంటివి కలపాలి.
  4. దీనికి అరటి పండ్ల గుజ్జును కలిపి 10 రోజులు అలాగే ఉంచాలి.
  5. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీనిని కలియబెట్టాలి.
  6. ఇలా చేస్తే పొలాల్లో ప్లేయర్ల ద్వారా చల్లడానికి వీలైన పంచగవ్య తయారవుతుంది.
  7. 3% పంచగవ్య పంట బాగా పెరగడానికి, అధిక దిగుబడి సాధించడానికి తోడ్పడుతుంది.
  8. దీన్ని కోళ్ళకు, చేపలకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 4.
స్థూల పోషకాలయిన నత్రజని, భాస్వరము మరియు పొటాషియం యొక్క ఉపయోగాలు ఏవి?
జవాబు:
నత్రజని, భాస్వరము మరియు పొటాషియంల ఉపయోగాలు :

పోషక పదార్థంఉపయోగం
నత్రజనికొత్త ఆకులు, పుష్పాలు వేగంగా వస్తాయి.
భాస్వరము (ఫాస్పరస్)వేళ్ళు నేలలోకి చొచ్చుకుపోవడానికి, నేలలోని పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి
పొటాషియంక్రిమికీటకాల నుండి రోగ నిరోధకశక్తిని పెంపొందించడం, వాసన, రంగు, రుచి వంటివి పెంచడం.

ప్రశ్న 5.
జీవ ఎరువులు అనగానేమి? ఉదాహరణలివ్వంది.
జవాబు:

  1. వాతావరణం నుండి పోషకాలను నేలకు తద్వారా మొక్కలకు అందించడానికి ఉపయోగపడే కొన్ని రకాలైన సూక్ష్మజీవులను జీవ ఎరువులు లేదా ‘మైక్రోబియల్ కల్చర్’ అంటారు.
  2. సాధారణంగా జీవ ఎరువులు రెండు రకాలు. అవి : ఎ) నత్రజని స్థాపన చేసేవి బి) భాస్వరాన్ని (పాస్ఫరస్) నేలలోనికి కరిగింపచేసేవి.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2

ప్రశ్న 6.
వర్మి కంపోస్టు తయారుచేయు విధమును రాయండి.
జవాబు:

  1. వర్మి కంపోస్టు కోసం 10 × 1 × 1/2 మీటర్ కొలతలతో వర్మీ కంపోస్టు బెడదను ఏర్పాటు చేసుకోవాలి.
  2. ఎండ తగలకుండా, వర్షానికి గురికాకుండా పైన కప్పు వేయాలి.
  3. కొబ్బరి, అరటి, చెరకు ఆకులను, కొబ్బరి పీచు, ఎండిన మినుము మొక్కలను సేకరించాలి.
  4. వీటిని 3 లేదా 4 అంగుళాల పొరగా వేసి నీటితో తడపాలి.
  5. ఇళ్ళలో లభించే వ్యర్థాలు, గ్రామంలో లభించే ఎండిన పేడను సేకరించి బెడ్లను నింపాలి.
  6. బెడ్ తయారుచేసుకున్న 2 వారాల తర్వాత వీటిలో చదరపు మీటరుకు 1000 చొప్పున వానపాములను వదలి దానిపై గోనె సంచులతో కప్పి ఉంచాలి.
  7. వాటిపై నీరు చిలకరిస్తూ 30 నుంచి 40% తేమ ఉండేలా చేయాలి.
  8. 60 రోజుల తరువాత మొదటిసారి ఎరువును సేకరించవచ్చు.
  9. రెండవసారి 45 రోజులకే ఎరువును సేకరించాలి.
  10. ఇలా ప్రతి సంవత్సరం ఈ బెడ్ నుండి 6 సార్లు ఎరువును పొందవచ్చు.
  11. 3 టన్నుల జీవ వ్యర్థాలతో ఒక టన్ను వర్మీ కంపోస్టు ఎరువును పొందవచ్చు.

ప్రశ్న 7.
శ్రీ వరి సాగు విధమును వివరించండి.
జవాబు:

  1. శ్రీ వరి సాగు అనేది సేద్యంలో ఒక విధానం.
  2. శ్రీ వరి సాగు అంటే తక్కువ విత్తనం, తక్కువ నీటితో ఆరుతడి పంటగా పండించే పంట అని అర్థం.
  3. యథార్థానికి SRI అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని అర్థం.
  4. ఏ వరి విత్తనాన్నైనా తీసుకొని ఈ పద్ధతిలో పండించవచ్చు.
  5. శ్రీ వరిలో నీరు పెట్టే విధానం, నాటే విధానం, కలుపు నివారణ విధానం భిన్నంగా ఉంటుంది.
  6. సాధారణంగా ఎకరాకు 30 కిలోల విత్తనాలు వాడితే శ్రీ వరి సాగులో కేవలం 2 కిలోల విత్తనం సరిపోతుంది.
  7. సాధారణ వరి సేద్యంలో ఒక కిలో ధాన్యం పండించడానికి సుమారు 5000 లీటర్లు నీరు కావాలి. శ్రీ వరికి 2500 నుండి 3000 లీటర్ల నీరు సరిపోతుంది.
  8. శ్రీ వరి విధానం వల్ల విత్తన కొరతని నివారించవచ్చు. నీటిని పొదుపు చేయవచ్చు.
  9. శ్రీ వరి విధానంలో తెగుళ్ళు అదుపులో ఉంటాయి, పురుగు మందుల అవసరం తక్కువ.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Important Questions and Answers

ప్రశ్న 1.
AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 3

పోషక పదార్థంఉపయోగం
నత్రజనికొత్త ఆకులు, పుష్పాలు వేగంగా వస్తాయి.
భాస్వరము (ఫాస్పరస్)వేళ్ళు నేలలోకి చొచ్చుకుపోవడానికి, నేలలోని పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి
పొటాషియంక్రిమికీటకాల నుండి రోగ నిరోధకశక్తిని పెంపొందించడం, వాసన, రంగు, రుచి వంటివి పెంచడం.

ఎ) ఏ పంటలో ఆకులు త్వరగా ఏర్పడతాయి? ఎందుకు?
జవాబు:
చెరుకుపంట. ఎందుకంటే అది 90% నత్రజనిని వినియోగించుకుంటుంది. నత్రజని కొత్త ఆకులు ఏర్పడటానికి తోడ్పడుతుంది.

బి) ఏ పంటలో వేర్లు లోతుగా చొచ్చుకొని పోవు?
జవాబు:
తృణధాన్యాలు

సి) ఏ పంట చీడలను ఎక్కువ ప్రతి రోధకతను కలిగి వుంటుంది?
జవాబు:
చెరుకు పంట

డి) పై పట్టికను బట్టి ఏ పంటను పండించుట వలన రైతు ఎక్కువ దిగుబడి పొందుతాడు.
జవాబు:
చెరుకుపంట

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 2.
రైతులకు సహాయం చేయుటలో వానపాముల పాత్రను నీవు ఏ విధంగా ప్రశంసిస్తావు.
జవాబు:

  1. వానపామును ‘కర్షకమిత్రుడు’ అంటారు.
  2. నేలను గుల్లపరచి, నేలలోనికి గాలి ప్రవేశాన్ని కల్పిస్తుంది.
  3. వానపాము తమ సేంద్రియ వ్యర్థాల ద్వారా నేలను సారవంతం చేసి రైతుకు ఎరువులు వాడవలసిన పనిలేకుండా చేస్తాయి. రైతుకు అధిక పంట దిగుబడిని ఇస్తాయి.

ప్రశ్న 3.
రైతులు ఒకే విధమైన పంటనే పండిస్తే ఏమౌతుంది?
జవాబు:
a) రైతులు ఒకే విధమైన పంటను పండిస్తుంటే పంట దిగుబడి తగ్గిపోతుంది.
b) భూసారం తగ్గిపోతుంది.
c) పంటలను ఆశించే చీడపీడలు ఎక్కువ అవుతాయి.

ప్రశ్న 4.
క్రింది సమాచారం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
సాధారణంగా రైతులు కృత్రిమంగా తయారుచేసిన ఎరువులు, కీటకనాశనులు ఉపయోగించి పంటపై వచ్చే కీటకాలను అదుపులో ఉంచుతారు. వీటితోపాటు కొన్ని సహజ కీటకనాశన పద్దతులను కూడా ఉపయోగిస్తారు.
1. పై సమాచారం వ్యవసాయంలోని ఏ అంశమును తెలియజేస్తుంది?
2. కృత్రిమంగా తయారుచేసిన కొన్ని ఎరువులను, కీటకనాశనులను పేర్కొనండి.
3. కృత్రిమ కీటకనాశనులకు, సహజ కీటకనాశనులకు గల తేడాలేమిటి?
4. ఏవైనా రెండు సహజ కీటకనాశన పద్దతులను గూర్చి రాయండి.
జవాబు:
1) పంటలను పరిరక్షించే పద్ధతులను పాటించడం

2) D.A.P సూపర్ ఫాస్ఫేట్ D.D.T, హెప్టాక్లోర్

3) కృత్రిమ కీటక నాశనులు విషపూరిత రసాయన పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి “మిత్ర కీటకాలను” కూడా చంపివేస్తాయి. సహజ కీటక నాశనులు అంటే పంటలకు నష్టాన్ని కలిగించే అనేక కీటకాలను ఆహారంగా చేసుకొనే సాలెపురుగులు, క్రిసోపా, మిరిబ్స్, లేడీబర్డ్, బీటిల్, డ్రాగన్ఎ మొదలగునవి. ఇవి మిత్ర కీటకాలను నాశనం చేయవు. ఎటువంటి దుష్ఫలితాలను ఇవి పంటలపై చూపించవు.

4) ఎ) “బాసిల్లస్ తురింజెనెసిస్” వంటి బాక్టీరియాలు కొన్ని రకాల హానికారక కీటకాలను నాశనం చేస్తాయి.
బి) మిశ్రమ పంటల సాగు వలన కొన్ని రకాల కీటకాల నుండి పంటలను కాపాడుకోవచ్చు.
ఉదా : వరి సాగు తర్వాత మినుము లేక వేరుశనగ సాగుచేస్తే వరిలో వచ్చే “టుందొ” వైరసను అదుపులో ఉంచవచ్చు.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. పంట ఉత్పత్తి పెంచడానికి అవసరమయ్యే కారకము
A) నాటిన విత్తన రకం
B) నేల స్వభావం, లక్షణాలు
C) నీటి లభ్యత, ఎరువులు, పోషక పదార్థాల అందుబాటు
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు

2. ఆహార ఉత్పత్తిని ఈ విధంగా పెంచవచ్చు.
A) సాగుభూమి విస్తీర్ణం పెంచడం ద్వారా
B) ఎక్కువ దిగుబడి ఇచ్చు సంకర రకాల అభివృద్ధి ద్వారా
C) పంట మార్పిడి ద్వారా
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

3. పంట మార్పిడి దీనిని పరిరక్షిస్తుంది.
A) నేల సారాన్ని
B) ఎక్కువ దిగుబడినిచ్చే సంకర రకాలు
C) నేల యాజమాన్యము
D) పంట యాజమాన్యము
జవాబు:
A) నేల సారాన్ని

4. స్టార్ట్ అనునది
A) క్రొవ్వు
B) కార్బోహైడ్రేటు
C) ప్రోటీను
D) విటమిన్
జవాబు:
B) కార్బోహైడ్రేటు

5. 100 గ్రాముల నీరు, 200 గ్రాముల కార్బన్ డయాక్సెడ్‌తో చర్య జరిపి ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేటును ఏర్పరుస్తుంది?
A) 280 గ్రాములు
B) 360 గ్రాములు
C) 180 గ్రాములు
D) 380 గ్రాములు
జవాబు:
C) 180 గ్రాములు

6. మొక్కలు విడుదల చేసే నీరు వీటి ద్వారా ఆవిరి అవుతుంది.
A) బాహ్యచర్మము
B) పత్రాంతర కణజాలం
C) పత్ర రంధ్రాలు
D) దారువు
జవాబు:
C) పత్ర రంధ్రాలు

7. ఈ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి.
A) వరి
B) మినుము
C) వేరుశనగ
D) సజ్జ
జవాబు:
A) వరి

8. నీటిని పరిరక్షించే నీటి పారుదల పద్ధతి
A) కాలువ నీటి వ్యవస్థ
B) చెరువు నీటి వ్యవస్థ
C) డ్రిప్ ఇరిగేషన్
D) ఏదీకాదు
జవాబు:
C) డ్రిప్ ఇరిగేషన్

9. ఈ క్రింది వాటిలో స్థూల పోషకము ఏది?
A) ఇనుము
B) నత్రజని
C) రాగి
D) మాంగనీసు
జవాబు:
B) నత్రజని

10. నేలకు పోషకాలను చేర్చేది
A) పంట మార్పిడి
B) సేంద్రియ ఎరువు
C) రసాయన ఎరువులు
D) అన్నియు
జవాబు:
D) అన్నియు

11. నేల నుండి అధిక మొత్తంలో పోషకాలను ఉపయోగించుకునేవి ……….
A) ప్రధాన ధాన్యాలు
B) చిరు ధాన్యాలు
C) దుంపలు
D) అన్నియు
జవాబు:
A) ప్రధాన ధాన్యాలు

12. చిక్కుడు జాతి పంట ఒక హెక్టారుకు అందించే నత్రజని
A) 150 నుండి 200 కి.గ్రా.
B) 50 నుండి 150 కి.గ్రా.
C) 100 నుండి 150 గ్రా.
D) 25 నుండి 100 కి.గ్రా.
జవాబు:
B) 50 నుండి 150 కి.గ్రా.

