AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

SCERT AP 6th Class Science Study Material Pdf 8th Lesson దుస్తులు ఎలా తయారవుతాయి Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 8th Lesson Questions and Answers దుస్తులు ఎలా తయారవుతాయి

6th Class Science 8th Lesson దుస్తులు ఎలా తయారవుతాయి Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. కృత్రిమ దారాలను మండించినపుడు …………. వాసన వస్తుంది. (ఘాటు)
2. పీచు → …………. → వస్త్రం. (దారం)
3. దూది నుంచి గింజలను వేరుచేయడాన్ని …………… అంటారు. (జిన్నింగ్)
4. …………… పీచు (దారం)ను బంగారు దారం అంటారు. (జనపనార)
5. సహజ దారాలకు (పోగులకు) ఉదాహరణ ………….. (నూలు, ఉన్ని)

II. సరియైన సమాధానాన్ని గుర్తించండి.

1. కృత్రిమ దారపు పోగును గుర్తించండి.
A) నూలు
B) ఉన్ని
C) అక్రిలిక్
D) జనపనార
జవాబు:
C) అక్రిలిక్

2. నూలు వడకడానికి ఉపయోగించే సాధనం
A) సూది
B) కత్తి
C) చరఖా
D) కత్తెర
జవాబు:
C) చరఖా

3. దారం నుంచి వస్త్రం తయారు చేసే ప్రక్రియ.
A) వడకడం
B) జిన్నింగ్
C) నేయడం
D) కత్తిరించడం
జవాబు:
C) నేయడం

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

4. జనపనార లభించే మొక్క భాగం
A) వేరు
B) పత్రం
C) పుష్పం
D) కాండం
జవాబు:
D) కాండం

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
వివిధ దారాలతో తయారయిన మీ ఇంటిలో మీరు ఉపయోగించే వస్తువులను పేర్కొనండి.
జవాబు:
చొక్కా – కాటన్
చీర – సిల్క్
స్వెట్టర్ – ఉన్ని
వాకిలి పట్టాలు – కొబ్బరి పీచు
లగేజి కవర్ – పాలిథీన్
గొడుగు – PVC
రైన్ కోట్ – PVC
గన్నీ బ్యాగ్ – జనపనార

ప్రశ్న 2.
దారపు పోగు కంటే దారం దృఢమైనది. ఎందుకు?
జవాబు:
దారంలోని సన్నని పోగుల వంటి నిర్మాణాలను దారపు పోగులు అంటారు. అనేక దారపు పోగుల కలయిక వలన దారం ఏర్పడుతుంది. దారపు పోగుల సంఖ్య పెరిగే కొలది దారం మందం మరియు గట్టితనం పెరుగుతుంది. అందువలన దారపు పోగు కంటే దారం బలంగా ఉంటుంది.

ప్రశ్న 3.
సహజ దారాలకు, కృత్రిమ దారాలకు మధ్య గల భేదాలను తెలపండి.
జవాబు:

సహజ దారాలుకృత్రిమ దారాలు
1) ఇవి మొక్కలు మరియు జంతువుల నుండి ఉత్పన్నమవుతాయి.1) ఇవి రసాయనాల నుండి ఉత్పన్నమవుతాయి.
2) నీటి శోషణ సామర్థ్యం ఎక్కువ.2) నీటి శోషణ సామర్థ్యము తక్కువ.
3) కాల్చినప్పుడు తీవ్రమైన వాసనలతో కూడిన బూడిదను ఏర్పరుస్తాయి.3) కాల్చినపుడు ముడుచుకుపోయి ప్లాస్టిక్ వాసనను ఇస్తాయి.
4) ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది.4) ఆరటానికి తక్కువ సమయం పడుతుంది.
5) బట్టలు ముతకగా ఉంటాయి.5) బట్టలు మృదువుగా ఉంటాయి.

ప్రశ్న 4.
నూలు దారాలతో రెయిన్ కోటును తయారు చేస్తే ఏమవుతుంది?
జవాబు:
వర్షం నుండి రక్షణ పొందటానికి రెయిన్ కోటులు వాడతారు. ఇవి నీటిని పీల్చుకోని స్వభావము కల్గి ఉంటాయి. కానీ నూలు దారాలు నీటిని బాగా పీల్చుకుంటాయి. నూలు దారాలతో రెయిన్ కోటు తయారుచేస్తే అవి నీటిని పీల్చుకొని తడిపేస్తాయి. కావున నూలు దారాలు రెయిన్ కోటు తయారీకి పనికిరావు.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 5.
జనపనార దారంను పొందే విధానం రాయండి.
జవాబు:
జనపనార మొక్క యొక్క కాండం నుండి జనపనార లభిస్తుంది. జనుము కోసిన తరువాత కొన్ని రోజులు నీటిలో నానబెడతారు. కాండం నీటిలో నానబెట్టినప్పుడు అది కుళ్ళిపోయి పై తొక్క సులభంగా ఊడిపోతుంది. ఈ కాండం బెరడు నుండి జనపనార వస్తుంది. ఈ దారంను నేయడం ద్వారా మనం గోనె సంచులను తయారుచేసుకోవచ్చు.

ప్రశ్న 6.
పత్తి మొక్క నుంచి నూలు వస్త్రాన్ని పొందడంలో గల దశలను తెలియజేసే ఫ్లోచార్టును రాయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 1a

ప్రశ్న 7.
సిరి తన పుట్టినరోజు సందర్భంగా బట్టతో చేసిన సంచులను తన తోటి విద్యార్థులకు బహుమతిగా ఇచ్చింది. మీరు ఆమెను ఎలా ప్రశంసిస్తారు?
జవాబు:
సిరి తన పుట్టినరోజున గుడ్డ సంచులను బహుమతిగా ఇచ్చింది. ఇది నిజంగా అభినందించాల్సిన అంశం. ఎందుకంటే: పాలిథీన్ కవర్లు నేలలో కుళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాక పరిసరాలను కలుషితం చేస్తాయి. ఇవి వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా నేల పెర్కొలేషన్ సామర్థ్యాన్ని నివారిస్తాయి. కానీ గుడ్డ సంచులు తేలికగా కుళ్ళి మట్టిలో కలిసిపోతాయి మరియు పర్యావరణానికి హాని కలిగించవు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి సిరి మంచి ప్రయత్నం చేసింది కావున అభినందించాలి.

ప్రశ్న 8.
పాలిథీన్ సంచులకు బదులుగా సహజ దారాలతో చేసిన సంచుల వాడకాన్ని ప్రోత్సహించే కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  • ప్లాస్టిక్ వద్దు – పర్యావరణమే ముద్దు
  • ప్లాస్టిక్ ఒక భూతం – గుడ్డ సంచులే హితం
  • ప్లాస్టిక్ కు నో చెప్పండి – చేతి సంచులకు యస్ చెప్పండి
  • ప్లాస్టిక్ ను వదిలేద్దాం – భూమిని బ్రతికిద్దాం
  • పరిష్కారంలో ఒక భాగంగా ఉండండి – కాలుష్యంలో కాదు
  • అరగని అన్నం మనకు కష్టం – కలవని ప్లాస్టిక్ నేలకు నష్టం

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 87

ప్రశ్న 1.
మీ ఇంటిలో వివిధ రకాల గుడ్డలను ఉపయోగించి తయారుచేసిన వస్తువులు ఏమేమి ఉన్నాయో వాటి జాబితా రాయండి. వాటిని నూలు, పట్టు, ఉన్ని, పాలిస్టర్, టెర్లిన్, నైలాన్ మొదలైన వాటిలో ఏవి దేనితో తయారయ్యా యో వర్గీకరించండి. మీ పట్టికలో మరికొన్ని చేర్చేందుకు ప్రయత్నించండి. మీ ఇంటిలో ఉండే పెద్దలు, ఉపాధ్యాయులు సహకారం తీసుకుని ఏ గుడ్డ ఏదో గుర్తించండి.

గుడ్డ రకంతయారుచేసిన వస్తువులు
1. నూలు
2. పట్టుకుర్తా, చీర
3. ఉన్నిమేజోళ్ళు ………
4. పాలిస్టర్
5. టెర్లిన్చీర, ………..

జవాబు:

గుడ్డ రకంతయారుచేసిన వస్తువులు
1. నూలునూలు చొక్కా సంచి, చీర, ధోవతి, గుమ్మం తెరలు, డ్రస్‌లు
2. పట్టుకుర్తా, చీర, తాళ్లు
3. ఉన్నిమేజోళ్లు, స్వెట్టర్లు
4. పాలిస్టర్చొక్కాలు, చీరలు, ప్యాంటులు, ధోవతులు
5. టెర్లిన్చీర, ఓణీలు, చొక్కాలు

1. మీ ఇంటిలో ఏ రకం బట్టలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?
జవాబు:
మా ఇంట్లో ఎక్కువగా కాటన్ మరియు పట్టు బట్టలు ఉపయోగిస్తున్నారు.

2. ఏ బట్ట ఎలాంటిదో ఎలా గుర్తించగలవు?
జవాబు:
తాకటం మరియు చూడటం ద్వారా దుస్తులు రకాన్ని గుర్తిస్తాము.

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 87

ప్రశ్న 2.
ఏదైనా ఒక గుడ్డముక్కను తీసుకోండి. భూతద్దంలో దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్కొక్కదారాన్ని నెమ్మదిగా లాగండి. దానిని పరిశీలించండి. మీరు ఏమి గమనించారు?
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 2
1. మీరు ఏమి గమనించారు?
జవాబు:
దారము పోగుల వంటి చిన్న నిర్మాణాలను కలిగి ఉంది. ఒక దారాన్ని తీసుకోండి. దాని చివరలు వేళ్ళతో నలపండి. భూతద్దం ద్వారా గమనించండి.

2. దారం చివరన మరింత సన్నని దారాలు కనిపించాయా?
జవాబు:
అవును దారంలో సన్నని నిర్మాణాలు ఉన్నాయి.

3. ఒక సూది తీసుకోండి. ఈ దారాన్ని సూదిలో గుచ్చండి. సూది కన్నంలోకి దారం దూర్చగలిగారా? కష్టంగా ఉంది కదూ! సూదిలో దారం దూర్చడానికి మీ ఇంటిలో పెద్ద వాళ్లు ఏమి చేస్తారో ఎప్పుడైనా గమనించారా?
జవాబు:
సాధారణంగా మనం సూది రంధ్రములోకి దారము ఎక్కించలేకపోయినప్పుడు, మనం దారము చివరను మెలి తిప్పుతాము లేదా లాలాజలంతో చివరి భాగాన్ని గట్టిగా చేస్తాము.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 88

ప్రశ్న 3.
కొన్ని సహజ, కృత్రిమ గుడ్డ ముక్కలను సేకరించండి. కింది పట్టికలో సూచించిన లక్షణాలను పరిశీలించండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.

లక్షణంసహజ వస్త్రంకృత్రిమ వస్త్రం
1. నీటిని పీల్చుకొనే సామర్థ్యము
2. ఆరటానికి పట్టే సమయం
3. కాలిస్తే వచ్చే వాసన
4. మండించిన తరువాత మిగిలినది
5. సాగే గుణం
6. నునుపుదనం

జవాబు:

లక్షణంసహజ వస్త్రంకృత్రిమ వస్త్రం
1. నీటిని పీల్చుకొనే సామర్థ్యముఎక్కువతక్కువ
2. ఆరటానికి పట్టే సమయంఎక్కువతక్కువ
3. కాలిస్తే వచ్చే వాసనమసి వాసనప్లాస్టిక్ వాసన
4. మండించిన తరువాత మిగిలినదిబూడిదముడుచుకుపోతుంది
5. సాగే గుణంతక్కువఎక్కువ
6. నునుపుదనంతక్కువఎక్కువ

1. ఏ రకమైన వస్త్రాలు నునుపుగా ఉన్నాయి?
జవాబు:
ప్రకృతిలో కృత్రిమ వస్త్రాలు నునుపుగా ఉన్నాయి.

2. ఏ రకమైన వస్త్రాలు తొందరగా ఆరాయి?
జవాబు:
కృత్రిమ వస్త్రాలు తక్కువ సమయంలో ఆరాయి.

3. వస్త్రాల నునుపుదనం, అవి ఆరడానికి పట్టే సమయం మధ్య ఏదైనా సంబంధాన్ని గుర్తించావా?
జవాబు:
అవును, నునుపైన బట్టలు ఆరబెట్టడానికి తక్కువ సమయం పడుతుంది.

4. కాల్చినప్పుడు బూడిదగా మారిన వస్త్రాలు ఏమిటి?
జవాబు:
సహజ దారాలు కాల్చినపుడు బూడిదను ఇచ్చాయి.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 89

ప్రశ్న 4.
మీ చుట్టుపక్కల లేదా పొలాలలో నుండి పత్తి కాయలను సేకరించండి. కాయల్లో తెల్లటి దూది ఉంటుంది. దూదిలో నుంచి గింజలను వేరుచేయండి. కొంచెం దూదిని తీసుకోండి. దాన్ని భూతద్దంలో గానీ మైక్రోస్కోపు కింద ఉంచి గానీ పరిశీలించండి.
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 3
1. మీరు ఏమి గమనిస్తారు?
జవాబు:
నేను చిన్న వెంట్రుకల నిర్మాణాలను గమనిస్తాను. ఇవి పత్తి యొక్క దారపు పోగులు.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 89

ప్రశ్న 5.
పత్తికాయల నుంచి దూదిని తీసి గింజలను ఏరివేయండి. కొంత దూదిని ఒక చేతితో తీసుకోండి. మరొక చేతి చూపుడువేలు, బొటనవేళ్లతో కొద్దిగా దూదిని పట్టుకుని మెల్లగా లాగండి. దానిని పురిపెడుతూ లాగండి.
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 4
1. దూది దారంగా రావడాన్ని గమనిస్తారు. ఇది గట్టిగా ఉంటుందా? ఉండదా?
జవాబు:
పత్తి లేదా ఉన్ని నుండి మనం తయారుచేసే దారం నేయడానికి ఉపయోగపడేంత బలంగా లేదు. పత్తి నుండి బలమైన దారం పొందడానికి రాట్నం మరియు తకిలి అనే పరికరాలు వాడతారు.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 91

ప్రశ్న 6.
ఒక గోనె సంచిని సేకరించండి. దానిలో నుండి ఒక దారాన్ని లాగండి. భూతద్దం కింద దారాన్ని పెట్టి పరిశీలించండి. జనపనార దారం సన్నని దారాలతో తయారయినట్టుగా గమనిస్తారు. దారాలు ఎలా కనిపిస్తున్నాయో పరిశీలించండి. వాటిని నూలు దారాలతో పోల్చండి.
జవాబు:
పత్తి మాదిరిగా, జనపనార దారం కూడా దుస్తుల తయారీకి ఉపయోగపడుతుంది. దీనిని “గోల్డెన్ దారపు పోగు” అని కూడా అంటారు. జనపనార బట్ట కాటన్ దుస్తులు వలె ఉండదు. ఇది గట్టి, బలమైనది మరియు మరింత కఠినమైనది.

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 92

ప్రశ్న 7.
కొబ్బరి ఆకులతో చాప ఎలా అల్లుతారు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 5
కొబ్బరి ఆకులను లేదా రెండు వేరు వేరు రంగుల కాగితపు చీలికలను తీసుకోండి. కొబ్బరి ఆకుకు ఉన్న ఈ నెను తీసివేసి ఆకును రెండుగా చేయండి. ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా ఆకులను అమర్చండి. ఇంకొక ఆకును తీసుకుని పేర్చిన ఆకులు ఒకసారి పైకి ఒకసారి కిందికి వచ్చేలా అడ్డంగా దూర్చండి. (నవారు మంచం అల్లినట్లు) ఇలా ఆకులన్నీ దూర్చండి. చివరికి మీకు చదునుగా ఉండే చాప తయారవుతుంది. ఇదే విధంగా రంగుల కాగితాలు ఉపయోగించి అల్లండి.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 94

ప్రశ్న 1.
బట్టతో సంచి తయారుచేయండి. దాని మీద రంగురంగుల గుడ్డ ముక్కలతో డిజైన్లు కుట్టండి. పాఠశాలలో ప్రదర్శించండి.
జవాబు:

ప్రశ్న 2.
వివిధ రకాల దుస్తుల చిత్రాలు సేకరించండి. వాటి పేర్లు రాయండి. స్క్రాప్ బుక్ తయారుచేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం :

  1. ఈ స్క్రుకను విద్యార్థులు ఎవరికి వారే తయారు చేసుకోవాలి.
  2. బట్టలషాపు యజమానుల సహకారం తీసుకుని సేకరించిన దుస్తుల పేర్లు తెలుసుకుని రాయవచ్చు.

ప్రశ్న 3.
మీ ఉపాధ్యాయులతో లేదా మీ తల్లిదండ్రులతో చర్చించి మన రాష్ట్రంలో గల నూలు మిల్లులను చూపించే చార్టు తయారు చేయండి.
జవాబు:

ప్రశ్న 4.
చేనేత కార్మికులు, పత్తి రైతుల గురించిన సమాచారాన్ని వార్తాపత్రికల నుండి సేకరించండి. ఏదైనా ఒక దానిపైన మీ విశ్లేషణ రాయండి.
జవాబు:
విద్యార్థులు వారి నైపుణ్యం బట్టి ఎవరికి తోచిన రీతిలో వారు ఈ ప్రశ్నకు జవాబు వ్రాసి, విశ్లేషణ చేయాలి. ఉపాధ్యాయుని సలహా తీసుకోండి.

ప్రశ్న 5.
కృత్రిమ దారాలు కాల్చినపుడు ఘాటైన వాసన వస్తుందని చెప్పడానికి నీవు ఏమి ప్రయోగం చేశావు? ఆ ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
వివిధ కృత్రిమ వస్త్రం ముక్కలను తీసుకొని ఒకదాని తరువాత ఒకటి కాల్చుతూ పరిశీలనలు నమోదు చేయండి. ఉన్ని త్వరగా కాలిపోదు. నైలాన్, పాలిస్టర్, టెరీలిన్, రేయాన్ వంటి దారాలు వాటిని కాల్చినప్పుడు అవి తీవ్రమైన వాసనను ఇస్తాయి. మరియు కుచించుకుపోతాయి.

AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 6.
ఈ లోగోలను పరిశీలించండి. వీనికి సంబంధించిన సమాచారం సేకరించండి.
జవాబు:

  • ‘ఆప్కో’ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత నేత కార్మికుల సహకార సంఘం యొక్క సంక్షిప్తీకరణ.
  • ఆప్కో 1976లో స్థాపించబడింది.
  • కో-ఆప్టెక్స్ అంటే తమిళనాడు చేనేత సహకార సమాజం యొక్క సంక్షిప్తీకరణ.
  • కో-ఆప్టెక్స్ చేనేత వస్త్రాల యొక్క మార్గదర్శక మార్కెటింగ్ సంస్థ.
  • దాని నెట్ వర్క్ ద్వారా భారతదేశం అంతటా విస్తరించి ఉన్న 203 షోరూమ్ ల ద్వారా వ్యాపారం సాగిస్తుంది.
  • 1935లో స్థాపించబడిన ఈ సంస్థ వార్షిక టర్నోవర్ రూ. 1000 కోట్లు.
  • వస్త్ర రంగుల సీతాకోకచిలుక లోగో అనేది కో-ఆప్టెక్స్ యొక్క నాణ్యత, మన్నిక మరియు సరసమైన వాణిజ్యానికి పర్యాయపదంగా మారింది.

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

SCERT AP 6th Class Science Study Material Pdf 7th Lesson కొలుద్దాం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 7th Lesson Questions and Answers కొలుద్దాం

6th Class Science 7th Lesson కొలుద్దాం Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. మిల్లీమీటరు ……………. కొలవడానికి ప్రమాణం. (పొడవు)
2. ఎక్కువ దూరాన్ని కొలవడానికి …………. ను ప్రమాణంగా ఉపయోగిస్తారు. (కి.మీ.)
3. ఒక వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను ……………. అంటాం. (వైశాల్యం )

II. సరియైన సమాధానాన్ని గుర్తించండి.

1. సెంటీమీటరు స్కేలును ఉపయోగించి కొలవగలిగిన అతిచిన్న కొలత
A) సెంటీమీటరు
B) మిల్లీమీటరు
C) మీటరు
D) మైక్రోమీటరు
జవాబు:
B) మిల్లీమీటరు

2. ఘనాకార వస్తువుల ఘనపరిమాణం ఇలా కొలుస్తారు.
A) మీటరు
B) చదరపు మీటరు
C) క్యూబిక్ మీటరు
D) సెంటీమీటరు
జవాబు:
C) క్యూబిక్ మీటరు

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

3. అక్రమాకార ఉపరితలాల వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించేది
A) దారం
B) గ్రాఫ్ కాగితం
C) కొలపాత్ర
D) స్కేలు
జవాబు:
B) గ్రాఫ్ కాగితం

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఒక తరగతి గది పొడవు 20మీ. వెడల్పు 15మీ. ఆ గది వైశాల్యాన్ని లెక్కించండి.
జవాబు:
హాల్ యొక్క పొడవు (l) = 20 మీ.
హాల్ యొక్క వెడల్పు (b) = 15 మీ.
హాల్ యొక్క వైశాల్యం A = l × b = 20 మీ × 15 మీ = 300 మీ² = 300 చ.మీ.

ప్రశ్న 2.
రాము వాళ్ళ నాన్న 60 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉన్న స్థలం కొన్నాడు. దానిలో 40 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు గల స్థలంలో ఇల్లు కట్టాడు. మిగిలిన ప్రదేశంలో తోట పెంచాలనుకున్నాడు. తోటకు ఎంత స్థలం వస్తుందో రాము కనుక్కోవాలనుకున్నాడు. అతనికి సహాయం చేయండి.
జవాబు:
దీర్ఘచతురస్రాకార ప్లాట్ యొక్క ప్రాంతం A = L1 × B1
ఇక్కడ L1 = 60 అడుగులు, B1 = 50అడుగులు
A1 = L1 × B1 = 60 అడుగులు × 50 అడుగులు = 3000 చదరపు అడుగులు
ఇంటి వైశాల్యం A2 = L2 × B2
ఇక్కడ L2 = 40 అడుగులు, B2 = 40 అడుగులు
A2 = L2 × B2 = 40 అడుగులు × 40 అడుగులు = 1600 చదరపు అడుగులు
మిగిలిన ప్రాంతం A3 = A1 – A2 = 3000 – 1600 = 1400 చ. అడుగులు
A3 = 1400 చదరపు అడుగులు. కాబట్టి తోట 1400 చదరపు అడుగులలో ప్రణాళిక చేయబడినది.

ప్రశ్న 3.
తాపీ మేస్త్రీని కలిసినప్పుడు ఇల్లు (డాబా) కట్టేటప్పుడు ఏ విధంగా కొలతలు తీసుకుంటాడో తెలుసుకోవడానికి ఏయే ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
ప్రశ్నలు :

  • ఒక ప్రాంతం యొక్క పొడవు మరియు వెడల్పును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి?
  • గోడను నిర్మించడానికి అవసరమయ్యే ఇటుకలను ఎలా అంచనా వేస్తారు?
  • కాంక్రీటు సిద్ధం చేయడానికి మనం ఎంత సిమెంట్ మరియు ఇసుకను కలపాలి?
  • ఇటుకలను విరగగొట్టటానికి ఉపయోగించే పరికరం ఏమిటి?

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

ప్రశ్న 4.
స్కేలు ఉపయోగించి లోహపు తీగ మందాన్ని కొలవగలమా? వివరించండి.
జవాబు:

  • ఒక లోహపు తీగె మరియు పెన్సిల్ తీసుకోండి.
  • పెన్సిల్ చుట్టూ లోహపు తీగను చుట్టలుగా చుట్టండి.
  • ఇప్పుడు స్కేల్ ఉపయోగించి లోహపు తీగె యొక్క పొడవును కొలవండి.
  • ఆ పొడవును పెన్సిల్ చుట్టూ ఉన్న లోహపు తీగ చుట్టల సంఖ్యతో విభజించండి. అప్పుడు మనకు మెటల్ వైర్ యొక్క మందం లభిస్తుంది.

ప్రశ్న 5.
ఒక అరటిపండు ఘనపరిమాణం లెక్కించడానికి మీరు ఏ పద్ధతిని అనుసరిస్తారు? దాన్ని వివరించండి.
జవాబు:

  • అరటి పండు ఘనపరిమాణం కొలవటానికి కొలజాడీ, నీరు, దారము తీసుకోవాలి.
  • కొలజాడీలో కొంత నీరు తీసుకొని దాని ఘనపరిమాణం నిర్ధారించుకోవాలి.
  • ఘనపరిమాణం కొలవవలసిన అరటిపండుకు దారం కట్టి నీరు ఉన్న కొలజాడీలో ముంచాలి.
  • అరటిపండు నీటిలో మునగటం వలన నీటి మట్టం పెరుగుతుంది.
  • పెరిగిన నీటి మట్టం అరటిపండు ఘనపరిమాణానికి సమానం.

ప్రశ్న 6.
గ్రాఫ్ పేపర్‌ను ఉపయోగించి మీ అరచేతి వైశాల్యాన్ని ఎలా లెక్కిస్తారో వివరించండి.
జవాబు:

  • గ్రాఫ్ పేపర్ తీసుకొని దానిపై మీ అరచేయి ఉంచండి.
  • పెన్సిల్ ఉపయోగించి మీ అరచేతి యొక్క హద్దు రేఖలను గీసి మీ చేతిని తొలగించండి.
  • ఇప్పుడు అరచేతి సరిహద్దు లోపల పూర్తి చతురస్రాల సంఖ్యను లెక్కించండి.
  • తరువాత సగం లేదా సగం కంటే ఎక్కువ ఉన్న చతురస్రాలను పూర్తి చతురస్రంగా లెక్కించండి.
  • సగం కంటే తక్కువ ఉన్న చతురస్రాలను లెక్కించకుండ వదిలేయండి.
  • లెక్కించిన చతురస్రాలు ‘n’ ఉంటే అరచేతి యొక్క వైశాల్యం ‘n’ cm’ అవుతుంది.
  • ఈ ప్రక్రియ ద్వారా అరచేతి యొక్క వైశాల్యం కనుగొనవచ్చు.

ప్రశ్న 7.
కొయ్య సామగ్రి తయారుచేసేటప్పుడు వడ్రంగి కచ్చితమైన కొలతలు తీస్తాడు కదా! మీరెప్పుడైనా చూశారా? అతని పనితీరును మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:

  • వడ్రంగులు లోహపు టేపుతో కొలతలు తీసుకుంటారు.
  • అతను కొలతలను చాలా కచ్చితంగా మరియు మిల్లీమీటర్లతో తీసుకుంటాడు.
  • ఈ పనికి అతని అనుభవం ఉపయోగపడుతుంది.
  • ఏదైనా తప్పు కొలత తీసుకుంటే అది అతను తయారుచేస్తున్న ఫర్నిచర్ పై ప్రభావం చూపుతుంది.
  • కాబట్టి వడ్రంగుల పని నాణ్యత ఈ కొలతలపై ఆధారపడి ఉన్నందున కొలతలపై అతని మనస్సును ఏకాగ్రతగా ఉంచుతారు.
  • లేకపోతే వడ్రంగులు సమయం, పేరు మరియు డబ్బు కోల్పోవలసివస్తుంది.

ప్రశ్న 8.
గడియారంలో రెండు అంకెల మధ్య దూరం కచ్చితంగా సమానంగా ఉంటుంది. ఇలా కచ్చితమైన దూరం ఉండే వస్తువులు, విషయాల జాబితా రాయండి.
జవాబు:

  • కిలోమీటర్ రాళ్ళ మధ్య ఒకే విధంగా ఉంటుంది.
  • వాహనాల ముందు మరియు వెనుక చక్రాల మధ్య వ్యాసార్థం, సమానంగా ఉంటుంది.
  • ఫ్యాన్ రెక్కల మధ్య దూరం సమానం మొదలైనవి.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 72

ప్రశ్న 1.
మీ స్నేహితులందరూ ఒక్కొక్కరుగా మీ తరగతి గదిలోని బల్ల అంచును ‘జాన’లలో కొలవండి.ఎవరికి ఎన్ని జానలు వచ్చాయో పట్టికలో నమోదు చేయండి.
పట్టిక -1
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 1

విద్యార్థి పేరుజానల సంఖ్య
1. వివేక్8
2. లిఖిత9
3. రాజు7
4. శ్రీదేవి8
5. శ్రీనివాస్6

• టేబుల్ పొడవు కొలిచినప్పుడు జానల సంఖ్య అందరికీ సమానంగా వచ్చిందా?
జవాబు:
టేబుల్ పొడవు కొలిచినపుడు అందరి జానల సంఖ్య సమానంగా లేవు.

• టేబుల్ పొడవును సూచించే జానల సంఖ్య ఎవరికి ఎక్కువగా వచ్చింది? ఎందుకు?
జవాబు:
లిఖితకు జానల సంఖ్య ఎక్కువగా వచ్చింది.

• ఒకే బల్లను కొలిచినప్పటికీ ఒక్కొక్కరికి జానల సంఖ్యలో తేడా ఎందుకు వచ్చింది?
జవాబు:
ఒకే పొడవును కొలిచినప్పటికి చిన్న చేతులు ఉన్న వారికి ఎక్కువ జానలు వచ్చాయి.

ఇదేవిధంగా విద్యార్థులందరూ కలిసి వారివారి అడుగులతో మీ తరగతి గది పొడవును కొలిచి పట్టిక -2లో – నమోదు చేయండి.
పట్టిక – 2

విద్యార్థి పేరుఅడుగుల సంఖ్య
1. వీరు9
2. లక్ష్మి8
3. శాంతి10
4. శ్యామ్8
5. రాజు7

• తరగతి గది పొడవును వేరు వేరు విద్యార్థులు కొలిచినపుడు అడుగుల సంఖ్య ఒకే విధంగా వచ్చిందా?
జవాబు:
వేరు వేరు విద్యార్థులకు అడుగుల సంఖ్య వేరుగా ఉంది.

• ఎవరు కొలిచినప్పుడు అడుగుల సంఖ్య ఎక్కువ వచ్చింది? ఎందుకు?
జవాబు:
శాంతి కొలిచినపుడు అడుగుల సంఖ్య ఎక్కువగా వచ్చింది.

• ఎవరు కొలిచినప్పుడు అడుగుల సంఖ్య తక్కువ వచ్చింది? ఎందుకు?
జవాబు:
రాజు కొలిచినపుడు అడుగుల సంఖ్య తక్కువగా వచ్చింది.

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 75

ప్రశ్న 2.
మీ తరగతిలోని మీ మిత్రుని ఎత్తు మీటరు స్కేలుతో ఎలా కొలుస్తావు?
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 2
1) ముందుగా మీ మిత్రుని వీపు గోడకు ఆనించి నిటారుగా నిలబడమనండి. కచ్చితంగా అతని తల పైభాగం మీద ఉండే విధంగా గోడ మీద ఒక గీత గీయండి.
2) ఇప్పుడు నేల నుంచి ఈ గీత వరకు గోడ మీద ఉన్న దూరాన్ని ఒక స్కేలుతో కొలవండి.
3) ఇదే విధంగా మీ మిత్రుని ఎత్తును మిగిలిన విద్యార్థుల ఎత్తును కూడా కొలవండి.
ఈ కొలతలన్నింటినీ మీ నోట్ బుక్ లో నమోదు చేయండి.

వేరు వేరు విద్యార్థుల ఎత్తులను నమోదు చేసిన కొలతలను జాగ్రత్తగా పరిశీలించండి.

• విద్యార్థులందరికీ ఒకే విధమైన కొలతలు వచ్చాయా?
జవాబు:
విద్యార్థులందరికీ ఒకే విధమైన కొలతలు రాలేదు. దీనికి కారణం గోడపై గుర్తించిన గీత విద్యార్థి తలపై ఉండకపోవటం.

• ఒకవేళ రాకపోయినట్లయితే, తేడా రావడానికి కారణం ఏమై ఉండవచ్చు?
జవాబు:
మీటర్ స్కేల్ ను సరిగా ఉపయోగించకపోవటం.

కృత్యం -3

6th Class Science Textbook Page No. 76

ప్రశ్న 3.
ఒక రూపాయి నాణాలను పది తీసుకుని వాటిని ఒక దానిపైన ఒకటి ఉండేటట్లు పటంలో చూపిన విధంగా అమర్చండి. వాటి మందాన్ని స్కేలుతో కొలిచి, ఆ విలువను నాణాల సంఖ్యతో భాగించినట్లయితే ఒక నాణెం మందం తెలుస్తుంది.
ఇదే విధంగా, మీ పాఠ్యపుస్తకంలోని ఒక పేజి మందాన్ని కొలవడానికి ప్రయత్నించండి.
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 3
జవాబు:
పుస్తకం మందాన్ని కొలిచి దానిని పుస్తక పేజీలతో భాగిస్తే ఒక పేజీ మందం తెలుస్తుంది.
ఉదా : పుస్తక మందం = 10 సెం.మీ.
పుస్తక పేజీల సంఖ్య = 100 మంది
పేజీ మందం = 10/100 = 0.01 సెం.మీ. = 0.1 మీ.మీ.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 77

ప్రశ్న 4.
వక్ర మార్గం యొక్క పొడవును మీరు ఎలా కనుగొంటారు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 4
వక్రరేఖ పొడవును కొలవడం :

  • కొలవవలసిన వక్రరేఖ రెండు చివరల దగ్గర, గుండు సూదులను పటంలో చూపిన విధంగా గుచ్చాలి.
  • ఇప్పుడు దారం తీసుకొని మొదటి బిందువు దగ్గర ఉన్న గుండుసూదికి ముడివేయాలి.
  • దారాన్ని B, C, D బిందువుల గుండా E దగ్గర ఉన్న గుండుసూది వరకు తీసుకెళ్ళాలి.
  • ఇలా చేసేటప్పుడు, దారం ఎక్కువ బిగుతుగా లేదా ఎక్కువ వదులుగా ఉండకుండా జాగ్రత్తపడాలి.
  • అంతేకాకుండా ప్రతిబిందువు దగ్గర దారం వక్రరేఖతో ఏకీభవించేలా చూడాలి. దారం, వక్రరేఖ చివరి బిందువు చేరిన తర్వాత, ఆ బిందువు దగ్గర దారాన్ని తెంపాలి.
  • ఇప్పుడు దారాన్ని ‘A’ దగ్గర గుండుసూది నుండి విడదీసి, దాన్ని తిన్నగా మీటరు స్కేలు పొడవు వెంబడి ఉంచి, దాని పొడవును కొలవాలి.
  • ఈ దారం పొడవే వక్రరేఖ పొడవు అవుతుంది.

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 77

ప్రశ్న 5.
కింద ఇవ్వబడిన డ్రాయింగ్ చార్టుల చిత్రాలను పరిశీలించండి.
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 5
పై చార్టులను చూసి అందులో ఏది పెద్దదో, ఏది చిన్నదో మీరు చెప్పగలరా? చూసి చెప్పలేకపోతే, ఏది పెద్దదో ఏది చిన్నదో ఎలా నిర్ణయిస్తావు?
జవాబు:
రెండు A, పరమాణపు తెల్ల కాగితాలను తీసుకోండి. పటంలో చూపినట్లు ఆ తెల్ల కాగితాలను కత్తిరించండి. ఒకే పరిమాణం గల ఖాళీ అగ్గిపెట్టెలను కొన్నింటిని తీసుకొని వాటిని ఒక్కొక్క కాగితంపై పేర్చండి. ఏ కాగితంపై పేర్చడానికి ఎన్నెన్ని అగ్గిపెట్టెలు పట్టాయో లెక్కించండి. ఏ కాగితంపైన పేర్చడానికి ఎక్కువ అగ్గిపెట్టెలు అవసరమయ్యాయో ఆ కాగితం పెద్దదని మీరు గుర్తించి ఉంటారు. కానీ ఆ కాగితం రెండో దానికంటే ఎంత పెద్దదో కచ్చితంగా చెప్పలేరు. దీన్ని బట్టి కాగితం వంటి సమతలం పెద్దదో, చిన్నదో తెలియాలంటే దాని ఉపరితలాన్ని కొలవాలి అని తెలుస్తుంది. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటారు.

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 79

ప్రశ్న 6.
అట్ట ముక్కవైశాల్యం కనుగొనే పద్ధతిని వివరించండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 6

  • పటంలో చూపిన విధంగా 4 సెం.మీ పొడవు, 2 సెం.మీ వెడల్పు ఉండే దీర్ఘ చతురస్రాకారంలో ఒక అట్ట ముక్కను కత్తిరించాలి.
  • దీని వైశాల్యాన్ని కొలవటానికి సెం.మీ. గ్రాఫ్ కాగితం తీసుకోవాలి. దీనిపై ప్రతిభాగం వైశాల్యం / చదరపు సెంటీమీటరుకు సమానం.
  • ఈ గ్రాఫ్ కాగితం పైన ప్రతి చదరం యొక్క భుజం పొడవు 1 సెం.మీ. ఉంటుంది. ఈ గ్రాఫ్ కాగితంపైన పైనుండే ప్రతి చదరం వైశాల్యం ఒక చ. సెం.మీ.కి సమానం.
  • పటంలో చూపిన విధంగా అట్టముక్కను గ్రాఫ్ కాగితం పైనుంచి, దాని – చుట్టూ పెన్సిల్ గీత గీయాలి.
  • ఇప్పుడు అట్టముక్కను తొలగించి ఏర్పడిన ఆకారాన్ని – PQRS గా గుర్తించాలి. ఇప్పుడు అట్టముక్క చుట్టూ గీసిన రేఖ లోపలి భాగంలో ఉన్న చదరాలను లెక్కించాలి.
  • ఇందులో ‘8’ చదరాలు ఉంటాయని గమనిస్తాము.
  • PORS వైశాల్యం = అట్టముక్క చుట్టూ గీసిన రేఖ లోపల ఉన్న చదరాల మొత్తం వైశాల్యాలకు సమానం = 8 × 1 చదరం వైశాల్యం = 8 × 1 చ.సెం.మీ = 8 చ.సెం.మీ. ఈ కృత్యంలో మనం ఉపయోగించిన అట్టముక్క క్రమాకారంలో ఉన్న ఒక దీర్ఘచతురస్రం అని స్పష్టం అవుతున్నది.

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 80

ప్రశ్న 7.
అక్రమాకార సమతలాన్ని, ఏదైనా ఆకు వైశాల్యాలను ఎలా కొలవాలో తెలుసుకుందాం.
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 7
జవాబు:

  • పటంలో చూపిన విధంగా ఒక ఆకును గ్రాఫ్ కాగితం పైన ఉంచి, దాని చుట్టూ పెన్సిల్ తో హద్దురేఖను గీయాలి.
  • ఇప్పుడు ఆకును తీసివేసి దానిచేత ఏర్పడిన హద్దు రేఖను పరిశీలించాలి.
  • హద్దు రేఖ లోపల ఉన్న పూర్తి చదరాలను సగం లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం ఉన్న చదరాల సంఖ్యనూ వేరువేరుగా లెక్కించాలి.
  • పూర్తి చదరాల సంఖ్యకు, సగం లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం గల చదరాల సంఖ్యను కలపాలి.
  • హద్దురేఖ లోపల ఉన్న ఈ మొత్తం చదరాల సంఖ్య ఆకు వైశాల్యాన్ని తెలుపుతుంది. హద్దు రేఖ లోపలి భాగంలో ‘n’ చదరాలు ఉంటే ఆకు వైశాల్యం ‘n’ చ. సెం.మీ. అవుతుంది.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 84

ప్రశ్న 1.
పటిక, కలకండ సేకరించండి. వాటి ఘనపరిమాణాన్ని కొలిచి పట్టికలో రాయండి.
జవాబు:
నీటిలో పటిక మరియు కలకండ కరుగుతాయి. కావున కొలపాత్రలో కిరోసిన్ తీసుకోవడం ద్వారా కలకండ మరియు పటిక పరిమాణాన్ని కొలుస్తారు.
కొలతలు క్రింది పట్టికలో నమోదు చేయబడ్డాయి.

విద్యార్థి యొక్క పేరుకలకండ ఘనపరిమాణంపటిక ఘనపరిమాణం
1. రమేష్30 CC40 CC
2. వెంకట్28.5 CC42.1 CC
3. గీతా27.6 CC41.8 CC
4. షాహీనా25.1 CC42.7 CC
5. లిఖిత21 CC42 CC
  • విద్యార్థులు కొలిచే కలకండ, యొక్క అన్ని ఘనపరిమాణాలు సమానంగా ఉండవు.
  • విద్యార్థులు కొలిచే పటిక యొక్క అన్ని ఘనపరిమాణాలు కూడా సమానంగా ఉండవు.
  • విద్యార్థుల రీడింగులను గమనించడంలో పారలాక్స్ లోపం ఉంది. కాబట్టి వారి రీడింగులలో చిన్న వైవిధ్యం ఉంది.

ప్రశ్న 2.
గ్రామ పంచాయితీ, కార్యాలయానికి వెళ్ళి గ్రామ రెవెన్యూ అధికారి పొలాల వైశాల్యాలను ఎలా కొలుస్తారో వివరాలు సేకరించండి. ఇందుకోసం మీరు ఆయన్ని ఏయే ప్రశ్నలు అడగదలుచుకున్నారో రాయండి.
జవాబు:

  • వ్యవసాయ భూముల ప్రాంతాలు మనకు తెలిసిన సాధారణ సాధనాలతో కొలవబడవు.
  • వారు సర్వే గొలుసులను ఉపయోగిస్తారు ఇవి లింకులలో చేయబడతాయి.
  • పొలం కొలతలు ఎక్కువ దూరాన్ని కలిగి ఉన్నందున, VRO వీటిని కొలిచేందుకు గొలుసులను ఉపయోగిస్తారు.

ప్రశ్నలు :

  1. మీరు కొలత కోసం టేప్ ఎందుకు ఉపయోగించరు?
  2. సర్వే గొలుసును ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏమిటి?
  3. మీరు గొలుసుతో ఖచ్చితమైన కొలతను పొందుతారా?
  4. స్థలం యొక్క పొడవును కొలవడానికి మేము మీటర్ స్కేల్ ను ఉపయోగించవచ్చా?
  5. ఎకరాల భూమిని కొలవడానికి మనకు ఎన్ని లింకులు అవసరం?

ప్రశ్న 3.
ఏదైనా శుభలేఖను కార్డు, కవరులతో సహా సేకరించండి. వాటి కొలతలు కొలవండి. తేడా లెక్కించండి. మీరు అనుసరించిన పద్దతిని నమోదు చేయండి.
జవాబు:
1. కవర్ల కొలతలు :
కవర్ పొడవు L1 = 25 సెం.మీ.
కవర్ యొక్క వెడల్పు B1 = 20 సెం.మీ.

2. కార్డు యొక్క కొలతలు:
కార్డు యొక్క పొడవు L2 – 23 సెం.మీ.
కార్డు యొక్క వెడల్పు B2 = 17 సెం.మీ.

  • కవర్ మరియు కార్డు యొక్క పొడవు మరియు వెడల్పులను స్కేల్ తో కొలుస్తారు.
  • కార్డు కవర్ కంటే కొంచెం చిన్నదిగా ఉండటం వలన కవర్ లో సరిపోతుంది.

AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం

ప్రశ్న 4.
సి.డి, సిమ్ కార్డు, మొబైల్ ఫోన్ వైశాల్యం ఎంత ఉంటుందో ఊహించండి. తరువాత గ్రాఫ్ పేపర్ తో కొలిచి చూడండి. ఏవేవి దాదాపు సమానంగా ఊహించగలిగారో రాయండి.
జవాబు:

వస్తువుఊహించినదిగ్రాఫ్ పేపర్ లో కొలిసినది
సిడి10 cm2 cm
సిమ్ కార్డ్1 cm1 cm
ఫోన్15 cm22 cm

గ్రాఫ్ పేపర్ ఉపయోగించి కొలిచినపుడు సిడి, సిమ్ కార్డు ఫోన్ వైశాల్యాలు నేను ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉన్నాయి.

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

These AP 6th Class Science Important Questions 12th Lesson కదలిక – చలనం will help students prepare well for the exams.

AP Board 6th Class Science 12th Lesson Important Questions and Answers కదలిక – చలనం

6th Class Science 12th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కదలిక అంటే ఏమిటి?
జవాబు:
ఒక జీవి యొక్క శరీరం లేదా దాని భాగాలు యథాస్థానం నుండి శాశ్వతంగా గాని లేదా తాత్కాలికంగా గాని మారే ప్రక్రియను కదలిక అంటారు.

ప్రశ్న 2.
స్థాన చలనం అంటే ఏమిటి?
జవాబు:
మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారే ప్రక్రియను స్థాన చలనం అంటారు.

ప్రశ్న 3.
స్థాన చలనం అవసరం ఏమిటి?
జవాబు:
స్థాన చలనం రక్షణ మరియు ఆహార సేకరణకు సహాయపడుతుంది.

ప్రశ్న 4.
కండరాలు ఎముకలతో ఎలా అనుసంధానించబడి ఉన్నాయి?
జవాబు:
కండరాలు ఎముకలతో నేరుగా కాకుండా స్నాయు బంధనం లేదా టెండాన్ సహాయంతో అనుసంధానించబడి ఉంటాయి.

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

ప్రశ్న 5.
కండరాలు ఎలా పనిచేస్తాయి?
జవాబు:
కండరాలు జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు, ఎముక ఆ దిశగా లాగబడుతుంది. అప్పుడు జతలోని మరొక కండరం సడలించబడుతుంది.

ప్రశ్న 6.
అస్థిపంజరం అంటే ఏమిటి?
జవాబు:
మన శరీరంలోని వివిధ ఎముకలు కలిసి అస్థిపంజరంగా ఏర్పడతాయి. ఇది శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది.

ప్రశ్న 7.
కీలు అంటే ఏమిటి?
జవాబు:
రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీలు అంటారు.

ప్రశ్న 8.
కీళ్ళలోని రకాలు ఏమిటి?
జవాబు:
కీళ్ళు రెండు రకాలు. అవి కదిలే కీళ్ళు మరియు కదలని కీళ్ళు.