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

13. నీలి ఆకుపచ్చ శైవల వర్గనమును ఈ పంటకు వినియోగిస్తారు.
A) బంగాళాదుంప పంట
B) ములగకాయ పంట
C) వేరుశనగ పంట
D) వరి పంట
జవాబు:
D) వరి పంట

14. పొలమును పరిశీలించి సరియైన పంటను పండించడానికి సలహాలిచ్చేది
A) వ్యవసాయ అధికారి
B) భూసార పరీక్షా కేంద్ర నిపుణుడు
C) A మరియు B
D) గ్రామ అభివృద్ధి అధికారి
జవాబు:
C) A మరియు B

15. పంచగవ్యలో ఉండే ముఖ్య పదార్థాలు
A) పాలు, పెరుగు
B) నెయ్యి, పేడ
C) ఆవు మూత్రం
D) పైవి అన్నియు
జవాబు:
B) నెయ్యి, పేడ

16. నేల ఎక్కువకాలం అధిక దిగుబడి ఇవ్వడం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది.
A) నేలలో పోషక పదార్థాల లభ్యత
B) నేల యొక్క సరియైన భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు
C) A మరియు B
D) వర్షము
జవాబు:
B) నేల యొక్క సరియైన భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు

17. సేంద్రీయ సేద్య విధానములో రైతు
A) సహజ ఎరువులను వాడతాడు.
B) సహజ కీటకనాశ పద్ధతులను అవలంబిస్తాడు
C) పంట మార్పిడి మరియు మిశ్రమ పంట విధానము పాటిస్తాడు
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు

18. యూరియాలో నత్రజని శాతం
A) 36%
B) 46%
C) 56%
D) 44%
జవాబు:
B) 46%

19. కీటకనాశనులు వీటిని సంహరించడానికి వాడతారు.
A) సూక్ష్మజీవులు
B) పురుగులు
C) కీటకాలు
D) శిలీంధ్రాలు
జవాబు:
C) కీటకాలు

20. మన రాష్ట్రంలో అధిక పరిమాణంలో క్రిమి సంహారక మందులను ఉపయోగించే జిల్లాలు
A) గుంటూరు
B) ప్రకాశం
C) నెల్లూరు
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

21. మిత్ర కీటకమును గుర్తించుము.
A) సాలెపురుగు, డ్రాగన్ ప్లే
B) క్రిసోపా, మిరిబ్స్
C) లేడీ బర్డ్ బిడిల్
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు

22. కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసించేది
A) బాసిల్లస్
B) ట్రాకోడర్మా
C) రైజోబియం
D) ఎజటోబాక్టర్
జవాబు:
B) ట్రాకోడర్మా

23. కీటకాలను నాశనం చేసే బాక్టీరియా
A) బాసిల్లస్ తురంజెనెసిస్
B) రైజోబియం
C) ఎజటోబాక్టర్
D) బాసిల్లస్ సూడోమోనాస్
జవాబు:
A) బాసిల్లస్ తురంజెనెసిస్

24. వరి సాగు చేసిన తరువాత మినుములను సాగు చేస్తే దీనిని అదుపులో ఉంచవచ్చు.
A) టుంగ్రోవైరస్
B) ధాన్యాన్ని తినే గొంగళిపురుగు
C) కాండం తొలుచు పురుగు
D) పైవి అన్నియు
జవాబు:
A) టుంగ్రోవైరస్

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

25. నత్రజనిని స్థాపించు బాక్టీరియా
A) రైజోబియం
B) బాసిల్లస్
C) మైకోరైజా
D) పెన్సిలియమ్
జవాబు:
A) రైజోబియం

26. 600 Kgల ధాన్యాన్ని పండించటానికి అవసరమయ్యే నేల
A) 1.4 చ.కి.మీ.
B) 2.4 చ.కి.మీ.
C) 3.4 చ.కి.మీ.
D) 4.4 చ.కి.మీ.
జవాబు:
A) 1.4 చ.కి.మీ.

27. అధిక దిగుబడి సాధించటానికి వ్యవసాయదారులు ఉపయోగించు పద్ధతి
A) అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి
B) అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులు
C) పంటలను పరిరక్షించే పద్ధతులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

28. పూలసాగునేమంటారు?
A) హార్టికల్చర్
B) ఫ్లోరీకల్చర్
C) ఎగ్రికల్చర్
D) ఓలరీకల్చర్
జవాబు:
B) ఫ్లోరీకల్చర్

29. ఒక మొక్క ఒక లీటర్ నీటిని శోషించుకుంటే అందులో కార్బోహైడ్రేడ్ల తయారీకి ఉపయోగపడేది.
A) 1 మి.లీ.
B) 10 మి.లీ.
C) 20 మి.లీ.
D) 50 మి.లీ.
జవాబు:
A) 1 మి.లీ.

30. ఈ క్రింది వానిలో తక్కువ నీరు ఉన్నచోట పండే పంట
A) వరి
B) మొక్కజొన్న
C) గోధుమ
D) చెరకు
జవాబు:
B) మొక్కజొన్న

31. బిందు సేద్యం ద్వారా
A) నీటి వృథా అరికట్టవచ్చు
B) పంట దిగుబడి పెరుగుతుంది
C) ఎరువుల వాడకం తక్కువ
D) పురుగులు ఆశించవు
జవాబు:
A) నీటి వృథా అరికట్టవచ్చు

32. ఈ క్రింది వానిలో సూక్ష్మ పోషకం
A) నత్రజని
B) ఇనుము
C) భాస్వరం
D) పొటాషియం
జవాబు:
B) ఇనుము

33. ఈ క్రింది వానిలో స్థూల పోషకం
A) మాంగనీసు
B) భాస్వరం
C) బోరాన్
D) జింక్
జవాబు:
B) భాస్వరం

34. పంట మార్పిడికి ఉపయోగించేవి ఏకుటుంబపు మొక్కలు?
A) మీలియేసి
B) విలియేసి
C) లెగ్యుమినేసి
D) ఆస్టరేసి
జవాబు:
C) లెగ్యుమినేసి

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

35. క్రింది వానిలో మిశ్రమ పంటకు సంబంధించి సత్య వాక్యం
A) పప్పుధాన్యాలు, గింజ ధాన్యాలు కలిపి పండిస్తారు.
B) స్వల్పకాలికాలు, దీర్ఘకాలికాలు కలిపి పండిస్తారు.
C) మామూలు పంటలు, ఆరుతడి పంటలు కలిపి పండిస్తారు.
D) పండ్లతోటల్లో కందులు, మినుములు పండిస్తారు.
జవాబు:
C) మామూలు పంటలు, ఆరుతడి పంటలు కలిపి పండిస్తారు.

36. క్రింది వానిలో అధిక సాంద్రత గల జీవ ఎరువు
A) జట్రోపా విత్తనం పొడి
B) వేప విత్తనం పొడి,
C) కొబ్బరి విత్తనం పొడి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

37. స్థూల సేంద్రీయ ఎరువు
A) జంతు విసర్జకాలు
B) క్రుళ్ళిన పదార్థాలు
C) చెత్త
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

38. పచ్చిరొట్ట ఎరువు కానిది
A) మినుము
B) పెసర
C) పిల్లి పెసర
D) వెంపలి
జవాబు:
A) మినుము

39. ఒక హెక్టారులో 8 నుండి 25 టన్నుల పచ్చిరొట్ట ఎరువును పండించి నేలలో కలియ దున్నినపుడు ఎంత నేలలోకి పునరుద్ధరింపబడుతుంది?
A) 50 – 60 కేజీలు
B) 60 – 80 కేజీలు
C) 70 – 90 కేజీలు
D) 50 – 75 కేజీలు
జవాబు:
C) 70 – 90 కేజీలు

40. వర్మీకంపోస్టు బెడ్ లోపల ఉండకూడనివి
A) పచ్చిపేడ
B) గాజుముక్కలు
C) ఇనుపముక్కలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

41. క్రింది వానిలో ఫాస్ఫరసను కరిగించే బాక్టీరియా
A) రైజోబియం
B) అజటోబాక్టర్
C) అజోస్పైరిల్లమ్
D) బాసిల్లస్
జవాబు:
D) బాసిల్లస్

42. కీటకాలు లేక పరాగ సంపర్కానికి సమస్య వచ్చిన పంట
A) వరి
B) కంది
C) వేరుశనగ
D) ప్రొద్దుతిరుగుడు
జవాబు:
D) ప్రొద్దుతిరుగుడు

43. ఈ క్రింది వానిలో మిత్రకీటకం కానిది
A) మిడత
B) సాలెపురుగు
C) గొల్లభామ
D) కందిరీగ
జవాబు:
A) మిడత

44. కీటకాలను నాశనం చేసే బాక్టీరియా
A) బాసిల్లస్ థురింజెనిసిస్
B) రైజోబియం
C) సూడోమోనాస్
D) అజోస్పెరిల్లమ్
జవాబు:
A) బాసిల్లస్ థురింజెనిసిస్

45. వరి సాగు చేసిన తర్వాత ఏ పంటను పండించటం ద్వారా వరిలో వచ్చే టుంగ్రో వైరసీని అదుపులో ఉంచవచ్చు?
A) మినుములు
B) శనగ
C) A & B
D) పైవేవీ కావు
జవాబు:
C) A & B

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

46. ప్రత్తి పండించిన తర్వాత ఈ పంటలు పండిస్తే ధాన్యాన్ని తినే గొంగళి పురుగుల్ని అదుపు చేస్తాయి.
A) పెసర, పిల్లిపెసర
B) జొన్న, మొక్కజొన్న
C) జనుము, నువ్వులు
D) మొక్కజొన్న, నువ్వులు
జవాబు:
D) మొక్కజొన్న, నువ్వులు

47. కందులు పండించిన తర్వాత ఈ పంటలు పండించటం ద్వారా కాండం తొలుచు పురుగు మరియు ఎండు తెగులును నివారించవచ్చు.
A) పెసర, పిల్లి పెసర
B) జొన్న, మొక్కజొన్న
C) జనుము, నువ్వులు
D) మొక్కజొన్న, నువ్వులు
జవాబు:
B) జొన్న, మొక్కజొన్న

48. ఒక పంట పండించటం ద్వారా రెండవ పంటలో తెగుళ్ళను నివారిస్తే అటువంటి పంటలను ఏమంటారు?
A) ఆరుతడి పంటలు
B) ఆకర్షక పంటలు
C) వికర్షక పంటలు
D) లింగాకర్షక పంటలు
జవాబు:
B) ఆకర్షక పంటలు

49. విచక్షణారహితంగా ఎరువులు వాడటం వలన
A) నేల కలుషితమవుతుంది.
B) నీరు కలుషితమవుతుంది.
C) జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

50. విత్తనాలు లేని సంకర జాతి వంగడాలు ఏ మొక్కల్లో ఉత్పత్తి చేసారు?
A) ద్రాక్ష
B) బొప్పాయి
C) దానిమ్మ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

51. సంకరణం ద్వారా వచ్చే మొక్కల్లో ఉండనిది
A) అధిక దిగుబడినిస్తాయి.
B) వ్యాధులకు ప్రతిరోధకత కల్గి ఉంటాయి.
C) ఎక్కువ నీటితో పండుతాయి.
D) ఆమ్ల నేలల్లో కూడా పండుతాయి.
జవాబు:
C) ఎక్కువ నీటితో పండుతాయి.