ప్రశ్న 9.
కదిలే కీళ్ళలో రకాలు ఏమిటి?
జవాబు:
కదిలే కీళ్ళు నాలుగు రకాలు. అవి

  1. బంతి గిన్నె కీలు,
  2. మడత బందు కీలు,
  3. జారెడు కీలు,
  4. బొంగరపు కీలు.

ప్రశ్న 10.
స్నాయుబంధనం (టెండాన్) ఉపయోగం ఏమిటి?
జవాబు:
స్నాయుబంధనం ఎముకలను, కండరాలను కలుపుతుంది.

ప్రశ్న 11.
సంధి బంధనం (లిగమెంట్) యొక్క పని ఏమిటి?
జవాబు:
సంధి బంధనం ఒక ఎముకను మరొక ఎముకతో కలుపుతుంది.

ప్రశ్న 12.
మన శరీరంలో కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
ఎగువ దవడ మరియు పుర్రె మధ్య కదలని కీళ్ళు ఉంటాయి.

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

ప్రశ్న 13.
జీవులలో గల కొన్ని చలన అవయవాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
చేపలలో – వాజాలు
పక్షులలో – కాళ్ళు, రెక్కలు
పాములో – పక్కటెముకలు
నత్తలో – కండరపాదం చలనానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 14.
మన శరీరంలో ఎన్ని కండరాలు ఉన్నాయి?
జవాబు:
మన శరీరంలో 650 కన్నా ఎక్కువ కండరాలు ఉన్నాయి.

ప్రశ్న 15.
మన శరీరంలో అతి పెద్ద కండరం ఏమిటి?
జవాబు:
మన శరీరంలో అతి పెద్ద కండరం గ్లూటియస్ మాక్షిమస్.

ప్రశ్న 16.
మన శరీరంలో అతి చిన్న కండరం ఏమిటి?
జవాబు:
మన శరీరంలో అతి చిన్న కండరం స్టేపిడియస్.

ప్రశ్న 17.
విశ్రాంతి లేకుండా ఏ కండరాలు పనిచేస్తాయి?
జవాబు:
గుండె కండరాలు విశ్రాంతి లేకుండా పనిచేస్తాయి.

ప్రశ్న 18.
నిమిషానికి హృదయం ఎంత రక్తం పంపు చేస్తుంది?
జవాబు:
మానవ హృదయం రక్త నాళాల ద్వారా నిమిషానికి 4500 సిసి రక్తాన్ని పంపు చేస్తుంది.

ప్రశ్న 19.
పుర్రెలో గల కదిలే కీలు ఏమిటి?
జవాబు:
పుర్రెలో గల కదిలే కీలు క్రింది దవడ.

ప్రశ్న 20.
మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి?
జవాబు:
మానవ శరీరంలో 206 ఎముకలు ఉన్నాయి.

ప్రశ్న 21.
ఎముకలు ఎలా తయారవుతాయి?
జవాబు:
ఎముకలు కాల్షియం మరియు భాస్వరంతో తయారవుతాయి. ఇవి చాలా కఠినంగా ఉంటాయి.

ప్రశ్న 22.
మన శరీరంలో అతిపెద్ద ఎముక ఏమిటి?
జవాబు:
తొడ ఎముక (ఫీమర్) మన శరీరంలో అతి పెద్ద ఎముక.

ప్రశ్న 23.
మన శరీరంలో అతి చిన్న ఎముక ఏమిటి?
జవాబు:
చిన్న ఎముక స్టేపిస్ లేదా కర్ణాంతరాస్థి.

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

ప్రశ్న 24.
మనం పై దవడను ఎందుకు కదిలించలేము?
జవాబు:
మన శరీరంలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు కదలవు. వీటిని ‘కదలని కీళ్ళు’ అంటారు. పుర్రె భాగంలో గల పై దవడకు, తలకు మధ్య కదలని కీలు ఉంటుంది. అందువల్లనే మనం పై దవడను కదిలించలేము.

6th Class Science 12th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కండరాలు కదలకుండా మీ శరీర భాగాలను కదిలించటం సాధ్యమేనా? ఎందుకు?
జవాబు:

  1. కండరాలు కదలకుండా శరీర భాగాలను కదిలించడం సాధ్యం కాదు.
  2. కండరాలు మాంసయుత నిర్మాణాలు. అవి కదలికకు కారణమవుతాయి.
  3. ఇవి ఎముకలకు జతచేయబడి సంకోచం మరియు సడలింపును చేస్తాయి.
  4. ఈ సంకోచాల ద్వారా ఎముకలు ఆ దిశలో లాగబడి కదలికను కలిగిస్తాయి.

ప్రశ్న 2.
కండరాలు ఎలా పనిచేస్తాయి?
జవాబు:

  1. కండరాలు జంటగా పనిచేస్తాయి.
  2. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు, ఎముక ఆ దిశగా లాగబడుతుంది మరియు జతలోని మరో కండరం అప్పుడు సడలించబడుతుంది.
  3. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి రెండవ కండరం సంకోచించబడి, మొదటి కండరం సడలించ బడుతుంది. ఎముకను కదిలించడానికి రెండు కండరాలు కలిసి పనిచేయాలి.

ప్రశ్న 3.
టెండాన్ అంటే ఏమిటి? మన శరీరంలో దాని పాత్ర ఏమిటి?
జవాబు:
కొన్ని కండరాలకు గుండ్రంగా, తెల్లగా ఉండే దారాల వంటి తంతువులు ఉంటాయి. వాటి చివరలు ఎముకకు అతికి ఉంటాయి.

  • ఈ తంతుయుత నిర్మాణాన్ని స్నాయుబంధనం లేదా టెండాన్ అంటారు.
  • మన శరీరంలోని అనేక భాగాలలో స్నాయువులను గమనించవచ్చు.
  • మోచేయి పైన, మోకాలి క్రింద, చీలమండ దగ్గర ఇవి కనిపిస్తాయి.
  • ఎముకలను కదిలించటానికి, శరీర కదలికలలో వీటికి కీలకపాత్ర ఉంటుంది.
  • కండరాలు ఎముకలకు అంటిపెట్టుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి.

ప్రశ్న 4.
అస్థి పంజరం అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:

  1. శరీరంలోని వివిధ ఎముకలు కలిసి ఒక నిర్మాణం లేదా వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఈ నిర్మాణాన్ని అస్థిపంజరం అంటారు.
  2. అస్థిపంజరం మన శరీరానికి ఆధారము మరియు ఆకారాన్ని అందిస్తుంది.
  3. ఇది అంతర్గత అవయవాలకు రక్షణ కల్పిస్తుంది.
  4. రక్తం ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది.

ప్రశ్న 5.
లిగమెంట్ అంటే ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి?
జవాబు:
పొడవైన కండర తంతువుల ద్వారా రెండు ఎముకలు ఒక ప్రత్యేక ప్రాంతంలో కలుస్తాయి. ఈ కండర తంతువులను లిగమెంట్లు లేదా సంధిబంధనాలు అంటారు. ఇవి ఎముకలను కలపటానికి మరియు శరీర కదలికలకు సహాయపడతాయి.

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

ప్రశ్న 6.
అస్థిపంజరము లేకుంటే మనం ఎలా ఉంటాము?
జవాబు:

  1. అస్థిపంజరం లేకుండా మనశరీరాన్ని ఊహించుకోవడం తమాషాగా అనిపిస్తుంది.
  2. అస్థిపంజరం లేకుంటే కండరాలకు ఆధారం ఉండరు.
  3. అందువలన శరీరానికి ఆకారం ఉం
  4. శరీరం మొత్తం గుండ్రని బంతిలా అవుతుంది.

ప్రశ్న 7.
జత్రుక అంటే ఏమిటి? దీని ఉపయోగం ఏమిటి?
జవాబు:

  1. జత్రుక అనేది మెడ మరియు భుజం మధ్య ఉండే పొడవైన ఎముక. దీనిని కాలర్ బోన్ అని కూడా పిలుస్తారు.
  2. ఇది భుజానికి గొప్ప ఆధారాన్ని అందిస్తుంది మరియు బరువైన వస్తువులను తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది.

ప్రశ్న 8.
మీరు జత్రుకను ఎలా పరిశీలిస్తారు?
జవాబు:
ఒక చేతిని మడిచి నడుము దగ్గర ఉంచాలి. ఇప్పుడు మెల్లగా భుజంతో బాటు చేతిని పైకి లేపాలి. మరో చేతి వేలితో మెడ నుండి భుజం వరకు జరపాలి. అక్కడ ఉన్న ఎముకలను కనుక్కోవడానికి ప్రయత్నించాలి. భుజం నుంచి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి. పైకి కనిపించే ఎముకను గుర్తించడానికి ప్రయత్నించాలి. దానిని జత్రుక అంటారు. దాని వెనుకవైపు ఉండే ఎముకను రెక్క ఎముక (Shoulder – blade) అంటారు. ఈ రెండింటిని కలిపి భుజాస్టులు అంటారు.
AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం 1

ప్రశ్న 9.
పక్కటెముకలు మరియు ఉరఃపంజరం మధ్య గల తేడా ఏమిటి?
జవాబు:

పక్కటెముకలుఉరఃపంజరం
1) ఛాతీ కుహరంలోని ఎముకలు పక్కటెముకలు.1) పక్కటెముకలు కలిసి ఉరఃపంజరం ఏర్పరుస్తాయి.
2) ఇవి 12 జతలు.2) దీని సంఖ్య ఒకటి.
3) ఇవి ముందు వైపు ఛాతీ ఎముకకు మరియు వెనుక వెన్నెముకకు అనుసంధానించబడి ఉంటాయి.3) ఛాతీ ఎముక, పక్కటెముకలు మరియు వెన్నెముక అన్నీ కలిసి ఉరఃపంజరంను ఏర్పరుస్తాయి.
4) శ్వాసకోశ కదలికలు మరియు రక్షణలో సహాయపడతాయి…4) ఇది ఊపిరితిత్తులు మరియు గుండెను రక్షిస్తుంది.

ప్రశ్న 10.
పుర్రె గురించి వ్రాయండి.
జవాబు:

  1. పుర్రె అనేక ఎముకలతో కలిసి ఉంటుంది.
  2. ఇది మెదడును చుట్టి రక్షిస్తుంది.
  3. పుర్రె ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోతాయి.
  4. వీటిని స్థిర కీళ్ళు అని కూడా అంటారు.

ప్రశ్న 11.
మృదులాస్థి అంటే ఏమిటి? ఇది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. చెవి మరియు ముక్కు యొక్క కొన్ని భాగాలు మృదువుగా ఉంటాయి. మరికొన్ని గట్టిగా ఉంటాయి.
  2. వీటిలో గట్టి భాగాలు మృదులాస్థి అనే నిర్మాణంతో తయారవుతాయి.
  3. ఇది కూడా ఎముకే అయితే ఇది మృదువైనది.
  4. మృదులాస్థి అస్థిపంజరం యొక్క ఇతర భాగాలలో కూడా ఉంటుంది. ఉదా : పక్కటెముక చివర, కనురెప్పలు, రొమ్ము ఎముక, వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య మృదులాస్థి ఉంటుంది.
  5. ఇది కీళ్ళ వద్ద పొడవైన ఎముకల చివరలను రక్షిస్తుంది.

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

ప్రశ్న 12.
కీలు అంటే ఏమిటి? దానిలోని రకాలు ఏమిటి?
జవాబు:

  1. రెండు ఎముకలు కలిసే ప్రదేశాన్ని కీలు అంటారు.
  2. కీళ్ళు వంగడానికి, కదలటానికి మరియు చలనానికి సహాయపడతాయి.
  3. వేర్వేరు కదలికలు మరియు కార్యకలాపాలను నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి.
  4. కీళ్ళు రెండు రకాలుగా విభజించబడ్డాయి. 1) కదిలే కీళ్ళు, 2) కదలని (స్థిరమైన) కీళ్ళు,

ప్రశ్న 13.
కదిలే కీళ్ళు రకాలు ఏమిటి?
జవాబు:
కదిలే కీళ్ళు నాలుగు రకాలుగా విభజించబడ్డాయి. అవి

  1. బంతి గిన్నె కీలు,
  2. మడత బందు కీలు,
  3. జారెడు కీలు,
  4. బొంగరపు కీలు.

ప్రశ్న 14.
కదలని కీళ్ళు గురించి వ్రాయండి.
జవాబు:

  1. మన శరీరంలోని ఎముకల మధ్య కొన్ని కీళ్ళు కదలలేవు. ఇటువంటి కీళ్ళను కదలని కీళ్ళు అంటారు.
  2. ఈ కీళ్ళు కలిసిపోయి ఒకే ఎముకలా కనిపిస్తాయి.
  3. ఇవి పుర్రెలో ఉంటాయి. మనం నోరు తెరచినప్పుడు, మన క్రింది దవడను మాత్రమే కదిలించగలము.
  4. పై దవడ కదలని కీలు.

ప్రశ్న 15.
చేపలు నీటిలో ఎలా ఈదగలుగుతున్నాయి?
జవాబు:

  1. చేపల శరీరం పడవ ఆకారంలో ఉంటుంది.
  2. ఇది చేపలు నీటిలో తేలికగా కదలడానికి వీలు కల్పిస్తుంది.
  3. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది.
  4. పొలుసుల చర్మం మరియు వాజాల సహాయంతో చేప నీటిలో ఈదగలుగుతుంది.

ప్రశ్న 16.
పక్షులలో చలనం గురించి వ్రాయండి.
జవాబు:

  1. పక్షులు గాలిలో ఎగురుతాయి మరియు నేలమీద నడుస్తాయి.
  2. పక్షులు ఎగరటానికి వీలుగా ప్రత్యేక శరీర నిర్మాణం కలిగి ఉంటాయి.
  3. వాటి ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి.
  4. కాలి ఎముకలు నడవడానికి మరియు గెంతటానికి అనువుగా ఉంటాయి.
  5. ముందరి చేతులు రెక్కలుగా మారి పక్షికి ఎగరటానికి సహాయపడతాయి.
  6. ఈ ఎగిరే ప్రక్రియలో ఈకలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ప్రశ్న 17.
కోడి, పిచ్చుకలను గమనించండి. అవి ఎలా చలిస్తాయి?
జవాబు:
కోడి మరియు పిచ్చుకలు రెండూ పక్షులే కాని వాటి చలనాలు భిన్నంగా ఉంటాయి.

కోడిపిచ్చుక
1) ఇది గాలిలో ఎగురలేదు1) ఇది గాలిలో ఎగురుతుంది.
2) నడవటం దీని ప్రధాన చలనం2) ఇది ఎగరటం మరియు నేలపై దుమకటం చేస్తుంది.
3) బలమైన కాళ్ళు ఉంటాయి.3) కాళ్ళు సన్నగా మరియు బలహీనంగా ఉంటాయి.
4) శరీరం గాఖలయిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉండదు.4) శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది.
5) ఎముకలు గట్టిగా, బలంగా ఉంటాయి.5) ఎముకలు తేలికగా, బోలుగా ఉంటాయి.

ప్రశ్న 18.
పాములోని చలనం వివరించండి.
జవాబు:

  1. పాములకు చలనాంగాలు (కాళ్ళు) లేవు.
  2. పాములకు పొడవాటి వెన్నెముక మరియు అనేక కండరాలు ఉంటాయి.
  3. సాధారణంగా పాము యొక్క శరీరం పొడవుగా ఉండి మెలి తిరుగుతుంది.
  4. పాము యొక్క ప్రతి వంపు భూమిపై ఒత్తిడి కలిగించి, శరీరాన్ని ముందుకు తోస్తుంది.
  5. పాము చాలా వేగంగా ముందుకు సాగడానికి పొట్ట క్రింద ఉండే పొలుసులు కూడా సహాయపడతాయి.

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

ప్రశ్న 19.
నత్త స్థాన చలనంను వివరించండి.
జవాబు:

  1. నత్తగుల్ల (కర్పరం) నుండి మందపాటి కండర నిర్మాణం బయటకు వస్తుంది.
  2. ఈ మందపాటి నిర్మాణం దాని పాదం. ఇది బలమైన కండరాలతో తయారు చేయబడి ఉంటుంది.
  3. దాని పాదం యొక్క అలల వంటి కదలిక వలన నత్త నెమ్మదిగా కదులుతుంది.

6th Class Science 12th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పాములో ఇతర చలన మార్గాలు చాలా ఉన్నాయి. వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చిత్రాలను సేకరించండి. సమాచారం మరియు వాటిని గోడ పత్రికలో ప్రదర్శించండి.
జవాబు:
పాములు నాలుగు విధాలుగా చలిస్తాయి. వాటికి కాళ్ళు లేనందున అవి చలించటానికి కండరాలను మరియు పొలుసులను ఉపయోగిస్తాయి.

సర్పంటైన్ పద్ధతి :
పాముల గురించి ఆలోచించినప్పుడు ఈ చలనం చాలా మందికి వెంటనే గుర్తుకొస్తుంది. పాములు ఏదైనా నేల వంటి ఉపరితలం, రాళ్ళు, చెట్లు మొదలైన ప్రాంతాలలో ఈ పద్ధతి వాడతాయి. ఈ పద్దతిలో ఇవి అలల వలె కదులుతాయి. ఇవి గాజు వంటి మృదువైన ఉపరితలాలపై కదలలేవు. ఈ కదలికను పార్శ్వ కదలిక అని కూడా అంటారు.

కాన్సర్టినా పద్దతి :
పాము అత్యవసర పరిస్థితులలో కదలడానికి ఈ పద్ధతిని వాడుతుంది. ఇది చాలా కష్టమైన మార్గాలలో కాని, గట్టి ప్రదేశాలలో కాని ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ముందు భాగాన్ని పైకి లేపి దుముకుతూ నేలను తక్కువ తాకుతూ త్వరగా ప్రయాణిస్తుంది.

సైడ్ వైండింగ్ :
ఇది వివరించడానికి చాలా కష్టమైన కదలిక. అయితే ఇసుక లేదా బురద వంటి వదులుగా లేదా జారే ఉపరితలాలపై కదలడానికి పాములు దీనిని తరచుగా ఉపయోగిస్తాయి. పాము తన తలని ముందుకు విసిరినట్లు కనిపిస్తుంది మరియు శరీరాన్ని బాగా వంచి అంచుల ప్రాంతం నేలను తాకటం వలన పాము పక్కకు ప్రయాణిస్తుంది. ఇది ప్రధానంగా ఎడారి ప్రాంతాలకు అనుకూలం.

రెక్టలినియర్ విధానం :
ఇది నెమ్మదిగా, గగుర్పాటుగా, నేరుగా ఉండే కదలిక పాము తన పొట్టపై ఉన్న కొన్ని పొలుసులను ఉపయోగించి ఆధారాన్ని పట్టుకొని ప్రయాణిస్తుంది.
AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం 2

ప్రశ్న 2.
మానవులలో కదిలే కీళ్ళు గురించి వ్రాయండి.
జవాబు:
కదిలే కీళ్ళు నాలుగు రకాలు.
1) బంతి గిన్నె కీలు :
ఒక ఎముక యొక్క బంతి వంటి ఆకారం మరొక ఎముకలోని గిన్నె లాంటి ఆకారంలోకి ఇమిడిపోతుంది. బంతి గిన్నె కీలుకు ఉదాహరణలు తుంటి మరియు భుజం.

2) మడత బందు కీలు :
తలుపు మడత బందు వలె ఎముకలను ఒకే దిశలో కదిలించటానికి తోడ్పడే కీలును మడత బందు కీలు అంటారు. ఉదాహరణలు మోకాళ్ళు మరియు మోచేతులు.

3) బొంగరపు కీలు :
పుర్రెను వెన్నెముకతో కలిపే కీలుని బొంగరపు లేదా మెడ కీలు అంటారు. ఇది గుండ్రని చలనాన్ని ప్రదర్శిస్తుంది.

4) జారెడు కీలు :
ఇది జారుడు కదలికను మాత్రమే అనుమతించే కీలు. జారెడు కీలు ఒక ఎముక మరొకదానిపైన జారడానికి అనుమతిస్తుంది. జారెడు కీలు మన మణికట్టును వంచుటకు అనుమతిస్తుంది. ఇది చాలా చిన్న ప్రక్క ప్రక్క కదలికలను చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మన శరీరంలోని చీలమండలు మరియు మణికట్టులలో జారెడు కీళ్ళు ఉన్నాయి.

ప్రశ్న 3.
నీటిలో చేప ఎలా ఈదుతుంది?
జవాబు:

  1. చేపల శరీరం పడవ ఆకారంలో ఉంటుంది.
  2. ఈ ఆకారం వలన నీటిలో తేలికగా కదలడానికి వీలుగా ఉంటుంది.
  3. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది.
  4. ఈత కొట్టేటప్పుడు, శరీరం యొక్క ముందు భాగం కండరాలు ఒకవైపు వైపుకు కదిలితే, తోక దానికి వ్యతిరేకదిశలో కదులుతుంది.
  5. ఇది ఒక కుదుపును సృష్టిస్తుంది మరియు శరీరాన్ని ముందుకు నెడుతుంది.
  6. ఇలాంటి కుదుపుల వరుస చేపను ముందుకు నెడుతుంది.
  7. తోక మరియు వాజములు కూడా ఈ కదలికకు సహాయపడతాయి.

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

ప్రశ్న 4.
వివిధ జీవులలో చలనాన్ని, వాటి చలనాంగాలను పట్టిక రూపంలో వ్రాయండి.
జవాబు:
ఆ చలనం – జీవి – చలనాంగము – వివరణ ఈదటం చేప వాజములు చేప ఈదటంలో రెక్కల వంటి వాజములు, పడవ వంటి ఆకారం ఉపయోగపడును. 2. పాకటం పాము పొలుసులు పొట్టక్రింద ఉండే పొలుసులు పాకేటప్పుడు పట్టు కలిగిస్తాయి. 3 ఎగరటం పక్షులు ఈకలతో కూడిన రెక్కలు పక్షులలో ఎగరటానికి తోడ్పడును. నడవటం మానవుడు | కాళ్ళు జతకాళ్ళు మనిషికి నడవటానికి, పరిగెత్తటానికి తోడ్పడును. రెక్కలు

AP Board 6th Class Science 12th Lesson 1 Mark Bits Questions and Answers కదలిక – చలనం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. కింది వాటిలో ఏది కాళ్ళు లేనప్పటికి స్థాన చలనం చూపిస్తుంది.
A) కప్ప
B) పాము
C) మనిషి
D) కాకి
జవాబు:
B) పాము

2. ఏవి నడవగల మరియు ఎగరగల జీవులు?
A) చేప
B) కప్ప
C) పక్షులు
D) పులి
జవాబు:
C) పక్షులు

3. చీలమండలో ఉండే కీళ్ళు
A) బొంగరపు
B) బంతిగిన్నె
C) జారెడు కీలు
D) మడత బందు కీలు
జవాబు:
C) జారెడు కీలు

4. మృదువైన ఎముక ఉన్న భాగాలు
A) పుర్రె
B) ముక్కు కొన
C) జత్రుక
D) ఎముక
జవాబు:
B) ముక్కు కొన

AP 6th Class Science Important Questions Chapter 12 కదలిక – చలనం

5. పక్కటెముక దేనిని రక్షిస్తుంది?
A) కడుపు
B) గుండె
C) ఊపిరితిత్తులు
D) బి & సి
జవాబు:
D) బి & సి

6. వెన్నెముక వేటి కలయిక వలన ఏర్పడును?
A) వెన్నుపూస
B) చిన్న ఎముకలు
C) రక్తం
D) లోహాలు
జవాబు:
A) వెన్నుపూస

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. …………. ఎముకలను కండరాలను కలుపుతుంది.
2. ……………. ఒక ఎముకను మరొక ఎముకతో కలుపుతుంది.
3. రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని …………. అంటారు.
4. మన శరీరంలోని వివిధ ఎముకలు కలిపి …………. ను ఏర్పరచుతాయి.
5. ……………. జతలుగా పనిచేస్తాయి.
6. మొక్కలు …….. చూపిస్తాయి.
7. కండరాలు …………….కు అతికి ఉంటాయి.
8…………….. లో మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతుంది.
9. భుజాలు ……………. కీళ్ళు కలిగి ఉంటాయి.
10. మన శరీరంలోని మొత్తం కండరాలు ………….
11. తల యొక్క వివిధ ఎముకలు కలిపి ఒక ………….. అంటారు.
12. ……………. మన తలలో కదిలే ఎముక.
13. వెన్నెముక …………….. తో నిర్మితమౌతుంది.
14. స్థిరమైన కీళ్ళు ……………. లో ఉన్నాయి.
15. మోచేతులు మరియు మోకాళ్ళలో ……….. కాని చలనాన్ని కాదు. కీళ్ళు ఉంటాయి.
16. నత్తలోని చలన అవయవం …………
17. …………… కీలు ఎక్కువ బరువును భరించడానికి సహాయపడుతుంది.
జవాబు:

  1. స్నాయువు
  2. సంధిబంధనం (లిగమెంట్)
  3. కీలు
  4. అస్థిపంజరం
  5. కండరాలు
  6. కదలికలను
  7. ఎముకలకు
  8. చలనం
  9. బంతి గిన్నె
  10. 650
  11. పుర్రె
  12. క్రింది దవడ
  13. వెన్నుపూసల
  14. పుర్రె
  15. మడత బందు
  16. పాదము
  17. బొంగరపు

III. జతపరచుట

కింది వానిని జతపరచుము.

1.

Group – AGroup – B
ఎ) మడత బందు కీలు1. మెడ
బి) బొంగరపు కీలు2. భుజం
సి) బంతి గిన్నె కీలు3. వెన్నెముక
డి) జారెడు కీలు4. మోకాలు

జవాబు:

Group – AGroup – B
ఎ) మడత బందు కీలు4. మోకాలు
బి) బొంగరపు కీలు1. మెడ
సి) బంతి గిన్నె కీలు2. భుజం
డి) జారెడు కీలు3. వెన్నెముక

2.

Group – AGroup – B
ఎ) చేప1. పాదం
బి) పాము2. వాజములు
సి) పక్షి3. పొలుసులు
డి) నత్త) 4. రెక్కలు

జవాబు:

Group – AGroup – B
ఎ) చేప2. వాజములు
బి) పాము3. పొలుసులు
సి) పక్షి) 4. రెక్కలు
డి) నత్త1. పాదం

3.

Group – AGroup – B
ఎ) కీలు1. పుర్రె
బి) టెండాన్2. ఎముకల కీళ్ళు
సి) లిగమెంట్3. ఎముక నుండి కండరానికి
డి) స్థిర కీలు4. ఎముకల సంధి తలం

జవాబు:

Group – AGroup – B
ఎ) కీలు4. ఎముకల సంధి తలం
బి) టెండాన్3. ఎముక నుండి కండరానికి
సి) లిగమెంట్2. ఎముకల కీళ్ళు
డి) స్థిర కీలు1. పుర్రె

మీకు తెలుసా?

మన శరీరంలో 650 కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి. అతి పెద్ద కండరం గ్లూటియస్ – మాక్షిమస్. అతి చిన్న కండరం స్టేపిడియస్. గుండె కండరాలు విశ్రాంతి లేకుండా పనిచేస్తాయి. మానవ హృదయం రక్తనాళాల ద్వారా నిమిషానికి 4500 సిసి రక్తాన్ని సరఫరా చేస్తుంది.

AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

These AP 6th Class Science Important Questions 11th Lesson నీడలు – ప్రతిబింబాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Science 11th Lesson Important Questions and Answers నీడలు – ప్రతిబింబాలు

6th Class Science 11th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కాంతి అవసరం ఏమిటి?
జవాబు:
వస్తువులను చూడటానికి మనకు కాంతి అవసరం.

ప్రశ్న 2.
కాంతి జనకం అంటే ఏమిటి?
జవాబు:
కాంతిని ఇచ్చే పదార్థాన్ని కాంతి జనకం లేదా కాంతి వనరుగా పిలుస్తారు.

ప్రశ్న 3.
నీడలు ఎప్పుడు ఏర్పడతాయి?
జవాబు:
అపారదర్శక వస్తువులు కాంతి మార్గాన్ని అడ్డుకున్నప్పుడు నీడలు ఏర్పడతాయి.

ప్రశ్న 4.
నీడను ఏర్పరచటానికి మనకు ఏమి అవసరం?
జవాబు:
కాంతి మరియు వస్తువుతో పాటు, అపారదర్శక వస్తువు యొక్క నీడను పొందటానికి తెర అవసరం.

AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

ప్రశ్న 5.
మీరు నీడ ద్వారా దాని రంగును తెలుసుకుంటారా?
జవాబు:
నీడలను చూడటం ద్వారా వస్తువుల రంగును నిర్ణయించలేము.

ప్రశ్న 6.
కాంతి ఎలా ప్రయాణిస్తుంది?
జవాబు:
కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది.

ప్రశ్న 7.
కాంతి ఎప్పుడు పరావర్తనం చెందుతుంది?
జవాబు:
ఏదైనా వస్తువు మీద పడినప్పుడు కాంతి పరావర్తనం చెందుతుంది.

ప్రశ్న 8.
కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని ప్రజలకు ఎలా తెలుసు?
జవాబు:
నీడల ఆకారాలను గమనించడం ద్వారా కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని ప్రజలు తెలుసుకున్నారు.

ప్రశ్న 9.
మనం చీకటిని, చీకటిలో వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నాము. ఎందుకు?
జవాబు:
చీకటిలో సరిపడినంత కాంతి ఉండదు కావున వస్తువులను మనం చూడలేము.

ప్రశ్న 10.
విద్యుత్తు లేనప్పుడు మనం వస్తువులను చూడలేము. ఎందుకు?
జవాబు:
విద్యుత్తు లేనప్పుడు కాంతి ఉండదు కాబట్టి మనం వస్తువులను చూడలేము.

ప్రశ్న 11.
కాంతి ఉన్నప్పుడు మనం వస్తువులను చూడగలం. ఎందుకు?
జవాబు:
వస్తువులపై పడిన కాంతి పరావర్తనం చెంది కళ్ళను చేరుతుంది కాబట్టి మనం వస్తువులను చూడగలుగుతాము.

ప్రశ్న 12.
కాంతి లేకపోవడం వలన మనం ఎందుకు వస్తువులను చూడలేము?
జవాబు:
కాంతి దృష్టికి మూలం. కాంతి లేకుండా మనం దేనినీ చూడలేము.

AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

ప్రశ్న 13.
నీడను ఏర్పరచటానికి షరతులు ఏమిటి?
జవాబు:
నీడను పొందడానికి మనకు కాంతి, అపారదర్శక వస్తువు మరియు తెర అవసరం.

6th Class Science 11th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మనం వస్తువులను ఎలా చూడగలం?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 2
కాంతి జనకాల నుండి, కాంతి వస్తువుపై పడుతుంది.

  • వస్తువు నుండి కాంతి పరావర్తనం చెందుతుంది.
  • పరావర్తనం చెందిన కాంతి కంటిని చేరుతుంది.
  • కంటి ద్వారా మనకు దృష్టి జ్ఞానం కలుగుతుంది.
  • కళ్ళు మరియు వస్తువు మధ్య ఎటువంటి ఆటంకాలు లేనప్పుడు వస్తువు కనిపిస్తుంది.

ప్రశ్న 2.
కాంతి ప్రసరణ ఆధారంగా వస్తువులను మీరు ఎలా వర్గీకరిస్తారు?
జవాబు:

  1. కాగితం, అట్ట, కలప, ఇనుము మొదలైన పదార్థాలు కాంతిని అనుమతించవు. ఈ వస్తువులు నీడలను ఏర్పరుస్తాయి. వీటిని అపారదర్శక పదార్థాలు అంటారు.
  2. గాజు మరియు గాలి వంటి పదార్థాలు కాంతిని వాటి గుండా వెళ్ళడానికి అనుమతిస్తాయి. అందువల్ల మనం వీటి నీడలను పొందలేము. ఇటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు.
  3. పాలిథీన్ కవర్ మరియు నూనె కాగితం వంటి పదార్థాలు పాక్షికంగా కాంతిని అనుమతిస్తాయి. వాటి నీడలు అస్పష్టంగా ఉంటాయి. వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు.

ప్రశ్న 3.
తోలుబొమ్మలాట గురించి రాయండి.
జవాబు:
తోలుబొమ్మల ఆట మన సాంప్రదాయ కళారూపాలలో ఒకటి.

  • ఈ తోలు బొమ్మలను జంతు చర్మాలతో చేస్తారు.
  • వీటితో తెరపై నీడలు వేసి ఆటలాడిస్తారు.
  • దీనితో పాటు కథ వివరించబడుతుంది.
  • ఈ కళను ఉపయోగించడం ద్వారా రామాయణం మరియు మహా భారతం వంటి ప్రాచీన ఇతిహాసాలు ప్రదర్శించబడతాయి.

ప్రశ్న 4.
అపారదర్శక మరియు పారదర్శక పదార్థాల మధ్య గల భేదం తెలపండి.
జవాబు:

అపారదర్శక పదార్థాలుపారదర్శక పదార్థాలు
1) కాంతిని తమగుండా అనుమతించవు.1) కాంతిని తమగుండా అనుమతిస్తాయి.
2) వీటి ద్వారా వస్తువులను చూడలేము.2) వీటి ద్వారా వస్తువులను చూడగలము.
3) నీడలను ఏర్పరచుతాయి.3) నీడలను ఏర్పరచవు.
4) ఉదా : బల్ల, కుర్చీ4) ఉదా : గాజు, గాలి

ప్రశ్న 5.
నీడను రూపొందించడానికి కాంతి జనకం మరియు అపారదర్శక వస్తువు సరిపోతుందా? మీరు దీనిని అంగీకరిస్తున్నారా?
జవాబు:
లేదు, నేను పై వ్యాఖ్యతో ఏకీభవించను. ఒక వస్తువు యొక్క నీడను రూపొందించడానికి కాంతి మరియు అపారదర్శక వస్తువు మాత్రమే సరిపోవు. వీటితో పాటు, మనకు తెర కూడా అవసరం.

AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

ప్రశ్న 6.
ఒక వస్తువు నీడను పరిశీలించడం ద్వారా మనం దాని ఆకారాన్ని తెలుసుకోవచ్చా?
జవాబు:

  1. వస్తువు యొక్క నీడను గమనించడం ద్వారా మనం దాని ఆకారాన్ని ఊహించవచ్చు.
  2. కానీ ఇది ఎల్లప్పుడూ సరైనదని చెప్పలేము.
  3. కొన్ని సార్లు నీడ, వస్తువు ఆకారానికి భిన్నంగా ఉండవచ్చు.
  4. కాంతి జనక స్థానం మరియు వస్తువు యొక్క ఆకారం బట్టి నీడ ఆకారం మారిపోతుంది.

ప్రశ్న 7.
పిన్‌హోల్ కెమెరా అంటే ఏమిటి?
జవాబు:

  1. పి హోల్ ద్వారా మనం వస్తువుల ప్రతిబింబాన్ని గమనించవచ్చు.
  2. ఇది కాంతిపై పనిచేసే చిన్న పరికరం.
  3. వస్తువు యొక్క ప్రతిబింబం తెరపై చిన్నదిగా, తలక్రిందులుగా ఏర్పడుతుంది.
  4. కాంతి యొక్క ఋజు మార్గ ప్రయాణాన్ని కూడా దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ప్రశ్న 8.
స్పి ల్ కెమెరా ద్వారా ఒక చెట్టు చూడండి. మీరు ఏమి చూస్తున్నారు?
జవాబు:
నేను పిన్‌హోల్ కెమెరా ద్వారా చెట్టును గమనించినప్పుడు

  1. ప్రతిబింబం చిన్నదిగా ఉంది.
  2. ఇది తెరపై విలోమంగా అంటే తిరగబడి ఉంది.
  3. ఇది రంగులు కలిగి ఉంది.
  4. మరియు దగ్గరగా కనిపిస్తుంది.

ప్రశ్న 9.
పిన్‌హోల్ కెమెరాలో రెండు రంధ్రాలు చేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:

  1. కెమెరాలో మనం రెండు రంధ్రాలు చేస్తే, ఆ ప్రతిబింబం స్పష్టంగా లేదని నేను గ్రహించాను.
  2. కానీ ఇది రెండు ప్రతిబింబాలను ఏర్పరుస్తుండటం ఆశ్చర్యంగా ఉంది.

ప్రశ్న 10.
ప్రతిరోజూ అద్దంలో ముఖాన్ని చూసుకొంటాము కదా ! అద్దంలో ఉన్నది నీడా లేదా ప్రతిబింబమా? మీరు దానిని ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:

  1. అద్దంలో మనం చూసేది ఒక ప్రతిబింబం.
  2. నీడలు రంగులో ఉండవని మనకు తెలుసు. కాని ప్రతిబింబానికి వస్తువు యొక్క రంగులు ఉంటాయి.
  3. నీడ వస్తువు యొక్క రూపు రేఖలను మాత్రమే చూపిస్తుంది కాని ఒక ప్రతిబింబము పూర్తి వస్తువును చూపిస్తుంది.
  4. అద్దంలో ఉన్న ప్రతిబింబం రంగును కలిగి ఉంది మరియు పూర్తి వస్తువును చూపుతుంది. కనుక ఇది ప్రతిబింబం.

ప్రశ్న 11.
నీడలు మరియు ప్రతిబింబాల మధ్య వ్యత్యాసాలను మరియు పోలికలను తెలపండి.
జవాబు:
పోలికలు :

  1. నీడ మరియు ప్రతిబింబం కాంతికి సంబంధించినవి.
  2. కాంతి లేకుండా రెండూ కనిపించవు.

వ్యత్యాసాలు :

  1. ప్రతిబింబం మరియు నీడ మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే, ప్రతిబింబం ఒక వస్తువు యొక్క కాంతి కిరణాలు పరావర్తనం లేదా వక్రీభవనం చెందటం వలన ఏర్పడుతుంది.
  2. నీడ ఒక అపారదర్శక వస్తువు కాంతి కిరణాలను అడ్డుకున్నప్పుడు ఏర్పడే చీకటి ఆకారం.
  3. ప్రతిబింబం అనే పదం సాధారణంగా నిజమైన వస్తువు యొక్క దృశ్యాన్ని సూచిస్తుంది. నీడ ఆకారాన్ని మాత్రమే చూపిస్తుంది.
  4. ఒక ప్రతిబింబం రంగురంగులుగా ఉంటుంది. నీడ నలుపు రంగులో ఉంటుంది.

AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

ప్రశ్న 12.
మీరు నీడ మరియు ప్రతిబింబానికి మధ్య గల భేదాన్ని డ్రాయింగ్ ద్వారా చూపించగలరా?
జవాబు:
అవును. నీడలు మరియు ప్రతిబింబాల మధ్య వ్యత్యాసాన్ని డ్రాయింగ్ ద్వారా చూపించగలము

  1. ప్రతిబింబాలకు మొత్తం చిత్రాన్ని గీయవచ్చు మరియు రంగును ఉపయోగించవచ్చు.
  2. నీడలకు అంచులు మాత్రమే గీస్తాము మరియు నలుపు రంగుతో నింపుతాము.

6th Class Science 11th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నీడను ఏర్పరచటానికి తెర అవసరం అని నీవు ఎలా నిరూపిస్తావు?
జవాబు:
లక్ష్యం : నీడను ఏర్పరచటానికి తెర అవసరం అని నిరూపించటం
AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 1

కావలసిన పరికరాలు :
టార్చ్, ఆకు, చీకటి గది, డ్రాయింగ్ షీట్ లేదా అట్ట

విధానం :

  1. టార్చ్ మరియు ఆకుతో చీకటి గదిలోకి ప్రవేశించండి.
  2. టార్చ్ కాంతిని ఆకుపై కేంద్రీకరించండి.
  3. ఆఱకు మరియు టార్చ్ కి మధ్య దూరం 30 సెం.మీ. ఉండేటట్లు చూడండి.
  4. ఇప్పుడు నీడ గోడపై ఏర్పడుతుంది.
  5. ఇప్పుడు టార్చ్ ను ఆకు క్రింద 30 సెం.మీ. దూరంలో ఉంచండి.
  6. ఇప్పుడు పైకప్పు మీద నీడ ఏర్పడుతుంది.
  7. రాత్రిపూట బహిరంగ ప్రదేశంలో (బయట) అదే కృత్యం చేయండి.
  8. ఇప్పుడు మనం నీడను కనుగొనలేము.
  9. ఆకుకు పైన 1 మీటర్ దూరంలో డ్రాయింగ్ షీట్ లేదా ప్లాంక్ ఉంచండి.
  10. ఇప్పుడు మనం డ్రాయింగ్ షీట్ పై నీడను కనుగొనవచ్చు.
  11. నీడలు ఏర్పడటానికి తెర అవసరం అని దీనిని బట్టి అర్థమవుతుంది.

నిర్ధారణ :
నీడలు ఏర్పడటానికి తెర అవసరమని నిరూపించబడింది.

AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

ప్రశ్న 2.
స్పి ల్ కెమెరా తయారీ ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఉద్దేశము :
పినహోల్ కెమెరాను తయారు చేయడం.

పదార్ధములు :
ఒక పివిసి పైపు, (సుమారు 8 సెం.మీ. వ్యాసం మరియు పొడవు 30 సెం.మీ.)

మరొక పివిసి పైపు (సుమారు 7 సెం.మీ. వ్యాసం మరియు పొడవు 20 సెం.మీ.)

ఒక బ్లాక్ డ్రాయింగ్ షీట్, నూనె, రెండు రబ్బరు బ్యాండ్లు, ఒక పిన్ మరియు షీట్

(మీరు పివిసి పైపులను పొందలేకపోతే, మందపాటి కాగితాన్ని తీసుకొని గొట్టాలను ఏర్పరచటానికి దాన్ని చుట్టండి) (గొట్టాల వ్యాసం మరియు పొడవు పైపులకు ఇచ్చిన విధంగానే ఉండాలి)
AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 2
విధానం :

  1. నల్ల కాగితం ముక్కను కత్తిరించి పెద్ద పివిసి పైపు యొక్క ఒక చివర ఉంచి రబ్బరు బ్యాండ్ తో కట్టండి.
  2. సన్నని పివిసి పైపు యొక్క ఒక చివర తెల్ల కాగితాన్ని ఉంచండి.
  3. దీన్ని రబ్బరు బ్యాండ్ తో కట్టండి. ఇప్పుడు పిన్ సహాయంతో బ్లాక్ పేపర్ క్యాప్ మధ్యలో రంధ్రం చేయండి.
  4. తెల్ల కాగితంపై 2 నుండి 3 చుక్కల నూనె వేయండి, తద్వారా అది అపారదర్శకంగా మారుతుంది.
  5. పెద్ద పైపులోకి సన్నని పైపును చొప్పించండి. మీ పి హోల్ కెమెరా సిద్ధంగా ఉంది.

పనిచేయు విధానం :

  1. పినల్ కెమెరా ముందు వెలిగించిన కొవ్వొత్తిని అమర్చండి.
  2. సన్నని పైపు తెరపై కొవ్వొత్తి యొక్క స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి సన్నగా – ఉన్న పైపును ముందుకు మరియు వెనుకకు జరపండి.
  3. ఏర్పడిన ప్రతిబింబాన్ని సన్నని పైపు వెనుక నుండి గమనించాలి.

AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 3

పరిశీలన :
కొవ్వొత్తి యొక్క మంట తెరపై తలక్రిందులుగా కనిపిస్తుంది. ఇది కొవ్వొత్తి నీడ కాదు. ఇది దాని , ప్రతిబింబం.

ప్రశ్న 3.
పినహోల్ కెమెరాలోని ప్రతిబింబం ఎందుకు తలక్రిందులుగా ఏర్పడుతుంది?
జవాబు:

  1. కొవ్వొత్తి మంట నుండి వచ్చే కాంతి ప్రతి బిందువు నుండి అన్ని దిశలలో నేరుగా ప్రయాణిస్తుంది.
  2. కాని కొన్ని నిర్దిష్ట దిశలలో వచ్చే కాంతి మాత్రమే దాని పిన్ హోల్ ద్వారా కెమెరాలోకి ప్రవేశిస్తుంది.
  3. మంట పై భాగంలో ఉన్న కాంతి నేరుగా తెర దిగువ వైపుకు వెళుతుంది.
    AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు 4
  4. మరియు మంట దిగువన ఉన్న కాంతి నేరుగా తెర పైభాగానికి వెళుతుంది.
  5. ఈ విధంగా, ప్రతి పాయింట్ నుండి ఒక నిర్దిష్ట దిశలో వచ్చే కాంతి మంట, పిన్‌హోల్ లోకి ప్రవేశించగలదు.
  6. మరియు ఇతర దిశలలో వెళ్ళే కాంతి బ్లాక్ షీట్ ద్వారా నిరోధించబడుతుంది.
  7. ఇది తలక్రిందుల ప్రతిబింబం ఏర్పడటానికి దారితీస్తుంది.
  8. పిన్ హోల్ కెమెరా తెరపై తలక్రిందుల ప్రతిబింబం ఏర్పడటం ఆ కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణాన్ని వివరిస్తుంది.