52. 1950 నాటికి మనదేశంలో ఉన్న వరి వంగడాల సంఖ్య
A) 225
B) 335
C) 445
D) 555
జవాబు:
C) 445

53. బంగాళదుంప, టమాట రెండింటిని సంకరం చేయటం ద్వారా వచ్చినటువంటి క్రొత్త పంట
A) టొటాటో
B) పొమాటో
C) బటాటా
D) వాటి మధ్య సంకరం జరగదు
జవాబు:
B) పొమాటో

54. GMS అనగా
A) జెనరల్లి మాడిఫైడ్ సీడ్స్
B) జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్
C) జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ సీడ్స్
D) జెనెటిక్ మాటర్ ఆఫ్ సీడ్స్
జవాబు:
B) జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్

55. శ్రీవరి పద్దతిలో SRI అనగా
A) సిస్టమాటిక్ రైస్ ఇంటిగ్రేషన్
B) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్
C) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంప్రూవ్మెంట్
D) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇరిగేషన్
జవాబు:
B) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్

56. సాధారణ పదతిలో ఎకరాకు 30 కిలోల విత్తనం నాటటానికి అవసరమయితే శ్రీవరి పద్దతిలో, ఎంత అవసరమవుతుంది?
A) 2 కిలోలు
B) 4 కిలోలు
C) 20 కిలోలు
D) 15 కిలోలు
జవాబు:
A) 2 కిలోలు

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

57. సాధారణ వరి సేద్యంలో ఒక కిలో వరిధాన్యం పండించటానికి 5,000 లీటర్లు నీరు అవసరమయితే శ్రీ వరి పద్దతిలో అవసరమయ్యే నీరు
A) 1000 లీటర్లు
B) 1500 లీటర్లు
C) 2000 లీటర్లు
D) 2,500 లీటర్లు
జవాబు:
D) 2,500 లీటర్లు

58. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) రబీ పంట – ఆవాలు
2) ఖరీఫ్ పంట – ప్రత్తి
3) మిశ్రమ పంట – చెరకు
A) 1,2
B) 2, 3
C) 1 మాత్రమే
D) 3 మాత్రమే
జవాబు:
D) 3 మాత్రమే

59. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) డ్రాగన్ ఫై – సహజ కీటక నాశనులు
2) కొబ్బరి నీరు – పంచగవ్వ
3) కులీ – మిశ్రమపంట
A) 1, 2
B) 2, 3
C) 1 మాత్రమే
D) 3మాత్రమే
జవాబు:
D) 3మాత్రమే

60. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) బాక్టీరియా – రైజోబియం
2) ఆల్గే – నీలి ఆకుపచ్చ శైవలాలు
3) ఫంగై – సూడోమోనాస్
A) 1, 2
B) 2, 3
C) 2 మాత్రమే
D) 3 మాత్రమే
జవాబు:
D) 3 మాత్రమే

61. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) వరి – వాంజా
2) పొగాకు – గడ్డి చామంతి
3) వేరుశనగ – పొగాకు మల్లె
A) 1 మాత్రమే
B) 1,2
C) 2,3
D) 3 మాత్రమే
జవాబు:
C) 2,3

పంట రకంపంటపై పెరిగే కలుపు మొక్కలు
వరిగరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగగురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములుగరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్నపచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలుఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

పై పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.

62. అన్ని పంటలలో పెరిగే కలుపు మొక్క
a) గరిక b) సార్వీనియా మొలస్కా c) తుంగ d) పావలికూర
A) a, b మరియు C
B) a, c మరియు d
C) bమరియు d మాత్రమే
D) a మరియు c మాత్రమే
జవాబు:
D) a మరియు c మాత్రమే

63. క్రింది పటాలలో మిశ్రమ పంటను సూచించే చిత్రం ఏది?
AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4
A) a, b
B) b, c
C) c, d
D) a, b, c, d
జవాబు:
A) a, b

64. ఈ క్రిందివానిలో సరిగా గుర్తించిన జతను ఎన్నుకోండి.
1) నైట్రోజన్ ( ) a) వేళ్ళు నేల లోనికి చొచ్చుకొని పోవడానికి
2) ఫాస్ఫరస్ ( ) b) క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం
3) పొటాషియం ( ) c) పుష్పాలు వేగంగా రావడం
A) 1 – a, 2 – c, 3 – b
B) 1 – c, 2 – b, 3 – a
C) 1 – a, 2 – b, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

65. ఈ క్రిందివానిలో సరిగా గుర్తించిన జతను ఎన్నుకోండి.
1) అజటో బాక్టర్ ( ) a) G.M. విత్తనం
2) B.T ప్రత్తి ( ) b) మిశ్రమ పంట
3) మిర్చి పంటలో పొద్దు తిరుగుడు పువ్వు ( ) c) సేంద్రీయ ఎరువు
A) 1 – c, 2 – b, 3 – a
B) 1 – a, 2 – c, 3 – b
C) 1 – a, 2 – b, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

66. బాసిల్లస్ తురింజెనిసిస్ అనునది
A) పంటలను నాశనం చేస్తుంది.
B) కలుపు నాశనం చేస్తుంది.
C) చీడలను నాశనం చేస్తుంది.
D) మొక్కలకు నత్రజనిని సరఫరా చేస్తుంది
జవాబు:
C) చీడలను నాశనం చేస్తుంది.

67. స్థూల జీవ ఎరువులకు ఉదా||
A) జంతు సంబంధ విసర్జక పదార్థాలు
B) ప్లాస్టిక్ వ్యర్థాలు
C) జట్రోఫా విత్తన పొడి
D) కంపోస్ట్
జవాబు:
A or D

68. బంతిపూల చెట్లను మిర్చి పంటలో సాగు చేయడం
A) తెగుళ్ళ నివారణకు జీవనియంత్రణ
B) పంట మార్పిడి
C) సహజీవన పద్దతి
D) ఏదీకాదు
జవాబు:
A) తెగుళ్ళ నివారణకు జీవనియంత్రణ

69. రైతులకు మిత్రులైన కీటకములు
A) సాలెపురుగు
B) డ్రాగన్ ఫ్లె
C) మిరియడ్లు
D) పైవన్ని
జవాబు:
D) పైవన్ని

70. వరి, పొగాకు వంటి పంటల్లో కనిపించే లార్వాలను గుడ్ల దశలోనే నాశనం చేసే బ్యాక్టీరియా
A) లాక్టోబాసిల్లస్
B) బాసిల్లస్ తురంజియెన్సిస్
C) రైజోబియం
D) అజటోబాక్టర్
జవాబు:
B) బాసిల్లస్ తురంజియెన్సిస్

71. కింది వాటిలో తక్కువ మోతాదులో మొక్కలకు అవసరమయ్యేవి
A) నత్రజని, పొటాషియం
B) పొటాషియం , భాస్వరం
C) బోరాన్, నత్రజని
D) బోరాన్, జింక్
జవాబు:
D) బోరాన్, జింక్

72. ఇతర కీటకాలను ఆహారంగా తీసుకొని రైతుకు సహాయపడే కీటకాలు
A) పరభక్షకులు
B) మిత్రకీటకాలు
C) కీటకనాశనులు
D) ఆకర్షక కీటకాలు
జవాబు:
B) మిత్రకీటకాలు

73. పంచగవ్య తయారుచేయడానికి ఉపయోగపడేవి
1) ఆవుపేడ, ఆవునెయ్యి
2) కొబ్బరినీరు, కల్లు
3) చెరుకురసం
4) ఆవుమూత్రం
A) 1 మాత్రమే
B) 2, 3
C) 3, 4
D) పైవన్నీ
జవాబు:
C) 3, 4

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

74. జీవసేద్యానికి సరైన సూచన
A) జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుట
B) వర్మీకంపోస్ట్ ఉపయోగించుటకు నిరుత్సాహపర్చుట
C) ఎక్కువ మోతాదులో యూరియా వాడుట.
D) ఎక్కువ మోతాదులో క్రిమిసంహారక మందులు వాడుట
జవాబు:
A) జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుట

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 5

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

These AP 9th Biology Important Questions and Answers 7th Lesson జంతువులలో ప్రవర్తన will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 7th Lesson Important Questions and Answers జంతువులలో ప్రవర్తన

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా ఎందుకు అధ్యయనం చేయాలి?
జవాబు:
జంతువులు తమలో తాము, ఇతర జీవులతో పర్యావరణంతో జరిపే పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి జంతు ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి.

ప్రశ్న 2.
జంతువులలో బాహ్య, అంతర్గత ప్రచోదనాలుగా పనిచేసేవి ఏవి?
జవాబు:
జంతువులలో ఇతర జంతువుల నుంచి ఆపద, ధ్వని, వాసన లేక తన చుట్టూ ఉన్న వాతావరణం మొదలైనవి బాహ్య ప్రచోదనలు (External Stimuli) గా పని చేస్తాయి. ఆకలి, భయం మొదలైనవి అంతర్గత ప్రచోదనాలు (Internal Stimuli) గా పని చేస్తాయి.

ప్రశ్న 3.
జంతువులలో ఇప్పటి వరకు పరిశోధించిన ప్రవర్తనారీతులు ఏవి?
జవాబు:
జంతువులలో ఇప్పటి వరకు పరిశోధించిన ప్రవర్తనారీతులు :

  1. సహజాత ప్రవృత్తి (Instinct)
  2. అనుసరణ (Imprinting)
  3. నిబంధన (Conditioning)
  4. అనుకరణ (Imitation)

ప్రశ్న 4.
సహజాత ప్రవృత్తి అంటే ఏమిటి? ఉదాహరణాలు ఇవ్వండి.
జవాబు:
పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు.

ప్రశ్న 5.
నిబంధన అంటే ఏమిటి?
జవాబు:
సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తనను ‘నిబంధన’ అంటారు. ఇది నేర్చుకోవలసిన ప్రవర్తన. ఇది పుట్టుకతో రాదు.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 6.
అనుకరణ అంటే ఏమిటి?
జవాబు:
ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తనను ‘అనుకరణ’ అంటారు.

ప్రశ్న 7.
మానవుని ప్రవర్తన ఇతర జంతువుల కన్నా ఎందుకు సంక్లిష్టంగా ఉంటుంది?
జవాబు:
మానవుల ప్రవర్తన ఇతర జంతువులలో కన్నా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైనవారు. ఆలోచించగల శక్తి గలిగినవారు. మానవులకు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు.

ప్రశ్న 8.
జంతువులు తమ శత్రువుల నుండి రక్షించుకోవడానికి చూపే భావాలు ఏవి?
జవాబు:
పాములు బుస కొట్టడం, కుక్కలు అరవడం (మొరగడం), ముళ్ళపంది దాని గట్టి రోమాలు (ముళ్ళు)ను నిక్కబొడుచుకునేలా చేయడం, టాస్మేనియన్ డెవిల్ అనే జంతువు శరీరం నుండి దుర్వాసన రావడం ఇవన్నీ కూడా ఆయా జంతువులు తమ శత్రువుల నుండి రక్షించుకోవడానికి చూపే భావాలు.

ప్రశ్న 9.
‘ఇథాలజీ’ అంటే ఏమిటి? దాని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయటాన్ని ఇథాలజీ (Ethology) అంటారు. ఇది జీవశాస్త్రంలో భాగం. ఇథాలజీ ముఖ్య ఉద్దేశ్యం సహజ వాతావరణంలో జంతువుల ప్రవర్తనను పరిశీలించడం.

ప్రశ్న 10.
జంతువుల ప్రవర్తనపై పరిశోధనలకు నోబుల్ పురస్కారం లభించినవారు ఎవరు?
జవాబు:
1930లో డచ్ జీవశాస్త్రవేత్త ‘నికోలస్ టింబర్ జన్’ జంతువులపై పరిశోధనలు ఆస్ట్రియా జీవశాస్త్రవేత్త ‘కొనార్డ్ లారెంజ్’ మరియు కార్లవాన్ ఫ్రితో కలసి నిర్వహించారు. 1973లో జంతువుల ప్రవర్తనపై పరిశోధనలకు గాను వీరికి నోబుల్ పురస్కారం లభించింది.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
“గుర్తు కట్టడం” అంటే ఏమిటో వివరించండి.
జవాబు:

  1. పక్షులలాగానే కొన్ని జంతువులు కూడా ఆహారం కోసం, గూడు కోసం చాలా దూరం వలస పోతాయి.
  2. ఈ వలస జంతువులను గుర్తించడానికి వాటికి అన్వేషణ పరికరాలు కడతారు.
  3. ఈ విధమైన గుర్తింపు సూచికలు జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 2.
స్క్రజ్ ఆహారాన్ని దాచే విధమును రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 1

  1. స్క్రజ్ అనే పక్షి దాని ఆహారం మరొక పక్షి సమక్షంలో దాచిపెడుతుంది.
  2. కొద్దిసేపటి తరువాత ఆ పక్షి ఒక పథకం ప్రకారం దానిని దొంగిలిస్తుంది.
  3. ఇది ప్రయోగపూర్వకముగా నిరూపించబడింది.

ప్రశ్న 3.
ప్రతీకార చర్యలకు రెండు ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. ఏదైనా వేడివస్తువును లేదా మొనదేలిన దానిని తాకినప్పుడు చేతిని వెనక్కి తీసుకోవడం.
  2. కంటికి ఆపద కలిగినట్లయితే కన్ను వెంటనే మూసుకోవడం.
  3. కంటికి ఎక్కువ కాంతి తగిలినప్పుడు తారక కుదించుకుపోవడం.
  4. ఏదైనా ముక్కులోనికి ప్రవేశించినపుడు చీదడం.
  5. దుమ్ముని పీల్చినపుడు దగ్గడం మొదలైనవి.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జంతువులలో ప్రవర్తన అంటే ఏమిటి? అది ఏమి తెలియచేస్తుంది?
జవాబు:

  1. జంతువుల ప్రవర్తన అనేది జంతువులు ఒకదానితో ఒకటి, ఇతర జంతువులతో, పరిసరాలతో ఎలా ప్రవర్తిస్తాయో తెలిపే శాస్త్రీయ అధ్యయనం.
  2. ఇది జంతువులు తమ భౌతిక పరిసరాలతో, అదే విధంగా ఇతర జంతువులతో ఎలా సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయో తెలుపుతుంది.
  3. జంతువులు ఆవాసాలను, వనరులను ఎలా వెతుకుతాయి, సంరక్షిస్తాయి, శత్రువుల నుండి తమను తాము ఎలా కాపాడుకుంటాయి, ప్రత్యుత్పత్తి కొరకు భిన్న లింగ జీవిని ఎలా ఎన్నుకుంటాయి, తమ సంతతిని ఎలా కాపాడు కుంటాయనేవి కూడా వాటి ప్రవర్తనను తెలియచేస్తాయి.

ప్రశ్న 2.
ఇవాన్ పాషాప్ నిబంధనపై జరిపిన పరిశోధనను రాయుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 2

  1. ఇవానా వోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త నిబంధనపై అనేక పరిశోధనలు చేశాడు.
  2. అతను కుక్కకు ఆహారం చూపించిన వెంటనే అది లాలాజలం స్రవించడం గమనించాడు. ఇది ఒక సహజ ప్రతిస్పందన.
  3. ఆహారం తీసుకొచ్చే వ్యక్తిని చూసినప్పుడు కూడా కుక్క నోటిలో లాలాజలం స్రవించడం పావ్లోవ్ గమనించాడు.
  4. వ్యక్తి ఆహారం తీసుకురానప్పటికీ కుక్క నోటిలో లాలాజలం స్రవించడం గమనించాడు.
  5. ఆహారంతో పాటు ఒక గంట శబ్దాన్ని వినిపించి ప్రయోగాలు చేశాడు.
  6. గంట మోగినప్పుడు ఆహారం పెట్టడం అలవాటు చేశాడు.
  7. ఆహారం పెట్టకపోయినా గంట శబ్దం వినిపించగానే కుక్క నోటినుండి లాలాజలం స్రవించడం మొదలైంది.
  8. గంట మోగిన వెంటనే లాలాజలం స్రవించడం ఒక నిబంధన. లాలాజలం స్రవించడం ఆ నిబంధనకి ప్రతిచర్య అయితే ఆ ప్రతిచర్యను నిబంధన సహిత ప్రతిచర్య అంటారు.

ప్రశ్న 3.
మానవ ప్రవర్తనలో అనుకరణ వలన లాభమేమిటి? నష్టమేమిటి?
జవాబు:

  1. అనుకరణ కొత్త విషయాలు నేర్చుకోవడంలో, పాఠ్యాంశాలలో మెలకువలు నేర్చుకోవడంలో, ఆటలో నైపుణ్యం పొందడంలో ఉపయోగపడుతుంది.
  2. స్నేహితులతో జత కట్టడానికి కౌమార దశలో ఉన్న పిల్లలు పొగ తాగడం, మద్యం సేవించడం లేక మాదక ద్రవ్యాలు వాడడం వంటి దురలవాట్లకు బానిసలవుతారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇవి అనుకరణ వలన కలిగే నష్టాలు.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 4.
ప్రకటన రంగం వారు నిబంధన సహాయంతో ఒక వ్యక్తి ఆచరణలో మార్పు ఏ విధంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తారు?
జవాబు:

  1. ప్రకటన రంగంవారు నిబంధనను ఉపయోగించడంలో నిపుణులు.
  2. తమ తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాళ్ళు ఆకర్షణీయమైన ఉద్వేగపూరిత చిత్రాలను వినియోగించుకుంటుంటారు.
  3. సినీ ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులతో తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయిస్తారు.
  4. ఆకర్షణీయమైన ఛాయాచిత్రాలను ఉపయోగించి వినియోగదారుడిని ఆ ఉత్పత్తులను వాడేలా నిబంధన కలుగచేస్తారు.
  5. ప్రజలు ఆ ఉత్పత్తుల వైపు ఆకర్షితులౌతుంటారు. వాటిని కొని వాడుతుంటారు.

ప్రశ్న 5.
ఉడతలు ఆహారాన్ని దాచే విధానాన్ని వివరించండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 3

  1. ఉడత ఆహారాన్ని అమితాశక్తి కలిగించే రీతిలో దాచిపెడుతుంది.
  2. అవి ఎప్పుడూ వాటి ఆహారాన్ని ఎవరో దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు అనే రీతిలో ప్రవర్తిస్తాయి.
  3. వేరే వాటిని పక్కదారి పట్టించడానికి చాలా చోట్ల నేలలో రంధ్రాలు చేస్తాయి.
  4. వాటిని ఆకులతో, ఇతర పదార్థాలతో కప్పుతాయి. నిజానికి చాలా రంధ్రాలలో ఆహారం ఉండదు.
  5. ఈ విధంగా ఉడతలు మిగతా జీవులను ఆ రంధ్రాలలో ఆహారం ఉందని నమ్మేలా చేస్తాయి.

ప్రశ్న 6.
ఉత్తర అమెరికాలో నివసించే బీవర్ క్షీరదం గురించి రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 4

  1. బీవర్ క్షీరదం నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుంది.
  2. అతి పెద్ద పెద్ద చెట్లను సైతం తన పదునైన పళ్ళతో కొరికి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది.
  3. వీటి సహాయంతో బీవర్ నాలుగు అడుగుల గోడను నిర్మిస్తుంది.
  4. చెట్ల కొమ్మలతో పాటు రాళ్ళను ఉపయోగించి అడ్డుగోడ కట్టి నీటిని నిల్వచేస్తుంది.
  5. దానిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది.

ప్రశ్న 7.
కందిరీగ గూడు ఎలా కడుతుంది? ఆహార సేకరణ ఎలా చేస్తుంది?
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 5

  1. తెలివైన కందిరీగ తన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంటిని నిర్మించుకుంటుంది. ,
  2. బురద మట్టిని ఉపయోగించి గోడలపైన గూడు కట్టుకుంటుంది.
  3. తరువాత ఆహారాన్ని వెదుకుతుంది.
  4. ఆహారాలు ముఖ్యంగా లార్వాలు కనిపించగానే వాటిని కుట్టి విషాన్ని ఎక్కిస్తుంది.
  5. దానిని సేకరించి, తయారుచేసుకున్న గూటిలో పెడుతుంది.
  6. ఈ ఆహారంపైనే కందిరీగలు గుడ్లు పెడతాయి.
  7. ఇది గుడ్ల నుండి ఏర్పడే కందిరీగల లార్వాలకు ఆహారంగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 8.
“డాల్ఫిన్లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఉంటుంది” అని ప్రయోగ పూర్వకంగా నిరూపించినది ఎవరు? ఆయన పరిశోధనలేవి?
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 6

  1. డాల్ఫిన్లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఉంటుందని హెర్మన్ ప్రయోగపూర్వకంగా నిరూపించాడు.
  2. హెర్మన్ నాలుగు బాటిల్ నోస్ డాల్ఫిన్లపై అధ్యయనం చేశాడు.
  3. ఈ పరిశోధనలు హవాయి ద్వీపంలోని “కవలో బేసిన్ మామల్ లాబొరేటరీ”లో జరిపాడు.
  4. నాలుగు డాల్ఫిన్లకు అక్కికోమాయ్, ఫీనిక్స్, అలెన్, హిప్పో అని పేర్లు పెట్టాడు.
  5. డాల్ఫిన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లయితే అవి వాటి పేర్లను గుర్తించు కుంటాయని, సంక్లిష్ట సంకేత భాషకు సమాధానం ఇస్తాయని నిరూపించాడు.
  6. ఉదాహరణకు మూసిన పిడికిలిని చూపించగానే తొట్టి అని, ఎత్తిన చేతులు చూపించగానే బంతి అని, ఎత్తిన ఒక చెయ్యి చూపించగానే తీసుకురమ్మని సంజ్ఞలు ఇచ్చి శిక్షణ ఇస్తే డాల్ఫిన్లు అన్నింటిని కలిపి కూడా అర్థం చేసుకున్నాయి.
  7. ఈ సంజ్ఞలు అన్నీ సవ్యక్రమంలో కలిపి చేయగానే డాల్ఫిన్లు బంతిని తొట్టె నుండి తీసుకువచ్చాయి. సంజ్ఞలు అన్నీ వ్యతిరేకదిశలో చేస్తే బంతిని తొట్టిలోకి నెట్టివేశాయి.
  8. ఏదేని డాల్ఫినను ప్రత్యేక ఈలతో పిలిస్తే అన్ని డాల్ఫిన్లు దానివైపు చూసేవి, ఏ డాల్ఫినను పిలిస్తే అదే డాల్ఫిన్ దగ్గరకు వచ్చేది.

ప్రశ్న 9.
అలెక్స్ అనే బూడిదరంగు ఆఫ్రికా చిలుక యొక్క ప్రవర్తనను వివరించండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 7

  1. 1977లో ఇర్విన్ పెప్పర్ బర్గ్ అలెక్స్ అను ఒక చిలుకను తెచ్చి దానికి శిక్షణ ఇచ్చాడు. నెమ్మదిగా దానికి 100 పదాలు నేర్పాడు.
  2. పదాలు ఉపయోగించి సొంతంగా వాక్యాలు తయారుచేయడం నేర్పాడు.
  3. కొన్ని రోజుల తరువాత అలెక్సకు పసుపురంగు గిన్నె మరియు పసుపుపచ్చ చిప్ప చూపిస్తే ఆ రెండింటి మధ్య భేదాలు, చిన్న చిన్న పోలికలు గుర్తించగలిగింది.
  4. ఇతర చిలకల గుంపునకు శిక్షణ ఇచ్చింది.
  5. ఆపిలను బానరీ అని పిలిచేది. ఎందుకంటే అది అరటిలాగా రుచి, చెర్రీలాగా రంగుతో కనిపించేది. ఈ రకంగా రెండింటిని కలిపి పేరు పెట్టడం అలెక్స్ సృజనాత్మకతకు ప్రతీక.
  6. అలెక్స్ చనిపోయేటప్పటికి 7వ ఎక్కం దాకా నేర్చుకుంది.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన Important Questions and Answers

ప్రశ్న 1.
ఏవైనా రెండు ఉదాహరణల ద్వారా జీవుల్లో ప్రవర్తన అనుకూలనాలు ఎలా వుంటాయో తెలపంది.
జవాబు:

  1. పక్షులు గూళ్ళు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం, రక్షణ కొరకు సమూహాలు ఏర్పాటు చేసుకోవడం.
  2. ఉత్తర అమెరికాలో నివశించే బీవర్ క్షీరదము నీటి ప్రవాహానికి అడ్డంగా చెట్టుకొమ్మల సాయంతో ఆనకట్టను నిర్మించి, ఆ నిలిచిన నీటిలో చేపలను వేటాడుతూ తన కుటుంబంతో జీవిస్తుంది.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 2.
జంతువులలో ప్రవర్తనలను ఎన్ని రకాలుగా పరిశీలించవచ్చు? ఏదైనా ఒక ప్రవర్తనను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

  1. జంతువుల ప్రవర్తనను ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను శాస్త్రవేత్తలు పరిశీలిస్తుంటారు.
  2. ముఖ్యంగా జంతువుల జీవన విధానం, అవి ఇచ్చిపుచ్చుకునే సంకేతాలను వాటి అర్థాలను అవగాహన చేసుకోవడంలో శాస్త్రవేత్తలు ఎంతో ప్రగతిని కనబరిచారు.
  3. గుర్తుకట్టడం విధానం ద్వారా పక్షుల వలస విధానం అది సుదూర తీరాలకు ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతున్నాయి అన్న విషయాలను పరిశీలిస్తున్నారు. ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకున్నారు.
  4. మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు మన ఇంట్లోలోకి ఎవరన్నా ప్రవేశిస్తే అవి మొరుగుతాయి.
  5. చీమలు ఆహారాన్వేషణలో సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాయి.
  6. నిశాచర జీవులైన గబ్బిలాలు, గుడ్లగూబలు రాత్రివేళల్లో మాత్రమే ఆహారాన్వేషణకు బయలుదేరతాయి.