AP Board 6th Class Science 11th Lesson 1 Mark Bits Questions and Answers నీడలు – ప్రతిబింబాలు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. కింది వాటిలో ఏది కాంతి వనరు కాదు?
A) సూర్యుడు
B) కొవ్వొత్తి
C) పంకా
D) ట్యూబ్ లైట్
జవాబు:
C) పంకా

2. పిన హోల్ కెమెరాలో ఏమి లేదు?
A) తెర
B) కటకం
C) ఆయిల్ పేపర్
D) ట్యూబ్
జవాబు:
B) కటకం

3. పిన్పల్ కెమెరాలో కటకంలా పనిచేయునది
A) రంధ్రం
B) తెర
C) ట్యూబ్
D) ఆయిల్ పేపర్
జవాబు:
A) రంధ్రం

4. పిన్పల్ కెమెరాలో ఎన్ని పైపులు ఉన్నాయి?
A) 2
B) 3
C) 4
D) 1
జవాబు:
A) 2

AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

5. పిన్పల్ కెమెరాలో చిత్ర పరిమాణం
A) పెద్దది
B) చిన్నది
C) సమానం
D) పొడవు
జవాబు:
B) చిన్నది

6. కింది వాటిలో దేనికి రంగులు లేవు?
A) వస్తువు
B) ప్రతిబింబము
C) నీడ
D) ఛాయాప్రతిబింబము
జవాబు:
C) నీడ

7. కింది వాటిలో ఏది పూర్తి ప్రతిబింబం చూపిస్తుంది?
A) బంతి
B) గాజు
C) లైటు
D) అద్దం
జవాబు:
D) అద్దం

8. నీడను ఏర్పరచటానికి అవసరం లేనిది ఏది?
A) కాంతి
B) వస్తువు
C) తెర
D) గాజు
జవాబు:
D) గాజు

AP 6th Class Science Important Questions Chapter 11 నీడలు – ప్రతిబింబాలు

9. భిన్నమైన దానిని కనుగొనండి.
A) బంతి
B) పెట్టే
C) గాజు
D) సంచి
జవాబు:
C) గాజు

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. ఏదైనా ……………… పై కాంతి పడినప్పుడు, అది తిరిగి వెనుకకు మరలుతుంది.
2. కాంతి జనకానికి ఉదాహరణ ……………..
3. నూనె కాగితం మరియు గరుకు గాజు…………….. పదార్థాలు.
4. ………………. పదార్థాలు నీడలు ఏర్పరచలేవు.
5. ………….. నీడలతో వివరించే కథా విధానం.
6. నూనె కాగితం పిన్‌హోల్ కెమెరాలో …………… పనిచేస్తుంది.
7. పినహోల్ కెమెరాలో ప్రతిబింబం ………………
8. ……………. వస్తువు యొక్క రూపురేఖలను మాత్రమే చూపిస్తుంది.
9. సాధారణ అద్దంలో మనం …………… చూస్తాము.
10. వస్తువులను చూడటానికి …………….. అవసరం.
11. ……………… వస్తువులు నీడలను ఏర్పరుస్తాయి.
జవాబు:

  1. వస్తువు
  2. సూర్యుడు
  3. అపారదర్శక
  4. పారదర్శక
  5. తోలుబొమ్మలాట
  6. తెర
  7. విలోమం
  8. నీడ
  9. ప్రతిబింబం
  10. కాంతి
  11. అపారదర్శక

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – AGroup – B
ఎ) కాంతి పారదర్శకము1) కొవ్వొత్తి
బి) కాంతి అపారదర్శకము2) నూనె కాగితం
సి) కాంతి జనకము3) రాయి
డి) పాక్షిక పారదర్శకం4) అద్దం
ఇ) పరావర్తనం5) గాలి

జవాబు:

Group – AGroup – B
ఎ) కాంతి పారదర్శకము5) గాలి
బి) కాంతి అపారదర్శకము3) రాయి
సి) కాంతి జనకము1) కొవ్వొత్తి
డి) పాక్షిక పారదర్శకం2) నూనె కాగితం
ఇ) పరావర్తనం4) అద్దం

2.

Group – AGroup – B
ఎ) ప్రతిబింబం1) ఆకారం
బి) పరావర్తనం2) పెద్దదిగా చూపును
సి) పి హోల్ కెమెరా3) నునుపైన తలం
డి) భూతద్దం4) తలక్రిందుల ప్రతిబింబం
ఇ) నీడ5) సాధారణ అద్దం

జవాబు:

Group – AGroup – B
ఎ) ప్రతిబింబం5) సాధారణ అద్దం
బి) పరావర్తనం3) నునుపైన తలం
సి) పి హోల్ కెమెరా4) తలక్రిందుల ప్రతిబింబం
డి) భూతద్దం2) పెద్దదిగా చూపును
ఇ) నీడ1) ఆకారం

మీకు తెలుసా?

మన సంప్రదాయ కళారూపాలలో తోలుబొమ్మలాట ఒకటి. ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెరమీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను, గాథలను ప్రదర్శిస్తుంటారు.

AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు

These AP 6th Class Science Important Questions 10th Lesson విద్యుత్ వలయాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Science 10th Lesson Important Questions and Answers విద్యుత్ వలయాలు

6th Class Science 10th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
విద్యుత్ అనగానేమి?
జవాబు:
విద్యుత్ ఒక శక్తి స్వరూపం.

ప్రశ్న 2.
విద్యుత్ శక్తి ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది?
జవాబు:
విద్యుత్ శక్తి ఘటాల నుంచి ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 3.
విద్యుత్ వాహకాలు అనగానేమి?
జవాబు:
విద్యుత్ ప్రవహించే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు.

ప్రశ్న 4.
విద్యుత్ బంధకాలు అనగానేమి?
జవాబు:
విద్యుత్తును తమ గుండా ప్రసరింపని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు.

AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 5.
విద్యుత్ వినియోగ పదార్థాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఫ్యాను, బల్బు, ఏ.సి, ఫ్రిజ్ మొదలైనవి విద్యుత్ వినియోగ పదార్థాలు.

ప్రశ్న 6.
విద్యుత్ వలయం అనగానేమి?
జవాబు:
ఘటం, బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం అంటారు.

ప్రశ్న 7.
టార్చి లైలో విద్యుత్తు ఎక్కడ నుండి వస్తుంది?
జవాబు:
టార్చ్ లైట్ లో ఘటాల నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 8.
ఘటంలో ఎన్ని ధ్రువాలు ఉంటాయి?
జవాబు:
ఘటంలో రెండు ధ్రువాలు ఉంటాయి. అవి

  1. ధవ ధృవము
  2. రుణ ధ్రృవం

ప్రశ్న 9.
విద్యుత్తు బల్బుకు ఎన్ని ధ్రువాలు ఉంటాయి?
జవాబు:
విద్యుత్ బల్బుకు రెండు ధ్రువాలు ఉంటాయి.

ప్రశ్న 10.
ఫిలమెంట్ అనగానేమి?
జవాబు:
బల్బు లోపల రెండు తీగల మీదుగా ఒక సన్నని తీగ లాంటి రింగు తీగ ఉంటుంది. దీనినే ఫిలమెంట్ అంటారు.

AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 11.
ఎడిసన్ తయారుచేసిన బల్బులో ఏ ఫిలమెంట్ 45 గంటలపాటు వెలిగింది?
జవాబు:
మసి పూత పూసిన దారం ఎడిసన్ బల్బులో 45 గంటలపాటు వెలిగింది.

ప్రశ్న 12.
స్విచ్ అనగానేమి?
జవాబు:
విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించటానికి ఉపయోగించే పరికరాన్ని స్విచ్ అంటారు.

ప్రశ్న 13.
కరెంటు అనగానేమి?
జవాబు:
వలయములో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటాము.

ప్రశ్న 14.
టార్చిలైటులోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
టార్చిలైటులో ఘటాలు, బల్బు, స్విచ్ ప్రధాన భాగాలు.

ప్రశ్న 15.
విద్యుత్ వాహకాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రాగి, ఇనుము, వెండి వంటి లోహాలు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి.

ప్రశ్న 16.
విద్యుత్ బంధకాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కాగితం, చెక్క, అట్టముక్క మొదలైనవి విద్యుత్ బంధకాలు.

ప్రశ్న 17.
విద్యుత్ బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బుని కనుగొన్నాడు.

ప్రశ్న 18.
విద్యుత్ బల్బులో ఏ పదార్థాన్ని మొదట ఫిలమెంట్ గా ఉపయోగించారు?
జవాబు:
విద్యుత్ బల్బులో ప్లాటినంను మొదట ఫిలమెంట్ గా వాడారు.

AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 19.
ప్రస్తుతం బల్బులలో ఫిలమెంట్ గా ఉపయోగించే పదార్థం ఏమిటి?
జవాబు:
టంగ్ స్టన్ పదార్థాన్ని బల్బులలో నేడు ఫిలమెంట్ గా వాడుతున్నారు.

6th Class Science 10th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
టార్చ్ లైట్ లో ఘటాలను చుట్టేసినప్పుడు బల్బు వెలగలేదు ఎందుకు?
జవాబు:
టార్చ్ లైట్ లో విద్యుత్తు ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది. టార్చ్ లైట్ లో ఘటాలను తిప్పి వేసినప్పుడు ఇది విద్యుత్ ప్రసరణకు అంతరాయం కలిగించడం వల్ల బల్బు వెలగలేదు.

ప్రశ్న 2.
విద్యుత్ ఘటం యొక్క నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ఘటానికి ఒక స్థూపాకార లోహపు పాత్ర ఉంటుంది. ఈ పాత్రలో కొన్ని రసాయన పదార్థాలను నింపి ఉండడం వల్ల అది బరువుగా ఉంటుంది. పాత్ర లోపల పదార్థాల మధ్యలో ఒక కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని ఒక చివర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తు భాగం ఒక లోహపు బిళ్లతో మూసి ఉంటుంది. మొత్తం స్థూపాకార పాత్ర సీలు చేసి ఉంటుంది.

ఘటంపైనున్న ధన (+), ఋణ (-) గుర్తులు ఘటం రెండు ధృవాలను సూచిస్తాయి.

ప్రశ్న 3.
టార్చ్ లైట్ బల్బు యొక్క నిర్మాణంను వర్ణించండి.
జవాబు:

  1. టార్చ్ లైట్ బల్బ్ లో ఒక లోహపు దిమ్మ, దానిపై గాజు బుగ్గ ఉంటాయి.
  2. లోపల రెండు తీగలుంటాయి.
  3. ఇందులో ఒక తీగ లోహపు దిమ్మకు, రెండో తీగ దిమ్మ మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటాయి. ఈ రెండు తీగలూ ధ్రువాలుగా పనిచేస్తాయి.
  4. బల్బు లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగులాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ‘ఫిలమెంట్’ అంటారు.
    AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు 1

ప్రశ్న 4.
విద్యుత్ వలయం అనగానేమి? దానిలో ఏమేమి ఉంటాయి?
జవాబు:
విద్యుత్ వలయంలో ఒక బల్బు, ఒక ఘటం, వాటిని కలుపుతూ తీగలు ఉంటాయి. ఘటము మరియు బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం అంటాము.

ప్రశ్న 5.
ఒక బల్బును పరిశీలించి అది పాడైపోయిందా లేదా చెప్పగలరా? ఫిలమెంట్ లలో తేడాలు గుర్తించగలరా?
జవాబు:

  1. బల్బును పరిశీలించి అది పాడైపోయిందో లేదో చెప్పవచ్చు. ఫిలమెంట్ లలోని తేడాలను గుర్తించవచ్చు.
  2. ఒక పాడైపోయిన బల్బును తీసుకొని వలయంలో కలపాలి. అది వెలగదు.
  3. బల్బులోని ఫిలమెంటు తెగిపోవడం వల్ల విద్యుత్ ప్రవాహమార్గం మూసి ఉండకపోవడంతో విద్యుత్ ప్రవహించదు.
  4. అందుకే బల్బ్ వెలగదు.

ప్రశ్న 6.
కరెంటు అనగానేమి?
జవాబు:
వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు. ఇది ధన ధృవం నుంచి ఋణ ధృవానికి ప్రవహిస్తుంది.

AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 7.
స్విచ్ అనగానేమి? దాని ప్రయోజనం ఏమిటి?
జవాబు:
విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించుటకు ఉపయోగించే విద్యుత్ పరికరంను స్విచ్ అంటారు. దీని ద్వారా విద్యుత్ పరికరాలను పనిచేయించవచ్చు లేదా ఆపవచ్చు.

ప్రశ్న 8.
టార్చ్ లైట్ పని చేయకపోవడానికి గల కారణాలను ఊహించండి.
జవాబు:
టార్చ్ లైట్ పనిచేయకపోవటానికి

  1. టార్చిలైట్ లోని సెల్స్ పనిచేయకపోవచ్చు.
  2. సెలను సరిగా అమర్చి ఉండకపోవచ్చు.
  3. స్విచ్ సరిగా పనిచేసి ఉండకపోవచ్చు.
  4. బల్బు మాడిపోయి ఉండవచ్చు.
  5. సెల్స్ వెనుకభాగాన తుప్పు పట్టి ఉండవచ్చు.. ,
  6. విద్యుత్ తీగలు తెగి ఉండవచ్చు.

ప్రశ్న 9.
విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు అనగానేమి?
జవాబు:
విద్యుత్ వాహకాలు :
విద్యుత్ ను తమగుండా ప్రవహింపచేసే పదార్థాలను ‘విద్యుత్ వాహకాలు’ అంటారు.

విద్యుత్ బంధకాలు :
విద్యుత్ ను తమగుండా ప్రవహింపనీయని పదార్థాలను ‘విద్యుత్ బంధకాలు’ అంటారు.

ప్రశ్న 10.
ప్లాస్టిక్ తొడుగును తొలగించకుండా తీగలను ఎందుకు ఉపయోగించకూడదు?
జవాబు:
విద్యుత్ తీగలోని లోహాల గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. మనకు విద్యుత్ ఘాతం తగలకుండా వాటి పైన ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. ఈ ప్లాస్టిక్ తొడుగును తొలగించకపోయినట్లయితే విద్యుత్ ప్రవాహం కొనసాగదు. అందువల్ల ప్లాస్టిక్ తొడుగును తొలగించకుండా తీగలను ఉపయోగించలేము.

ప్రశ్న 11.
విద్యుత్ తీగలో ఉండే పదార్థం ఏమిటి?
జవాబు:
విద్యుత్ తీగలలో విద్యుత్ వాహకాలైన లోహాలు ఉంటాయి. వీటి ద్వారా విద్యుత్తు ప్రవహిస్తుంది.

AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 12.
విద్యుత్తు పనిచేసేటప్పుడు కాళ్లకు ప్లాస్టిక్ చెప్పులు ధరించమని సలహా ఇస్తారు. ఎందుకు?
జవాబు:
విద్యుత్తు పనిచేసేటప్పుడు విద్యుత్ ఘాతం జరిగే ప్రమాదం ఉంది దాన్ని నివారించడానికి ప్లాస్టిక్ చెప్పులు. వాడమంటారు. ఇవి విద్యుత్ బంధకం. అందువలన విద్యుత్ పని చేసేటపుడు కాళ్ళకు ప్లాస్టిక్ చెప్పులు ధరించమని సలహా ఇస్తారు. వీటి వలన వ్యక్తి విద్యుత్ ఘాతం జరగకుండా రక్షింపబడతాడు.

6th Class Science 10th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
స్విచ్ తయారు చేయు విధానాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
పటంలో చూపిన విధంగా ఒక చెక్కపలక పైన గాని లేదా ఒక థర్మకోల్ షీటుపైన గాని వలయాన్ని అమర్చండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 3

వలయంలో A, B ల వద్ద రెండు డ్రాయింగ్ పిన్నులు అమర్చండి. ఒక పిన్నీసును తీసుకొని దాని ఒక కొన (B) వద్ద తాకేటట్టుగాను, రెండవ కొన విడిగా ఉండేటట్లుగాను అమర్చండి. ఇప్పుడు పిన్నీసు రెండవ కొనను (A) కి తాకించండి. ఇప్పుడు బల్బు వెలుగుతుందో లేదో గమనించండి.

కృత్యంలో పిన్నీసు వలయాన్ని మూయడానికి లేదా తెరవడానికి ఉపయోగపడింది. అంటే ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుందన్నమాట.

స్విచ్ ఆన్ (ON) చేసినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్ (OFF) చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. బల్బు లేదా ఇతర విద్యుత్ పరికరాలలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ నియంత్రిస్తుంది.

ప్రశ్న 2.
టార్చిలైట్ నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
చీకటిలో వెలుతురు సం సాధారణంగా టార్చిలైటును వాడతాం. టార్చిలైటులో ఒక స్థూపాకారపు గొట్టం, ఘటం, బల్బు, స్విచ్, గాజుమూత మరియు లోహపు స్ప్రింగు ఉంటాయి.
AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు 2
స్థూపాకారపు గొట్టం లోపల ఘటాలను అమర్చడానికి వీలుగా ఉంటుంది. మూతకు స్కూ ఉండి తెరవడానికి, మూయడానికి ఉపయోగపడుతుంది. మూతను మూసి స్విచ్ ఆన్ (ON) చేయగానే వలయం మూయబడి టార్చిలైటులో ఉన్న బల్బు వెలుగుతుంది.

AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 3.
విద్యుత్ బల్ట్ ఆవిష్కరణ గురించి చెప్పండి.
జవాబు:
ఎడిసన్ శాస్త్రజ్ఞుడే అయినప్పటికి బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగగుండా విద్యుత్ ను ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. కాని కేవలం కొన్ని సెకన్లలోనే అది మండిపోయింది. తీగచుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసివేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేదని ఎడిసన్, భావించాడు.

ఒక గాజు బుగ్గను తయారుచేసి, దానిలో ప్లాటినం ఫిలమెంటును ఉంచి బుగ్గలో ఉన్న గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంటు గుండా విద్యుత్ ను ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాలపాటు నిరంతరాయంగా వెలిగింది. దీనితో ఉత్తేజితుడైన ఎడిసన్, వేరు వేరు పదార్థాలపై ప్రయోగాలు చేస్తూ ఇంకా మంచి ఫిలమెంటు కోసం ప్రయత్నించాడు. అతడు మసి పూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంటుగా వాడగా, ఇది 45 గంటలపాటు నిరంతరాయంగా వెలిగింది.

AP Board 6th Class Science 10th Lesson 1 Mark Bits Questions and Answers విద్యుత్ వలయాలు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. విద్యుత్ బల్బులో ఫిలమెంట్
A) రాగి
B) వెండి
C) టంగ్ స్టన్
D) ప్లాస్టిక్
జవాబు:
C) టంగ్ స్టన్

2. విద్యుత్ బల్బుని కనుగొన్నది.
A) ఎడిసన్
B) న్యూటన్
C) థామస్
D) రూథర్ ఫర్డ్
జవాబు:
A) ఎడిసన్

3. విద్యుత్ ప్రసరణకు ఉపయోగపడే పదార్థాలు
A) వాహకాలు
B) బంధకాలు
C) ఘటం
D) జనకాలు
జవాబు:
A) వాహకాలు

4. విద్యుత్ బంధకమునకు ఉదాహరణ
A) ఇనుము
B) ఉక్కు
C) ప్లాస్టిక్
D) రాగి
జవాబు:
C) ప్లాస్టిక్

AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు

5. విద్యుద్ఘాతము తగలకుండా ఉపయోగపడునవి
A) వాహకాలు
B) బంధకాలు
C) జనకాలు
D) అన్నీ
జవాబు:
B) బంధకాలు

6. విద్యుత్ వలయంలోని పరికరాలు
A) విద్యుత్ ఘటం
B) విద్యుత్ వాహకం
C) బల్బ్
D) అన్ని
జవాబు:
D) అన్ని

7. విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని ఏమంటారు?
A) విద్యుత్ వలయం
B) విద్యుత్ నిరోధం
C) విద్యుత్ వాహకం
D) విద్యుత్ బంధకం
జవాబు:
A) విద్యుత్ వలయం

8. విద్యుత్ బల్బులు వెలుగునిచ్చే భాగం
A) ధన ధ్రువం
B) రుణ ధ్రువం
C) ఫిలమెంట్
D) గాజుకుప్పె
జవాబు:
C) ఫిలమెంట్

9. టార్చ్ లైట్లో సెలను తిప్పివేస్తే
A) వెలగదు
B) వెలుగుతుంది
C) వెలిగి ఆరిపోతుంది
D) బల్బు మాడిపోతుంది
జవాబు:
A) వెలగదు

AP 6th Class Science Important Questions Chapter 10 విద్యుత్ వలయాలు

10. విద్యుత్ ఘటాలలో విద్యుత్తు వేటి నుంచి ఉత్పత్తి అవుతుంది?
A) నీరు
B) రసాయనాలు
C) లోహాలు
D) తీగలు
జవాబు:
B) రసాయనాలు

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. ప్రవహించే విద్యుత్తును ………….. అంటాము.
2. విద్యుత్ ఉత్పత్తికి …………… వాడతాము.
3. ఘటము ……….. ధృవాలు కలిగి ఉంటుంది.
4. విద్యుత్ ధన ధ్రువం నుండి ………….. ప్రయాణిస్తుంది.
5. బల్బు రెండు ధృవాల మధ్య ………….. ఉంటుంది.
6. విద్యుత్ బల్బు ఫిలమెంట్ …………. లో ఉంటుంది.
7. ఘటము యొక్క ధన ధృవాన్ని బల్బ్ యొక్క …………….
8. విద్యుత్ వలయంలో ఘటాన్ని ……………. అంటారు.
9. వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడేది ………….
10. స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు విద్యుత్ ……………………
11. మూసివున్న వలయంలో విద్యుత్ ……………
12. టార్చ్ లైట్ లో స్విచ్ ఆన్ చేయగానే బల్చు …………… ధృవానికి కలుపుతారు.
13. విద్యుత్తు ప్రవహించని పదార్థాలను ………….. అంటారు.
14. విద్యుత్ బల్బును ఆవిష్కరించిన శాస్త్రవేత్త ………………..
15. విద్యుత్ బల్బులో ఉపయోగించే పదార్థం ……………………..
జవాబు:

  1. కరెంట్
  2. ఘటము లేదా సెల్
  3. రెండు
  4. రుణ ధృవానికి
  5. ఫిలమెంట్
  6. గాజుబుగ్గ
  7. ఋణ ధృవం
  8. విద్యుత్ జనకం
  9. స్విచ్
  10. ప్రవహించదు
  11. ప్రవహిస్తుంది.
  12. వెలుగుతుంది
  13. విద్యుత్ బంధకాలు
  14. థామస్ ఆల్వా ఎడిసన్
  15. టంగ్స్టన్

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – AGroup – B
ఎ) విద్యుత్ వాహకాలు1) కాంతిని ఉత్పత్తి చేస్తుంది.
బి) విద్యుత్ బంధకాలు2) విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది
సి) విద్యుత్ ఘటం3) విద్యుత్తు అనుమతిస్తుంది, అనుమతించదు
డి) కాంతి జనకం4) విద్యుత్తును అనుమతించదు
ఇ) స్విచ్5) విద్యుత్తును అనుమతిస్తుంది.

జవాబు:

Group – AGroup – B
ఎ) విద్యుత్ వాహకాలు5) విద్యుత్తును అనుమతిస్తుంది.
బి) విద్యుత్ బంధకాలు4) విద్యుత్తును అనుమతించదు
సి) విద్యుత్ ఘటం2) విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది
డి) కాంతి జనకం1) కాంతిని ఉత్పత్తి చేస్తుంది.
ఇ) స్విచ్3) విద్యుత్తు అనుమతిస్తుంది, అనుమతించదు

2.

Group – AGroup – B
ఎ) విద్యుత్1) ధన లేదా రుణ
బి) కాగితం2) బల్బు
సి) రాగి3) కరెంట్
డి) ఫిలమెంట్4) వాహకం
ఇ) ధృవము5) అవాహకం

జవాబు:

Group – AGroup – B
ఎ) విద్యుత్3) కరెంట్
బి) కాగితం5) అవాహకం
సి) రాగి4) వాహకం
డి) ఫిలమెంట్2) బల్బు
ఇ) ధృవము1) ధన లేదా రుణ

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

These AP 6th Class Science Important Questions 9th Lesson జీవులు – ఆవాసం will help students prepare well for the exams.

AP Board 6th Class Science 9th Lesson Important Questions and Answers జీవులు – ఆవాసం

6th Class Science 9th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జీవులు మరియు నిర్జీవులు అంటే ఏమిటి?
జవాబు:
పెరుగుదల, కదలిక, ఆహారం తీసుకోవడం, శ్వాస తీసుకోవడం, వ్యర్థాలను విసర్జించడం మరియు కొత్త జీవులకు జన్మనివ్వడం వంటి లక్షణాలు కలిగిన వాటిని జీవులు అంటారు. ఉదా : మొక్కలు, జంతువులు. ఈ లక్షణాలు కలిగి లేని వాటిని నిర్జీవులు అని పిలుస్తారు.
ఉదా : రాయి, నీరు; నేల.

ప్రశ్న 2.
అండోత్పాదక జీవులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
గుడ్లు పెట్టే జీవులను అండోత్పాదక జీవులు అంటారు.
ఉదా : కోడి, కాకి, బల్లి, పాము.

ప్రశ్న 3.
శిశోత్పాదక జీవులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
పిల్లలకు జన్మనిచ్చే జీవులను శిశోత్పాదక జీవులు అంటారు.
ఉదా : మనిషి, పిల్లి, కుక్క ఏనుగు.

ప్రశ్న 4.
సూక్ష్మదర్శిని అంటే ఏమిటి?
జవాబు:
మైక్రోస్కోప్ అనేది మనం కంటితో చూడలేని జీవులను పరిశీలించడానికి ఉపయోగించే ఒక పరికరం.

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 5.
టచ్ మీ నాట్ మొక్కను తాకినప్పుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
టచ్ మీ నాట్ మొక్క (మైమోసా పుడికా)ను ఆకులను తాకినప్పుడు, ఆకులు ముడుచుకుపోతాయి. ఇక్కడ తాకటం మొక్కకు ఉద్దీపన, ఆకులు ముడుచుకోవటం మొక్క యొక్క ప్రతిస్పందన.

ప్రశ్న 6.
జీవులన్నీ జీవితాంతం పెరుగుతాయా?
జవాబు:
లేదు. అన్ని జీవులు జీవితాంతం పెరగవు. మొక్కలు జీవితాంతం పెరుగుతాయి. కాని జంతువులు కొంత వయస్సు వరకు మాత్రమే పెరుగుతాయి.

ప్రశ్న 7.
చనిపోయిన మొక్కలు లేదా జంతువులు నిర్జీవులా?
జవాబు:
లేదు. చనిపోయిన మొక్క కానీ జంతువులు కానీ లేదా మరే ఇతర సజీవి కానీ చనిపోయిన తరువాత కుళ్ళిపోయి నిర్జీవ కారకాలుగా మారతాయి. అందువల్ల చనిపోయిన జీవులను నిర్జీవులుగా భావించలేము. ఇవి సజీవులకు, నిర్జీవులకు నడుమ ఏర్పడు మధ్యస్థ అంశాలు.

ప్రశ్న 8.
సూక్ష్మజీవులు అంటే ఏమిటి?
జవాబు:
కంటికి కనపడని చిన్న జీవులను సూక్ష్మజీవులు అంటారు. మనం వీటిని సూక్ష్మదర్శిని క్రింద మాత్రమే చూడగలము.

ప్రశ్న 9.
ఉద్దీపన అంటే ఏమిటి?
జవాబు:
జీవులలో ప్రతిస్పందనకు కారణమైన మార్పును ఉద్దీపన అంటారు.

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 10.
కొల్లేరు సరస్సులో ఏ నెలల్లో పెలికాన్లు కనిపిస్తాయి?
జవాబు:
అక్టోబర్ నుండి మార్చి వరకు.

ప్రశ్న 11.
భౌమ ఆవాసము అంటే ఏమిటి? భౌమ ఆవాసాల యొక్క కొన్ని మొక్కలు మరియు జంతువులకు పేరు పెట్టండి.
జవాబు:
భూమిపై వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలు మరియు జంతువులు నివసించే ప్రదేశాలను భౌమ ఆవాసాలు అంటారు.
ఉదా : మామిడి, జామ, సపోటా, పక్షులు, మనిషి, పాములు, చీమలు మొదలైనవి.

ప్రశ్న 12.
జంతువుల చర్మం కొన్ని జీవులకు ఆవాసంగా ఎలా ఉంటుంది?
జవాబు:
మనం తరుచుగా గేదెల చర్మంపై కొన్ని కీటకాలను చూస్తుంటాము. కాబట్టి ఆ కీటకానికి గేదె చర్మం ఆవాసము.

ప్రశ్న 13.
సాధారణంగా జీవులు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
జీవులకు వేర్వేరు అవసరాలు ఉన్నాయి. అవి సాధారణంగా వారి అవసరాలను తీర్చగలిగిన ప్రదేశాలలో ఉంటాయి. అంటే ఆవాసాలలో వాటికి తగినంత ఆహారం, ఆశ్రయం మరియు జీవించటానికి అవసరమైన ఇతర పరిస్థితులు లభిస్తాయి.

ప్రశ్న 14.
కొలను యొక్క ఉపరితలంపై ఏ జంతువులు మరియు మొక్కలు నివసిస్తాయి?
జవాబు:
నత్త, మే ఫ్లై, కింగ్ ఫిషర్ మరియు పాండ్ స్కేటర్లు వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి.

ప్రశ్న 15.
కొలనులోని వివిధ ప్రదేశాలను ఆవాసముగా కూడా పిలవవచ్చా? ఎందుకు? లేదా ఎందుకు కాదు?
జవాబు:
కొలనులోని వివిధ ప్రదేశాలలో వివిధ జీవులు నివసిస్తాయి. కావున వీటిని ఆవాసముగా భావించవచ్చు.

ప్రశ్న 16.
చెట్టుపై మీకు కనిపించే వివిధ జీవుల పేర్లు చెప్పండి.
జవాబు:
పక్షులు, కోతులు, ఉడుతలు, పాములు, చీమలు, సాలెపురుగులు, గొంగళి పురుగులు, చిమటలు, తేనెటీగలు, కందిరీగలు, చిన్న మొక్కలు (నాచులు) దోమలు మొ||నవి.

ప్రశ్న 17.
పండ్ల తోటలో పెరిగే మొక్కలన్నీ అడవిలోని మొక్కల మాదిరిగానే ఉన్నాయా? ఎందుకు?
జవాబు:
ఒక పండ్ల తోటలో పండ్ల మొక్కలు మాత్రమే పండిస్తారు. చింతపండు, మామిడి, ఉసిరి, అడవులలో పెరిగే మొక్కలకు ఉదాహరణలు.

ప్రశ్న 18.
ఎడారి మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బ్రహ్మజెముడు, నాగజెముడు, కలబంద, కిత్తనార ఎడారి మొక్కలకు ఉదాహరణలు.

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 19.
కొలను మధ్యభాగంలో ఏ జంతువులు, మొక్కలు నివసిస్తాయని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
బొద్దింకలు, దోమ లార్వా, చేపలు మరియు పీతలు కొలను మధ్యభాగంలో ఉంటాయి.

6th Class Science 9th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జీవులు మరియు నిర్జీవులు రెండింటిలో ఏ లక్షణాలు ఒకేలా ఉంటాయి?
జవాబు:

  • అన్ని జీవులు మరియు నిర్జీవులు పదార్థంతో తయారవుతాయి.
  • అన్ని జీవులు మరియు నిర్జీవులు ద్రవ్యరాశిని కలిగి వుంటాయి. మరియు స్థలాన్ని ఆక్రమిస్తాయి.
  • రెండూ నిర్మాణాత్మక పరిమాణం కలిగి ఉంటాయి.
  • కణం అనేది జీవుల మరియు నిర్జీవుల నిర్మాణాత్మక ప్రమాణం.

ప్రశ్న 2.
మన పర్యావరణమునకు జీవులు మరియు నిర్జీవులు రెండూ అవసరమని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
అవును. మన పర్యావరణానికి జీవులు మరియు నిర్జీవులు రెండూ అవసరం.

  • ఉదాహరణకు మొక్క ఒక జీవి. దాని మనుగడ కోసం నేల నుండి నీరు మరియు ఖనిజాలను తీసుకుంటుంది.
  • దీని అర్థం జీవులు నిర్జీవుల పై ఆధారపడి ఉంటాయి. ఇది మన పర్యావరణాన్ని స్థిరంగా ఉంచుతుంది.

ప్రశ్న 3.
విత్తనం జీవిస్తున్నట్లు వంశీ తన స్నేహితుడు రాముతో వాదించాడు. రాము ఏ ప్రశ్నలు అడుగుతాడో ఆలోచించండి.
జవాబు:

  • విత్తనం పెరుగుతుందా?
  • విత్తనంలో కదలిక ఉందా?
  • విత్తనం ఆహారాన్ని తీసుకుంటుందా?
  • విత్తనం శ్వాస తీసుకోగలదా?
  • విత్తనం దానిలోని వ్యర్థాలను ఎలా తొలగిస్తుంది?

ప్రశ్న 4.
కొలను నీటిలో సూక్ష్మజీవులను పరిశీలించడానికి మీరు ప్రయోగశాలలో చేసిన ప్రయోగ దశలను రాయండి.
జవాబు:

  • నీటి నమూనాలను కొలను నుండి మరియు బోరు బావి నుండి సేకరించండి.
  • వాటిని విడివిడిగా ఉంచండి.
  • స్లెడ్ పై వాటర్ డ్రాప్ ఉంచండి. దానిపై కవర్ స్లిప్ ఉంచండి.
  • సూక్ష్మదర్శిని క్రింద గమనించండి. అనేక సూక్ష్మజీవులు కనిపిస్తాయి.

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 5.
మన చుట్టూ ఉన్న వివిధ ఆవాసాలు ఏమిటి?
జవాబు:
చెట్లపై, మన ఇళ్లలో, కొలనులోని వివిధ ప్రాంతాలలో మరియు అనేక ఇతర ప్రదేశాలలో ఒక చిన్న నీటి కొలనులో అనేక జీవులను మనం చూస్తాము. ఇవన్నీ ఆవాసాలే.

  • విస్తీర్ణం పెరిగే కొద్దీ, అక్కడ నివసించే జీవుల రకం మరియు సంఖ్య కూడా పెరుగుతుంది.
  • మన ఇంటి కంటే ఇంటి పరిసరాలు, పరిసరాల కంటే కొలను, కొలను కంటే సరస్సులో ఎక్కువ రకాల జీవులు ఉంటాయి.
  • పెద్ద ప్రాంతాలు ఎక్కువ జీవులు జీవించటానికి అనుకూలంగా ఉంటాయి.

ప్రశ్న 6.
జల ఆవాసాలు అంటే ఏమిటి?
జవాబు:
నీరు ప్రధాన వనరుగా ఉన్న ఆవాసాలను జల ఆవాసాలు అంటారు.

  • అన్ని సరస్సులలో మనం మొక్కలను మరియు జంతువులను చూడవచ్చు.
  • నీటిలో నివసించే మొక్కలను నీటి మొక్కలు అంటారు. జంతువులను నీటి జంతువులు అంటారు.

ప్రశ్న 7.
మీ ఇల్లు కూడా ఒక ఆవాసమేనా? దీనిపై వ్యా ఖ్యానించండి.
జవాబు:
మనతో పాటు మన ఇంట్లో అనేక జీవులు ఉంటాయి. కావున మన ఇల్లు కూడా ఒక ఆవాసము.

  • కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, పక్షులు, సాలెపురుగులు, చీమలు మరియు బొద్దింకలు వంటి అనేక జీవులు మాతో పాటు నివసిస్తాయి.
  • మనీ ప్లాంట్ మరియు కొన్ని క్రోటన్ మొక్కలు, పూల మొక్కలు మరియు కొన్ని కూరగాయల మొక్కలు మా ఇంటిలో పెంచుతాము.
  • కావున మా ఇల్లు కూడా ఒక ఆవాసము.

ప్రశ్న 8.
ఎడారి మొక్కల గురించి తెలపండి.
జవాబు:

  • ఎడారులలో అధిక ఉష్ణోగ్రత మరియు నీటి లభ్యత తక్కువగా ఉంటుంది.
  • ఇటువంటి పరిసరాలలో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అంటారు.
  • బ్రహ్మ జెముడు, నాగజెముడు, కలబంద మొక్కలకు మిరప లేదా మల్లె మొక్కల వలె నీరు అవసరం లేదు.
  • ఎడారి మొక్కలు మరియు జంతువులు పొడి పరిస్థితులకు మరియు విస్తారమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలను తట్టుకొంటాయి.

ప్రశ్న 9.
తన ఇంటి వద్ద ఉన్న జామ చెట్టు మీద పండ్లు తినే ఉడుతలను భంగపరచడానికి రాజేష్ ఇష్టపడడు. అతను ఎందుకు అలా చేస్తాడు?
జవాబు:

  • మన వలె జంతువులు కూడా ఆవాసంలో ఒక భాగము. అవి జీవించటానికి ఆహారం అవసరం.
  • తినేటప్పుడు వాటిని బెదరకొడితే అవి భయపడతాయి. కావున మనం చెడుగా ప్రవర్తించకూడదు.

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 10.
మన పెంపుడు జంతువుల పట్ల మనం ఎందుకు బాధ్యతాయుతంగా మెలగాలి?
జవాబు:

  • మన పెంపుడు జంతువుల మంచి చెడ్డలను మనమే చూసుకోవాలి.
  • వాటి షెడ్లను శుభ్రంగా ఉంచడం, వాటికి పశుగ్రాసం మరియు నీరు సరఫరా చేయడం మన బాధ్యత.
  • మనం జంతువుల పట్ల శ్రద్ధ చూపిస్తే అవి మన పట్ల ప్రేమగా ఉంటాయి.

6th Class Science 9th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం 1

  1. సూక్ష్మదర్శిని మనం కంటితో చూడలేనంత చిన్న వస్తువులను, జీవులను చూడటానికి ఉపయోగించే పరికరం.
  2. ఇది భూతద్దం వలె పనిచేస్తుంది. అయితే భూతద్దం కన్నా చాలా శక్తివంతమైనది.
  3. ప్రాథమికంగా సూక్ష్మదర్శిని నందు రెండు – విభాగాలు కలవు. అవి నిర్మాణాత్మక విభాగం మరియు దృశ్య విభాగం.
  4. నిర్మాణాత్మక విభాగంలో పీఠం, ఆధారం, చేతి వంపు ఉంటాయి.
  5. దృశ్య విభాగంలో అక్షి కటకం, వస్తు కటకం స్థూల సవరణి, సూక్ష్మ సవరణి, పీఠం, రంధ్రం మొదలైన భాగాలుంటాయి.

ప్రశ్న 2.
ఆవాసాలను పాడుచేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:

  • కొలనులు, సరస్సులు, నదులు మరియు మైదానాలలో వ్యర్థాలను వేయడం ద్వారా మనం ఆవాసానికి భంగం కలిగిస్తున్నాము.
  • ఆవాసాలు అనేక జీవులకు నివాస స్థావరాలు. ఆవాసాలు పాడుచేయటం వలన ఈ జీవులన్నీ నివాసాలను కోల్పోతాయి.
  • జంతువులు మన ఆవాసాలలో భాగస్వాములు. వాటికి జీవించే హక్కు ఉంది.
  • ఆవాసములో జరిగే ప్రతి మార్పు అన్నీ జీవులను ప్రభావితం చేస్తుంది.
  • అది మానవుని జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
  • కావున ఆవాసాలను మనం పరిరక్షించుకోవాలి.

ప్రశ్న 3.
పక్షులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎందుకు వలసపోతున్నాయి?
జవాబు:

  • పక్షులు ప్రధానంగా ఆహారం కోసం, అనుకూల పరిసరాల కోసం, ప్రత్యుత్పత్తి కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళతాయి.
  • మన రాష్ట్రంలోని కొల్లేరు మరియు పులికాట్ సరస్సులకు వివిధ రకాల పక్షులు చాలాదూరం నుండి వలస వస్తాయి.
  • సాధారణంగా పునరుత్పత్తికి అనువైన పరిస్థితుల కోసం పక్షులు చాలాదూరం ప్రయాణిస్తాయి.
  • తాబేళ్లు వంటి జంతువులు పశ్చిమబెంగాల్ మరియు ఒడిశా తీరాల నుండి విశాఖపట్నం తీరాలకు వెళతాయి.
  • పులస వంటి కొన్ని చేపలు సముద్రపు నీటి నుండి నది నీటికి వలసపోతాయి.

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

ప్రశ్న 4.
మనం జంతువుల ఆవాసాలను ఆక్రమిస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:

  • జంతువులు మన ఆవాసంలో ఒక భాగము.
  • మనలాగే వాటికి భూమి మీద జీవించే హక్కు ఉంది.
  • మనం మన అవసరాల కోసం వాటి ఆవాసాలను ఆక్రమిస్తున్నాము.
  • మనం చెట్లను నరికినపుడు వాటిపై నివసించే పక్షులు వాటి గూళ్ళు పోగొట్టుకుంటాయి మరియు ప్రమాదంలో పడతాయి.
  • కుక్కలు, కాకులు, కోతులు మొ|| జంతువులు ఆహారం మరియు ఆశ్రయం లేకపోతే బాధపడటం మనం తరచుగా చూస్తాము.
  • కావున మనం ఆవాసాలను పాడు చేయరాదు.
  • జంతువుల హక్కులు మరియు రక్షణ కోసం పనిచేసే పెటా వంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి.

AP Board 6th Class Science 9th Lesson 1 Mark Bits Questions and Answers జీవులు – ఆవాసం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. కిందివాటిలో అండోత్పాదక జీవి
A) కుందేలు
B) కుక్క
C) కోడి
D) ఎలుక
జవాబు:
C) కోడి

2. శిశోత్పాదక జంతువులు
A) గుడ్లు పెడతాయి.
B) చిన్న పిల్లలకు జన్మనిస్తాయి.
C) గుడ్లు పెట్టి, చిన్న పిల్లలకు జన్మనిస్తాయి.
D) ఏదీకాదు
జవాబు:
B) చిన్న పిల్లలకు జన్మనిస్తాయి.

3. సూక్ష్మజీవులను చూడటానికి మనం ఏమి ఉపయోగిస్తాము?
A) టెలిస్కోపు
B) పెరిస్కోపు
C) కెలిడియోస్కోపు
D) మైక్రోస్కోపు
జవాబు:
D) మైక్రోస్కోపు

4. కింది వాటిలో ఏది జీవి?
A) బాక్టీరియా
B) టేబుల్
C) కుర్చీ
D) రాయి
జవాబు:
A) బాక్టీరియా

5. సూక్ష్మదర్శినిలో అక్షి కటకం దేని భాగం?
A) నిర్మాణాత్మక విభాగం
B) దృశ్య విభాగం
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) దృశ్య విభాగం

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

6. విత్తనం ………
A) జీవి
B) నిర్జీవి
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) జీవి

7. జీవుల యొక్క లక్షణం
A) పునరుత్పత్తి
B) శ్వాసక్రియ
C) విసర్జన
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

8. ఏ మొక్కను మనం తాకినప్పుడు ప్రతిస్పందనను చూపుతుంది?
A) వేప
B) జామ
C) అత్తిపత్తి
D) మామిడి
జవాబు:
C) అత్తిపత్తి

9. చనిపోయిన పదార్థాలు కుళ్ళిపోయి వేటిని ఏర్పరుస్తాయి?
A) జీవులు
B) మొక్కలు
C) జంతువులు
D) నిర్జీవ అంశాలు
జవాబు:
D) నిర్జీవ అంశాలు

10. నీటి మొక్కలు ఎక్కడ నివసిస్తాయి?
A) నీటిలో
B) భూమిపై
C) ఇసుకపై
D) బురద నేలలో
జవాబు:
A) నీటిలో

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

11. కింది వాటిలో ఎడారి మొక్క ఏది?
A) జామ
B) కలబంద
C) వేప
D) మామిడి
జవాబు:
B) కలబంద

12. పానపాములు మొక్కల ఏ భాగంకు దగ్గరగా ఉంటాయి?
A) వేర్లు
B) కాండం
C) ఆకులు
D) కొమ్మలు
జవాబు:
A) వేర్లు

13. ఏ జంతువు ఎడారిలో కనిపిస్తుంది?
A) గుర్రం
B) ఎలుక
C) ఒంటె
D) ఏనుగు
జవాబు:
C) ఒంటె

14. పాండ్ స్కేటర్ (నీటిపై తిరిగే కీటకం) కొలను ఏ ప్రాంతంలో నివసిస్తుంది?
A) కొలను అంచు
B) కొలను యొక్క ఉపరితలం
C) కొలను దిగువన
D) ఏదీకాదు
జవాబు:
B) కొలను యొక్క ఉపరితలం

15. జీవులు ఏ అవసరాలకు వాటి పరిసరాలపై ఆధారపడి ఉంటాయి?
A) ఆహారం
B) నీరు
C) ఆశ్రయం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

16. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏ జిల్లాలో ఉంది?
A) గుంటూరు
B) కృష్ణా
C) నెల్లూరు
D) ప్రకాశం
జవాబు:
B) కృష్ణా

17. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది?
A) నెల్లూరు
B) కృష్ణా
C) పశ్చిమ గోదావరి
D) కర్నూలు
జవాబు:
A) నెల్లూరు

18. మన ఇంటి ఆవాసాలలో కనిపించని జీవులు
A) పక్షులు
B) కుక్కలు
C) పీతలు
D) ఎలుకలు
జవాబు:
C) పీతలు

19. ఒక పండ్ల తోటలో రైతులు ఏమి పెంచుతారు?
A) అన్ని రకాల పండ్లు
B) అన్ని రకాల పువ్వులు
C) అన్ని రకాల పండ్ల మొక్కలు
D) ఒకే రకమైన పండ్ల మొక్కలు
జవాబు:
D) ఒకే రకమైన పండ్ల మొక్కలు

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

20. కొన్ని, పక్షులు దేని కోసం తమ ఆవాసాలను మార్చుకుంటాయి?
A) ప్రత్యుత్పత్తి
B) శ్వాసక్రియ
C) జీర్ణక్రియ
D) విసర్జన
జవాబు:
A) ప్రత్యుత్పత్తి

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. మొక్కలు మరియు జంతువుల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు బయటకు పంపటాన్ని ………. అంటారు.
2. పరిసర వాతావరణంలో మార్పు …………………
3. ………………… ఆవాసంలోని నిర్జీవ కారకం.
4. శరీరం, ఆధారము మరియు చేతివంపు సూక్ష్మదర్శిని యొక్క ………………… భాగాలు.
5. ……………… సజీవులు మరియు నిర్జీవుల మధ్య మధ్యంతర విషయాలు.
6. ఒక జీవి యొక్క అవసరాలను తీర్చగల పరిసరాలను …………. అంటారు.
7. దోమ లార్వా ఒక కొలను యొక్క …………… స్థానంలో కనిపిస్తుంది.
8. ……………. మన ఆవాస భాగస్వాములు.
9. విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఉన్న మడ అడవులు …………..
10. డ్రాగన్ ఫై కొలను యొక్క భాగంలో నివసిస్తుంది.
11. ………………… మొక్కలు మరియు జంతువులకు నివాస స్థలం (ఆవాసము).
జవాబు:

  1. విసర్జన
  2. ఉద్దీపన
  3. మట్టి
  4. నిర్మాణాత్మక
  5. చనిపోయిన జీవులు
  6. ఆవాసం
  7. మధ్య నీటి
  8. జంతువులు
  9. కొరింగ
  10. ఉపరితలంపైన
  11. మృత్తిక

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – AGroup – B
ఎ) జీవులు1) గుర్రం
బి) అండోత్పాదకాలు2) రాయి
సి) నిర్జీవి3) మైక్రోస్కోపు
డి) శిశోత్పాదకాలు4) కాకి
ఇ) బాక్టీరియా5) మొక్కలు

జవాబు:

Group – AGroup – B
ఎ) జీవులు5) మొక్కలు
బి) అండోత్పాదకాలు4) కాకి
సి) నిర్జీవి2) రాయి
డి) శిశోత్పాదకాలు1) గుర్రం
ఇ) బాక్టీరియా3) మైక్రోస్కోపు

2.