ప్రశ్న 3.
గుర్తు కట్టడం (Tagging) అనగానేమి ? ఇది శాస్త్రవేత్తలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
a) జంతువుల ఉనికిని, వలసలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు అన్వేషణా పరికరాలను కడతారు. ఈ విధమైన గుర్తింపు సూచికలు కట్టడాన్ని గుర్తుకట్టడం అంటారు.
b) జంతువులు, పక్షులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఈ గుర్తింపు పరికరాలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 4.
క్రింది సమాచారం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. .
కోళ్ళు, బాతుల పిల్లలు గుడులో నుండి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. బాతు పిల్లలైతే కొన్ని రోజుల తరువాత ఈదగలుగుతాయి. దీనినే అనుసరణ అంటారు.
ఎ) బాతు పిల్లలు కోడితో కలిసి ఉండగలుగుతాయి. ఎందుకు?
బి) అనుసరణ వలన కలిగే లాభం ఏమిటి?
జవాబు:
ఎ) బాతుపిల్లలు కోడిని తమ తల్లిగా భావించి, దానిని అనుసరిస్తూ తిరుగుతాయి. దీనికి కారణం ‘అనుసరణ’ అనే లక్షణం.
బి) అనుసరణ వల్ల బాతుపిల్లలు కోడి వెనుక తిరుగుతూ ఆహారాన్ని, రక్షణను పొందుతాయి.

ప్రశ్న 5.
ప్రక్క పటమును పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన 2
a) ఏ గదిలో ఎక్కువ బొద్దింకలు ఉన్నాయి?
b) ఏ గదిలో తక్కువ బొద్దింకలు ఉన్నాయి?
c) ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న బొద్దింకల గది పరిస్థితులు ఏమి?
d) బొద్దింకల ప్రవర్తన ఎలా ఉంది?
జవాబు:
a) చీకటి మరియు తడి ఉన్న గదిలో ఎక్కువ బొద్దింకలు ఉన్నాయి.
b) వెలుతురు, పొడిగా ఉన్న గదిలో తక్కువ బొద్దింకలు ఉన్నాయి.
c) తడి మరియు చీకటిగా ఉన్నాయి.
d) విభిన్న పరిస్థితులు కల్పించబడిన నాలుగు గదులలో బొద్దింకలు చీకటి మరియు తడి ప్రదేశం గల గదిని వెదుకుతూ ఆ గదిని చేరుకున్నాయి.

ప్రశ్న 6.
పై పటమును పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) ఈ ప్రయోగంను ఎందుకొరకు నిర్వహించారు?
b) బొద్దింకల ప్రవర్తన ఎలా ఉన్నది?
c) ఒక గదిలో ఎక్కువ బొద్దింకలు, మరో గదిలో తక్కువ బొద్దింకలు చేరాయికదా. ఆ గదుల మధ్య భేదమేమిటి?
d) ఈ ప్రయోగంలో బొద్దింకలకు బదులుగా ఎలుకలను వదిలితే ఏమౌతుందో ఊహించి రాయండి.
జవాబు:
a) బొద్దింకల ప్రవర్తన అధ్యయనం కొరకు

b) బొద్దింకలు చీకటిగా, తడిగా ఉన్న గదిని ఇష్టపడుతున్నాయి. ఎందుకంటే ఆ పరిస్థితులలో మాత్రమే బొద్దింకలు జీవించగలుగుతాయి.

c) ప్రయోగపెట్టెను 4 గదులుగా విభజించాం కదా !
1) వెలుతురుగా ఉన్న పొడి వాతావరణం
2) చీకటిలో పొడిగా ఉన్న భాగం
3) చీకటిలో తడిగా ఉన్న భాగం
4) పొడిగా ఉన్న భాగం బొద్దింకలు చీకటి, తడిగా ఉన్న గదిలోకి ఎక్కువ చేరాయి.

d) అవి కూడా చీకటిగా తడిగా ఉన్న వాతావరణాన్నే ఎక్కువగా ఇష్టపడతాయి. ఎందుకంటే చీకటిగా ఉన్న ప్రాంతం అయితే శత్రువుల నుండి తమను రక్షించుకోవచ్చు. తడిగా ఉన్న ప్రాంతంలో శరీర తమ ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన 1 Mark Bits Questions and Answers

లక్ష్యత్మక నియోజనము

1. జంతువుల ప్రవర్తన వీటి గురించి తెలియచేస్తుంది.
A) జంతువుల ఆవాసాలు, వనరులను వెతికే విధానాన్ని
B) శత్రువుల నుండి తమను తాము కాపాడే విధం
C) ప్రత్యుత్పత్తి కొరకు భిన్నజీవిని ఎంచుకోవడం, తమ సంతతిని కాపాడుకోవడం
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

2. జంతు ప్రవర్తనను ప్రభావితం చేసేవి
A) జంతువు శరీర ధర్మం
B) జంతువు శరీర అంతర నిర్మాణం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

3. పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు
A) సహజాత ప్రవృత్తి
B) అనుసరణ
C) నిబంధన
D) అనుకరణ
జవాబు:
D) అనుకరణ

4. సహజాత ప్రవృత్తికి ఉదాహరణలు
A) పక్షులు గూడు కట్టుకోవడం
B) సంతానోత్పత్తి కోసం భిన్న జీవిని ఎంచుకోవడం
C) రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

5. ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు.
A) అనుకరణ
B) సహజాత ప్రవృత్తి
C) నిబంధన
D) అనుసరణ
జవాబు:
B) సహజాత ప్రవృత్తి

6. బాతు పిల్లలు, కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన
A) అనుకరణ
B) నిబంధన
C) అనుసరణ
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
C) అనుసరణ

7. గంట కొట్టే సమయాన్ని బట్టి బడిలోని పిల్లల ప్రవర్తన
A) నిబంధన
B) అనుకరణ
C) అనుసరణ
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
A) నిబంధన

8. నిబంధనపై పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞుడు
A) కోప్లెర్
B) ఇవాన్ పావ్లోవ్
C) ఇర్విన్ పెప్పర్ బర్గ్
D) హెర్మన్
జవాబు:
B) ఇవాన్ పావ్లోవ్

9. నిబంధన సహిత ప్రతిచర్యలకు ఉదాహరణ
A) పెద్దవాళ్ళు రాగానే గౌరవంగా లేచి నిలబడడం
B) పలుపుతాడు విప్పదీయగానే ఎద్దు అరక దగ్గరకు పోవడం
C) జాతీయగీతం వినగానే లేచి నిలబడడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

10. చింపాంజీలలో అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త
A) కోస్ఆర్
B) హెర్మన్
C) పెప్పర్ బర్గ్
D) పాప్ లోవ్
జవాబు:
A) కోస్ఆర్

11. బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలని పించినా, అందరూ కూర్చున్న తరువాతే భోజనం చేయడం మొదలుపెట్టడం
A) అనుకరణ
B) సహజాత ప్రవృత్తి
C) నిబంధన
D) గుర్తుకట్టడం
జవాబు:
B) సహజాత ప్రవృత్తి

12. సినీ ప్రముఖులు, క్రీడాకారులతో ఉత్పత్తులను ప్రచారం చేయించి వినియోగదారులను కొనేలా చేయడం
A) అనుకరణ
B) సహజాత ప్రవృత్తి
C) నిబంధన
D) అనుసరణ
జవాబు:
C) నిబంధన

13. జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడేవి.
A) గుర్తుకట్టడం
B) అన్వేషణ
C) A మరియు B
D) సంకేతాలు
జవాబు:
C) A మరియు B

14. చీమలలో వెదకటానికి లేదా సమాచారం అందించడానికి ఉపయోగపడేవి
A) హార్మోనులు
B) ఫెర్మె నులు
C) ఎంజైములు
D) అన్నియు
జవాబు:
B) ఫెర్మె నులు

15. గూటిలోని ఆహారంపై గుడ్లు పెట్టేది
A) కందిరీగ
B) నేతగాని పక్షి
C) చీమలు
D) బీవర్ క్షీరదం
జవాబు:
A) కందిరీగ

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

16. తార్కికంగా ఎక్కువ శక్తి కలిగిన జంతువు
A) బీవర్ క్షీరదం
B) డాల్ఫిన్
C) ఉడత
D) స్క్రజ్ పక్షి
జవాబు:
B) డాల్ఫిన్

17. అలెక్స్ అనే చిలుక ఆపిల్‌ను ఈ విధంగా పిలిచేది.
A) బానరీ
B) చెర్రీ
C) అరటి
D) ఆరెంజ్ మారటం
జవాబు:
A) బానరీ

18. శత్రువుల నుండి రక్షించుకోవడానికి శరీరము నుండి దుర్వాసనను వెదజల్లే జంతువు ………
A) టాస్మేనియన్
B) బంబార్డియర్ బీటిల్లో
C) A మరియు B
D) బీవర్ క్షీరదం
జవాబు:
C) A మరియు B

19. జంతువుల ప్రవర్తన శాస్త్రం పేరు?
A) ఇకాలజీ
B) ఆర్నిథాలజీ
C) ఇథాలజీ
D) ఎనాలజీ
జవాబు:
C) ఇథాలజీ

20. జంతువుల ప్రవర్తనపై పరిశోధనకుగాను 1973లో నోబెల్ పురస్కారం వీరికి లభించింది.
A) కోనార్డ్ లోరెంజ్
B) నికోలస్ టింబర్జన్
C) కార్లవాన్ ఫ్రిష్
D) అందరూ
జవాబు:
D) అందరూ

21. ఈ క్రింది వానిలో అంతర్గత ప్రచోదనం
A) ఆకలి
B) ఆపద
C) వాసన
D) ధ్వని
జవాబు:
A) ఆకలి

22. ప్రవర్తనలో మొత్తం రకాల సంఖ్య
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
B) 4

23. సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవటం
A) సహజాత ప్రవృత్తి
B) అనుసరణ
C) నిబంధన
D) అనుకరణ
జవాబు:
A) సహజాత ప్రవృత్తి

24. బాతు పిల్లలు కోడివెంట వెళ్ళడం
A) సహజాత ప్రవృత్తి
B) అనుసరణ
C) నిబంధన
D) అనుకరణ
జవాబు:
B) అనుసరణ

25. అనుసరణ గురించి తెల్లబాతుల మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త
A) కోనార్డ్ లోరెంజ్
B) ఇవాన్ పావ్లోవ్
C) కోస్ఆర్
D) హెర్మన్
జవాబు:
A) కోనార్డ్ లోరెంజ్

26. తార్కికంగా ఆలోచించే శక్తి గురించి హవాయి ద్వీపంలోని “కవలో బేసిన్ మామల్ లాబోరేటరీ”లో డాల్ఫిన్లపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త
A) కోనార్డ్ లోరెంజ్
B) ఇవాన్ పావ్లోవ్
C) కోస్ఆర్
D) హెర్మన్
జవాబు:
D) హెర్మన్

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

27. తేనెటీగల నృత్యాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త
A) కార్లవాష్
B) కోనార్డ్ లోరెంజ్
C) కోప్లెర్
D) హెర్మన్
జవాబు:
A) కార్లవాష్

28. ఉద్దీపనలకు చూపే ప్రతిచర్య
A) సహజాత ప్రవృత్తి
B) అనుసరణ
C) నిబంధన
D) అనుకరణ
జవాబు:
C) నిబంధన

29. ఒక జంతువు యొక్క ప్రవర్తనను వేరొక జంతువు ప్రదర్శిస్తే
A) అనుసరణ
B) అనుకరణ
C) నిబంధన
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
B) అనుకరణ

30. ఎడ్వర్టైజ్ మెంట్లలో ఉపయోగించుకునే ప్రవృత్తి
A) అనుకరణ
B) అనుసరణ
C) నిబంధన
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
A) అనుకరణ

31. మానవునిలో లేని ప్రవర్తన
A) అనుకరణ
B) అనుసరణ
C) నిబంధన
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
B) అనుసరణ

32. ఒక వ్యక్తిలో మార్పు తేవటానికి ఉపయోగపడేది.
A) అనుకరణ
B) అనుసరణ
C) నిబంధన
D) సహజాత ప్రవృత్తి
జవాబు:
C) నిబంధన

33. కుక్కలు వాసన పసిగట్టటం, చీమలు వెదుకులాడటానికి కారణం
A) హార్మోన్లు
B) ఫెర్మోన్లు
C) ఎంజైములు
D) జన్యువులు
జవాబు:
B) ఫెర్మోన్లు

34. ‘బీవర్’ అనే క్షీరదం యిక్కడ కనిపిస్తుంది.
A) ఉత్తర అమెరికా
B) దక్షిణ అమెరికా
C) ఆఫ్రికా
D) ఆస్ట్రేలియా
జవాబు:
A) ఉత్తర అమెరికా

35. కందిరీగ దీనితో గూడు కడుతుంది.
A) పుల్లలు
B) ఆకులు
C) బురదమట్టి
D) బూజువంటి పదార్థం
జవాబు:
C) బురదమట్టి

36. ఇర్విన్ పెప్పర్ బర్గ్ శిక్షణ యిచ్చిన అలెక్స్ అనేది
A) పావురం
B) గోరింక
C) చిలుక
D) కుక్క
జవాబు:
C) చిలుక

37. జంతు రాజ్యంలో అన్నిటికంటె ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు
A) కంగారు
B) టాస్మేనియన్ డెవిల్
C) కొమెడో డ్రాగన్
D) ముళ్ళపంది.
జవాబు:
B) టాస్మేనియన్ డెవిల్

38. బంబార్డియర్ పురుగులో ఉండే రసాయనాలు
A) హైడ్రోక్వినోన్, ఫిల్లోక్వినోన్
B) అల్యూమినియం ఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్
C) హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్
D) అల్యూమినియం ఆక్సైడ్, ఫిల్లోక్వినోన్
జవాబు:
C) హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్

39. సరిగా జతపరచబడని జత ఏది?
1) చిలుకకు శిక్షణ ఇవ్వడం – ఇర్విన్ పెప్పర్ బర్గ్
2) చింపాంజిపై ప్రయోగాలు – ఇవాన్ పావలోవ్
3) కుక్కపై నియబంధనల ప్రయోగం – కోప్లెర్
A) 1 మాత్రమే
B) 1, 2
C) 2, 3
D) 3 మాత్రమే
జవాబు:
C) 2, 3

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

40. క్రింది వాక్యాలను చదవండి.
a) కోనార్డ్ లారెంజ్, అనుసరణ మీద ప్రయోగాలు
b) సాలెపురుగు గూడు కట్టడం అనుకరణకు ఉదాహరణ
A) a, b లు రెండూ సరియైనవి కావు
B) a, b లు రెండూ సరియైనవి
C) b సరియైనది, a సరియైనది కాదు
D) a సరియైనది, b సరియైనది కాదు
జవాబు:
D) a సరియైనది, b సరియైనది కాదు

41. సరిగా జతపరచబడిన సమాధానాన్ని ఎన్నుకోండి.
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 9
A) (i) – d, (ii) – c, (iii) – b, (iv) – a
B) (i) – a, (ii) – d, (iii) – c, (iv) – b
C) (i) – b, (ii) – a, (iii) – c, (iv) – d
D) (i) – b, (ii) – d, (iii) – a, (iv) – c
జవాబు:
D) (i) – b, (ii) – d, (iii) – a, (iv) – c

42. సరిగా జతపరచబడిన సమాధానాన్ని ఎన్నుకోండి.
1) సహజాత ప్రవృత్తి ( ) a) పిల్లవాడు తల్లిని గుర్తించటం
2) అనుసరణ ( ) b) ఇంకొకరి నుండి వేరొకరు కాపీ చేయడం
3) అనుకరణ ( ) c) పుట్టుకతో వచ్చే గుణం
A) 1 – c, 2 – b, 3 – a
B) 1 – a, 2 – c, 3 – b
C) 1 – b, 2 – a, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

43. సరిగా జతపరచబడిన సమాధానాన్ని ఎన్నుకోండి.
1) కొనార్డ్ లారెంజ్ ( ) a) అనుకరణ
2) కాపీ కొట్టే ప్రవర్తన ( ) b) ఇథాలజీ
3) జంతువుల ప్రవర్తనను చదవడం ( ) c) అనుసరణ
A) 1 – c, 2-b, 3 – a
B) 1 – b, 2-6, 3 – a
C) 1 – a, 2 – b, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

44. పాప్ లోవ్ ప్రయోగంలో, గంట శబ్దం విని కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించుట అనునది.
A) సహజ ఉద్దీపన
B) నిబంధిత ఉద్దీపన
C) సహజ ప్రతిస్పందన
D) నిబంధిత ప్రతిస్పందన
జవాబు:
D) నిబంధిత ప్రతిస్పందన

45. బొద్దింకల ప్రవర్తనను అధ్యయనం చేయటానికి నీతు ఒక ప్రయోగం నిర్వహించింది. ఒక పెట్టెను 4 గదులుగా విభజించి, బొద్దింకలు స్వేచ్ఛగా కదిలేలా కింది పటం వలే ప్రయోగం నిర్వహించింది. ఆ పెట్టెలో 20 బొద్దింకలను వుంచి 2 రోజులు గమనించింది. ఈ ప్రయోగం ద్వారా కింది నిర్ధారణ చేయవచ్చు.
A) బొద్దింకలు పొడి ప్రదేశాల కంటే తడి ప్రదేశాలనే ఇష్టపడతాయా?
B) చీకటిలో బొద్దింకలు వ్యాధులకు గురవుతాయా?
C) బొద్దింకలు ఎలాంటి ఆహారం ఇష్టపడతాయి?
D) బొద్దింకలు గుడ్లు పెట్టి పొదగటానికి ఎంత కాలం పడుతుంది?
జవాబు:
A) బొద్దింకలు పొడి ప్రదేశాల కంటే తడి ప్రదేశాలనే ఇష్టపడతాయా?

46. బాతు పిల్లలు తల్లిని గుర్తించే విధానం
A) ప్రేరణ
B) అనుసరణ
C) సహజాత ప్రవృత్తి
D) అనుకరణ
జవాబు:
B) అనుసరణ

47. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ చూడగానే లావణ్య తన స్కూటీని ఆపివేయుట దేనికి ఉదాహరణ?
A) అనుకరణ
B) నిబంధిత ప్రతిచర్య
C) సహజాత ప్రవృత్తి
D) అసంకల్పిత ప్రతీకార చర్య
జవాబు:
B) నిబంధిత ప్రతిచర్య

48. క్రింది వానిలో సహజాత ప్రవర్తనకు చెందిన.
A) కందిరీగ మట్టితో గూడును కట్టుకొనుట
B) బీవర్ చెట్ల కొమ్మలను నదీ ప్రవాహానికి అడ్డుగా వేయుట
C) పక్షులు ఆకులు, పుల్లలతో గూళ్ళు నిర్మించుట
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన

49. క్రింది వానిలో సరికానిది గుర్తించుము.
A) టాస్మానియన్ డెవిల్
B) బొంబార్డియర్ బీటిల్
C) సముద్రం
D) సుబ్ధయ్
జవాబు:
C) సముద్రం

50.
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 2
పై ప్రయోగాలను నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు? దేనిని తెలపడానికి నిర్వహించారు?
A) ఇవాన్ పావ్ వ్ – నిబంధన
B) చార్లెస్ డార్విన్ – అనుకరణ
C) గ్రెగర్ మెండల్ – అనుసరణ
D) జీన్ లామార్క్ – నిబంధన
జవాబు:
A) ఇవాన్ పావ్ వ్ – నిబంధన

51.
AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 10
చిత్రంలోని జంతువులో అనుకరణశక్తిని గుర్తించినది
A) ఇవాన్ పావ్లోవ్
B) ప్రిన్స్ డోరియా
C) జీన్ లామార్క్
D) కోబ్లెర్
జవాబు:
D) కోబ్లెర్

52. బొంబార్డియర్ బీటిల్ అనే కీటకం చెడువాసనను వెదజల్లుతుంది. ఎందుకంటే
A) ఆహార సంపాదన కొరకు
B) శత్రువులబారినుండి రక్షించుకోవడానికి
C) ఆడకీటకాన్ని ఆకర్షించుట కొరకు
D) భక్షకజీవిని చంపడానికి
జవాబు:
B) శత్రువులబారినుండి రక్షించుకోవడానికి

మీకు తెలుసా?

జంతువులలో ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలలో ఆస్ట్రియాకు చెందిన కోనార్డ్ లో రెంజ్ (1903 – 1989) | ప్రముఖుడు. అతను తెల్లబాతులను స్వయంగా పెంచి వాటి ప్రవర్తనను అధ్యయనం చేశాడు. గుడ్లు పొదిగిన నాటి నుండి అవి ఇతన్ని అనుసరించేవి. అవి పెరిగి పెద్దవిగా మారినప్పటికీ ఆయనతోనే కలిసి తిరిగేవి. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసినందుకుగాను శరీరధర్మశాస్త్రం మరియు ఔషధశాస్త్ర రంగంలో ఆయనకు 1973లో నోబెల్ బహుమతి లభించింది.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 11
కొన్ని జంతువులు, శత్రువుల (భక్షకాలు) నుండి రక్షించుకోవడానికి తమ శరీరం నుండి దుర్వాసన వెదజల్లుతాయి. జంతురాజ్యంలో టాస్మేనియన్ డేవిల్ అన్నింటి కంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు. దీని మాదిరిగానే బాంబార్డియర్ బీటిల్ (Bombardier beetle) చెడు వాసన వెదజల్లే కీటకం.

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 12
ఈ కీటకం శరీరంలో రెండు రకాల రసాయనాలు ఉంటాయి. అవి హైడ్రోక్వినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది ఎప్పుడైతే ప్రాణహాని ఉందని భావిస్తుందో అప్పుడు ఈ రసాయనాలు ప్రత్యేక ఎంజైముతో కలిసి వేడెక్కుతాయి. అవి శరీరం నుండి దుర్వాసనను వెదజల్లేలా చేస్తాయి. వాసన వచ్చే పురుగులు మీరెపుడైనా చూశారా…. అది ఎలా ఉంటుందో పరిశీలించండి.

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 7th Lesson జంతువులలో ప్రవర్తన 8

AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు

These AP 9th Physical Science Important Questions and Answers 9th Lesson తేలియాడే వస్తువులు will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 9th Lesson Important Questions and Answers తేలియాడే వస్తువులు

9th Class Physical Science 9th Lesson తేలియాడే వస్తువులు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
హైడ్రాలిక్ లిఫ్ట్ ఏ నియమం ఆధారంగా పని చేస్తుంది?
(లేదా)
దైనందిన జీవితంలో పాస్కల్ నియమం యొక్క ఏదైనా ఒక అనువర్తనాన్ని రాయండి.
జవాబు:
హైడ్రాలిక్ లిఫ్ట్, పాస్కల్ నియమం ఆధారంగా పనిచేస్తుంది.

ప్రశ్న 2.
సాంద్రతను నిర్వచించి దాని సూత్రం రాయండి.
జవాబు:
ప్రమాణ ఘనపరిమాణంలో గల ద్రవ్యరాశిని సాంద్రత అంటారు.
AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు 1

ప్రశ్న 3.
సాపేక్ష సాంద్రత అనగానేమి? సూత్రం రాయుము.
జవాబు:
వస్తువు సాంద్రతకి, నీటి సాంద్రతకి గల నిష్పత్తిని సాపేక్ష సాంద్రత అంటారు.
AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు 2

ప్రశ్న 4.
పాల స్వచ్ఛతని ఏ పరికరంతో కొలుస్తారు?
జవాబు:
పాల స్వచ్ఛతని లాక్టోమీటరుతో కొలుస్తారు.

ప్రశ్న 5.
ద్రవాల సాపేక్ష సాంద్రతని కొలవడానికి వాడే పరికరం ఏది?
జవాబు:
ద్రవాల సాపేక్ష సాంద్రతని హైడ్రోమీటరు అనే పరికరం ద్వారా కనుగొంటారు.

AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు

ప్రశ్న 6.
వాతావరణ పీడనం అనగానేమి?
జవాబు:
భూమి ఉపరితలంపై నున్న అన్ని వస్తువులపై గాలి కలుగజేసే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు.

వాతావరణ పీడనం ρo = ρhg

ప్రశ్న 7.
ఆర్కిమెడీస్ సూత్రమును వ్రాయుము.
జవాబు:
ఏదైనా ఒక వస్తువును ఒక ప్రవాహిలో పూర్తిగా గాని, పాక్షికంగా గాని ముంచినపుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన ఉత్తవన బలం ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది.

ప్రశ్న 8.
పాస్కల్ నియమమును పేర్కొనుము.
జవాబు:
ప్రమాణ ఘనపరిమాణంలో బంధించబడిన ప్రవాహి పై కలుగజేయబడిన బాహ్యపీడనం ఆ ప్రవాహిలో అన్ని దిశలలో ఒకే విధంగా కలుగజేయబడుతుంది.

9th Class Physical Science 9th Lesson తేలియాడే వస్తువులు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఒకే ద్రవ్యరాశిగల నీటిని, పాలను కలిపినపుడు మిశ్రమం ఫలిత సాంద్రత ఎంత?
జవాబు:
1) పాలు, నీటిల ద్రవ్యరాశులను ρ1, ρ2 అనుకొనుము.
2) ఒకే ద్రవ్యరాశి m , వేరు వేరు ఘనపరిమాణాలు V1 , V2 లుగా వాటిని తీసుకున్నపుడు
AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు 3

ప్రశ్న 2.
ఒకే ఘనపరిమాణం గల పాలు, నీరు కలిపినపుడు మిశ్రమం యొక్క ఫలిత సాంద్రత ఎంత?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు 4

ప్రశ్న 3.
వాతావరణ పీడనాన్ని ఎలా కొలుస్తారు?
జవాబు:
1) వాతావరణ పీడనాన్ని భారమితిలోని పాదరస స్థంభం ఎత్తు ఆధారంగా చెప్పవచ్చు.