Group – AGroup – B
ఎ) హైడ్రిల్లా1) కొలను అంచు
బి) బ్రహ్మ జెముడు2) ఎడారి మొక్క
సి) మామిడి3) శాఖల మధ్య
డి) కప్ప4) కొలను దిగువ
ఇ) కోతి5) ఎడారి మొక్క

జవాబు:

Group – AGroup – B
ఎ) హైడ్రిల్లా4) కొలను దిగువ
బి) బ్రహ్మ జెముడు5) ఎడారి మొక్క
సి) మామిడి2) ఎడారి మొక్క
డి) కప్ప1) కొలను అంచు
ఇ) కోతి3) శాఖల మధ్య

3.

Group – AGroup – B
ఎ) విత్తనాలు1) మొక్కలు
బి) పెరుగుదల2) నిర్జీవి
సి) ఉద్దీపన3) జీవుల లక్షణం
డి) విసర్జన4) బాహ్య శక్తికి ప్రతిస్పందించడం
ఇ) రాయి5) వ్యర్థాలను విసర్జించటం

జవాబు:

Group – AGroup – B
ఎ) విత్తనాలు3) జీవుల లక్షణం
బి) పెరుగుదల1) మొక్కలు
సి) ఉద్దీపన4) బాహ్య శక్తికి ప్రతిస్పందించడం
డి) విసర్జన5) వ్యర్థాలను విసర్జించటం
ఇ) రాయి2) నిర్జీవి

మీకు తెలుసా?

“జీవించు -జీవించనివ్వు”

→ జంతువులూ మన ఆవాసంలో భాగమే. వాటికి కూడా జీవించే హక్కు ఉంది. మనం వాటి ఆవాసాలనే ఆక్రమించేస్తున్నాం. ఒక చెట్టును కాని మనం నరికేస్తే ఆ చెట్టుపై గూడు కట్టుకుని జీవిస్తున్న అనేక పక్షులు ప్రమాదంలో పడినట్లే. మనం ఒక్కోసారి కుక్కలు, పిల్లులు, కోతులు ఆహారం, నివాసం.లేక బాధపడుతూ తిరగడం చూస్తుంటాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జంతువుల హక్కులు, వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. వాటికి మనం కూడా ఆహారాన్ని అందించి సంరక్షించాలి. దీనిని మన బాధ్యతగా మనం భావించాలి.

→ బ్రహ్మజెముడు, తుమ్మ, కలబంద మొక్కలకు ఎక్కువ నీరు అవసరం లేదు. వీటిని ఎడారి మొక్కలు అంటారు. మనం ఎడారిలో ఒంటెలను చూస్తూ ఉంటాం. ఎడారి మొక్కలు, జంతువులు పొడి పరిస్థితులకు, విస్తారమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఎడారిలోని విభిన్న లక్షణాలు ఎడారిని ఆవాసంగా మారుస్తాయి.

AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం

→ ఎక్కడో సుదూర ప్రదేశాల నుండి పక్షులు మన రాష్ట్రంలోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ సరస్సులకు పెలికాన్ పక్షులు వస్తాయి. సాధారణంగా పక్షులు ప్రత్యుత్పత్తి జరుపుకోవడం కోసం దూర ప్రాంతాలకు ఎగిరి వెళుతుంటాయి. తాబేళ్లు, చేపలు వంటి జంతువులు కూడా గుడ్లు పెట్టటం కోసం ఒకచోటి నుండి మరొకచోటికి వెళుతుంటాయి. కొన్ని సముద్ర తాబేళ్ళు పశ్చిమ బంగ, ఒడిశా తీరప్రాంతాల నుండి విశాఖపట్నం తీరానికి ప్రయాణించి వస్తుంటాయి.

పులస చేపను గురించి ఎపుడైనా విన్నారా? వీటి గురించిన సమాచారాన్ని సేకరించండి. పులస చేపలు ఏ విధంగా మరియు ఎందుకని ఋతువుల ఆధారంగా తమ ఆవాసాన్ని మార్చుకుంటున్నాయి?

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

These AP 6th Class Science Important Questions 8th Lesson దుస్తులు ఎలా తయారవుతాయి will help students prepare well for the exams.

AP Board 6th Class Science 8th Lesson Important Questions and Answers దుస్తులు ఎలా తయారవుతాయి

6th Class Science 8th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సహజ దారాలు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మొక్కలు మరియు జంతువుల నుండి ఉత్పన్నమయ్యే దారాలను సహజ దారాలు అంటారు.
ఉదా: పత్తి, ఉన్ని, పట్టు, జనపనార, కొబ్బరి.

ప్రశ్న 2.
కృత్రిమ దారాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
రసాయనాల నుండి ఉత్పన్నమయ్యే దారాలు కృత్రిమ దారాలు లేదా సింథటిక్ దారాలు.
ఉదా : పాలిస్టర్, పాలిథీన్, నైలాన్, రేయాన్.

ప్రశ్న 3.
దారపు పోగు అంటే ఏమిటి?
జవాబు:
దారంలోని సన్నటి నిర్మాణాలను దారపు పోగు అంటారు.

ప్రశ్న 4.
నేత అంటే ఏమిటి?
జవాబు:
దారం నుండి బట్టల తయారీని నేయడం అంటారు.

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 5.
మీరు దుస్తుల నుండి ముడుతలను ఎలా తొలగించగలరు?
జవాబు:
ఇస్త్రీని ఉపయోగించడం ద్వారా దుస్తుల నుండి ముడుతలను తొలగించవచ్చు.

ప్రశ్న 6.
బట్టలు మనకు ఎలా ఉపయోగపడతాయి?
జవాబు:
వివిధ వాతావరణ పరిస్థితుల నుండి మనలను రక్షించుకోవడానికి కవచంగా బట్టలు ఉపయోగపడతాయి. వస్త్రాలు రక్షణతో పాటు అందం మరియు సంస్కృతి చిహ్నంగా కూడా ఉంటాయి.

ప్రశ్న 7.
బ్యానర్లు మరియు బుక్ బైండింగ్ తయారీలో ఏ దుస్తులు ఉపయోగించబడతాయి?
జవాబు:
కాలికో అనేవి బ్యానర్లు మరియు పుస్తక బైండింగ్ తయారీకి ఉపయోగించే ఒక రకమైన దుస్తులు.

ప్రశ్న 8.
ఏ నారను బంగారు దారాలు అంటారు?
జవాబు:
జనపనార (జ్యూట్)

ప్రశ్న 9.
భారతదేశంలో జనపనార ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
జవాబు:
పశ్చిమ బెంగాల్

ప్రశ్న 10.
పాలిథీన్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను ఎందుకు ఉపయోగించాలి?
జవాబు:
మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం పాలిథీన్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను ఉపయోగించాలి.

ప్రశ్న 11.
తక్కువ సమయంలో ఏరకమైన బట్టలు పొడిగా అవుతాయి?
జవాబు:
కృత్రిమ బట్టలు తక్కువ సమయంలో పొడిగా అవుతాయి.

ప్రశ్న 12.
పత్తికాయల నుండి విత్తనాలు ఎందుకు తొలగిస్తారు?
జవాబు:
పత్తికాయల నుండి పత్తి విత్తనాలు తీసివేసి, సమానంగా మరియు ఏకరీతిగా ఉండే దారాలు తయారు చేస్తారు.

ప్రశ్న 13.
దారం తయారీకి మనం దారపు పోగులను ఎందుకు మెలివేస్తాము?
జవాబు:
దారపు పోగులు చాలా సన్నగా మరియు బలహీనంగా ఉంటాయి. వాటిని గట్టిగా, మందంగా మరియు పొడవుగా ఉండేలా మనం వాటిని కలిపి మెలితిప్పుతాము.

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 14.
గోనె సంచులను తయారుచేయడానికి ఏ పదార్థం ఉపయోగించబడుతుంది. ఎందుకు?
జవాబు:
గోనె సంచులను తయారుచేయడానికి జనపనార దారాలు ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి బలంగా ఉంటాయి మరియు అధిక భారాన్ని భరిస్తాయి.

ప్రశ్న 15.
మగ్గాల రకాలు తెలపండి.
జవాబు:
మగ్గాలు రెండు రకాలు. అవి చేనేత మగ్గాలు, మర మగ్గాలు.

ప్రశ్న 16.
వడకటం కోసం ఉపయోగించే రెండు సాధారణ పరికరాల పేర్లు చెప్పండి.
జవాబు:
వడకటం కోసం ఉపయోగించే రెండు సాధారణ పరికరాలు తకిలి మరియు చరఖా.

ప్రశ్న 17.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో చరఖాను ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎవరు?
జవాబు:
మహాత్మా గాంధీ

ప్రశ్న 18.
భారతదేశంలో కొబ్బరి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవి?
జవాబు:
కొబ్బరి పరిశ్రమ ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉంది.

ప్రశ్న 19.
కలంకారి వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
జవాబు:
మచిలీపట్నం మరియు పెడన కలంకారి వస్త్రాలకు ప్రసిద్ది.

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 20.
కార్పెట్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది?
జవాబు:
మచిలీపట్నం

6th Class Science 8th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మీదుస్తులను కొనుగోలు చేసేటప్పుడు షాప్ కీపర్ల నుండి మీరు ఏ సందేహాలను నివృత్తి చేయాలనుకుంటున్నారు?
జవాబు:
ప్రశ్నలు :

  1. ఈ దుస్తులకు ఏ రకమైన వాషింగ్ అవసరం?
  2. ఇది శరీరం యొక్క చెమటను గ్రహిస్తుందా?
  3. వస్త్రం శరీరానికి బాగా గాలి ప్రవాహాన్ని అందిస్తుందా?
  4. వస్త్రం ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటుందా?

ప్రశ్న 2.
వివిధ రకాల బట్టలు ఎలా ఉపయోగపడతాయి?
జవాబు:
మన అవసరము మరియు ప్రయోజనాలు మనం ధరించాల్సిన దుస్తులను నిర్ణయిస్తాయి. వేసవిలో చెమటను పీల్చటానికి నూలు దుస్తులు బాగా సరిపడతాయి. చలికాలంలో ఉన్ని బట్టలు వెచ్చదనాన్ని ఇస్తాయి. వర్షాకాలంలో నీటిని పీల్చని క్యాన్వాయ్ దుస్తులు ఉపయోగపడతాయి. ముతక బట్టలను మ్యాపింగ్ చేయడానికి మరియు గోనె సంచులను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు కాని బట్టలు తయారు చేయడానికి కాదు. కర్టెన్ బట్టలు తయారీలో దృఢమైన సిల్క్ దారాలు వాడతారు. బ్యానర్లు మరియు బుక్ బైండింగ్ తయారీకి కాలికో దుస్తులు ఉపయోగిస్తారు.

ప్రశ్న 3.
మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ ఎక్కడ బాగా అభివృద్ధి చెందింది?
జవాబు:
చేనేత పరిశ్రమ మన రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందింది. వెంకటగిరి, నారాయణపేట, ‘ధర్మవరం, మంగళగిరి, కొత్త కోట వంటి ప్రదేశాలు చేనేత పరిశ్రమలకు ప్రసిద్ధి చెందాయి. పెడన మరియు మచిలీపట్నం కలంకారి పరిశ్రమకు ప్రసిద్ధి. మచిలీపట్నం కార్పెట్ పరిశ్రమకు కూడా ప్రసిద్ది చెందింది.

ప్రశ్న 4.
బాల కార్మికులు ఎక్కడ పని చేస్తున్నారు? వారిని ఎందుకు పనిలో పెట్టారు? బాల కార్మిక వ్యవస్థను ఎలా నిర్మూలించవచ్చు?
జవాబు:
పత్తి విస్తృతంగా పండించే వ్యవసాయ పనులలో బాల కార్మికులు పనిచేస్తున్నారు. పత్తి మొక్కల నుండి పరిపక్వమైన పత్తి కాయలను తీయడం కోసం పిల్లలని బాలకార్మికులుగా వాడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందటానికి వారిని బాల కార్మికులుగా ఉంచుతున్నారు. కొన్ని సంస్థలు బాల కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి మరియు వారిని తిరిగి పాఠశాలలకు పంపుతున్నాయి. వీరి తల్లిదండ్రులకు ఆర్థిక వెసులుబాటు కల్పించి, పిల్లలను బడికి పంపటం ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చు.

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 5.
కొబ్బరిపీచు యొక్క ఉపయోగాలు ఏమిటి?
జవాబు:
కొబ్బరిపీచు పరిశ్రమ భారతదేశంలోని గ్రామీణ పరిశ్రమలలో ఒకటి. కొబ్బరి పీచు ఇప్పటికీ వ్యవసాయ మరియు దేశీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. దీనిని నేలకోత నియంత్రణలో వాడవచ్చు. గోధుమ రంగు కొబ్బరి పీచును బ్రష్ లు, డోర్ మాట్లు, దుప్పట్లు మరియు బస్తాల తయారీకి ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
అన్ని అవసరాలకు ఒకే రకమైన దుస్తులు వాడవచ్చా?
జవాబు:
లేదు. మనం నివసించే ప్రాంతం బట్టి, ఋతువులు బట్టి మన అవసరాలకు అనువైన బట్టలు వాడవలసి ఉంటుంది. జనపనార గట్టిగా ఉన్నప్పటికి సంచుల తయారీకి వాడతాము కానీ దుస్తుల తయారీకి కాదు. ఇంట్లో కరెనకు, డోర్యా లకు, టేబుల్ క్లాత్ కు వేరు వేరు దుస్తులు వాడవలసి ఉంటుంది. శీతాకాలంలో ఉన్ని దుస్తులను, వేసవికాలంలో నూలు దుస్తులు వాడటం వలన మనకు కూడా సౌకర్యంగా ఉంటుంది.

ప్రశ్న 7.
ప్రాచీన కాలంలో మానవులు ఉపయోగించే వివిధ బట్టలు ఏమిటి?
జవాబు:
పురాతన కాలంలో మానవుడు జంతువుల చర్మాలను మరియు మొక్కల ఆకులను, చెట్ల బెరడులను బట్టలుగా ఉపయోగించారు. యుద్దాల సమయంలో ధరించే లోహపు జాకెట్ తయారీకి లోహాలు వాడేవారు. చారిత్రక సంగ్రహాలయాలలో మరియు టెలివిజన్ షోలలో ఇలాంటి వస్త్రాలను మీరు చూడవచ్చు.

ప్రశ్న 8.
గన్నీ సంచుల ఉపయోగాలు ఏమిటి?
జవాబు:
వరి, మిరప వంటి వాణిజ్య పంటలు గోనె సంచులలో నింపుతారు. ఈ సంచులు ముతక జనపనార బట్టతో తయారవుతాయి. ఈ సంచులు ఎక్కువ పదార్థాలను తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి దృఢంగా ఉండి అధిక మన్నిక కల్గి ఉండుట వలన పంట నిల్వలో బాగా వాడతాము.

ప్రశ్న 9.
మీరు పత్తి కాయ నుండి బలమైన దారంను ఎలా తయారు చేస్తారు? మీరు చేసే కృత్యంను వివరించండి.
జవాబు:
పత్తి నుండి మనం తయారుచేసే దారం చేయడానికి ఉపయోగపడేంత బలంగా ఉండదు. పత్తి పోగుల నుండి బలమైన దారం పొందడానికి, పాత రోజుల నుండి స్పిన్నింగ్ లేదా వడకటం కోసం తకిలి అనే పరికరం ఉపయోగించబడింది. చరఖాను దారం తయారీకి ఉపయోగించారు. దారపు పోగు నుండి దారం తయారీ ప్రక్రియను స్పిన్నింగ్ అంటారు. ఇలా వడికిన దారాన్ని రసాయనాలతో చర్యనొందించటం వలన దారం గట్టి తనం పెరుగుతుంది.
AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 1

ప్రశ్న 10.
దుస్తులు ఎలా తయారు చేస్తారు?
జవాబు:
పోగుల నుండి తయారుచేసిన దారం దుస్తులు తయారీకి ఉపయోగిస్తారు. దుస్తులు నేయడానికి ఒక మగ్గంలో నిలువు మరియు క్షితిజ సమాంతర వరుసలలో దారం అమర్చి నేత నేస్తారు. నేతకు యంత్రాలను ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున దుస్తుల తయారీ జరుగుతుంది. దారాల నుండి దుస్తులు తయారు చేయడాన్ని నేయడం అంటారు. నేతకు చేతి మగ్గాలూ లేదా యంత్రాలను వాడతారు.
AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 2

ప్రశ్న 11.
నూలు దారంను ఎలా తయారు చేస్తారు?
జవాబు:
పత్తిని సాధారణంగా చేతులతో తీస్తారు. తరువాత పత్తిని విత్తనాల నుండి వేరు చేస్తారు. ఈ ప్రక్రియను “జిన్నింగ్” అంటారు. జిన్నింగ్ వలన పత్తి, విత్తనాలు వేరయి పత్తి పోగులు లభిస్తాయి. ఈ పత్తి పోగులను శుభ్రంగా కడిగి, దువ్వటం జరుగుతుంది. దువ్విన తరువాత వడికి పత్తి దారం తయారు చేస్తారు.

ప్రశ్న 12.
జనపనార దారంను ఎలా పొందుతారు?
జవాబు:
జనపనార, జనుము మొక్క యొక్క కాండం నుండి లభిస్తుంది. జనుము మొక్క కాండం కత్తిరించి కొన్ని రోజులు నీటిలో నానబెడతారు. కాండం నీటిలో నానబెట్టినప్పుడు అది కుళ్ళిపోతుంది మరియు పై బెరడు వదులు అవుతుంది. అప్పుడు నారను కాండం నుండి వేరు చేస్తారు.

ప్రశ్న 13.
మనం జనపనార దారంను ఎక్కడ ఉపయోగిస్తాము?
జవాబు:
వరి, మిరపకాయ మరియు ఇతర వాణిజ్య పంటలను గోనె సంచులలో ప్యాక్ చేస్తారు. ఈ రకమైన అన్ని సంచులు ముతక జనపనార బట్టతో తయారు చేయబడతాయి. ఈ సంచులు. భారీ పదార్థాలను తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటాయి. జనపనార మొక్క యొక్క కాండం నుండి జనపనార లభిస్తుంది.

ప్రశ్న 14.
మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ ఎక్కడ ఉంది?
జవాబు:
చేనేత పరిశ్రమ మన రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందింది. ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి వంటి ప్రదేశాలు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి. కలంకారి అనేది వస్త్రాలపై చేతితో ముద్రించే అద్దకపు కళ. మచిలీపట్నం, పెడన కలంకారికి ప్రసిద్ధి. మచిలీపట్నం కార్పెట్ పరిశ్రమకు కూడా ప్రసిద్ది చెందింది.

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 15.
కొబ్బరి పరిశ్రమ గురించి రాయండి.
జవాబు:
కొబ్బరి పీచు పరిశ్రమ భారతదేశంలోని గ్రామీణ పరిశ్రమలలో ఒకటి. ఇది ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 5 లక్షల మంది చేతివృత్తులవారికి ఆదాయ వనరులను అందిస్తుంది. కొబ్బరి పీచు పరిశ్రమలో, శ్రామిక శక్తిలో 80% మహిళలు ఉన్నారు.

ప్రశ్న 16.
కొబ్బరి ఉత్పత్తుల గురించి ఫ్లో చార్ట్ రాయండి.
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 3

ప్రశ్న 17.
కొబ్బరి పీచు ఉపయోగాలు తెలపండి.
జవాబు:
పురాతన కాలం నుండి కొబ్బరి నారను వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు. దీనిని ఇప్పటికీ వ్యవసాయ మరియు దేశీయ ప్రయోజనాల కోసం వాడుతున్నాము. దీనిని కొండచరియలు లేదా నేల కోతను నియంత్రించడానికి . ఉపయోగిస్తారు. కొబ్బరి నారను పుట్టగొడుగులను పెంచడానికి ఒక ఉపరితలంగా కూడా ఉపయోగిస్తారు. గోధుమరంగు కొబ్బరి నారను బ్రషన్లు, డోర్మాట్లు, దుప్పట్లు మరియు బస్తాల తయారీకి ఉపయోగిస్తారు.

ప్రశ్న 18.
దారాలలోని రకాలు ఏమిటి?
జవాబు:
పత్తి, జనపనార వంటి కొన్ని బట్టల దారాలు మొక్కల నుండి పొందబడతాయి. పట్టు మరియు ఉన్ని జంతువుల నుండి పొందబడతాయి. మొక్కలు మరియు జంతువుల నుండి పొందిన దారాలు సహజ దారాలు. ఈ రోజుల్లో, బట్టలు పాలిస్టర్, టెరిలీన్, నైలాన్, యాక్రిలిక్ వంటి రసాయనికంగా అభివృద్ధి చెందిన దారంతో కూడా తయారవుతున్నాయి. వీటిని కృత్రిమ దారాలు అంటారు.

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

ప్రశ్న 19.
ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను ఎందుకు ఉపయోగించాలి?
జవాబు:
మనమందరం వివిధ ప్రయోజనాల కోసం పాలిథీన్ సంచులను ఉపయోగిస్తాము. పాలిథీన్ కుళ్ళిపోవడం చాలా కష్టం. ఇది భూమిలో కలవటానికి లక్షల యేళ్ళు పడుతుంది. మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి పాలిథీన్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను వాడాలి.

6th Class Science 8th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పత్తి దారాలు ఎలా తయారు చేస్తారు?
జవాబు:
ఇల్లు లేదా పత్తి పొలాల దగ్గర నుండి కొన్ని పత్తి కాయలను సేకరించండి. పత్తి నుండి విత్తనాలను తొలగించి, పత్తిని వేరు చేయండి. ఒక చిన్న పత్తి ముక్క తీసుకొని సూక్ష్మదర్శిని క్రింద గమనించండి. పోగులు అని పిలువబడే చిన్న చిన్న వెంట్రుకల నిర్మాణాలను మనం గమనిస్తాము. పత్తి నుండి విత్తనాలను తొలగించడం జిన్నింగ్ అంటారు. ఈ దారపు పోగులు, కడగటం మరియ దువ్వటం వలన శుభ్రం చేయబడతాయి. ఈ దారపు పోగులను మెలితిప్పి దారం తయారు చేస్తారు. ఇప్పుడు ఈ దారాలకు రంగులు వేసి రసాయనాలతో పూత పూస్తారు. అందువల్ల దారాలు బట్టలు తయారుచేసేంత బలంగా తయారవుతాయి.
AP Board 6th Class Science Solutions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 2AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 1

ప్రశ్న 2.
వస్త్రాలలోని దారాలను ఎలా గుర్తించాలి? ఆ విధానాన్ని వివరించండి.
జవాబు:
ఏదైనా ఒక గుడ్డ ముక్కను తీసుకోండి. భూతద్దము సహాయంతో గుడ్డను పరిశీలించండి. దాని నుండి దారాన్ని ఒక్కొక్కటిగా లాగండి. ఒక దారం తీసుకొని, దాని చివరను నలిపి, భూతద్దం ద్వారా గమనించండి. దారపు పోగులు అని పిలువబడే చిన్న చిన్న పొడవైన నిర్మాణాలను మనం గమనించవచ్చు. ఈ దారపు పోగులు అన్నీ కలిసి దారంను ఏర్పరుస్తాయి. ఈ దారంను చేతి మగ్గాలు లేదా మర మగ్గాల మీద అల్లటం ద్వారా నేత కార్మికులు నూలు బట్టలు తయారు చేస్తున్నారు.

ప్రశ్న 3.
దుస్తుల ఎంపికలో ఉన్న అంశాలు ఏమిటి?
జవాబు:
బట్టలు వేర్వేరు వాతావరణ పరిస్థితుల నుండి మనలను రక్షిస్తాయి. వస్త్రాలు రక్షణతో పాటు అందం మరియు హోదాకు చిహ్నంగా కూడా ఉంటాయి. దుస్తుల ఎంపిక వ్యక్తికి, వ్యక్తికి మారవచ్చు. కొందరు కాంతి, సన్నని, మెరిసే బట్టలతో చేసిన బట్టలు ధరించడానికి ఇష్టపడవచ్చు. మరొక వ్యక్తి ప్రకాశవంతమైన రంగు మరియు నూలు బట్టతో చేసిన బట్టలు ధరించడానికి ఇష్టపడవచ్చు. ఋతువులను బట్టి ధరించే దుస్తులు భిన్నంగా ఉండవచ్చు. దుస్తుల ఎంపికలో వ్యక్తిగత ఆసక్తి , యజమాని యొక్క వ్యక్తిత్వం మరియు దుస్తుల ఖర్చు వంటివి ముఖ్యమైన అంశాలు.

ప్రశ్న 4.
కొబ్బరి ఆకులతో మీరు చాపను ఎలా తయారు చేస్తారు?
జవాబు:
కొబ్బరి ఆకులు లేదా రెండు రంగు కాగితపు కుట్లు తీసుకోండి. ఆకు రెండు భాగాలను పొందడానికి ఆకు మధ్య ఈనెను కత్తిరించి తొలగించండి. ఇప్పుడు ఈ ఆకులను ఒకదానికొకటి సమాంతరంగా ఉంచండి. మరో ఆకును . తీసుకొని పేర్చిన ఆకులు ఒకసారి కిందకు ఒకసారి . పైకి వచ్చే విధంగా అమర్చండి. చివరగా మీకు చదునైన చాప తయారు అవుతుంది. ఇదే చాపను తయారుచేసే మార్గం.

ప్రశ్న 5.
గోనె సంచి దారంలో మీరు ఏమి గమనిస్తారు? జనపనార దారంను ఇతర దారంతో పోల్చండి.
జవాబు:
గోనె సంచుల నుండి దారం తీసివేసి, భూతద్దం క్రింద గమనించండి. దారంలో సన్నని తంతువులను చూస్తాము. వీటిని మనం పత్తి దారాలతో సరిపోల్చవచ్చు. గోంగూర మరియు వెదురు నుండి కూడా దారాలు తయారవుతాయి. జనపనార కూడా మొక్కల దారాలు. వీటిని బట్టలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు, కాని పత్తితో పోలిస్తే తక్కువ. పత్తిలాగే జనుము దారాలు నేయటానికి ఉపయోగపడతాయి. జనుము దారాలను “బంగారు దారాలు” అని కూడా అంటారు. జనపనార బట్టలు నూలు దుస్తులు వలె ఉండవు, ఇవి గట్టిగా మరియు గరుకుగా ఉంటాయి.

ప్రశ్న 6.
ప్రజలు మారుతున్న ఋతువులు ప్రకారం దుస్తులు ధరిస్తారు. మారుతున్న ఋతువులకు భూమి పరిభ్రమణం కారణం. ఋతువులు, దుస్తులకు సంబంధించిన కింది పట్టికను పూర్తి చేయండి.
AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 4
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 5

AP Board 6th Class Science 8th Lesson 1 Mark Bits Questions and Answers దుస్తులు ఎలా తయారవుతాయి

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. మొక్కలు మరియు జంతువుల నుండి పొందిన దారాలను ………. దారాలు అంటారు.
A) కృత్రిమ
B) సింథటిక్
C) సహజ
D) పైవన్నీ
జవాబు:
C) సహజ

2. పత్తి దారం దేని నుండి లభిస్తుంది?
A) జనపనార
B) పత్తి
C) కొబ్బరి
D) వేరుశెనగ
జవాబు:
B) పత్తి

3. గాంధీజీ ఏ రకమైన వస్త్రాల వాడుకకు ప్రాధాన్యత ఇచ్చారు?
A) ఖాదీ
B) సిల్క్
C) ఉన్ని
D) పాలిస్టర్
జవాబు:
A) ఖాదీ

4. గన్నీ సంచులు దేనితో తయారు చేయబడతాయి?
A) కొబ్బరి
B) కాటన్
C) జనపనార
D) వేరుశనగ
జవాబు:
C) జనపనార

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

5. మంగళగిరి ఏ పరిశ్రమకు ప్రసిద్ది చెందింది?
A) కలంకారి
B) హస్తకళలు
C) తివాచీలు
D) చేనేత వస్త్రాలు
జవాబు:
D) చేనేత వస్త్రాలు

6. ఏ పట్టణం కార్పెట్ పరిశ్రమకు ప్రసిద్ధి?
A) మచిలీపట్నం
B) మంగళగిరి
C) పాండూరు
D) ధర్మవరం
జవాబు:
A) మచిలీపట్నం

7. పాలిస్టర్ దేనితో తయారు చేయబడుతుంది?
A) ఈథేన్
B) ఆల్కహాల్
C) యాసిడ్
D) పెట్రోలియం
జవాబు:
D) పెట్రోలియం

8. దేని వెంట్రుకలతో వెచ్చని బటలు తయారు చేసారు?
A) పట్టు పురుగు
B) అడవి దున్న
C) పంది
D) ఆవు
జవాబు:
B) అడవి దున్న

9. భిన్నమైన దాన్ని ఎంచుకోండి.
A) సిల్క్
B) ఉన్ని
C) కాటన్
D) పాలిస్టర్
జవాబు:
D) పాలిస్టర్

10. కింది వాటిలో ఏది సహజ దారం?
A) పట్టు
B) నైలాన్
C) రేయాన్
D) ఏదీ కాదు
జవాబు:
A) పట్టు

11. పత్తి పోగులను దాని విత్తనాల నుండి వేరు చేయడం
A) నేత
B) జిన్నింగ్
C) అల్లడం
D) వడకటం
జవాబు:
B) జిన్నింగ్

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

12. సరైన క్రమాన్ని ఎంచుకోండి.
A) దారపు పోగు → ఫ్యాబ్రిక్ → దారం
B) దారం → దుస్తులు → దారపు పోగు
C) దుస్తులు → దారం → దారపు పోగు
D) దారపు పోగు → దారం → దుస్తులు
జవాబు:
D) దారపు పోగు → దారం → దుస్తులు

13. కొబ్బరి పీచును దేని తయారీకి ఉపయోగిస్తారు?
A) చొక్కాలు
B) చీరలు
C) డోర్ మాట్స్
D) పైవన్నీ
జవాబు:
C) డోర్ మాట్స్

14. పాత రోజులలో యుద్ధ సైనికులు ఏ బట్టలు ఉపయోగించారు?
A) లోహపు
B) ఉన్ని
C) నైలాన్
D) పాలిస్టర్
జవాబు:
A) లోహపు

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

15. ఏ పదార్ధం భూమిలో కుళ్ళిపోవటం చాలా కష్టం?
A) కాటన్
B) జనపనార
C) ఉన్ని
D) పాలిథీన్
జవాబు:
D) పాలిథీన్

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. పత్తిలోని చిన్న చిన్న దారాలను ……. అంటారు.
2. పత్తి …………… నేలల్లో పెరుగుతుంది.
3. పుస్తక బైండింగ్ లో ……………………… దుస్తులు ఉపయోగిస్తారు.
4. మచిలీపట్నం ………… పరిశ్రమకు ప్రసిద్ధి.
5. ……………. పత్తి త్రిప్పడానికి ఉపయోగించే పరికరం.
6. భారతదేశంలో ……….. రాష్ట్రం జనపనారను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది.
7. కొబ్బరి నార ………… చెట్టు నుండి ఉత్పత్తి అవుతోంది.
8. వేసవి కాలంలో ……….. బట్టలు వాడతారు.
9. దారపు పోగు(పీచు) → ……… → దుస్తులు.
10. పత్తి కాయలనుండి విత్తనాలను తొలగించే ప్రక్రియను ……………… అంటారు.
జవాబు:

  1. దారపు పోగు లేదా పత్తి పీచు దారాలు
  2. నల్ల రేగడి
  3. కాలికో
  4. కలంకారి
  5. తకిలి
  6. పశ్చిమ బెంగాల్
  7. కొబ్బరి
  8. కాటన్
  9. దారం
  10. జిన్నింగ్ (వేరు చేయటం)

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – AGroup- B
ఎ) పత్తి1) జనుము యొక్క కాండం
బి) పట్టు2) పత్తి కాయ
సి) ఉన్ని3) పెట్రోలియం
డి) జనపనార4) పట్టు పురుగు
ఇ) పాలిస్టర్5) గొర్రెలు

జవాబు:

Group – AGroup- B
ఎ) పత్తి2) పత్తి కాయ
బి) పట్టు4) పట్టు పురుగు
సి) ఉన్ని5) గొర్రెలు
డి) జనపనార1) జనుము యొక్క కాండం
ఇ) పాలిస్టర్3) పెట్రోలియం

2.

Group – AGroup – B
ఎ) దుస్తులు1) చిన్న తంతువులు
బి) జిన్నింగ్2) దారం నుండి నేసినది.
సి) దారపు పీచు3) విత్తనాలను తొలగించే ప్రక్రియ
డి) కాలికో4) దారపు పోగు నుండి దారం తయారీ
ఇ) స్పిన్నింగ్5) బుక్ బైండింగ్లో ఉపయోగించే బట్ట

జవాబు:

Group – AGroup – B
ఎ) దుస్తులు2) దారం నుండి నేసినది.
బి) జిన్నింగ్3) విత్తనాలను తొలగించే ప్రక్రియ
సి) దారపు పీచు1) చిన్న తంతువులు
డి) కాలికో5) బుక్ బైండింగ్లో ఉపయోగించే బట్ట
ఇ) స్పిన్నింగ్4) దారపు పోగు నుండి దారం తయారీ

3.

Group – AGroup – B
ఎ) జనపనార1) కాలికో
బి) పి.వి.సి2) పత్తి కాయ
సి) ప్యాంటు3) బంగారు దారపు పోగు
డి) బుక్ బైండింగ్4) కృత్రిమ దారం

జవాబు:

Group – AGroup – B
ఎ) జనపనార3) బంగారు దారపు పోగు
బి) పి.వి.సి4) కృత్రిమ దారం
సి) ప్యాంటు2) పత్తి కాయ
డి) బుక్ బైండింగ్1) కాలికో

మీకు తెలుసా?

→ మీ పుస్తకాల సంచి తయారుచేయడానికి ఉపయోగించే గుడ్డ ప్రత్యేకంగా ఉంటుంది. దుస్తుల తయారీకే కాకుండా జెండాలు, బ్యానర్లు, కిటికీ తెరలు, పుస్తకాల బైండింగ్లలో కూడా రకరకాల గుడ్డలను ఉపయోగిస్తారు. పుస్తకాల బైండింగ్ లో ఉపయోగించే గుడ్డను “కాలికో” అంటారు.

→ ఆది మానవులు చెట్ల ఆకులు, బెరళ్లు, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు ” కదా ! పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తులు తయారుచేసేవారు. యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుము లాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు. ఇలాంటి దుస్తులను చారిత్రక వస్తు ప్రదర్శనశాలలలోనూ, టెలివిజన్ కార్యక్రమాలలోనూ చూడవచ్చు.
AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 6

→ మన రాష్ట్రంలో పత్తి విస్తారంగా పండుతుంది. పొలాలలో పత్తికాయలు కోయడంలో పిల్లలతో పని చేయిస్తుంటారు. ఇలా బాల కార్మికులుగా మారుతున్న పిల్లలను కాపాడడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. పిల్లలు బలవంతంగా ఎందుకు బాల కార్మికులుగా మారుతున్నారో ఆలోచించండి. పరిష్కారాలు సూచించండి.

→ భారతదేశంలో జనపనార పంట ఎక్కువగా ఏడు రాష్ట్రాలలో పండిస్తారు. అవి పశ్చిమ బంగ, అసోం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, త్రిపుర మరియు మేఘాలయ ఒక్క పశ్చిమ బంగ రాష్ట్రం నందే 50% పైగా జనపనార ఉత్పత్తి అవుతుంది.

AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి

→ మనమంతా వివిధ రకాల అవసరాల కోసం పాలిథీన్ సంచులను ఉపయోగిస్తాం. పాలిథీన్ సంచులు విచ్ఛిన్నమయి మట్టిలో కలిసిపోవు. మనం పర్యావరణాన్ని రక్షించాలంటే పాలిథీన్ సంచులకు బదులుగా సహజ దారాలతో తయారయిన సంచులను వాడాలి.
AP 6th Class Science Important Questions Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి 7

AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం

These AP 6th Class Science Important Questions 7th Lesson కొలుద్దాం will help students prepare well for the exams.

AP Board 6th Class Science 7th Lesson Important Questions and Answers కొలుద్దాం

6th Class Science 7th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కొలత యొక్క సంప్రదాయ పద్ధతులు ఏమిటి?
జవాబు:
కొలత యొక్క సంప్రదాయ పద్ధతులు అడుగు, జాన మరియు మూర.

ప్రశ్న 2.
పొడవుకు ప్రమాణం ఏమిటి?
జవాబు:
మీటర్ పొడవు యొక్క ప్రమాణం.

ప్రశ్న 3.
వైశాల్యం యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు:
చదరపు సెంటీమీటర్² (సెం.మీ.²) వైశాల్యం యొక్క ప్రమాణం.

ప్రశ్న 4.
ద్రవాల ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి?
జవాబు:
కొలజాడీ ద్రవాల ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం.

AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం

ప్రశ్న 5.
గజం అంటే ఏమిటి?
జవాబు:
మన యొక్క ముక్కు చివర నుండి చేతి మధ్య వేలు వరకు ఉండే దూరాన్ని గజం అంటారు.

ప్రశ్న 6.
మొదటి మీటర్ స్కేల్ ను ఎవరు చేశారు? ఇప్పుడు అది ఎక్కడ ఉంది?
జవాబు:
ఫ్రాన్స్ దేశస్థులు మొదటి మీటర్ స్కేల్ ను తయారు చేశారు. ఇప్పుడు అది ఫ్రాన్స్ మ్యూజియంలో ఉంది.

ప్రశ్న 7.
స్కేల్ చేయడానికి ఫ్రాన్స్ ఏ పదార్థంను ఉపయోగించింది?
జవాబు:
ప్లాటినం మరియు ఇరిడియం లోహాల మిశ్రమాన్ని మీటర్ స్కేల్ చేయడానికి ఫ్రాన్స్ ఉపయోగించింది.

ప్రశ్న 8.
పొడవును కొలవడానికి మన దైనందిన జీవితంలో ఉపయోగించిన సాధనాలు ఏమిటి?
జవాబు:
మనం సాధారణ టేప్, చుట్టుకొనే టేప్, చెక్క ప్లాస్టిక్ మరియు లోహాలతో చేసిన వివిధ స్కేల్ లను ఉపయోగిస్తాము.

ప్రశ్న 9.
వక్రమార్గాన్ని కలిగిన వస్తువులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బకెట్ మరియు తవ్వ వంటి వంట పాత్రల చుట్టుకొలతలు వక్రమార్గాలకు ఉదాహరణ.

ప్రశ్న 10.
గుంటూరు నుండి విశాఖపట్నం మధ్య దూరాన్ని కొలవడానికి అనుకూలమైన ప్రమాణం ఏది?
జవాబు:
కిలోమీటర్ ఎక్కువ దూరాలను కొలవడానికి తగిన ప్రమాణం.

AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం

ప్రశ్న 11.
మూరను పొడవు యొక్క ప్రామాణిక ప్రమాణంగా ఎందుకు తీసుకోరు?
జవాబు:
మూర విశ్వసనీయమైన ప్రమాణం కాదు. ఎందుకంటే చేతి లేదా మూర పొడవు ప్రజలందరికీ సమానం కాదు.

ప్రశ్న 12.
క్యూబ్ లేదా ఘన.సెం.మీ. అంటే ఏమిటి?
జవాబు:
క్యూబ్ అనగా 1 సెం.మీ పొడవు, 1 సెం.మీ వెడల్పు మరియు 1 సెం.మీ ఎత్తు యొక్క కొలత. ఇది ఘన ఆ పరిమాణాన్ని చూపిస్తుంది.

ప్రశ్న 13.
వక్రరేఖ యొక్క పొడవును కొలవడానికి మనం ఏ పరికరం ఉపయోగిస్తాము?
జవాబు:
వక్ర రేఖ యొక్క పొడవును కొలవడానికి మనం దారం మరియు స్కేలును ఉపయోగిస్తాము.

ప్రశ్న 14.
ఎక్కువ దూరాన్ని ఎలా కొలుస్తారు?
జవాబు:
అధిక దూరాన్ని కిలోమీటర్ల ద్వారా కొలుస్తారు.
1 కిలోమీటర్ = 1000 మీటర్లు.

ప్రశ్న 15.
రాము ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం 2500 మీటర్లు. ఈ దూరాన్ని కిలోమీటర్లకు మార్చండి.
జవాబు:
1 కిలోమీటర్ = 1000 మీటర్లు ⇒ 2500 కి.మీ. = 2500/1000 = 2.5 కి.మీ.

ప్రశ్న 16.
మి.లీ. మరియు మీ³ మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
1 మి.లీ = సెం.మీ³

ప్రశ్న 17.
వైర్ల మందాన్ని కొలవటానికి ప్రమాణం ఏమిటి?
జవాబు:
మిల్లీ మీటర్లు

ప్రశ్న 18.
పాలు మరియు ద్రవాల పరిమాణాలను కొలవడానికి ఏ సాధనాలను ఉపయోగిస్తారు?
జవాబు:
కొలజాడీ లేదా కొలపాత్ర

ప్రశ్న 19.
క్రమరహిత ఉపరితలం యొక్క వైశాల్యం కొలవడానికి ఏ సాధనాలను ఉపయోగిస్తారు?
జవాబు:
గ్రాఫ్ పేపర్

ప్రశ్న 20.
ద్రవాల ఘనపరిమాణాన్ని కొలిచే ప్రామాణిక ప్రమాణం ఏమిటి?
జవాబు:
ద్రవాల ఘనపరిమాణాన్ని కొలిచే ప్రామాణిక ప్రమాణం మి.లీ.

ప్రశ్న 21.
మీరు వదులుగా ఉండే ఘనపదార్థాల ఘనపరిమాణాన్ని కొలవగలరా?
జవాబు:
అవును. మనం ఇసుక, కంకర వంటి వదులుగా ఉండే ఘనపదార్థాల ఘనపరిమాణాన్ని కొలవగలము.

AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం

ప్రశ్న 22.
ఘనపరిమాణం యొక్క ప్రామాణిక ప్రమాణం ఏమిటి?
జవాబు:
ఘన సెం.మీ³ ఘనపరిమాణం యొక్క ప్రామాణిక ప్రమాణం.

6th Class Science 7th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రాచీన కాలంలో గజం దూరం ఎలా నిర్ణయించబడింది?
జవాబు:

  1. ప్రాచీన కాలంలో వారి దేశపు రాజు ముక్కు నుండి మధ్య వేలు చివరకు గల దూరాన్ని వారు ‘గజం’ అని పిలిచారు.
  2. గజం మూడు సమాన భాగాలుగా విభజించబడింది మరియు ప్రతి భాగాన్ని ‘అడుగు’గా పిలుస్తారు.
  3. ప్రతి అడుగును ‘అంగుళాలు’ అని పిలువబడే పన్నెండు సమాన భాగాలుగా విభజించారు.
  4. ప్రతి అంగుళాన్ని కూడా చిన్న భాగాలుగా విభజించి కొలతలు కొలుస్తారు.

ప్రశ్న 2.
పొడవులను కొలవడానికి అంతర్జాతీయంగా ఆమోదించబడిన పరికరాన్ని ఎందుకు అభివృద్ధి చేయవలసి వచ్చింది?
జవాబు:
ప్రతి దేశానికి వారి సొంత స్కేల్ అమలులో ఉంది, ఇది ఇతర దేశాలకు భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది వాణిజ్యానికి మరియు వాణిజ్య లావాదేవీలలో చాలా సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉమ్మడి స్కేలు ప్రారంభించాలని నిర్ణయించారు. చివరగా ఫ్రాన్స్ లో ఒక ప్రత్యేక పదార్థంతో (ప్లాటినం – ఇరిడియం) తయారు చేసిన రాడ్ యొక్క నిర్దిష్ట పొడవును మీటర్ గా నిర్ణయించారు. ఇది అంతర్జాతీయంగా పొడవుకు ప్రమాణంగా అంగీకరించబడింది.

ప్రశ్న 3.
పొడవు యొక్క ప్రామాణిక ప్రమాణం ఏమిటి? దీన్ని చిన్న యూనిట్లుగా ఎలా విభజించారు?
జవాబు:
‘మీటర్’ పొడవు యొక్క ప్రామాణిక ప్రమాణం. సెంటీమీటర్ మరియు మిల్లీమీటర్లు పొడవు యొక్క చిన్న ప్రమాణాలు.
AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం 1
1 మీటర్ (1 మీ) = 100 సెంటీ మీటర్లు (100 సెం.మీ)
1 సెంటీ మీటర్ (1 సెం.మీ) = 10 మిల్లీ మీటర్లు (10 మి.మీ)

ప్రశ్న 4.
కొలపాత్రను వర్ణించండి. ఇవి ఎక్కడ ఉపయోగించబడతాయి?
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం 2
ఇది స్థూపాకారంలో ఉంటుంది. దానిమీద కొలతలు గుర్తించి ఉంటాయి. వీటిని ప్రయోగశాలలో రకరకాల ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి ఉపయోగిస్తారు. అలాగే దుకాణదారు పాలు, నూనె, మొదలైన ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి కొలపాత్రలను ఉపయోగిస్తాడు. ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి వీటిని ద్రవంతో నింపిన తరవాత ద్రవం పుటాకార తలానికి కచ్చితంగా కింద ఉండే గుర్తును చూస్తారు. ఇలా చూసేటప్పుడు మన కళ్ళను ఈ గుర్తు వెంబడి ఉండేలా తీసుకువచ్చి, ఆ గుర్తు వద్ద ఉన్న గీతను నమోదు చేస్తాం.

ప్రశ్న 5.
నాణేల మందాన్ని ఎలా కొలుస్తారు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 7 కొలుద్దాం 3

  • ఒకే పరిమాణంలో ఉన్న రూపాయి నాణేలను 10 తీసుకొని ఒకదానిపై ఒకటి ఉంచండి.
  • వాటి మొత్తం మందాన్ని(ఎత్తును) స్కేల్ లో కొలవండి.
  • ఆపై నాణెం యొక్క మందాన్ని తెలుసుకోవటానికి ఆ ఎత్తును సంఖ్య నాణేలతో భాగించండి.
  • వచ్చిన విలువ నాణెం మందాన్ని సూచిస్తుంది.

ప్రశ్న 6.
సాధారణంగా మనుషుల ఎత్తును 1.85 మీ. గా వ్రాస్తూ ఉంటారు. దీన్ని సెం.మీలోకి మరియు మి.మీ లోకి మార్చండి.
జవాబు:
వ్యక్తి ఎత్తు 1.85 మీ.
1 మీటర్ = 100 సెం.మీ.
1.85 మీ = 1. 85 మీ × 100 = 185 సెం.మీ.
1 మీటర్ = 1000 మి.మీ.
1.85 మీ =1.85 × 1000 మి.మీ. = 1850 మి.మీ.

ప్రశ్న 7.
దుస్తుల పొడవును కొలవడానికి మీటర్ స్కేల్ ను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
మీటర్ స్కేల్ అంతర్జాతీయంగా ఆమోదించబడిన, పొడవును కొలిచే పరికరం. అంతర్జాతీయంగా ఒకే ప్రమాణం వాడటం వలన వర్తకాలు మరియు వాణిజ్యంలో చాలా సమస్యలు పరిష్కరింపబడ్డాయి. మీటర్ పొడవు, ప్రపంచంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది.

AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం

ప్రశ్న 8.
మల్లె పువ్వుల మాల కొలిచేందుకు మహిళలు తమ చేతులను ఎందుకు ఉపయోగించారు?
జవాబు:
మల్లె పువ్వుల మాల కొలవడంలో ఖచ్చితత్వం అంత ముఖ్యం కాదు. వీటి ధర తక్కువ కాబట్టి ఖచ్చితత్వంను అనంతరం పట్టించుకోరు. కాబట్టి పూలమాల కొలవటంలో మూరను వాడటం వలన సమస్య లేదు. ఇది కూడా మన దేశం యొక్క సంప్రదాయ పద్ధతి. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది.

ప్రశ్న 9.
ఘనపరిమాణంను నిర్వచించండి. దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
ఘనపరిమాణం అంటే ఒక వస్తువు ఆక్రమించిన స్థలం. ద్రవాల ఘనపరిమాణాన్ని కొలవడంతో పాటు ఇసుక మరియు బంకమట్టి వంటి ఘనపదార్థాల పరిమాణాలను కూడా కొలుస్తాము. పాలు, కిరోసిన్ మరియు నూనె వంటి ద్రవాల ఘనపరిమాణాన్ని కొలవడానికి కొలపాత్రను ఉపయోగిస్తాము. ద్రవాల ఘనపరిమాణం లీటర్లలో లేదా మి.లీ.లలో కొలుస్తారు.

ప్రశ్న 10.
మీటర్ స్కేల్ ఎలా రూపొందించబడింది? మరియు దాని ఉపయూనిట్లు ఏమిటి? ఇది ఎక్కడ భద్రపరచబడింది?
జవాబు:
ఫ్రాన్స్ లో ఒక ప్రత్యేకమైన పదార్థం (ప్లాటినం-ఇరిడియం మిశ్రమం)తో తయారు చేసిన రాడ్ యొక్క నిర్దిష్ట పొడవును మీటర్ అని పిలుస్తారు. మీటరు 100 సమాన భాగాలుగా సెంటీమీటర్ విభజించారు. ప్రతి సెంటీమీటరు మిల్లీమీటర్ అని పిలిచే పది సమాన భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనం దీన్ని ప్రపంచవ్యాప్తంగా పొడవు కోసం ప్రామాణిక కొలతగా ఉపయోగిస్తున్నాము. ఈ స్కేల్ ఫ్రాన్స్ లోని మ్యూజియంలో భద్రపరచబడింది.

ప్రశ్న 11.
మీటర్ స్కేల్ తో పొడవును కచ్చితంగా ఎలా కొలుస్తావు?
జవాబు:
నిజ జీవితంలో మనం చెక్కతో లేదా ప్లాస్టిక్ తో చేసిన స్కేలును పొడవును కొలవడానికి ఉపయోగిస్తాం. దీనిమీద సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు గుర్తించి ఉంటాయి. ఒక టేబుల్ పొడవును కొలవాలంటే మనం మీటరు స్కేలును తీసుకొని, దానిపైనున్న సున్నా గుర్తును టేబుల్ కు ఒక చివర కచ్చితంగా కలిసేటట్లుగా ఉంటే టేబుల్ కు రెండో చివర స్కేలుపై ఏ సంఖ్య దగ్గర కలుస్తుందో దాన్ని పొడవుగా తీసుకొంటాం.

ప్రశ్న 12.
పొడవును కొలవడానికి తగిన పరికరాన్ని ఎలా ఎంచుకుంటారు?
జవాబు:
కొలవవలసిన పొడవు ఆధారంగా తగిన పరికరాన్ని ఎన్నుకొంటాము. చిన్న చిన్న పొడవులకు స్కేలును, పెద్ద పొడవులకు లింకు గొలుసును, పూల మాలకు మూరను, ఇళ్ల స్థలాలకు గజాలను ఎన్నుకొంటాము.

6th Class Science 7th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మీటర్ స్కేల్ ఉపయోగిస్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:
మీటరు స్కేల్ ను ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :
AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం 3

  • ఏ పొడవును కొలుస్తున్నామో దాని వెంబడి ఉండేటట్లుగా స్కేలును ఉంచాలి.
  • స్కేలుపై సున్నాను సూచించే బిందువు కచ్చితంగా కొలవవలసిన పొడవు మొదటి బిందువుతో కలిసేలా స్కేలును ఉంచాలి.
  • మన కన్ను స్కేలుపై ఏ బిందువు నుంచి మనం కొలతను తీసుకొంటామో ఆ బిందువునకు నిటారుగా పైన ఉండాలి.
  • స్కేలు చివరి భాగాలు విరిగిపోయిగాని, అరిగిపోయిగాని ఉండకుండా చూసుకోవాలి.
  • కచ్చితత్వం కోసం ఏ వస్తువు పొడవునైనా రెండు కంటే ఎక్కువసార్లు కొలిచి, దాని సరాసరిని తీసుకోవాలి.

ప్రశ్న 2.
మీటర్ స్కేల్ ఉపయోగించి మీ ఎత్తును ఎలా కొలుస్తారు?
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం 4
ముందుగా మీ మిత్రుని వీపు గోడకు ఆనించి నిటారుగా నిలబడమనండి. కచ్చితంగా అతని తల పైభాగం మీద ఉండే విధంగా గోడమీద ఒక గీత గీయండి. ఇప్పుడు నేలనుంచి ఈ గీత వరకు గోడమీద ఉన్న దూరాన్ని ఒక స్కేలుతో కొలవండి. ఇదే విధంగా మీ మిత్రుని ఎత్తును, మిగిలిన విద్యార్థుల ఎత్తును కూడా కొలవండి. ఈ కొలతలన్నింటినీ మీ నోట్ బుక్ లో నమోదు చేయండి.

ప్రశ్న 3.
మీటర్ స్కేల్ లో పొడవును ఎలా ఖచ్చితంగా కొలవాలి?
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం 5
నిజ జీవితంలో మనం చెక్కతో లేదా ప్లాస్టిక్ తో చేసిన స్కేలును పొడవును కొలవడానికి ఉపయోగిస్తాం. దీనిమీద సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు గుర్తించి ఉంటాయి. ఒక టేబులు పొడవును కొలవాలంటే మనం మీటరు స్కేలును తీసుకొని, దాని పైనున్న సున్నా గుర్తును టేబుల్ కు ఒక చివర కచ్చితంగా కలిసేటట్లుగా ఉంటే టేబులకు రెండో చివర స్కేలుపై ఏ సంఖ్య దగ్గర కలుస్తుందో దాన్ని పొడవుగా తీసుకొంటాం. మీటరు స్కేలు కొద్దిపాటి మందం కలిగి – ఉండడం వల్ల మనం మన కంటిని సరైన స్థానంలో ఉంచకపోతే కొలతలలో దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రశ్న 4.
అక్రమాకార వస్తువుల ఘనపరిమాణాన్ని కొలపాత్రతో ఎలా కనుగొంటావు?
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం 6
ఒక కొలపాత్రను తీసుకొని దాన్ని దాదాపు సగం వరకు నీటితో నింపండి. పటంలో చూపిన విధంగా ఇప్పుడు నీటి ఘనపరిమాణం కొలపాత్రపైన ఉన్న రీడింగును పరిశీలించి నమోదు చేయండి. దీని విలువ ‘a’ ఘ. సెం.మీ. (లేదా ‘a’ మి.లీ.) అనుకోండి. ఇప్పుడు ఒక చిన్న అక్రమాకారపు రాయికి పురి లేని దారాన్ని కట్టండి. దాన్ని నెమ్మదిగా కొలపాత్రలోని నీటిలోకి, పూర్తిగా మునిగే విధంగా జారవిడిచి —- పట్టుకోండి. కొలపాత్రలోని నీటిలో రాయి ఉంచినపుడు ఆ రాయి దాని ఘనపరిమాణానికి సమానమైన నీటిని తొలగించడం వలన పాత్రలోని నీటిమట్టం ఎత్తు పెరగడాన్ని మీరు గమనిస్తారు.

ఇప్పుడు పాత్రపైన రీడింగ్ ను పరిశీలించి దానిలోని నీటి ఘనపరిమాణాన్ని నమోదు చేయండి. దీని విలువ ‘b’ ఘ. సెం.మీ. (లేదా ‘b’ మి.లీ) అనుకోండి.

నీటి రెండవ, మొదటి ఘనపరిమాణాల భేదానికి రాయి ఘనపరిమాణం సమానమవుతుంది. కావున రాయి ఘనపరిమాణం = (b – a) ఘ. సెం.మీ. (లేదా మి.లీ).

ప్రశ్న 5.
AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం 7
1. ఏ పటానికి ఎక్కువ వైశాల్యం ఉంటుంది? ఎందుకు?
జవాబు:
నేను రెండవ పటానికి ఎక్కువ వైశాల్యం ఉంది అనుకొంటున్నాను.

2. రెండు పటాలలో ఉన్న చిన్న భాగాలన్నీ సమానంగా ఉన్నాయా?
జవాబు:
రెండు పటాలలో ఉన్న చిన్న భాగాలన్నీ సమానముగా ఉన్నాయి.

3. పటాలలో ఉన్న చిన్న భాగాలు ఏ ఆకారంలో ఉన్నాయి?
జవాబు:
ఇవి చదరపు ఆకారాన్ని కలిగి ఉన్నాయి.

4. ప్రతి భాగం పొడవు, వెడల్పులూ సమానంగా ఉన్నాయా?
జవాబు:
ప్రతి భాగం పొడవు మరియు వెడల్పులు సమానంగా ఉన్నాయి.

5. పటంలో ఏదో ఒక భాగం పొడవు, వెడల్పులను కొలవండి. మీరు ఏమి గమనిస్తారు?
జవాబు:
వీటి పొడవు, వెడల్పులు వేరుగా ఉన్నప్పటికి ఒకే వైశాల్యము కలిగి ఉన్నాయి.

ప్రశ్న 6.
క్రింది పటం చూడండి మరియు కింది వాటికి సమాధానం ఇవ్వండి.
AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం 8
• పెద్దపెద్ద దూరాలను మనం పటంలో చూపిన పరికరాలతో కొలవగలమా?
జవాబు:
పెద్ద పెద్ద దూరాలను స్కేల్ తో కొలవటం సాధ్యం కాదు.

• ఒకవేళ కొలవలేకపోతే మరి వాటిని దేనితో కొలుస్తారు?
జవాబు:
కిలోమీటర్లలో ఎక్కువ దూరాలను కొలుస్తారు.

• వీటిని కొలవడానికి ఏ పరికరాలు వాడుతారు?
జవాబు:
కిలోమీటర్లను కొలవడానికి ఓడోమీటర్ ఉపయోగిస్తారు.

• చాలా పెద్ద దూరాలను ఎలా కొలుస్తారో మీ మిత్రులతోను, అమ్మానాన్నలతోను, ఉపాధ్యాయులతోను చర్చించి తెలుసుకోండి.
జవాబు:
చాలా పెద్ద దూరాలను సాధారణంగా కాంతి సంవత్సరాల్లో సూచిస్తారు. అంటే, ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం.

AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం

ప్రశ్న 7.
స్కేల్ కథను వివరించండి.
జవాబు:
ఇంతకుముందు రోజులలో భూములను తాళ్ళ పొడవులతో కొలిచేవారు. చాలా సందర్భాలలో కొలతలు సరిగా లేవని గొడవలు జరుగుతూండేవి.

పొడవులు కొలవడానికి ఎవరి ‘మూర’ను ప్రామాణికంగా తీసుకోవాలి?
ఒక మూర పొడవులో సగం లేదా నాలుగోవంతు పొడవులను ఎలా కొలవాలి?
ఇలాంటి ప్రశ్నలకు ఒక శాస్త్రీయమైన, అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం ఎవరూ కూడా ఆ రోజులలో ఇవ్వలేకపోయారు.

చివరిగా కొద్దిమంది తెలివైన వ్యక్తులందరూ ఒకచోట సమావేశమై ఒక నిర్దిష్టమైన పొడవు గల స్కేలు (కొలబద్ద)ను తయారుచేసుకోవాలని నిర్ణయించారు. ఈ స్కేలు పొడవు కంటే తక్కువ పొడవులను కొలవడానికి దాన్ని సమానమైన సూక్ష్మభాగాలుగా విభజించే విధంగా దానిపై గుర్తులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తరవాత ఆ ప్రాంత ప్రజలందరూ ఆ స్కేలు పొడవుకు సమానమైన పొడవు వుండే లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలును ఉపయోగించడం ప్రారంభించారు.

AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం 9
ఒక ప్రాంతంలోని ప్రజలు, ఆ దేశపు రాజు ముక్కు దగ్గరినుంచి అతని చేతి మధ్యవేలు వరకు ఉండే దూరాన్ని పొడవులను కొలవడానికి ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. వాళ్ళు ఈ దూరాన్ని ‘ఒక గజం’గా పిలిచేవారు. ఈ పొడవుకు సమానమైన లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలు అక్కడి ప్రజలు వాడేవారు. ఒక గజాన్ని ప్రమాణంగా తీసుకొనేవారు.

గజాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగాన్నీ ఒక ‘అడుగు’గా పిలిచేవారు. ఆ తర్వాత ప్రతి అడుగునూ పన్నెండు సమ భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక “అంగుళం”గా పిలిచేవారు. ఈ ‘అంగుళం’ పొడవును కూడా వారు ఇంకా సూక్ష్మభాగాలుగా కూడా విభజించారు.

ప్రశ్న 8.
కార్డ్ బోర్డు బాక్స్ యొక్క ఘనపరిమాణాన్ని మీరు ఎలా కొలుస్తారు?
జవాబు:

  • క్యూబ్ బాక్సుల (సమ ఘనం) సహాయంతో కార్డ్ బోర్డు పరిమాణాన్ని కొలుస్తాము.
  • ప్రతి క్యూబ్ 1 సెం.మీ. పొడవు, 1 సెం.మీ. వెడల్పు మరియు 1 సెం.మీ. ఎత్తు ఉంటుంది.
  • ఒక క్యూబ్ యొక్క ఘనపరిమాణం 1 సెం.మీ. × మీ. × 1 సెం.మీ. = 1 సెం.మీ³ కు సమానం. దీనిని 1 క్యూబిక్ సెంటీ మీటర్ అని పిలుస్తారు మరియు 1 సెం. మీ³ గా వ్రాయబడుతుంది.
  • క్యూబిక్ సెంటీ మీటర్, ఘనపదార్థాల పరిమాణాన్ని కొలవడానికి ఒక ప్రామాణిక ప్రమాణం.
  • అందువల్ల దీర్ఘచతురస్రాకార కార్డ్ బోర్డ్ పెట్టె యొక్క పరిమాణం అది ఆక్రమించిన మొత్తం సమ ఘనాల సంఖ్యకు సమానం.
  • దీర్ఘచతురస్రాకార కార్డ్ బోర్డ్ బాక్స్ = 12 × 1 సెం.మీ³ = 12 సెం.మీ.³
  • ఇప్పుడు మనం పొడవు, వెడల్పు మరియు ఎత్తును గుణిస్తే, అది 3 సెం.మీ × 2 సెం.మీ × 2 సెం.మీ = 12 సెం.మీ³
  • పెట్టె ఘనపరిమాణం = పొడవు × వెడల్పు × ఎత్తుకు సమానం.

AP Board 6th Class Science 7th Lesson 1 Mark Bits Questions and Answers కొలుద్దాం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించుము.

1. పొడవు యొక్క ప్రమాణం
A) సెంటీ మీటర్
B) మిల్లీ. మీటర్
C) కిలో మీటర్
D) ఒక మీటర్
జవాబు:
D) ఒక మీటర్

2. తూకములు మరియు కొలతల వైవిధ్యం గురించి తెలుపు శాస్త్రం
A) చరక సంహిత
B) రాజ తరంగిణి
C) అర్థశాస్త్రం
D) కాదంబరి
జవాబు:
C) అర్థశాస్త్రం

AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం

3. విమానం లేదా ఓడలు ప్రయాణించే దూరాన్ని దేనితో కొలుస్తారు?
A) నాటికల్ మైల్స్
B) కిలోమీటర్లు
C) అడుగులు
D) మైల్స్
జవాబు:
A) నాటికల్ మైల్స్

4. ద్రవాల ఘనపరిమాణంనకు ప్రమాణం
A) మి.లీ.
B) సెం.మీ.
C) మి.మీ.
D) కి.మీ.
జవాబు:
A) మి.లీ.

5. క్రింది వానిలో సరైనది
A) 1 సెం.మీ – 100 మిమీ
B) 1 మీ = 100 సెం.మీ
C) 1 కి.మీ = 100 మీ.
D) అన్నీ
జవాబు:
B) 1 మీ = 100 సెం.మీ

6. కోణమానిని (ప్రొట్రాక్టర్)లో కోణాలు
A) 90 – 180
B) 0 – 90
C) 0 – 180
D) 0 – 360
జవాబు:
C) 0 – 180

7. వక్ర మార్గం పొడవును దేనితో కొలుస్తారు?
A) టేప్
B) గ్రాఫ్ పేపర్
C) దారము
D) కొలపాత్ర
జవాబు:
C) దారము

8. ప్రమాణ స్కేల్ ఎక్కడ భద్రపరచబడింది?
A) యు.ఎస్.ఎ
B) రష్యా
C) యు.కె
D) ఫ్రాన్స్
జవాబు:
D) ఫ్రాన్స్

9. చదరపు మిల్లీమీటరు …. గా సూచిస్తాము.
A) మీ.
B) మి.మీ.
C) సెం. మీ
D) కి.మీ. 7
జవాబు:
B) మి.మీ.

AP 6th Class Science Important Questions Chapter 7 కొలుద్దాం

10. పెద్ద దూరాలను దేనితో కొలవవచ్చు?
A) మి.మీ
B) కి.మీ.
C) సెం.మీ.
D) పైవన్నీ
జవాబు:
B) కి.మీ.

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. 1 సెం.మీ = ………….. మి.మీ.
2. నాణేల మందం …………. తో కొలుస్తారు.
3. చదరపు మిల్లీమీటర్ యొక్క సంకేతం …………
4. 1 కిమీ = ………….. మీటర్లు.
5. క్రమరహిత ఆకారపు వస్తువు ఘనపరిమాణాన్ని కొలవడానికి ………….. ఉపయోగించబడుతుంది.
6. అడుగు, జాన మరియు మూర వస్తువుల పొడవును కొలవడానికి ………….. పద్ధతులు.
7. …………… అనేది స్కేల్ లో అతి చిన్న ప్రమాణం .
8. …………. చదరపు మీటర్ యొక్క సంకేతం.
9. ………….. వస్తువు ఆక్రమించిన ఉపరితలం.
10. ద్రవాల ఘనపరిమాణాన్ని ………. లో కొలుస్తారు.
జవాబు:

  1. 10 మిమీ.
  2. స్కేల్
  3. చ.మి.మీ.
  4. 1000 మీ.
  5. కొలపాత్ర
  6. సాంప్రదాయక
  7. మిల్లీమీటర్/మి.మీ.
  8. మీ²
  9. ఘనపరిమాణం
  10. మిల్లీ లీటర్లు/మి. లీ.

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – AGroup – B
ఎ) కొలపాత్ర1) ఓడ ప్రయాణించే దూరం
బి) మీటర్ టేప్2) ద్రవాల ఘనపరిమాణం
సి) నాటికల్ మైళ్ళు3) టైలర్
డి) బిఘా4) గ్రామ్
ఇ) ద్రవ్యరాశి5) మొఘల్ కొలత పద్దతి

జవాబు:

Group – AGroup – B
ఎ) కొలపాత్ర2) ద్రవాల ఘనపరిమాణం
బి) మీటర్ టేప్3) టైలర్
సి) నాటికల్ మైళ్ళు1) ఓడ ప్రయాణించే దూరం
డి) బిఘా5) మొఘల్ కొలత పద్దతి
ఇ) ద్రవ్యరాశి4) గ్రామ్

2.

Group – AGroup – B
ఎ) సెంటీమీటర్1) వెడల్పు
బి) చదరపు మిల్లీమీటర్2) 3 అడుగులు
సి) గజం3) సెం.మీ.
డి) మిల్లీమీటర్4) మి.మీ²
ఇ) వైశాల్యం5) మి.లీ.

జవాబు:

Group – AGroup – B
ఎ) సెంటీమీటర్3) సెం.మీ.
బి) చదరపు మిల్లీమీటర్4) మి.మీ²
సి) గజం2) 3 అడుగులు
డి) మిల్లీమీటర్5) మి.లీ.
ఇ) వైశాల్యం1) వెడల్పు

మీకు తెలుసా?

→ ద్రవాల ఘనపరిమాణం మిల్లీ లీటర్లలలో, ఘనపదార్థాల ఘనపరిమాణం ఘ. సెం.మీ.లలో రాయడం మీరు గమనించే ఉంటారు. ఈ రెండు ప్రమాణాల మధ్య ఏమైనా సంబంధం మీరు గుర్తించగలరా?
1 మి.లీ. = 1. ఘ. సెం.మీ.

AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

These AP 6th Class Science Important Questions 6th Lesson అయస్కాంతంతో సరదాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Science 6th Lesson Important Questions and Answers అయస్కాంతంతో సరదాలు

6th Class Science 6th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పిన్ హోల్డర్ మూత యొక్క పై కప్పుకు పిన్స్ ఎందుకు అతుక్కుంటాయి?
జవాబు:
పిన్ హెల్డర్ మూత యొక్క పై కప్పుకు అయస్కాంతం అమర్చబడి ఉంటుంది. అందువలన పిన్స్ మూతకు అతుక్కొని ఉంటాయి.

ప్రశ్న 2.
సహజ అయస్కాంతాలను ‘లీడింగ్ స్టోన్స్’ అని ఎందుకు పిలుస్తారు?
జవాబు:
సహజ అయస్కాంతాలను దిశను కనుగొనడానికి ఉపయోగిస్తారు, కాబట్టి వాటిని ‘లీడింగ్ స్టోన్’ లేదా ‘లోడ్ స్టోన్’ అని కూడా పిలుస్తారు.

ప్రశ్న 3.
అయస్కాంతం యొక్క ఏ భాగము నుండి ఇనుప రజను తొలగించటం కష్టంగా ఉంటుంది?
జవాబు:
అయస్కాంతము యొక్క చివరి భాగాలైన ధ్రువాల నుండి ఇనుప రజను తొలగించడం కష్టంగా ఉంటుంది.

ప్రశ్న 4.
అయస్కాంతం యొక్క ఏ ధర్మం ఉపయోగించి దిక్సూచి తయారు చేస్తారు?
జవాబు:
అయస్కాంతం యొక్క దిశా ధర్మం ఆధారంగా దిక్సూచి తయారు చేస్తారు.

ప్రశ్న 5.
అయస్కాంత దిక్సూచితో మనం తీసుకోవలసిన ప్రధాన జాగ్రత్త ఏమిటి?
జవాబు:
అయస్కాంత దిక్సూచిని అయస్కాంతానికి దూరంగా ఉంచాలి.

AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

ప్రశ్న 6.
అయస్కాంతాన్ని రెండు ముక్కలుగా చేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
అయస్కాంతాన్ని రెండు ముక్కలు చేస్తే ప్రతి ముక్క రెండు ధృవాలను ఏర్పర్చుకొని స్వతంత్ర అయస్కాంతాలుగా పనిచేస్తాయి.

ప్రశ్న 7.
వ్యర్థ పదార్థాల నుంచి లోహపు ముక్కలను ఎలా వేరు చేస్తావు?
జవాబు:
ఇనుము, ఉక్కు వంటి పదార్థాలను అయస్కాంతం ఆకర్షిస్తుంది, కావున అయస్కాంతం ఉపయోగించి వ్యర్థ పదార్థాల నుంచి లోహపు ముక్కలను వేరు చేస్తాను.

ప్రశ్న 8.
అయస్కాంతం ఉపయోగించి నీవు పడమర దిక్కుఎలా కనుగొంటావు?
జవాబు:
అయస్కాంతం దిశాధర్మం వల్ల ఉత్తర, దక్షిణ ధ్రువాలను చూపిస్తుంది. దానివలన నేను పడమర దిక్కును కనుక్కొంటాను.

ప్రశ్న 9.
ఒక వడ్రంగి పనిచేస్తూ ఇనుప మేకులను, స్కూలను, చెక్కపొట్టులో కలిపేశాడు. అతడికి నీవు ఏ విధంగా సహాయం చేయగలవు?
జవాబు:
అయస్కాంతం ఉపయోగించి ఇనుప మేకులను, స్కూలను చెక్క పొట్టు నుంచి సులభంగా వేరు చేస్తాను.

ప్రశ్న 10.
అయస్కాంత ప్రేరణ అంటే ఏమిటి?
జవాబు:
అయస్కాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఒక అయస్కాంత పదార్థం, అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే . దానిని అయస్కాంత ప్రేరణ అంటారు.

ప్రశ్న 11.
అయస్కాంతానికి సరైన పరీక్ష ఏమిటి?
జవాబు:
అయస్కాంతానికి సరైన పరీక్ష వికర్షణ.

ప్రశ్న 12.
అయస్కాంతాల దిశాత్మక ధర్మం అంటే ఏమిటి?
జవాబు:
స్వేచ్ఛగా వ్రేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర మరియు దక్షిణ దిశలలో నిలబడుతుంది. అయస్కాంతాల యొక్క ఈ ధర్మాన్ని దిశాత్మక ధర్మం అంటారు.

ప్రశ్న 13.
విద్యుదయస్కాంత రైళ్లు ఏ సూత్రంపై పనిచేస్తాయి?
జవాబు:
విద్యుదయస్కాంత రైలు వికర్షణ సూత్రంపై పనిచేస్తుంది. వికర్షణను ఉపయోగించి అయస్కాంత వస్తువులను గాలిలో తేలేలా చేయవచ్చు.

AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

ప్రశ్న 14.
గుర్రపునాడ అయస్కాంతం యొక్క రేఖాచిత్రాన్ని గీయండి.
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 1

6th Class Science 6th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
అయస్కాంత, అనయస్కాంత పదార్థాలు అనగానేమి?
జవాబు:
అయస్కాంతం చేత ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు.
ఉదా : ఇనుము, ఉక్కు, నికెల్.

అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు.
ఉదా : ప్లాస్టిక్, పేపరు.

ప్రశ్న 2.
అయస్కాంతం యొక్క ఏ భాగాల్లో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది? దీనిని ఎలా నిర్ధారిస్తారు?
జవాబు:
అయస్కాంతం రెండు చివర ప్రాంతాలను ధృవాలు అంటారు. ఈ ధృవాలలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అయస్కాంతాన్ని ఇనుప రజనులో ఉంచినపుడు ధృవాల వద్ద అధిక రజను ఉండటం గమనించవచ్చు.

ప్రశ్న 3.
అయస్కాంత ధ్రువాలు ఎప్పుడు ఆకర్షించుకుంటాయి?
జవాబు:
అయస్కాంతంలో రెండు రకాల ధృవాలు ఉంటాయి. వీటిని N మరియు S అంటారు. వేరువేరు ధ్రువాల మధ్య ఆకర్షణ ఉంటుంది. అంటే N – S ధ్రువాల మధ్య ఆకర్షణ ఉంటుంది.
AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 2

ప్రశ్న 4.
అయస్కాంత ధ్రువాలు ఎప్పుడు వికర్షించుకుంటాయి?
జవాబు:
అయస్కాంతంలో రెండు రకాల ధృవాలు ఉంటాయి. వీటిని N మరియు S అంటారు. ఒకే రకమైన ధృవాల మధ్య వికర్షణ ఉంటుంది. అంటే N – N, S – S ధృవాల మధ్య వికర్షణ ఉంటుంది.
AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 3

ప్రశ్న 5.
ఈ క్రింది పట్టిక పూరించండి.

ధృవాలువాటి పేరుపరిశీలన
ఉత్తరం – దక్షిణంఆకర్షణ
ఉత్తరం – ఉత్తరంసజాతి ధృవాలు
దక్షిణం – ఉత్తరంఆకర్షణ

జవాబు:

ధృవాలువాటి పేరుపరిశీలన
ఉత్తరం – దక్షిణంవిజాతి ధృవాలుఆకర్షణ
ఉత్తరం – ఉత్తరంసజాతి ధృవాలువికర్షణ
దక్షిణం – ఉత్తరంవిజాతి ధృవాలుఆకర్షణ

ప్రశ్న 6.
దండాయస్కాంతం యొక్క పటం గీసి, ధృవాలు గుర్తించండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 2

ప్రశ్న 7.
అయస్కాంత దిక్సూచి యొక్క ఉపయోగం ఏమిటి?
జవాబు:

  • దిశలను కనుగొనడానికి అయస్కాంత దిక్సూచి ఉపయోగించబడుతుంది.
  • ఇది ఎక్కువగా ఓడలు మరియు విమానాలలో ఉపయోగించబడుతుంది.
  • పర్వతారోహకులు, సైన్యం మరియు ప్రజలు కూడా తెలియని ప్రదేశంలో దారి తప్పిపోకుండా ఒక దిక్సూచిని వాడతారు.
  • దిక్సూచి అయస్కాంత దిశా ధర్మం ఆధారంగా పని చేస్తుంది.

ప్రశ్న 8.
అయస్కాంతాలతో ప్రయోగాలు చేయడానికి రజనీకి కొంత ఇనుప రజను అవసరం. వాటిని ఎలా సేకరించాలో ఆమెకు తెలియదు. ఇనుప రజను సేకరించే విధానాన్ని వివరించడం ద్వారా ఆమెకు సహాయం చేయండి.
జవాబు:

  • అయస్కాంతాల ప్రయోగాలలో మనం ఇనుప రజను మళ్లీ మళ్లీ ఉపయోగించాలి.
  • ఇసుక కుప్పలో ఒక అయస్కాంతాన్ని ఉంచి తిప్పడం ద్వారా మనం వీటిని సేకరించవచ్చు.
  • ఇసుకలో ఉన్న చిన్న ఇనుము ముక్కలు అయస్కాంతానికి అంటుకుంటాయి.
  • మనకు ఇసుక దొరకకపోతే మట్టి నేలలో కూడా ప్రయత్నించవచ్చు.

AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

ప్రశ్న 9.
విజాతి ధృవాల మధ్య ఆకర్షణ, సజాతి ధృవాల మధ్య వికర్షణను ఎలా నిరూపించగలరు?
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 5

  • రెండు దండాయస్కాంతాలను తీసుకోండి.
  • దండాయస్కాంతం యొక్క దక్షిణ ధృవం మరొక దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువానికి దగ్గరగా తీసుకురండి. అవి వికర్షించుకొంటాయి.
  • ఇప్పుడు దండాయస్కాంతం యొక్క ఉత్తర ధృవం మరొక దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి దగ్గరగా తీసుకురండి. అవి వికర్షించుకొంటాయి.
  • దీనిని బట్టి ఒకే రకమైన ధృవాలు వికర్షించుకొంటాయి అని నిర్ధారించవచ్చు.
  • ఇప్పుడు దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం మరొక దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువానికి తీసుకురండి. అవి రెండు ఆకర్షించుకొంటాయి. దీనిని బట్టి విభిన్న ధృవాలు వికర్షించుకొంటాయి అని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 10.
అయస్కాంతము తన లక్షణాలు ఎలా కోల్పోతుంది?
జవాబు:

  • అయస్కాంతాలు వేడి చేయబడినా లేదా ఎత్తు నుండి పడిపోయినా లేదా సుత్తితో కొట్టినా వాటి లక్షణాలను కోల్పోతాయి.
  • సెల్ ఫోన్, కంప్యూటర్, డి.వి.డిల దగ్గర ఉంచినప్పుడు అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి.
  • అయస్కాంతాలను సరిగా నిల్వ చేయకపోతే తన లక్షణాలను కోల్పోయేలా చేస్తుంది.

ప్రశ్న 11.
అయస్కాంతాలను సరిగా నిల్వ చేయటం కోసం సూచనలు చేయండి.
జవాబు:
అయస్కాంతాలను సరైన విధానంలో భద్రపరచకపోతే, అవి వాటి స్వభావాన్ని కోల్పోతాయి. దండాయస్కాంతాలను భద్రపరిచేటప్పుడు వాటిని జతలుగా, వాటి విజాతి ధృవాలు ఒకవైపుకు ఉండేలా ఉంచాలి. ఈ రెండింటి మధ్యలో చెక్క ముక్కను ఉంచాలి. రెండు చివరలా మృదువైన ఇనుప ముక్కలను ఉంచాలి. గుర్రపు నాడ ఆకారపు అయస్కాంతానికి దాని రెండు ధృవాలను కలుపుతూ మృదువైన ఇనుప ముక్కను ఉంచవచ్చు.
AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 4

ప్రశ్న 12.
సస్పెన్షన్ రైలు అంటే ఏమిటి? ఇది ఏ సూత్రంపై పనిచేస్తుంది?
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 5
వికర్షణను ఉపయోగించడం ద్వారా మనం అయస్కాంత వస్తువులను గాలిలో తేలేలా చేయవచ్చు. విద్యుత్ అయస్కాంత రైలు అదే సూత్రంపై ఎగిరే రైలు పనిచేస్తుంది. విద్యుత్ అయస్కాంత రైలును సస్పెన్షన్ రైలు లేదా ఎగిరే రైలు (Maglev train) అని కూడా పిలుస్తారు. దీనికి డీజిల్ లేదా పెట్రోల్ అవసరం లేదు. ఈ సాంకేతికత, అత్యంత వేగవంతమైన రైళ్లను నడపడానికి అయస్కాంత ఆకర్షణ, వికర్షణ యొక్క ధర్మాన్ని ఉపయోగిస్తుంది. ఈ విద్యుదయస్కాంత రైలు అయస్కాంత లేవిటేషన్ సూత్రంపై పనిచేస్తుంది. అంటే వికర్షణను ఉపయోగించి అయస్కాంత వస్తువును గాలిలో నిలపటం.

ప్రశ్న 13.
సహజ అయస్కాంతాలు మరియు కృత్రిమ అయస్కాంతాల మధ్య తేడాలను వ్రాయండి.
జవాబు:

సహజ అయస్కాంతాలుకృత్రిమ అయస్కాంతాలు
1. ఇవి ప్రకృతిలో సహజంగా సంభవిస్తాయి.1. ఇవి మానవ నిర్మిత అయస్కాంతాలు.
2. వీటిని వాటి ధాతువు నుండి పొందవచ్చు.2. ఇనుము వంటి అయస్కాంత పదార్థాల అయస్కాంతీకరణ ద్వారా వీటిని పొందవచ్చు.
3. వీటికి ఖచ్చితమైన ఆకారం లేదు.3. రౌండ్, రింగ్, డిస్క్, హార్స్ షూ మొదలైన వివిధ ఆకారాలలో వీటిని తయారు చేస్తారు.
4. వీటిని సీసపు రాళ్ళు లేదా అయస్కాంత శిలలు అంటారు.4. వీటి ఆకారాలను బట్టి, తయారీ విధానం బట్టి పేరు పెట్టారు.

6th Class Science 6th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
అయస్కాంతాల ఆవిష్కరణ కథను వివరించండి.
జవాబు:

  • సుమారు 2500 సంవత్సరాల క్రితం గ్రీకు భాషలో మెగ్నీషియా అనే ప్రాంతంలో, మాగ్నస్ అనే గొర్రెల కాపరి నివసించేవాడు.
  • ఒక రోజు తన మేకలు గడ్డి మేసుకుంటూ ఉండగా, అతను తన ఇనుప నాడా కలిగిన కర్ర మరియు ఇనుప మేకులు కొట్టబడిన చెప్పులు ఆ రాతిపై ఉంచి ఒక బండపై పడుకున్నాడు.
  • అతను మేల్కొన్నప్పుడు, తన ఇనుప నాడా కలిగిన కర్ర రాయి మీద నిటారుగా నిలబడి ఉన్నట్లు అతను కనుగొన్నాడు. అతని ఇనుప మేకులు గల చెప్పులు కూడా రాయి మీద అతుక్కుపోయాయి.
  • ఈ మాయాజాలం చూడటానికి గ్రామం మొత్తం అక్కడ సమావేశమైంది.
  • ఈ సంఘటన గురించి ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వివిధ మార్గాల్లో వ్యక్తం చేశారు.
  • ప్రజలు దీనిని మాగ్నస్ కర్రను మాత్రమే కాకుండా, ఇనుముతో తయారు చేసిన అన్ని ఇతర వస్తువులను కూడా ఆకర్షిస్తుందని గమనించారు.
  • ఈ రకమైన రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడ్డాయి.
  • ఈ అయస్కాంత శిలలకు ‘అయస్కాంతాలు’ అని పేరు పెట్టారు మరియు ఈ ధాతువును మాగ్నస్ పేరు మీద ‘మాగ్నెటైట్’ అని పిలుస్తారు.

AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

ప్రశ్న 2.
అయస్కాంత లక్షణాలపై చిన్న నివేదిక రాయండి.
జవాబు:

  1. అయస్కాంతాలు అయస్కాంత పదార్థాలను ఆకర్షిస్తాయి.
  2. అయస్కాంతం ఎల్లప్పుడూ రెండు ధృవాలను కలిగి ఉంటుంది. వీటి ఆకర్షణ సామర్థ్యం అయస్కాంతాలలోని ఇతర భాగాల కంటే ఎక్కువగా ఉంటుంది.
  3. అయస్కాంతము యొక్క అయస్కాంతాలను ఉత్తర మరియు దక్షిణ ధృవాలు అంటారు.
  4. సజాతి ధృవాలు (N – N, S – S) ఒకదానినొకటి వికర్షించుకోగా, విజాతి ధృవాలు (N – S, S – N) ఆకర్షించుకొంటాయి.
  5. స్వేచ్ఛగా వ్రేలాడతీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిశలో నిలుస్తుంది.
  6. అయస్కాంతాలను వేడి చేయటం లేదా ఎత్తు నుండి పడవేయటం లేదా సుత్తితో కొట్టడం వల్ల వాటి లక్షణాలను కోల్పోతాయి.

ప్రశ్న 3.
దండాయస్కాంతం రెండు ధృవాలను కలిగి ఉందని మీరు ఎలా నిరూపించగలరు?
జవాబు:
లక్ష్యం :
దండాయస్కాంతం రెండు ధృవాలను కలిగి ఉందని నిరూపించడం

అవసరమైన పదార్థాలు :
ఇనుప రజను, కాగితం, దండాయస్కాంతం

విధానం :
కొంత ఇనుప రజనును ఒక కాగితంపై పరచండి. ఈ కాగితం క్రింద దండాయస్కాంతం ఉంచండి.

పరిశీలన :
ఏకరీతిలో వ్యాపించిన ఇనుప రజను దగ్గరికి వచ్చి కాగితం యొక్క రెండు చివరలలో పోగవటం గమనించవచ్చు. ఈ రెండు ప్రదేశాల మధ్య కొంత దూరంలో చెల్లాచెదురైన ఇనుప రజను గీతలుగా అమరి కనిపిస్తుంది.

ఫలితం :
దీనిని బట్టి దండాయస్కాంతం చివరలు అయస్కాంతం మధ్య భాగం కంటే ఎక్కువ ఇనుప రజనును ఆకర్షిస్తాయి. ఈ కృత్యం ద్వారా, ప్రతి దండాయస్కాంతం ఎల్లప్పుడూ రెండు చివరలను కలిగి ఉంటుందని మనం నిర్ధారించగలము. దీని ఆకర్షణ సామర్థ్యం దాని ఇతర భాగాల కంటే ఎక్కువ. ఈ చివరలను అయస్కాంతం యొక్క ధృవాలు అంటారు.

ప్రశ్న 4.
దండాయస్కాంతం యొక్క దిశాత్మక ధర్మాన్ని మీరు ఎలా ప్రదర్శించవచ్చు?
జవాబు:
లక్ష్యం : దండాయస్కాంతం యొక్క దిశాత్మక ధర్మాన్ని ప్రదర్శించడం.

అవసరమైన పదార్థాలు :
దండాయస్కాంతం, దారము, స్టాండ్ మరియు రంగు.

విధానం :
దండాయస్కాంతంను మధ్యలో కట్టిన దారము సహాయంతో స్వేచ్ఛగా వ్రేలాడతీయాలి. అయస్కాంతం అటు ఇటు తిరిగి చివరకు ఉత్తర-దక్షిణ దిశలో నిలబడుతుంది. ఉత్తరం వైపు ఉన్న అయస్కాంత చివరి భాగాన్ని రంగుతో గుర్తించండి. ఇప్పుడు అయస్కాంతాన్ని కొద్దిగా కదిలించి, మళ్ళీ కొంత సమయం వేచి ఉండండి.

పరిశీలన :
అయస్కాంతాలు ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిశలలో నిలబడతాయి. ప్రతి సందర్భంలో రంగుతో గుర్తించబడిన ధృవము ఉత్తరం వైపు చూపుతుంది.

ఫలితం : గుర్తించబడిన ధృవమును అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అంటారు. మరొక ధృవాన్ని, దక్షిణ దిశను సూచించే అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అంటారు. అయస్కాంతాల యొక్క ఈ ధర్మాన్ని దిశా ధర్మం అంటారు.

ప్రశ్న 5.
మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల అయస్కాంతాలను గీయండి.
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 6

ప్రశ్న 6.
దిక్సూచి నిర్మాణము, పని చేయు విధానంను తెలపండి.
జవాబు:
అయస్కాంత దిక్సూచి నిర్మాణము :
AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు 7

  1. దిక్సూచి వృత్తాకారంలో ఉండే పలుచని రేకు డబ్బా.
  2. దీని అడుగు భాగాన ఉత్తరం (N), దక్షిణం (S), తూర్పు (E), పడమర (W) దిక్కులను తెలియబరిచే అక్షరాలు రాసి ఉంటాయి.
  3. అడుగుభాగం మధ్యలో గల సన్నని మొనపై స్వేచ్ఛగా, గుండ్రంగా తిరిగేట్లుగా పలుచని అయస్కాంత సూచి అమర్చి ఉంటుంది.
  4. ఈ మొత్తం అమరికమీద పలుచని పారదర్శకపు గాజుబిళ్లతో డబ్బా మూసేసి ఉంటుంది. (పటం చూడండి)

ఉపయోగించే విధానము :

  1. ఏ ప్రదేశంలో దిక్కులను తెలుసుకోవాలో అక్కడ ఈ దిక్సూచిని ఉంచితే అందులోని అయస్కాంత సూచి ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తూ ఆగుతుంది.
  2. అప్పుడు దిక్సూచిని గుండ్రంగా తిప్పుతూ దాని అడుగుభాగంలో రాసివున్న N, S అక్షరాలు, అయస్కాంత సూచిక కొనల వద్దకు చేరేటట్లు చేయాలి.
  3. దిక్సూచిలో అయస్కాంత సూచిక ఉత్తరధృవాన్ని తెలుసుకోడానికి వీలుగా ఆ కొనకు ప్రత్యేకమైన రంగువేసి ఉంటుంది. (పటంలో చూడండి)
  4. అప్పుడు ఆ ప్రదేశంలో ఉత్తర, దక్షిణ దిక్కులు తెలుస్తాయి.
  5. ఆ తర్వాత వాటి మధ్య తూర్పు, పడమరలను కూడా మనం గుర్తించవచ్చు.

దిక్సూచి ఉపయోగాలు :

  1. ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోడానికి మనం ఈ దిక్సూచిని వాడుతాం.
  2. ఎక్కువగా దీన్ని ఓడలలోనూ, విమానాలలోనూ వాడతారు.
  3. అదే విధంగా పర్వతారోహకులు, మిలటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోడానికి విరివిగా ఉపయోగిస్తారు.