2) గాజు గొట్టంలోని పాదరస మట్టం యొక్క భారం దానిపై వాతావరణ పీడన ఫలితంగా గిన్నెలోని పాదరసం వల్ల కలిగే బలానికి సమానంగా ఉంటుంది.
పాదరస స్థంభం భారం (W) = పాదరసం ద్రవ్యరాశి (ρ) × g
= ఘనపరిమాణం × సాంద్రత × g
= గొట్టం అడ్డుకోత వైశాల్యం (A) × మట్టం ఎత్తు (h) × సాంద్రత (ρ) × g
= A hρg

వాతావరణ పీడనాన్ని P0 గా తీసుకుంటే
పాదరస మట్టంపై వాతావరణ పీడనం వల్ల కలిగే బలం = P0A
అప్పుడు A hρg = P0A
P0 = hρg

ఇక్కడ ρ, g లు స్థిరరాశులు కాబట్టి గాజు గొట్టంలో పాదరస మట్టం అనేది వాతావరణ పీడనంపై ఆధారపడి ఉంటుంది.

గాజు గొట్టంలో పాదరస మట్టం ఎత్తు h = 76 సెం.మీ. = 76 × 10-2 మీ
పాదరసం సాంద్రత p = 13.6 గ్రా/ఘ. సెం.మీ. = 13.6 × 10³ కి.గ్రా/మీ³
గురుత్వ త్వరణం g = 9.8 మీ/సె²
P0 = hρg
= 76 × 10-2 × 13.6 × 10³ × 9.8
= 1.01 × 105 కి.గ్రా. మీ/మీ² సె²
1 కి.గ్రా మీ/సె² = 1 న్యూటన్
= 1.01 × 105 న్యూటన్/మీ²
ఈ విలువను వాతావరణ పీడనం అంటారు.
1 అట్మాస్ఫియర్ = 1.01 × 105 న్యూటన్/మీ²
= 1.01 × 105 పాస్కల్

AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు

ప్రశ్న 4.
ఒక ద్రవంలో లోతున ఉన్న ప్రదేశం దగ్గర పీడనం కనుగొనండి.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు 7
1) ఒక పాత్రలో 2 సాంద్రత గల ద్రవం ఉందనుకుందాం.

2) పటంలో చూపినట్లు ఆ ద్రవం ఉపరితలం కింద A ఆధారవైశాల్యం,
h ఎత్తు గల ద్రవ స్థూపాన్ని పరిగణనలోకి తీసుకుందాం.

3) ఆ ద్రవ స్థూపం ఘనపరిమాణం V = Ah

4) ఆ ద్రవ స్టూపం ద్రవ్యరాశి n = Ahρ
దాని భారం w= mg = Ahρg
ఆ ద్రవ స్థూపం సమతాస్థితిలో ఉన్నది కాబట్టి న్యూటన్ గమన
నియమాల ప్రకారం దానిపై పనిచేసే ఫలిత బలం శూన్యం.

5) ఆ ద్రవ స్థూపంపై పనిచేసే బలాలు
ఎ) భూమ్యాకర్షణ వల్ల కలిగిన ఆ ద్రవ స్తూపం భారం (W) (కింది దిశలో)
బి) వాతావరణ పీడనం వలన ఆ ద్రవస్తూపంపై కలుగజేయబడిన బలం (P0A)
సి) ద్రవం పీడనం వలన ఆ స్థూపంపై కలుగజేయబడిన బలం (PA) (పై దిశలో)

6) న్యూటన్ గమన నియమాల ప్రకారం పై దిశలో పనిచేసే బలాల మొత్తం, కింది దిశలో పనిచేసే బలాల మొత్తానికి సమానం.
PA = P0A + W
PA = P0A+ hρgA
P = P0 + hρg
ఇక్కడ P అనేది ద్రవ ఉపరితలం నుండి + లోతులో గల ప్రదేశంలో పీడనం, P0 అనేది వాతావరణ పీడనం. ఒకే లోతులో ఉన్న అన్ని ప్రదేశాలలోనూ ,ఈ పీడనం ఒకే విధంగా ఉంటుంది.

ప్రశ్న 5.
ద్రవంలోని వివిధ లోతుల్లో పీడన వ్యత్యాసం కనుగొనుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు 8
1) ద్రవంలో A ఆధార వైశాల్యం, 7 ఎత్తు ఉండేటట్లు ఒక ద్రవ స్థూపాన్ని పరిగణనలోకి తీసుకుందాం.

2) ద్రవంలో h1 లోతులో ఉండే పీడనం P1 అనుకుంటే
P1 = P0 + h1ρg ……… (1)

3) ద్రవంలో h2 లోతులో ఉండే పీడనం P2 అనుకుంటే
P2 = P0 + h2ρg ……… (2)

4) సమీకరణము (1) , (2) ల నుండి
P2 – P1 = (P0 + h2ρg) – (P0 + h1ρg)
= h2ρg – h1ρg
P2 – P1 = ρg (h2 – h1)
5) పటం నుండి h2 – h1 = h
P2 – P1 = ρgh

6) ఆ ద్రవంలో రెండు ఎత్తుల వద్ద గల పీడనాల వ్యత్యాసం = ρgh

7) ఇందులో ρ, g లు స్థిరాంకాలు కనుక ద్రవం లోతు పెరిగితే పీడన వ్యత్యాసం పెరుగుతుంది.

ప్రశ్న 6.
ద్రవ సాంద్రతతో సమాన సాంద్రత లేని వేరొక పదార్థంతో చేయబడిన వస్తువును ఆ ద్రవంలో ఉంచినపుడు పీడన వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
ద్రవ సాంద్రతతో సమాన సాంద్రత లేని వేరొక పదార్థంతో చేయబడిన వస్తువును ఆ ద్రవంలో ముంచినపుడు ఆ వస్తువు పై భాగం, కింది భాగంలోని పీడనాల వ్యత్యాసం
P2 – P1 = hρg
⇒ P2 – P1 = h\(\frac{m}{V}\)g
⇒ P2 – P1 = h \(\frac{m}{Ah}\)e
⇒ P2 – P1 = \(\frac{m}{A}\)g
⇒ (P2 – P1)A = mg (F = PA, W = mg)
⇒ F = W
1) ఇక్కడ F అనేది నీటిలో ఉన్న వస్తువుపై పై దిశలో కలుగజేయబడే బలం, వస్తువు వలన తొలగింపబడిన ద్రవం బరువు W.

2) కనుక ఆ వస్తువుపై కలుగజేయబడే బలం తొలగింపబడిన ద్రవం బరువుకు సమానమని తెలుస్తుంది.

AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు

ప్రశ్న 7.
పాస్కల్ సూత్రాన్ని పేర్కొని ఒక ఉదాహరణతో వివరించుము.
(లేదా)
పాస్కల్ నియమాన్ని తెలిపి, పాస్కల్ నియమం ఆధారంగా పనిచేసే ఒక పరికరం పటం గీయంది.
జవాబు:
పాస్కల్ సూత్రం :
ఏదైనా ప్రవాహి బంధింపబడి ఉన్నప్పుడు దానిపై బాహ్యపీడనం కలుగజేస్తే ఆ ప్రవాహిలో అన్ని వైపులా ఒకే విధంగా పీడనం పెరుగుతుంది.
AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు 9

వివరణ:

  1. పటాన్ని చూడండి.
  2. ఇక్కడ U ఆకారం గల గొట్టంలో ఒక ప్రవాహి బంధింపబడి ఉండడం చూడవచ్చు.
  3. ఆ గొట్టం రెండు చివరల రెండు ముషలకాలు అమర్చబడి ఉన్నాయి.
  4. గొట్టం యొక్క కుడి, ఎడమ గొట్టాల అడ్డుకోత వైశాల్యాల నిష్పత్తి A1 : A2 మరియు A1 > A2
  5. ఎడమవైపునున్న ముషలకంపై F1 బలాన్ని ప్రయోగిస్తే అది గొట్టంలోని ప్రవాహి పై అధికంగా కలుగజేసే పీడనం F1/A1 అవుతుంది.
  6. పాస్కల్ నియమం ప్రకారం ఈ పీడనం ప్రవాహి అంతటా ఒకే విధంగా ఉండాలి.
  7. కావున కుడి గొట్టంలో కూడా, దాని అడ్డుకోత వైశాల్యం A3 కావడం చేత ఆ కుడి ముషలకంపై కలుగజేయబడే పీడనం \(\mathrm{F}_{2}=\frac{\mathrm{A}_{2} \times \mathrm{F}_{1}}{\mathrm{~A}_{1}}\)
  8. F2, F1 కన్నా ఎక్కువగా ఉంటుంది.
  9. కావున ఎడమవైపు ముషలకంపై ప్రయోగించబడిన తక్కువ బలం, కుడివైపు ముషలకంపై ఎక్కువ బలాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా పాస్కల్ నియమం నిత్యజీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

9th Class Physical Science 9th Lesson తేలియాడే వస్తువులు 4 Marks Bits Questions and Answers

1. సాంద్రత : \(\frac{\mathrm{kg}}{\mathrm{m}^{3}}\) :: సాపేక్ష సాంద్రత : ……….
C) పాస్కల్ / మీ
D) ప్రమాణాలు లేవు
జవాబు:
D) ప్రమాణాలు లేవు

2. పాలతో కలసిన నీటిని గుర్తించుటకు వాడు పరికరం
A) బారోమీటరు
B) లాక్టోమీటరు
C) హైడ్రోమీటర్
D) థర్మామీటరు
జవాబు:
B) లాక్టోమీటరు

3. హైడ్రాలిక్ జాక్ నిర్మాణానికి సంబంధించి భిన్నమైనది
A) ముషలకాలకు ఘర్షణ ఉండరాదు.
B) ఓటు పోని (leak proof) ముషలకాలుండాలి.
C) ముషలకాలకు ఒకే వైశాల్యం ఉండాలి.
D) జాక్ లోని ప్రవాహి సంపీడ్యం చెందనిదిగా ఉండాలి.
జవాబు:
C) ముషలకాలకు ఒకే వైశాల్యం ఉండాలి.

4. ఒక పాస్కల్ కు సమానమైన విలువ
A) 1.01 × 10 న్యూ. మీ.-2
B) 1.01 × 10 న్యూ.మీ.-2
C) 1 న్యూ. మీ.-2
D) 76 న్యూ.మీ.-2
జవాబు:
C) 1 న్యూ. మీ.-2

5. పాల స్వచ్చతను కనుగొనుటకు ఉపయోగించు పరికరం
A) భారమితి
B) హైడ్రోమీటర్
C) పొటెన్షియోమీటర్
D) లాక్టోమీటర్
జవాబు:
D) లాక్టోమీటర్

6. 2 సెం.మీ. వ్యాసార్థం గల గోళం యొక్క ద్రవ్యరాశి 0.05 కి.గ్రా. అయితే దాని సాపే సాంద్రత ఎంత?
A) 1.39
B) 1.39 కి.గ్రా/మీ³
C) 1.49
D) 1.46 కి.గ్రా/మీ³
జవాబు:
C) 1.49

7. ఉత్సవనం గురించి తెలియజేయు నియమం ఏది
A) పాస్కల్ నియమం
B) ఆర్కిమెడిస్ నియమం
C) బాయిల్ నియమం
D) న్యూటన్ నియమం
జవాబు:
B) ఆర్కిమెడిస్ నియమం

AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు

8. పాలకు నీరు కలిపినపుడు …………
A) మిశ్రమం సాంద్రత పాల సాంద్రత కన్నా ఎక్కువ
B) మిశ్రమం సాంద్రత పాల సాంద్రత కన్నా తక్కువ
C) మిశ్రమం ఘన పరిమాణం పాల ఘనపరిమాణం కన్నా ఎక్కువ
D) మిశ్రమం ఘన పరిమాణం పాల ఘనపరిమాణం కన్నా తక్కువ
జవాబు:
B) మిశ్రమం సాంద్రత పాల సాంద్రత కన్నా తక్కువ

I. సరియైన సమాధానమును రాయుము.

9. కిరోసిన్ నీటిలో …………
A) తేలును
B) మునుగును
C) తేలియాడును
D) ఏమీ చెప్పలేము
జవాబు:
A) తేలును

10. కిందివాటిలో నీటిలో మునిగేది.
A) చెక్క ముక్క
B) మైనం ముక్క
C) గాజు గోళీ
D) ప్లాస్టిక్ బంతి
జవాబు:
C) గాజు గోళీ

11. సాంద్రత అనగా …………..
A) ద్రవ్యరాశి / లీటర్లు
B) ద్రవ్యరాశి ఘనపరిమాణం
C) ద్రవ్యరాశి వైశాల్యం
D) ద్రవ్యరాశి / అడ్డుకోత వైశాల్యం
జవాబు:
B) ద్రవ్యరాశి ఘనపరిమాణం