AP Board 6th Class Science 6th Lesson 1 Mark Bits Questions and Answers అయస్కాంతంతో సరదాలు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. ఈ క్రింది వానిలో సహజ అయస్కాంతము
A) రాక్ స్టోన్
B) లోడ్ స్టోన్
C) బంగారం
D) ఏదీ కాదు
జవాబు:
B) లోడ్ స్టోన్

2. ఈ క్రింది వానిలో ఏది అయస్కాంతము చేత ఆకర్షించబడదు?
A) ఇనుము
B) అయస్కాంతం
C) బంగారం
D) నికెల్
జవాబు:
C) బంగారం

3. అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను ఏమంటారు?
A) అయస్కాంత పదార్థాలు
B) అనయస్కాంత పదార్థాలు
C) ధృవము
D) అన్నీ
జవాబు:
B) అనయస్కాంత పదార్థాలు

4. స్వేచ్ఛగా వేలాడతీయబడిన అయస్కాంతం ఏ దిక్కును చూపిస్తుంది?
A) తూర్పు, పడమర
B) పడమర, ఉత్తరం
C) ఉత్తరం, తూర్పు
D) ఉత్తరం, దక్షిణం
జవాబు:
D) ఉత్తరం, దక్షిణం

AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

5. అయస్కాంత ధృవాల సంఖ్య
A) 3
B) 1
C) 2
D) 4
జవాబు:
C) 2

6. ప్రాచీన కాలంలో నావికులు దిక్కులు తెలుసుకోవటానికి దేనిని ఉపయోగించేవారు?
A) చెక్క
B) క్లాత్
C) రాయి
D) సహజ అయస్కాంతం
జవాబు:
D) సహజ అయస్కాంతం

7. జాతి ధ్రువాలు
A) ఆకర్షించుకుంటాయి
B) వికర్షించుకుంటాయి
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించుకుంటాయి

8. అయస్కాంతంలోని ఏ ధృవాలు ఆకర్షించుకుంటాయి?
A) సతి ధ్రువాలు
B) విజాతి ధ్రువాలు
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) విజాతి ధ్రువాలు

9. సహజ అయస్కాంత ఆకారాన్ని గుర్తించండి.
A) దండ
B) డిస్క్
C) సూది
D) ఖచ్చితమైన ఆకారం లేదు
జవాబు:
D) ఖచ్చితమైన ఆకారం లేదు

10. దేనిని టి.విలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి?
A) ప్లాస్టిక్
B) చెక్క
C) తీగ
D) అయస్కాంతం
జవాబు:
D) అయస్కాంతం

11. అయస్కాంతంచే ఆకర్షించే పదార్థాలను ఏమంటారు?
A) అనయస్కాంత పదార్థాలు
B) అయస్కాంత పదార్థాలు
C) ప్లాస్టిక్ పదార్థాలు
D) చెక్క
జవాబు:
B) అయస్కాంత పదార్థాలు

12. కింది వాటిలో ఏది అయస్కాంతం ద్వారా ఆకర్షించబడుతుంది?
A) చెక్క ముక్క
B) సాదా పిన్స్
C) ఎరేజర్
D) ఒక కాగితపుముక్క
జవాబు:
B) సాదా పిన్స్

AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

13. అయస్కాంతాలను ఏమి చేసినపుడు వాటి లక్షణాలను కోల్పోతాయి?
A) ఉపయోగించినపుడు
B) నిల్వ చేసినపుడు
C) వేడిచేసినపుడు
D) శుభ్రం చేసినపుడు
జవాబు:
C) వేడిచేసినపుడు

14. దిక్సూచిని తయారుచేయటానికి అయస్కాంతము యొక్క ఏ ధర్మము ఉపయోగపడుతుంది?
A) జంట నియమం
B) ధృవ నియమం
C) దిశా ధర్మం
D) ప్రేరణ
జవాబు:
C) దిశా ధర్మం

15. దిక్కులు తెలుసుకోవటానికి ఉపయోగించే పరికరము
A) ఇనుప కడ్డీ
B) బంగారం
C) దిక్సూచి
D) దండాయస్కాంతం
జవాబు:
C) దిక్సూచి

16. అనయస్కాంత పదార్థానికి ఉదాహరణ
A) కాగితం
B) ఇనుము
C) ఉక్కు
D) నికెల్
జవాబు:
A) కాగితం

17. అయస్కాంతం యొక్క ధాతువు
A) కార్నలైట్
B) మాగ్న టైట్
C) అయస్కాంత ప్రేరణ
D) అనయస్కాంత డిప్
జవాబు:
B) మాగ్న టైట్

18. అయస్కాంతాన్ని వేడిచేస్తే అది
A) విరిగిపోతుంది
B) కరిగిపోతుంది
C) అయస్కాంతత్వం కోల్పోతుంది
D) రంగు మారుతుంది.
జవాబు:
C) అయస్కాంతత్వం కోల్పోతుంది

19. విద్యుదయస్కాంత రైలు ఏ సూత్రంపై పనిచేస్తుంది?
A) అయస్కాంత ఆకర్షణ
B) దిశా ధర్మము
C) అయస్కాంత ప్రేరణ
D) అయస్కాంత లెవిటేషన్
జవాబు:
D) అయస్కాంత లెవిటేషన్

20. “అయస్కాంతం” పేరు ….. పేరు మీద పెట్టబడింది.
A) గ్రీస్
B) మాగ్నస్
C) మెగ్నీషియా
D) మాగ్నెటైట్
జవాబు:
B) మాగ్నస్

AP 6th Class Science Important Questions Chapter 6 అయస్కాంతంతో సరదాలు

21. సరైన వ్యాఖ్యను గుర్తించండి.
X) అయస్కాంతాలు సెల్ ఫోన్ దగ్గర ఉంచినప్పుడు వాటి లక్షణాలను కోల్పోతాయి.
Y) సెల్ ఫోన్ అయస్కాంతం దగ్గర ఉంచినప్పుడు అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రభావితమవుతుంది.
A) X మాత్రమే సరైనది
B) Y మాత్రమే సరైనది
C) రెండూ సరైనవి
D) రెండూ తప్పు
జవాబు:
C) రెండూ సరైనవి

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. లోడ్ స్టోన్ ………….. అయస్కాంతం.
2. మానవ నిర్మిత అయస్కాంతాలను ………. అంటారు.
3. …………. అయస్కాంతం యొక్క ధాతువు.
4. ఇనుప ముక్కను అయస్కాంతంగా మార్చే పద్ధతిని ……………. అంటారు.
5. ఆకర్షించే సామర్థ్యం ఒక అయస్కాంతం యొక్క …………. వద్ద అధికము.
6. అయస్కాంతాల యొక్క ………….. ధర్మం ఆధారంగా దిక్సూచి అభివృద్ధి చేయబడింది.
7. ……………. కనుగొనడానికి ఒక దిక్సూచి ఉపయోగించబడుతుంది.
8. అయస్కాంత పదార్థం దగ్గర ఒక అయస్కాంతం ఉండటం వల్ల అయస్కాంతంగా మారే ధర్మాన్ని ………… అంటారు.
9. ఒక వసువు దండాయస్కాంతం యొక్క ఒక ధ్రువం ద్వారా ఆకర్షించబడి, దాని మరొక ధృవం ద్వారా వికర్షించబడితే, అది ఒక ………….
10. ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క రెండు ధ్రువాలచే ఆకర్షించబడి, ఏ ధ్రువంతోను వికర్షించ బడకపోతే, అది ఒక ……………
11. ఒక వస్తువు అయస్కాంతం ద్వారా ఆకర్షించబడక లేదా దాని ద్వారా వికరించబడకపోతే, అది ఒక ………………..
12. ………… వలన అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి.
13. అయస్కాంతాలు …………. దగ్గర ఉంచినప్పుడు వాటి లక్షణాలను కోల్పోతాయి.
14. విద్యుదయస్కాంత రైలును ………… అని కూడా పిలుస్తాము.
15. విద్యుదయస్కాంత రైలు ………….. ధర్మాన్ని ఉపయోగించి నడుస్తుంది.
జవాబు:

  1. సహజ
  2. కృత్రిమ అయస్కాంతాలు
  3. మాగ్నెటైట్
  4. అయస్కాంతీకరణ
  5. ధృవాలు
  6. దిశాధర్మం
  7. దిక్కులు
  8. అయస్కాంత ప్రేరణ
  9. అయస్కాంతం పదార్థం
  10. అయస్కాంత పదార్థం
  11. అనయస్కాంత పదార్ధం
  12. వేడి చేయటం
  13. టీవీలు, సెల్ ఫోన్లు
  14. ఎగిరే రైలు
  15. వికర్షణ

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – AGroup – B
ఎ) మాగ్నెటైట్1) ఉత్తర – దక్షిణ
బి) లీడింగ్ స్టోన్2) అయస్కాంతానికి మరో పేరు
సి) అయస్కాంత ధ్రువాలు3) దిక్కులు చూపించేది
డి) కంపాస్4) అయస్కాంతంగా ప్రవర్తించడం
ఇ) అయస్కాంత ప్రేరణ5) అయస్కాంతం కనుగొన్న ప్రదేశం

జవాబు:

Group – AGroup – B
ఎ) మాగ్నెటైట్5) అయస్కాంతం కనుగొన్న ప్రదేశం
బి) లీడింగ్ స్టోన్2) అయస్కాంతానికి మరో పేరు
సి) అయస్కాంత ధ్రువాలు1) ఉత్తర – దక్షిణ
డి) కంపాస్3) దిక్కులు చూపించేది
ఇ) అయస్కాంత ప్రేరణ4) అయస్కాంతంగా ప్రవర్తించడం

2.

Group – AGroup – B
ఎ) సజాతి ధృవాలు1) N
బి) విజాతి ధృవాలు2) S
సి) అయస్కాంత ధృవాలు3) ఆకర్షించుకుంటాయి
డి) దక్షిణ ధృవం4) వికర్షించుకుంటాయి
ఇ) ఉత్తర ధృవం5) అధిక ఆకర్షణ

జవాబు:

Group – AGroup – B
ఎ) సజాతి ధృవాలు4) వికర్షించుకుంటాయి
బి) విజాతి ధృవాలు3) ఆకర్షించుకుంటాయి
సి) అయస్కాంత ధృవాలు5) అధిక ఆకర్షణ
డి) దక్షిణ ధృవం2) S
ఇ) ఉత్తర ధృవం1) N

3.

Group – AGroup – B
ఎ) సహజ అయస్కాంతం1) విజాతి ధృవాలు
బి) ఆకర్షణ2) లోడ్ స్టోన్
సి) అనయస్కాంత3) హార్స్ షూ అయస్కాంతం
డి) కృత్రిమ అయస్కాంతం4) సజాతి ధృవాలు
ఇ) వికర్షణ5) ప్లాస్టిక్

జవాబు:

Group – AGroup – B
ఎ) సహజ అయస్కాంతం2) లోడ్ స్టోన్
బి) ఆకర్షణ1) విజాతి ధృవాలు
సి) అనయస్కాంత5) ప్లాస్టిక్
డి) కృత్రిమ అయస్కాంతం3) హార్స్ షూ అయస్కాంతం
ఇ) వికర్షణ4) సజాతి ధృవాలు

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

These AP 6th Class Science Important Questions 5th Lesson పదార్థాలు – వేరుచేసే పద్ధతులు will help students prepare well for the exams.

AP Board 6th Class Science 5th Lesson Important Questions and Answers పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

6th Class Science 5th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
వస్తువులు దేనితో తయారవుతాయి?
జవాబు:
వస్తువులు రకరకాల పదార్థాలతో తయారవుతాయి.

ప్రశ్న 2.
నీటిపై తేలే పదార్థాలు ఏమిటి?
జవాబు:
తక్కువ బరువు కలిగిన కాగితం, కర్ర, ఆకు, ప్లాస్టిక్ బాటిల్ వంటి పదార్థాలు నీటిపై తేలుతాయి.

ప్రశ్న 3.
నీటిలో మునిగే పదార్థాలు ఏమిటి?
జవాబు:
ఎక్కువ బరువు కలిగిన రాయి, ఇనుము, మట్టి, ఇసుక వంటి పదార్థాలు నీటిలో మునిగిపోతాయి.

ప్రశ్న 4.
నీటిలో కరిగే పదార్థాలు అనగానేమి?
జవాబు:
నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కలిసిపోయే పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటాము.
ఉదా : ఉప్పు, పంచదార.

ప్రశ్న 5.
నీటిలో కరగని పదార్థాలు అంటే ఏమిటి?
జవాబు:
నీటిలో కలిపినప్పుడు కలిసిపోని పదార్థాలను నీటిలో కరగని పదార్థాలు అంటాము.
ఉదా : రాయి.

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

ప్రశ్న 6.
విశ్వ ద్రావణి అనగానేమి?
జవాబు:
నీరు అనేక పదార్థాలను కరిగించుకుంటుంది. కావున నీటిని విశ్వద్రావణి అంటాము.

ప్రశ్న 7.
ద్రావణం అనగానేమి?
జవాబు:
ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవ పదార్థాన్ని ద్రావణం అంటాము.

ప్రశ్న 8.
నీటిలో అన్ని ద్రవాలు కరుగుతాయా?
జవాబు:
కొబ్బరి నూనె, కిరోసిన్ వంటి ద్రవాలు నీటిలో కరగవు.

ప్రశ్న 9.
నీటిలో కరిగే ద్రవ పదార్థాలు ఏమిటి?
జవాబు:
నిమ్మరసం, వెనిగర్ ద్రవాలు నీటిలో కరుగుతాయి.

ప్రశ్న 10.
మిశ్రమాలు అనగానేమి?
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో తయారైన వాటిని మిశ్రమాలు అంటాము.

ప్రశ్న 11.
చేతితో ఏరివేసే పద్ధతికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బియ్యం నుంచి రాళ్లను తీసివేయడం, ధాన్యంలో నుంచి మట్టి గడ్డలు తీయటం చేతితో ఏరివేసే పద్ధతికి ఉదాహరణలు.

ప్రశ్న 12.
తూర్పారపట్టడం ఎప్పుడు అవసరమవుతుంది?
జవాబు:
ధాన్యం నుంచి ఊక, తాలు వేరు చేయడానికి తూర్పారపట్టడం అవసరము.

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

ప్రశ్న 13.
ధాన్యం నుంచి తాలు ఎలా వేరు అవుతుంది?
జవాబు:
ధాన్యంతో పోల్చినప్పుడు ఊకతాళ్లు చాలా తేలికగా ఉంటాయి, అందువల్ల రైతులు ధాన్యాన్ని తూర్పారపట్టడం ద్వారా తాలు నుంచి వేరు చేస్తారు.

ప్రశ్న 14.
తేర్చటానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మట్టి నుంచి నీటిని వేరు చేయడానికి తేర్చటం ఉపయోగిస్తాము.

ప్రశ్న 15.
నిత్యజీవితంలో ఏ సందర్భాల్లో తేర్చటం ఉపయోగిస్తాము?
జవాబు:
బియ్యం కడిగేటప్పుడు రాళ్లను వేరు చేయడానికి, మినపప్పు నుంచి రాళ్ళను వేరు చేయడానికి తేర్చటం ఉపయోగిస్తాం.

ప్రశ్న 16.
టీ డికాషన్ నుంచి, టీ పొడిని ఎలా వేరు చేస్తారు?
జవాబు:
వడపోత ద్వారా టీ డికాషన్ నుంచి, టీ పొడిని వేరు చేస్తారు.

ప్రశ్న 17.
పిండి నుంచి పొట్టు ఎలా వేరు చేస్తారు?
జవాబు:
జల్లించడం ద్వారా పిండి నుంచి పొట్టును వేరు చేయవచ్చు.

ప్రశ్న 18.
క్రొమటోగ్రఫి అనగానేమి?
జవాబు:
రంగుల మిశ్రమం నుంచి వివిధ రంగులను వేరు చేసే ప్రక్రియను క్రొమటోగ్రఫి అంటారు.

ప్రశ్న 19.
సముద్రం నుంచి ఉప్పు పొందే ప్రక్రియ ఏమిటి?
జవాబు:
స్ఫటికీకరణ ప్రక్రియ ద్వారా సముద్రం నుంచి ఉప్పు పొందుతాము.

ప్రశ్న 20.
రంగులను విశ్లేషించే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
రంగులను విశ్లేషించే ప్రక్రియను క్రొమటోగ్రఫి అంటారు.

ప్రశ్న 21.
స్వేదనజలం ఎక్కడ ఉపయోగిస్తాము?
జవాబు:
ఇంజక్షన్ చేసే మందులలో స్వేదనజలం ఉపయోగిస్తాము.

6th Class Science 5th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జల్లించటంను ఎక్కడ ఉపయోగిస్తాము?
జవాబు:

  1. నాణ్యమైన ఇసుకను పొందటానికి జల్లించటం ఉపయోగిస్తాము.
  2. పిండి పదార్థాన్ని జల్లించి పిండివంట చేసుకుంటాము.
  3. రైతులు ధాన్యాన్ని జల్లించి రాళ్లను వేరుచేస్తారు.
  4. మిల్లులో బియ్యాన్ని జల్లించి నూకలు వేరుచేస్తారు.

ప్రశ్న 2.
ఒకే పదార్థాలతో తయారయ్యే వస్తువులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చెక్క కుర్చీ – చెక్కతో తయారవుతుంది.
గడ్డపార – ఇనుముతో తయారవుతుంది.
విగ్రహం – రాతితో తయారవుతుంది.
టైరు – రబ్బర్ తో తయారవుతుంది.

ప్రశ్న 3.
ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారయ్యే వస్తువుల గురించి రాయండి.
జవాబు:
కొన్నిసార్లు వస్తువుల తయారీకి ఒకటికంటే ఎక్కువ పదార్థాలు వాడతాము. ఉదాహరణకు
సైకిల్ – ఇనుము, రబ్బరు
కిటికీ – చెక్క ఇనుము
కుర్చీ – ఇనుము, ప్లాస్టిక్ వైర్లు
పార _ ఇనుము, చెక్క

ప్రశ్న 4.
కుర్చీ తయారీలో కొన్ని రకాల పదార్థాలు వాడవచ్చు?
జవాబు:
కుర్చీ తయారీలో ఇనుము, ప్లాస్టిక్ వైరు లేదా నవారు ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకే పదార్థం ఉపయోగించి కుర్చీలు తయారు చేయవచ్చు. ఉదాహరణకి చెక్క, ప్లాస్టిక్ కుర్చీ, ఇనుప కుర్చీ.

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

ప్రశ్న 5.
వస్తువుల తయారీకి ఒకే పదార్థం సరిపోతుందని వివేక్ అన్నాడు. దీన్ని నువ్వు సమర్థిస్తావా?
జవాబు:
కుర్చీలు, బల్లలు, సైకిల్, ఎడ్లబండ్లు, వంటపాత్రలు, బట్టలు, టైర్లు వంటి ఎన్నో వస్తువులను మన చుట్టూ గమనిస్తూ ఉంటాము. వస్తువులన్నీ వేరువేరు పదార్థాలతో తయారయి ఉంటాయి. కొన్ని వస్తువులు ఒకే పదార్థంతో మరికొన్ని వస్తువులు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారవుతాయి. కావున పై వాక్యాన్ని పూర్తిగా సమర్థించలేము.

ప్రశ్న 6.
పదార్థాల ధర్మాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?
జవాబు:
ఏ వస్తువుకు ఏ పదార్థం వాడాలి నిర్వహించాలంటే ముందుగా ఆ పదార్థాల ధర్మాలు తెలుసుకోవాలి. మెత్తదనం, గట్టిదనం మరియు నిల్వ ఉండటం, మెరుపు లేకపోవడం అనే ఎన్నో ధర్మాల పదార్థాలుంటాయి. పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా వేరువేరు సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఒక్కో వస్తువుకు ఒక్కో ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుంది కాబట్టి ఏ వస్తువుకు ఏ పదార్థం వాడాలో తెలియాలంటే మనకు పదార్థాల ధర్మాల గురించి తెలియాలి.

ప్రశ్న 7.
పదార్థాల స్థితులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
సాధారణంగా పదార్థాలు మూడు స్థితులలో ఉంటాయి. అవి : 1. ఘనస్థితి 2. ద్రవస్థితి 3. వాయుస్థితి.

ప్రశ్న 8.
నీటి యొక్క మూడు స్థితులు తెలపండి.
జవాబు:
ప్రకృతిలో నీరు మూడు స్థితులలో లభిస్తుంది. ఘనస్థితిలో ఉండే నీటిని మంచు అంటాము. ఇది పర్వత శిఖరాలపై, ధ్రువ ప్రాంతాలలో ఉంటుంది. నీటి యొక్క ద్రవస్థితిని నీరు అంటాము. ఇది నదులలోను, సముద్రాలలోను ఉంటుంది. నీటి యొక్క వాయుస్థితిని నీటి ఆవిరి అంటాము. ఇది వాతావరణంలో తేమ రూపంలో ఉంటుంది.

ప్రశ్న 9.
ఒక పదార్థం యొక్క స్థితి ఎప్పుడు మారుతుంది?
జవాబు:
వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారతాయి. అదేవిధంగా చల్లబరచినప్పుడు వాయుస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారతాయి. కావున ఉష్ణోగ్రతలను మార్చి పదార్థం యొక్క స్థితిని మార్చవచ్చును.

ప్రశ్న 10.
ఘన పదార్థాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నిర్దిష్ట ఆకారం కలిగి గట్టిగా ఉండే పదార్థ స్థితిని ఘనస్థితి అంటాము.
ఉదా : రాయి, గోడ, బల్ల.

ప్రశ్న 11.
ద్రవ పదార్థాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నిర్దిష్ట ఆకారం లేకుండా ప్రవహించే ధర్మాన్ని కలిగి ఉండి, ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకారం ఉండే వాటిని ద్రవపదార్థాలు అంటాము.
ఉదా : పాలు, నూనె.

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

ప్రశ్న 12.
వాయు పదార్థాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నిర్దిష్ట ఆకారం లేకుండా ఎక్కువ ప్రాంతము విస్తరించే గాలి వంటి పదార్థాలను వాయువులు అంటాము.
ఉదా : హైడ్రోజన్, ఆక్సిజన్.

ప్రశ్న 13.
పంచదార తాను పోసిన పాత్ర ఆకారాన్ని పొందినప్పటికీ అది ఘన పదార్థమే కాని ద్రవ పదార్థం కాదు. చర్చించండి.
జవాబు:
పంచదార స్ఫటిక నిర్మాణం కలిగి ఉంటుంది. స్ఫటికాలు పరిమాణంలో చిన్నవిగా ఉండటం వల్ల అవి పాత్ర ఆకారంలో సరిపోతాయి. అయినప్పటికీ పంచదార ద్రవపదార్థం కాదు. పంచదార స్ఫటికాన్ని పరిశీలించినట్లయితే అది నిర్దిష్ట ఘనపరిమాణం కలిగి గట్టిగా ఉంటుంది. ఇది ఘన పదార్థం యొక్క లక్షణం కావున పంచదార కూడా ఘన పదార్థమే.

ప్రశ్న 14.
సాధారణ ఉప్పు ఘన పదార్థమా? లేక ద్రవ పదార్థమా?
జవాబు:
సాధారణ ఉప్పు ఘన పదార్థం. ఉప్పు స్ఫటిక నిర్మాణం కలిగి ఉంటుంది. ఉప్పు స్ఫటికం గట్టిగా ఉండి నిర్దిష్ట ఆకారం కలిగి ఉంటుంది. కావున సాధారణ ఉప్పు ఘన పదార్థం.

ప్రశ్న 15.
కొన్ని పదార్థాలు నీటిలో మునుగుతాయి, మరికొన్ని తేలుతాయి. ఎందుకు?
జవాబు:
నీటి కంటే ఎక్కువ బరువు ఉన్న పదార్థాలు నీటిలో మునిగిపోతాయి. నీటి కంటే తక్కువ బరువు ఉన్న పదార్థాలు నీటిపై తేలుతాయి. ఉదాహరణకు ఎక్కువ బరువు కలిగిన రాయి నీటిలో మునుగుతుంది. తక్కువ బరువు కలిగిన కాగితం నీటిపై తేలుతుంది.

ప్రశ్న 16.
ఇనుప వస్తువులు నీటిలో తేలుతాయా?
జవాబు:
సాధారణంగా ఇనుప వస్తువులు నీటిలో మునిగిపోతాయి. కానీ వాటి ఆకారం మార్చడం వల్ల ఇనుప వస్తువులను నీటిపై చేర్చవచ్చు. ఉదాహరణకు ఇనుపమేకు నీటిలో మునగదు. ఇనుప డబ్బా నీటిపై తేలుతుంది. అందువల్లనే ఇనుము ఆకారాన్ని మార్చి పెద్ద పెద్ద పడవలను నీటిపై తేలే విధంగా తయారు చేస్తున్నారు.

ప్రశ్న 17.
నీటిని విశ్వ ద్రావణి అంటాము. ఎందుకు?
జవాబు:
ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవాన్ని ద్రావణము అంటాము. నీరు అనే ద్రావణం ఇతర ద్రావణాలతో పోల్చినప్పుడు ఎక్కువ పదార్థాలను తనలో కరిగించుకొంటుంది. అందుకని నీటిని “విశ్వద్రావణం” అంటాము.

ప్రశ్న 18.
మిశ్రమాలు అనగానేమి?
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ పదార్థాల కలయిక వల్ల మిశ్రమాలు ఏర్పడతాయి. మట్టి లాంటి మిశ్రమాలు సహజంగా లభిస్తే నిమ్మరసం, లడ్డు వంటి కొన్ని మిశ్రమాలు మనం తయారు చేస్తాం.

ప్రశ్న 19.
పదార్థాలు వేరు చేసే కొన్ని పద్ధతులను తెలపండి.
జవాబు:
పదార్థాలు వేరు చేయడానికి అనేక పద్ధతులు వాడతాం. అవి : 1. తూర్పారపట్టడం 2. జల్లించటం 3. చేతితో ఏరటం 4. స్ఫటికీకరణ 5. స్వేదనం 6. ఉత్పతనం 7. క్రొమటోగ్రఫి

ప్రశ్న 20.
తూర్పారపట్టడం గురించి రాయండి.
జవాబు:
రైతులు తమ పంటను నూర్చినప్పుడు ఊక, తాలు, ధాన్యం గింజల మిశ్రమం లభిస్తుంది. రైతులు వీటిని వేరు చేయడానికి తూర్పారపడతారు. గాలి ఎక్కువగా ఉన్న రోజు రైతు ఒక ఎత్తైన బల్లమీద నిలబడి ధాన్యం ఊక, తాలు మిశ్రమాన్ని చేటతో ఎత్తి క్రిందకు నెమ్మదిగా పోస్తూ ఉంటారు. ఊక, తాలు, ఇతర చెత్త గాలికి దూరంగా పడిపోతాయి. మంచిధాన్యం ఒక రాశి లాగా నేరుగా కింద పడుతుంది. ధాన్యంతో పోల్చినప్పుడు ఊక, తాలు తేలికగా ఉంటాయి. అందువల్ల రైతులు తూర్పార పట్టడం అనే ధర్మాన్ని ఉపయోగించి ధాన్యం నుంచి తాలు వేరు చేస్తారు.

ప్రశ్న 21.
జల్లెడ ఉపయోగించి మురికి నీటి నుంచి మట్టిని వేరు చేయగలవా? దీనికోసం నీవు ఏ పద్ధతి వాడతావు?
జవాబు:
జల్లెడ ఉపయోగించి మురికి నీటి నుంచి మట్టిని వేరు చేయలేము. మురికి కణాలు జల్లెడలోని రంధ్రాల కంటే చాలా చిన్నవి. అందువలన ఇవి నీటితోపాటు ప్రయాణిస్తాయి. మురికి నీటి నుంచి మట్టిని వేరు చేయడానికి వడపోత మంచి పద్దతి. దీనికోసం వడపోత కాగితం వాడుతాము.

ప్రశ్న 22.
వడపోత కాగితం గురించి రాయండి.
జవాబు:
వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి చాలా వడపోయవచ్చు. నీటి నుంచి మట్టి కణాలను తొలగించడానికి వడపోత కాగితం చాలా మంచి సాధనం.

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

ప్రశ్న 23.
వడపోత కాగితం ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పు కణాలను వేరు చేయగలమా?
జవాబు:
వడపోత కాగితం ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పు కణాలను వేరు చేయలేము. వడపోత కాగితంలో చాలా సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. అయినప్పటికీ ఈ రంధ్రాల ద్వారా ఉప్పు కణాలు జారిపోతాయి. దీనిని బట్టి ఉప్పు కణాలు ఎంత చిన్నవిగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రశ్న 24.
ఉప్పు నీటి నుంచి ఉప్పు ఎలా పొందుతారు?
జవాబు:
ఉప్పునీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి, సూర్యరశ్మికి మడులలో నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది.

ప్రశ్న 25.
స్పటికీకరణం అనగానేమి?
జవాబు:
ద్రవపదార్థాన్ని వేడిచేసి ఆవిరిగా మార్చడం వల్ల దానిలోని ఘన పదార్థం స్ఫటికాలుగా మారుతుంది. ఈ ప్రక్రియను స్పటికీకరణం అంటాము. ఈ ప్రక్రియ ద్వారా మనము సముద్రం నుంచి ఉప్పును తయారు చేస్తాము.

ప్రశ్న 26.
స్వేదనము అనగానేమి?
జవాబు:
ద్రవ పదార్థాన్ని ఆవిరిగా మార్చి దానిని చల్లబర్చటం వల్ల స్వచ్ఛమైన ద్రవ పదార్థాన్ని పొందటాన్ని స్వేదనం అంటారు. ఈ ప్రక్రియలో వైద్యులు ఇంజక్షన్లలో వాడే మంచి నీటిని తయారుచేస్తారు.

ప్రశ్న 27.
ఉత్పతనం అనగానేమి?
జవాబు:
కొన్ని ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు అవి నేరుగా వాయుస్థితికి మారటాన్ని ఉత్పతనం అంటారు.
ఉదా : అయోడిన్.

ప్రశ్న 28.
మన నిత్య జీవితంలో క్రొమటోగ్రఫీని ఎక్కడ ఉపయోగిస్తాము?
జవాబు:
ఆహార పదార్థాలు ఎంతవరకు పాడైపోయాయో నిర్ధారించడానికి, నేరస్తులను గుర్తించడానికి, రక్తాన్ని విశ్లేషించడానికి, నేర నిర్ధారణ విభాగంలో, శరీరంలోని జీవక్రియల విశ్లేషణకు క్రొమటోగ్రఫీని ఉపయోగిస్తాము.

6th Class Science 5th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నీకు దగ్గర సముద్రపు ఒడ్డున గల ఉప్పుమండలిలోనికి వెళ్ళి వ్రాయుము. ఉప్పును ఎలా తయారు చేస్తారు?
జవాబు:

  1. ఉప్పునీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు.
  2. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు.
  3. గాలికి, సూర్యరశ్మికి మడులలోని నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది.
    AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 1

ప్రశ్న 2.
హేమంత ను కొన్ని కిరాణా సరుకులు, కూరగాయలు కొనుక్కురమ్మని వాళ్ళ అమ్మ పంపించింది. అతను పచ్చిమిరపకాయలు, టమాటాలు, కందిపప్పు, గోధుమపిండి, ధనియాలు కొని వాటిని ఒక సంచిలో జాగ్రత్తగా ఉంచాడు. ఇంటికి తిరిగి వస్తుంటే రాయి తగిలి రోడ్డుపైన పడిపోయాడు. సంచిలోని వస్తువులన్నీ నేలపై పడిపోయాయి, వాటిని అతను ఏరినట్లయితే
ఎ) మొదటగా ఏ పదార్థాన్ని వేరుచేస్తాడు?
బి) టమాటాలు, పచ్చిమిరపకాయలను ఎలా వేరుచేస్తాడు?
సి) గోధుమపిండిని అతను ఎలా వేరుచేస్తాడు?
డి) ధనియాలను అతను ఎలా వేరుచేస్తాడు?
మీ స్వీయ అనుభవం ద్వారా సమాధానాలు వ్రాయుము.
జవాబు:
ఎ) అతను మొదటగా ప్యాకెట్ల రూపంలో గల సరుకులను చేతితో వేరుచేస్తాడు.
బి) టమాటాలను, పచ్చిమిరపకాయలను చేతితో ఏరి వాటిని వేరుచేస్తాడు.
సి) గోధుమపిండిని మట్టి, ఇసుక, చిన్న చిన్న రాళ్ళు రాకుండా చేతితో ఎత్తి ఇంటికి వెళ్ళాక “జల్లెడతో” వేరుచేస్తాడు.
డి) రోడ్డుపై పడ్డ ధనియాలను చేతితో ఎత్తి, చాట సహాయంతో చెరిగి వేరుచేస్తాడు.

ప్రశ్న 3.
నెయ్యి, మైనం, పంచదార, ఉప్పు, పసుపు, పప్పు దినుసులు, ప్లాస్టిక్, చెక్క, ఇనుపమేకులు మొదలైన కొన్ని ఘనపదార్ధాలను సేకరించండి. ఒక బకెట్ నిండుగా నీరు, బీకరు తీసుకోండి. కింద తెలిపినధర్మాలుగల పదార్థాలు ఏవో గుర్తించడానికి ప్రయత్నించండి.
ఎ) నీటిపై తేలే పదార్థాలు
బి) నీటిలో మునిగే పదార్థాలు
సి) నీటిలో కరిగే పదార్థాలు
డి) నీటిలో కరగని పదార్థాలు
జవాబు:
ఎ) నీటిపై తేలే పదార్థాలు : 1) నెయ్యి 2) మైనం 3) చెక్క 4) ప్లాస్టిక్

బి) నీటిలో మునిగే పదార్థాలు : 1) పంచదార 2) ఉప్పు 3) పసుపు 4) పప్పు దినుసులు 5) ఇనుప మేకులు

సి) నీటిలో కరిగే పదార్థాలు : 1) పంచదార 2) ఉప్పు ..

డి) నీటిలో కరగని పదార్థాలు : 1) నెయ్యి 2) మైనం 3) పసుపు 4) పప్పు దినుసులు 5) ఇనుపమేకులు

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

ప్రశ్న 4.
ఒక బీకరులో సగం వరకు నీరు తీసుకొని దానిలో ఇసుక, రంపపు పొట్టు, ఉప్పును చేర్చండి. మిశ్రమాన్ని బాగా కలపండి. దీనిని 10 నిమిషాలు కదిలించకుండా అలాగే ఉంచండి.
a) నీవు ఏమి గమనించావు?
b) ఏ పదార్థం నీటిమీద తేలుతుంది?
c) తేలుతున్న పదార్థాన్ని నీవు ఎలా సేకరిస్తావు?
d) బీకరు అడుగు భాగంలో ఏ పదార్దం చేరివుంది?
e) దాన్ని తిరిగి ఎలా సేకరించగలవు?
f) ఏ పదార్థం నీటిలో కరిగినది?
g) ఆ పదార్ధాన్ని నీవు తిరిగి ఎలా పొందగలవు?
జవాబు:
a) నీటిలో రంపపు పొట్టు పైకి తేలినది. ఉప్పు నీటిలో కరిగింది. ఇసుక పూర్తిగా కిందికి దిగింది.
b) రంపపు పొట్టు తేలింది.
c) తేరిన దానిని వంచడం ద్వారా రంపపు పొట్టును సేకరిస్తాము.
d) బీకరు అడుగుభాగాన ఇసుక ఉంది.
e) వడబోత ద్వారా ఇసుకను సేకరిస్తాము.
f) ఉప్పు నీటిలో కరిగింది.
g) ఇగుర్చు ప్రక్రియ ద్వారా నీటిలో కరిగిన ఉప్పును పొందగలము.

ప్రశ్న 5.
1) మనకు తారసపడే అనేక సందర్భాలలో, వేర్వేరు వస్తువులను ఒక మిశ్రమం నుంచి వేరుచేయవలసి ఉంటుంది. అటువంటి రెండు సందర్భాలను ఉదహరించండి.
జవాబు:
1) బియ్యం , చిన్న చిన్న రాళ్లు
2) మురికి నీరు

2) ఆ వస్తువులను నీవు వేరుచేయడానికి ఏం చేస్తావు?
జవాబు:
1) బియ్యంలో చిన్న చిన్న రాళ్లను చేతితో ఏరివేసి వేరుచేస్తాం.
2) వడబోత కాగితంతో మురికినీటిని వడబోస్తాం. వడబోత కాగితం అనేది కాగితంతో తయారయిన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడబోయవచ్చు. మిశ్రమంలోని ప్రతి వస్తువునూ వేరుచేయగల్గితిని.

3) నీవు మిశ్రమంలోని ప్రతి వస్తువునూ వేరుచేయగలిగావా? అన్ని సందర్భాలలో నువ్వు వేరుచేసేందుకు ఉపయోగించిన పద్దతులు ఒకే విధంగా ఉన్నాయా?
జవాబు:
నేను మిశ్రమంలోని పదార్థాలను వేరు చేసేందుకు ఉపయోగించిన పద్దతులు అన్ని సందర్భాలలో ఒకే విధంగా లేవు.

ప్రశ్న 6.
కింది సందర్భాలలో మిశ్రమం నుండి ఒక అంశాన్ని వేరుచేయాలంటే ఏ పద్ధతి ఉపయోగించాలి?
అ) మరొక దానికంటే బరువుగా ఉన్నవాటిని
ఆ) మరొక దానికంటే పెద్దవిగా ఉన్నవాటిని
ఇ) రంగు, ఆకారంలో వేరుగా ఉన్నవాటిని
ఈ) ఒకటి నీటిలో కరిగేది మరొకటి నీటిలో కరగనిది ఉన్నప్పుడు
ఉ) ఒకటి నీటిలో తేలేది మరొకటి నీటిలో తేలనిది ఉన్నప్పుడు
జవాబు:
అ) తూర్పారబెట్టడం
ఆ) జల్లించడం
ఇ) చేతితో ఏరివేయడం
ఈ) వడబోత
ఉ) తేర్చుట

ప్రశ్న 7.
మీదగ్గరలో ఉన్నపాలకేంద్రానికి వెళ్ళండి. పాలనుంచి వెన్ననుఎలావేరుచేస్తారో తెలుసుకోండి.నివేదికరాయండి.
జవాబు:

  1. సెంట్రీ ఫ్యూజ్ తో పాల నుండి వెన్నను వేరుచేస్తున్నారు.
  2. ఒక పాత్రలో పాలు తీసుకుని దానిని ఏకరీతి వేగంతో వృత్తాకార మార్గంలో తిరుగునట్లు చేశారు.
  3. వృత్తాకార మార్గంలో పదార్థాలను తిప్పడానికి కావలసిన అపకేంద్రబలం తేలికైన పదార్థాలకు తక్కువగాను, బరువైన పదార్థాలకు ఎక్కువగాను ఉంటుంది.
  4. అందువల్ల పదార్థాలు వృత్తాకార మార్గంలో తిరుగునపుడు తేలికైన పదార్థాలు (వెన్న) తక్కువ వ్యాసార్ధం వున్న – వృత్తాకార మార్గంలోను, బరువైన పదార్థాలు (పాలు) ఎక్కువ వ్యాసార్ధం వున్న వృత్తాకార మార్గంలోను ఉంటాయి.
  5. అందువల్ల వృత్తాకార మార్గంలో తిరిగే పాత్రలో అడుగుభాగానికి పాలు, పై భాగానికి వెన్న తేలుతాయి. దానిని వేరుచేస్తున్నారు.
  6. మన ఇళ్ళలో ఇదే సూత్రం ఆధారంగా పెరుగును కవ్వంతో చిలికి వెన్నను రాబడతారు.

ప్రశ్న 8.
మిశ్రమాలను వేరుచేయడానికి దివ్య కొన్ని పద్ధతులను సూచించింది. అవి సరయినవో కాదో, సాధ్యమౌతాయో లేదో చెప్పండి. కారణాలు రాయండి.
అ) వడపోయడం ద్వారా సముద్రపు నీళ్ళనుంచి మంచి నీరు పొందవచ్చు.
ఆ) పెరుగును తేర్చడం ద్వారా వెన్నను వేరుచేయవచ్చు.
ఇ) వడపోయడం ద్వారా టీ నుంచి చక్కెరను వేరుచేయవచ్చు.
జవాబు:
అ) 1) వడబోయడం ద్వారా సముద్రపు నీటి నుండి మంచి నీరు పొందలేము.
2) స్వేదన ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి మంచి నీరు పొందగలము.

ఆ) 1) పెరుగును తేర్చడం ద్వారా వెన్నను వేరుచేయలేము.
2) పెరుగును కవ్వంతో చిలకడం ద్వారా వెన్నను వేరుచేయగలము.

ఇ) 1) వడబోయడం ద్వారా టీ నుండి చక్కెరను వేరుచేయలేము.
2) ఇగర్చడం ద్వారా టీ నుండి చక్కెరను వేరుచేయగలము.

ప్రశ్న 9.
మీ ఇంట్లో ఆహార ధాన్యాలు శుభ్రం చేయడానికి ఉపయోగించే పద్ధతులను సేకరించి చార్టు తయారుచేయండి.
జవాబు:
ఆహారధాన్యాలు శుభ్రం చేయడానికి ఉపయోగించే పద్ధతులు :
1) చేతితో ఏరివేయడం :
ఈ పద్ధతిని ఉపయోగించి బియ్యం, తృణధాన్యాలలోని రాళ్లను చేతితో ఏరివేస్తాం.

2) జల్లించడం :
ఎ) మిశ్రమంలోని పదార్థాలు వేరు పరిమాణంలో వున్నప్పుడు జల్లించడం ద్వారా వాటిని వేరు చేస్తారు.
బి) జల్లెడలోని రంధ్రాల ద్వారా చిన్నసైజు కణాలు వెళ్లిపోతాయి. పెద్ద సైజు కణాలు జల్లెడలో ఉండిపోతాయి.
ఉదాహరణ : గోధుమ పిండిని జల్లించడం.

సి) పంట నూర్చుట :
వరి కంకుల నుండి ధాన్యం, గడ్డిని వేరుచేయుట.

ప్రశ్న 10.
మిశ్రమాలను వేరుచేయడానికి మీ ఇంటిలో ఉపయోగించు ఒక పరికరం పటం గీచి వివరించుము.
జవాబు:
మనం టీ డికాక్షన్ నుండి టీ పొడిని, ఎర్రమట్టి నుండి ఇసుకను వేరుచేయుటకు జల్లెడలను ఉపయోగిస్తాం.
AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 2

ప్రశ్న 11.
నీటిని వడబోయుటకు వడబోత కాగితం ఉపయోగించు విధానం పటము గీయుము.
(లేదా)
ప్రయోగశాలలో వడపోత విధానం అమరిక పటం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు 3

AP Board 6th Class Science 5th Lesson 1 Mark Bits Questions and Answers పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. రంగులను వేరుచేసే ప్రక్రియ
A) స్వేదనం
B) ఉత్పతనం
C) ఫోటోగ్రఫీ
D) క్రోమటోగ్రఫీ
జవాబు:
D) క్రోమటోగ్రఫీ

2. ఘన స్థితి నుంచి వాయు స్థితికి నేరుగా మార్చే ప్రక్రియ
A) స్వేదనం
B) ఫోటోగ్రఫీ
C) ఉత్పతనం
D) క్రోమాటోగ్రఫీ
జవాబు:
C) ఉత్పతనం

3. ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరచి నీరుగా మారుస్తాం?
A) స్వేదనం
B) వడపోత
C) తూర్పారపట్టడం
D) జల్లించడం
జవాబు:
A) స్వేదనం

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

4. సముద్రం నుండి. ఉప్పును తయారు చేసే ప్రక్రియ
A) స్ఫటికీకరణ
B) ఉత్పతనం
C) స్వేదనం
D) వడపోత
జవాబు:
A) స్ఫటికీకరణ

5. నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతి
A) వడపోత
B) తరలించటం
C) స్పటికీకరణం
D) క్రోమటోగ్రఫీ
జవాబు:
A) వడపోత

6. రైతులు ధాన్యం నుంచి తాలు వేరుచేసే ప్రక్రియ
A) వడపోత
B) తూర్పారపట్టడం
C) జల్లించడం
D) ఆవిరి చేయటం
జవాబు:
B) తూర్పారపట్టడం

7. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ఏర్పడేవి
A) మిశ్రమాలు
B) రసాయనాలు
C) ఘన పదార్థాలు
D) ద్రవ పదార్థాలు
జవాబు:
A) మిశ్రమాలు

8. విశ్వ ద్రావణి
A) ఆల్కహాల్
B) నీరు
C) పాలు
D) కిరోసిన్
జవాబు:
B) నీరు

9. నీటి కంటే బరువైన పదార్థాలు నీటిలో
A) తేలుతాయి
B) మునుగుతాయి
C) కొట్టుకుపోతాయి
D) పగిలిపోతాయి
జవాబు:
B) మునుగుతాయి

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

10. పాత్రల ఆకారము పొందే ఘన పదార్థం
A) ఇసుక
B) పాలు
C) నీరు
D) గాలి
జవాబు:
A) ఇసుక

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. వస్తువులు …….. తో తయారవుతాయి.
2. ఒకే పదార్థంతో తయారైన వస్తువు ………….
3. పదార్థాలు ………… స్థితులలో ఉంటాయి.
4. నీటి యొక్క స్థితిని …….. అంటాము.
5. నీటి యొక్క ……… వాయు స్థితి రూపము.
6. పదార్థాల స్థితి మారటానికి …….. అవసరం.
7. ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు ……… స్థితికి వస్తాయి.
8. నిర్దిష్టమైన ఆకారం కలిగి ఉన్న పదార్థాలు …………….
9. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకొనే పదార్థాలు ………………
10. ద్రవపదార్థాలను వేడి చేస్తే అవి ……. స్థితికి మారతాయి.
11. చక్కెర …………. స్థితి కలిగి ఉంది.
12. ఘన స్థితిలో ఉన్నప్పటికీ పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థం ………..
13. నీటిలో మునిగే పదార్థం …………
14. నీటిలో తేలే పదార్థం ………..
15. నీటిలో కరిగే పదార్థాలు …………..
16. నీటిలో కరగని పదార్థాలు …………
17. విశ్వ ద్రావణి ………………
18. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ……………. ఏర్పడతాయి.
19. మిశ్రమ పదార్థం ………….. నకు ఉదాహరణ.
20. బియ్యం నుంచి రాళ్లు తీసివేయడానికి వాడే పద్ధతి ……………..
21. ధాన్యం నుంచి తాలు వేరు చేసే పద్ధతి ………..
22. మట్టి నీటి నుంచి మట్టిని, వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి …………
23. టీ డికాషన్ నుంచి టీ వేరు చేయడానికి వాడే పద్ధతి …………..
24. పిండిని శుభ్రం చేయడానికి వాడే పద్దతి …………..
25. సముద్రం నుంచి ఉప్పు పొందే పద్దతి ………….
26. నీటిని ఆవిరిగా మార్చి దానిలోని ఘన పదార్థాలను
వేరు చేయటాన్ని ………….. అంటాము.
27. స్వచ్ఛమైన నీటిని …………… పద్ధతిలో పొందుతాము.
28. వర్షం పడటంలో ఇమిడి ఉన్న ప్రక్రియలు ……………
29. ఉత్పతనం చెందే పదార్థం …………….
30. ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితికి మారటాన్ని …………… అంటాము.
31. రంగుల మిశ్రమం నుంచి రంగులను వేరుచేయు ప్రక్రియ ……………
32. రోజువారి జీవితంలో చూసే ఉత్పతనం చెందే పదార్థం …………
33. సుద్ద ముక్క , నీరు, సిరాతో నీవు ……………. నిరూపిస్తావు.
34. ఉప్పు మిశ్రమం నుంచి కర్పూరాన్ని వేరు చేయడానికి వాడే పద్దతి ……………..
35. సాధారణ నీటి నుంచి, స్వచ్ఛమైన నీటిని పొందటానికి వాడే పద్ధతి ……………..
35. ఉప్పు తయారీలో ఇమిడి ఉన్న ప్రక్రియ ……………
36. నీటి నుంచి సన్నని కణాలను వేరు చేయడానికి వాడే పద్దతి …………..
37. అధిక మొత్తంలో ఉన్న ధాన్యం నుంచి రాళ్లను వేరు
చేయడానికి రైతులు వాడే పద్దతి ………..
38. నీటి నుంచి మినపపొట్టు వేరు చేయడానికి గృహిణిలు వాడే పద్ధతి ……………
39. పదార్థాలను వేరు చేయటానికి ……………. పద్ధతిలో గాలి అవసరం.
40. ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవ పదార్థము ……….
జవాబు:

  1. పదార్థం
  2. గడ్డపార
  3. మూడు
  4. ద్రవస్థితి
  5. నీటి ఆవిరి
  6. ఉష్ణోగ్రత
  7. ద్రవ
  8. ఘన పదార్థాలు
  9. ద్రవ పదార్థాలు
  10. వాయు
  11. ఘన
  12. చక్కెర, ఉప్పు, ఇసుక
  13. రాయి
  14. చెక్క
  15. ఉప్పు, పంచదార
  16. ఇసుక
  17. నీరు
  18. మిశ్రమాలు
  19. లడ్డు, నిమ్మరసం
  20. చేతితో ఏరటం
  21. తూర్పారపట్టడం
  22. తేర్చటం
  23. వడపోత
  24. జల్లించటం
  25. స్పటికీకరణ
  26. స్పటికీకరణ
  27. స్వేదనం
  28. భాష్పోత్సేకం, స్వేదనం
  29. అయోడిన్
  30. క్రోమాటోగ్రఫీ
  31. కర్పూరం
  32. క్రోమటోగ్రఫీ
  33. ఉత్పతనం
  34. స్వేదనం
  35. స్పటికీకరణం
  36. వడపోత
  37. జల్లించటం
  38. తేర్చటం
  39. తూర్పారపట్టడం
  40. ద్రావణం

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – AGroup – B
ఎ) ఒకే పదార్థంతో తయారైన వస్తువులు1. నీరు
బి) ఎక్కువ పదార్థంతో తయారైన వస్తువులు2. నిర్దిష్ట ఆకారం
సి) మిశ్రమాలు3. ఇనుప బీరువా
డి) ఘన పదార్థం4. సైకిల్
ఇ) విశ్వ ద్రావణి5. లడ్డు

జవాబు:

Group – AGroup – B
ఎ) ఒకే పదార్థంతో తయారైన వస్తువులు3. ఇనుప బీరువా
బి) ఎక్కువ పదార్థంతో తయారైన వస్తువులు4. సైకిల్
సి) మిశ్రమాలు5. లడ్డు
డి) ఘన పదార్థం2. నిర్దిష్ట ఆకారం
ఇ) విశ్వ ద్రావణి1. నీరు

2.