12. ఒకే పరిమాణం గల ఇనుప ముక్కను, చెక్కముక్కను తూచినపుడు, ఇనుపముక్క ఎక్కువ బరువుగా ఉంటుంది. కారణం ఏమనగా
A) ఇనుము సాంద్రత చెక్క సాంద్రత కన్నా తక్కువ
B) ఇనుము బరువు చెక్క బరువు కన్నా ఎక్కువ
C) ఇనుము వైశాల్యం చెక్క వైశాల్యం కన్నా ఎక్కువ
D) ఇనుము సాంద్రత చెక్క సాంద్రత కన్నా ఎక్కువ
జవాబు:
D) ఇనుము సాంద్రత చెక్క సాంద్రత కన్నా ఎక్కువ

13. సాంద్రతకు ప్రమాణాలు …………
A) కి.గ్రా/సెం.మీ.
B) గ్రా/మీ
C) కి.గ్రా/మీ
D) మీ/కి.గ్రా
జవాబు:
C) కి.గ్రా/మీ

14. ఒక వస్తువు ద్రవం ఉపరితలంపై తేలాలంటే
A) ఆ వస్తువు సాంద్రత ద్రవం సాంద్రత కంటె ఎక్కువ ఉండాలి
B) ఆ వస్తువు సాంద్రత ద్రవం సాంద్రత కంటె తక్కువ ఉండాలి
C) ఆ వస్తువు బరువు ద్రవం బరువు కంటే ఎక్కువ ఉండాలి
D) ఆ వస్తువు బరువు ద్రవం బరువు కంటే తక్కువ ఉండాలి
జవాబు:
B) ఆ వస్తువు సాంద్రత ద్రవం సాంద్రత కంటె తక్కువ ఉండాలి

15. వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత =
A) వస్తువు సాంద్రత / నీటి బరువు
B) నీటి సాంద్రత / వస్తువు సాంద్రత
C) వస్తువు బరువు/ నీటి బరువు
D) వస్తువు ద్రవ్యరాశి / అంతే ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి
జవాబు:
D) వస్తువు ద్రవ్యరాశి / అంతే ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి

16. పాల స్వచ్ఛతను తెలుసుకోవడానికి వాడేది
A) భారమితి
B) హైడ్రోమీటరు
C) డెన్సిట్ మీటరు
D) లాక్టోమీటరు
జవాబు:
D) లాక్టోమీటరు

17. లాక్టోమీటరు ……. సూత్రంపై పనిచేస్తుంది.
A) సాంద్రత
B) సాపేక్ష సాంద్రత
C) ఉత్సవనము
D ఘనపరిమాణము
జవాబు:
B) సాపేక్ష సాంద్రత

AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు

18. సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువ ఉన్న వస్తువులు నీటిపై (లో) ………….
A) తేలును
B) మునుగును
C) వేలాడును
D) చెప్పలేము
జవాబు:
D) చెప్పలేము

19. వాతావరణ పీడనాన్ని కొలవడానికి వాడేది ………….
A) లాక్టోమీటరు
B) హైడ్రోమీటరు
C) భారమితి
D) హైగ్రోమీటరు
జవాబు:
C) భారమితి

20. సాధారణ వాతావరణ పీడనం వద్ద పాదరస స్తంభం ఎత్తు ………….
A) 76 సెం.మీ.
B) 7.6 సెం.మీ
C) 76 మి. మీ
D) 100 సెం.మీ.
జవాబు:
A) 76 సెం.మీ.

21. 1 అట్మాస్ఫియర్ పీడనము, అనగా ……….
A) 1.01 × 10³ న్యూ మీ²
B) 1.01 × 104 న్యూ మీ²
C) 1.01 × 106 న్యూ మీ²
D) 1.01 × 105 న్యూ మీ²
జవాబు:
D) 1.01 × 105 న్యూ మీ²

22. వాతావరణ పీడనానికి ప్రమాణాలు ………..
A) పాస్కల్
B) న్యూ మీ²
C) A లేదా B
D) ఏదీకాదు
జవాబు:
C) A లేదా B

23. ద్రవంలో మునిగిన ఏ వస్తువు పైనైనా పనిచేసే ఊర్ధ్వ బలాన్ని ………… అంటారు.
A) గురుత్వ బలం
B) ఉత్సవనము
C) పీడనం
D) సాంద్రత
జవాబు:
B) ఉత్సవనము

AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు

24. హైడ్రాలిక్ జాక్స్ ………. నియమంపై పనిచేస్తాయి.
A) ఆర్కిమెడీస్ నియమం
B) ఉత్సవనము
C) పాస్కల్ నియమం
D) గాలి పీడనం
జవాబు:
C) పాస్కల్ నియమం

II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.

1. ప్రమాణ ఘనపరిమాణము గల వస్తువు యొక్క ద్రవ్యరాశిని ……………… అంటారు.
2. MKS పద్ధతిలో సాంద్రతకు ప్రమాణాలు ………..
3. ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత = …………
4. ఒక ద్రవం యొక్క సాపేక్ష సాంద్రత = …………
5. సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ……………
6. లాక్టోమీటరును ………… కనుగొనుటకు వాడుతారు.
7. లాక్టోమీటరు పనిచేయుటలో ఇమిడియున్న సూత్రం
8. ఒకే ద్రవ్యరాశి గల రెండు వస్తువుల సాంద్రతలు ρ1, ρ2 అయిన ఆ మిశ్రమం యొక్క ఫలిత సాంద్రత ……………..
9. ఒకే ఘనపరిమాణం గల రెండు వస్తువుల సాంద్రతలు ρ1 ρ2 అయిన ఆ మిశ్రమం యొక్క ఫలిత సాంద్రత
10. ఏ ద్రవం యొక్క సాంద్రతనైనా ………….. నుపయోగించి కనుగొనవచ్చును.
11. ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువైన ఆ వస్తువు నీటిపై (లో) …………..
12. ఒక ద్రవంలో ముంచబడిన వస్తువుపై పనిచేసే ఊర్ధ్వ బలాన్నే ……………… అంటారు.
13. 1 అట్మాస్ఫియర్ = …………….
14. పాదరసం సాంద్రత = …………..
15. ఒక ద్రవంలో h లోతులో పీడనం ……………….
16. ఉత్సవన బలం ఆ వస్తువు యొక్క ………………కు సమానము.
17. బ్రాహప్రెస్ లో కుడి ముషలకముపై పనిచేసే బలం = …………….
18. ఒక వస్తువును ద్రవంలో ముంచినపుడు దానిపై పనిచేసే ఉత్సవన బలం ………………. కు సమానం.
19. ఓడలు …… సూత్రం ఆధారంగా నిర్మింపబడతాయి.
జవాబు:

  1. సాంద్రత
  2. కి.గ్రా / మీ³
  3. వస్తువు సాంద్రత / నీటి సాంద్రత (లేదా) వస్తువు బరువు / వస్తువు ఘనపరిమాణమునకు సమాన ఘనపరిమాణము గల నీటి బరువు
  4. ద్రవం బరువు / అంతే ఘనపరిమాణం గల నీటి బరువు
  5. ప్రమాణాలు లేవు
  6. పాల స్వచ్ఛత
  7. సాపేక్ష సాంద్రత
  8. \(\frac{2 \rho_{1} \rho_{2}}{\rho_{1}+\rho_{2}}\)
  9. \(\frac{1}{2}\)(ρ1 + ρ2)
  10. హైడ్రోమీటరు లేదా డెన్సిటోమీటరు
  11. మునుగును
  12. ఉత్సవనము
  13. 1.01 × 105 న్యూ/మీ²
  14. 13.6 గ్రా/సి.సి.
  15. P = P0 + ρhg
  16. కోల్పోయినట్లనిపించు బరువు
  17. \(\mathrm{F}_{2}=\frac{\mathrm{A}_{2} \times \mathrm{F}_{1}}{\mathrm{~A}_{1}}\)
  18. వస్తువుచే తొలగింపబడిన ద్రవం బరువుకు సమానం
  19. ఉత్సవన సూత్రం

III. జతపరచుము.

i)

Group – AGroup – B
1. ఉత్సవన నియమంA) పాల స్వచ్ఛత
2. హైడ్రాలిక్ జాక్స్B) నీటిలో మునుగును
3. లాక్టోమీటరుC) ఆర్కిమెడీస్
4. హైడ్రోమీటరుD) నీటిపై తేలును
5. సాపేక్ష సాంద్రత 1 కన్నా తక్కువE) పాస్కల్ సూత్రం
F) ఏదైనా ద్రవం యొక్క సాంద్రత
G) నీటిలో వేలాడును

జవాబు:

Group – AGroup – B
1. ఉత్సవన నియమంC) ఆర్కిమెడీస్
2. హైడ్రాలిక్ జాక్స్E) పాస్కల్ సూత్రం
3. లాక్టోమీటరుA) పాల స్వచ్ఛత
4. హైడ్రోమీటరుF) ఏదైనా ద్రవం యొక్క సాంద్రత
5. సాపేక్ష సాంద్రత 1 కన్నా తక్కువD) నీటిపై తేలును

ii)

Group – AGroup – B
1. 1 అట్మాస్ఫియర్A) P2 – P1 = hρg
2. పాదరసం సాంద్రతB) 1.01 × 105 పాస్కల్
3. భారమితిలో పాదరస స్తంభం ఎత్తుC) P = P0 + ρ h g
4. వాతావరణ పీడనం P0 =D) 13.6 గ్రా/సి.సి
5. ఒక ద్రవంలో స్త్రీ లోతులో పీడనంE) ρ h g
F) 76 సెం.మీ

జవాబు:

Group – AGroup – B
1. 1 అట్మాస్ఫియర్B) 1.01 × 105 పాస్కల్
2. పాదరసం సాంద్రతD) 13.6 గ్రా/సి.సి
3. భారమితిలో పాదరస స్తంభం ఎత్తుF) 76 సెం.మీ
4. వాతావరణ పీడనం P0 =E) ρ h g
5. ఒక ద్రవంలో స్త్రీ లోతులో పీడనంC) P = P0 + ρ h g

మీకు తెలుసా?

ఆధార వైశాల్యం 1 సెం.మీ², భూమిపై 30 కి.మీ. వాతావరణం ఎత్తు కలిగిన స్థూపాకార గొట్టంలో ఆవరించి ఉన్న గాలి ద్రవ్యరాశి 1 కి.గ్రా. ఉంటుంది.

1 సెం.మీ² వైశాల్యం గల భూ ఉపరితలంపై పనిచేసే భారమే వాతావరణ పీడనం.

వాతావరణ పీడనం P0 = mg/A = (1 కి.గ్రా. × 10 మీ/సె)² /1 సెం.మీ² = 10 న్యూ / సెం.మీ² లేదా 105 న్యూ / మీ.² (105 పాస్కల్) ఈ విలువ సుమారుగా 1 అట్మాస్ఫియర్ కు సమానం.

AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు 10
ఆర్కిమెడీస్ గ్రీకు దేశ శాస్త్రవేత్త. ఆ రోజుల్లో రాజు గారికి ఒక కిరీటం ఉండేది. అయితే అది స్వచ్ఛమైన బంగారంతో చేయబడిందో, లేదోననే అనుమానం రాజుకు కలిగింది. దానిని కరిగించకుండా మరియు ఆకృతి చెడగొట్టకుండా అది స్వచ్ఛమైనదో, కాదో పరీక్షించవలసిందిగా రాజు ఆర్కిమెడీసకు బాధ్యత అప్పగించాడు.

AP 9th Class Physical Science Important Questions 9th Lesson తేలియాడే వస్తువులు

ఒకరోజు ఆర్కిమెడీస్ స్నానం చేయడానికి స్నానపు తొట్టిలోకి దిగినప్పుడు అందులోని నీరు పొర్లిపోయింది. ఈ సంఘటన ద్వారా కిరీటం యొక్క ఘనపరిమాణం కనుగొనడానికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. కిరీటాన్ని నీటిలో ముంచితే అది దాని ఘనపరిమాణానికి సమాన ఘనపరిమాణం గల నీరు పొర్లిపోయేట్లు చేస్తుంది. కిరీటం యొక్క ద్రవ్యరాశిని ఆర్కిమెడిస్ కొలిచి దానిని కిరీటం ఘనపరిమాణంతో భాగిస్తే కిరీటం యొక్క సాంద్రత తెలుస్తుంది. ఒకవేళ కిరీటంలో సాంద్రత తక్కువ గల లోహం కలీ చేయబడితే కనుగొన్న కిరీటం సాంద్రత స్వచ్ఛమైన బంగారం సాంద్రత కన్నా తక్కువ ఉంటుంది. ఈ ఆలోచన రాగానే ఆర్కిమెడీస్ తన ఒంటి మీద బట్టలు లేని సంగతి కూడా మర్చిపోయి “యురేకా” (నేను కనుగొన్నాను) అని అరుస్తూ వీధిలోకి పరుగెత్తాడు.