Group – AGroup – B
ఎ) స్థితి మార్పు1. పంచదార
బి) ఉత్పతనం2. గాలి
సి) నీటిలో తేలేవి3. ఉష్ణోగ్రత
డి) వాయు పదార్థాలు4. కర్పూరం
ఇ) నీటిలో కరిగేవి5. చెక్క

జవాబు:

Group – AGroup – B
ఎ) స్థితి మార్పు3. ఉష్ణోగ్రత
బి) ఉత్పతనం4. కర్పూరం
సి) నీటిలో తేలేవి5. చెక్క
డి) వాయు పదార్థాలు2. గాలి
ఇ) నీటిలో కరిగేవి1. పంచదార

3.

Group – AGroup – B
ఎ) తూర్పారపట్టడం1. ఉప్పు
బి) క్రొమటోగ్రఫి2. ఇసుక
సి) స్వేదనం3. ధాన్యం
డి) నీటిలో మునిగేవి4. శుద్దజలం
ఇ) స్ఫటికీకరణ5. రంగులు

జవాబు:

Group – AGroup – B
ఎ) తూర్పారపట్టడం3. ధాన్యం
బి) క్రొమటోగ్రఫి4. శుద్దజలం
సి) స్వేదనం5. రంగులు
డి) నీటిలో మునిగేవి2. ఇసుక
ఇ) స్ఫటికీకరణ1. ఉప్పు

మీకు తెలుసా?

→ ద్రావణం అనేది ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవ పదార్థం. నీరు అనే ద్రావణం ఇతర ద్రావణాలతో పోల్చినప్పుడు ఎక్కువ పదార్థాలను తనలో కరిగించుకుంటుంది. అందుకని నీటిని “విశ్వ ద్రావణి” అంటారు.

AP 6th Class Science Important Questions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు

→ రైతులు జల్లెడలనుపయోగించి పెద్ద ధాన్యం గింజలను, చిన్న ధాన్యం గింజలను వేరుచేస్తారు. అప్పుడు పెద్ద ధాన్యం గింజలను, విత్తనాలుగా కాని లేదా అధిక రేటుకు విక్రయించటంగాని చేస్తారు.

→ ఉప్పునీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి, సూర్యరశ్మికి మడులలో నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది.

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

These AP 6th Class Science Important Questions 2nd Lesson మొక్కల గురించి తెలుసుకుందాం will help students prepare well for the exams.

AP Board 6th Class Science 2nd Lesson Important Questions and Answers మొక్కల గురించి తెలుసుకుందాం

6th Class Science 2nd Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఈనెల వ్యాపనం రకాలు ఏమిటి?
జవాబు:
ఈనెల వ్యాపనం రెండు రకాలు. అవి :

  1. జాలాకార ఈనెల వ్యాపనం
  2. సమాంతర ఈనెల వ్యాపనం.

ప్రశ్న 2.
పత్ర రంధ్రము యొక్క పని ఏమిటి?
జవాబు:
పత్ర రంధ్రము బాష్పోత్సేకమును నిర్వహిస్తుంది మరియు మొక్కకూ, వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి.

ప్రశ్న 3.
మొక్కలోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
మొక్కలో వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు ప్రధాన భాగాలు.

ప్రశ్న 4.
వేరు వ్యవస్థ ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
వేరు వ్యవస్థలో రెండు రకాలు ఉన్నాయి.

  1. తల్లి వేరు వ్యవస్థ
  2. గుబురు వేరు వ్యవస్థ.

ప్రశ్న 5.
గుబురు వేరు వ్యవస్థకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఏకదళ బీజ మొక్కలకు గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది. ఉదా : గడ్డి, వరి, గోధుమ మొదలైనవి.

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

ప్రశ్న 6.
బీజదళం అంటే ఏమిటి?
జవాబు:
విత్తనంలో ఉన్న పప్పు బద్దలను బీజదళం అంటారు.

ప్రశ్న 7.
ఏకదళ బీజం మరియు ద్విదళ బీజాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఏకదళ బీజాలు :
గడ్డి, వరి, గోధుమ, మొక్కజొన్న మొదలైనవి.

ద్విదళ బీజాలు :
మామిడి, పప్పుధాన్యాలు, పండ్లు.

ప్రశ్న 8.
ఒక చిక్కుడు గింజకు ఎన్ని బీజ దళాలు ఉన్నాయి?
జవాబు:
చిక్కుడు గింజ విత్తనంలో రెండు బీజ దళాలు ఉంటాయి.

ప్రశ్న 9.
ద్విదళ బీజ దళాల మొక్కలు ఏ రకమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి?
జవాబు:
ద్విదళ బీజ దళాల మొక్కలలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది.

ప్రశ్న 10.
దుంప వేర్లకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ముల్లంగి, క్యారెట్, బీట్ రూట్, చిలగడదుంపలు దుంపవేర్లకు ఉదాహరణలు.

ప్రశ్న 11.
కాండం అంటే ఏమిటి?
జవాబు:
మొక్క యొక్క ప్రధాన అక్షాన్ని కాండం అంటారు.

ప్రశ్న 12.
కణుపు అంటే ఏమిటి?
జవాబు:
కణుపు, కణుపు మధ్యమం కాండం యొక్క ప్రధాన లక్షణము. కణుపు నుండి ఆకు, మొగ్గ, ముల్లు వంటి భాగాలు ఏర్పడతాయి.

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

ప్రశ్న 13.
కణుపు మధ్యమం అంటే ఏమిటి?
జవాబు:
కాండంలో రెండు వరుస కణుపుల మధ్య భాగాన్ని కణుపు మధ్యమం అంటారు.

ప్రశ్న 14.
మీరు ఏ మొక్కలో సమాంతర ఈ నెల వ్యాపనం గమనిస్తారు?
జవాబు:
గడ్డి, తృణధాన్యాలు, చిరు ధాన్యాలు వంటి ఏక దళ బీజం మొక్కలలో మనం సమాంతర ఈ నెల వ్యాపనంను పరిశీలిస్తాము.

ప్రశ్న 15.
బాష్పోత్సేకము అంటే ఏమిటి?
జవాబు:
మొక్కలు తమ శరీరంలో అధికంగా ఉన్న నీటిని ఆవిరి రూపంలో పత్ర రంధ్రము ద్వారా విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియను బాష్పోత్సేకము అంటారు.

ప్రశ్న 16.
పువ్వు గురించి మీకు ఏమి తెలుసు?
జవాబు:
పువ్వు మొక్కలో రంగురంగుల మరియు ఆకర్షణీయమైన భాగం.

ప్రశ్న 17.
ఆకర్షక పత్రాలు అంటే ఏమిటి?
జవాబు:
పువ్వు యొక్క రంగురంగుల మరియు సువాసన భాగాలను ఆకర్షక పత్రాలు అంటారు.

ప్రశ్న 18.
చిరు ధాన్యాలను ఏక దళ బీజాలు అని ఎలా చెబుతారు?
జవాబు:
చిరు ధాన్యాల విత్తనంలో ఒక బీజ దళం మాత్రమే కలిగి ఉంది. కాబట్టి చిరు ధాన్యాలు ఏక దళ బీజాలు.

ప్రశ్న 19.
పనస ఆకుల సహాయంతో తయారుచేసే కోనసీమ యొక్క సాంప్రదాయ ఆహారానికి పేరు పెట్టండి.
జవాబు:
పొట్టిక్కలు.

ప్రశ్న 20.
గుబురు వేర్లు కలిగిన మొక్కల ఆకులలో ఏ రకమైన ఈ నెల వ్యాపనం కనిపిస్తుంది?
జవాబు:
గుబురు వేర్లు కలిగిన మొక్కల ఆకులలో సమాంతర ఈనెల వ్యాపనం కనిపిస్తుంది.

ప్రశ్న 21.
ఆకులు జాలాకార ఈ నెల వ్యాపనం కలిగి ఉండే వేరు రకం ఏమిటి?
జవాబు:
జాలాకార ఈనెల వ్యాపనం ఉన్న మొక్కలకు తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది.

ప్రశ్న 22.
మార్పు చెందిన కాండాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం మరియు చెరకు మార్పు చెందిన కాండాలకు ఉదాహరణలు.

ప్రశ్న 23.
గుబురు వేరు వ్యవస్థను నిర్వచించండి.
జవాబు:
కాండం యొక్క పునాది నుండి ఉత్పన్నమయ్యే సన్నని మరియు ఏకరీతి వేర్లు సమూహాన్ని గుబురు వేరు వ్యవస్థ అంటారు.

ప్రశ్న 24.
పొట్టిక్కలు పనస కాయ రుచిని ఎందుకు కల్గి ఉంటాయి?
జవాబు:
పనస చెట్టు యొక్క ఆకులను పొట్టిక్కలు తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టి, పొట్టిక్కలు పనస పండు రుచిని కలిగి ఉంటాయి.

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

ప్రశ్న 25.
ఊత వేర్లను కలిగి ఉన్న మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
మర్రి చెట్టు, చెరకు మరియు మొక్కజొన్న మొక్కలు భూమికి పై భాగంలో పెరిగిన వేర్లను కలిగి ఉంటాయి. ఇవి మొక్కలకు అదనపు బలాన్ని ఇచ్చి పడిపోకుండా కాపాడతాయి.

6th Class Science 2nd Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
బంగాళదుంప మరియు చిలగడదుంప మధ్య తేడాలు రాయండి.
జవాబు:

బంగాళదుంపచిలగడదుంప
1. ఇది కాండం యొక్క మార్పు.1. ఇది వేరు యొక్క మార్పు.
2. ఇది కాండంలో ఆహారాన్ని నిల్వ చేస్తున్నందున దీనిని దుంప కాండం అంటారు.2. ఇది ఆహారాన్ని వేర్లలో నిల్వ చేస్తున్నందున, దీనిని దుంప వేరు అంటారు.

ప్రశ్న 2.
తల్లి వేరు వ్యవస్థ మరియు గుబురు వేరు వ్యవస్థ మధ్య తేడాలను వ్రాయండి.
జవాబు:

తల్లి వేరు వ్యవస్థగుబురు వేరు వ్యవస్థ
1. తల్లి వేరు ఒకే ప్రాథమిక మూలాన్ని కలిగి ఉంటుంది.1. గుబురు వేరు వ్యవస్థ అనేక ప్రాథమిక మూలాలను కలిగి ఉంటుంది.
2. తల్లి వేరు వ్యవస్థలో తల్లి వేరు మరియు పార్శ్వ వేర్లు ఉంటాయి2. ఇందులో సన్నని మరియు ఏకరీతి వేర్ల సమూహం ఉంటుంది.
3. తల్లి వేరు మట్టిలోకి లోతుగా చొచ్చుకుపోతుంది.3. గుబురు వేరు నిస్సారమైనది మరియు లోతుగా చొచ్చుకుపోదు.
4. ఇది మొక్కలను కరువు పరిస్థితులలో జీవించడానికి సహాయపడుతుంది.4. ఇది నేల కోతను నివారించడానికి మొక్కకు సహాయపడుతుంది.
5. ద్విదళ బీజ దళాల మొక్కలలో కనిపిస్తుంది.5. ఏక దళ బీజ మొక్కలలో గుబురు వేరు వ్యవస్థ, కనిపిస్తుంది.

ప్రశ్న 3.
కరవు పరిస్థితులలో మొక్కకు మనుగడ సాగించడానికి ఏ వేరు వ్యవస్థ సహాయపడుతుంది?
జవాబు:
కొన్నేళ్లుగా వర్షాలు పడనప్పుడు అది కరవుకు దారితీస్తుంది.

  • కరవు పరిస్థితులలో నీరు నేల క్రింది పొరలకు చేరుతుంది.
  • నేల యొక్క లోతైన పొరల నుండి తేమను పొందడానికి తల్లి వేరు వ్యవస్థ అనుకూలం.
  • కాబట్టి, కరవు పరిస్థితులలో మొక్క మనుగడకు తల్లి వేరు వ్యవస్థ సహాయపడుతుంది.

ప్రశ్న 4.
అగ్ర మొగ్గ మరియు పార్వ మొగ్గ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

అగ్ర మొగ్గపార్శ్వ మొగ్గ
1. ఇది కాండం చివరిలో లేదా పైభాగంలో ఉంటుంది.1. ఇది ఆకు కణుపు వద్ద ఏర్పడుతుంది.
2. ఇది మొక్క ఎత్తుగా ఎదగడానికి సహాయపడుతుంది, తద్వారా మొక్క ఎక్కువ ఎత్తును పొందుతుంది.2. ఇది ఆకులు, మొగ్గలు మరియు పువ్వులు ఏర్పడటానికి సహాయపడుతుంది.
3. దీని వలన మొక్క నేరుగా ముందుకు పెరుగుతుంది.3. దీని వలన మొక్క పొదలా పెరుగుతుంది.

ప్రశ్న 5.
మార్పు చెందిన కాండం అంటే ఏమిటి?
జవాబు:
కొన్ని మొక్కలలో కాండం ఆహారం నిల్వ చేయటానికి, ఆధారం ఇవ్వటానికి, రక్షణ కల్పించటానికి మరియు వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చెందటానికి మార్పు చెంది ఉంటుంది. బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరకు మొక్కలు ఆహార పదార్థాలను కాండంలో భద్రపరుస్తాయి, తద్వారా కాండం పరిమాణం పెరుగుతుంది. వీటిని మార్పు చెందిన కాండం లేదా దుంపలు అంటారు.

ప్రశ్న 6.
ఈనెల వ్యాపనం అంటే ఏమిటి? దానిలోని రకాలు ఏమిటి?
జవాబు:
ఒక ఆకులో ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు.
ఈనెల వ్యాపనం రెండు రకాలు.

  1. జాలాకార ఈనెల వ్యాపనం
  2. సమాంతర ఈనెల వ్యాపనం.

ఈనెలు లేదా పత్ర దళం వల లాంటి నెట్ వర్క్ లో అంతటా అమర్చబడి ఉంటాయి. దీనిని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. పత్ర దళం అంతటా ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చబడి ఉంటే, దానిని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు.

ప్రశ్న 7.
జాలాకార మరియు సమాంతర ఈనెల వ్యాపనం మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

జాలాకార ఈనెల వ్యాపనంసమాంతర ఈనెల వ్యాపనం
1. ఈనెలు నెట్ వర్క్ రూపంలో పత్ర దళం అంతటా వల వంటి అమరికలో అమర్చబడి ఉంటాయి.1. ఈనెలు సమాంతరంగా పత్ర దళం అంతటా ఒకదానితో ఒకటి అమర్చబడి ఉంటాయి.
2. ఇది ద్విదళ బీజ మొక్కలలో కనిపిస్తుంది.2. ఇది ఏక దళ బీజ మొక్కలలో కనిపిస్తుంది.
3. ఉదా: మామిడి, మందార, ఫికస్ మొదలైనవి.3. ఉదా: అరటి, వెదురు, గోధుమ, మొక్కజొన్న మొ||

ప్రశ్న 8.
మొక్కను పీకకుండా వేరు వ్యవస్థను మీరు ఎలా కనుగొంటారు?
జవాబు:
వేరు వ్యవస్థను బయటకు తీయకుండా కనుగొనడం సాధ్యమే.

  • ఆకు ఈనెల వ్యాపనం గమనించడం ద్వారా, ఆ మొక్కకు తల్లి వేరు లేదా గుబురు వేర్లు ఉన్నాయా అని మనం కనుగొనవచ్చు.
  • ఆకు సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటే, మొక్క యొక్క వేరు గుబురు వేరు వ్యవస్థ అవుతుంది.
  • ఆకు జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటే, మొక్క యొక్క వేరు తల్లి వేరు వ్యవస్థ అవుతుంది.

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

ప్రశ్న 9.
ఏకదళ బీజాలు మరియు ద్విదళ బీజాలు మధ్య తేడాలను వ్రాయండి.
జవాబు:

ఏకదళ బీజాలుద్విదళ బీజాలు
1. విత్తనంలో ఒక బీజ దళం మాత్రమే ఉంటుంది.1. విత్తనంలో రెండు బీజ దళాలు ఉంటాయి.
2. ఇవి గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.2. ద్విదళ బీజాలలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది.
3. వీటి ఆకులు సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి.3. ద్వి దళ బీజాలలోని ఆకులు జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి.
4. ఉదా : గోధుమ, మొక్కజొన్న, వరి.4. ఉదా : ఆపిల్, మామిడి, వంకాయ, బీన్స్.

ప్రశ్న 10.
పత్ర రంధ్రము అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:

  • ఆకు ఉపరితలంపై ఉన్న చిన్న రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు.
  • పత్ర రంధ్రము మొక్కకు ముక్కులా పనిచేస్తుంది.
  • మొక్క మరియు వాతావరణం మధ్య వాయువుల మార్పిడికి ఇవి సహాయపడతాయి.
  • మొక్కలు తమ శరీరంలో అధిక నీటిని పత్ర రంధ్రము ద్వారా బాష్పోత్సేకము ప్రక్రియ ద్వారా విడుదల చేస్తాయి.

ప్రశ్న 11.
వేరు యొక్క విధులు ఏమిటి?
జవాబు:

  • వేరు వ్యవస్థ మొక్కను మట్టిలో పట్టి ఉంచుతుంది.
  • నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తుంది.
  • ఇది క్యారెట్ మరియు దుంప వేరు వంటి కొన్ని మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేస్తుంది.

ప్రశ్న 12.
బాష్పోత్సేకము అంటే ఏమిటి మరియు దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:

  • పత్ర రంధ్రము ద్వారా నీటిని, ఆవిరి రూపంలో విడుదల చేసే ప్రక్రియను బాష్పోత్సేకము అంటారు.
  • ఇది ఆకులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
  • కిరణజన్య సంయోగక్రియ కోసం ఆకు కణాలకు నీటిని అందించడానికి ఇది సహాయపడుతుంది.
  • మొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది.

ప్రశ్న 13.
కాండం యొక్క విధులను వ్రాయండి.
జవాబు:
కాండం యొక్క విధులు :

  • కొమ్మలు, ఆకులు, పువ్వులు మరియు పండ్లకు ఆధారం ఇస్తుంది.
  • నీరు మరియు ఖనిజాలను వేరు నుండి ఇతర భాగాలకు రవాణా చేస్తుంది.
  • కాండం ఆహారాన్ని ఆకుల నుండి ఇతర భాగాలకు రవాణా చేస్తుంది.
  • బంగాళదుంప, అల్లం, పసుపు, వెల్లుల్లి మొదలైన మొక్కలలో ఆహారం నిల్వ చేస్తుంది.

ప్రశ్న 14.
మొక్కలు మరియు దాని భాగాల గురించి తెలుసుకోవడానికి మీరు ఏ ప్రశ్నలు వేస్తారు?
జవాబు:
ఈ మొక్కలోని ఏ భాగం నీటిని గ్రహిస్తుంది?

  • మొక్కలోని ముఖ్యమైన భాగాలు ఏమిటి?
  • కాండం యొక్క పని ఏమిటి?
  • కొన్ని వేర్లు ఎందుకు మార్పు చెందుతాయి?

ప్రశ్న 15.
ఆకు యొక్క విధులను వ్రాయండి.
జవాబు:
మొక్కల జీవితంలో ఆకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, అవి

  • శ్వాసక్రియలో వాయు మార్పిడికి,
  • బాష్పోత్సేకము నిర్వహించడానికి,
  • కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేయడానికి మొ||నవి.

ప్రశ్న 16.
మార్పు చెందిన వేర్లు ఏమిటి?
జవాబు:

  • కొన్ని మొక్కలలో, వేర్లు వాటి ఆకారాన్ని మార్చుకొని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి తోడ్పడతాయి.
  • ముల్లంగి, క్యారెట్ వంటి దుంప వేర్లు పిండిని నిల్వ చేయడానికి మార్పు చెందాయి.
  • వాయుగత వేర్లు భూమి పైన పెరుగుతాయి, సాధారణంగా ఇవి మొక్కకు ఆధారం ఇస్తాయి.
    ఉదా: మర్రి చెట్టు, చెరకు, మొక్కజొన్న మొదలైనవి.
  • మడ అడవులలో శ్వాసక్రియకు సహాయపడే వాయుగత వేర్లు ఉంటాయి.

ప్రశ్న 17.
పొట్టిక్కలు గురించి రాయండి.
జవాబు:

  • పొట్టిక్కలు గోదావరి జిల్లాల కోనసీమ సంప్రదాయ ఆహారం.
  • పనస చెట్టు యొక్క ఆకులు దీని తయారీలో ఉపయోగిస్తారు.
  • వారు ఈ ఆకులతో కప్పులను తయారు చేసి, మినుములు మరియు బియ్యం రవ్వలతో చేసిన పిండిని నింపుతారు. వీటిని ఆవిరిలో ఉడికించటం వలన పొట్టిక్కలు తయారవుతాయి.
  • ఇవి పనస పండు రుచి కలిగి ఆరోగ్యకరమైనవి మరియు రుచికరమైనవి.

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

ప్రశ్న 18.
పువ్వు అందాన్ని మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:

  • పువ్వులు మొక్కలలోని రంగురంగుల భాగాలు.
  • ఇవి పరాగసంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి మరియు పండ్లను ఉత్పత్తి చేస్తాయి.
  • రంగురంగుల పువ్వులు ప్రకృతికి అందాన్ని ఇస్తాయి.
  • రంగురంగుల పువ్వులను చూడటం ద్వారా, మనకు ఆనందం లభిస్తుంది.
  • మరియు అవి మనకు మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని ఇస్తాయి.

ప్రశ్న 19.
వేరు అంటే ఏమిటి? దాని పనితీరు గురించి వ్రాయండి.
జవాబు:

  • మొక్క ప్రధాన అక్షం యొక్క భూగర్భ భాగాన్ని వేరు అంటారు.
  • ఇది మొక్కను మట్టికి బంధిస్తుంది. ఇది నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తుంది.
  • ఇది క్యారెట్ మరియు దుంప వేరు వంటి కొన్ని మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేస్తుంది.

ప్రశ్న 20.
ఏ వేర్లను దుంప వేర్లు అంటారు? ఎందుకు?
జవాబు:

  • ముల్లంగి, క్యారెట్, బీట్ రూట్, చిలగడదుంపను దుంప వేర్లు అంటారు.
  • ఈ మొక్కలు ఆహార పదార్థాలను వాటి వేర్లలో నిల్వ చేస్తాయి. తద్వారా వాటిని దుంప వేర్లు అని పిలుస్తారు.

ప్రశ్న 21.
మొక్క యొక్క ఏ భాగం కాండం మరియు వేరు అని మీరు ఎలా చెబుతారు?
జవాబు:

  • నేల ఉపరితలం పైన ఉండే మొక్క యొక్క భాగం కాండం.
  • నేల ఉపరితలం క్రింద ఉండే మొక్క యొక్క భాగం కాండం.
  • కాండం కణుపు, కణుపు మధ్యమం మరియు ఆకులు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. వేరు వీటిని కలిగి ఉండదు.

ప్రశ్న 22.
పువ్వులకు వేర్వేరు రంగుల ఆకర్షక పత్రాలు లేకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:

  • పువ్వుల్లో ఆకర్షక పత్రాలు అనేక రంగులను కలిగి ఉంటాయి.
  • అందమైన ఆకర్షక పత్రాలు పరాగసంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి మరియు పండ్లను ఉత్పత్తి చేస్తాయి.
  • పువ్వులకు వేర్వేరు రంగుల ఆకర్షక పత్రాలు లేకపోతే, కీటకాలను ఆకర్షించడానికి, వాటికి సువాసన ఉంటుంది.
  • మొక్కకు రంగురంగుల ఆకర్షక పత్రాలు మరియు సువాసన లేకపోతే, అవి కీటకాలను ఆకర్షించలేవు కాబట్టి పండ్లు ఏర్పడవు.

ప్రశ్న 23.
మడ అడవుల వాయుగత వేర్లు గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:

  1. ఈ మడ అడవులను మనం ఎక్కడ కనుగొంటాము?
  2. మడ అడవుల ప్రాముఖ్యత ఏమిటి?
  3. మడ అడవుల ప్రత్యేక పాత్ర ఏమిటి?
  4. మడ అడవులలో వాయుగత వేర్ల ఉపయోగం ఏమిటి?

ప్రశ్న 24.
మొక్క ఆకులను గమనించి కింది పట్టిక నింపండి.
జవాబు:

మొక్క యొక్క పేరుఈనెల వ్యాపనం రకం
1. మందారజాలాకార ఈనెల వ్యాపనం
2. వరిసమాంతర ఈనెల వ్యాపనం
3. రావిజాలాకార ఈనెల వ్యాపనం
4. జొన్నసమాంతర ఈనెల వ్యాపనం

ప్రశ్న 25.
మొక్క యొక్క తల్లి వేరు వ్యవస్థ మరియు గుబురు వేరు వ్యవస్థ యొక్క రేఖాచిత్రాన్ని గీయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 13AP Board 6th Class Science Solutions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 14

6th Class Science 2nd Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మొక్కలు తమ ఆహారాన్ని నిల్వ చేయలేకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:

  • కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ద్వారా తయారైన ఆహారాన్ని మొక్కలు నిల్వ చేసుకొంటాయి.
  • కొంత ఆహారాన్ని మొక్కలు వివిధ జీవక్రియ ప్రక్రియల కోసం ఉపయోగిస్తాయి.
  • మిగిలిన ఆహారం శరీరంలోని వివిధ భాగాలైన వేర్లు , కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు మొదలైన వాటిలో నిల్వ చేయబడుతుంది.
  • ఈ నిల్వ చేసిన ఆహారం మొక్కలను అననుకూల పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడుతుంది.
  • ఇతర జంతువులు కూడా తమ ఆహారం కోసం మొక్కలపై ఆధారపడతాయి.
  • ఇలా మొక్కలు – ఆహారాన్ని నిల్వ చేయలేకపోతే, మొక్కలపై ఆధారపడే జంతువులు క్రమంగా ఆకలితో చనిపోతాయి.
  • కరవు వంటి అననుకూల పరిస్థితులు సంభవించినప్పుడు, మొక్కలు కూడా చివరికి చనిపోతాయి.

AP Board 6th Class Science 2nd Lesson 1 Mark Bits Questions and Answers మొక్కల గురించి తెలుసుకుందాం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. తల్లి వేరు నుండి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ………. అంటారు.
A) గొట్టపు వేర్లు
B) వాయుగత వేర్లు
C) పార్శ్వ వేర్లు
D) గుబురు వేర్లు
జవాబు:
C) పార్శ్వ వేర్లు

2. సన్నని మరియు ఏకరీతి పరిమాణ వేర్లు ఏ వ్యవస్థలో కనిపిస్తాయి?
A) తల్లి వేరు వ్యవస్థ
B) గుబురు వేరు వ్యవస్థ
C) A & B
D) పైవేవీ కాదు
జవాబు:
B) గుబురు వేరు వ్యవస్థ

3. నీరు మరియు ఖనిజాలను గ్రహించడంలో సహాయపడే మొక్క యొక్క భాగం
A) వేరు
B) కాండం
C) ఆకు
D) పుష్పము
జవాబు:
A) వేరు

4. అదనపు విధులు నిర్వహించడానికి భూమికి పైన పెరిగే వేరును ఏమంటారు?
A) నిల్వ వేర్లు
B) వాయుగత వేర్లు
C) తల్లి వేర్లు
D) గుబురు వేర్లు
జవాబు:
B) వాయుగత వేర్లు

5. నిల్వ వేర్లు వేటిలో కనిపిస్తాయి?
A) క్యారెట్
B) ముల్లంగి
C) దుంప వేరు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

6. కాండం వ్యవస్థ యొక్క ప్రధాన అక్షంను ఏమంటారు?
A) కాండం
B) వేరు
C) పుష్పము
D) పండు
జవాబు:
A) కాండం

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

7. వరుసగా రెండు కణుపుల మధ్య గల కాండం యొక్క భాగం
A) అగ్ర మొగ్గ
B) పార్శ్వ మొగ్గ
C) కణుపు మధ్యమం
D) బీబీ దళం
జవాబు:
C) కణుపు మధ్యమం

8. ఆకులు పుట్టుకొచ్చే కాండం యొక్క భాగంను ……….. అంటార.
A) నీరు
B) కార్బన్ డై ఆక్సైడ్
C) బీజ దళం
D) కణుపు మధ్యమం
జవాబు:
A) నీరు

9. తినదగిన కాండం ఏమిటి?
A) వేప
B) అరటి
C) చెరకు
D) పత్తి
జవాబు:
C) చెరకు

10. పత్ర రంధ్రము యొక్క ముఖ్యమైన పని
A) రవాణా
B) బాష్పోత్సేకము
C) పునరుత్పత్తి
D) శోషణ
జవాబు:
B) బాష్పోత్సేకము

11. ఇది ఆకులో ముక్కుగా పనిచేస్తుంది.
A) మధ్య ఈనె
B) పత్ర రంధ్రము
C) పత్ర దళం
D) ఈనెలు
జవాబు:
B) పత్ర రంధ్రము

12. వేరులో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను గుర్తించండి.
A) ముల్లంగి
B) బంగాళదుంప
C) అల్లం
D) పసుపు
జవాబు:
A) ముల్లంగి

13. ఆకు యొక్క విశాలమైన ఆకుపచ్చ భాగం
A) పత్ర ఆధారం
B) పత్ర వృంతము
C) రక్షక పత్రాలు
D) పత్ర దళం
జవాబు:
D) పత్ర దళం

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

14. క్రింది వాక్యాలు చదవండి. సరైన దానిని గుర్తించండి.
i) జాలాకార ఈనెల వ్యాపనం ఉన్న మొక్కలలో గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది.
ii) జాలాకార ఈనెల వ్యాపనం ఉన్న మొక్కలలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది.
A) i మాత్రమే సరైనది
B) ii సరైనది మరియు i) తప్పు
C) i & ii రెండూ సరైనవి
D) i & ii రెండూ తప్పు
జవాబు:
B) ii సరైనది మరియు i) తప్పు

15. వేర్వేరు రంగులలో ఉండే ఆకర్షక పత్రాలు దేనిలోని భాగాలు?
A) వేర్లు
B) పుష్పము
C) ఆకులు
D) పండు
జవాబు:
B) పుష్పము

16. ఆకుపచ్చ ఆకులు ఏ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని సిద్ధం చేస్తాయి?
A) శ్వాసక్రియ
B) పునరుత్పత్తి
C) కిరణజన్య సంయోగక్రియ
D) బాష్పోత్సేకము
జవాబు:
C) కిరణజన్య సంయోగక్రియ

17. మొక్క యొక్క ఏ భాగం పండ్లను ఉత్పత్తి చేస్తుంది?
A) కాండం
B) పత్రము
C) పుష్పము
D) వేరు
జవాబు:
C) పుష్పము

18. కిరణజన్య సంయోగక్రియను మొక్కలు నిర్వహించ డానికి అవసరమైనవి
A) కణుపు
B) మొగ్గ
C) సూర్యరశ్మి మరియు క్లోరోఫిల్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

19. కింది వాటిలో ఏది పరాగసంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తుంది?
A) ఆకర్షక పత్రాలు
B) మధ్య ఈనె
C) పత్ర
D) పత్ర వృంతము
జవాబు:
A) ఆకర్షక పత్రాలు

20. మొక్క యొక్క భూగర్భ ప్రధాన అక్షాన్ని ఏమంటారు?
A) కాండం
B) వేరు
C) మొగ్గ
D) ఆకు
జవాబు:
B) వేరు

21. గుబురు వేర్లు ఉన్న మొక్కను గుర్తించండి.
A) వరి
B) మామిడి
C) వేప
D) ఉసిరి
జవాబు:
A) వరి

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

22. కిందివాటిలో తల్లి వేరు వ్యవస్థలో భాగం కానిది ఏది?
A) తల్లి వేరు
B) పార్శ్వ వేర్లు
C) గుబురు వేర్లు
D) A మరియు B
జవాబు:
C) గుబురు వేర్లు

23. ద్విదళ బీజ దళాల మొక్కలలో ఉండే వేరు వ్యవస్థ మరియు ఈనెల వ్యాపనం
A) తల్లి వేరు మరియు సమాంతర ఈ నెల వ్యాపనం
B) తల్లి వేరు వ్యవస్థ మరియు జాలాకార ఈనెల వ్యాపనం
C) గుబురు వేర్లు మరియు సమాంతర ఈనెల వ్యాపనం
D) గుబురు వేర్లు మరియు జాలాకార ఈనెల వ్యాపనం
జవాబు:
B) తల్లి వేరు వ్యవస్థ మరియు జాలాకార ఈనెల వ్యాపనం

24. ఏ మొక్కల శ్వాసక్రియకు వాయుగత వేర్లు సహాయ పడతాయి?
A) జల మొక్కలు
B) భూసంబంధమైన మొక్కలు
C) మడ అడవులు
D) ఎడారి మొక్కలు
జవాబు:
C) మడ అడవులు

25. అదనపు ఆధారం ఇవ్వడానికి వాయుగత వేర్లను కలిగి ఉన్న మొక్క
A) మర్రి చెట్టు
B) చెరకు
C) మొక్కజొన్న
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

26. ఆకు అక్షం వద్ద ఉన్న మొగ్గ
A) అగ్ర మొగ్గ
B) పార్శ్వ మొగ్గ
C) పత్ర మొగ్గ
D) బాహ్య మొగ్గ
జవాబు:
B) పార్శ్వ మొగ్గ

27. ఆకుల నుండి ఇతర భాగాలకు ఆహారాన్ని రవాణాచేయటం దేని ద్వారా జరుగుతుంది?
A) వేరు
B) ఆకు
C) కాండం
D) పుష్పము
జవాబు:
C) కాండం

28. దుంప కాండానికి ఉదాహరణ
A) బంగాళదుంప
B) మడ మొక్క
C) బీట్ రూట్
D) క్యాబేజీ
జవాబు:
A) బంగాళదుంప

29. ఆకు యొక్క నిర్మాణంలో కాడ వంటి నిర్మాణం
A) పత్ర దళం
B) పత్ర వృంతము
C) పత్ర ఆధారం
D) ఈనెలు
జవాబు:
B) పత్ర వృంతము

30. ఆకులో భాగం కానిది ఏది?
A) పత్ర దళం
B) పత్ర వృంతము
C) మధ్య ఈనె
D) అక్షం
జవాబు:
D) అక్షం

31. పత్ర దళంలోని ఈ నెల అమరికను ఏమంటారు?
A) రవాణా
B) బాష్పోత్సేకము
C) ఈనెల వ్యాపనం
D) శ్వాసక్రియ
జవాబు:
C) ఈనెల వ్యాపనం

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

32. మొక్క ఆహారాన్ని తయారు చేసుకొనే ప్రక్రియ
A) కిరణజన్య సంయోగక్రియ
B) శ్వాసక్రియ
C) బాష్పోత్సేకము
D) రవాణా
జవాబు:
A) కిరణజన్య సంయోగక్రియ

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. మొక్క యొక్క ప్రధాన అక్ష భూగర్భ భాగాన్ని …………….. అంటారు.
2. తల్లి వేరు వ్యవస్థలో ఒకే ప్రధాన వేరు ఉంటుంది. దీనిని …………. అంటారు.
3. మొక్కలలోని …………. ద్వారా నీరు గ్రహించబడుతుంది.
4. ఆహార పదార్థాలను నిల్వ చేసే వేర్లను …………. వేర్లు అంటారు.
5. తల్లి వేరు వ్యవస్థ ………….. మొక్కలో ఉంది.
6. విత్తనం లోపల ఉండే విత్తన ఆకును …………….. అంటారు.
7. కాండం కొన వద్ద ఉన్న మొగ్గను ………….. అంటారు.
8. ………… నిల్వ కాండానికి ఒక ఉదాహరణ.
9. ఆకుల అక్షం వద్ద ఉన్న మొగ్గలను ………… అంటారు.
10. ………… ఆకుపత్ర దళంను కాండంతో కలుపుతుంది.
11. ఆకుపై కనిపించే గీతల వంటి నిర్మాణాలను ……………… అంటారు.
12. పత్రదళంలో ఈనెల అమరికను …………. అంటారు.
13. గుబురు వేర్లు కలిగిన మొక్కలు వాటి ఆకులలో …….. ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి.
14. ఆకుల ద్వారా ఆవిరి రూపంలో నీటిని కోల్పోవడాన్ని ……………… అంటారు.
15. ద్విదళ బీజదళాల మొక్కలకు ………… వేరు వ్యవస్థ ఉంటుంది.
16. ……………….. ప్రక్రియ ద్వా రా మొక్కలు అదనపు నీటిని కోల్పోతాయి.
17. ……… వేర్లు గ్రహించిన నీటిని మొక్క యొక్క వివిధ భాగాలకు రవాణా చేస్తుంది.
18. గోదావరి జిల్లా యొక్క కోనసీమ ప్రాంత సంప్రదాయ ఆహారం …………………..
19. పొట్టిక్కలు ……………… రుచితో ఆరోగ్యంగా మరియు రుచికరంగా ఉంటాయి.
20. ………………. ప్రక్రియ ద్వారా మొక్కలలో ఆహారం తయారవుతుంది.
21. మొక్క మరియు వాతావరణం మధ్య వాయువుల మార్పిడి …………. ద్వారా జరుగును.
22. …………… ఆకు యొక్క బయటి ఉపరితల పొరలో ఉంటాయి.
23. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకు ……. ఈనెల వ్యాపనంతో ఆకులు ఉంటాయి.
24. పత్రదళం మధ్యలో ఉన్న పొడవైన ఈనె …………
25. ………… ఆకు యొక్క అస్థిపంజరం వలె పనిచేస్తాయి.
26. వరుసగా రెండు కణుపుల మధ్య కాండం యొక్క భాగాన్ని ……….. అంటారు.
ఆహార పదార్థాలను నిల్వ చేసే కాండాలను …………. అంటారు.
28. ప్రధాన వేరు కలిగిన వ్యవస్థ ………….
29. రాగులలో ఒక బీజదళం మాత్రమే ఉంది. కనుక ఇది ఒక ……….. మొక్క.
జవాబు:

  1. వేరు
  2. తల్లి వేరు
  3. వేర్లు
  4. నిల్వ వేర్లు
  5. ద్విదళ బీజదళాలు
  6. బీజ దళం
  7. అగ్ర మొగ్గ
  8. బంగాళదుంప / అల్లం
  9. పార్శ్వ మొగ్గ
  10. పత్ర వృంతము
  11. ఈనెలు
  12. ఈనెల వ్యాపనం
  13. సమాంతరం
  14. బాష్పోత్సేకము
  15. తల్లి వేరు
  16. బాష్పోత్సేకము
  17. కాండం
  18. పొట్టిక్కలు
  19. పనసపండు
  20. కిరణజన్య సంయోగక్రియ
  21. పత్ర రంధ్రము
  22. పత్ర రంధ్రాలు
  23. జాలాకార
  24. మధ్య ఈనె 10
  25. ఈనెలు
  26. కణుపు మధ్యమం
  27. దుంపవేర్లు
  28. తల్లి వేరు వ్యవస్థ
  29. ఏకదళ బీజ

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – AGroup – B
ఎ) వేరు1. ప్రకృతి సౌందర్యాన్ని ఇస్తుంది
బి) కాండం2. ఆహారం తయారీ
సి) ఆకు3. బీజదళాలు కలిగి ఉంటుంది
డి) పువ్వు4. వేరు నుండి ఆకుల వరకు నీటి రవాణా
ఇ) విత్తనం5. నీటి శోషణ

జవాబు:

Group – AGroup – B
ఎ) వేరు5. నీటి శోషణ
బి) కాండం4. వేరు నుండి ఆకుల వరకు నీటి రవాణా
సి) ఆకు2. ఆహారం తయారీ
డి) పువ్వు1. ప్రకృతి సౌందర్యాన్ని ఇస్తుంది
ఇ) విత్తనం3. బీజదళాలు కలిగి ఉంటుంది

2.

Group – AGroup – B
ఎ) మినుములు1. సమాంతర ఈనెల వ్యాపనం
బి) టొమాటో2. తల్లి వేరు వ్యవస్థ
సి) రాగులు3. ఏక దళ బీజం
డి) మర్రి4. ద్వి దళ బీజం
ఇ) గడ్డి5. వాయుగత వేర్లు

జవాబు:

Group – AGroup – B
ఎ) మినుములు2. తల్లి వేరు వ్యవస్థ
బి) టొమాటో4. ద్వి దళ బీజం
సి) రాగులు3. ఏక దళ బీజం
డి) మర్రి5. వాయుగత వేర్లు
ఇ) గడ్డి1. సమాంతర ఈనెల వ్యాపనం

3.

Group – AGroup – B
ఎ) ముల్లంగి1. ఆకులు
బి) చెరకు2. పువ్వు
సి) మడ అడవులు3. కాండం
డి) పత్ర రంధ్రము4. వేరు
ఇ) పరాగసంపర్కం5. వాయుగత వేర్లు

జవాబు:

Group – AGroup – B
ఎ) ముల్లంగి4. వేరు
బి) చెరకు3. కాండం
సి) మడ అడవులు5. వాయుగత వేర్లు
డి) పత్ర రంధ్రము1. ఆకులు
ఇ) పరాగసంపర్కం2. పువ్వు

4.

Group – AGroup – B
ఎ) పత్ర రంధ్రము1. పొడవైన ఈనె
బి) పత్ర దళం2. మధ్య ఈనె యొక్క శాఖలు
సి) పత్ర వృంతము3. ఆకుపచ్చ చదునైన భాగం
డి) మధ్య ఈనె4. ఆకు యొక్క కాడ వంటి భాగం
ఇ) ఈనెలు5. మొక్క యొక్క ముక్కు

జవాబు:

Group – AGroup – B
ఎ) పత్ర రంధ్రము5. మొక్క యొక్క ముక్కు
బి) పత్ర దళం3. ఆకుపచ్చ చదునైన భాగం
సి) పత్ర వృంతము4. ఆకు యొక్క కాడ వంటి భాగం
డి) మధ్య ఈనె1. పొడవైన ఈనె
ఇ) ఈనెలు2. మధ్య ఈనె యొక్క శాఖలు

మీకు తెలుసా?

వేర్లు – రూపాంతరాలు
AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 1

→ కొన్ని మొక్కలు తమ వేర్లు, కాండములలో ఆహారాన్ని నిల్వచేసుకుంటాయి. ముల్లంగి, క్యారట్, బీట్ రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహారపదార్థాలను నిల్వచేస్తాయి. ఆహారంను నిల్వచేసిన వేర్లు లావుగా ఉబ్బి, దుంపవేర్లుగా మారుతాయి.

కాండం -రూపాంతరాలు
AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 2
→ బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, వంటి మొక్కలలో కాండం ఆహార పదార్థాలను నిల్వచేయడం వలన లావుగా ఉబ్బి, దుంపగా మారి, భూమిలో పెరుగుతుంది. సాధారణంగా మనం వీటిని దుంప వేర్లుగా భావిస్తుంటాం. కానీ, నిజానికి ఇవి రూపాంతరం చెందిన కాండాలు.

AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం

పొట్టిక్కలు
AP 6th Class Science Important Questions Chapter 2 మొక్కల గురించి తెలుసుకుందాం 3
→ గోదావరి జిల్లాలలోని కోనసీమ ప్రాంతంలో పొట్టిక్కలు సాంప్రదాయకమైన వంటకం. పనస చెట్టు పత్రాలను ఈ వంటకం తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు పత్రాలతో చిన్న గిన్నెలను తయారుచేసి వాటిలో మినుములతో తయారుచేసిన పిండి, బియ్యపు రవ్వలను ఉంచుతారు. తరువాత ఈ గిన్నెలను ఆవిరిలో ఉంచి ఉడికించి, పొట్టిక్కలను తయారు చేస్తారు. వీటిని ఇడ్లీల లాగే చట్నీతో తినవచ్చు. పనస పండు వాసనతో కలిసి ఈ వంటకం రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరం.

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

These AP 6th Class Science Important Questions 1st Lesson మనకు కావలసిన ఆహారం will help students prepare well for the exams.

AP Board 6th Class Science 1st Lesson Important Questions and Answers మనకు కావలసిన ఆహారం

6th Class Science 1st Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రపంచ ఆహార దినోత్సవం 2019 యొక్క సందేశం ఏమిటి?
జవాబు:
ఆహార భద్రత మరియు పోషక ఆహారాన్ని అందరికీ అందించటం ప్రపంచ ఆహార దినోత్సవం 2019 యొక్క సందేశం.

ప్రశ్న 2.
దినుసులు అంటే ఏమిటి?
జవాబు:
ఆహారాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను దినుసులు అంటారు.

ప్రశ్న 3.
మానవుల యొక్క ఆహార వనరులు ఏమిటి?
జవాబు:
మొక్కలు, జంతువులు మరియు సముద్రపు నీరు మానవులకు ఆహార వనరులు.

ప్రశ్న 4.
కోడి కూర సిద్ధం చేయడానికి పదార్థాలు రాయండి.
జవాబు:
చికెన్, టమోటా, కారం, పసుపు పొడి, గరం మసాలా, దాల్చిన చెక్క, అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉల్లిపాయ, ఉప్పు మరియు కొత్తిమీర.

ప్రశ్న 5.
మీకు ఏ ఆహార పదార్థం ఇష్టం? ఎందుకు?
జవాబు:
నాకు పాయసం అంటే ఇష్టం. ఎందుకంటే రుచిలో తియ్యగా ఉండే ఆహార పదార్థాలు నాకు చాలా ఇష్టం.

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 6.
ఊరగాయల తయారీలో ఉపయోగించే సాధారణ పదార్థాలు ఏమిటి?
జవాబు:
ఉప్పు, నూనె, పసుపు పొడి, కారం, వెల్లుల్లి, మెంతి పొడి మరియు అసాఫోటిడా వంటి పదార్థాలను సాధారణంగా ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
అల్పాహారంలో తీసుకునే ఆహార పదార్థాలు ఏమిటి?
జవాబు:
ఇడ్లీ, దోసె మరియు పచ్చడి, రొట్టె, పాలు, గుడ్డు అనేవి సాధారణంగా అల్పాహారంలో వేర్వేరు వ్యక్తులు తీసుకునే ఆహార పదార్థాలు.

ప్రశ్న 8.
ఆహారం తయారీలో ఉపయోగించే వివిధ పద్ధతులు ఏమిటి?
జవాబు:
ఉడకబెట్టడం, ఆవిరి చేయడం, కిణ్వ ప్రక్రియ, వేయించుట, డీప్ ఫ్రైయింగ్ వంటివి ఆహారం తయారీలో ఉపయోగించే వివిధ పద్ధతులు.

ప్రశ్న 9.
మన ప్రాంతంలో వరి వంటకాలు ఎందుకు చాలా సాధారణం?
జవాబు:
మన రాష్ట్రంలో వరి పండించడానికి భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మన ప్రాంతంలో వరి వంటకాలు సాధారణం.

ప్రశ్న 10.
F.A.O అంటే ఏమిటి?
జవాబు:
ఆహార మరియు వ్యవసాయ సంస్థ (Food and Agriculture Organisation).

ప్రశ్న 11.
UNDP ని విస్తరించండి.
జవాబు:
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (United Nations Development Programme).

ప్రశ్న 12.
మరిగించటం అంటే ఏమిటి?
జవాబు:
ఆహార పదార్థాలను ఉడికించే ప్రక్రియను మరిగించటం అంటారు. బియ్యం, పప్పు, గుడ్డు మరియు బంగాళదుంప మొదలైన వాటిని ఉడికించి వంటకాలలో వాడతాము. ఇది ఒక ఆహార తయారీ పద్ధతి.

ప్రశ్న 13.
కిణ్వప్రక్రియ ద్వారా తయారుచేసిన ఆహార పదార్థాల ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
రొట్టె, జిలేబీ, కేక్, దోసె, ఇడ్లీ కిణ్వప్రక్రియ ద్వారా తయారుచేసిన ఆహార పదార్థాలు.

ప్రశ్న 14.
సాధారణంగా మనం తినే జంక్ ఫుడ్స్ జాబితా రాయండి.
జవాబు:
పిజ్జా, బర్గర్, చిప్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్, నూడుల్స్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలైనవి జంక్ ఫుడ్స్.

ప్రశ్న 15.
వెజిటబుల్ కార్వింగ్ అంటే ఏమిటి?
జవాబు:
కూరగాయలతో వివిధ రకాల డిజైన్లు మరియు అలంకరణలను తయారు చేయడాన్ని వెజిటబుల్ కార్వింగ్ అంటారు.

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 16.
సహజ ఆహార నిల్వ కారకాలు ఏమిటి?
జవాబు:
ఉప్పు, నూనె, పసుపు పొడి, చక్కెర మరియు తేనె సహజ ఆహార నిల్వ కారకాలు.

ప్రశ్న 17.
కృత్రిమ ఆహార నిల్వ కారకాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బెంజోయేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్లు మొదలైన వాటిని కృత్రిమ ఆహార నిల్వ కారకాలుగా వాడతారు.

ప్రశ్న 18.
ఆహారానికి రుచి ఎలా వస్తుంది?
జవాబు:
ఆహార రుచి దానిలో ఉపయోగించిన పదార్థాలు, తయారీ విధానం మరియు మన సాంస్కృతిక అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 19.
జంతువుల నుండి మనకు ఏమి లభిస్తుంది?
జవాబు:
మనకు జంతువుల నుండి పాలు, మాంసం, గుడ్లు మరియు తేనె లభిస్తాయి.

ప్రశ్న 20.
ఆహారాన్ని నిల్వ చేసే కాండానికి ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
చెరకు, ఉల్లిపాయ, వెల్లుల్లి, పసుపు, అల్లం మొక్కలు కాండంలో ఆహారాన్ని నిల్వ చేస్తాయి.

ప్రశ్న 21.
మనం కొన్ని పండ్లను చక్కెర సిరప్ లేదా తేనెలో ఎందుకు ఉంచుతాము?
జవాబు:
చక్కెర సిరప్ లేదా తేనెలో అధిక గాఢతలో చక్కెర ఉండటం వలన సూక్ష్మజీవులు పెరగలేవు. కావున నిలవ ఉంచిన ఆహారం చెడిపోదు. అంతేకాకుండా ఇది ఆహార రుచిని, సహజ రంగును కాపాడుతుంది.

ప్రశ్న 22.
ఊరగాయల తయారీలో ఉపయోగించే కూరగాయలు/ పండ్లు తెలపండి.
జవాబు:
మామిడి, నిమ్మ, చింతపండు, ఉసిరి, టమోటా, మిరపకాయలను ఊరగాయ లేదా పచ్చళ్లకు వాడుతారు.

ప్రశ్న 23.
చేపలను ఎండబెట్టడం లేదా పొగబెట్టడం చేస్తారు. ఎందుకు?
జవాబు:
ఎండబెట్టడం మరియు పొగబెట్టడం వలన చేపలలో తేమ తగ్గుతుంది. తద్వారా ఇవి చెడిపోకుండా సరిగ్గా నిల్వ చేయబడతాయి.

ప్రశ్న 24.
నిర్దిష్ట ప్రాంత ఆహారపు అలవాట్లకు మరియు అక్కడ పెరిగే పంటలకు సంబంధం ఉందా?
జవాబు:
ఒక ప్రాంతంలో పండే ఆహార పంటలు ఆ ప్రాంత భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులపై ఆధార పడి ఉంటాయి. అక్కడ పండే ఆహార పంటలు బట్టి ఆ ప్రాంత ప్రజల ఆహార అలవాట్లు ఉంటాయి.

ప్రశ్న 25.
బియ్యం ఉపయోగించి తయారుచేసే వివిధ ఆహార పదార్థాలు ఏమిటి?
జవాబు:
ఇడ్లీ, దోశ, పప్పన్నం, వెజిటబుల్ రైస్, పాయసం, కిచిడి వంటి ఆహార పదార్థాలలో బియ్యం ఉపయోగిస్తారు.

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 26.
తృణధాన్యాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
జొన్న, సజ్జ, రాగి వంటి పంటలను తృణ ధాన్యాలుగా పండిస్తారు.

6th Class Science 1st Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మనం కొన్ని రకాల ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటాము. మరికొన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటాము. ఎందుకు?
జవాబు:
జీవక్రియలను నిర్వహించడానికి శరీరానికి శక్తి అవసరం. మన శరీరానికి శక్తి అవసరం కాబట్టి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటాము. ప్రోటీన్లు శరీర నిర్మాణ పోషకాలు. ఇవి పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరం. ఇవి పిండి పదార్థాల కంటే తక్కువ పరిమాణంలో సరిపోతాయి. కూరగాయలు మరియు పండ్లలో విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరం.

ప్రశ్న 2.
భారతీయ సుగంధ ద్రవ్యాలు అంటే ఏమిటి? ఆహారం తయారీలో దాని పాత్ర ఏమిటి?
జవాబు:
ఆహారానికి రుచిని, సువాసనను ఇచ్చే పదార్థాలను సుగంధ ద్రవ్యాలు అంటారు. వీటిని వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు. కొన్ని మొక్కలు, ఆకులు, పువ్వులు లేదా కాండం యొక్క బెరడు మరియు మూలాల నుండి మనకు సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి. ఆహారాన్ని రుచి చూడటం, రంగులు వేయడం లేదా సంరక్షించడం కోసం వీటిని ఉపయోగిస్తారు. ఉదా : ఏలకులు, నల్ల మిరియాలు, కరివేపాకు, మెంతి, సోపు, అజ్వెన్, బే ఆకులు, జీలకర్ర, కొత్తిమీర, పసుపు, లవంగాలు, అల్లం, జాజికాయ మరియు దాల్చిన చెక్క.

ప్రశ్న 3.
అన్ని ఆహార పదార్థాలు మొక్కలు మరియు జంతువుల నుండి లభిస్తాయని రాము చెప్పాడు. మీరు ఈ అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నారా? ఎందుకు? ఎందుకు కాదు?
జవాబు:
కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు మొదలైనవి మొక్కల నుండి పొందే పదార్థాలు. గుడ్డు, పాలు, మాంసం మొదలైనవి జంతువుల నుండి పొందే ఆహార పదార్థాలు. కాబట్టి ఈ ఆహార పదార్థాలన్నీ మొక్క మరియు జంతు వనరుల నుండి లభిస్తాయి కావున నేను ఈ అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నాను.
(లేదా)
మనం మొక్కలు మరియు జంతు వనరుల నుండి ఆహారాన్ని పొందుతాము. అదే సమయంలో ఉప్పు ఇతర వనరుల నుండి తీసుకోబడింది. అన్ని ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉప్పు ఒక ముఖ్యమైన అంశం. అందువల్ల అన్ని ఆహార పదార్థాలు మొక్కలు మరియు జంతువుల మూలాలు అనే ప్రకటనకు నేను మద్దతు ఇవ్వలేను.

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 4.
మానవుని ఆహార వనరుల గురించి తెలుసుకోవడానికి మీరు ఏ ప్రశ్నలు వేస్తున్నారు?
జవాబు:

  • మనకు పదార్థాలు ఎక్కడ లభిస్తాయి?
  • ఆహార పదార్థాలు ఎక్కడ నుండి వస్తాయి?
  • ప్రధాన ఆహార వనరులు ఏమిటి?
  • మొక్కలు మరియు జంతువులు తప్ప వేరే మూలం ఉందా?

ప్రశ్న 5.
ఆహార వనరుల దృష్టిలో మీరు మొక్కలను మరియు జంతువులను ఎలా అభినందిస్తారు?
జవాబు:
మొక్కలు మరియు జంతువులు మనకు ప్రధాన ఆహార వనరులు. మొక్కల నుండి కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు మొదలైనవి మనకు లభిస్తాయి. మనకు జంతువుల నుండి పాలు, మాంసం, గుడ్డు మరియు తేనె లభిస్తాయి. మనకు భూమిపై ఈ ఆహార వనరులు లేకపోతే జీవిత ఉనికి అసాధ్యం అవుతుంది.

ప్రశ్న 6.
జంక్ ఫుడ్స్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:
జంక్ ఫుడ్ తినడం వలన ఊబకాయం, జ్ఞాపకశక్తి కోల్పోవడం మరియు అభ్యాసన సమస్యలు, ఆకలి మరియు జీర్ణక్రియ మందగించటం, పెరుగుదల మరియు అభివృద్ధి లోపం, గుండె జబ్బులు మరియు గుండె ఆగిపోవటం వంటివి సంభవిస్తాయి.

ప్రశ్న 7.
జంక్ ఫుడ్ నివారించడానికి కొన్ని నినాదాలు సిద్ధం చేయండి.
జవాబు:

  • మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి – జంక్ ఫుడ్ వద్దు అని చెప్పండి.
  • ఫాస్ట్ ఫుడ్ – ఫాస్ట్ డెత్. * జంక్ ఫుడ్ స్థానం కడుపు కాదు – డస్ట్బలో ఉంచండి.
  • రోజూ పిజ్జాలు మరియు బర్గర్లు తినండి గుండ్రని పొట్టను తెచ్చుకోండి.
  • జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం.

ప్రశ్న 8.
ఆవిరితో ఉడికించటం (స్టీమింగ్ ప్రక్రియ) గురించి వ్రాయండి.
జవాబు:
స్ట్రీమింగ్ ప్రాసెస్ అనేది ఆహారాన్ని తయారుచేసే ఒక పద్ధతి. ఈ ప్రక్రియలో నీటిని మరిగించడం వల్ల నీరు ఆవిరైపోతుంది. ఆవిరి ఆహారానికి వేడిని తీసుకువెళుతుంది. తద్వారా ఆహారం ఉడుకుతుంది. ఇడ్లీ, కేక్, గుడ్డు ఆవిరి ప్రక్రియ ద్వారా వండుతారు.

ప్రశ్న 9.
ఆహారాన్ని తయారు చేయడానికి మీరు వేర్వేరు పద్ధతులను ఎందుకు అనుసరిస్తున్నారు?
జవాబు:
ఆహారాన్ని తయారు చేయడం ఒక కళ. దీనికి వివిధ మార్గాలను అవలంభిస్తాము. వంట వలన ఆహారం పోషకాలను కోల్పోకూడదు. కొన్ని ఆహార పదార్థాలు ఆహార తయారీ పద్దతి వలన రుచికరంగా ఉంటాయి. ఆహారం యొక్క రుచి దానిలో వాడిన పదార్థాలు మరియు తయారీ విధానం మీద ఆధారపడి ఉంటుంది. తద్వారా మనం ఆహారాన్ని తయారు చేయడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తాము.

ప్రశ్న 10.
మనం ఆహారాన్ని ఎందుకు కాపాడుకుంటాము?
జవాబు:
ఆహార సంరక్షణ అంటే చెడిపోకుండా ఎక్కువకాలం పాటు నిల్వ చేసుకోవటం. దీనివలన ఏడాది పొడవునా మనకు ఆహారం లభిస్తుంది. ఆహార సంరక్షణ ఆహార వ్యర్థాన్ని ఆపుతుంది. ఆహారాన్ని సరిగ్గా సంరక్షించకపోతే, అది సూక్ష్మజీవుల వలన పాడు చేయబడుతుంది. అందువలన మనం ఆహార కొరత ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రశ్న 11.
ఆహార నిల్వ కారకాలు ఏమిటి? వాటి అవసరం ఏమిటి?
జవాబు:
ఆహారాన్ని సంరక్షించడానికి ఉపయోగించే పదార్థాలను ఆహార నిల్వ కారకాలు అంటారు. సాధారణంగా ఉప్పు, నూనె, పసుపు పొడి, చక్కెర, తేనె వంటి పదార్థాలను మరియు బెంజోయేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్లు వంటి కృత్రిమ రసాయనాలను ఆహార నిల్వ కారకాలుగా వాడతారు. ఆహారాన్ని సరిగ్గా కాపాడుకోవడానికి ఇవి తప్పనిసరి. ఇవి ఎక్కువ కాలం ఆహారాన్ని తాజాగా ఉంచటంతోపాటు ఆహారం చెడిపోకుండా చేస్తాయి.

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 12.
కృత్రిమ ఆహార నిల్వ పదార్థాల కంటే సహజ సహాయ ఆహార నిల్వ పదార్థాలు మంచివి. ఎందుకు?
జవాబు:
సహజ ఆహార నిల్వ కారకాలలో ఉప్పు, నూనె, పసుపు పొడి, చక్కెర మరియు తేనె ఉంటాయి. కొన్ని రసాయనాలను ఉపయోగించి కృత్రిమ ఆహార నిల్వ కారకాలు తయారు చేస్తారు. సహజ కారకాలు ఆహార పదార్థాల పోషక విలువను రక్షిస్తాయి. కృత్రిమ నిల్వ కారకాలు ఆహారంలో తేమను మరియు వాటి యొక్క పోషక విలువను తగ్గిస్తాయి. అందువలన కృత్రిమ నిల్వ కారకాలు మన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి కృత్రిమ నిల్వ కారకాల కంటే సహజ నిల్వ కారకాలను అందరూ ఇష్టపడతారు.

ప్రశ్న 13.
భారతీయ సాంప్రదాయ ఆహార నిల్వ పద్ధతులు ఏమిటి?
జవాబు:
సాధారణంగా మనదేశంలో ఆహార పదార్థాలను ఉప్పు వేయడం మరియు ఎండబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు.
ఉదా : మామిడి, టమోటా, చేప, అప్పడాలు, వడియాలు, ఊరగాయలు చేసేటప్పుడు ఉప్పు, పసుపు పొడి, కారం, నూనె కలుపుతారు. చేపలు, మాంసం, కూరగాయలు రిఫ్రిజరేటర్లలో నిల్వ చేస్తారు. కొన్ని పండ్లు చక్కెర సిరప్ లేదా తేనెలో భద్రపరచబడతాయి.

ప్రశ్న 14.
ఊరగాయల తయారీలో ఉపయోగించే ఆహార నిల్వ సూత్రం ఏమిటి?
జవాబు:
ఉప్పు మరియు పసుపు పొడి సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. వెల్లుల్లి మరియు అసాఫోటిడా ఊరగాయకు రుచి మరియు వాసన ఇస్తాయి. ఇతర నిల్వ పదార్థాలు ఊరగాయను నెలల తరబడి సంరక్షిస్తాయి.

ప్రశ్న 15.
ఆహార అలవాట్ల గురించి అవగాహన కలిగించే చెక్ లిస్ట్ తయారు చేయండి.

  • అల్పాహారంలో తృణధాన్యాలు తీసుకోవాలి. (అవును)
  • బాగా వేయించిన, కాల్చిన ఆహారం తినాలి. (కాదు)
  • ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు బంగాళదుంప చిప్స్ తరచుగా తినాలి. (కాదు)
  • పాలు, గుడ్లు, కూరగాయలు మరియు పండ్లు తినాలి. (అవును)

ప్రశ్న 16.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను జాబితా చేయండి.
జవాబు:

  • ప్రతిరోజు రకరకాల కూరగాయలు, పండ్లు తినాలి.
  • ప్రతిరోజు కొవ్వు రహిత మరియు తక్కువ కొవ్వు పాలు త్రాగాలి.
  • జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. తియ్యటి పానీయాలు మరియు కూల్ డ్రింకను మానేయాలి.
  • శీతల పానీయాలకు బదులు పుష్కలంగా నీరు త్రాగాలి.

ప్రశ్న 17.
చిరుధాన్యాలు గురించి రాయండి.
జవాబు:
చిరుధాన్యాలు ప్రధానమైన ఆహారం మరియు పోషకాలకు ముఖ్యమైన వనరులు. వాటిలో శక్తి వనరులు, ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు ఉంటాయి. ఉదా : ఫింగర్ మిల్లెట్స్ (రాగులు), పెర్ల్ మిల్లెట్స్ (సజ్జలు), గ్రేట్ మిల్లెట్స్ (జొన్నలు), ఫాక్స్ టైల్ మిల్లెట్స్ (కొర్రలు), ప్రోసో మిల్లెట్స్ (సామలు) మొదలైనవి. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివి.

ప్రశ్న 18.
ప్రపంచ ఆహార దినంగా ఏరోజు జరుపుకుంటారు? ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క లక్ష్యం ఏమిటి?
జవాబు:
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న జరుపుకుంటారు. ఆకలి పోషకాహార లోపం మరియు పేదరికం వంటి సమస్యలపై ప్రపంచవ్యాప్త అవగాహనను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తిపై దృష్టి పెట్టడం దీని ప్రధాన లక్ష్యం.

ప్రశ్న 19.
మొక్కల వేర్లు మానవులకు ఆహార వనరులు, మీరు ఈ అంశాన్ని ఎలా సమర్థిస్తారు?
జవాబు:
క్యారెట్, బీట్ రూట్, చిలగడదుంప, ముల్లంగి వంటి వాటిలో ఆహార పదార్థాలు వాటి వేర్లలో ఉంటాయి. ఈ దుంప వేర్లు మానవులకు ఆహార వనరులుగా ఉపయోగపడతాయి. అందువలన మొక్కల వేర్లు మానవులకు ఆహార వనరులు.

ప్రశ్న 20.
ఆహార వృథాను మీరు ఎలా నిరోధించవచ్చు?
జవాబు:

  • సరైన నిల్వ పద్ధతులను ఉపయోగించడం ద్వారా
  • వాంఛనీయ ఉష్ణోగ్రతను నియంత్రించటం. నీటిశాతాన్ని 5% వరకు తగ్గించడం.
  • ఆహార నిల్వ కారకాలను కలపటం వలన ఆహార వృథాను నివారించవచ్చు.

6th Class Science 1st Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మీ పాఠశాలలో సింపోజియం నిర్వహించడానికి, జంక్ ఫుడ్ గురించి ఒక నివేదికను తయారు చేయండి.
జవాబు:

  • జంక్ ఫుడ్ తక్కువ విటమిన్లు మరియు ఖనిజాలతో అధిక స్థాయిలో కేలరీలు కలిగిన ఆహారం.
  • ఫాస్ట్ ఫుడ్ లో ఎక్కువభాగం జంక్ ఫుడ్ ఉంటుంది.
  • పిజ్జా, బర్గర్, చిప్స్, ఫ్రెడ్ ఫాస్ట్ ఫుడ్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలైనవి జంక్ ఫుడ్స్.
  • జంక్ ఫుడ్ లో పోషక విలువలు మోతాదుకు మించి ఉంటాయి.
  • జంక్ ఫుడ్ జీర్ణించుకోవడం అంత సులభం కాదు.
  • జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం, జీర్ణ సమస్యలు మరియు ఆకలి తగ్గటం జరుగుతుంది.
  • ఇది మగతను కలిగించటమే కాకుండా ఆరోగ్యానికి హానికరం కూడా.
  • ఇది డయాబెటిస్, కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులకు కారణమవుతుంది.

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 2.
మీకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని తయారు చేసి, దాని తయారీ విధానం రాయండి.
జవాబు:
నాకు ఇష్టమైన ఆహార పదార్థం ఉప్మా.
కావలసిన పదార్థాలు (దినుసులు) :

లక్ష్యం : ఉప్మా తయారు చేయటం.
మనకు కావలసింది (కావలసినవి) :
ఉప్మా రవ్వ, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, నూనె, టమోటా, ఉప్పు, నీరు, ఆవాలు, కరివేపాకు, పాత్ర మొదలైనవి.

తయారీ విధానం :

  • శుభ్రమైన కూరగాయలను ముక్కలుగా కోసుకోండి.
  • మంటమీద పాత్ర ఉంచండి.
  • 3 చెంచాల నూనె పోసి ఆవాలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, చిన్న ముక్కలుగా తరిగి కూరగాయలు వేసి వేయించాలి.
  • తగినంత నీరు పోసి దానికి ఉప్పు కలపండి. కొంత సమయం మరగనివ్వండి.
  • తర్వాత ఆ మిశ్రమానికి రవ్వ కలపండి. కొన్ని నిమిషాల తరువాత అది చిక్కగా మారి, రుచికరమైన ఉప్మా సిద్ధమవుతుంది.

ప్రశ్న 3.
ఇచ్చిన ఆహార పదార్థాలను ఇచ్చిన శీర్షికల ప్రకారం వర్గీకరించండి.
మామిడి, పుదీనా, చక్కెర, చెరకు, దాల్చిన చెక్క బంగాళదుంప, ఉల్లిపాయ, ఏలకులు, క్యాలిప్లవర్, క్యారెట్, వేరుశనగ, లవంగాలు, టొమాటో, బియ్యం, పెసలు, క్యాబేజీ, ఆపిల్, పసుపు, అల్లం,
AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం 1
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం 2

ప్రశ్న 4.
క్రింది ఇచ్చిన వాటిని మొక్కల మరియు జంతు ఉత్పత్తులుగా వర్గీకరించండి మరియు వాటిని నిర్దిష్ట స్థలంలో రాయండి.
గుడ్డు, నూనె, మాంసం, పాలు, ధాన్యపు మసాలా, పప్పు, పండు, మజ్జిగ, నెయ్యి, కూరగాయలు, పెరుగు.
జవాబు:
మొక్కల ఉత్పత్తులు :
నూనె, ధాన్యం, మసాలా, పప్పు, పండు, కూరగాయలు.

జంతు ఉత్పత్తులు :
గుడ్డు, మాంసం, మజ్జిగ, నెయ్యి, పెరుగు.

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

ప్రశ్న 5.
ఇచ్చిన వాక్యాలలో తప్పు ఒప్పులను గుర్తించండి.
జవాబు:

  • కాలీఫ్లవర్ లో తినదగిన భాగం వేరు. (తప్పు)
  • షుగర్ సిరప్ ఒక ఆహార నిల్వ పదార్థం. (ఒప్పు)
  • ఆవిరి పద్ధతిలో రొట్టె తయారు చేస్తారు. (తప్పు)
  • జంక్ ఫుడ్ ఎల్లప్పుడూ మంచిది మరియు పరిశుభ్రమైనది. (తప్పు)
  • ఆహారాన్ని పాడుచేయడం ఆహార కొరతకు దారితీయవచ్చు. (ఒప్పు)
  • ఉప్పు ఇతర వనరుల నుండి లభిస్తుంది. (ఒప్పు)
  • పసుపు కృత్రిమ ఆహార నిల్వ కారకం. (తప్పు)
  • మనం ఎక్కువగా బియ్యాన్ని ఆహారంగా తీసుకొంటాము. (ఒప్పు)

AP Board 6th Class Science 1th Lesson 1 Mark Bits Questions and Answers మనకు కావలసిన ఆహారం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. మీరు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
A) ఆగస్టు 15
B) అక్టోబర్ 16
C) మార్చి 22
D) జనవరి 26
జవాబు:
B) అక్టోబర్ 16

2. FAO యొక్క సరైన విస్తరణను గుర్తించండి.
A) ఫుడ్ అండ్ అథారిటీ ఆఫీసర్
B) రైతు మరియు వ్యవసాయ సంస్థ
C) ఆహార మరియు వ్యవసాయ సంస్థ
D) ఆహార ప్రత్యామ్నాయ కార్యాలయం
జవాబు:
C) ఆహార మరియు వ్యవసాయ సంస్థ

3. టేబుల్ ఉప్పు దేని నుండి పొందబడుతుంది?
A) మొక్క
B) జంతువు
C) సముద్రం
D) A & B
జవాబు:
C) సముద్రం

4. కింది వాటిలో ఆకు కూర కానిది
A) కొత్తిమీర
B) బచ్చలికూర
C) పాలకూర
D) బంగాళదుంప
జవాబు:
D) బంగాళదుంప

5. రొట్టెను తయారుచేసే విధానం
A) మరిగించటం
B) స్ట్రీమింగ్
C) కిణ్వప్రక్రియ
D) వేయించుట
జవాబు:
C) కిణ్వప్రక్రియ

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

6. కూరగాయలతో వివిధ రకాలైన డిజైన్లను తయారుచేయడం మరియు అలంకరించడం
A) వెజిటబుల్ కార్వింగ్
B) డబ్బాలలో నిల్వ చేయటం
C) ఎండబెట్టడం
D) చెక్కటం
జవాబు:
A) వెజిటబుల్ కార్వింగ్

7. ఊరగాయల తయారీలో ఇది ఉపయోగించబడదు.
A) ఉప్పు
B) నూనె
C) నీరు
D) కారం పొడి
జవాబు:
C) నీరు

8. సహజ నిల్వల కారకాల యొక్క సరైన జతను గుర్తించండి.
A) నైట్రేట్స్ మరియు బెంజోయేట్స్
B) పసుపు పొడి మరియు ఉప్పు
C) లవణాలు మరియు సల్పేట్లు
D) పసుపు మరియు నైట్రేట్లు
జవాబు:
B) పసుపు పొడి మరియు ఉప్పు

9. జంక్ ఫుడ్ ఫలితం
A) ఊబకాయం
B) మగత
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
C) A & B

10. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ఆహారం
A) గోధుమ
B) బియ్యం
C) జొన్న
D) మొక్కజొన్న
జవాబు:
B) బియ్యం

11. ఆహారాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు
A) నిల్వ కారకాలు
B) డ్రైఫ్రూట్స్
C) ఇండియన్ మసాలా దినుసులు
D) దినుసులు
జవాబు:
D) దినుసులు

12. పులిహోరలోని దినుసులు
A) బియ్యం, చింతపండు, ఉప్పు
B) వర్మిసెల్లి, చక్కెర, పాలు
C) కూరగాయలు, నూనె, ఉప్పు
D) గుడ్డు, బియ్యం , నీరు
జవాబు:
A) బియ్యం, చింతపండు, ఉప్పు

13. గుడ్లు, కారం పొడి, ఉల్లిపాయ, ఉప్పు, నూనె. ఈ పదార్థాలను ఏ రెసిపీ సిద్ధం చేయడానికి ఎందుకు కలుపుతారు?
A) ఆలు కుర్మా
B) మిశ్రమ కూర
C) గుడ్డు కూర
D) టమోటా కూర
జవాబు:
C) గుడ్డు కూర

14. మొక్క నుండి పొందిన పదార్థాన్ని గుర్తించండి.
A) కాయ
B) గుడ్డు
C) పాలు
D) ఉప్పు
జవాబు:
A) కాయ

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

15. ఏ పదార్థంను మొక్కలను లేదా జంతువుల నుండి పొందలేము?
A) కూరగాయలు
B) ఉప్పు
C) మాంసం
D) పాలు
జవాబు:
B) ఉప్పు

16. పాల యొక్క ఉత్పత్తులు ఏమిటి?
A) వెన్న
B) చీజ్
C) నెయ్యి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

17. ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించే జంతు సంబంధ ఉత్పన్నం
A) పాలు
B) మాంసం
C) గుడ్డు
D) తేనె
జవాబు:
D) తేనె

18. పంది మాంసంను ఏమంటాము?
A) ఫోర్క్
B) మటన్
C) చికెన్
D) బీఫ్
జవాబు:
A) ఫోర్క్

19. క్యారెట్ లో మొక్కలోని ఏ భాగం తినదగినది?
A) వేరు
B) కాండం
C) ఆకు
D) పుష్పము
జవాబు:
A) వేరు

20. తినదగిన పువ్వుకు ఉదాహరణ ఇవ్వండి.
A) క్యాబేజీ
B) కాలీఫ్లవర్
C) ఉల్లిపాయ
D) చెరకు
జవాబు:
B) కాలీఫ్లవర్

21. కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను గుర్తించండి.
A) క్యా రెట్
B) బీట్ రూట్
C) అల్లం
D) ముల్లంగి
జవాబు:
C) అల్లం

22. పుదీనా మొక్కలో తినదగిన భాగం ఏమిటి?
A) వేరు
B) కాండం
C) పుష్పము
D) ఆకు
జవాబు:
D) ఆకు

23. భారతీయ మసాలా దినుసును గుర్తించండి.
A) నల్ల మిరియాలు
B) జీడిపప్పు
C) ఖర్జూర
D) కిస్మిస్
జవాబు:
A) నల్ల మిరియాలు

24. రకరకాల భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు?
A) రుచి కోసం
B) రంగు కోసం
C) నిల్వ కోసం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

25. కింది వాటిలో ఏది జంతువుల నుండి పొందిన సహజ ఆహార నిల్వకారి?
A) పసుపు పొడి
B) చక్కెర
C) తేనె
D) నూనె
జవాబు:
C) తేనె

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

26. కింది వాటిలో ఏ ఆహార నిల్వకారి ఆరోగ్యానికి హానికరం?
A) బెంజోయేట్
B) ఉప్పు
C) షుగర్
D) తేనె
జవాబు:
A) బెంజోయేట్

27. మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు ఏ పంట అనుకూలంగా ఉంటుంది?
A) పైన్ ఆపిల్
B) గోధుమ
C) వరి
D) బియ్యం
జవాబు:
C) వరి

28. తృణధాన్యాలకు ఉదాహరణ ఇవ్వండి.
A) బియ్యం
B) గోధుమ
C) మొక్కజొన్న
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

29. కింది వాటిలో ఏది ఎండబెటడం ద్వారా నిల్వ చేయబడుతుంది?
A) ఊరగాయ
B) చేప
C) ఇడ్లీ
D) గుడ్లు
జవాబు:
B) చేప

30. తీర ప్రాంతాల్లో చేపల సంరక్షణకు వాడే సాధారణ పద్దతి
A) పొగబెట్టడం
B) కిణ్వప్రక్రియ
C) మరిగించడం
D) ఆవిరి పట్టడం
జవాబు:
A) పొగబెట్టడం

31. కింది వాటిలో జంక్ ఫుడ్ ను గుర్తించండి.
A) పప్పు
B) ఉడికించిన గుడ్డు
C) ఐస్ క్రీమ్
D) జాక్ ఫ్రూట్
జవాబు:
C) ఐస్ క్రీమ్

32. కింది వాటిలో చిరుధాన్యం ఏది?
A) బియ్యం
B) సజ్జలు
C) గోధుమ
D) మొక్కజొన్న
జవాబు:
B) సజ్జలు

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

33. కింది వాటిలో ఏది మంచి అలవాటు?
A) ఆహారాన్ని వృథా చేయడం
B) పెద్ద మొత్తంలో వంటచేయడం
C) అదనపు ఆహారాన్ని విసిరివేయడం
D) నిరుపేదలకు ఆహారాన్ని అందించడం
జవాబు:
D) నిరుపేదలకు ఆహారాన్ని అందించడం

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. UN విస్తరించండి
2. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ……… ఉపయోగించడం ద్వారా ఆహారాన్ని తయారుచేస్తారు.
3. పాలు మరియు మాంసం ……. నుండి లభిస్తాయి.
4. మామిడి : పండు :: బంగాళదుంప : …….
5. ఆహారం రుచికొరకు …….. ఉపయోగిస్తారు.
6. ఆహారం ….. మరియు ….. కు తోడ్పడుతుంది.
7. ఆహార రుచి దాని …….. …… పై ఆధారపడి ఉంటుంది.
8. ఇంట్లో తయారుచేసిన ఆహారం ఎల్లప్పుడూ …………….. మరియు …………
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులు …………….. పంట పండించడానికి మరింత అనుకూలం.
10. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా …………… సంవత్సరం జరుపుకుంటారు.
11. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం …………… ను స్థాపించిన తేదీని పురస్కరించుకుని జరుపుకుంటారు.
12. F.A.O ని విస్తరించండి.
13. యు.ఎన్.డి.పి.ని విస్తరించండి.
14. వెన్న, జున్ను, నెయ్యి మరియు పెరుగు ………….. ఉత్పత్తులు.
15. …… ఇతర వనరుల నుండి వచ్చే పదార్థం.
16. మనం ………….. మొక్క ఆకులు తింటాము.
17. తేనె …………. నుండి పొందిన మంచి పదార్థం.
18. చెరకులో మనం తినే మొక్క యొక్క భాగం …………….
19. ఫైడ్, ఫాస్ట్ ఫుడ్, నూడుల్స్, సమోసా, ఐస్ క్రీం, కూల్ డ్రింక్ అనునవి …………..
20. ఏలకులు, నల్ల ‘మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు మొదలైన వాటిని ……. అంటారు.
21. పండ్లు, కూరగాయలతో వివిధ రకాల డిజైన్లు మరియు అలంకరణలను తయారు చేయడం …….
22. ఊరగాయలను ……. పద్ధతి ద్వారా తయారు చేస్తారు.
23. ఉప్పు, నూనె, పసుపు పొడి, చక్కెర, తేనె మొదలైనవి …………
24. …………. ఆహార నిల్వ పదార్థాలు మన ఆరోగ్యానికి హానికరం.
25. ఆహారాన్ని సరిగ్గా భద్రపరచకపోతే, దానిపై …………….. దాడి చేయవచ్చు.
26. ఆహారాన్ని పాడుచేయటం వలన ………… మరియు పర్యావరణ కలుషితం కూడా జరుగుతుంది.
27. పండ్లను కాపాడటానికి, మనం సాధారణంగా ……………….. వాడతాము.
28. కూరగాయలు మరియు పండ్లను నిల్వ చేయటానికి ఉపయోగించే చాలా సాధారణ పద్దతి …………………….
29. చెడిపోయిన ఆహారాన్ని తినడం వల్ల ……………………
జవాబు:

  1. ఐక్యరా జ్యసమితి
  2. దినుసులు
  3. జంతువులు
  4. కాండం
  5. సుగంధ ద్రవ్యాలు
  6. పెరుగుదల, మనుగడ
  7. దినుసులు, తయారీ విధానం
  8. ఆరోగ్యకరమైనది, పరిశుభ్రమైనది
  9. వరి
  10. 16 అక్టోబర్
  11. FAO
  12. ఆహార మరియు వ్యవసాయ సంస్థ
  13. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
  14. పాల
  15. ఉప్పు
  16. పుదీనా/బచ్చలకూర
  17. తేనెటీగలు/జంతువుల
  18. కాండం
  19. జంక్ ఫుడ్స్
  20. భారతీయ సుగంధ ద్రవ్యాలు
  21. వెజిటబుల్ కార్వింగ్
  22. కటింగ్ మరియు మిక్సింగ్
  23. సహజ ఆహార నిల్వ పదార్థాలు
  24. రసాయన
  25. సూక్ష్మక్రిములు/సూక్ష్మజీవులు
  26. ఆహార కొరత ఆ కొరత
  27. తేనె/చక్కెర సిరప్
  28. గడ్డకట్టడం
  29. కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు
  30. ఊబకాయం

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – AGroup – B
ఎ) కూరగాయలు1) జంతువు
బి) పాలు2) బియ్యం
సి) కలరింగ్3) మొక్క
డి) ఉడకబెట్టడం4) ఆహార నిల్వ పదార్థం
ఇ) షుగర్ సిరప్5) సుగంధ ద్రవ్యాలు

జవాబు:

Group – AGroup – B
ఎ) కూరగాయలు3) మొక్క
బి) పాలు1) జంతువు
సి) కలరింగ్5) సుగంధ ద్రవ్యాలు
డి) ఉడకబెట్టడం2) బియ్యం
ఇ) షుగర్ సిరప్4) ఆహార నిల్వ పదార్థం

2.

Group – AGroup – B
ఎ) మొక్క1) సల్ఫేట్
బి) జంతువులు2) పండు
సి) ఇతరులు3) తేనె
డి) సహజ ఆహార నిల్వ పదార్థం4) గుడ్లు
ఇ) రసాయనిక ఆహార నిల్వ పదార్థం5) ఉప్పు

జవాబు:

Group – AGroup – B
ఎ) మొక్క2) పండు
బి) జంతువులు4) గుడ్లు
సి) ఇతరులు5) ఉప్పు
డి) సహజ ఆహార నిల్వ పదార్థం3) తేనె
ఇ) రసాయనిక ఆహార నిల్వ పదార్థం1) సల్ఫేట్

3.

Group – AGroup – B
ఎ) కోడి1) తేనెపట్టు
బి) తేనె2) ఆవు
సి) పాలు3) పంది మాంసం
డి) మేక4) చికెన్
ఇ) పంది5) మటన్

జవాబు:

Group – AGroup – B
ఎ) కోడి4) చికెన్
బి) తేనె1) తేనెపట్టు
సి) పాలు2) ఆవు
డి) మేక5) మటన్
ఇ) పంది3) పంది మాంసం

4.

Group – AGroup – B
ఎ) బచ్చలికూర1) పువ్వు
బి) మామిడి2) వేరు
సి) కాలీఫ్లవర్3) ఆకులు
డి) అల్లం4) పండు
ఇ) ముల్లంగి5) కాండం

జవాబు:

Group – AGroup – B
ఎ) బచ్చలికూర3) ఆకులు
బి) మామిడి4) పండు
సి) కాలీఫ్లవర్1) పువ్వు
డి) అల్లం5) కాండం
ఇ) ముల్లంగి2) వేరు

5.

Group – AGroup – B
ఎ) విత్తనాలు1) సముద్రపు నీరు
బి) కాండం2) వేరుశనగ
సి) ఆకు3) బీట్ రూట్
డి) వేరు4) పుదీనా
ఇ) ఉప్పు5) బంగాళదుంప

జవాబు:

Group – AGroup – B
ఎ) విత్తనాలు2) వేరుశనగ
బి) కాండం5) బంగాళదుంప
సి) ఆకు4) పుదీనా
డి) వేరు3) బీట్ రూట్
ఇ) ఉప్పు1) సముద్రపు నీరు

6.

Group – AGroup – B
ఎ) మరిగించటం1) చేప
బి) ఆవిరితో వండటం (స్టీమింగ్)2) గుడ్లు
సి) కిణ్వప్రక్రియ3) కేక్
డి) వేయించటం4) ఇడ్లీ
ఇ) ఎండబెట్టడం5) మాంసం

జవాబు:

Group – AGroup – B
ఎ) మరిగించటం2) గుడ్లు
బి) ఆవిరితో వండటం (స్టీమింగ్)4) ఇడ్లీ
సి) కిణ్వప్రక్రియ3) కేక్
డి) వేయించటం5) మాంసం
ఇ) ఎండబెట్టడం1) చేప

మీకు తెలుసా?

→ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 16న జరుపుకుంటారు. ఇది 1945లో ఐక్యరాజ్యసమితి ద్వారా ఏర్పాటు చేయబడిన F.A.O (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) గౌరవార్థం ప్రతి ఏటా జరుపుకునే రోజు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆకలితో అలమటించే ప్రజల బాధలను తెలియజేసి అందరికి ఆహార భద్రత, పోషక విలువలు గల ఆహారాన్ని అందించే దిశలో ప్రపంచ వ్యాప్తంగా అవగాహన, ఆహార భద్రత కల్పించుట. ఇది ప్రతి సంవత్సరం ఒక్కో నేపథ్యంతో ముందుకు సాగుతుంది.
AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం 3

→ UNDP (యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలలో 40% వృథా అవుతుంది. ఈ FAO (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) 2018లో విడుదల చేసిన ప్రపంచంలోని ఆహార భద్రతా మరియు పోషణ స్థితి నివేదిక ప్రకారం భారతదేశంలో 195.9 మిలియన్ మంది. పోషకాహార లోపానికి గురవుతున్నారు.

భారతీయ సుగంధ ద్రవ్యాలు

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం 4
→ సుగంధ ద్రవ్యాలు ఉష్ణమండల మొక్కలలోని కొన్ని సుగంధభరిత భాగాలు. వీటిని మనం సాంప్రదాయబద్ధంగా ఆహారపు రుచిని పెంచుటకు వినియోగిస్తున్నాం. సుగంధ ద్రవ్యాలుగా కొన్ని మొక్కల బెరడు, ఆకులు, పుష్పాలు లేక కాండాలను ఆహారపు రుచి, రంగు, నిల్వకాలం పెంచుటకు వినియోగిస్తాం. విభిన్న రకాల భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు : యాలకులు, నల్లమిరియాలు, కరివేపాకు, మెంతులు, సోంపు, వాము, బిర్యానీ ఆకులు, జీలకర్ర, ధనియాలు, పసుపు, లవంగాలు, అల్లం, జాజికాయ మరియు దాల్చిన చెక్క,

AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం

→ కొందరు కూరగాయలు, పండ్లతో అనేక రకాల ఆకారాలను చెక్కడం మనం చూస్తుంటాం. దీనిని “వెజిటబుల్ కార్వింగ్” అంటారు.
AP 6th Class Science Important Questions Chapter 1 మనకు కావలసిన ఆహారం 5

జంక్ ఫుడ్ వద్దని అందాం

→ పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, వేపుడు, ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ మొ|| వాటిని జంక్ ఫుడ్ అంటాం. జంక్ ఫుడ్ తినడం వలన ఊబకాయం, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, ఆకలి మందగించడం వంటి పరిణామాలకు దారితీస్తుంది. ఇది మగతకు, అనారోగ్యానికి దారితీస్తుంది.